60 - అధ్యాయము

సనందన ఉవాచ:-

ఆవతీర్ణేషు విప్రేషు వ్యాపః పుత్రసహాయవాన్

తూష్ణీం ధ్యానపరో ధీమానేకాంతే సముపావిశత్

తమువాచాశరీరీ వాక్ వ్యాపం పుత్రసమన్వితమ్

భో ! భో ! మహర్షే ! వాపిష్ఠ ! బ్రహ్మఘోషో న వర్తతే

ఏకో ధ్యానపరపూష్ణీం కీమా పే చిన్తయన్నివ

 బ్రహ్మ షైర్విరహితః పర్వతోయం న శోభతే

తస్మాదధీష్య భగవన్ ! సార్థం పుత్రేణ ధీను

వేదాన్వేదవిదా చైవ సుప్రసన్నమనాస్పదా

 తచుత్వా వచనం వ్యాసో నభవాణీసమీరితమ్

శుకేన సహపుత్రేణ వేదాభ్యాసమధాకరోత్

 తయారభ్యసతో రేవం బహుకాలం ద్విజోత్తమ

వాతఒతమాత్రం ప్రవవో సముద్రానిలవీజితః

 తతోనధ్యాయ ఇతి తం వ్యాసః పుత్రమవారయత్

శుక్ వారితమాత్రాస్తు కౌతూహలసమన్వితః

అపృచ్ఛత్పితరం తత్ర కుతో వాయురభూదయమ్

ఆఖ్యాతుమర్హతి భవాన్ పర్వం వాయోర్విచేష్టితమ్

శుక సెలతద్వచశుత్వా వ్యాసః పరమవిప్మితః

 అనధ్యయనిమిత్తేస్మిఽన్నదం వచనమబ్రవీత్

దివ్యం తే చక్షురుత్పన్నం స్వస్థం తే నిశ్చలం మనః

తమసా రజసా చాపి త్యక్తస్సల్వే వ్యవస్థితః

 తస్యాత్మని స్వయం వేదాన్బుద్ధ్వా సమనుచింతయ

దేవయానచరో విష్ణోః పితృయానశ్చ తామహః

 ద్వావేతా ప్రత్యయం యాతౌ దివం చాధశ్చ గచ్ఛతః

 పృధివ్యామంతరిక్షే చ యతపంయాస్తి వాయవః

సప్త తే వాయుమార్గా వైతాన్ని బోధానుపూర్వశః

 తత్ర దేవగణాస్సాధ్యాసమభూవన్మహాబలాః

తేషామప్యభవత్పుత్రసమానో నామ దుర్జయః

 ఉదోనస్తస్య పుత్రఽభూద్వ్యానస్తస్యాభవత్సుతః

 అపానశ్చ తతో జజ్జీ ప్రాణశ్చాపి తతః పరమ్

అనపత్యోఽభవతాడో దుర్ధర్షశ్శత్రుమర్దనః

 పృథక్కర్మాణి తేషాం తు ప్రవక్ష్యామి యథా తథా

ప్రాణినాం పర్వతో వాయుశ్చేష్టా వర్తయతే పృథక్

ప్రీణనాచ్చెవ పర్వేషాం ప్రాణ ఇత్యభిధీయతే

ప్రేషయత్యభసంఘాతాన్జూమజాంశ్చష్మజాంస్తథా

ప్రథమః ప్రథమే మారే ప్రవహానామ సోనిలః

 అంబర్ ప్నేహమాత్రేభ్యస్తడిచ్యైశ్చత్తమద్యుతిః

 ఆవహో నామ సోభ్యేతి ద్వితీయశ్శ్వసనో నదన్

ఉదయం జ్యోతిషాం శశ్వత్సమాదీనాం కరోతి యః

అంతర్దే హెడు చోదానం యం రదస్త్రి మనీషిణః

 యశ్చతుర్భ్యసముద్రేభ్యః వాయుర్థారయతే జలమ్

ఉద్ధృత్య దదతే చాపో జీమూతేభ్యో వనేనిలః

యోఒద్భిసంయోజ్య జీమూతాన్పర్జన్యాయ ప్రయచ్ఛతి

ఉద్వహా నామ బహిష్టస్తృతీయస్స పదాగతిః

 పంనీయమానా బహుధా యేన నీలా మహాఘనాః

వర్షమోక్షకృతారంభా స్తే భవస్తా ఘనాఘనాః

యెఒసౌ వహతి దేవాసోం విమానాని విహాయసా

చతుర్ధస్సంవహా నామ వాయుస్స గిరినుర్థనః

యేన వేగవతా రుగ్లా క్రియనే తరుణా రసాః

పంచమస్స మహావేగో వివహా నామ మారుతః

 యస్మిన్పరిష్ణవే దివ్యా వహన్హ్యాపో విహాయసా

పుణ్యం చాకాశ గంగాయాస్తోయం తిష్ఠతి తిష్ఠతి

 దూరాతతహతో యప్మి న్నేకరశ్మిర్టీవాకరః

యోఽనిరంశుసహస్రస్య యేన యాతి వసుంధరామ్

 యస్మాదాప్యాయతే సోమో నిధిర్డీవ్యోమృతస్య చ

షష్ఠః పరివహా నామ సవాయుర్జీవతాం వరః

సర్వప్రాణభృతాం ప్రాణాన్యోంఒతకాలే నిరస్యతి

యస్య ధర్మోనువర్తేతే మృత్యునైవ స్వతావుభౌ

సమ్యగన్వీక్షతా బుద్ధ్యా శాంతయాధ్యాత్మ నిత్యయా

ధ్యానాభ్యాసాభిరామాణాం యోఒమృతత్వాయ కల్పతే

 యం పమాసాద్య వేగేన దిశామంతం ప్ర పేదిరే

 దక్షప్య దశపుత్రాణాం పహస్రాణి ప్రజాపతేః

 యేన వృష్ట్యా పరాభూతా స్తో యాన్యేన నివర్తతే

పరీవహా నామ వరో వాయుప్స దురతిక్రమః

ఏవమేతే దితేః పుత్రా మరుతః పరమాద్భుతాః

అనారమంతప్పర్వాంత్సర్వగొప్పర్వచారిణః

ఏతత్తు మహదాశ్చర్యం యదయం పర్వతోత్తమః

కంపితప్సహసా తేన పవమానేన వాయునా

విష్ణోర్నిశ్శ్వాపవాతోయం యదా వేగపమీరితః

పహసోదీర్యతే తాత జగతవ్యధతే తదా

తస్మాదహ్మవిదో బ్రహ్మ న పఠంత్యతివాయుతః

వాయోర్వాయుభయం హ్యుక్తం బ్రహ్మ తత్పీడితం భవేత్

 ఏతావదుక్త్వా వచనం పరాశరసుతః ప్రభుః

ఉక్త్వా పుత్రమధీష్వేతి వ్యోమగంగామగాత్తదా

తతో వ్యాపే గతే స్నాతుం శుకో బ్రహ్మవిదాం వరః

స్వాధ్యాయమకరోద్భ్రహ్మ స్వేదవేదాంగపారగః

 సనందన మహర్షి పలికెను :- పైలాదిబ్రాహ్మణులు పర్వతము నుండి దిగి వెళ్ళిన తరువాత వ్యాసభగవానుడు పుత్రసహాయముతో ఏకాంతమున ధ్యానపరుడై ఊరకనే కూర్చొని యుండెను. అంతలో అశరీరవాణి పుత్రునితో కూడియున్న వ్యాసమహర్షి ని గూర్చి ఇట్లు పలికెను. ఓ వసిష్ఠ కులసంభవా ! మహరీ ! వేదఘోష జరుగుట లేదు. ఒక్కడివే ధ్యానపరుడవై యున్నావు. ఏమాలోచించుచున్నావు? వేదఘోష లేనిచో ఈ పర్వతము శోభించదు. కావున జ్ఞానియగు పుత్రునితో కలిసి వేదాధ్యయనమును గావించుము. అట్లు అశరీరవాణి మాటలను వినిన వ్యాస మహర్షి పుత్రునితో కలిసి వేదాభ్యాసమును గావించసాగెను. ఇట్లు వారిద్దరు వేదాభ్యాసమును చేయుచుండగా చాలాకాలము గడిచెను. అంత సముద్రవాయువుతో పేరేపించబడిన వాయువు అతిమాత్రముగా వీచేను. అపుడు వ్యాసుడు ఇది. అనధ్యయన కాలమనీ శుకమహర్షిని వారించెను. ఆట్లు వారించబడిన శుకమహర్షి కౌతూహలముతో ఈ వాయువిట్లు ఏలవీచెనని తండ్రి నడిగెను. ఈ వాయు చేష్టనంతటిని నాకు తెలుపుము అని ప్రార్థించెను. ఇట్లు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి మిక్కిలి ఆశ్చర్యమును పొందినవాడై అనధ్యాయము కావున ఇట్లు పలికెను. నీకు దివ్యజ్ఞానము కలిగినది. నీ మనసు స్వస్థముగా నిశ్చలముగా నున్నది. తమోరజగుణముల నుండి విడువడి సత్యమార్గమున నీ మనసున్నది. ఆ మనసులో బుద్ధిచే వేదములను తెలుసుకొని ధ్యానించుము. వాయువు దేవయానము పితృయానమని రెండు విధములు. ఈ రెంటిలో పితృయానము తామసము. ఈ రెండు భూమ్యాకాశములలో సంచరించుచుండును. దీని వలననే పృథివ్యంతరిక్షములలో వాయువు తిరుగుచుండును. ఈ వాయు మార్గములు ఏడుండును... వాటిని తెలుసుకొనుము. ఈ వాయువు నుండియే దేవగణములు సాధ్యులు మహాబలశాలురుగా పుట్టిరి. వారికి సమానుడగు పేరుగల పొయువు పుట్టెను. ఈ సమాన వాయువు జయింపశక్యముకానిది. సమానునకు పుత్రుడుగా ఉదోనవాయువు, ఉదోనునకు వ్యాసుడను పుత్రుడు కలిగెను. వ్యానవాయువు నుండి అపానుడు, ఆపానుని నుండి ప్రాణవాయువు కలిగెను. ఈ ప్రాణవాయువు శత్రుమర్ధనము చేయగలది, ఇతరులచే అణచలేనిది మరియు సంతానము లేనిదిగా నుండెను. ఇపుడు ఆ వాయువుల కర్మలను విడివిడిగా చేప్పెదను. వాయువు ప్రాణులలో అన్ని చేష్టలను కలిగించును. అందరినీ ప్రీతులను చేయును. కావున ప్రాణమను పేరు కలిగినది. ధూమము వలన పుట్టు, ఊష్మ వలన పుట్టు మేఘసంఘాతములను పొయువే పేరేపించును. మొదటి మార్గమున మొదటి వాయువు పేరు ప్రవహము. ఈ వాయువు ఆకాశమున స్నేహామాత్రల నుండి, మెరుపుల నుండి ఉత్తమకాంతి గలిగియుండును. రెండవ వాయువు ఆవహమనునదీ అంతటా ధ్వనించుచు సంచరించుచుండును. ఈ వాయువే చంద్రుడు మొదలగు నక్షత్రములను ఉదయింపచేయును. బుద్ధిమంతులు ప్రాణుల దేహములలో నుండు దానిని ఉదానమని యందురు. నాలుగు సముద్రముల జలమును ఈ వాయువు ధరించును. వనముననున్న వాయువు సముద్రముల నుండి జలమును తీసుకొని మేఘములకీచ్చును. మేఘములను నీటితో కూర్చి పర్జన్యునకీచ్చును. ఇక మూడవవాయువు ఉద్వహమనునది ఇది సద్గతి. చాలా పెద్దది. ఈ వాయువుచే గొనిపోవబడు మేఘములు వర్ణించుటకు ఆరంభించును. ఈ వాయువే దేవవిమానములను ఆకాశమున ధరించును. నాలుగవ వాయువు సంవహము. ఈ వాయువు పర్వతములను మర్ధించును. ఈ వాయువేగముచే ప్రాణులు. రోగములు కలవారౌదురు. ఈ వాయువుచే చెట్ల నుండి రసమేర్పడును. అయిదవ వాయువు మహావేగము కలది వివహమను పేరు కలది. ఈ వాయువు నందు దివ్యజలములు ప్రవహించుచుండును. ఈ వాయువు వలననే ఆకాశగంగా జలము నిలిచియుండును. ఈ వాయువు నందు సూర్యుడు ప్రతిహతుడై ఏకరశ్మి గలవాడగును. వేయి కిరణములు గల సూర్యుడు భూమిమీదికి చేరుట ఈ వాయువు చేతనే. ఈ వాయువు వల్లనే అమృతనిధియగు చంద్రుడు తడుపబడును. ఆరవ వాయువు పరీవహామనునది. ఇది ప్రాణులకు చాలా శ్రేష్ఠమయినది. ప్రాణధారులందరి ప్రాణములను అంతకాలమున ఈ పోయువే తోలగించును. మృత్యువు, యముడు ఇద్దరు ఈ వోయుధర్మముననే అనువర్తించుచుందురు. చక్కగా చూడగలిగిన, అధ్యాత్మనిత్యమగు బుద్దిచే చేయబడు ధ్యానాభ్యాసాభిరామములకు అమృతత్త్వమును కల్పించునది ఈ వాయువే. ఈ వాయువు వేగముచే దక్షప్రజాపతి పుత్రులు పదివేలమంది దిగంతములకు చేరిరి. ఈ వాయువుచే పరాభూతమగు జలము వృషిచే మరొక దిశకు మరణును. ఏడవవాయువు పరీవహమనునది ఉత్తమమగు వాయువు. దీనిని ఎవరు అతిక్రమించజాలరు. ఇట్లు ఏడుగురు వాయువులు దిలీపుత్రులు. అత్యాశ్చర్యకరులు. ఆద్యంతములు లేనివారు ప్రతిదానిలోపల నుండువారు. అంతట వెళ్ళగలవారు. అంతట సంచరించువారు. ఇది చాలా ఆశ్చర్యమును కలిగించు విషయము. ఓ హిమవత్పర్వము ఈ పోయువుచే కంపించబడినది. ఈ వాయువు విష్ణువు యొక్క నిశ్వాసముతో వెలువడి వేగము కలదగును. అపుడు ఒకేసారి బయలు వెడలును. దానిచే జగత్తు కోభించును. కావున అతివోయువు వీచినపుడు వేదజ్ఞులు వేదాధ్యయనమును గావించరు. వాయువువలన కలుగు వోయుభయమును చెప్పితిని. ఈ భయముచే వేదము పీడించబడును. ఇట్లు పరాశరసుతుడగు వ్యాసుడు ఇంతమాత్రము చెప్పి పుత్రుని అధ్యయనము చేయమని ఆకాశగంగకు వెళ్ళేను. అట్లు వ్యాసమహర్షి స్నానము చేయుటకు వెళ్ళగా బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడగు శుకమహర్షి వేదవేదాంగపారగుడు కావున స్వాధ్యాయమును చేసెను.

 తత్ర స్వాధ్యాయపుసక్తం శుకం వ్యాపఘుతం మునే

సనత్కుమారో భగవానేకాంతే పముపొగతః

ఉత్థాయ పత్కృత స్తేన బ్రహ్మపుత్ర హి కార్ణినా

తతః ప్రోవాచ విప్రేంద్ర శుకం వేదవిదాం వరః

కిం కరోషి మహాభాగ వ్యాసపుత్ర మహాద్యుతే

 అట్లు స్వాధ్యాయమును అధ్యయనము చేయుచున్న వ్యాసపుత్రుడగు శుకుని ఏకాంతమున మహానుభావుడగు సనత్కుమారుడు సమీపించెను. వ్యాసపుత్రుడగు శుకమహర్షి లేచి సత్కరించగా వేదజ్జులలో శ్రేష్ఠుడగు సనత్కుమారుడు , " ఓ వ్యాసపుత్రా ! మహాతేజశ్శాలీ ! ఏమి చేయుచున్నావు అని అడిగెను.

శుక ఉవాచ:-

స్వాధ్యాయే సంప్రవృత్తోహం బ్రహ్మపుత్రాధునా స్థితః

త్వద్దర్శనమనుప్రాప్తః కేనాపి సుకృతేన చ

కించిత్త్వాం ప్రష్టుమిచ్ఛామి తత్త్వం మోక్షార్థసాధనమ్

తద్వదప్ప మహాభాగ ! యధో తజ్ జ్ఞానమాప్నుయామ్

 శుక మహర్షి పలికెను :- ఓ బ్రహ్మ పుత్రా ! ఇపుడు నేను స్వాధ్యాయమున ప్రవర్తించుచుంటిని. నా సుకృత విశేషమున మీ దర్శనమును పొందగలిగితిని. మోక్షార్ధ సాధనమగు తత్త్వమును మిమ్ముల నడుగగోరుచున్నాను. నాకు మోక్షార్థ జ్ఞానము కలుగునట్లు నాకు తత్త్వమును తెలియజేయుము.

సనత్కుమార ఉవాచ:-

నాస్తి విద్యాసమం చక్షుర్నాస్తి విద్యాసమం తపః

నాప్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమరి సుఖమ్

 నివృత్తిః కర్మణః పౌహిత్సతతం పుణ్యశీలతా

 సద్వృత్తిప్సముదాచార శేయస్ ఏతదనుత్తమమ్

మానుష్యమసుఖం ప్రాప్య యస్సజ్జతి స ముహ్యాతి

నాలం స దుఃఖమోక్షాయ పంగో వై దుఃఖలక్షణః

సక్తస్య బుద్ధిర్భవతి మోహజాలవివర్థినీ

 మోహజాలావృతో దుఃఖమిహాముత్ర తథైశ్నుతే

 సర్వోపాయన కామస్య క్రోధస్య చ వినిగ్రహః

కార్య:శ్రేయోర్ధినా తాహి శ్రేయోఘాతార్థముద్యతౌ

నిత్యం క్రోధాత్తపో రక్షేత్ శ్రియం రక్షేచ్చ మత్సరాత్

నీద్యోం మానావమానాభ్యాం ఆత్మానం తు ప్రమాదతః

ఆనృశంస్యం పరో ధర్మః క్షమా చ పరమం బలమ్

ఆత్మజ్ఞానం పరం జ్ఞానం సత్యం హి పరమం హితమ్

యేన సర్వం పరిత్యక్తం స విద్వాన్స చ పండిత

ఇంద్రియైరిస్క్రియాధేభ్యశ్చరత్యాత్మవశైరిహ

అసజ్జమానశ్శాంతాత్మా నిర్వికారస్సనూ హితః

 ఆత్మభూఖైరతద్భూతస్సహ చైవ వినైవ చ

 స విముక్తః పరం శ్రేయో న చిరేణాధిగచ్ఛతి

అదర్శనమసంస్పర్శస్తథైవాభాషణం సదా

యస్య భూతైస్సహా మునే స శ్రేయో విన్హతే మహత్

న హింస్యాత్సర్వభూతాని భూతైర్మెత్రాయణశ్చ రేత్

వేదం జన్మ సమాసాద్య వైరం కుర్వీత కేనచిత్

 ఆకించన్యం సుపంతోషో నిరాశిష్టమచాపలమ్

ఏతదాహుః పరం శ్రేయ ఆత్మజ్ఞప్య జితాత్మనః

సరిగ్రహం పరిత్యజ్య భవ తాత జితేంద్రియః

 అశోకం స్థానమతిష్ఠ ఇహ చాముత్ర చాభయమ్

నిరాశిషో న శోచస్తి త్యజేదాశీషమాత్మనః

పరిత్యజ్యోతిషం సౌమ్య దుఃఖగ్రామాద్విమోక్ష్య పే

తపో నిత్యేన గొంతేన మునినా సంయతాత్మనా

అజితం జేతుకామేన భావ్యం సంగేష్వపంగినా

గుణపం గేష్వనాపక్త ఏకచర్యారతప్పదా

బ్రాహ్మణో న చిరాదేవ సుఖమాయాత్యనుత్తమమ్

ద్వంద్వారానేషు భూతేషు వరాకో రమతే మునిః

 కించితజ్ఞానతృప్తాశో జ్ఞానతృషో న శోచతి

శుభైర్లభేత దేవత్వం వ్యామిశైగ్జన్మ మానుషమ్

 అశుభైశ్చాష్యధో జన్మ కర్మభిర్లభతేవశః

తత్ర మృత్యుజరాదుఃఖైస్సతతం పమభిద్రుతమ్

పంసారం పశ్యతే జంతుస్తత్కథం నావబుధ్య పే

 ఆపితే హితసంజ్ఞప్త్వమధ్రువే ధ్రువసంజ్ఞకః

 అనధే వార్ధసంజ్ఞస్త్వం కీమర్థం నావబుధ్య సే

 సంవేష్ట్యమానం బహుభిః మోహతంతుభిరాత్మజైః

కోశకారవదాత్మానం వేష్టితో నావబుధ్య పే

ఆలం పరిగ్ర హేణేహ దోషవానైపరిగ్రహః

కృమిర్షి కోశకారపు బధ్యతే స్వపరిగ్రహాత్

పుత్రదారకుటుంబేషు పత్తా సీదంతి జంతవః 

నరఃపంక్తార్ణవే మగ్నా జీర్ణ వనగజా ఇవ

 మోహజాలసమాకృష్టానశ్యజంతూన్సుదుఃఖితాన్

కుటుంబం పుత్రదారం చ శరీరం ద్రవ్యపంచయమ్

పారక్యమధ్రువం పర్వం కిం ప్వం సుకృతదుష్కృతే

 యదా సర్వం పరిత్యజ్య గంతవ్యమవ తేన వై

అనధే కిం ప్రసక్తస్త్వం సమర్థం నానుతిష్ఠపి

అవిశ్రాంతమనాలంబమపాధేయమదైశికమ్

తమః కర్తారమధ్వానం కథమేకో గమిష్యసి

 న హి త్వాం ప్రస్థితం కశ్చిత్ పృష్ఠతోనుగమిష్యతి

సుకృతం దుష్కృతం చ త్వాం గచ్ఛన్తమనుయాస్యతః

విద్యాకర్మ చ శౌర్యం చ జ్ఞానం చ బహు విస్తరమ్

 అర్థార్థమనుశీర్యంతే సిద్ధార్థస్తు విముచ్యతే

 నిబంధినీ రజ్జురేషి యా గ్రామే వపతో రతిః

చిత్వైనాం సుకృతే యాంతి నైనాం ఛందస్తి దుష్కృతః

 తుల్యజాతివయోరూపాన్ హృతాన్పశ్యపీ మృత్యునా

 న చ నామాప్తి నిర్వేదో లోహం హి హృదయం తవ

 రూపకూలాం మనసోతాం స్పర్శద్వీపాం రసావహామ్

గంధపంకార శబ్దజలాం స్వర్గమార్గదురారుహామ్

 క్షమారిత్రాం పత్యమయీం ధర్మ ఫైర్యకరాకరామ్

త్యాగవాతాధ్వగాం శీఘ్రం బుద్ధినావం నదీం తరేత్

త్యక్త్వా ధర్మమధర్మం చ హ్యుభే పత్యానృతే త్యజ

త్యజ ధర్మమసంకల్సాత్ అధర్మం చాప్య హింసయా

ఉభే సత్యానృతే బుద్ధ్వా బుద్ధిం పరమనిశ్చయాత్

 ఆస్థి స్టూణం స్నాయుయుతం మాంపశోణితలేపనమ్

 ధర్మావనద్ధం దుర్గంధిం పూర్ణం మూత్రపురీషయోః

జలాశోకసమావిష్టం రోగాయతనమస్థిరమ్

 రజస్వలమనిత్యం చ భూతావాసం సముత్సృజ

 ఇదం విశ్వం జగత్సర్వమజగచ్చాపి యద్భవేత్

 మహాభూతాత్మకం సర్వం అస్మాద్యతరమాణువత్

ఇంద్రియాణి చ పంచైవ తమస్సత్త్వం రజస్తథా

ఇత్యేష సప్తదశకో రాశరవ్యక్తసంజ్ఞకః

 పర్వెరి హేంద్రియాధైశ్చ వ్యక్తావ్యకైర్ణి సంహితమ్

 పంచవింశక ఇత్యేష వ్యక్తావ్యక్తమయో గణః

 ఏవైస్సర్వేస్సమాయుక్తమనిత్యమభిధీయతే

 త్రివర్గోత్ర సుఖం దుఃఖం జీవితం మరణం తథా

య ఇదం వేద తత్వేన స వేద ప్రభవాప్యణో

ఇంద్రియెర్గృహ్యతే యద్యత్తద్వ్యక్తమభిధీయతే

 అవ్యక్తమథ తజ్ జ్ఞేయం లింగగ్రాహ్యమతీంద్రియమ్

ఇంద్రియెర్నియతైర్దేహీ ధారాభిరివ తర్ప్యతే

లోకే విహితమాత్మానం లోకం చాత్మని పశ్యతి

పరావరదృశశ్శక్తిర్జానవేలాం న పశ్యతి

పశ్యతస్సర్వభూతాని సర్వవస్థాపు పర్వదా

 బ్రహ్మభూతస్య పంయోగో వాశుభేనోపపద్యతే

 జ్ఞానేన వివిధాల్లే శాశ్ న నివృత్తిశ్చ దేహాజాత్

లోకబుద్ధిప్రకాశేన లోకమార్గో నరిష్యతి

అనాదినిధనం జనుమాత్మని స్థితమవ్యయమ్

అకర్తారమమూఢం చ భగవానాహ తీర్థవిత్

యో జన్తుస్స్వకృతై సై సైః కర్మభిర్నిత్యదుఃఖితః

స్వదుఃఖప్రతిఘాతార్ధం హంతి జంతురనేకధా

తతః కర్మ సమాదత్తే పునరన్యం నవం బహు

తప్యతేథ పున స్తేన భుక్త్వా పధ్యమినాతురః

 అజస్రమేవ మోహాంతో దుఃఖేషు సుఖసంజ్ఞాతః

 వధ్యతే తప్యతే చైవ భయవత్కర్మభిస్సదా

 తతో నివృతో బంధాత్స్వాత్కర్మణాముదయాదిహ

పరిభ్రమతి సంసారే చక్రవద్బాహువర్జితః

సంయమేన చ సంబంధాల్ నివృత్త్యా తపసో బలాత్

 సంప్రాప్తా బహవస్సిద్ధిం అవ్యాబాధాం సుఖోదయామ్

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే షష్ఠితమోఽధ్యాయః

 సనత్కుమార మహర్షి పలికెను:- విద్యతో సమానమగు నేత్రము మరొకటి లేదు. విద్యా సమమగు తపస్సు వేరొకటి లేదు. రాగసమమగు దుఃఖము, త్యాగసమమగు సుఖము మరొకటి లేదు. పాపకర్మ నివృత్తి, సర్వదా పుణ్యశీలత, సద్వృత్తి, సముదోచారము ఇదియే సాటిలేని శ్రేయస్సు. దుఃఖకారకమైన మానవత్వమును పొంది, సంగమును అలవర్చుకొనువాడు మోహమును పొందును. అట్టివాడు దుఃఖమునుండి విముక్తిని పొందజాలడు. సంగమనడా దుఃఖ లక్షణమే. సక్తుడగువానికి మోహ జాలమును పెంచు బుద్ధి కలుగును. మోహ జాలావృతుడు ఇహపరములలో దుఃఖమునే పొందును. శ్రేయస్సును కోరువాడు సర్వోపాయములతో 'కామక్రోధములను నిగ్రహించుకొనవలయును. కామక్రోధములు శ్రేయస్సును భంగపరచ ప్రయత్నించుచుండును. తపస్సును క్రోధము నుండి శ్రీని మాత్సర్యము నుండి, విద్యను మానావమానముల నుండి, ఆత్మను ప్రమాదము నుండి కాపొడుకొనవలయును. ఎదుటి వారి యందు దయకలిగియుండుట పరమధర్మము. కమ పరమ బలము. ఆత్మజ్ఞానమే ఉత్తను జ్ఞానము. సత్యమే పరమహితము. సర్వసంగ పరిత్యాగమును చేసినవాడే విద్వాంసుడు. పండితుడు. ఇంద్రియార్థములనుండి ఇంద్రియములను స్వాధీనము చేసుకొని తిరుగువాడు, సంగరహితుడు, శాంతమనస్కుడు, వికారమును పొందనివాడు, సావధాన మనస్కుడు ఆత్మ భూతములచే కలిసికాని, కలియక కాని అతదూతుడు, నిజముగా విముక్తుడగును. త్వరలో శ్రేయస్సును పొందగలడు. ప్రాణులతో దర్శన స్పర్శన సంభాషణములు చేయనివాడు ఉత్తమ శ్రేయస్సును పొందగలడు. ఏ ప్రాణిని హింసించరాదు. అన్ని ప్రాణుల యెడ మైత్రీ భావమున నుండవలయును. మానవ జన్మను పొందినవాడు ఎవనితోను వైరమును చేయరాదు. . ఆకీంచన్యము, సంతోషము కలవాడై కోరికలు చాపల్యము లేని వాడై యుండుట జితేంద్రియుడగు ఆత్మ జ్ఞానికి ఉత్తమ శ్రేయస్సు. ఇతరుల నుండి పరిగ్రహమును పరిత్యజించి జితేంద్రియుడవు కమ్ము. ఇహలోకమున పరలోకమున శోకరహిత స్థితిని పొందుము. ఆశలేనివారు శోకించరు. కావున మనసు నుండి కోరికలను విడువుము, కోరికలను విడిచిన వాడు దుఃఖవిముక్తుడగును. ఎప్పడు తపమును అంతరింద్రియ నీగ్రహము కలవాడై, మౌనమునవలంబించి, మనసును నిగ్రహించుకొని సంగములయందు సంగతిని విడిచినవాడు జయించరానీ సంసారమును జయించగలడు. గుణసంగములందు ఆసక్తి లేనివాడై ఎప్పుడూ ఏకచ్యూరతుడు కోవలయును. బ్రహ్మ జ్ఞానము కలపోడు త్వరలోనే ఉత్తమానందమును పొందగలడు. సుఖదుఃఖాది ద్వంద్వములలో ఆనందించు ప్రాణులలో మూర్ఖుడు సంతోషించగలడు. కొంచెము ప్రజ్ఞానముచే తృప్తినందినవాడు, జ్ఞానతృప్పుడు దుఃఖించడు. శుభకర్మలచే దేవత్వమును, శుభాశుభమిశ్ర కర్మలచే మానవత్వమును, అశుభకర్మలచే అధోగతిని పొందును. ఆ నీచ జన్మలో జరా, దుఃఖము మృత్యువులచే నిండియున్న సంసారమును చూచును. ఆ విషయమునేట్లు తెలియకున్నావు? హితము కాని దానిని హితమని, నిత్యము కాని దానిని నిత్యమని అనర్ధమును అర్థముగా భావించుచు నిజము నేల తెలియకున్నావు? ఆత్మ భవములగు పలు మోహతంతువులచే చుట్టబడియు సాలెపురుగు వలే తనను తాను చుట్టబడినట్లు తెలియజాలడు. పరిగ్రహించుటను మానుము. పరిగ్రహము దోషయుక్తము. సాలె పురుగు స్వపరిగ్రహము వలననే బంధించబడుచున్నది. ప్రాణులు దారా పుత్రకుటుంబముల యందు బంధించబడి దుఃఖించుచుందురు. బురద యున్న కొలనులో బంధించబడిన యేనుగుల వలె నుందురు. మోహజాలముచే ఆకర్షించబడి దుఃఖించుచున్న ప్రాణులను చూడుము. కుటుంబము, దారాపుత్రులు, శరీరము, ద్రవ్య సంపాదన ఇవియన్నియున పరలోకమున నిలుచునవి కావు. కేవలము సుకృత దుష్కృతములు మాత్రమే నిలుచును. అన్నిటిని విడిచి తప్పని సరిగా పరాధీనుడవై వెళ్ళవలసియున్నపుడు అనర్థమునందు ఎందుకు తగిలియున్నావు. నీ యర్థమును ఎందుకనుసరించవు? విశ్రాంతి, ఆధారము, దొరిబత్తెము, ఆవాసము లేని, చీకటి అలుముకొని యున్న మార్గమున ఒక్కడివే ఎట్లు వెళ్ళగలవు? అట్లు వేళ్ళుచున్న నీవెంట ఏ ఒక్కడూ రాజాలడు. కేవలము సుకృతదు, అష్కృతములుమాత్రమే నీవెంటవచ్చును. విద్య, కర్మ, శౌర్యము, విస్తృతమగు జ్ఞానము అర్ధసాధనకు బాధపడుచుండును. సిద్దార్దుడు మాత్రము ముక్తిని పొందగలడు. గ్రామమున ఉండుటలో ప్రీతి కలిగియుండుట బంధించు త్రాడు వంటిది. సుకృతులు ఈ రజ్జవును ఛేదించివెళ్ళగలరు. దుష్కృతులు వెళ్ళజాలరు. నీతో సమానమగు జాలు, వయస్సు, రూపము గల వారు మృతులగుట చూచుచున్నావు కదా ! అయిననూ నీలో వైరాగ్యము కలుగుట లేదు. నీ హృదయము లోహమయమా? మనస్సు అను ప్రవాహము, రూపము అను తీరములు, స్పర్శమను దీవులు రసమగు వేగము, గంధమను " బురద, శబ్దమను జలము, స్వర్గమార్గమును అధిరోహించజాలని నదిని క్షమారిత్రము, సత్యమయము, ధర్మ ఫైర్యములను కరములు (తెడ్డులు) - కలది త్యాగమను వాయువును అనుసరించి పోగల బుద్దీ నావ మాత్రమే దాటగలదు. ధర్మమును అధర్మమును, సత్యమును, అసత్యమును త్యజించుము. సంకల్పించక ధర్మమును, హింసించక అధర్మమును విడువవలయును. సత్యాసత్యములను తెలిపి పరమనిశ్చయమును బుద్దిలో నిలుపుము. అస్థి అను స్థూణము కలది (స్తంభము) స్పాయుయుతము, మాంస శోణితలేపనము, నరములచే బంధించబడినది. దుర్గంధ భూయిష్టము, మూత్రపురీషములతో పూర్ణము, జరాశోక సమావిష్టము, రోగాలవాలము, అస్థిరము రజోయుతము, అనిత్యము అయిన ప్రాణాధారమగు శరీరము నందు మమకారమును విడువుము. ఈ ప్రపంచము, సర్వజగత్తులు, జగద్భిన్నములు, అంతయు పంచమహాభూతాత్మకమే. దీని కంటే పరము పరమాణువులు గలది. పంచేంద్రియములు సత్త్వరజస్తమోగుణాత్మకములు అనునవి పది హేడు అవ్యక్తమనబడును. ఇంద్రియార్థములన్నింటితో వ్యక్తావ్యక్తలతో కూడియున్నదే ఈ జగము. ఈ వ్యక్తావ్యక్తి స్వరూపములు గల సమూహమున పంచవింశతి తత్త్వములుండును.

వీటన్నిటితో కలిసి యున్నది అనిత్యమనబడును. ఇచట త్రివర్గము, సుఖదుఃఖములు, జీవితము మరణము అనుగొనిని తెలిసినవాడు సృష్టి ప్రళయములను తెలియగలడు. ఇంద్రియములచే గ్రహించబడునదంతయూ వ్యక్తమనబడును. ఇంద్రియాతీతము లింగమాత్రగ్రాహ్యమైనది అవ్యక్తమనబడును. జీవుడు నియతములగు ఇంద్రియములచే ధారలతో వలె తృప్తి పొందును. తనను లోకమున, లోకమును తనలో ఇమిడ్చియుంచబడినదని తెలియును. పరావరములను చూచువారు చూడగలశక్తి జ్ఞానపు చివరిహద్దును చూడజాలరు. అన్ని భూతములను అన్ని వేళలలో అన్ని అవస్థలలో చూచువాడు జ్ఞానావధిని చూడజాలడు. బ్రహ్మభూతునికి అశుభముతో సంబంధము కలుగదు. దేహము వలన కలిగెడు క్లేశముల నుండి నివృత్తి లభించదు. లోకబుద్ధి కలిగియున్నంతవరకు లౌకిక మార్గము నశించదు. జీవుడు ఆద్యంతములు లేనివాడు, ఆత్మలో ఉండువాడు, క్షయము లేనివాడు, కర్త కాడు, మోహమును పొందడు, అని తీర్ధజ్ఞుడగు భగవంతుడు చెప్పియున్నాడు. జీవుడు తాను చేసిన ఆయాకర్మలచే నీత్యదుఃఖితుడగు చున్నాడు. తన దుఃఖమును, తొలగిచుకొనుటకు బహువిధములుగా హింసించుచున్నాడు. హింసవలన మరల కొత్తది, చాలా కర్మను స్వీకరించుచుండును. మరల ఆ కర్మచే బహువిధములుగా పరితపించుచుండును, రోగి అపధ్యముతో పరితపించునట్లు దుఃఖములను సుఖములుగా భావించి ఎప్పుడూ మోహితుడగు చుండును. తాను చేయు భయమును కలిగించు కర్మలచే వధించబడును. బంధించబడును. తన కర్మోదయము వలన బంధనిర్ముక్తుడని తలచును. బాహువులు లేనివాడై చక్రము వలె. సంసారమున పరిభ్రమించుచుండును. నిగ్రహమువలన, సంబంధ నివృత్తి వలన, తపోబలము వలన చాలామంది బాధలు లేని ఆనంద స్వరూపమగు సిద్ధిని పొందిరి.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున అరవదియవ అధ్యాయము సమాప్తము.