నారద మహా పురాణము
95 - వాయుపురాణానుక్రమణి నిరూపణమ్
బ్రహ్మోవాచ :-
శృణు విప్ర ప్రవక్ష్యామి పురాణం వాయవీయకమ్ ।
యస్మిఞ్చృతే లభేద్ధామ రుద్రస్య పరమాత్మనః
చతుర్వింశత్సాహస్రం తత్పురాణం ప్రకీర్తితమ్ ।
శ్వేతకల్పప్రసంగేన ధర్మానత్రాహ మారుతః
తద్వాయవీయముదితం భాగద్వయ సమన్వితమ్ ।
సర్గాదిలక్షణం యత్ర ప్రోక్తం విప్ర సవిస్తరమ్
మన్వంతరేషు వంశాశ్చ రాజ్ఞాం యే యత్ర కీర్తితాః ।
గయాసురస్య హననం విస్తరాద్యత్ర కీర్తితమ్
మాసానాం చైవ మాహాత్మ్యం మాఘస్యోక్తం ఫలాధికమ్ ।
దానధర్మా రాజధర్మా విస్తరేణోదితాస్తథా
భూపాతాళకకుద్యోమచారీణాం యత్ర నిర్ణయః ।
ప్రతాదీనాం చ పూర్వోయం విభాగ స్సముదాహృతః
ఉత్తరే తస్య భాగే తు నర్మదా తీర్థ వర్ణనమ్ ।
శివస్య సంహితోక్తా వై విస్తరేణ మునీశ్వర
యో దేవ స్సర్వ దేవానాం దుర్విజ్ఞేయ సనాతనః ।
స తు సర్వాత్మనా యస్యా సీరే తిష్ఠతి సంతతమ్
ఇదం బ్రహ్మ హరిరిదం సాక్షాచ్చేదం పరో హరః ।
ఇదం బ్రహ్మ నిరాకారం కైవల్యం నర్మదా జలమ్
ధ్రువం లోకహితార్దాయ శివేన స్వశరీరతః ।
శక్తిః కాపి సరిద్రూపా రేవేయమవతారీతా
యే వసన్యుత్తరే కూలే రుద్రస్యానుచరా హితే ।
వసన్తి యామ్యతీరే యే లోకం తే యాంతి వైష్ణవమ్
ఓంకారేశ్వరమారభ్య యావత్పశ్చిమ సాగరః ।
సంగమాః పంచత్రింశన్నదీనాం పాపనాశనీ
దశైకముత్తరే తీరే త్రయోవింశతి దక్షిణే ।
పంచత్రింశత్తమః ప్రోక్తో రేవాసాగర సంగమః
సంగమై స్సహితాన్యేవ దేవాతీరద్వయేసి చ ।
చతుశ్శతాని తీర్థాని ప్రసిద్దాని చ సంతి హి
షష్టి తీర్థ సహస్రాణి షష్టికోద్యో మునీశ్వర ।
సంతి చాన్యాని రేవాయాస్త్రయుగ్మే పదే పదే
సంహితేయం మహాపుణ్యా శివస్య పరమాత్మనః ।
నర్మదా చరీతం యత్ర వాయునా పరికీర్తితమ్
లిఖిత్వేదం పురాణం తు గుడధేను సమన్వితం ।
శ్రావణ్యాం యో దదేద్భక్త్యా బ్రాహ్మణాయ కుటుంబినే
రుద్రలోకే వసేత్సోపి యావదింద్రాశ్చతుర్ధశ ।
యశ్రావయేద్వా శృణుయాద్వాయవీయ మిదం నరః
నియమేన హవిష్యాశీ స రుద్రో నాత్ర సంశయః ।
యశ్చానుక్రమణీమేతాం శృణోతి శ్రావయేత్తథా
సోపి సర్వపురాణస్య ఫలం శ్రవణజం లభేత్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్ధపాదే వాయుపురాణానుక్రమణీ నిరూపణం నామ పంచనవతి తమోధ్యాయః.
బ్రహ్మ పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా! శివలోకమును ప్రసాదించు వాయు పురాణమును చెప్పేదను వినుము. ఈ వాయు పురాణము ఇరువది నాలుగువేల శ్లోకములు కలది. ఇచట వాయువు శ్వేత కల్ప ప్రసంగముతో ధర్మములను చెప్పెను. కావున దీనిని వాయు పురాణమందురు. రెండు భాగములు కలిగియున్నది. ఈ పురాణమున సవిస్తరముగా సర్గాది లక్షణములు చెప్పబడినవి. మన్వంతరములందు వంశములు, గయాసుర వధ, మాస మాహాత్మ్యములు, మాఘమాస వైశిష్ట్యము, దాన ధర్మములు, రాజ ధర్మములు, భూపాతాళ దిగ్వ్యోమ చారుల నిర్ణయములు, వ్రతాదులు పూర్వభాగమున వర్ణించబడినవి. ఇక ఉత్తరభాగమున నర్మదా తీర్థ వర్ణనము, శివ సంహితా, సర్వదేవతలకు తెలియశక్యము కాని శివుడు సర్వాత్మనా నర్మదాతీరమున నుండుట, ఈ నర్మదా జలమే బ్రహ్మ, విష్ణువు రుద్రుడు, నిరాకార బ్రహ్మ, కైవల్యము, లోకహితము కొఱకు శివుడు తన శరీరము నుండి నదీ రూపమగు ఒకానొక శక్తిని నర్మదా రూపముగా నవతరింప చేసెను. నర్మదానదీ ఉత్తర తీరప్రాంతమున నుండు వారు శివానుచరులు, దక్షిణ తీరమున నుండువారు విష్ణులోకమును చేరెదరు. ఓంకారేశ్వరము మొదలు పశ్చిమ సముద్రము వరకు ముప్పది అయిదు నదుల సంగమములు సర్వపాప నాశకములు, ఉత్తర తీరమున పదకొండు, దక్షిణ తీరమున ఇరువది మూడు, ముప్పది అయిదవది రేవాసాగర సంగమము, రేవా తీర ద్వయమున సంగమములతో కలిసియున్నవే ప్రసిద్ధములగు తీర్థములు నాలుగు వందలు కలవు. అరువది వేల తీర్ధములు, అరువది కోట్ల తీర్థములు ఇతరములు రేవా తీరమున అడగడుగున కలవు. ఇట్లు వాయువుచే కీర్తించబడిన నర్మదా చరితము కల పరమాత్మయగు శివుని సంహిత పరమ పావనమైనది. అని చెప్పబడెను. ఈ పురాణమును వ్రాసి గుడధేను సమన్వితముగా శ్రావణ పూర్ణిమనాడు కుటుంబియగు బ్రాహ్మణునకు దానము చేసిన వారు పదునాలుగు ఇంద్రుల కాలము రుద్ర లోకమున నివసించును. ఈ వాయు పురాణమును హవిస్సును మాత్రమే భుజించుచు నియమ బద్దముగా వినువాడు చెప్పువాడు రుద్రుడే యగును. సంశయముతో పనిలేదు. ఈ వాయుపురాణాను క్రమణిని వినిపించినవాడు, వినినవాడు సర్వపురాణ శ్రవణ ఫలమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున వాయుపురాణ అనుక్రమణీ కథనమను తొంబదియైదవ అధ్యాయము
Summary of chapter 97 of the Nārada Mahā Purana is as follows:
శ్రీరాధాకృష్ణుల నిత్య రాసలీలా విలాస భూమియైన బృందావన క్షత్ర మహిమ ఈ అధ్యాయంలో పరమ భక్తితో వర్ణించబడినది. బృందావన ధూళి స్పర్శ మరియు తులసీ వన దర్శనము వలన లభించే దివ్య ప్రేమభక్తి ఇక్కడ అభివర్ణించబడినది.