నారద మహా పురాణము
116 - ద్వాదశమాసస్థిత సప్తమీ వ్రత నిరూపణం
యది చేద్ధస్త యుక్తేయం తదాస్యాతాప నాశినీ ।
అస్యాం దానం జపో హోమ స్సర్వం చాక్షయ్యతాం వ్రజేత్
భాద్రేతు శుక్ల సప్తమ్యా మముక్తాభరణవ్రతమ్ ।
సోమస్య తు మహేశస్య పూజనం చాత్ర కీర్తితమ్
గంగాదిభి స్షోడశభి రుపచారై స్సమర్చనమ్ ।
ప్రార్థ్య ప్రణమ్య విసృజే త్సర్వ కామ సమృద్ధయే
ఫలసప్తమికా చేయం తద్విధాన ముదీర్యతే ।
నాలికేరం చ వృంతాకం నారంగం బీజపూరకమ్
కూష్మాండం బృహతీ పూగ మితి సప్త ఫలానివై ।
మహాదేవస్య పురతో విన్యస్యా పరదోరకమ్
సప్తతంతు కృతం సప్త గ్రంధి యుక్తం ద్విజోత్తమ ।
సంపూజ్య పరయా భక్త్యా ధారయే ద్వామకే కరే
స్త్రీ నరో దక్షిణే చైవ యావద్వర్షం సమాప్యతే ।
సంభోజ్య విప్రాన్సపైవ పాయసేన విసృజ్య తాన్
స్వయం భుంజీత మతిమాన్ వ్రత సంపూర్తి హేతవే ।
ఫలాని తాని దేయాని సప్తస్వపీ ద్విజేషు చ
ఏవం తు సప్త వర్షాణి కృత్వోపాస్య యధావిధి ।
సాయుజ్యం లభతే విప్ర మహాదేవస్య త ద్ర్వతీ
ఆశ్వినే శుక్ల పక్షేతు విశ్లేయా శుభ సప్తమి ।
తస్యాం కృత స్నాన పూజో వాచయిత్వా ద్విజోత్తమాన్
ఆరభ్యం కపిలాంగాం చ సంపూజ్య ప్రార్ధయేత్తతః ।
త్వామహం దద్మి కళ్యాణి ప్రియాతా మర్యమా స్వయమ్
పాలయ త్వం జగత్కృత్నం యతోఽసి ధర్మ సంభవా ।
ఇత్యుక్త్యా వేద విదుషే దత్వా కృత్వాన దక్షిణామ్
నమస్కృత్య స్వయం విప్ర విసృజేత్రాశయేత్స్వయమ్ ।
పంచగవ్యం వ్రతం చేత్తం విధాయ శ్వో ద్విజోత్తమాన్
భోజయిత్వా స్వయం చాద్యా త్తదన్నం ద్విజశేషితమ్ ।
కృతం హ్యేతద్ర్వతం విప్ర సుభాష్యం శ్రద్ధ యాన్వితః
దేవదేవ ప్రసాదేన భుక్తిం ముక్తిమవాప్నుయాత్ ।
అధ కార్తీక శుక్లాయాం శాకాఖ్యం సప్తమివ్రతమ్
తస్యాంతు సప్త శాకాని స్వర్ణకమలాని చ ।
ప్రదద్యాత్సప్త విప్రేభ్య శాకాహార స్తత స్వయమ్
ద్వితేయేఽహ్ని ద్విజాన్ఫోజ్య దత్వా తేభ్యోన్న దక్షిణామ్ ।
విసృజ్య బంధుభిస్సార్థం స్వయం భుంజీత వాగ్యతః
మార్గస్య సిత సప్తమ్యాం మిత్ర వ్రత ముదాహృతమ్ ।
యద్విష్ణోర్దక్షిణం నేత్రం తదేవ కృత వానిహ
అదిత్యాం కశ్యపాజ్జజ్జీ మిత్ర నామ దివాకరః ।
అతోఽస్యాం పూజనం తస్య యధోక్త విధినా ద్విజ
కృత్వా ద్విజా నోజయిత్వా సపైవ మధురాదినా ।
సువర్ల దక్షిణాం దత్వా విసృజ్యాశ్నీత చస్వయమ్
కృత్వైత ద్విధినా లోకం సూర్యస్య వ్రజతి ధ్రువమ్ ।
ద్విజో బ్రాహ్మం తధా శూద్ర స్సత్కులే జన్మ చాప్నుయాత్
పౌషస్య శుక్ల సప్తమ్యాం వ్రతం చాభయ సంజ్ఞతమ్ ।
ఉపోష్య భానుం త్రిసంధ్యం సమభ్యర్చ్య ధరాస్థితః
క్షీరసికానసంబద్ధం మోదకం ప్రస్థసమ్మితమ్ ।
ద్విజాయ దత్వా భోజ్యాన్యా నష్టాష్టభ్యశ్చ దక్షిణామ్
పృధివీ వా సువర్ణం వా విసృజ్యాశ్నీత చ స్వయమ్ ।
అభయాఖ్యంప్రతంత్వేత త్సర్వస్యాభయదం స్మృతమ్
మార్తండాఖ్యం వ్రతం నామ కధయక్తి ద్విజాః పరే ।
ఏకమేవేతి చ ప్రోక్త మేకదైవతయా ఋధైః
మాఘే తు కృష్ణసప్తమ్యాం వ్రతం సర్వాప్తిసంజ్ఞకమ్ ।
సముప్యోష్య దినే తస్మిన్ సంపూజ్యాదిత్యమంబికామ్
సౌవర్ణంగంధపుష్టాద్యైః కృత్వా రాత్రే చ జాగరమ్ ।
పరే హ్ని విప్రా సంభోజ్య పాయసేన తు సప్త వై
దక్షిణాం నాలికేరాణి తేభ్యోదత్వా గురుం తతః ।
సౌవర్ణం తు రవేర్చిమం యుక్తం దక్షిణయానయా
సమర్యచ భృశం ప్రార్ధ్య విసృజ్యా ద్యాత్స్వయం తతః ।
ఏతత్సర్వాప్తిదం నామ సంప్రోక్తం సార్వకామికమ్
వ్రతస్యాస్య ప్రభావేణ ద్వైతం సిద్ధ్యేద్ధి సర్వధా ।
మాఘస్య శుక్ల సప్తమ్యా మచలాఖ్యం వ్రతం స్మృతమ్
త్రిలోచన జయన్డీయం సర్వపాపహరా స్మృతా ।
రధాఖ్యా సప్తమి చేయం చక్రవర్తిత్వ దాయినీ
అస్యాం సమర్చ్య సవితుః ప్రతిమాం తు హైటాం ।
హేమాశ్వయుక్త రథగాం తు దదేత్సహేమామ్
యో భావభక్తి సహిత స్సగతో హి లోకం ।
శంభో స్సమోదత ఇహాపి చ భుక్తభోగః
భాస్కరీ సప్తమి చేయం కోటి భాస్వద్ధహోపమా ।
అరుణోదయ వేలాయాం అస్యాం స్నానం విధీయతే
అర్కస్య చ బదర్యాశ్చ సప్త సప్త దలాని వై ।
నిధాయ శిరసి స్నాయాత్ సప్త జన్మాఘ శాంతయే
పుత్ర ప్రదం వ్రతం చాత్ర ప్రాహాదిత్య స్వయం ప్రభుః ।
యో మాఘసీత సప్తమ్యాం పూజయేన్మాం విధానతః
తస్యాహం పుత్రతాం యాస్యే స్వాంశేన భృశతోషితః ।
తస్మాత్తైతేన్డియో భూత్వా సముపోష్య దివానిశమ్
పూజయే దపరే చాహ్ని హోమం కృత్వా ద్విజాంస్తతః ।
దధ్యోదనేన పయసా పాయసేన చ భోజయేత్
అనేన విధినా యస్తు కురుతే పుత్ర సప్తమిః ।
లభతే సతు సత్పుతం చిరాయుష మనామయమ్
తపస్య శుక్ల సప్తమ్యాం వ్రత మర్కపుటం చరేత్ ।
అర్కపతైర్యజేదర్క మర్కపత్రాణి చొశ్నుయాత్
అర్కనామ జపేచ్ఛశ్వ దళం చార్కపుట వ్రతమ్ ।
ధనదః పుత్రదం చైత త్సర్వ పాప ప్రణాశనమ్
త్రివర్గదమితి ప్రాహు కేచివేత ద్ర్వతం ద్విజ ।
యజ్ఞవ్రతం తధాప్యన్యే వీధి వద్దోమ కర్మణా
సర్వాసు సర్వమాసేపు సప్తమిషు ద్విజోత్తమః ।
భాస్కరా రాధనం ప్రోక్తం సర్వకామఫలప్రదమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే ద్వాదశమాస స్థిత సప్తమీ వ్రత నిరూపణం నామ షోడశాధిక శత తమోఽధ్యాయః.
ఓ నారాదా! ఇపుడు నేను నీకు సప్తమి వ్రతములను చెప్పెదను వినుము ఈ వ్రతముల నాచరించిన మానవుడు సూర్యుని సాయుజ్యమును పొందును.చైత్ర శుక్ల సప్తమినాడు బయట స్నానము చేయవలయును. గోమయముచే అలుకబడి, గౌరవర్లమృత్తికచే పూయబడిన స్థండిలమున అష్టదల పద్మమును లిఖించి కర్ణికయందు సూర్యుని ఉంచి, పూర్వపత్రము నందు ధాతువులచే చేయబడిన ఇద్దరు దేవతల నుంచవలయును. ఆగ్నేయ పత్రము నందు కారకములచే చేయబడిన గంధర్వుల నుంచవలయును. దక్షిణ పత్రము నందు రాక్షస ద్వయము నుంచవలయును. నైఋతి దిక్పత్రము నందు ఆకృతి ద్వయము నుంచవలయును. పశ్చిమ పత్రము నందు కాద్ర వేయులగు మహానాగుల నుంచవలయును. వాయువ్య పత్రమునందు యాతుధాన ద్వయమును, ఉత్తర పత్రమున ఋషిద్వయమును, ఐశాన్య పత్రమునందు ఒక గృహము నుంచవలయును. ఇట్లుంచిన వాటిని గంధమాల్యాను లేపనములచే, దీప ధూపనైవేద్యములచే, తాంబూల క్రమకాదులచే పూజించవలయును. ఇట్లు పూజించి, నూటా ఎనిమిదిమార్లు నేతితో హోమమును చేయవలయును. సూర్యునికి ఎనిమిది, ఇతరులకెనిమిది ఆహుతులనీయవలయును. వేదియందు నామ మంత్రముచే నీయవలయును. తరువాత పూర్ణాహుతిని ఆచరించవలయును. యధాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ నీయవలయును. ఇట్లు సవిధిగా ఈ వ్రతము నాచరించినచో సర్వసౌఖ్యములను పొందును. దేహాంతమున సూర్యమండలమును ఛేదించి పరమ పదమును చేరును.
వైశాఖ శుక్ల సప్తమినాడు జహ్నుమహర్షి జాహ్నవీ నదిని కోపముచే త్రాగి మరల దక్షిణ కర్ణము నుండి విడిచెను. ఈ దినమున ప్రత్యూష కాలమున గంగానదిలో స్నానముచేసి గంగానదిని గంధపుష్పాక్షతాదులచే సర్వోపచారములచే పూజించవలయును. ఈ గంగావ్రతమున ఒక వేయి ఘటములను దానము చేయవలయును. ఈ వ్రతమును భక్తితో చేసినచో ఏడు తరములను స్వర్గమునకు చేరును. ఈ దినమున కమల వ్రతమును కూడా చెప్పిరి. ఆ విధానమును చెప్పెదను. ఒక తిలమాత్ర సువర్ణముతో కమలమును నిర్మించి వస్త్రయుగ్మముచే కప్పిపుచ్చి, గంధ దూపాదులచే పూజించవలయును. పద్మహస్తునకు నమస్కారము. విశ్వధారికి నమస్కారము. దివాకరా! నీకు నమస్కారము. ప్రభాకరా! నీకు నమస్కారము. ఇట్లు దేవేశుని ప్రార్థించి సూర్యాస్తమయమున ఉదకుంభముతో స్వర్ణకమలమును, కపిలగోవును బ్రాహ్మణునకు సమర్పించవలయును. ఆ దినము ఉపవసించి మరునాడు భుజించవలయును. భక్తితో బ్రాహ్మణులను భుజింపజేసి వ్రత సాఫల్యమును పొందును. ఈ దినముననే నింబవ్రతములచే (వేపాకు) పూజించవలయును. “ఓంకారమును” ఆదిలో చేర్చి “ఖభోల్కాయ” అను మంత్రముచే నింబపత్రమును భుజించవలయును. మౌనముగా భూమియందు పరుండవలయును. మరునాడు బ్రాహ్మణులను భుజింపజేసి తాను కూడా బంధువులతో కలిసి భుజించవలయును. ఈ నింబపత్ర వ్రతము నాచరించు వారికి సర్వసౌఖ్యముల నిచ్చును. ఈ సప్తమినే శర్కరా నామముతో పిలిచెదరు. అమృతమును త్రాగుచున్న సూర్యుని హస్తము నుండి అమృత బిందువులు భూమి మీదపడి శాలిముద్దయవ ఇక్షువులుగా పుట్టినది. చెరుకు నుండి శర్కర అమృతము వంటి చెఱుకురసము స్రవించినది కావున సూర్యునకు ప్రియమగు శర్కర హవ్యకవ్యములలో ఉపయోగింతురు. ఈ శర్కరా సప్తమి వ్రతము నాచరించినచో అశ్వమేధ ఫలమును ప్రసాదించును. ఈ వ్రతము సర్వదుఃఖములను ఉపశమింప చేయును. పుత్ర సంతానమును పెంచును. ఈ సప్తమినాడు శర్కరాదానము శర్కరా భోజనమును శ్రద్ధతో చేయవలయును. ఈ వ్రతము సూర్యునకు చాలా ప్రియము. పరమ భక్తిచే ఈ వ్రతము నాచరించు వారికి సద్గతి లభించును. ఇక జ్యేష్ఠ శుద్ధ సప్తమినాడు రవి స్వయముగా ఇంద్రుడాయెను. యధావిధిగా ఆ ఇంద్రుని పూజించి ఇంద్రియ నిగ్రహముతో ఉపవసిచినచో దేవేంద్రుని అనుగ్రహము వలన స్వర్గమును పొందును. ఆషాఢ శుక్ల సప్తమినాడు భాస్కరుడు వివస్వాన్ అను పేరుతో పుట్టెను. ఆ దినమున వివస్వంతుని గంధపుష్పాదులచే ప్రత్యేకముగా పూజించి చక్కగా ప్రార్ధించి సూర్యసాయుజ్యమును పొందును. శ్రావణ శుక్లసప్తమినాడు శుభకరమగు అవ్యంగమను వ్రతమును ఆచరించవలయును. నాలుగు హస్తముల పత్తి సార్థవస్త్రములను గోపతి పూజాంతమున ప్రీతి కొఱకు దానము చేయవలయును. ఈ వ్రతము పరమ శుభప్రదము. ఈ సప్తమి హస్తా నక్షత్రయుక్తమగుచో పాపనాశిని కాగలదు. ఈ దినమున దానము జపము, హోమము అంతయూ అక్షయమగును. భాద్రపద శుక్లసప్తమినాడు అముక్తాభరణ
Summary of chapter 118 of the Nārada Mahā Purana is as follows:
అజ్ఞానంచేత లేదా ప్రమాదవశాత్తు ఏకాదశీ వ్రతమునకు భంగము వాటిల్లితే ఆచరించవలసిన ప్రాయశ్చిత్త మార్గములు ఈ అధ్యాయంలో వివరింపబడినవి. శ్రీహరి శరణాగతి మరియు భక్తిపూర్వక పూజ వలన పాప విముక్తి కలుగునని నిరూపించబడినది.