36 - విష్ణు సేవాప్రభావః

సనక ఉవాచ :-

వేదమాలేస్సుతౌ పోక్తౌ యావుభౌ మునిసత్తమ !

యజ్ఞమలీ సుమాలీ చ తయోః కర్మాధునోచ్యతే

తయోరాద్యో యజ్ఞామాలీ బిభేద పితృసంచితమ్

ధనం ద్విధా కనిష్ఠస్య భోగమేకం దదౌ తదా

సుమాలీ చ ధనం సర్వం వ్యసనాభిరతస్సదా

అపాదానాదిభిశ్చైవ నాశయామాస భో ద్విజ

గీతవాద్యరతో నిత్యం మద్యపానరతోఽభవత్

వేశ్యావిభ్రమలుబ్ధోఽసౌ పరదారరతోఽభవత్

సర్వస్మి న్నా శమయతే హిరణ్యే పితృసంచితే

అపహృత్య పరం ద్రవ్యం వారస్త్రీనిరతోఽభవత్

దృష్ట్వా సుమాలినశీలం యజ్ఞామాలీ మహామతిః

బభూవ దుఃఖితోఽత్యర్థం భ్రాతరం చేదమబ్రవీత్

అలమత్యంతక ష్టేన వృత్తేనాస్మత్కులేఽనుజ

త్వమేక ఏవ దుష్టాత్మా మహాపాపరతోఽభవః

ఏవం నివారయంతం తం బహుశో జ్యేష్ఠసోదరమ్

హనిష్యామీతి నిశ్చిత్య ఖడ్గహస్తః కచేఽగ్రహీత్

తతో మహారవో జజ్ఞే నగరే భృశదారుణః

బబంధుర్నాగరా శ్చైనం కుపితా స్తే సుమాలినమ్

యజ్ఞమాలీ పునశ్చాపి బిభిదే స్వధనం ద్విధా

ఆదరే స్వయమర్థం చ దదావర్థం యవీయ సే

సుమాలీ త్వతిమూఢాత్మా తద్ధనం చాపి నారద !

మూర్ఖైః పాఖండచండాలైర్భుభుజే చ సహోద్ధతః

అసతాముపభోగాయ దుర్జనానాం విభూతయః

పీచుమందః ఫలాఢ్యోఽపి కాకైరేవోపభుజ్యతే

భ్రాత్రా దత్తం ధనం తచ్చ సుమాలీ నాశయన్ము నే

మద్యపానప్రమత్తశ్చ గోమాంసాదీన్యభక్షయత్

త్యక్తో బంధుజనై స్సర్వేశ్చాండాల స్త్రీ సమన్వితః

రాజ్ఞాపి బాధితో విప్ర ప్రపేదే నిర్జనం వనమ్

యజ్ఞమాలి సుధీర్వప్ర సదా ధర్మరతోఽ భవత్

ఆవారితం దదావన్నం సత్సంగగతకల్మషః

పిత్రా కృతాని సర్వాణి తటాకాదీని సత్తమ

అపాలయత్పరయత్నేన సదా ధర్మపరాయణః

విశ్రాణితం ధనం సర్వం యజ్ఞమాలేర్మహాత్మనః

తత్పాత్రదాననిష్ఠస్య ధర్మమార్గప్రవర్తినః

అహో సదుపభోగాయ సజ్జనానాం విభూతయః

కల్పవృక్షఫలం సర్వమమరైరేవ భుజ్యతే

ధనం విశ్రాణ్య ధర్మార్ధం యజ్ఞమాలీ మహామతిః

నిత్యం విష్ణుగృహే సమ్యక్చరిచర్యాపరోఽభవత్

సనక మహర్షి పలికెను :- వేదమాలి పుత్రులగు యజ్ఞమాలి సుమాలుల చరితమును ఇపుడు చెప్పెదను. పెద్దవాడగు యజ్ఞామాలి తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును చిన్నవాడగు సుమాలికిచ్చెను. సుమాలి వ్యసనలోలుడై ధనమునంతటిని అపాత్రదానములచే నశింపచేసేను. ప్రతినిత్యము గీతవాద్యములందు ఆసక్తుడై మద్యపానరతుడై వేశ్యా విలాసములయందు ఆశపడి పరదొరరతుడాయెను. పిత్రార్జితమైన ధనమంతయూ వ్యయము కాగా పరద్రవ్యమును అపహరించి వేశ్యాలోలుడాయెను. సుమాలి దుర్వృత్తమును చూచి మహామతియైన యజ్ఞమాలి దుఃఖితుడై తమ్మునితో నిట్లు పలి కెను. సోదరా ! మన కులములో పుట్టిన నీవు దురాచారము నవలంబించి కష్టపడుట తగదు. ఈ కులములో నీ వొక్కడవే దుష్టాత్ముడవు మహాపాపరతుడవగుచున్నావు. ఈ దుర్వృత్తమును మానుము. ఇట్లు పలుమార్లు వారించుచున్న అన్న మీద ఆగ్రహించిన సుమాలి యజ్ఞమాలినీ చంపుటకు నిశ్చయించి ఖడ్గహస్తుడై కేశములను పుట్టుకొనెను. అంతట నగరమున భయంకరమైన మహానాదము కలిగెను. నగర ప్రజలు కోపించినవారై సుమాలిని బంధించిరి. సజ్జనుడగు యజ్ఞమాలి నాగరులను ప్రార్థించి సుమాలిని విడిపించేను.” మరల తన ధనమును రెండు భాగములుగా విభజించి ఒక భాగమును సుమాలికిచ్చెను. అతమూడుడైన సుమాలి ఆ ధనమును కూడా మూర్తులగు పాషండచండాలులతో కలిసి అనుభవించెను. దుర్జనుల సంపదలు దుర్జనులచే మాత్రమే అనుభవించబడును. వేపచెట్టు పండ్లను కాకులు మాత్రమే భుజించును కదా ! యజ్ఞమాలి ఇచ్చిన ధనమును కూడా సుమాలి వ్యయము చేసెను. మద్యపానమత్తుడై గోమాంసాదులను భక్షించేను. బందుజనులచే వెలివేయబడి, రాజుచే శిక్షించబడి చండాలస్త్రీలతో కూడి నిర్దారణ్యమున ప్రవేశించేను. మంచిబుద్ధి గల యజ్ఞమాలి మాత్రము ఎప్పుడూ ధర్మరతుడై నిరంతరాయముగా అన్నదానమును చేయుచుండ సత్సంగతివలన పాపములు తొలగెను. తండ్రి త్రవ్వించిన తటాకాదులను ధర్మపరాయణుడై నిత్యము కొపాడుచుండెను. ధర్మమార్గప్రవర్తకుడై మహానుభావుడగు యజ్ఞమాలి సతాత్రదానముచే ధనమునంతయూ వ్యయము చేసెను. సజ్జనుల సంపదలు సజ్జనుల భోగమునకే ఉపయోగపడును. కల్పవృక్షఫలములను అమరులు మాత్రమే అనుభవింతురు కదా ! ధర్మ కార్యములకు ధనమును వ్యయము చేసిన యజ్ఞమాలి ప్రతినిత్యము విష్ణ్వాలయమున పరిచర్యలను చేయుచుండెను.

కాలేన గచ్ఛతా తౌ తు వృద్ధభావముపాగతౌ

యజ్ఞమాలీ సుమాలీ చ హ్యేకకాలే మృతావుభౌ

హరిపూజారతస్యాస్య యజ్ఞమాలిమహాత్మనః

హరిస్సం ప్రేషయామాప విమానం పార్షదావృతమ్

దివ్యం విమానమారుహ్య యజ్ఞమాలీ మహామతిః

పూజ్యమానస్సురగ ణైస్సూ యమానో మునీశ్వరైః

గంధైర్వెర్గీయమానశ్చ సేవితశ్చాప్పరో గణైః

కామధేన్వా పుష్యమాణశ్చిత్రాభరణభూషితః

కోమలైస్తులసీమాల్యైర్భూషిత స్తేజం నిధిః

గచ్ఛన్విష్ణుపదం దివ్యమనుజం పథి దృష్టవాన్

తాడ్యమానం యమభటైః క్షుత్తడ్బ్యాం పరిపీడితమ్

ప్రేతభూతం వివస్త్రం చ దుఃఖితం పాశవేష్టితమ్

ఇతస్తతః ప్రధావన్తం విలపంతమనాధవల్

క్రోశంతం చ రుదన్తం చ దృష్ట్వా మనసి వివ్యధే

యజ్ఞమాలీ దయాయుక్తో విష్ణుదూతాన్సమీపగాన్

కోఽయం భటైర్బాధ్యమాన ఇత్యపృచ్ఛత్కృతాంజలిః

అథ తే హరిదూతాస్తం యజ్ఞమాలిం మహౌజసమ్

అసౌ సుమాలీ భ్రాతా తే పాపాత్మేతి సమబ్రువన్

యజ్ఞమాలీ సమాకర్ణ్య వ్యాఖ్యాతం విష్ణుకింకరైః

మనసా దుఃఖమాపన్నః పునః పప్రచ్ఛ నారద

కథనుస్య భవేన్మోక్షస్సంచితైః పాపసంచయైః

తదుపాయం వదధ్వం మే యూయం హి మమ బాంధవాః

సఖ్యం సాప్తపదీనం స్యాదిత్యాహుర్ధర్మ కోవిదాః

సతాం సాప్తపదీ మైత్రీ సత్సతాం త్రిపదీ తథా

సత్సతామపి యే సంత స్తేషాం మైత్రీ పదేపదే

తస్మా న్మే బాంధవా యూయం మాం నేతుం సముపొగతాః

యతోఽయం మమభ్రాతాపి ముచ్యతే తదిహోచ్యతామ్

యజ్ఞమాలివచశ్శ్రుత్వా విష్ణుదూతా దయాలవః

పునస్మితముఖాః ప్రోచుర్యజ్ఞమాలిం హరిప్రియమ్

కొంతకాలమునకు యజ్ఞమాలి సుమాలి వార్ధక్యమును పొందిరి. ఇద్దరూ ఒకే సమయమున మరణించిరి. మహానుభావుడు హరిపూజాపరుడు అయిన యజ్ఞమాలికై శ్రీహరి ద్వొరపాలకులతో కూడియున్న దివ్య విమానమును పం పెను. మహామతియుగు యజ్ఞమాలి దివ్య విమానము నధిరోహించి దేవతాగణములు పూజించుచుండగా, మునీశ్వరులు స్తుతించుచుండగా గంధర్వులు గానము చేయుచుండగా అప్సరోగణములు సేవించుచుండగా కామధేనువు పోషించుచుండగా చిత్రాభరణ భూషితుడై కోమలములైన తులసీమాలలచే అలంకరించబడి తేజోనిధి దివ్యమైన విష్ణులోకమునకు వెళ్ళుచు మార్గమధ్యమున తమ్ముని చూచెను. యమభటులు కొట్టుచుండగా ఆకలిదప్పులచే పీడించబడుచు, పేతరూపుడైన నగ్నముగా దుఃఖితుడై పాశబద్దుడై ఇటునటు పరుగిడుచు అనాధవలే విలపించుచు ఆక్రోశించుచు రోదించుచున్న వానిని చూచి మనసున వ్యధచెందెను. యజ్ఞమాలి దయాన్వితుడై దగ్గరలోనున్న విష్ణుదూతలను ఇట్లు భటులచే బాధించబడువాడెవ్వడు అని అడిగెను. అట్లు చేతులు జోడించి అడిగిన మహాతేజస్వియగు యజ్ఞమాలికి విష్ణుదూతలు, ఇతను నీ తమ్ముడు పాపాత్ముడగు సుమాలి, అని తెలిపిరి. విష్ణుదూతలు చెప్పిన మాటలను వినిన యజ్ఞమాలి మనసులో దుఃఖించి మరల వారి నడిగెను. ఇతను చేసిన పాపములనుండి ఎట్లు విముక్తి లభించును ? మీరు నాకు బంధువులు కావున ఆ ఉపాయమును తెలుపుడు. ఏడడుగులు కలిసి నడిచినచో సఖ్యమని ధర్మకోవిదులు చెప్పియున్నొరు. సజ్జనులకు ప్రతిపదమున మైత్రి అని కదా ధర్మ నిర్ణయము. కావున నన్ను గొనిపోవుట కొచ్చిన మీరు నాకు బాంధవులు. నా సోదరుడగు సుమాలి కూడా మోక్షమును పొందునుపాయమును తెలుపుడు. ఇట్లు పలికిన యజ్ఞమాలి మాటలను వినిన విష్ణుదూతలు దయాళువులు కావున చిరునవ్వుతో హరిప్రియుడగు యజ్ఞమాలిని గూర్చి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఉవాచ :-

యజ్ఞమాలి మహాభాగ ! నారాయణపరాయణ !

ఉపాయం తవ వక్ష్యామః సుమాలి ప్రేమముక్తిదమ్

కృతం యత్సుమహత్కర్మ త్వయా ప్రాక్తన జన్మని

ప్రవక్ష్యామస్సమా సేన తచ్ఛృణుష్వ సమాహితః

పురా త్వం వైశ్యజాతీయో నామ్నా విశ్వంభరస్స్మృతః

త్వయా కృతాని పాపాని మహన్త్య గణితాని వై

సుకర్మవాసనా హీనో మాతాపిత్రార్విరోధకృత్

ఏకదా బంధుభిస్త్యక్తః శోకసంతాపపీడితః

క్షుధాగ్నినాపి సంతప్తః ప్రాప్తవాన్హరిమందిరమ్

తదా వృష్టిరభూత్తత్ర తత్థ్సానం పంకిలం హ్యభూత్

దూరీకృతస్త్వయా పంకస్తత్థ్సానే స్థాతుమిచ్ఛతా

ఉపలేపనతాం ప్రాప్తం తత్థ్సానం విష్ణుమంది రే

త్వయోషితం తు తద్రాత్రే తస్మిన్దేవాలయే ద్విజ

దంశితశ్చైవ సర్పేణ ప్రాప్తం పంచత్వమేవ చ

తేన పుణ్యప్రభావేన ఉపలేపకృతేన చ

విప్రజన్మ త్వయా ప్రాప్తం హరిభక్తిస్తథాచలా

కల్పకోటిశతం సాగ్రం సంప్రాప్య హరిసన్నిధిమ్

వసాద్య జ్ఞానమాసాద్య పరం మోక్షం గమిష్యసి

అనుజం పాతకి శ్రేష్ఠం త్వం సముద్ధర్తు మిచ్ఛసి

ఉపాయం తవ వక్ష్యామస్తం నిబోధ మహామతే

గోచర్మ మాత్రభూమేస్తు ఉపలేపనజం ఫలమ్

దత్వోద్ధర మహాభాగ భ్రాతరం కృపయాన్వితః

ఏవముక్తో విష్ణుదూతైర్యజ్ఞమాలీ మహామతి

తత్ఫలం ప్రదదౌ తస్మై భ్రాత్రే పాపవిముక్తయే

సుమాలీ భ్రాతృదత్తేన పుణ్యేన గతకల్మషః

బభూవ యమదూతాస్తు తం త్యక్త్వా ప్రపలాయితాః

విమానం చాగతం సద్యస్సర్వభోగసమన్వితమ్

తదా సుమాలీ స్వర్యానమారుహ్య ముముదే మునే

తావుభౌ భ్రాతరౌ విప్ర సురబృందనమస్కృతౌ

ఆవాపతుర్భృశం ప్రీతిం సమాలింగ్య పరస్పరమ్

యజ్ఞమాలీ సుమాలీ చ స్తూయమానౌ మహర్షిభిః

గీయమానౌ చ గంధర్వైః విష్ణులోకం ప్రజగ్మతుః

అవాప్య హరిసాలోక్యం సుమాలీ మునిసత్తమ

యజ్ఞమాలీ చోషతు స్తే కల్పమేకం ముదాన్వితౌ

భుక్త్వా భోగాన్బహూంస్తత్ర యజ్ఞమాలీ మహామతి

తత్రైవ జ్ఞానసంపన్నః పరం మోక్షముపాగతః

సుమాలీ తు మహాభాగో విష్ణులోకే ముదాన్వితః

స్థిత్వా భుమిం పునః ప్రాప్య విప్రత్వం సముపాగత

అతిశుద్ధీ కులే జాతో గుణవాన్వేదపారగః

సర్వసంపత్సము పేతో హరిభక్తిపరాయణః

వ్యాహరన్హరినామాని ప్రపేదే జాహ్నవీతటమ్

తత్ర స్నాతశ్చ గంగాయాం దృష్ట్వా విశ్వేశ్వరం ప్రభుమ్

అవాప పరమం స్థానం యోగినామపి దుర్లభమ్

ఉపలేపనమాహాత్మ్యం కథితం తే మునీశ్వర

తస్మాత్సర్వప్రయల్నేన సంపూజ్యో జగతాం పతిః

అకామాదపి యే విష్ణోః సకృత్పూజాం ప్రకుర్వతే

న తేషాం భవబంధస్తు కదాచిదపి జాయతే

హరిభక్తిరతాన్యస్తు హరిబుద్ధ్యా సమర్చయేత్

తస్య తుష్యంతి విప్రేన్ద్ర బ్రహ్మవిష్ణుమహేశ్వరాః

హరిభక్తి పరాణాం తు సంగినాం సంగమాత్రతః

ముచ్యతే సర్వపాపేభ్యో మహాపాతకవానపి

హరిపూజాపరాణాం చ హరినామరతాత్మనామ్

శుశ్రూషానిరతా యాంతి పాపినోఽపి పరాం గతిమ్

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే విష్ణుసేవాప్రభావో నామ షట్రింశోఽధ్యాయః

విష్ణు దూతల పలికిరి :- ఓ మహానుభావా ! నారాయణ పరాయణా ! యజ్ఞమాలీ ! సుమాలి మోక్షమును చెందు ఉపాయమును నీకు చెప్పెదము. నీవు పూర్వజన్మలో చేసిన మహాపుణ్యమును సంగ్రహముగా చెప్పెదను వినుము. నీవు పూర్వజన్మలో విశ్వంభరడను పేరుగల వైశ్యజాతీయుడవు. నీవు లెక్కించలేని మహాపాపములను ఎన్నింటినో చేసితివి. సత్కర్మవాస నాహీనుడవై తలిదండ్రులను ద్వేషించుచుంటివి. ఒకపుడు బంధువులందరూ వెలివేయగా శోకసంతాపముచే పీడించబడిన ఆకలిచే పరితపించుచు హరి మందిరమును చేరితివి. ఆ సమయమున ఆచట మహా వర్షము కురిసినది. ఆ ప్రాంతమంతయూ బురదమైనది. అపుడు నీవు అచట నివసించగోరి ఆ బురదను దూరము చేసి శుభ్రపరిచితివి. నీవు చేసిన పని హరీమందిరమును అలుకుటగా అయినది. నీవు ఆ రాత్రి ఆ దేవాలయముననే ఉంటివి. ఒక మహాసర్పము కాటువేయగా మరణించితివి. అట్లు విష్ణ్వాలయమున అలుకుట అను సుకృత ప్రభావముచే బ్రాహ్మణజన్మ హరిభక్తి లభించినది. కోటి కల్పములు హరి సన్నిధిన నివసించి జ్ఞానమునుపొంది మోక్షమునందగలవు. మహాపాపి అయిన నీ తమ్ముని పాపవిముక్తుని చేయగోరుచున్నావు. ఆ ఉపాయమును చెప్పెదము. తెలియుము. నీవు ఈ జన్మలో హరిమందిరమును అలికిన ప్రదేశమున గోచర్మమాత్రప్రదేశమును అలుకుట వలన కలిగిన పుణ్యమును నీ సోదరునికి దానము చేసి ఉద్దరించుము. ఇట్లు విష్ణుదూతలు పలుకగా దయాపరుడగు యజ్ఞమాలి ఆ ఫలమును సుమాలికరించెను. అన్నగారు దానము చేసిన పుణ్యముచే సుమాలి పాపవిముక్తుడాయెను. యమదూతలు సుమాలిని విడిచి పారిపోగా, ఆ విమానము నధిరోహించి ఆనందించెను. ఇట్లు ఆ సోదరులిరువురు దేవతాసమూహముచే నమస్కరించబడుచు పరస్పరమాలింగనమును చేసుకొని ఆనందించిరి. యజ్ఞమాలి సుమాలులు మహర్డులచే స్తోత్రము చేయబడుచు గంధర్వులచే గానము చేయబడుచు విష్ణులోకమునకు చేరిరి. ఆ విష్ణులోకమున యజ్ఞమాలిసుమాలులు సంతోషముతో ఒక కల్పము నివసించిరి. విష్ణులోకమున బహుభోగములననుభవించి అచటనే జ్ఞానమును పొంది మోక్షమును పొందెను. మహానుభావుడగు సుమాలి విష్ణులోకమున ఆనందముతో నివసించి మరల భూలోకమున బ్రాహ్మణత్వమునొందెను. పరమపవిత్రమైన కులములో పుట్టిన సుమాలి గుణవంతుడు వేదసారగుడు సర్వసంపత్సమేతుడు, హరిభక్తి పరాయణుడుగా నుండి హరినామ సంకీర్తనమును చేయుచు గంగాతీరమును చేరెను. గంగానదిలో స్నానము చేసి ప్రభువైన విశ్వేశ్వరుని దర్శించి యోగులకు కూడా దుర్లభమగు మోక్షమును పొందెను. ఓ మునీశ్వరా ! నీకు దేవాలయమున ఉపలేపనము చేయుటవలన కలుగు మాహాత్మ్యమును చెప్పితిని. కావున అన్ని విధములా ప్రయత్నించి జగన్నాధుని పూజించవలయును. సంకల్పములేక, కోరికలేక శ్రీహరిని పూజించిననూ ఎపుడూ సంసారబంధము కలుగును. హరిభక్తిరతులైన వారిని హరిబుద్ధిచే పూజించినచో బ్రహ్మ విష్ణుమ హేశ్వరులు సంతోషింతురు. హరిభక్తి పరులతో కలిసియున్నవారిని కలిసిననూ మహాపాతకులైనను అన్ని పాపములనుండి విముక్తులగుదురు. హరిపూజాపరులను హరినామసంకీర్తనము చేయువారిని సేవించువారు పొపులైనను పరమపదమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణు సేవాప్రభావమను ముప్పదియారవ అధ్యాయము సమాప్తము.