7 - మోహినీంప్రతి బ్రహ్మవాక్యమ్

యమ ఉవాచ :-

ప్రాప్తం తాత మయా సార్థం వేదాంఘ్రినమనే హితమ్

నాహం గచ్చామి యోగాంతం పునరేవ జగత్పతే

ప్రశాసతి మహీం భూపే హాటకాంగదసంజ్ఞకే

తమేకం దేవతాశ్రేష్ఠం సంప్రాప్తే హరివాసరే

యది చాలయసే ధైర్యా త్తతోఽహం తవ కింకరః

స మే శత్రుర్మహాన్దేవ తన లుప్తః పటో మమ

తమేకం భోజయిత్వా తు కార్శ్ణేహని మహీపతిమ్

 కృతకృత్యో భవిష్యామి గయాపిండప్రదో యధా

 అద్య ప్రభృతి దేవేశ! యెర్నరైస్సంస్మృతోపివా

ఉపోషిత స్తుతో వాపి న నియామ్యా మయా హితే

హరిరితి సహసా యేగృణన్తిచ్ఛలేన జనని జఠరమార్గాత్తే విముక్తా హి మర్త్యాః

 మమ పటవిలిపిం తే నోవిశంతి ప్రవీణా దివిచరవరసంఘైస్తే నమస్యాభవన్తి

యమధర్మరాజు పలికెను :- శ్రీహరిపాదపద్మములకు నమస్కరించుటచే నేను కూడా హితమును పొందితిని. కావున నేను మరల యోగాంతమును పొందజాలను. రుక్మాంగదుడు భూమిని పాలించుచున్నాడు. శ్రీహరివాసరమున ఒక్కరుక్మాంగదుని ధైర్యచ్యుతుని చేయగలిగినచో నేను నీకింకరుడనగుదును. రుక్మాంగదుడొక్కడేనాకు శత్రువు. అతనే నా రాతను తుడిచి వేసెను. కావున శ్రీహరివాసరమున ఒక్కరుక్మాంగదమహారాజును భుజింపచేసిన గయాపిండప్రదానము చేసిన వానివలె కృతకృత్యుడనగుదును. ఇప్పటినుండి శ్రీహరిని స్మరించుకొని, స్తుతించువారిని, ఉపవసించువారిని నేను శాసించను. వ్యాజముతో నైనను హరినామమునుచ్చరించు వారుపునర్జన్మనందరు. నారాతలో చోటు చేసుకోరు. దేవతల చేత కూడా నమస్కరించబడుదురు.

వైవస్వతస్య కార్యేణ తత్సమ్మానచికీర్షయా

 చింతయామాస దేవేశో విరించిః కుశలాంఛనః

చింతయిత్వా క్షణం దేవ స్సర్వభూతైశ్చ భూషితః

 భూతత్రాసనమాత్రం తు రూపం స జగృహే విభుః

తస్మిన్నుత్పాదయామాస ప్రమదాం లోకమోహినీమ్

సర్వయోషిద్వరా దేవీ మనసా నిర్మితా బభౌ

సా బభూవాగ్రతస్తస్య సర్వాలంకారభూషితా

 దృష్ట్వా పితామహస్తాం తు రూపద్రవిణసంయుతామ్

ప్రాహేమాన్ పశ్యతో హ్యేతా స్వకాన్వై కామమోహితాన్

 ప్రత్యవాయభయాద్భ్రహ్మా చక్షుషీ సంన్యమిలయత్

 సరాగేణేహ మనసా సరాగేణేహ చక్షుషా

 చింతయేద్వీక్షయద్వాపి జననీం వా సుతామపి

 వధూం వా భ్రాతృజాయాం వా గురోర్భార్యాం నృపస్త్రీయమ్

 స యాతి నరకం ఘోరం సంచిన్త్య శ్వపచీమపి

 దృష్ట్వా హి ప్రమదాహ్యాతా యః క్షోభం వ్రజతే నరః

 తస్య జన్మకృతం పుణ్యం వృధా భవతి నాన్యధా

ప్రసంగే దశసాహస్రం పుణ్యమాయాతి సంక్షయమ్

 పుణ్యస్యసంక్షయాత్పాపీ పాషాణాఖుర్భవేధ్ర్భువమ్

తస్మాన్నచింతయేత్ప్రాజ్ఞో హ్యేతా రాగేణ చక్షుషా

 జనన్యా ఆపి పాదౌ తు నాదేయా ద్వాదశాబ్దికైః

సుతైస్త్యభ్యంగకరణే పునర్యౌవనసంస్థితైః

షష్ఠ్యతీతాం సుతోఽభ్యంగే నియుంజీత విచక్షణః

వృద్ధో వాపి యువా వాపి న పాదౌ ధావయేద్వధూమ్

ఉభయోః పతనం ప్రోక్తం రౌరవేఽరింగారసంచయే

యా వధూర్దర్శయేదంగం వివృతం శ్వశురస్య హి

పాణిపాదహతారాజన్ క్రిమిభక్ష్యా భవేత్తు సా

వధూహస్తేన యః పాపః పాదశౌచం కరోతి హి

 స్నానం నాప్యధనాభ్యంగం తస్యాప్యేవంవిధా గతిః

సూచీముఖైః కృష్ణవక్తైః భుజ్యతే కల్పసంస్థితామ్

తస్మాన్నవీక్షయేన్నారీం సుతాం వాపి వధూం నరః

సాభిలాషేణ మనసా తత్క్షణాత్పతతే నరః

ఏవం సంచింతయిత్వా తు సూక్ష్మాం దృష్టిం చకార హ

యదిదం వర్తులం వక్త్రం సోన్నతం దృశ్యతే శుభమ్

 అస్థిపంజరమేతద్ధి చర్మమాంసావృతం త్వితి

వసామేదోధనయనే సోజ్జ్వలే స్త్రీషు సంస్థితే

అత్యుచ్చ్రితమిదం మాంసం స్తనయో స్సమవస్థితమ్

నిమ్నంశతాం దర్శయతి త్రివలీ జఠరస్థితా

 పునరేవాధికం క్షిప్తం మాంసం జఘనవర్త్మని

  మూత్రద్వారమిదం గుహ్యం యత్ర ముగ్ధం జగత్రయమ్

 అపానవాయునా జుష్టం సదైవప్రతికుత్సితమ్

భస్త్రావర్గాధికం క్షిప్తం మాంసం జఘనవర్శని

కృతం యద్వ ద్విధాకాష్ఠం తద్వజ్జంఘా ద్విధా ధ్రువమ్

శుక్రాస్థిపూరితాం మాంసైః కధం సుందరతాం వ్రజేత్

మాంస మేదోవసాసారే కిం సారం దేహినాం వద

విష్ఠామూత్రమలైః పుష్టే కో దేహే రజ్యతే నరః

ఏవం విచార్య బహుధా విరించిర్జాజనచక్షుషా

ధైర్యం కృత్వా చ నారీం తాం ఉవాచ గజగామినీమ్

యధా హి మనసా సృష్టా మయా త్వం వరవర్ణినీ

 తధాభూతాసి చార్వంగి మానసోన్మాదకారిణీ

 తమువాచ తదా సా తు ప్రణమ్య చతురాననమ్

పశ్య మూర్చాన్వితం నాధ జగత్థ్సావరజంగమమ్

 మోహితం మమ రూపేణ స యోగి యదకల్మషమ్

స నాస్తి త్రిషు లోకేషు యః పుమాన్మమ దర్శనాత్

 భవంతమాదితః కృత్వా నక్షోభం యాతి పద్మజ

ఆత్మస్తుతిర్నకర్తవ్యా కేనచిచ్ఛుభమిచ్ఛతా

స్తవనానన్నరకం యాతి విశుద్ధోఽపి చ మానవః

 తధాపి స్తవనం బ్రహ్మ స్కర్తవ్యం కార్యహేతునా

 సాహం సృష్టాత్వయా బ్రహ్మ కస్యచిత్ క్షోభణాయవై

 తమదిశ జగన్నాధ క్షోభయిష్యే న సంశయః

 మాం దృష్ట్యాఽపి క్షితా దేవ! భూధరశ్చాపి ముహ్యతి

కిం పునశ్చేతనోపేత శ్వాసోచ్చ్వాసీనరస్త్వితి

తధాచోక్తం పురాణేషు నారీవీక్షణవర్ణనమ్

ఉన్మాదకరణం నృణాం దుశ్చరవ్రతనాశనమ్

సన్మార్గే తావదాస్తే ప్రభవతి పురుష స్తావదేవేంద్రియాణాం

 లజ్జాం తావద్విధత్తే వినయమపి సమాలంబతే తావదేవ భ్రూచాపాక్షేపయుక్తాశ్రవణపధగతానీలపక్ష్మాణ ఏతే

 యావల్లీలావతీనాం స హృది ధృతిముషో దృష్టిబాణాః పత్తని

ధిక్తస్య మూఢమనసః కుకవేః కవిత్వం యస్త్రీముఖం చ శశినం చ సమాకరోతి భ్రూక్షేపమిస్మితకటాక్షనిరీక్షితాని కోపప్రసాదహసితాని కుతశ్శశాంకే

 పీతం హి మద్యం మనుజేన నాధ కరోతి మోహం ను విచక్షణస్య

 స్మృతా చ దృష్టా యువతీ నరేణ విమోహయేదేవ సురాధికా హి

మోహనార్థం త్వయా సృష్టా నరాణాం ప్రపితామహ

తమాదిశజగన్నాధ త్రైలోక్యం మోహయామ్యహమ్

సౌరిపలికెను :- కుశలాంఛనుడగు బ్రహ్మ యమధర్మరాజు ప్రార్థనను ఆలకించి అతని కార్యమునెట్లు చేయవలయునని ఒక క్షణమాలోచించి, సర్వభూతసహితుడై సర్వభూతభయంకరమగు రూపమును ధరించేను. ఆరూపమున లోకమును మోహింపచేయగల ఒక యువతిని సృజించెను. ఆయువతి సకల యువతులలో శ్రేష్ఠురాలుగా బ్రహ్మమానసపుత్రిగా ప్రకాశించేను. ఆమోహిని సర్వాలంకార భూషితయై బ్రహ్మముందు నిలిచేను. రూపసంపదతో, వెలుగొందుచున్న మోహినిని చూచి బ్రహ్మ పాపభీతిచే కనులను మూసుకొని మోహినిని చూచి కామమోహితులైన తనవారితో నిట్లుపలికెను. కోరిక గల మనసుతో కాని, కోరిక కలకనులతో కాని తల్లిని లేదా పుత్రికను ఆలోచించిననూ చూచిననూ అట్లే కోడలిని, అన్న భార్యను, గురువు భార్యను, రాజు భార్యను చింతించిననూ చూచిననూ చండాలన్రీ గురించి చింతించిననూ చూచిననూ అతను ఘోరమగు నరకమును పొందును. ఈ స్త్రీలను చూచి చలించువాడు జన్మమొత్తము చేయు లేదా చేసిన పుణ్యము వ్యర్థమగును. అట్టి స్త్రీ ప్రసంగమున దశసహస్రజన్మ సముపార్జిత పుణ్యము క్షీణించును. పుణ్య క్షయముతో పాపియై పాషాణముగానో ఎలుకగానో పుట్టును. కావున ఈ స్త్రీలను కోరికతో చింతించరాదు. చూడరాదు. పన్నెండు సంవత్సరములు వయసుకలవారు తల్లిపాదములను కూడా స్పశించరాదు. యౌవనము వచ్చిన పుత్రులకు తల్లీకూడా అభ్యంగనము (తలంటిపోయుట) చేయరాదు. అరువది సంవత్సరములు దాటిని స్త్రీని అభ్యంగమునకు వినియోగించవలయును. వృద్దుడైననూ యువకుడైననూ స్త్రీ పాదధావనము చేయరాదు. అట్లు చేసినచో వారిద్దరూ నరకమును పొందెదరు. మామకు తన శరీరమును సవివరముగా చూపిన కోడలు కాళ్ళుచేతులు లేనిదై క్రిములచే భక్షింపబడును. కోడలిచే కాళ్ళుకడిగించు కొనువాడు, స్నానమాడువాడు, అభ్యంగనమును చేయించుకొనువాడు కూడా క్రిమిభక్షిఅగును. ఒక కల్పకాలము సూచీముఖములుగలకృష్ణవక్రములచే భక్షింప బడును. కావున కూతురును కోడలును కోరికతో చూడరాదు. కోరికతో ఆలోచించినన ఆక్షణముననే పతితుడగును. ఇట్లుపలికి తనలో తాను చాలా సూక్ష్మదృష్టితో ఆలోచించసాగెను. మన కనులకు గుండ్రముగా ఉన్నతముగా సుందరముగా కనపడు ఈ ముఖము చర్మముతో మాంసముతో కప్పబడిన అస్థిపంజరముమాత్రమే. స్త్రీలలోనున్న ప్రకాశవంతములైన కనులు వసామేడ (కొవ్వుచీము) భూయిష్టములు. స్త్రీలకు ఉన్నతములుగా పీనములుగా కనవడు స్తనములు మాంసపుముద్దలు. కడుపుమీదనుండు మూడు ముడతలు నిమ్నస్థితిని చూపును. పిరుదులరూపములోనున్నవి మాంసము అధికముగా నున్న భాగములే. మూడులోకములు మోహము చెందు గుహ్యము వాస్తవముగా చూచిన మూత్రద్వారమే కదా? ఇక పొయ్వింద్రియము అపానవాయుసంమిశ్రితము. రెండుగా కనబడు ఈ పిక్కలు ఒక కాష్ఠమును రెండుగా చీల్చినపుడు ఏర్పడు రెండు భాగవములవంటివి. రక్తము ఎముకల మాంసములతో ఏర్పడిన శరీరము సుందరమెట్లగును? మాంసము, కొవ్వు, చీముతో నిండిన శరీరమున సారమేముండును? క్రిములు, మలము, మూత్రములతో పుష్టి చెందిన శరీరమునందు ఎవనికి ప్రీతికలుగును? ఇట్లు బ్రహ్మ జ్ఞానచక్షువుతో పలువిధములుగా ఆలోచించి ధైర్యమును కూర్చుకొని గజగామినియగు మోహినితో నిట్లు పలికెను. ఓ వరవర్ణినీ! నీవు నామనసుచే సృష్టించబడినదానవు. నేను సంకల్పించిన విధముగా నీవు మనసునకు ఉన్మాదమును కలిగింతువు, అపుడు మోహిని బ్రహ్మకు నమస్కరించి ఇట్లు పలికెను. ఓ ప్రభూ? నా రూపముతో మోహింపబడిన ఈ స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతయూ మూర్చనందినది. ఒక యోగమాత్రమే స్వచ్చముగా నుండును. ఓ పద్మజా? ఈమూడులోకములలో నన్ను చూచి వికారము చెందని మగవాడు నీనుండి ఎవరూలేరు. శుభమును కోరువారెవ్వరూ ఆత్మస్తుతిని చేసుకోరాదు. పరిశుద్దుడగు మానవుడు కూడా ఆత్మస్తుతిచే నరకమును పొందును. అయిననూ కార్యముననుసరించి ఆత్మస్తుతి చేయవలసివచ్చినది. నేను ఎవరినో ఒకరిని చలింపచేయుటకే మిచేత సృజించబడితిని. అతని వివరములను తెలిపినచో చలింపచేతును. నన్ను చూసిన పర్వతము కూడా మూర్చనొందును. ఇక చైతన్యము కలిగి ఊపిరిని పీల్చు నరుని విషయము చెప్పవలయునా? పురాణములలో స్త్రీచూపులను పురుషులకు ఉన్మాదమును కలిగించునవి, కష్టసాధ్యవ్రతములను భంగపరుచునవి యని వర్ణించబడియున్నవి. కనుబొమలను ధనువున సంధించబడి కర్ణమార్గమునునసురించి నల్లనికనురెప్పలుగల విలాసవతుల చూపులను తూపులు ధైర్యమును దొంగలించుచు పురుషుల హృదయమును తాకునంతవరకే పురుషులు సన్మార్గమునను సంచరించగలరు. ఇంద్రియములను అరికట్టగలరు. సిగ్గుపడగలరు. వినయమును అనుసరించగలరు. మరియు ప్రీముఖమును చంద్రునితో పోల్చు మూఢమనస్సుకల కుకవిత్వము వ్యర్థము. కనుబోములముడిపాటు, రెప్పలతడబాటు, దరహాస విస్మయములతో నుండు చూపులు, చిరుకోపము, మెప్పుకోలునుసూచించు చిరునవ్వులుగల చూపులు చంద్రునిలో కలవా? ఎంతవివేకముకలవాడైనను మద్యమును పానముచేసినచో మోహమును కలిగించును. కాని యువతి చూడబడిననూ తలచబడిననూ మోహింప చేయును. కావున పురుషులను మోహింపచేయుటకు మీరు నన్ను సృష్టించితిరి. ఎవరిని మోహింపచేయవలయునో తెలుపుము. ఆజ్ఞాపించుము. నేను మూడులోకములను నీయాజ్ఞచే మోహింపచేయగలను.

 బ్రహ్మోవాచ :-

సత్యముక్తం త్వయా దేవి! నాసాధ్యం భువనత్రయే

 నాగనాసోరు సుభగే! మత్తమాతంగగామిని!

యా త్వం దూషయసే చేతో మమాపి వరవర్ణిని!

 తన్మయా సుగృహీతం తు కృతం జ్ఞానాంకుశేన హి

సా త్వం కథం న లోకానాం చేతాంస్యపహరిష్యసి

సత్యమేతద్విశాలాక్షి! తవ రూపం విమోహనమ్

సామరం హి జగత్సర్వం నిశ్చేష్టమపి లక్షయే

యన్నిమిత్తం మయా సృష్టా తత్సాధయ వరాననే

వైదికే నగరే రాజా నామ్నా రుక్మాగదః క్షితౌ

 యస్య సంధ్యావలీ భార్యా తవ రూపోపమా శుభే!

యస్యాం ధర్మాంగదో జాతః పితురత్యధికస్సుతః

 దశనాగాయుతబలః ప్రతాపేన రవిర్యధా

యః క్షాంత్యా ధరయా తుల్యో గాంభీర్యే సాగరోపమః

తేజసా వహ్నివద్దీప్తః క్రోధే వైవస్వతోపమః

త్యాగే వైరోచనీర్యద్వ ద్గతౌ హి పవనోపమః

 సౌమ్యత్వే శశితుల్యస్తు రూపవాన్మన్మధో యధా

జీవభార్గవయోస్తుల్యో యో నీతౌ రాజనన్దనః

 పిత్రా భుక్తం సమస్తైకం జంబూద్వీపం వరాననే

ధర్మాంగదేవ ద్వీపాని సంజితాన్యపరాణ్యపి

 పిత్రోస్సువ్రీడయానేన నజ్ఞాతం ప్రమాదాసుఖమ్

 స్వయం ప్రాప్తః పరిత్యక్తా యేన భార్యాస్సహస్రశః

 యో న వాక్యాద్విచలతే సహైవ హి పితుర్గృహె

 యస్య వై త్రీణి సుభగే మాతౄణాం చారుహాసిని

 శతాని కనకాభాసే త్వవిశేషేణ పశ్యతి

తస్య ధర్మప్రధానస్య పుత్రరత్నాంచితస్య చ

 సమీపం గచ్ఛ చార్వంగి మందర పర్వతోత్తమే

తత్ర వత్స్యతి రాజా వై తురగేణాతి వాహితః

 తవ గీతేన చార్వంగి మోహితోఽశ్వం విహాయ చ

అధిరుహ్య గిరేః పృష్ఠం స సంగం యాస్యతి త్వయా

 తత్ర దేవి త్వయా వాచ్యం మిలిత్వా భూభుజా త్విహ

అహం భార్యా భవిష్యామి తవ రాజన్నసంశయః

యద్రవీమి హ్యహం నాధ తత్కార్యం హి త్వయా ధ్రువమ్

మోహితస్తవరూపేణ తదైవ ప్రతిపద్యతే

 యతస్తం శపధైర్దృత్వా దక్షిణేన కరేణ వై

వాచ్యః కతిపదైస్సుభ్రు దినైరపగతైస్త్వితి

 సురతే తవ చార్వంగి యదా ముగ్ధోహి లక్ష్యతే

తదా ప్రహస్య రాజ్ఞో వై స్మారణీయం పురా వచః

 యస్త్వయా శపధో రాజన్! కృతో మద్వాక్యపాలనే

 తత్పాలయ మహీపాల మన్యేఽహం సమయస్తితి

 ఏవముక్తే త్వయా ముగ్ధో రాజా వై సత్యగౌరవాత్

 పాలయామి న సందేహో బ్రూహి కిం తే దదామ్యహమ్

 ఏవముక్తే తు వచనే త్వయా వాచ్యో వరాననే

రుక్మాంగదో మహీపాలో ధర్మాంగదపితా శుభే

 నోపవాసస్త్వయా కార్యో జాతు వై హరివాసరే

సురతస్రంస కారీ మే హ్యుపవాసో భవేత్ప్రియ

 సుముగ్ధాం యౌవనోపేతాం స్వభార్యాం యో న సేవతే

 పర్వాపేక్షీ దురాచార స్స యాతి నరకం ధ్రువమ్

 త్రిరాత్రమపవిద్ధాహం త్వయా భూపఉపోషణాత్

నాహం నిమేషమప్యేకం స్థాతుం శక్తా త్వయా వినా

 శ్రాద్ధకాలే తు సంప్రాప్తి ఉపవిష్టైర్ద్విజైఃకిల

యాచతే సంగమం భార్యా యది భోగ్యా తదైవ సా

 ఏవం సంబోధ్యమానోపి యదా రాజా వచస్తవ

 న కరిష్యతి చార్వంగి తదా వాచ్య మిదంవచః

యది న త్యజసే రాజ న్నుపవాసం హరేర్దినే