40 - స్థలవిశేష స్నానఫలకథనమ్

వసురువాచ:-

అథ కాలవిశేషే తు గంగా స్నానస్య తే ఫలమ్ !

కీర్తయిష్యామి వా మోరు సావధానా నిశామయ

నైరంతర్యేణ గంగాయాం మాఘే స్నాతి చ యో నరః

స శక్రలోకే సుచిరం కాలం తిష్ఠత్ సగోత్రజః

తతో బ్రహ్మపురం యాతి కల్పకోటిశతాయుతైః

నైరంతర్యేణ విధివత్ గంగాయాం స్నాతి యో నరః

షణ్మాసమేకకాలాశీ సకృదేవోత్తరాయణే

సోపి విష్ణుపదం యాతి కులానాం శతముద్దరన్

సంక్రాంతిషుతు సర్వాసు స్నాత్వా గంగాజలే నరః

విమానేనార్కవర్ణేన స వ్రజేర్విష్ణుమందిరమ్

విషువేయనసంక్రాంతౌ విశేషాత్ఫలమీరితం

తపః సమం కార్తికేపీ గంగాస్నాన ఫలం విదుః

మేషప్రవేశార్క కాలే కార్తిక్యం వాపి మోహిని

మాఘస్నానాధికం ప్రాహుః కమలాసనపూర్వకాః

సంవత్సరస్నాన జన్యం ఫలమక్షయకే తిధౌ

కార్తికే వాపి వైశాఖే వాపి ప్రాహ పితా తవ

మన్వాదౌ చ యుగాదౌ యత్ ప్రోక్తం గంగాజలే ఫలం

స్నానేన యాజ్యవనితే త్రిమాస్యపి చ తత్ఫలమ్

ద్వాదశ్యాం శ్రవణరేక్షచ అష్టమ్యాం పుష్యయోగతః

ఆర్ద్రాయాం చ చతుర్దర్శ్యాం గంగాస్నానం సుదుర్లభమ్

పూర్ణిమా మాధవే పుణ్యా తథా కార్తికమామయోః

అమావస్యాస్తదైతేషాం గంగాస్నానే సుదుర్లభాః

కృష్ణాష్టమ్యాం సహస్రం తు శతం స్యాత్సర్వపర్వసు

అమాయాంచ తథాష్టమ్యాం మాఘాతదలే సతి

అర్ధోదయం తదా పర్వ కీంచిన్న్యూనం మహోదయః

మహోదయే శతగుణం లక్షమర్దోదయే స్మృతమ్

స్నానం గంగాజలే దేవి గ్రహణాచ్చంద్ర సూర్యయోః

మాసత్రయస్నానఫలం ఫాల్గునాషాఢమాసయోః

జన్మర్షేతు కృతే స్నానే గంగాయాః భక్తిభావతః

జన్మప్రభృతి పాపం వై సంచితం హి వినశ్యతి

చతుర్దశ్యాం మాఘకృష్ణే వ్యతీపాతశ్చ దుర్లభః

కృష్ణాష్టమ్యాం విశేషేణ వైధృతర్జాహ్నవీ జలే

మాఘం సకలమేవాపి నరో యో విధిపూర్వకమ్

అరుణోదయకే స్నాయి స తు జాతిస్మరో భవేత్

సర్వ శాస్త్రార్థవిజ్ఞానీ నీరోగశ్చ భవేధ్రువయ్

సంక్రాంత్యాం పక్షయోరంతే గ్రహణే చంద్రసూర్యయోః

గంగాస్నాతో నరః కామాత్ బ్రహ్మణః సదనం లభేత్

ఇందోర్లక్షగుణం ప్రోక్తం రవేర్దశగుణం తతః

గంగాతీరేతు సంప్రాప్తి ఇందోః కోటీ రవేర్దశ

వారుణేన సమాయుక్తా మధౌ కృష్ణాత్రయోదశి

గంగాయాం యది లభ్యత సూర్యగ్రహశతైః సమా

జ్యేష్ఠ మాసే క్షితిసుతదినే శుక్లపక్షే దశమ్యాం

హ ష్తే శైలాదవతరదసా జాహ్నవీ మర్త్యలోకమ్

పాపాన్యస్యాం హరతి హి తిదౌసాదశైషాద్యగంగా

పుణ్యం దద్యాదపి శతగుణం వాజిమేధక్రతోశ్చ

మహాపాతకసంఘాని యాని పాపాని సంతి మే

గోవింద ద్వాదశీం ప్రాప్య తాని మే హన జాహ్నవి

మఘా సంజ్ఞేన ఋక్షేణ చంద్రః సంపూర్ణ మండలః

గురుణా యాతి సంయోగం తన్మహత్వం తిఢః స్మతమ్

గంగాయాం యది లభ్యత సూర్యగ్రహశతైః సమా

అథ దేశవిశేషణ స్నానస్య ఫలముచ్యతే

వసువు పలికెను:- ఇక ఇపుడు ఆయా కాల విశేషములలో చేయు గంగా స్నానఫలమును చెప్పెదను. సావధానముగా వినుము. గంగానదిలో నిరంతరము మాఘస్నానమును చేయువాడు తన గోత్రము వారితో కలిసి ఇంద్రలోకమున నివసించును. యధావిధిగా నిరంతర గంగాస్నానమును చేయువారు కల్పకోటి శతాయుతములు బ్రహ్మలోకమున నివసించును. ఆరు నెలలు ఒకపూట భోజనము చేయుచు ఉత్తరాయాణ కాలమున ఒకమారు గంగా స్నానమును చేయువారు నూరు తరములను ఉద్దరించి విష్ణులోకమును చేరును. అన్ని సంక్రమణ కాలములలో గంగా జలమున స్నానము చేయువారు ఆరవర్ల విమానముతో విష్ణుమందిరమును చేరును. విషువ ఆయన సంక్రాంతులలో గంగా స్నానము విశేష ఫలప్రదము. కార్తీక మాసమున గంగా స్నానము తపస్సమఫలప్రదము. మేష సంక్రమణ కాలమున సూర్యోదయ కాలమున చేయు గంగాస్నానము మాఘస్నానాధిక ఫలప్రదమని బ్రహ్మాదులు చెప్పీయున్నారు. ఆక్షయతిథిన, కార్తీకమాసమున, వైశాఖ మాసమున చేయు గంగా స్నానము సంవత్సర గంగాస్నాన ఫలమును ఇచ్చును. మన్వాదికాలమున, యుగాదికాలమునగంగాస్నాన ఫలము త్రిమాస గంగా స్నాన సమమని చెప్పెదరు. శ్రవణానక్షత్రయుక్త ద్వాదశిన, పుష్యమీనక్షత్రయుక్త అష్టమిన, ఆర్తానక్షత్రయుక్త చతుర్దశిన గంగాస్నానము బహు దుర్లభము. మఘానక్షత్రయుక్త పూర్ణిమన, కార్తిక మాఘ అమావాస్యలలో గంగా స్నానము సుదుర్లభము. కృష్ణ పక్షాష్టమిన గంగాస్నానము సహస్రస్నానఫలము, సర్వపర్వకాలములందు గంగాస్నానము శతగుణ ఫలప్రదము, అమావాస్యనాడు, అష్టమిన, మాఘకృష్ణ పక్షమున గంగాస్నానము విశేష ఫలప్రదము. ఆల్రోదయపర్వము, కొద్ది తక్కువ మహోదయపర్వము. మహోదయపర్వమున శతగుణము, అరోదయమున లక్షగుణము గంగాస్నానము ఫలప్రదము. సూర్య చంద్రగ్రహణ కాలమున గంగా స్నానము మాసత్రయ స్నానఫలప్రదము. ఫాల్గునా షాఢమాసములలో గంగా స్నానము కూడా మాసత్రయస్నాన ఫలప్రదము. జన్మ నక్షత్రమున గంగా స్నానము చేసిన జన్మనుండి సంపాదించిన పాపమంతయూ నశించును. మాఘ కృష్ణ చతుర్దశిన వ్యతీపాత యోగము సుదుర్లభము. కృష్ణాష్టమిన వైధృతియోగము కూడా దుర్లభము. పూర్ణముగా మాఘమాసమునంతయూ విధిగా గంగాస్నానమును చేయివానికి ప్వూ జన్మజ్ఞానము కలుగును. సర్వశాస్త్రార్ధ జ్ఞానము కలవాడు రోగరహితుడగును. సంక్రాతికాలమున, పూర్ణిమా అమావాస్యలలో, సూర్యచన గ్రహణకాలమున గంగాస్నానము నాచరించినవాడు బ్రహ్మలోకమును పొందును. చంద్రునికి లక్షగుణములు, సూర్యునికి దశగుణములు సామాన్యముగా చెప్పబడి యున్నవి. కాని గంగాతీరమున చంద్రునికి కోటి గుణములు, సూర్యునికి దశ గుణములు గ్రహణకాల ఫలముగా చెప్పబడినవి. చైత్రకృష్ణత్రయోదశి వారు సమాయుక్తమైనచో గంగాతీరమున నున్నచో నూరు సూర్యగ్రహణ సమమని చెప్పబడినది. జ్యేష్ట శుద్ద దశిమినాడు మంగళవారము హస్తా నక్షత్రయుక్తమున ఈ గంగానది పర్వతము నుంచి మర్త్యలోకమునకు దిగియున్నది. ఈ స్థితియే గంగానదికి ఆది దశ. కావున ఆనాడు ఈ భూలోకములోనున్న అన్ని పాపములను హరించును. ఈ దినమున స్నానము నాచరించినచో నూరు అశ్వమేధయూగముల కంటే నూరు రెట్లు అధిక పుణ్యమును ప్రసాదించును. ఈ భూలోకమున నున్న మహా పాతక సంఘములు ఇతర సకల పాపములనన్నింటినీ గోవింద ద్వాదశిని పొంది ఓ. గంగాదేవీ! సంపూర్ణముగా హరించుము. పూర్ణిమ తిధిన మఘానక్షత్రముండి చంద్రుడు గురువుతో కలిసియున్నచో ఆ తిథి చాలా మహత్వమును సంతరించుకొనును. ఇటువంటి మహత్తత్వము గంగా తీరమున లభించినచో నూరు సూర్యగ్రహణములతో సమానమగును. ఇక ఇపుడు ఆయా దేశ వివేషములందు గంగా స్నానఫలమును చేప్పెదను.

కురుక్షేత్రాద్దశగుణా యత్ర తత్రావ రోహితా

కురుక్షేత్రాచ్ఛత గుణా యత్ర వింధ్యేన సంయుతా

వింధ్యాచ్ఛతగుణా ప్రోక్తా కాశీపుర్యాం తు జాహ్నవీ

సర్వత్ర దుర్లభా గంగా త్రిషు స్థానేషు చాధికా

గంగాద్వారే కుశావర్తే స్నానే పుణ్యఫలం శృణు

సప్తానాం రాజసూయానాం ఫలం స్యాదశ్వమేధయో

ఉషిత్వా తత్ర మాసార్ధం షణ్ణం విశ్వజితాం ఫలం

దశాయుతానాం తు గవాం దానపుణ్యం విదుర్బుధః

సరోత్తమేఽధ గోవిందం రుద్రం కనఖలే స్థితమ్

స్నాత్వావాప్యేషు గంగాయాం పుణ్యమక్షయమాప్నుయాత్

తీర్థం చ సౌకరం నామ మహాపుణ్యం శుభే శృణు

యస్మిన్నావిరభూత్పార్వం వారాహాకృతి రచ్యుతః

 శతస్యాగ్ని చితాం పుణ్యం జ్యోతిష్టోమద్వయస్య చ

అగ్నిష్టోమ సహస్రస్య ఫలమాప్నోతి మానవః

తత్రైవ బ్రహ్మణస్తీర్దే జ్యోతిష్టోమాయుతస్య చ

అశ్వమేధత్రయ స్యాపి స్నాతః పుణ్యం లభేన్నరః

కుబ్జాఖ్యం తీర్థమనఘం యత్ర చ వ్యాధయోఃఽఖిలాః

నశ్యంతి సర్వజన్మోత్థం పాతకం చాపి మోహిని

అత్రాన్యత్కాపిలం తీర్ధం యత్ర స్నాతో నరః శుభే

కపిలాష్టాయుతస్యాపి దానతుల్యపలం లభేత్

గంగాద్వారే కుశావర్తే బిల్వకే నీలపర్వతే

తీర్దే కనఖలే స్నాత్వా ధూతపాపో వ్రజేద్దిమ్

పవిత్రార్థం తతస్తీర్ధం సర్వతీత్తమోత్తమమ్

ద్వయోర్విశ్వజితోస్తత్ర స్నానాత్పుణ్యం లభేన్నరః

వేణీరాజ్యం తతస్తీర్ధం సరయూర్యత్ర గంగయా

సుపుణ్యయా మహాపుణ్యా స్వసా స్వస్రేవ సంగతా

హరేర్దక్షిణ పాదాబ్జ క్షాళనాదమరాపగా వామపాదోద్భవా

వాపి సరయూర్మానప్రసూః

తీర్దే తత్రార్చయన్ రుద్రం విష్ణుం విష్ణుత్వమా ప్నుయాత్

పంచాశ్వమేధ ఫలదం స్నానం తత్ర ప్రకీర్తితమ్

తతస్తు గాండవం తీర్థం గండకీ యత్ర సంగతి

గోసహస్రస్య దానం చ తత్ర స్నానం సమం ద్వయమ్

రామతీర్థం తతఃపుణ్యం వైకుంఠం యత్ర సన్నిధౌ

సోమతీర్థం తతః పుణ్యం యత్రాసౌ నకులో మునిః

సమభ్యర్చ్య పుణ్యతీర్థం యద్గంగోత్తర వాహినీ

మణికర్ణికయా తుల్యం మహాపాతక నాశనమ్

కలశాఖ్యం తతస్తీర్ధం కలశాదుత్థితో మునిః

అగస్త్యః పూజయన్యత్ర రుద్రం మునివరోఽ భవత్

సోమద్వీపం మహాపుణ్యం తీర్థం వారాణసీసమమ్

సోమో యత్రార్చయన్నీశం రుద్రేణ శిరసా ధృతః

విశ్వామిత్రస్య భగినీ గంగయా యత్ర సంగతా

తత్రాప్లుతో నరో భూయా ద్వాసవస్య ప్రియోఽ తిథిః

జహ్నుహ్రదే మహాతీర్దే స్నాతో మర్త్యో హి మోహిని

ఏకవింశతి కుల్యానాం తారకో భవతి ధ్రువమ్

తస్మాదదితి తీర్థం చ యత్రావాపాదితిర్హరిమ్

కశ్యపాత్తత్ర సుభగే స్నానమాహుర్మ హోదయమ్

శిరోచ్చయం మహాతీర్థం యత్ర తప్త్వా తపః ప్రజాః

తృణాదిభిః సహ స్వర్గం యాంతి తీర్థగణాశ్రయాత్

ఇంద్రాణీ నామ తీర్థం స్యా ద్యత్రేంద్రాణీ తు వాసవమ్

తపస్త్య పతిం లేభే సేవ్య మేతత్ర్పయాగవత్

పుణ్యదం స్నాతకం తీర్థం విశ్వామిత్ర స్తపశ్చరన్

యత్ర బ్రహ్మర్షితాం లేభే క్షత్రియస్తీర్థ సేవయా

ప్రద్యుమ్నతీర్థం తపసా ఖ్యాతం యత్ర స్మరో హరే

ప్రద్యుమ్న నామా పుత్రోభూ త్పరం తత్ర మహోదయమ్

తతో దక్షప్రయాగం తు గంగాతో యమునో గతా

స్నాత్వా తత్రాక్షయం పుణ్యం ప్రయాగ ఇవ లభ్యతే

ఇతి శ్రీ బృహన్నారదీయపురాణోత్తర భాగే మోహినీ వసుసంవాదే గంగా మాహాత్మ్యే స్థల విశేష స్నాన ఫలకధనం నామ చత్వారింశత్తమోఽధ్యాయః

ఇతర పుణ్యక్షేత్రముల కంటే కురుక్షేత్రమున గంగా స్నానము దశ గుణము ఫలమును ప్రసాదించును. వింధ్య పర్వతముతో కలిసియున్న గంగానదీ స్నానము కురుక్షేత్ర స్నానమున కంటే శతగుణము అధిక ఫల ప్రదము. కాశీపురిలో గంగా స్నానము వింధ్య గంగా స్నానమున కంటే శత గుణము ఫలప్రదము. ఇట్లు కురుక్షేత్ర వింధ్యకాశీపురులలోని గంగా బహు దుర్లభము. గంగా ద్వారమున, ప్రయాగలో గంగాసాగర సంగమమున స్నానమునాచరించిన వారు స్వర్గమును పొందెదరు. ఈ విశేష స్థలములలో మృతి చెందినచో మరల జన్మించరు. గంగా ద్వారమున కుశావర్తమున స్నానమాచరించినచో పుణ్యఫలమును వినుము. ఏడు రోజ సూయయాగముల ఫలము, రెండు అశ్వమేధముల ఫలము లభించును. ఈ ప్రదేశములలో మాసార్ధము నివసించినచో ఆరు విశ్వజి ద్యాగముల ఫలము లభించును. ఒక లక్ష గోవులను దానము చేసిన ఫలము లభించును. ఈ ప్రదేశములలో స్నానమాచరించి కాని సరోత్తమమున గోవిందుని, కనఖల క్షేత్రమున రుద్రుని దర్శించి కాని అక్షయ పుణ్యమును పొందును. సౌకర తీర్ధము మహాపుణ్యప్రదము. ఈ తీర్థముననే పూర్వము అచ్యుతుడు వరాహాకారమున ఆవిర్భవించెను. ఈ తీర్థమున స్నానము నాచరించిన మానవుడు శతాగ్ని చిత్పుణ్యమును, రెండు జ్యోతిష్ణోమ యాగముల ఫలమును, వేయి అగ్నిష్టోమ యాగముల ఫలమును పొందును. ఈ తీర్థమున నున్న బ్రహ్మ తీర్ద మున స్నానమాడినచో పదివేల జ్యోతిష్ణోమయాగముల ఫలమును, మూడు అశ్వమేధ యాగముల ఫలమును పొందును. కుబ్జతీర్థమున స్నానము నాచరించినచో అఖిల వ్యాధులు నశించును. అన్ని జన్మలలో సంచితములగు సకల పాపములు హరించబడును. ఇచటనే మరియొకటి కపిల తీర్ధమని కలదు. ఇచట స్నానమాచరించిన నరుడు ఎనుబది వేల కపిల గోవుల దానఫలమును లభించును. గంగా ద్వారమున, కుశావర్తమున, బిల్వ క్షేత్రమున, నీల పర్వతమున, కనఖల తీర్ధమున స్నానము నాచరించిన సకల పాపములు నశించి స్వర్గమును చేరును. సర్వతీర్ణోత్తమ తీర్ధమగునది. పవిత్ర తీర్థమున స్నానమాచరించినచో రెండు విశ్వజిద్యాగముల ఫలము లభించును. దీని తరువాత వేణీ రాజ్యతీర్థము కలదు. ఇచట గంగా నదితో సరయూనది. ఆక్కొచెల్లెళ్ళవలే కలిసియున్నది. శ్రీహరి దక్షిణ పాదము నుండి పుట్టినది గంగానది వామపాదము నుండి పుట్టినది సరయూనది. ఇదియే మానస సరోవర సంజాత. ఈ తీర్థమున రుద్రుని పూజించిన రుద్రత్వమును, విష్ణువును పూజించిన విష్ణుత్వమును పొందును. ఈ తీర్థమున స్నానము వలన అయిదు అశ్వమేధ యాగము ఫలము లభించును. తరువాత గాండవతీర్థము కలదు. ఇచటనే గంగానదితో గండకీ నది కలిసియున్నది. ఇచట స్నానము సహస్ర గోదానసముము. తరువాత రామతీర్థము వైకుంఠమునకు సమీపముననున్నది. సోమతీర్థమున నకులముని నివసించును. ఈముని చక్కగా శివుని పూజించి ధ్యానించుచు గణత్వము పొందెను. గంగోత్తర వాహినియగు చంపక తీర్థ ము కలదు. ఈ తీర్థ ము మణికర్ణికతో సమము. మహాపాతకనాశనము. తరువాత కలశతీర్థము కలదు. ఇచటనే ఆగస్త్య మహర్షి కలశమునుండి ఉద్భవించెను. ఇచటనే అగస్త్యుడు రుద్రుని పూజించి మహర్షి ఆయెను. తరువాత మహాపుణ్యకరమగు సోమద్వీప తీర్థము వారాణసీసమము కలదు. ఇచటనే చంద్రుడు రుద్రుని పూజించి రుద్రుని శిరమును అధిష్ఠించెను. విశ్వామిత్రుని ప్రియసోదరియగు కౌశికి నది గంగతో కలిసిన తీర్థమున స్నానము నాచరించిన వాడు ఇంద్రునికి ప్రియాతిథి యగును. మహాతీర్థమగు జహ్ను ప్రదమున స్నానము నాచరించినవాడు ఇరువది యొకటి తరములను తరింపచేయును. తరువాత అదితి తీర్థము కలదు. ఇచటనే అదితి కశ్యపమహర్షి వలన శ్రీహరిని పొందెను. ఇచట స్నానము నాచరించిన మహాఫలము లభించును. తరువాత శిరోచ్చయమను మహాతీర్థము కలదు. ఇచటనే తపమాచరించిన మానవులు ఈ తీర్థ మహిమ వలన తృణాదులతోపాటు స్వర్గమును చేరెదరు. తరువాత ఇంద్రాణీ తీర్థము గలదు. ఇచటనే శచీదేవి తపమును చేసి ఇంద్రుని పతిగా పొందెను. ఈ తీర్థమును ప్రయాగతుల్యముగా సేవించవలయును. తరువాత స్నాతక తీర్థము కలదు. ఇచట క్షత్రియుడగు విశ్వామిత్రడు ఈ తీర్థమును సేవించుచు తపము నాచరించి బ్రహ్మర్షిత్వమును పొందెను. తరువాత ప్రద్యుమ్న తీర్థము మహా ప్రసిద్దము. ఇచ్చటనే శ్రీహరికి ప్రద్యుమ్నుడను పుత్రుడు కలిగెను. ఇచట స్నానము మహోదయప్రదము. తరువాత దక్ష ప్రయాగ తీర్థము కలదు. ఇచటనే గంగ నుండి యమున విడివడినది. ఇచట స్నానము నాచరించినచో ప్రయాగాస్నానము వలె అక్షయ పుణ్యము లభించును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసు సంవాదమున గంగా మాహాత్మ్యమున స్థల విశేష స్నానఫలకధనమను నలుబది యవ అధ్యాయము.