54 - జ్యోతిషవర్ణనమ్

సనందన ఉవాచ :-

జ్యోతిషాంగం ప్రవక్ష్యామి యదుక్తం బ్రహ్మణా పురా

యస్య విజ్ఞానమాత్రేణ ధర్మ సిద్ధిర్భవేన్నృణామ్

త్రిస్కంధం జ్యోతిషం శాస్త్రం చతుర్లక్షముదాహృతమ్

గణితం జాతకం విప్ర సంహితాస్కంధసంజ్ఞతాః

గణితే పరికర్మాది ఖగమధ్యస్పుటక్రియే

అనుయోగశ్చన్ద్రసూర్యగ్రహణం చ ప్రకీర్తితమ్

ఛాయా శృంగోన్నతివ్యతీపాతసాధనమీరితమ్

జాతకే రాశిభేదాశ్చ గ్రహయోనిశ్చ యోనిజమ్

ని షేకజన్మారిష్టాని హ్యాయుర్దాయో దశాక్రమః

కర్మాజీవం చాష్ఠవర్గే రాజయోగాశ్చ నాభసాః

చంద్రయోగాః ప్రవ్రజ్యాఖ్యా రాశిశీలం చ దృకలమ్

గ్రహభావఫలం చైవాశ్రయయోగప్రకీర్ణ కే

అనిష్టయోగాత్ స్త్రీ జన్మ ఫలం నిర్యాణ మేవ చ

నష్టజన్మ విధానం చ తథా ద్రేష్కాణలక్షణమ్

సంహితాశాస్త్రరూపం చ గ్రహచారోఽబ్దలక్షణమ్

తిథివాసరనక్షత్రయోగతిధ్యర్దసంజ్ఞకాః

ముహూర్తాపగ్రహాస్సూర్యసంక్రాంతిర్గోచరః క్రమాత్

చంద్రతారాబలం చైవ సర్వలగ్నార్తవాహ్వయః

ఆధానపుంససీమన్తజాతనామాన్నభుక్తయః

చేల కర్ణ్యయనం మౌంజీ కుర్ణికాబంధనం తథా

సమావర్తనవైవాహప్రతిష్టాసద్మ లక్షణమ్

యాత్రాప్రవేశనం సద్యోవృష్టి కర్మవిలక్షణమ్

ఉత్పత్తిలక్షణం చైవ సర్వం సంక్షేపతో బ్రువే

ఏకం దశశతం చైవ సహస్రాయుతలక్షకమ్

ప్రయుతం కోటిసంజ్ఞాం చార్బుదమజ్జం చ ఖర్వకమ్

నిఖర్వం చ మహాపద్మం శంకుర్జలధిరేవ చ

అంత్యం మధ్యం పరార్ధం చ సంజ్ఞా దశగుణోత్తరాః

క్రమాదుత్క్రమతో వాపి యోగః కార్యోత్తరం తథా

హన్యాద్గుణేన గుణ్యం స్యాత్ తేనైవోపాంతిమాదికాన్

శుద్ధేద్ధరో యద్గుణశ్చ భాజ్యాంత్యాత్తత్ఫలం మునే!

సమాంకతోఽధో వర్గస్స్యాత్త మేవాహుః కృతిం బుధాః

అంత్యాత్తు విషమాత్యక్త్వా కృతిం మూలం న్య సేతృథక్

ద్విగుణేనామునా భక్తీ ఫలం మూలే న్యసేత్క్రమాత్

తత్కృతిం చ త్యజేదిప్ర మూలేన విభజేత్పునః

ఏవం ముహుర్వర్గమూలం జాయతే చ మునీశ్వర

సమతజహతిః ప్రోక్తో ఘనస్తత్ర విధిః పదే

ప్రోచ్యతే విషమం త్వాద్యం సమే ద్వే చ తతః పరమ్

విశోధ్యం విషమాదంత్యాత్ ఘనం తన్మూలముచ్యతే

త్రిఘ్నాద్భజేన్మూలం కృత్యా పమం మూలే న్య సేత్ఫలమ్

తత్కృతిత్వేన నిహతాన్ని ఘ్నీం చాపి విశోధయేత్

ఘనం చ విషమాదేవం ఘనమూలం ముహుర్భ వేత్

అన్యోన్యహారనిహతౌ హారాంశౌ తు సముచ్ఛిదా

లవా లవఘ్నశ్చ హరా హరఘ్నహి సవర్ణనమ్

భాగప్రభా గే విజ్ఞేయం మునే శాస్త్రార్ధచింతకైః

అనుబంధేఽపవా హే చైకస్య చేదధికోనకః

భాగాస్తలస్థహారేణ హరం స్వాంశాధి కేన తాన్

ఊనేన చాపి గుణయేద్ఘనర్ణం చింతయేత్తథా

కార్యస్తుల్యహరాంశానాం యోగశ్చాప్యంతో మునే

అహారరాశౌ రూప్యం తు కల్పయేద్ధరమప్యథ

అంశాహతి శ్ఛేదఘాతహృద్భిన్నగుణనే ఫలమ్

ఛేదం చాపి లవం విద్వన్ పరివర్త్య హరప్య చ

శేషః కార్యో భాగహారే కర్తవ్యో గుణనావిధిః

హారాంశయోః కృతీ వర్గే ఘనౌ ఘనవిధౌ మునే

పద సిద్ద్యై పదే కుర్యాత్ అథో ఖం సర్వతశ్చ ఖమ్

ఛేదం గుణం గుణం ఛేదం వర్గం మూలం పదం కృతిమ్

ఋణం ఖం ఖమృణం కుర్యాత్ దృశ్యే రాశిప్రసిద్దయే

అధస్వాంశాధికోనే తు లవాడ్యోనో హరో హరః

అంశస్త్వవికృతిషత్ర విలోమే శేషముక్తవత్

ఉద్దిష్టరాశిస్సంక్షిప్తౌ హృతోంశై రహితో యుతః

ఇష్టఘ్నదృష్టేనైతేవ భక్త రాశిరనీశితః

యోగోంతరేణీనయుతోద్వితోరాశీతపంక్రమే

రాశ్యంతరహృతం వర్గోత్తరం యేసుతశ్చ తా

గజగ్రీష్టకృతిర్వైకా దలితా చేష్టభాజితా

ఏకోఽస్య వర్గో దలిత స్సైకో రాశిః పరో మతః

ద్విగుణీఽష్టహృతం రూపం శ్రేష్ఠం ప్రాగ్రూపకం పరమ్

వర్గయోగాంతరే వ్యేకే ఈశ్యోర్వర్గౌస్త ఏతయోః

ఇష్టవర్గకృతి శ్చేష్టఘనోష్టగ్రౌ చ సైకకౌ

ఏషీస్యానాముఖే వ్యక్తే గణితం వ్యక్త మేవ చ

గుణఘ్నమూలోనయుతః సగుణార్దే కృతం పదమ్

దృష్టస్య చ గుణార్ధో న యుతం వర్గీకృతం గుణః

యదా లవోనపుమ్రాఃర్దృశ్యం భాగోనయుగ్భువా

భక్తం తథా మూలగుణం తాభ్యాం సాధ్యోఽథ వ్యక్త వత్

ప్రమాణేచ్ఛే సజాతీయే ఆద్యంతే మధ్యగం ఫలమ్

ఇచ్చఘ్నమాద్యహృత్సేష్టం ఫలం వ్యస్తే విపర్యయాత్

సనందన మహర్షి పలికెను :- పూర్వము బ్రహ్మ చెప్పిన జ్యోతిషాంగమును చెప్పెదను. జ్యోతిషమును తెలిసిన మానవులకు ధర్మ సిద్ది లభించును. ఈ జ్యోతిష శాస్త్రము మూడు స్కంధములు గలది. నాలుగు లక్షల శ్లోకములు గలవు. గణితము, జాతకము, సంహితయని మూడు స్కంధములు. గణిత భాగమున పరికర్మ మొదలుకొని ఆకాశ మధ్యమున నుండు క్రియా స్పుటము, గ్రహానుయోగము, చంద్రసూర్యగ్రహణము, శృంగోన్నతి ఛాయలు, పాత సాధనము చెప్పబడినది. జాతక భాగమున రాశి భేదము, గ్రహకారణములు, గర్భాధాన, జన్మ అరిష్టములు, ఆయుర్దాయము, దశాక్రమము, జీవనమున చేయు కర్మ, అష్టవర్గము, ఆకాశమునకు సంబంధించిన రాజయోగములు, చంద్రయోగము, రాశిశీలము, దృక్ఫలము, గ్రహభావఫలము, ఆశ్రయయోగప్రకీర్ణకములు, అనిష్టయోగములు, స్త్రీ జన్మఫలము, నిర్యాణము, నష్టజన్మ విధానము, దేష్కాణలక్షణము, చెప్పబడినవి. సంహితాభాగమున గ్రహచారము, అబ్దలక్షణము, తిథి, వార, నక్షత్ర, యోగ, తిధ్యర్థ సంజ్ఞలు, ముహూర్తోప గ్రహములు సూర్యసంక్రమణము, తారా చంద్రబలములు, సర్వలగ్న ఋతువులు, గర్భాధాన, పుంసవన, . సీమంత, జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, మౌంజీ, కురికా బంధనము, సమావర్తనము, వివాహము, ప్రతిష్ణా, గృహలక్షణములు యాత్రాగమనము, సద్యోవృష్టి, విశేషకర్మలు, ఉత్పత్తి లక్షణము అంతయూ చెప్పబడినది. దానిని నేను సంక్షేపముగా చెప్పెదను. ఒకటి,పది, శతము, సహస్రము, అయుతము, లక్ష, ప్రయుతము (పదిలక్షలు), కోటి, అర్బుదము (పదికోట్లు), అబ్జము, ఖర్వము, నిఖర్వము, మహాపద్మము, శంకు, జలధి, అంత్యము, మధ్య, పరార్ధము అని సంఖ్యల సంజ్ఞలు. ఈ సంజ్ఞలు మొదటి దాని కంటే తరువాత నున్నది పది రెట్లని తెలియవలయును. క్రమముగా కాని ఉతమముగా కాని సంఖ్యాయోగముననుసరించవలయును. గుణము చేయబడిన దానిని గుణ్యమందురు. గుణ్యముచే ఉపాంతిమాదిమములను శుద్ధి చేయవలయును. హరించబడిన గుణమును భాగించుటచే చివరగా మిగిలినది ఫలమనబడును. సమమైన అంకములు గలది వర్గమనబడును. ఈ వర్గనే కృతి యందురు. విషమమైన అంత్యమునుండి కృతిని విడదీసి మూలముగా విడిగా నుంచవలయును. దీనిని రెట్టింపుచే భాగించగా వచ్చిన ఫలమును క్రమముననుసరించి మూలమున నుంచవలయును. అపుడు దాని కృతిని - వీడువవలయును. మరల మూలమున భాగించవలయును. ఇట్లు మాటిమాటికి చేసినచో వర్గమూలమేర్పడును. మూడంకములతో సమముగా భాగించవలయును. ఇట్లు భాగించగా వచ్చిన దానిని ఘనమందురు. మూటీలో మొదటి దానిని విషమమందురు. మిగిలిన రెండు సమములనబడును. తరువాత విషమమగు అంత్యమునుండి ఘనమును శుద్ధి చేయవలయును. ఇట్లు శుద్ధి చేయబడిన ఘనమే మూలమనబడును. ఇట్లు మూటిచే భాగించబడిన దానిని మూలముచే కలిపి, సమమైన దానిని మూలమున ఫలముగా నుంచవలయును. దానిని కృతిచే భాగించబడగా, దానిని కూడా శుద్ధి చేయవలయును. ఇట్లు విషమము నుండి ఘనమును, ఘనమునుండీ ఘనమూలమును మాటి మాటికి శుద్ధిచేసి తేల్చవలయును. ఇట్లు ఒకదానిచే ఒకటి భాగించబడినపుడు, భాగాంశములను వేరు చేయవలయును. లవములు, లవఘ్నములు, హరములు హరఘ్నములు, అని శాస్త్రార్థచింతకులు భాగప్రభాగములను తెలియవలయును. అనుబంధమున కొని . అసవాహమున కొని ఒకదానికి ఎక్కువగా కానీ తక్కువగా కొని యున్నపుడు చేతిలో నున్న హారభాగముచే విభజించి, హరమును స్వాంశాధిక్యముచే విభజించవలయును. తక్కువగా నున్నదానిచే కూడా గుణించవలయును. గుణించునపుడు ఘనమును (మూలమును) ఋణమును గుర్తుంచుకొనవలయును. చివరలో సమముగా నున్న హరాంశములను కలుపవలయును. హరముకాని రాశిలో కూడా హరమును కల్పించవలయును. అంశభాగమైనపుడు భాగించబడిన హరభాగమును గుణించినచో వచ్చునది ఫలమగును. హారమును -పరివర్తనము చేసి భాగించగా వచ్చు భాగమును లవమని తెలియుము. భాగహారమున శేషమును చూపవలయును. వచ్చిన దానిని గుణించవలయును. హారాంశలలోని కృతిని, వర్గమును ఘనవిధిలో ఘనమును విడిగా చూపవలయును. పదము సిద్ధించుటకు పదమున క్రింద, 'అంతట శూన్యము వచ్చునట్లు భాగించవలయును. భోగమును గుణముగ, గుణమును భాగముగా వర్గమును, మూలముగా, పదమును కృతిగా, ఋణమును శూన్యముగా శూన్యమును ఋణముగా చేసినచో రాని తెలియును. స్వాంసము కంటే, అధికముగా కొని తక్కువగా కానీ భోగమున్నపుడు లవమును తక్కువగా చేసినచో వచ్చినదానిని హరమందురు. ఈ విషయమున విలోమమున మాత్రము అంశము వికారమును చెందదు. శేషము మొదటి చేయవలయును. ఉద్దేశించబడిన రాగి తగ్గినపుడు అంశములతో హరించబడును. అంశహారము కొనిది యుతమనబడును. ఇట్లు ఇష్టమును భాగము చేయగా వచ్చిన దానితో భోగము చేయబడిన రాశిని కలుపరాదు. ఇట్లు కలుపక ఉన్నదానిని, తక్కువగా ఉన్నదానిని . రెండుగా రాశులనేర్పరుచ వలయును. రెండు రాశులలోని భేదమును, వర్గము తరువాత నున్నదానిని ఒకటిగా చూడవలయును. హారమైనదీ అంశరహితమైనది . యుతమగును. ఇష్టముచే హృతమైన దానతో భాగరాశితో కలుపవలయును. మరొక దానితో కలిసిన యుతమును భాగరాశినీ సంక్రమింపచేయవలయును. ఇతర రాశితో హతమైన దానిని వర్గము తరువాత నున్నదానిని రెండును విడిగా చూపవలయును. ఇవియే మూలము యుతములనబడును. దీనినే గజాగ్రీ, ఇష్టకృతి యందురు. ఇష్టముచే భాగింపబడినది దలితమనబడును. ఈ రెంటిలో ఒకవర్గము దలితము రెండవది పరరాశియనబడును. ఇష్టము కంటే రెట్టింపుచే హారమైనది శ్రేష్టరూపము. రెండవది పరరూపముఇదియే మొదటీ రూపముతో కనపట్టును. వర్గయోగాంతరములు భిన్నముగా నుండును. ఈ రెంటిరాశులనే వర్గములుగా వ్యవహరించబడును. ఒకటి ఇష్టవర్గకృతి, మరియొకటి ఇష్టధనము. ఇష్టధనము ఉష్ణగ్రము అని ఒకరాశి కే రెండు పేర్లుండును. ఈ రెండు రాశులనే వ్యక్తములందురు. ఈ గణితమే వ్యక్త గణితమందురు. . గుణించబడిన మూలము యుతము కాదు. గుణించబడినదానిలో సగభాగము పదమనబడును. గుణార్ధముగా చూచినది కూడా యుతము కాదు. వర్గముగా చేయబడినది మాత్రమే గుణమనబడును. పుంరాశి లవ దృశ్య మైనపుడు భాగముకంటే తక్కువ దానిచే కలిసియుండును. ఇట్లు భాగించబడినది, మూలగుణము అను ఈ రెంటిచే వ్యక్త గణితమును సాధించవలయును. ప్రమాణము ఇచ్ఛ, సమానముగా నున్నచో (సజాతీయములైనచో) ఆద్యంతములుగా నున్నచో ఫలము మధ్యమున నుండును. మొదటి హరము ఇచ్చను కొట్టివేయును. దీనినే ఇష్టఫలమందురు. విజాతీయములైనచో విపర్యయము వలన ఫలము అనబడును.

పంచరాశ్యాదికేఽన్యోన్యపక్షం కృత్వా ఫలచ్ఛిదామ్

బహురాశివధం భక్తే ఫలం స్వల్పవధేన చ

ఇష్టకర్మవధేర్మూలం చ్యుతం మిశ్రాత్కలాంతరే

మానఘ్న కాలశ్చాతీతకాలాఘ్నఫలసంహృతాః

స్వయోగభక్తా నిఘ్నాస్స్యుసంప్రయుక్తదలాని చ

బహురాశిఫలాత్స్వల్పరాశిమాసఫలం బహు

చేద్రాశివివరం మాసఫలాంతరహృతం చయః

క్షేపా మిశ్రహతాః క్షేపయోగభక్తాః ఫలాని చ

భజేచ్ఛిదోం స్తైర్మిశ్రైః రూపం కాలశ్చ పూర్తి కృత్

పూర్ణో గచ్ఛేత్స మేధ్యవ్యే సమే వర్గోర్దితేత్యతః

వ్యస్తం గచ్ఛతం ఫలం యత్ గుణవర్గం భచహి తత్

వ్యేకం వ్యేకగుణాప్తం చ ప్రాఘ్నం మానం గుణోత్తరే

భుజకోటికృతియోగమూలం కర్ణశ్చ దోర్భవేత్

శ్రుతికృత్యంతరపద కోటిర్దోః కర్ణవర్గయో

వివరాత్తత్కర్ణపదం క్షేత్రే త్రిచతురస్రకే

రాశ్యోరంతరవర్గేణ ద్విఘ్నే ఘాతే యుతే తయోః

వర్గయోగోఽథ యోగాంతం హంతి వర్గాంతరం భవేత్

వ్యాస ఆకృతి సంక్షణ్ణో వ్యాసా స్స్యాత్పరిధిర్ము నే

జ్యావ్యాసయోగవివరాహతమూలోనితోఽర్ధితః

వ్యాసశ్శరశ్శరోనాచ్ఛ వ్యాసాచ్ఛరగుణాత్పదమ్

ద్విఘ్నం జీవాధ జీవార్ధవర్గే శరహృతే యుతే

వ్యాసోష్టతే భవేదేవం ప్రోక్తం గణితకోవిదైః

చాపోననిఘ్నః పరిధిః ప్రగాజ్ఞః పరిధేః కృతే

తుర్యాం శేన శర ఘ్నేనాఘే నినాఘం చతుర్గణమ్

వ్యాసఘ్నం ప్రభజే ద్విప్ర జ్యాకాశం జాయతే స్ఫుటా   

జ్యాంఘ్రీషు ఘ్నోవృత్తవర్గోఽబ్ధిఘ్నవ్యాసాఢ్యమౌర్విహృత్

లబ్ధోనవృత్తవర్గాద్రపదేఽర్ఘాత్పతితే ధనుః

స్థూలమధ్య పృవన్న వేధో వృత్తాంకా శేషభాగికః

వృత్తాంగాంశకృతిర్వేధని ప్రీయనకరామితౌ

వారివ్యాసహితం దైర్ఘ్యం వేధాంగులహతం పునః

ఖభేందురామవిహతం మానం ద్రోణాదివారిణః

విస్తరాయామవేధానామంగుల్యోఽన్యోన్యనాడిఘ్నాః

రసాంకాభ్రాబ్ధభిర్భక్తాః ధాన్యే ద్రోణాదికా మితి:

ఉత్సేధవ్యాసదైర్ఘ్యాణాం అంగుళ్యాన్యస్య నో ద్విజ

మిధోఘ్నతి భజే త్వ్సాక్షేశైర్డోణాదిమితిర్భవేత్

విస్తారాద్యంగులాన్యేవ మిధోఘ్నాన్యపసాం భవేత్

బాణేభమార్గణైర్లబ్ధం ద్రోణాద్యం మార్గమాది శత్

దీపశకుంతలఛిద్రఘ్నశ్శంకుర్మైవం భవేన్మునే

నరోనదీపకశిఖౌచ్యభకో హ్యధ భోద్వనే

శంకౌనదీపాఘశ్ఛిద్ర ఘైర్ధీ పౌచ్యం నరాన్వితే

వింశకుదీపౌచ్చ్య గుణాచ్ఛాయా శంకూద్దృతా భవేత్

దీపశంక్వంతరం చాథ ఛాయాగ్రవివరఘ్నభా

మానాంతరద్రుద్భూమిస్స్యాదధో భూ వరాహతి

ప్రభాప్తా జాయతే దీపశిఖౌచ్చ్యం స్యాత్త్రిరాశి కాత్

ఏతత్సంక్షేపతః ప్రోక్తం గణితే పరికర్మ కమ్

గ్రహమధ్యాదికం వక్ష్యే గణితే నాతివిస్తరాత్

పంచరాశ్యాదిక స్థలములో ఫలమును విభజించు రాశులను పరస్పరముగా విభజించి రెండు పక్షములను చేసి ఎక్కువరాళీగా ఉన్నదానిని భాగహరమునుచేసి తక్కువదానిచే కొట్టబడిన, దానిని ఫలముగా నిర్ణయించవలయును. ఇష్టకర్మఘాతమునకు కలిసి యున్న కలాంతరము నుండి చ్యుతమైనది మూలమగును. మాన నీఘాతమగు కాలము ఆతీతకాలనిఘాతమగు ఫలముచే సమన్వయము చేయబడును. కేపములన్నియూ మిశ్రహతములగును. కేపయోగముచే భాగించబడినవి ఫలములగును. భిన్నమైన అంశములచే విభజించవలయును. వాటితో కలిసియున్న రూపము కాలము పూర్తి చేయునదగును. పూర్ణభాగము సమభాగమును చెందును. వ్యంకమున సమమున వర్గమున అర్థభాగము నిలీనమగును. వ్యస్తమును పొందుచున్న ఫలము ఏ గుణవర్గమును చేరినదో చూడవలయును. వ్యేకము, వ్యేకగుణమును పొందినది, ఎక్కువరాశిచే భిన్నమైనది ఉత్తరగుణమున మానమగును. (కొలబద్ద) రెండు భుజముల కలయికచే ఏర్పడినది భుజములకు కర్ణమగును. శ్రుతికృతుల మధ్యనయున్నది. భుజకోటి ద్వయమున నున్నదీ భుజభాగమగును. ఆ కృతి సంక్షేపమును భిన్నము చేసినది వ్యాసమగును. ఇదియే పరిధియనబడును. నారివ్యాసముల కలయికచే ఏర్పడిన వివరముచే ఆహతమగు మూలమునే అర్ణీతమందురు. గణతములో వ్యాసము శరము అని రెండు సంజ్ఞలుండును. శరము కంటే తక్కువగా నున్నదానికి, వ్యాసము కంటే శరగుణము కంటే అవతలనున్నది పదమనబడును. రెంటిచే విభజించబడునది జీవము. శరహితమగు యుతమున జీవార్ణము గా పేర్కొనబడును. వ్యాసభాగము అష్టవిధముగా భిన్నమగుచో నని గణీతకోవిదులు చేప్పేదరు. ధనువు కంటే తక్కువగొనిచే హతనుగునదీ పరిధియనబడును పరిధిని విభజించినచో ప్రదాజమగును. నాలగవ భాగమగు శరాంశముచే అర్థము చేయబడిన భాగము నాలుగరెట్లుండును. వ్యాసముచే విభజించబడిన దానిని మరల విభాగము చేయబడినది కాశమగును. దీనినే స్పుటమందురు. జ్యా భాగముచే శరభాగముచే విభజించబడినది వృత్తవర్గమగును. నాలుగింటిచే విభజించబడిన వృత్తవర్గము, నాలుగింటిచే విభజించబడినది వ్యాసమగును. ఈ వ్యాసమే జ్యాభాగమును హరించును. లబ్దముకంటే తక్కువగానున్న వృత్త వర్గమున ఏడుచే కాని రెంటిచే కొని వెలగట్టినది పతితమగుచో ధనువగును. స్థూలమధ్య భాగమును పొందిన దానిని వేధ చేసినచో వృత్తాంక శేషభాగమగును. వృత్తాంగాంశము యొక్క కృతిచే విద్దమైనదీ కరమితమగును. వారి వ్యొసహతమగునది మరల దీర్ఘమేధాంగులఘ్నమగును. మూడుమార్లు ఒకటిచే భాగించబడినది, మూడుచే భాగించబడినది ద్రోణమునుండి వారివరకుండు మానమగును. వైశాల్యము, పొడుగుగా ఉన్నవాటిని అంగుళములచే నాడులచే విభజించవీలయును. ఆరింటిచే ఏడింటిచే, నాలుగింటిచే విభజించబడినవి ధాన్యమున ద్రోణాదీమానము పరిగణించబడును. ఎత్తు, వెడల్పు, పొడుగును అంగులములచే కొలవవలయును. పరస్పరము ఒకదానితో వేరొకదానిని కలిపి విభజించవలయును. ఒకటితో తొమ్మిదితో, పన్నెండుతో విభజించినచో ద్రోణాది మానమేర్పడును. వెడల్సు మొదలగువాటిని అంగుళాదులతో లెక్కించవలయును. పరస్పరము కొట్టివేయబడినచో మాన నిర్ధారణ జరుగును. అయిదింటిచే, ఎనిమిదింటిచే, అయిదింటిచే విభాగము చేయగా లభించినది ద్రోణామానముగా నిర్దేశించవలయును. దీప శకుంతల ఛిద్రములచే కొట్టివేయబడినచో శంకువగును. నరభాగము కంటే తగ్గిన భాగము దీపశిఖము కంటే ఎక్కువ భాగములచే విభజించబడినది ఆకాశభాగమగును. శంకువునందు నరదీప అఘఛిద్రములచే కొట్టి వేయబడినపోటిచే దీపోచ్చ. భాగమును నరాన్వితమగును. విశంకు దీప భాగములకంటే ఉన్నతమగునది గుణచ్ఛాయ శంకుచే ఉద్ధృతమగును. దీప శంకు మధ్యలోనున్నది ఛాయాగ్ర వివరమును కొట్టివేయును. మానాంతరముచే కొలువబడు: భూమి నరాహతమగును. ప్రభచే పొందబడినది దీపశిఖకంటే ఉచ్చయగును. ఇదియే రాశిత్రయమగును. ఇది సంక్షేపముగా గణితకర్మ చెప్పబడినది. ఎక్కువ విస్తరముగా కాకుండగా గ్రహమధ్యభాగము మొదలగు దానిని చేప్పెదను.

యుగమానం స్మృతం విప్ర ఖచతుష్కరదార్ణవాః

తద్దశాంస్తు చత్వారః కృతాఖ్యం పాదముచ్యతే

త్రయస్త్రేతా ద్వాపరో ద్వౌ కలిగేకః ప్రకీర్తితః

మనుకృతాబ్దసహితా యుగోనామేకసప్తతిః

విధేర్దినే స్యుర్విప్రేన్ద్ర మనవస్తు చతుర్దశ

తావత్యేవ నిశా తస్య విప్రేన్ద్ర పరికీర్తితా

స్వయంభువా శరగతానబ్దాన్సంపీడ్య నారద

ఖచరానయనం కార్యమథ వేష్టయుగాదితః

యుగే సూర్యజ్ఞశుక్రాణాం ఖచతుష్కరదార్ణవాః

పూజార్కిగురుశుక్రాణాం భగణా పూర్వపాపినామ్

ఇందోరసాగ్నిత్రిషు సప్త భూధరమార్గణాః

దస్రత్ర్యాష్ఠరసాంక్వాలోచనాని కుజస్య తు

బుధశీఘ్రస్య శూన్యర్తు ఖాద్రీత్ర్యంకన గేందవః

బృహస్పతేః ఖదస్రాక్షి వేద స్త్రీడహూయస్తథా

శితశీఘ్రస్య యష్ణసత్రీయమాన్విస్వభూధరాః

శనేర్భుజగషట్పంచరసవేదనిశాకరా!

చంద్రోచ్ఛస్యాగ్నిశూన్యాక్షి వసుర్నార్ణవా యుగే

వామం పాతస్య చ స్వగ్నియమాశ్విశిఖాదస్రకాః

ఉదయాదుదయం భానోర్భూమే స్సాచేన పొసరాః

వసుద్వ్యష్టాద్రీరూపొంకసప్తాద్రితిధయో యుగే

షడ్వహిప్రాహుతాశాంక తిథయశ్దాధిమాసకాః

తిధిక్షయా యమార్దాక్షి ద్వష్టవ్యోమ శరాశ్వినః

ఖ చతుష్కా సముద్రాష్టకుర్పచరవిమాపకాః

షట్ త్యగ్ని వేదాన్ని పంచ శుభ్రంశు మాసకాః

ప్రాగార్తే సూర్యమందస్య కల్పే సప్తాష్టవహ్నయః

కౌజస్య వేదస్వయమా బౌధస్యాష్టర్తువహ్నయః

ఖ ఖరంధ్రాణి జైవస్య శాక్రస్యార్ధగుణేషవః

గోఽగ్నయశ్శనిమందస్య పాతానామథవా మతః

మనుదస్తాస్తు కౌజస్య భాధస్యాష్టాష్ట సాగరాః

కృతాద్రి చంద్రా జైవస్య శౌక్రస్యాన్నిఖనందకాః

శనిపాతస్య భగణాః కల్పే యమరసర్తవః

వర్తమానయుగే పానవత్సరా భగణాభిధాః

మా సీకృతా యుతా మాసైర్మధుశుక్లాదిభిర్గతైః

పృధక్దాసిధిమాసాగ్రా సూర్యమాసవిభాజితాః

అభాధిమాసకైర్యుక్తా దినీకృత్య దినాన్వితాః

ద్విస్థాస్తితిక్షయాభ్యన్తశ్చంద్రవాసరభాజితాః

రధోనరాత్రిరహితాలంకార్యామర్ధరాత్రిక:

సావనోద్యూగసోరరాదిర్ధినమాసాబ్దయస్తత

పప్తభిః క్షపిత శ్శేషస్సూర్యాద్యో వాపరేశ్వరః

మాసాబ్దదినపంఖ్యాసం ద్విత్రిఘ్నం రూపసంయుతమ్

సప్తోర్ధనావ శేషౌ తౌ విజ్ఞేయా మాసవర్షపౌ

స్నేహస్య భగణాభ్యస్తో దీనరాశిః కువాసరైః

విభాజితో మధ్యగత్యా భగణాదిర్గృహో భవేత్

ఏవం హ్యశీఘ్రమందాచ్చ యే ప్రోక్తాః పూర్వపాపినః

విలోమగతయః పాతాః స్తద్వచ్చక్రోష్విశోధితాః

యోజనాని శతాన్యష్టౌ భూకర్ణౌ ద్విగుణస్స్మృతః

తద్వర్గతో దశగుణాత్పదభూపరిధిర్భవేత్

లంబజ్యాఘ్నస్వజీవాప్తస్ఫుటో భూపరిధిస్వకః

తేన దేశాంతరాభ్యస్తా గ్రహభుక్తిర్విరాజితా

కలాది తత్ఫలం ప్రార్చ్యా గ్రహేభ్యః పరిశోధయేత్

రేఖా ప్రతీచిసంస్థానే ప్రక్షి పేత్స్యుః స్వదేశతః

రాక్షసాతపదేవౌకశ్మైలయోర్మధ్యపూత్రగాః

అవంతికారో హతికం తథా సన్నిహితం సరః

వారప్రవృత్తివాగ్ధేశే క్షయార్దే భ్యధికో భవేత్

తద్దేశాంతరనాడీభిః పశ్చాదూనే వినిర్ధిశేత్

ఇష్టనాడీ గుణా భుక్తిష్టష్ట్యా భక్తా కలాదికమ్

గతే శోద్ధ్యం తథా యోజ్యం గమ్యే తాత్కాలి కోగ్రహః

భచక్రలిప్తాసీత్యంశః పరమం దక్షిణోత్తరమ్

విక్షిప్యతే స్వపాతేన స్వక్రాంత్యంతాదనుష్ణగుః

తత్ర వాసం ద్విగుణితం జీవస్త్రిగుణితం కుజః

బుధశుక్రర్కజాః పాతైర్విక్షిప్యంతే చతుర్గుణమ్

రాశిలిప్తాష్టమో భాగః ప్రథమం జ్యార్ధముచ్యతే

తతో ద్విభక్తులబ్ధోనమిశ్రితం తద్ద్వితీయకమ్

ఆద్యేనైవ క్రమాత్పిండా న్భక్తాల్లబ్లో నితైర్యుతాన్

ఖండకాస్స్యుచతుర్వింశా జ్యార్థపిండాః క్రమాదమీ

పరమాపక్రమజ్యా తు సప్తరంధ్రగుణేందవః

తద్గుణజ్యాతిజీవాప్తా తచాపక్రాంతిరుచ్యతే

గ్రహం సంశోధ్య మందోచ్చం తథా శీఘ్రద్విశోధ్య చ

శేషం కందపదం తస్మాత్ భుజజ్యాకోటిరేవ చ

గతాద్భుజజ్యావిషమే గమ్యాత్కోటిః పదే భవేత్

సమేతి గమ్యాద్భాహు జ్యాకోటిజ్యానుగతా భవేత్

లిప్తోస్తత్త్వ యమైర్భక్తా లబ్దిజ్యా పిండకం గతమ్

గతగమ్యాంతరాభ్యస్తం విభజేత్తత్త్వలోచనైః

తదవాస్తఫలం యోజ్యం జ్యాపిండే గతసంజ్ఞకే

స్యాత్క్రమజ్యావిధి శ్చైవముత్క్రమ జ్యాగతా భవేత్

జ్యాం ప్రోహ్య శేషం తత్త్వతాశ్విహంతం తర్వివరోద్ఘాతమ్

సంఖ్యా తత్త్వాశ్వసంవర్గ్యసంయోజ్యం ధనురుచ్యతే

ఖేర్మలదపరిశుద్ధ్యంశా మనవశ్శీతగోరదాః

యుగ్మాంతే విషమాంతే తు నఖలిప్తో నిరూస్తయోః

యుగాంతేర్ధాదయః భౌగ్నిసురాస్సూర్యా నవార్ణవాః

నాలుగు ఆకాశ సంఖ్యగల వత్సరములు నాలుగు సముద్రసంఖ్య గల వత్సరములు. యుగచూనము. దానిలో దంశాశములగు నాలుగు కలిసినపుడు కృతయుగము ఒక పొదమగును. మూడు దశాంశములు త్రేతాయుగము రెండవపాదమగును. రెండు దశాంశములు ద్వాపరయుగము మూడవపాదమగును. ఒక దశాంశము కలియుగము నాలుగవపాదమగును. డెబ్బదియొక్కయుగములు ఒక మనువు కాలము. బ్రహ్మకు ఒకపూటలో పదునలుగురు మనువులు ఉందురు. బ్రహ్మ రాత్రి కూడా అంతయే కాలముండును. బ్రహ్మ కౌలమును అయిదు భాగములుగా విభజించి అయిదవ భాగముచే ఖచరానయనమును చేయవలయును. ఇట్లు యుగాది నుండి చేయవలయును. ఒక యుగమున సూర్య బుధ శుక్రులకాలము యుగకాలముతో సమానము. శని గురు శుక్రులకు భగణ పూర్వకాలముగా గుర్తించవలయును. చంద్రునికి 577346 సంవత్సరముల కాలముగా తెలియవలయును. కుజునకు 226835 సంవత్సరములు కొలము. బుధునకు 1763160 సంవత్సరము. బృహస్పతికి 684281 సంవత్సరముల కాలము. శిత శీఘకాలము 712239 సంవత్సరముల కాలము. శనికి వేరొక కాలము 146561 సంవత్సరముల కొలము. ఉచ్చచంద్రునికి 418204 సంవత్సరముల కాలము. వామపాతకాలము 442241 సంవత్సరములు. సూర్యోదయము నుండి మరల సూర్యోదయము వరకు ఒకదినముగా భూలోకమున పరిగణింతురు. ఒక యుగమున 15727828 సంవత్సరములుండును. అధిమాసముల సంఖ్య 1524346 సంవత్సరములుగా నుండును. తిధి క్షయ కాలము 2518221 సంవత్సరకాలముండును. విమాసములు 1841111 సంవత్సరముల కాలముండును. మాసముల కాలము 1544336 సంవత్సరముల కాలముగా నుండును. సూర్యశనుల సంయోగకాలము 487 కల్పములుగా నుండును. కుజునకు 214, బుధకాలము 468, బృహస్పతికి 110, శుక్రునకు 560, శనిమందగతికి 54, లేదా పాతమునకు అనీ కూడా చెప్పవచ్చును. 142 కుజపొతమునకు, బుధునకు 488, బృహస్పతికీ 171, శుక్రునకు 914, శనిపాతమునకు 662 భగణములు, వర్తమానయుగమున పాతవత్సరములే భగణ నామముచే వ్యవహరించబడుచున్నవి. గడిచిన మధు శుక్లా మాసములచే మాసమానమేర్పడును. సూర్యాది గ్రహములకు విడిగా మాసనామము వ్యవహారమున కలదు. ఇపుడు అధిమాసములతో కలిసి యున్న మాసములను దినములుగా విభజించి, దీనములతో కూడిన వాటిని రెట్టింపు చేసినచో చంద్రవాసరములొచ్చును. రాత్రిలేని పగలును మాత్రమే లెక్కించి, అర్ధరాత్రికాలమును కలిపి సావనమానము చేసినచో అరాది దీనములు మాసములు, సంవత్సరములు కల్పించవచ్చును. మిగిలిన దానిని ఏడుతో భాగించినచో సూర్యాది వాసరములొచ్చును. ఆయావాసరములకు సూర్యాదులే అధిపతులు. మాసమును మొదలుకొని దినసంఖ్య వరకు లెక్కించిన దానిని రెంటితో భాగించి ఏడు కంటే ఎక్కువగా మిగిలిన సంఖ్యకు అధిపతియైన వారు మాసాధిపతియనీ, మూటితో భాగించినపుడు ఏడు కంటే ఎక్కువగావచ్చిన శేషసంఖ్యాధిపతియే సంవత్సరాధిపతిగా తెలియవలయును. కువాసరములతో కలిసిన దానిని భగణముతో రెట్టింపు చేసినచో దినవచ్చును. సగముగా విభజించినపుడు వచ్చినసంఖ్యకు భ గణాది నుండి లెక్కించగా అధిపతియగు గ్రహము తెలియును, ఇట్లు పూర్వపాపులుగా అశీఘ్రలు, మందులుగా చెప్పబడిన గ్రహములకు విలోమగతి ఏర్పడినపుడు పాతమని చక్రగతిని బట్టి తెలియవలయును. ఎనిమిదొందల యోజనములు భూకర్ణములుగా చెప్పబడినవి. ఒకవర్గము కంటే రెండో వర్గము రెట్టింపుగా నుండును. ఆ వర్గము కంటే పది రెట్లుగా నున్నది. భూపరిధి యగును. లంబము, జ్యాఘ్నము, స్వజీవాప్తముగానున్న స్పుటమగునది భూపరిధి. ఈ భూపరిధిలో దేశాంతర భాగములను రెట్టింపు చేసి గ్రహభుక్తిచే విభజించినపుడు కలాదులు తెలియును. ఆ ఫలములను గ్రహములనుండి శోధించి తెలియవలయును. తమ ప్రాంతమునుండి రేఖకు పశ్చిమదిశగా గీసి ఆస్థానమును సంఖ్యను వేయవలయును. రాక్షస, ఆతప, దేవనీవాస, పర్వత మధ్యభాగముల నుండి సూత్రమున అనుసరించు ఆరోహణావరోహణలను చూచుచు దగ్గరగా నున్న సరో ప్రాంతమును గుర్తించి, వారప్రవృత్తికి స్థానమైన వాకాంతమున క్షయ భాగమునలోని సగముకంటే ఎక్కువ భాగమునుంచవలయును. ఆ దేశాంతర నాడులచే పశ్చిమభాగమున తక్కువగా నిర్దేశించవలయును. ఇష్టనాడీగుణములు కలది భుక్తియగును. ఈ భుక్తిని ఆరు సంఖ్య చే భాగించిన కలాదికమగును. పూర్తిగా పోయినపుడు శోధించవలయును. అట్ల యోగము చేయవలయును. ఇట్లు చేసినపుడు వచ్చునది తాత్కాలికగ్రహము. భక్త చక్ర లిప్తాంశము గలది అంశియగును. దక్షిణోత్తరముగా నున్నది అంశమగును. చంద్రుడు తన పాతముచే సంక్రాంత్యంతము వరకు విక్షేపము చేయబడును. దానికి రెట్టింపుగా బృహస్పతి, మూడు రెట్లు కుజుడుండును. బుధ శుక్ర శనులు పాతములచే నాలుగు రెట్లు విక్షేపము చేయబడుదురు. రాశిలిపాష్టమ భాగము . మొదట జ్యార్థమనబడును. దానికంటే రెంటితో భాగించగా మిగిలిన దానికంటే తక్కువగా నున్నది కలిసి రెండవ జ్యార్ధమగును. మొదటిదానివలెనే క్రమముగా భాగముచే లభించిన శేషభాగములను లభించిన దానికంటే తక్కువగానున్న భాగములను కలిపినచో ఖండకములగును. ఇవి మొత్తము ఇరువదినాలుగు జ్యార్థ పిండములుండును. క్రమముగా అన్నిటికంటే పరమైనది అపక్రమజ్యార్థము 1607 గా తేలును. దీనికి మూడు రేట్లుగా గుణజ్యాయగును. చాపమును క్రాంతియందురు. గ్రహమును చక్కగా మందత్వమును, ఉచ్చత్వమును, శీఘత్వాదులనుండి శోధించి మిగిలిన దానిని కందపదముగా పేర్కొనవలయును. దీని నుండి భుజము, జ్యా, కోటి భాగములనేర్పరచవలయును. గతమునుండి భుజ జ్యాభాగములను విషమముగా, గమ్యమునుండి కోటి పదములో నుండును. గమ్యమునుండి వచ్చిన భుజ జ్యా భాగము సమకుని, దానిననుసరించి వచ్చునది కోటిజ్యాయగును. తత్త్వయమలచే విభజించబడిన లిప్తలు జ్య పిండమున లభింపచేయును. దీనినే గతమందురు. గతగమ్యములలోని బేధాభ్యాసమును తత్త్వజ్ఞానము కలవారు విభజించగలరు. అట్లు విభజించగావచ్చిన ఫలమును గతము అను సంజ్ఞకల జ్యా పిండమున కలుపవలయును. ఇట్లు క్రమజ్యావిధి యగును. ఇట్ల ఉత్కమ జ్యావీధి కూడా గతమనబడును. జ్యా భాగమును శుద్ధి చేసి మిగిలిన దానిని తత్త్వముతో భాగించిగా వచ్చినది వివరోద్ధృతమగును. సంఖ్యాతత్త్వము యొక్క అంశులతో సంవర్గ్యములతో కలిసిన దానిని ధనువు అందురు. సూర్యుని మంద పరిధి అంశములు మనవులు. చంద్రునికి ఇట్లుండును. యుగాంతమున, విషమాంతమున నలిప్త భాగమే ఆరెంటికి భేదము. యుగ్మాంతమున 491233413 గా భాగములేర్పడును.

ఓబేద్వ్యగా చ సుయమా రదారుద్ర గజాబ్ధయః

కుజాదీనామతశ్శౌధ్నా యుగ్మాంతేర్దాగ్నిదస్రకా

గుణాగ్ని చంద్రాఖనగా ద్విరసా క్షీణిగోఽగ్నయః

ఓజాంతే ద్వితయో మతా ద్వీవిశ్వే యమపర్వతాః

ఖర్తుదస్రవిపద్వేదా శీఘ్రకర్మణి కీర్తితాః

ఓజయుగ్మాంతరగుణా భుజజ్యాత్రిజ్యయోద్ధృతాః

యుగ్మవృత్తే ధనర్ణస్స్యారోజాదూనేఽధికే స్పుటమ్

తద్గుణే భుజకోటిజ్యే భగణాంశవిభాజితే

తద్భుజజ్యాఫలధనుర్మాందం లిప్తాదికం ఫలమ్

శైఘ్ర్యకోటిఫలం కేంద్రే మకరాదౌ ధనం స్మృతమ్

సంశోధ్యం తు త్రిజీవాయాం కర్కాదౌ కోటిజం ఫలమ్

తద్బాహుఫలవర్గైక్యాన్మూలకర్ణశ్చ లాభదః

త్రిజ్యాభ్యస్తం భుజఫలం ఫలకర్ణవిభాజితమ్

లబ్దస్య చాపం లిప్తాదిఫల శైఘ్ర్యమిదం స్మృతమ్

ఏతదాదౌ కుజాదీనాం చతుర్దే చైవ కర్మణి

మాంద్యం కర్మై కమర్కైర్ద్వౌ భౌమాదీనామథోచ్యతే

శైఘ్ర్యo మాంద్యం పునర్మాంద్యం శైఘ్ర్యo చత్వార్యనుక్రమాత్

అజాది కేంద్రే సర్వేషాం మాంద్యే శైఖ్యే చ కర్మణి

ధనం గ్రహాణాం లిప్తాదితులాదావృణమేవ తత్

అర్కబాహుఫలాభ్యస్తా గ్రహభుక్తివిభాజితాః

భచక్రకలికాభిస్తు లిప్తాః కార్యా గ్రహేఽర్కవత్

గ్రహభక్తః ఫలం కార్యం గ్రహవన్మందకర్మణి

కర్కాదౌ తద్ధనం తత్ర మకరాదావృణం స్మృతమ్

దోర్జ్యోత్తరగుణా భుక్తిస్తత్త్వనేత్రోద్ధృతా పునః

స్వమందపరిధిక్షుణ్ణా భగణాంశోద్ధృతాః కలాః

మందస్ఫుటకృతా భక్తి ప్రొహ్య శీఘ్రోచ్చభుక్తితః

తచ్ఛేషం వివ రేణాథ హన్యాత్త్రిజ్యాంకకర్ణయోః

చక్రకర్ణహృతం భుక్తీ కర్ణే త్రిజ్యాధికే ధనమ్

ఋణమానేఽధికే ప్రొహ్య శేషం వక్రగతిర్భవేత్

కృతర్తు చంద్రైర్వేదేంద్రై శూన్యత్ర్యైకైర్గుణాష్టభిః

శరరుద్రైశ్చతుర్యాంశుకేంద్రాంశైర్భూసుతాదయః

వక్రిణశ్చక్రశుద్ధైస్తైరంశైరుజుతి వక్రతామ్

క్రమజ్యా విషువద్భాఘ్నిక్షితిర్ష్యాద్వాదశోద్ధతా

త్రిజ్యాగుణా దీనవ్యాసభక్తా చాపం చ శత్రవః

తత్కార్ము కముదక్రాంతౌ ధన హీనో పృథక్ క్షతే

స్వాహోరాత్రచతుర్భాగే దినరాత్రిదలే స్మృతే

యామ్యకాంతా విపర్య స్తే ద్విగుణితే దినక్షయే

భభోగోఽష్టశతీర్లిప్తాస్వాశ్వ శైలోస్తథా తిథే

గ్రహలిప్తా భగా భోగా భావి భుక్త్యా దినాదికమ్

రవీందుయోగలిప్తాస్తు యోగా భభోగభాజితాః

గతగన్యూశ్చ షష్ఠిఘ్నా భుక్తియోగాస్త్రనాడికాః

అర్కోన చంద్రలిప్తాస్తు తిథయో భోగభాజితాః

గతగమ్యాశ్చ షష్టిఘ్నా నాతోభుక్తతరోద్ధజాః

తిథయశుక్లప్రతిపదో ద్విఘ్నాస్సైకా నగా హతాః

శేషం బవో బాలవశ్చ కౌలవస్తైతిలో గరః

వణిజోఽభౌ భవేదిష్టిః కృష్ణభూతో పరార్ఖతః

శకునిగ్నాగశ్చ చతుష్పద కింస్తుఘ్న మేవ చ

శిలాతలే చ సంశుద్దే వజ్రలేపే తథా పమే

తత్ర శకాంగులైరిష్టైస్సమమండలమాలిఖేత్

తన్మ ధ్యే స్థాపయేచ్ఛంకుం కల్పనా ద్వాదశాంగులమ్

తచ్ఛాయాగ్రం స్పృ శేద్యత్ర దత్తం పూర్వాపరాజ్ఞాయోః

తత్ర బంధుం విధాయోభౌ వృత్తే పూర్వాపరాభిధే

తన్మ ధ్యే తిమీనా రేఖా కర్తవ్యా దక్షిణోత్తరా

యామ్యోత్తరదిశోర్మధ్యే తిమీనా పూర్వపశ్చిమా

ద్విజ్మధ్యమత్స్యైః సంసాధ్యా విదిశస్తద్వదేవ హీ

చతురస్తం బహిః కుర్యాత్ సూత్రైర్మధ్యాద్వినిస్సృతైః

భుజసూత్రాంగులైస్తత్ర దత్తైరిష్టప్రభా మత

ప్రాక్పశ్చిమా శ్రీతా రేఖా ప్రోచ్యతే సమమండలమ్

భ మండలం చ విషువత్ మండలం పరికీర్తితమ్

రేఖా ప్రాద్యపరా సాధ్యా విషువద్భాగ్రయా తథా

ఇష్టఛాయా విషువతోర్మధ్యే హ్యగ్రాభిధీయతే

శంకుచ్ఛాయాకృతియుతేర్మూలం కర్ణోఽయువర్గతః

ప్రొహ్య శంకుకృతే యుతే ఛాయా శంకువిపర్యయాత్

త్రింశత్కృత్యో యుగే బొనాం చక్రం ప్రాక్పరిలంబతే

తద్గుణాద్భదినైర్భక్త్యా ద్యుగణాద్యదవాప్యతే

తద్దో స్త్రీఘ్నాదశాఘ్నాంతా విష్ణోయా అయతాభిదా

తత్సంస్వ కృతార్దాసత్కాంతిచ్ఛాయానరదలాదికమ్

శంకుచ్ఛాయా హతే త్రిజ్యే విషువత్కర్కభాజితే

లంబాక్షజ్యే తయాశ్చాయే లంబాక్షాదక్షిణౌ సదా సాక్షార్కాపక్రమాయుతిర్దిక్సామ్యెంతరమన్యథా

శేషహ్యానాంశాః సూర్యస్య తద్బాహుజ్యాధకోటిజాః

శంకుమానంగులాభ్య స్తే భుజత్రిజ్యే యథాక్రమమ్

కోటిజ్యయా విభజ్యాప్తే ఛాయాకర్ణా బహిర్దలే

స్వాక్షార్కశతభాగానాం దిక్సామ్యేంతర మన్యథా

దిగ్భేదోపక్రను శ్శేషస్తస్య జ్యోత్రిజ్యయాహతా

పరమోపక్రమఙ్యప్త చాపమేషాదిగో రవిః

కర్కాదౌ పోహ్య చక్రార్ధా తులాదౌ భార్ధసంయుతాత్

మృగాదౌ ప్రోహ్య చక్రాట్లు మధ్యాహ్నోఽరస్ఫుటో భవేత్

తన్మన్దమసకృద్వామం ఫలం మధ్య దివాకరః

గ్రహోదయాః ప్రాణహతాః ఖఖాష్టైకోద్ధతా గతిః

చక్రాసవో లబ్ధయుతీ స్వాహోరాత్రాసకస్స్మృతాః

త్రిభద్యుకర్ణార్ధగుణా స్వాహో రాత్రార్ధభాజితాః

క్రమాదేక ద్వీత్రిభాజ్యా తచ్చాపాని పృథక్ఫథక్

కుజాదులకు ఆయుగాంతమున అయిదున్నరలో లెక్కించవలయును. 4126271146 గా సంఖ్యలు తెలియవలయును. ఓజాంతమున 7222232 సంఖ్యలు తెలియవలయును. గ్రహముల శీఘకర్మలను 4726! సంఖ్యలు తెలుపును. ఓజో యుగ్మాంతర గుణములు భుజ, జ్యూ, త్రిజ్యలతో ఉద్దరించబడును. యుగ్మవృత్తమున్న చో ధనమును అప్పుచేయువాడగును. ఓజము కంటే తక్కువగా ఉన్నను, ఎక్కువగా ఉన్నను స్పుటఫలితము తెలియును. ఓజగుణమును భుజ, కోటి, జ్యా భాగములలో భగణాంశములతో విభజించినపుడు భుజ జ్యా ఫలము ధనువైనపుడు మందగతియని, లిప్తాదికములు ఫలముగా తెలియును. కేంద్రమున శేఘ్యకోటి ఫలము, మకరాదులలో నైనచో ధనము ఫలమనీ చెప్పబడినది. త్రిజీవభాగమును శోధించినపుడు కర్కాదులలో నైనచో కోటిజము ఫలమగును. భుజ భాగ ఫలవర్గము ఐక్యమైనచో మూలమగుకర్ణము చలమనబడును. శ్రీజ్యాభ్యస్తమే భుజఫలము ఇదియే ఫల భాగ కర్ణముతో విభజించబడును. విభాగము చేసినపుడు లబ్దమైన భాగము యొక్క చాపమే లిప్తాదులను తెలుపును. దీని ఫలము శైఘ్యాదికమని తెలియుము. ఇట్లు కుజాదులకు చతుర్ధకర్మలో మాంద్యము కర్మగా నుండును. సూర్యునిలో ఒకటి, కుజాదులకిపుడు చెప్పెదను. శీఘ్రత, మాంద్యము, మరల మాంద్యము శీఘ్రత ఇట్లు వరుసగా నాలుగు సంభవించును. అన్ని గ్రహములకు మేషాని కేంద్రములందు మాంద్య శీఘ్రకర్మలలో లిప్తాదుల ఫలము ధనముగా తెలియును. తులాదులలో నైనచో ఫలము ఋణము. సూర్యభుజ ఫలమును రెట్టించినచో, గ్రహభుక్తితో విభజించబడి భచక్రళలినాదులతో కలిసిన లిప్తలను సూర్య గ్రహమునందువలె చూడవలయును. మందకర్మలో గ్రహమువలే గ్రహభక్తమును ఫలముగా చేయవలయును. అట్లు చేసినపుడు కర్కాదులొచ్చినచో ధనమని, మకరాదులోచ్చినచో ఋణమనీ తెలియవలయును. భుజభాగము జ్యూభాగము తరుపోత గుణభుక్తి చతురులైన. చారిచే ఉద్దరించబడినపుడు స్వమందపరిధిచే క్షుణ్ణమై భగణాంశములచే ఉద్ధరించబడిన కలలు మందస్ఫుటములుగా చేయబడిన భుక్తి శీఘ్ర ఉచ్చ భుక్తి చే శోధించబడి మిగిలిన దానిని వివరముచే కొట్టివేయవలయును. ఈ కొట్టివేత కూడా త్రి ,జ్యాంకభాగమున కర్ణములయందు మాత్రమే చేయవలయును. చక్రకర్ణ హృతమే భుక్తిలో ప్రాజ్యాధిక కర్ణములో నున్నచో ధనము. ఫలమని చెప్పవలయును. తక్కువగా ఉన్నచో ఋణము ఫలముగా తేలును. అధికమున శుద్ధిచేయగా మిగిలినది వక్రగతిగా తెలియవలయును. 6, 1, 4, 1, 0, 1, 1, 6, 8, 5, 11, లలో చతుర్థాంశ కేంద్రాంశములలో కుజాదులున్నపుడు వక్రులుగా, చక్రశుద్ధాంశలచే రుజువక్రతలను తెలియవలయును. క్రమ జ్యభాగము విషువు వలే నక్షత్రముచే కొట్టి వేయవలయును. పన్నెండునుండి ఉద్దరించబడిన క్షితిజ్యాభాగము, త్రిజ్యా భాగముచే గుణించినపుడు దీనవ్యాస భక్త మైనచో చాపము వచ్చిన శత్రువృద్ధి ఫలమగును. ఆ చాపము ఉదకొంతమైనపుడు, విడివిడిగా కొట్టివేయబడినపుడు ధన హీనుడగును. తన తన అహోరాత్రముల చతుర్బాగమున దినరాత్రి భాగములుండును. యామ్య కొంతిలో, విపర్యస్తముగా నున్నపుడు, దినకయమున దీనిని రెట్టింపు చేయవలయును. నక్షత్రభుక్తి ఎనిమిదివందల లిప్తలు. తిథి భుక్తి 72గా ఉండును. గ్రహలిప్తలు నక్షత్ర భుక్తులు, నక్షత్రములు, భుక్త్యాదులచే దినాదికమును తెలియవలయును. సూర్యచంద్రయోగ లిప్తలు మాత్రము నక్షత్రభుక్తులచే విభజించబడినపుడుగా యోగములుగా తెలియును. గతములు గమ్యములు అరవైచే కొట్టివేసినచో భుక్తియోగముచే నాడీ విభాగములను పొందును. సూర్యలిప్తలకంటే తక్కువగానున్న చంద్రలిప్తలు భుక్తిచే విభజించబడి తిథులగును. - ఇవి కూడా గతములు గమ్యములు ఆరవై సంఖ్యచే కొట్టబడును. ఇంతకంటే భుక్తి ఇక ఉండదు. శుక్ల ప్రతిపత్ మొదలగునవి తిథులు. రెంటితో కొట్టబడును. ఏడుతో కొట్టబడినచో ఒక ఓ యగును. మిగిలినవి బవ, బాలవ, కౌలవ తైతుల, గరములను పేర్లను పొంది కరణములగును. అభ్రమున వణిజులున్నచో విష్టియగును. పరార్దభాగము కృష్ణపక్షమగును. శకుని, నాగము, చతుష్పదము, కింస్తుఘ్నము అను నామము లేర్పడును. శిలాతలమువలె శుద్ధి చేసినపుడు, వజ్రలేపమువలె సమముగా చేసి భాగమున ఇష్టమైన అంగుళులచే సమమండలమును లిఖించవలయును. ఆ మండల మధ్యభాగమున శంకువును స్థాపించవలయును. శంకువు ద్వాదశాంగులి పరిమితము కావలయును. శంకుచ్చాయాగ్రము తాకిన ప్రదేశము పూర్వాపరాహ్లాదత్తమగును. అచట బిందువునుంచి పూర్వఅపర అను పేర్లుగల రెండు వృత్తముల నేర్పరచవలయును. ఆ రెండు వృత్తముల మధ్యలో అంచుతో దక్షిణోత్తరముగా రేఖ నేరపరచవలయును. దక్షిణోత్తర దిక్కుల మధ్యమున అంచుతో పూర్వపశ్చిమ దిశలకు ఒక రేఖను ఏర్పరచవలయును. దిక్కులమధ్యనున్న మత్స్యములచే విదిక్కులను కూడా గుర్తించవలయును. మధ్యభాగము నుండి వెడలిన సూత్రములచే బయటికి చతురస్రమును చేయవలయును. భుజ సూత్రాంగులములచే దత్తమగునది ఇష్టపభయనబడును. తూర్పు, పశ్చిమములనాశ్రయించిన రేఖ సమమండలమనబడును. నక్షత్రమండలము కూడా విషువు వలె నుండునని చెప్పబడినది. తూర్పు పశ్చిమములలో నున్న 'రేఖకు విషువువలె నక్షత్రాగ్ర భాగముగా సాధించవలయును. ఇష్టచ్చాయ విషువత్తుల మధ్యనున్నది అగ్రాయనబడును. శంకుచ్ఛాయా కృతిచే కూడిన దాని మూలము యవర్గనుండి కర్ణభాగమగును. శంకును పరిశుద్ధి చేసినపుడు మూలమని, శంకు విపర్యయము వలన ఛాయయని వ్యవహరించబడును. నక్షత్రచక్రము యుగమున ముప్పది భాగములుగా తూర్పుభాగమున వ్రేలాడును. దానిని గుణించుట వలన నక్షత్రదినములతో విభజించుట వలన ఆకాశ భాగమున లభించు భాగము రెంటిలో మూటితో పదితో కొట్టివేయబడినపుడు ఆయనమేర్పడును. దానిని చక్కగా విభజించినపుడు కాంతి ఛాయలేర్పడును. ఇవియే శుక్లకృష్ణపక్షములు. త్రిజ్యము శంకు ఛాయచే కొట్టబడినపుడు విషువత్ కర్కభాగము చేయబడినపుడు లంబాక్టజ్యా భాగములు వాటి ఛాయలగును. లంబాక్షములు ఎపుడూ దక్షిణమున నుండును. సాక్షాత్తు సూర్యునిచే కాని అపక్రమముగా కాని కలిసియున్నది దిక్సామ్యమగును. లేనిచో భేదమేర్పడును. మిగిలినవి సూర్యాంశలు. ఇవియే భుజ జ్యా కోటి భాగముల వలన ఏర్పడునవి. శంకుమానమును అంగులములచే రెట్టింపు చేసి యథాక్రమముగా భుజములను త్రిజ్యమును సాధించవలయును. కోటి జ్యాభాగములచే విభజించగా లభించిన దానియందు బయటిదలమున ఛాయా కర్ణము ఏర్పడును. స్వాక అర్కనత భాగములకు దిక్సామ్యము, ఇతరత్ర భేదమును గుర్తించవలయును. దిగేదోపక్రమము శేషమగును. త్రిజ్యముచే కొట్టబడినది జ్యా భాగమగును. పరమోపక్రమమున జ్యా భాగమున పొందిన చాపమున సూర్యుడు మేషాది రాశి గోచరుడగును. సంశుద్ధి చేసిన చక్రార్ధ భాగమువలన కర్కాది. రాశి గోచరుడగును. నక్షత్రార్ధసంయుతి వలన తులాది గోచరుడగును. సంశుద్ధి చేయబడిన చక్రమువలన మృగాది నక్షత్రములలో మధ్యాహ్న సూర్యుడు స్పుటముగా గోచరుడగును. ఆభాగము మందమైనను, చాలాసార్లు వామమైనను దివాకరుడు మధ్యమున నున్నడని ఫలము. ప్రాణహతులు గ్రహోదయమును తెలుపును. 1, 1, 8 సంఖ్యలచే కొట్టబడి గతిని తెలుపును. చక్రాసువులు లబ్దముతో కలిసి అహోరాత్రాసువులు గా పేర్కొనబడును. మూడుమార్లు నక్షత్రాంశముచే ఆకాశాంశముచే కర్ణభాగమున అర్థభాగగుణములు అహోరాత్రార్థభాగముచే విభజించబడును. విడిగా ఒకటి, రెండు, మూడు సంఖ్యలచే విభజించబడి వేరు వేరు చాపములుగా నుండును.

స్వాధోఽధః ప్రవిశేధ్యాత మేషాల్లింగోదయాసవః

స్వాగాష్టయోఽర్ధా గోగైకాః శిరత్ర్యైకం హిమాంసవః

స్వదేశచరఖండోనా భవంతీ ష్టోదయాసవః

వ్యస్తా వ్య సైర్యుతాస్తై స్తైః కర్కటాద్యాప్తతస్తు యః

ఉత్క్రమేణ షడేవైతే భవన్తిష్టాస్తులాదయః

గతభోగ్యాసవః కార్యా సాయనా స్స్యేష్టభాస్కరాః

స్వోదయాత్సుహతా భక్తా భక్తభోగ్యాస్వమానవతః

అభీష్టఘటికాసుభ్యో భోగ్యాసూన్ప్రవిశోధయేత్

తద్వదేవేష్య లగ్నాసూన్ ఏవం వ్యాపాస్తథా క్రమాత్

శేషం త్రింశత్క్రమాద్వ్యస్తమశుద్ధేన విభాజితమ్

భాగయుక్తం చ హీనం చ వ్యయనాంశం తనుః కుజే

ప్రాక్పశ్చాన్నతనాడీభ్యస్తద్వల్లంకోదయాసుభిః

భానౌ క్షయధనే కృత్వా మధ్యాల్లగ్నం తదా భవేత్

భోగ్యాసూనూనకస్యాథ భక్తాసూనధికస్య చ

సపిండ్యాంతరలగ్నాస్తూనేవం స్యాత్కాలసాధనమ్

విరాహ్వర్కభుజాంశాశ్చేదింద్రాల్పః స్యాద్గ్రహో విధోః

తేషాం శివఘ్నా శ్శైలాప్తా వ్యావరాజశ్శరోంగులై

అర్కం విధు వీధుర్భూభా ఛాదయత్యథ ఛన్నకమ్

ఛాద్య ఛాదకమానార్ధం శరోనం గ్రాహ్య వర్జితమ్

తత్స్వచ్ఛన్నం చ మానైక్యార్థాంశషష్ఠం దశాహతమ్

ఛన్నఘ్నమస్మాన్మూలంతు ఖాంగోనగ్లౌవపుర్హృతమ్

స్థిత్యర్థం ఘటికాదిస్యాద్వ్యంగబాహ్వంశసంమితైః

ఇష్టైః ఫలైస్తదూనాఢ్యం వ్యగావూనేఽర్కషడ్గుణః

తదన్యధాదికే తస్మి న్నేవం స్పష్టే సుఖాంత్య గే

గ్రాసేన స్వాహతే ఛాద్యమానా మే స్యుర్విశోషకాః

పూర్ణాంతం మధ్యమత్రస్యాద్ధర్శాంచేంజం త్రిభోనకమ్

పృథక్తత్క్రాంత్యక్ష భాగసంస్కృతా స్యుర్నతాంశకాః

తద్ద్విఘ్నంశకృతిద్వ్యూనార్థార్కాంశయుతా హరిః

త్రిభానాంగార్క విశ్లేషాంశోంశోనఘ్నాః పురందరాః

హరాప్తాలంబనం స్వర్ణ విత్రిభ్రాధికోనకే

విశ్వఘ్నలంబనకలాడ్యోఖాస్తు తిథివహ్యాగుః

శరోనో లంబనషడ ఘ్నే తల్లవాడ్యోనవిత్రిభాత్

నతాంశాస్తజాంసానేషు ప్రాధృతస్తద్వివర్జితః

శబ్ధైర్లుల్లిప్తై షడ్భిస్తు భక్తానతిర్నతాంశదిక్

తయోర్నాట్యోహభిన్నైకడిక్శరస్ఫుటతాం వ్రజేత్

తతశ్చన్న స్థితిదలే సాధ్య స్థిత్యర్ధషట్రిభిః

అంశైస్తైర్విత్రిభిర్ద్విస్థం లంబనేతయో పూర్వవత్

సంస్కృతేస్తాభ్యాం స్థిత్యఛే అత్యంతం భవతస్థౄటే

తాభ్యాం హీనయుతో ప్రధ్య దర్శః కాలౌ ముఖాంతగా

అర్కాద్యూనా విశ్వ ఈశా నవ పంచ దశాంశకాః

కాలాంశాస్తైరూనయుక్తే రవౌ హస్తోదయా విధోః

దృష్ట్వా హ్యాదౌ భేటబింబం దుగొచ్చ్యే లంబమీక్ష్య చ

తల్లంబపాపబింబాంతర్దృగౌ వ్యాప్త రవిఘ్నభాః

అస్తే సావయవా జ్ఞేయా గతేష్యాస్తిధయో బుధైః

వస్తేయుక్రాంతిభా గైశ్చ ద్విఘ్న తిధ్యాహృతా స్ఫుటమ్

సంస్కారాదికలంబినం త్వంగులద్యం ప్రజాయతే

పేష్వాంశోనాః సితం తిథ్యో బలాన్నాశోన్నతం విధః

శృంగమన్యత్ర ఉద్వాచ్యం బలనాంగులలేఖనాత్

పంచత్వేగోంక విశిఖా శ్శేషకర్ణహృతాః పృథక్

వికృజ్యకాంగ సిద్ధాగ్నిభక్తాల్లఙ్ఞానసంయుతాః

త్రిజ్యాధికోనే శ్రవణే వపూంషి స్యుర్హతాః కుజాత్

రుజ్వోరనుజ్వోరివరం గత్యంతరవిభాజితమ్

వక్రత్వే గతియోగా మం గమ్యేఽతీతే దినాదికమ్

ఖనత్యా సంస్కృతౌ వేఘాదక్సామ్యేన్యేంతరే యుతిః

యామ్యోద కే ఖేట వివరం మానేక్యాద్ధోఽల్పకం యదా

యదా భేదో లంబనాద్యం స్ఫుటార్థం సూర్యపూర్వవత్

ఏకాయనగతౌ స్యాతాం సూర్యచంద్రమసౌ యదా

తయుతే మండలే క్రాంత్యా తుల్యత్వే వైధృతాభిధః

విపరీతాయనగతౌ చంద్రార్కె క్రాంతిలిప్తకాః

సమస్తదా వ్యతీపాతో భగణార్దే తపోయుతా

భాస్కరేంద్వోర్భచక్రాంతచక్రార్ధావధిసంస్థయోః

దృక్కల్పసాధితాంశాదియుక్త మోస్వావపక్రమౌ

అధోజపదగమ్యేందోః క్రాంతిర్విక్షేపసంస్కృతా

యది స్యాదధికా భానోః క్రాంతేః పాతో గతస్తదా

న్యూనాచేత్స్యాత్తదా భావీ వామం యుగ్మపదస్య చ

యదాన్యత్వం విధోః క్రాంతిః క్షేపాచ్చేద్యది శుద్ధ్యతి

కాంత్యోర్జే త్రిజ్యయాభిస్తే పరమాయక్రమోద్ధతే

తచ్చాపాంతర్మర్ధవాయోర్జ్యభావినసీతగౌ

శోధ్యం చంద్రాద్గతే పాతే తత్సూర్యగతితాడితమ్

చంద్రభుక్త్యా హృత్ భానౌ లిప్తాదిశశివత్సలమ్

తద్వచ్ఛశాంకపాతస్య ఫలం దేయం విపర్యయాత్

కర్మైతదసకృత్తావత్ క్రాంతి యావత్సమే తయోః

క్రాంత్యోస్య మత్వే పాతోఽధ ప్రక్షిప్తాంశోనితే విధా

హీనేఽర్ధరాత్రికాఘాతో భావీతత్కాలికేఽధికా

స్థిరీకృతార్థరాత్రార్దౌ ద్వయోర్వివరలిప్తకాః

షష్టిశాచంద్రభుక్తార్తె పాతకాలప్య నాడికాః

రవీందోర్మానయోగార్థం షష్ట్యా పంగుణ్య భాజయేత్

తయోర్భుక్త్యంతరేణాప్తం సీత్యర్ధం నాడికాదివత్

పాతకాలస్తుటో మాధ్యస్సోఽపిస్థిత్యర్ధవర్జితః

తస్య సంభవకాలస్యాత్తత్సంయోగోక్తసంజ్ఞకః

ఆద్యంతకాలయోర్మధ్యే కాలో జ్ఞేయోఽతిదారుణః

ప్రజ్వలజ్జ్వలనాకారస్సర్వకర్మసు గర్హితః

ఇత్యేతద్గణితే కించిత్ ప్రోక్తం సంక్షేపతో ద్విజ

జాతకం వచ్మి సమయాద్రాగిసంజ్ఞాపురస్సరమ్

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే జ్యోతిషవర్ణనం నామ చతుఃపంచాశత్తమోఽధ్యాయః

మేషరాశి నుండి లంబోదయాసువులను క్రిందుగా శోధించి 8, 4, 2, 3 లతో విభజించి, 5, 3, 1 లుగా శేషము లంభించిన చంద్రలిప్తలని తెలియవలయును. తమ ప్రదేశభాగమున చరించుభాగమున కంటే తక్కువగా నున్నచో ఇషోదయాసువులగును. వ్యస్తములచే అవ్యస్తములచే కూడినవై కర్కటాదులగును. ఈ ఆరే ఉతమముగా తులాదులగును. స్వేషాంశలగు భాస్కరాంశలను భోగ్యాసువులను తీసివేయవలయను. తమ తమ ఉదయమునుండి చక్కగా కొట్టివేయబడి విభజించబడి, భోగ్యములను విడిగా విభజించి తమ తమ మానముననుసరించి అభీష్టఘటికాసువులనుండి భోగ్యాసువులను శుద్ధిచేయవలయును. ఇట్ల ఏష్యలగ్నాస్తువులను కూడా శుద్ధిచేయవలయును. ఇట్ల క్రమముగా వ్యాప్తి చెందును.మిగిలిన దానిని 30 తో వ్యస్తమగుదానిని శుద్ధిచేయబడని దానిచే విభజించి భాగయుక్తమును, భాగహీనమును వ్యయనాంశమును వేరుచేసి,. కుజతనుక్రీగా గుర్తించవలయును. తూర్పుపశ్చిమములలో నినతనాడుల నుండి, అట్లే లంకోదయాసువులచే సూర్యునిలో క్షయ ధన భాగములనేర్పరిచినపుడు మధ్యలగ్న మేర్పడును. భోగ్యాసువులు తక్కువగానుండి, భుక్తాసువులధికముగా నున్నచో అంతరలగ్నాస్తువులను చక్కగా శోధించి కాలమును సాధించవలయును. రాహువులేని సూర్యభుజాంశములున్నచో చంద్రగ్రహమున ఇంద్రాల్పములగును. వాటిని పదకొండుచే కొట్టివేసి ఏడును కలిపి 5, 10 చే విభాగముచేసి అంశములను తెలియవలయును. సూర్యుని చంద్రుడు, చంద్రుని కుజుడు కప్పివేయును. ఛైద్య ఛాదక మానారమునకు అయిదు తగ్గించి గ్రాహ్యవర్జితముగా దానిని స్వచ్ఛన్నమును చేసి మానైక్యార్ధాంశములో ఆరవభాగమును అందానిని మూలముగా ఛన్నఘ్నమును స్వాంగోనముగా చంద్రతను హారమును నిలుపుటకు ఘటికాదులుపయోగించును. ఇవి కూడా వ్యంగములైన భుజాంశసమ్మితములచే చేయబడును. ఇపుడు ఇష్టఫలములచే తక్కువగా నున్నదానిని సూర్యుని భాగములో ఆరుగుణములగును. ఒకవేళ ఎక్కువగా నున్నచో దానిలోనే భాగములేర్పరుచవలయును. ఇట్లు సుఖాంత్యభాగము స్పష్టమగును. గ్రాసము స్వాహతమైన దానిలో, ఛాద్యమానమానములో విశోషకములేర్పడును. ఇచ్చట పూర్ణాంతము మధ్యమమగును. దశాంతమున మూడు నక్షత్రములు తక్కువగా నుండును. విడిగా ఆయాక్రాంతి అక్షభాగములచే సంస్కరించినపుడు నతాంశములేర్పడును. వీటిని రెంటితో కొట్టివేసినచో వచ్చిన అంశకృతులలో రెంటిని తగ్గించి సగము సూర్యాంశలతో కలిపి హారము చేయవలయును. మూడు నక్షత్రములతో తేలిన అంగాంశములనుండి సూర్యాంశలను విడదీసి వచ్చిన అంశలకంటే తక్కువ అంశలతో కొట్టివేసినచో ఇంద్రలిప్తలగును. తీసివేయగా పొందిన అంశలను ఆలంబనముగా చేసుకొని సూర్యాంశలకంటే అధికమా న్యూనమా చూచి విశ్వఘ్నలంబనకలల కంటే తక్కువగా నున్నచో తిథులగును. అయిదు అంశలకంటే తక్కువగా ఉండి మొత్తము భాగమును ఆరుచే కొట్టివేసినచో ఆలవలలో తక్కువగా నున్నవి నక్షత్రాంశములగును. నతాంశములు వాటివలన కలిగిన అంశములు ప్రాధృతమగును. ప్రాధృతవర్షితమైనపుడు ఆరు చంద్రలిప్తలచే విభజించబడినవి నతాంశములు దిక్కును సూచించును. ఆ రెంటిలో భిన్నత్వమును చూచి ఒకదిక్కు స్పుటత్వమును పొందును. అపుడు కప్పివేసిన స్థితి పక్షమును సాధించదలిచినపుడు స్త్రీత్యర్ధముచే ఆరింటిచే మూడింటిచే అంశలను కనుగొని ఆయంశలచే జంటలుగా నున్న నక్షత్రాంశములను రెండింట ఉంచి వేరుచేయుట మొదటివలెనే అని తెలియవలయును. ఇట్లు సంస్కరించినచో వాటినుండి స్త్రీత్యర్ధములు స్పుటమగును. వాటితో హీనమగునపుడు మధ్యదర్శము. కాలములుగా ముఖాంతగములగును. సూర్యుని కంటే తక్కువగా నున్న విశ్వ ఈశాంశములు నవపంచదంశాంశకములే యగును. కాలాంశల కంటే తక్కివ అంశలతో సూర్యుడు కూడియున్నపుడు చంద్రుని అస్తోదయములగును. మొదట సూర్యబింబమును చూచి ఉచ్చవీక్షణమున లంబమును చూచి లంబ పాపబింబాంతర దృష్టులు సూర్యుని వ్యాపించు నక్షత్రములచే కొట్టబడినపుడు అస్తమయమునందు సావయవములు ఏష్యములేని తిథులు ఉండునని పండితులు తెలియవలయును. వ్యస్తముగా నున్నపుడు వ్యుత్కాంతి భాగములచే ద్విఘ్నతిథులతో ఆహృతములు స్పుటముగా తెలియవలయును. సంస్కారాది వలంబనము అంగులాద్యముగా కలుగును. అయిదంశలకన్నా తక్కువైనవై శుక్లపక్షము తిథులను తెలియవలయును. అట్లు కానిచో చంద్రునికి నాశోన్నతముగా గుర్తించవలయును. అంగులలేఖనమున శృంగమును వేరు ప్రదేశమున ఉన్నతముగా చూపవలయును. అయిదు అంశలున్నపుడు పది హేను అంశలు శేషకర్లప్పతములను వేరుగా చూపవలయును. శ్రవణా నక్షత్రము త్రిజ్యము కంటే అధికము కాని న్యూనము కాని అయినపుడు కుజుని వలన తను భాగములు హరించబడును. ఋజు ఋజు భిన్నముల వివరమును గత్యంతరముచే విభాగము చేయబడి వక్ర ఋతువులు విషయమున గతియోగామమును గమ్యము అతీతమైనచో దినాదికమని తెలియవలయును. దక్షిణోత్తర భేట వివరము మానైక్యమున అల్పముగా నున్న చో, భేదలంబనము మొదటున్నపుడు స్పుటమును తెలియుటకు సూర్యుని విషయమున మొదట చేసినట్లే చేయవలయును. సూర్యచంద్రులు ఒకే అయనమున నున్నచో విషమముగా నున్నపుడు క్రాంతిమండలములని, సమముగా నున్న చో ధృతమని తెలియవలయును. సూర్యచంద్రులు విపరీతాయనమున నున్న చో క్రాంతిలిప్తలుగా తెలియవలయును. సూర్యచంద్రులు సములైనచో వ్యతీపాతమనీ, భగణార్గమున తపోయుతులుగా తెలియవలయును. సూర్య చంద్రులు భచక్రాంతచక్రార్ధమున నున్న చో దక్కలముచే సాధించబడిన అంశములతో కూడియున్నచో అపక్రమములని తెలియవలయును. చంద్రుడు ఉచ్చపదమున సూచించబడినపుడు క్రాంతి విక్షేప సంస్కృతమై సూర్యుని కంటే అధికముగా నున్నచో క్రాంతి పాతమగునని తెలియవలయును. న్యూనమైనచో వామభావిగా తెలియవలయును. చంద్రక్రాంతి విడిగా యుండి క్షేపముచే శుద్ధి పొందినచో క్రాంతి ఉర్టలు త్రిజ్యముతో భాగించబడి పరమాయక్రమోద్దతములై చాప మధ్యభాగమున జ్యాభాగములో సూర్యచంద్రులున్నపుడు చంద్రునినుండి గతమగు పాతము సూర్యగతి తాడితమగుచో శోధించవలయును. సూర్యునిలో చంద్రభుక్తిచే లిప్తాదులు హృతమైనపుడు చంద్రుని వలెనే ఫలమును తెలియవలయును. ఇట్లే విపర్యయముగా చంద్రపొతఫలమును తెలియవలయును. ఇట్లు ఇద్దరి క్రాంతులు సమముగా వచ్చువరకు ఇట్లు చాలామార్లు చేయుచుండవలయును. ఇట్లు రెండు క్రాతులు సమములైనపుడు చంద్రుడు ప్రక్షిప్తాంశకు తగ్గినపుడు పాతమును తెలియవలయును. పొతములేనపుడు అర్థరాత్రికాఘాతమగును. అధికమైనపుడు తాత్కాలికాఘాతమగును. అర్థరాత్రార్ధములు స్థిరముగా చేసినపుడు సూర్య చంద్రుల వివరలిప్తలుగా తెలియవలయును. చంద్రుని భుక్తముకాని షష్టిపాతకాలనాడికలు. సూర్యచంద్రుల మానయోగము కొఱకు షష్టిచే గుణించి విభజించవలయును. ఇద్దరి భుక్ష్యంతరముతో పొందిన అర్ధ స్థితిని నాడికలవలే తెలియవలయును. మధ్యభాగము స్పుటము పాతకాలమగును. ఈ పాతకాలము స్థిత్యర్థ వర్షితమైనపుడు పాతకాలసంభవకాలమగును. ఆ సంయోగము పైన చెప్పిన సంజ్ఞ కలదగును. ఈ ఆద్యంతకాలములు మధ్యకాలము అతిభయంకరమైన కొలమని తెలియుము. ఈ కాలము భగభగమండుచున్న అగ్నిహోత్రము వంటిది కావున అన్ని కర్మలయందు ఈ కాలమును పరిత్యజించవలయును. ఇట్లు గణితభాగము కొంచెము సంక్షేపముగా చెప్పితిని. ఇక ఇపుడు రాశిసంజ్ఞాపూర్వకముగా జాతకభాగమును చెప్పెదను.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున జ్యోతిషవర్ణనమను బది నాలుగవ అధ్యాయము సమాప్తము.