నారద మహా పురాణము
87 - దుర్గా మంత్ర చతుష్టయ వర్ణనమ్
సనత్కుమార ఉవాచ :
అవతార త్రయం లక్ష్మ్యాః కధితం తే ద్విజోత్తమ ।
దుర్గాయా శ్చాభిధాస్యామి నర్వలోకోపకారకాన్
ప్రణవశ్శ్రీ శ్శివాయుగ్మం వాణీ వైరోచనీపదమ్ ।
వజ్రాద్యం క్షుధితా సూక్ష్మా మృతా స్వాగీందు సంయుతా
ప్రతిష్టాప్య శివా షట్చ స్వాహాంతో తృష్టి వర్ణవాన్ ।
భైరవోఖస్య ముని సమ్రాట్ ఛన్లో మన్తస్య దేవతా
ఛిన్నమస్తా రమా బీజం స్వాహా శక్తి రుదీరితా ।
ఆం ఖడ్గాయ హృదాఖ్యాత మిం ఖడ్గాయ శిరస్సృతమ్
ఊం వజ్రాయ శిఖాప్రోక్తా ఐం పాశాయ తనుచ్ఛదమ్ ।
ఔమంకుశాయ నేత్రర్యో ద్విసర్గో వసురక్షయుక్
మాయాయుగ్మం చాస్త్ర మంగం మనవః ప్రణవాదికాః ।
స్వాహాంతాశ్చైవమంగాని కృత్వా ధ్యాయేదధాంబికామ్
భాను మండల సంస్థానం ప్రవికీర్ణాలకం శిరః ।
ఛిన్నం స్వకం స్ఫార ముఖం స్వరక్తం ప్రపిబద్ధలతో
ఉపరిస్లాం రతాసక్తరతిమన్మథయోర్నిజే ।
డాకినీ వర్ణినీ సఖ్యై దృష్ట్వామోదభరామలామ్
ధ్యాత్వైవం ప్రజ పేల్లక్ష చతుష్పం తద్దశాంశతః ।
పాలాశైర్బిల్వజైర్వాపి జుహుయాత్కుసుమైః ఫలైః
ఆధార శక్తిమారభ్య పరతత్యాంత పూజితే ।
పీలే జయాఖ్యా విజయా జితా చాపి పరాజితా
నిత్యా విలాసినీ షష్ఠి దోగ్ధ్యఫరా చ మంగలా ।
దీక్షు మధ్యే చ సంపూజ్యా నవపీఠస్య శక్తయః
సర్వబుద్ధిప్రదే వర్ణనీయే సర్వభృగు స్సదృక్ ।
సిద్ధిప్రదే డాకినీయే తారో వజ్రస్సభౌతికః
ఖడ్గశో రోచనీయేం తే భగం ధేహి నమోంతకః ।
తారాది పీఠ మంత్రోయం వేద రామాక్షరో మంతః
సమర్యాస నమేతేన తత్ర సంపూజయేచ్ఛివామ్ ।
త్రికోణ మధ్య షట్కోణ పద్మ భూపుర మధ్యతః
బాహ్యావరణ మారభ్య పూజయే త్రతిలోమతః ।
భూపురే బాహ్య భాగేషు వజ్రాదీని ప్రపూజయేత్
తదనస్సురరాజాదీన్ పూజయేద్ధరితాం పతీన్ ।
భూపురస్య చతుర్ద్వార్టు ద్వారపాలా న్యసేదథ
కరాల వికరాలాఖ్యా వతికాల సృతీయకః ।
మహాకాల శ్చతుర్ధ స్స్యాదథ పద్మేష్ట శక్తయః
ఏకలింగా యోగినీ చ డాకినీ భైరవీ తథా ।
మహా భైరవ కేంద్రాక్షీ త్వసితాంగీతి సప్తమి
సంహారిణ్యష్టమి చేతి షట్కోణేష్వంగ మూర్తయః ।
త్రికోణగా ఛిన్నమస్తా పార్వయోస్తు సఖీద్వయమ్.
డాకినీ వర్ణినీ సంజ్ఞం తాకా వాగ్భ్యాం ప్ర పూజయేత్ ।
ఏవం పూజాదిభిస్సీద్ధే మంత్ర మంత్రి మనోరథాన్
ప్రాప్నుయాన్నిఖిలాన్సద్యో దుర్లభాంస్తత్రసాదతః ।
శ్రీ పుషేర్లభతే లక్ష్మీం తత్ఫలైశ్చ సమిహితమ్
వాక్సిద్ధిం మాలతీ పుషైశ్చంపకై ర్హవనాత్సుఖమ్ ।
ఘృతాక్తం ఛాగమాంసయో ర్జుహుయాత్పత్యహం శతమ్
మాసమేకం తు వశగాస్తస్యస్యు స్సర్వ పార్థివా ।
వరవీర సుమై శ్వేతై ర్లక్ష సంఖ్యైర్జుహోతి యః
రోగజాలం పరిభూ సుఖీ జీవచ్ఛతం సమాః ।
రకైస్తత్సంఖ్యలో హుత్వా వశయేన్మశ్రిణో నృపాన్
ఫలైరుత్వాప్నుయాల్లక్ష్మీ ముదుంబరపలాశజైః ।
గోమాయు మాంసైస్తామేవ కవితాం పయసాంధసా
బంధూక కుసుమైరాగ్యం కర్లికారై స్సమిహితమ్ ।
తిలతండులహామేన వశయేన్నిఖిలాజ్ఞనాన్
నారీరబోభి రాకృష్ణ రగమాంసై స్సమాహితమ్ ।
స్తంభనం మాహిషై ర్మాంగైః పంకజై స్స ఘృతైరపి
చితాగ్నౌ పరభృత్నకై ర్జుహుయాదరిమృత్యవే ।
ఉన్మత్త కాష్ఠ దీపేలిగ్నె తత్ఫలం వాయసచ్ఛదైః
ద్యూతే వనే నృపద్వారే సమరే వైరి సంకటే ।
విజయం లభతే మంత్రీ ధ్యాయందేవీం జపేన్మనుమ్
భుక్యై ముక్యై సితాం ధ్యాయేదుచ్చాటే నీల రోచిషమ్ ।
రక్తం వశ్య మృతా ధూమ్రాం స్తంభనే కనక ప్రభామ్
నిశి దద్యాద్బలిం తస్యై సిద్ధయే మదిరాదినా ।
గోపనీయః ప్రయోగోయం ప్రోచ్యతే సర్వసిద్ధిదః
భూతాహే కృష్ణపక్షస్య మధ్యరాత్రే తమోఘనే ।
స్నాత్వా రక్షాంబరధరో రక్తమాల్యాను లేపనః
ఆనీయ పూజయే న్నారీం ఛిన్నమస్తా స్వరూపిణీమ్ ।
సుందరీం యౌవనాక్రాంతాం నరపంచక గామినీమ్
సుస్మితాం ముక్త కబరీం భూషాదాన ప్రతోషితామ్ ।
వివస్త్రాం పూజయిత్వైనాల అయుతం ప్రజపేన్మనుమ్
బలిం దత్వా నిశాం నీత్వా సంప్రెష్య ధనతోషితామ్ ।
భోజయే ద్వివిధై రన్నై డ్రాహ్మణా న్ఫోజనాది నా
అనేక విధినా లక్ష్మీం పుత్రా నాత్రాస్థనం యశః ।
నారీమాయు స్సుఖం ధర్మ మిష్టం చ సమవాప్నుయాత్
తస్యాం రాత్రా వ్రతం కార్యం విద్యా కామేన మంత్రిణా ।
మనోరథేషు చాన్యేషు గచ్ఛేత్తాం ప్రజ పననుమ్
ఉషస్యుత్థాయ శయ్యాయాముపవిష్ణో జపేచ్ఛతమ్ ।
షణ్మాసాభ్యన్తరే మన్రీ కవిత్వన జయేత్కలిమ్
శివేన కీలితా చేయం తదుతీలన ముచ్యతే ।
మాయాం తార పుటాం మంత్రి జపే దష్టోత్తరం శతమ్
మంత్రస్యాదౌ తథైవాంతే భవేత్సిద్ధింప్రదాతు సా ।
ఉదితా ఛిన్నమస్తేయం కలౌ శీఘ్రమభీష్టదా
సనత్కుమార మహర్షి పలికెను :
ఓ బ్రాహ్మణోత్తమా? నీకు లక్ష్మీదేవి యొక్క అవతారత్రయమును చెప్పితిని. ఇక ఇపుడు సర్వలోకోపకారకములగు దుర్గావతారములను చెప్పెదను. “ఓం శ్రీ శివా శివా వాణీ వైరోచనీ” పదముల తరువాత వజ్రాద్యము క్షుధితా సూక్ష్మా మృతా స్వాగ్నీళ్లు సంయుతా శివా ఫట్లను కూడా ప్రతిష్ఠింప చేసి స్వాహాంతముగా అత్యష్టి వర్ణములు గల మంత్రమిది. ఈ మంత్రమునకు భైరవముని. సమ్రాట్ఛందస్సు. ఛిన్నమస్తా దేవతా, రమా బీజము. స్వాహా శక్తి. 'ఆంఖడ్డాయ' అని హృదయము. 'ఈం ఖడ్గాయ' అనునది శిరస్సు. 'ఊం వజ్రాయ' అనునది శిఖ. 'ఐంపొశాయ' అనునది కవచము. “ఔం అంకుశాయ” అనునది నేత్రము. విసర్గము వసురక్షయుక్కు. మాయాయుగ్మము అస్త్రము. ప్రణవాదికములు మంత్రములు, స్వాహాంతము వరకు, ఇట్లు అంగ కల్పన చేసి అంబికను భాను మండల మధ్యస్థనుగా, ప్రవికీలకగా, స్వమస్తకము ఛిన్నము కాగా స్పారముఖురాలై కారుచు పడుచున్న స్వరక్తమును త్రాగుచున్న దానినిగా, రతియందు ఆసక్తులగు రతీమన్మధులపైన యున్న దానినిగా, తన చెలికత్తెలగు డాకినీ వర్ణినులను చూచి ఆనందించు దానినిగా ధ్యానించి నాలుగు లక్షలు జపమును చేయవలయును. దశాంశమును మోదుగు మారేడు పూలచే పండ్లచే హోమమును చేయవలయును. ఆధార శక్తి ఉండి పరతత్త్యాంతము వరకు పూజించబడిన పీఠము నందు జయ, విజయ, జిత, పరాజిత, నిత్యా, విలాసినీ, దోస్తీ అఘోరా, మంగలా అను నవ పీఠ శక్తులను దిక్కులందు, మధ్య భాగమున పూజించవలయును. సర్వబుద్ధి ప్రదముగా వర్ణించి సర్వ భృగువు సదృక సిద్ధి ప్రదము డాకీనీ సంబంధము తారము సభౌతికమగు వజ్రము 'ఖడ్గశోచనీమే భగంధేహి నమః' ఇది తారాది పీఠ మంత్రము. వేదరామాక్షరము. ఈ మంత్రముచే ఆసనమును సమర్పించి అచట శివను పూజించవలయును. త్రికోణ మధ్య షట్కోణ పద్మ భూపుర మధ్యమున బాహ్యావరణము మొదలుకొని ప్రతిలోమ విధానముగా పూజించవలయును. భూపురమున బాహ్య భాగములందు వజ్రాదులను పూజించవలయును. దానిలోపల ఇంద్రాదులను పూజించ వలయును. భూపురము యొక్క నాలుగు ద్వారములందు ద్వారపాలకులను , పూజించవలయును. కరాలుడు, వికరాలుడు, అతికాలుడు మహాకాలుడు అనువారు నలుగురు ద్వారపాలకులు. ఆ తరువాత పద్మ ము నందు అష్టశక్తులను పూజించవలయును. ఏకలింగ యోగిని, డాకినీ, భైరవీ, మహాభైరవీ, కేంద్రాక్షి అసితాంగి, సంహరి అను వారీలు షట్కోణములందు అంగమూర్తులు. త్రికోణగా, ఛిన్నమస్తా అను వారలు పార్శ్వము నందు, సఖీద్వయమగు డాకినీవర్లీని అనువారలను తారా వాక్కులచే పూజించవలయును. ఇట్లు పూజాదులచే మంత్రము సిద్ధించిన పిదప సాధకుడు దుర్లభములగు ఇష్టమనోరథములను ఆ దేవీ అనుగ్రహముచే వెంటనే పొందవచ్చును. మారేడు పూలచే సంపద, మారేడు పండ్లచే ఇష్టము సిద్ధించును. మాలతీ పుష్పములచే హోమమును చేసిన వాక్సిద్ధి, చంపక పుష్ప హోమముచే సుఖము లభించును. నేతితో కలిపిన మేక మాంసము ప్రతి దినము నూరు చొప్పున ఒకనెల హోమము గావించినచో రాజులందరు వశమగుదురు. లక్షతెల్ల గన్నేరు పుష్పములచే హోమమును గావించిన అన్ని రోగములను పాలద్రోలి సుఖముగా నూరువత్సరములు జీవించును. లక్ష ఎఱ్ఱ గన్నేరు పూలచే హోమము గావించిన మంత్రులను రాజులను వశ పరచుకొనును. మేడి మోదుగు పండ్లచే హోమమును గావించిన సంపదను పొందును. గోమాయు మాంసముచే కాని, పాలచేకాని, అన్నముచే కాని హోమమును చేసిన కవిత్వమును పొందును. బంధూక పుష్ప హోమముచే భాగ్యము, కర్ణికార పుష్ప హోమముచే మనోరథమును పొందును. తిలతండుల హోమముచే జనులందరు వశులగుదురు. ఆ కృష్ణములగు నారీ రజములచే కాని మృగమాంసముచే కాని హోమమును చేసిన ఇష్టసిద్ధి కలుగును. మహేష మాంస హోమముచే, స ఘృత పంకజ హోమముచే స్తంభనము సిద్ధించును. శత్రు మృత్యువు కొఱకు చితాగ్ని యందు కోకిల రెక్కలచే హోమమును చేయవలయును. ఉమ్మెంత సమిధలచే ప్రజ్వరిల్లిన అగ్నిలో కాకి రెక్కలచే చేసిననూ అదే ఫలము కలుగును. ద్యూతమున, అరణ్యమున, రాజద్వారమున, సమరమున, శత్రు సంకటమున దేవిని ధ్యానించుచు మంత్రమును జపించినచో విజయమును పొందును. భుక్తిముక్తుల కొఱకు శ్వేత వర్ణను, ఉచ్చాటనకు నీల వర్ణను ధ్యానించవలయును. వశమునకు రక్త వర్లను, మృతికి ధూమ్ర వర్లను, స్తంభకమున కనకప్రభను ధ్యానించ వలయును. సిద్ధి కొఱకు రాత్రి యందు మదిరాదులచే బలినీయవలయును. ఇపుడు సర్వసిద్ధి ప్రదమగు ఒక ప్రయోగమును చెప్పెదను. దీనిని అతి ప్రయత్నముచే రహస్యముగా నుంచవలయును. కృష్ణ పక్ష భూతాహమున కారు చీకటి నిండిన మధ్య రాత్రమున స్నానముచేసి రక్తవస్త్రములను ధరించి రక్తమాల్యాను లేపనుడై ఛిన్న మస్త స్వరూపిణి, సుందరి, యౌవనవతి నరపంచక గామిని, సుస్మిత, ముక్తకబరి, భూషాదాన ప్రతోషిణి యగు వారిని తీసుకొని వచ్చి వివస్త్రగా పూజించవలయును. మంత్రమును పదివేలు జపించవలయును. బలినిచ్చి, రాత్రి గడిపి ధనముచే ఆ యువతిని ప్రీతురాలిని చేసి పంపించి పలువిధాన్నములచే బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో పుత్రులను పౌత్రులను ధనమును కీర్తిని స్త్రీలను, ఆయుష్యమును, సుఖమును ధర్మమును, ఇష్టమును పొందును. విద్యను కోరువాడు ఆ రాత్రి యందు వ్రతము నాచరించవలయును. ఇతర కోరికలున్నచో ఆమంత్రమును జపించుచు దానిని పొందవలయును. ప్రాతః కాలమున లేచి పడక మీద కూర్చొని జపించవలయును. ఆరు నెలలలో సాధకుడు కవిత్వముతో కవిని జయించును. శివునిచే కీలితమగుచో ఈ విద్య ఉత్కీలన మగును. తారా పుటమగు మాయను అష్టోత్తర శతము మంత్రాదిలో అంతమున జపించినచో ఈ విద్య సిద్ది ప్రదమగును.
అవతారాంతరం దేవ్యా వచ్మి తే మునిసత్తమ ।
జ్ఞానామృతారుణా శ్వేతా క్రోధినీందు సమన్వితా
శాంతిస్త థా విధా చాపి నీచ సర్గాన్వితా స్తథా ।
వాగ్భవం కామ రాజాఖ్యం శక్తి బీజాహ్వయం తథా
త్రిభిర్భీజైః పంచకూటాత్రికా త్రిపుర భైరవీ ।
ఋషి స్సా దక్షిణామూర్తి శ్ఛన్దః పంక్తి రుదాహృతా
దేవతా దేశికై రుక్తా దేవీ త్రిపుర భైరవీ ।
నాభ్రా చరణం న్యస్య వాగ్భవం మన్త త్పునః
హృదయాన్నాభి పర్యన్తం కామ బీజం ప్రవిన్య సేత్ ।
శిరసో హృత్పదేశాంతం తార్తీయం విన్యసేత్తతః
ఆద్యం ద్వితీయం కరయో గ్రీయ ముభయం న్యసేత్ ।
మూలాధారే హృది న్యస్య భూయో బీజత్రయం క్రమాత్
నవయోన్యాత్మకం న్యాసం కుర్యాద్బీజై స్త్రిభిః పునః ।
బాలాదిత ప్రకారేణ మూర్తి న్యాస మథాచరేత్
స్వస్వ బీజాదికం పూర్వం మూఠీశానమనోభవమ్ ।
న్యసే ద్వక్రే తత్పురుషం మకర ధ్వజ మాత్మవిత్
హృద్యమౌర కుమారాది కన్దర్పం తదనన్తరమ్ ।
గుహ్యదేశే ప్రవిన్యస్యే ద్వామ దేవాది మన్మథమ్
సద్యోజాతం కామదేవం పాదయోర్విన్య సేత్తతః ।
ఊర్థ్వ ప్రాగ్దాక్షిణోదీచ్య పశ్చిమేషు ముఖేషు తాన్
ప్రవిన్యసేద్యథా పూర్వం భృగుర్వ్యోమాది సంస్థితః ।
సద్యాది పంచహ్రస్వాద్యా బీజమేషాం ప్రకీర్తితమ్
షడ్డీర్ఘయుక్రేనాద్యేన బిజేనాంగక్రియా మతా ।
పంచ బాణాంస్తతో న్యస్యే న్మంత్రీ త్రైలోక్యమోహనాన్
ద్రామాద్యం ద్రావీణీం మూర్థి ద్రామాద్యాం క్షోభిణీం పదే ।
క్లీం వశీకరణే వక్రా గుహ్యే బ్లూం బీజ పూర్వికామ్
ఆకర్షణీం హృది పునః సర్వాంత భృగు సంస్థితామ్ ।
సంమోహనీం క్రమాదేవం బాణన్యాయ మిరితః
ఫాల భ్రూమధ్య వదనే ఘంటికా కంఠ హృత్సుచ ।
నాభ్యధిష్టానయోః పంచ తారాద్యా సుభగాదికాః
మస్తకావధి నాథేశ్చ మంత్రిణా సుభగా భగా ।
భగసర్పిణ్యథ పరా భగమాలిన్య నన్తరమ్
ఆనంగా నంగ కుసుమా భూయశ్చా నంగమేఖలా ।
ఆనంగ మదనా సర్వా మద విభ్రమ మంధరా
ప్రధాన దేవతా వర్ణ భూషణా ద్యైరలంకృతాః ।
అక్షసక్పుస్తకాభీతి వరదాఢ్య కరాంబుజాః
వాక్కామ బ్లూం స్త్రీం సర్గాంతే తారాః పంచ ప్రకీర్తితాః ।
తతః కుర్యాద్భూషణాఖ్యం న్యాసముక్తదిశా మునే
ఏవం న్యస్త శరీరసౌ ధ్యాయే త్రిపుర భైరవీమ్ ।
సహస్ర భాను సంకాశా మరుణ క్షామవాసినీమ్
శిరోమాలా మసృస్లిప్త స్తనీం జప వటీంకరైః ।
విద్యామభీతిం చ వరం దధతీం తీక్షణాననామ్
దీక్షాం ప్రాప్య జపేన్మస్త్రం తత్య లక్షం జితేశ్రియః ।
పుసైర్భాను సహస్రాణి జుహుయా ద్రహ్మ వృక్షజైః
త్రి మదకై: ప్రసూనైర్వా కరవీర సముద్భవైః ।
పద్మం వసుదలోపేతం నవయోన్యష్ట కర్ణికమ్
ఇచ్ఛాది శక్తి భిర్యుక్తం భైరవ్యాః పీఠ మర్చయేత్ ।
ఇచ్ఛా జ్ఞానా క్రియా పశ్చా తామినీ కామదాయినీ
రతి ప్రియా మదానన్గా నవమి స్యాత్మ నోన్మనీ ।
వరదాభయ ధారిణ్య స్సంప్రోక్తా నవశక్తయః
వాగ్భవం లోహితో రాయై శ్రీ కంఠ లోహితో నలః ।
దీర్ఘ వాన్యై పరాపశ్చా దపరాయౌ హసౌయుతః
సదాశివ మహాప్రేత జైనం పద్మాసనం నమః ।
అనేక మనునా దద్యా దాసనం శ్రీ గురు క్రియమ్
ప్రాజ్మధ్య యోన్యత్తరాలే పూజయేత్కల్పయేత్తతః ।
పంచభిః ప్రణవై ర్మూర్తిం తస్యామావాహ్య దేవతామ్
పూజయే దాగమోక్తేన విధానేన సమాహితః ।
తారా వాక్ఛక్తి కమలా హస ఖూం ఫ్రేం హసౌ స్మృతాః
వామకోణే యజేద్దేవ్యా రతిమిందు సమప్రభామ్ ।
సృణి పాశధరాం సౌమ్యాం మద విభ్రమ విహ్వలామ్
ప్రీతిం దక్షిణ కోణస్థాం తప్త కాంచన సన్నిభామ్ ।
అంకుశం ప్రణతం దోర్భ్యాం ధారయన్తం సమర్చయేత్
అగ్రే మనోభవాం రక్తం రక్త పుష్పాద్యలంకృతామ్ ।
ఇక్షుకార్ముక పుష్పేషు ధారిణీం సస్మితాననామ్
అంగాన్యభ్యర్చయేత్పశ్చాద్యథా పూర్వం విధాన విత్ ।
దిక్ష్వగ్రే చ నిజైర్మంలౌ పూజయే ద్బాణ దేవతాః
హస్తా జైరత పుష్పేషు ప్రణామామృతసప్రభాః ।
అష్టయోనిష్వష్ట శక్తిః పూజయే త్సుభగాదికాః
మాతరో భైరవాంకస్థా మద విభ్రమ విహ్వలాః ।
అష్ట పత్రేషు సంపూజ్యా యథా వత్కుసుమాదిభిః
లోకపాలాంస్తలో దిక్షు తేషామస్రాణి తద్బహిః ।
పూర్వజన్మకృతైః పుణ్యే ద్ఘాత్వైనాం పరదేవతామ్
యో భజేదుక్త మాణ స భవేత్సంపదాం పదమ్ ।
ఏవం సిద్ధ మనుర్మంత్రి సాధయే దిష్ట మాత్మనః
జుహుయాదరుణాంభోజై రదోషైర్మధురాప్లుతైః ।
లక్ష సంఖ్యం తదర్థం వా ప్రత్యహాం భోజయేద్ద్విజాన్
హోమాంతే ధనధాన్యాద్యై స్తోషయే ద్గురుమాత్మనః ।
ఏవం కృతే జగద్వశ్యో రమాయా భవనం భవేత్
రక్టోత్పలైఫ్రిమధ్వ రరుణ్ణిర్వాహయాంజైః
పుషైః సయాన్నై సృఘృతై ర్ఘమాద్విశ్వం వశం నయేత్ ।
వాక్సిద్ధిం లభతే మంత్రి పలాశ కుసుమైతైః
కర్పూరాగురు సంయుక్తం గుగ్గులుం జుహుయాత్సుధీః ।
జ్ఞానం దివ్యమవాప్నోతి తేనైవ స భవేత్కవిః
క్షీరాకైర మృతాఖండై రోమ స్సర్వాపమృత్యుజిత్ ।
దూర్వాభరాయుషే హోమ: క్షీరాక్తాభి ర్దినత్రయమ్
గిరికర్ణిభవైః పుష్పై ర్రాహ్మణాన్వశయేద్ధతైః ।
కప్లోరైః పార్థివాన్పుపై సద్వధూః కర్లికారజైః
మల్లికా కుసుమైరుత్వా రాజపుత్రా న్వశం నయేత్ ।
కోరంట కుసుమైర్వైశ్యా నషలా నాటలోద్భవైః
అనులోమాం విలోమాంత స్థితసాధ్యాహ్వయాన్వితమ్ ।
మంత్రముచ్చార్య జుహుయా న్మంత్రీ మధురలోలితైః
సర్షపైర్మధు సంమిశ్రా ర్వశయేత్పార్థి వాన్ క్షణాత్ ।
అనేనైవ విధానేన తత్పత్నీస్తత్సుతానపి
జాతి బిల్వ భవైః పుష్పై ర్మధుర త్రయ సంయుతైః ।
నరనారీ నర పతి నోమేన వశయే త్ర్కమాత్
మాలతీవకులోద్భూతైః పుష్పైశ్చన్జనలోలితైః ।
జుహుయాత్కవితాం మంత్రీ లభతే వత్సరాంత
మధురత్రయసంయుకై: ఫలైర్బిల్వ సముద్భవైః ।
జుహుయా ద్వశయేల్లోకం శ్రియం ప్రాప్నోతి వాంఛితమ్
సాజ్యమన్నం ప్రజుహుయా ద్భవేదన్న సమృద్ధిమాన్ ।
కస్తూరీ కుంకుమోపేతం కర్పూరం జుహుయాద్వశీ
కందర్పాదధికం సద్య సౌందర్య మధిగచ్ఛతి ।
అజాగ్రజుహుయాన్మంత్రీ దధిక్షీర మధుప్లుతాన్
విజిత్య రోగానఖిలా న జీవేచ్ఛరదాం శతమ్ ।
పాద ద్వయం మలయజం పాదం కుంకుమ కేసరమ్
పాదం గోరోచనాంతాని త్రీణి పిష్ట్వా హిమాంభసా ।
విదద్ధ్యా త్తిలంక ఫాలే యాన్పశ్యే ద్యైర్విలోక్యతే
యానశేత్ స్పృశ్యతే యైర్వా వశ్యాస్స్యుస్తస్య తే చిరాత్ ।
కర్పూర కపిచోరాణి సమ భాగాని కల్పయేత్
చతుర్భుజా జటామాంసీ తావతీ రోచనా మతా ।
కుంకుమం సమభాగం స్యా ద్దిగ్భాగం చందవం మతమ్
అగురుర్నవభాగంస్యా దితి భాగక్రమేణ చ ।
హిమాద్భి: కన్యయా పిష్ట మేతత్సర్వం సుసాధితమ్
ఆదాయ తిలకం ఫాలే కుర్యాద్భూమి పతీన్నరాన్ ।
వనితా మద గర్వాణ్యా మదోన్మత్తా న్మతంగ జాన్
సింహవ్యాఘ్రన్మహా సర్పా న్భూత వేతాల రాక్షసాన్ ।
దర్శనాదేవ వశయే త్తిలకం ధారయన్నరః
ఇత్యేషా భైరవీ ప్రోక్తా హ్యవతారాంతరం శృణు ।
ఓ మునిసత్తమా!! దేవి యొక్క మరి యొక అవతారమును చెప్పెదను. జ్ఞానామృతారుణా, శ్వేతా, క్రోధినీ, ఇందు సమన్వితా, అట్టి శాంతి నీచసర్గాన్విత, కామరాజాఖ్య మగు వాగ్భవము శక్తి బీజము. మూడు బీజములచే పంచకూటాత్మికా త్రిపురభైరవి. దక్షిణామూర్తి ఋషి పంక్తి ఛందస్సు. త్రిపుర భైరవి దేవత. వాగ్భవ బీజమును నాభి నుండి పాద పర్యంతము న్యాసము చేయవలయును. కామ బీజమును హృదయము నుండి నాభి వరకు న్యాసము చేయవలయును. తృతీయ బీజమును శిరసు నుండి హృదయము వరకుంచవలయును ఆద్యమును ద్వితీయమును కరములందు, తృతీయమును ఉభయమును మూలాధారమున హృదయమున ఉంచి మరల బీజత్రయ న్యాసమును చేయవలయును. నవయోన్యాత్మక న్యాసమును బీజత్రయముచే చేయవలయును. బాలా త్రిపురకు చెప్పినట్లు మూర్తి న్యాసమును చేయవలయును. స్వస్వ బీజాదికమును పూర్వకమును, శిరస్సున ఈశానుని, వక్రమున మనోభవుని, తత్పురుషుని మకర ధ్వజుని, హృదయమున అఘోరకుమారుని కందర్పుని న్యాసము చేయవలయును. వామదేవాది మన్మధాంతము గుహ్య దేశమున నుంచవలయును. పాదములందు సద్యోజాతుని వామదేవుని న్యాసము చేయవలయును. ఊర్ద్వ ప్రాగ్దాక్షిణోదీచ్య పశ్చిమ ముఖములందు వారివారిని న్యాసము చేయవలయును. సద్యాది పంచహ్రస్వాద్యములు వీటికి బీజముగా చెప్పబడినవి. షడ్డీర యుక్తమగు నాద బీజముచే అంగకల్పన చేయవలయును. తరువాత త్రైలోక్య మోహనములగు పంచబాణములను న్యాసము గావించవలయును. ద్రాం అను దానిని ద్రావిణీ బీజమును శిరస్సున, ద్రాం అను క్షోభిణీ బీజమును పదమున, వశీకరణమగు క్లీం బీజమును వక్రమున, బ్లూం అను దానిని బీజపూర్వకమును గుహ్యమున న్యాసమును చేయవలయును. సర్వాంత భృగు సంస్థితమగు ఆకర్షణ బీజమును హృదయమున, సంమోహన బీజమున క్రమముగా న్యాసము చేయవలయును. దీనిని బాణ న్యాసమందురు. ఫాల భ్రూమధ్య వదనములందు, ఘంటికా కంఠ హృదయములందు, నాభ్యధిష్టానములందు, తారాదులగు అయిదు సుభాగాదికములను, నాభి నుండీ మస్తకము వరకుంచ వలయును. సుభగా, భగా, భగసర్పిణీ, పరా, భగమాలిని, ఆనంగా, అనంగ, కుసుమ, అనంగమేఖలా, ఆనంగ మదనా అనువారలందరు మద విభ్రమస మంధరలు ప్రధాన దేవతలు, వర్ల భూషణాదులచే అలంకరించబడిన వారిని, అక్షసకుస్తక అభయ వరదాఢ్య కరాంబుజలను పూజించవలయును. వాక్కామ బీజమగు బ్లూ. అను దానిని సరాంతమున నుంచవలయును. ఇవియే పంచతారలనబడును. తరువాత భూషణ న్యాసమును చేయవలయును. ఇట్లు న్యస్త శరీరుడై సహస్ర భాను సంకాశ అరుణ క్షామ వస్త్ర, శిరోమాల, అస్పషస్తని, జపకటిని, విద్యను, అభయముద్రను, కరమును ధరించునది, త్రినేత్ర యగు త్రిపుర భైరవిని ధ్యానించవలయును. ఇట్లు దీక్షను పొంది పన్నెండు లక్షలు జపించవలయును. బ్రహ్మవృక్ష సమిధములగు గన్నేరు పూవులచే కాని హోమమును చేయవలయును. అష్టదళములు కల నవయోని అష్టకర్ణిక, ఇచ్ఛాది శక్తి యుతమగు భైరవీ పీఠ పద్మమును ఆర్చించవలయును. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా, కామినీ, కామదాయినీ, రతిప్రియా మదానన్దా, నవమి, మనోన్మనీ యను నవపీఠశక్తులు వరదాభయధారిణులుగా చెప్పబడిరి. వాగ్భవము లోహితుడు శ్రీ బీజమునకు, శ్రీ కంఠుడు, లోహితుడు, అనలుడు, దీర్ఘవానికి పరా, తరువాత, అపరాయములు హసయుతములు, “సదాశివాయ, మహాప్రేతాయ పద్మాసనాయ నమ:” అనుమంత్రముచే ఆసనము నర్పించవలయును. శ్రీ గురుక్రమముగా చేయవలయును. పొజ్మధ్యయోగ్యంతరాలమున పూజించి పంచ ప్రణవములచే మూర్తిని కల్పించి, ఆమూర్తి యందు దేవతను ఆవాహించి, సావధాన మనస్కుడై ఆగమోక్త విధానముచే పూజించవలయును. ఈరావాక్చక్తి కమలలు హసఖూ ఫేంహసలుగా చెప్పబడినవి. దేవి యొక్క వామకోణమున ఇందు సమప్రభయగు రతిని పూజించవలయును. ఈ రతిని సృణి పాశధర, సౌమ్య మద విభ్రమ విహ్వలగా పూజించవలయును. దక్షిణ కోణమున తప్తకాంచన సన్నిభ, అంకుశ ప్రణతములను ధరించు ప్రీతిని అర్చించవలయును. అగ్ర భాగమున రక్తవర్ణా, రక్త పుష్పాద్యలంకృత, ఇక్షకార్ముక పుషేషు ధారిణి సస్మితానన యగునో మనోభవను అర్చించవలయును. దిక్కులలో అగ్రభాగమున ఆయా మంత్రములచే ప్రాణదేవతలను అర్చించవలయును. హస్తముల యందు పుష్పేషు ప్రణామామృత ప్రభలను ధరించియున్న అష్టశక్తులను సుభగాదులను అష్టయోనులను పూజించవలయును. భైరవాంకస్థలు మదవిభ్రమ విహ్వలలగు మాతలను అష్టపత్రములందు యధావిధిగా పుష్పాదులచే పూజించవలయును. దిక్కులందు లోకపాలకులను, దాని వెలుపల వారి అస్త్రములను పూజించవలయును. పూర్వజన్మ కృత పుణ్యముచే పరదేవతను తెలిసి ఉక్తమార్గముచే సేవించువాడు సంపదల కాలవాలమగును. ఇట్లు మంత్రసిద్ధిని పొందిన సాధకుడు స్వాభీష్టమును సాధించుకొనవచ్చును. మధుర మిశ్రితములు దోషరహితములగు రక్షాంభోజములచే లక్షకాని యాబదివేలు కాని హోమముచేసి ప్రతిదినము, బ్రాహ్మణులకు భోజనమును పెట్టవలయును. సౌందర్యము యౌవనము గల స్త్రీలను దేవతా బుద్ధిచే పూజించవలయును. హోమ సమాప్తిలో తన గురువును ధన ధాన్యాదులచే సంతోషింప చేయవలయును. ఇట్లు చేసిన జగత్తు వశమగును. లక్ష్మీనిలయ మగును. త్రిమధు మిశ్రితములగు రకోత్పలముచే కాని, అరుణ వర్ణములు గల హయాదిజములచేకాని, పుష్పములచే కాని, క్షీరాన్నములచే కాని హోమము చేసినచో జగత్తు వశమగును. మోదుగు పూవులచే హోమము గావించిన దివ్యజ్ఞానమును పొంది కవి యగును. పాలతో తడిపిన అమృత ఖండములచే హోమమును గావించిన అపమృత్యువును జయించును. పాలతో తడిపిన గరకతో మూడు దినములు హోమమును గావించిన ఆయుర్వృద్ధి కలుగును. గిరికర్ణికాభవ పుష్పహోమము బ్రాహ్మణులను వశము చేయును. కలువలచే హోమము గావించిన రాజులు వశులగురు, పుష్ప హోమము రాజపత్నులను వశము చేయును. మల్లికా పుష్పహోమము రాజపుత్రులను వశము చేయును. పాటలోద్భవములగు కోరంట పుష్ప హోమము శూద్రులను వశము చేయును. విలోమాంతమున నున్న సాధ్యనామాన్వితముగా అనులోమమును మంత్రముచ్చరించి మధుర మిశ్రితములగు ఆవాలచే హోమమును గావించినచో ఆ క్షణమునే రాజులను వశములో నుంచును. ఇదే విధానముచే రాజపత్నులను రాజపుత్రులను వశములో నుంచుకొనవచ్చును. మధుర త్రయ మిశ్రితములగు జాతి బిల్వ పుష్పములచే హోమమును గావించిన నరనారీ నరపతులను వశులను చేయవచ్చును. చందన లోలితములకు మాలతీవకుల పుష్పములచే హోమమును గావించినచో ఒకవత్సరములో సత్కవిత్వమును పొందును. మధురత్రయ మిశ్రితములగు బిల్వఫలములచే హోమమును గావించిన లోకము వశమగును. ఉత్తమ సంపదను పొందును. నేయి కలిపిన అన్నముచే హోమము గావించిన అన్న సమృద్ది కలుగును. కస్తూరీ మయ, పేతమగు కర్పూర హోమము గావించినచో మన్మథుని మించిన సౌందర్యము కలుగును. దధిక్షీర మధుప్లుతములగు లాజహోమమును గావించిన అన్ని రోగములను జయించి నూరు వత్సరములు జీవించును. రెండు భాగములు మలయ చందనము ఒక భాగము కుంకుమ కేసరీ, ఒక భాగము గోరోజనము ఈ మూడింటిని చల్లని నీటిచే చక్కగా మర్దనము గావించి ఫాలమున తిలకమున ధరించి ఎవరిని చూచినను, ఎవరిచే చూడబడిననూ, ఎవరిని తాకిననూ ఎవరిచే తాకబడిననూ వారందరూ వశమగుదురు. కర్పూర కపిచోరములను సమభాగములుగా ఏర్పరిచి నాలుగవ భాగమున జటామాంసమును, అంతయే గోరోచనమును, అంతయే కుంకుమను, ఎనిమిదవ భాగమును చందనమును, తొమ్మిదవ భాగమును ఆగురును కలిపి చల్లటి నీటితో కన్య చక్కగా మర్ధన గావించి ఫాలమున తిలకమును ధరించినచో రాజులను, నరులను మదగర్వితులగు యువతులను, మదించిన యేనుగులను, సింహ వ్యాఘమహాసర్పములను, భూత భేతాల రాక్షసులను చూచిన తోడనే వశులగుదురు. ఇట్లు మహా భైరవీ మంత్రమును చెప్పితిని. ఇక ఇపుడు అవతారాంతరమును చెప్పెదను వినుము.
వాజ్మయా కమలా తారో నమోతే భగవత్యథ
శ్రీమాతంగేశ్వరి వదేత్సర్వ జనమనోహరి ।
సర్వాది సుఖ రాజ్యాంతే సర్వాది సుఖరంజని
సర్వరాజ వశం పశ్చాత్ కరి సర్వపదం వదేత్ ।
స్త్రీ పురుష వశం సృష్టి విద్యా క్రోధకాన్వితా
సర్వం దుష్ట మృగవశం కరిసర్వపదం తతః ।
సర్వసత్యవశంకరి సర్వలోకం తతః పరమ్
అముకం మే వశం పశ్చాదానయానలసున్దరీ ।
అష్టాశీత్యక్షరో మంత్ర మున్యాద్యా భైరవీ గతాః
న్యాసాన్మంత్రీ తనౌ కుర్యా వక్ష్యమాణాన్యథాక్రమాత్ ।
శిరోలలాట భ్రూమధ్యే తాలుకంఠ గలోరసి
అనాహతే భుజద్వంద్వే జఠరే నాభిమండలే ।
స్వాధిష్టానే గుప్తదేశే పాదయోర్ధక్ష వామయోః
మూలాధారే గుదే న్యస్యేతదాన్యష్టాదశ క్రమాత్ ।
గుణేక ద్విచతుష్టశ్ఛిర్వసు పర్వనవాష్టభిః
నన్ద పంక్ష్యష్ట వేదాన్ని చస్త్రయుగ్మ గుణాక్షిభిః ।
యదుక్లుప్తి రియం ప్రోక్తా మంత్రవగైర్యథాక్రమమ్
రత్యాద్యమూల హృదయ భ్రూమధ్యేషు విచక్షణః ।
వాక్శక్తి లక్ష్మీబీజాద్యా మాతంగ్యస్తా ప్రవిన్య సేత్
శిరోవదన హృద్దుహ్య పాదేషు విధినా న్యసేత్ ।
హృల్లేఖాం గగనాం రక్షాం భూయో మంత్రి కరాలికామ్
మహాచ్ఛుష్మాం స్వనామాది వర్ణబీజ పురస్సరాః ।
మాతంగ్యంతా షడంగాని తతః కుర్వీత సాధకః
వరైశ్చతుర్వింతశతభిప్షత్రయోదశభి శిరః ।
శిఖాష్టదశభిః ప్రోక్తా వర్మతావద్భిరక్షరైః
స్యాత్రయోదశభిర్నేత్రం ద్వాభ్యామస్త్రం ప్రకీర్తితమ్ ।
బాణన్యాసం తతః కుర్యాదైరవీ ప్రోక్త వర్మనా
మాతంగీ పదయోశాన్యం మన్మథాన్వద నాంశయోః ।
పార్వకటో ర్నాభిదేశే కటి పార్వాంశకే పునః
బీజ త్రయాది కానన్రీ మన్మధం మకర ధ్వజమ్ ।
మదనం పుష్పధన్వానం పంచమం కుసుమాయుధమ్
షష్ఠం కందర్పనామానం మనోభవరతి ప్రియా ।
మాతంగ్యస్తాక్షతో న్యస్యే తానే ష్వేతేషు మస్రవిత్
కుసుమా మేఖలా చైవ మదనా మదనాతురా ।
మదన వేగా సంభవా చ భువన పాలేన్లు రేభికా
అనంగ పద పూర్వాశ్చ మాతంగ్యనా స్సహిరితాః ।
విన్యస్త వ్యాస్తతో మూలే ధిష్టానే మణిపూరకే
హృత్కంధాస్యే భ్రువోర్మధ్యే మస్తకే చాపి మంత్రిణా ।
ఆద్యే లక్ష్మీ సరస్వత్యౌ రతిః ప్రీతిశ్చ కృత్తికా
శాంతి: పుష్టిః పునస్తుష్టి ర్మాతంగీ పదశేఖరా ।
మూలమంత్రం పృధ్య స్యే న్నిజమూర్ధని మంత్రవిత్
ఆధార దేశేధిష్టానే నాభై పశ్చాదనాహతే ।
కంఠ దేశే భువోర్మధ్యే బిందో భూయః కలాపదో
ఉన్నతాంగేషు వక్రే చ ధ్రువమండలకే శివే
మాతంగ్యంతాః ప్రవిన్యస్యేద్వాషాం జ్యేష్ఠ మతః పరమ్ ।
రౌద్రీం ప్రశాంతాం శ్రద్ధాఖ్యాం పునర్మాహేశ్వరీ మథ.
క్రియా శక్తిం సులక్ష్మీం చ సృష్టిం సంజ్ఞాం చ మోహినీమ్ ।
ప్రమధా శ్వాసినీం విద్యుల్లతాం చిచ్ఛక్తి మప్యథ
తతశ్చ సుందరీం నిన్గాం నన్ద బుద్ధి మిమాః క్రమాత్ ।
శిరోఫాల హృదాధారేస్వేతా బీజత్రయాధికాః
మాంతగాద్యాః ప్రవిన్య సేద్యథావద్దేశికోత్తమః ।
మాతంగీం మహదాద్యాంతాం మహాలక్ష్మీ పదాదికామ్
సిద్ధలక్ష్మీ పదాద్యాం చ మూలమాధార మండలమ్ ।
న్యసేత్తేనైవ కుర్వీత వ్యాపకం దేశికోత్తమః
ఏవం న్యస్తశరీరసౌ చిన్తయన్మన్తదేవతామ్ ।
శ్యామాం శుకోక్తిం శృణ్వన్తం న్యస్త్రీకాంఘిశిరోరుహామ్
శశిఖండధరాం వీణాం వాదయన్తం మధూన్మదామ్ ।
రక్షాంశుకాం చ కప్లోరమాలా శోభిత చూలికామ్
శంఖ పత్రాం తు మాతంగీం చిత్రకోద్భాసిమస్తకామ్ ।
ఆయుతం ప్రజపేన్మస్త్రం తద్దశాంశం మధూకడైః
పుపై స్త్రీ మధురోపేతై ర్జుహుయాన్మస్త్ర సిద్ధయే ।
త్రికోణకర్ణికం పద్మమష్టపత్రం ప్రకల్పయేత్
అష్టపత్రావృతం బాహ్యా వృతం షోడశభిర్జలే! ।
చతురస్త్రీ కృతం బాహ్యే కాంత్యా దృష్టి మనోహరమ్
ఏతస్మిన్పూజయేత్పరే నవశక్తేః క్రమాదిమా: ।
విభూతిపూర్వా: పూర్వోక్తా మాతంగీ పద పశ్చిమా:
సర్వాంతే శక్తి కమలాసనాయ నమ ఇత్యథ ।
వాకృత్యలక్ష్మీ బీజాద్యా ఉక్తపీఠార్చనే మనుః
మూలేన మూర్తిం సంకల్ప్య తస్యామావాహ్య దేవతామ్ ।
అర్చయేద్విధినానేన వక్ష్యమాణేన మస్రవిత్
రత్యాద్యా క్రిషు కోణేషు పూజయే త్పూర్వ వత్సుధీః ।
హృహృల్లేఖాః పంచపూజ్యా మధ్యే దీక్షు చ మంత్రిణా
పాశాంకుశాభయాభీష్టధారిణ్యే భూత సప్రభాః ।
అంగాని పూజయేత్పశ్చాద్యథాపూర్వం విధానవిత్
బాణానభ్యర్చయే ద్దిక్షు పంచమం పురతో యజేత్ ।
దలమధ్యేథ సంపూజ్యా అనంగ కుసుమాదికాః
పాశాంకుశాభయా భీష్ట ధారిణ్యో రుణ విగ్రహాః ।
పత్రాగ్రేషు పునః పూజ్యా లక్ష్మ్యాద్యా వల్లకీ వరాః
బహిరష్టదలేష్వర్యా మన్మధాద్యా మదోద్ధతాః ।
అపరాంగా నిషంగాద్యా పుష్పాస్తేషు ధనుర్ధరా:
పత్రస్థా మాతరః పూజ్యా బ్రాహ్మద్యాః ప్రోక్త లక్షణాః ।
తదగ్రేష్వర్చయేద్విద్వా ! నసితాంగాది భైరవాన్
పునషోడశ పతేషు పూజ్యాషోడశ శక్తయః ।
వామాద్యాః కలవీణాభిర్గాయన్య శ్యామ విగ్రహాః
చతురస్ర చతుర్ధిక్షు చతస్రః పూజయేత్పునః ।
మాతంగ్యాద్యా మదోన్మత్తా వీడోల్లసిత పాణయః
ఆగ్నేయకోణీ విఘ్నేశం దుర్గాం వైశాచరైర్యజేత్ ।
వాయవ్యే బటుకాన్పశ్చాదీశానే క్షేత్రపం యజేత్
లోకపాలా బహిః పూజ్యా వజ్రాద్యైరాయుధై స్సహ ।
మంత్రేస్మిన్యాధితే మంత్రి సాధయే దిష్ట మాత్మనః
మల్లికా జాతిపున్నాగై రోమాద్భాగ్యాలయో భవేత్ ।
ఫలై ర్బిల్వ సముద్భూతే సత్పతైర్వా హుతాద్భవేత్
రాజపుత్రస్య రాజ్యాః పంకజై శ్రియ మాప్నుయాత్ ।
ఉత్పలైర్వశయే ద్విశ్వం క్షారైర్మధాశ్రితై శ్రియమ్
వంజులస్య సమిదోమో వృష్టిం వితనుతే చిరాత్ ।
క్షీరాకై రమృతా ఖండై రోమాన్నాశయతి జ్వరమ్
దూర్వాభి రాయురాప్నోతి తందులైర్ధనవాన్భవేత్ ।
కదంబైర్వశ్యమాప్నోతి సర్వం త్రిమధురాప్లుతమ్
నన్గ్యావర్తభలైః పుపై క్ట్రోమో వాక్సిద్ధి దాయకః ।
నింబ ప్రసూనై ర్జుహుయా దీప్సిత శ్రీ సమృద్ధయే
పలాశ కుసుమైఠోమా తేజస్వీ జాయతే నరః ।
చన్ద నాగురు కస్తూరీ చన్ద కుంకుమ రోచనాః
వశ్యాయ చ ప్రియత్వాయ హుతాశ్చ తిలకీకృతాః ।
నిర్గుడే మూలహోమేన నిగదాన్ముచ్యతే నరః
నింబతైలాన్వితై జై రోమ శ్శత్రు వినాశనః ।
హరిద్రా చూర్ల సంమిశై ర్లవణే సంభయే జ్జగత్
మాతంగీ సిద్ద విద్యైషా ప్రోక్తా తే ద్విజసత్తమ ।
అవతారాంతరం భూయో వర్ణయామి నిశామయ
“ఓమ్ నమో భగవతి! శ్రీ మాతంగేశ్వరి! సర్వజనమనోహరి! సర్వసుఖరాజ్య సర్వసుఖరంజని! సర్వరాజవశంకరి! సర్వప్రీ పురుష వశం కరి! సర్వదుష్ట మృగవశంకరి! సర్వ సర్వ సత్యవశంకరి! సర్వలోకం అముకం మే వశం ఆనయ స్వాహో అనునది ఎనుబది ఎనిమిది అక్షరముల మంత్రము. భైరవీ మంత్రము న్యాసాదులే ఈ మంత్రమునకు కూడా చెప్పుకొనవలయును. చెప్పబోవు న్యాసములను యథా క్రమముగా శరీరమున చేయవలయును. శిరోలలాట భ్రూమధ్యములందు తాలు కంఠగలోరస్థలములందు అనాహతమున భుజద్వంద్వమున, జఠరమున నాభిమండలమున, స్వాధిష్టానమున గుప్తదేశమున, పాదములందు మూలాధారమున, గుదమున, పదునెనిమిది పదములను క్రమముగా న్యాసము చేయవలయును. 6,1,2,4,6,8,3,9,8,9,7,8,4,3,1,2,6 సంఖ్యలచే ఇది యదు క్లుప్తియని మంత్ర వర్ణములచే న్యాసము చేయవలయును. మూల హృదయ భ్రూమధ్యము లందు రత్యాద్యములు వాక్శక్తి లక్ష్మీ బీజాద్యములను మాతంగ్యంతము న్యాసము చేయవలయును. శిరోవదన హృదుహ్యపావనములందు విధానముచే న్యాసము చేయవలయును. హృల్లేఖను, గగనను,రక్తను, కరాలికను, మహోచ్ఛుష్మను స్వనామాదివర్ణ బీజపురస్సరముగా నూతంగ్యంతముగా సడంగ కల్పన చేయవలయును. ఇరువది నాలుగక్షరములచే హృదయమును, పదమూడక్షరములచే నేత్రమును, పదునెనిమిదక్షర ములచే శిఖను కవచమును, పదమూడక్షరములచే నేత్రమును, రెంటిచే అస్త్రమును ఏర్పరచవలయును భైరనీమంత్రప్రోక్తవిధిచే బాణన్యాసమును చేయవలెను. మాతంగీపదములయందు మరియొక న్యాసమును చేయవలయును. వదాంశములందు మన్మధుల నుంచవలయును. పార్శ్వనటులందు, నాభిదేశమునకటి పార్శ్వాంసమునందు బీజత్రయాదికన్యాసమును చేయవలయును. మన్మధుని, మకరధ్వజుని, మదనుని, పుష్పధన్వుని, కుసుమాయుధుని, కందర్పుని, మనోభవుని, రతిప్రియుని, న్యాసము చేయవలయును. కుసుమమేఖల, మదన మదనాతురా మదనవేగా, సంభవా భువనపాల, ఇందురేఖ, అనంగ పూర్వ మాతంగి అని చెప్పబడినది. తరువాత అధిష్టానమగు మణిపూరకమున న్యాసముచేయవలయును. హృత్కంఠాస్య ములందు, భ్రూమధ్యమున, మస్తకమునందు, న్యాసము చేయవలయును. ఆద్యమున లక్ష్మీసరస్వతులను, రతి, ప్రీతి, కృత్తిక, శాంతి, పుష్టి, తుష్టి, మాతంగి మూలమంత్రన్యాసమును గావించవలయును. ఆధారదేశమున, అధిష్ఠానమున, నాభియందు, నిరోధికయందు, తీర్దేందునాదమున, శివమున, మాతంగి పరమ న్యాసమును గావించవలయును. తరువాత వామను జేష్టను, రౌద్రిని, ప్రశాంతను, శ్రద్దను, మాహేశ్వరిని, ప్రియాశక్తిని, సులక్ష్మిని, మృష్టిని, సంజ్ఞను, మోహినిని ప్రమథశ్వాసినిని. విద్యుల్లతను, చిచ్ఛక్తిని, సుందరిని, నిన్లను, నందబుద్ధిని క్రమముగా శిరోఫాలహృదా ధారములందు బీజయతాధికలుగా మాతంగాదులను యథావిధిగా న్యాసమును గావించవలయును. మాతంగిమహదాద్యను, మహాలక్ష్మిని, సిద్ధలక్ష్మిని మూలాధారమండలమును న్యాసము చేసి, ఈశాన్యముచేతనే వ్యాపకమును ఆచరించవలయును. ఇట్లు శరీరమున న్యాసము గావించి మంత్రదేవతను ధ్యానించవలయును. శ్యామ, చిలుక పలుకులను వినుచున్నది, న్యసైకాగ్నిశిరోరుహ, శశిఖండ ధర, వీణావాదనమును చేయుచున్నది, మధూన్మాద, రక్షాంశుక, కప్షరమాలా శోభిత చూలిక, శంఖపుత్ర, చిత్రకోద్దాసి మస్తకయగు మాతంగిని ధ్యానించి పదివేలు జపించవలయును. దశాంశమును ఇప్పపూలను త్రిమధుమిశ్రితములుగా మంత్రసిద్ధి కొఱకు హోమమును గావించవలయును. త్రికోణ కర్ణికము అష్టపత్రము కల్పించవలయును. బాహ్య భాగమున అష్టపత్రావృతము, షోడశ దలావృతము, చతురస్రీకృతము, కొంతిచే దృష్టి మనోహర మగు పీఠమున క్రమముగా నవశక్తులను పూజించవలయును. ఈ నవశక్తులు విభూతి పూర్వులు మాతంగీ పదపశ్చిమలను పూజించవలయును. “సర్వశక్తి కమలాసనాయ నమ:” అనునది బీజాద్యమగు పొకృత్వలక్ష్మీ బీజాద్యము. పీఠాపూజన మంత్రము మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి a ందు దేవతను ఆవాహించి, వక్ష్యమాణ విధిచే పూజించవలయును. పూర్వమువలే కోణత్రయములందు రత్యాదులను పూజించవలయును. దిక్కులందు బాణములను, అగ్రభాగమున పంచమమును పూజించవలయును. దల మధ్యమున అనంగ కుసుమాదికలను పూజించవలయును. పాశాంకుశాభయాభీష్ట ధారిణదిజ్మధ్యమున హృత్ హృల్లేఖలను పూజించవలయును. పత్రాగ్రములందు వల్లకీకరులను లక్ష్యాదులను పూజించవలయును. అష్టదలములందు బహిర్ధాగమున మద్దతులగు మన్మధాదులను పూజించ వలయును. వీరందరు అపరాంగులు నిషంగాదులు పుష్పాస్తేషు ధనుర్ధరులు గానుందురు. పైన చెప్పబడిన లక్షణములుగల బ్రహ్మాది మాతలను పత్రస్థలను పూజించవలయును. తదగ్ర భాగమున అసితాంగాది భైరవులను పూజించవలయును. మరల షోడశ సత్రములందు షోడశ శక్తులను పూజించవలయును. ఈ షోడశక్తులు. వామాద్యలు కల వీణలచే గానము చేయు వారు శ్యామ విగ్రహలు, నాలుగు దిక్కులందు చతురస్ర పీఠమున నలుగురిని పూజించవలయును. ఈ నలుగురు మాతంగ్యాదులు మదోన్మత్తలు వీడోల్లసితపాణులుగా నుందురు. ఆగ్నేయ కోణమున విఘ్నేశుని దుర్గను పూజించవలయును. వాయవ్యకోణమున బటుకలను, ఈశాన్యమున క్షేత్రపాలుని పూజించవలయును. బహిర్భాగమున వజ్రాద్యాయుధములతోపాటు లోకపాలులను పూజించ వలయును. ఇట్లు సాధకుడు మన్రసిద్ధిని పొందిన తరువాత స్వేష్టమును సాధించుకోనవలయును. మల్లికజాతి పుష్పములచే హోమమును గావించిన ధనాధిపతియగును. బిల్వఫలములచే కాని పత్రములచే కాని హోమమును గావించిన రాజపుత్రులకు రాజ్యము లభించును పద్మ హోమముచే సంపద కలుగును. ఉత్పలహామముచే జగత్తు వశమగును. మధుమిశ్రిత క్షారములచే స్త్రీ వశమగును. వంజుల సమిట్టోమము వర్షమును కురిపించును. క్షీరమిశ్రిత అమృతఖండములచే హోమమును గావించిన జ్వరము నశించును. దూర్వాహోమముచే ఆయుష్యము, తండులచే సర్వము వశమగును. తద్యావర్త సంజాత పుష్పహోమముచే వాక్సిద్ధి కలుగును. అభీష్ట సంపత్సమృద్ధికి నింబపుష్ప హోమమును చేయవలయును. పలాశ కుసుమ హోమముచే తేజస్వియగును. చందనాగరు కస్తూరీ చంద్ర కుంకుమల హోమమును గావించిననూ తిలకముగా ధరించిననూ సర్వవశ్యత సర్వప్రియత్వము సంభవించును. నిగుడీ మూల హోమముచే నిగడ విముక్తుడగును. నింబతైల మిశిత లోహోమముచే శత్రు నాశమగును. హరిద్ర చూర్ణ మిశ్రితములగు లవణములచే జగతంభనము సిద్దించును. ఓ బ్రాహ్మణోత్తమా! ఇట్లు నీకు మాతంగీ సిద్దవిద్యను చెప్పితిని. ఇక ఇపుడు మరొక అవతారమును చెప్పెదను వినుము.
దీపికా ప్రీతి చంద్రాఢ్యా ద్విధా చేద్రంజితా పునః ।
వతివహ్ని ప్రియామంత్రో ధూమావత్యాగజాక్షరః
పిప్పలాదో మునిశ్ఛందో నివృద్ధూమావతీశ్వరీ ।
బీజేన షడ్డీర్ఘజాతి యుక్తేన పరికల్పయేత్
తతో ధూమావతీం ధ్యాయే చ్ఛత్రు నిగ్రహ కారిణీమ్ ।
వివర్ణాం చంచలాం దుష్టాం దీర్ఘాం చ మలినాంబరామ్
విముక్త కుంతలాం సూక్ష్మాం విధవాం విరల ద్విజామ్ ।
కంకధ్వజు రధారూఢం ప్రలంబిత పయోధరామ్.
సూర్యహస్తాం నిరుక్షాంక ధృతహస్తాంబరాన్వితామ్ ।
ప్రవృద్ధలోమాం తు భృశం కుటిలా కుటిలేక్షణామ్
క్షుత్పిపాసార్ధితాం నిత్యం భయదాం కలహ ప్రియామ్ ।
ఏవం విధాం తు సంచిన్య నమస్వాహా షడంతకమ్
బీజం సాధ్యపరి న్యస్య తస్మినాప్య శవం జపేత్ ।
అవష్టభ్య శవం శత్రునామ్నాథ ప్రజ పేన్మనుమ్
సోష్ణీషకంచుకో విద్వా న్కృష్ణే భూతే దివానిశమ్ ।
ఉపవాసీ శ్మశానే వా విపినే శూన్యమందిరే
మంత్రస్య సిదై యతవాక్ ధ్యాయన్దేవీం నిరంతరమ్ ।
సహస్రాదూర్థ్వత శత్రు ర్జ్వరేణ పరిగృహ్యతే
పంచగవ్యన శాస్త్రిస్స్యా జ్వరస్య పయసాపి వా ।
మంత్రాద్యక్షరమాలిఖ్య శత్రునామ తతః పరమ్
ద్వితీయం మనువర్ణం చ శత్రు నామైవమాలిఖేత్ ।
కుర్వం మనుదిక్సహస్ర జపాచ్ఛత్రుమృతిర్భవేత్
దణ్ణ కంకం శ్మశానాగ్నే తద్భస్మాదాయ మస్రవిత్ ।
విరోధి నామ్నాష్టశతం జప్తముచ్చాటనం రిపోః
శ్మశాన భస్మనా కృత్వా శవం తస్యోపరి న్య సేత్ ।
విరోధి నామ సంరుద్దం కృష్లే పక్షే సముచ్చరేత్
మహిషీ క్షీరధూపం చ దద్యాచ్ఛత్రు విపత్కరమ్ ।
ఏవం సంక్షేపతః ప్రోక్తం అవతారచతుష్టయమ్
దుర్గాయా జగదంబాయాః కిం పునః ప్రష్టు మిచ్ఛసి
ఇతి శ్రీ బృహన్నారదీయ మహా పురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయ పాదే దుర్గామంత్ర చతుష్టయ వర్ణనం నామ సప్తాశీతి తమోధ్యాయః.
ప్రీతి చంద్రాఢ్య దీపిక ద్విధా రంజితమై స్వాహాంతమగు మంత్రము ధూమావతీ మంత్రము అష్టాక్షరి. పిప్పలాద మహర్షి. నివృచ్ఛందస్సు. ధూమావతీశ్వరి దేవత. షడ్డీర్ఘ జాతి యుక్తముచే అంగకల్పన చేయవలయును. తరువాత శత్రునిగ్రహకారిణి, వివర్ణ, చంచల, దుష్ట, దీర్ఘ, మలినాంబర, విముక్త కుంతల, సూక్ష్మ, విధవ, విరలద్విజ, కంకధ్వజ రధారూఢ, ప్రలంబిత పయోధర, సూర్యహస్త, నిరుక్షాంక ధృతహస్తాంబరాన్విత, ప్రవృద్ధలోమ, కుటిల, కుటిలేక్షణ, క్షుత్పిపాసార్డిత, నిత్య భయద, కలహప్రియ, యగు ధూమావతీశ్వరిని చింతించి, నమస్వాహా ఫడంత బీజమును సాధ్యోపరి భాగమున నుంచి, దానిపై శవమును స్థాపించి జపించవలయును. శవమును శత్రు నామముచే అవష్టంభనమును గావించి మంత్రమును జపించవలయును. ఉష కంచుకములను ధరించి కృష్ణపక్షమున రాత్రింబవళ్ళు ఉపవసించి, శ్మశానమునకొని, అరణ్యమునకొని, శూన్యమందిరమున కాని మంత్రసిద్ధి కోరకు, వాక్కును నియమించి దేవిని ధ్యానించుచు, వేయికంటే ఎక్కువ జపించినచో శత్రువు జ్వరపీడితుడగును. పంచ గవ్యముచే కాని పాలచే కాని జ్వర శాంతి జరుగును. మంత్రాద్యక్షరమును లిఖించి తరువాత శత్రునామము లిఖించి, మరల మన్త ద్వితీయాక్షరమును శత్రునామమును లిఖించవలయును. 98 వేల జపముచే శత్రుమృతి సంభవించును. శ్మశానాగ్నియందు కంకమును దహించి, ఆ భస్మమును తీసుకోని శత్రునామముచే ఎనిమిది వందలు జపమును గావించినచో శత్రూచ్చాటనము జరుగును. శ్మశాన భస్మముపై శవము నుంచి కృష్ణ పక్షమున శత్రునామము నుచ్చరించి మహిషీక్షీర ధూపమును ఇచ్చినచో శత్రువులకు విపత్తును కలిగించును. ఇట్లు సంక్షేపముగా జగదంబికయగు దుర్గాదేవి యొక్క అవతార చతుష్టయమును చెప్పితిని, ఇంకనూ ఏ మడుగ దలచితివి?
ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగ మున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దుర్గామంత్ర చతుష్టయ వర్ణనమను ఎనుబదియేడ - అధ్యాయము సమాప్తము
Summary of chapter 89 of the Nārada Mahā Purana is as follows:
పరమాత్మ దివ్య మంగళ రూపాన్ని హృదయ కమలంలో నిలిపి ఆచరించే ధ్యానయోగ స్వరూపము ఈ అధ్యాయంలో ప్రబోధించబడినది. ధ్యాన సాధన వలన మనస్సు ప్రశాంతమై ఆత్మసాక్షాత్కారము సిద్ధించునని నిరూపించబడినది.