125 - పురాణ మహిమ వర్ణనమ్

సనాతన ఉవాచ :-

ఇత్యేవముక్తా మునినా హి పృష్టాస్తే వై కుమారాః కిల నారదేన

 సంపూజితాశ్శాస్త్రవిదాం వరిషా కృతాహ్నికా జగ్మూరమేశలోకమ్

 తత్రేశమగ్న్యర్కనిభైర్మునీనై శ్రీవామదేవాదిభిరర్చితాంఘ్రిమ్

సురాసురేనైరభివన్ద్యముర్రం నత్వాజ్ఞాయా తస్య నిషేదురుర్యామ్

 శ్రుత్వాథ తత్రాభిలశాస్త్రసారం శివాగమం తే పశుపాశమోక్షణమ్

 జగ్ముస్తతో జ్ఞానఘనస్వరూపా నత్వా పురారిం స్వపితుర్నికాశమ్

 తత్పాదపద్మే ప్రణతిం విధాయ పిత్రాపి సత్కృత్య, సభాజితాస్తే

లబ్దాశివోద్యాపి చరని శశ్వల్లోకేషు తీర్థాని చ తీర్థభూతాః

జగ్ముస్తతో వై బదరీవనానే సురేన్తవర్యైరుపసేవ్యమానమ్

 దధ్యుశ్చిరం విష్ణుపదాబ్జమవ్యయం ధ్యాయస్తి యద్యతయో వీతరాగాః

 నారదోపి తతో విప్రా కుమారేభ్యసమిహితమ్

 లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం భృశం ప్రీతమనా హ్యభూత్

 స తస్మాత్స్వర్ణదీతీరాదాగత్య పితురస్త్రాకే

 ప్రణమ్య సత్కృతః పిత్రా బ్రహ్మణా నిషసాద చ

 కుమారేభ్యశ్ర్శుతం యచ్చ జ్ఞానం విజ్ఞానసంయుతమ్

 వర్ణయామాస తత్యేన సోలిపి శ్రుత్వా ముమోద చ

 అథ ప్రణమ్య శిరసా లబ్ధశర్మునిసత్తమః

 ఆజగామ చ కైలాసం మునిసిద్ధనిషేవితమ్

 నానాశ్చర్యమయం శశ్వత్పర్వర్తుకుసుమద్రుమైః

 మందారైః పారిజాతైశ్చ చంపకాశోకవంజులైః

 అన్యైశ్చ వివిధైరకై ర్నానాపక్షిగణావృతైః

 వాతోద్భూతశిఖైః పాంధానాహ్వయద్భిరివావృతమ్

 నానామృగగణాకీర్ణం సిద్ధకిన్నరసంకులమ్

సరోభిస్స్వచ్ఛసలిలైర్లసత్కాంచనపంకజైః

శోభితం సార సెర్హంపై శ్చక్రాహ్వాద్యైన్నినాదితమ్

 స్వర్ధునిపాతనిర్ఘృష్టం క్రీడద్భిశ్చాపురోగణైః

సలిలేలకనందాణా కుచకుంకుమపింగలే

 ఆమోదముదితైర్నాగ్రెస్సలిలైః పుష్కరోద్ధృతైః

 స్నాయద్భిః కరేణూంశ్చ కలభాంశ్చ సమాకులే

 అధ శ్వేతాభసదృశే శృంగే తస్య చ భూభృతః

వటం కొలాభసదృశం దదర్శ శతయోజనమ్

 తస్యాధస్తాత్సమాసీనం యోగిమండలమధ్యగమ్

 కపర్దినం విరూపాక్షం వ్యాఘ్రచర్మాంబరావృతమ్

 భూతిభూషితసర్వాంగం నాగభూషణభూషితమ్

 రుద్రాక్షమాలయా శశ్వచ్ఛోభితం చన్రశేఖరమ్

 తం దృష్ట్వా నారదో విప్రా భక్తినమ్రాత్మకంధరః

ననామ శిరసా తస్య పాదయోర్జగదీశితు:

 తతః ప్రసన్నమనసా స్తుత్వా వారిర్వృషధ్వజమ్

 నిషసాదాజ్ఞయా స్థాణీః సత్కృతే యోగిభిస్తదా

 అధాపృచ్ఛచ్చ కుశలం నారదం జగతాం గురుః

 స చ ప్రాహ ప్రసాదేన భవతస్సర్వమస్తీ మే

సర్వేషాం యోగివర్యాణాం శృణ్వతాం తత్ర వాడవాః

పప్రచ్ఛ శాంభవం జ్ఞానం పశుపాశవిమోక్షణమ్

 స శివస్సాదరం తస్య భక్త్యా సంతుష్టమానసః

 యోగమష్టాంగసంయుక్తం ప్రాహ ప్రణతవత్సలః

 స లబ్ధ్వా శాంభవం జ్ఞానం శంకరాల్లోకశంకరాత్

 సుప్రసన్నమనా నత్వా యయా నారాయణాంతకమ్

 తత్రాపి నారదోభీక్షం గతాగతపరాయణః

 సేవితం యోగిభి స్సీదై ర్నారాయణమతోషయత్

ఏతద్వఃకీర్తితం విప్రా నారదీయం మహన్మయా

ఉపాఖ్యానం వేధసమం సర్వశాస్త్ర నిదర్శనమ్

 చతుష్పాదసమాయుక్తం శృణ్వతాం జ్ఞానవర్థనమ్

 య ఏతత్కీర్తయేద్విపా నారదీయం శివాలయే

 సమాజే ద్విజముఖ్యానం తథా కేశవమందిరే

 మధురాయాం ప్రయాగే చ పురుషోత్తమసన్నిధౌ

సేతా కాంచ్యాం కుశస్థల్యాం గంగాద్వారే కుశస్థలే

 పుష్కరేషు నదీతీరే యత్రకుత్రాపి భక్తిమాన్

స లభేత్సర్వయజ్ఞానాం తీర్ణానాం చఫలం మహత్

 దానానాం చాపి సర్వేషాం తపసాం వాప్యశేషతః

 ఉపవాసపరో వాపి హవిష్యాచీ జితేంద్రియః

శ్రోతా చైవ తధా వక్తా నారాయణపరాయణః

 శివభక్తిరతో వాపి శృణ్వన్సిద్ధిమవాప్నుయాత్

ఆస్మిన్నశేషపుణ్యానాం సిద్ధీనాం చ సముద్భవః

 కధితస్సర్వపాపఘ్నః పఠతాం శృణ్వతాం సదా

 కలిదోషహరం పుంసాం సర్వసంపత్తివర్థనమ్

 సర్వేషామోపిత్సం చేదం సర్వజ్ఞానప్రకాశకమ్

 శైవానాం వైష్ణవానాం చ శాక్తానాం సూర్య సేవానామ్

 తధైవ గణపత్యానాం వర్ణాశ్రమవతాం ద్విజాః

తపసాం చ వ్రతనాం చ ఫలానాం సంప్రకాశకమ్

 మంత్రాణాం చైవ యంత్రాణాం వేదాంగానాం విభాగశః

తధాగమానాం సాంఖ్యానాం వేదానాం చైవ సంగ్రహమ్

 య ఏతత్పఠతే భక్త్యా శృణుయాద్వా సమాహితః

స లభేద్వాంఛితాన్కామా దేవాదిష్వపి దుర్లభాన్

 శ్రుత్వేదం నారదీయం తు పురాణం వేదసమితమ్

వాచకం పూజయేద్భక్త్యా ధనరత్నాంశుకాధిభిః

భూమిదానైర్గవాం దానై రత్నదానైశ్చ సంతతమ్

హస్త్యశ్వరథదానైశ్చ ప్రీణయేత్సతతం గురుమ్

 యస్తు వ్యాకురుతేవిప్రాః  పురాణం ధర్మసంగ్రహమ్

చతుర్వర్గప్రదం నృణాం కోఽన్యస్తత్సదృశో గురుః

 కాయేన మనసా వాచా ధనాద్యై రపి సంతతమ్

ప్రియం సమాచరేత్తస్య గురోర్ధర్మోపదేశినః

శ్రుత్వా పురాణం విధివ ద్థోమం కృత్వా సురార్చనమ్

బ్రాహ్మణాన్ఫోజయేత్పశ్చా చ్ఛతం మిష్టాన్నపాయసైః

దక్షిణాం ప్రదద్ఛేక్త్యా భక్త్యా ప్రీయేత మాధవః

యధా శ్రేష్టా నదీ గంగా పుష్కరం చ సరో యధా

కాశీ పురీ నగో మేరుర్దేవో నారాయణోహరిః

కృతం యుగం సామవేదో ధేనుర్విప్రోఽన్నమంబుచ

మార్గోమృగేన్ద్రః పురుషోఽశ్వత్థః ప్రహ్లాద ఆననమ్

ఉచ్చైశ్రవా వసంతశ్చ జపశ్శేష్ఠోఽర్యమా ధనుః

పావకో విష్ణురింద్రశ్చ కపిలో వాక్పతిఃకవిః

అర్జునో హనుమాన్దర్భ శ్చిత్తం చిత్రరథోంఽబుజమ్

 ఊర్వశీ కాంచనం యద్వ చ్చ్రేష్టాశ్చైతే స్వజాతిషు

తధైవ నారదీయం తు పురాణేషు ప్రకీర్తితమ్

శాంతిరస్తు శివం చాస్తు సర్వేషాం వో ద్విజోత్తమాః

గమిష్యామి గురోఃపార్శ్వం వ్యాసస్యామితతేజసః

 ఇత్యుక్త్యాభ్యర్చితస్సూతః శౌనకాద్యైర్మహాత్మభిః

 ఆజ్ఞప్తశ్చపునస్సర్యై ర్దర్శనార్థం గురోర్యయౌ

తే పిసర్వేద్విజశ్రేష్టా శౌనకాద్యాస్సమాహితాః

శ్రుతం సమ్యగనుష్టాయ తత్ర తస్థుశ్చసత్రిణః

కలికల్మషవిషనాశనం హరిం యో జపపూజనవిధిభేషజోపసేవీ

సతు నిర్విషమనసా సమేత్య యోగం లభతే సత మభీప్సితం హితలోకమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే బృహపాదుఖ్యానే చతుర్థపాదే పురాణమహిమావర్ణనం నామ పంచవిశోత్తరశతతమోఽధ్యాయః.

       సమాప్తోఽయం బృహన్నాదీయ పురాణస్య పూర్వభాగః

సూత మహర్షిపలికెను :- ఇట్లు నారదమహర్షి ఆకుమారులనుండీ చక్కగా అన్ని విషయములనడిగి తెలుసుకొని వారిని చక్కగా పూజించెను. అంతట ఆకుమారులు తమతమ నిత్యకృత్యములను చక్కగా పూర్తిచేసుకొని మహేశ్వరుని లోకమునకు వెళ్ళిరి. అచట అగ్నిసూర్య సన్నిభులగు వామదేవాది మునీన్తులచే సురాసురేన్రులచే పూజించబడుచున్న శంకరునికి నమస్కరించి అతని ఆజ్ఞచే భూమిపై కూర్చుండిరి. అచట శివునివలన జీవబంధమోచకము అఖిల శాస్త్రసారమగు శివాగమమును విని జ్ఞాన ఘన స్వరూపులగు ఆకుమారులు పురారికి నమస్కరించి తండ్రియగు బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. బ్రహ్మపాదపద్మములకు ప్రణమిల్లి బ్రహ్మచే గౌరవించబడి, ఆశీర్వాదమును పొంది, పరమపావనలగు కుమారులు లోకములోని తీర్థములలో సంచరించుచున్నారు. తరువాత వారు బదరీవనాన్తమున సురేన్తవర్గములచే సేవించబడుచున్న, వీతరాగులగు యతలచే ధ్యానించబడు, అవ్యయమగు విష్ణుపాదపద్మములను ధ్యానించిరి నారదమహర్షి కూడా కుమారువలన విజ్ఞానసహితమగు జ్ఞానమును పొంది మిక్కిలి ప్రీతిచెందెను. అపుడు నారదమహర్షి గంగాతీరమునుండి బ్రహ్మలోకమునకు వచ్చి బ్రహ్మకు నమస్కరించి అతనిచే సత్కరించబడి కూర్చునెను. కుమారుల వలన వినిన విజ్ఞానము తమదు జ్ఞానమునంతను యధాతధముగా వినిపించెను. దానిని వినిన బ్రహ్మ కూడా సంతసించెను. అంతట నారదమహర్షి బ్రహ్మకు నమస్కరించి ఆశీర్వాదములను పొంది మునిసిద్ధని షేవితమగు కైలాసమును చేరెను. ఆకైలాసము నానాశ్యర్చమయము, సర్వఋతుపుష్పయుతవృక్షములచేమందారపారిజాత చంపకాశోకవనంబులవృక్షములచే, ఇతరములగు పలు వృక్షములచే, నానా పక్షిగణములచే ఆశ్రయించబడిన వాయువుచే ఊగుచున్న శాఖలచే బాటసారులను పిలుచుచున్నట్లున్న వృక్షములచే ఆవరించబడియున్న నానామృగగణాకీర్ణము, సిద్దకిన్నల సంకురము, స్వచ్ఛసలిలములుగల స్వర్ణపద్మప్రకాశముచే విలసిల్లుచున్న సరస్సులచే శోభించబడుచున్న సారసములచే, హంసలచే, చక్రవాకములచే ధ్వనించబడుచున్న, ఆకాశగంగాపాతధ్వనులచే కూడి యున్నది. కుచకుంకుమలచే పింగల వర్ణములు గల అలకనందా జలములలోక్రీడించు అప్పరోస్తీలచే కూడియున్న పుష్కరోద్దత ములగు జలములను పరిమళముచే మదించిన యేనుగల ఆడయేనుగులపై చల్లి స్నానము చేయించుచున్నా, తెల్లని మేఘమువంటి కైలాస పర్వత శృంగమునందు నీలమేఘునిభము శతయోజన వ్యాప్తమగు వటవృక్షమును చూచెను. ఆవటవృక్షము క్రింద యోగి మండలమధ్యమున కూర్చొనియున్న, వ్యాఘ్రచర్మాంబరధారి, కపర్ది, విరూపాక్షుడు, భూతిభూషిత సర్వాంగుడు, నాగభూషణ భూషితుడు, రుద్రాక్షమాలా శోభితుడు, చన్జశేఖరుడు, అగుశంకరుని చూచిన నారదుడు భక్తితో శిరసును వంచి జగదీశ్వరుని పాదములకు నమస్కరించెను. తరువాత వృషధ్వజుని ప్రసన్నమనసుచే, వాక్కుతో స్తోతము చేసి, యోగులచే సత్కరించబడి, శివాజ్ఞచే ఆసనముపై కూర్చెండెను. అంతట జగద్గురువు నారదుని కుశలమడిగెను. నారదుడు తమ అనుగ్రహముతో అంతా కుశలమే అని చెప్పెను. అచటి యోగులందరూ వినుచుండగా జీవబంధమోచకమగు శివాగమమును నారదుడడిగెను. అంతట శివుడు నారదుని భక్తిచే సంతోషించి ఆశ్రితవత్సలుడు కావున అష్టాంగసంయుక్తమగు జ్ఞానమును ఉపదేశించెను. లోకమంగళకరుడగు శంకరుని వలన శివజ్ఞానమును పొంది ప్రసన్నమనస్కుడై నమస్కరించి శ్రీమన్నారయణుని సన్నిధికి చేరెను. అచట కూడా నారదుడు గతాగతపరాయణుడు సిద్దయోగి సేవితుడగు నారాయణుని సంతోషపరిచెను. ఓ బ్రాహ్మణోత్తములారా? ఇట్లు మీకు నారదీయమహాపురాణమును ఉపాఖ్యాన సమన్వితము, వేదసమము, సర్వశాస్త్ర నిదర్శనము, చతుష్పాదసమాయుక్తము, వినువారికి జ్ఞానమును పెంచుదానిని చెప్పితిని. ఈ నారదీయపురాణమును శివాలయమునకాని, బ్రాహ్మణసమాజమునకాని, విష్ణ్వాలయమున కాని, మధురయందు, ప్రయాగయందు, పురుషోత్తమ క్షేత్రమున, సేతుక్షేత్రమున, కాంచియందు, ద్వారకయందు, గంగాద్వారమున, కుశస్థలమున, పుష్కరములందు, నదీతీరమున, ఏదో యొక పవిత్రప్రదేశమున భక్తికలవాడై కీర్తించినచో సర్వయజ్ఞఫలమును, సర్వతీర్థఫలమును, సర్వదానఫలమును, సర్వతపఃఫలమును, పొందును. ఉపవాసముతో, హవిస్సును భుజించి కాని, జితేంద్రియుడై చెప్పువాడు వినువాడు నారాయణ పరాయణుడుకాని, శివభక్తిపరాయణుడు కానీ సకలసిద్దులను పొందును. ఈనారదపురాణమున సకలపుణ్యములు, సకలసిద్దులు కలవు. చదువువారికి వినువారికి సకలపాపములను నశింపచేయును. మానవులకు కలిదోషమును హరించును. సర్వసంపదలను వృద్ధిపొందించును. సర్వాభీష్టప్రదము. సర్వజ్ఞానప్రకాశకము. శైవులకు,వైష్ణవులకు, శాక్తులకు, సూర్య సేవకులకు గణపతి భక్తలకు, వర్ణాశ్రమావలంబులకు, అన్ని తపస్సులకు, అన్నివ్రతములకు, కలుగు అన్ని ఫలములను ప్రకాశింప చేయునది. మంత్రముల, యంత్రముల వేదాంగముల, ఆగమముల, సాంఖ్యముల, వేదముల సంగ్రహమిది. ఈ పురాణమును భక్తితో చదువువారికి, వినువారికి, దేవాదులకు కూడా దుర్లభములగు వాంఛితకామనలు ఫలించును. వేదసమ్మితమగు ఈనారదీయ పురాణమును విని, చెప్పువానిని ధనరత్నాంశుకాదులచే, భూమిదానములచే, గోదానములచే రత్నదానములచే, హస్తి అశ్వ, రథ దానములచే పూజించవలయును. గురువును సంతోషపరచవలయును. ధర్మసంగ్రహమగు ఈ పురాణమును వ్యాఖ్యానము చేయు వాడు నరులకు చతుర్వర్గప్రదాతకావున అతనితో సమానమగు గురువెవరుండును. ఇట్లు ధర్మోపదేశమును చేయు గురువునకు కావాజ్మనస్సులతో ధనాదులతో సర్వకాలములందు ప్రియము నాచరించవలయును. పురాణమును యధావిధిగా విని హోమము నాచరించి, దేవతాపూజ గావించి మిష్టాన్నపాయసములతో నూరుమంది బ్రాహ్మణులను భుజింపచేసి శక్తికొలది దక్షిణలనిచ్చినచో వారి భక్తికి మాధవుడు ప్రీతి చెందును. నదులలో గంగానది, సరస్సులలో పుష్కరము, పురములలో కాశీ, పర్వతములలో మేరుపు, దేవతలలో నారాయణుడు, యుగములలో కృతయుగము, వేదములలో సామవేదము, పశువులలో ధేనువు, నరులలో బ్రాహ్మణులు, ఖాద్యములలో అన్నము, పానీయములలో జలము మృగములలో సింహము, పురుషుడు, అశ్వత్తము, ప్రహ్లాదుడు, ముఖము, ఉచ్చైశ్రవము, వసంతము, జపము, శేషుడు, అర్యమ, ధనువు, అగ్ని, విష్ణువు, ఇంద్రుడు, కపిలుడు, ఆకృతి, కవి, అర్జునుడు, హనుమనుడు, దర్భ, చిత్తము, చిత్రరధుడు, అంబుజము, ఊర్వశి కాంచనము ఎట్లు తమజాతిలో శ్రేష్ఠములో అట్లే పురాణములలో నారదీయము శ్రేష్ఠము. ఓ బ్రాహ్మణోత్తములారా? మీకు శాంతి కలుగుగాక. శుభము కలుగుగాక. ఇకనేను గురువుగారగు వ్యాసమహర్షి వద్దకు వెళ్ళేదను. అని చెప్పగా శౌనకాది మహర్షులు సూతమహర్షిని చక్కగా పూజించిరి. గురువును దర్శించుటకు అనుమతించిరి. ఇక శౌనకాది ఋషి వర్యులు కూడా సావధానముగా వినిన దానిని చక్కగా అనుష్టించి అచటనే ఉండిరి. కలికల్మషవిషనాశనమగు శ్రీహరిని జపపూజనవిధి భేషజములతో సేవించువాడు నిష్కల్మషమనసుతో యాగఫలమును పొంది అభీప్సిత లోకమును పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వ భాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాద మున పురాణమహిమావర్ణనమను నూటా ఇరువదియైదవ అధ్యాయము సమాప్తము.

 బృహన్నారదీయ పురాణమున పూర్వభాగము సమాప్తము.