34 - హరిభక్తిలక్షణమ్

నారద ఉవాచ :-

సమాఖ్యాతాని సర్వాణి యోగాంగాని మహామునే !

ఇదానీమపి సర్వజ్ఞ యత్పృచ్ఛామి తదుచ్యతామ్

యోగో భక్తిమతామేవ సిధ్యతీతి త్వయోదీతమ్

యస్య తుష్యతి సర్వేశస్తస్య భక్తిశ్చ శాశ్వతమ్

యథా తుష్యతి సర్వేశో దేవదేవో జనార్దనః

తన్మమాఖ్యాహీ సర్వజ్ఞ మునే కారుణ్యవారిదే !

నారదమహర్షి పలి కెను :- సర్వజ్ఞా ! మహామునీ ! సర్వయోగాంగములను చక్కగా వివరించితిరి. ఇపుడు కూడా నేనడిగిన విషయములను చేప్పుడు. భక్తి గల వారికే యోగము సిద్ధించునని మీరు చెప్పితీరి. సర్వేశుడు సంతోషించినపుడే భక్తి స్థిరముగా నుండునని చెప్పితిని. సర్వేశుడు దేవదేవుడగు జనార్దనుడు ఎట్లు సంతోషించునో దయానిధివగు నీవు నాకు చెప్పుము.

సనక ఉవాచ:-

నారాయణం పరం దేవం సచ్చిదానన్దవిగ్రహమ్

భజ సర్వాత్మనా విప్ర యది ముక్తిమభీప్ససి

రిపవస్తం న హింసన్తి న బాధనే గ్రహాశ్చ తమ్

రాక్షసాశ్చ నచేక్షన్తే నరం విష్ణుపరాయణమ్

భక్తిర్దృడా భవేద్యస్య దేవదేవే జనార్ధనే

శ్రేయాంసి తస్య సిధ్యంతి భక్తిమంతోఽధికాస్తతః

పాదౌ తౌ సఫలౌ పుంసాం యా విష్ణుగృహనామినే

తౌ కరౌ సఫలౌ జ్ఞేయో విష్ణుపూజాపరౌ తు యా

తే నేత్రే సుఫలే పుంసాం పశ్యతో యే జనార్దనమ్

సా జిహ్వ ప్రోచ్యతే సద్భిర్హరినామపరా తు యా

సత్యం సత్యం పునస్సత్యముద్ధృత్య భుజముచ్యతే

తత్త్వం గురుసమం నాస్తి న దేవః కేశవాత్పరః

సత్యం వచ్మి హితం వచ్మి సారం వచ్మి పునఃపునః

అసార్వే స్మింస్తు సంసారే సత్యం హరిసమర్చనమ్

సంసారపాశం సదృఢం మహామోహప్రదాయకమ్

హరిభక్తి కుఠారేణ ఛత్త్వాత్యన్తసుఖీ భవ

తన్మనస్సంయుతం విష్ణౌ సా వాణీ యత్పరాయణా

తే శ్రోత్రే తత్కథాసారపూరితే లోకవందితే

ఆనందమక్షరం శూన్యమవస్థాత్రితయైరపి

ఆకాశమధ్యగం దేవం భజ నారద సంతలమ్

స్థానం న శక్యతే యస్య స్వరూపం వా కదాచన

నిర్దేష్టుం మునిశార్దూల ద్రష్టుం వాప్యకృతాత్మభిః

సమస్తైః కరణేర్యుక్తీ వర్తతేఽసౌ యదా తదా

జాగ్రదిత్యుచ్యతే సద్భిరన్తర్యామీ సనాతనః

యదాన్తఃకరణైర్యుక్తో స్వేచ్ఛయా విచరత్యసౌ

స్వప్నల్యుచ్యతే హ్యాత్మా యదా స్వాపవివర్జితః

న బాహ్యాకరణేర్యుక్తో న చాన్తఃకరణైస్తథా

అస్వరూపో యదాత్మాసౌ పుణ్యాపుణ్యవివర్జితః

సర్వోపాధివినిర్ముక్తో హ్యానందో నిర్గుణో విభుః

పరబ్రహ్మమయో దేవసుషుప్త ఇతి గీయతే

భావనామయమేతద్వై జగతావర జంగమమ్

విద్యుద్విలోలం విప్రేన్ద్ర భజ తస్మాజ్జనార్దనమ్

అహింసాసత్యమ స్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ

వర్తతే యస్య తస్యైవ తుష్యతే జగతాంపతిః

సర్వభూతదయాయుక్తో విప్రపూజాపరాయణః

తస్య తుష్టో జగన్నాథో మధు కైటభమర్దనః

సత్కథాయాం చ రమతే సత్కథాం చ కరోతి యః

సత్సంగో నిరహంకారస్తస్య ప్రీతో రమాపతిః

నామసంకీర్తనం విష్ణోక్షుత్తృటస్థలతాదీషు

కరోతి సతతం యస్తు తస్య ప్రీతోహ్యధోక్షజః

యా తు నారీ పతిప్రాణా పతిపూజాపరాయణా

తస్యాస్తుష్టో జగన్నాథో దదాతి స్వపదం మునే

అసూయారహితా యే తు హ్యహంకారవివర్జితాః

దేవపూజాపరా శ్చైవ తేషాం తుష్యతి కేశవః

సనక మహర్షి పలికెను :- ముక్తి పై కోరిక యున్నచో సచ్చిదానన్దవిగ్రహుడు పరదేవుడు అగు నారాయణుని సర్వ విధములా సేవించుము. విష్ణు పరాయణుడగు మానవుని శత్రువులు హింసించజాలరు. గ్రహములు బాధించజాలవు. రాక్షసులు చూడజాలరు. దేవదేవుడగు జనార్ధనుని యందు దృఢమగు భక్తి కలవారికి అన్ని శ్రేయస్సులు సిద్దించును. అందరికంటే భక్తిమంతులే అధికులు. శ్రీహరి మందిరమునకు వెళ్ళు పాదములు సఫలములు. శ్రీహరిని పూజించు కరములు సఫలములు. శ్రీహరిని దర్శించు నేత్రములు సఫలములు. హరినామమును కీర్తించు దానినే సజ్జనులు జిహ్వయందురు. చేతులు పైకెత్తి ముమ్మారులు సత్యమును చెప్పుచున్నాను. గురువుతో సమమగు తత్త్వమును, హితమును, సారమును చెప్పుచున్నాను. నిస్సారమైన ఈ సంసారమున సారము హరి సమర్చనము మాత్రమే. సుదృఢము మహామోహ ప్రదాయకము అగు సంసారపాశమును హరి భక్తి యను గొడ్డలిచే ఛేధించి అత్యన్తానన్దమును పొందుము. విష్ణువు నందు లగ్నమైనదే మనస్సు. విష్ణు నామసంకీర్తన పరాయణమైనదే వాక్కు. విష్ణు కథాసారపూరితములైనవే శ్రోత్రములు. ఆనందము అక్షరము, అవస్థాత్రయశూన్యము అకాశమధ్యగతము పరదైవతమగు శ్రీహరిని సర్వకాలములలో సేవించుము. ఆత్మజ్ఞానము లేనివారు శ్రీహరి స్థానమును, స్వరూపమును చూచుటకు నిర్దేశించుటకు వీలుకాదు. సర్వాంతర్యామి సనాతనుడగు దేవదేవుడు సమస్త కరణములచే కూడియున్నచో మేలుకొని యున్నాడందురు. అంతకరణములతో కూడి స్వేచ్ఛగా సంచరించు చున్నపుడు స్వపితి అని (పడుకొని యున్నాడు) అందురు. స్వాప వివర్జితుడై బాహ్యాంతఃకరణ రహితుడై స్వరూప రహితుడై పుణపాప వివీర్షితుడై యున్నపుడు సర్వోపాధి వినర్ముక్తుడు ఆనంద స్వరూపుడు నిర్గుణుడు విభువు పరబ్రహ్మ స్వరూపుడగు దేవుడు సుషుప్తావస్థలో (నిద్రావస్థలో) ఉండేనందురు. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ భావనామయమే. మెరుపువలె చంచలము. కావున జనార్ధనుని సేవించుము. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మ చర్యము అపరిగ్రహము కలవానికి శ్రీహరి సంతోషించును. సర్వభూతదయాపరుడు బ్రాహ్మణపూజా పరాయణుడు అగువాని విషయమున మధు కైటభమర్దనుడగు శ్రీహరి సంతోషించును. సత్కథను విని సంతోషించువాడు, సత్కథను , చెప్పువాడు, సత్సంగమును చేయువాడు, అహంకార రహితుడు అగువానికి శ్రీహరి ప్రీతి చెందును. ఆకలి దప్పులలో, ప్రమాదములలో, సర్వకార్యములలో, సర్వావస్థలలో శ్రీహరినామ సంకీర్తనమును చేయువారికి శ్రీహరి సంతోషించును. పతిప్రాణి పతిపూజా పరాయణ యగు స్త్రీ విషయమున జగన్నాథుడు సంతోషించి తన పదమును ప్రసాదించును. అసూయారహితులకు అహంకార వర్షితులకు దేవపూజాపరులకు శ్రీహరి ప్రసన్నుడగును.

తస్మాచ్ఛృణుష్వ దేవర్షే భజస్వ సతతం హరిమ్

మా కురుష్వ హ్యాహంకారం విద్యుల్లోలశ్రిలియా వృథా

శరీరం మృత్యుసంయుక్తం జీవితం చాతిచంచలమ్

రాజాదిభిర్ధనం బాధ్యం సంపదః క్షణభంగురాః

కిం న పశ్యసి దేవర్షే హ్యాయుషార్థం తు నిద్రయా

హతం చ భోజనాద్యైశ్చ కియదాయుస్సమాహృతమ్

కియదాయుర్బాలభావార్వృద్ధభావాతీయద్వృధా

కియద్విషయభో గైశ్చ కదా ధర్మాన్కరిష్యతి

బాలభావే చ వార్ధక్యే న ఘటేతాచ్యుతార్చనమ్

వయ స్యేవ తతో ధర్మాన్కురు తమనహంకృతః

మా వినాశం ప్రజ మునే మగ్నస్సంసారగహ్వరే

వపుర్వనాశనిలయమాపదాం పరమం పదమ్

శరీరం భోగనిలయం మలాద్యైః పరదూషితమ్

కిమర్దం శాశ్వత ధియా కుర్యాతాపం నరో వృథా

అసారభూతే సంసారే నానాదుఃఖసమన్వితే

విశ్వాసో నాత్ర కర్తవ్యో నిశ్చితం మృత్యుసంకులే

తస్మాచ్ఛృణుష్వ విప్రేన్ద్ర సత్య మేతదవీమ్యహమ్

దేహం యోగనివృత్త్యర్థం సద్య ఏవ జనార్దనమ్

మానం త్యక్త్వా తథా లోభం కామక్రోధవివర్జితః

భజస్వ సతతం విష్ణుం మానుష్యమతిదుర్లభమ్

కోటిజన్మసహస్రేషు స్థావరాదిషు సత్తమ

సంభ్రాంతస్య తు మానుష్యం కథంచిత్పరిలభ్యతే

తత్రాపి దేవతాబుద్ధిర్ధానబుద్ధిశ్చ సత్తమ

భోగబుద్ధిస్తథా నృణాం జన్మాత్తరతపఃఫలమ్

మానుష్యం దుర్లభం ప్రాప్య యో హరిం నార్చయేత్సకృత్

మూర్ఖః కోఽస్తే పరస్తస్మాఙడబుద్ధిరచేతనః

దుర్లభం ప్రాప్య మానుష్యం నార్చయన్తి చ యే హరిమ్

తేషామతీవ మూర్ఖణాం వివేకః కుత్ర తిష్ఠతి

ఆరాధితో జగన్నాథో దదాత్యభిమతం ఫలమ్

కస్తం న పూజయేద్విప్ర సంసారాగ్నిప్రదీపిత

చండాలోఽపి మునిశ్రేష్ట విష్ణుభక్తో ద్విజాధికః

విష్ణుభక్తివిహీనశ్చ ద్విజోఽపి శ్వపచాధమః

తస్మాత్కామాదికం త్యక్త్వా భజేత హరిమవ్యయమ్

యస్మింస్తుఽ ష్టేఖిలం తు ష్యేద్యతస్సర్వగతో హరిః

యథా హస్తిపదే సర్వం పదమాత్రం ప్రతీయతే

తథా చరాచరం విశ్వం విష్ణవేవ ప్రలీయతే

ఆకాశేన యథా వ్యాప్తం జగత్థ్సావరజంగమమ్

తథైవ హరిణా వ్యాప్తం విశ్వమేతచ్చరాచరమ్

జన్మనో మరణం నృణాం జన్మవై మృత్యుసాధనమ్

ఉభే తే నికటే విద్ది తన్నాశో హరి సేవయా

ధ్యాతస్స్మృతః పూజితో వా ప్రణతో వా జనార్దనః

సంసారపాశవిచ్ఛేదీ కస్తం న ప్రతిపూజయేత్

యన్నా మోచ్చారణాదేవ మహాపాతకనాశనమ్

యం సమభ్యర్చ్య విప్రర్షే మోక్ష భాగీ భవేన్నరః

అహో చిత్రమహో చిత్రమహా చిత్రమిదం ద్విజ

హరినామ్ని స్థితే లోకస్సంసారో పరివర్తితే

భూయో భూయోఽపి వక్ష్యామి సత్యమేతత్తపోధన

నీయమానో యమభటైరశక్తో ధర్మసాధనైః

యావన్నేండ్రియవైకల్యం యావద్యాధిర్న బాధతే

తావదేవార్చయేద్విష్ణుం యది ముక్తి మభీప్సతి

కావున ఓ దేవరీ ! నా మాటను వినుము. ఎప్పుడూ శ్రీహరినే సేవించుము. మెరుపు వలె చంచలమైన సంపదచే అహంకరించకుము. ఈ శరీరము మృత్యువుతో కలిసియుండునది. జీవితము అతి చంచలము. ధనము రాజ తస్కరాదులచే అపహరించబడును. సంపదలు కణ భంగురములు. ఓ దేవరీ ! సగము ఆయుష్యము నీద్రలో గడుచుటను నీవు చూచుట లేదా ? భోజనాది వ్యవహారములచే ఎంత ఆయుష్యము గడుచుచున్నది. బాలభావముచే కొంత వృద్ధాభావముచే కొంత వ్యర్థమగుచున్నది. మరికొంత యౌవనమున విషయ భోగములచే వ్యర్థమగుచున్నది. ఇక ధర్మములనోచరించునదెపుడు? బాల్యమున వార్థక్యమున అచ్యుతార్చన చేయజాలరు. కావున యౌవనముననే అహంకారమును విడిచి ధర్మా చరణమును చేయుము. సంసార గహ్వరమున మునిగి నశించకుము. ఈ శరీరము నాశనమునకు నిలయము ఆపదలకు స్థానము. ఈ శరీరము భోగనిలయము. మలమూత్రాదులచే పరిదూషితము. కావున శాశ్వతమని భావించి మానవుడేల పాపమునాచరించవలయును? నానా దుఃఖములతో కూడుకొని నిస్సారమైన సంసారమున విశ్వాసమునులచరాదు. ఎప్పుడు మృత్యువు గ్రహీంచునో తెలియదు. కావున ఓ మునీనా ! నేనీ సత్యమును చెప్పుచును. వినుము. దేహసంబన్ల నివృత్తికొఱకు వెంటనే అభిమానమును కామక్రోధలోభములను విడిచి శ్రీహరిని భజించుము. మానవత్వము చాలా దుర్లభము. కొన్ని వేల కోట్ల జన్మలు స్థావరాదులలో భ్రమించిన తరువాత అతి కష్టముతో మనుష్యత్వము లభించును. ఆ మానవ జన్మలో దైవతాబుద్ధి భోగబుద్ధి కలుగుట పూర్వజన్మ తపః ఫలమే. మానుష్యమును పొంది కూడా శ్రీహరిని సేవించనిచో అతనికంటే అజ్ఞాని 'మందబుద్ది మూర్ఖుడు మరియొకడుండడు. దుర్లభమైన మానుష్యమును పొంది శ్రీహరిని కోరిన ఫలములనిచ్చును. సంసారాగ్నిచే దహించబడిన వాడెవ్వడు శ్రీహరిని ఆరాధించడు? విష్ణుభక్తి కలవాడు చండాలుడైనను ద్విజుని కంటే శ్రేషుడే. విష్ణు భక్తి హీనుడగు ద్విజుడుకూడా చండాలుని కంటే అధముడే. కావున కామాదులను విడిచి అవ్యయుడగు శ్రీహరిని సేవించవలయును. శ్రీహరి సర్వగతుడు కావున శ్రీహరి సంతోషించినచో విశ్వమంతయూ ప్రీతి చెందును. హస్తిపదమున పొదమంతయూ లీనమగునట్లు చరాచర ప్రపంచమంతయూ శ్రీహరిలో లీనమగును. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ ఆకాశముతో వ్యాపించబడియున్నట్లు ఈ ప్రపంచమంతయూ శ్రీహరి చే వ్యాపించబడియున్నది. జన్మ నుండి మరణము సంభవించును. జన్మమే మృత్యుసాధనము. జన్మ మరణములు అతి సన్ని హితములు. శ్రీహరి సేవచే జన్మ మరణములు నశించును. శ్రీహరిని ధ్యానించిననూ, స్మరించిననూ, పూజించిననూ ప్రణామములాచరించిననూ సంసారపాశమును ఛేదించును. కావున శ్రీహరిని పూజించనివాడెవ్వడు? శ్రీహరి నామోచ్చారణముచే సర్వపాపములు నశించును. పూజించినచో మోక్షమే లభించును. శ్రీహరి నామముండగా జనులు సంసారమున నుండుట ఎంత ఆశ్చర్యము ! ఎంత ఆశ్యర్యము ! అందువలననే మరల మరల చెప్పుచున్నాను. ఇది సత్యము. వినుము. యమభటులు తీసుకొని పోవుచున్నప్పుడు ధర్మాచరణను చేయజాలవు. ఇంద్రియవైకల్యము వ్యాధులు కలుగనపుడే ముక్తిని కోరువారు శ్రీహరిని పూజించవలయును.

మాతుర్గర్భాద్వినిష్క్రాంతో యదా జంతుస్తదైవ హీ

మృత్యుస్సన్ని హితో భూయాత్తస్మాద్ధర్మపరో భవేత్

ఆహొకష్టమహోకష్టమహాకష్టమిదం వపుః

వినశ్వరం సమాజ్ఞాయ ధర్మం నైవాచరత్యయమ్

సత్యం సత్యం పునస్సత్యముద్ధృత్య భుజముచ్యతే

దంభాచారం పరిత్యజ్య వాసుదేవం సమర్చయేత్

భూయో భూయో హితం వచ్మి భుజముద్ధృత్య నారద !

విష్ణుస్సర్వాత్మనా పూజ్యస్త్యాజ్యాసూయా తథానృతమ్

క్రోధమూలో మనస్తాపః క్రోధస్సంసారబంధనమ్

ధర్మక్షయకరః క్రోధస్తస్మాత్తం పరివర్జయేత్

కామమూలమిదం జన్మ కామః పాపస్య కారణమ్

యశఃక్షయకరః కామః తస్తాత్తం పరివర్జయేత్

సమస్తదుఃఖజాలానాం మాత్సర్యం కారణం స్మృతమ్

నరకాణాం సాధనం చ తస్మాత్తదపి సంత్యజేత్

మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

తస్మాత్తదభిసంయోజ్య పరాత్మని సుఖీ భవేత్ అహోధైర్యమహోధైర్యమహోధైర్యమహోనృణామ్

విష్ణౌ స్థితే జగన్నాథే న భజంతి మదోద్ధతాః

అనారాధ్య జగన్నాధం సర్వధాతారమచ్యుతమ్

సంసారసాగరే మగ్నాః కథం పారం ప్రయాంతి హి

అచ్యుతానన్దగోవిన్దనామోచ్చారణభేషజాత్

నశ్యంతి సకలా రోగాస్సత్యం సత్యం వదామ్యహమ్

నారాయణ ! జగన్నాథ ! వాసుదేవ ! జనార్దన !

ఇతీరయన్త యే నిత్యం తే వై సర్వత్ర వందితాః

ఆద్యాపి చ మునిశ్రేష్ఠ బ్రహ్మాద్యా ఆపి దేవతాః

యత్ప్రభావం న జానన్తి తం యాహి శరణం మునే

అహో మౌర్ఖ్యమహో మౌర్ఖ్యo అహో మౌర్ఖ్యo దురాత్మ నామ్

హృత్పద్మసంస్థితం విష్ణుం న విజానప్తి నారద!

శృణుష్వ మునిశార్దూల భూయో భూయో వదామ్యహమ్

హరిశ్శ్రద్ధావతాం తు ష్యేన్నధనై ర్న చ బాంధవైః

బంధుమత్త్వం ధనాఢ్యత్వం పుత్రవత్త్వం చ సత్తమ

విష్ణుభక్తిమతాం నృణాం భవేజ్జన్మని జన్మని

పాపమూలమయం దేహః పాపకర్మరతస్తథా

ఏతద్విదిత్వా సతతం పూజనీయో జనార్దనః

పుత్రపౌత్రకలత్రాద్యా బహవస్స్యుశ్చ సంపదః

హరిపూజారతానాం తు భవత్యేవ న సంశయః

ఇహాముత్ర సుఖప్రేప్సుః పూజయేత్సతతం హరిమ్

ఇహాముత్రాసుఖప్రేప్సుః పరనిన్దాపరో భవేత్

ధిగ్జన్మ భక్తి హీనానాం దేవదేవే జనార్ధనే

సత్పాత్రదానశూన్యం యత్తద్దనం ధిక్పునః పునః

న నమేద్విష్ణవే యస్య శరీరం కర్మభేదినే

పాపానామాకరం తద్వై విజ్ఞేయం మునిసత్తమ

సత్పాత్రదానరహితం యద్ధవ్యం యేన రక్షితమ్

చౌర్యేణ రక్షితమివ విద్ది లోకేషు నిశ్చితమ్

తడిల్లోలశ్రియా మత్తాః క్షణభంగురశాలినః

నారాధయంతి విశ్వేశం పశుపాశవిమోచకమ్

సృష్టిస్తు ద్వివిధా ప్రోక్తా దైవాసురవిభేదతః

హరిభక్తియుతా దైవీ తద్దీనా హ్యాసురీ మతా

తస్మాచ్ఛృణుష్వ విప్రేన్ద్ర హరిభక్తిపరాయణాః

శ్రేష్ఠాస్సర్వత్ర విఖ్యాతా యతో భక్తి సుదుర్లభా

అసూయారహితా యే చ విప్రత్రాణపరాయణాః

కామాదిరహితా యే చ తేషాం తుష్యతి కేశవః

సంమార్జనాదినా యే తు విష్ణుశుశ్రూషణే రతాః

సత్పాత్రదాననిరతాః ప్రయాంతి పరమం పదమ్

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే హరిభక్తిలక్షణం నామ చతుస్రంశోఽధ్యాయః

తల్లి గర్భము నుండి బయటపడిన వెంటనే మృత్యువు ప్రాణి సన్నిహితమగును. కావున ధర్మపరుడు కావలయును. వినశ్వరమగు శరీరమును పొంది ధర్మము నాచరించకపోవుట ఎంతకష్టము ? ఎంత కష్టము ! చేతులు పైకెత్తి ఇది ముమ్మాటికి నిజమని మరల చెప్పుచున్నాను. దంభాఖాచారమును విడిచి వాసుదేవుని పూజించవలయును. చేతులు పైకెత్తి మరల హితమును చెప్పుచున్నాను. సర్వవిధములా విష్ణువును పూజించవలయును. అసూయను అనృతమును వదిలి పెట్టుము. క్రోధము వలన మనస్తాపము కలుగును. క్రోధమువలన సంసారబంధము కలుగును. క్రోధము ధర్మమును క్షీణింపచేయును. కావున క్రోధమును విడువవలయును. ఈ జన్మ కామమూలము. కామమే పాపమునకు కారణము. కామము కీర్తిని క్షీణింపచేయును. కావున కొమమును పరిత్యజించవలయును. సమస్త దుఃఖజాలములకు మాత్సర్యమే కారణము. నరకసాధకము కావున మాత్సర్యమును విడవవలయును. మానవుల బంధమోక్షములకు. మన సే కారణము. కావున ఆ మనసును పరమాత్మయందు లగ్నముచేసి సుఖమును పొందవలయును. జగన్నాధుడగు శ్రీమహావిష్ణువుండగా భజించకపోవుటకు మానవుల కేంత ధైర్యము ! సర్వధాత అచ్యుతుడు అగు జగన్నాధుని సేవించక సంసారసాగరమున మునిగిన వారెట్లు తీరమును చేరెదరు. అచ్యుతానంతగోవింద నామోచ్చారషధము వలన అన్ని రోగములు నశించును. నేను నిజమును చెప్పుచున్నాను. నారాయణ జగన్నాథ వాసుదేవ జనార్ధన అని కీర్తించువారు అంతటా వందితులగుదురు. ఇప్పటికీ బ్రహ్మదులచే కూడా తెలియశక్యముకాని ప్రభావముగల శ్రీహరిని శరణు వేడుము. హృదయపద్మములో నివసించియున్న శ్రీహరిని తెలియలేని దుర్జనుల మూఢత్వము ఎంత వింత ? ఓ మునిశ్రేషా ! నేను మరల మరల చెప్పుచున్నాను. వినుము. శ్రద్దగల వారికి శ్రీహరి సంతుష్టుడగును కొని ధనములచే బంధుత్వముచే కాదు. విష్ణుభక్తి గల వారికి ప్రతిజన్మలో బంధువులు ఐశ్వర్యము పుత్రులు వృద్దీ చెందెదరు. ఈ దేహము పాపమూలము. పాపకర్మరతము. ఈ విషయమును తెలిసీ జనార్ధనుని పూజించుము. హరిపూజాపరాయణులకు పుత్రమిత్ర కళత్రాదీబహుసంపదలు కలుగును. సంశయమే లేదు. ఇహపరములలో ఆనందమును కోరువారు సర్వకాలములలో శ్రీహరిని పూజించవలయును. ఇహపరములలో దుఃఖమును కోరువారు పరనిందాపరులు కావలయును. దేవదేవుడగు జనార్ధనుని యందు భక్తి లేని వారి జన్మము వ్యర్థము. సతాత్ర దానములేని ధనము వ్యర్థము. ఓ మునిసత్తమా ! కర్మకయమును కలిగించు శ్రీమహావిష్ణువును నమస్కరించని వాని శరీరము సర్వపాపములకు నిలయము. సల్పోత్రదానశూన్యమగు ధనమును కాపాడుట చౌర్యముచేసిన ధనమును కొపొడుట వంటిదని తెలియును. మెరుపునలే చంచలమైన సంపదలచే మదించిన క్షణభంగురులు ప్రాణులు సంసారపాశవిమోచకుడుగు విశ్వేశుని పూజించరు. దైవి, ఆసురియని సృష్టి రెండు విధములు. హరిభక్తి కల సృష్టి దైవీయని, హరిభక్తి లేని సృష్టి ఆ సురియని తెలియవలయును. సుదుర్లభమైన హరిభక్తి కలవారు సర్వ శేషులు. అంతటా ప్రసిద్ధులు. అసూయా రహితులు విప్రరక్షణను చేయువారు కామాది రహితులైన వారి విషయమున శ్రీహరి సంతోషించును. విష్ణ్వాలయమున సమ్మారనాది శుశ్రూష చేయువారు సత్పాత్రదోననిరతులు పరమపదమును చేరెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున హరిభక్తి లక్షణమను ముప్పదినాలుగవ అధ్యాయము సమాప్తము.