నారద మహా పురాణము
23 - ఏకాదశీవ్రతమహిమానువర్ణనమ్.
సనక ఉవాచ :
ఇదమన్యత్ప్రవక్ష్యామి వ్రతం త్రైలోక్యవిస్తరమ్।
సర్వపాపప్రశమనం సర్వకామఫలప్రదమ్॥
బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చైవ యోషితామ్।
మోక్షదం కుర్వతాం భక్త్యా విష్ణోః ప్రియతరం ద్విజ॥
ఏకాదశీవ్రతం నామ సర్వభీష్టప్రదం నృణామ్।
కర్తవ్యం సర్వధా విప్ర విష్ణుప్రీతికరం యతః॥
ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి।
యో భుంక్తే సోఽత్ర పాపీయాన్ఫరత్ర నరకం వ్రజేత్॥
ఉపవాసఫలం లిప్సుర్జహాద్భుక్తి చతుష్టయమ్।
పూర్వాపరదినే రాత్రావహారాత్రం తు మధ్యమే॥
ఏకాదశీదినే యస్తు భోక్తు మిచ్ఛతి మానవః।
స భోక్తుం సర్వపాపాని స్పృహయాలుర్న సంశయః॥
భవేద్దశమ్యామేకాకీ ద్వాదశ్యాం చ మునీశ్వర।
ఏకాదశ్యాం నిరాహారో యది ముక్తి మభీప్సతి॥
యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ।
అన్నమాశ్రిత్య తిష్ఠన్తి తాని విప్ర హరేర్ధినే॥
బ్రహ్మహత్యాదిపాపానాం కథంచిన్నిష్కృతిర్భవేత్।
ఏకాదశ్యాం తు యో భుంక్తే తస్య నైవాస్తి నిష్కృతిః॥
మహాపాతకయుక్తో వా యుక్తో వా సర్వపాతకై।
ఏకాదశ్యాం నిరాహారస్థిత్వా యాతి పరాం గతిమ్॥
ఏకాదశీ మహాపుణ్యా విష్ణోః ప్రియతమా తిథిః।
సం సేవ్యా పర్వథా విప్రైస్సంసారచ్ఛేదలిప్సుభిః॥
దశమ్యాం ప్రాతరుత్థాయ దంతధావనపూర్వకమ్।
స్నాపయేద్విధావద్విష్ణుం పూజయేత్ప్రయాతేంద్రియః॥
ఏకాదశ్యాం నిరాహారో నిగృహీతేంద్రియో భవేత్।
శయీత సన్నిదౌ విష్ణోర్నారాయణపరాయణ॥
ఏకాదశ్యాం తథా స్నాత్వా సంపూజ్య చ జనార్దనమ్।
గంధపుష్పాదిభిస్సమ్యక్ తత స్త్వేవముదీరయేత్॥
ఏకాదశ్యాం నిరాహారస్థిత్వ్యాధ్యాహం పరేహని భోక్ష్యామి పండరీకాక్ష శరణం మే భవాచ్యుత।
ఇమం మన్త్రం సముచ్చార్య దేవదేవస్య చక్రిణః॥
భక్తి భావేన తుష్టాత్మా ఉపవాసం సమర్పయేత్।
దేవస్య పురతః కుర్యాజ్ఞాగరం నియతో వ్రతీ।
గీతై ర్వాదైశ్చ నృత్యైశ్చ పురాణశ్రవణాదిభిః॥
తతః ప్రాతస్సముత్థాయ ద్వాదశీవ సే వ్రతీ।
స్నాత్వా చ విధివద్విష్ణుం పూజయేత్ప్రయతేంద్రియః॥
పంచామృతేన సంస్నాప్య ఏకాదశ్యాం జనార్దనమ్।
ద్వాదశ్యాం పయసా విప్ర హరిసారూప్యమశ్నుతే॥
అజ్ఞానతిమిరాన్దస్య వ్రతేనానేన కేశవ।
ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ॥
ఏవం విజ్ఞాప్య విపేన్ద్ర మాధవం సుపమాహితః।
బ్రాహ్మణాన్ఫోజయేచ్ఛక్త్యా దద్యాద్వై దక్షిణాం తథా॥
తతస్స్వబన్దుభిస్సార్థం నారాయణపరాయణః।
కృతపంచమహాయజ్ఞస్వయం భుంజీత వాగ్యతః॥
ఏవం యః ప్రయతః కుర్వాత్పుణ్యమేకాదశీవ్రతమ్।
స యాతి విష్ణుభవనం పునరావృత్తిదుర్లభమ్॥
సనకమహర్షి పలికెను :- మూడులోకములలో ప్రసిద్ధి నొందినది,సర్వపాపములను శమింపచేయునది, సర్వకామఫలప్రదము అయిన మరియొక వ్రతమును చెప్పెదను వినుము. ఇది బ్రాహ్మకతీయ వైశ్యశూద్రులలో స్త్రీలలో ఎవరు చేసిననూ మోక్షము నొసంగునది. విష్ణువునకు ప్రీతికరము. ఈ వ్రతము పేరు ఏకాగశీవ్రతము. ఇది సర్వాభీష్టప్రదము. ఈ వ్రతమును అన్ని విధములా చేయవలయును. ఈ ఏకాదశవ్రతము విష్ణు ప్రీతికరము. శుక్షకృష్ణపక్షములలోని ఏకాదశీ తిథీన భోజనము చేయరాదు, అట్లు భుజించువాడు ఇహ లోకమున పాపమును పొంది పరమున నరకమును చేరును, ఉపవాసఫలమును పొందగోరువారు దశమిరాత్రి, ఏకాదశి రెండుపూటలు, ద్వాదశిన రాత్రి ఈ నాలుగు పూటలు భుజించరాదు. ఏకాదశీదినమున భుజించగోరువారు సర్వపాపములననుభవించగోరువాడని తెలియుము. ముక్తిని కోరువాడు దశమిన ఒకపూట, ద్వాదశీ తిథిన ఒకపూట, ఏకాదశీ తిథిన రెండుపూటలా నిరాహారముగా నుండవలయును. బ్రహ్మ హత్యాది మహాపాతకములన్నియు హరిదినమున అన్నము నాశ్రయించియుండును. బ్రహ్మహత్యాదిపాపముల కెట్లో నిష్కృతి లభించును కాని ఏకాదశీ తిథిన భుజించువానికి నిష్పతి లభించదు. మహాపాతకములు కలవారు కాని సర్వపొతకములు కలవారు కాని ఏకాదశీ తిథిన ఉపవాసమును చేసినచో పరమ పదమును పొందుదురు. ఏకాదశీ తిథి పరమపవిత్రమైనది. విష్ణువును ప్రీతిపాత్రమైన తిథి. కావున సంసారచ్ఛేదమును కోరువారు ఏకాదశీ తిథిని సేవించవలయును. దశమీతిథియందు ప్రాతఃకాలమున లేచి దంతధావన పూర్వకముగా స్నానాదికములను నిర్వర్తించి ఇంద్రియనిగ్రహముతో యథావిధిగా శ్రీమహావిష్ణువునకు స్నానాదికమును చేయించి పూజించవలయును. ఏకాదశినాడు ఇంద్రియ జయముతో నిరహారముగా నుండవలయును. నారాయణుని స్మరించుచు శ్రీమహావిష్ణువు సన్నిధిలో శయనించవలయును. ఏకాదశీ తిథి నాడు స్నానముచేసి జనార్దనుని పూజించి గంధపుష్పాదుల నర్పించి ఇట్లు విజ్ఞాపన చేయవలయును.
“ఏకాదశ్యాం నిరహార స్ధ్రిత్వాఽద్యాహం పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత”
ఈ మంత్రమునుచ్చరించి దేవదేవుడగు శ్రీమన్నారాయణునకు ఉపవాసమును సమర్పించవలయును. (“ఓ పుండరీకాక్షా! నేను ఏకాదశిన నిరాహారముగా నుండి ద్వాదశీ తిథిన భోజనము చేయగలను. ఓ అచ్యుతా! నాకు రక్షకుడవు కమ్ము” అని మంత్రమున కర్థము). నియములతో దేవదేవుని ముందు నృత్యగీత వాద్యపురాణాదులతో జాగరణ చేయవలయును. తరువాత ద్వాదశీ తిథిన ప్రాతఃకాలమున లేచి స్నానముచేసి యథావిధిగా అర్చించవలయును. ఏకాదశీ తిథిన జనార్ధనుని పంచామృతముతో స్నానము చేయించవలయును. ద్వాదశిన క్షీరాభి షేకము చేయవలయును. అట్లు చేసినచో హరిసారూప్యమును పొందును.
“అజ్ఞానతిమిరాన్ధస్య వ్రతేనానేన కేశవ।
ప్రసీద సుముఖో భూత్వా జ్ఞానదృష్టిప్రదో భవ”
అని శ్రీహరికి విజ్ఞాపన చేయవలయును. (“అజ్ఞానమను చీకటిలో గుడ్డివాడినైన నాకు ఈ వ్రతాచరణతో సుముఖుడవై ప్రసన్నుడవై జ్ఞానదృష్టిని ప్రసాదించుము” అని అర్థము). తరువాత శక్తి నననుసరించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణను సమర్పించవలయును. తరువాత పంచమహాయజ్ఞములనాచరించి బంధువులతో కలిసి మౌనముతో తాను భుజించవలయును. ఇట్లు పవిత్రమైన ఏకాదశీ వ్రతమునాచరించినవారు పునారవృత్తి రహితమైన శ్రీమహావిష్ణుభవనమును చేరెదరు.
ఉపవాసవ్రతపరో ధర్మ కార్యపరాయణః।
చాండాలన్పతితాంశ్చైవ నేక్షేదపి కదాచన॥
నాస్తికాన్భిన్నమర్యాదాన్నిందకాన్పిశువాంస్తథా ఉపవాసవ్రతపరో నాల పేచ్చ కదాచన॥
వృషలీ సూతిపోష్టారం వృషలీపతిమేవ చ అయాజ్యయాజకం చైవ నాల పేత్సర్వదా వ్రతీ॥
కుండాశినం గాయకం చ తథా దేవలకాశినమ్।
భిషజం కావ్యకర్తారం దేవద్విజవిరోధినమ్॥
పరాన్నలోలుపం చైవ పర స్త్రీనిరతం తథా ప్రతాపవాసవిరతో వాజ్మా త్రేణాపి నార్చయేత్
ఇత్యేనమాదిభిశ్శుద్ధో వశీసర్వ హితే రతః ఉపవాసపరో భూత్వా పరాం సిద్దిమవాప్నుయాత్
నాస్తి గంగాసమం తీర్థం నా మాతృసమో గురుః నాస్తి విష్ణుసమం దైవం తపోనానశనాతృరమ్॥
నాస్తి క్షమా సమా మతా నాస్తి కీర్తిసమం ధనమ్ నాస్తి జ్ఞానపమో లాభో న చ ధర్మసమః పితా॥
స వివేకసమో బన్దుర్నైకాదశ్యాః పరం వ్రతమ్ అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనమ్॥
ఉపవాసవ్రతము నాచరించు ధర్మ కార్యపరాయణులు చండాలురను పతితులను ఎప్పుడూ చూడరాదు. నాస్తికులను మర్యాదార హితులను, నిందించువారిని, కొండెములను చెప్పుచారిని, ఉపవాసవ్రతము చేయువారి పలుకరించరాదు. శూద్ర స్త్రీకి పుట్టిన వారిని పోషించువారితో, శూద్ర స్త్రీపతితో యజ్ఞాధికారములేని వానిచే యజ్ఞమును చేయించువానితో మాటలాడరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగినవాని ఇంటిలో భోజనము చేయువారితో, గాయకునితో, ధనముతీసుకొని దేవార్చన చేయువానితో, డబ్బు తీసుకొని వైద్యము చేయువారితో,కార్యమును చేయువారితో దేవబ్రాహ్మణులను ద్వేషించువారితో పరాన్నము పై ఆశపడువారితో, పరస్త్రీ నిరతునితో మాటమాత్రముతోనైన సన్మానముగా వ్యవహరించరాదు. ఇటువంటి నియములను నాచరించి శుద్దుడై ఇంద్రియజయము కలిగి సర్వ హితమును కోరుచు ఉపవాసవ్రతమునాచరించినచో ఉత్తమ సిద్ధిని పొందగలరు. గంగాసమతీర్థము, మాతృసమగురువు, విష్ణుసమదైవము, నిరాహారమును మించిన తపము మరియొకటిలేదు, కముతో సమమగు తల్లి, కీర్తి సమమైన ధనము, జ్ఞాన సమమగు లాభము, ధర్మ సముడగు తండ్రి, వివేకసముడైన బంధువు, ఏకాదశిని మించిన వ్రతము లేదు. ఈ విషయమున ఈ ఇతిహాసమును చెప్పుచుందురు వినుము.
సంవాదం భద్రశీలస్య తత్పితుర్గాలవస్య చ।
పురా హి గాలవో నామ మునిస్సత్యపరాయణః॥
ఉవాస నర్మదాతీరే శాన్తో దాన్తస్తపోనిధిః।
బహువృక్షసమాకీర్ణే గజభల్లునిషేవితే॥
సిద్ధచారణగంధర్వయక్షవిద్యాధరాన్వితే।
కందమూలఫలైః పూర్ణే మునిబృందని షేవితే॥
గాలవో నామ విప్రేన్ద్రో నివాసమకరోచ్చిరమ్।
తస్యాభవద్భద్రశీల ఇతి ఖ్యాతస్సతో వశీ॥
జాతిస్మరో మహాభాగో నారాయణపరాయణః।
బాలక్రీడనకాలేఽపి భద్రరీలో మహామతిః॥
మృదా చ విష్ణోః ప్రతిమాం కృత్వా పూజయతే క్షణమ్।
వయస్యాన్బోధయేచ్చాపి విష్ణుః పూజ్యో నరైస్సదా॥
ఏకాదశీవ్రతం చైవ కర్తవ్యమపి పండితైః।
ఏవం తే బోధితా స్తేన శిశవోఽపి మునీశ్రర॥
హరిం మృదైవ నిర్మాయ పృధక్సంభూయ వా ముదా॥
ఆర్చయన్తి మహాభాగా విష్ణుభక్తిపరాయణాః॥
నమస్కుర్వన్ఛద్రమతిర్విష్ణవే సర్వజిష్ణవే।
సర్వేషాం జగతాం స్వస్తి భూయాదిత్యబ్రవీదిదమ్॥
క్రీడాకాలే ముహూర్తం వా ముహూర్తార్థమథాపి వా।
ఏకాదశీతి సంకల్ప్య వ్రతం యచ్ఛతి కేశవే॥
ఏవం సుచరితం దృష్ట్వా తనయం గాలవో మునిః।
ఆపృచ్ఛద్విస్మయావిష్టస్సమాలింగ్య తపోనిధిః॥
భద్రశీలునికి భద్రశీలుని తండ్రి గాలవునికి జరిగిన సంవాదమును వినుము. పూర్వకాలమున గాలవుడను మహర్షి, పరమశాంతుడు, దాంతుడు, తపోనిధి నర్మదాతీరమున నివసించుచుండెను. ఆ నర్మదా తీరము నానావృకసమన్వితము. గజ భల్లూకాది మృగ ని షేవితము. సిద్ధచారణ గంధర్వయక్ష విద్యాధర సేవితము. కందమూలఫలముతో సమృద్ధము. ముని బృంద సేవితము. ఆచట గౌరవ మహర్షి చాలాకాలము నివసించేను. గాలవమహర్షికి భద్రశీలుడను కుమారుడు కలిగెను. అతడు సుప్రసిద్దుడు జితేంద్రియుడు. పూర్వజన్మ జ్ఞానము కలవాడు. మహానుభావుడు. నారాయణ భక్తుడు. మహామతియగు భద్రశీలుడు బాల్యక్రీడలలో కూడా మట్టి విష్ణుప్రతిమను చేసుకొని క్షణకాలము పూజించుచుండెడివాడు. సర్వకాలమున శ్రీమహావిష్ణువును పూజించవలయునని మిత్రులను బోధించుచుండెడివాడు. పండితులైన వారు ఏకాదశీవ్రతము నాచరించవలయును. ఓ మునీశ్వరా ! ఇట్లు భద్రశీలునిచే బోధించబడిన శిశువులు కూడా కలిసి విడిగా మట్టి శ్రీహరి ప్రతిమను నిర్మించుకొని విష్ణుభక్తి పరాయణులై ఆర్చించుచుండిరి. సర్వజిష్ణువుగు శ్రీమహావిష్ణువునకు నమస్కరించుచు సర్వజగములను శుభము కలుగ వలయునని కోరుచుండెడివాడు. క్రీడా సమయమున ఒక ముహూర్తము కాని ముహూర్తార్థము కాని ఏకాదశీ అని సంకల్పము చేసి శ్రీహరికి వ్రతమును సమర్పించెడివాడు. ఇట్లు సచ్చరిత్రగల కుమారుని చూచి గాలవ మహర్షి ఆశ్చర్యమునందినవాడై చక్కగా ఆలింగమును చేసుకొని ఇట్లు అడిగెను.
గాలవ ఉవాచ :
భద్రశీల మహాభాగ భద్రశీలోఽసి సువ్రత !
చరితం మంగలం యత్తే యోగినామపి దుర్లభమ్॥
హరిపూజాపరో నిత్యం సర్వభూత హితే రతః ఏకాదశీవ్రతపరో నిషిద్దాచారవర్జితః।
నిర్ద్వన్దో నిర్మమశ్శాన్తో హరిధ్యానపరాయణః॥
ఏవ మేతాదృశీ బుద్ధిః కథం జాతార్భకస్సతే వినాపి మహాతాం సేవాం హరిభక్తిరిదుర్లభా॥
స్వభావతో జనస్యాస్య హ్యవిద్యాకామకర్మసు ప్రవర్తతే మతిర్వత్స కథం తేఽలౌకికీ కృతిః
సత్సంగేఽపి మనుష్యాణాం పూర్వపుణ్యాతిరేకతః జాయతే భగవద్భక్తిస్తదహం విస్మయం గతః
పృచ్ఛామి ప్రీతిమాపన్నస్తద్భవాన్వక్తుమర్హతి భద్రశీలో మునిశ్రేష్ఠః పిత్రైవం సువికల్పితైః
జాతిస్మరస్సుకృతాత్మా హృష్ట ప్రహసీతాననః స్వానుభూతం యథావృత్తం సర్వం పిత్రే న్య వేదయత్॥
గాలవ మహర్షి పలికెను : మహానుభావా ! భద్రశీలా ! నీవు నిజముగా భద్రమగు శీలము గలవడమే. నీ చరితము యోగులకు కూడా దుర్లభమగు మంగళకరము. ఎల్లపుడూ హరి పూజను చేయుచు సర్వప్రాణి హితమును కోరుచు ఏకాదశి వ్రతము నాచరించుచు నిషిద్ధమైన దాని విడిచి సుఖదుఃఖములను పరిత్యజించి మమకార రహితుడవై శాంతుడవై హరిధ్యాన పరాయణుడవై యుంటివి. బాలుడవాన నీకు ఇట్టి . బుద్ధి ఎట్లు కలిగెను ? మహాత్ముల సేవ లేనిదే హరి భక్తి కలుగునది కాదు. సామాన్యముగా లోకమున మానవులకు అవిద్యవలన కామ్యకర్మలయందాసక్తి కలుగును కదా ! నీ కెట్లు అలౌకికమైన బుద్ధి కలిగినది. మానవులకు సత్సంగమున్ననూ పూర్వజన్మ సుకృతము లేనిదే భగవద్భక్తి కలుగదు. అందువలననే నేను విస్మయమును చెందుచున్నాను. కావుననే ప్రీతిచెంది అడుగుచున్నాను. కావున తెలుపుము. ఇట్లు తండ్రి అయిన గాలవమహర్షి ప్రశ్నించగా పుణ్యాత్ముడు పూర్వజన్మ జ్ఞానము కలవాడు అయిన భద్రశీలుడు ఆనందముతో విప్పారిన మోము కలవాడై తాను అనుభవించిన దానిని యథాతధముగా తండ్రికి తెలియపరిచెను.
భద్రశీల ఉవాచ :-
శృణు తాత మునిశ్రేష్ఠ హ్యనుభూతం మయా పురా।
జాతీస్మరత్వాజ్ఞానామి యమేన పరిభాషితమ్॥
ఏతచ్ఛ్రుత్వా మహాభాగో గాలవో విస్మయాన్వితః।
ఉవాచ ప్రీతి మాపన్నో భద్రకీలం మహామతిమ్॥
భద్రశీలుడు పలికెను :- “ఓ తండ్రీ ! మహామునీ ! నేను పూర్వ జన్మలో అనుభవించిన దానిని చెప్పెదను వినుము. నాకు పూర్వజన్మ జ్ఞానము కలదు కావున యమధర్మరాజు చెప్పినదానిని వినుము”. ఈ విషయమును వినిన గాలవ మహర్షి ఆశ్చర్యమునొంది ప్రీతితో మహామతియగు భద్రశీలుని గూర్చి ఇట్లుపలికెను.
గాలవ ఉవాచ :-
కస్త్వం పూర్వం మహాభాగ ! కిముక్తం చ యమేన తే కస్య వా కేనవా హేతో స్తత్సర్వం వక్తుమర్హసి
గాలవ మహర్షి పలికెను :- ఓ మహానుభావా ! నీవు పూర్వజన్మలో ఎవరివి ? యముడు నీతో ఏమి పలికెను? ఎందువలన పలికెనో త్వరగా చెప్పుము.
భద్రశీల ఉవాచ :-
అహమాసం పురా తాత ! రాజా సోమకలోద్భవః।
ధర్మకీర్తి రితి ఖ్యాతో దత్తాత్రేయేణ శాసితః॥
నవవర్ష సహస్రాణి మహీం కృత్స్నామపాలయమ్।
అధర్మాశ్చ తథా ధర్మా మయా తు బహవః కృతా॥
తత శియా ప్రమత్తోఽహం బహ్వధర్మమకారిషమ్।
పాషండ జన సంసర్గా తాషండచరితోఽభవమ్॥
పురార్జితాని పుణ్యాని మయా తు సుబహూన్యపి।
పాషండైర్బాధితోఽహం తు వేదమార్గం సమత్యజమ్॥
ముఖాశ్చ సర్వే విధ్వస్తా కూటయుక్తి విదా మయా।
అధర్మనిరతం మాం తు దృష్ట్వా మద్దేశజాః ప్రజాః॥
సదైవ దుష్కృతం చక్రు షష్టాంశస్తత్రమేఽ భవత్।
ఏవం పాప సమాచార వ్యసనాభిరత స్సదా॥
మృగయాభిరతో భూత్వా హ్యేకదా ప్రావిశం వనమ్।
స సైన్సోఽహం వనే తత్ర హత్వా బహువిధాన్మగాన్॥
క్షత్తృట్పరివృతశ్శాంతో రేవాతీరముపాగమమ్।
రవితీక్ష్ణాతపక్లాన్తో రేవాయాం స్నానమాచరమ్॥
అదృష్ట సైన్య ఏకాకీ పీడ్యమానః క్షుధా భృశమ్।
సమేతాస్తత్ర యే కేచిద్రేవాతీరనివాసినః॥
సమేతా సత్ర యే కేచిద్రేవాతీరనివాసినః।
ఏకాదశీవ్రత పరా మయా దృష్టా నిశాముఖే॥
నిరాహారశ్చ తత్రాహమేకాకీ తజ్జనైస్సహ।
జాగరం కృతవాంశ్చాపి సేనయా రహితో నిశి॥
అధ్వశ్రమ పరిశ్రాంతః క్షుత్పిపాసా ప్రపీడితః।
తత్రైవ జాగరణాన్తేఽహం పంచత్వమాగతః॥
తతో యమభటైర్భద్భో మహాదంష్ట్రా భయంకరైః।
అనేక క్లేశ సంపన్నమార్గేణాప్తో యమాంతికమ్।
దంష్ట్రాకరాలవదన మపశ్యం సమవర్తినమ్॥
అథకాలశ్చిత్రగుప్తమాహూథాయేదమభాషత।
అస్య శీక్షా విధానం చ యథావద్వద పండిత॥
ఏవముక్త శ్చిత్రగుప్తో ధర్మరాజేన సత్తమ।
చిరం విచారయామాస పునశ్చేదమభాషత॥
అసౌ పాపరతస్సత్యం తథాపి శృణు ధర్మప !।
ఏకాదశ్యాం నిరాహారస్సర్వపాపైః ప్రముచ్యతే॥
ఏష రేవాతటే రమ్యే నిరాహారా ! హరేర్దినే।
జాగరం చోపవాసం చ కృత్వా నిష్పాపతాం గత !॥
యాని కాని చ పాపాని కృతాని సుబహూని చ।
తాని సర్వాణి నష్టాని హ్యుపవాసప్రభావతః॥
ఏవముక్తో ధర్మరాజుశ్చిత్రగుప్తేన ధీమతా।
ననామ దండవద్భూమౌ మమాగ్రే సోఽనుకంపితః॥
పూజయామాస మాం తత్ర భక్తిభావేన ధర్మరాట్।
తతశ్చ స్వభటాన్సర్వానాహూయేదమువాచ హ॥
భద్రశీలుడు పలికెను : ఓ తండ్రీ ! నేను పూర్వము సోమవంశపురాజుగా ఉంటిని. నా పేరు ధర్మకీర్తి. నా గురువు దత్తాత్రేయ మహర్షి. తొమ్మిది వేల సంవత్సరములు రాజ్యపాలన చేసితిని. అధర్మములను ధర్మములను చాలా ఆచరించితిని. అంతట ఐశ్వర్యమదముతో చాల అధర్మముల నాచరింతిని. పాషండ జనుల మైత్రితో పాషండాచారము ననుసరించితిని. మొదట చాల పుణ్యములను సంపాదించితిని కాని పాషండులచే బాధించబడిన నేను వేదమార్గమును పరిత్యజించితిని. మాట యుక్తి విదుడనైన నేను చాల యజ్ఞములను ధ్వంసము చేసితిని. నేను అధర్మనిరతుడనగుట చూచి నా దేశప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరించుచుండిరి. ఆ అధర్మమునుండి ఆరవ భాగము నాకు చేరినది. ఇట్లు పాపా చారుడను, వ్యసనరతుడను అయిన నేను వేట మీద ఆసక్తి కలిగి ఒకసారి ఆడవికి వెళ్ళితిని, సైన్యముతో అడవిలో చాలా మృగములను చంపితిని. ఆకలిదప్పులు బాధించగా రేవానదీతీరమును చేరితిని. సూర్యకిరణతాపొరుడనైన నేను రేవానదీలో స్నానము చేసితిని. కాని నా వెంట నా సైన్యము చేరలేదు. సైన్యములేక ఒంటరినై ఆకలి దప్పికచే పీడించబడుచు రేవానదీ తీరవాసులను కొందరిని కలిసితిని. సాయంకాల సమయమున ఏకాదశవ్రతము నాచరించుచున్నవారిని చూచితిని. ఒంటరినైన నేను వారితో కలిసి నిరాహారముగా నుంటిని. సైన్యము లేనందున రాత్రి అంతయు జాగరణ చేసితిని, నడక బడలికతో ఆకలి దప్పులతో పీడించబడిన నేను జాగరణ చీరలో ప్రాతఃకాలమున మరణించితిని. అపుడు మహాదంష్టలతో భయంకరులైన యమభటులు నన్ను బంధించి బహుకష్టతరమైన మార్గముతో యముని సన్నిధికి చేర్చి ఆచట దంష్ట్రాకరాల వదనుడైన యమధర్మరాజును చూచితిని. అపుడు సమవర్తీ చిత్రగుప్తుని పిలచి “ఇతని చరితమును శిక్షను వివరించుము” అని పలికెను. ధర్మరాజు మాటలను వినిన చిత్రగుప్పుడు చాలాకాలమాలోచించి ఇట్లు పలికెను “ ఓ ధర్మరాజా ! ఇతడు వాస్తవముగా పాపాచారరతుడే. అయిననూ ఏకాదశీ తిథిన నిరాహారముగా నున్నచో అన్ని పాపములు తొలగును. ఇతడు వేటకై బయలువెడలి ఏకాదశీ తిథిన రేవానదీ తీరమున నిరాహారముగా నుండి జాగరము చేసెను. కావున ఇతని పాపములన్నియు తొలగెను. ఇతను చేసిన పాపములన్నియు ఏకాదశీ ఉపవాస ప్రభావముచే నశించినవి” ధీమంతుడగు చిత్రగుప్తు డిట్లు పలుకగా యమధర్మరాజు వినయముతో భక్తితో నాముందు దండవత్రణామునాచరించెను. భక్తి భావముతో నన్ను పూజించెను. తరువాత తన భటులనందరిని పిలిచి ఇట్లు పలికెను.
ధర్మరాజు ఉవాచ :-
శృణుధ్వం మద్వచో దూతా హితం వక్ష్యామ్యనుత్తమమ్।
ధర్మమార్గరతాన్మర్త్యా న్మానయధ్వం మమాస్తికమ్॥
యే విష్ణుపూజనరతాః ప్రయతాకృజ్ఞా శ్చెకాదశీవ్రతమా విజితేన్ద్రియాశ్చ। నారాయణాచ్యుతహరే శరణం
భవేతి శాన్తా వదన్తి సతతం తరసా త్యజధ్వమ్
నారాయణాచ్యుత జనార్దన కృష్ణ విష్ణో ! పద్మేశ ! పద్మజపితశ్శివ శంకరేతి।
నిత్యం వదన్త్యభిలం లోకహితాః ప్రశాన్తా దూరాద్భటాస్త్యజత తాన్న మమైషు శిక్షా॥ నారాయణార్పితకృతాన్హరిభక్తిభాజస్వాచారమార్గనిరతన్గురు సేవకాంశ్చ। సత్పాత్రదాననిరతాంశ్చ సుదీనపాలాన్దూతాస్త్యజస్వమనిశం హరినామసక్తాన్॥ పాషండసంగరహితాన్ద్విజభక్తి నిషాన్సత్సంగలోలుపతరాంశ్చ తథాతిధేయాన్।
శంభౌ హరౌ చ మనబుద్దిమతస్తథైవ దూతస్త్యజస్వముపకారపరాన్ జ్ఞానానామ్॥
యే వర్జితా హరికథామృత సేవనైశ్చ నారాయణస్మృతిపరాయణమాన సైశ్చ।
విప్రేన్ద్రపాద జల సేచనతోఽ ప్రహృష్టాంస్తానాపినో మమ భటా గృహమానయధ్వమ్
యే మాతృతాతపరిభర్తనశీలినశ్చ లోకద్విషో హితజనాహితకర్మణశ్చ।
దేవస్వలోభనిరతాన్ జననాశనకరూ నత్రానయధ్వ మహరాధ ఏకాదశీవ్రతపరాజ్ముఖముగ్రశీలం లోకాపవాదనిరతం పరనిందకం చ।
గ్రామస్య నాశకరముత్తమవైరయుక్తం దూతాస్సమానయత విప్రధనేషు లుబ్దమ్॥
యే విష్ణుభక్తి విముఖాః ప్రణమంతి నైవ నారాయణం హి శరణాగతపాలకం చ। విష్ణ్వాలయం చ నహి యాంతి నరాస్సుమూర్ఖ స్తానానయధ్వమతిపాపరతాన్ప్రసహ్య
ఏవం శ్రుతం యదా తత్ర యమేన పరిభాషితమ్।
మయాను తాపదగ్ధేన స్మృతం తత్కర్మ నిర్ణితమ్॥
ఆసత్కర్మానుతా పేన సద్ధర్మ శ్రవణేన చ।
తత్రైవ సర్వపాపాని నిశ్శేషాణి గతాని మే॥
పాప శేషాద్వినిర్ముక్తం హరిసారూప్యతాం గతమ్।
సహస్రసూర్యసంకాశం ప్రణనామ యమశ్చ తమ్॥
ఏవం దృష్ట్వా విస్మితా స్తే యమదూతా భయోత్కటాః।
విశ్వాసం పరమం చక్రుర్యమేన పరిభాషితే॥
ధర్మరాజు పలికెను :- “ఓ దూతలారా ! నా మాటను వినుడు. మీకు హితమును బోధించెదను. ధర్మమార్గరతులై మానవులను నా వద్దకు చేర్చుకుడు. విష్ణుపూజా పరులను, భక్తులను, కృతజ్ఞలను, ఏకాదశీవ్రతపరులను, జితేన్టియులను “నారాయణ ! అచ్యుత ! హరే ! రక్షకుడవుకమ్ము” అని ఎప్పుడూ పలుకు శాస్తులను త్వరగా వదిలి పెట్టుడు. నారాయణా ! “అచ్యుత ! హరే ! జనార్దన ! కృష్ణ ! విష్ణో ! పద్మేశ ! పద్మజపిత! శివ ! శంకర” అని. ఎల్లపుడూ పలుకు అఖిల లోక హితకొంకులను, ప్రశాంతులను దూరము నుండియే వదులుడు. వారి విషయమున నా శిక్షలుండవు. అన్ని కర్మలను నారాయణు కర్పించు వారిని, హరిభక్తి గలవారిని, స్వాచారమార్గమున నడుచువారిని గురు సేవకులను, సత్పాతదాననీరతులను, దీనపాలకులను, హరినామ పరాయణులను వదిలి పెట్టుడు. పాషండ సంగమ:లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమునందు నందాస్తక్తి కలవారిని, అతిథిపూజ చేయువారిని, బ్రాహ్మణ భక్తి కలవారిని, సత్సంగమునందు నందాసక్తి కలవారిని, అతిథిపూజ చేయువారిని, శివ విష్ణువులందు సమబుద్ధి కలవారిని, జనోపకారములను విడిచి పెట్టుడు. హరికథామృతమును సేవించువారిని, నారాయణస్మృతి పరాయణమౌనసులతో కలియుని వారిని, బ్రాహ్మణపాద జల సేచనముతో సంతోషించనివారిని, లోకులను ద్వేషించువారిని, హితజనులను అహితము నాచరించువారిని, దేవధనమున నొశించువారిని, హిత జనులకు అహితము నాచరించువారిని, దేవధనము సాగించువారినీ, జనులను నాశముచేయువారిని, అపరాధపరులను ఇక్కడకి రెండు. ఏకాదశీవ్రతపరబ్ముఖుని, ఉగ్రస్వభావుని, లోకాపవాద నిరతుని, పరనిందకుని, గ్రామస్థాశకుని, ఉత్తములను ద్వేషించువానిని, బ్రాహ్మణ ధనము నాశించువానిని ఇటకు రెండు. విష్ణుభక్తి విముఖునకు వెళ్ళని వారినీ, మూర్ఖులను అతి పాపరతులను, ఇటకు లెండు.” ఇట్లు యమధర్మరాజు పలికిన మాటలను వినిన నేను చేసిన పాపకర్మలను తలచుకొని పరితపించితిని. పాపములను తలచి పశ్చాత్తాపమును చెందుటచే సద్ధర్మములను వినుటచే అప్పుడే అక్కడే నా నా పాపములన్ని నిశ్శేషముగా నశించినవి. ఇట్లు పాపరాహిత్యమునొంది హరిసారూప్యమును పొందియున్న సహస్ర సూర్యసమప్రకాశుడనైన నాకు ధర్మరాజు నమస్కరించెను. ఇట్లు నన్ను చూచిన యమదూతలు భయముచే వణుకుచు యమధర్మరాజు చెప్పిన దానిని దృఢముగా విశ్వసించిరి.
తతస్సంపూజ్య మాం కాలో విమానశతసంకులమ్।
సద్యస్సంప్రేషయామాస తద్విష్ణోః పరమం పదమ్॥
విమానకోటిభిస్సార్థం సర్వభోగసమన్వితైః।
కర్మణా తేన విప్రర్షే విష్ణులోకే మయోషితమ్॥
కల్పకోటిసహస్రాణి కల్పకోటీశతాని చ।
స్థిత్వా విష్ణుపదం పశ్చాదింద్రలోకముపాగమమ్॥
తత్రాపి సర్వభోగాఢ్యస్సర్వదేవనమస్కృతః।
తావత్కాలం దివి స్థిత్వా తతో భూమిముపాగతః॥
ఆత్రాపి విష్ణుభక్తానాం జాతోఽహం భవతాం కులే।
జాతిస్మరత్వాఙ్ఞానామి సర్పమేతను నీశ్వర !
తస్మాద్విష్ణర్చనోద్యోగం కరోమి సహబాలకైః।
ఏకాదశీవ్రతమిదమితి న జ్ఞాతవాన్పురా॥
జాతిస్మృతిప్రభా వేణ తదజ్ఞాతం సాంప్రతం మయా।
అవశేనాపి యత్కర్మ కృతం తస్య ఫలం త్విదమ్॥
ఏకాదశీవ్రతం భక్త్యా కుర్వతాం కిముత ప్రభో।
తస్మాచ్చరి ప్యే విప్రేన్ద్ర శుభమేకాదశీవ్రతమ్॥
విష్ణుపూజాం చాహరహః పరమస్థానకాంక్షయా।
ఏకాదశీవ్రతం యత్తు కుర్వీత శ్రద్దయా నరాః॥
తేషాం తు విష్ణుభవనం పరమానన్దదాయకమ్।
ఏవం పుత్రవచశ్రుత్వా సంతుష్టా గాలవో మునిః॥
ఆవాప పరమాం తుష్టిం మనసా చాతీహర్షితః।
మజ్జన్మ స ఫలం జాతం మద్వంశః పావనీకృతః॥
యతస్త్వం మద్గృహే జాలో విష్ణుభక్తిపరాయణః।
ఇతి సంతుష్టచిత్తస్తు తస్య పుత్రస్య కర్మణా॥
హరిపూజావిధానం చ యథావత్సమబోధయత్।
ఇత్యేతత్తే మునిశ్రేష్ఠ యథావత్కథితం మయా॥
సంకోచవిస్తరాభ్యాం చ కిమన్యచ్ఛ్రోతుమిచ్ఛసి॥
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే వ్రతాఖ్యానే ఏకాదశీవ్రత మహిమానువర్ణనం నామ త్రయోవింశోఽధ్యాయః॥
తరువాత యమధర్మరాజు నన్ను సన్మానించి నూరు దివ్యవిమానములతో శ్రీమహావిష్ణు పరమ పదమును పంపెను. నేను చేసి ఆ చిన్న పనిచే అన్ని భోగములతో కూడిన కోటి విమానములతో విష్ణులోకమున నుంటిని. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, విష్ణులోకమును నుండి తరువాత ఇంద్రలోకమునకు వచ్చితిని. ఆచట కూడా దేవతలందరిచే పూజలనందుచు కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు, అన్ని భోగములుతో నివసించి భూలోకమునకు వచ్చితిని. ఇచట కూడా విష్ణుభక్తులైన మీ వంశమున పుట్టితిని. పూర్వజన్మ జ్ఞానముచే దీనినంతటిని తెలిసియున్నాను. కావుననే బాకులతో కలిసి విష్ణుపూజా ప్రయత్నమును చేయుచున్నాను. మొదట నేనాచరించినది ఏకాదశవ్రతమని తెలియకపోతిని. పూర్వజన్మ జ్ఞానముచే ఇపుడు తెలిసితిని. నేను నా వశమునలో లేనప్పుడు చేసిన పని కే ఇంతటి ఫలము కలిగినదన్న భక్తిచే ఏకాదశవ్రతమును చేయువారికి కలుగు ఫలమునేమి చెప్పవలయును. కావున ఓ మహర్షి ! నేను పరమపవిత్రమైన ఏకాదశవ్రతమును ఆచరించెదను. పరమపదమును కాంక్షించి ప్రతిపూట విష్ణుపూజను చేసెదను. శ్రద్దతో ఏకాదశవ్రతము నాచరించువారు పరమానందతాయకమగు విష్ణుభవనమును పొందెదరు. ఇట్లు భద్రకీలుని మాటలను వినిన గాలవమహరి సంతోషించినవారై పరమానందమును మానసికముగా పొందెను. విష్ణుభక్తి పరాయణుడైన నీవు నా వంశమున పట్టితివి కావున నా వంశము ధన్య మైనది నా జన్మ సఫలమైనది. ఇట్లు పుత్రుని కర్మలచే సంతోషించిన గాలవమహర్షి విధి విధానముగా హరిపూజా విధానమును బోధించెను. ఓ మునిపుంగవా! ఇట్లు ఏకాదశవ్రద మహిమను సంకోచవిస్తారములతో నీకు చెప్పితిని. ఇంకను ఏమీ వినకోరుచుంటిలో తెలుపుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున వ్రతాఖ్యానమున ఏకాదశి వ్రతమహిమానువర్ణనమను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 23 of the Nārada Mahā Purana is as follows:
సమస్త వ్రతములలో కల్లా అత్యుత్తమమైనదిగా భావించబడే ఏకాదశీ వ్రత మాహాత్మ్యమును ఈ అధ్యాయంలో అత్యంత భక్తిప్రపత్తులతో వర్ణించబడినది. ఏకాదశీ రోజున అన్నవర్జనము చేసి హరినామ సంకీర్తనంలో గడిపే భక్తులకు లభించే అమోఘమైన పుణ్యఫలము మరియు ముక్తిమార్గము ఇక్కడ నిరూపించబడినది.