నారద మహా పురాణము
123 - ద్వాదశమాసస్థిత చతుర్దశీవ్రత వర్ణనమ్
సనాతన ఉవాచ :-
శృణు నారద వక్ష్యామి చతుర్ధశ్యా వ్రతాని తే ।
యాని కృత్వా నరో లోకే సర్వాన్కామానవాప్నుయాత్
చైత్రశుక్లచతుర్దశ్యాం కుంకుమాగరుచందనైః ।
గంధాద్యైర్వస్త్రమణిభిః కార్యార్చా మహతీ శివే
వితానధ్వజఛత్రాణి దత్వా పూజ్యాశ్చ మాతరః ।
ఏవం కృత్వార్చనం విప్ర సోపవాసోధవైకభుక్
అశ్వమేధాధికం పుణ్యం లభతే మానవో భువి ।
అత్రైవదమనార్చాంచ కారయేద్గంధపుష్పకైః
సమర్పయేత్సపూర్ణాయాం శివాయ శివరూపిణే ।
రాధాకృష్ణచతుర్థశ్యాం సోపవాసో నిశాగమే
లింగమభ్యర్చయేచైవం స్నాత్వా ధౌతాంబరస్సుధీః ।
గంధాద్యైరుపచారైశ్చ బిల్వపత్రైశ్చ సర్వతః
దత్వామంత్రం ద్విజాగ్రాయ భుంజీత చ పరేహని ।
ఏవమేవ తు కృష్ణాసు సర్వాసు ద్విజసత్తమ
శివవ్రతం ప్రకర్తవ్యం ధనసంతానమిచ్ఛతా ।
రాధాశుక్లచతుర్దశ్యాం శ్రీ నృసింహవ్రతం చరేత్
ఉపవాసవిధానేన శక్తి శక్తస్తథైకభుక్ ।
నిశాగమే తు సంపూజ్య నృసింహం దైత్యసూదనమ్
ఉపచారైషోడశభి స్నానైః పంచామృతాదిభిః ।
తతః క్షమాపయేద్దేవం మంత్రేణానేన నారద
తప్రహాటకకేశానం జ్వలత్పావకలోచనమ్ ।
వజ్రాధికనఖస్పర్శ! దివ్యసింహ నమోస్తుతే
ఇతి సంప్రార్థ్య దేవేశం ప్రతీ స్యాత్ధ్సండిలేశయః ।
జితేంద్రియో జితక్రోధ స్సర్వోభోగవివర్జితః
ఏవం యః కురుతే విప్ర విధివద్ర్వతముత్తమమ్ ।
వర్షే వర్షే స లభతే భుక్తభోగో హరేః పదమ్
ఓంకారేశ్వరయాత్రా చ కార్యాతైవ మునీశ్వర ।
దుర్లభం వార్చనం తత్ర దర్శనం పాపనాశనమ్
కిమత్ర బహునోక్తేన పూజాధ్యానజపేక్షణమ్ ।
యద్భవేత్తత్సముద్దిష్టం జ్ఞానమోక్షప్రదం నృణామ్
అత్ర లింగవ్రతం చాపి కర్తవ్యం పాపనాశనమ్ ।
పంచామృతైస్తు సంస్నాప్య లింగమాలిప్య కుంకుమైః
నైవేద్యైశ్చ ఫలైర్దూపై ఛీపైర్వస్రవిభూషణైః ।
ఏవం యఃపూజయేత్పైష్టం లింగం సర్వార్థసిద్ధిదమ్
భుక్తిం ముక్తిం స లభతే మహాదేవప్రసాదతః ।
జ్యేష్ఠ శుక్లచతుర్దశ్యాం దివా పంచతపా నిః
ముఖే దదే ధోమధేనుం రుద్రవ్రతమిదంస్మృతమ్ ।
శుచి శుక్లచతుర్దశ్యాం శివం సంపూజ్య మానవః
దేశకాలోద్భవైః పుష్టైః సర్వసంపదమాప్నుయాత్ ।
నభశ్శుక్లచతుర్ధశ్యాం పవిత్రారోపణం మతమ్
తత్వశాభోక్తవిధినా కర్తవ్యం ద్విజసత్తమ ।
శతాభిమగ్రితం కృత్వా తతో దేవ్యై నివేదయేత్
పవిత్రారోపణం కృత్వా నరో నారధవా యది ।
మహాదేవ్యాః ప్రసాదేన భుక్తిం ముక్తిమవాప్నుయాత్
భాద్రశుక్ల చతుర్దశ్యాం అనన్నవ్రతముత్తమమ్ ।
కర్తవ్యమేక భుక్తం హి గోధూమప్రస్థపిష్టకమ్
విపాచ్య శర్కరాజ్యాక్త మనస్తాయ నివేదయేత్ ।
గంధాద్యైః ప్రాక్సమభ్యర్చ్య కార్పాసం పట్టజంతునా
చతుర్దశగ్రంధియుతం సూత్రం కృత్వా సుశోభనమ్ ।
తతః పురాణముత్తార్య సూత్రం క్షిష్యా జలాశయే
నిబధీయాన్నవం నారీ వామే దక్షే పుమాన్భుజే ।
విపాచ్య పిష్టపక్వం తత్ర్పదగ్యాడ్జక్షిణాన్వితమ్
స్వయం చ తన్మితం చాద్యా దేవం కుర్యా ద్ర్వతోత్తమమ్ ।
ద్విసప్తవర్షపర్యంతం తత ఉద్యాపయేత్సుధీః
మండలం సర్వతోభద్రం ధాన్యవర్ణేః ప్రకల్ప్యచ ।
సుశోభనే న్యసేత్తత కలశం తామజం మునే
తస్యోపరి న్యసేద్ధైమి మనన్నప్రతిమాం శుభామ్ ।
పీతపట్టాంశుకాచ్ఛన్నాం తత్ర తాం విధినా యజేత్
గణేశం మాతృకాః భేటాం ల్లోకపాం శ్చ యజేత్స్పధక్ ।
తతో హోమం హవిష్యేణ కృత్వా పూర్ణాహూతిం చరేత్
శయ్యాం సోపస్కరాం ధేనుం ప్రతిమాం చ ద్విజోత్తమ ।
ప్రదద్యాద్గురవే భక్త్యా ద్విజానన్యాంశ్చతుర్దశ
సోప్యనన్నప్రసాదేన జాయతే భుక్తిముక్తిభాక్ ।
కదలీవ్రతమపత్ర తద్విధానం చ మే శృణు
నరో వా యదివా నారీ రంభాముపవనస్థితామ్ ।
స్నాత్వా సంపూజయే ధంధపుష్పధాన్యాంకురాదిభిః
దధిదూర్వాక్షతైర్డీపై ర్వస్త్రపక్వాన్నసంచయైః ।
ఏవం సంపూజ్య మంత్రేణ తతస్సంప్రార్థయేద్ర్వతీ
అప్సరోమరకన్యాభి రాగకన్నా భిరర్చితే ।
శరీరారోగ్యలావణ్యం దేహి దేవి నమోస్తుతే
ఇతి సంప్రార్థ్య కన్యాస్తు చతస్రో వా సువాసినీః ।
సంభోజ్యాంశుక సిందూర కజ్జలాలక్తచర్చితాః
నమస్కృత్య నిజం గేహం సమాప్య నియమం వ్రజేత్ ।
ఏవం కృతే ప్రతే విప్ర లబ్ధ్వా సౌభాగ్యముత్తమమ్
ఇహలోకే విమానేన స్వర్గలోకే వ్రజేత్పరమ్ ।
ఇషకృష్ణచతుర్దశ్యాం విషశస్త్రాంబువహ్నిభిః
సర్పశ్వాపదవజ్రాద్యై ర్హతానాం బ్రహ్మఘాతినామ్ ।
చతుర్దశ్యాం క్రియాశ్రాద్ద మేకోద్దిష్టవిధానతః
కర్తవ్యం విప్రవర్గం చ భోజయేన్మిష్టపక్వకైః ।
తర్పణం చ గవాం గ్రాసం బలిం చైవ శకాకయోః
కృత్వాచమ్య స్వయం పశ్చా ద్బుంజీయాద్బంధుభిస్సహ ।
ఏవం యః కురుతే విప్ర శ్రాద్ధం సంపన్నదక్షిణమ్
స ఉద్ధృత్య పితృన్గచ్ఛే ద్దేవలోకం సనాతనమ్
సనాతనమహర్షి పలికెను. ఓ నారదా! ఇపుడు నీకు చతుర్దశీవ్రతములను చెప్పెదను. వినుము. ఈ వ్రతముల నాచరించిన మానవుడు సర్వకానమలను పొందును. చైత్రశుక్లచతుర్దశినాడు కుంకుమాగరు చందనములచే, గంధాదులచే, వస్త్రమణులచే శివునకు మహాపూజను గావించవలయును. మాతృదేవతలను వితానధ్వజఛత్రములనిచ్చి పూజించవలయును. ఇట్లర్చనగావించి ఉపవాసమును కాని ఏకభుక్తమును కాని ఆచరించవలయును. ఇట్లు చేసినచో అశ్వమేధాదియజ్ఞపుణ్యమును పొందును. ఈనాడే గంధపుష్పాదులచే దమనార్చన గావించవలయును. శివరూపియగు శివునకు పూర్ణిమనాడు దమనమును సమర్పించవలయును. వైశాఖబహుళచతుర్దశి నాడు ఉపవసించి సాయంకాలమున స్నానముచేసి ధౌతవస్త్రములను ధరించి శివలింగమును గంధాద్యుపచారములచే బిల్వపత్రములచే చక్కగా పూజించవలయును. ఇట్లే కృష్ణచతుర్దశులలో కూడా ధనమును సంతానమును కోరువారు శివవ్రతము నాచరించవలయును. వైశాఖశుద్ధచతుర్దశినాడు శ్రీనృసింహవ్రతము నాచరించవలయును. శక్తిగలవాడు ఉపవాసముతో, శక్తి లేనివాడు ఏకభుక్తముతో నాచరించవలయును. సాయంకాలసమయమున రాక్షస సంహారకుడగు శ్రీనృసింహస్వామిని షోడశోపచారములతో, పంచామృత స్నానములతో పూజించవలయును. తరువాత ఈమంత్రముతో క్షమాపణను వేడుకొనవలయును. చక్కగా పుటము పెట్టిన బంగారు వన్నెగల కేశములు గల మండుచున్న అగ్నివంటి నేత్రములు కల వజ్రాయుధమును మించిన వాడిగల నఖముల స్పర్శగల ఓ నృసింహా! నీకు నమస్కారము. ఇట్లు దేవదేవుని చక్కగా ప్రార్థించి వ్రతము నాచరించువాడు భూమిమీద పరుండవలయును. ఇంద్రియజయము కలవాడై, కోపమును జయించి అన్ని భోగములను విడిచి వ్రతము నాచరించవలయును. ఇట్లు ఈవ్రతమును యధావిధిగా నాచరించినవాడు ఇహమున అన్ని భోగములననుభవించి అంతకాలమున శ్రీహరిపదమును చేరును. ఈ దినముననే ఓంకారేశ్వర యాత్రను కూడా నాచరించ వలయును. ఇచట పూజ చేయుట దుర్లభము. దర్శనము సమస్తపాపహారము. ఇదియననేల? ఈ ధ్యానమున పూజధ్యానము, జపము, దర్శనము, మొదలగునవన్నీయూ నరులకు జ్ఞానప్రదములు మోక్షప్రదములు. అట్లే ఈదినమున పాపనాశకమగు లింగ వ్రతమును కూడా నాచరించవలయును. శివలింగమును పంచామృతముతో స్నానము చేయించి, కుంకుమాదులతో చక్కగా అర్చించి, ధూపదీపనైవేద్యములతో, ఫలములతో, వస్త్ర విభూషణములతో పిండితో చేసిన శివలింగమును సర్వార్థప్రదమును చక్కగా పూజించిన వారు మహాదేవుని అనుగ్రహము వలన భుక్తి ముక్తిని పొందెదరు. జ్యేష్ఠ శుక్లచతుర్దశినాడు పగలు పంచాగ్ని మధ్యమున నిలిచి, రాత్రిముఖమున హోమధేనువును అర్చించవలయును. ఇదియే రుద్ర వ్రతము. ఆషాఢశుద్ధచతుర్థిశినాడు నరుడు దేశకాలోద్భవములగు పుష్పములతో చక్కగా పూజించి సర్వసంపదలను పొందును. శ్రావణ శుద్ధ చతుర్దశినాడు పవిత్రారోపణము చేయవలయును. ఈపవిత్రారోపణమున తమతమ శాభోక్తవిధిననుసరించి చేయవలయును. పవిత్రమును శతాభిమంత్రితమునుగావించి దేవికి నివేదించవలయును. పవిత్రారోపణమును చేసిన స్త్రీకాని పురుషుడుకాని ఉమాదేవ్యనుగ్రహముతో భుక్తిముక్తులను పొందును. ఇక భాధ్రపదశుక్ల చదుర్గశినాడు అననవతము నాచరించవలయును. చేయవలయును. గోధుమపిండి శర్కర నేయి కలిపి చక్కగా ఉడికించి మొదట గంధాదులతో చక్కగా పూజించి అనస్తునకు నివేదించవలయును. పత్తితో కాని, చర్మముతో కాని నేర్పడిన దారమును పదునాలుగు ముడులు వేసి పాతదానిని తీసేసి, జలాశయమున పడవేసి కొత్తకంకణమును పురుషునకు దక్షిణకరమున, స్త్రీకి వామకరమున కట్టవలయును. పిండివంటలు వండి దక్షిణ సహితముగా బ్రాహ్మణునకిచ్చి తాను మితముగా భుజించవలయును. ఇట్లు పదునాలుగు సంవత్సరములు వ్రతము నాచరించి ఉద్యాపన గావించ వలయును. ధ్యానవర్ణములతో సర్వతోభద్రమండలమును నిర్మించి, ఆమండలమున తామ్రకలశమునుంచి, దానిపై బంగారముతో నిర్మించి అననప్రతిమను పీటపట్టాంశుకముతో అచ్చాదించి యధావిధిగా పూజించవలయును. గణేశుని, మాతృకలను, ఖేటమును, లోకపాలకులను, విడివిడిగా పూజించవలయును. తరువాత హవిస్సుతో హోమమును చేసి పూర్ణాహూతిని ఆచరించవలయును. చక్కగా అలంకరించిన శయ్యను, ధేనువును బంగారు ప్రతిమను గురువునకు సమర్పించవలయును. అట్లే పదునాలుగు మంది బ్రాహ్మణులను భుజింపచేసి దక్షిణలతో సంతోషింప చేయవలయును. ఇట్లు ఆదరముతో అనన్తవతము నాచరించినవాడు అననుని అనుగ్రహము వలన భుక్తిముక్తులను పొందును. నరుడుకాని, నారికాని చక్కగా స్నానము చేసి ఉపవనమున నున్న అరటి చెట్టును గంధపుష్పధాన్యాంకుర దధిదూర్వా అక్షతాదులచే, దీపములచే, వస్త్రములచే, పక్వాన్నములచే, చక్కగా పూజించి ఇట్లు ప్రార్థించ వలయును. అప్సరోదేవకన్యలచే, నాగకన్యలచే పూజించబడు రంభావృక్షమా? నాకు శరీరారోగ్యమును, లావణ్యమును ప్రసరించుము. ఇట్లు ప్రార్థించి నలుగురు కన్యలను కాని, ముత్తయిదవులను కాని చక్కగా భుజింపచేసి అంశుకసిందూర కజ్జలఅలక్షములను సమర్పించి, నమస్కరించి నియమమును ముగించి తన ఇంటికి వెళ్ళవలయును. ఇట్లు వ్రతమును చేసినచో ఉత్తమమగు సౌభాగ్యమును పొంది, అస్తమున విమానముతో స్వర్గలోకమును చేరును. ఆశ్వయుజ బహుళచతుర్దశినాడు విష, శస్త్ర, అంబు, అగ్నులచే, సర్పములచే, జంతువులచే వజ్రాదులచే మరణించినవారికి, బ్రహ్మఘాతకులకు, ఏకోద్దిష్టవిధానముతో క్రియాశ్రాద్ధమును చేయవలయును. బ్రాహ్మణ వర్గమును మిష్టపక్వాన్నములతో భుజింపచేయవలయును. తర్పణమును, గోగ్రాసమును, కాకశునకములకు బలిని చేసి, ఆచమనమును చేసి, తరువాత బంధువులతో కలిసి భుజించవలయును. ఇట్లు దక్షిణలతో చక్కగా శ్రాద్ధమును చేసినచో పితృదేవతలనుద్ధరించి సనాతనమగు దేవలోకమును చేరును.
ఇషశుక్ల చతుర్ధశ్యాం ధర్మరాజం ద్విజోత్తమ
గంధాద్యై స్సమ్యగభ్యర్చ్య సౌవర్ణం భోజ్యవాడవమ్ ।
దద్యాత్తస్మై ధర్మరాజు స్రాయతే భువి నారద
ఏవం యః కురుతే ధర్మం ప్రతిమాదానముత్తమమ్ ।
స భుక్త్యేహ వరాన్ఫోగా నివం ధర్మాజ్ఞయా ప్రజేత్
ఊర్జకృష్ణచతుర్దశ్యాం తైలాభ్యంగం విధూదయే ।
కృత్వా స్నాత్వార్చయేద్ధర్మం నరకాదభయం లభేత్
ప్రదోషే తైలదీపాంస్తు దీపయేద్యమతుష్టయే ।
చతుష్పథే గృహాద్బాహ్య ప్రదేశే వా సమాహితః
వత్సరే హేమలంబ్యాఖ్యే మాసి శ్రీమతి కార్తికే ।
శుక్లపక్షే చతుర్దశ్యా మరుణాభ్యుదయం ప్రతి
స్నాత్నా విశ్వేశ్వర దేవో దేవైస్సహమునీశ్వర! ।
మణికర్ణిక తీర్ధే చ త్రిపుండ్రం భస్మనా దధత్
స్వాత్మానం స్వయమభ్యర్య చక్రే పాశుపతవ్రతమ్ ।
తతస్తత్ర మహాపూజాం లింగే గంధాదిభిశ్చరేత్
ద్రోణపుషైర్బిల్వదలై రక్కపుషైశ్చ కేతకైః ।
పుష్పైః ఫలైర్మిష్టపకై రైవేద్యైర్వివిధైరపి
ఏవం కృత్వైకభుక్తస్తు వ్రతం విశ్వేశతోషణమ్ ।
లభతే వాంఛితాన్కామా నిహాముత్ర చ నారద
బ్రహ్మకూర్చవ్రతం చాత్ర కర్తవ్యమృద్ధిమిచ్ఛతా ।
సోపవాసః పంచగవ్యం పిబేదౌత్రా జితేంద్రియః
కపిలాయాస్తు గోమూత్రం కృష్ణాయా గోమయం తధా ।
శ్వేతయాః క్షీరముదితం రక్తాయాశ్చ తథా దధి
గృహీత్వా కర్బురాయాశ్చ ఘృతమేకత్రమేలయేత్ ।
కుశాంబునా తతః ప్రాతః స్నాత్వా సంతర్ప్య దేవతాః
బ్రాహ్మణాం స్తోషయిత్వా చ భుంజీయాద్వాగ్యతస్స్వయమ్ ।
బ్రహ్మకూర్చవ్రతం హ్యేత త్సర్వపాతకనాశనమ్
యచ్చ బాల్యే కృతం పాపం కౌమారే వార్థకే పి యత్ ।
బ్రహ్మకూర్చోపవాసేన తతక్షణాదేవ నశ్యతి
పాషాణవ్రతమప్యత ప్రోక్తం తచ్చణు నారద ।
సోపవాసో దివానక్తం పాషాణాకారపిష్టకమ్
ప్రార్చ్య గంధాదిభిరౌరీం ఘృతపక్వముపాహరేత్ ।
వ్రతమేతచ్చరిత్వా తు యధోక్తం ద్విజసత్తమ
ఐశ్వర్యసౌఖ్యసౌభాగ్య రూపాణి ప్రాప్నుయాన్నరః ।
మార్గశుక్లచతుర్దశ్యా మేకభుక్తః పురోదితమ్
నిరాహారో వృషం స్వర్ణం ప్రార్చ్య దద్యాద్ద్విజాతయే ।
పరేహ్నిప్రాతరుత్థాయ స్నాత్వా సోమం మహేశ్వరమ్
పూజయేత్కమలైః పుపై ర్గంధ మాల్యానులేపనైః ।
ద్విజానం భోజ్య మిష్టాన్నై సోషయేదక్షిణాదిభిః
ఏతచ్ఛివవ్రతం విప్ర భుక్తిముక్తిప్రదాయకమ్ ।
కర్త్రణాముపదేష్ట్రం సాహ్యానామనుమోదినామ్
పౌషశుక్లచతుర్దశ్యాం విరూపాక్షవ్రతం స్మృతమ్ ।
కపర్దీశ్వరసాన్నిధ్యం ప్రాప్స్యామ్యత్ర విచింత్య చ
స్నాత్వాగాధజలే విప్ర విరూపాక్షం శివం యజేత్ ।
గంధమాల్యనమస్కార ధూపదీపాన్నసంపదా
తళం ద్విజాతయే దత్వా మోదతే దివి దేవవత్ ।
మాఘకృష్ణ చతుర్ధశ్యాం యమతర్పణ మిరితమ్
అనరాభ్యుదితే కాలే స్నాత్వా సంతర్పయే ద్యమమ్ ।
ద్విసప్తనామభిః ప్రోకైః సర్వపాపవిముక్తయే
తిలదర్భాంబుఖిః కార్యం తర్పణం ద్విజభోజనమ్ ।
కృశరాన్నం స్వయం చాపి తదేవాశ్నీత వాగ్యతః
అంత్యకృష్ణచతుర్థశ్యాం శివరాత్రీవ్రతం ద్విజ ।
నిర్జలం సముపోష్యాత్ర దివానక్తం ప్రపూజయేత్
స్వయం భువాదికం లింగం పార్థివం వా సమాహితః ।
గంధాద్యైరుపచారైశ్చు సాంబు బిల్వదలాదిభిః
ధూపైర్దీ పైశ్చనైవద్యై స్తోత్రపాలైర్జపాదిభిః ।
తతఃపరేహ్ని సంపూజ్య పునరేవోపచారకైః
సంభోజ్య విప్రాన్మిష్టాన్నై ర్విసృజేల్లజ్ఞదక్షిణాన్ ।
ఏవం కృత్వావ్రతం మర్త్యో మహాదేవప్రసాదతః
అమర్త్యభోగాన్లభతే దైవతైస్ససభాజితః ।
అన్యశుక్లచతుర్దశ్యాం దుర్గాం సంపూజ్య భక్తితః
గంధాద్యైరుపచారైస్తు విప్రాన్సంభోజయేత్తతః ।
ఏవం కృత్వా వ్రతం విప్ర దుర్గాయాశ్చైకభోజనః
లభతే వాంఛితాన్కామా నిహాముత్ర చ నారద! ।
చైత్రకృష్ణచతుర్దశ్యా ముపవాసం విధాయ చ
కేదారోదకపానేన వాజిమేధఫలం లభేత్ ।
ఉద్యాపనే తు సర్వాసాం సామాన్యో విధిరుచ్యతే
కుంభాశ్చతుర్థశైవాత్ర సపూగాక్షతమోదకాః।
సదక్షీణాంశుకాస్తామ్రా మృణ్మయాశ్చావణానవాః
తావంతో వంశదండాశ్చ పవిత్రాణ్యాసనావిచ ।
పాత్రాణి యజ్ఞసూత్రాణి తావన్యేవ హి కల్పయేత్
శేషం ప్రాగుక్తవత్కుర్యా ద్విత్తశాఠ్యవివర్జితః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే ద్వాదశ మాసస్థిత చతుర్దశీవ్రత వర్ణనం నామ త్రయోవింశత్యధిక శతతమోధ్యాయః.
అశ్వయుజశుక్లచతుర్దశినాడు ధర్మరాజును గంధాదులతో చక్కగా పూజించి బ్రాహ్మణుని భుజింపచేసి, సువర్ణమును దానము చేసినచో ధర్మరాజు కాపాడును. ఇట్లు ధర్మరాజుప్రతిమను దానము చేసినవాడు ఇహలోకమున ఉత్తమభోగములనను భవించి ధర్మరాజాజ్ఞచే స్వర్గమును పొందును. కార్తీక కృష్ణ చతుర్దశినాడు చంద్రోదయకాలమున తైలాభ్యంగమును చేసుకొని స్నానముచేసి ధర్మరాజును పూజించి నరకమునుండి అభయమును పొందును. ప్రదోషకాలమున యమధర్మరాజ ఫ్రీతికొరకు సావధానముతో నూనె దీపములను నాలుగు దారుల కూడలిలోకాని, ఇంటి బయటి ప్రదేశమునకాని నుంచవలయును. హేమలంబసంవత్సర కార్తిక శుద్దచతుర్దశినాడు అరుణోదయకాలమున స్నానముచేసి దేవతలతో పాటు విశ్వేశ్వరుడు మణికర్ణికాతీర్థమున భస్మముతో త్రిపుండ్రమును ధరించి తననుతాను చక్కగా పూజించుకొని పాశుపతవ్రతమును ఆచరించెను. కావున ఆదినమున శివలింగమున గంధాదులతో మహాపూజనాచరించవలయును. ద్రోణపుష్పములతో బిల్వదలములతో, జిల్లేడు పూవులతో, కేతక పుష్పములతో, ఫలములతో, మిష్టాన్నములతో, పక్వాన్నములతో, బహువిధనైవేద్యములతో పూజించి ఏకభుక్తముతో విశ్వేశ్వరప్రీతికరమగు వ్రతము నాచరించి, ఇహపరములలో సకలాభీష్టములను పొందును. ఈదినమున అభివృద్దిని కోరువారు బ్రహ్మకూర్చవ్రతము నాచరించవలయును. ఉపవాసముతో రాత్రియందు జితేంద్రియుడై పంచగవ్యపానమును చేయవలయును. కపిలాధేనుమూత్రమును, కృష్ణగోమయమును, శ్వేత గోక్షీరమును, రక్తగోవుదధి, కుర్బురో గోఘృతమును ఒకచోట కలుపవలయును. ప్రాతః కాలమున దర్భజలముతో స్నానముచేసి దేవతలకు సంతర్పణచేసి, బ్రాహ్మణులను సంతోషింపచేసి, మౌనముగా భుజించవలయును. ఈ బ్రహ్మకూర్చవ్రతము సర్వపాతక నాశనము. బాల్యమున, కౌమారమున, వార్థక్యమున చేసిన పాపములన్నియూ బ్రహ్మకూర్చోపవాసముతో వెంటనే నశించును. ఈ దినముననే పాషాణవ్రతముకూడా చెప్పబడినది. దానిని వినుము. పగలు రాత్రి ఉపవసించి, పాషాణాకారపిష్టమును ఘృతపక్వముగాచేసి, గంధాదులతో గౌరీదేవిని పూజించి నైవేద్యమును సమర్పించవలయును. ఈవ్రతమును యధావిధిగా నాచరించి ఐశ్వర్యసౌఖ్యసౌభాగ్యసౌందర్యములను పొందును.
మార్గశిరశుక్లచతుర్దశినాడు ఏకభుక్తముతో కాని, నిరాహారముగా కాని స్వర్ణవృషమును చక్కగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయవలయును. మరునాడు ప్రాతఃకాలమున లేచి స్నానము చేసి ఉమాసహితమహేశ్వరుని కమల పుష్పములతో, గంధమాల్యాను లేపనములతో పూజించి, బ్రాహ్మణులను మిష్టాన్నములతో భుజింపచేసి, దక్షిణాదులతో ప్రీతుల గావించవలయును. ఇదీ శివవ్రతము. భుక్తిముక్తి ప్రదము. ఈవ్రతమును చేయువారికి, ఉపదేశించువారికి, సహాయము చేయువారికి, ఆమోదించువారికి భుక్తిముక్తులు లభించును. పుష్యశుక్ల చతుర్దశినాడు విరూపాక్షవ్రతము నాచరించవలయును. ఈదినమున అగాధజలమును స్నానమునుచేసి విరూపాక్షుడగు శివుని చక్కగా ధ్యానించి పూజించవలయును. గంధమాల్యనమస్కారములను, ధూపదీపాన్నసంపదలను బ్రాహ్మణునకు సమర్పించి స్వర్గమున దేవతలవలె ఆనందించును. మాఘకృష్ణచతుర్దశినాడు యమతర్పణము చెప్పబడినది. సూర్యోదయకాలమునకు పూర్వమే స్నానముచేసి, పదునాలుగు నామములతో యమునికి తర్పణము గావించవలయును. ఇట్లు చేసినచో సర్వపాపములు నశించును. తిలదర్భజలములచే తర్పణమును చేయవలయును, నువ్వుల అన్నముతో బ్రాహ్మణులను భుజింపచేయవలయును. తాను కూడా మౌనముగా ఆయన్నమునే భుజించవలయును. ఫాలున బహుళచతుర్దశినాడు శివరాత్రివ్రతమును ఆచరించవలయును. ఈ దినమున నిర్జలముగా ఉపవసించి పగలురాత్రి స్వయంభువలింగమును కాని, పార్థివలింగమును కాని సావధానముగా, గంధాద్యుపచారములచే, జలముతో, బిల్వదలాదులచే, ధూపదీపనైవేద్యములచే, స్తోత్రపాఠములచే, జపాదులచే చక్కగా పూజించవలయును. తరువాత మరునాడు మరల ఉపచారములచే చక్కగా పూజించి, మిష్టాన్నములతో బ్రాహ్మణులకు చక్కగా భుజింపచేసి, దక్షిణలనిచ్చి పంప వలయును. ఇట్లు వ్రతము నాచరించి మహాదేవాను గ్రహముతో దేవతలతో ఆదరింపబడి దివ్యభోగములనను భవించును. ఫాల్గుణ శుక్లచతుర్దశినాడు భక్తితో దుర్గాదేవిని గంధాద్యుపచారములచే చక్కగా పూజించి బ్రాహ్మణులను భుజింపచేయ వలయును. ఏక భుక్తముతో నిట్లు దుర్గావ్రతమునాచరించి ఇహపరములలో సకలా భీష్టములను పొందును. చైత్రబహుళచతుర్దశినాడు ఉపవసించి కేదారోదకపానమును చేసినచో అశ్వమేథ యాగఫలమును పొందును. ఇట్లు సమస్త చతుర్దశీ వ్రతములను ఉద్యాపనము సామాన్యముగా ఒకేవిధముగా చెప్పబడినది. పదునాలుగు, కలశములు పూగాక్షతమోదకములతో, దక్షిణాంశుకములతో తామ్రములు కాని మృణ్మయములు కాని కొత్తవి స్థాపించి పదునాలుగు వెదురు దండములను, పవిత్రములను, ఆసనములను, పాత్రలను, యజ్ఞసూత్రములను కూడా పదునాలుగుంచవలయును. మిగిలిన దంతయూ పూర్వము చెప్పినట్లు శాఠ్యము లేకుండగా నాచరించ వలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున ద్వాదశమాసస్థిత చతుర్దశీవ్రతవర్ణనమను నూటా ఇరువదిమూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 125 of the Nārada Mahā Purana is as follows:
శ్రీ నారద మహాపురాణ పూర్వార్థ ముగింపు అధ్యాయంలో ఈ దివ్య గ్రంథ పారాయణ, శ్రవణ మరియు లేఖన ఫలశ్రుతి అత్యంత భక్తిరసభరితంగా గానము చేయబడినది. ఈ పూర్వార్థమును భక్తితో పఠించే వారికి శ్రీలక్ష్మీ సమేత నారాయణ ప్రభువు భుక్తి ముక్తులను ప్రసాదించి ధన్యులను చేయునని ప్రబోధించుటతో పూర్వార్థము సంపూర్ణమైనది.