నారద మహా పురాణము
83 - పంచ ప్రకృతి మన్త్రాది నిరూపణమ్
శ్రీ శౌనక ఉవాచ :
సాధు సూత మహాభాగ జగదుద్దారకారక ।
మహాతంత్ర విధానం నః కుమారోక్తం త్వయేరితమ్
అలభ్యమేతత్తంత్రేషు పురాణేష్వపి మానద ।
యదిహోదితమస్మభ్యం త్వయాతి కరుణాత్మనా
నారదో భగవాన్సూత లోకోద్ధరణ తత్పరః ।
భూయః పప్రచ్ఛ కిం సాధో కుమారం విదుషాం వరమ్
శ్రీ శౌనక మహర్షి పలికేను :
ఓ మహాను భావా? సూతమహర్షి। జగదుద్ధార కారక । సనత్కుమార మహర్షిచే చెప్పబడిన మహా తంత్ర విధానమును నాకు చెప్పితీరి. ఈ మహా తంత్ర విధానము తంత్రములందు పురాణము లందు కూడా ఇది లభించదు. మీరు అతి దయాపరులు కావున మాకు చెప్పితిరి. లోకోద్ధరణ తత్పరుడగు నారదుడు సనత్కుమారుని మరల ఏమడిగెను.
సూత ఉవాచ :
శ్రుత్వా స నారదో విప్రాః యుగ్మనామ సహస్రకమ్ ।
సనత్కుమారమప్యాహ ప్రణమ్య జ్ఞానినాం వరమ్
సూతమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా? రాధా కృష్ణ సహస్ర నామమును వినిని నారద మహర్షి జ్ఞానులలో శ్రేష్టుడగు సనత్కుమారుని నమస్కరించి ఇట్లు పలికెను.
నారద ఉవాచ :
బ్రహ్మం స్యయా సమాఖ్యాతా విధయస్తన్త్రచోదితాః ।
తత్రాపి కృష్ణ మంత్రాణాం వైభవం హ్యుదితం మహత్
యా తత్ర రాధికా దేవీ సర్వాద్యా సముదాహృతా ।
తస్యా అంశావతారాణాం చరితం మంత్ర పూర్వకమ్
తంత్రోక్తం వద సర్వజ్ఞ త్వామహం శరణం గతః ।
శక్తే స్తంత్రాణ్యనేకాని శివోక్తాని మునీశ్వర
యాని తత్సారముద్థృత్య సాకల్యేనాభిధేహి నః ।
తచ్చ్రుత్వా వచనం తస్య నారదస్య మహాత్మనః
సనత్కుమార: ప్రోవాచ స్మృత్వా రాధాపదాంబుజమ్
మధ్యస్థ రత్న సింహాసన స్థిత యగు రాధికను ధ్యానించి, పుష్పాంజలి సమర్పించి ఉపచారములచే పూజించవలయును. ఆరు లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమమును చేయవలయును. మాతృకా పీఠమున ఆవరణములచే పూజించవలయును. షట్కోణములందు షడంగములును, బాహ్యములందు అష్టదలమున పూజించవలయును. మాలావతిని, మాధవిని, రత్నమాలను, సుశీలికను, శశికలను, పారిజాతను, పద్మావతిని, సుందరిని క్రమముగా ప్రాచ్యాది దిక్కులందు, విదిక్కులందు పూజించవలయును. తరువాత వెలుపల సాయుధులగు ఇంద్రాదులను పూజించి వినియోగములను సాధించవలయును. రాధా, కృష్ణ ప్రియ, రాసేశ్వరి, గోపీ గణాధిప, నిరుణా కృష్ణపూజ్య, మూల ప్రకృతి, ఈశ్వరి, సర్వేశ్వరి, సర్వపూజ్య, వైరాజు జననీ, వీరందరు పూర్వారి దిక్కులందు అన్ని వైపులా అన్ని వేళలా నన్ను కాపాడుగావుత. ఓ దేవీ। నీవు జగన్మాతవు, సనాతన విష్ణుమాయవు, కృష్ణమాయవు, ఆది దేవివి, కృష్ణ ప్రాణాధికవు, శుభ కరురాలవు. కృష్ణ భక్తి ప్రదురాలవు, మంగల ప్రదురాలవు. అట్టి నీకు నమస్కారము. ఇట్లు ప్రార్థించి, సర్వేశ్వరురాలను స్తుతించి హృదయమున విసర్జన గావించవలయును. ఇట్లు సర్వాద్య, సర్వమంగలయగు రాధా దేవిని సేవించువాడు ఇహమున అన్ని భోగముల ననుభవించి అంతమున గోలోకమును పొందును.
అధ తుభ్యం మహాలక్ష్మ్యా విధానం వచ్మి నారద।
యదా రాధనతో భూయాత్ సాధకో భుక్తిముక్తిమాన్
లక్ష్మీ మాయా కామవాణీ ! పూర్వా కమల వాసినీ ।
జేన్తా వహ్ని ప్రియాంతోఽయం మంత్రః కల్పద్రుమో పరః ।
ఋషి ర్నారాయణ శ్చాస్య ఛందో హి జగతీ తథా ।
దేవతా తు మహాలక్ష్మీ ర్ద్విద్వివర్ణ ష్షడంగకమ్
శ్వేత చంపకవర్ణాభాం రత్న భూషణ భూషితామ్ ।
ఈషద్దాస్యప్రసన్నాస్యాం భక్తానుగ్రహకాతరామ్
బిభ్రతీం రత్నమాలాం చ కోటి చన్ద్ర సమప్రభామ్ ।
ధ్యాత్వా జపేదరలక్షం పాయసేన దశాంశత:
జుహుయాదేధితే వహ్నౌ శ్రీదకాష్టైస్సమర్చయేత్ ।
నవశక్తి యుతే పీఠే హ్యంగై రావరణైస్సహ
విభూతిరున్నతి: కాంతి సృష్టిః కీర్తిశ్చ సన్నతిః ।
వ్యుష్టి రుత్కృష్టి ఋద్దిశ్చ సంప్రోక్తా నవ శక్తయః
అత్రావాహ్య చ మూలేన మూర్తిం సంకల్ప్య సాధకః ।
షట్కోణేషు షడంగాని దక్షిణే తు గజాననమ్
వామే కుసుమధన్వానం వసుపత్రే తతో యజేత్ ।
ఉమాం శ్రీం భారతీం దుర్గాం ధరణీం వేదమాతరమ్ ॥
దేవీముషాం చ పూర్వాదె దిగ్విదిక్షు క్రమేణ హి ।
జుహ్న సూర్యసుతే పూజ్యే పాద ప్రక్షాల నోద్యతే
శంఖపద్మనిధీ పూజ్యా పార్వయోర్థత చామరో ।
ధృతాతపత్రం వరుణం పూజయే తృశ్చిమే తతః
సంపూజ్య రాశీన్పరితో యథాస్థానం నవగ్రహాన్ ।
చతుర్ధనైరావతాదీన్ దిగ్విదిక్షు తతోర్చయేత్
తద్బహిర్లోకపాలాంశ్చ తదస్రాణి చ తద్బహిః ।
దూర్వాభిరాజ్యసిక్తాభిర్జుహుయాదాయుషే నరః
గుడూచీమాజ్యసంసిక్తాం జుహుయాత్సప్తవాసరమ్ ।
అష్టోత్తరసహస్రం యః స జీవేచ్చరదాం శతమ్
హ్వు తిలాన్హతా భక్తాఛీర్ఘమాయుష్యమాప్నుయాత్ ।
ఆరభ్యారదినం మంత్రి దశాహం ఘృత సంఫ్లుతః
జుహుయాదరసమిధః శరీరారోగ్య సిద్ధయే ।
శాలిభి ర్జుహ్వతో నిత్యమష్టోత్తర సహస్రకమ్
అచిరాదేవ మహతీ లక్ష్మీ సంజాయతే ధ్రువమ్ ।
ఉషా జాజీనాలికేరరజోభిర్హతమిశ్రితైః
హువేదష్టోత్తర శతం పాయసాశీ తు నిత్యశః ।
మండలాజ్ఞాయతే సోఽపి కుబేర ఇవ మానవః
హవిషా గుడ మిశ్రేణ హోమతో హ్యన్నవాన్భవేత్ ।
జపా పుష్పాణి జుహుయాదప్టోత్తర సహస్రకమ్
తాంబూలరససంమిశ్రం తద్భస్మ తిలకం చరేత్ ।
చతుర్ణామపి వర్ణానాం మోహనాయ ద్వీజోత్తమః
ఏవం యో భజతే లక్ష్మీం సాధకేంద్రో మునీశ్వర ।
సంపదస్తస్య జాయతే మహాలక్ష్మీః ప్రసీదతి
దేహాంతే వైష్ణవం ధామ లభతే నాత్ర సంశయః ।
ఓ నారదా? ఇపుడు నీకు మహాలక్ష్మీ పూజా విధానమును చేప్పెదను. ఈ లక్ష్మీ పూజ వలన సాధకుడు భుక్తి ముక్తులను పొందును. “ఓం కమల వాసిన్యై మహాలక్ష్మ్యే స్వాహా" అను మంత్రము సకలాభీష్ట ప్రదము. ఈ మంత్రమునకు నారాయణ ఋషి. జగతీ ఛన్దస్సు. మహాలక్ష్మీ దేవత. ద్వి ద్వివర్ణములచే షడంగ కల్పన చేయవలయును. శ్వేత చంపక వర్ణాభ రత్న భూషణ భూషిత, ఈషద్దాస్య ప్రసన్నాస్య, భక్తాను గ్రహకాతర, రత్నమాలా ధారిణి, కోటి చన్ల సమప్రభయగు లక్ష్మీదేవిని ధ్యానించి పన్నెండు లక్షలు జపించి దశాంశమును పాయసముచే ప్రజ్వలితాన్ని యందు హోమమును చేయవలయును. బిల్వకాష్ఠముచే పూజించవలయును. నవశక్తి యుతమగు పీఠమున అంగములచే ఆవరణములచే పూజించవలయును. విభూతి, ఉన్నతి, కాంతి, సృష్టి, కీర్తి, సన్నతి, వ్యుష్టి, ఉత్కృష్టి, ఋద్ధి అనునవి నవశక్తులు.
ఇచట మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి, షట్కోణములందు షడంగములను, దక్షిణ దిగ్భాగమున గజాననుని, వామ భాగమున మన్మధుని, అష్టదలమున ఉమను, శ్రీని, భారతిని, దుర్గను, ధరణిని, గాయత్రిని, ఉషాదేవిని పూర్వాది దిక్కులందు విదిక్కులందు క్రమముగా పూజించవలయును. పాదప్రక్షాలనోద్యతములగు గంగా యమునలను పూజించవలయును. చామరములను ధరించి శంఖ పద్మనిధులను పూజించవలయును. పశ్చిమ దిగ్భాగమున ఆతపత్రమును ధరించిన వరుణుని పూజించవలయును. చుట్టు రాశులను పూజించి యధాస్థానమున నవగ్రహములను పూజించి, దిగ్వి దిక్కులందు చతుర్ధనములు గల ఐరావతాదులను పూజించవలయును. ఆ వెలుపల లోకపాలులను, వారి వెలుపల వారి అస్త్రములను పూజించి ఆజ్యయుక్తములగు దూర్వలచే ఆయుష్యము కాఱకు హోమమును గావించవలయును. ఆజ్యసిక్తమగు గుడూచినీ ప్రతినిత్యము అష్టోత్తర సహస్రమును ఏడు వారములు హామము గావించినచో నూరు సంవత్సరములు జీవించును. ఘృత మిశ్రితములగు తిలలచే హోమమును గావించినచో దీర్ఘాయుష్యమును పొందును. శరీరారోగ్య సిద్ది కారకు ఆదివారమున ప్రారంభించి పది దినములు నేతిలో తడిపిన జిల్లేడు సమిధలచే హోమమును గావించవలయును. వరిధాన్యముచే ప్రతినిత్యము అష్టోత్తర సహస్రము హోమముగావించినచో త్వరలో గొప్ప సంపద కలుగును. జపా జాజి నారికేల రజస్సులచే నేయి కలిపిన వాటిచే అష్టోత్తర సహస్రమును హోమమును చేయుచు పాయసమును తినుచున్నచో ఒక మండలమున కుబేరుడంతటి వాడగును. గుడ మిశ్రమగు హవిస్సుచే హోమమును గావించినచో అన్నము కలవాడగును. అష్టోత్తర సహస్రము తాంబూల రస సమ్మిశితముగా జపా పుష్పములచే హోమమును గావించి ఆ భస్మమును తిలకముగా ధరించినచో నాలుగు వర్ణముల వారిని మోహింప చేయును. ఓ మునీశ్వరా? ఇట్లు లక్ష్మీదేవిని సేవించువానికి సర్వ సంపదలు కలుగును. మహాలక్ష్మి ప్రసన్నురాలగును. దేహాంతమున విష్ణుధామమును చేరును.
యా తు దుర్గా ద్విజశ్రేష్ఠ శివలోకం గతా సతీ
సా శివాజ్ఞామనుప్రాప్య దివ్యలోకం వినిర్మమే ।
దేవీ లొకేతి విఖ్యాతం సర్వలోక విలక్షణమ్
తత్ర స్థితా జగన్మాత తపో నియమమాస్థితా ।
వివిధాన్స్యావతారాన్షి త్రికాలే కురుతేఽనిశమ్
మాయాధికా ప్రోదినీయుక్ చన్ద్రాఢ్య సర్గిణీ పునః ।
ప్రతిష్టా స్మృతి సంయుక్తా క్షుధయా సహితా పునః
జ్ఞానామృతా వహ్నిజాయాంతస్తారాద్యా మనుర్మతః ।
ఋషిస్స్యాద్వామదేవోఽస్య ఛందో గాయత్ర మిరితమ్
దేవతా జగతామాదిర్ధుర్గా దుర్గతి నాశినీ ।
తారాద్యేకైక వర్ణేన హృదయాది త్రయం మతమ్
త్రిభిర్మర్మేక్షణం ద్వాభ్యాం సర్వైరస్త్ర ముద్రితమ్ ।
మహా మరకత ప్రఖ్యాం సహస్ర భుజ మండితామ్
నానా శస్త్రాణి దధతీం త్రినేత్రాం శశిశేఖరామ్ ।
కంకణాం గదహారాఢ్యం క్వణ న్నూపురకాన్వితామ్
కిరీట మండలధరాం దుర్గాం దేవీం నిచింతయేత్
వసులక్షం జపేన్మన్త్రం తిలై సుమధురై ర్హునేత్ ।
పయోఽoభసా వా సాహస్రం నవ పద్మాత్మకే యజేత్
ప్రభామాయా జయా సూక్ష్మా విశుద్ధా నందినీ పునః ।
సుప్రభా విజయా సర్వసిద్ధిదా పీఠ శక్తయః
ఆదిర్హస్పత్రయ క్లీబరహితైః పూజయేదిమాః ।
ప్రణవో వజ్రనఖదంష్ట్రాయుధాయ మహా పదాత్
సింహాయ వర్మాస్త్రం హృచ్చ ప్రోక్తస్సింహమనుర్మునే ।
దద్యాదాసనమేతేన మూర్తిం మూలేన కల్పయేత్
అంగా వృత్తిం పురాభ్యర్చ్య శక్తీః పత్రేషు పూజయేత్ ।
జయా చ విజయా కీర్తి: ప్రీతిః పశ్చాత్ర్పభా పునః
శ్రద్ధా మేధా శ్రుతిశ్చైవ స్వనామాద్యక్షరాదికా: 1
పత్రాగ్రేప్వర్చయేదష్టావాయుధాని యథాక్రమాల్ :
శంఖ చక్ర గదా ఖడ్గపాశాంకుశ శరాస్థను: ।
లోకేశ్వరాంస్తలో చాహ్యే తేషామస్రాణ్యనంతరమ్ .
ఇత్థం జపాదిభి ర్మంత్రీ మంత్ర సిద్ధే విధానవిత్ ।
కుర్యాత్రయోగానమున యథా స్వస్వమనీషితాన్
ప్రతిష్టాప్య విధానేన కలశాన్నవ శోభనాన్ ।
రత్న హేమాది సంయుక్తా నషు నవసు స్థితాన్
మధ్యస్థ పూజయేద్దేవీమితరేషు జయాదికాః ।
సంపూజ్య గన్ధపుష్పాద్యై రభిషించేన్నరాధిపమ్
రాజా విజయతే శత్రూన్యోఽధికో విజయశ్రియమ్ ।
ప్రాప్నోత్యరోగో దీర్ఘాయు సర్వవ్యాధి వివర్జితః
వంధ్యాభిషిక్తా విధినా లభతే తనయం వరమ్ ।
మంత్రేణానేనసంజప్త మౌజ్యం క్షుద్ర గ్రహాపహమ్
గర్భిణీనాం విశేషేణ జప్తం భస్మాదికం తథా ।
జృంభశ్వాసే తు కృష్ణస్య ప్రవిష్ట రాధికాముఖమ్
యాతు దేవీ సముద్భూతా వీణా పుస్తకధారిణీ ।
తస్యా విధానం విక్రేన్ల శృణు లోకోపకారకమ్
శివలోకమునకు వెళ్ళిన దుర్గాదేవి శివుని ఆజ్ఞను పొంది అచట దివ్యలోకమును నిర్మించేను. ఈ లోకము దేవీలోకమని ప్రసిద్ది చెంది సర్వలోక విలక్షణముగా విలసిల్లెను. ఈ జగన్మాత ఆ లోకమున నుండి తపోనియమము నాశ్రయించేను. దుర్గ పలువిధములైన స్వావతారములను చేయుచున్నది. “ఓం హ్రీం మహాదేవ్యై శ్రీ దుర్గాయై స్వాహా" అనునది దుర్గామంత్రము. వామదేవుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. దుర్గతినాశిని ఆదిదేవి యగు దుర్గా దేవత ఓం కారము నుండి ఒక్కొక్క వర్ణముచే హృదయాదిత్రయ న్యాసము నాచరించవలయును. మూడింటిచే కవచమును, రెండింటిచే నేత్రము, అన్నింటిచే అస్త్రమును కల్పించవలయును. మహా మరకత ప్రఖ్య, సహస్ర భుజమండిత, నానా శస్త్ర ధారిణి, తినేత్ర, చన్ద శేఖర, కంకణాంగహార నూపురాద్యాభరణ భూషిత, కిరీట కుండల ధారిణి, యగు దుర్గాదేవిని ధ్యానించవలయును. మంత్రమును ఎనిమిది లక్షలు జపించవలయును. మధుర మిశ్రితములగు నువ్వులచేకాని, పాలచేకాని, అన్నముచే కాని దశాంశమును హోమమును గావించవలయును. నవ పద్మాత్మక దలమున శక్తులను పూజించవలయును. ప్రభా, మాయా, జయా, సూక్ష్మా, విశుద్దా, నందినీ, సుప్రభా, విజయ, సర్వసిద్ధిదా, అనునవి పీఠశక్తులు. ప్రస్వత్రయ ప్లేబరహితములగు జలముచే ఈ శక్తులను పూజించవలయును. “ఓం వజ్రనఖదంష్ట్రాయుధాయ మహాసీంహాయ హుంఫట్ నమ:” అనునది సింహ మంత్రము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని కల్పించవలయును. మొదట అంగావరణలను పూజించి పత్రములందు శక్తులను పూజించవలయును. జయ, విజయ, కీర్తి, ప్రీతి ప్రభ, శ్రద్దా, మేధా, శ్రుతి అనునవి స్వనామాద్యక్షరాదికలు. ఈ యెనిమిదింటిని పత్రాగ్రములందర్పించ వలయును. తరువాత క్రమముగా ఆయుధములను పూజించవలయును. శంఖ చక్ర గదా ఖడ్గ పాశాంకుశ శరధనువులను పూజించవలయును. ఆ వెలుపల లోకేశ్వరులను, ఆ వెలుపల వారి ఆయుధములను పూజించవలయును. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించిన తరువాత తాను కోరిన ప్రయోగములను చేయ వచ్చును. రత్న హేమాది సంయుక్తములు నవఘటములలో నున్న నవకలశములను స్థాపించి మధ్య కలశమున దుర్గాదేవిని, ఇతర కలశము లందు జయాదికలను పూజించవలయును. ఇట్లు గంధ పుష్పాదీకములచే పూజించి రాజునకు ఆ జలముచే అభిషేకము చేయవలయును. అట్లు చేసినచో రాజు శత్రువులను జయించి విజయలక్ష్మిని పొందును. రోగ రహితుడై, దీర్ఘాయుష్మంతుడై సర్వవ్యాధి వర్జితుడగును. గొడ్రాలు అభిషేకించినచో ఉత్తమ పుత్రుని పొందును. ఈ మంత్రముచే అభిమంత్రించిన నేయి క్షుద్ర గ్రహములను తొలగించును. అభిమంత్రించిన భస్మము గర్భిణీ స్త్రీలను ధరింపచేసినచో విశేష ఫలప్రదము. శ్రీ కృష్ణుడు ఆవలించినపుడు వెలువడిన గాలి రాధికా ముఖమున ప్రవేశించినపుడు వీణా పుస్తకధారిణియై పుట్టిన దేవి యొక్క మంత్ర విధానమును సర్వలోకోపకారకమును చెప్పెదను వినుము.
ప్రణవో వాగ్భవం మాయా శ్రీ కామ శక్తి రీరితా ।
సరస్వతీ చతుర్థ్యంతా స్వాహాంతో ద్వాదశాక్షరః
వున ర్నారాయణ ఋషి ర్విరాట్ఛన్ద స్పమిరితమ్ ।
మహా సరస్వతీ చాస్య దేవతా పరికీర్తితా
వాగ్భవేన షడంగాని కృత్వా వర్ణాన్య ద్బుధ:
బ్రహ్మరంధ్ర న్యసేత్తారం లఙ్ఞాం భ్రూమధ్యగాం న్యసేత్
ముఖ నాసాది కర్ణేషు గుదేషు శ్రీముఖార్ణవాన్ ।
తతో వాగ్దేవతాం ధ్యాయేదీణాపుస్తక ధారిణీమ్
కర్పూర కుంద ధవళాం పూర్ణ చంద్రో జ్వలాననామ్ ।
హంసాది రూఢం భాలేన్దు దివ్యాలంకార శోభితామ్
జపేద్దాదశలక్షాణి తత్సహస్రం సితాంబుజైః ।
నాగచంపకపుష్పైర్వా జుహుయాత్సాధకోత్తమః
మాతృకోస్తే యజేత్పీఠే వక్ష్యమాణ క్రమేణ తామ్ ।
వర్ణాబ్జేనాసనం దద్యాన్మూర్తిం మూలేన కల్పయేత్
దేవ్యా దక్షిణత: పూజ్యా సంస్కృతా వాజ్మయీ శుభా ।
ప్రాకృతా వామతః పూజ్యా వాజ్మయీ సర్వసిద్ధిదా .
పూర్వమంగాని షట్కోణే ప్రజ్ఞాద్యాః ప్రయజేద్బహిః ।
ప్రజ్ఞా మేధా శ్రుతి శ్శక్తిః స్మతి రాగీశ్వరీ మతి:
స్వస్తి శ్చేతి సమాఖ్యాతా బ్రహ్మద్యాస్త దనస్తరమ్ ।
లోకేశానర్చయేద్భూయస్తదస్రాణి చ తద్బహిః ।
ఏవం సంపూజ్య వాగ్దేవీం సాక్షాద్వాగ్వల్లభో భవేత్ ।
బ్రహ్మచర్య రత శ్శుద్ధః శుద్ధ దంత నఖాదికః
సంస్మరన్సర్వ వనితా స్సతతం దేవతా ధియా ।
కవిత్వం లభతే ధీమాన్ మాసైక్టాదశభి ర్రువమ్
పీత్వా తన్మన్త్రితం తోయం సహస్రం ప్రత్యహం మునే ।
మహాకవిర్భవేన్మన్త్రీ వత్సరేణ న సంశయః
ఉరోమాత్రదకే స్థిత్వా ధ్యాయన్మార్తాండమండలే ।
స్థితాం దేవీం ప్రతిదినం త్రిసహస్రం జపేన్మనుమ్
లభతే మండలాత్సిద్ధిం వాచామప్రతిమాం భువి ।
పాలాశ బిల్వకుసుమై ర్జుహుయా న్మధురోక్షితైః
సమిద్భిర్వా తదుత్థాభిర్యశః ప్రాప్నోతి వాక్పతేః ।
రాజవృక్ష సముద్భూతైః ప్రసూనై ర్మధురాప్లుతై:
తత్సమిద్భిశ్చ జుహుయాత్కవిత్వమతులం లభేత్ ।
“ఓం శ్రీ మహాదేవ్యై సరస్వత్యై స్వాహా" అనునది ద్వాదశాక్షర మంత్రము. నారాయణ ఋషి. విరాట్చన్దస్సు. మహా సరస్వతీ దేవతా వాగృవముచే షడంగన్యాసము చేసి వర్ణన్యాసమును చేయవలయును. బ్రహ్మ రంధ్రమున ఓంకారమును, భూమధ్యమున శ్రీని ముఖనాసాదివర్ల గుణములందు శ్రీ మొదలగు వర్ణములను న్యాసము చేయవలయును. తరువాత వీణా పుస్తక ధారిణి, కర్పూర కుంద ధవల, పూర్ణ చంద్రోజ్జ్వలానన, హంసాధిరూఢ, ఫాలేన్దు దివ్యాలంకార శోభిత యగు వాగ్దేవిని ధ్యానము చేయవలయును. పది లక్షలు జపించవలయును. దశాంశము తెల్లని పద్మములచే కాని నాగచంపక పుష్పములచే కాని హోమమును చేయవలయును. మాతృకా పీఠమున చేప్పబోవు విధముగా పూజించవలయును. వర్ణాబ్దముచే ఆసనమును సమర్పించవలయును. మూల మంత్రముచే మూర్తిని సంకల్పించి దేవియొక్క దక్షిణ భాగమున శుభకరమగు సంస్కృత వాగ్దేవిని పూజించవలయును. వామ భాగమున ప్రాకృత వాగ్దేవిని పూజించవలయును. షట్కోణములందు మొదట అంగపూజ గావించి, వెలుపల ప్రజ్ఞాదులను పూజించవలయును. మరల లోకపాలకులను వారి ఆయుధములను బయట పూజించవలయును. ఇట్లు వాగ్దేవిని పూజించినచో సాక్షాత్తుగా వాక్పతి యగును. బ్రహ్మచర్య వ్రతము నవలంబించి, పరిశుద్ధుడై, పరిశుద్ధములైన దంతనఖాదులు కలవాడై స్త్రీల నందరిని దేవతా బుద్దితో భావించుచు ఒక సంవత్సరము పూజించినచో కవిత్వమును పొందును. వేయిమార్లు మంత్రించిన జలమును ప్రతిదినము త్రాగుచు ఒక సంవత్సరము పూజించినచో మహాకవి యగును. ప్రతిదినము ఉరోమాత్ర జలమున నిలిచి మార్తాండ మండలమున నున్న దేవిని ధ్యానించుచు మూడు వేలు జపించినచో నలుబది రోజులలో సిద్ధిని పొంది అసమాన వాగ్వైభవమును పొందును. మధుర మిశ్రితములగు పాలాశ బిల్వ పుష్పములచే కాని, సమిధలచే కాని హోమమును చేసినచో వాక్పతి కీర్తిని పొందును. మధుర మిశ్రితములగు రాజ వృక్ష పుష్పములచే కాని సమిధలచే కాని హోమమును గావించినచో అతులమగు కవిత్వమును పొందును (93-108)
అథ ప్రవక్ష్యే విప్రేన్ద్ర సావిత్రీం బ్రహ్మణః ప్రియామ్
యాం సమారాధ్య ససృజే బ్రహ్మ లోకాంశ్చరాచరాన్ ।
లక్ష్మీ మాయా కామపూర్వా సావిత్రీ జే సమన్వితా
స్వాహాంతో మనురాఖ్యాతః సావిత్ర్యా వసువర్ణవాన్ ।
ఋషిర్భ్రహ్మాస్య గాయత్రీ ఛన్దః ప్రోక్తం చ దేవతా
సావిత్రీ సర్వ దేవానాం సావిత్రీ పరికీర్తితా ।
హృదంతికైర్ర్బహ్మవిష్ణురుద్రేశ్వరసదాశివైః
సర్వాత్మనా చ జేయుక్తైరంగానాం కల్పనం మతమ్ ।
తప్త కాంచన వర్ణాభాం జ్వలంతీం బ్రహ్మ తేజసా
గ్రీష్మ మధ్యాహ్న మార్తాండసహస్ర సమవిగ్రహామ్ ।
ఈషద్ధాస్యప్రసన్నాస్యాం రత్నభూషణ భూషితామ్
వహ్నిశుద్ధాంశుకాఘానాం భక్తాను గ్రహకాతరామ్ ।
సుఖదాం ముక్తిదాం చైవ సర్వ సంపత్ర్పదాం శివామ్
వేద బీజ స్వరూపాం చ ధ్యాయేద్వేదప్రసూం తతః ।
ధ్యాత్వైవం మండలే విద్వాన్ త్రికోణోజ్జ్వలకర్ణికే
సౌరే పీఠే యజేద్దేవీం దీప్తాదినవశక్తిభిః ।
మూలమంత్రేణ క్లుప్తాయాం మూర్తీ దేవీం ప్రపూజయేత్
కోణేషు త్రిషు సంపూజ్యా బ్రాహ్మద్యా శ్శక్తయో బహిః ।
ఆదిత్యాద్యాస్తత: పూజ్యా ఉషాది సహితాః క్రమాత్
తతషడంగాన్యభ్యర్చ్య కేసరేసు యథావిధి ।
ప్రహ్లాదినీం ప్రభాం పశ్చాత్ నిత్యం విశ్వంభరాం పునః
విలాసినీ ప్రభావత్యే జయాం శాంతాం యజేత్పునః ।
కాంతిం దుర్గాం సరస్వత్యా విద్యారూపాం తతః పరమ్
విశాలసంజ్ఞతామిశాం వ్యాపినీం విమలాం యజేత్ ।
తమోఽపహారిణీం సూక్ష్మాం విశ్వయోనిం జయావహామ్
పద్మాలయాం పరాం శోభాం బ్రహ్మరూపాం తతోఽర్చయేత్ ।
బ్రాహ్మాద్యాశ్శారణా బాహ్యే పూజయేత్ప్రోక్తలక్షణాః
తతోఽభ్యర్చ్యేద్ధహాసా హ్యే శక్రాద్యానాయుఫైస్సహ ।
ఇత్థమావరణైర్దేవీర్దశభిః పరిపూజయేత్
అష్టలక్షం జపేన్మన్త్రం తత్సహస్రం హువేత్తలైః ।
సర్వపాప వినిర్ముక్తో దీర్ఘమాయుం స విన్డతి
అరుణాబ్జైస్త్రిమధ్వక్తార్జుహుయాదయుతం తతః ।
మహాలక్ష్మీర్భవేత్తస్య షణ్మాసానాత్ర సంశయః
బ్రహ్మవృక్షప్రసూనైస్తు జహుయాద్రహ్మతేజసే ।
బహునా కిమిహోక్తేన యథావత్సాధితా సతీ
సాధకానామియం విద్యా భవేత్కామదుఘా మునే ।
బ్రహ్మకు ప్రియమైన సావిత్రీ మంత్రమును నీకు చెప్పెదను. ఈ మంత్రము నుపాసించియే బ్రహ్మ చరాచరలోకములను . సృజించెను. “శ్రీ మహా సావిత్ర్యై స్వాహా" అనునది అష్టాక్షర మంత్రము. బ్రహ్మ ఋషి గాయత్రీ ఛందస్సు. సర్వదేవతా సావిత్రియగు సావిత్రి దేవత. బ్రహ్మణే నమః, రుద్రాయనమః, విష్ణవే నమః, ఈశ్వరాయ నమః, సదాశివాయ నమః, అనువాటిచే అంగకల్పన చేయవలయును. తప్తకాంచన వర్ణాభ, బ్రహ్మతేజస్సుచే జ్వలించు చున్నది, గ్రీష్మ మధ్యాహ్న మార్తాండ సహస్ర సమవిగ్రహ, ఈ షద్ధాస్య ప్రసన్నాస్య, రత్న భూషణ భూషిత, వహ్ని శుద్ధాంశుక ధారిణి, భక్తాను గ్రహకాతర, సుఖప్రద, ముక్తిదాయిని, సర్వసంపత్ర్పద, శుభకరి, వేదబీజ స్వరూప, వేద ప్రసూ అయిన సావిత్రిని ధ్యానించ వలయును. త్రికోణోజ్జ్వల కర్ణికా మండలమున ఇట్లు ధ్యానించి, సౌర పీఠమున దీప్తాదినవశక్తులచే దేవిని పూజించవలయును. మూల మంత్రముచే సంకల్పించిన మూర్తియందు దేవిని పూజించవలయును. మూడు కోణములందు బ్రాహ్మి మొదలగు శక్తులను పూజించవలయును. తరువాత ఆ బయట ఉషాది సహితులగు ఆదిత్యాదులను పూజించవలయును. తరువాత కేసరములందు యథావిధిగా షడంగ పూజను గావించి ప్రహ్లాదినిని, ప్రభను, నిత్యను, విశ్వంభరను, విలాసినీ ప్రభావతులను, జయను శాంతను, కాంతిని, దుర్గా సరస్వతులను, విద్యారూపను, విశాలను, ఈశను, వ్యాపినిని, విమలను, తమోప హారిణిని, సూక్ష్మను, విశ్వయోనిని, జయావహను, పద్మాలయను, పరమ, శోభను, బ్రహ్మరూపను అర్చించవలయును. బాహ్యావరణమున బ్రాహ్మి మొదలగు వారిని సలక్షణల నర్చించవలయును. ఆ బాహ్యావరణమున సాయుధులగు ఇంద్రాదుల నర్చించవలయును. ఇట్లు దశావరణలలో దేవులను పూజించవలయును. ఎనిమిది లక్షలు మంత్రమును జపించవలయును. ఎనిమిది వేలు నువ్వులచే హోమమును చేయవలయును. ఇట్లు చేసినచో సర్వపాప వినిర్ముక్తుడై దీర్ఘాయుష్యమును ఆరునెలలలో మహాసంపదను పొందును. బ్రహ్మవృక్ష పుష్పములచే హోమము గావించినచో కోరిన కోర్కెలన్నియూ తీరును. ఇంకనూ ఏమి చెప్ప వలయును. విధి విధానముగా ఉపాసించబడిన సావిత్రి సర్వాభీష్ట వర్షిణి యగును. (109 - 126)
అథ తే సంప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతమ్
సావిత్రీ పంజరం నామ సర్వరక్షాకరం నృణామ్ ।
వ్యోమకేశాలకాసక్తాం సుకిరీటవిరాజితామ్
మేఘభ్రుకుటిలాక్రాంతం విధి విష్ణు శివాననామ్ ।
గురు భార్గవ వర్ణాంతాం సోమ సూర్యాగ్ని లోచనామ్
ఇడా పింగలికా సూక్ష్మా వాయునాసాపుటాన్వితామ్ ।
సంధ్యా ద్విజోష్ఠపుటితాం లసద్వాగురజిహ్వకామ్
సంధ్యా సూర్యమణి గ్రీవాం మరుద్బాహు సమన్వితామ్ ।
పర్జన్య హృదయా సక్తాం వస్వాఖ్య ప్రతిమండలామ్
అనాశోదరవిభ్రాంతం నాభ్యవాంతరవీధికామ్ ।
ప్రాజాపత్యాఖ్య జఘనాం కటీంద్రాణీ సమాశ్రితామ్
ఊర్వోర్మలయ మేరుభ్యాం శోభమానాం సరీద్వరామ్ ।
సుజాను జహ్నుమశికాం వైశ్వదేవాఖ్య సంజ్లికామ్ పాదాంఘ్రినఖలోమాఖ్యభూనాగద్రుమలక్షితామ్ ।
గ్రహరాశ్యర్క్ష యోగాదిమూర్తా వయవ సంజ్లికామ్
తిథి మాసర్తుపక్షాళ్యై: సంకేతనిమిషాత్మకామ్ ।
మాయా కల్పితవైచిత్ర్యసాంధ్యఖ్యఛదనావృతామ్
జ్వలత్కాలానలప్రఖ్యాం తడిత్కోటిసమప్రభామ్ ।
కోటిసూర్యప్రతీకాశాం శశికోటిసుశీతలామ్
సుధామండలమధ్యస్థాం సాంద్రానన్దామృతాత్మికామ్ ।
వాగతీతాం మనోగమ్యాం వరదాం వేదమాతరమ్
చరాచరమయీం నిత్యాం బ్రహ్మక్షర సమన్వితామ్ ।
ధ్యాత్వా స్వాత్మావిభేదేన సావిత్రీ పంజరం న్యసేత్
పంజరస్య ఋషి స్సోహం ఛందో వికృతిరుచ్యుతే ।
దేవతా చ పరో హంసః పరబ్రహ్మాది దేవతా
ధర్మార్థ కామ మోక్షాపై వినియోగ ఉదాహృతః ।
షడంగ దేవతా మంత్రైరంగన్యాసం సమాచరేత్
త్రిధా మూలేన మేధావీ వ్యాపకం హి సమాచరేత్ ।
పూర్వోక్తాం దేవతాం ధ్యాయేత్సాకారాం గుణ సంయుతామ్
త్రిపదా హరిజా పూర్వముఖి బ్రహ్మస్త్ర సంజ్ఞకా ।
చతుర్వింశతి తత్యాఢ్య పాతు ప్రాచీం దేశం మమ
చతుష్పదా బ్రహ్మదండా బ్రహ్మాణీ దక్షిణాననా ।
షడ్వింశతత్య సంయుక్తా పాతు మే దక్షిణాం దిశమ్
ప్రత్యజ్ముఖీ పంచపదీ పంచాశతత్వరూపిణీ ।
పాతు ప్రతీచీ మనిశం మమ బ్రహ్మ శిరోంకితా
సౌమ్యాస్యా బ్రహ్మతుర్యాఢ్య సాధర్వాంగిరసాత్మకా ।
ఉదీచీం షట్పదా పాతు షష్టి తత్య కలాత్మికా
పంచాశద్వర్ణ రచితా నవపాద శతాక్షరీ ।
వ్యోమా సంపాతు మేఊర్థ్వం శిరో వేదాంత సంస్థితా
విద్యున్నిభా బ్రహ్మ సంధ్యా మృగారూఢ చతుర్భుజా ।
చాపేషుచర్మాసిధరా పాతు మే పావకీం దిశమ్
బ్రాహ్మీ కుమారీ గాయత్రీ రక్తాంగీ హంస వాహినీ ।
చిభ్రత్కమండలుం చాక్షం స్రుక్సువా పాతు నైఋతిమ్
శుక్లవర్ణ చ సావిత్రీ యువతీ వృష వాహనా ।
కపాల శూలకాక్షస్రగ్ధరిణీ పాతు వాయనీమ్
శ్యామా సరస్వతీ వృద్ధా వైష్ణవీ గరుడాసనా ।
శంఖ చక్రాభయకరా పాతు శైవీం దేశం మమ
చతుర్భుజా దేవమాతా గౌరాంగీ సింహవాహనా ।
వరాభయ ఖడ్గ చర్మభుజా పాత్వధరాం దిశమ్
తత్తత్ఫార్శ్వే స్థితాః స్వస్వ వాహనాయుధ భూషణాః ।
స్వస్వ దీక్షు స్థితాః పాంతు గ్రహ శక్త్యంగ సంయుతాః
మంత్రాధిదేవతా రూపా ముద్రాధిష్ఠాతృదేవతాః ।
వ్యాపకత్వేన పాత్వస్మానాపాదతలమస్తకమ్
ఇదం తే కథితం సత్యం సావిత్రీ పంజరం మయా ।
సంధ్యయోః ప్రత్యహం భక్త్యా జపకాలే విశేషితః
పఠనీయం ప్రయత్నేన భుక్తిం ముక్తిం సమిచ్ఛతా ।
భూతిదా భువనా వాణీ మహా వసుమతీ మహీ
హిరణ్యజననీ నన్హా సవిసర్గా తపస్వినీ ।
యశస్వినీ సతీ సత్యా వేదవిచ్చిన్మయీ శుభా
విశ్వా తుర్యా వరేణ్యా చ నిస్పణీ యమునా భువా ।
మోదా దేవీ వరిష్ఠా చ ధీశ్చ శాంతిర్మతిర్మహీ
ధిషణా యోగినీ యుక్తా నదీ ప్రజ్ఞా ప్రచోదినీ ।
దయా చ యామినీ పద్మా రోహిణీ రమణీ జయా
సేనాముఖీ సామమయీ జగలా దోష వర్జితా ।
మాయా ప్రజ్ఞా పరాదోస్తీ మానినీ పోషిణీక్రియా
జ్యోత్స్నా తీర్థమయీ రమ్యా సౌమ్యామృతమయీ తథా ।
బ్రాహ్మీ హైమా భుజంగీ చ వశినీ సందురీవనీ
ఓంకార హంసినీ సర్వా సుధా సా షడ్గుణావతీ ।
మాయా స్వధా రమా తన్వీ రిపుఘ్ని రక్షణీ సతీ
హైమా తారా విధుగతిగ్విషఘ్నీ చ వరాననా ।
అమరా తీర్థదా దీక్షా దుర్ధర్షా రోగ హారిణీ
నానా పాప నృశంసఘ్నీ షట్పదీ వజ్రణీరణీ ।
యోగినీ విమలా సత్యా అబలా బలదా జయా
గోమతీ జాహ్నావీ రజ్వీ తపనీ జాతవేదసా ।
అచిరా వృష్టిదా ప్లేయా ఋతతంత్రా ఋతాత్మికా
సర్వకామదుఘా సౌమ్యా భవాహంకార వర్జితా ।
ద్విపదాయా చతుష్పదా త్రిపదాయా చ షట్పదా
అష్టాపదీ నవపదీ సహస్రాక్షా క్షరాత్మికా ।
అష్టోత్తర శతం నామ్నాం సావిత్య్రా యః పఠేన్నరః
స చిరాయుస్సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ।
ఏతత్తే కథితం విప్ర పంచ ప్రకృతి లక్షణమ్
మంత్రారాధన పూర్వం చ విశ్వకామ ప్రపూరణమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయ పాదే పంచ ప్రకృతి మంత్రాది నిరూపణం నామ త్య్రశీతి తమోధ్యాయః.
ఇక ఇపుడు నీకు పరమాద్భుతము రహస్యము నరులకు సర్వరక్షా కరమగు సావిత్రీ పంజరమను దానిని చెప్పెదను. వ్యోమకేశాలకొసక్త, సుకిరీట విరాజిత మేఘ భ్రుకుటిలాక్రాంత బ్రహ్మవిష్ణు శివాననా, గురుశుక్ర కర్ణాంత, సోమసూర్యాగ్ని లోచన, ఇడా పింగలికా సూక్ష్మ వాయు నాసా పుటాన్విత, సంధ్యాద్విజోష్ణ పుటితా, లసద్వాగురజిహ్విక, సంధ్యా సూర్యమణి గ్రీవా, మరుద్బాహు సమన్విత, పర్జన్య హృదయా సక్త, వస్వాఖ్య ప్రతిమండల, ఆకాశోదర విభ్రాంత, నాభ్యవాంతర వీధిక, ప్రజాపత్య జఘన, కటీంద్రాణీ సమాశ్రిత, మలయ మేరూరువులతో శోభించునది, సరిద్వరా, జాహ్నవీ కాశికీ జాను, వైశ్వదేవ సంజ్ఞిక, పాదాంఘి నఖలోమాఖ్య భూనాగ ద్రుమలక్షిత, గ్రహరాశి నక్షత్ర యోగాది మూర్తా వయక సంజ్ఞక, తిధిమాస ఋతు పక్షాది సంకేత నిమిషాత్మిక, మాయా కల్పితవైచిత్ర్య సంధ్యాఖ్య ఛేదనోవృత, జ్వలత్కాలానలప్రఖ్య, తటితోటి సమప్రభ, కోటి సూర్యప్రతీకాశ, శశికోటిసుశీతల, సుధామండల మధ్యస్థ, సాంద్రానందామృతాత్మిక, వాగతీత, మనోగమ్యా, వరద, వేదమాత, చరాచరమయి, నిత్య. బ్రహ్మక్షర సమన్వితయగు సావిత్రిని స్వాత్మాది విభేదముచే ధ్యానించి సావిత్రీ పంజర న్యాసమును గావించవలయును. ఈ పంజరమునకు నేను (సనత్కుమార మహర్షి ఋషిని. వికృతి ఛందస్సు. పరమహంస పరబ్రహ్మ రూపమగు ఆది దేవత దేవత. ధర్మార్థ కామమోక్ష ప్రాప్తికి వినియోగించ వలయును. షడంగ దేవతా మంత్రములచే అంగన్యాసమును ఆచరించవలయును. త్రిధామూలముచే వ్యాపకమును ఆచరించవలయును. సాహార గుణ సంయుతయగు పూర్వోక్త దేవతను ధ్యానించవలయును. త్రిపదా, హరిజా, పూర్వముఖి, బ్రహ్మస్త్రసంజ్జిక, చతుర్వింశతి తత్యాఢ్య యగు సావిత్రి పూర్వదిక్కును కాపాడుగాక. చతుష్టద బ్రహ్మదండ, బ్రహ్మాణి, దక్షిణముఖీ షడ్వింశతత్త్వ సంయుక్తో దక్షిణ దిక్కును కాపాడుగాక. పశ్చిమముఖి, పంచపదీ, పంచాశతత్తత్య రూపిణి, బ్రహ్మ శిరోంకితా పశ్చిమ దిక్కును కాపాడుగాక. సౌమ్యాస్య బ్రహ్మతుర్యాఢ్య అధర్వాంగి రసాత్మక, షట్పదా, షష్టితత్య కలాత్మిక ఉత్తర దిక్కును కాపాడుగావుత. పంచాశద్వర్ణ రచిత, నవపాద, శతాక్షరి, వ్యోమా, వేదాంత సంస్థిత, ఊర్థ్వమును కాపాడుగాత విద్యున్నిభ, బ్రహ్మ సంధ్య, మృగారూఢ, చతుర్బుజ, చాపేషు చర్మాసిధరా, ఆగ్నేయ దిక్కును కాపాడుగాక. బ్రాహ్మి, కుమారి, రక్తాంగీ, హంస వాహిని కమండలమును జపమాలను, సుక్ర్సువములను ధరించు గాయత్రి నైఋత దిక్కును కాపాడుగావుత. శుక్లవర్ల, యువతి, వృషవాహిని. కపాల శూల కాక్ష స్రగ్ధరిణి యగు సావిత్రి నాయవ్య దిక్కును కొసాడు గావుత. శ్యామా, వృద్ద వైష్ణవి, గరుడాసన, శంఖ చక్రాభయకర యగు సరస్వతి ఈశాన్య దిక్కును కాపాడు గావుత. చతుర్బుజ, దేవతమాత, గౌరాంగి, సింహవాహన, వరాభయ ఖడ్గ చర్మభుజ ఆధరదిక్కును. కాపాడు గావుత. ఆయా పొర్శములనున్నవారు స్వస్వవాహనాయుధ భూషణ ధారిణులు గ్రహ శక్ష్యంగ సంయుతలై కాపొడుగావుత. మంత్రాధి దేవతారూపలు ముద్రాధిష్ఠాతృ దేవతలు ఆపాద తలమస్తకమును వ్యాపకముగా కాపాడుగావుత. ఇట్లు నీకు సావిత్రీ పంజరమును చెప్పితిని. ప్రతి దినము ఉభయ సంధ్యలలో, విశేషించి జపకాలమున భక్తిచే పఠించు వారికి భుక్తిముక్తులు లభించును.
భూతిదా, భువనా, వాణి, మహా వసుమతి, మహీ, హిరణ్య, జనని, నందా, సవిసర్గా, తపస్విని, యశస్విని, సతీ, సత్యా, వేదివిల్, చిన్మయి, శుభ, విశ్వా, తుర్యా, వరేణ్య, నిసృణీ, యమునా, భువా, మోదా, దేవీ, వరిష్ణా, ధీ, శాంతి, మతి, మహి, ధిషణ, యోగిని, యుక్త, నదీ, ప్రజ్ఞా, ప్రచోదిని, దయా, యామిని, పద్మా, రోహిణి, రమణి, జయ, సేనాముఖి, సామమయి, జగలా, దోష వర్జిత, మాయా, ప్రజ్ఞా, పరా, దోర్రీ, మానినీ, పోషిణి, క్రియా,జ్యోత్స్నా, తీర్థమయీ, రమ్యా, సౌమ్యా, అమృతమయి, బ్రాహ్మీ, హైమి, భుజంగి, వశినీ, సుందరీ, వనీ, ఓంకార హాసినీ, సర్వా, సుధా, షడ్గుణవతీ, మాయా, స్వధా, రమా, తన్వీ, రిపుఘ్నీ, రక్షణీ, సతీ, హైమా, తారా, విధుగతి, విషఘ్ని, వరాననా, అమరా, తీర్థదా, దీక్షా, దుర్ధర్షా, రోగ హారిణి, నానా పాపనృశంసఘ్నీ, షట్పదీ, వజ్రణీ, రణీ, యోగిని, విమలా, సత్యా, ఆబాలా, బలదా, జయ, గోమతీ, జాహ్నవీ, రజ్వీ, తపనీ, జాతవేదసా, ఆచిరా, వృష్టిదా, షైయా, ఋతతంత్రా ఋతాత్మికా, సర్వకామదుఘా, సౌమ్యా, భవాహంకారవర్జితా, ద్విపదా, త్రిపదా, చతుష్పదా, షట్పదా, అష్టాపదీ, నవపదీ, సహస్రాక్షాక్షరాత్మిక, ఇవి సావిత్రీ దేవి యొక్క అష్టోత్తర శత నామములు. ఈ అష్టోత్తర శతనామములను ప్రతి దినమున భక్తిచే పఠించువారు దీర్గాయుష్మంతులు, సుఖము గలవారు, పుత్రవంతులు, విజయము గలవారు, వినయము గలవారు అగుదురు. ఇట్లు నీకు పంచ ప్రకృతి లక్షణమును చెప్పితిని. సమస్త కామ ప్రదమగు మంత్రమును అరాధనా సహితముగా చెప్పితిని.
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున పంచప్రకృతి మంత్రాది నిరూపణమను ఎనుబది మూడ - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 85 of the Nārada Mahā Purana is as follows:
యజ్ఞ హోమాదులకై నిర్మించవలసిన హోమకుండముల కొలతలు, లక్షణములు మరియు హోమ ప్రక్రియా విధానము ఈ అధ్యాయంలో నిరూపించబడినది. ఆజ్య హోమము, సమిధల నియమములు మరియు పూర్ణహుతి వైభవము ఇక్కడ వివరింపబడినది.