నారద మహా పురాణము
63 - ప్రయాగమాహాత్మ్యమ్
వసురువాచ :-
శృణు మోహిని వక్ష్యామి మాహాత్య్మం వేద సంమతమ్ ।
ప్రయాగస్య విధానేన స్నాత్వా యత్ర విశుద్ధ్యతి
కురుక్షేత్రసమా గంగా యత్ర తత్రోవగాహితా ।
తస్మాద్దశగుణాప్రోక్తా యత్ర వింధ్యేన సంగతా
తస్మాచ్చతగుణప్రోక్తా కాశ్యాముత్తరవాహినీ ।
కాశ్యాశ్శతగుణా ప్రోక్తా గంగా యత్రార్కజాన్వితా
సహస్రగుణితా సా పి భవేత్పశ్చిమవాహినీ ।
సా దేవి దర్శనాదేవ బ్రహ్మహత్యాది హారిణీ
పశ్చిమాభిముఖీ గంగా కాళింద్యా సహ సంగతా ।
హనిక్త ల్పశతం పాపం సామాఘే దేవి దుర్లభా
అమృతం కధ్యతే భద్రే సా వేణీ భువి సంగతా ।
యస్య మాఘే ముహుర్తం తు దేవానామపి దుర్లభమ్
పృథివ్యాం యాని తీర్థాని పుర్యః పుణ్యాస్తధా సతి ।
స్నాతు మాయాతి తా వేణ్యాం మాఘ మకర భాస్కరే
బ్రహ్మవిష్ణుమహాదేవా రుద్రాదిత్యమరుద్గణాః ।
గంధర్వా లోకపాలాశ్చ యక్షకిన్నర గుహ్యకాః
అణిమాది గుణోపేతా యే చాన్యే తత్వదర్శినః ।
బ్రహ్మాజీ పార్వతీ లక్ష్మీ శృచీమేధా దితీ రతిః
సర్వాస్తాదేవపత్స్యశ్చ తధా నాగాంగనాశ్శుభే ।
ఘృతాచి మేనకా రంభా పుర్వశీ చ తిలోత్తమా
గణాశ్చాప్సరసాం సర్వే పితూణాం చ గణాస్తధా ।
స్నాతుమాయాస్తి తే సర్వే మాఘే వేణ్యాం విరించి జే
కృతే యుగే స్వరూపేణ కతా ప్రచ్ఛన్నరూపిణః ।
సర్వతీర్థానీ కృష్ణాని పాపినాం సంగదోషతః
భవన్తో శుక్ల వర్ణాని ప్రయాగే మాఘమజ్జనాత్ ।
మకరస్థీ రనౌ మాఘ గోవిన్దాచ్యుత మాధవ!
స్నానేనానేన మే దేవ! యధోక్తఫలదో భవ ।
ఇమం మన్తం సముచ్చార్య స్నాయాన్మౌనం సమాశ్రితః
వాసుదేవం హరిం కృష్ణం మాధవం చ స్మరేత్పునః ।
తప్తేన వారిణి స్నానం యధ హే క్రియతే నరైః
షష్ట్యబ్దేన ఫలం తద్ధి మకర స్థీ దివాకరే ।
బహిస్నానం తు వాప్యాదౌ ద్వాదశాబ్దఫలం స్మృతమ్
తటాకే ద్విగుణం తద్ది నద్యాడో తచ్చతుర్గుణమ్ ।
దశధా దేవఖాతే చ మహానద్యాం తు త చ్ఛతమ్
చతుర్గుణశతం తచ్చ మహానద్యోస్తు సంగమే ।
సహస్రగుణితం సర్వం తత్ఫలంమకరే రనౌ
గంగాయాం స్నానమాత్రేణ ప్రయాగే తత్రకీర్తితమ్ ।
గంగాం యే చావగాహంతి మాఘ మాసి సులోచనే
చతుర్యుగ సహస్రాంతే న పతంతి సురాలయాత్ ।
శతేన గుణితం మాఘే సహస్రం విధి నందిని!
నిర్దిష్టమృషిభిస్నానం గంగా యమున సంగమే ।
పాపౌఘైర్బువిభాగస్య దాహాయేమం ప్రజాపతిః
ప్రయాగం విదధో దేవి! ప్రజానాం హితకామ్యయా ।
స్నానస్థానమిదం సమ్యక్ సీతాసీతజలం కిల
పాపరూప పశూనాం హి బ్రహ్మణా నిర్మితం పురా ।
సితాపితా తు యా ధారా సరస్వత్యా విదర్భితా
తం మార్గం బ్రహ్మలోకస్య సృష్టికర్తా ససర్జ వై ।
జ్ఞానదో మానసే మాఘా న తు మోక్షఫలప్రదః
హిమవత్పష్ణ తీర్ధేషు సర్వపాపప్రణాశనః ।
వేదవిద్బిర్వినిర్దిష్టం ఇంద్రలోకప్రదోహి సః
సర్వమాసోత్తమో మాఘ మోక్షదో బదరీ వనే ।
పాపహా దుఃఖ హారీ చ సర్వకామఫలప్రదః
రుద్రలోకప్రదో మాఘా నార్మదే పరికీర్తితః
విశాల ఫలదో మాఘా విశాలాయా ప్రకీర్తితః ।
పాపేంధన దవాగ్నిశ్చ గర్భవాస వినాశనః
విష్ణులోకాయ మోక్షాయ జాహ్నవః పరికీర్తితః ।
సరయూర్గండకీ సింధు శ్చంద్రభాగా చ కౌశికీ
తాపీ గోదావరీ భీమా పయోట్ల కృష్ణవేణికా ।
కావేరీ తుంగ భద్రా చ యాస్తధాన్యా స్సముద్రగాః
తాసు స్నాయీ నరో యాతి స్వర్గలోకం వికల్మషః
వసువు పలికెను:- మోహినీ! వేదసంమ్మతమగు ప్రయాగక్షేత్ర స్నాన విధానమును తెలి పెదను. వినుము. గంగలో నిచట స్నానముచేసిననూ కురుక్షేత్ర సమఫలము కలుగును. గంగ వింధ్యసంగతయైన చో పదిరెట్లు అధిక ఫలము నిచ్చును. కాశిలో ఉత్తరవాహినీ యగుగంగ నూరురెట్లు అధిక ఫలము నిచ్చును. యమునా నదీతో కలిసి యున్న గంగ కాశీ గంగ కంటే నూరు రెట్లు అధికఫలమునిచ్చును. పశ్చిమ వాహినీ గంగయైనచో వేయిరెట్లు అధికఫలము నిచ్చును. పశ్చిమవాహిని గంగా దర్శనమాత్రముననే బ్రహ్మహత్యాది పాపములను హరించును. పశ్చిమాభిముఖియగు గంగ యమునతో కలిసియున్నచో నూరు కల్పముల పాపములను నశింప చేయును. మాఘ మాసమున ఇట్టి గంగ దుర్లభము. భూమండలమున గంగాయమున సంగమ తీర్థము అమృతముగా కీర్తించబడును. ఇట్టి తీర్దము మామమాసమున దేవతలకు కూడా దుర్లభమే. ఈ భూమండలమున నున్న సమస్త తీర్ధములు, పవిత్రక్షేత్రములు మాఘమాసమున మకర భాస్కరుడున్నపుడు వేణిలో స్నానముచేయుటకు వచ్చును. బ్రహ్మవిష్ణుమహాదేవులు, రుద్రాదిత్యమరుద్గణములు, గంధర్వులు, లోకపాలకులు, యక్షకిన్నర గుహ్యకులు, అణిమాది గుణోపేతులగు తత్త్యదర్శులు, సరస్వతి, పార్వతి, లక్ష్మి, శచి, మేధ, అదితి, రతి, సకలదేవపత్నులు నాగాంగనలు, ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశీ, తిలోత్తమ, అప్సరోగణములు, పితృగణములు, అందరు మాఘమాసమున వేణీ సొనమునకై వత్తురు. కృతయుగమున ప్రత్యక్షరూపముతో, కలియుగమున ప్రచ్ఛన్నరూపముతో వచ్చెదరు. వేణిలో దీగుచున్నపుడు పాపులసంగదోషముతోనల్ల బారిన సర్వతీర్థములు మాఘమాసమున ప్రయాగమజ్జనమున శుక్లవర్ణములగును. సూర్యుడు మకరరాశిలో ఉండగా మాఘమాసమున “గోవిన్ద, అచ్యుతా! మాధవా నాస్నానముచే నాకు యధోక్త ఫలమునిమ్ము” అనుమస్తమునుచ్చరించీ మౌనముగా స్నానమునాచరించవలయును. మరల వాసుదేవుని, హరిని, కృష్ణుని మాధవుని స్మరించవలయును. సూర్యుడు మకరరాశిలో ఉండగా ఇంటిలో వేడినీరుతో స్నానము చేసినచో అరువదిసంవత్సరముల ఫలము కలుగును. వేలుపలనున్న పాప్యాదులలో స్నానమాచరించిన ద్వాదశాబ్దస్నానఫలము కలుగును. తటాకమున స్నానము ద్విగుణఫలమును, తద్యాదులందు చతుర్గుణఫలము, దేవఖాత స్నానము దశగుణఫలమును, మహానదీస్నానము శతగుణ ఫలమును, మహానదీసంగమస్నానము చతుశ్శతగుణఫలము కలుగును. సూర్యుడు మకరరాశిలో నుండగా చేయు అన్ని విధములస్నానము సహస్రగుణ ఫలమునిచ్చును. గంగాస్నానము, ప్రయాగ స్నానము సమాన ఫలమునిచ్చును. మాఘమాసమున గంగాస్నానమును చేయువారు నాలుగువేలయుగములు స్వర్గములో నివసింతురు. గంగాస్నానము శతగుణము, ప్రయాగ స్నానముసహస్రగుణిత ఫలమునిచ్చునని గంగాయమున సంగమమున స్నానమునునిర్దేశించిరి. భూమండలమునగల పాపసమూహ భారదాహము కొరకు ప్రజాహితమును కోరి ప్రజాపతి ప్రయాగను సృజించెను. తెలపు నలుపు జలము కలిగి తీర్థము స్నానస్థానము. పాపరూప పశునాశమునకు ఈ స్థానమను బ్రహ్మనిర్మించేను. సితాసిత జలయగు ధారను సరస్వతితో కలిగి బ్రహ్మలోకమార్గమును సృష్టికర్త ఏర్పరిచెను. మానససరోవరస్నానము జ్ఞానప్రదముని మోక్ష ప్రదముకా జాలదు. హిమవత్పష్టతీర్ధములన్నింటిలో సర్వపాప ప్రణాశనముగా ఇంద్రలోక ప్రదమని వేదవిదులు నిర్దేశించిరి. మాఘ మాసము సర్వమాసములలో ఉత్తమము. బదరీవనమున మోక్షప్రదము, పాపహారి, దుఃఖహారి, సర్వకామఫలప్రదము. నర్మదానది మాఘమాసమున రుద్రలోకప్రదము. సకలపాపనాశకము సర్వలోకసుఖప్రదము. మాఘమాసమున విశాలా నది విశాఫలప్రదము. పాపసమూహమునకు దవాగ్ని. జన్మనాశకము, మాఘమాసమున గంగానది విష్ణులోక ప్రదము. మోక్ష ప్రదము. సరయు, గండకీ, సింధు, చన్దభాగా, కౌశికి, తాపీ, గోదావరి, భీమా, పయోష్ణీ, కృష్ణవేణి, కావేరి, తుంగభద్ర, ఇతరసముద్రగతనదులు అన్నియూ మాఘమాసమున స్వర్గలోక ప్రదములు.
నైమిషే విష్ణు సారూప్యం పుష్కరే బ్రహ్మణోంతకమ్ ।
ఆఖండలస్య లోకో పి కురుక్షేత్రే చ మాఘతః ।
మాఘో దేవ హ్రదే దేవి యోగసిద్ధి ఫలప్రదః
ప్రభాసే మకరా దిత్యే స్నాతో రుద్రగణో భవేత్ ।
దేవికాయాం దేవదేహో నరో భవతి మాఘతః
మాఘస్నానేన విధిజే గోమత్యాం న పునర్భవః ।
హేమకూటే మహాకాలే ఓంకారే హ్యపరే తధా
నీలకంధర్బుదే మాఘా రుద్రలోక ప్రదో మతః ।
సర్వాసాం సరితా దేవి సంపూరో మాకరే రవౌ
స్నానేన సర్వకామానాం ప్రాప్త్యె జ్ఞేయో విచక్షణైః ।
మాఘస్తు ప్రాప్యతే ధన్యైః ప్రయాగే విధినందిని
అపునర్భవదం తత్ర సితాసిత జలం యతః
గాయన్తి దేవా స్సతతం దివిష్టా మాఘః ప్రయాగే కిల సంభవిష్యతి ।
స్నాతా నరా యత్ర న గర్భవేదనాం పశ్యన్తి తిష్ఠని చ విష్ణు సన్నిధౌ
రవైస్నానంచే భగ్గరై సార్లు విధాత్రా తులయా ధృత పరా ।
మాపః ప్రయాగశ్చ తయోర్ద్వయేరళ స్మాహో గరీయాంశ్చతురాననాత్మజే
పోతాంబుపర్ణాషనదేవ శోషస్తుడుగై శ్చిరాలసుచితే ।
యోశ్చ సుయాన్తి సరాస్తు యాం గతిం స్నానాశ్రయాగస్య హి యాంతి తాం గతిమ్
స్నాతా పా యే మాకర భాస్కరోదయే తీర్దే ప్రయాగే సురధసంగమే ।
తేషాం గృహద్వార మలంకరోతి భృంగావళీ కుంజరకర్ణతాడితా
యో రాజసూయాఖ్య స్పూర్య స్నానాత్సలం సంప్రదదాతి చాఖిలమ్।
పాపాని సర్వాణి నిహత్య లీలయా నూనం ప్రయాగః సకనం న వర్ణ్యతే
చతుర్వేదిషు యత్పుణ్యం సత్యవాదిషు చైవహి ।
స్నాత ఏవ తదాప్నాతి గంగాకాలింది సంగమే
తత్రాభిషేకం కుర్వీత సంగమే శంసితవ్రతః ।
తుల్యం ఫలమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః
పంచయోజనవిస్తీర్ణం ప్రయాగస్యతు మండలమ్ ।
ప్రవేశాదస్య భూమౌతు అశ్వమేధః పదే పదే
త్రీణి కుండాని సుభగే తేషాం మధ్యే తు జాహ్నవీ ।
ప్రయాగస్య ప్రవేశేన పాపం న శ్యతి తత్ క్షణాత్
నైమిషమున విష్ణుసారూప్యమును, పుష్కరమున బ్రహ్మసామీప్యమును, కురుక్షేత్రమున ఇంద్రలోకమును ప్రసాదించును. దేవప్రదమున మాఘమాసము యోగసిద్ధి ఫలప్రదము. మకరాదిత్యకాలమున ప్రభాసస్నానము రుద్రగణత్వప్రదము. దేవికానదిలో మానస్నానము దేవదేహమును ప్రసాదించును. గోమతీ స్నానము మున్షన్మ హరము. హేమ కూటమున,మహాకాలమున, ఓంకారమున, నీలకంఠార్బుదమున మాఘస్నానము రుద్రలోకప్రదము. సూర్యుడు మకరరాశిలో నుండగా సర్వనదులు కలియును గాన అపుడు చేయుస్నానము సర్వకామప్రదము. మాఘమాసమున ప్రయాగను ధన్వులు చేరెదరు. అచట సీతాసిత జలముండును గాన పునర్జన్మును హరించును. మాఘమాసము ప్రయాగలో మాకు గడువవలయునని స్వర్గమున నుండు దేవతలు గానము చేయు చుందురు. ప్రయాగలో మాఘస్నానమును చేయువారు. మరల గర్బవేదనను పొందరు. విష్ణుసన్నిధిలో ఉందురు. పూర్వము బ్రహ్మ తీర్ధవ్రత స్నానతపోయాగ మాఘప్రయాగలను తలతూచేను. వాటిలో మాఘమాసము ప్రయాగ అధికమాయెను. ఈ రెంటిలో మాఘము ఇంకనూ శ్రేష్ఠమాయేను. గాలి, నీరు ఆకులు, ఆహారముగా తీసుకొని దేహశోషణముచే ఉగ్రతపములచే, చిరకాల సంచితయోగములచే పొందుగతిని మాఘప్రయాగ స్నానమున పొందెదరు. మకర భాస్కరోదయకాలమున గంగాసంగమమగు ప్రయాగలో స్నానము చేయువారి గృహద్వారమున కుంజరకర్ణతాడిత భృంగావళి అలంకార మగును. మాఘప్రయాగస్నానము రాజసూయాధ్వర సమఫలప్రదము సర్వపాపహరము. అట్టి ప్రయాగనేలస్తుతించరు? నాలుగువేదములను చదివినవారికి కలుగు ఫలము, సత్యవాది ఫలము, గంగాయమునాసంగమ స్నానమున లభించును. ఈ సంగమమున వ్రతమును స్వీకరించి స్నానమాడవలయును. ఇట్లు చేసిన రాజసూయాశ్వమేధముల ఫలమును పొందును. ప్రయాగమండలము పంచయోజనవివస్తీర్ణము. ఈ భూమిలో ప్రవేశించి నంతనే ప్రతిపదమున అశ్వమేధ ఫలము లభించును. ఇచట మూడు కుండములుండును. వీటి మధ్యలో జాహ్నవి యుండును. ప్రయాగతీర్ధ ప్రవేశమాత్రముననే తత్ క్షణమే సకలపాపములు నశించును.
మాసమేకం నరస్స్నాత్వా ప్రయాగే నియతేంద్రియః ।
ముచ్యతే సర్వపాపేభ్యో యధా దృష్టం స్వయంభువా
శుచిస్తు ప్రయతో భూత్వా హింసక శ్శ్రద్ధయాన్వితః ।
స్నాత్వా ముచ్యత పాపేభ్యో గచ్ఛేచ్చ పరమం పదమ్
నైమిషం పుష్కరం చైవ గోతీర్థం సింధుసాగరమ్ ।
గయా చ ధీమకం చైవ గంగాసాగరసంగమః
ఏతే చాన్యేచ బహవో యే చ పుణ్యా శ్శిలచ్చయాః ।
దశతీర్ధ సహస్రాణి త్రింశత్కోట్యస్తధాపరాః
ప్రయాగే సంస్థితా నిత్య మేధమానా మనీషిణాం ।
త్రీణి యాత్యగ్ని కుండాని తేషాం మధ్యేతు జాహ్నవీ
ప్రయాగాద్ది వినిప్ర్కొన్హా సర్వతీర్ధపురస్కృతా ।
తపనస్య సుతా దేవీ త్రిషులో కేషు విశ్రుతా
యమునా గంగయా సార్ధం సంగతా లోకపావనీ ।
గంగాయమునయోర్మధ్యే పృధివ్యాం యత్పరం స్మృతమ్
ప్రయాగస్య తు తీర్ధస్య కలాం నార్హతి షోడశీమ్ ।
తిస్రః కోట్యోర్ధకోటీచ తీర్ధానాం వాయురబ్రవీత్
దివి భువ్యం తరిక్షే చ జాహ్నవ్యంతాని సంతి చ ।
ప్రయాగే సమధిష్టాయ కబలాశ్వతరావుభౌ
భోగవత్యధవాచైషా వేదీవేద్యాప్రజాపతిః ।
తత్ర వేదాశ్చ యజ్ఞాశ్చ మూర్తిమంత స్సమాస్ధితాః
ప్రజాపతి ముపాసంతే ఋషయశ్చ తపోధనాః ।
యజన్తి క్రతు భిర్దేవాం స్తధా చక్రధరాస్సతి
తతః పుణ్యతమో నాస్తి త్రిషు లోకేషు సున్దరి।
ప్రభావాత్సర్వతీర్థేభ్యః ప్రభవత్యధిక స్తధా ।
తత్ర దృష్ట్వా తు తత్తీర్ధం ప్రయాగం పరమం పదమ్
ముచ్యన్డే సర్వపాపేభ్య శ్శశాంక ఇవ రాహుణా
తతో గత్వా ప్రయాగం తు సర్వదేవాభిరక్షితమ్ ।
బ్రహ్మచారీ వసన్మాసం పితౄన్దేవాంశ్చ తర్పయన్
ఈప్సితాంల్లభతే కామా న్యతతత్రాభిసంగతః ।
మకరస్ధే రవౌ మాఘే న స భూయస్తు గర్భగః
ఒక మాసము జితేద్రియడై ప్రయాగస్నానమాచరించిన సర్వపాపములు నశించుటను బ్రహ్మ ప్రత్యక్షముగా చూచెను. పాపియైననూ శుచియై ఏకాగ్రమనస్కుడై శ్రద్ధతో ప్రయాగలో స్నానమాడినచో సర్వపాపములు తొలగి పరమపదమును పొందును. నైమిషము, పుష్కరము, గోతీర్థము, సింధుసాగరము, గయా, ధేనుకము, గంగాసాగర సంగమము ఇవి, ఇతరబహు పుణ్యశిలోచ్చయములు, దశసహస్రతీర్ధములు, ఇతరములగు ముప్పదికోట్ల తీర్ధములు, ఇవన్నియూ ప్రయాగలో ఎపుడూ నిలిచియుండును. ఇచట మూడు అగ్ని కుండములు కలవు. వీటి మధ్యలో జాహ్నవి కలదు. ప్రయాగనుండి సర్వతీర్థ పురస్కృతయై బయలువెడలిన యమునానది లోకత్రయ ప్రసిద్ధిని పొందినది. లోకపావనియగు యమునానది గంగతో కలిసెను. గంగాయమునల మధ్య భూభాగమున నున్న సకలపుణ్యక్షేత్ర తీర్థరాజములన్నియూ ప్రయాగషోడశాంశకు సాటిరావని చెప్పిరి. ఈ భూమండలమున మూడు కోట్ల యాబదిలక్షల తీర్ధములు, ఇంకను అంతరిక్షమున స్వర్గమున జాహ్నవ్యంతములుగా కలవని వాయువు తెలిపెను. ఇవన్నియూ ప్రయాగలో కలియును. మరియూ కబలాశ్వతరములు రెండు, భోగవతి, వేది, వేధ్యము, ప్రజాపతి, వేదములు యజ్ఞములు అన్నియూ ఆకారమును దాల్చి ప్రయాగలో నుండును. తపోధనులగు ఋషులు ప్రజాపతిని సేవించుచుందురు. యాగములచే-దేవతలను పూజింతురు. కావున ప్రయాగకంటే పుణ్యతమ మగునది ఈ భూమండలమున మరియొకటి లేదు. ప్రయాగప్రభావమున అన్ని తీర్ధములను అతిశయించును. ఇచట ప్రయాగతీర్థమును చూచిన వారు సర్వపాప వినిర్ముక్తులై పరమపదమును పొందెదరు. కావున సర్వదేవాభిరక్షితమగు ప్రయాగ కు వెళ్ళి బ్రహ్మచర్యముతో ఒకమాసముండి పితరులను, దేవతలను తృప్తులను చేయవలయును. ఇట్లు చేసిన సకలాభీష్టములను పొందును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున ప్రయాగలో స్నానమాడినవాడు మరల పుట్టడు.
దుర్జయా వైష్ణవీ మాయా దేవైరపి సుదుస్త్యజా ।
ప్రయాగే దహ్యతే సా తు మాఘే మాసి విరించిజే ।
తేషు తేషు చ లోకేషు భుక్త్యా భోగాననేకశః
పశ్చాచ్చక్రిణి లీయనే ప్రయాగే మాఘమజ్జినః ।
ఉపస్పృశతి యో మాఘ మకరర్కే సీతా సితే
తస్య పుణ్యస్య సంఖ్యాం నో చిత్ర గుప్తో పివేత్త్యలమ్ ।
రాజసూయ సహస్రస్య వాజపేయ శతస్య చ
ఫలం సీతాసితే మాఘే స్నాతానాం భవతి ధ్రువమ్ ।
ఆకల్ప జన్మభిః పాపం సంచితం మనుజేస్తు యత్
తద్భవేద్భస్మసాన్మామే స్నాతానాం తు సితాసితే ।
గంగాయమునయోశ్చైవ సంగమో లోకవిశ్రుతః
స ఏవ కామికం తీర్ధం యత్ర స్నానేన భక్తితః ।
యస్య యస్య చ యః కామ స్తస్య తస్యభవేద్ధి సః
భోగకామస్యగాస్యు స్యాద్రాజ్యం రాజ్యకామినః ।
స్వర్గస్స్యాత్ స్వర్గ కామస్య మోక్షస్స్యాన్మోక్షకామినః
కామప్రదాని తీర్థాని త్రైలోకేశ్ యాని కాని చ ।
తావి సర్వాణి సేవస్తే ప్రయాగం మకరే రనౌ
హరిద్వారే ప్రయాగే చ గంగాసాగరసంగమే ।
స్నాత్వైవ బ్రహ్మణో విష్ణో శ్శివస్య చ పురం ప్రజాత్
సీతా సితే తు యత్నా నం మాఘమాసే సులోచనే ।
న దత్తే పునరావృత్తం కల్పకోటి శతైరపి
సత్యవాదీ జితక్రోధో హ్యహింసాం పరమాం శ్రితః ।
ధర్మానుసారీ తత్వజ్ఞో గోబ్రాహ్మణ హితే రతః
గంగాయమున యోముర్మధ్యే స్నాతో ము చ్యేతకిల్బిషాత్ ।
మనసా చింతితాన్కామాం సత్ర ప్రాప్నోతి పుష్కలాన్
స్వర్ణభారసహస్రేణ కురుక్షేత్రే రవిగ్రహే ।
యత్పలం లభతే మాఘే వేణ్యాం తత్తు దినే దినే
గువాం శతసహస్రస్య సమ్యగ్దత్తస్య యత్ఫలమ్ ।
యోగాభ్యా సేన యత్పుణ్యం సంవత్సర శతత్రయే
ప్రయాగే మాఘ మాసేతు త్ర్యహం స్నానేన యత్పలమ్
నాశ్వమేధసహణ తత్ఫలం లభతే సతి ।
త్యహస్నానఫలం మాఘ పురా కాంచన మాలినీ
రాక్షసాయ దదౌ ప్రీత్యా తేన ముక్తస్సపాపకృత్ ।
త్ర్యహత్పాపక్షయో జాతః సప్తవింశతిభిర్దినైః
స్నానేన యద భూత్పుణ్యం తేన దేవత్వమాగతా
విష్ణుమాయ దేవతలచే కూడా జయించ రానిది. కాని మాఘప్రయాగస్నానమున విష్ణుమాయ కూడా దహించబడును. మాఘప్రయాగస్నానమునాచరించినవారు ఆయాలోకములలో బహు భోగములననుభవించి శ్రీ విష్ణువులో లీనమగుదురు. మకరార్కకాలమున ప్రయాగస్పర్శవలన కలుగు పుణ్యరాశులను చిత్రగుప్తుడు కూడా లెక్కించ జాలడు. సహస్రరాజసూయముల ఫలము, శత వాజపేయముల ఫలము మాఘ ప్రయాగస్నానమున కలుగును, మాఘప్రయాగస్నానమున కల్పారంభమునుండి బహుజన్మలలో చేసిన పాపరాశులు భస్మమగును. గంగాయమునాసంగమము లోక ప్రసిద్ధము. దీనినే కామిక తీర్ధ మందురు. ఇచట భక్తిచేస్నానముచేయువారి కోరికలన్నియూ తీరును. భోగములకు భోగము, రాజ్యకాములకు రాజ్యము, స్వర్గకామికి స్వర్గము, మోక్షకామికి మోక్షము కలుగును ఈ భూమండలమున గల కామప్రద తీర్ధములన్నియూ మాఘమున ప్రయాగలో లీనమగును. హరిద్వారమున, ప్రయాగలో, గంగా సాగర సంగమమున స్నానము చేసినవారు బ్రహ్మ విష్ణు శివలోకములను పొందెదరు. మాఘమాసమున ప్రయాగస్నానము చేసినవారికి పునర్జన్మ కలుగదు. సత్యవాది, జితక్రోధుడు, ఆహింసా శీలుడు, ధర్మానుసారి, తత్వజ్ఞుడు, గోబ్రాహ్మణహితకారి, గంగాయమునా సంగమస్సానమాత్రమున పాపముక్తుడగును. మనసులో చింతించిన కామనలన్నింటినీ పొందును, సూర్యగ్రహణకాలమున కురుక్షేత్రమున స్వర్ణభారసహస్రదానమును చేసినవానికి కలుగు ఫలము మాఘప్రయాగస్నానమున లభించును, సహస్రగోదాన జన్మఫలము మాఘప్రయాగమున త్రిదిన స్నానము వలన కలుగును. త్రిశతవత్సరములు యోగాభ్యాసమువలన కలుగు ఫలము మాఘమాసమున ప్రయాగలో త్రిదినస్నానమున కలుగును. మాఘమాసమున దినత్రయము ప్రయాగస్నానమువలన కలుగు ఫలము, అశ్వమేధ సహస్రముచే కూడా లభించదు. పూర్వము కాంచనమాలినీ మాఘమున త్రిదిన ప్రయాగస్పానఫలమును రాక్షసునకిచ్చుటచే రాక్షసుడుపాపముక్తుడాయెను. మూడు దినములలో పాపక్షయము జరిగెను. ఇరువదియేడు దినములు స్నానముచేయుటచే దేవత్వమును పొందెను.
రమమాణా తు కైలాసే గిరిజాయాః ప్రియా సఖీ
జాతిస్మరా తథా జాతా ప్రయాగస్య ప్రసాదతః ।
అవంతీ విషయే రాజా వాసరాజో భవత్పురా
నర్మదా తీర్ధ మాసాద్య రాజసూయం చకార సః ।
అశ్వైషోడశభిస్తత్ర స్వర్ణయూప విరాజితైః
స్వర్ణభూషణ భూషాడ్యై రీజే సోపి యధా విధి ।
ప్ర దదౌ ధాన్య రాశిం చ ద్విజేభ్యః పర్వతోపమమ్
శ్రద్ధావాన్దేవతాభక్తి ప్రదశ్చ సువర్ణదః ।
బ్రాహ్మణో భద్రకో నామ మూరో హీన కులస్తధా
కృషీవలో ధమాచారః సర్వధర్మ బహిష్కృతః ।
సీరకర్మ స ముద్విగ్నో బంధుభిశ్చ స వంచితః
ఇతస్తతః పరిక్రమ్య నిర్గలో దుష్ట పీడితః ।
దైవతో జ్ఞానమాశ్రిత్య ప్రయాగం సముపాగతః
మహా మాఘిం పురస్కృత్య సన్నీ తత్ర దినత్రయమ్ ।
అనఘ స్నానమాత్రేణ సమభూత్సద్విజోత్తమః
ప్రయాగాచ్చలితస్తస్మా ద్యమౌ యస్మాత్సమాగతః ।
స రాజా సోపితైర్విస్తో తిపన్నావేకదా తదా
తయోర్గతి సమాదృష్టి దేవరాజస్య సన్నిధౌ ।
తేజోరూపం బలం సైణం దేవయానం విభూషణమ్
మాలా చ పారిజాతస్య నృత్యం గీతం సమం తయోః ।
ఇతి దృష్ట్వా హి మాహాత్మ్యం క్షేత్రస్య కధముచ్యతే
మాఘ సితాసితే భద్రే రాజసూయ సమో న చ ।
ధనుర్వింశతి విస్తీర్ణే సితనీలాంబుసంగమే
మాఘాదపున రావృత్తీ రాజసూయాత్పునర్భవేత్ ।
కంబలాశ్వతరో నాగో విపులే యమునాతటే
తత్ర స్నాత్వా చ పీత్వా చ సర్వపాపైః ప్రముచ్యతే ।
తత్ర గత్వా చ సంస్థానే మహాదేవస్య ధీమతః
నరస్తారయతే పుంసో దశపూర్వాన్ల శాపఠాన్ ।
కూపం చైవ తు తత్రాప్తి ప్రతిష్టాన్వేత్తి విశ్రుతమ్
తత్ర స్నాత్వా పితూన్దేవా నంతర్య యత మానసః ।
బ్రహ్మచారీ జితక్రోధ స్తిరాత్రం యాత్ర తిష్ఠతి
సర్వపాప విశుద్ధాత్మ సోఃశ్వమేధఫలం లభేత్ ।
ఉత్తరేణప్రతిష్టానా ద్భాగీరధ్యాశ్చ పూర్వతః
హంసప్రతపనం నామ తీర్ధం లోకేషు విశ్రుతమ్ ।
అశ్వమేధ ఫలం తత్ర స్నానమాత్రేణ లభ్యతే
యావచ్చన్తశ్చ సూర్యశ్చ తావత్స్వర్గే మహీయతే ।
తతో భోగవతీం గత్వా వాసుకేరుత్తరేణ చ
దశాశ్వమేధికం నామ తత్తీర్ధం పరమం స్మృతమ్ ।
తత్ర కృత్వాభిషేకంతు వాజిమేధఫలం లభేత్
ధనాఢ్యో రూపవాన్గాక్షో దాతా భవతి ధార్మిక! ।
చతుర్వేదిషు యత్పుణ్యం సత్యవాదిషు యత్ఫలమ్
అహింసాయాం తు యో ధర్మో గమనాత్తస్య తత్ఫలమ్
పార్వతీ ప్రియసఖి కైలాసమున క్రీడించునది ప్రయాగస్నానమువలన పూర్వజన్మ జ్ఞానమును పొందెను. పూర్వము అవంతిదేశమున వాన రాజుండేను. ఇతను నర్మదా తీర్థ మును చేరి రాజసూయయాగ మునాచరించెను. స్వర్ణయూప విరాజితములను పదహారశ్వములచే అశ్వమేధయాగమునాచరించెను. బ్రాహ్మణులను పర్వతోమధాన్యరాశిని దానము చేసెను. శ్రద్ధకలవాడు, దేవతా భక్తుడు, గోదానమును, స్వర్ణదానమును చేసినవాడుగా నుండెను.
ఇట్లే భద్రకుడను బ్రాహ్మణుడు మూర్లుడై, హీనకులసంగతితో కృషీవలుడై, అధమాచారుడు, సర్వధర్మబహిష్కృతుడు, హలకర్మయందాసక్తిగలవాడు బంధువులచే వంచించబడి అంతటా తిరుగుచు, అదృష్టవశమున బయలుదేరి దైవవశమున జ్ఞానమును పొంది ప్రయాగతీర్ధమునకొచ్చెను. మహామాఘే సందర్భమున ప్రయాగలో మూడుదినములు స్నానమాడెను. ఇట్లు అనఘస్నానమాత్రమున భద్రకుడు బ్రాహ్మణోత్తముడాయెను. ప్రయాగనుండి బయలుదేరి స్వదేశమునకు వెడలెను. వాసరాజు భద్రక బ్రాహ్మణుడు ఒకేసారి మృతి చెందిరి. వారిద్దరూ ఇంద్ర సమీపమున సమానస్థానమును పొందిరి. తేజస్సు, రూపము, బలము, స్త్రీజనము, దేవయానము, విభూషణము, పారి జాతమాల, నృత్యము, గీతము అన్నియూ సమములుగా నుండెను. ఇట్లు ప్రత్యక్షముగా మాహాత్యమును చూచిన తరువాత మాఘమున ప్రయాగస్నానము రాజసూయసమముకాదని ఎట్లు చెప్పెదరు? వింశతిధనుర్విస్తీర్ణప్రాంతమున గంగాయమున సంగమమున మాఘమాసస్నానమున పునర్జన్మకలుగదు. రాజసూయమున పునర్జన్మ కలుగును. విపులమగు యమునాతీరమున కబలా అశ్వ తర అనురెండు నాగములు కలవు. ఇచట స్నానపానములనుచేసినవారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. ఇచటికి వెళ్లి నివసించినచో మహాదేవుని ప్రసాదము వలన దశపూర్వులను, దశాపరులను తరింపచేయును. ఇచటనే ప్రతిష్టాన మనుకూపము కలదు. ఇచట స్నానముచేసి పితరులను దేవతలను, తర్పణము గావించి బ్రహ్మచారియై, జితక్రోధుడై మూడురాత్రులున్న చో సర్వపాపవిశుద్ధాత్మయై అశ్వమేధఫలమును పొందును. ప్రతిష్టానమునకు ఉత్తరమున, భాగీరధికి పూర్వమున హంసప్రతపనమను తీర్ధము లోకప్రసిద్ధము ఇచట స్నానమాచరించిన అశ్వమేధ ఫలమును పొందును. ప్రళయకాలము వరకు స్వర్గమున నుండును. ఇక వాసుకికి ఉత్తరమున భోగవతీ సమీపమున దశాశ్వమేధికమను ఉత్తమతీర్ధము కలదు. ఇచటస్నానము చేసిన అశ్వమేధఫలము లభించును. ధనాఢ్యుడు, రూపవంతుడు, దక్షుడు, దాత, ధార్మికుడు అగును. చతుర్వేదాధ్యయన పరులను కలుగు పుణ్యము, సత్యవాదులకు కలుగు ఫలము, అహింసలో నుండు ధర్మము దశాశ్వమేధగమనమున కలుగును.
పాయతే శోత్తరేకూలే ప్రయాగస్య తు దక్షిణే
ఋణమోచనకం నామ తీర్ధం తు పరమం స్మృతమ్ ।
ఏకరాత్రో షిత స్స్నాత్వా ఋణైస్సర్వైః ప్రముచ్యతే
స్వర్గలోక మవాప్నోతి హ్యమరశ్చ తధా భవేత్ ।
త్రికాలమేక స్నా చా హరముక్తిం య ఆచరేత్
విశ్వాస ఘాత పొత్తు త్రిభిర్మా సైస్స శుద్ధ్యతి ।
కీర్తనాల్లభతే పుణ్యం దృష్ట్వా భద్రాణి పశ్యతి
అవగాహ్య చ పీత్వా చ పునాత్యాసప్తమం కులమ్ ।
మకరస్థ రనౌ మాఘ న స్నాత్యనుదితే రవౌ
కధం పాపైః ప్రముచ్యత కధం వా త్రిదివం వ్రజేత్ ।
ప్రయాగే వపనం కుర్యా ధంగాయాం పిండపాతనమ్
దానం దద్యా త్కురుక్షేత్ర వారాణస్యాం తనుం త్యజేత్ ।
కిం గయా పిండదానేన కాశ్యాం వా మరణేన కిమ్
కిం కురుక్షేత్ర దానేన ప్రయాగే ముండనం యది ।
సంవత్సరం ద్విమాసోనం పునస్తీర్ధం వ్రజేద్యది
మండనం చోపవాసం చ తతో యత్నేన కారయేత్ ।
ప్రయాగప్రాప్తనారీణాం ముండనం త్వేవమీరయేత్
సర్వాన్కేశాన్సముద్ధృత్య సర్వపాపాని దేహినామ్
తిష్ఠన్తి తీర్థస్నానేన తస్మాత్తన్యత్ర వాపయేత్ ।
అమార్కపాత శ్రవణే ర్యుక్తచేత్పౌషమాఘయోః
అర్ధోదయస్స విజ్ఞేయ స్సూర్య పర్వశతాధికః ।
కిం చిన్య్యూనే తు విధిజే మహోదయ ఇతిస్మృతః
అరుణోదయ వేలాయాం శుక్లామాఘస్య సప్తమీ।
ప్రయాగే యది లభ్యత సహస్రారగ్రహై స్సమా
అయనే కోటిపుణ్యం స్యా ల్లక్షంతు విషువే ఫలమ్ ।
షడశీత్యాం సహస్రం తు తధావిష్ణుపదీషు చ
దానం ప్రయాగే కర్తవ్యం యధా విభవ విస్తరమ్ ।
గంగాయమున యోర్మధ్యే యస్తు గాం వై ప్రయచ్ఛతి
సువర్ణం మణి ముక్తాం వా యది వాన్యం ప్రతి గ్రహమ్ ।
పాటలాం కపిలాం భర్తే యస్తు తత్ర ప్రయచ్ఛతి ।
స్వర్ణశృంగీం రౌప్యఖురాం చైలకంఠం పయస్వినీమ్
సవత్సాం శ్రోత్రియం సాధుం గ్రాహయిత్వా యధావిధి ।
శుక్లాంబరధరం శాంతం ధర్మజ్ఞం వేదపారగమ్
సా చ గౌస్తస్య దాతవ్యా గంగాయమున సంగమే ।
వాసాంసి చ మహార్షాణి రత్నాని వివిధాని చ
యావన్తో రోమ కూపాస్యు స్తస్యాగోర్వత్సకస్యచ ।
తావద్వర్షసహస్రాణి స్వర్గలోకే మహీయతే
యత్రాసౌ లభతే జన్మ సా గౌస్తత్రాభిజాయతే ।
న చ పశ్యన్త నరకం దాతారస్తేన కర్మణా
ఉత్తరాంశ్చ కురూక్రాప్య మోదంతే కాలమక్షయమ్ ।
గవాం శతసహసేభ్యో దద్యాదేకాం పయస్వినీమ్
పుత్రాన్జారాంసధాభృత్యాన్ గౌరేకా ప్రతితారయేత్ ।
తస్మాత్సర్వేషు దానేషు గోదానం తు విశిష్యతే
దుర్గమే విషమే ఖోరే మహాపాతక సంక్రమే ।
గౌరేవ రక్షాం కురుతే తస్మార్టేయా ద్విజోత్తమే
తీర్దేన ప్రతిగృహ్లియా త్పుణ్యేష్వాయతనేషు చ ।
నిమిత్తేషు చ సర్వేషు హ్యప్రమత్తో భవేద్ద్విజః
స్వకార్యే పితృకార్యే వా దేవతాభ్యర్చనేపి వా ।
విఫలం తస్య తత్తీర్ధం యావత్తద్దన మశ్నుతే
గంగాయమునయోర్మధ్యే యస్తు కన్యాంప్రయచ్ఛతి న స పశ్యతి ఘోరం తు నరకం తేన కర్మణా
ఉత్తరాంస్తు కురూన్గత్వా మోదతే కాలమక్షయమ్ పుత్రాన్దారాంశ్చ లభతే ధార్మికాన్రూప సంయుతాన్
అధశ్శిరాస్త్రతో ధూమ మూర్ధ్వ బాహుః పిబేన్నరః శతం వర్ష సహస్రాణాం స్వర్గలోకే మహీయతే
పరిభ్రష్టస్త తస్స్వర్గాత్ అగ్నిహోత్రీ భవేన్నరః భుక్త్వా తు విపులాన్భోగాం స్తత్తిర్థం లభతే పునః
పాయత్యుత్తరతీరమున ప్రయాగకు దక్షిణ భాగమున ఋణమోచనకమను తీర్థము కలదు. ఇచట స్నానము చేసి ఒకరాత్రి ఉన్నవారు ఋణవిముక్తులగుదురు. స్వర్గలోకమును పొంది అమరతమునందెదరు. మూడుపూటలా ఒకమారు స్నానముచేయుచు నిరాహారియై మూడునెలలున్నచో విశ్వాసఘాతక పాపమునుండి శుద్ధి పొందును. ఈ తీర్థమును కీర్తించుట వలన పుణ్యమును పొందును దర్శించి శుభములను బడయును. స్నానము పానముచేసి ఏడుతరములనుపావనము చేయును. సూర్యుడు మకరరాశి గతుడు కాగా మాఘమాసమున సూర్యోదయమునకంటే స్నానము చేయనిచో ఎట్లు పాపవిముక్తి కలుగును? ఎట్లు స్వర్గమును పొందును? ప్రయాగలో వపనము, గయలో పిండదానము, కురుక్షేత్రమున దానము, కాశిలో దేహత్యాగము చేయవలసిన పనులు. ప్రయాగలో ముండనము చేసుకొన్నవానికి గయా పిండదానముతో కాశీమరణముతో కురుక్షేత్రదానముతో పనిలేదు. పదినెలల తరువాత మరల తీర్ధమునకు వెళ్ళిననూ ముండనమును ఉప వాసమును ప్రయత్నముచే నాచరించవలయును. ప్రయాగకు వెళ్ళిన స్త్రీలకు ముండన విధి ఇట్లు చెప్పబడినది. అన్ని కేశములను ఒకచో చేర్చి రెండంగుళములను ఛేదించవలయును. మానవులకు కేశాంత్యభాగమునాశ్రయించి సర్వపాపములుండును. కావున తీర్ధ స్నానకాలమున కేశాంత్య భాగములను ఛేదించవలయును. పుష్యమాఘమాసములలో అమావాస్య అర్కపాత శ్రవణములతో కలిసి వచ్చేనేని అరోధయమని తెలియవలయును. ఈ అక్టోదయము శతసూర్య పర్వల కంటే అధికము. కొద్దిగా న్యూనమైనచో మహోదయమనబడును. మాఘశుక్లసప్తమినాడు అరుణోదయవేళయందు ప్రయాగలో ఉన్నవారికి వేయి సూర్యగ్రహణములతో సమానము. అయనకాలమున కోటి పుణ్యము, విషువమున లక్షగుణము, షడశీతియందు సహస్రఫలము ఇట్లే విష్ణుపదులలో కూడా ఫలము కలుగును. ప్రయాగలో విభవానుసారముగా దానము చేయవలయును. దానముచే తీర్ధ ఫలము పెరుగును. గంగాయమునా సంగమమున గోదానమును గావించిన స్వర్ణదానము, మణిముక్తాది దానములను గావించిననూ, పాటలగోవును కాని కపిలగోవునుకాని స్వర్ణశృంగిని రౌప్య ఖురను, ఏలకంఠిని యస్వినిని సవత్సను శ్రోత్రియుడగు బ్రాహ్మణునకు యధావిధిగా దానము గావించవలయును. శుక్లాంబరధరుడు, శాంతుడు, ధర్మజుడు, వేదపారగుడు అగువానికి గోవునీయవలయును. అట్లే మహార్హములగు వస్త్రములను ఆభరణములను బహువిధరత్నములను దానము చేయవలయును. ఆ గోవునకు వత్సమునకున్నరోమకూపముల సంఖ్యననుసరించి అన్నివేలసంవత్సరములు స్వర్గమున నివసించును. అతనుపుట్టిన ప్రదేశముననే ఆ గోవుకూడా పుట్టును. దాత తన సుకృత వశమున నరకమును చూడడు. ఉత్తర కురుదేశములను పొంది. అక్షయ కాలము భోగములననుభవించును. వందలవేల ఆవులకంటే ఒకపాలిచ్చు ఆవును దానము చేయవలయును. పుత్రులను భార్యలను భృత్యులను ఒక గోవే తరింపచేయును. కావుననే అన్ని దానములలో గోదానము విశిష్టము దుర్గమము విషమము ఘోరము అగు మహాపాతక సంక్రమమున గోవే రక్షించును. కావున గోదానమును చేయవలయును. తీర్ధ మున పుణ్యాయతనములందు ప్రతిగృహమును వర్ణించి బ్రాహ్మణుడు అప్రమత్తునిగా ఉండవలయును. స్వకార్యమున కాని పితృకార్యమున కాని దేవతారాధనలో కాని ప్రతిగ్రహధనానుభవము వరకు ఆ తీర్థయాత్ర విఫలమగును. గంగాయమున మధ్యలో కన్యాదానమును చేసినవాడు నరకమును చూడజాలడు. ఉత్తర కురుదేశములకు వెళ్లి అక్షయకాలము భోగాను భవమును పొందును. ధార్మికులు రూపసంయుతులు అగు భార్యాపుత్రులను పొందును. అధశ్శిరమునుంచి ఊర్ధ్వబాహులై అచటి యజ్ఞధూమమును పానము చేయవలయును. అక్ష సంవత్సరములు స్వర్గమున నివసించును. స్వర్గమునుండి దిగివచ్చి అగ్నిహోత్రిగా పుట్టి విపులభోగములననుభవించి మరల ఈతీర్ధమును చేరును.
ఆప్రయాగా త్ప్రతిష్టానా మత్పురోవాసుకేర్హ్రదాత్ కబలాశ్వతరౌ నాగౌ నాగాదాబహుమూలకాత్
ఏతత్ప్రజాపతేఃక్షేత్రం త్రిషు లోకేషు విశ్రుతమ్ తత్రస్నాత్వా దీవం యాన్తి యే మృతాస్తేపునర్భవాః
న వేదవచనా చ్సైవ న లోకవచనాదపి ।
మతిరుత్ర్కమణీయా హి ప్రయాగమరణం ప్రతి
దశతీర్ధసహస్రాణి షష్టికోట్యస్తధాపరాః ।
తత్రైవ తేషాం సాన్నిధ్యం కీర్తితం విధినందిని
యా గతిర్యగయుక్తస్య సత్పధస్తస్య ధీమతః ।
సా గతిస్త్యజతఃప్రాణా స్థంగాయమున సంగమే
బాధితో యది వా దీనః క్రుద్దేవాపి భవేన్నరః ।
గంగాయమున మాసాద్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్
దీప్తకాంచన వర్ణాభై ర్విమానైసూర్యకాంతిభిః ।
గంధర్వాప్సరసాం మధ్యే స్వర్గే మోదతి మానవః
ఈప్సితాంల్లభతే కామా న్వదంతతి మునీ శ్వరాః ।
గీతవాదిత్రనిర్దోషైః ప్రసుప్తః ప్రతిబుధ్యతే
యా వన్న స్మరతే జన్మ తావత్స్వర్ణే మహీయతే ।
తతస్స్వర్గాత్పరిభ్రష్టః క్షీణకర్మాత్రచాగతః
హిరణ్యరత్న సంపూర్ణే సమృద్దే జాయతే కులే ।
తదేవ సంస్మరంస్తత్ర విష్ణులోకం స గచ్చతి
వటమూలం సమాసాద్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్ ।
సర్వలోకానతిక్రమ్య రుద్రలోకం స గచ్చతి
తత్ర తే ద్వాదశాదిత్యాం స్తపతే రుద్రమాశ్రితాః ।
నిర్గచ్ఛత్తి జగత్సర్వం వటమూలే స దహ్యతే
హరిశ్చ భగవాంస్తత్ర ప్రజాపతిపురస్కృతః ।
ఆస్తే తత్ర పుటే దేవి పాదాంగుష్ఠం ధయశిశుః
ఊర్వశీపులినేరమ్యే విపులే హంసపాదుకే ।
పరిత్యజతి యః ప్రాణా ఋణు తస్యాపి యత్పలమ్
షష్ఠి వర్ష సహస్రాణి షష్టివర్షశతానిచ ।
వసేత్స పితృభిసార్థం స్వర్గలోకే విరించితే
ఊర్వశీం చ యదా పశ్యే దేవలోకే సులోచనే ।
పూజ్యతే సతతం దేవ ఋషిగంధర్వకిన్నరైః
తతస్స్వర్గాత్పరిభ్రష్టః క్షీణకర్మాత్విహాగతః ।
ఉర్వశీ సదృశీనాం తు కాంతానాం లభతే శతమ్
మధ్యే నారీ సహస్రాణాం భోక్తా శాస్తా చ మోహిని
కాంచీనూపురశబ్దేన సుష్యానీ ప్రతిబధ్యతే ।
భుక్త్యా తు విపులానోగాం సతీర్థం లభతే పునః
శుక్లాంబర ధరో నిత్యం నియతస్సజితేంద్రియ ।
ఏక కాలంతు భుంజాన్ మాసం యోగపతి ర్ధవేత్
సువర్ణాలంకృతానాం తు నారీణాం లభతే శతమ్ ।
పృధివ్యామా సముద్రాయం మహాభోగపతిర్భవేత్
ధనధాన్యసమాయుక్త దాతా భవతి నిత్యశః ।
స భ్యుక్త్యా విపులాన్ఫోగాం సతీర్థం స్మరతే పునః
కోటి తీర్థం సమాసాద్య యస్తు ప్రాణాన్పరిత్యజేత్ ।
కోటి వర్ష సహస్రాక్షం స్వర్గలోకే మహీయతే
తతస్స్వర్గాదిహాగత్య క్షీణకర్మా నరోత్తమః ।
సువర్ణమణి ముక్తాగ్రే కులే జాయేత రూపవాన్
అకామో వా సకామో వా గంగాయాం యో విపద్యతే ।
శక్రస్య లభతే స్వర్గం నరకం తు న పశ్యతి
హంస సారసయుక్తేన విమానేన స గచ్ఛతి ।
అప్సరోగణ సంకీర్ణే సుప్త్యాసా ప్రతిబుధ్యతే
తతస్స్వర్గా దేహాయాతః క్షీణకర్మా విరించిజే ।
యోగినాం శ్రీమతాం చాపి స్వేచ్ఛయా లభతే జనిమ్
ప్రయాగ నుండి ప్రతిష్టానము వరకు వాసుకి హృదము నుండి బహుమూలకసాగము వరకు కబలాశ్వతర నాగములుండును. ఇంత వరకు ప్రజాపతిక్షేత్రమనీ లోకత్రయ ప్రసిద్ధము. ఈ క్షేత్రమున స్నానమాచరించి స్వర్గమునకు చేరెదరు. ఇచట మరణించిన వారు మరల పుట్టరు. వేద వచనము వలన కాని, లోకవచనమువలనకాని ప్రయాగమరణ విషయమున బుద్ధిని తొలగించరాదు. ప్రయాగయందు పదివేల తీర్ధములు అరువది కోట్ల తీర్థములు సన్నిహితములుగా నుండును. యోగయుక్తునకు సన్మార్గగతునకు లభించుగతి గంగాయమునా సంగమమున ప్రాణములను విడిచిన వానికి లభించును. బాధితుడు, దీనుడు కోపించిన వాడు కానీ గంగాయమునా సంగమమును చేరి ప్రాణ పరిత్యాగము గావించినచో దీప్తకాంచన వర్ణములు సూర్యకాంతి సన్నిభములు అగు విమానములతో గంధర్వాప్సరసల మధ్యన స్వర్గమున ఆనందించును. అభీష్టకామనలను పొందును. నిదురించిన వాడు గీత వాద్యనాదములచే మేలు కొనును. పుట్టుకను కోరు వరకు స్వర్గములోనే నివసించును. కర్మక్షయమున స్వర్గ పరిభ్రష్టుడై హిరణ్యరత్నసంపూర్ణ కులమున పుట్టును. పూర్వసుకృతమును స్మరించుచు విష్ణులోకమును చేరును. ఇచట వట మూలమును చేరి ప్రాణపరిత్యాగమును చేయువాడు సర్వలోకములనతిక్రమించి రుద్రలోకమును పొందును. అచట రుద్రుని ఆశ్రయించి ద్వాదశాదిత్యులను తపింపచేయును. జగత్తును వెడలి వచ్చిన ద్వాదశాదిత్యులు వటమూలమున దహించబడును. ప్రజాపతి పురస్కృతుడగు శ్రీహరి వటపత్రమున పాదాంగుష్టమును పానమును చేయుచు ఉండును. విపులము హంసపాండురము అటు ఉర్వశీపులినమున ప్రాణములను విడుచువాడు అరువది యారు వేల సంవత్సరములు పితరులతో కలిసి స్వర్గలోకమున నివసించును. దేవలోకమున ఉర్వశిని చూచినపుడు దేవ ఋషిగంధర్వులచే పూజించబడును. కర్మక్షయమున స్వర్గ భ్రష్టుడై ఇచటికొచ్చి ఊర్వశీతుల్యులగు యువతులను నూరు మందిని పొందును. నారీ సహస్రమునకు భర్తయగును. పది వేల గ్రామములకు భోక్త శాస్తయగును. ఇతను నిదురించినచో కాంచీనూపుర శబ్దములచే మేలుకొనును. వీపుల భోగములననుభ వించి మరల అదే తీర్థమును చేరును. నిత్యము శుక్లాంబరధరుడు, నియమబద్దుడు, జితేన్టియుడు, ఒక పూట మాత్రమే భుజించుచు ఒక మాసము భోగపతియగును. సువర్ణాలంకృతలగు నారీ శతమును పొందును. సముద్రాన్తపృధివిలో మహాభోగపతి యగును. ధనధాన్యసమాయుక్తుడు దాతగా విపులభోగములననుభవించి మరల క్షేత్రమును స్మరించును. కోటి తీర్ధమున మరణించిన వారు వేయి కోట్ల వర్షములు స్వర్గములో నుందురు. తరువాత ఇటకొచ్చి సువర్ణమణి ముక్తా భూయిష్ఠకులమున పుట్టును. ఇష్టముండికాని లేకకాని గంగలో మరణించిన వాడు స్వర్గమును చేరును. నరకమును చూడడు. హంసయుక్త విమానమున విహరించును. అప్సరగణమధ్యన నిదురించి మేల్కొనును. స్వర్గము నుండి ఇటకొచ్చి పరిశుద్దులు శ్రీమంతులగుయోగుల కులములో జన్మను పొందును.
గంగాయమున యోర్మధ్యే కరీషాగ్నిం తు ధారయేత్ ।
అహీనాంగో హ్యరోగశ్చ పంచేంద్రియ సమన్వితః
యావంతి లోమ కూపాని తస్య గాత్రే తు ధీమతః ।
తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే
తతస్స్వర్గాత్పరి భ్రష్టా జంబూద్వీపపతిర్భవేత్ ।
భుక్త్యాంతు విపులాన్బోగాం సత్తీర్ధ లభతే పునః
యస్తు దేహం నికృత్య స్వం శకునిభ్యః ప్రయచ్ఛతి ।
స వర్షశతసాహస్రం సోమలోకే మహీయతే
తతస్తస్మాదిహాగత్య రాజా భవతి ధార్మికః ।
గుణవాన్రూపసంపన్నో విద్యావాన్రియ వాక్ఛుచిః
భుక్త్యా తు విపులాన్ఫోగాం సతీర్థం పునరావ్రజేత్ ।
పంచయోజన విస్తీర్లే ప్రయాగస్య తు మండలే
విపన్నో యత్ర కుత్రావ్యనాశకం వ్రతమాశ్రితః ।
వ్యతీతాన్పురుషాన్సప్త భావినస్తు చతుర్దశ
నరస్తారయతే సర్వా నాత్మానం చ సముద్ధరేత్ ।
అగ్నితీర్థమితి ఖ్యాతం దక్షిణాయమునాతటే
పశ్చిమే ధర్మరాజస్య తీర్ధం తు నరకం స్మృతమ్ ।
తత్ర స్నాత్వా దివం యాన్తి యేమృతాస్తే పునర్భవాః
యమునోత్తరకూలేతు పాపఘ్నని బహూన్యపి ।
తీర్ధాని సంతి విధికే సేవితాని మునీశ్వరైః
తేషు స్నాతా దీపం యాన్తి యే మృతాస్తే పునర్భవాః ।
గంగా చ యమునా చైవ ఉభే తుల్యఫలే స్మృతే
కేవలం జ్యేష్ఠభావేన గంగా సర్వత్ర పూజ్యతే ।
యస్తు సర్వాణి రత్నాని బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛతి
తేన దత్తేన దేవేశి యోగో లభ్యత వా న వా ।
ప్రయాగేతు మృతస్యేదం సర్వం భవతి నాన్యధా
దేశస్థో యది వారణ్యే విదేశే యది వా గృహే ।
ప్రయాగం స్మరమాణోపి యస్తు ప్రాణాన్పరిత్యజేత్
బ్రహ్మలోక మవాప్నోతి మహీ యత్ర హిరణ్మయీ ।
సర్వకామఫలా వృక్షా స్తిష్ఠని ఋషయో గతాః
స్త్రీ సహస్రాకులే రమ్యే మందాకిన్యాస్తటే శుభే ।
క్రీడతే సిద్ధ గంధర్వైః పూజ్యతే త్రిదశైస్తధా
తతః పున రిహాయాతో జంబూ ద్వీప పతిర్భవేత్ ।
ధర్మాత్మా గుణ సంపన్న సత్తీర్ధం లభతే పునః
ఏతత్తే సర్వ మాఖ్యాతం మాహాత్మ్యం చ ప్రయాగజమ్ ।
సుఖదం మోక్షదం సారం కిమన్యచ్ఛ్రోతు మిచ్ఛసి
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే బృహదుపాఖ్యానే వసు మోహినీ సంవాదే ప్రయాగమాహాత్మ్యే త్రిషష్ఠితమోఽధ్యాయః ॥
గంగాయమునల మధ్యన పిడకలు అగ్నిలో దహించబడవలయును. అట్లు దహించబడువాడు హీనాంగుడు రోగయుక్తుడు కారాదు. పంచేంద్రియుడు కావలయును. అట్టి వాని శరీరమున గల రోమకూపములు ఎన్ని యుండునో అన్ని వేల వర్షములు స్వర్గలోకమున నివసించును. స్వర్గమునుండి తిరిగి వచ్చి జంబూద్వీప పతి యగును. ఇచట విపుల భోగములననుభవించి మరల ఆ తీర్థమును చేరును. ఇచట తనదేహమును ఖండించి పక్షులకు వేసిన వాడు లక్ష సంవత్సరములు చంద్రలోకమున నివసించును. అట నుండి ఇట కువచ్చి ధార్మికుడగు రాజగును. గుణవంతుడు రూపవంతుడు విద్యావంతుడు, ప్రియవాక్కుగలవాడు. పరిశుద్ధుడుగా నుండి విపుల భోగములననుభవించి మరల ఈ తీర్థమునకు చేరును. పంచయోజన విస్తీర్ణమగు ప్రయాగ మండలమున అనశనవ్రతముతో మరణించిన వారు గడిచిన ఏడు తరములను, రాబోవు పదునాలుగు తరములను తరింపచేసి తాను కూడా తరించును. యమునా దక్షిణ తటమున అగ్ని తీర్థము కలదు. ధర్మరాజ నరకతీర్ధము పశ్చిమ భాగమున కలదు. ఇచట స్నానము చేసినవారు స్వర్గమును పొందెదరు. మరణించిన వారు మరల పుట్టరు. యమునా నదికి ఉత్తర తీరమున పాపహరములగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్థములను చాలా మంది మునులు సేవించి యుండిరి. ఈ తీర్థములలో స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వీటిలో మరణించిన వారు మరల జన్మను పొందరు. గంగాయమునానదులు రెండు సమాన ఫలములనిచ్చునవిగా ప్రసిద్ధిని పొందినవి. జ్యేష్ఠ భావనతో గంగ అంతట పూజించబడును. సర్వరత్నములను బ్రాహ్మణులకు దానము చేసిన వారికి కూడా యోగము లభించునో లేదో కాని ప్రయాగలో మరణించిన వారికి మాత్రము అన్నియూ లభించును. దేశములో నుండి కాని, అరణ్యములో నుండి కాని, విదేశములలో లేదా గృహములో నుండు వాడైనను ప్రయాగను స్మరించుచు ప్రాణములను విడిచినచో హిరణ్మయ భూప్రాంతము కల బ్రహ్మలోకమును పొందును. అచట సర్వకామ ఫలములు గల వృక్షములుండును. ఋషులుందురు. స్త్రీ సహస్ర పరివేష్టితమగు శుభకరమగు మందాకినీ తటమున సిద్దులతో గంధర్వులతో కలిసి క్రీడించును. అచటి నుండి మరల ఇటకొచ్చి జంబూద్వీప పతియగును. ధర్మాత్ముడు గుణ సంపన్నుడుగా ఉండి మరల ఆ తీర్థమును పొందును. ఇట్లు నీకు సమగ్రముగా సుఖ ప్రదము, మోక్ష ప్రదమగు ప్రయాగమాహాత్మ్యమును తెలిపితిని. ఇంకనూ ఏమి వినదలచితినో చేప్పుము.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున బృహదుపాఖ్యానమున వసుమోహినీ సంవాదమున ప్రయాగమాహాత్మ్యమున అరువది మూడవ అధ్యాయము.
Summary of chapter 190 of the Nārada Mahā Purana is as follows:
దేవర్షి నారదుడు మరియు సనత్కుమార మహర్షి మధ్య జరిగిన పవిత్ర ఆధ్యాత్మిక సంవాదము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. భగవత్కృపను పొందే సాధనా మార్గములు మరియు ఆత్మజ్ఞాన రహస్యములు ఇక్కడ భక్తిరసభరితంగా వివరింపబడినవి.