నారద మహా పురాణము
67 - అధ్యాయము
సనత్కుమార ఉవాచ :
ఆటడవక్ష్యే దేవపూజాం సాధకాభీష్ట సిద్ధిదామ్,
త్రికోణం చతురస్రం వా వామభాగే ప్రకల్ప్య చ.
పంపూజ్యాస్త్రేణ సంక్షాల్య హృదోధారం నిధాయ చ,
తత్రాన్నిమండలం చేదొ పాత్రం పంక్షోల్య చాస్త్రృతః.
ఆధారే నమసంస్థాప్య తత్ర చేద్రవిమండలమ్,
విలోమమాతృకొమూలముచ్చన్పూజయేజ్జలైః.
తత్రేష్ఠమండలం ప్రార్చ్య తీర్ధాన్యావాహ్య పూర్వవత్,
గోముద్రయామృతీకృత్య కవచేనావగుంతయేత్.
సంక్షాల్యాఘ్రణ ప్రణవం తదుపర్యష్టధా జపేత్ ,
సామాన్యామిదం ప్రోక్తం సర్వసిద్ధికరం నృణామ్.
తజ్ఞలం కించిదుగ్ధత్వ ప్రోక్షిణ్యా సాధకోత్తమః,
ఆత్మానం యాగవస్తూవి తేన పంప్రోక్షయేతృథక్.
ఆత్మవామాగ్రతః కుర్యాత్తట్కోణాంతప్రికోణకమ్,
చతురస్రణ సంవేష్ట్య సంక్షాత్యారోదకేన చ.
తతస్తు సాధకశ్రేష్ఠపురిభయేచ్ఛంఖముద్రయా,
ఆగ్నేయాదిషు కోణేషు హృదద్యంగచతుష్టయమ్.
నేత్రం మధ్యే దీక్షు చాస్త్రం త్రికోణే పూజయేత్తతః,
మూలఖండత్రయేణాణాధారశక్తిం తు మధ్యగామ్.
ఏవం సంపూజ్య విధివత్ అస్త్రపక్షాళితం హృదా,
ప్రతిష్ఠాప్య త్రిపదికా పూజయేన్మనునామునా.
మం వహ్నిమండలాయేతి తతో దశకలాత్మనే,
అముగాష్ట్యోతి పొతొంతే ససోపహృదయాంతిమే.
చతుర్వింశతివర్లోయమాధారస్యారచనే మనః,
స్వతంత్రక్షాలితం శంఖం సంస్థాప్యాథ సమర్చయేత్.
తారః కార్మ్యమహాంస్తే తు తతో జలచరాయ చ,
వర్మ ఫట్ హృదయం పాంచజన్యాయ హృదయం మనుః.
తత్రార్కమటలాయేతి ద్వాదశాంతే కలాత్మనే,
అముకొర్ణేతి పాత్రాంతే నమోంఒతస్ర్యక్షివర్ణవాన్.
సంపూజ్య తేన తత్రార్చేద్ద్వాదశార్కతలాః క్రమాత్,
తతశ్శుద్ధజలైర్మూలం విలోమ నూతృకాం పఠన్.
శంఖనూపూరయేత్తస్మిన్పూజయేన్మనునామునా,
ఓం సోమనుండలాయేతి షోడశాంతే కలాత్మనే.
ఆముకొర్ఘ్యామృతాయేతి హృన్మనుశ్నార్ఘ్యపూజనే,
తత్ర షోడశపంఖ్యాకా యథేచ్చన్దమసః కలాః.
తతస్తు తీర్ధాన్యావాహ్య గంగీచేత్యాదపూర్వవత్,
గోముద్రయామృతకృత్యాచ్ఛాదయేన్మత్స్యముద్రయా.
కవచేనావగుండ్యాథ రక్షేదఫ్రేణ తత్పున,
చింతయిత్వేష్టదేవం చ తతో ముద్రాః ప్రదర్శయేత్.
శంఖమౌశలచక్రౌఖ్యా పరమీకరణం తతః,
మహాముద్రాం యోనిముద్రాం దర్శయేత్రమతో సుధీః.
గారుడిగాలినీ చైవ ముఖ్యే ముద్రే ప్రకీర్తితే,
గంధపుష్పాదిభిషత్ర పూజయేద్దేవతాం స్మరన్.
అష్టకృత్వా జుపేన్మూలం ప్రణవం చాష్ట్రథా తథా,
శంఖాద్ధక్షిణదిగ్భాగే ప్రోక్షణే పాత్రమాదిత్.
ప్రోక్షణ్యం తజ్జలం కించిత్కృత్వాత్మానం త్రిధా తతః,
ఆత్మ తత్వాత్మనే హృచ్చ విద్యోతత్యాత్మనే నమః.
శివతత్త్వాత్మనే హచ్చ ఇత్యేతైర్మనుభిప్రిభిః,
ప్రోక్షేతుష్పాక్షతైశ్చాపి మండలం విధివత్సుధీః.
ఆథవో మూలగాయత్ర్యా పూజాద్రవ్యాణి ప్రోక్షయేత్ ,
పొద్యార్ఘ్యాచమనీయార్థం మధుసర్కార్ధనప్యుత.
ప్రాత్రాణ్యాధారయుక్తాని స్థాపయేద్విధినా పురః ,
పాద్యం శ్యామకదూర్వాబ్జవిష్ణుక్రాంతకై స్స్మృతమ్.
ఆర్ఘ్యం పుష్పాక్షతైఃయ పై కుశాగ్రతీలపర్ష పైకి,
గంధదూర్వాదలైః ప్రోక్తం తతశాచమనీయకమ్.
జాతీఫలం చ కంకోలం లవంగం చ జలాన్వితమ్,
వొడ్రాజ్యదధిసంమిశ్రం మధుపర్కసమీరితమ్.
ఏకస్మిన్నధవా పాత్రే పాద్యాదీవి ప్రకల్పయేత్,
శంకరారార్చనే శంఖమయేనైవ ప్రశస్యతే.
శ్వేతా కృష్ణారుణా సీతా శ్యామారక్తా పితా పితాః,
రక్తాంబరో భయకరాధ్యేయాస్స్యుః పీఠశక్తయః .
స్వర్గాదిలిఖితే యంత్ర శాలగ్రామే మౌతథా,
నిధినా స్థాపితాయారి వో ప్రతిమాయా ప్రపూజయేత్.
ఆంగుష్యాదివితప్త్యం చ నూనో ప్వర్లాదిధాతుభిః,
నిర్మితా శుభదా గేహో పూజసాయ దినే దినే.
వక్రొం దగ్ధం ఖండిం చ భిన్ననూర్థదృశం పునః,
పృష్ఠాం వాప్యం త్యజాద్యేశ్చ ప్రతిమాం నైవ పూజయేత్.
బాణాదిలిం గేవాభ్యరేత్సర్వలక్షణలక్షితే,
మూలేన మూర్తిం పంకల్య ధ్యాతో దీపం యథోదితమ్.
ఆవాహ్యా పూజయేత్తస్యాః పరివారగశైప్సహా,
కౌలాగ్రామే స్థాపితాయాం నావోహనవిసర్జనే.
పుష్పాంజలిం ప్రమాదాయ ధ్యోత్వా మంత్రముదీరయేత్ .
ఆత్మసంస్థమజిల శుద్ధం త్వామహం పరమేశ్వర,
ఆరణ్యామివ హవ్యాశం మూర్తావావాహయాన్యుహమ్.
తనేయం హి మహామూర్తిప్తస్యాం త్వాం సర్వగం ప్రభో,
భక్తి స్నేహపూకృష్ణం దీపపయామ్యహమ్.
పర్వాంతర్యామిణీ దేవం పర్వబీజమయం శుభమ్,
స్వాత్మస్థాయ పరం శుద్ధమాపనం కల్పయామ్యహమ్.
ఆనన్యా తవ దేవేశ మూర్తి శక్తిరియం ప్రభో,
పొన్నిధ్యం కురు తస్యాం త్వం భక్తానుగ్రహకారక.
అజ్ఞానొదున్మత్తత్వాద్వైకల్యాత్సాధనప్య చ,
మద్యపూర్ణం భవేత్కల్పం తథాస్యభిముఖో భవ.
దృశా యాషవషీణ్యా పూరయన్యజ్ఞవిష్టరే,
మూర్తే వా యజ్ఞసంపూర్త్యై స్థితో భన మహేశ్వర.
అభక్తవాజ్మనఃశ్చక్తుశోత్రదూరాయితద్యుతే,
స్వతేజఃసంజరేణాశు వేష్టితో భవ సర్వతః.
యవ్య దర్శనమిచ్ఛత్తి దేవాస్వాభీష్ట సిద్ధయే,
తప్మె తే పరమేశాయ స్వాగతం చ మే.
కృతాళ్యో_నుగృహీతో ఒష్మి పఫలం జీవితం ముమ,
ఆగతో దేవదేవేశస్సుఖాగతమిదం పునః.
యద్భక్తి లేశసంపరాత్పరమానన్దసంభవః,
తప్మెతే చరణాబ్దాయ పాద్యం శుద్ధాయ కల్పితే.
వేదానామపి వేదాయ దేవానాం దేవతాత్మనే,
ఆచామం కల్పయామీశ! శుద్ధానోం శుద్ధి హేతవే.
తాపత్రయహరం దివ్యం పరమానన్దలక్షణమ్,
తాపత్రయవినిర్ము క్యే తవార్ఘ్యం కల్పయామ్యహమ్.
పర్వకాలుష్యహీనాయ పరిపూర్ణసుఖాత్మనే,
మధుపర్కమిదం దేన కల్పయామి ప్రసీద మే.
ఉచ్ఛిష్ణ్యోఒప్యశుచిర్వాపి యస్య స్మరణమాత్రతః,
శుద్ధిమాప్నోతి తస్మై తే పునరాచమనీయకమ్.
స్నేహం గృహాణ ప్నే హేన లోకనాధ మహాశయ,
సర్వలోకేషు శుద్ధాత్మన్జదొమీ స్నేహముత్తమమ్.
పరమాన్స్టనబోధాబ్దినిమగ్ననిజమూర్తయే,
సాంగోపాంగమిదం స్నానం కల్పయామ్యహమీశ తే.
సహస్రం వా శతం వాపి యథాశక్త్యాద రేణ చ,
గంధపుష్పాదికైరీశం మనునా చాభిషించయేత్.
మాయాచిత్రపటచ్ఛన్న నిజగుహ్యారుచేజి పే,
నిరొవగణవిజ్ఞానవాస స్తే కల్పయాన్యుహమ్.
యమా శెరీత్య మహామాయా జగత్సంమోహినీ పదో,
తస్మై తే పరమేశాయ కల్పయామ్యుత్తరీయకమ్.
శక్తం శక్త్యర్కవి ఘ్నేశ పీతం విప్లే పితం శివేవే,
తైలాదిదూషితం జీర్ణం సచ్ఛిద్రం మలినం త్యజేత్.
యస్య శక్తిత్రయేజేదం సంప్రీతమఖిలం జగత్,
యజ్ఞసూత్రాయ తస్మై తే యజ్ఞసూత్రం ప్రకల్పయే.
స్వభావసుందరాంగాయ నానాశక్త్యాశ్రయాయ తే,
భూషణాని విచిత్రాణి కల్పయామ్యమరార్చిత.
పరమానన్దసౌందర్యపరిపూర్ణదిగంతర,
గృహాణ పరమం గస్థం కృపయా పరమేశ్వర.
తురీయవనసంభూతం నానాగుణమనోహరమ్,
అమన్తసౌరభం పుష్పం గృహ్యతామిదముత్తమమ్.
జపాక్ష తార్కధత్తూరానవి షేనైవవార్పయేత్క్వచిత్,
కేతం కుటజని కుందం బంధూకం కేపరం జపామ్.
మాలతీపుష్పకం చైవ నార్పయేత్తు మహేశ్వరే,
మాతులింగం చ తగరం రసానెవార్పయేత్క్వచిత్.
శక్తీదూర్వార్కమందారాన్ గణేశే తులసీం త్యజేత్,
పరోజినీదమనకౌ తథా మరుబకః కుశః.
విష్ణుక్రాంతా నాగవల్లీ దూర్వాపామార్గదాడిమౌ,
దాత్రీ మునియుతానోం చ పత్రైర్దేవార్చనం చరేత్.
సనత్కుమార మహర్షి పలికెను :- సాధకునికి అభీష్టసిద్ధిని ప్రసాదించు దేవపూజను ఇప్పడు చెప్పెదను. దేవోగారమున వామ భాగమున త్రికోణాకారముగా కాని చతురస్రాకారముగా కొని వేదిక నేర్పరిచి, చక్కగా పూజించి అస్త్రముచే సంక్షాళనము గోవించి హృదోధారము నుంచి, అచట అగ్ని మండలమును కొని పాత్రను కొని అస్త్రముచే ప్రక్టోళనము గావించి, ఆధారమున నమస్సునుంచి, రవిమండలమున తరువాత చంద్రమండలమును పూజించి మొదట చెప్పిన విధముగా సర్వతీర్థములను ఆవాహనగావించి, గోముద్రచే అమృతమును చేసి, కవచముచే అవగుంఠమును చేయవలయును. ప్రణవమును అస్త్రముచే సంక్షోళనము చేసి ప్రణవము మీద ఎనిమిది మార్లు జపముగావించవలయును. ఇదియే నరులకు సర్వసిద్ది ప్రదోయకనుగు సామాన్యాక్టము. ఆ జలమును కొద్దిగా తీసుకొని సాధకుడు ప్రోక్షిణితో వేరు వేరుగా తనను యాగవస్తువులను సంప్రోక్షణ గావించవలయును. తనకు వామాగ్రభాగమున షట్కోణాంతమును దానిలో త్రికోణమును ఏర్పరచవలయును. చతురస్రముతో చుట్టి, అర్ఘ్యాదకముచే చక్కగా క్షాళనము గావించి సాధకుడు శంఖముచే స్తంభనము గావించవలయును. ఆగ్నేయాది కోణచతుష్టయమున హృదయా చతుష్టయమును అంగన్యాసమును గావించవలయును. త్రికోణ మధ్యభాగమున నున్న ఆధారశక్తిని మూలఖండత్రయముచే చక్కగా పూజించి అస్త్రసంక్జాలితమగు దానిని హృదయముచే ప్రతిష్టించి, ఈ మంత్రముచే త్రిపదికను పూజించవలయును. దశకలాత్మకుడగు వహ్నిమండలాంతర్వర్తియగు వానికి మం అను బీజమును, అముక్తార్ష్యమని పొత్రాతమున, అంతిమమున సనాప హృదయముగా ఆధోరొర్చన యందు మంత్రము ఇరువది నొలుగు వర్ణములు కలిగి యుండును. సమంత్రక్షాళితమగు శంఖమును స్థాపించి పూజించవలయును. కర్మమహాత్వము కల నీకు తారము, జలచరునికి వర్మ, ఫట్ హృదయమును, పొంచజన్యమునకు హృదయము మనువు. అచట ద్వొదశాంతమున కళాత్మకుడగు అర్కమండలమునకాని, అముకొర్ఘ్యమని పాత్రాంతమున, నమోంతముగా త్ర్యక్టీవర్ణము గలదిగా పూజించి క్రమముగా ద్వాదశార్కకలలను పూజించి, శుద్ధజలముచే మూలమంత్రమును విలోమమాతృకగా పఠించి, శంఖమును పూరించవలయును. ఈ మంత్రముచే పూజించవలయును. షోడశాంతమున కలాత్మకుడగు సోమ మండలమునకు అముకొర్ధ్యామృతమునకు అర్ఘ్యపూజనమున హృదయమంత్రము, అచట పదునారు చంద్రకలలను పూజించవలయును. తరువాత పూర్వము వలే “గంగేచ” ఇత్యాది మంత్రముచే తీర్థములను ఆవాహన గావించి, గోముద్రచే అమృతమును గావించి మత్స్యముద్రచే ఆచ్ఛాదించవలయును. కవచముచే అవగుంఠనముగావించి మరల అస్త్రముచే కక్ష గావించవలయును. ఇష్టదేవుని ధ్యానించి ముద్రలను ప్రదర్శించవలయును. శంఖమౌశలచక్రముద్రలను చూపి పరమీకరణమును గొవించవలయును. బుద్ధిమంతుడు క్రమముగా మహాముద్రను యోనిముద్రను చూపవలయును. గారుడీ గాలినీ ముద్రలు ముఖ్యములు. దేవతాస్మరణాపూర్వకముగా గంధ పుష్పాదులచే పూజించవలయును. శంఖమునకు దక్షిణభాగమున ప్రోక్టణీ పాత్ర నుంచవలయును. ప్రోక్షిణి యందు ఆ జలమును కొంచెముగా నుంచి, తనను మూడుమార్లు ప్రోక్షించుకొని ఆత్మ తత్త్వాత్మకు హృదయమును, విద్యాతత్త్వాత్మ కునికి నమస్కారము, శ్రీవత్త్వాత్మకునకు హృదయము అని మంత్రములచే మూడుమార్లు ప్రోక్షణగావించవలయును. విధి విదానముగా మండలమును పుష్పాక్షతలచే కాని మూలగాయత్రిచే కాని పూజాద్రవ్యములను ప్రోక్షించవలయును. పాద్య అర్ఘ్య ఆచమనీయము కొరకు మధుపర్కము కొఱకు ముందు భాగమున ఆధారయుక్తముగా పాత్రలను స్థాపించవలయును. శ్యామాక, దూర్వ, అబ్ద విష్ణుక్రాంత జలములచే పాద్యము, పుష్ప, అక్షతయవలచే, కుశ, అగ్నితిల సర్షపములచే అర్ఘ్యమును, గంధదూర్వాదలములచే ఆచమనీయము చెప్పబడినది. జాతిఫలము, కంకోలము, జలాన్వితముగు లవంగము, తేనే, నేయి, పెరుగులతో కలిపిన దానిని మధుపర్కమందురు. ఒకదానియందుకాని, పాత్రయందుకాని పాద్యాదులను కల్పించవలయును. శంకరుని, సూర్యుని పూజించునపుడు శంఖమునుపయోగించుట ప్రశస్తము. శ్వేత, కృష్ణ, అరుణ, పీత, శ్యామ, రక్త, సిత, అసితలుగా రక్తాంబరాభయకరులుగా పీఠశక్తులను ధ్యానించవలయును, స్వర్ణాది లిఖిత యంత్రమున కాని, శాలగ్రామమున, మణియందు కాని, విధిగా స్థాపించిన ప్రతిమ యందు పూజించవలయును. అంగుష్ఠ పరిమాణము నుండి వితస్త్రీ పరిమాణము వరకు స్వర్ణోద్ధాతువులచే నిర్మించబడిన ప్రతిమలు గృహమున పూజించుటకు ప్రశస్తములు. వక్రముగా నున్న, దగ్డమైన, ఖండితమైన భిన్న మూర్థము, భిన్న నేత్రమును, అంత్యజాదులచే స్పృశించబడిన ప్రతిమను పూజించరాదు. సర్వలక్షణలక్షితయగు బాణాదిలింగమున కూడా పూజించవచ్చును. మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి యథాప్రకారముగా దేవుని ధ్యానించి, ఆవాహన గోవించి పరివార గణములతో కూడియున్న దేవుని ఆ మూర్తియందు పూజించవలయును. శాలగ్రామమును ప్రతిష్టించినచో ఆవాహనవిసర్జనలతో పని లేదు, పుష్పాంజలిని తీసుకోని ధ్యానించి మంత్రమునుచ్చరించవలయును. ఆత్మ స్థితుడు అజుడు శుద్దుడు యగునిన్ను, అరణియందు అగ్నినీవలే మూర్తియందు ఆవాహించుచున్నాను. ఈ మహామూర్తి నీదే. ఆ మూర్తియందు సర్వగతుడవగు, భక్తి స్నేహ సమాకృష్ణుడవగు నిన్ను దీపము వలె ప్రతిష్టింతును. ఓ దేవా సర్వబీజమయుడవు, సర్వోంతర్యామిని, శుభకరుడవు స్వాత్మస్థుడను అగు నీకు పరిశుద్ధమగు ఆసనమును కల్పించుచున్నాను. ఓ ప్రభూ! ఈ నీ మూర్తి శక్తి నీకంటే వేరుగాదు. కావున భక్తానుగ్రహకారకుడవగు నీవు ఆ మూర్తిలో నిలువుము. అజ్ఞానము వలన గాని, మదించియుండుట వలన కాని, సాధన వైకల్యము వలన కానీ కల్పము అసంపూర్ణమైనను నీవు అభిముఖుడవుకమ్ము. యజ్ఞశాలయందు అమృతమును వర్షించు నీ దృష్టిని పూరించుచు యజ్ఞసంపూర్తి కొరకు మూర్తియందు నిలిచి యుండుము. భక్తులుకొని వొరి వాజ్మనశ్చకుశోత్రములకు అందని ప్రకాశముకలవాడా! నీ తేజఃపుంజముతో అంతటా పరివేష్టితుడవు కమ్ము. దేవతలు కూడా తమ అభీష్టసిద్ది కొఱకు దర్శనమభిలషించు పరమేశుడవగు నీకు స్వాగతము. నాకు కూడా స్వాగతము. నేను కృతార్థుడనైతిని. అనుగ్రహించబడితినని. నా జన్మ సఫలమైనది. దేవేశుడవగు నీవు వచ్చితివి. నీకు మరల సుఖాగమనము. కొద్ది భక్తి సంపర్కము వలననే పరమానందము సంభవించు నీపాదపద్మమునకు పొద్యమును కల్సించుచున్నాను. వేదములకు వేదము, దేవతలకు దేవతవు, శుద్దుల శుద్ధికి హేతువగు నీకు ఆచమనమును కల్పించుచున్నాను. తాపత్రయరుడవు, దివ్యుడను, పరమానన్దలక్షణుడవు అగు నీకు పాపనిర్ముక్తి కొఱకు నీకు అర్ఘ్యమును కల్పించుచున్నాను. సర్వకాలుష్య రహితుడవు, పరిపూర్ణగుణాత్ముడవగు నీకు మధుపర్కమును కల్పించుచున్నాను. ఉచ్చిష్టుడు కొననీ, అశుచియైనను స్మరణమాతరముచేతనే శుద్ధిని ప్రసాదించు నీకు మరల ఆచమనమును సమర్పంచు చున్నాను. ఓలోకనాధా! మహాశయా, స్నేహమునర్పంచుచున్నాను. ఈశ్వరో పరమానంద బోట్లలో నిమగ్నుమగు మూర్తీగల నీకు సాం గోపొంగముగా స్నానమును కల్పించుచున్నాను. యథాశక్తి గా, ఆదరముగా సహస్రమును కాని శతమును కాని గంధపుష్పాదులచే మంత్రముచే అభి షేకమును చేయవలయును. మాయ అను చిత్రపటముచే కప్పబడియున్న రహస్య ప్రకాశము కలవొడవు, ఆవరణములేని విజ్ఞానము కలిగియున్న నీకు నేను వస్త్రమును కల్పించుచున్నొను. మహామాయ నీ ఆశ్రయము వల్లనే జగత్తును మోహింప చేయుచున్నది. అట్టి పరమేశుడవగు నీకు ఉత్తరీయమును కల్పించుచున్నాను. శక్తి అర్క విఘ్నేశ్వరులకు రక్త వస్త్రమును, విష్ణువునకు పీతవస్త్రమును, శివునకు శ్వేతవస్త్రమును, అర్పించవలయును. శైలాదిదూషితమగు, జీర్ణమగునది, ఛిద్రములు కలిగియున్న, మలినమైన వస్త్రమును అర్పించరాదు. ఎవని శక్తిత్రయముచే సకల జగత్తు ప్రీతి చెండుచున్నదో అట్టి యజ్ఞ సూత్రస్వరూపునకు యజ్ఞసూత్రమును అర్పించుచున్నాను. స్వభావముచేతనే సుందరాంగుడు, నానాశక్త్యాశ్రయుడు అయిన నీకు విచిత్రభూషణములనర్పించుచున్నాను. పరమానందసౌరభ్యపరిపూర్ణ దిగంతరములు కల నీకు పరమగంధమును కల్పించుచున్నాను, కృపతో స్వీకరించుము. తురీయవనసంభూతమగు నొసాగుణమనోహరమగు, అధికసౌరభయుక్తమగు నీ పుష్పములను స్వీకరించుడు, జపాపుష్పమును, అక్షతలను, జిల్లేడుని, ఉమ్మెంతపుష్పములను శ్రీమహావిష్ణువునక్పంచరాదు. శక్తికీ దూర్వ అర్క మందోరములను, గణేశునకు తులసిని అర్చించరాదు. సరోజినీ దమనకములను, మరుబకమును, కుశములను, విష్ణుక్రాంత, నాగవల్లి, దూర్వ, ఆపామార్గ, దాడిమ, పుష్పములను ధాత్రీమునియుతులగు దేవతలకు పత్రములచే అర్చనమును చేయవలయును.
కదలీ బదరీ ధాత్రీ తింత్రిణీ బీజపూరకమ్,
ఆమ్రదాడీమజంబీరజంబూపనసభూమజాః.
ఏతేషాం తు ఫలైః కుర్యాద్దేవతాపూజనం బుధః,
శుష్కైస్తు నార్చయేద్దేవం పతైః పుష్పైః ఫలైరపి.
ధాత్రీఖదిరబిల్వాణాం తనలస్య దలాని చ,
భిన్నభిన్నాన్యపి మన్యే న దూష్యాణీతి జగురుధాః.
పద్మమామలకం తి ప్లేచ్ఛుద్ధం చైవ దినత్రయకమ్,
సర్వదా తులసీ శుద్ధా బిల్వపత్రాణి వై తథా.
పలాశకొశకుసుమైస్తమాలతులసీదలై,
ధాత్రీదలైశ్చ దూర్వాభిర్నార్చయేజ్జగదంబికామ్.
నార్పయేత్కుసుమం పత్రం ఫలం దేవే హ్యధోముఖమ్,
పుష్పపత్రాదికం విప్ర యథోత్పన్నం తథార్పయేత్.
వనస్పతిరసం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్,
ఆఘ్యం దేవదేవేశ ధూపం భక్త్యా గృహాణ నే.
సుప్రకాశం మహాదీపం సర్వదా తిమిరాపహమ్,
ఘృతవర్తిసమాయుక్తం గృహాణ మమ పత్కృతమ్.
అన్నం చతుర్విధం స్వాదు ర సైషడ్భిస్సమన్వితమ్,
భక్త్యా గృహాణ మే దేవ నైవేద్యం తుష్టితం సదా.
నాగవల్లీదలం శ్రేష్ఠం పూగఖదిరచూర్ణయుక్,
కర్పూరాది సుగంధాఢ్యం యద్దత్తం తద్గృహాణమే.
దద్యాత్పుష్పాంజలిం పశ్చాత్కుగ్యాదావరణార్చనమ్.
యదా శాఖముఖో భూత్వా పూజనం తు సమాచరేత్,
సైవ ప్రాచీ తు విజ్జీయా తత్యో_న్యో విదిశా దశ.
కేశరేశ్వగ్నికోణాది హృదయాదీని పూజయేత్,
నేత్రమ దిక్షు చాస్త్రముంగనురితైర్యథాక్రమమ్.
శుక్ల శ్వేత పితశ్యామకృష్ణరక్షార్చిషః క్రమాత్,
వరాభయకరా ధ్యేయాప్స్వప్వదిక్ష్వంగశక్తయః.
అముకావరణాంతే తు దేవతా ఇతి పంవదేత్,
సాలంకొరాప్తతః పశ్చాత్సాంగాః పపరిచారకొః.
సవాహనాస్సాయుధాశ్చ తతప్సర్వోపచార కైః,
సంపూజితాస్తర్పితాశ్చ వరదొస్సర్వదం పఠేత్.
మూలాంతే చ వముచ్చార్య దేవతాయై నివేదయేత్,
అభీష్టసిద్ధిం మే దేహి శరణాగతవత్సల.
భక్త్యా సమర్పయే తుభ్యమముకొవరణార్చనమ్,
ఇత్యుచ్చార్య క్షి పేత్పుష్పాంజలిం దేవస్య మస్త కే.
తతస్త్వభ్యర్చనీయాస్స్యుః కల్పోక్తాశ్చావృతీః క్రమాత్,
సాయుధాంస్తత ఇంద్రాద్యాన్స్వస్వదిక్టు ప్రపూజయేత్.
ఇంద్రో వహ్నిర్యమో రక్షో వరుణః పవనో నిధుః,
ఈశాన్యోధ విధి శ్చెవమధస్తాత్పన్నగాధిపః.
ఐరావతస్తథా మేజో మహిషః ప్రేతస్తిమిర ఎగః,
వాజీ వృషో హంపకూర్మొ వాహనాని విదుర్భుధాః.
వజ్రం శక్తిం దండఖడ్గా పాశాంకుశగదా అపి,
త్రిశూలం పద్మ చక్రే చ క్రమాదిరిద్రాది హేతయః,
సరూప్యావరణార్చాం తు దేవతారార్తికం చరేత్,
శంఖతోయం పరిక్షిస్యోర్ధ్వబాహుర్నృత్సన తేరితో.
దండవచ్చాష్యథోత్థాయ ప్రార్థయిత్వా నిజేశ్వరమ్,
దక్షిణే స్థండిలం కృత్వా తత్ర స్సా రమాచరేత్.
మూలేనేక్షణమణ ప్రోక్షణం తాడనం పునః,
కుశైషద్వర్మణాభ్యుక్ష్య పూజ్య తత్ర న్య పేత్వపుమ్.
ప్రదాప్య తత్ర జుహుయాత్ ధ్యాత్వా చైవేష్టదేవతామ్,
మహావ్యాహృతిభిర్యస్తు పమస్తాభిశ్చతుష్టయమ్.
జుహుయాత్సరిషా భక్తి స్త్రీలైర్వా పాయ సేన పా,
సఘృతైస్సాధక శ్రేష్ఠః పంచవింశతిసంఖ్యయా.
పునర్వాహృతిభిర్హత్యా గంధాద్యైః పునరర్చయేత్,
దేవం సంయోజయేన్మూర్తే తతో శహ్నం విపర్జయేత్.
భో! భో! వప్నే! మహాశక్తే! పర్వకర్మప్రసాధక!,
కర్మాంతర్యేపి పంప్రాస్తే సాన్నిధ్యం కురు సాదరమ్.
విసృజ్యాన్ని దేవతాయై దద్యాదాచనునీయకమ్,
అవశి షేన హవిషా గంధపుష్పాక్షతాదికమ్.
దేవతా పొర్షదేభ్యోపి పూర్వోత్తేభ్యో బలిం దదేత్ ,
యే రౌద్రా రౌద్రకర్మాణో రౌద్రస్థాననివాసినః.
యోగిన్యో హ్యుగ్రరూపాశ్చ గణానామధిపొశ్చ యే,
వింనభూతాప్తథాచాన్యే దిగ్విదిక్షు సమాశ్రితాః .
సర్వే తే ప్రీతమనసః ప్రతిగృహ్లాన్విమం బలిమ్,
ఇత్యష్టదిక్టు దత్వా చ పునర్బూతబలిం చరేత్.
పానీయమమృతకృత్య ముద్రయా ధేనుసంజ్ఞయా,
దేవతాయాః కరే దద్యాత్పునశ్చాచమనీయకమ్.
దేవముద్వాస్య మూర్తిస్థం పునస్తతైవ యోజయేత్ ,
నైవేద్యం చ తతో దద్యాత్తత్తదుచ్ఛిష్టభోజినే.
మహేశ్వరస్య చండేశో విష్వక్సేనప్తథాహరేః,
చండాంశుస్తరణేర్వక్రతుండశ్చాపి గణేశితుః .
శక్తేరుచ్ఛిష్టచండాలీ ప్రోక్తా ఉచ్చిష్టభోజినః,
తతో ఋష్యాదికం స్మృత్వా కృత్వా మూలషడంగకమ్,
జప్త్వా మంత్రం యథాశక్తి దేవతాయై నివేదయేత్.
గుహ్యతిగుహ్యా గోప్తా త్వం గృహాణాస్మత్కృతం జపమ్,
సిద్ధిర్భవతు మే దేవ త్వతసాదాత్వయి స్థితా.
తతః పరాజ్ముఖం చార్హం కృత్వా పుష్పై ప్రపూజయేత్,
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా.
మనసా వచసా చేతి ప్రణామ్యోఅష్టాంగ ఈరితః,
బాహుభ్యాం చ సజానుభ్యాం శిరసా వచస్యాపి వా.
పంచాంగకః ప్రణామస్యాత్ పూజాయాం ప్రవరావుభౌ,
నత్వా చ దండవన్మంత్రీ తతః కుర్యాత్పదక్షిణాః.
విష్ణుసోనూతనిస్తూనో వేదార్థంద్వద్రివప్నయనికి,
తతస్తోత్రాదీకం మంత్రి ప్రపఠేద్భక్తి పూర్వకమ్.
ఇతః పూర్ణం ప్రొణబుద్దిదేహధర్మాధికారతః,
జాగ్రత్స్వప్నసుషుప్త్యంతేనస్థాసు మనసావదేత్.
వాచా హస్తాభ్యాం చ పద్భ్యోం ఉద రేణ తతః పరమ్,
శిస్లింతే యత్స్మృభల పశ్చాద్యదుక్తం సత్కృతం తతః.
తత్సర్వం చ తతో బ్రహ్మార్పణం భవతు తద్వయమ్,
మా మదీయం చ సకలం విష్ణవే చ సమర్పయే.
తారం తత్సదతో బ్రహ్మార్పణమస్తు నునుర్మతః,
ప్రణవాద్యోష్ణవస్వర్ణో హ్యనేమౌత్మానమర్పయేత్ .
అజ్ఞానోద్వో ప్రమాదోడ్వొ వైకల్యాల్సొధనప్య చ,
యన్న్యూనమతిరిక్తం నా తత్సర్వం క్షత్తుమర్హసి.
ద్రవ్య హీనం క్రియాహీనం ముస్త్రహీనం మయాన్యధి,
కృతం యత్తతక్షమ స్వేశ కృపయా త్వం దయానిధే.
యన్మయా క్రియతే కర్మ జాగ్రత్స్వప్నసుషుప్తిషు ,
తత్సర్వం తావకీ పూజా భూయాద్భూత్యేచ మే ప్రభో.
భూమౌ స్థలితపాదానాం భూమీరేవావలం బనమ్,
త్వయి జాతాపరాధానాం త్వమేవ శరణం ప్రభో!.
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మను,
తస్మాత్కారుణ్యభావేన క్షమస్వ పరమేశ్వర.
అపరాధసహస్రాణి క్రియంత్యేళీ -హర్నిశం మయా,
దాసోయమితి మాం మత్వా క్షమస్వ జగతాం పతే.
ఆవాహనం న జానామి న జానామి పర్జనమ్,
పూజాం చైవ న జానామి త్వం గతిః పరమేశ్వర.
సంప్రౌర్ధ్యైవం తతో మంత్రీ మూలాంతే శ్లోకముచ్చరేత్ ,
గచ్ఛ గచ్ఛ పరం స్థానం జగదీశ జగన్మయ.
యం న బ్రహ్మాదయో తే వా జానప్తి చ సదాశివః ఇతి పుష్పాంజలిం దత్త్వా తతస్సంహారముద్రయా.
విధాయ దేవం సాంగం చ స్వీయ హృత్సర వీరు హే,
సుషుమ్లవర్త్మనా పుష్పమాఘ్రయోద్వాపయేద్బుధః.
శంఖచక్రగిలాలింగవిఘ్నపూర్యద్వయం తథా,
శక్తిత్రయం నచేకత పూజయేద్దుఃఖ కారణమ్.
అకాలమృత్యుహరణం సర్వవ్యాధివినాశనమ్,
సర్వపాపక్షయకరం విష్ణుపాదోదకం శుభమ్.
తత్తద్భకెళ్తహీతవ్యం తన్నె వేద్యనివేదితమ్,
అగ్రాహ్యం శివనిర్మాల్యం పత్రం పుష్పం ఫలం జలమ్.
శాలగ్రామశిల్పార్శాత్సర్యం యాతి పవిత్రతామ్,
పూజా పంచవిధా తత్ర కథితా సౌరదాఖిలైః.
ఆతుగీసేతుపాకీత్రాసీ సాధన - భావినీ తథా,
దౌర్బోధీ చ క్రమాదాసాం లక్షణాని శృణుష్వ మే.
కదలి, బదరి, ధాత్రి, తింత్రిణీ,బీజ పూరకము, ఆమ్లము, దొడిమ, జంబీరము, జంబు, పనస వృక్షముల ఫలములతో దేవపూజనము గావించవలయును. ఎండిన పత్ర పుష్పఫలములతో పూజించరాదు. ధాత్రీ ఖదీర బిల్వతమాలదళములు భిన్నములైనను ఛిన్నము లైనను దోషము లేదని పండితులు చెప్పిరి. పద్మము, ఆమలకము మూడు దీనములు శుద్ధముగా నుండును. తులసీదళములు మారేడు దళములు సర్వ కొలములలో శుదములే. పలాశ, కోశకుసుమ తులసీ దలములు, ధాత్రీదలములు, దూర్వా వీటిచే జగదంబికను అర్చంచరాదు. పత్ర పుష్ప ఫలములను తలక్రిందులుగా దేవుని కర్పించరాదు. పత్ర పుష్పాదులు చెట్టు ఎట్లుండునో అట్లే అర్పించవలయును. దివ్యము, సుగంధభరితము, సుమనోహరము అయిన వనస్పతీరసమును భక్తిచే సమర్పించుచున్నాను. ఆ ధూపమును ఆఘ్రాణించుము. సర్వదో చీకటిని హరింపచేయు చక్కని ప్రకాశము కల నేతివత్తితో కూడియున్న దీపమును స్వీకరించుము. రుచిగలది షడ్రసోపేతము అగు సొలుగు విధముల అన్నమును ఆనందమునిచ్చు నైవేద్యముగా స్వీకరించును. పూగ ఖదిర చూర్ణముతో కూడియున్న నాగవల్లీ దళమును కర్పూరాది సుగంధభరితమును నేనిచ్చిన దానిని స్వీకరించుము. తరువోత పుష్పాంజలినిచ్చి ఆవరణార్చనగావించవలయును. ఏ దిక్కునను అభిముఖుడై దైవపూజగావించునో ఆ దిక్కు తూర్పుదిక్కుగా తెలియవలయును. ఇతర దోశలు పది విదిశలగును. కేశరములందు అగ్నికోణాదిగా హృదయాదులను పూజించవలయును. అగ్రభాగమున నేత్రమును, దిక్కులందు అస్త్రమును యథాక్రమముగా అంగమంత్రములచే శుక్ల శ్వేత సీతశ్యామ కృష్ణ రక్త వర్ణములు గల, వరాభయకరలైన ఆయా దీగంగ శక్తులను ధ్యానము చేయవలయును. ఈ ఆవరణాంతమున ఈ దేవతయని చెప్పవలయును. తరువాత సాలంకారులను, సపరిచారికలను, సపోహనులను, సాయుధులను సర్వోపచారములతో చక్కగా పూజించి తృప్తి పరిచి వరదులగుదురుగాక అని చెప్పవలయును. మూలాంతమున ఉచ్చరించి దేవతకు నివేదించవలయును. ఓ శరణాగతవత్సలా నాకు అభీష్ట సిద్ధిని కలిగించును. భక్తితో నీకు ఈ ఆవరణార్చనను సమర్పించుచున్నాను. అని పలికి దేవమస్తకమున పుష్పాంజలిని సమర్పించవలయును. తరువాత కల్పోక్తావరణలను యథాక్రమముగా అర్చించవలయును. తరువాత సాయుధులైన ఇంద్రాదులను వారి వారి దిక్కులందు పూజించవలయును. ఇంద్రుడు వహ్ని, యముడు, వైబ్రుతి, వరుణుడు, వాయువు, ఈశ్వరుడు, బ్రహ్మ అధోభాగమున ఆది శేషుడు వీరు దిగీశులు, ఐరావతము, మేషము, మహిషము, పేతము, తిమి, మృగము, అశ్వము, వృషభము, హంస, కూర్మము, ఇవి వారి వాహనములు. వజ్రము, శక్తి, దండము, ఖడ్గము, పొశము, అంకుశము, గద, త్రిశూలము, పద్మము చక్రము ఇవి క్రమముగా వారి ఆయుధములు. ఆవరణార్చనను పూర్తి గావించి దేవతారార్తికమును గావించవలయును. శంఖ జలమును చుట్టు జల్లి చేతులు పైకెత్తి భూమి మీద పడవలయును. దండము వలె పడిలేచి తన ఇష్టదైవమును ప్రార్ధించి, దక్షిణ భాగమున స్థండిలము నేర్పరిచి అచట సంస్కారమును ఆచరించవలయును. మూలమంత్రముతో నేత్రమును, అస్త్రముచే ప్రోక్షణమును, మరల తొడనమును, దర్భలచే కవచమును ప్రోక్షించి అచట వసువు నుంచవలయును. ప్రదోపనము గావించి హోమమును చేయవలయును. ఇష్టదేవతను ధ్యానించి సమస్తములగు మహావ్యాహృతులచే చతుష్టయమును నేతితో కొని, తిలలచే కాని, పాయసము చే కాని నేతిని కలిపి ఇరువది మార్లు హోమమును గావించవలయును. మరల వ్యాహృతులచే, హోమమును గావించి గంధాదులచే అర్చించవలయును. మూర్తియందు దేవుని సంయోజన చేయవలయును. అపుడు అగ్నిని విసర్జన చేయవలయును. ఓ మహాశక్తి గల అగ్నిహోత్రమా, సర్వ కర్మ ప్రసాధకా! మరియొక కర్మ వచ్చినపుడు సాన్నిధ్యము నిమ్ము. ఇట్లు విసర్జన గావించి అగ్నికి ఆచమనమును సమర్పించవలయును. మిగిలి హవిస్సును గంధపుష్పాక్షతలతో కలిపి దేవతా ద్వారపొలకులకు పూర్వోక్తులకు బలినీయవలయును. రౌద్రులు, రౌద్రకర్ములు, రౌద్రస్థాన నివాసులు, యోగినులు, ఉగ్రరూపులు, గణాధిపులు, ఇతరులగు విఘ్నభూతులు దిక్కులలో విదిక్కులలో ఉన్న వారందరు ప్రీతితో కూడిన మనసు గలవారై ఈ పూజను స్వీకరింతురుగాత. ఇట్లు అష్టదిక్కులలో నుంచి మరల భూతబలిని గావించవలయును. గోముద్రచే జలమును అమృతమును గావించి దేవతా హస్తమున మగల ఆచమనీయమునీయవలయును. మూర్తిస్తుడగు దేవతను ఉద్వాసన గావించి, మరల అచటనే యోజన చేయవలయును. తరువాత వారి వారి ఉచ్చిష్ట భోజులకు నైవేద్యము నర్పించవలయును. మహేశ్వరునికి చండేశుడు, శ్రీహరికి విష్వక్సేనుడు, సూర్యునికి చండాంశువు, గణేశునికి వక్రతుండుడు, శక్తికి , చండాలి ఉచ్చిష్టభోజులు. తరువాత ఋష్యాదికమును స్మరించి మూల షడంగ న్యాసమును గావించి యథాశక్తిగా మంత్రమును జపించి దేవతకు నివేదించవలయును. గుహ్యాతిగుహ్యా గోప్తవగు నీవు మాచే చేయబడిన జపమును స్వీకరించుము. నీ అనుగ్రహము వలన నీయందున్న సిద్ది నాకు కలుగును. తరువాత అర్షమును పరాజ్ముఖముగా చేసి పుష్పములచే పూజించవలయును. బాహువులచే, పొదములచే, మోకాళ్ళచే, వక్షస్థలముచే, శిరస్సుచే, నేత్రములచే, మనస్సుచే వాక్కుచే అని ప్రణామము అష్టాంగముగా చెప్పబడినది. బాహువులచే జానువులచే శిరస్సుచే వాక్కుచే, మనస్సుచే పంచాంగప్రణామము కూడా చెప్పబడినది. దైవ పూజలో ఈ రెండు ఉత్తమములే. మంత్రానుష్టానము చేయువాడు దండవత్రణామములాచరించి ప్రదక్షిణముల నాచరించవలయును. తరువాత భక్తిపూర్వకముగా స్తోత్రాదికమును పఠించవలయును. ఇప్పటి నుండి పూర్ణముగా ప్రాణ బుద్ధి దేహ ధర్మాధికారములవలన జాగ్రత్స్వప్నసుషుష్యవస్థలలో మనసుచే, వాక్కు, హస్తములచే, పాదములతో, ఉదరముతో, అక్కడి నుండి శిరస్సువంచి తలచినది, పలికినది, చేసినది అంతయూ బ్రహ్మర్పణమగు గాక. నన్ను, నాదైన సమస్తమును విష్ణువునకు సమర్పించుచున్నాను. తార స్వరముతో “తత్సదతో బ్రహ్మర్పణమస్తు” అనునది మంత్రము ప్రణవము ఆదియందుగ అష్టాక్షరములు గల ఈ మంత్రముతో ఆత్పార్పణమును గావించవలయును. అజ్ఞానము వలన కాని ప్రమాదము వలన కాని సాధన వైకల్యము వలన కొని ఎక్కువ తక్కువలున్నచో దాని నంతను క్షమించవలయును. ద్రవ్య హీనము, క్రియాహీనము, మన్త హీనముగాకాని, మరొకవిధముగా కానీ నేనాచరించిన దానిని దయానిధివగు నీవు దయచే క్షమించుము. జాగ్రత్స్వప్నసుషుప్తి కర్మలలో నేను చేయు పనులన్నియూ నీ పూజయే అయ్యి నాకు సంపదలను వృద్ధిపరచనీ, భూమిమీద కాలు జారిన వానికి భూమియే ఆధారమగునటుల నీయందు అపరాధము చేసిన వారికి నీవే రక్షణము కావలయును. ఇతరములైన రక్షకము లేవియూ లేవు. నీవే నాకు రక్షణము. కావున కొరుణ్యభావముతో నన్ను క్షమించుము. నేను రాత్రింబవళ్ళు అపరాధసహస్రముల నాచరించుచున్నాను. ఓ జగత్పతి నన్ను నీదాసునిగా భావించి క్షమించుము నేను ఆవాహనమును తెలియను, విసర్జనమును తెలియను. పూజను తెలియను. కావున నీవే గతివి ఇట్లు ప్రార్థించి మూలాంతమున శ్లోకమును పఠించవలయును. గచ్చ గచ్చ పరం స్థానం జగదీశ జగన్మయ, యన్న బ్రహ్మదయో దేవ జానర్తి చ సదాశివః” అనునది శ్లోకము. ఓ జగదీశా జగన్మయా బ్రహ్మాది దేవతలు సదాశివుడు కూడా తెలియని నీ పరస్థానమునకు వెళ్ళుము అని అర్థము. ఇట్లు పుష్పాంజలినిచ్చి సంహారముద్రచే తన హృదయ పద్మమునందు సాంగముగా దేవుని ఉంచి సుషుమ్లామార్గముతో పుష్పమునాఘ్రాణించవలయును. శంఖ చక్ర శిలా లింగ విఘ్నేశ సూర్యద్వయమును, శక్తిత్రయమును ఒకేచోట పూజించరాదు. పూజించినచో దుఃఖకారణమగును. శుభములను కలిగించు శ్రీ విష్ణుపాదోదకము అకాలమృత్యుహరణము, సర్వ వ్యాధి నివారణము. సర్వపాపక్షయకరము. ఆయాదేవతల భక్తులచే వారి వారికి సమర్పించిన నైవేద్యమును స్వీకరించవలయును. శివనిర్మాల్యమును పత్ర పుష్ప ఫలజలములను గ్రహించరాదు. శాలగ్రామశీలాస్పర్శవలన అన్నియూ పవిత్రములగును. ఈ విషయమున పూజ అయిదు విధములుగా చెప్పబడినది. ఆతురీ, సౌతికీ, త్రాసీ, సాధనా భావినీ, దౌర్బోధి యని వాటి పేర్లు. ఇపుడు క్రమముగా వీటి లక్షణములను వినుము.
రోగాదియుక్తో న స్నాయన్న జపేన్న చ పూజయేత్,
విలోక్య పూజాం దేవస్య మూర్తిం వా సూర్యమండలమ్.
ప్రణమ్యాథ స్మరన్మంత్రమర్పయేత్కుసుమాంజలిమ్,
రోగే నివృత్తే స్నాత్వాథ నత్వా సంపూజయేద్గురుమ్.
త్వత్ప్రసాదాబ్జగన్నాథ జగత్పూజ్య దయానిధే,
పూజావిచ్ఛేదదోషో మే మాస్త్వితి ప్రార్థయేచ్ఛ తమ్.
ద్విజానపి చ సంపూజ్య యథాశక్త్యా ప్రచోష్య చ,
తేభ్యశ్చాతిషమాదాయ దేవం ప్రాగ్వత్తతోర్పయేత్.
ఆతురీ కథితా హ్యేషా సౌతిక్యథ నిగద్యతే,
సూతకం ద్వివిధం ప్రోక్తం జాతాఖ్యం మృతసంజ్ఞకమ్.
తత్ర స్నాత్వా మానసీం తు కృత్వా సంధ్యాం సమాహితః,
మన సైవ యజేద్దేవం మన సైవ జ పేన్మనుమ్.
నివృత్తే సూతకే ప్రాగ్వల్ సంపూజ్య చ గురుం ద్విజాన్,
తేభ్యశ్చాశిషయాదాయ తతో నిత్యక్రమం చరేత్.
ఏషా తు సౌతికీ ప్రోక్తా త్రాసీ చాథ నిగద్యతే,
దు షేభ్యశ్రిసమాపన్నో యథాలజ్జోపచార కైః.
మాన సైర్వాయజేద్దేవం త్రాసీ సా పరికీర్తితా,
పూజాసాధనవస్తూనామసామర్థ్య తు సర్వతః.
పు షైః పతైః ఫలైర్వాపి మనసా వా యజేద్విభుమ్,
సాధనా భావినీ హ్యేషా దౌర్బోధీం శృణు నారద.
యో వృద్ధాస్తథా బాలా మూర్ధా న్తస్తు యథాక్రమమ్,
యథాజ్ఞానకృతా సా తు దౌర్బోధీతి ప్రకీర్తితా.
ఏవం యథాకథంచిత్తు పూజాం కుర్యాద్ధి సాధకః,
దేవపూజావిహీనో యస్స గచ్ఛేన్నరకం ధ్రువమ్.
వైశ్వదేవాదికం కృత్వా భోజయేద్ద్విజసత్తమాన్,
దేవే నివేదితం పశ్చాత్ భుంజీత స్వగజైస్వయమ్.
ఆచమ్యాననశుద్ధిం చ కృత్వా తిష్ఠతియత్కణమ్,
పురాణమితిహాసం చ శృణుయాత్స్వజనైస్సహ.
సమర్ధస్సర్వకల్పేషు యోనుకల్పం సమాచరేత్,
న సాంగసాయికం తస్య దుర్మతేర్జాయతే ఫలమ్.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే
తృతీయపాదే దేవపూజానిరూపణం నామ సప్తషష్టితమోధ్యాయః .
రోగాదులు వచ్చినవారు స్నానము చేయరాదు. జపము చేయరాదు. పూజించరాదు. దేవ పూజను చూచి, మూర్తిని కాని, సూర్యమండలమును కాని చూచి నమస్కరించి, మస్త్రమును స్మరించుచు పుష్పాంజలిని సమర్పించవలయును. రోగము తగ్గిన తరువాత స్నానము చేసి గురువునకు నమస్కరించి పూజించవలయును. ఓ జగత్పూజ్యా! దయానిధీ! నీయనుగ్రహమువలన నాకు పూజావిచ్చేద దోషము కలుగకుండు గావు అని దైవమును ప్రార్థించవలయును. బ్రాహ్మణులను కూడా పూజించి శక్త్యనుసారము సంతోషింప జేసి, వారి నుండి ఆశీర్వాదములను పొంది తరువాత మొదటి వలె దేవ పూజను గ్రావించవలయును. ఇది ఆతురీపూజ యనబడును. ఇపుడు సౌతికీపూజను చేప్పెదను. సూతకము రెండు విధములు. జాతసూతకము, మృతసూతకము అని. ఈ సూతకములలో స్నానము చేసి మానసిక సంధ్యా వందనమాచరించి, మనసుతోనే దైవపూజ గావించవలయును. మనసులోనే మంత్రమును జపించవలయును. సూతకము తొలగిపోయిన తరువాత, మొదటివలె గురువును, బ్రాహ్మణులను పూజించి, వారి ఆశీర్వచనములను పొంది, తరువాత నిత్యకృత్యములను నిత్యకర్మనాచరించవలయును. దీనిని సౌతిక పూజయందురు. ఇపుడు త్రా సీపూజను చేప్పెదను. దుర్జనులవలన భయము కలిగినపుడు లభించిన ద్రవ్యములచే కొని. మానసిక ద్రవ్యములచే కాని దైవపూజ గావించవలయును. ఇదియే త్రాసీ అనబడును. పూజాసాధన వస్తువులను కూర్చుకొను సామర్థ్యము లేనపుడు పత్ర పుష్ప ఫలములతో కాని మానసికముగా కాన దైవపూజ గావించుటయే సాధనా భావినీ పూజ యనబడును. స్త్రీలు వృద్దులు బాలులు, మూర్తులు వారికి తోచిన క్రమముచే తెలిసినంతలో చేసిన పూజ దౌరోధియగును. సాధకుడిట్లు ఏదో విధముగా పూజము చేయించవలయును. దేవపూజావిహీనుడు నరకమునకు వెళ్ళును. వైశ్వదేవాదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలయును. తరువాత దైవనివేదికమును చేసి బ్రాహ్మణులకు భోజనమును అర్పించవలయును. తరువాత దైవనివేదితమైన దానిని స్వగణముచే భుజించవలయును. ఆచమనము చేసి ఆనన శుద్ధిగావించుకొని క్షణములుండవలయును. స్వజనులతో కలిసి పురాణమును కాని ఇతిహాసమును కాని వినవలయును. సర్వకల్పములలో అనుకల్పము నాచరించువాడు దుర్మతి యగును. కల్పఫలమును పొందజాలడు.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దేవ పూజా నిరూపణమను అరువది యేడ - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 68 of the Nārada Mahā Purana is as follows:
సమస్త జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువు యొక్క దివ్య మంత్రోపాసనా విధానమును సనందన మహర్షి ఈ అధ్యాయంలో ప్రబోధించినారు. అష్టాక్షరీ ద్వాదశాక్షరీ మంత్రముల మహిమ, ధ్యాన శ్లోకములు మరియు ఆరాధనా క్రమము ఇక్కడ నిరూపించబడినవి.