15 - భగీరథస్య గంగానయనోద్యమవర్ణనమ్

ధర్మరాజ ఉవాచ :-

పాపభేదాన్ప్రవక్ష్యామి యథా స్థూలాశ్చ యాతనాః

శృణుష్వ ధైర్యమాస్థాయ రౌద్రా యే నరకా యతః

పాపినో యే దురాత్మానో నరకాగ్నిషు సంతతమ్

పచ్యన్తే యేషు తాన్వక్ష్యే భయంకరఫలప్రదాన్

తపనో వాలుకాకుంభౌ మహారౌరవరౌరవౌ

కుంభీపాకో నిరుచ్చ్వాసః కాలసూత్రః ప్రమర్దనః

అసిపత్రవనం ఘోరం లాలాభక్షో హిమోత్కటః

మూషావస్థా వసాకూపస్తథా వైతరణీ నదీ

భక్ష్యత్తే మూత్రపానం చ పురీషప్రద ఏవ చ

తప్తశూలం తప్త శిలా శాల్మలీద్రుమ ఏవ చ

తథా శోణితకూపశ్చ ఘోర: శోణితభోజనః

శ్వమాంసభోజనం చైవ వహ్నిజ్వాలానివేశనమ్

శిలావృష్టిశ్శస్త్రవృష్టిర్వహ్నివృష్టిస్తథైవ చ

క్షారోదకం చోష్ణతోయం తప్తాయఃపిండభక్షణమ్

అథ శీరశ్శోషణం చ మరుత్ప్రపతనం తథా

తథా పాషాణవర్షం చ కృమిభోజనమేవ చ

క్షారోదపానం భ్రమణం తథా క్రకచదారణమ్

పురీషలేపనం చైవ పురీషస్య చ భోజనమ్

రేతః పానం మహాఘోరం సర్వసంధిషు దాహనమ్

ధూమపానం పాశబంధం నానాశూలానులేపనమ్

అంగారశయనం చైవ తథా ముసలమర్దనమ్

బహూని కాష్ఠయంత్రాణి కషణం ఛేదనం సధా

పతనోత్పతనం చైవ గదాదండాదిపీడనమ్

గజదన్తప్రహరణం నానాసర్పైశ్చ దంశనమ్

శీతాంభు సేచనం చైవ నాసాయాం చ ముఖే తథా

ఘోరక్షారాంబుపానం చ తథా లవణభక్షణమ్

స్నాయుచ్ఛేదం స్నాయుబన్దమస్థిచ్ఛేదం తథైవ చ

క్షారాంబుపూర్ణరంధ్రాణాం ప్రవేశం మాంసభోజనమ్

పిత్తపానం మహాఘోరం తథైవ శ్లేష్మ భోజనమ్

వృక్షాగ్రాత్పాతనం చైవ జన్తర్మజ్జనం తథా

పాషాణధారణం చైవ శయనం కంటకోపరి

పిపీలికాదంశనం చ వృశ్చికైశ్చాపి పీడనమ్

వ్యాఘ్రపీడా శివాపీడా తథా మహిషపీడనమ్

కర్దమే శయనం చైవ దుర్గన్దపరిపూరణమ్

బహుశశ్చార్దశయనం మహాతిక్తని షేవణమ్

అత్యుష్ణతైలపానం చ మహాకటుని షేవణమ్

కషాయోదకపానం చ తప్తపాషాణతక్షణమ్

అత్యుష్ణశీతస్నానం చ తథా దశనశీర్ణనమ్

తప్తాయశ్శయనం చైవ హ్యయోభారస్య బన్దనమ్

ఏవమాద్యా మహాభాగ ! యాతనాః కోటికోటిశః

అపి వర్షసహస్రేణ నాహం నిగదితుం క్షమః

ఏతేషు యస్య యత్ప్రాప్తం పాపినః క్షితిరక్షక ! 

తత్సర్వం సంప్రవక్ష్యామి తన్మే నిగదతశ్శృణు

ధర్మరాజు పలికెను : పాప భేదములను స్థూల యాతనలను చెప్పెదను. నరకములు చాలా భయంకరములు కావున ధైర్యమును వహించి వినుము. దుష్టస్వభావములు కల పాపాత్ములు యే యే నరకములలో పడి యాతనలను పొందెదరో ఆ నరకములను గూర్చి చెప్పేదను. ఇవి యన్నియు భయంకర ఫలముల నిచ్చును. తపన-వాలుకా-కుంభ-మహారౌరవ-గౌరవకుంభీపాక-నిరుచ్ఛ్వాస-కాలసూత్ర-ప్రమర్ధన-అసి పత్రవనములు లౌలాభక్షము, హిమోత్కటము, మూషావస్థ, వసామాపము, వైతరణీనది, మూత్రపానము, పురీషప్రదము, తప్త శూలము, తప్తశిల, శాల్మలీద్రుమము, శోణితకూపము, ఘోరమైన శోణిత భోజనము, శ్వమాంస భోజనము, వహ్నిజ్వాలానివేశనము, శిలావృష్టి, శస్త్రవృష్టి, వహ్నివృష్టి, క్షారోదకము, ఉష్ణతోయము తపొయః పిండభక్షణము, శిరశ్శోషణము, మరుతపతనము, పొషాణవర్షము, కృమిభోజనము, కారోదపానము, భ్రమణము, క్రకచదారణము, పురీషలేపనము, పురీషభోజనము, రేతఃపానము, సర్వసంధిదాహనము, దూమపానము, పొశబంధము, నానాశూలానులేపనము, అంగార శయనము, ముసలమర్లనము, బహుభాషయన్తకషణము, ఛేదనము, పతనోత్పతనము, గదాదండాది పీడనము, గజదంతప్రహరణము, సోనాసర్పదంశనము, నాసికా ముఖములలో శీతాంబు సేచనము, ఘోరక్షారాము పానము, లవణ భక్షణము, స్నాయుచ్ఛేదము, స్నాయుబగ్ధము, ఆస్థిచ్ఛేదము, క్షారామ్బుపూర్ణరంధ్రప్రవేశము, మాంసభోజనము, పిత్తపానము, మహాఘోరమైన శ్లేష్మ భోజనము, వృక్షాగపతనము, జలాన్తర్మజ్జనము, పాషాణధారాశయనము, కంటక శయనము, పిపీలికాదంశనము, వృశ్చిక పీడనము, వ్యాఘపీడ, శివాపీడ, మహేషపీడనము, కర్ధమ శయనము, దుర్గంధపరిపూరణము, ఆర్ధశయనము, మహాతిక ని షేవణము, అత్యుష్ణతైలపానము, మహాకటు ని షేవణము, కషాయోదక పానము, తప్తపాషాణ తక్షణము. అత్యుష్ణ, శీతస్నానము, దశన శీర్ణనము, తప్తాయ శ్శయనము, అయోభారబంధనము. ఇటువంటి యాతనలు కొన్ని కోట్లు కలవు. వేల సంవత్సరములలో నేను కూడా చెప్పజాలను. ఏ పాపమునకు ఏ యాతన వచ్చునో దానినంతనూ చెప్పెదను వినుము.

బ్రహ్మహా చ సురాపీ చ స్తేయీ చ గురుతల్పగః

మహాపాతకినస్త్వేతే తత్సంసర్గీ చ పంచమః

పంక్తి భేదీ వృథాపాకీ నిత్యం బ్రాహ్మణదూషకః

ఆదేశీ వేదవిక్రేతా పంచైతే బ్రహ్మఘాతకాః

బ్రాహ్మణం యస్సమాహూయ దాస్యామీతి ధనాదికమ్

పశ్చాన్నాస్తితి యో బ్రూయాత్తమాహుర్భ్రహ్మఘాతినమ్

స్నానార్థం పూజనార్థం వా గచ్ఛతో బ్రాహ్మణస్య యః

సమాయాత్యంతరాయత్వం తమాహుర్భ్రహ్మఘాతినమ్

పరనిన్దాసు నిరతశ్చాత్మోత్కర్షరతశ్చ యః

అసత్యనిరతశ్చైవ బ్రహ్మహా పరికీర్తితః

అధర్మస్యానుమంతా చ బ్రహ్మహా పరికీర్తితః

అన్యోద్వేగరత శ్చైవ అన్యేషాం దోషసూచకః

దంభాచారరత శ్చైవ బ్రహ్మ హేత్యభిధీయతే

నిత్యం ప్రతిగ్రహరతస్తథాప్రాణివధేరతః

అధర్మస్యానుమస్తా చ బ్రహ్మహా పరికీర్తితః

బ్రహ్మ హత్యాసమం పాపమేవం బహువిధం నృప

బ్రహ్మ హత్యను చేయువారు, సురాపానమును చేయువారు, చౌర్యమును చేయువారు, గురు పణీసంగమమును చేయువారు ఈ నలుగురు మహాపాతకులు అనబడుదురు. వీరితో సంబంధము కలవాడు అయిదవ మహాపాలకి యగును. భోజనము చేయుచున్న పంక్తిలోని అందరికీ ఒకే విధముగా వడ్డించక భేదమును చూపుదారు, భగవంతునికి నివేదన చేయకనే తినువారు, ఎల్లపుడూ బ్రాహ్మణులను దూషించువారు, కఠినముగా ఆదేశమిచ్చుచారు, చేదమును అమ్ముకొనువారు ఈ అయిదుగురు బ్రహ్మఘాతకులు. ధనాదికమునిచ్చెదనని బ్రాహ్మణుని పిలిచి, తరువాత లేదనువాడు కూడా బ్రహ్మఘాతకుడే. స్నానము కొఱకు కాని పూజించుటను కాని వేళ్ళు బ్రాహ్మణునికి విఘ్నమును కల్పించువాడు కూడా బ్రహ్మఘాతకుడే. పరులను నిందించుటలో, తనను శ్లాఘించుకొనుటలో ఆసక్తి చూపువాడు, అసత్యమును పలుకుటతో ఆనందించువాడు కూడా బ్రహ్మఘాతకుడనబడును. ఇతరులను బాధించుటలో ఆసక్తి కలవాడు. ఇతరుల దోషములనే సూచించువాడు, డాంబికాచారము కలవాడు, బ్రహ్మఘాతకుడే. ఎప్పడూ ఎదుటివానినుండి పరిగ్రహించువాడు, ప్రాణులను వధించు స్వభావము కలవాడు అధర్మమును ఆమోదించువాడు బ్రహ్మఘాతకుడనబడును. ఇట్లు బ్రహ్మహత్యతో సమానమైన పాపము బహువిధములుగా నుండును.

సురాపానసమం పాపం ప్రవక్ష్యామి సమాసతః

గణాన్నభోజనం చైవ గణికానాం ని షేవణమ్

పతితాన్నాదనం చైవ సురాపానసమం స్మరితమ్

ఉపాసనాపరిత్యాగో దేవతానాంచ భోజనమ్

సురాపయోషిత్సంయోగసురాపాన సమస్స్మృతః

యశ్శూద్రేణసమాహూతో భోజనం కురుతే ద్విజు

సురాపీ స హి విజ్ఞేయ స్సర్వధర్మ బహిష్కృతః

యశ్శూద్రోణాభ్యనుజ్ఞాతః పేష్యకర్మ కరోతి చ

సురాపానసమం పాపం లక్షతే స నరాధమః

ఏవం బహువిధం పాపం సురాపానసమం స్మృతమ్

సురాపానముతో సమానమగు పాపమును సంగ్రహముగా చెప్పెదను. వేశ్యా భోజనమును భుజించుట, వేశ్యలను సేవించుట, పతితుల అన్నమును తినుట సురాపానముతో సమానము. చేయుచున్న ఉపాసనను పరిత్యజించుట, దేవలు. (ఆలయాలలోని అర్చకుల) భోజనము, సురాపానము చేయు స్త్రీతో సంగమించుట సురాపానముతో సమానము. శూద్రునిదే ఆహ్వానించబడి భోజనము చేయువాడు అన్ని ధర్మములనుండి బహిష్కరించబడి సురాపి అనబడును. శూద్రుని ఆజ్ఞచే భృత్య కర్మ చేయువానికి సురాపానసమఫలము లభించును. ఇట్లు పలువిధములైన పాపములు సురాపాన సమములుగా చెప్పబడినవి.

హేమ స్తేయసమం పాపం ప్రవక్ష్యామి నిశామయ

కందమూలఫలానాం చ కస్తూరీపటవాససామ్

సదా స్తేయం చ రత్నానాం స్వర్ణస్తే యసమం స్మృతమ్

తామ్రాయస్త్రపుకాంస్యానామాజ్యస్య మధునస్తథా

స్తేయం సుగంధద్రవ్యాణాం స్వర్ణ సేయసమం స్మృతమ్

క్రముకస్యాపి హరణమంభసాం చన్దనస్య చ

పర్ణరసాపహరణం స్వర్ణస్తేయసమం స్మృతమ్

పితృయజ్ఞపరిత్యాగో ధర్మ కార్యవిలోపనమ్

యతీనాం నిన్దనం చైవ స్వర్ణ సేయసమం స్మృతమ్

భక్ష్యాణాం చాపహరణం ధాన్యానాం హరణం తథా

రుద్రాక్షహరణం చైవ స్వర్ణ స్తేయసమం స్మృతమ్

భగినీగమనం చైవ పుత్ర స్త్రీ గమనం తథా

రజస్వలాదిగమనం గురుతల్పసమం స్మృతమ్

హీనజాత్యాదిగమనం మద్యప స్త్రీని షేవణమ్

పరస్త్రీగమనం చైవ గురుతల్పసమం స్మృతమ్

భ్రాతృ స్త్రీగమనం చైవ వయస్య స్త్రీని షేవణమ్

విశ్వస్తాగమనం చైవ గురుతల్పసమం స్మృతమ్

అకాలే కర్మ కరణం పుత్రీగమనమేవ చ

ధర్మ లోపశ్శాస్త్ర నిన్దా గురుతల్పసమం స్మృతమ్

ఇత్యేవమాదయో రాజన్మహాపాతకసంజ్ఞతాః

ఏతే షేకతమేనాపి సంగకృత్తత్సమో భవేత్

యథాకథంచిత్పాపానామేతేషాం పరమర్షిభిః

శాన్తైస్తు నిష్కృతిర్దృష్టా ప్రాయశ్చిత్తాదికల్పనైః

ప్రాయశ్చిత్తవిహీనాని పాపాని శృణు భూపతే

ఇపుడు బంగారమును చౌర్యము చేసినందువలన కలుగు పాపముతో సమాన పాపములను చెప్పెదను వినుము. కందమూలములను, ఫలములను, కస్తూరి మొదలగు సుగంధ ద్రవ్యములను, రత్నములను అపహరించుట సువర్ణ సేయముతో సమానము. రాగి, ఇనుము, సీసము, ఇత్తడి, నెయ్యి, తేనె మొదలగు వాటిని సుగంధద్రవ్యములను, పట్టువస్త్రములను అపహరించుట స్వర్ణ సేయముతో సమానము. వక్కలను, నీటిని చందనమును, ఆకురసములను అపహరించుట స్వర్ణస్తేయముతో సమానము. పితృయజ్ఞమును వదిలి పెట్టుట, ధర్మకార్యములను లో పింపచేయుట, యతులను నిందించుట స్వర్ణ చౌర్యముతో సమానము. తినదగిన పదార్ధములను, ధాన్యములను హరించుట రుద్రాక్ష హరణము స్వర్ణచౌర్యముతో సమము. తోబుట్టువులైన అక్కచెల్లెలు మొదలగు స్త్రీల సంగమము, కొడుకు భార్యను సంగమించుట, రజస్వలా స్త్రీ సంగమము గురు భార్యాసంగమముతో సమానము. హీనజాతి స్త్రీని సంగమించుట, మద్యపానము చేయు స్త్రీని సంగమించుట, పరస్త్రీ గమనము, గురుదారా గమనముతో సమానము, అన్న భార్యను కలియుట, మిత్రుని భార్యను కలియుట, విధవాగమనము , గురదారా. గమనముతో సమానము. కాని కాలములో పనిచేయుట, పుత్రికాసంగమము, ధర్మలోపము, శాస్త్రానిన్ల, గురు భార్యా . గమనముతో సమానము. ఇటువంటివన్నీ మహాపాపములనబడును. వీటిలో ఏ ఒక్కదానిని చేసినను మహాపాపియే యగును. శాంతులైన పరమరులు ఈ మహాపాపములకు నిష్కృతిని (ప్రాయశ్చిత్తమును) కనుగొనిరి. ఇక ఇపుడు ప్రాయశ్చిత్తములు లేని పాపములను చెప్పెదను వినుము.

సమస్త పాపతుల్యాని మహానరకదాని చ

బ్రహ్మహత్యాదిపాపానాం కథం నిష్కృతిర్భవేత్

బ్రాహ్మణం ద్వేష్టి యస్తస్య నిష్కృతి ర్నాస్తి కుత్రచిత్

విశ్వస్త ఘాతినాం చైవ కృతఘ్ననాం నరేశ్వర

శూద్రస్త్రీసంగినాం చైవ నిష్కృతిర్నాస్తి కుత్రచిత్

శూద్రాన్నపుష్టదేహానాం వేదనిందారతాత్మనామ్

సత్కథానిన్దకానాం చ నేహాముత్ర చ నిష్కృతిః

బౌద్ధాలయం విశేద్యస్తు మహాపద్య పి వై ద్విజః

న తస్య నిష్కృతి ర్దృష్టా ప్రాయశ్చిత్తశతైరపి

బౌద్ధాః పాషండినః ప్రోక్తా యతో వేదవినిన్దకాః

తస్మాద్ద్విజస్తాన్నే క్షేత్ర యతో ధర్మ బహిష్కృతాః

జ్ఞానతోఽ జ్ఞానతో వాపి ద్విజో బౌద్ధాలయం విశేల్

జ్ఞాత్వా చేనిష్కృతి ర్నాస్తి శాస్త్రాణామితి నిశ్చయః

ఏతేషాం పాపబాహుళ్యాన్నరకం కోటికల్పకమ్

ప్రాయశ్చిత్తవిహీనాని ప్రోక్తాన్యన్యాని చ ప్రభో

పాపాని తేషాం నరకాన్గదతో మే నిశామయ

ఇవి అన్ని పాపములతో సమానమైన పాపములు. మహానరకము నిచ్చునవి. బ్రహ్మహాత్యాది పాపములకు ఏదో యొక విధముగా నిష్కృతి లభించును. బ్రాహ్మణులను ద్వేషించువారికి ఏ విధముగానైనను నిష్కృతి లేదు. నమ్మిన వారిని చంపిన వారికి, కృతఘ్నులకు; శూద్ర స్త్రీ సంగమమును చేయువారికి నిష్కృతి లభించదు. శూద్రాన్నముతో పుష్టిని పొందిన శరీరము గలవారికి చేందనిందను చేయువారికి, సత్కథానిన్తకులకు ఇహపరములలో నిష్కృతి లేదు. గొప్ప ఆపదలోనైను బౌద్దాలయ ప్రవేశము చేసిన బ్రాహ్మణునికి నూరు ప్రాయశ్చిత్తములు జరిపినను నిష్కృతి లభించదు. బౌద్దులు వేదనిన్హాకులు కావున పాషండులనబడుదురు. ధర్మ బహిష్కృతులు కావున బ్రాహ్మణులు బౌద్ధులవైపు చూడరాదు. తెలిసియైనను తెలియకనైనను బ్రాహ్మణుడు బౌద్దాలయమున ప్రవేశించరాదు. తెలిసి ప్రవేశించినచో నిష్కృతి లభించదు. ఇది శాస్త్ర నిశ్చయము. ఇవి చాల పెద్ద పాపములు కావున కోటి కల్పములు నరకముననుభవించవలయును. ప్రాయశ్చిత్తములు లేని ఇతర పాపములు చాలా కలవు. ఆ పాపములు వాటి వలన కలుగు నరకములను చెప్పెదను. వినుము.

మహాపాతకిన స్తేషు ప్రత్యేకం యుగవాసినః

తదన్తే పృథివీమేత్య సప్తజన్మసు గర్దభాః

తతశ్శ్వానో విద్ధదేహాః భవేయుర్దశజన్మసు

ఆశతాబ్దం విట్ కృమయః సర్పా ద్వాదశజన్మసు

తతస్సహస్రజన్మాని మృగాద్యాః పశవో నృప

శతాబ్దం స్థావరా శ్చైవ తతో గోధాశరీరిణః

తతస్తు సప్తజన్మాని చండాలాః పాపకారిణః

తతష్షోడశ జన్మాని శూద్రాద్యా హీనజాతయః

తతస్తు జన్మద్వితయే దరిద్రా వ్యాధిపీడితాః

ప్రతిగ్రహపరానిత్యం తతో నిరయగాః పునః

అసూయావిష్ఠమనసో రౌరవే నర కే స్మృతమ్

తత్ర కల్పద్వయం స్థిత్వా చాండాలాశ్శతజన్మసు

మా దద స్వేతి యో బ్రూయాద్గవాగ్నిబ్రాహ్మణేషు చ

శునాం యోనిశతం గత్వా చాండాలేషూపజాయతే

తతో విష్ఠాకృమితశ్చైవ తతో వ్యాఘ్రస్త్రీజన్మసు

తదంతే నరకం యాంతి యుగానామేకవింశతిమ్

పరానిన్దాపరా యే చ యే చ నిష్ఠురభాషిణః

దానానాం విఘ్నకర్తార స్తేషాం పాపఫలం శృణు

ముసలోలూఖలాఖ్యం చ చూర్ణ్యంతే తస్కరా భృశమ్

తదన్తే తప్తపాషాణగ్రహణమ్ వత్సరత్రయమ్

తతశ్చ కాలసూత్రేణ భిద్యన్తే సప్తవత్సరాన్

శోచన్తస్సానికర్మాణి పరద్రవ్యాపహారకాః

కర్మణా తత్ర పచ్యన్తే నరకాగ్నిషు సంతతమ్

పైన చెప్పబడిన పాపులందరిలో మహాపాపులు మాత్రము ఒక్కొక్క మహాపాపమునకు ఒక్కొక్క యుగమున నరకమున నుందురు. తరువాత భూలోకమునకు వచ్చి ఏడు జన్మలు గర్గభములుగా, తరువాత ఎపుడూ కొట్టబడు శరీరములు గల కుక్కలుగా పదిజన్మలు పుట్టెదురు. తరువాత నూరు సంవత్సరములు మలములో పురుగులుగా, పన్నెండు జన్మలు పాములుగా, తరువాత వేయి జన్మలు మృగాది పశువులుగా, నూరు సంవత్సరములు, స్థావరములుగా, తరువాత బల్లులుగా, తరువాత ఏడు జన్మలు చండాలులుగా, తరువాత పదునారు జన్మలు హీనజాతులైన శూద్రులుగా, తరువాత రెండు జన్మలు. దరిద్రులుగా వ్యాధి పీడితులూ ఎపుడూ ఎదుటివారినుండి తీసుకొను వారిగా పుట్టి మరల నరకమునకు వెళ్ళెదరు. అసూయ నిండిన మనసు కలవారు రౌరవమను నరకమునకు వెళ్ళెదరు. ఆ రౌరవమున రెండు కల్పములుండి నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గోవులకు అగ్నికి బ్రాహ్మణులకు అర్పించవద్దని చెప్పినవారు నూరు జన్మలు కుక్కలుగా పుట్టి చండాలులుగా పుట్టెదరు. తరువాత మలకీటకములుగా, తరువాత మూడు జన్మలు పెద్దపులులుగా పుట్టి చివరికి మరల నరకమునకు వెళ్ళి ఇరువది యొక్కయుగములు అచటనుందురు. పరులను నిందించువారు, కఠినముగా మాట్లాడువారు దానములకు విఘ్నమును కలిగించువారు చోరులతో సమానము, వారు రోట పడవేయబడి రోకళ్ళతో పొడి చేయబడుదురు. తరువాత బాగుగా కాల్చిన పాషాణమును మూడుసంవత్సరములు పట్టుకొని యుండవలయును. తరువాత ఏడు సంవత్సరములు కాల సూత్రముతో చీల్చబడుదురు. ఇట్లు పరద్రవ్యములన నపహరించినవారు తాము చేసిన కర్మలను గూర్చి విచారించుచు నరకాగ్నిలో పాకము చేయబడుదురు (వారి పాపములు నరకములో పండునని భావము).

పరస్వసూచకానాం చ నరకం శృణు దారుణమ్

యావద్యుగసహస్రం తు తప్తాయఃపిండ భక్షణమ్

సంపీడ్యతే చ రసనా సందంశైర్బృశదారుణైః

నిరుచ్చ్వాసం మహాఘోరే కల్పార్థం నివసన్తి తే

పరస్త్రీలోలుపానాం చ నరకం కథయామి తే

తప్తతామ్రస్త్రీయ స్తేనసురూపాభరణైర్యుతాః

యాదృవీస్తాదృశీస్తాశ్చ రమనే ప్రసభం బహు

విద్రవనం భయేనాసాం గృహ్ణాన్తి ప్రసభం చ తమ్

కథయన్తశ్చ తత్కర్మ నయనేనరకాన్క్రమాత్

అన్యం భజన్తే భూపాల పతిం త్యక్త్వా చ యా శ్రియః

తప్తాయః పురుషాస్తాస్తు తప్తాయశ్శయనే బలాత్

పాతయిత్వా రమన్తే చ బహుకాలం బలాన్వితాః

తత స్తైర్యోషితో ముక్తా హుతాశనసమోజ్జ్వలమ్

అయస్తంభం సమాశ్లిష్య తిష్ఠన్త్యబ్దసహస్రకమ్

తతః క్షారోదకస్నానం క్షారోదక ని షేవణమ్

తదన్తే నరకాన్సర్వాన్ భుంజ్కేఽబ్ద శతం శతమ్

యో హస్తి బ్రాహ్మణం గాం చ క్షత్త్రియం చ నృపోత్తమమ్

స చాపి యాతనాస్సర్వా భుంక్తే కల్పేషు పంచసు

యశృణోతి మహన్నిందాం సాగరం తత్పలం శృణు

తేషాం కర్ణేషు దాప్యన్తే తప్తాయఃకీలసంచయాః

తతశ్చ తేషు చిద్రేషు తైలమత్యుష్ణముల్బణమ్

పూర్యతే చ తతశ్చాపి కుంభీపాకం ప్రపద్యతే

నాస్తికానాం ప్రవక్ష్యామి విముఖానాం హరేహరే

అబ్దానాం కోటి పర్యన్తం లవణం భుంజలే హి తే

తతశ్చ కల్పపర్యన్తం రౌరవే తప్త సైకతే

భజ్యన్తే పాపకర్మాణోఽ న్యేష్వ ప్యేవం నరాధిప

చోరులకు ఇతరుల ద్రవ్యముల జాడను తెలిపి చౌర్యమును చేయుటకు సహకరించిన వారికి కలుగు నరకమును చే ప్పెదను వినుము. చేయి యుగములు బాగుగా కాల్చిన ఉక్కుముద్దను తినుచుందురు. బాగుగా కాల్చిన ఇనుప పట్కారులతో నాలుకను బయటకులాగుచుందురు. తరువాత సగము కల్పము మహాఘోరమైన నరకములో ఊపిరి పీల్చక పడియుందురు. ఇక ఇపుడు పర స్త్రీ సంగమమునందు ఆశ కలవారికి కలుగు నరక యాతనలను తెలి పెదను. బాగుగా కొల్పబడిన రాగి శరీరము కల స్త్రీలు కాల్చబడిన రాగి ఆభరణములను ధరించి ఇదివరకు వీరు కోరిన స్త్రీల వంటి రూపములతో వచ్చి బలవంతముగా రమీంచెదరు. ఆ స్త్రీలను చూచి భయముతో పారిపోవుచున్న పురుషుని బలాత్కారముచే పట్టుకొని పురుషుడు చేసిన పాపకార్యములను స్త్రీ సంగమములను చెప్పుచు నరకముల లోనికి తీసుకొని వెళ్ళి బలవంతముగా రమించేదరు. అట్లే భర్తను వదిలి పరపురుషునితో రమించిన స్త్రీలను నరకములో బాగుగా కాల్చిన ఉక్కు శరీరములు కల పురుషులు బాగుగా కాల్చిన ఉక్కు శయ్యమీద బలవంతముగా పడవేసి బలవంతులు కావున చాలాకాలము రమింతురు. లట్లు చాలా కాలము రమీంచి విడిచిన తరువాత ఆ స్త్రీలు అగ్నివలె మండుచున్న ఉక్కుస్తంభమును ఆలింగనము చేసుకొని చేయి సంవత్సరములుందురు. తరువాత కొరము నీటితో స్నానము చేయుచు కొరము నీరు త్రాగుచుందురు. తరువాత నూరు సంవత్సరములు అన్ని నరకయాతనలననుభవించేదరు. బ్రాహ్మణుని, ఆవును, ఉత్తమరాజగు క్షత్రియుని చంపువారు అయిదు కల్పములు అన్ని నరక యాతనలననుభవించెదరు. మహాత్ములనిందను ఆదరముతో వినువారి చెవులలో బాగుగా కాల్చిన ఇనుప మేకులను నా పెదరు. తరువాత ఆ కర్ణరంధ్రములలో బాగుగా కాగి మసలుచున్న నూనేను నిం పెదరు. తరువాత కుంభీపాక నరకమునకు గొనిపోయెదరు. శ్రీహరి యందు గాని శంకరుని యందు కొన్ని విముఖులైన నాస్తికలు కోటి సంవత్సరములు ఉప్పునే తినుచుందురు. తరువాత బాగుగా కాలియున్న ఇసుక కల గౌరవమునందు ఒక కల్పకాలము యాతనలను అనుభవించి ఇతర యాతనలను కూడా ఇట్లే అనుభవించెదరు.

బ్రాహ్మణాన్యే నిరీక్షన్తే కోపదృష్ట్యా నరాధమాః

తప్తసూచీ సహస్రేణ చక్షు స్తేషాం ప్రసూచ్యతే

తతః క్షారాంబు ధారాభి సేద్యన్తే నృపసత్తమ

తతశ్చ క్రకచైర్ఘోరైర్భిద్యస్తే పాపకర్మణః

విశ్వాసఘాతినాం చైవ మర్యాదాభేదినాం తథా

పరాన్నలోలుపానాం చ నరకం శృణు దారుణమ్

స్వమాంసభోజినో నిత్యం భక్ష్యమాణాశ్వుభిస్తు తే

నర కేషు సమ స్తేషు ప్రత్యేకం హ్యాబ్దవాసినః

ప్రతిగ్రహరతా యే చ యే వై నక్షత్రపాఠకాః

యే చ దేవలకాన్నానాం భోజినస్తాన్ శృణుష్వ మే

రాజన్నాకల్పపర్యన్తం యాతనాస్వాసు దుఃఖితాః

పచ్యన్తే సతతం పాపావిష్టా భోగరతాస్తదా

తలస్తైలేన పూర్యన్తే కాలసూత్రప్రపీడితాః

తతః క్షారోదక స్నానం మూత్రవిష్ఠాని షేవణమ్

తదన్తే భువమాసాద్య భవన్తి మేచ్ఛజాతయః

అన్యోద్వేగరతా యే తు యాన్తి వైతరణీం నదీమ్

త్యక్త పంచమహాయజ్జో లాలాభక్షం వ్రజన్తి హి

ఉపాసనాపరిత్యాగే రౌరవం నరకం వ్రజేత్

విప్రగ్రామకరా దానం కుర్వతాం శృణు భూపతే

యాతనాస్వాసు పచ్యన్తే యావదాచన్ద్రతారకమ్

గ్రామేషు భూపాలవరో యః కుర్యాదధికం కరమ్

స సహస్రకులో భుంక్తే నరకం కల్పపంచసు

విప్రగ్రామకరా దానే యోఽనుమంతా తు పాపకృత్

స ఏవ కృతవాన్రాజన్ ! బ్రహ్మహత్యా సహస్రకమ్

కాలసూత్రే మహాఘోరే స వసేద్ధి చతుర్యుగమ్

అయోనౌ చ వియోనౌ చ పశుయోనౌ చ యో నరః

త్యజేద్రేతో మహాపాపీ స రేతోభోజనం లభేల్

వసాకూపం తతః ప్రాప్య స్థిత్వా దివ్యాబ్ధి సప్తకమ్

రేతోభోజీ భవేన్మర్త్య స్సర్వలోకేషు నిన్దితః

ఉపవాసదినే రాజన్దన్తధావనకృన్నరః

స ఘోరం నరకం యాతి వ్యాఘ్రపక్షం చతుర్యుగమ్

య స్వకర్మ పరిత్యాగీ పాషండీత్యుచ్యతే బుదైః

తత్సజ్గకృతమోఘస్సాయత్తా వుభావతి పాపినౌ

కల్పకోటి సహస్రేషు ప్రాప్నుతో నరకానమాత్

దేవద్రవ్యాపహర్తారో గురుద్రవ్యాపహారకాః

బ్రహ్మహత్యావ్రతసమం దుష్కృతం భుంజతే నృప !

అనాథధనహర్తారో హ్యనాథం యే ద్విషన్తి చ

కల్పకోటి సహస్రాణి నరకే తే వసన్తి చ

స్త్రీ శూద్రాణాం సమీ పేతు యే వేదాధ్యయనే రతాః

తేషాం పాపఫలం వక్ష్యే శృణుష్వ సుసమాహితః

అథఃశీరోర్ధ్వపాదశ్చ కేలితా స్తంభకద్వయే

ధూమ్రపానరతా నిత్యం తిష్ఠన్త్యాబ్రహ్మవత్సరమ్

బ్రాహ్మణులను కోపదృష్టిచే చూచిన నరాధములు వేలకొలది కాల్చిన సూదులచే కన్నులలో పొడువబడుదురు. తరువాత కారపు నీటి ధారలచే చల్లబడుదురు. తరువాత వారి దేహములను గడ్డపొరలచే త్రవ్వదరు. విశ్వాసఘాతకులు మర్యాదను భంగపరచువారు ఇతరుల అన్నమును ఆశించువారు తమ మాంసమును తామే భుజిస్తూ, కుక్కలచే భుజింపబడుచు ప్రతినరకమున ఒక్క సంవత్సరము చొప్పున నివసించెదరు. ఇతరులనుండి దానము గ్రహించుటయందు ఆసక్తి కలవారు, నక్షత్రములను పఠించువారు దేవతల అన్నమును భుజించువారు కల్పము వరకు ఈ యాతనలలో దుఃఖముతో పాపావిష్ణులు భోగరతులూ అగుచు నరకము ననుభవించెదరు. కాల సూత్రమను యాతనచే పీడించబడుచు కాగిన తైలములో ముంపబడుదురు. తరువాత కారపునీటితో స్నానము మలమూత్ర సేవనము చేతురు. తరువాత భూలోకమున మ్లేచ్చ జాతులలో పుట్టదరు. ఇతరులను బాధించువారు వైతరణీ నదిని చేరెదరు. దేవపిత్స బ్రహ్మయజ్ఞాది పంచమహా యజ్ఞములను విడిచినవారు: లాలా భకమను నరకమును పొందెదరు. ఉపాసనను పరిత్యజించినవారు రౌరవ నరకమును పొందెదరు. బ్రాహ్మణసమూహములనుండి పన్నును తీసుకొనువారు సూర్య చంద్రులుండు వరకు ఈ నరకములలో యాతనలను పొందెదరు. గ్రామములలో ఎక్కువ పన్సును గ్రహించు రాజు వేయి తరములు అయిదు కల్పములు నరకముననుభవించును. బ్రాహ్మణులనుండి పన్నును తీసుకొనుటను ఆమోదించినవాడు వేయి బ్రహ్మ హత్యలను చేసినవానితో సమానము. నాలుగు యుగములు మహాఘోరమైన కాల సూత్రమను నరకమున నివసించును. భగినీపుత్రవధు మొదలగు స్త్రీల యందు, శూద్రాది స్త్రీల యందు, పశువులందు వీర్యమునుంచివాడు మహాపాపియగును. అతను నరకమున రేలో భోజనమును చేయును. ఏడు దివ్య వర్షములు వసామాపమను నరకమును పొంది అన్ని లోకములలో నిందించబడుచు రేతో భోజనమును చేయుచుండును. ఉపవాసదినమున దంతధావనమును చేయువాడు నాలుగు యుగములు చ్యొఘ్రపక్షమను నరకమును పొందును. స్వకర్మలను పరిత్యజించువారు పాషండులనబడుదురు. పాషండులతో కలిసియుండువారు కూడా వారితో పాటు వేల కోట్ల కల్పములలో క్రమముగా నరకములను పొందెదరు. దేవ ద్రవ్యములను గురుద్రవ్యముల నపహరించువారు బ్రహ్మ హత్య చేసిన వారితో సమానముగా నరకము ననుభవించెదరు. అనాధల ధనమునపహరించువారు, అనాధలను ద్వేషించువారు కోటి కల్పములు నరకమున నివసింతురు. స్త్రీల సమీపమున, శూద్రులసమీపమున వేదాధ్యయనమును చేయువారు క్రింద తల, పైన పాదములతో తలక్రిందులుగా రెండు స్తంభముల మధ్యన వేలాడుచుందురు. బ్రహ్మ ఉండునంత వరకు ధూమపానము చేయుచు గడుపుచుందురు.

జలే దేవాలయే వాపి యస్త్యజేద్దేహజం మలమ్

భ్రూణహత్యాసమం పాపం సంప్రాప్నోత్యతిదారుణమ్

దంతాస్థి కేశనఖరాన్యే త్యజన్త్యామరాలయే

జలే వా భుక్త శేషం చ తేషాం పాపఫలం శృణు

ప్రాసప్రోతా హలైర్బిన్నా ఆర్తరావవిరావిణః

అత్యుష్ణ తైలపాకేఽ తితవ్యస్తే భృశదారుణే

కుర్వన్తి దుఃఖసంతప్తా స్తతోఽన్యేషు ప్రజన్తిచ

బ్రహ్మ సంహరతే యస్తు దంతకాష్ఠం తథైవ చ

స యాతి నరకం ఘోరం యావదాచన్ద్ర తారకమ్

బ్రహ్మస్వహరణం రాజనిహాముత్ర చ దుఃఖదమ్

ఇహ సంపద్వినాశాయ పరత్ర నరకాయ చ

కూటసాక్ష్యం వదేద్యస్తు తస్య పాపఫలం శృణు

స యాతి యాతనాస్సర్వా యావదిన్ద్రాశ్చతుర్దశ

ఇహ పుత్రాశ్చ పౌత్రాశ్చ వినశ్యన్తి పరత్ర చ

రౌరవం నరకం భుజ్కే తతోఽన్యానపి క్రమాత్

యే చాతికామినో మర్త్యా యే చ మిథ్యాప్రవాదిన

తేషాం ముఖే జతాకాస్తు పూర్యన్తే పన్నగోపమాః

ఏవం షష్టిసహస్రాబ్ధే తతః క్షారాంబు పేచనమ్

యే వృథా మాంసనిరాత స్తే యాన్తి క్షారకర్థమమ్

తతో గజైర్నిపాత్యన్తే మరత పతనం యథా

తదన్తే భువమాసాద్య హీనాంగాః ప్రభవన్తి చ

యస్త్వృతౌ నాభిగచ్ఛేత స్వస్త్రియం మనుజేశ్వర

స యాతి రౌరవం ఘోరం బ్రహ్మ హత్యాం చ విన్హతి

అత్యాచారరతం దృష్ట్వా యః శక్తి న నివారయేత్

తత్పాపం సమవాప్నోతి నరకం తావుభావపి

పాపినాం పాపగణనాం కృత్వా న్యేభ్యో దిశస్తి చ

అస్తీల్వే తుల్యపాపాస్తే మిథ్యాత్వే ద్విగుణా నృప

అపాపే పాతకం యస్తు సమారోష్య వినిన్జలి

స యాతి నరకం ఘోరం యావచ్చన్దార తారకమ్

పాపీనాం నిన్ద్యమానానాం పాపార్ధం క్షయమేతి చ

యస్తు ప్రతాని సంగృహ్య అపమాప్య పరిత్యజేల్

స్కోపి పత్రే అనుభూయార్తిం హీనాంగో జాయతే భువి

అన్యాసం గృహ్యమాణానాం వ్రతానాం విఘ్నకృన్నరః

అతీవ దుఃఖదం రౌద్రం స యాతి శ్లేష్మభోజనమ్

న్యాయే చ ధర్మశిక్షాయా పక్షపాతం కరోతి యః

న తస్య నిష్కృతిర్భూయః ప్రాయశ్చిత్తాయుతైరపి

అభోజ్యభోజ్ సంప్రాప్య విడోజ్యం తు సమాయుతమ్

తతశ్చండాలయోనౌ తు గోమాంసాశీ సదా భవేత్

నీటిలో కాని దేవాలయమున కాని దేహమలమును విడిచినవారు అతి భయంకరమైన భ్రూణహత్యా సమమైన పాపమును పొందెదరు. దేవాలయమున దంతములను ఎముకలను కేశములను, గోళ్ళను వదిలినవారు, తినగా మిగిలిన దానిని జలమున వదిలిన వారు ప్రాసములతో పొడువబడుచు, నాగళ్ళచే చీల్చబడుచు ఆర్తనాదములు చేయుచు, చాలా వేడితో మసలుచున్న నూనెలో బాగుగా గోలించబడుదురు. అటు దుఃఖముచే బాగుగా తపించినవారు ఇతర నరకములలోనికి పంపబడుదురు. బ్రాహ్మణుని చంపినవారు, గంధపు కట్టను నరికిన వారు సూర్య చంద్రులుండు వరకు ఘోర నరకమున నివసింతురు. బ్రాహ్మణ ధనమును అపహరించుట ఇహ పరములలో దుఃఖమునే కలిగించును. ఇహలోకమున సంపదలను నశింపచేయును. పరమున నరకమును కలిగించును. అసత్యపు సాక్ష్యమును చెప్పువారు ఒక కల్పకాలము అన్ని నరక యాతనలను పొందెదరు. ఇహలోకమున పుత్రులు పౌత్రులు నశింతురు. పరలోకమున గౌరవనరకమును ఇతర నరకములను కూడా అనుభవింతురు. అతి కాముకులు, అబద్ధమును మాటలాడువారు చాలా ఘోరమైన నరకమును పొందెదరు. వారి నోటో పాముల వంటి జలగలను నిం పెదరు. అటు ఆరువది వేల సంవత్సరములు అనుభవించిన తరువాత కారపునీటిని చల్లేదరు. వ్యర్థముగా మాంసమును భుజించువారు కారపు బురదలో పడెదరు. తరువాత కాలితో కొట్టబడినట్లుగా యేనుగులచే పడవేయబడుదురు. దాని తరువాత భూలోకమున అంగవికలులుగా జన్మించెదరు. ఋతుకాలమున తన భార్యను సంగమించనివారు ఘోరమైన గౌరవ నరకమును పొందును, బ్రహ్యాహత్యా పాపమును కూడా పొందును. సమర్దుడైయుండి కూడా అత్యాచారములను చేయువారిని వారించనివారు కూడా ఆ పాపమును పొందెదరు. వారిద్దరు నరకమును పొందెదరు. పాపాత్ముల పాపములను లెక్కించుచు ఇతరులకు చెప్పువారు, వారు చెప్పిన పాపములున్నచో వారితో సమానముగా పాపము గలవారీగాను, అసత్యమైనచో రెట్టింపు పాపము గలవారీగా నగుదురు. పాపములేని వానియందు పాపము నారోపించి చెప్పినచో సూర్యచంద్రులు, నక్షత్రములుండు వరకు మహాఘోర నరకమును పొందెదరు. పాపులను నిందించినచో వారి పాపము సగము తొలగును. వ్రతములను ప్రారంభించి పూర్తి చేయక వదిలినచో అసి పత్రమను నరకమున యాతనలననుభవించి, భూలోకమున వికలాంగులుగా జన్మించెదరు. ఇతరులు చేయువ్రతములకు విఘ్నములను కల్పించువారు మిక్కిలి దుఃఖమును కలిగించు, భయంకరమైన శ్లేష్మ భోజనమను నరకమును పొందెదరు. న్యాయమునందు, ధర్మశీక్షలో పక్షపాతమును చూపువారికి పది వేల ప్రాయశ్చిత్తముల నాచరించినను నిష్పతి లభించదు. తినకూడని దానిని తినినవారు మల భోజ్యమను నరకమును పొంది, పిదప చండాలులుగా పుట్టి గోమాంసమును భుజించువారగుదురు.

ఆవమాన్య ద్విజాన్వాగ్భిర్భ్రహ్మ హత్యాం చ విందతి

సర్వాశ్చ యాతనా భుక్త్వా చాండాలో దశజన్మసు

విప్రాయ దీయమానే తు యస్తు విఘ్నం సమాచరేత్

బ్రహ్మహత్యాసమం తేన కర్తవ్యం వ్రతమేవ చ

ఆపహృత్య పరస్యార్ధం యః పరేభ్యః ప్రయచ్ఛతి

ఆపహర్తా తు నిరయి యస్యార్ధస్తస్య తత్ఫలమ్

ప్రతిశ్రుత్యా ప్రదానేన లాలాభక్షం వ్రజేన్నరః

యతినిన్దాపరో రాజన్ శిలామాత్రే ప్రయాతి హి

ఆరామచ్ఛేదినో యాన్తి యుగానామేకవింశతిమ్

శ్వభోజనం తత స్సర్వా భుంజతే యాతనాః క్రమాత్

దేవతాగృహభేత్తారస్తడాగానాం చ భూపతే !

పుష్పారామభిద శ్చైవ యాం గతిం యాంతి తచ్ఛృణు

యాతనాస్వాసు సర్వాసు పచ్యన్తే వై పృథక్ పృథక్

తతశ్చ విష్ఠాకృమయః కల్పానామేకవింశతిమ్

తతశ్చండాలయోనౌ తు శతజన్మాని భూపతే

గ్రామవిధ్వంసకానాం తు దాహకానాం చ లుంపతామ్

మహత్పాపం తదాదేష్టుం న క్షమోఽహం నిజాయుషా

ఉచ్చిష్ట భోజినో యే చ మిత్రద్రోహపరాశ్చ యే

ఏతేషాం యాతనాస్తీవ్రా భవన్త్యాచన్ద్రతారకమ్

ఉచ్ఛిన్న పితృదేవేజ్యా వేదమార్గబహిస్థితాః

పాషణ్డా ఇతి విఖ్యాతా స్తేషాం వై సర్వ యాతనాః

ఏవం బహువిధా భూప యాతనాః పాపకారిణామ్

తేషాం లూసాం చ సంఖ్యానం కర్తుం నాలమహం ప్రభో

పాపానాం యాతనానాం చ ధర్మా ణాం చాపి భూపతే

సంఖ్యాం నిగదితుం లోకే కః క్షమో విష్ణునా వినా

ఏతేషాం సర్వపాపానాం ధర్మ శాస్త్రవిధానతః

ప్రాయశ్చిత్తేషు చర్తేషు పాపరాశిః ప్రణశ్యతి

ప్రాయశ్చిత్తాని కార్యాణి సమీ పే కమలాపతేః

మాటలతో బ్రాహ్మణులను అవమానించినవారు బ్రహ్మ హత్యాపాపమును పొంది అన్ని నరకయాతనల ననుభవించి పది జన్మలు చండాలులుగా పుట్టుదురు. బ్రాహ్మణునకిచ్చు దానమునకు విఘ్నమును కల్పించువారు బ్రహ్మ హత్య చేసినవారు చేయవలసిన ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఇతరుల ధనమును అపహరించి మరొకరికి దానము చేసినచో, అపహరించినవారు నరకమును పొందుదురు. ఆ ధనము ఎవరిదో వారికి దాన ఫలము లభించును. ఇచ్చెదనని మాట ఇచ్చి ఈయని వారు లాలాభక్షమను నరకమును పొందును. యతులను నిందించువారు శిలా మాత్రమను నరకమును పొందును. ఉద్యానవనములను నరకువారు ఇరువది యొక్క యుగములు శ్వభోజనమను నరకమును అనుభవించి వరసగా అన్ని యాతనల ననుభవించేదరు. దేవాలయములను తటాకములను పూలతోటలను ధ్వంసము చేయువారు అన్ని యాతనలను వేరువేరుగా అనుభవించి ఇరువది యొక్క కల్పములు మలములో క్రిములుగా ఉండి, నూరు జన్మలు చండాలులుగా పుట్టెదరు. గ్రామములను ధ్వంసమును చేయువారు, దగ్గముగావించువారు పొందేడు పాపమును, నరకములను నా జీవితకాలమునంతటిలోనూ చెప్పజాలను. ఉచ్చిష్టమును భుజించువారు మిత్రద్రోహులు సూర్య చంద్రులుండు వరకు తీవ్రయాతనలను పొందెదరు. పితృదేవయజ్ఞములను విచ్చిన్నమును చేసినవారు, వేద మార్గములనుండి బహిష్కృతులైన వారు పాషండులనబడెదరు. వారికి అన్ని యాతనలు సంప్రాప్తించును. ఓ రాజా ! ఇట్లు పాపకర్మల నాచరించువారికి చాలా విధములైన యాతనలు కలుగును. ఆ పాపములను యాతనలను లెక్కించు శక్తి నాకు లేదు. పొపములను యాతనలను ధర్మములను లెక్కించుటకు శ్రీ మహావిష్ణువు తప్ప ఇతరులు సమర్దులు కారు. ఈ పాపములనన్నింటికి ధర్మ శాస్త్ర విధానముననుసరించి ప్రాయశ్చిత్తముల నాచరించినచో పాప రాశి నశించును. ఈ ప్రాయశ్చిత్తములనన్నింటిని శ్రీ మహావిష్ణువు సన్నిధిలో నాచరించవలయును.

న్యూనాతిరిక్త కృత్యానాం సంపూర్తికరణాయ చ

గంగా చ తులసీ చైవ సత్సంగో హరికీర్తనమ్

అనసూయా హ్యహింసా చ సర్వే ప్యేతే హి పాపహాః

విష్ణ్వర్పితాని కర్మాణి సఫలాని భవన్తి హి

అనర్పితాని కర్మాణి భస్మ విన్యస్త హవ్యవత్

నిత్యం నైమిత్తికం కామ్యం యచ్చాన్యన్మోక్షసాధనమ్

విష్ణౌ సమర్పితం సర్వం సాత్త్వికం సఫలం భవేత్

హరిభక్తిః పరా నృణాం సర్వపాపప్రణాశినీ

సా భక్తిర్దశధా జ్ఞేయా పాపారణ్యదవోపమా

తామసై రాజసైశ్చైవ సాత్త్వికైశ్చ నృపోత్తమ

యచ్చాన్యస్య వినాశార్థం భజనం శ్రీపతేర్న్పప

సా తొమస్యధమా భక్తిః జలభావధరా యతః

యోఽర్చయేతెతవధియా స్త్వైరిణీ స్వపతిం యథా

నారాయణం జగన్నాధం తామసీ మధ్యమా తు సా

దేవపూజాపరాన్దృష్ట్వా మాత్సర్యాదోఽర్చయేద్ధరిమ్

సా భక్తిః పృథివీపాల తామ సే చోత్తమా స్మృతా

ధనధాన్యాదికం యస్తు ప్రార్డయన్నర్చయేద్దరిమ్

శ్రద్దయా పరయా యుక్తస్సా రాజస్యధనూ స్మృతా

యస్సర్వలోకవిఖ్యాతకీర్తి ముద్దిశ్య మాధవమ్

ఆర్చయేత్పరయా భక్త్యా సా మధ్యా రాజసీ మతా

సాలోక్యాది పదం యస్తు సముద్దిశ్యార్చయ్ఛేరిమ్

సారాజస్యుత్తమా భక్తిః కీర్తితా పృథివీపతే

యస్తు స్వకృతపాపానాం క్షయార్థం ప్రార్చయేద్ధరిమ్

శ్రద్ధయా పరయో పేతః సా సాత్త్విక్యధమా స్మృతా

హరేరిదం ప్రియమితి శుశ్రూషాం కురుతే తు యః

శ్రద్ధయా సంయుతో భూయస్సాత్త్వికీ మధ్యమా తు సా

విధిబుద్ధ్యార్చయేద్యస్తు దానవచ్చ్రీపతిం నృప

భక్తీనాం ప్రవరా సా తు ఉత్తమ సాత్త్వికీ స్మృతా

మహిమానం హరేర్యస్తు కించిత్కృత్వా ప్రియో నరః

తన్మయత్వేన సంతుష్ట స్సా భక్తి రుత్తమోత్తమా

అహమేవపరో విష్ణుర్మయి సర్వమిదం జగత్

ఇతి యస్సతతం పశ్యేత్తం విద్యాదుత్తమోత్తమమ్

ఏవం దశవిధా భక్తిస్సంసారచ్ఛేదకారిణీ

తత్రాపి సాత్త్వికీభక్తి స్సర్వ కొనుఫలప్రదా

తస్మాచ్ఛృణుష్వ భూపాల సంసొరవిజిగీషుణా

స్వకర్మణోఽ విరోధేన భక్తిః కార్యా జనార్ధనే

యస్వధర్మం పరిత్యజ్య భక్తిమాత్రేణ జీవతి

న తస్య తుష్యతే విష్ణురాచారేశైవ తుష్యతే

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్ప్యతే

ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః

తస్మాత్కార్యా హరేర్భక్తి స్వధర్మస్యావిరోధినీ

సదాచారవిహీనానాం ధర్మా అప్యసుఖప్రదాః

స్వధర్మ హీనా భక్తి శ్చాష్యకృతైవ ప్రకీర్తితా

యత్తు పృష్టం త్వయా భూయస్తత్సర్వం గదితం మయా

తస్మాద్ధర్మపరో భూత్వా పూజయస్వ జనార్దనమ్

నారాయణపుణీయాంసం సుఖమేష్యసి శాశ్వతమ్

శివ ఏవ హరిస్సాక్షాద్ధరి రేవ శివస్వయమ్

ద్వయోరస్తరదృగ్యాతి నరకాన్కోటిశః ఖలః

తస్మాద్విష్ణుం శివం వాపి సమం బుద్ధ్వా సమర్చయ

భేదకృద్దు:ఖమాప్నోతి ఇహలోకే పరత్ర చ

ఎక్కువ తక్కువలుగా చేసిన కర్మలను పరిపూర్ణములుగా చేయునవి గంగా తులసి, సత్సంగము, హరికీర్తనము, అసూయ లేకయుండుట, అహింస అనునవి. ఇవి అన్ని పాపములను హరింప చేయును. శ్రీ మహావిష్ణువునకు సమర్పించిన కర్మలు సఫలములగును. శ్రీమహావిష్ణువునకు అర్పించక చేసిన కర్మలు బూడిదలో అర్పించిన హోమద్రవ్యములవంటివి. మోక్షసాధనములైన నిత్యనైమిత్తిక కామ్య కర్మలు, ఇతర కర్మలు విష్ణువున కర్పించినచో సాత్త్వికములు సఫలములగును. మానవులకు అన్ని పాపములను నశింప చేయునది ఉత్తమమైనది హరిభక్తియొక్క ఓ. పొపారణ్యములకు దవాగ్నియైన ఆ హరి భక్తి పది విధములని తెలియుము.సాత్వికములు రాజసములు తామసములుగా భక్తి ప్రభేదములుండును. ఇతరుల వినాశము కొఱకు శ్రీహరిని భజించినచో దుష్ట స్వభావము కలది కావున ఈ భక్తి అధమతామసభక్తి అనబడును. తనకు నచ్చిన పురుషునితో రమించు స్త్రీ తన భర్తను పూజించునట్లు జగన్నాథుడైన నారాయణుని కపటముతో పూజించినచో ఆ భక్తి మధ్యమ తామసభక్తి అనబడును. దేవతలను పూజించువారిని జూచి మాత్సర్యముతో శ్రీహరిని అర్చించినచో ఆ భక్తి ఉత్తమ తామసభక్తి అనబడును. ధనధాన్యాదికములను కోరుచు శ్రీహరిని ఉత్తమమైన శ్రద్దచే పూజించినచో ఆ భక్తి అధమరాజసభక్తి అగును. అన్ని లోకములలో ప్రసిద్ధిపొందు కీర్తి కావలయుని ఉత్తమమైన భక్తి చే శ్రీహరిని పూజించిన చో మధ్యమ రాజసభక్తి యగును. సాలోక్యసాయుజ్యములను కోరుచు శ్రీహరిని పూజించినచో ఉత్తమరాజస భక్తి యనబడును. తాను చేసిన పాపములు నశించవలయునని ఉత్తమ శ్రద్ధతో శ్రీహరిని పూజించినచో అధమ సాత్త్విక భక్తియగును. ఇది శ్రీహరికి ప్రీతిని కలిగించునని శ్రీహరిని సేవించినచో మధ్యమసాత్త్విక భక్తియగును. హరిని పూజించుట నా కర్తవ్యమను బుద్దితో దాసుని వలె శ్రీహరిని పూజించినచో అన్ని భక్తులలో ఉత్తమైనది ఉత్తమ సాత్త్విక భక్తి యగును. శ్రీహరి మహిమను ఏ కొంచెమైనను. గొప్ప సంతోషముతో ప్రీతికలవాడై తన్మయత్వముతో స్తుతించినచో ఉత్తమోత్తమమైన భక్తియగును. నేనే విష్ణువును. ఈ జగత్తంతయు నాలోనే నిలిచియున్నది. అని జగత్తునంతటిని విష్ణుమయముగా చూడగలవాడు ఉత్తమోత్తముడగును. ఇట్లు పది విధములుగా నుండు భక్తి సంసారమును నశింపచేయును. ఈ పదివిధములలోను సాత్త్విక భక్తి అన్ని కోరికలను ప్రసాదించును. కావున ఓ మహారాజా ! సంసారమును గెలువవలయునని కోరువారు తమ కర్మలకు విరోధము కాకుండా శ్రీహరియందు భక్తిని చేయవలయును. స్వధర్మమును వదిలి భక్తిని మాత్రమే చేయువాని విషయమున శ్రీహరి సంతోషించడు. ఆచారముతో మాత్రమే శ్రీహరి సంతోషించును. అన్ని ఆగమములలోను మొడటిది ఆచారమని నిర్ణయించబడినది. ఆచారమునుండే ధర్మము పుట్టును. ధర్మమునకు శ్రీహరి ప్రభువు. కావున స్వధర్మముకు భంగకరము కొని విధముగా శ్రీహరి భక్తిని ఆచరించవలయును. సదాచారము లేనివారికి ధర్మములు సుఖము నీయజాలవు. స్మధర్మా చరణములేని భక్తి లేని దానితో సమానమే. నీవు అడిగిన దానినంతటిని చెప్పితిని. కావున ధర్మపరుడవై జనార్ధనుని పూజించుము. సూక్ష్మరూపుడైన శ్రీమన్నారాయణుని పూజించి ఆనందమును పొందగలవు. శివుడే శ్రీహరి. శ్రీహరియే శివుడు. ఇద్దరిలో భేదమును చూచు ఖలుడు కోటి నరకములను పొందును. కావున శ్రీహరిని కాని శివుని కాని సమానముగా భావించి పూజించుము.భేదమును చూచువాడు ఇహపరములలో దుఃఖమునే పొందును.

యదర్థమహామాయాతస్త్వత్సమీపం జనాధిప !

తత్తే వక్ష్యామి సుమతే ! సావధానం నిశామయ

ఆత్మఘాతకపాప్మానో దగ్ధాః కపిలకోపతః

వసన్తి నరకే తే తు రాజస్తవ పితామహాః

తానుద్ధర మహాభాగ గంగానయనకర్మణా

గంగా సర్వాణి పాపాని నాశయత్యేవ భూపతే !

కేశాస్థినఖదంతాశ్చ భస్మా పి నృపసత్తమ

నయతి విష్ణుసదనం స్పృష్టా గాంగేన వారణా

యస్యాస్థి భస్మ వా రాజన్ గంగాయాం క్షిప్యతే నరైః

స సర్వపాపనిర్ముక్తః ప్రయాతి భవనం హరేః

యాని కాని చ పాపాని ప్రోక్తాని తవ భూపతే

తాని సర్వాణి నశ్యన్తి గంగాబిన్ద్వభి షేచనాత్

ఓ రోజా ! సుబుద్దీ ! నేను నీ వద్దకు వచ్చిన కోరణమును చేప్పెదను. సావధాముగా వినుము. నీ పితామహులు ఆత్మ హత్యా పాపమును చేసి కపిల మహర్షి కోపముచే దహించబడి నరకముననున్నారు. ఓ మహానుభావా! గంగను తీసుకొని వచ్చి నీ పితామహులనుద్దరించుము. గంగ అన్ని పాపములను నశింపచేయును. కేశములు, అస్తులు, నఖములు, దంతములు, చివరికి బూడిద అయిననూ గంగాజలముచే స్పృశించబడినచో శ్రీ విష్ణులోకమును చేర్చును. అస్తులను కాని భస్మమును కాని గంగలో పడవేసినచో అతను అన్నిపాపముల నుండి విముక్తుడై శ్రీహరి భవనమును చేరును. గంగా బిన్హ్వభి షేకము వలన నేను నీకు తెలిపిన పాపములన్నియూ నశించును.

సనక ఉవాచ :-

ఇత్యుక్త్వా మునిశార్దూల మహారాజం భగీరథమ్

ధర్మాత్మానం ధర్మరాజు సద్యశ్చాన్తర్దధే తదా

స తు రాజా మహాప్రాజ్ఞః సర్వశాస్త్రార్ధపారగః

నిక్షిప్య పృథివీం సర్వాం సచివేషు యమౌ వనమ్

తుహినాద్రీ తతో గత్వా నర నారాయణాశ్రమాత్

పశ్చిమే తుహినాక్రాన్తే శృంగే షోడశయోజనే

తపస్తప్వాఽనయామాస గంగాం త్రైలోక్యపావనీమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణే పూర్వభాగే ప్రథమపాదే ధర్మా ఖ్యానే ధర్మరాజోపదే శేన భగీరథస్య గంగానయనోద్యమవర్ణనం నామ పంచదశోఽధ్యాయః

సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేషా ! మహారాజగు భగీరథునితో యమధర్మరాజు ఇట్లు చెప్పి వెంటనే అంతర్థానము చెందెను. సర్వశాస్త్రార్ధకోవిదుడు మహాప్రాజ్ఞుడగు భగీరథమహారాజు మంత్రులయందు రాజ్యభారమునుంచి అరణ్యమునకు వెళ్ళెను. హిమవత్పర్వతమునకు వెళ్ళి అచట నరనారాయణాశ్రమమునకు పశ్చిమమున పదునారు యోజనముల దూరమున మంచుతో కప్పబడియున్న శృంగమున తపస్సు చేసి మూడు లోకములలో పావనమైన గంగను తెప్పించెను.

ఇది శ్రీ బృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున ధర్మా ఖ్యానమున ధర్మరాజోపదేశముచే భగీరథుడు చేసిన గంగానయనోద్యమ వర్ణనమను పదునైదవ అధ్యాయము సమాప్తము.