నారద మహా పురాణము
93 - పద్మపురాణానుక్రమణికా వర్ణనమ్.
బ్రహ్మో వాచ :-
శృణు పుత్ర ప్రవక్ష్యామి పురాణం పద్మ సంజ్ఞకమ్ ।
మహత్పుణ్యప్రదం నృణాం శృణ్వతాం పఠతాం ముదా
యథా పంచేంద్రియస్సర్వశరీరీతి నిగద్యతే ।
తథేదం పంచభిః ఖండైరుదితం పాపనాశనమ్
పులస్త్యేన తు భీష్మాయ సృష్ట్యాది క్రమతో ద్విజ ।
నానాఖ్యానే తిహాసాద్యై ర్యతో ధర్మ విస్తరః
పుష్కరస్య చ మాహాత్మ్యం విస్తరేణ ప్రకీర్తితమ్ ।
బ్రహ్మయజ్ఞ విధానం చ వేదపాఠాదిలక్షణమ్
దానానాం కీర్తనం యత్ర వ్రతానాం చ పృథక్ పృథక్।
వివాహ శైలజాయాశ్చ తారకాఖ్యానకం మహత్
మాహాత్మ్యం చ గవాదీనాం కీర్తితం సర్వపుణ్యదమ్ ।
కాలకేయాదిదైత్యానాం వధో యత్ర పృథక్పథక్
గ్రహాణామర్చనం దానం యత్ర ప్రోక్తం ద్విజోత్తమ ।
తత్సృష్టిఖండముద్దిష్టం వ్యాసేన సుమహాత్మనా
పితృమాత్రాదిపూజ్యత్వే శివశర్మ కథాపురా ।
సువ్రతస్య కథాపశ్చాద్వత్రస్య చ వధస్తథా ।
పృథోర్వైనస్య చాఖ్యానం సునీధాయాః కథా తథా ।
సుకళాఖ్యానకం చైవ ధర్మాఖ్యానం తతః పరమ్
పితృశుశ్రూషణాఖ్యానం నహుషస్య కథా తతః ।
యయాతిచరితం చైన గురుతీర్థనిరూపణమ్
రాజ్ఞా జైమినిసంవాదో బహ్వాశ్చర్యకణాయుతః ।
కథా హ్యశోకసుందర్యా శుండదైత్యవధాన్వితా
కౌమోదఖ్యానకం తత్ర విశుండ వధసంయుతమ్ ।
కుంజరస్య చ సంవాద శ్చ్యవనేన మహాత్మనా
సిద్ధాఖ్యానం తతః ప్రోక్తం ఖండస్యాస్య ఫలావహమ్ ।
సూత శౌనక సంవాదం భూమిఖండమిదం స్మృతమ్
బ్రహ్మండోత్పత్తిరుదితా యత్రర్షిభిశ్చ సౌతినా ।
స భూమిలోకసంస్థానం తీర్థాఖ్యానం తతః పరమ్
నర్మదోత్పత్తికధనం తత్తీర్ణానాం కథాః పృథక్ ।
కురుక్షేత్రాది తీర్థానాం కధాః పుణ్యా ప్రకీర్తితా
కాళిందీ పుణ్య కథనం కాశీ మాహాత్మ్య వర్ణనమ్ ।
గయాయాశ్చైవ మాహాత్మ్యం ప్రయాగస్య చ పుణ్యకమ్
వర్ణాశ్రమానురోధేన కర్మయోగ నిరూపణమ్ ।
వ్యాసజైమిని సంవాదః పుణ్య కర్మ కథాన్వితః
సముద్రమథనాఖ్యానం వ్రతాఖ్యానం తతః పరమ్ ।
ఊర్ణ పంచాహమాహాత్మ్యం స్తోత్రం సర్వాపరాధనుత్
ఏతత్స్వర్గాభిదం విప్ర సర్వపాతక నాశనమ్ ।
రామాశ్వమేధం ప్రథమం రామరాజ్యాభిషేచనమ్
అగస్త్యాద్యాగమశ్చైవ పౌలస్త్యాన్వయ కీర్తనమ్ ।
అశ్వమేధోపదేశశ్చ హయచర్యా తతః పరమ్
నానారాజకథాః పుణ్యా జగన్నాథానువర్లనమ్।
బృష్ణావనస్య మహాత్మ్యం సర్వపాపప్రణాశనమ్
నిత్యలీలానుకథనం యత్ర కృష్ణావతారిణః ।
మాధవస్నానమాహాత్మ్యం నానాదానార్చనే ఫలమ్
ధరావరాహసంవాదో యమబ్రహ్మణయోః కథా ।
సంవాదో రాజదూతానాం కృష్ణస్తోత నిరూపణమ్
శివశంభుసమాయోగో దధీచఖ్యానకం తతః ।
భస్మ మాహాత్మ్యమతులం శివమాహాత్మ్య ముత్తమమ్
దేవరాత సుతాఖ్యానం పురాణజ్ఞ ప్రశంసనమ్ ।
గౌతమాఖ్యానకం చైవ శివగీతా తత స్మృతా
కల్పాక్షరా రామకథా భారద్వాజాశ్రమస్థితా ।
పాతాలఖండమేతద్ధి శృణ్వతాం పఠతాం సదా
సర్వపాప ప్రశమనం సర్వాభీష్ట ఫలప్రదమ్ ।
పర్వతాఖ్యానకం పూర్వం గ్జర్యై ప్రోక్తం శివేన వై
జాలంధర కథా పశ్చాచ్ఛీశైలాద్యనుకీర్తనమ్ ।
సగరస్య కథా పుణ్యా తతః పరముదీరితమ్
గంగా ప్రయాగకాశీనాం గయాయా శ్చాధిపుణ్యకమ్ ।
అన్నాది దాన మహాత్మ్యం తన్మహాద్వాదశీవ్రతమ్
చతుర్వింశైకాదశీనాం మహాత్మ్యం పృథగీరితమ్ ।
విష్ణు ధర్మ సమాఖ్యానం విష్ణునామ సహస్రకమ్
కార్తిక వ్రత మహాత్మ్యం మాఘస్నాన ఫలం తతః ।
జంబూ ద్వీపస్య తీర్థానాం మాహాత్మ్యం పాపనాశనమ్
సాభ్రమత్యాశ్చ మహాత్మ్యం నృసింహోత్పత్తి వర్ణనమ్ ।
దేవశర్మాది కాఖ్యానం గీతామహాత్మ్య వర్ణనమ్
భక్త్యా ఖ్యానం చ మాహాత్మ్యం శ్రీమద్భాగవతస్య హ ।
ఇస్రప్రస్థస్య మాహాత్మ్యం బహుతీర్థ కధాన్వితమ్
మంత్రరత్నాభిధానం చ త్రిపాద్భూత్యనువర్ణనమ్ ।
అవతారకథాః పుణ్యా మత్స్యాదీనామతః పరమ్
రామనామశతం దివ్యం తన్మాహాత్మ్యం చ వాడవ ।
పరీక్షణం చ భృగుణా శ్రీ విష్ణోర్యై భవస్య చ
ఇత్యేతదుత్తరం ఖండం పంచమం సర్వపుణ్యదమ్ ।
పంచఖండయుతం పాద్మం యశృణోతి నరోత్తమః
స లభేద్వైష్ణవం ధామ భుక్త్యా భోగానిహేప్సితాన్ ।
ఏతద్వై పంచ పంచాశత్సహస్రం పద్మసంజ్ఞకమ్
పురాణం లేఖయిత్వా వై జ్యేష్ఠ్యాం స్వర్ణాబ్జసంయుతమ్ ।
యః ప్రదద్యాత్సుసత్కృత్య పురాణజ్ఞాయ మానద
స యాతి వైష్ణవం గ్రామ సర్వదేవనమస్కృతః ।
పద్మానుక్రమణిమేతాం యః పఠేచ్ఛృణుయాత్తథా
సోపి పద్మ పురాణస్య లభేచ్ఛ్రవణజం ఫలమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే పద్మపురాణానుక్రమణికా వర్ణనం నామ త్రినవతి తమోధ్యాయః.
బ్రహ్మపలికేను :-
ఓ పుత్రా ! ఇపుడు చదువు వారికి వినువారికి గొప్ప పుణ్యమును ప్రసాదించు పద్మపురాణమును చెప్పెదను వినుము. అయిదింద్రియములు గలవాడు ఆత్మ అగునట్లు పంచఖండములు కలది పాపనాశకమగు పద్మపురాణము. ఓ బ్రాహ్మణోత్తమా? పులస్త్య బ్రహ్మ భీష్మునకు సృష్ట్యాది క్రమముగా సోనాఖ్యానే తిహాసాదులతో ధర్మము విస్తారముగా ఈ పద్మ పురాణమున చెప్పబడినది. పుష్కర మాహాత్మ్యము, వేద పాఠాది లక్షణము, దాన ప్రశంస, వ్రత ప్రశంస, పార్వతీ కళ్యాణము, తారకాఖ్యానము, గవాది మహాత్మ్యము కాలకేయాది దైత్యవధ, గ్రహార్చనము, దానము ఇవన్నియూ సృష్టి ఖండమున మహాను భావుడగు వ్యాసమహర్షి విస్తరముగా వర్ణించియున్నాడు. తల్లిదండ్రులను పూజించవలయునని చెప్పుటకు శివశర్మ కథను, సువ్రతుని కథను, వృత్రాసుర వధను, పృధువేనుల చరిత్రను, సునీధుని కథను, సుకళాఖ్యానమును, ధర్మాఖ్యానమును, పితృశుశ్రూషణాఖ్యానమును, సహుష కథను, యయాతి చరితమును, గురుతీర్ధ నిరూపణమును ఆశ్చర్యములను గొలుపు పలుకథలు గల రాజ జైమిని సంవాదమును హుండదైత్యుని వధతో కూడిన అశోక సుందరి కథను, కామోదాఖ్యానకమును, విహుండ వధను, చ్యవన కుంజల సంవాదమును, ఈ ఖండమున ఫలశ్రుతిని, సిద్ధాఖ్యానమును, సూత శౌనక సంవాదమున భూమి ఖండమున చెప్పియున్నారు. సూత పుత్రునిచే ఋషులచే బ్రహ్మండోత్పత్తి వర్ణమును, భూమిలోక సంస్థానమును, తీర్థాఖ్యానమును, నర్మదోత్పత్తి కథనమును, ఆయా తీర్థముల కధలను, కురుక్షేత్రాదులలో నుండు తీర్థముల పుణ్యధలను, కాళిందీ పుణ్యకథను, కాశీమాహాత్మ్య వర్ణనమును, గయా మహాత్మ్యమును, ప్రయాగ మహాత్మ్యమును, వర్ణాశ్రమానురోధముతో కర్మయోగ నిరూపణమును, వ్యాస జైమిని సంవాదమును పుణ్యకర్మ కథాన్వితముగా, సముద్ర మథనాఖ్యానమును, వ్రతాఖ్యానమును, ఊర్జ పంచాహ మాహాత్మ్యమును, సర్వాపరాధములను తొలగించు స్తోతమును స్వర్గఖండమున చెప్పియున్నారు.
రామ రాజ్యాభిషేచనము, రామాశ్వమేధము, అగస్త్యాది మహర్షులు వచ్చుట, పౌలస్త్య వంశ కధను చెప్పుట, అశ్వమేధోప దేశము, హయచర్య, పవిత్రములైన నానా రాజ కధలు, జగన్నాధాను వర్ణనము, సర్వపాప ప్రణాశనమగు బృందావన మాహాత్మ్యము, కృష్ణావతారమున నున్న శ్రీహరి యొక్క నిత్యలీలాను కథనము, మాధవ స్నాన మాహాత్మ్యము, నానా దానార్చన పలము, భూవరాహ సంవాదము, యమ బ్రాహ్మణుల కథ, రాజ దూత కధ, కృష్ణ స్తోత్ర నిరూపణము, శివ శంభు సమాయోగము, దధీచాఖ్యానకము, గొప్ప భస్మ మాహాత్మ్యము, ఉత్తమమగు శివమాహాత్మ్యము, దేవరాత సుతాఖ్యానము, పురాణజ్ఞ ప్రశంస, గౌతమాఖ్యానము, శివగీతా, కల్పాన్తరమున రామకథ భారద్వాజాశ్రమస్థితి, ఇవి యన్నియు పాతాళఖండమున చెప్పబడియున్నవి. ఈ పాతాళ ఖండమును చదివిన వారికి వినువారికి సర్వపాప నివృత్తి ద్వారా సర్వాభీష్ట ఫలము నిచ్చును.
శివుడు పార్వతికి చెప్పిన పర్వతాఖ్యానము, జలంధర కథ, గంగా ప్రయాగ కాశీ గయా తీర్థక్షేత్రముల పుణ్యకథలు. అన్నాది దాన మాహాత్మ్యము, మహాద్వాదశీవ్రతము, ఇరువది నాలుగు ఏకాదశుల మాహాత్మ్యము, విష్ణు ధర్మ సమాఖ్యానము, విష్ణు నామ సహస్రము, కార్తీక వ్రత మాహాత్మ్యము, మాఘస్నాన ఫలము, పాప నాశనములగు జంబూద్వీప తీర్థముల మాహాత్మ్యము, సౌభ్రమతీ మాహాత్మ్యము, నృసింహోత్పత్తి వర్ణనము, దేవశర్మాఖ్యానము, గీతా మహాత్మ్య వర్ణనము, భక్త్యాఖ్యానము, భక్తి మాహాత్మ్యము శ్రీమద్భాగవత మాహాత్మ్యము. బహుతీర్థకథలతో కూడియున్న ఇంద్రప్రస్థ మాహాత్మ్యము, మంత్ర రత్నాభిధానము, త్రిపాద్విభూతి వర్ణనము, మత్స్యాద్యవతార కథలు, దివ్యమగు రామనామ శతకము, రామనామ మహాత్మ్యము, భృగుమహర్షి శ్రీ మహా విష్ణు వైభవమును పరీక్షించుట ఇవియన్నియు సర్వపుణ్య ప్రదమగు అయిదవ ఉత్తరఖండమున చెప్పబడియున్నవి. ఇట్లు పంచ ఖండములచే కూడియున్న పద్మపురాణమును భక్తితో వినిన మానవోత్తముడు ఇహలోకమున అభీష్టభోగముల ననుభవించి వైష్ణవ లోకమును చేరును. ఇట్లు పద్మపురాణమున యాభైయైదు వేల శ్లోకములు కలవు. జేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు, ఈ పద్మ పురాణమును వ్రాసి బంగారు పద్మములతో పురాణజ్ఞునికి చక్కగా సత్కరించి ఇచ్చినవాడు సర్వదేవ నమస్కృతుడై విష్ణులోకమున కేగును. ఈ పద్మపురాణానుక్రమణిని చదివినవాడు, వినినవాడు పద్మపురాణ శ్రవణ ఫలమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థ పాదమున పద్మపురాణా నుక్రమణీకథనమను తొంబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 95 of the Nārada Mahā Purana is as follows:
తీర్థరాజైన ప్రయాగక్షేత్రము మరియు గంగా యమునా సరస్వతుల త్రివేణి సంగమ మహిమ ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. ప్రయాగ మాఘ స్నానము వలన లభించే అత్యున్నత వైకుంఠ ప్రాప్తి ఇక్కడ నిరూపించబడినది.