46 - పిండదాన మహాత్మ్య కథనమ్

వసురువాచ :-

అధతే సంప్రవక్ష్యామి భుక్తిముక్తి ప్రదాయకమ్

తృతీయ దివసే కృత్యం గయాసంగ ఫల ప్రదమ్ 

స్నాత్వాతు బ్రహ్మసరసీ శ్రాద్ధం కుర్యాత్సపిండకమ్

స్నానం కరోమి తీర్దేఽస్మి నృణత్రయ విముక్తయే

శ్రాద్ధాయ పిండదానాయ తర్పణాయార్ధ సిద్ధయే”

తత్కూపయూపయోర్మధ్యే కుర్వంస్తారయతే పితృన్

స్నానం కృత్వోచ్చ్రితో యూపో బ్రహ్మణో యూప ఇత్యుత

కృత్వా బ్రహ్మ సర శ్రాద్ధం బ్రహ్మలోకం నయేత్పతౄన్

గోప్రచార సమీపస్థా ఆమ్రా బ్రహ్మప్రకల్పితాః

తేషాం సేచన మాత్రేణ పితరో మోక్షగామినః

ఆమ్రం బ్రహ్మసరోద్భూతం సర్వదేవమయం విభుమ్

విష్ణురూపం ప్రసించామి పితృణాం చైవ ముక్తయే

ఏకో మునిః కుంభకుశాగ్రహస్త ఆమ్రస్య మూలే సలిలం దదాతి

ఆమ్రాశ్చ సిక్తాః పితరశ్చ తృప్తా ఏకా క్రియా ద్వ్యర్థకరీ ప్రసిద్ధి

ఆచమ్య మూలే సలిలం దదానో నో పేక్షణీయో విబుధైర్మనుష్యః

యూపం ప్రదక్షిణీకృత్య వాజపేయ ఫలం లభేత్

బ్రహ్మణం చ నమస్కృత్య పితృన్భ్రహ్మపురం నయేత్

ఓం నమో బ్రహ్మణేజాయ జగజ్జన్మాదికారిణే

భక్తానాం చ పితృణాం చ తారకాయ నమో నమః”

తతో యమబలిం క్షిప్త్వా మంత్రేణానేన సంయతః

యమరాజ ధర్మారాజౌ నిశ్చలోద్ధా వితి స్థితిః

తాభ్యాం బలిం ప్రయచ్చామి పితృణాం ముక్తి హేతవే”

తత శ్వాన బలిం కృత్వా పూర్వమంత్రేణ మోహిని

తతః కాక బలిం కుర్ద్యా న్మంత్రేణానేన సంయతః

“ఐన్ద్రవారుణ వాయవ్యా యామ్యావైనైఋతాస్తధా

వాయసాః ప్రతిగృహ్ణాన్తు భూమౌ పిండం మయార్పితమ్”

తతస్నానం ప్రకుర్వీత బ్రహ్మతీర్థ కుశాన్వితః

ఏవం తృతీయ దివసే సమాప్య నియమం సుధీః

నత్వా గదాధరం ఏవం బ్రహ్మచర్య పరో భవేత్

ఫల్గుతీర్దే చతుర్దేచ స్నానాదిక మధాచరేత్

గయా శిరస్యధో శ్రాద్ధం పదే కుర్యాత్స పిండకమ్

సాక్షాద్గయా శిరస్తత్ర ఫల్గుతీర్థాశ్రయం కృతమ్

క్రౌంచ పాదాత్ఫల్గు తీర్థం యావత్సా క్షేధయాశిరః

గయాశీరే నగాద్యాశ్చ సాక్షాత్తత్ఫల్గు తీర్థకమ్

ముఖం గయాసుర స్యైత త్స్నా త్ర్వా శ్రాద్ధం సమాచరేత్

ఆద్యో గదాధరో దేవో వ్యక్తావ్యక్తార్థ మాస్థితః

విష్ణ్వాది పదరూపేణ పితృణాంముక్తి హేతవే

తత్ర విష్ణు పదం దివ్యం దర్శనాత్పాపనాశనమ్

స్పర్శ నాత్పూజనాచ్చాపి పితృణాం మోక్షదాయకమ్

శ్రాద్ధం సపిండకం కృత్వా సహస్రకులమాత్మనః

విష్ణులోకం సముద్దృత్య నయేద్విష్ణు పదే నరః

వసువుపలికెను : ఇక ఇప్పుడు నీకు తృతీయ దినమున చేయవలసిన దానిని భుక్తి ముక్తి ప్రదాయకమగు గయాసంగమ ఫలప్రదమును చేప్పెదను. బ్రహ్మసరస్సున స్నానము చేసి పిండ ప్రదానముతో శ్రాద్ధము చేయవలయును. ఋణత్రయ విముక్తికి, శ్రాద్ధము కొరకు, పిండదానము కొరకు, తర్పణము కొరకు అర్ధసిద్ధి కొరకు ఈ తీర్థమున స్నానమును చేయుచున్నాను. ఆ కూపయూపముల మధ్యన శ్రాద్దము చేయుచు పితరులను తరింపచేయును. స్నానము చేసి పెరిగియున్న యూపము బ్రహ్మయూపమనబడును. బ్రహ్మసరస్సు స్నానము చేసి పితరులను బ్రహ్మలోకమును చేర్చును. ప్రచార సమీపస్థ ములు బ్రహ్మ ప్రకల్పితములు ఆక్రములు. వీటిని సేచనమాత్రమున పితరులు మోక్షమునకు వెళ్ళెదరు. బ్రహ్మ సరోద్భూతము, సర్వదేవమయము, విభువు విష్ణు రూపమగు ఆత్రమును తడుపుచున్నాను. పితరులకు ముక్తి కలుగవలయును. కుంభకుశాగ్రహస్తుడగు ఒక ముని ఆమమూలమున సలిలమునుంచును. ఆమవృక్షములు తడియును. పితరులు తృప్తి పొందుదురు. ఒకే పని రెండు ప్రయోజనములను కలిగించును. ఆచమనము చేసి ఆమ్రమూలమున జలమునిచ్చు నరుని దేవతలు పేక్షించరు. యూపమును ప్రదక్షిణమును చేసి వాజపేయ ఫలమును పొందును. బ్రహ్మను నమస్కరించి పితరులను బ్రహ్మపురమునకు చేర్చును.

“ఓం నమో బ్రహ్మణ్వేఽజాయ జగజ్జన్మాదికారిణే.

భక్తానాం చ పితృణాంచ తారకాయ నమోనమః”

అను ఈ మంత్రముచే సమస్తమునుంచి “యమరాజ ధర్మారాజా అను ఈ మంత్రముచే సమస్తము నుంచి “యమారాజ దర్మరాజా నిశ్చలార్గో వితిస్థితిః తాభ్యాం బలిం ప్రయచ్ఛామి పితృణాం ముక్తి హేతవే” అని మంత్రము నుచ్చరించవలయును. ఇక పూర్వమంత్రముచే శ్వాన బలిని చేసి ఈ మంత్రముచే కాక బలిని చేయవలయును” ఐన్ద వారుణ వాయవ్యాయామ్యావైనైఋతాస్తధా

వాయసా: ప్రతిగృహ్ణాన్తు భూమౌ పిండం మయార్పితమ్” అనునది మంత్రము. తరువాత దర్భలను గ్రహించి బ్రహ్మతీర్థమున స్నానమును చేయవలయును. ఇట్లు మూడవదినమున కృత్యమును పూర్తి చేసి గదాధరుని నమస్కరించి బ్రహ్మచర్య పరుడు కావలయును. నాలుగవ దినమున ఫలు తీర్థమున స్నానాదికము నాచరించవలయును. గయాశీరమున సపిండక శ్రాద్దము నాచరించవలయును. గయాశిరమే ఇచట ఫలు తీత్రత్రయమైనది. క్రౌంచపాదము నుండి ఫలుతీర్థము గయాశిరము వరకుండును. గయాశిరమున నగాది నుండి ఉన్నది ఫలు తీర్థము. ఇదియే గయాసురుని ముఖము ఇచట స్నానము చేసి శ్రాద్ధమునాచరించవలయును. ఆది దేవుడగుగదాధరుడు వ్యక్తావ్యక్తము కొరకు .పితరుల ముక్తి కొరకు విష్ణ్వాది పదరూపముగా యుండెను. ఇచట దివ్యమగు విష్ణు పదము దర్శన మాత్రముననే పాపనాశనము. స్పృశించిననూ పూజించిననూ పితరులకు మోక్షమును ప్రసాదించును. సపిండకముగా శ్రాద్ధమునాచరించి తమ సహస్ర కులమునుద్దరించి విష్ణుపదమున విష్ణులోకమును చేర్చును.

శ్రాద్ధం కృత్వా రుద్రపదే నయే త్కులశతం నరః

సహాత్మనా శివపురం తధా బ్రహ్మపదే శుభే

దక్షిణాగ్ని పదే శ్రాద్దీ వాజపేయ ఫలం లభేత్

గార్హపత్య పదే శ్రాద్దీ రాజసూయఫలం లభేత్

శ్రాద్ధం కృత్వా చన్ద్రపదే వాజిమేధ ఫలం లభేత్

శ్రాద్ధం కృత్వా సత్యపదే జ్యోతిష్టోమ ఫలం లభేత్

ఆవసధ్య పదే శ్రాద్ధీ సోమలోకమవాప్నుయాత్

శ్రాద్ధం కృత్వా సత్యపదే శక్రలోకం నయేత్పితౄన్

అన్యేషాంచ పదే శ్రాద్దీ పితృన్భ్రహ్మపదే నయేత్

శ్రాద్దీ సూర్యపదే యశ్చ పాపిన్కోఽర్కపురం నయేత్

కార్తికేయ పదే శ్రాద్ధే శివలోకే నయేత్పతూన్

శ్రాద్ధం కృత్వాగస్త్య పదే బ్రహ్మలోకం నయేత్పితౄన్

సర్వేషాం కాశ్యపం శ్రేష్టం విష్ణో రుద్రస్య వై పదమ్

బ్రహ్మణశ్చ పదం తత్ర సర్వశ్రేష్ఠముదాహృతమ్

ప్రారంభే చ సమాప్తౌచ తేషామన్యతమం స్మృతమ్

శ్రేయస్కరం భవేత్తత్ర శ్రాద్ధకర్తుశ్చ మోహిని

కశ్యపస్య పదే దివ్యో భారద్వాజో మునిః పురా

శ్రాద్ధం హి చోద్యతో దాతుం పిత్రాదిభ్యశ్చ పిండకమ్

శుక్ల కృష్ణౌ తదా హస్తౌ పదముద్భిద్య నిష్కృతౌ

దృష్ట్వా హస్తద్వయం తత్ర పితృసంశయ మాగతః

తతస్స్వ మాతరం శాంతాం భారద్వాజస్తు పృష్టవాన్

కశ్యపస్య పదే కస్మిన్ శుక్లే కృష్ణే పదే పునః

పిండో దేయో మయా మాత ర్జానాసి పితరం వద

తచ్చ్రుత్వా వచనం తస్య భారద్వాజస్య ధీమతః

శాంతోవాచ ప్రసన్నాస్యా పుత్రం శ్రాద్ధప్రదాయినమ్

భారద్వాజ మహాప్రాజ్ఞ పిండం కృష్ణాయ దేహి భోః

శ్వేతో దృశ్యో బ్రవీత్పుత్ర దేహి పుత్రో మమౌరసః

కృష్ణో ఽబ్రవీత్ క్షేత్రజస్త్యం తతో మే దేహి పిండకమ్

శుక్లోఽ బ్రవీత్యైరిణీయం యతో జాతం మమౌరసః

స్వైరిణీ జో దదౌ చాదౌ క్షేత్రిణే బీజినే తతః

తతో భక్త్యా మహాభాగే దత్వా పిండాన్మహామతిః

కృతకృత్యం నిజాత్మానం మేనే ప్రత్యక్షభాషణాత్

భీష్మో విష్ణు పదే శ్రాద్ధ ఆహూయ తు పితృన్వకాన్

శ్రాద్ధం కృత్వా విధానేన పిండదానాయ చోద్యతః

పితుర్వినిర్గతౌ హస్తా గయాశిరసి శంతనోః

భీష్మః పిండం దదౌ భూమౌ నాధికారః కరే యతః

శంతసుః ప్రాహ సంతుష్ట శ్శాస్త్రార్దే నిశ్చలో భవాన్

త్రికాలదర్శీ భవసి విష్ణుశ్చాంతే గతిస్తవ

స్వేచ్ఛయా మరణం చాస్తు ఇత్యుక్త్యా ముక్తి మాగతః

రుద్రపదమున శ్రాద్దము నాచరించి తనతోపాటు కులశతమును శివపురమును చేర్చును. బ్రహ్మపదమున చేసిననూ ఇదే ఫలితము. దక్షిణాగ్ని పదమున శ్రాద్దమునాచరించిన వాజపేయ ఫలము లభించును. గార్హపత్యపదమున శ్రాద్దము చేసినచో రాజసూయ ఫలము లభించును. చంద్రపదమున శ్రాద్ధము నాచరించిన అశ్వమేధ ఫలము లభించును, సత్యపదమున శ్రాద్ధము సోమలోకమునిచ్చును. చస్రపదమున చేయు శ్రాద్ధము ఇవ్రలోకమును చేర్చును. ఇతర పదములలో చేయు శ్రాద్ధము పాపులను కూడా సూర్యపురము చేర్చును. కార్తికేయ పదమున చేయు శ్రాద్దము పితృలోకమునకు పితరులను చేర్చును. అగస్త్యపదమున చేయు శ్రాద్దము బ్రహ్మలోకమున చేర్చును. అన్ని పదములలో కాశ్యప పదము శ్రేష్టము. తరువాత విష్ణుపదము రుద్రపదము బ్రహ్మపదము సర్వశ్రేష్టముగా చెప్పబడినది. ప్రారంభమున కాని సమాప్తిలో కాని వీటిలో ఒక పదమున చేయవలయును. ఇచట శ్రాద్ధకర్తకు మేలు చేకూరును. పూర్వము కశ్యపపదమున భరద్వాజముని శ్రాద్ధమును పిండ ప్రదానమును చేయుటకు సిద్దపడెను. అంతట ఆ పదమును బోధించుకొని శుక్ల కృష్ణ హస్తములు వెడలినవి. రెండు హస్తములను చూచిన భరద్వాజమునికి తండ్రి విషయమున సందేహము కలిగెను. అంత తన తల్లియగు శాంతను తండ్రి వరని యడిగెను. ఈ కశ్యపపదమున శుక్ల హస్తమున చేయవలయునా, కృష్ణ హస్తమున చేయవలయునా తండ్రెవరో నీవు తెలియుదువు కదా అతని మాటను వినిన శాంత కృష్ణవర్లున కీయమని పలికెను. అపుడు భారద్వాజుడు కృష్ణహస్తునకు పిండ ప్రదానము చేయ సిద్దపడెను. అంతట శ్వేత వర్ణుడు కనపడి నీవు నాకు ఔరసపుత్రుడవు కాన నాకిమ్మని అడిగెను. కృష్ణ వర్ణుడు నీవు నాక్షేత్రజుడవు. నాకు పిండమునిమ్ము అని అడిగెను. నీ మాత స్యైరణి కావున నీవు నాకు ఔరసపుత్రుడవు. అనెను. అంతట స్వైరిణీ పుత్రుడగు భరద్వాజుడు మొదట క్షేత్రికి, తరువాత బీజీకి పిండ ప్రదానమును గావించెను. ఇట్లు భక్తిచే ఇరువురికి పిండ ప్రదానమును గావించి వారిరువురు ప్రత్యక్షముగా మాట్లాడినందున తనను తాను కృతకృత్యునిగా తలచెను. భీష్ముడు విష్ణుపదమున శ్రాద్దమును చేయ సంకల్పించి పితరులనాహ్వానించెను. యధావిధిగా శ్రాద్ధమునాచరించి పిండదానమునకు సిద్ధపడెను. అంతట గయాశిరమున తండియగు శంతనుని హస్తములు చాపబడెను. కాని కరమున ఇచ్చుట. కధికారము లేదని భీష్ముడు భూమి యందుంచెను. అంతట శంతనుడు సంతోషించి నీవు శాస్త్రార్థమున నిశ్చలుడవు. కావున త్రికాల దర్శివై స్వేచ్చామరణము కలవాడవై అంతమున విష్ణులోకమున చేరెదవు అని పలికి ముక్తిని పొందెను.

రామో రుద్రపదే రమ్యే పిండార్పణ కృతోద్యమః

పితా దశరధస్స్వర్గా త్ప్రసార్య కరమాగతః

నాదాత్పిండం కరే రామో దదౌ రుద్రపదే తతః

శాస్త్రార్థాతిక్రమాద్బీతో రామం దశరధోఽ బ్రవీత్

తారితోఽహం త్వయా పుత్ర రుద్రలోకోహ్యభూన్మమ

పదే పిండ ప్రదానేన హస్తే తు స్వర్గతిర్న

త్వంచ రాజ్యం చిరం కృత్వా పాలయిత్వా నిజాః ప్రజాః

యజ్ఞాన్స దక్షిణానృత్వా విష్ణులోకం గమిష్యసి

సహాయోధ్యాజనైస్సర్వైః కృమికీటాదిభిస్సహ

ఇత్యుక్త్యా స నృపో రామం రుద్రలోకం పరం యయౌ

కనకేశం చ కేదారం నారసింహం చ వామనమ్

రధమార్గే సమభ్యర్చ్య పితన్సర్వాంశ్చ తారయేత్

 గయా శిరసి యః పిండం యేషాం నామ్నా తు నిర్వ పేత్

నరకస్థా దివం యాంతి స్వర్గస్థా మోక్షగామినః

గయా శిరసి యః పిండం శమీపత్ర ప్రమాణతః

కందమూల పలాద్యైర్వా దద్యాత్స్వర్గం నయే త్పితౄన్

పదాని యత్రదృశ్యంతే విస్ణ్వాదీనాం తదగ్రతః

శ్రాద్ధం కృత్వా పదే యేషాం తేషాం లోకాన్నయేత్పితౄన్

సర్వత్ర ముండపృష్ఠాద్రిః పదే రేబిస్సల క్షితః

ప్రయా న్తి పితరస్త త్ర పూజితా బ్రహ్మణః పదమ్

గయాసరస్య తు శిరో గదయా యద్ద్విధాకృతమ్

యతః ప్రక్షాలితా తీరే గదాలోలస్తతస్మృతః

క్రౌంచరూపేణ హి ముని ర్ముండ పృష్టే తపోఃఽ కరోత్

తస్య పాదాంకకో యస్మాత్ క్రౌంచపాద స్స్మృతస్తతః

విస్ణ్వాదీనాం పదాన్యత్ర లింగరూపస్థితాని చ

దేవాది త్వరణం కృత్వా శ్రాద్ధం రుద్రపదాదితః

చతుర్ధ దివసే కృత్య మేతత్కృత్వాథ మోహిని

పూతః కర్మాధికారీ స్యాచ్చ్రాద్ధ కృద్ర్బహ్మలోక భాక్

శిలాస్థితేషు తీర్ధేషు స్నాత్వా కృత్వాధ తర్పణమ్

శ్రాద్ధం సపిండకం యేషాం బ్రహ్మలోకం ప్రయాన్తి తే

స్థాస్యన్తి చ రమిష్యన్తి యావదాభూత సంప్లవమ్

దేహం త్యక్త్వా శిలాపృష్ఠే స్వేదజాండ జరాయుజాః

గచ్ఛన్తి విష్ణుసాయుజ్యం కులైస్సప్త శతైస్సమం

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తర భాగే మోహినీ వసుసంవాదే గయామహాత్మ్యే విష్ణ్వాది పదే పిండదాన మాహాత్మ్య కధనం నామ షట్చత్వారింశతమోఽధ్యాయ!

శ్రీరామ చంద్రుడు రుద్రపదమున పిండార్పణ చేయుటకు. సిద్దము కాగా తండ్రి యగు దశరధుడు స్వర్గమునుండి చేయి చాచి వచ్చేను. శాస్త్రాతి క్రమభయముచే శ్రీరాముడు చేతిలోనిడక రుద్రపదమున ఇచ్చెను. అపుడు దశరథ మహారాజు రామునితో ఇట్లు పలికెను. నీవిట్లు రుద్రపదమున పిండ ప్రదానము చేయుటచే నేను తరించితిని. నాకు రుద్రలోకము లభించినది. కరమున పిండ ప్రదానము చేసిన స్వర్గము లభించదు. నీవు చాలా కాలము రాజ్యమును చేసి ప్రజలను చక్కగా పాలించి సదక్షిణలుగా యజ్ఞముల నాచరించి విష్ణు లోకమును చేరెదవు. అయోధ్యాజనులతో క్రిమికీటాదులతో విష్ణులోకమునకు వెళ్ళేదవు. ఇట్లు పలికి దశరధ మహారాజు రుద్రలోకమును చేరెను. కనకేశుని కేదారమును నారసింహుని వామనుని రథమార్గమున పూజించి పితరులనందరిని తరింపచేయువచ్చును. గయాశిరమున ఎవరి పేరుతో పిండ ప్రదానమును చేయునో వారు నరకములోనున్న స్వర్గమును, స్వర్గములోనున్న మోక్షమును పొందెదరు. గయా శిరమున కందమూల పలాదులచే కాని శమీపత్ర ప్రమాణముతో పిండ ప్రదానముగావించిన పితరులను స్వర్గమును చేర్చును. విష్ణ్యాది పదములు కనపడుచోట ఆ పదముల ముందు శ్రాద్ధము చేసినచో ఆయా లోకములకు పితరులు చేరుదురు. ముండ పృషాద్రి యంతట ఈ పదముల గురుంలుండును. ఇచట పూజించబడిన పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. గదచే గయాసురుని శిరము రెండుగా చేసి ఆగదను ఈ తీర్థమున కడిగేను కావున గదిలోలమనబడును. ఋషిక్రౌంచరూపముచే ముండ పృష్టమున తపము నాచరించెను. అతని పాదముల ముద్ర పడుటచే క్రౌంచ పాదమని పేరు కలిగినది. విష్ణ్వాది పదములు ఇచట లింగరూపముగా నన్నవి. రుద్ర పదాది తీర్థములలో దేవాది తర్పణమును గావించి శ్రాద్ధమును ఆచరించి ఈ నాలుగవ దినమున కృత్యమునాచరించి పవిత్రుడై కర్మాధికారమును పొంది శ్రాద్ధమును చేయువాడు బ్రహ్మలోకమును పొందును. ప్రేతశిలయందు కల తీర్థములందు స్నానము నాచరించి తర్పణము గావించి సపిండకముగా శ్రాద్ధము చేసినచో పితరులు బ్రహ్మలోకమును చేరెదరు. ఆ బ్రహ్మలోకముననే ప్రలయకాలము వరకు ఉందురు. ఆనందింతురు. స్వేదజ అండజ జరాయుజ ప్రాణులన్నింటిలో శిలాపృష్ఠమున తనువును చాలించిన ప్రాణులు ఏడువందల తరములలో విష్ణుసాయుజ్యమును పొందెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గయా మాహాత్మ్యమున విష్ణ్వాది పదమున పిండదాన మాహాత్మ్య కధనమను నలుబది యారవ అధ్యాయము.