నారద మహా పురాణము
114 - ద్వాదశమాసస్థపంచమివ్రత నిరూపణమ్
సనాతన ఉవాచ:-
శృణు విప్ర ప్రవక్ష్యామి పంచమ్యాస్తే వ్రతాన్యహమ్ ।
యాని భక్త్యా సమాశ్రియ సర్వాన్కామానవాప్నుయాత్
ప్రోక్తా మత్స్యజయప్తీ తు పంచమి మధుశుక్లగా ।
అస్యాం మత్స్యావతారార్చా భకైః కార్యా మహోత్సవా
శ్రీపంచమితి చైషోక్తా తత్ర కార్యం శ్రియోర్చనమ్ ।
గంధాద్యైరుపచారైస్తు నైవేద్యైః పాయసాదిభిః
యో లక్ష్మీం పూజయేచ్చాత తం వై లక్ష్మీ ర్న ముంచతి ।
పృధ్వీవ్రతం తథా చాంద్రం హయగ్రీవ వ్రతం తథా
కార్యం తత్తద్విధానేన తత్తత్సిద్ధిమభీపుభిః ।
అధ వైశాఖపంచమ్యాం శేషం చాభ్యర్చ్య మానవః
సర్యైర్నాగ గణేర్యుక్తం అభీష్టం లభతే ఫలమ్ ।
తధా జ్యేష్ఠస్య పంచమ్యాం పితూనభ్యర్చయేత్సుధీః
సర్వకామఫలవాప్తి ర్భవేద్వై విప్రభోజనైః ।
అధాషాఢస్య పంచమ్యాం వాయుం సర్వగతం మునే
గ్రామాద్బహిర్వనిర్గత్య ధరోపస్థే సమాశ్రితః ।
ధ్వజం చ పంచవర్ణం తు వంశ దండాగ్ర సంస్థితమ్
సముచ్ఛైతం నిదధ్యాత్తు కల్పితాబే తు మధ్యతః ।
తతస్తన్మూలదే తు దిక్షు సర్వాసు నారద!
లోకపాలాన్సమభ్యర్య కుర్యాద్వాయుపరీక్షణమ్ ।
ప్రథమాదిషు యామేషు యో యో వాయుః ప్రవర్తతే
తసై తస్మై దిగీశాయ పూజాం సమ్యక్ర కల్పయేత్ ।
ఏవం స్థిత్వా నిరాహారసత్ర యామచతుష్టయమ్
సాయమాగత్య గేహం స్వం భుక్త్యా స్వల్పం సమాహితః ।
లోకపాలాన్నమస్కృత్య స్వప్యాద్భూమితలే శుచౌ
యస్స్వప్నో జాయతే తస్యాం రాత్రా యామే చతుర్థకే ।
స ఏవ భవితా నూనం స్వప్న ఇత్యాహ వై శివః
అశుభే తు సముత్పన్నే శివపూజా పరాయణః ।
సోపవాసో నయేదష్టయామం తద్దిన మేవ వా
భోజయిత్వా ద్విజానష్టా తతశ్శుభ ఫలం లభేత్ ।
వ్రతమేతత్సముదితం శుభా శుభ నిదర్శనమ్
నృణాం సౌభాగ్య జనక మిహలోకే పరత్ర చ ।
శ్రావణ్ కృష్ణపంచమ్యాం వ్రతం హ్యన్న సమృద్ధిదమ్
చతుర్థ్యాం దీనశేషే తు సర్వాణ్యన్నాని నారద ।
పృథకాలేషు సంస్థాప్య జలైరాప్లావయేత్సుధీః
తతో పాత్రాంతరే తత్తు నిష్కాస్యాంబు నిధాపయేత్ ।
ప్రాతర్భానౌ సముదితా పితరాంశ్చైవ తథా ఋషీన్
దేవాంశ్చభ్యర్య సున్నితం కృత్వా నైవేద్యమగ్రతః ।
తదన్నం యాచకేభ్యస్తు ప్రయచ్చేత్పీతమానసః
సర్వం దినం క్షిపేదేవం ప్రదోషే తు శివాలయే ।
గత్వా సంపూజయేద్దేవం లింగరూపిణమిశ్వరమ్
గంధపుష్పాదిభిస్సమ్యక్పూజయిత్వా మహేశ్వరమ్ ।
జపేత్పంచాక్షరీం విద్యాం శతం చాపి సహస్రకమ్
జపం నివేద్య దేవాయ భవాయ భవరూపిణే ।
స్తుత్వా సర్వైర్వైదికైశ్చ పౌరాణేశ్చాప్యనాకులః
ప్రార్ధయేద్దేవమాశానం శశ్వత్సర్వాన్న సిద్ధయే ।
శారదీయాని చాన్నాని తథా వాంతికాన్యపి
యాని స్యుసై స్సమృద్దోఽహం భూయాసం జన్మ జన్మని ।
ఏవం సంప్రార్ధ్య దేవేశం గృహమాగత్య వై స్వకమ్
దత్వాన్నం బ్రాహ్మణాదిభ్యః పక్వం భుంజీత వాగ్యతః ।
ఏతదన్నవ్రతం విప్ర విధినా చరితం నృభిః
సర్వాన్న సంపజ్జనకం పరలోకే గతిప్రదమ్ ।
శ్రావణే శుక్ల పంచమ్యాం నృభిరాస్తిక్యతత్పరైః
ద్వారస్యోభయతో లేఖ్యా గోమయేన విషోల్బణాః ।
గంధాద్యైః పూజయేత్తాంశ్చ తథేంద్రాణీ మనస్తరమ్
సంపూజ్య స్వర్ణరూప్యాది దధ్యక్షతకుశాంబుభిః ।
గంధైః పుషై స్తథా ధూపై ఛీపై రైవేద్య సంచయైః
తతః ప్రదక్షిణీకృత్య తద్రవ్యం సంప్రణమ్య చ ।
సంప్రార్థ్య భక్తిభావేన విగ్ర్యేషు సమర్పయేత్
యదిదం స్వర్ణరౌప్యాది ద్రవ్యం వై విప్రసాత్కృతమ్ ।
తదననఫలం భూయాన్మమ జన్మని జన్మని
ఇత్యేవం దదతో ద్రవ్యం భక్తిభావేన నారద ।
ప్రసన్న స్స్యాద్ధనాధ్యక్షస్స్వర్ణాదిక సమృద్ధిదః
ఏతద్ర్వతం నరః కృత్వా విప్రాన్సంభోజ్య భక్తితః ।
పశ్చాత్స్వయం చ భుంజీత దారాపత్య సహృద్వతః
భాద్రే తు కృష్ణపంచమ్యాం ఆగాన్ క్షీరేణ తర్పయేత్
యస్తస్యా సప్తమం యావత్ కులం సర్పాత్సు నిర్భయమ్ ।
భాద్రస్య శుక్లపంచమ్యాం పూజయే దృషిసత్తమాన్
ప్రాతర్నద్యాదికే స్నాత్వా కృత్వా నిత్యమతంద్రితః ।
గృహమాగత్య యత్నేన వేదికాం కారయేన్మదా
గోమయేనోపలిప్యాథ కృత్వా పుషోపశోభితామ్ ।
తత్రోస్తీర్య కుశాన్విప్ర ఋషీన్సప్త సమర్చయేత్
గంధైశ్చ వివిధైః పుష్పై ర్దూపైర్గీపై సుశోభనైః ।
కశ్యపో త్రిర్భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమః
జమదగ్నిర్వసిష్ఠశ్చ సపైతే ఋషయ స్స్మృతాః ।
ఏతేభ్యోర్యం చ విధివత్కల్పయిత్వా ప్రదాయ చ
నైవేద్యం విపచేద్దీమాన్యామాకాద్యైర కృష్టకైః ।
తన్నివేద్య విసృజ్యేమాన్వయం చాద్యాత్తదేవ హి
అనేన విధినా సప్త వర్షాణి ప్రతి వత్సరమ్ ।
కృత్వా వ్రతాంతే వరయేదాచార్యాన్సప్త వైదికాన్
ప్రతిమాస్సప్త కుర్వీత సువర్ణేన స్వశక్తితః ।
జటిలాస్సాక్షసూత్రాశ్చ కమండలు సమన్వితాః
సంస్థాప్య కలశేష్వేతాంస్త్రామేషు మృణ్మయేషు వా ।
స్నాపయేద్విధివద్భక్త్యా పృథక్పంచామృతైరపి
ఉపచారై షోడశభి స్తత స్సంపూజ్య భక్తితః ।
అర్ఘ్యం దత్వా తతో హోమం తిలప్రిహియవాదిభిః
‘సహ స్తోమా’ ఇతి ఋచా నామమంత్రైస్తు వా పృథక్ ।
పుణ్యోర్మనై స్తథైవాన్యై రుత్వా పూర్ణాహుతిం చరేత్
తతస్తు సప్త గా దద్యాద్వస్త్రాలంకార సంయుతాః ।
ఆచార్యం పూజయేచైవ వస్త్రాలంకార సంయుతా
అనుజ్ఞయా గురోః పశ్చా న్మూర్తీ ర్విప్రేషు చార్పయేత్ ।
భోజయిత్వా తు తాన్భక్త్యా ప్రణిపత్య విసర్జయేత్
తతశ్చేషై స్సహాసేన స్వయం బ్రాహ్మణ శేషితమ్ ।
భుక్త్యా వై షడ్రసోపేతం. ప్రముద్యాత్సహ బంధుభిః
ఏతత్కృత్వా వ్రతం సాంగం భోగానుప్రక్ష్యాధ వాంఛితాన్ ।
సప్తరీణాం ప్రసాదేన విమానవరదో భవేత్
అశ్వినే శుక్ల పంచమ్యాం ఉపాంగ లలితా వ్రతమ్
తస్యాస్స్వర్ణమయీం మూర్తిం శక్త్యా నిర్మాయ నారద ।
ఉపచారై షోడశభిః పూజయేతాం విధానతః
పక్వాన్నం ఫలసంయుక్తం సఘృతం దక్షిణాన్వితమ్ ।
ద్విజవర్యాయ దాతవ్యం వ్రతసంపూర్తిహాతవే
సవాహనా శక్తియుతా వరదా పూజితా మయా ।
తర్మాను గృహ్యాథ గమ్యతాం నిజమందిరమ్
కార్తికే శుక్ల పంచమ్యాం జయావ్రతమనుత్తమమ్ ।
కర్తవ్యం పాపనాశాయ శ్రద్ధయా ద్విజసత్తమ
పూజయిత్వా జయాం విప్ర యథావిధి సమాహితః ।
ఉపచారై షోడశభి స్తతశుచిగలం కృతః
విషైకం భోజయేచ్చాపి తస్మై దత్వా చ దక్షిణామ్ ।
విసర్జయేత్తతః పశ్చాత్స్వయం భుంజీత వాగ్యతః
యస్తు వై భక్తిసంయుక్తః స్నానం కుర్యాజ్జయాదినే ।
నశ్యన్తి తస్య పాపాని సింహాక్రాన్తో మృగా యథా
యదశ్వమేధావభృథే ఫలం స్నానేన కీర్తితమ్ ।
తత్ఫలం ప్రాప్యతే విప్ర స్నానేనాపి జయా దినే
అపుత్రో లభతే పుత్రం. వంధ్యా గర్భం చ విష్ణతి ।
రోగీ రోగాత్రముచేత బద్దే ముచ్యేత బస్థనాత్
మార్గశుక్ల చ పంచమ్యాం నాగానిష్టా విధానతః ।
నాగేభ్యో హ్యభయం లబ్ది మోదతే సహ బాంధవైః
పౌషేపీ శుక్ల పంచమ్యాం సంపూజ్య మధుసూదనమ్ ।
లభతే వాంఛితాన్కామాన్నాత్ర కార్యా విచారణా
పంచమ్యాం ప్రతిమాసే తు శుక్లే కృష్ణే చ నారద ।
పితృణాం పూజనం శస్తం నాగానాం చాపి సర్వథా
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే ద్వాదశ మాసందపంచమీ వ్రత నిరూపణం నామ చతుర్ధశాధికశత తమోధ్యాయః.
సనాతన మహర్షి పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! ఇపుడు నీకు పంచమి వ్రతములను. చెప్పెదను వినుము. ఈ వ్రతములను భక్తితో ఆచరించిన వారు అన్ని వాంఛితములను పొందగలరు. చైత్ర శుద్ధ పంచమిని మత్స్య జయన్తి అందురు. ఈ దినమున భక్తులు మహోత్సవముగా మత్స్యావతార పూజను చేయవలయును. ఈ పంచమినే శ్రీ పంచమి అని కూడా అందురు. ఈ దినమున శ్రీ అర్చన చేయవలయును. గంధాది ఉపచారములచే పాయసాదులనైవేద్యములచే లక్ష్మీదేవిని పూజించువానిని లక్ష్మీదేవి విడిచి పెట్టదు. అట్లే పృథ్వీ వ్రతమును, చాంద్ర వ్రతమును, హయగ్రీవ వ్రతమును ఆయా వ్రత విధానములచే ఆయా సిద్దులను కోరువారు ఆచరించవలయును. ఇక వైశాఖ శుద్ధ పంచమినాడు ఆదిశేషుని పూజించి అభీష్ట ఫలమును పొందును. జ్యేష్ఠ శుద్ధ పంచమినాడు పితృదేవతలను పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టినచో సర్వకామ ఫలములను పొందగలుగును. ఆషాఢ శుద్ధ పంచమిన సర్వవ్యాపియగు వాయుదేవుని, గ్రామము నుండి వెలుపలకు వచ్చి భూమి మీద కూర్చుని వంశదండాగ్రమున పంచవర్ణములు గల ధ్వజము నేర్పరచి, మధ్య భాగమున పద్మమును కల్పించి, ఆ మూల దేశమున, అన్ని దిక్కులయందు, లోకపాలకులను పూజించి, వాయు పరీక్షణమును చేయవలయును. ప్రథమాది యామములలో యే యే వాయువు వచ్చునో ఆయా దిక్పతులకు పూజను గావించవలయును. ఇట్లు అచట నిరాహారముగా నాలుగు రూములుండి, సాయంకాలమున స్వగృహమునకు వచ్చి సావధానముతో స్వల్పముగా భుజించి, లోకపాలకులకు నమస్కరించి, పవిత్రమగు భూమిపై పరుండవలయును. ఆ రాత్రి నాలుగవ ఝామున వచ్చిన స్వప్నమే నిజమగునని శివుడు చెప్పెను. అశుభ స్వప్నము వచ్చినచో శివపూజను గావించుచు యెనిమిది ఝాములుకాని ఆదినము మొత్తముకాని గడుప వలయును. యెనిమిది మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టి శుభములను పొందవచ్చును. ఈ వ్రతము శుభాశుభములకు నిదర్శనముగా చెప్పబడినది. ఇహపరలోకములలో మానవులకు సౌభాగ్యజనకము. శ్రావణబహుళపంచమినాడు చేయువ్రతము అన్న సమృద్ధినిచ్చునది. చతుర్థిదినశేషమున అన్ని విధములగు అన్నములను వేజువేజుపాత్రలలో నుంచి వీటితో తడుపవలయును. తరువాత ఇతరత్రలలోనికి ఆయన్నములను తీసి జలములనుంచవలయును. ప్రాతఃకాలమున సూర్యోదయకాలమున పితృదేవతలను, ఋషులను దేవతలను చక్కగా పూజించి స్నానాదులను చేయించి నైవేద్యముగా ఆయన్నములనుంచవలయును. తరువాత సంతోషముతో ఆయన్నములను యాచకులకు పెట్టవలయును. ఇట్లు దినమంతయు గడిపి, ప్రదోషకాలమున శివాలయమునకు వెళ్ళి లింగరూపియగు ఈశ్వరుని గంధపుష్పాదులతో చక్కగా పూజించి, నూరుమార్లుకాని, వేయిమార్లుకాని పంచాక్షరీమంత్రమును జపించవలయును. ఆజపమును భవరూపియగు భవునకు నివేదించవలయును. సావధానమనస్కుడై వైదికమంత్రములచే పౌరాణిక మంత్రములచే స్తుతించి, ఎల్లకాలము అన్ని అన్నములు లభించుటకు ఈశ్వరుని ప్రార్థించవలయును. శారదాన్నములు, వాసంతికాన్నములు ఇంకా ఈ ప్రపంచముననున్న అన్ని యన్నములు నాకు ప్రతిజన్మలో సమృద్ధిగా లభించవలయును అని ఈశ్వరుని ప్రార్థించి తన గృహమున కొచ్చి బ్రాహ్మణాదులకు పక్వాన్నమును పెట్టి తను భుజించవలయును. ఇట్లు ఈ అన్నవ్రతమును విధిగా ఆచరించిన వారు సర్వాన్నసంపదలను ఇహలోకమున పొంది పరలోకమున ఉత్తమగతిని పొందుదురు. ఇక శ్రావణ శుక్ల పంచమినాడు ఆస్తికులైన నరులు ద్వారమునకు రెండు ప్రక్కలా గోమయముతో సర్పములను లిఖించి గంధాదులచే పూజించి శచీదేవిని పూజించ వలయును. స్వర్ణరూప్యములతో దధ్విక్షతకుశ అంబుగంధపుష్పధూపదీపనైవేద్యదాల నర్పించి, ప్రదక్షిణము గావించి, ఆద్రవ్యమును భక్తిభావముతో బ్రాహ్మణులకు నమస్కరించి సమర్పించవలయును. ఇట్లు బ్రాహ్మణాధీనము చేసిన స్వర్ణరూప్యాది ద్రవ్యము నాకు ప్రతి జన్మలోను ఆనన్తఫలప్రదమగు గావుత అని భావించి భక్తిచే ద్రవ్యదానము చేయువానికి ధనాధ్యక్షుడు ప్రసన్నుడై స్వర్ణాది ద్రవ్య సమృద్ధిని కలిగించును. ఈ వ్రతమును మానవుడాచరించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి కుటుంబ బంధుమిత్రులతో కలిసి తానూ భుజించవలయును. భాద్రపదకృష్ణ పంచమినాడు నాగులకు పాలతో తర్పణము గావించవలయును. ఇట్లు చేసిన ఆ వంశములో ఏడు తరముల వరకు సర్పభయముండదు. భాద్రపద శుద్ధ పంచమినాడు ఋషివర్యులను పూజించవలయును. ప్రాతః కాలమున నద్యాదులందు స్నానము గావించి, నిత్యకృత్యములను జాడ్యము లేక నాచరించి, గృహమునకు వచ్చి, శ్రద్దగా మట్టితో వేదికనేర్పరచి, గోమయముతో అలికి, పుష్పములతో అలంకరించి, దానిపై దర్భలను పరిచి సప్త ఋషులను గంధపుష్ప ధూపదీపములచే చక్కగా పూజించవలయును. కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర గౌతమ, జమదగ్ని, వసిష్టులు సప్తఋషులుగా ప్రసిద్ధులు, వీరికి విధిగా కల్పించిన అర్ఘ్యమును ప్రదానము చేసి, పండించని శ్యామాకాదులచే నైవేద్యమును సిద్ధముచేసి నివేదించి, వారిని విసర్జన గావించి, దానినే తాను భుజించవలయును. ఇట్లు ఈ విధిచే ఏడు సంవత్సరముల కాలము ప్రతి సంవత్సరము నాచరించి వ్రతాంతమున సప్త ఆచార్యులను వరించ వలయును. స్వశక్తి కొలది బంగారముతో ఏడు ప్రతిమలను చేసి, ఆ ప్రతిమలను జటిలులుగా అక్షసూత్రధారులుగా కమండలధారులుగా నిర్మించి, కలశములందు వీరిని స్థాపించి (తామ్రములుకాని మృణ్మయములు కాని కలశములు) భక్తితో యధావిధిగా వేరువేరుగా పంచామృతములచే స్నానము చేయించి, షోడశోపచారములచే భక్తిభావముచే పూజించి అర్ఘ్యమునిచ్చి తిలక్ర్హియవాదులచే “సహస్తోమా' అను ఋక్కుచేకాని నామమంత్రములచే కొని హోమము గావించి, పూర్ణాహుతిని ఆచరించి, తరువాత వస్త్రాలంకార యుతములగు ఏడు గోవులను దానము చేయవలయును. వస్త్రాలంకార భూషణములతో ఆచార్యుని పూజించవలయును. గురువుగారి అనుజ్ఞతో ప్రతిమలను బ్రాహ్మణులకు దానము గావించవలయును. ఆ బ్రాహ్మణులకు భోజనము పెట్టి నమస్కరించి విసర్జించవలయును. అపుడు బ్రాహ్మణ శేషమును ఇష్టబంధు జనముతో కలిసి భుజించి ఆనందించ వలయును. ఈ వ్రతమును సాంగోపాంగముగా నాచరించి ఇహలోకమున వాంఛిత భోగములనను భవించి దేహాంతమున సప్తర్షుల ప్రభావము వలన విమాన వరమును అధిష్ఠించును. ఆశ్వయుజ శుక్ల పంచమినాడు ఉపాంగలలితా వ్రతము చెప్పబడినది. స్వర్ణముతో లలితామూర్తి నేర్పరచి షోడశోపచారములతో పూజించి ఫలసంయుక్తమగు పక్వాన్నమును సఘృతముగా దక్షిణా సహితముగా బ్రాహ్మణోత్తమునకు దానము గావించవలయును. సవాహనశక్తియుతముగా వరదురాలు నా చేత పూజించబడినది. నన్ను అనుగ్రహించి నీ మందిరమునకు వెళ్ళుము. అని ప్రార్థించవలయును. కార్తీక శుక్ల పంచమినాడు సాటిలేని జయావ్రతమును పాపనాశము కొఱకు ఆచరించవలయును. జయాదేవిని శ్రద్దగా సావధానముగా యధావిధిగా షోడశోపచారములచే పూజించి, పవిత్రుడై, అలంకరించుకొని ఒక బ్రాహ్మణునికి భోజనము పెట్టి దక్షిణనిచ్చి విడిచి, తాను మౌనముగా భుజించవలయును. జయాదినమున భక్తి కలవాడై స్నానము చేసిన వాని పాపములు సీంహము ఆక్రమించిన మృగములవలె పారిపోవును. అశ్వ మేధ యాగావ భృధస్పానమున కలుగు ఫలము జయాదినమున స్నానము చేసిన కలుగును. పుత్రులు కలిగెదరు. గోత్రాలు గర్భమును పొందును. రోగి రోగము నుండి విముక్తుడగును. బంధనము కలవాడు బంధనము నుండి విముక్తుడగును. మార్గశిర శుక్ల పంచమినాడు యథావిధిగా సాగులను పూజించి నాగులనుండి అభయమును పొంది బంధుమిత్రాదులతో ఆనందించును. పుష్య శుద్ధ పంచమినాడు మధుసూదనుని పూజించి వాంఛితములను పొందును. ఇట్లు ప్రతిమాసమున శుక్ల కృష్ణ పంచములయందు పితృదేవతలను నాగులను పూజించుట ప్రశస్తము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్ధపాదమున ద్వాదశ మాసస్థ పంచమి వ్రతమును నూట పదునాలుగవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 116 of the Nārada Mahā Purana is as follows:
ధర్మాంగదుడు ఖడ్గంతో శిరస్సును ఖండించబోయే క్షణంలో శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ఖడ్గాన్ని నివారించి, రుక్మాంగదుని సత్యపాలనకు, ధర్మాంగదుని భక్తికి సంతృప్తుడై సమస్త కుటుంబమునకు వైకుంఠ మోక్షమును అనుగ్రహించిన దివ్య ఘట్టము ఇక్కడ వర్ణించబడినది.