నారద మహా పురాణము
50 - బృహదుపాఖ్యానమ్
సూత ఉవాచ :-
శ్రుత్వా సనందన స్యేత్థం వచనం నారదో మునిః।
అసంతుష్ట ఇవ ప్రాహ భ్రాతరం తం సనందనమ్॥
సూత మహర్షి పలి కెను :- నారద మహర్షి ఇట్లు సనందనమహర్షి మాటలను విని సంతృప్తి పొందని వానివలె భౌతయగు సనందనుని ఇట్లు పలి కెను.
నారద ఉవాచ :-
భగవన్సర్వమాఖ్యాతం యత్పృష్టం భవతో మయా।
తథాపి నాత్మా ప్రీయేత శృణ్వన్హరికథాం ముహుః॥
శ్రూయతే వ్యాసపుత్రస్తు శుకః పరమధర్మ విత్।
సిద్ధిం సుమతీం ప్రాప్తో నిర్విణ్ణోఽవాంతరం బహిః॥
బ్రహ్మన్పుంసస్తు విజ్ఞానం మహతాం సేవనం వినా।
న జాయతే కథం ప్రాప్తో జ్ఞానం వ్యాసాత్మజో శిశుః॥
తస్య జన్మ రహస్యం మే కర్మ చాప్యస్య శృణ్వతే।
సమాఖ్యాహి మహాభాగ మోక్షశాస్త్రార్ధవిద్భవాన్॥
నారద మహర్షి పలికెను :- ఓ మహానుభావా! నేనడిగిన విషయములన్నిటిని మీరు చెప్పితిరి. అయిననూ హరికథలను ఎన్నిమార్లు వినిననూ ఆత్మకు సంతృప్తి కలుగుట లేదు. వ్యాస పుత్రుడగు శుకుడు పరమధర్మములను తెలుసుకొని అంతరంగమున బహిరంగమున తృప్తిని మహాసిద్ధిని పొందేనని వినియుంటిని. జీవునికి మహానుభావుల సేవ చేయనిదే విజ్ఞానము కలుగదు కదా? వ్యాస పుత్రుడు శైశవములోనే జ్ఞానమునెట్లు పొందెను? శుకమహర్షి జన్మ రహస్యమును, కర్మలను వినగోరు నాకు తెలుపుము. మీరు మోక్ష శాస్త్రార్ధములను తెలిసిన మహానుభావులు.
సనందన ఉవాచ :-
శృణు విప్ర ప్రవక్ష్యామి శుకోత్పత్తిం సమాసతః।
యాం శ్రుత్వా బ్రహ్మతత్త్వజ్ఞో జాయతే మానవో మునే॥
న హాయనైర్న పలితైర్నవిత్తేన న బంధుభిః।
ఋషయశ్చక్రిరే ధర్మం యోఽనూచాన స్స నో మహాన్॥
సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? సంగ్రహముగా శుకోత్పత్తిని చెప్పెదను. వినుము. ఈ శుకోత్పత్తిని వినిన మానవుడు బ్రహ్మ జ్ఞానమును పొందును. సంవత్సరముచే, ఫలితములచే, ధనముచే బంధువులచే ఋషులు ధర్మమునాచరించలేదు. అనూచానమునే ఆచరించిరి. అనూచానమే ఉత్తమము.
నారద ఉవాచ :-
అనూచానః కథం బ్రహ్మన్! పుమాన్భవతి మానద !।
తన్మే కర్మ సమాచక్ష్వ శ్రోతుం కౌతూహలం మమ॥
నారద మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా మానవుడు అనూచానుడెట్లగను? అనూచానమనగానేమి? ఆ కర్మను చెప్పుము. వినవలయునని నాకు కోరికయున్నది.
సనందన ఉవాచ :-
శృణు నారద వక్ష్యామి హ్యనూచానస్య లక్షణమ్।
యజ్ జ్ఞాత్వా సాంగ వేదానామభిజ్ఞో జాయతే నరః॥
శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం జ్యోతిషం తథా।
ఛన్దశ్శాస్త్రం షడేతాని వేదాంగాని విదుర్భుధాః॥
ఋగ్వేదోఽథ యజుర్వేదస్సామవేదో హ్యధర్వణః।
వేదాశ్చత్వార ఏవైతే ప్రోక్తా ధర్మనిరూపణే॥
సాంగాన్వేన్గురోర్యస్తు సమధీతే ద్విజోత్తమః।
సోఽనూచానః ప్రభవతి నాన్యధా గ్రంథకోటిభిః॥
సనందన మహర్షి పలికేను :- ఓ నారదా? అనూచాన లక్షణమును చెప్పెదను. వినుము. అనూచాన లక్షణమును తెలియువాడు సాంగవేదములను తెలియగలడు. శిక్ష, కల్పము, వ్యోకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు అను ఈ ఆరు వేదాంగములను పండితులు తెలియుదురు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము అను నీ నాలుగు వేదములని ధర్మనిరూపణమున చెప్పబడినవి. గురువు వలను "సాంగవేదములను అధ్యయనము చేయు మానవోత్తముడు అనూచానుడనబడును. స్వయముగా కోటి గ్రంథములను చదివిననూ అనూచానుడు కాజాలడు.
నారద ఉవాచ :-
అంగానాం లక్షణం బ్రూహి వేదనా చాపి విస్తరాత్।
త్వమస్మాసు మహావిజ్ఞస్సాంగే ష్వేతేషు మానద!
నారద మహర్షి పలి కెను :- వేదాంగముల లక్షణమును, వేదముల లక్షణమును విస్తరముగా తెలుపుము. ఓ మహానుభావా! నీవు సాంగవేదములందు విజ్ఞుడవు.
సనందన ఉవాచ :-
ప్రశ్న భారోఽయమతులస్త్వయా మమ కృతే ద్విజ।
సంక్షేపాత్కథయిష్యామి సారమేషాం సునిశ్చితమ్॥
స్వరః ప్రధానశ్శిక్షాయాం కీర్తితో మునిభిర్ద్విజై:।
వేదానాం వేదవిద్భిస్తు తచ్ఛృణుష్య పదామీ తే॥
ఆర్చికం గాధికం చైవ సామీకం చ స్వరాన్తరమ్।
కృతాంతే సర్వశాస్త్రాణాం ప్రయోక్తవ్యో విశేషతః॥
ఏకాంతరో స్వరో హ్యాప్సు గాధాసు ద్వ్యంతరస్స్వరః।
సామసు త్ర్యంతరం విద్యాదేతావత్స్వరతోఽస్తరమ్॥
ఋక్సామయజురంగాని యే యజ్ఞేషు ప్రయుంజతే।
అవిజ్ఞానాద్దీ శిక్షాయా స్తేషాం భవతి విస్వరః॥
మన్త్రో హీనస్వరతో వర్ణతో వా మిథ్యాప్రయుక్తో న తమర్ధమాహ।
స వాగ్వజ్రో యజమానం హీనస్తి యథేన్ద్రశత్రుస్స్వరతోఽపరోధాత్॥
ఉరః కంఠశ్శిర శ్చైవ స్థానాని త్రీణి వాజ్మయే।
సవనాన్యాహుర్తాని సామ వాప్యర్థతోఽతరమ్॥
ఉరస్సప్తవివారం స్యాత్ తథా కంఠస్తథా శిరః।
న చ శక్తోఽసి వ్యక్తస్తు తథా ప్రావచనావిధిః॥
కఠకాలాపవృత్తేషు తైత్తిరాహార కేషు చ।
ఋగ్వేదే సామవేదే చ వక్తవ్యః ప్రథమస్వరః॥
ఋగ్వేదస్తు ద్వితీయేన తృతీయేన చ వర్తతే।
ఉచ్చమధ్యమసంఘాతస్స్వరో భవతి పార్ధివః॥
తృతీయప్రధమక్రుష్టా కుర్వంత్వాహ్వరకాన్స్వరాన్।
ద్వితీయాద్యాస్తు మంద్రాంతాః తైత్తిరీయాశ్చతుస్స్వరాన్॥
ప్రథమశ్చ ద్వితీయశ్చ తృతీయోఽథ చతుర్ధకః।
మంద్రః క్రుష్టో మునీశ్వరైరేతాన్కుర్వన్తి సామగాః॥
ద్వితీయప్రథమావైతానాండిభాల్లవినౌ స్వరా।
తథా శాతపథావేతా స్వరౌ వాజసనేయినామ్॥
ఏతే విశేషతః ప్రోక్తా స్స్వరా వై సార్వ వైదికాక।
ఇత్యేతచ్చరితం సర్వం స్వరాణాం సార్వవైదికమ్॥
సామవేదే తు వక్ష్యామి స్వరాణాం చరితం యథా।
అల్పగ్రంథం ప్రభూతార్థం సామవేదాంగముత్తమమ్॥
తానరాగస్వరగ్రామమూర్ఛనానాం తు లక్షణమ్।
పవిత్రం పావనం పుణ్యం యథా తుభ్యం ప్రకీర్తితమ్॥
శిక్షామాహుర్ద్విజాతీనాం ఋగ్యజుస్సామలక్షణమ్।
సప్తస్వరాస్త్రయో గ్రామా మూర్ఛనా స్త్వేకవిశతిః॥
తానా ఏకోనపంచాశదిత్యేతత్స్వరమండలమ్।
షడ్జశ్చ ఋషభశ్చైవ గాంధారో మధ్యమస్తథా॥
పంచమో ధైవత శ్చైవ నిషాదస్సప్తమస్స్వరః।
షడ్జమధ్యమగాంధారాస్త్రయో గ్రామాః ప్రకీర్తితాః॥
భూధోకాజ్ఞాయతే షడ్జో భువర్లోకాచ్చ మధ్యమః।
స్వర్గాభ్రాచ్చెవ గాంధారో గ్రామస్థానాని త్రీణి హి॥
స్వరాణాం చ విశేషేణ గ్రామరాగా ఇతి స్మృతాః।
వింశతిర్మధ్యమగ్రామే షడ్జగ్రామే చతుర్ధశ॥
తానాన్పంచ దశేచ్ఛంతి గాంధారే సామగాయినామ్।
నదీ విశాలా సుముఖీ చిత్రాచిత్రవతీ ముఖా॥
చాలా చావ్యధ విజ్ఞేయా దేవానాం సప్తమూర్ఛనాః।
ఆప్యాయనీ విశ్వభృతా చంద్రా హేమా కపర్దినీ॥
మైత్రీ చ బార్హతీ చైవ పితృణాం సప్త మూర్ఛనాః।
షడ్జే తూత్తరమంద్ర స్యాదృషభే చాభిరూహతా॥
అశ్వక్రాంతా తు గాంధారే తృతీయా మూర్ఛనా స్మృతా।
మధ్యమే ఖలు సౌవీరా హృషికా పంచమే స్వరే॥
ధైవతే చాపి విజ్ఞేయా మూర్ఛనా తూత్తరా మతా।
నిషాదే రజనీం విద్యాత్ ఋషీణాం సప్త మూర్ఛనాః॥
ఉపజీవన్తి గంధర్వా దేవానాం సప్త మూర్ఛనాః।
పితృణాం మూర్చనొస్సప్త తథా య న సంశయః॥
ఋషీణాం మూర్చనాస్సప్త యాస్త్విమా లౌకికాస్మృతాః।
షడ్జః ప్రీణాతి వై దేవాన్ ఋషీన్ప్రీజాతి చర్షభః॥
పితృ న్ప్రీణాతి గాంధారో గంధర్వాన్మధ్యమస్వరః।
దేవానృషీన్పితరాంశ్చైవ స్వరః ప్రీణాతి పంచమః॥
యక్షాన్నిషాదః ప్రీణాతి భూతగ్రామం చ ధైవతః।
గానస్య తు దశవిధా గుణవృత్తిస్తు తద్యథా।
సనందన మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా!నీవు చాలా కష్టతరమగు ప్రశ్ననడిగితిని. వేదవేదాంగముల సారమును సంక్షేముగా నిశ్చితముగా చెప్పెదను, మునులు ద్విజులు శికలో స్వరము ప్రధానమనీ చెప్పియున్నారు. వేదవిదులు వేదములలో చెప్పిన వాటిని తెలి పేదను వినుము. ఆర్చికము గాధికము సామికము అని సర్వశాస్త్ర సిద్ధాంతముగా విశ్లేషించి ప్రయోగించవలయును. ఏకమాత్రవ్యవధానము కల స్వరము ఋక్కులలో, గాధలలో మాత్రాద్వయవ్యవధానము కలస్వరము, సామమున త్రిమాత్రవ్యవధానముగా నుండును. ఇదియే సామాన్యముగా స్వరలక్షణము, యజ్ఞములలో ప్రయోగించబడు ఋక్సొమయజురంగములలో శిక్షాజ్ఞానము లేనిచో అపస్వరము కలుగును. స్వర హీనము వర్ణహీనమగు. మంత్రమును అపరిశుద్ధముగా పలికినచో అభి పేతమగు నర్థమును చెప్పజాలదు. అట్లు దుష్టమగు వాగ్వజము యజమానికి హాని కలిగించును. ఇంద్రశత్రుపదము అపస్వరముగా పలికినందున ఇంద్రుని శమింపచేయువాడు అను అర్థమును కాక ఇంద్రునిచే శమింప చేయబడువాడు అనునర్థమును బోధించునటుల. వాజ్మయమున వక్షస్థలము, కంఠము, శిరము అని మూడు స్థానములుండును. ఈ మూడింటినే సవనములందురు. అర్థమౌత్రాంతరమున్నచో సామ అనికూడా అందురు. వక్షస్థలము కంఠము శిరము సప్తవివరములు కలిగియుండును. వివరములులేనిచో స్వరము బయలుపరచ శక్యము కాదు.ఇదియే ప్రవచన విధి. కఠకాలాప వృత్తములలో తైత్తిర ఆహ్వరకములలో, ఋగ్వేదము ద్వితీయ తృతీయ స్వరములతో కూడా యుండును. ఉచ్చ మధ్యమ సంఘాతమే స్వరమనబడును. ఆహ్వరకములందు తృతీయ ప్రధమ స్వరములను చెప్పవలయును. ద్వితీయమునుండి మంద్రము వరకు తైత్తిరీయ స్వరములందురు. సామగానము చేయు మునీశ్వరులు ప్రధమ ద్వితీయ తృతీయ చతుర్ధ మంద్ర క్రుష్ట స్వరములను ప్రయోగింతురు. ద్వితీయ ప్రధమ స్వరములు నాండిభాల్లవులనబడును. ఇవియే వాజసనేయులకు శాతపధస్వరములు. వైదికులందరూ ఈ స్వరములను విశే స్వరముల సంగ్రహ చరిత్ర.
ఇక ఇపుడు సామవేదస్వరముల చరితమును చెప్పెదను వినుము. సామవేదాంగము అల్పగ్రంధము విస్తరార్ధముగా నుండును. ఈ సామవేదములో తాన రాగ స్వర గ్రామ మూర్చనా లక్షణములను తెలియుట పవిత్రము, పావనము, పుణ్యము. కావుననే నీకు చెప్పుచున్నాను. ద్విజులు అధ్యయనము చేయు ఋగ్యజుస్సామ లక్షణమునే శిక్షయందురు. ఏడుస్వరములు, మూడుగ్రామములు, ఇరువది యొకటి మూర్చనలు, నలుబది తొమ్మిది తానములు. ఇదియంతయు కలిసి స్వరమండలమనబడును. షడ్డ, ఋషభి, గాంధార, మధ్యమ, పంచమ, ధైవత నిషాదములను, ఏడు స్వరములు. షడ్డ మధ్యమ గాంధారములు అను మూడు గ్రామములనబడును. షడ్జము భూలోకమునుండి పుట్టును. భువర్లోకమునుండి మధ్యమము పుట్టును. సువర్లోకము నుండి గాంధారము పుట్టును. ఈ మూడు గ్రామ స్థానములు. స్వరములకు విశేషముగా గ్రామరాగములకి పేరు. మధ్యమ గ్రామమున ఇరువది, షడ్డ గ్రామమును పదునాలుగు, రాగములుండును. సామగానమును చేయువారు గాంధారమున పంచదశ తానములను చేప్పెదరు. నదీ, విశాలా, సుముఖీ, చిత్రా, చిత్రవతీ, ముఖా, బలా అను నీ ఏడు దేవ మూర్చనలు. ఆప్యాయినీ, విశ్వభృతా, చంద్రా, హేమా, కపర్దినీ, మైత్రీ, బార్హతీ అను ఏడు మూర్ఛనలు పితృదేవతలవి. షడ్జమున ఉత్తరమంద్రము, ఋషభమున ఆరోహణము, గాంధారమున అశ్వక్రాంతము, అను మూడవ మూర్చనయుండును. ఈ మధ్యమమున సౌవీర, పంచమ స్వరమున హృషీకా, ధైవతమున ఉత్తరామూర్చన యుండును. నిషాదమున రజనీ, ఇట్లు ఋషులకు ఏడు మూర్చనలుండును. దేవతల సప్త మూర్చనలనే గాంధర్వులు గానము చేతురు. పితృదేవతల మూర్చనలను యక్షులు గానము చేతురు. ఋషుల సప్తమూర్చనలే లౌకికములనబడుచున్నవి. షడ్జస్వరము దేవతలకు ప్రీతి కలిగించును. ఋషభ స్వరము ఋషులను ప్రీతులను చేయును. గాంధారము పితృదేవతలను ప్రీతులను చేయును. మధ్యమ స్వరము గంధర్వులను ప్రీతులను చేయును. పంచమ స్వరము దేవతలను పితృదేవతలను ఋషులను ప్రీతులను చేయును. యకులను నిషాదము, ప్రాణిసమూహమును దైవతము సంతోషపరచును. గానమునకు దశవిధములుగా గుణవృత్తులుండును. వినుము.
రక్తం పూర్ణమలంకృతం ప్రపన్నం వ్యక్తం వికృష్టం।
శ్లక్ష్ణం సమం సుకుమారం మధురమితి గుణాస్తత్ర
రక్తం నామ వేణువీణాస్వరాణామేకీభావం రక్తమిత్యుచ్యతే॥
పూర్ణం నామ స్వరశ్రుతిపూరణా చ్ఛందః
పొదాక్షరం సంయోగాత్పూర్ణమిత్యుచ్యతే॥
ఆలంకృతం నామ। ఉరపి శిరసి కంఠయుక్తమిత్యలంకృతం।
ప్రసన్నం నానూపగత గద్గదనిర్విశంకర ప్రసన్నమిత్యుచ్యతే॥
వ్యక్తం నామ పదపదార్ధప్రకృతివికారాగమనోపకృత్తద్ధితసమాసధాతుని పొతోపసర్గప్వరలింగం।
వృత్తివార్తి కవిభక్త్యర్థవచనానాం సమ్యగుపపాదనం వ్యక్తమిత్యుచ్యతే॥
విక్రుష్టం నామ ఉచ్చైరుచ్చారితం।
వ్యక్తపదాక్షరం వికృష్టమిత్యుచ్యతే శ్లక్ణం నామ ద్రుతమవిలంబితముచ్చనీచపుత సమాహార హేలతాలోపనయాదిభిరుపపాదనాభిస్లక్ష్ణమిత్యుచ్యతే॥
సమం నామావాపనిర్వాపప్రదేశ్ ప్రత్యంతర స్థానానాం సమాసః సమమిత్యుచ్యతే॥ సుకుమారం నామ మృదుపదవర్ణస్వరకుహరణయుక్తం సుకుమార మిత్యుచ్యతే మధురం నామ స్వభావోపనీతలలితపదాక్షరగుణ సమృద్ధం మధురమిత్యుచ్యతే ఏవమే వేతైర్దశభిర్గుణైర్యుక్తం గౌనం భవతి॥
భవంతి చాత్ర శ్లోకాః॥
శంకితం భీషణం భీతం ఉద్ఘుష్టమనునాసికమ్।
కాకస్వరం మూర్థగతం తథా స్థానవివర్జితమ్॥
వీస్వరం విరసం చైవ విక్లిష్టం విషమాపతమ్।
వ్యాకులం తాలహీనం చ గీతిదోషాశ్చతుర్దశ॥
ఆచార్యాసమమిచ్చంతి పదచ్చేదం తు పండితాః।
శ్రియో మధురమిచ్ఛంతి విక్రుష్టమీతరే జనాః।
పద్మపత్రప్రభష్షడ్జ ఋషభశ్శుకపింజరః।
కనకాభస్తు గాంధారో మధ్యమః కుందసన్నిభః॥
పంచమస్తు భవేత్కృష్ణః పీతకం దైవతం విదుః।
నిషాదస్సర్వవర్ణస్స్యాదిత్యేతాస్స్వరవర్ణతాః॥
పంచమో మధ్యమష్టడ్జ ఇత్యేతే బ్రహ్మణా స్మృతాః।
ఋషభో ధైవతశ్చాపీత్యేతే వై క్షత్రియావుభౌ॥
గాంధారశ్చ నిషాదశ్చ వైశ్యావర్ధేన వై స్మృతౌ।
శూద్రత్వం విధినార్ధేన పతితత్వాన్న సంశయః॥
ఋషభో మూర్ఛితవర్జితో దైవతసహితశ్చ పంచమో యత్ర।
నిపతతి మధ్యమరాగే స నిషాదం షాడ్జవం విద్యాత్॥
యది పంచమో విరమతే గాంధారశ్చాంతరస్వరో భవతి।
ఋషభో నిషాదసహితస్తం పంచమమీదృశం విద్యాత్॥
గాంధారస్యాధిపత్యేన నిషాదస్య గతాగతైః।
ధైవతస్య చ దౌర్బల్యాన్మధ్యమ గ్రామ ఉచ్యతే॥
ఈషత్పృష్టో నిషాదస్తు గాంధారశ్చాధికో భవేత్।
ధైవతః కంపితో యత్ర స షడ్జగ్రామ ఈరితః॥
అంతరస్వరపంయుక్త కాకలిర్యత్ర దృశ్యతే।
తం తు సాధారితం విద్యాత్ పంచమస్థం తు కైశికమ్॥
కైశికం భావయిత్వా తు స్వరైస్సర్వైస్సమంతతః।
యస్మాత్తు మధ్యమే న్యాస్తస్మాత్కైశికమధ్యమః॥
కాకలిర్దృశ్యతే యత్ర ప్రాధాన్యం పంచమస్య తు।
కశ్యపః కైశికం ప్రాహ మధ్యమగ్రామసంభవమ్॥
గీతి గేయం విదుః ప్రాజ్ఞా ధేతికారుప్రవాదనమ్।
వేతివాద్యస్య సంజ్ఞేయం గంధర్వస్య ప్రరోచనమ్॥
యస్సామనాం ప్రథమస వేణోర్మధమస్స్వరః।
యో ద్వితీయస్స గాంధారస్తృతీయస్యృషభస్మృతు:॥
చతుర్థషడ్జ ఇత్యాహాః పంచమో దైవతో భవేత్।
షష్ఠో నిషాదో విజ్ఞేయస్సప్తమః పంచమస్మృతః॥
షడ్జం మయూరో వదతి గావో రంభంతి చర్షభమ్।
అజావి కేతు గాంధారం క్రౌంచో వదతి మధ్యమమ్॥
పుష్పసాధారణే కాలే కోకిలా వక్తి పంచమమ్।
ఆశ్వస్తు దైవతం వక్తి నిషాదం నక్తి కుంజరః॥
కంఠాదుత్తిష్ఠతే షడ్జః శిరసస్త్వృషభస్మృతః।
గాంధారస్త్వనునాసిక్య ఉరసో మధ్యమస్వరః॥
ఉరసశ్శిరసః కంఠాదుధ్ధితః పంచమస్వరః।
లలాటాద్ధైవతం విద్యాన్నిషాదం సర్వసంధిజమ్॥
నాసాకంఠమురస్తాలుజిహ్వాదంతాశ్చ సంశ్రితాః।
షడ్ఛ్యస్సంజాయతే యస్మాత్తస్మాత్తడ్జ ఇతి స్మృతః॥
వాయుస్సముత్తితో నాభేః కంఠశీర్షసమాహతః।
నర్దత్యృషభవద్యస్మాత్తస్మాదృషభ ఉచ్యతే॥
వాయుస్సముత్తితో నాభేః కంఠశీర్షసమాహాతః।
వాతి గంధవహః పుణ్యో గాంధార స్తేన హేతునా॥
వాయుస్సముత్తితో నాభేరూరో హృది సమాహతః।
నాభి ప్రాప్తో మధ్యవర్తీ మధ్యమత్వం సమశ్నుతే॥
వాయుస్సముత్తితో నాభేరులో హృత్కంఠకాహతః।
పంచస్థానోత్తిస్యాస్య పంచమత్వం విధీయతే॥
ధైవతం చ నిషాదం చ వర్జయిత్వా తు తావుభౌ।
శేషాన్నంచ స్వరాంస్త్వన్యే పంచస్థానోత్థిత్వాదుః॥
పంచస్థాన స్థితత్వేన సర్వస్థానాని ధార్యతే।
అగ్నిగీతస్వరషడ్డ ఋషభో బ్రహ్మణోచ్యతే॥
సోమేన గీతో గాంధారో విష్ణునా మధ్యమస్వరః।
పంచమస్తు స్వరో గీతస్త్వయోవేతి నిధారయ॥
దైవతశ్చ నిషాదశ్చ గీతౌ తుంబురుణా స్వరౌ।
ఆద్యస్య దైవతం బ్రహ్మ షడ్జస్యాప్యుచ్యతే బుధైః॥
తీక్ష్ణదీప్తప్రకాశత్వాదృషభస్య హుతాశనః।
గావః ప్రణీతే తుష్యంతి గాంధార సేన హేతునా॥
శ్రుత్వా చైవోపతిష్ఠంతి సౌరభేయా న సంశయః।
సోమస్తు పంచమస్యాపి ధైవతం బ్రహ్మరాట్ స్మృతమ్॥
నిద్రోసో యస్య వృద్ధిశ్చ గ్రామమాసాద్య సోమవత్।
అతిసంధీయతే యస్మా దేతాన్పూర్వోత్థితాన్స్వరాన్॥
తస్మాదస్య స్వరస్యాపి ధైవతత్వం విధీయతే।
నిషేదంతి స్వరా యస్మాన్నిషాద స్తేన హేతునా॥
సర్వాశ్చాభిభవత్యేష యదాదిత్యఽస్య దైవతమ్॥
రక్తము, పూర్ణము, అలంకృతము, ప్రసన్నము, వ్యక్తము, వికృష్టము, శ్రేక్షము, సమము సుకుమారము, మధురము అని గానమున పదిగుణములుండును. వేణువీణా స్వరముల ఏకీభావము రక్తమనబడును. స్వరశ్రుతి పూరణము వలన ఛందఃపొదాకర సంయోగము పూర్ణమగును. ఉరోభాగమున శిరోభాగమున, కంఠయుక్తమగుచో అలంకృతమనబడును. గద్గదాది శంకలు లేని దానిని ప్రసన్నమందురు. పదపదార్థ ప్రకృతివికార ఆగమ ఆదేశ కృత్తద్ధిత సమాస ధాతు నిపాత ఉపసర్గ స్వరలింగ వృత్తి వార్తిక విభక్త్వర్ధవచనములను చక్కగా ఉపపొదించుట వ్యక్తమనబడును. పెద్దగా ఉచ్చరించబడి స్పష్టమగు అక్షరములు పదములు కలిగియుండుట విక్రుష్టమనబడును. ద్రుతము, అవిలంబితము ఉచ్ఛనీచ స్థుత సమాహార హేలతాల ఉపనయాదులగు ఉపపాదనలచే కూడియున్నది శ్రేక్షమనబడును. ఆవాస నిర్వాప ప్రదేశములందు ప్రత్యంతర స్థాన సమాగమము సమమనబడును. మృదు పద వర్ల స్వరసాద యుక్తము సుకుమారమనబడును. సమభావముచే కూర్చబడిన లలితపద అక్షర గుణ సమృద్ధము మధురమనబడును. ఇట్లు ఈ పదిగుణములచే కూడియున్న దానిని గానమందురు. ఈ విషయమున కొన్ని శ్లోకములు కలవు.
శంకితము, భీషణము, భీతము, ఉర్దుష్టము, అనునాసికము, కాకస్వరము, మూర్ధగతము, స్థానవివర్జితము, విస్వరము, విరసము, విశిష్టము, విషమాహతము, వ్యాకులము, తాలహీనము, అని గీతమునకు పదునాలుగు "దోషములుండును. ఆచార్యులు సమముగా నుండవలయునని భావింతురు. పండితులు పదచ్ఛేదమును కోరెదరు. స్త్రీలు మధురగుణమును. అభిలషింతురు. ఇతరజనులు విక్రుష్టమును కోరెదరు. (స్పష్టాక్షర పదవత్త్వము) షడ్జము యొక్క వర్ణము పద్మపత్రము వలెనుండును. ఋషభము చిలుక- పచ్చన, గాంధారము కనక వర్ణము. మధ్యమము మల్లె పూవురంగు కలిగియుండును. పంచమము కృష్ణవర్ణము. ధైవతము పీతవర్ణము, నిషాదము సర్వవర్ణసంయుతము. ఇవి స్వరముల వర్ణములు. పంచమ మధ్యమ షడ్జస్వరములు బ్రాహ్మణ జాతివి. ఋషభ ధైవత స్వరములు క్షత్రియములు. గాంధార ' నిషాదములు వైశ్యజాతివి. గాంధార నిషాదములు అర్ద పతితములైనచో శూగ్రజాతికి చెందును. మూర్చ నావర్జితమై దైవత సహితముగా ఋషభ. పంచమములున్నపుడు మధ్యమరాగమున నిపలుంచనచో అదిషడ్జము వలన కలిగిన నిషాదమనబడును. పంచమ స్వరవిరామముతో గాంధారము అంతస్వరముగా నుండి నిషాదసహితమగు ఋషభమును పంచమమని తెలియవలయును. గాంధారస్వరాధీపత్యమున్నచో నిషాద స్వరగమనాగమనములచే ధైవత దౌర్బల్యము వలన నుండునది మధ్యమ గ్రామమనబడును. కొంచెము నిషాద స్పర్శకలిగి, గాంధారము అధికముగానుండి, ధైవత కంపమున్నచో షడ్డగ్రామమగును. అంతర స్వరములతో కాకలి కనబడినచో నది పంచమమగు కైశికమను సాధారణగ్రామమగును. అంతట అన్ని స్వరములచే కైశికమును భావించి మధ్యమమున నుంచినచో నది కైశికమధ్యమమనబడును. కాకలి స్వరముండి కూడా పంచమ ప్రాధాన్యము కలిగియున్నచో మధ్యమ గ్రామసంభవమగు కైశికమని కశ్యపుడు చెప్పెను. గంధర్వ శబ్దములో గకారము గేయమును, ధకారము కారువాదనమును, వకారము వాద్యమును చెప్పును. సామగానము ' చేయువారికి ప్రధమస్వరము వేణువునకు మధ్యమ స్వరమగును. రెండవది గాంధారము, మూడవది ఋషభము, నాలుగవది షడ్జము, అయిదవది ధైవతము, ఆరవది. నిషాదము, ఏడవది పంచమ స్వరము. మయూరము షడ్జమును పలుకును. గోవులు ఋషభమును, మేకలు గొట్టెలు గాంధారమును, క్రౌంచము మధ్యమమును, పూవులు పూయు కాలమున కోకిల పంచమ స్వరమును పలుకును. అశ్వము ధైవతమును, ఏనుగు నిషాదమును పలుకును. షడ్జము కంఠమునుండి వెడలును, శిరస్సు నుండి ఋషభము,గాంధారము అనునాసికము నుండి, ఉరోభాగము నుండి మధ్యమ స్వరము, ఉరోభాగము నుండి, శిరస్సు నుండి కంఠము . నుండి పంచమ స్వరము వెలువడును. లలాటమునుండి దైవతము, సర్వసంధులనుండి నిషాదము వెలువడును. నాసిక, కంఠము, వక్షస్థలము, తాలువు, జిహ్వా, దంతములు అను ఈ ఆరింటినుండి వెలువడును కావున షడ్జస్వరమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠ శీరములచే కొట్టబడి ఋషభమువలె నినదించును కావున ఋషభమందురు. నాభి నుండి పుట్టిన వాయువు కంఠశీర్షములచే కొట్టబడి పవిత్ర వాయువును వదులును కావున గాంధారమందురు. నాభినుండి పుట్టిన వాయువు వక్షస్తలమున హృదయమున కొట్టబడి మరల సౌభిదేశమున చేరి మధ్యవర్తి యగును కావున మధ్యమమనబడును. నాభి నుండి బయలు వెడలిన వాయువు ఉగోహత్కంఠములచే కొట్టబడి పంచస్థానములనుండి వచ్చును. కావున పంచమమనబడును. ధైవత నిషాదములను వదిలి మిగిలిన అయిదు స్వరములు పంచస్థానములనుండి పుట్టిన వేయని తెలియుము. పంచస్థానములలో నుండియే అన్నిస్థానములను ధరించును. షడ్జము అగ్నిచే గానము చేయబడునది. ఋషభమును బ్రహ్మ , గాంధారమును చంద్రుడు, మధ్యమమును విష్ణువు, పంచమమును నీవు (నారదుడు) ధైవత నిషాదములను తుంబురుడు గానము చేయును. షడ్జమునకు అధిదేవత బ్రహ్మ, ఋషభమునకు అగ్ని, గాంధారమున గోవులు, పంచమమునకు చంద్రుడు, ధైవతమునకు బ్రహ్మ అధిదేవతలు. గ్రామమును చేరి చంద్రుని వలే హొస వృద్దులు కలది కావున తనకంటే ముందున్న స్వరములచే సంధానము చేయబడుచున్నది కావున ఈ స్వరమును ధైవతమందురు. అన్నిస్వరములు చేరియుండును. కావున నిషాదమని పేరు. ఈ నిషాదస్వరము అన్నిస్వరములను కప్పివేయును. కావున నిషాదమునకు సూర్యుడు దేవత,
దారవీగాత్రవీణా చ ద్వే వీణే గానజోతిషు॥
సామనీ గాత్రవీణా తు తస్సాస్త్వం శృణు లక్షణమ్।
గాత్రవీనా తు సా ప్రోక్తా యస్యాం గాయంత సామగాః॥
స్వరవ్యంజనసంయుక్తా అంగుల్యంగుష్ఠరంజితా।
హస్తౌ తు సరయతౌ ధార్యౌ జానుభ్యాముపరిస్థితా॥
గురోరనుకృతిం కుర్యా నుదధాన్యాన్యమతిర్భవేత్ ।
ప్రణవం ప్రాక్ప్రయుంజీత వ్యాహృతీస్తదన్తరమ్॥
సావిత్రిం చానువచనం తతో వై గానమారభేత్।
ప్రసార్య చాంగులీస్సర్వా రోపయేత్స్వరమండలమ్॥
న చాంగులీభిరంగుష్ఠమంగుష్ఠేనాంగులీస్పత్।
విరళా నాంగులీ: కుర్యాన్మూలే చైతాం న సంస్పృశేత్॥
అంగుష్టాగ్రేణ తో నిత్యం మధ్యమే పర్వణీ స్పృశేత్।
మాత్రా ద్వీమాత్రవృద్దానాo విభాగార్ధే విభాగవిత్॥
అంగులీభిర్ద్విమాత్రం తు పాణేస్సవ్యస్య దర్శయేత్।
త్రిరేఖా యస్య దృశ్యేత సిద్ధిం తత్ర వినిర్ధి శత్॥
స పర్వ ఇతి విజ్ఞేయ శ్శేషమంతరమంతరమ్।
పర్వాంతరం సామషు చ ఋక్షం కుర్యాత్తి లాంతరమ్॥
స్వరాన్మధ్యమపర్వసు సునివిష్టం నివేశయేత్।
న చాత్ర కంపయేత్కించిత్ అంగస్యావయవం బుధః॥
అధస్తనం మృదం న్యన్య హస్తమాత్రే యథాక్రమమ్।
అభ్రమధ్యే యథా విద్యుత్ దృశ్యతే మణిసూత్రవత్।
పృషచ్ఛేదవివృత్తినాం యథా బాలేషు కర్తరీ।
కూర్మాంగాని చ సంహృత్య చేతో దృష్టిం దిశన్మనః॥
స్వస్థః ప్రశాంతో నిర్బీకో వర్ణానుచ్చారలేద్బుధః।
నాసికాయాస్తు పూర్వేణ హస్తం గోకర్ణవద్దరేత్॥
నివేశ్య దృష్టిం హస్తాగ్రే శాస్త్రార్థమనుచింతయేత్।
సమ్యక్ప్రచారయేద్వాక్యం హస్తేన చ ముఖేన చ॥
యథైవోచ్చారయేద్వర్ణాంస్తథైవైనాం సమాపయేత్।
నాత్యాహన్యాన్న నిర్హణ్యాత్ న ప్రగాయే న్నకంపయేత్॥
సమం సామాని గాయేత వ్యోమ్ని స్వేన గతిర్యణా।
యథా సుచరతాం మార్గో మీనానాం నోపలభ్యతే॥
ఆకాశే వా విహంగానాం తద్వత్స్వరగతా శ్రుతిః।
యథా దధీని సరిస్స్యాత్ కాష్ఠస్థో వా యథానలః॥
ప్రయత్నేనోపలభ్యేత తద్వత్స్వరగతా శ్రుతిః।
స్వరాత్స్వరస్య సంక్రామం స్వరసంధిమనుల్బణమ్॥
అవిచ్ఛిన్నం సమం కుర్యాత్ సూక్ష్మచ్ఛాయా తపోపమమ్।
అనాగతమతిక్రాంతం విచ్ఛిన్నం విషమాహతమ్॥
తన్వంతమస్థితాంతం చ వర్జయేత్కర్షణం బుధః।
స్వరస్థానాచ్చ్యుతో యస్తు స్వం స్థానమతివర్తతే॥
విస్వరం సామగా బ్రూయుర్విరక్తమితి వీణినః।
అభ్యాసార్దే ద్రుతాం వృత్తిం ప్రయేగార్దే తు మధ్యమామ్॥
శిష్యాణాముపదేశార్ధం కుర్యాద్వృత్తం విలంబితామ్।
గృహీతగ్రంథ ఏవం తు గ్రంథొచ్చోరణ శైక్షకాన్॥
హస్తేనాధ్యాపయేచ్చిష్యాన్ శైక్షేణ విధినా ద్విజ:।
క్రుష్టస్య మూర్ధని స్థానం లలాటే ప్రధమస్య తు॥
ధ్రువోర్మధ్యే ద్వితీయస్య తృతీయస్య తు కర్ణయోః।
కంఠస్థానం చతుర్ధస్య మంద్రస్య రసనోచ్యతే॥
అతిస్వరస్య నీచస్య హృది స్థానం విధీయతే।
అంగుష్ఠస్యోత్తమే క్రుష్టో హ్యంగుష్ఠం ప్రధమస్స్వరః॥
ప్రదేశిన్యాం తు గాంధార ఋషభస్తదనంతరమ్।
అనామికాయాం షడ్జస్తు కనిష్టాయాం తు దైవతః॥
తస్యాధస్తాచ్చ యోఽన్యాస్తు నిషాదం తత్ర నిర్ది శేత్ ।
అపర్వత్వాదమధ్యత్వాదవ్యయత్వాచ్చ నిత్యశః॥
మంద్రో హి మందీభూతస్తు పరిస్వార ఇతి స్మృతః।
క్రుష్టేన దేవా జీవన్తి ప్రథమేన తు మానుషాః॥
పశవస్తు ద్వితీయేన గంధర్వాపురసస్త్వను।
అండజాః పితర శ్చైవ చతుర్థస్వరజీవినః॥
మంద్రత్వేనోపజీవన్తి పిశాచాసురరాక్షసా।
అతిస్వరేణ నీచేత జగత్థ్సావరజంగమాః॥
సర్వాణి ఖలు భూతాని ధార్యంతే సామికైస్స్వరైః।
దీప్తాయతా కరుణానాం మృదుమధ్యమయోస్తథా॥
శ్రుతీనాం యోఽవిశేషజ్ఞో న స ఆచార్య ఉచ్యతే।
దీప్తా మంద్రే ద్వితీయే చ ప్రచతుర్దే తథైవ చ॥
అతిస్వరే తృతీయే చ క్రుష్టే తు కరుణా శ్రుతిః।
శ్రుతయో యా ద్వితీయస్య మృదుమధ్యాయతాస్స్మతాః॥
తాసామపి తు వక్ష్యామి లక్షణాని పృథక్ పృథక్।
ఆయతాత్వం భవేన్నీచే మృదుతా తు విపర్యయే॥
స్వరే స్వరే మధ్యమాత్వం తత్సమీక్ష్య ప్రయోజయేత్।
ద్వీతీయే విరతా యా తు క్రుష్టశ్చ పరతో భవేత్॥
దీప్తాం తాం తు విజానీయాత్ ప్రాధమ్యేన మృదుస్స్మృత।
ఆత్రైవ విరతా యా తు చతుర్ధేన ప్రవర్తతే॥
తథా మంద్రే భవేద్దీప్తా సామ్న శ్చైవ సమాపనే।
నాతితారశ్రుతిం కుర్యాత్ స్వరయోర్నా పి చాంతరే॥
తం చ హ్రస్వే చ దీర్ఘే చ న చాపి ఘటిసంజ్ఞకే।
ద్వివిధా గతిః పదాంత స్థితసంధిస్సహొష్మభిః॥
స్థానేషు పంచ స్వేతేషు విజ్ఞేయం ఘుటిసంజ్ఞకమ్।
స్వరాంతరావిరతాని హ్రస్వదీర్ఘఘుటాని చ॥
స్థితిస్థానేప్వ శేషాణి శ్రుతివత్స్వరతో వదేత్।
దీప్తాముదాత్తే జానీయాత్ దీప్తాం చ సరితే విదుః॥
అనుదాత్తే మృదుర్జేయా గంధర్వాశ్శ్రుసంపదే।
ఉదాత్త శ్చానుదాత్తశ్చ స్వరితప్రచితే తథా॥
నిఘాతశ్చేతి విజ్ఞేయస్వరభేదశ్చ సంచథా।
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి ఆచికస్య స్వరత్రయమ్॥
గానజాతులలో దారవీ గాత్రవీణ యని రెండు వీణలుండును. సామగానమును చేయునది గాత్రవీణయందురు. ఆ గాత్రవీణలక్షణమును చెప్పెదను వినుము. సామగానము చేయువారు దేనియందు గానము చేతురో దానిని గాత్రవీణయందురు. స్వరవంజనములతో కూడినదై అంగుళులచే అంగుష్ఠముచే రంజితమై జానువుల పై హస్తములను కలిపి ఉంచవలయును. గురువును అనుకరించవలయును. లేనిచో భిన్నమతి యగును. మొదట ప్రణవమును ప్రయోగించవలయును. తరువాత భూః, భువః, సువః అను వ్యాహృతులను ప్రయోగించవలయును. తరువాత సావిత్రీమంత్రమును ప్రయోగించవలయును. అపుడు గానము నాగంభించవలయును. అన్ని అంగుళులను చాచి స్వరమండలమును ఆరోపించవలయును. ఇతరాంగుళులతో అంగుష్ఠమును, అంగుష్ఠముతో ఇతరొంగుళులను స్పృశించరాదు. అంగుళులను ఎక్కువ వ్యవధానమునుంచరాదు.అంగుళుల మూలమును స్పృశించరాదు. అంగుషాగ్రముతో మధ్యమ పర్వను (రేఖను) స్పశించవలయును. విభాగమును చక్కగా తెలిసిన వారు ఏకమాత్ర ద్వీమాత్రావిభాగమును తెలుపుటకు అట్లు మధ్యమ పర్వను స్పృశించవలయును. వామహస్తముయొక్క అంగుళులతో ద్విమాత్రాస్థితిని తెలుపవలయును. మూడు రేఖలున్న ప్రదేశమున స్వర సిద్ధిని చూపవలయును. ఆత్రి రేఖలున్న ప్రదేశమునే పర్వయందురు. మిగిలిన భాగము మధ్య భాగమందురు. సామవేదమున పర్వాంతరమును ఋగ్వేదమున తీలాంతరము నోచరించవలయును. మధ్యమ పర్వం యందు స్వరములను చక్కగా నిచేశించవలయును. ఈ విషయము ఏ శరీరావయవమును కొంచెము కూడా కదిలించరాదు. క్రిందమ్సత్తు నుంచి హస్తమాత్రమున యథాక్రమముగా మేఘముల మధ్యన మణీసూత్రము వలె నుండు మెరపు వలె ప్పషచ్ఛేద వివృత్తులకు బాలులలో కర్తరీవలే, తాబేలు తన అవయవములను తనలో దాచుకొనినట్లు అన్ని వ్యాపారములను మాని మనసును నిలుపవలయును. స్వస్తుడై ప్రశాంతుడై భయము లేనివాడై జ్ఞాని వర్ణములనుచర్చంచవలయును. నాసిక యొక్క పూర్వభాగమున గోకర్ణము వలె హస్తమునుంచవలయును. హస్తాగ్రమున దృష్టినుంచి శాస్త్రార్థమును చింతన చేయవలయును. హస్తముతో నోటితో చక్కగా వాక్యమును పలుకవలయును. వర్ణములనుచ్చరించుట సమాప్తిగావించుట ఒకే విధముగా చేయవలయును. ఎక్కువగా తక్కువగా రాగ ప్రస్తారము చేయరాదు. ఎక్కువగా ఉచ్చస్వరముతో గానము చేయరాదు. శరీరావయవములను స్వరములను కంపన చేయరాదు. ఆకాశమున వాయుస్థితివలె సామమును సమమగా గానము చేయవలయును. జలములో చక్కగా సంచరించుచున్ననూ మీనముల అడుగుల జాడ కనపడదో, ఆకాశమున విహరించుచున్ననూ పక్షుల పాద చిహ్నములు స్పష్టముగా తెలియవో అట్ల స్వరములో శ్రుతి ఉండి లేనట్లుండవలయును. పెరుగులోని నేతిని, కాష్ఠములోని అగ్నిని ప్రయత్నముచే పొందునట్లు స్వరములోని శ్రుతిని ప్రయత్నముచే తెలియవలయును. ఒక స్వరమునుండి మరొక స్వర సంక్రమమును స్వర సంధిని ఎదుటి వారిని కోభింపచేయక, విచ్చిత్తి కలుగనీయక కొద్దినీడతో కూడిన ఎండవలె సమముగా చేయవలయును. అనాగతము, అతిక్రాంతము, విచ్చిన్నము, విషమాపతము, సూక్తాంతము, అంతములేకుండుటను కర్షణమును పండితుడు వర్షించవలయును. స్థానము నుండి చ్యుతమైన స్వరము తన స్థానమునతిక్రమించినచో సామగాన మును చేయువారు విస్వరమందురు. వీణాగానము చేయువారు విరక్తమందురు. అభ్యాసము కొఱకు ద్రుత వృత్తిని, ప్రయోగము కొలుకు మధ్యమావృత్తిని, శిష్యోపదేశము కొఱకు విలంబిత వృత్తినాశ్రయించ వలయును. గ్రంథమును గ్రహించి గ్రంథమునుచ్చరించుట నేర్చుకొను వారికి శిక్షావిధిననుసరించి హస్తముతో అధ్యాపనమును చేయవలయును. క్రుష్టస్వరమునకు స్థానము మూర్ద. ప్రధమ స్థానము లలాటము ద్వితీయమునకు స్థానము భూమధ్యము. తృతీయమునకు స్థానము కర్ణములు. చతుర్ధస్థానము కంఠము. మంద్రమునకు స్థానము రసన (నాలుక) అతిస్వరము నీచ స్వరమునకు హృదయము స్థానము. అంగుషోత్తమ భాగమున క్రుష్టస్వరమును, అంగుష్ఠమున , ప్రధమస్వరమును, ప్రదేశిని యందు గాంధారమును, దాది తరువాత ఋషభమును, అనామిక యందు షడ్జమును, కనిష్ఠయందు ధైవతమును కనిషము క్రింది భామున నిషాదమును చూపవలయును. పర్వలు లేకుండుటచే, మధ్యములేకుండుటచే, వ్యయములేకుండుటచే ఎపుడూ మందీ భూతముగానుండు మంద్రము పరిస్వారమనబడును. క్రుష్టస్వరముచే దేవతలు, ప్రథమముచే మనుష్యులు, ద్వితీయముచే పశువులు, తృతీయముచే గంధర్వాప్సరసలు, పక్షులు పితృదేవతలు నాలుగవస్వరముచే, పిశాచ అసుర రాక్షసులు మంద్రస్వరముచే, అతిస్వరముచే నీచముచే స్థావరజంగమాత్మకమగు ప్రపంచము జీవించుచున్నది. సామిక స్వరముతో అన్ని ప్రాణులు తమ ప్రాణములను నిలుపుకొనుచున్నవి. దీప్తాయత కరుణము, మధుమధ్యమముల శ్రుతుల విశేషములను తెలియనిపోడు ఆచార్యుడనబడడు. దీప్త శ్రుతిని మంద్రమున ద్వితీయమున చతుర్ధమున, అతి స్వరమున, తృతీయమున ప్రయోగించవలయును. క్రుష్టస్వరమున కరుణశ్రుతిని ప్రయోగించవలయును. ద్వితీయమునకు మృదుమధ్య ఆయత శ్రుతులను ప్రయోగించవలయును. ఆ శ్రుతుల లక్షణములను కూడా విడివిడిగా చెప్పేదను వినుము. నీచమున ఆయత శ్రుతి, ఉచ్ఛలో మదుశ్రుతి స్వీయస్వరమున మధ్యమ శ్రుతిని చక్కగా విచారించి ప్రయోగించవలయును. ద్వితీయమున వినతమైనది, పరమున క్రుష్టమైగును. మొదట మృదువుగా నుండి వీరతమై చతుర్థస్వరమున ప్రవర్తించునది, మంద్రమున ప్రయోగించునదీ, సామసమాప్తిలో ఉపయోగించునది దీప్త శ్రుతీయని తెలియవలయును. స్వరముల మధ్యన తార శ్రుతిని ప్రయోగించరాదు. ఊష్మలతో (శషసహ) పదాంత స్థిత సంధికి రెండు గతులుండును. ఈ అయిదు స్థానములను ఘుటి యని యందురు. స్వరాంతరావిరతములు హ్రస్వదీర్ఘ ఘటికలు అను శ్రుతి స్థానములలో శ్రుతులవలెను స్వరములను చెప్పవలయును. ఉదాత్త స్వరిత స్వరములలో దీపాశ్రుతిని, అనుదోత్తమున మృదుశ్రుతిని ప్రయోగించవలయును. శ్రుతి సంపదలో గంధర్వులు నిష్ణాతులు. ఉదాత్తము అనుదాత్తము, స్వరితము, ప్రచితము నిఘాతము అని స్వరభేదములు అయిదు విధములు. ఇకనిప్పుడు ఆచిక స్వరత్రయమును చెప్పెదను. వినుము.
ఉదాత్తశ్చానుదాత్తశ్చ తృతీయస్స్వరితస్స్వరః।
య ఏవోదాత్త ఇత్యుక్తస్స ఏవ స్వరితాత్పరః॥
ప్రచయఃప్రోచ్యతేతజ్ జ్ఞైర్న చిత్రాన్యత్స్వరాంతరమ్।
వర్ణస్వరోఽతీతప్వరస్వరితో ద్వివిధస్స్మృతః॥
మాత్రికో వర్ణ ఏవం తు దీర్ఘస్తూచ్చారితాదను।
స తు సప్తవిధో జ్ఞేయస్స్వరః ప్రత్యయదర్శనాత్॥
పదేన తు స విజ్ఞేయో భవేద్యో యత్ర యాదృశ।
సప్త స్వరాన్ప్రయుంజీత దక్షిణం శ్రవణం ప్రతి॥
ఆచార్యెర్వి హితం శాస్త్రం పుత్రశీష్యహితైషిభిః।
ఉచ్చాదుచ్చుతరం నాస్తి నీచాన్నీ చతరం తథా॥
వైష్వర్యస్వారసంజ్ఞాయాం కింస్థానస్వర ఉచ్యతే।
ఉచ్ఛనీచస్య యన్మధ్యే సాధారణమితి శ్రుతి॥
తం స్వారం స్వారసంజ్ఞాయా ప్రతిజానంతి శైక్షి కాః।
ఉదాత్తే నిషాదగాంధారావనుదాత్తే ఋషభదైవతా॥
స్వరితప్రభవా హ్యేతే షడ్జమధ్యమపంచమాః।
యత్ర కఖపరా ఊష్మా జిహ్వా మూలప్రయోజనాః॥
తానప్యాజ్ఞాపయేన్మాత్రా ప్రకృత్యైవ తు సా కలా జాత్యఃక్షైపోఽభినిహిత స్త్రవ్యంజనఏవచ॥
తిరో విరామః ప్రశ్లిష్టోఽపాదవృత్తశ్చ సప్తమః।
స్వరాణామహమేతేషాం పృథగక్ష్వామి లక్షణమ్॥
ఉద్దిష్టానాం తథాన్యాయముదాహరణమేవ చ।
సపకారం సవం వాపి హ్యకరం స్వరితం భవేత్॥
న చోదాత్తం పురో యస్య జాత్యస్వారస్స ఉచ్యతే।
ఇఉవర్ణౌ యదోదాత్తా వాపద్యేతే పవౌ క్వచిత్॥
అనుదాత్తం ప్రత్యయే తు విద్యాత్కేప్రస్య లక్షణమ్।
ఏ ఓ ఆభ్యాముదాత్తాభ్యామకారో నిహితశ్చయః॥
ఆకారో యత్ర లుంపతి తనభినిహితం విదుః।
ఉదాత్తపూర్వే యత్కించిచ్ఛంద సీ స్వరితం భవేత్॥
ఏష సర్వబహుస్వార స్తైరవ్యంజన ఉచ్యతే।
అవగ్రహాత్పరం యత్ర స్వరితం స్యాదనన్తరమ్॥
తిరో విరామం తం విద్యాదుదాత్తో యద్యవగ్రహః।
ఇకారం యత్ర పశ్యేయురికారేణైవ సంయుతమ్॥
ఉదాత్తమనుదాత్తేన ప్రశ్లిష్టం తం విచారయ।
స్వరే చేత్స్వరితం యత్ర వివృతా యత్ర సంహితా॥
ఏతత్పాదాంతవృత్తస్య లక్షణం శాస్త్రనోదీతమ్।
తాన్యస్వారస్సజాత్యేన శ్రుత్యగ్రే క్షైప్ర ఉచ్యతే॥
తేమన్వతాభినిహిత స్తైరవ్యం జన ఊతయే।
తిరో విరామో విష్కషితే ప్రశ్లిష్టో హీ ఈ గో వర్ణ॥
పాదవృత్త: కందనిదే స్వరాస్సప్తైవమాదయః।
ఉచ్చాదేకాక్షరోత్పూర్వాత్స్వరం యద్యదిహాక్షరమ్॥
స్వారాణాం జాత్యవర్జానాం ఏషా ప్రకృతిరుచ్యతే।
చత్వారస్త్వాదితస్స్వారా కం షం పు శ్ఫుతి శాస్త్రతః॥
ఉదాత్తే చైకనీ చేవా జుహ్వోఽగ్నిస్తన్నిదర్శనమ్।
ఇకారాంతే పదే పూర్వం ఉకారో పరత స్థితే॥
హ్రస్వం కంపం విజానీయాన్మేధావీ నాత్ర సంశయః।
ఇకారాంతే పదే చైవోకారద్వయం పరే పదే॥
దీర్ఘం కంపం విజానీయాత్ శాగ్ధూష్వితి నిదర్శనమ్।
త్రయో దీర్ఘాస్తు విజ్ఞేయా యే చ సంధ్యక్ష రేషు వై॥
మన్యా యధా న ఇంద్రాభ్యాం శేషా హ్రస్వాః ప్రకీర్తితాః।
అనేకానాముదాత్తానామనుదాత్తః ప్రత్యయో యది॥
శివకంపం విజానీయాత్ ఉదాత్తః ప్రత్యయో యది।
యత్ర ద్విప్రభృతిని స్యురుదాత్తాన్యక్షరాణి తు॥
నీచం వొచ్చం చ పరతస్తత్రోదాత్తం విదుర్బుధాః।
న రేఫే వా హాకారే వా ద్వీర్భావో జాయతే క్వచిత్॥
న చ వర్గద్వితీయేషు న చతుర్దే కదాచన।
చతుర్థం తు తృతీయేన ద్వితీయః ప్రథమేన తు॥
ఆద్యమంత్యం చ మధ్యం చ స్వారాక్ష రేణ పీడయేత్।
అనన్త్యశ్చ భవేత్పూర్వో హ్యాంతశ్చ పరతో యది॥
తత్ర మధ్యే యమస్తి ష్ఠేత్ పవర్ణః పూర్వవర్ణయోః।
వర్గాంత్యాన్నష సైస్సార్థమంత స్థైర్వాపీ సంయుతాన్॥
దృష్ట్వా యమాని వర్తంతే అదేశికమివాధ్వగాః।
తృతీయశ్చ చతుర్థశ్చ చతుర్ధాదిపరం పదమ్॥
ద్వౌ తృతీయౌ హకార శ్చ హకారాది పరం పదమ్।
అనుస్వారోపధామూలా తాన్క్వచిత్క్రమత: పరమ్॥
రహపూర్వసంయుతం చాప్యుత్తరం క్రమతోఽక్షరమ్।
సంయోగో యత్ర దృశ్యేత వ్యంజనం విరతే పదే॥
పూర్వాంగమాదితః కృత్వా పరాంగోదౌ నివేశయేత్।
సంయోగే స్వరితం యత్ర ఉద్వోతః ప్రతనం యథా॥
పూర్వాంగం తద్విజానీయాద్యేనారంభః పరం హి తత్।
సంయోగాత్తు విజానీయాత్ పరం సంయోగనాయకమ్॥
సంయుక్తస్య తు వర్ణస్య తత్పరం పూర్వనుక్షరమ్।
అనుస్వరః పదాంతశ్చ క్రమజం ప్రత్యయే స్వ కే॥
స్వరభక్తిస్తథా రేఫః పూర్వపూర్వాంగముచ్యతే।
పాదాదౌ చాపాదాదౌ చ సంయోగావగ్రహేషు చ॥
య శబ్ద ఇతి విజ్ఞేయో యోఽ న్యస య ఇతి స్మృతః।
పాదాచావప్యవిచ్ఛేదే సంయోగాన్తే చ తిష్ఠతామ్॥
వర్జయిత్వా రహపాణాముపాదేశః ప్రదృశ్యతే।
స్వసంయుక్తో గురుర్జ్ఞేయస్సానుస్వరాగ్రమ స్ఫుటః॥
అణుశేషే హ్రిగో వాపి యుగళాదిరవిస్ఫుట॥
యదుదాత్తముదాత్తం తద్యత్స్వరితం తత్పదే భవతి।
యన్నీ చం నీచమేవ తద్యత్ప్రచయస్థం తదపి నీచమ్॥
అగ్నిస్సుతో మిత్రమిదం తథా వయమయా వహాః।
ప్రియం దూతం ఘృతం చిత్తమతిశబ్దస్తు నీచతః॥
అక్వే ష్వేవ సుతే ష్వేవ యజ్ఞేషు కల శేషు చ।
శతేషు పపవిత్రేషు నీచాదుచ్చార్యతి శ్రుతిః॥
హారివరణవరేణ్యేషు ధారాపురు షేషు స్వరిత రేఫః।
విశ్వానరో నకారశ్చ శేషాస్తు స్వరితో నరాః॥
ద్వౌవరుణౌ వ స్వరత ఉదుత్తమత్త్వం వరుణధారా చౌరుధారా।
మురుధారా స్వ దోహతే॥
మాత్రికం వా ద్వీమాత్రం వా స్వర్యతే యదిహాక్షరమ్।
తస్యాదితోఽర్థమాత్రం వై శేషం తు పరతో భవేత్॥
అదీర్ఘం దీర్ఘవత్కుర్యాత్ ద్వీస్వరం యత్ప్రయుజ్యతే।
కంపోత్స్వంతాభిగీతం హ్రస్వకర్షణమేవ చ ॥
నిమేషకాలో మాత్రా స్యాద్విద్యుత్కాలేతి చాపరే।
ఋక్స్వరా తుల్యయోగా వా కైశ్చిదేవముదీర్యతే॥
సమా సేఽవగ్రహం కుర్యాత్ పదం చాత్రానుసంహితమ్।
యే తీక్షరాదికరణం పదాంత స్యేతి తం విదుః॥
సర్వత్ర మిత్రపుత్రసఖశబ్దా అహీశతక్రతౌరవగ్రాహ్యాః।
ఆదిత్యవిప్రజాతవేదాశ్చ సత్పతిగోపతివృత్రహా సముద్రాశ్చ॥
స్వరయుపువో దేవయవశ్చారితం దేవతాత పే।
చికితిశ్చథ చైవ నావగృహ్ణంతి పండితాః॥
వీవృతయశ్చతస్రో వా విజ్ఞేయా ఇతి మే మతమ్।
ఆక్షరాణాం నియో గేన తాసాం నామాని మే శృణు॥
ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు స్వరములు ఉదాత్తమనునదే స్వరితము కంటే పరముగా నుండును. స్వంతము కంటే పరముగానున్న ఉదాత్తమును ప్రచయమందురు. ఇచట ఇంకొక స్వరముండదు. వర్ణస్వరము, అతీత స్వరము అని స్వరితము రెండు విధములు. మాత్రాస్వరము వర్ణస్వరము, దీర్ఘము అతీత స్వరమనబడును. ఈ స్వరము ప్రత్యయముననుసరించి ఏడు విధములగును. యెచట ఏ స్వరముండునో పదమును అనుసరి" తెలియవలయును. సమర్థుడగు శ్రోతకు ఏడు స్వరములను ప్రయోగించవలయును. పుత్రుల శిష్యల హితమును కోరిన ఆచార్యులు శాస్త్రమునేర్పచిరి. ఉచ్చమునకం ఓ ఉచ్చతరము, నీచముకంటే నీచతరము లేదు. వైస్వర్యమున స్వారమున ఏస్థానమును స్వరముగా పలుకవలయునో తెలియును. ఉచ్ఛనీచముల మధ్యమున నున్న దానిని సాధారణమందురు. గానశాస్త్ర శిక్షకులు స్వార సంజ్ఞలో ఈ సాధారణమునే స్వారమనీ యందురు. ఉదాత్తస్వరము నిషాదగాంధారములను అనుదాత్త స్వరమున ఋషభదైవతములను ప్రయోగించవలయును. షడ్గమధ్యమ ధైవతములు స్వరితము నుండి పుట్టినవి. జిహ్వామూల ప్రయోజనములుగాగల కఖలు పరముగానున్న శషసహలను కూడా మాత్రా ప్రకృతి చేతనే ప్రయోగించవలయును. దానినే కల యందురు. జాత్యము, కైప్రము, అభినిహితము, అవ్యంజనము, తిరోవిరామము, ప్రశిష్టము, అపొదవృత్తము అని మరియొక ఏడు స్వరములు గలవు. ఈ స్వరముల లక్షణములను విడిగా చెప్పెదను. ఈ స్వరములను ప్రయోగించు ఉద్దేశ్యములను ఉదాహరణములను కూడా చెప్పెదను. సకారముతో కొని వకారముతో కాని కూడియున్న యకరము స్వరితమగును. ముందు ఉదాత్తము లేనిచో జాత్యస్వారమందురు. ఇకార ఉకారములు ఉదాత్తములుగా నున్నను కొన్ని చోట్ల పకారవకారములు అనుదాత్త స్వరముకల ప్రత్యయము పరముగా నున్ననూ కైప్రస్వరమని తెలియవలయును. ఉదాత్తములైన ఏకార ఓకారములచే ఆకారము నుదాత్తమగుచో అకారము లోపించినపుడు అభినిహిత స్వరమందురు. ఉదాత్తపూర్వమగు ఏదో ఒక చంధస్సున స్వరితమొచ్చినచో, సర్వస్వరితములు కలది కూడా అవ్యంజన స్వరమనబడును. అవగ్రహము తరువాత స్వరితమున్న చో ఉదాత్తము అవగ్రహమైనచో తిరోవిరామమగును. ఇకారముచే ఇకారము కలిసియున్నచో ఉదాత్తము అనుదాత్తము చే కూడిన ప్రక్లిష్ట మగును, స్వరిత స్వరమున సంహిత వివృతమైనచో పొదాత వృత్తముగా తెలియవలయును. తానస్వరము జాత్యముచే శ్రుత్యగమున కలిసియున్నచో కైప్రమనబడును. అవియే అభినిహితమైనచో అవ్యంజనమనబడును. విష్కషితమున తిరోవిరామమగును. హీ ఈగో వర్ణములు ప్రశిష్టములనబడును. పాదవృత్తమున ఈ యేడు స్వరములను తెలియవలయును. ఉచ్చమగు ఒక అక్షరమునకంటే పూర్వమున స్వరము గలిగి యుండుట జాత్యవర్జితములగు స్వరములకిట్లుండుట స్వభావము. మొదట నాలుగు స్వారములుండును. కం, షం, పుం, స్సు అనునవి.ఉదాత్తమున ఒక నీచ స్వరమున అగ్ని హోమము దృష్టాంతము. మొదట ఇకారాంతమగు పదముండి పరమున ఉకారమున్నచో దానిని హ్రస్వకంపమని తెలియవలయును. ఇకారాంత పదమన పరమున ఉకార ద్వయమున్న చో దీర్ఘకంపమని తెలియవలయును. సంధ్యక్షరములలో మూడు దీర్ఘములుండును. మిగిలినవి హ్రస్వములుండును. న ఇంద్రభ్యాం అనునపుడు మూడు దీర్ఘములున్నవి. మిగిలినవి హ్రస్వములు. అనేకోదాత్తములగు అనుదాత్త ప్రత్యయమున్నచో శివకంపమని తెలియవలయును. రెండుకంటే ఎక్కువ ఉదాత్తక్షరములకు నీచము కాని ఉచ్చముకొని పరమగునపుడు అచట ఉదాత్తమునే చెప్పుకొనవలయును. రేఫయందు హకారమునందు ఎప్పుడూ ద్విత్వము రాదు. వర్గద్వితీయ వర్ణములందు వగ్గ చతుర్ధ వర్ణములందు కూడా ద్విత్వము రాదు. చతుర్థమును తృతీయముతో, ద్వితీయమును ప్రథమముతో కలిసియున్నపుడు ఆదిమద్య అంత్యవర్ణములను స్వరాక్షరముచే పీడించవలయును. అనన్యము పూర్వమున అంత్యము పరమున నున్నచో ఆ రెంటి మధ్యన నున్నదానిని యమమందురు. ఈ యమము పూర్వవర్ణముతో సవర్ణమగును. శషశలతో కాని యరలవలతో కాని వర్గాంత్యములచే కలిసి యున్నచో పరదేశమును బాటసారులు విడిచునట్లు యమములు నివర్తించును. తృతీయ వర్ణము చతుర్ధ వర్ణము . చతుర్దాది వర్ణములు పరముగా గలదిగా యున్నచో పదమగును. రెండు తృతీయ వర్ణములు హకారము హకారపరముగా నున్నచో పదమగును. ఈ పదములు అనుస్వారోపధామూలములుగా క్రమముగా పరములగును. పూర్వము రేఫహకారములతో సంయుతమైనచో క్రమముగా ఉత్తరాక్షరములుగానుండును. పదాంతమున సంయోగ మున్నచో అంత్యమున వ్యంజనముండును. మొదట ఆగమాదులను చేయవలయును. పరాంగమునందు ఆగమమును నివేశించవలయును. సంయోగమున స్వరితమున్న చోట ఉద్ఘాతముగాని ప్రతనము కాని ఉన్న చో దానిని పూర్వాంగమని తెలియవలయును. ఆరంభించునది పరమగును. సంయోగమునకు పరముగానున్న దీనిని సంయోగసాగుకమందురు. సంయుక్తవర్ణమును పరమున పూర్వమున నున్న అక్షరము పదోంతరమగు అనుస్వరము స్వప్రత్యయమున క్రమజమందురు. స్వరభక్తి రేఫ పూర్వాంగమగును. పాదాది యందు ఆపాదాదియందు సంయోగమునందు అవగ్రహమునందు. యశబ్దముగా తెలియుము. ఇతరము సయమగును. పొదొదిలో విచ్ఛిత్తి కలుగనిచో సంయోగాంతమున నున్న రేఫహకార పకారములను వదిలి ఉపదేశము కనపడును. సంయుక్తమైన వర్ణము అనుస్వరయుక్త మగు వర్ణము గురువగును. దీనినే స్పుటమందురు. ప్రస్వ శేషము గో వర్ణములు యుగళాదులు అవిస్పోటమందురు. ఆ పదముననున్న ఉదాత్తము స్వరితము ఉదాత్తముగా స్వరితముగానే యుండును. నీచము నీచముగానే యుండును. ప్రచయస్థము కూడా నీచమే యగును. అగ్ని, సుత, మిత్ర " శబ్దములు ప్రియ, దూత, ఘృత చిత్త మతి శబ్దములలో నీచ స్వరముండును. అక్కసుత యజ్ఞ కలశ, శత పవిత్ర శబ్దములలో నీచ స్వరము నుండి ఉచ్చారణ ప్రారంభించవలయును. హారివరుణ వరేణ్య ధారా పురుష శబ్దములలోని రేఫ స్వలితమగును. విశ్వానర శబ్దమున నకారము, ఇతర శబ్దములలో నకార రేఫలు స్వరితములగును. వరుణ శబ్దమున వకారము నుండి రెండు వర్ణములు స్వరితములుండును. వరుణ ధారాశబ్దము ఉదాత్తమగును. ఇట్ల ఉరుధార ఓరుధారా శబ్దములలో తెలియవలయును. ఈ శబ్దములలో ఏకమాత్రికము, ద్విమాత్రికము స్వరితమగుచో మొదటిసగము ఉదాత్తమగును.మిగిలినది అనుదాత్తమగును. రెండుస్వరములు ప్రయోగించబడినచో దీర్ఘము కాని దానిని కూడా దీర్ఘముగా చేయవలయును. స్వరితమును కంపము చేయవలయును. హ్రస్వమును కరణము చేయవలయును. మాత్రయనగా నిమేషకాలము లేదా, విద్యుత్కాలము అని తెలియవలయును. ఋక్స్వరములు కూడా ఇట్లే యుండునని కొందరు చెప్పెదరు. సమాసమున అవగ్రహమును (సంధి - విచ్ఛేదమును) చేయవలయును. పదమును అనుసంహితముగా పలుకవలయును. మిత్రపుత్ర సఖి శబ్దములు, అహి శత క్రతు శబ్దములు అవగ్రహములు కలవి. ఆదిత్య, విప్ర, జాత వేద, సత్పతి, గోపతి వృత్రహ సముద్ర శబ్దములు స్వరయుతములు. చికితములు ధకారము అవగ్రహములు కావు. ఇచట నాలుగు వివృతులుండునని నా అభిప్రాయము. ఈ వివృతులు అక్షరనియోగముచే ఏర్పడును. ఈ వివృతుల పేర్లను చేప్పెదను వినుము.
హ్రస్వాదివత్సానుసృతా వత్సానుసారిణీ చాగ్రే॥
పాకవత్యుభయోర్ర్హుస్వా దీర్ఘా వృద్దా పిపీలికాః।
చతసృణాం వివృతీనాం అంతరం మాత్రికం భవేత్॥
ఆర్ధమాత్రికమన్యేషాం అన్యేషామణుమాత్రికమ్॥
ఆపద్యతే మకారో రేఫోష్మాసు ప్రత్యయేఽప్యనుస్వారమ్।
పవేషు పరసవర్ణం స్పర్శేషు చోత్తమా పతిమ్॥
నకారాంతే పదే పూర్వే సరే చ పరతస్థితే।
అకారం రక్తమిత్యాహుస్తకారేణ తు రజ్యతే॥
నకారాంతే పదే పూర్వే వ్యంజనైశ్చ యవో హిషు
అర్ధమాత్రా తు పూర్వస్య రజ్యతే త్వణు మాత్రయా॥
నకారస్వరసంయుక్తశ్చతుర్యుక్తా విధీయతే।
రేఫో రంగశ్చ లోపశ్చ సానుస్వారోఽపి వాక్వచిత్॥
హృదయాదుత్తిష్ఠతే రంగః కాంస్యేన తు సమన్వితః।
మృదు శ్చైవ ద్విమాత్రశ్చ దధన్వామితి నిదర్శనమ్॥
యథా సౌరాష్ట్ర కా నారీ అరామిత్యభిభాషతే।
ఏవం రంగః ప్రయోక్తవ్యో నారదైతన్మతం మమ॥
స్వరా గడదబా శ్చైవ జణనమాస్సహొష్మభిః।
చతుర్ణాం పదజాతీనాం పదాంతో దశ కీర్తితాః॥
స్వర ఉచ్చస్స్వరో నీచస్స్వరస్స్వరిత ఏవ చ।
వ్యంజనా న తు వర్తన్తే యత్ర తిష్ఠతి స స్వరః॥
స్వర ప్రధానం త్రైస్వర్యం ఆచార్యాః ప్రతిజానతే।
మణివద్వ్యంజనం విద్యాత్ సూత్రవచ్చ స్వరం విదుః॥
దుర్భలస్య యథా రాష్ట్రం హరతే బలవన్నృపః।
దుర్బలం వ్యంజనం తద్వత్ హరతే బలవాన్స్వరః॥
ఉభావశ్చ వివృత్తిశ్చ॥ శషసా రేఫ ఏవ చ।
జిహ్వామూలముపధ్మా చ గతిరష్టవిధోష్మణః॥
స్వరప్రత్యయా వివృతిః సంహితాయాం తు యా భవేత్।
విపరస్తత్ర మంతవ్యస్తాలవ్యశ్చాత్ర జాయతే॥
సంధ్యక్షరే పరే సంధౌ ప్రాప్తలుప్తా యవౌ యది।
వ్యంజనాఖ్యా వివృత్తిస్తు స్వరాభ్యా ప్రతిసంహితా॥
ఊష్మాంతే విరతే యత్ర సంభావో భవతి క్వచిత్।
వివృత్తిర్యా భవేత్తత్ర స్వరాభ్యాం తాం వినిర్దిశత్॥
యద్యోభావప్రసంధానముకారాదిపరం పదమ్।
స్వరాంతం తాదృశం విద్యాత్ యదన్యద్వ్యక్తమూష్మణః॥
ప్రథమా ఉత్తమాశ్చైవ పదాంతేషు యది స్థితాః।
ద్వితీయo స్థానమాపన్నా: శషసప్రత్యయా యది॥
ప్రథామానూష్మ సంయుక్తాన్ ద్వితీయానివ దర్శయేత్।
న చైతన్ప్రాతిజానీయాత్ యథా నుత్స్యః కురో పరాః॥
చందో మానం చ వృత్తం చ పాదస్థానం త్రికరణమ్।
ఋచస్స్వచ్ఛందవృత్తస్తు పాదాస్త్వక్షరమానతః॥
ఋగ్వర్యాన్స్వరభక్తిం చ ఛందోమానేన నిర్ది శేత్।
ప్రత్యయేత సహారేఫ మిమీతే స్వరభక్తయా॥
ఋవర్ణే తు పృథగ్రేఫ ప్రత్యయస్తు వృథా భవేత్।
విద్యాల్లఘుమృకారం తు యది తూష్మాణసంయుతః॥
ఊష్మణైవ హి సంయుక్త ఋకారో యత్ర పీడ్యతే।
గురువర్ణస్స విజ్ఞేయస్తృతం చాత్ర నిదర్శనమ్॥
ఋషభం చ గృహీతం చ బృహస్పతిం పృథివ్యాం చ।
నిరృతి పంచనూ హ్యత్ర ఋకారా నాత్ర సంశయః॥
శషసహరాదౌ రేఫసవరభక్తిర్జాయతే ద్విపదసంధే।
ఇ ఉ వర్ణాభ్యాం హీనా క్వచిదేకపదాక్రమవియుక్తా॥
స్వరభక్తిర్ద్విధా ప్రోక్తా ఋకారే రేఫ ఏవ చ।
స్వరోదా వ్యంజనోదా చ విహితాక్షరచింతకైః॥
శష సేషు స్వరోదాయాం హకారే వ్యంజనోదయమ్।
శష సే। ఉవివృతాం తు హకారే సంవృతాం విదుః॥
స్వరభక్తిం ప్రయుంజానస్త్రీన్దోషాన్పరివర్జయేత్।
ఇకారం చాప్యుకారం చ గ్రస్తదోషం తథైవ చ॥
సంయోగపరం ఛపరం విసర్జనీయం ద్విమాత్రకం చైవ।
అధసాన్తకచనజ్ మసానుస్వారం ఘుటీతం చ॥
యస్యాః పాదః ప్రథమో ద్వాదశమాత్రస్తథా తృతీయోఽపి।
అష్టాదశో ద్వితీయస్సమాపన్నః పంచదశమాత్రః॥
యస్యా లక్షణముక్తం యా త్వన్యా సా స్మృతా విపులా॥
అక్షరాణాం లఘుహ్రస్వమసంయోగ పరం యది।
తత్సంయోగోత్తరం విద్యాత్ గురుదీర్ఘాక్షరాణి తు॥
వివృత్తిర్యత్ర దృశ్యత స్వార స్వైవాగ్రతస్థితః॥
గురుస్వారస్స విజ్ఞేయః క్షప్రస్తత్ర న విద్యతే।
అష్టప్రకారం విజ్ఞేయం పదానాం స్వరలక్షణమ్॥
హ్రస్వాదివత్తు, సాన్పుతా, ముందు వత్సానుసాగిణీ, ఉభయత్రపాకవతి అని నాలుగు వివృతులు. ఈ నాలుగింటికి హస్వా, దీర్జా, వృద్దా, పిపీలికా అని పేర్లు. నాలుగు వివృతులకు వ్యవధానము ఒక మాత్రయుండును. ఇతరములకు అర్దమాత్రము, మిగిలిన వాటికి అణుమాత్రము వ్యవధానముండును. రేఫలో శషసరాలలో మకారముండి ప్రత్యయమున అనుస్వారము, పర్వములలో పరసవర్ణము, స్పర్శలలో (క నుండి మ వరకు)ఉత్తమా సతిని, పూర్వము నకారాంత పదముండి పరమున స్వరమున్నచో తకొరముతో కూడియున్న కారమును ‘రక్తము’ అని యందురు. పూర్వమునందు నకారాంత పదముండి యవహ మొదలగునవి వ్యంజనములచే కూడి యున్నపుడు పూర్వమున అర్దమాత్ర. అణుమాత్రముతో రక్తమగును. నకార స్వర సంయుక్తము నాలుగింటి యుక్తమై విధించబడినపుడు రేఫరంగము లోపము కొన్ని చోట్ల సానుస్వారముగానుండును. రంగము హృదయమునుండి వెలువడును. కాంస్యముతో కూడి యుండును. మృదుస్వరముగా ద్విమాత్రముగానుండును. దీనికి ఉదాహరణము దధన్వాం అనునది. సౌరాష్ట్ర కనారి ‘అరాం’ అని పలుకునట్లు రంగమును ప్రయోగించవలయును. ఇది నా అభిప్రాయము. శషసహలతో కూడిన గ,డ,ద,బ లు జ, ణ నమలు స్వరములు (అచ్చులు) నాలుగు పదజాతులను పది పదాంతములు చెప్పబడినవి. ఉచ్ఛస్వరము, నీచస్వరము, స్వరిత స్వరము, అని. ఈ స్వరమున్న ప్రదేశమున వ్యంజములుండవు. ఈ మూడు స్వరములు స్వరప్రధానములు గా ఆచార్యులు ప్రతిజ్ఞ చేసిరి. స్వరములు సూత్రమువంటివి. వ్యంజనము మణివంటిదని తెలియుము. దుర్భలుడగు రాజు యొక్క రాజ్యమును బలవంతుడగు రాజు హరించునటుల దుర్బలమైన వ్యంజనమును బలవత్తైన స్వరము హరించును. ఉభావము, చివృత్తి శషసలు, రేఫ, జిహ్వా మూలములు, ఉపధ్మా నీయములు అను ఎనిమిది ఊష్మల స్వరూపము. సంహితలో కలుగు స్వర ప్రత్యయ వివృతి ప్రదేశమున విసర్గలను చెప్పకొనవలయును. ఇచట తాలవ్యవర్ణములుండును. సంధ్యకరము పరముగా నున్నపుడు సంధిలో యకొరవకారములు లోపించినచో అచట వ్యంజన వివృత్తి స్వరసంహిత యుండునని తెలియుము. ఊష్మాంతముచే పదము ముగియునపుడు సంభావమగుచో స్వరవివృతియని తెలియవలయును. ఉభావముచే కలిసిన ఋకారము ఆదియందున్న పదము పరముననున్న చో స్వరాంతవివృతి యనబడును. మిగిలిన ఊష్కలకు వ్యక్తి వివృతి కలుగును. పదాంతములందు ప్రథమాకరములు, చివరి అక్షరములు (వర్గలలో) ఉన్నచో శషస ప్రత్యయములు ద్వితీయ స్థానమును పొందినచో ఊష్మయుక్తములగు ప్రథమ వర్ణములను ద్వితీయ వర్ణముల వలె చూపవలయును. కాని వీటిని ద్వితీయములుగా నియమించరాదు. మత్స్య, కుర, అప్సర అనునవి దృష్టాంతములు. చంధస్సునకు మానము వృత్తము. పాదస్థానమునకు కారణత్రయముండును. ఋక్కులు స్వచ్ఛందవృత్తములుగా నుండును. అక్షరముల మానముననుసరించి పొదములుండును. ఋక్కులను స్వరభక్తిని ఛందోమానముచే చూపవలయును. స్వరభక్తితో రేఫలేని దొనిని గుర్తించవలయును. ఋ వర్ణములో విడిగెనుండు రేఫజ్ఞానము నిష్ప్రయోజనమేయగును. ఊషలచేకూడిన ఋకారమును లఘువుగా తెలియవలయును. ఊష్మలతో కూడిన ఋకారము పీడించబడినచో గురువుగా తెలియవలయును. ఇచట త్పచ్ అనునది ఉదాహరణము. ఋషభ, బృహస్పతి, గృహీత, పృథివి, నిర్వతి శబ్దములలో నున్న అయిదు ఋకారములు గురువులేయగును. ఈ విషయమున సంశయము లేదు. శషసహరలు ఆదియందు గల పదములలో నున్న రేఫద్విపద సంధిలో నున్న రేఫ స్వరభక్తి యగును.. ఇ ఉ వర్ణరహితమైనది, క్రమ రహితమైన ఏకపదములోని ఋకారము కూడా స్వరభక్తి యగును. స్వరభక్తి రెండు విధములు. ఋకారమునందు రేఫయందు ఉండును నియమించబడిన అక్షరములను చింతించువారు ఈ స్వరభక్తిని స్వరోద వ్యంజనోద యని యందురు. శషసలలో నున్న స్వరభక్తిని స్వరోదయందురు. హకారమునున్న స్వరభక్తిని వ్యంజనోద యందురు. శషసలలోని ఋకారమును వివృతముగా హకారములోని ఋకారమును సంవతముగా తెలియుదురు. స్వరభక్తిని ప్రయోగించువారు మూడు దోషములను వర్షించవలయును, ఇకారమును, ఉకారమును, గ్రస్తదోషమును, సంయోగ పరమైన చకారమును, విసర్గలను, ద్విమాత్రక వర్ణమును, అంతమున నున్న చ, న, జ్, మ, సకారములను, అనుస్వారమును, ఘుటితమును విడువవలయును. ఏ వృత్తములో ప్రథమపాదము తృతీయ పాదము ద్వాదశ మాత్రలు కలదిగా, ద్వితీయపాదము అష్టాదశ మాత్రలు కలదిగా, చతుర్లపాదము పంచదశ మాత్రలు కలదిగానుండునో దానిని విపుల వృత్తమందురు. సంయోగము పరమునందు లేని హ్రస్వాక్షరములు లఘువులని, సంయోగము పరమందున్న హ్రస్వాక్షరములు, దీర్ఘాక్షరములు గురువులని తెలియవలయును. స్వరమున కంటే ముందు వివృతి యున్నచో నది గురుస్వరముగా తెలియబడును. అచట క్షిప్ర స్వరముండదు. పదములలోని స్వరములు అష్టవిధములని తెలియుము.
అంతోదాత్తమాద్యుదాత్తమాదాత్తమనుదాత్తం నీచస్వరితమ్।
మధ్యదాత్తం స్వరితం ద్విరుదాత్తమిత్యే అజ్ఞోపదసంజ్ఞాని॥
అగ్నిస్సోమప్రవోవీర్య హవిషా స్వర్వనస్పతిః॥
అంతర్మధ్యమయో తామ్యుదమనునిత్య ఆద్యాత్స్వరితముపసర్గే।
ద్విర్నీ చమాఖ్యాత ఇతి స్పరితాత్పరాణి యానిప్యుర్ధారాపక్షరాణి తు॥
సర్వాణి ప్రచయస్థాన్యుపోదాత్తం నిహన్యతే॥
ప్రచయో యత్ర దృశ్యేత తత్ర హన్యాత్స్వరం బుధః।
స్వరితః కేవలో యత్ర మృదుస్తత్ర నిపాతయేత్॥
పంచవిధమాచార్యకం నామ సుఖం న్యాసః కరణం ప్రతిజ్ఞాతోచ్చారణా।
అత్రోచ్యతే శ్రేయః ఖలు॥ వైశ్యాః ప్రతిజ్ఞాతోచ్చారణా యస్య కస్యచిత్।
వర్ణస్య కరణం నోపలభ్యతే ప్రతిజ్ఞా తత్ర వోఢవ్యా కరణం హి తదాత్మ కమ్॥ తుంబురుర్బవద్విశిష్ట విశ్వావస్వాదయశ్చ గంధర్వాః।
సామసు నిభృతం కరణం స్వరసాక్ష్మ్యాన్నైవ జానీయుః॥
కౌక్షేయాగ్నిం సదా రక్షేత్ అశ్రీపాదర్శనం హేతుమ్।
జీర్ణో హారః ప్రవృద్ధః ఖలూషసినహ్మ చింతయేత్॥
శరద్విషువతోత్తాదుషష్యత్థానమిష్యతే।
యావద్వాసంతికీ రాత్రిర్మధ్యా పర్యుపస్థితా॥
ఆమ్రపాలాశబిల్వానామపామార్గశిరీషయోః।
వాగ్యతః ప్రాతరుత్థాయ భక్షయేద్దంతధావనమ్॥
ఖాదిరశ్చ కదంబశ్చ కరవీరకరంజయోః।
సర్వే కంటకినః పుణ్యాః క్షీరిణశ్చ యశస్వినః॥
తేనాస్య కరణే సౌక్ష్యం మాధుర్యం చోపజాయతే।
వర్ణాంశ్చ కురుతే సమ్యక్ ప్రాచీనౌదావతిర్యథా॥
త్రిఫలాం లవణాఖ్యేన భక్షయేచ్ఛిష్యకస్సదా।
అగ్ని మేధా జనన్యేషా స్వరవర్ణకరీ తథా॥
కృత్వా చావశ్యకాన్దర్మా ఞ్జాతరం పర్యుపాస్య చ।
పీత్వా మధు ఘృతం చైవ శుచిర్భూత్వా తతో వదేత్॥
మంద్రేణోపక్రమేత్పూర్వం సర్వశాఖాస్వయం విధిః।
సప్త మంత్రానతిక్రమ్య యథేష్టాం వాచముత్సృజేత్॥
న తాం సమీరయేద్వాచం న ప్రాణముపరాధయేత్।
ప్రాణానాముపరోధేన వైస్వర్యం చోపజాయతే॥
స్వరవ్యంజనమాధుర్యం లుప్యతే నాత్ర సంశయః।
కుతీర్ధాదాగతం దగ్ధమపవర్ణైశ్చ భక్షితమ్॥
న తస్య పరమోక్షోఽస్తి పాపా హేరివ కిల్బిషాత్।
సుతీర్థాదాగతం జగ్ధుం స్వామ్నాతం సుప్రతిష్ఠితమ్॥
సుస్వరేణ సువక్త్రేణ ప్రయుక్తం బ్రహ్మ రాజతి।
న కఠాలో న లంబోష్ఠో న చ సర్వానునాసికః॥
గద్గదో బద్ధజిహ్వశ్చ ప్రయోగాన్వక్తుమర్హతి।
ఏకచిత్తో నిరుద్ధాంతః స్నాతో గానవివర్జితః॥
స తు వర్ణాన్ప్రయుంజీత దంతోష్ఠం యస్య శోభనమ్।
పంచ విద్యాం న గృహ్ణాంతి చండా స్తబ్దాశ్చ యే నరాః॥
అలసాశ్చ సరోగాశ్చ యేషాం చ విసృతం మనః;
శనైర్విద్యాం శనైరర్ధాన్ ఆరో హేత్పర్వతం శనైః॥
శనైరధ్వసు వర్తేత యోజనాన్న పరం వ్రజేత్।
యోజనానాం సహస్రం తు శనైర్యాతి పిపీలికా॥
అగచ్ఛన్వైనతేయోఽపి పదమేకం న గచ్ఛతి।
న హి పాపహతా వాణీ ప్రయోగాన్వక్తుమర్హతి॥
బధిర స్యేవ జల్పస్య విదగ్ధా వామలోచనా।
ఉపాంశుచరితం చైవ యోఽధీతే విత్రసన్నివ॥
అపి రూప సహస్రేషు సందే హే ష్వేవ వర్తతే।
పుస్తకప్రత్యయాధీతం నాధీతం గురుసన్నిధౌ॥
రాజతే న సభామత్యే జారగర్భేవ కామినీ।
అంజనస్య క్షయం దృష్ట్వా వల్మీ కస్య తు సంచయమ్॥
అవంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయనకర్మసు।
యత్కీటైః పాంసుభిశ్నక్ష్ణైర్వల్మీకః క్రియతే మహాన్॥
న తత్ర బలసామర్థ్యముద్యోగస్తత్ర కారణమ్।
సహస్రగుణితా విద్యా శతశః పరికీర్తితా॥
ఆగమిష్యతి జిహ్వాగ్రే స్థలాన్నిమ్నమివోదకమ్।
హయానామివ జాత్యానాం అర్ధరాత్రార్ధశాయి నామ్॥
న హి విద్యార్థినాం నిద్రా చిరం నేత్రేషు తిష్ఠతి।
న భోజనవిలంబీ స్యాన్న చ నారీనిబంధనః॥
సముద్రమపి విద్యార్థి వ్రజేద్గరుడహంసవత్।
అహిరివ గణాద్భీతస్సారహిత్యాన్నరకాదివ॥
రాక్షసీభ్య ఇవ స్త్రీభ్యస్స విద్యామధిగచ్చతి।
న శఠాః ప్రాప్నువన్త్యర్ధాన్ న క్లీబా న చ మానినః॥
న చ లోకరవా దీనా న చ స్వస్వప్రతీక్షకా।
యథా ఖనన్జనిత్రేణ భూతలం వారి విందతి॥
ఏవం గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్ఛతి।
గురుశుశ్రూషయా విద్యా పుష్కలేన ధనేన వా॥
అథవా విద్యయా విద్యా హ్యన్యధా నోపపద్యతే॥
శుశ్రూషారహితా విద్యా యద్యపీ మేధాగుణైస్సముపయాతి।
వంద్యేవ యౌవనవతీ న తస్య సాఫల్యవతీ భవతి॥
ఇతి దిఙ్మాత్రముద్దిష్టం శిక్షాగ్రంథం మయా తవ।
జ్ఞాత్వా వేదాంగమాగ్యం తు బ్రహ్మ భూయాయ కల్పతే॥
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే
పంచాశత్త మోఽధ్యాయః॥
అంతోదాత్తము, ఆద్యుదాత్తము, ఉదాత్తము, అనుదాత్తము, నీచస్వరితము, మధ్యోదాత్తము, స్వరితము, ద్విరుదాత్తము అని ఎనిమిది పదస్వరముల పేర్లు. అగ్ని సోమ,ప్రవ, వీర్యం, హవిషా, స్వ, వనస్పతి అను శబ్దముల లోపల మధ్యమున నున్న స్వరములు అనునిపాతము చేయబడి మొదటి దానికంటే పరముననున్నది స్వరితమని, ఉపసర్గలో ద్విరుదాత్తమని, ఆఖ్యాతమున నీచస్వరితమని, స్వరితము కంటే పరమందున్నవాటిని నిపాతములుగా తెలియవలయును. ప్రచయమున నున్న అన్నిస్వరములలో ఉదాత్త సమీపవర్తి అనుదాత్తమగును. ప్రచయమున్న ప్రదేశమున స్వరమును అనుదాత్తముగా పలుకవలయును. కేవల స్వరితమున్నచో మృదుస్వరమునుపయోగించవలయును. ఆచార్యులు చెప్పుట అయిదు విధములు. సుఖము, న్యాసము, కరణము, ప్రతిజ్ఞ, ఉచ్చారణము అని ఈ విషయమున శ్రేయోదాయకమగు పద్దతిని చేప్పెదను. వైశ్యులు ప్రతిజ్ఞచే ఉచ్చరించుట యుక్తము. ఏ వర్ణమునకైనను కరణము లభించదు. ప్రతిజ్ఞ మాత్రమే స్వీకరించవలయును. కరణము కూడా ప్రతిజ్ఞాత్మకముగా నుండును. తుంబురుడు, నారదుడు, విశ్వావసువు మొదలగు గంధర్వులు సామములో నిక్షిప్తమగు కరణమును స్వర సూక్ష్మత వలన తెలియరు. జఠరాగ్నిని ఎప్పుడూ తగిన ఆహారపానీయములచే రక్షించవలయును. జీర్ణమగు ఆహారమునే భుజించవలయును. ఉషఃకాలమున లేచి బ్రహ్మను ధ్యానము చేయవలయును. వేదమును వల్లెవేయవలయును. శరదృతువు హేమంతరువు నందు మధ్య కాలమున మామిడి, మోదుగు మారేడు, ఉత్తరేణి శిరీష కొషములతో వాక్కును నియమించి, ప్రాతఃకాలమున లేచి దంతధావనమును చేయవలయును మేడి, కదంబము, కరవీరము, కరంజము, కంటకములు గల వృక్షముల కొషములు, పాలుకారు వృక్షముల కొష్టములు దంతధావనమునకుపయోగించినచో పావనత్వమేర్పడు ఓ కాక స్వరములో సూక్ష్మత మాధుర్యము కలుగును. తూర్పుదిక్కున నుండు మేఘము పలువర్ణములను చూపునట్లు కంఠము అన్నివర్ణములను చక్కగా పలుకగలుగును. శిష్యుడు త్రిఫలచూర్ణమును లవణములతో కలిపి సేవించవలయును. ఈ త్రిఫల జఠరాగ్నిని మేధస్సును కలిగించును. నిత్యకృత్యములను నెరవేర్చి నిత్యధర్మములనాచరించి జఠరాగ్నిని తృప్తిపరిచి, తేనెను నెయ్యిని త్రాగి, పవిత్రుడై వేదాధ్యయనమును చేయవలయును. మొదట మంద్రస్వరముతో ప్రారంభించవలయును. అన్ని వేదశాఖలలోను ఈ విధినే అనుసరించవలయును. సప్తస్వరములనతిక్రమించి యథేషముగా పలుకుటను విసర్జించవలయును. యథేషముగా పలుకరాదు. ఊపిరిని బిగబట్టరాదు. ఊపిరిని బిగబట్టుటచే వైస్వర్యము కలుగును. స్వరవ్యంజనములలో మాధుర్యము లో పించును. చెడుతీర్ధములను వచ్చినవాటిని, దగ్గమైన వాటిని, అపవర్ణములు కలవాటిని భక్షించినచో స్వరము చక్కగా రాదు. అటువంటివారికి పాపులకువలె పరిమోక్షము లేదు. మంచితీర్ధములనుండి వచ్చినవాటిని భక్షించినవారు చక్కగా వేదాధ్యయనమును చేయగలరు. వారివద్ద వేదము సుప్రతిష్ఠితమగును. మంచి స్వరముతో, మంచినోటితో ప్రయోగించిన వేదము శోభించును. పెద్దనోరు కలవాడు, వేలాడు పెదవులు కలవాడు, అన్నివర్ణములను ముక్కుతో పలుకువాడు, బొంగరు గొంతు కలవాడు, నాలుకు కదల్చనివాడు, వేదాధ్యయనమును చేయరాదు. ఏకాగ్రచిత్తము గలవాడు, ఉద్వేగము లేనివాడు, స్నానము చేసి గానమును విడిచి, మంచి దంతోషములు కలవాడు . వేదవర్ణములనుపయోగించవలయును. చండులు, స్తబ్దులు, అలసులు, రోగము గలవారు, పలువిషయములందు మనసునుంచువారు ఈ అయిదుగురు వేదాధ్యయనమును చేయరాదు. విద్యను మెల్లగా అభ్యసించవలయును. ధనమును. మెల్లగా సంపాదించవలయును. పర్వతమును మెల్లగా అధిరోహించవలయును. దొరిలో మెల్లగా నడువవలయును. ప్రతిదినము ఒక యోజనమును మించి నడువరాదు. మెల్లగా కదలుచు చీమలు కొన్ని వేల యోజనముల దూరమును చేరును. ఒక్క అడుగు కూడా ముందుకు వేయనిచో గరుడుడు కూడా ఒక్క అడుగు దూరమును కూడా చేరలేడు. పాపములను పలుకు వాక్కుచే వేదములను పలుకరాదు. చెవిటి వానితో వదురుబోతుతో నెరజాణ పలుకుల వలె యుండును. ఉపాంశు చరితమును భయపడుచు పలుకువాడు ఎన్ని వేలమార్లు చదివిననూ సందేహముతోనే యుండును. గురువు సన్నిధిలో చదువక పుస్తకమును చూచి చదువబడినది జారుని వలన గర్భమును ధరించిన స్త్రీవలే సమాజమున గౌరవమును పొందజాలదు. ఎన్నిమార్లు పెట్టిననూ కరిగిపోవు కాటుకను, చీమలు ప్రయత్నముచే నేర్పరుచు పుట్టను చూచి దానాధ్యయన కర్మలయందు నిత్యము యత్న శీలుడై యుండవలయును. పురుగులు ధూళికణములతో "మెత్తనిమట్టితో పెద్ద పుట్టను సిద్దము చేయును. ఆ పురుగులకు బలము కాని సామర్ధ్యము కాని లేదు. ప్రయత్నశీలతే కార్య సిద్ధికి కారణము నూరుమార్లు అధ్యయనము చేసి వేయిమార్లు వల్లె వేసినచో విద్య పల్లమునకు ప్రవహించునదివలె వచ్చును. జాత్యశ్వములు అర్థరాత్రి సగము నిద్రపోవునట్లు విద్యార్థులు చాలాకాలము కనులకు నిద్ర యుండరాదు. చాలాకాలము భోజనము చేయరాదు. నారీ నిర్బంధముండరాదు. సముద్రమును గరుడ పక్షులు, హంసలు చోటునట్లు విద్యార్థులు వేదసాగరమును దాటవలయును. పాము వలే జనసమూహమునకు భయపడుచు, నగరమును వలె సాహిత్యమును చూచి భయపడుచు రాక్షసులకు వలే స్త్రీజనమునకు భయపడు విద్యార్థి విద్యను పొందగలడు. శకులు, దీనులు, వృధాభిమానులు, లోకముతో ఎక్కువగా మాట్లాడువారు, నపుంసకులు, తమను తాము చూచుకొను వారు అర్ధములను పొందజాలరు. గడ్డపారతో త్రవ్వుచు భూమిలో నీరును పొందినట్లు గురువులో నున్న విద్యను శుశ్రుషతో పొందగలరు. గురువును సేవించుటచే, పుష్కుల ధనముచే కాని ఒక విద్య నిచ్చుటచే గాని విద్యను పొందవచ్చును. నాలుగవ మార్గము లేదు. గురువును సేవించక మేధాసంపత్తి చే విద్యను పొందిననూ గొడ్డురాలి యౌవనము వలె సఫలము కాజాలదు. ఇట్లు సంగ్రహముగా శిక్షను నీకు తెలిపితిని. వేదమునకు మొదటి యంగమగు శిక్షను చక్కగా తెలుసుకొని చక్కగా వేదమును అభ్యసించవచ్చును.
ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున యాబదియవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 51 of the Nārada Mahā Purana is as follows:
వేదముల ద్వితీయ అంగమైన కల్ప వేదాంగ స్వరూపమును సనందన మహర్షి ఈ అధ్యాయంలో దేవర్షి నారదునకు విశదీకరించినారు. యజ్ఞయాగాదుల నిర్వహణ క్రమము, శ్రౌత స్మార్త కర్మల విధివిధానములు, గృహ్య సూత్రములు మరియు శౌత సూత్రముల నియమములను శాస్త్రబద్ధంగా ఇక్కడ అభివర్ణించబడినవి.