56 -  సంహితానిరూపణమ్

సనందన ఉవాచ :-

క్రమాచ్చైత్రాధిమా సేషు మేషాద్యాస్సంక్రమా మతాః

చైత్రశుక్లప్రతిపదీ యో వారస్సనృపస్మృతః

మేషప్రవేశే సేనానీ కర్కటే సస్యపో భవేత్

సమోధ్యధీశ్వరసూర్యో మధ్యమశ్చోత్తమో విధుః

నేష్టః కుజో బుధో జీవో భృగుస్త్వతిశుభంకరః

అధమో రవీజో వాచ్యో జ్ఞాత్వా చైషాం బలాబలమ్

దండాకారే కబంధే వా ధ్వారక్షాకారేఽధకీలకే

దృష్టేర్కమండలే వ్యాధిర్భ్రాన్తిశ్చోరార్థనాశనమ్

ఛత్రధ్వజపతాకాద్యసన్నిభస్తిమితైర్ద్వనైః

రవిమండల గైర్దూమ్రైః సస్ఫులింగైర్జగత్కయః

సితరక్తైః పీతకృష్ణైర్వర్ణైర్విప్రాదిపీడనమ్

ఘ్నంతి ద్వీత్రిచతుర్వర్ణైర్భువి రాజజనాన్ము నే

ఊర్ధైర్భానుకర్తెస్తామ్రైర్నాశం యాతి చమూపతిః

పీతెర్నృపసుత శ్వేతైః పురోధాశ్చిత్రజైర్జనాః

ధూమ్రైర్నృపః పిశం గైస్తు జలదాధోముఖైర్జగత్

శుభోఽరశ్శిశి రే తామ్రః కుంకుమాభా వసన్తి కే

గ్రీష్మ శ్చాపాండురశ్చైవ విచిత్ర జలదాగమే

పద్మోదరాభశ్శరది హేమంతే లో హీతచ్ఛవిః

పీతశ్శీతే సితే వృష్టే గ్రీష్మే లో హితభారవిః

రోగానావృష్టిభయకృత్ క్రమాదుక్తో మునీశ్వర

ఇంద్రచాపార్థమూర్తిస్తు భానుర్భూపవిరోధకృత్

శశరక్తనిభే భానౌ సంగ్రామో న చిరాద్భువి

మయూరపత్రసంకాశో ద్వాదశాబ్దం న వర్షతి

చంద్రమాసదృశో భానుః కుర్యాద్భూపాంతరం క్షితౌ

ఆర్కే శ్యామే కీటభయం భస్మాభే రాష్ట్రజం తథా

ఛిద్రేఽర్కమండలే దృష్టం మహారాజవినాశనమ్

ఘటాకృతిః క్షుద్భయకృత్ పురహా తోరణాకృతిః

ఛత్రాకృతౌ దేశపతిః ఖండభానుర్నృపాంతకృత్

ఉదయాస్తమయే కాలే విద్యుదుల్కాశనిర్యది

తదా నృపవధో జ్ఞేయస్త్వధవా రాజవిగ్రహః

పక్షం పక్షార్థమర్కేందుపరివిష్టావహర్నిశమ్

రాజానమన్యం కురుతో లోహితాంబుదయాస్త గౌ

ఉదయాస్తమయే భానురచ్ఛిన్నశ్శస్త్రసన్నిభైః

ఘనైర్యుద్ధం ఖరోష్ట్రాద్యేః పాపరూ పైర్భయప్రదమ్

సనందన మహర్షి పలికెను :- చైత్రము మొదలు ఫొల్లునము వరకు పన్నెండు నెలలలో వరుసగా మేషము మొదలు మీనము వరకు పన్నెండు సంక్రమణములుండును. చైత్రశుద్దప్రతిపత్ ఏవారమున వచ్చునో ఆగ్రహమే ఆ సంవత్సరమునకు రాజగును. మేషసంక్రమణము ఏ వారమున ప్రవేశించునో ఆగ్రహము సేనాపతియగును. కర్కటసంక్రమణము ఏవారమున వచ్చునో ఆగ్రహము సస్యాధిపతి యగును. సూర్యుడు రాజుగా గల సంవత్సరము మధ్యమము. చంద్రుడు రాజుగా గల సంవత్సరము ఉత్తమము. కుజుడు బుధుడు బృహస్పతి రాజుగా ఉన్న సంవత్సరము మంచిది కాదు. శుక్రుడు రాజుగా ఉన్నచో మిక్కిలి శుభమును కలిగించును. శనిరాజుగా ఉన్నచో అధమము. ఇట్లు ఈ గ్రహముల బలాబలమును తెలిసి విశేష ఫలమును చెప్పవలయును. సూర్యమండలమున దండాకారముకాని, కబంధాకారము కాని, ధ్వాంకొకారము కొని, కీలకముకాని కనపడినచో వ్యాధి, భ్రాంతి, చోరుల వలన అర్థనాశము జరుగును. ఛత్రధ్వజపతాకాద్యాకారములుకొని స్సులింగములతో పొగవలె సూర్యమండలమున కనబడినచో ప్రపంచనాశము సంభవించును. తెలుపు ఎరుపు రంగులు, పసుపు నలుపు రంగులు కనబడినచో విప్రాదులకు పీడకలుగును. రెండు, మూడు, నాలుగు రంగులు ఒకేసారి కనబడినచో రాజులను ప్రజలను నశింపచేయును. తామవర్ణములు గల సూర్యకిరణములు ఊర్థ్వముగా కనబడిన చో సేనాపతి నశించును. పీతవర్ణము కలవైనచో రాజపుత్రుడు, తెలుపు వర్ణము కలవైనచో పురోహితుడు, చిత్రవర్ణమున్నచో ప్రజలు నశింతురు. ధూమ్రవర్ణము కలిగి యున్నచో రాజు, పిశంగవర్ణము కాని, మేఘవర్ణముకాని కలిగి అధోముఖముగా నున్నచో జగత్తు నశించును. శిశిరరుతువున సూర్యుడు తామ్రవర్లగుడైనచో శుభకరుడగును. వసంతరుతువున కుంకుమవర్ణుడు శుభకరుడు. గీష్మరు వులో ఆపాండురవర్ణము కలిగియున్న శుభకరుడు. వర్షఋతువులో చిత్రవర్ణుడు, శరదృతువున పద్మోదరవర్ణుడు, హేమంతఋతువులో లోహిత వర్ణుడు శుభకరుడు. శీతకాలమున పీతవర్ణుడు, వర్షరువులో శ్వేతవర్ణుడు, గ్రీష్మమున లోహిత వర్ణుడు, క్రమముగా రోగమును, అనావృష్టిని, భయమును కలిగించునని చెప్పబడినది. ఇంధ్రధనువులో అర్థభాగము వంటి ఆకారముగల సూర్యుడు రాజులకు విరోధమును కలిగించును. కుందేటి నెత్తురు వర్ణముగల సూర్యుడు భూమండలమున త్వరలో యుద్దము జరుగునని తెలుపును. నెమిలిపింఛము రంగు కలిగియున్నచో పన్నెండు సంవత్సరములు భూమిమీద వర్షము కురియును. సూర్యుడు చంద్రునివలే యున్నచో కొత్తరాజును ఏర్పరచును. సూర్యుడు శ్యామవర్ణుడైనచో కీట భయము, భస్మ వర్ణుడైనచో రాష్ట్ర మువలన భయము, అర్కమండలమున ఛిద్రము కనపడినచో మహారాజనాశము, ఘటాకారముననున్న చో ఆకలిభయమును, తోరణాకారమున నున్నచో పట్టణనాశనమును, ఛత్రాకారమున నున్నచో దేశమునకు హానిని, ఖండభానువు రాజనాశనమును కలిగించును. సూర్యోదయ సమయమున, ఆస్తమయ సమయమున మెరుపులు, ఉల్కాపొతము, పిడుగు పాటు సంభవించినచో రాజవధ కాని, రాజులకు విరోధముకాని జరుగును. పక్షముకాని పక్షార్థముకాని పగలు రాత్రి సూర్యచంద్రులకు పరివేషము కనబడినచో ఉన్న రాజు పోయి కొత్తరాజు వచ్చును. అస్తమయ సమయమున శస్త్రముల ఆకారముకల మేఘములచే సూర్యుడు కప్పబడియున్నచో యుద్ధము సంభవించును. గాడిదలు, ఒంటెలు వంటి ఆకారముగల మేఘములచే కప్పబడినచో భయమును కలిగించును.

 యామ్యశృంగోన్నతశ్చన్దశ్శుభదో మీనమేషయోః

సౌమ్యశృంగోన్నత శ్శ్రేష్ఠో నృయుజ్మకరయోస్తథా

ఘటోక్షస్తు సమః కర్క చాపయోశ్శరసన్నిభః

ఛాపవత్కౌర్మహర్యశ్చ శూలవత్తులకర్కయోః

విపరీతోదితశ్చంద్రో దుర్భిక్షకలహప్రదః

ఆషాఢద్వయమూలేన్ద్రధిష్ణ్యానాం యామ్యగశ్శశీ

అగ్నిప్రదస్తేయచరవనసర్పవినాశకృత్

విశాఖామిత్రయోర్యామ్యపార్శ్వగః పాపగశ్శశీ

మధ్యమః పితృదైవత్యే ద్విదైవే సౌమ్యగశ్శశీ

అప్రాప్యపౌష్ణభాద్రౌద్రామదుక్షావిశశీ శుభః

మధ్యగో ద్వారదక్షాణి అతీత్య నవవాసవాత్

యమేంద్రాహీశనోయేశ మరుతశ్చార్థతారకాః

ధ్రువాదితిద్విదైవాస్స్యురధ్యర్థాంశ్చాపరాస్సమాః

యామ్యశృంగోన్నతో నేష్టశ్శుభశ్శుక్లే పిపీలికా

కార్యహనిః కార్యవృద్ధిర్షానివృద్ధిర్యథాక్రమమ్

సుభిక్షకృద్విశాలేందురవిశాలోఽఘనాశనః

అధోముఖే శస్త్ర భయం కలహో దండసన్నిభే

కుజాద్యైర్ని హతే శృంగే మండలే వా యథాక్రమమ్

క్షేమాద్యం వృష్టిభూపాల జననాశః ప్రజాయతే

సత్యాష్టనవమరేషు సోదయాదిక్రమే కుజే

తద్వక్రముష్ణసంజ్ఞం స్యాత్ప్రజాపీడాగ్నిసంభవః

దశమైకాదశే ఋక్షే ద్వాదశర్వాగ్రతీపయః

కూక్రం వక్రముఖం జ్ఞేయం సస్యవృష్టివినాశకృత్

కుజే త్రయోదశే ఋక్షే వక్రితే వా చతుర్దశే

బాలాస్యచక్రం తత్త స్మిన్ సస్యవృష్టివినాశనమ్

పంచదశే షోడశర్కే వక్రే స్యాద్రుధిరాననమ్

దుర్భిక్షం క్షుద్భయం రోగాన్ కరోతి క్షితినందనః

అష్టాదశే సప్తదశే తద్వక్త్రం ముసలాహ్వయమ్

దుర్భిక్షం ధనధాన్యాదినాశనే భయకృత్సదా

ఫాల్గున్యోరుదితో భౌమో వైశ్వదేవే ప్రతీపగః

అస్తగశ్చతురాస్యార్కే లోకత్రయవినాశకృత్

ఉదితశ్శ్రవణే పుష్యే వక్త్రగోశ్వానహానిదః

యద్దిగ్గోఽభ్యుదితో భౌమస్తద్దిగ్భూషభయప్రదః

మఘామధ్యగతో భౌమస్తత్ర చైవ ప్రతీపగః

ఆవృష్టిశస్త్రభయదః పీడ్యం దేవా నృపాంతకృత్

పితృద్విదైవధాతృణాం భిద్యంతే గండతారకాః

దుర్భిక్షం మరణం రోగం కరోతి క్షితిజస్తదా

త్రిషత్తరాసు రోహిణ్యాం నైరుతే శ్రవణే మృగే

ఆవృష్టిదశ్చరన్భౌమో దక్షిణే రోహిణీ స్థితః

భూమిజస్సర్వధిష్ణ్యానాముదగామీ శుభప్రదం

యామ్యగోఽనిష్టఫలదో భవేద్భేదకరో నృణామ్

వినోత్పాతేన శశినః కదాచిన్నోదయం వ్రజేత్

అనావృష్ట్యగ్నిభయకృత్ అనర్థనృపవిగ్రహః

వసు వైష్ణవవి శ్వేన్దుధాతృభేషు చరన్భుధః

భినత్తి యది తత్తారాం బాధావృష్టిభయంకరః

ఆర్ద్రాదిపితృభాంతేషు దృశ్యతే యది చంద్రజః

తదా దుర్భిక్షకలహగానావృష్టిభీతకృత్

హస్తాదిషట్సు తారాసు విచరన్నిందునందనః

క్షేమం సుభిక్షమారోగ్యం కురుతే రోగనాశనమ్

అహిర్బుధ్న్యార్యమాగ్నేయయామ్య గేషు చరన్బుధః

భిషక్తరంగవాణిజ్యవృత్తీనాం నాశకృత్తదా

పూర్వత్రయే చరన్సౌమ్యో యోగతారాం భినత్తి చేత్

క్షుచ్ఛస్త్రానలచౌరేభ్యో భయదః ప్రాణినాం తదా

యామ్యాగ్నిధాతృవాయవ్యధి ష్ణ్యేషు ప్రాకృతా గతిః

రౌద్రేన్దుసార్పపిత్ర్యేషు జ్ఞేయ మిశ్రాహ్వయా గతిః

భాగ్యర్యమేజ్యాదితిషు సంక్షిప్తా గతిరుచ్యతే

గతిస్తీక్ష్ణాజచరణాహిర్బుధ్యభాశ్రిభేషు యా

యోమాతికాతివిశ్వాంబుమూలమత్స్యేన్యజస్య చ

ఘోరా గత్తిర్హరిత్వాష్ట్ర వసువారుణభేషు చ

ఇంద్రాగ్నిమిత్రమార్తండభేషు పాపాహ్వయా గతిః

ప్రాకృతాద్యాసు గతిషు హ్యుదితోస్తమితోఽపి వా

యావన్త్యైవ దినాన్యేష దృశ్యస్తావత్యదృశ్యగః

చత్వారింశత్క్రమాత్రింశద్రవీన్దూ భూసుతో నవ

పంచదశైకాదశభిర్దివ సైశ్శశినందనః

ప్రాకృతాయాం గతస్సౌమ్యః క్షేమారోగ్యసుభిక్షకృత్

మిశ్రసక్షిప్తయోర్మధ్యే ఫలదోఽన్యాసు వృష్టిదః

వైశాఖే శ్రావణే పౌషే ఆషాఢేఽభ్యుదితో బుధః

జగతాం పాపఫలదస్త్వితరేషు శుభప్రదః

ఇషోర్జమాసయోశ్శస్త్రదుర్భిక్షాగ్నిభయప్రదః

ఉదితశ్చన్ద్రజ శ్శ్రేష్ఠో రజతస్పటికోపమః

ద్విభాటజోదిమాస్తస్య పంచమైకాదశ స్త్రీభాత్

యన్నక్షత్రోదితో జీవస్తన్నక్షత్రాఖ్యవత్సరః

కార్తికో మార్గశీర్షశ్చ నృణాం దుష్టఫలప్రదః

శుభప్రదౌ పౌషమాఘౌ మధ్యమౌ ఫాల్గునో మధుః

మాధవశ్శుభదో జ్యేష్ఠో నృణాం మధ్యఫలప్రదః

శుచిర్మధ్యే నభ శ్శ్రేష్ఠో భాద్రశేష్ఠః క్వచిన్నరః

అతిశ్రేష్ఠ ఇషః ప్రోక్తో మాసానాం ఫలమీదృశమ్

సౌమ్యే భగే చరన్భానాం క్షేమారోగ్యసుభిక్షకృత్

విపరీతో గురుర్యామ్యే మధ్యే చరతి మధ్యమమ్

పీతాగ్ని శ్యామ హరిత రక్త వర్ణోంగిరాః క్రమాత్

వ్యాధ్యగ్ని చౌరశస్త్రాస్త్రాభయదః ప్రాణినాం భవేత్

అనావృష్టిం భూమ్ననిభః కరోతి సురపూజితః

దివాదృష్టో నృపవధ్యామయం వా రాష్ట్ర నాశనమ్

సంవత్సరశరీరం స్యాత్ కృత్తికా రోహిణీ తథా

నాభిస్త్వాటయుగలమాద్రీహృత్కుసుమం మఘా

దుర్భిక్షాగ్నిమరుద్భీతిశ్శరీరం క్రూరపీడితే

నాభ్యాం క్షుత్తృడ్భయం పుష్యే సమ్యజ్మూలిఫలక్షయః

హృదయే శస్యనిధనం శుభం స్యాత్సంయుతైశ్శుభైః

సస్యవృద్ధిః ప్రజారోగ్యం యుద్ధం జీవాత్యవర్షణమ్

ఇతి ద్విజాతిమధ్యాంతు గోనృపస్త్రీ సుఖం మహత్

నిస్స్వనావృష్టిఫణిభిర్వృష్టిస్స్వాస్ఫ్యం మహోత్సవః

మహార్ఘమపి సంపత్తిర్దేశనాశోఽతివర్షణమ్

అవైరం రోగమభయం రోగభీప్సస్యవర్షణే

రోగో ధాన్యం నభోఽదృష్టిర్మఘాధ్యక్షగతే గురౌ

సౌమ్యమధ్యమయామ్యేషు మార్గేషు వీధికోత్రయమ్

శుక్రస్య దస్రభా జ్ఞేయం పర్యాశ్చ త్రిభిస్త్రిభిః

నాగే భైరావతాశ్చైవ వృషభోష్ట్ర ఖరాహ్వయాః

మృగాంజదహనాఖ్యాస్యుర్యామ్యాంతా వీధయో నవ

సౌమ్యుమార్గే చ తిసృషు చరన్వీథిషు భార్గవః

ధాన్యార్థవృష్టిసస్యానాం పరిపూర్తిం కరోతి హి

మధ్యమార్గే చ తిసృషు సర్వమప్యధమం ఫలమ్

పూర్వస్యాం దిశి మేషస్తు శుభదః పితృపంచకే

స్వాతిత్రయే పశ్చిమాయాం తస్యాం శుక్రస్తథావిధః

నిపరీతే త్వనావృష్టిర్వృష్టికృద్ఛధసంయుతః

కృష్ణాష్టమ్యాం చతుర్ధశ్యాం అమాయాం చ యదా సితః

ఉదయాస్తమనం యాతి తదా జలమయీ మహీ

మిథస్సప్తమరాశిస్థే పశ్చాత్ప్రాగ్విధిసంస్థితౌ

గురుశుక్రావనావృష్టిదుర్భిక్షసమరప్రదౌ

కుజజ్ఞజీవరవిజా శుక్రస్యాగ్రేసరా యది

యుద్ధాతిపోయుదుర్భిక్షజలనాశకరా మతాః

జలమిత్ర్యార్యమాహీన్ద్రా నక్షత్రేషు సుభిక్షకృత్

సచ్ఛస్త్రావృష్టిదో మూలేఽహిర్భుధ్న్యాన్త్య భయోర్భయమ్

శ్రవణానితి హస్తార్ద్రౌ భరణీ భాగ్యభేషు చ

చరఞ్చనైశ్చరో నృణాం సుభిక్షారోగ్యసస్యకృత్

ముఖే చైకం గుడే ద్వే చ త్రీణి కే నయనే ద్వయమ్

హృదయే సంచరుక్షాణి వామహస్తే చతుష్టయమ్

వామపాదే తథా త్రీణి దక్షిణే త్రీణి ఖాని చ

చత్వారీ దక్షిణే హస్తే జన్మ భాద్రవిజ స్థితిః

రోగో లాభస్తథా హానిర్ణాభస్సౌఖ్యం చ బంధనమ్

ఆయాస శ్శ్రేష్ఠయాత్రా చ ధనలాభః క్రమాత్ఫలమ్

బహుధారవిజస్త్వేతద్వక్రగః ఫలమీదృశమ్

కరోత్యేవ సమస్సామ్యం శీఘ్ర షూత్క్రమాత్ఫలమ్

విష్ణుచక్రోత్కృత్తశ్రాః పంగుః పీయూషపానతః

అమృత్యుతాం గతస్తత్ర ఖేటత్వే పరికల్పితః

పరణధాతురర్కేన్దూ తుదతే సర్వపర్వణి

విక్షేపావనతేర్వంగాద్రాహుర్దూరగతస్తయోః

దక్షిణ దిక్కున శృంగమున్నతముగా నున్న చంద్రుడు మీనమేషములలో నున్న చో శుభప్రదుడు. మిధున మకరరాశులలో ఉత్తరదిశగా శృంగోన్నతుడగు చంద్రుడు ఉత్తముడు. కుంభ వృషభ రాశులలో చంద్రుడు సముడుగా ఉన్న చో ఉత్తముడు కర్కధనూరాశులలో నున్నచో సముడుగా నుండును. ధనువు వలె వృశ్చిక సింహరాశులలో నున్నపుడు తులా కర్కటకరాశులలో శూలము వలే, విపరీతముగా ఉదయించిన చంద్రుడు దుర్బిక కలహములను కలిగించును. పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రములలో మూలా జ్యేషా నక్షత్రములో నున్న చంద్రుడు దక్షిణదిశలో నున్న చో అగ్నినిచ్చి చోరులను చరప్రాణులను వనములను సర్పములను నశింపచేయును. విశాఖో అనూరాధా నక్షత్రములో నుండి దక్షిణ పార్శ్వభాగమున నుండు చంద్రుడు పాపుడగును. మఘ నక్షత్రములోని చంద్రుడు మధ్యముడు. విశాఖా నక్షత్రమున సౌమ్యుడు. పుష్యమి పూర్వాభాద్ర నక్షత్రాదులలోని చంద్రుడు శుభప్రదుడు. జ్యేష్టా నక్షత్రము నుండి తొమ్మిదన నక్షత్రములను వాటి భరణి జ్యేష్ఠ ఆశ్లేష నక్షత్రములలో కాని, మరుత్తులు అర్థతారకలు పునర్వసు, విశాఖా నక్షత్రములు అర్థ ఫలప్రదములు. ఇతర నక్షత్రములు సమములు. దక్షిణ శృంగోన్నతుడు ఇష్టుడు కాజాలడు. శుక్లపక్షమున పిపీలికారమున శుభుడు. కార్యహాని, కార్య సిద్ది అనునవి క్రమముననుసరించి జరుగును. విశాల చంద్రుడు సుభిక్షమును కలిగించును. అవిశాల చంద్రుడు పాపములను నశింపచేయును. చంద్రుడు ఆధోముఖముగా నున్న చో శస్త్ర భయము, దండాకారమున నున్నచో కలహము సంభవించును. కుజాదులచే శృంగము నిహతమైనను, మండలము నిహతమైనను యథాక్రమముగా క్షేమాదులు వృష్టి, భూపాలనాశము జననాశము కలుగును.

ఆశ్లేషా మఘా నక్షత్రములో కుజుడు ఉదయించి బలవంతుడుగా నుండి వక్రగతుడైనచో ఆ వక్రమునకు ఉష్ణము అని పేరు. దీని వలన ప్రజాపీడ, అగ్నిభయము కలుగును. పదియవ పదకొండవ పన్నెండవ నక్షత్రములలో ఉదయించిన కుజుడు వక్రుడైనచో దానిని కూక్రము అందురు. సస్యమును వర్షమును నశింపచేయును. కుజుడు పదమూడవ నక్షత్రమున నుండుట కాని, పదునాలుగవ నక్షత్రమున వక్రించినచో దానిని బాలాస్య చక్రమందురు. ఇందు సస్యమును వృష్టిని నశింపచేయును. పదునైదు పదునారు నక్షత్రములలో వక్రుడైనచో రుధిరాననమందురు. దీని వలన దుర్భిక్షము, కుదయము, రోగములు కలుగును. పదునేడవ పదునెనిమిదవ నక్షత్రమున వక్రించినచో ముసలమందురు. దీని వలన దుర్భిక్షము, ధనధాన్యాది నాశనము, భయమును కలిగించును. పూర్వఫల్గునీ ఉత్తర ఫల్గునీ నక్షత్రములలో ఉదయించి ఉత్తరాషాఢ నక్షత్రమున వక్రించినచో అట్లే రోహిణీ నక్షత్రమున అస్తమించినచో లోకత్రయమును నశింపచేయును. శ్రవణా నక్షత్రమున ఉదయించి పుష్యమీ నక్షత్రమున వక్రగతిని పొందినచో శ్వానములకు హానిని కలిగించును. కుజుడు ఏ దిక్కున ఉదయించిన ఆ దిక్కులోని రోజులకు భయమును కలిగించును. మఘానక్షత్రమధ్యన చరించును అచటనే వక్రి అయినచో అనావృష్టి శస్త్ర భయము, కలహము రాజర్షయము జరుగును. మఘా విశాఖా రోహిణీ నక్షత్రముల యోగతారకలను కుజుడు భేదించినచో దుర్భిక్షము, మరణము, రోగములు కలుగును. ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, మూల, శ్రవణా మృగశిరా నక్షత్రములలో కుజుడు చరించినచో, అట్లే రోహిణీ నక్షత్రమునకు, దక్షిణ దిశగా యున్నచో అనావృష్టిని కలిగించును. కుజుడు అన్ని నక్షత్రములకు ఉత్తరదిక్కున చలనము కలిగియుండు శుభప్రదము దక్షిణదిశగా వెళ్ళినచో అనిష్టఫలమునిచ్చును. రాజులలో భేదమును కలిగించును. ఉత్పాతము లేకుండా ఒక్కొక్కసారి స్వచ్చమైన ఆకాశమున బుధుడు ఉదయించినచో అనావృష్టి భయమును, అగ్నిభయమును రాజులలో విరోధమును కలిగించును. ధనిషా శ్రవణము, ఉత్తరాషాఢ, మృగశిరా రోహిణీ నక్షత్రములలో చరించు బుధుడు యోగితారలను ఛేదించినచో, ప్రజలలో కలహములు అనావృష్టి కలిగి భయమును కలిగించును.

ఆర్గానక్షత్రము నుండి మఘ నక్షత్రము వరకు బుధుడు చరించునపుడు దుర్భిక్షమును, కలహములను, రోగమును, అనావృష్టిని, భీతిని కలిగించును. హస్త నుండి జ్యేషానక్షత్రము వరకున్న ఆరు నక్షత్రములలో చరించు బుధుడు క్షేమమును, సుభికమును, ఆరోగ్యమును, రోగనాశమును కలిగించును. కృత్తికా, భరణీ నక్షత్రములలో చరించు బుధుడు, వైద్య, తరంగ, వాణిజ్య వృత్తులను నశింపచేయును. పూర్వఫల్గునీ పూర్వాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రములలో చరించు యోగ తారను భేదించినచో ఆకలి వలన, శస్త్రముల వలన, అగ్ని వలన, , చోరుల వలన ప్రాణులకు భయమును కలిగించును. భరణి కృత్తిక, రోహిణి, చిత్తా నక్షత్రములలో ప్రకృత గతి, ఆరుద్ర, మృగశిరా, ఆశ్లేష, మఘా నక్షత్రములలో మిశ్రగతి ఉండవలయును. పూర్వఫల్గుని, ఉత్తరఫల్గునీ, పుష్యమి, పునర్వసు నక్షత్రములలో సంక్షిప్తగతి చెప్పబడినది. ఉత్తరాభాద్ర నక్షత్రమున తీక్లాజచరణగతి భరణి, పుష్యమీ, ధనిష్ట, శతభిష నక్షత్రములలో ఘోరగతి. జ్యేష్టా, కృత్తిక, విశాక, హస్త నక్షత్రములలో పాపగతి యనబడును. ప్రాకృతాదిగతులలో ఉదయించినను, అస్తమించినను ఎన్నిదినములు కనపడునో అన్నియే దినములు కనపడడు. నలుబది దినములు సూర్యుడు, ముప్పది దినములు చంద్రుడు, కుజుడు తొమ్మిదిదినములు, పదిహేను లేదా పదకొండు దినములు బుధుడుండును. బుధుడు ప్రాకృత గతిలో ఉన్నచో క్షేమమును, ఆరోగ్యమును సుభిక్ష మును కలిగించును. మిశ్ర సంక్షిప్తగతులలో నున్ననూ ఫలప్రదుడు. ఇతర గతులలో నున్నచో వృష్టినిచ్చును. వైశాఖ మాసమున, శ్రావణ మాసమున, పుష్యమాసమున, ఆషాఢమాసమున ఉదయించిన బుధుడు జగత్తునకు పాప ఫలమునిచ్చును. ఇతర మాసములలో నుదయించినచో శుభప్రదుడు. ఆశ్వయుజ కార్తీక మాసములలో ఉదయించినచో శస్త్ర, దుర్భిక్ష అగ్ని భయములను కలిగించును. రజత స్పటిక వర్ణముతో ఉదయించిన బుధుడు శేషుడు. బృహస్పతి ఏ నక్షత్రమున ఉదయించునో ఆ నక్షత్రము పేరే ఆ సంవత్సరమునకు ఉండును. కార్తీక మార్గశీర్ష మాసములలో ఉదయించినచో నరులకు దుష్టఫలములనిచ్చును. పుష్యమాఘమాసములలో ఉదయించినచో శుభప్రదుడు. ఫాల్గుణ చైత్ర మాసములు మధ్యమములు. వైశాఖ మాసము శుభప్రదము. జ్యేష్ఠమాసము మధ్యమము. ఆషాఢము మధ్యమము. శ్రావణము శ్రేష్ఠము. భాద్రపదము ఉత్తమము. ఆశ్వయుజమాసము అత్యుత్తమము. ఇది మాసముల ఫలము. నక్షత్రములకు ఉత్తరదిశగా సంచరించు బృహస్పతి క్షేమమును ఆరోగ్యమును సుభిక్షమును ప్రసాదించును. భరణీ నక్షత్రమున చరించుచు విపరీత ఫలమునిచ్చును. మధ్యలో మధ్యమముగా. చరించును. పీత, అగ్ని, శ్యామ, హరిత, రక్త వర్ణములు కల బృహస్పతి క్రమముగా వ్యాధి, అగ్ని, చోర, శస్త్ర, అస్త్ర భయములను కలిగించును. భూమ్నవర్ణము కల బృహస్పతి అనావృష్టిని కలిగించును. పగటి పూట బృహస్పతి కనిపించినచో రాజమరణము, రాష్ట్రమును నశింపచేయు రోగమును కలిగించును. సంవత్సరము శరీరముగా నుండును. కృత్తికా రోహిణి నాభి, ఆర్ద్రపాదయుగలము, మఘహృదయము. శరీరమును క్రూరగ్రహములు పీడించినచో దుర్భిక్షము, అగ్నివాయు భయము కలుగును.

నాభిలో ఉన్నపుడు ఆకలిదప్పుల భయము, పుష్యమీ నక్షత్రమున నున్నచో మూలఫలనాశము హృదయేశనిధనము సంభవించును. శుభగ్రహములచే శరీరము కూడియున్నచో శుభము కలుగును. సస్యవృద్ధి ప్రజారోగ్యము కలుగును. బృహస్పతి అతిచారముచే యుద్ధము సంభవించును. మధ్యలో నున్నచో గో, నృప, స్త్రీ సుఖము కలుగును. అవృష్టి ఫణులచే వృష్టి, స్వాస్థ్యము మహోత్సవము జరుగును. మహార్టమగు సంపద, దేశనాశము, అతివృష్టి, అద్వేషము, రోగము అభయము రోగభయము సస్యవర్షణమున కలుగును. మఘ మొదలగు నక్షత్రములలో బృహస్పతి యున్నచో, రోగము, ధాన్యము కలుగును. శుక్రునికి అంగారకుని వలన ఉత్తర దక్షిణ మధ్య దిశలలో మూడుగతులుండును. నాగ ఇభ ఐరావత, వృషభ, ఉష ఖర, మృగ, ఆంజ, దహనములు అని దక్షిణ దిశతో ముగియు తొమ్మిది వీధులుండును. శుక్రుడు ఉత్తర మార్గమున నుండు మూడు వీధులలో తిరుగుచు ధాన్య, అర్థ వృష్టి సస్యములకు పరిపూర్ణతను కలిగించును. మధ్యమార్గమున నుండు మూడు వీధులలో చరించుచున్నచో అధమ ఫలము సంభవించును. తూర్పుదిక్కులో నుండు మేఘము మఘాది పంచకమున శుభదము. స్వాతి నుండి మూడు నక్షత్రములలో పశ్చిమదిక్కున నుండు శుక్రుడు అట్టిఫలితమునే కలిగించును. విపరీతముగా నున్నచో అనావృష్టి సంభవించును. బుధునితో కలిసియున్నచో వృష్టిని కలిగించును. బహుళాష్టమీ తిథిన, చతుర్దశీ తిథినాడు, అమావాస్యనాడు, శుక్రుడు ఉదయించిననూ, అస్తమించిననూ భూమి జలమయమగును. ఒకరికొకరు ఏడవరాశిలో ఉంటూ పశ్చిమ తూర్పు వీధులలో ఉన్న గురుశుక్రులు అనావృష్టిని, దుర్భిక్షమును, యుద్ధమును కలిగింతురు. శుక్రునికి అగ్రభాగమున కుజుడు, బుధుడు, బృహస్పతి శని చరించుచున్నచో యుద్ధము, వాయువును దుర్భిక్షమును జలసౌశమును కలిగింతురు.

పూర్వాషాఢ, అనూరాధ, ఉత్తర ఫల్గుని, ఆశ్లేష, జ్యేష్ఠా నక్షత్రములలో శుక్రుడున్నచో సుభిక్షమును కలిగించును. ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రములలో నున్నచో భయము. మూలలో నున్న చో వృష్టిని కలిగించును. శ్రవణా, స్వాతి, హస్త ఆర్థ, భరణి, పూర్వఫల్గునీ నక్షత్రములలో చరించు శని నరులకు సుభిక్షమును ఆరోగ్యమును, సస్యమును కలిగించును. శని శరీరాకారమున నక్షత్రముల స్థితి ఇట్లుండును. ముఖమున ఒక నక్షత్రము, గుదమున రెండు నక్షత్రములు, లింగమున మూడు నక్షత్రములు, నేత్రమున రెండు నక్షత్రములు, హృదయమున అయిదు నక్షత్రములు, వామహస్తమున నాలుగు, వామపాదమున మూడు, దక్షిణ పాదమున మూడు, దక్షిణ హస్తమున నాలుగు. ఇది జన్మనక్షత్రము నుండి శని స్థితి. రోగము, లోభము, హాని, లాభము, సౌఖ్యము, బంధనము, ఆయాసము, శ్రేష్ఠయాత్ర, ధనలాభము ఇవిపైన చెప్పిన స్థితుల వలన వరుసలో కలుగు లాభములు. శని ఎక్కువగా వక్రగతిగా నుండును. కావున ఈ ఫలము చెప్పబడినది. సమగతియున్నచో సమఫలమునే యొసంగును. అతిచారమున్న చో ఫలవ్యుతమము జరుగును. విష్ణుచక్రముచే ఛేదించబడిన శిరస్సు కలవాడు, కుంటివాడు, అమృత పానమును చేసినందున అమరత్వమును పొందినవాడు గ్రహముగా కల్పించబడెను. ప్రతిపర్వకాలమున సూర్య చంద్రులను బాధించుచుండును. ఇతనే రాహువు. ఈ రాహువు విక్షేపము చేయబడుటవలన, అవనతి వలన సూర్య చంద్రులకు దూరముగా నుండును.

షణ్మాసవృద్ధ్యా గ్రహణం శోధయేద్రవిచంద్రయోః

పర్వేశాస్తు తథా సత్యదేవా రవ్యాదితః క్రమాత్

బ్రహ్మేంద్వంద్రధనాధీశవరుణాగ్నియమాహ్వయాః

పశుసస్యద్విజాతీనాం వృద్ధిర్భ్రాహ్మే తు పర్వణి

తద్వదేవ ఫలం సౌమ్యే శ్లేష్మ పీడా చ పర్వణి

విరోధో భూభుజాం దుఃఖం ఐన్ద్రే సస్యవినాశనమ్

ధనినాం ధనహానిస్స్యాత్కౌబేరం ధాన్యవర్ధనమ్

నృపాణామశివం క్షేమమిత రేషాం చ వారుణే

ప్రవర్షణం సస్యవృద్ధిః క్షేమం హౌతాశపర్వణి

అనావృష్టిస్సస్యహానిర్దుర్భిక్షం యామ్యపర్వణి

వేలాహీనే సస్యహానిర్నృపాణాం దారుణం రణమ్

అతివేలే పుష్పహానిర్భయం సస్యవినాశనమ్

ఏకస్మిన్నేవ మాసేతు చంద్రార్కగ్రహణం యదా

విరోధో ధరణీశానామర్థవృష్టివినాశనమ్

గ్రస్తోదితావస్తమితౌ నృపధాన్యవినాశదౌ

సర్వగ్రస్తావినేందూ తు క్షుద్వాధ్యగ్నిభయప్రదౌ

సౌమ్యాయనేక్షత్ర విప్రానితరాన్హన్తి దక్షిణే

ద్విజాతీం శ్చక్రమాద్ధన్తి రాహుదృష్టోరగాదితః

తథైవ గ్రామభౌదాస్స్యు మోక్షభేదాస్తథా దశ

నో శక్తా లక్షితుం దేవాః కిం పునః ప్రాకృతా జనాః

ఆనీయ ఖేటాన్గణితాన్ తేషాం వారం విచిన్తయేత్

శుభాశుభాన్యైః కాలస్య గ్రాహయామో హి లక్షణమ్

తస్మాదన్వేషణీయం తత్ కాలజ్ఞానాయ ధీమతా

ఉత్పాతరూపాః కేతూనాముదయాస్తమయా నృణామ్

దివ్యాంతరిక్షాభౌమా స్తే శుభాశుభఫలప్రదాః

యజ్ఞద్వజాస్త్రభవనరక్షావృద్ధిం గజోపమాః

స్తమ్భశూలాంకుశాకారా ఆంతరిక్షాః ప్రకీర్తితాః

నక్షత్రాంశస్థితా దివ్యా భౌమా యే భూమిసంస్థితాః

ఏకోఽపి భిన్నరూపస్స్యాత్ జంతుర్నామ శుభాయ వై

యావన్తో దివసాన్కేతుర్ద్రుశ్యతే వివిధాత్మకః

తావన్మా సైః ఫలం యచ్ఛత్సష్టౌ సారవ్యవత్సరైః

యే దివ్యాః కేతవ స్తేఽపి శశ్వజ్జీవఫలప్రదాః

హ్రస్వ స్నిగ్ధస్సుప్రసన్నః శ్వేత కేతుస్సువృష్టికృత్

క్షిప్రాదస్తమయం యాతి దీర్ఘ కేతురవృష్టికృత్

అనిష్టదో ధూమకేతుశ్శక్రచాపసమప్రభః

ద్విత్రిచతుశ్శూలరూపస్స చ రాజ్యాంతకృన్మతః

మణిహారస్తు వర్ణాభా దీప్తిమంతోఽర్కసూనవః

కేతవశ్చోదితాః పూర్వపరయోర్న్పపహానిదాః

వంసుకబింబక్షితిజచ్ఛుకతుండాదిసన్నిభాః

హుతాశనోదితాస్తేఽపి కేతవః ఫలదాస్మృతాః

భూసుతా జలతైలాభా వర్తులా క్షుద్భయప్రదాః

సుభిక్ష క్షేమదాశ్వేతకేతవసోమసూనవః

పితామహాత్మజః కేతుస్త్రివర్ణ స్త్రిదశాన్వితః

బ్రహ్మదండాద్ధూమకేతుః ప్రజానామంతకృన్మతః

ఐశాన్యాం భార్గవసుతాః శ్వేతరూపాస్త్వనిష్టదాః

అనిష్టదాః పంగుసుతా విశిఖా కమకాహ్వయాః

వికచాఖ్యా గురుసుతా వేష్టా యామ్యే స్థితా అపి

సూక్ష్మాశ్శుక్లా బుధసుతాశ్చౌరరోగభయప్రదాః

కుజాత్మజాః కుంకుమాఖ్యా రక్తాశ్శూలాస్త్వనిష్టదాః

అగ్నిజా విశ్వరూపాఖ్యా అగ్నివర్ణాస్సుఖప్రదాః

అరుణాశ్శ్యామలాకారా అర్కపుత్రాశ్చ పాపదాః

శుక్రజా ఋక్షసదృశాః కేతవశ్శుభదాయకాః

కృత్తికాసు భవో ధూమకేతుర్నూనం ప్రజాక్షయః

ప్రాసాదవృక్ష శైలేషు జాతో రాజ్ఞాం వినాశకృత్

సుభిక్షకృత్కౌముదాఖ్యః కేతుః కుముదసన్నిభః

ఆవర్త కే తు సంధ్యాయాం శశిరనిష్టదాయకః

బ్రహ్మ దేవమనోర్మానపిత్ర్యం సౌరం చ సావనమ్

చాంద్రమానం గురోర్మానమితి మానాని వై నవ

ఏతేషాం నవమానానాం వ్యవహారోఽత్ర పంచభిః

తేషాం పృథక్పృథక్కార్యం వక్ష్యతే వ్యవహారతం

గ్రహాణాం నిఖిలశ్చారో గృహ్యతే సౌరమానతః

వృష్టేర్విధానం స్త్రీగర్భస్సావ నేనైవ గృహ్యతే

ప్రవర్షణం సమే గర్భౌ నాక్షత్రేణ ప్రగృహ్యతే

యాత్రో ద్వాహవ్రతక్షారే తిథివర్షేశనిర్ణయః

పర్వతాస్తూపవాసాది కృత్స్నం చాంద్రేణ గృహ్యతే

గృహ్యతే గురుమానేన ప్రభవాద్యబ్దిలక్షణమ్

తత్తన్మా సైర్ద్వాదశభిస్తత్తదష్టౌ భవేత్తతః

గురుమధ్యమచారేణ షష్ట్యబ్దాః ప్రభవాదయః

ప్రభవో విభవశ్శుక్లప్రమోదోఽథ ప్రజాపతిః

అంగిరాశ్శీముఖో భావో యువా ధాతా తథైవ చ

ఈశ్వరో బహుధాన్యశ్చ ప్రమాధీ విక్రమో వృషః

చిత్రభానుస్సుభానుశ్చ తారణః పార్థివోఽవ్యయః

సర్వజిత్సర్వధారీ చ విరోధీ వికృతః ఖరః

నందనో విజయశ్చైవ జయో మన్మథదుర్ము ఖౌ

హేవిలంబో విలంబశ్చ వికారీ శార్వరీ లవః

శుభకృచ్చోభనః క్రోధీ విశ్వావసుపరాభవౌ

ప్లవంగః కీలకస్సౌమ్యస్సామాప్తశ్చ విరోధకృత్

పరిభావీ ప్రమాదీ చ ఆనందో రాక్షసోనలః

పింగలః కాలయుక్తశ్చ సిద్ధార్ధో రౌద్రదుర్మతీ

దుందుభిరుధిరోద్గారీ రక్తాక్షః క్రోధనః క్షయః

ప్రతి ఆరునెలలకు సూర్యచంద్రుల గ్రహణమును పరిశోధించవలయును. ఈ పర్వలకు సూర్యుని నుండి వరుసగా సత్య దేవులు అధిపతులు. బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, అగ్ని, యముడు అనువారలు అధిపతులు. బ్రాహ్మపర్వమున పశుసస్యబ్రాహ్మణ వృద్ధి జరుగును. చంద్ర పర్వమున కూడా ఇట్టిఫలితమే కలుగును. ఈ పర్వమున శ్లేష్మ పీడ యుండును. ఇంద్రపర్వమున రాజులకు పరస్పర విరోధము, సస్యనాశము, ధనవంతులకు ధననాశము కలుగును.కౌబేర పర్వలో ధాన్యవృద్ధి రాజులకు మాత్రము అశుభము కలుగును. వరుణపర్వలో రాజభిన్నులకు క్షేమము కలుగును బాగుగా వర్షించును. సస్యవృద్ధి క్షేమము కలుగును. అగ్నిపర్వలో అనావృష్టి, సస్యహాని, దుర్భిక్షము కలుగును. యమపర్వలో కాలము కాని కాలమున సస్యహాని రాజులకు పరస్పర యుద్ధము, పుష్పహాని, భయము, సస్యనాశము కలుగును. ఒకే నెలలో సూర్యచంద్రులకు గ్రహణము సంభవించినచో రాజులకు పరస్పర విరోధము, అర్ధనాశము, వృష్టినాశము కలుగను. గ్రస్తులైన ఉదయించిన సూర్య చంద్రులు, గ్రస్తులై ఆస్తమించిన సూర్యచంద్రులు నృపనాశమును, ధాన్యనాశమును చేయుదురు. సూర్యచంద్రులు సంపూర్ణముగా గ్రహించబడినచో (సంపూర్ణ గ్రహణము) ఆకలి, వ్యాధి, అగ్ని భయమును కలిగింతురు. ఉత్తరాయణమున గ్రహణమేర్పడినచో క్షత్రియులను బ్రాహ్మణులను నశింపచేయును. దక్షిణాయనమున ఏర్పడినచో ఇతరులను నశింపచేయును. రాహుదృష్టమగు ఉరగాదుల వలన బ్రాహ్మణులను నశింపచేయును. అట్ల గ్రామభేదములు మోక్ష భేదములు పదియున్నవి. ఈ భేదములను దేవతలే తెలియలేదు. ఇక ప్రాకృత జనులెట్లు తెలియగలరు. గ్రహగణితములను తీసుకొని వారి భాగములను ఆలోచించవలయును. కాలముయొక్క లక్షణమును శుభాశుభ మధ్యమములచే గ్రహించవలయును. కావున మానవులు కాలజ్ఞానము కొరకు కేతువుల ఉదయాస్తమయములను ఉత్పాతరూపములను పరిశీలించవలయును.

దివ్యములు, అంతరిక్షములు భౌమములని ఆ ఉత్పాతరూపములు మూడువిధములు. ఇవియే శుభాశుభఫలములనిచ్చునవి. యజ్ఞధ్వజ, అస్త్ర, భవనముల రక్షను వృద్ధి పరుచునవి గజోపమములైన కేతువులు సమ్బ, శూల, అంకుశాకారములతో నుండు కేతువులు అంతరిక్షములనబడును. నక్షత్రాంశలలో నుండునవి దివ్యములు. భూమి పైనున్న వాటిని భౌమములందురు. జంతువు యొక్క నామము ఒక టైనను భిన్నరూపము నొందినచో శుభమును కలిగించును. కేతువు పలురూపములతో ఎన్నిదినములు కనపడునో అన్నిమాసములు ఫలమునిచ్చును. దివ్యములైన కేతువులు కూడా జీవులకు ఫలముల నిచ్చునవే. హ్రస్వము, స్నిగ్ధము సుప్రసన్నము అగు శ్వేత కేతువు సువృష్టిని కలిగించును. ఇంద్రధనువు వంటి కాంతిగల ధూమకేతువు అనిష్ట ఫలము నొసంగును. ద్విశూల, త్రిశూల, చతుశూలరూపమగు కేతువు రాజ్యమును నశింపచేయును.

పలువర్ణములు కల మణిహారములు మిక్కిలి కాంతి గలవి సూర్యుని నుండి పుట్టునవి. తూర్పు పశ్చిమ దిశలలో ఉదయించిన కేతువులు రాజులకు హానిని కలిగించును. వంసుక, బింబ, క్షితిజ, శుక్రతుండముల వలెనుండు కేతువులు అగ్నినుండి పుట్టునవి. ఇవి కూడా ప్రాణులకు ఫలముల నొసంగును. జలము వలె, తైలము వలె గుండ్రగా నుండు కేతువులు భూపుత్రులు. ఇవి ఆకలి, భయములను కలిగించును. చంద్రుని నుండి పుట్టిన శ్వేతకేతువులు సుభికమును క్షేమమును కలిగించును. పితామహుని నుండిన కేతువు మూడువర్ణములు, మూడు దశలు కలిగియుండును. బ్రహ్మ దండము నుండి పుట్టిన ధూమ కేతువు ప్రజలను నశింపచేయును. ఈశాన్యదిక్కున ఉదయించు శ్వేత కేతువు శుక్రుని వలన పుట్టునది. ఇది అనిష్టమును కలిగించును. శనిపుత్రులగు కమకములను పేరు గల శిఖలు లేని కేతువులు కూడా అనిష్టమునే కలిగించును. గురుపుత్రులగు ఏకచములను పేరుగల కేతువులు దక్షిణదిక్కున నుండునవైనను ఇష్టఫలములనే ఒసంగును. బుధుని నుండి పుట్టిన కేతువులు సూక్ష్మములు శుక్లములు చోర, రోగ భయములను కలిగించును. కుజుని నుండి పుట్టిన కేతువులు కుంకుమ అను పేరుగలవి రక్త వర్ణములు గలవి. శూలాకారముతో నుండునవి అనిష్టమును కలిగించును. అగ్నివలన పుట్టునవి విశ్వరూపములు అను పేరుగలవి అగ్నివర్ణములు సుఖమును కలిగించును. సూర్యపుత్రులు అరుణములనునవి శ్యామలా కారమున నుండునవి పాపఫలమునే ఇచ్చును. శుక్రుని వలన పుట్టినవి నక్షత్రము వలె నుండునవి శుభఫలము నొసంగును. కృత్తికలలో పుట్టు ధూమకేతువు ప్రజాక్షయమును కలిగించును. ప్రాసాద వృక్ష శైలములలో పుట్టిన కేతువులు రాజులను నశింపచేయును. కలువ వలె నుండు కుముదమను పేరు గల కేతువు సుభిక్షమును చేయును. సంధ్యాసమయమున పుట్టు ఆవర్త కేతువు అనిష్టఫలము నొసంగును. కాలమానము తొమ్మిది విధములు. బ్రహ్మ మానము, దేవమానము, మనుమానము, పిత్సమానము, సౌరమానము, సావనమానము, చాంద్రమానము, నక్షత్రమానము, గురుమానము అని ఈ నవమానముల వ్యవహారము అయిదింటిచే చేయబడును. ఈ మానములకు వ్యవహారము ననుసరించి వేరువేరుగా చెప్పబడును. సౌరమానముననుసరించి అన్ని గ్రహముల అన్ని చారములను గ్రహించెదరు. వర్షవిధానము, స్త్రీగర్బవిషయమును సావనమానముచే గ్రహించెదరు. ప్రవర్ణణమును, సమగర్భములను నక్షత్రమానముచే గ్రహించెదరు. యాత్రలు, వివాహము, వ్రతములు, క్షౌరము, తిథి, వర్షాధిపతి నిర్ణయము, పర్వము, వాస్తు, ఉపవాసాదులు చాంద్రమానముచే చేయబడును. ప్రభవాది సంవత్సర లక్షణములను గురుమానముచే తెలియుదురు. ఆయా పన్నెండు మాసములచే, ఆయా అష్టకములు ఏర్పడును. గురుమధ్యమ చారముచే ప్రభవ మొదలుకొని అరువది సంవత్సరములుండును. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజాపతి, అంగిరా, శ్రీముఖ, భావ, యువ, ధాత, ఈశ్వర, బహుధాన్య, ప్రమాధీ, విక్రమ, వృష, చిత్రభాను, సుభాను, తారణ, పార్థివ, అవ్యయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నంద, విజయ, జయ, మన్మథ, దుర్ముఖ, హేమలంబ, విలంబ, వికారి, శార్వరి, లవ, శుభకృత్, శోభన, క్రోధి, విశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సామాప్త, విరోధకృత్, పరిభావి, ప్రమాది, ఆనంద, రాక్షస, నల, పింగల, కాలయుక్త, సిద్ధార్థ, రౌద్రి, దుర్మతి, దుందుభి, రుధిరోద్గారి, రక్తాక్షీ, క్రోధన క్షయ అనునవి అరువది సంవత్సరములు.

నామతుల్యఫలాస్సర్వే విజేయాష్టష్టి వత్సరాః

యుగం స్యాత్పంచభిర్వర్షై యుగాన్యేవంతు ద్వాదశ

తేషామీశాః క్రమా జ్ఞేయా విష్ణు ర్దేవపురోహితః

పురందరో లోహితశ్చ త్వష్టాహిర్బుధ్న్యసంజ్ఞకః

పితరశ్చ తతో విశ్వే శకీన్ద్రాగ్న్యశ్వినో భగః

తధా యుగస్య వర్షేశాస్త్వగ్నినేందువిధీశ్వరాః

అదాబ్ధేశ చమూనాథ సస్యపానాం బలాబలమ్

తత్కాలం గ్రహచారం చ సమ్యక్ జ్ఞాత్వా ఫలం వదేత్

సౌమ్యాయనం మాసషట్కం మృగాద్యం భానుభుక్తితః

అహ స్సురాణాం తద్రాత్రిః కర్కాద్యం దక్షిణాయనమ్

గృహప్రవేశవైవాహప్రతిష్ఠామౌంజిబంధనమ్

మఘాదౌ మంగళం కర్మ విధేయం చోత్తరాయణే

యామ్యాయనే గర్హితం చ కర్మయత్నాత్ప్రశస్యతే

మాఘాదిమాసౌ ద్వౌ ద్వౌ చ ఋతవశ్శిశీరాదయః

మృగాచ్ఛిశిర వసంతశ్చ గ్రీష్మాస్స్యు శ్చోత్తరాయణే

వర్షా శరచ్చ హేమంతః కర్కాద్వై దక్షిణాయనే

చాంద్రో దర్శావిధిస్సౌరస్సంక్రాంత్యా సావనో దీనైః

త్రింశద్భిశ్చన్ద్రభగణ్ మాసో నాక్షత్రసంజ్ఞకః

మధుశ్చ మాధవశ్శుక్ర శ్శుచిశ్చాథ నభస్తత

నభస్య ఇష ఊర్జశ్చ సహా శ్చైవ సహస్యకః

తపాస్తపస్యః క్రమశః శ్చైత్రాదీనాం సమాహ్వయాః

యస్మిన్మాసే పౌర్ణమాపీ యేన ధిష్ణ్యేన సంయుతా

తన్నక్షత్రాహ్వయో మాసః పౌర్ణమాసీ తదాహ్వయా

తత్ఫక్షౌ దైవపిత్రాఖ్యౌ శుక్లకృష్ణౌ తథాపరే

శుభాశుభే కర్మణి చ ప్రశస్తౌ భవతస్సదా

క్రమాత్తిధీనాం బ్రహ్మగ్ని విరించివిష్ణు శైలజాః

వినాయకయమౌ నాగచంద్రౌ స్కందోఽరవాసవౌ

మహేన్ద్రవాసవౌ నాగ దుర్గా దండధరాహ్వయః

శివవిష్ణు హరిరవీ కామస్సర్వః కలీ తతః

చంద్ర విశ్వే దర్శ సంజ్ఞ తిథశాః పితర స్మృతాః

నందా భద్రా జయారిక్తా పూర్ణాస్స్యుస్తిథయః పునః

త్రిరావృత్త్యా క్రమాజ్ఞేయా నేష్ట మధ్యేష్టదా స్సితే

కృష్ణపక్షే త్విష్టమధ్యా నిష్టదా క్రమశస్తదా

అష్టమీ ద్వాదశీ షష్ఠి చతుర్దీ చ చతుర్ధశి

తిథయః పంచ రంధ్రాఖ్యా హ్యతిరూక్షాః ప్రకీర్తితాః

సముద్రమనురంధ్రాకతత్త్వసంఖ్యాస్తు నాడికాః

త్యాజ్యాస్స్యుస్తాసు తిథిషు క్రమాత్పంచ చ సర్వదా

అమావాస్యా చ నవమీ హిత్వా విషమసంజ్ఞికా

తిథయస్తు ప్రశస్తాస్స్యు ర్మధ్మమా ప్రతిపత్సితా

షష్ఠ్యాం తైలం తథాష్టమ్యాం మాసం క్షౌరం కలే స్థిరౌ

పూర్ణిమా దర్శయోర్నారీ సేవనం పరివర్జయేత్

దర్శే షష్ఠ్యాం ప్రతిపది ద్వాదశ్యాం ప్రతిపర్వసు

నవమ్యాం చ న కుర్వీత కదాచిద్దన్తధావనమ్

వ్యతీపాతే చ సంక్రాంతావేకాదశ్యాం చ పర్వసు

అర్కభౌమదినే షష్ఠ్యాం నాభ్యంగో వైధృతా తథా

యః కరోతి దశమ్యాం చ స్నానమామలకైర్నరః

పుత్రహానిర్భ వేత్తస్య త్రయోదశ్యాం ధనక్షయః

ఆర్థపుత్రక్షయస్తస్య ద్వితీయాయాం న సంశయః

అమాయాం చ నవమ్యాం చ సప్తమ్యాం చ కులక్షయః

యా పౌర్ణిమా దివా చంద్రమతీసానుమతీ స్మృతా

రాత్రౌ చంద్రవతీ రాకాప్యమావాస్యా తథా ద్విధా

సినీవాలీ చేందుమతీ కుహూర్చేందుమతీ మతా

కార్తికే శుక్లనవమీత్వాదిః కృతయుగస్య చ

త్రేతాదిర్మాధవే శుక్లే తృతీయా పుణ్యసంజ్ఞతా

కృష్ణ పంచదశీ మాఘే ద్వాపరాదిముదీరితా

కల్యాది స్యాత్కృష్ణపక్షే నభస్యస్య త్రయోదశీ

ఈ అరువది సంవత్సరములు తమతమ పేరుకు తగిన విధముగానే ఫలముల నొసంగును. అయిదు సంవత్సరములకొక యుగమని పేరు. ఇట్లు పన్నెండు యుగములుండును. ఆయుగములకు అధిపతులు వరుసగా విష్ణువు, బృహస్పతి, పురందరుడు, లోహితుడు, త్వష్టా, అహిర్భుధ్యుడు, పితృదేవతలు, విశ్వేదేవతలు, చంద్రుడు, అగ్ని, అశ్వినీ దేవతలు, భగుడు, అని తెలియవలయును. యుగములోని అయిదు సంవత్సరములకు వరుసగా అగ్ని, నరుడు, చంద్రుడు, బ్రహ్మ, శంకరుడు అధిపతులు. ఇపుడు సంవత్సరాధిపతి, సేనాపతి, సస్యాధిపతుల బలాబలములను, ఆసమయమున నున్న గ్రహచారమును బాగుగా తెలుసుకొని ఫలమును చెప్పవలయును. ఉత్తరాయణము ఆరు మాసములు. మకరమునుండి మిధునము వరకు సూర్యభుక్తి వలన నుండును. ఈ ఉత్తరాయణము దేవతలకు పగలు దేవతలకు రాత్రి దక్షిణాయనము. ఇది సూర్యుడు కర్కాటక రాశియందు ప్రవేశించిననాటినుండి మొదలగును. ధనూరాశ్యంతము వరకుండును. గృహప్రవేశము, వివాహము, ప్రతిష్ణ, మౌంజీబంధనము మొదలగు శుభకర్మలను ఉత్తరాయణమున మాఘాది మాసములలో చేయవలయును. దక్షిణాయనమున శుభకర్మలను చేయుట నిందించబడినది. మాషము నుండి రెండు రెండు నెలలు శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులుండును. కర్కటకసంక్రమణనుండి ఆరునెలల దక్షిణాయనకాలమున వర్ష, శరత్, హేమంత ఋతువులుండును. అమావాస్యనుండి ఉండునది చాంద్రమానము సంక్రమణము నుండి చెప్పునది సౌరమానము, దీనములతో చెప్పునది సావనమానము, చంద్రనక్షత్ర గణములు ముప్పదితో చెప్పు మాసము నక్షత్రమానమనబడును. చైత్రాది మాసములకు వరుసగా మధు, మాధవ, శుక్ర, శుచి, నభస్, నభస్య, ఇష, ఊర్జ, సహాః, సహస్యకః, తపః, తపస్య అనునవి పేర్లు. ఏ నేలలోని పూర్ణిమ ఏ నక్షత్రముతో కలిసియుండునో ఆ నక్షత్రము పేరే ఆ మాసమునకుండును. పూర్ణిమకు కూడా ఆ పేరే యుండును. ఆ మాసమున దేవ పక్షము, పితృపక్షము అని రెండుపక్షములుండును. అట్లే శుక్లపక్షము, కృష్ణ పక్షము అని మరి రెండు పేర్లు కూడా కలవు. ఈ రెండు పక్షములు శుభాశుభ కర్మలకు ప్రశస్తములుగా పేర్కొన బడినవి. ఇట్లే షది హేనుతిథులకు అధిపతులుగా వరుసగా బ్రహ్మ, అగ్ని, విరించి, విష్ణు, శైలజ, వినాయక, యమ, నాగ, చంద్ర, స్కంద, అర్క, వాసవ, మ హేస్ట్ర, వాసవ, నాగ, దుర్గా, దండధర, శివ, విష్ణు, హరి, రవి, కొమ, సర్వ, కలీ, చంద్ర, విశ్వేదేవ, ధర్మ, అను వారలు మరియు పితృదేవతలుగా తెలియవలయును. నందా, భద్రా, జయా, రిక్షా, పూర్ణా అని తిథులు అయిదు విధములు. అయిదింటిని. మూడావృత్తులచే తిథులను తెలియవలయును. శుక్ల పక్షమున అనీష్టము మధ్యన కలిగి ఇష్టములనిచ్చును. కృష్ణ పక్షమున ఇష్టమధ్యలై అనిష్టమునిచ్చును. అష్టమి, ద్వాదశి , షష్టి, చతుర్థి, చతుర్దశి, అను అయిదు తిథులను రంధ్రములు అని పేరు. ఇవి చాలా క్రూరములుగా పేర్కొనబడినవి. సముద్ర మనురంధ్ర తత్త్వసంఖ్యలు గలవినాడికలు. ఆయా తిథులలో క్రమముననుసరించి ఈనాడికలను విడువవలయును. అమావాస్య, నవమిలను విడిచి మిగిలిన బేసి తిథులు ప్రశస్తములైనవి.

శుక్లప్రతిపత్ మధ్యమము. షష్ఠి తిథిన తైలమును, అష్టమి తిథిన మాంసమును, నవమీ తిధిన కారమును, పూర్ణిమా అమావాస్యలలో స్త్రీని సేవించరాదు. అమావాస్య తిధినాడు, షష్ఠినాడు, ప్రతిపత్తున, ద్వాదశి తిధిన, ప్రతిపర్వలో, నవమి తిథిన, దన్తధావనము చేయరాదు. వ్యతీపాతున, సంక్రాంతిన ఏకాదశిన, ప్రతిపర్వలో ఆదివారము, మంగళవారము, షష్ఠి తిథినాడు, వైధృతినాడు అభ్యంగనము చేయరాదు. దశమి తిథిన వుసిరికాయలతో స్నానము చేసినచో పుత్రహాని, త్రయోదశిన చేసినచో ధనక్షయము కలుగును. ద్వితీయా తిథిన చేసినచో ధనక్షయము, పుత్రక్షయము జరుగును. అమావాస్యనాడు, నవమినాడు, సప్తమినాడు చేసినచో కులక్షయమగును. పగలుకూడా చంద్రుడున్న పూర్ణిమను సానుమతి యందురు. రాత్రి చంద్రుడున్న పూర్ణిమను రాకా యందురు. అట్లే అమావాస్య కూడా రెండు విధములు. చంద్రుడు కల అమావాస్యను సినీవాలి యని, చంద్రుడు లేని యమావాస్యను కుహూ అని యందురు. కార్తికశుక్లనవమీ కృతయుగాది వైశాఖశుద్ద తదియ త్రేతాయుగా. దీనినే పుణ్యా అని పేరు. మాఘబహుళ పంచమి ద్వాపరయుగాది. భద్రపద బహుళ త్రయోదశి కలియుగాది.

ద్వాదశ్యూర్జే శుక్లపక్షే నవమ్యచ్ఛేఽశ్వయుజ్యపి 

చైత్ర భాద్రపదే చైవ తృతీయా శుక్లసంజ్ఞితా

ఏకాదశీ సితా పౌ షే హ్యాషాడే దశమీ సితా

మా ఘే చ సప్తమీ శుక్లా న భ స్యేశ్వసి తాష్టమీ

శ్రావణే మాస్యమావాస్యా ఫాల్గునే మాసి పౌర్ణిమా

ఆషాడే కార్తి కే మాసి జ్యేష్ఠే చైత్రే చ పౌర్ణిమా

మన్వాదయో మానవానాం శ్రాద్ధేష్వత్యంత పుణ్యదా

భాద్రే కృష్ణత్రయోదశ్యాం మఘామిన్దుః కరేరవిః

గజచ్ఛాయా తదా జ్ఞేయా శ్రాద్ధే హ్యత్యన్త పుణ్యదా

ఏక స్మిన్వాసరే తిస్రస్తిధయస్స్యాత్తిధిక్షయః

తిధిర్వారత్రయే త్వేకా హ్యధికా ద్వే చ నిందితే

సూర్యాస్తమనపర్యన్తం యస్మిన్వారే తు యా తిధిః

విద్యతే సా త్వఖండా స్యాన్న్యూనా చేత్ఖండసంజ్ఞితా

తిధేః పంచదశో భాగః క్రమాత్ప్రతిపదాదయః

క్షణ సంజ్ఞాస్తదర్ధాని తాసామర్ధ ప్రమాణతః

రవిస్థిరశ్చరశ్చన్ద్రః క్రూరో వక్రోఽఖిలో బుధః

లఘురీజ్యో మృదుశ్శుక్రసీక్షోష్ణదినకరాత్మజః

అభ్యక్తో భానువారే య స నరః క్లేశవాన్భవేత్

ఋక్షేశే కాంతిభాగ్భౌమే వ్యాధి సౌభాగ్యమిందుజే

జీవే నైవం సితే హాని మందే సర్వసమృద్ధయః

లంకేదయాత్స్యాద్వారాది తస్మాదూర్ధ్వ మధోఽపి వా

దేశాన్తర స్వచరార్ధ నాడీభిరపరే భవేత్

బలప్రదస్య భేటస్య కర్మ సిద్ధ్యతి యత్కృతమ్

తత్కర్మ బలహీనస్య దుఃఖేనాపి న సిద్ధ్యతి

ఇందుజ్ఞజీవశుక్రాణాం వాసరాస్సర్వకర్మసు

ఫలదాస్త్వితరే క్రూరే కర్మస్వభిమతప్రదాః

రక్తవర్ణౌ రవిశ్చంద్రో గౌరో భౌమస్తు లోహితః

దూర్వావర్ణో బుధో జీవః పీతశ్శ్వేతస్తు భార్గవః

కృష్ణస్సౌరి స్వవారేషు స్వస్వవర్ణక్రియా హితాః

అది బాణాశ్చ యస్తర్క పాతాలవసుధాధరాః

బాణాగ్నిలోచనా నిహ్య వేదబాహు శిలీముఖాః

త్ర్యేకాహయో నేత్రగోత్ర రామాశ్చన్ద్ర రసార్తవః

మలికాశ్చోపకులికా వారవేలాస్తథా క్రమాత్

ప్రహరార్థ ప్రమాణాస్తే విజ్ఞేయా సూర్యవాసరాత్

యస్మిన్వారే క్షణో వార దృష్టస్తద్వాపరాధిపః

ఆద్యష్షష్టో ద్వితీయోఽస్మా త్తత్షష్ఠస్తు తృతీయకః

షష్ఠ ష్షష్ఠ శ్చేత రేషాం కాలహారాధిపాస్మృతాః

సార్ధనాడీ ద్వయేనైవ దివారాత్రౌ యథాక్రమాత్

వారప్రోక్తం కర్మకార్యే త్తద్గృహస్య క్షణేఽపి సన్

నక్షత్రేశాః క్రమాద్దస్ర యమవహ్ని పితామహాః

చంద్రేశాదితిజీవా హి పితరో భగ సంజ్ఞకః

ఆర్యమార్కత్వష్టృమరుత్ శక్రాగ్నిమిత్రవాసవాః

నైరుత్యుదకవి శ్వేజగోవిందవసుతోయః

అజైకపాదహిర్భుద్న్యా పూషా చేతి ప్రకీర్తితాః

పూర్వాత్రయం మఘాహ్యగ్ని విశాఖా యమమూలభమ్

అధో ముఖం తు నవకం భానౌ తత్ర విధీయతే

బిలప్రవేశగణితభూతసాధకలేఖనమ్

శిల్పకర్మ కలాకూపనిక్షేపోద్ధరణాని యత్

మిత్రేన్దు త్వాష్ట్ర హస్తేన్ద్ర దితి భాంత్యశ్వినాయుభమ్

తిర్యజ్ముఖాఖ్యం నవకం భానౌ తత్ర విధీయతే

హలప్రవాహగమనం గంత్రీపత్రగజోష్ట్రకమ్

ఖరగ్రథనౌయాన లులాయ హాయ కర్మచ

బ్రహ్మ విష్ణు మహేశార్య శతతారా వసూత్తరాః

ఊర్ధ్వాస్యం నవకం భానాం ప్రోక్తమత్ర విధీయతే

నృపాభి షేకమాంగల్యవారణధ్వజి కర్మచ

ప్రాసాదతోరణారామప్రాకారాద్యం చ సిద్ద్యతి

స్థిరే రోహిణ్యుత్తరాఖ్యం క్షిప్రం సూర్యాశ్విపుష్యభమ్

సాధారణం ద్విదైవత్యం వహ్నిభం చ ప్రకీర్తితమ్

వస్వాదిత్యంబుపుష్యాణి విష్ణు ఖేచరసంజ్ఞాతమ్

మృద్విందుమిత్రచిత్రాంతముగ్రం పూర్వా మఘాత్రికమ్

మూలార్థాహీన్ద్రభం తీక్ష్ణం స్వనామ సదృశం ఫలమ్

చిత్రాదిత్యాంబు విష్ణ్వంబాం త్యాధిమిత్ర వసూడుషు

సమృగే జ్యేషు బాలానాం కర్ణవేధ క్రియా హితా

దసేన్ద్వదితి తిష్యేషు కరాచిత్రితయే తధా

గజకర్మాఖిలం యత్తి ద్విధేయం స్థిరభేషు చ

వాజి కర్మాఖిలం కార్యం సూర్యవారే విశేషతః

చిత్రావరుణవైరించిత్త్యుత్తరాసు గమాగమమ్

దర్శాష్టమ్యాం చతుర్ధశ్యాం పశూనాం న కదాచన

మృదు ధ్రువ క్షిప్రచర విశాఖా పితృభేషు చ

హలప్రవాహం ప్రథమం విదధ్యాన్మూలభే వృషైః

హలాదౌ వృషనాశాయ భత్రయం సూర్య ముక్తభాత్

అగ్రే వృద్ధ్యే త్రయం లక్ష్మ్యై సౌమ్య పార్శ్వే చ పంచకమ్

శూలత్రయోఽపి నవకమ్ మరణాయ చ పంచకమ్

శ్రియై పుష్ట్యై త్రయం శ్రేష్ఠం స్యాచ్చక్రే లాంగలాహ్వయే

మృదు ధ్రువ క్షిప్రభేషు పితృవాయువసూడుషు

సమూలభేషు బీజోప్తిరత్యుత్కృష్ట ఫలప్రదా

భవేద్ఖత్రితయం మూర్ద్ని ధాన్యనాశాయ రాహుభాత్

గలే త్రయం కజ్జ్వలాయ వృద్ధ్యే చ ద్వాదశోదరే

నిస్తండులత్వం లాంగూలే భచతుష్టయ భీతిదమ్

నాభౌ వహ్నిః పంచకం యద్బీజోప్తావిత చింతయేత్

స్థిరేష్వదితి సార్పాంత్య పితృమారుత భేషు చ

 న కుర్యాద్రోగముక్తస్య స్నానమాహీన్దుశుక్రయో

 ఉత్తరాత్రయమైత్రేన్ద్ర వసువారుణభేషు చ

 పుష్యార్కపౌష్ణధిష్ణ్యేషు నృత్యారంభః ప్రశస్యతే

పూర్వార్థయుంజి షడ్బానే పౌష్ణభాదుదభాత్తతః

మధ్యయుంజి ద్వాదశారాశేన్ద్రభాన్నవభాని చ

పరార్దయుంజి క్రమశః సంప్రీతిర్దమ్పతేర్మిధః

 జిఘన్యా స్తోయ పార్ద్రా హి పవనాంతకనాకపొః

క్రమాతి ద్విదైవత్యా బృహత్తారాః పరాస్సమాః

 తాసాం ప్రమాణఘటికా స్ప్రింశన్నవతి దృష్టయః

క్రమాదభ్యుదితే చంద్రే నయత్యర్ఘసమాని చ

 అశ్వగ్రీంద్వీజ్య నైఋత్య త్వాష్ట్ర జత్త్యుత్తరా భవాః

పితృద్విదైవ వస్వాఖ్యా స్తారా స్యుః కులసంజ్ఞికాః

 ధాతుజ్యేష్ఠాదితి స్వాతీ పౌష్ణార్క హరిదేవతాః

అజాహ్యంత్యక భౌజంగ తారాశ్చైవాకులాహ్యయాః

శేషాః కులాకులాస్తారా స్తాసాం మధ్యే కులోడుషు

ప్రయాతి యది భూపాల స్తదాప్నోతి పరాజయమ్

భేషూపకులసంజ్ఞేషు జయమాప్నోతి నిశ్చితమ్

సంధిర్వాపి తయోస్సామ్యం కులాకులగణోడుషు

 అర్కార్కి భౌమవారే చేభద్రాయా విషమాంఘ్రిభమ్

త్రిపుష్కరం త్రిగుణదమ్ ద్విగుణం యమలా హి భమ్

దద్యాత్తద్దోష నాశాయ గోత్రయం మూల్యమేవ వా

ద్విపుష్కరే ద్వయం దద్యా న్నదోష స్త్యృక్ష భేఽపి వా

 క్రూరవిద్ధో యుతో వాపి పుష్యో యది బలాన్వితః

వినా పాణిగ్రహం సర్వమంగలేష్విష్ట దస్సదా

రామాగ్ని ఋతుబాణాగ్ని భూవేదాగ్ని శరేషు చ

నేత్రబాహుశరేంద్వందుబాహు వేదాగ్నిసంకరాః

వేద నేత్రాగ్నబ్ద్యగ్ని శతబాహునేత్రరదాః క్రమాత్

తారా సంఖ్యాశ్చ విజ్ఞేయా దస్రాదీనాం పృథక్ పృథక్

 యా దృశ్యన్తే దీప్తతారా స్వగణే యోగతారకాః

           కార్తికశుక్ల ద్వాదశి, ఆశ్వయుజశుద్ధ నవమి, చైత్రశుద్ధ తదియ, భాద్రపదశుద్ధ తదియ, పుష్యశుద్ధ ఏకాదశి, ఆషాఢశుద్ధ దశమి, మాఘశుద్ధ సప్తమీ, బాద్రపద బహుళాష్టమి, శ్రావణామావాస్య, ఫాల్గున పూర్ణిమ, ఆషాఢ కార్తిక జ్యేష్ఠ, చైత్ర పూర్ణిమలు అను ఈ పదునాలుగు మన్వాదికాలములు. మానవులు ఈ దిలములలో శ్రాద్దము చేసిన మిక్కిలి పుణ్యవంతులగుదురు. భాద్రపద బహుళ త్రయోదశిన చంద్రుడు మఖా నక్షత్రమున, సూర్యుడు హస్తా నక్షత్రమున ఉన్నచో దానిని గజచ్చాయ అందురు. శ్రాద్ధమును చేసినచో అధిక పుణ్యమును ప్రసాదించును. ఒకే దీనమున మూడు తిథులు వచ్చినచో తిథికయము. మూడుదినములలో ఒకేతిథి వచ్చినచో ఒకటి అధిక, రెండు తిథులు నిందితములు. సూర్యాస్తమయపర్యంతము ఏ దినమున ఏ తిథి యుండునో ఆ తిథి అఖండతిథి యనబడును. తక్కువగా యున్నచో ఖండతిథి యందురు. తిథియొక్క పది హేనవ భాగము వరుసగా ప్రతిపదాదులని తెలియవలయును. వాటిలో సగభాగము కణము అనబడును. ఇట్లు వాటిలో అర్థప్రమాణముననుసరించి సూర్యుడు స్థిరుడు, చన్లుడు చరుడు, బుధుడు క్రూరుడు వక్రుడు, బృహస్పతి లఘువు, శుక్రుడు మృదువు, శని తీక్లుడు అని సిద్ధాన్తము. భానువారమున అభ్యంగనమును చేసుకొనిన మానవుడు కష్టములపాలగును. సోమవారమున చేసినచో కాంతిమంతుడగును, మంగళవారమున చేసినచో వ్యాధి కలుగను. బుధవారము చేసినచో సౌభాగ్యవంతుడగును. గురువారము చేసినచో అనిష్టము. శుక్రవారము చేసినచో హాని, శనివారము చేసినచో సర్వసమ్పద్దులు కలుగును. లంకోదయము నుండి వారాది యగును. దాని తరువాత కాని ముందు కొని దేశాన్తరమున స్వచరార్థనాడులతో తక్కినవియగును. గ్రహము బలయుతుడుండగా చేసిన పని చక్కగా నెరవేరును. అదే గ్రహము బలహీనముగా నున్నపుడు కష్టపడి చేసిననూ సిద్ధించదు. సోమ బుధ గురు శుక్రవారములు అన్నిపనులకు శుభప్రదములు. మిగిలిన వారములు క్రూరములు. సూర్యుడు రక్తవర్ణుడు, చంద్రుడు గౌరవర్ణుడు. అంగారకుడు లోహిత వర్ణుడు, బుధుడు దూర్వావర్ణుడు, గురువు పీతవర్ణుడు, శుక్రుడు శ్వేతవర్ణుడు, శని కృష్ణవర్ణుడు. తమ తమ వారములలో తమతమ వర్ణములను పనులను చేయుచుందురు. అద్రి, బాణ, పాతాల, పర్వత, బాణ, అగ్నిలోచన, వేద, బహు, బాణ, నేత్ర, గోత్ర, నామ, చన, రస, ఋతువుల సంఖ్యతో అనగా 7, 5, 1, 7, 5, 3, 2, 4, 2, 5, 2, 1, 3, 1, 9, 6 ఈ సంఖ్యలు గలవి వారవేల లగును. ఈ వేళలకు కులికా ఉపకులిక అను పేర్లుండును. ఆది వారమునుండి వరుసగా అన్నివారములలో  ఈ వేళలు సగము రూముకొలము ఉండును. ఏ వారమున పొరాధిపతి కణకాలము చూడబడునో అది ఆద్య వేళ, దానినుండి ఆరవది రెండోవేళ, దాని నుండి ఆరవది మూడవ వేళ ఇట్లు ఆరు ఆర్లు చేసినచో ఏడువేళలు వచ్చును. మిగిలిన వాటిని ఆయా గ్రహములు హోరాధిపతులగుదురు. రెండున్నర నాడులచే క్రమముననుసరించి పగలు రాత్రులు ఏర్పడును. ఆ గ్రహము యొక్క క్షణములో ఆవారములో చెప్పబడిన , కర్మను చేయవలయును. ఆయా నక్షత్రములకు క్రమముగా దస్ర, యమ, వహ్ని, పితామహ, చంద్ర, ఈశ, అదితి, బృహస్పతి, సర్ప, పితృ, భగ, అర్యమ, అర్క, త్వష్క, మరుత్, శక్ర, అగ్ని, మిత్ర, వాసవ, నైరుతి, ఉదక, విశ్వేదేవ, లిజ, గోవింద, వసు, జలాధిపతి, అజైకపాత్, అహిర్బుధ్య, పూష అను, వారలు పూర్వఫల్గుని, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, మఘ, కృత్తిక, విశాఖ, భరణి, మూలా అను తొమ్మిది నక్షత్రములు అధోముఖ నవకమని, ఈ నవకములో సూర్యుడు ప్రవేశించి యున్నపుడు బలప్రవేశ, గణిత, భూతసాధన లేఖనము, శిల్పకర్మ, కలా, కూప, నిక్షేపోద్దరణము మొదలగునవి విధించబడినవి అనగా చేయవలయును. అనూరాధ, మృగశిర, చిత్త, హస్త, జ్యేష్ఠ, పునర్వసు, రేవతి, అశ్వని, స్వాతి అనునీ తొమ్మిది తిర్యజ్ముఖ నవకమందురు. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడున్నపుడు, హల, ప్రవాహగమన, గంతీపత్ర, గజ, ఉష్ట్ర, ఖర, గో, రథ, నౌయాన, తిలాయ, హయ కర్మలు చేయవలయునని వీధించబడినవి. రోహిణి, శ్రవణం, ఆరుద్ర, ఉత్తరఫల్గుని శతభిష, ధనిష్ఠ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పుష్యమి అను తొమ్మిది ఊర్ధ్వముఖమను నవకమనబడును. ఈ తొమ్మిది నక్షత్రములలో సూర్యుడున్న చో రాజ్యభిషేక, మాంగల్య, గజ, ధ్వజకర్మలు, ప్రాసాద, తోరణ. ఆరామ, ప్రాకారాదులను చేయబడవలయును. రోహిణి, ఉత్తర, హస్త, అశ్విని, పుష్యమి, ఈ నక్షత్రములు స్థిరములని, విశాఖ, కృత్తికలు సాధారణములని చెప్పబడినవి ధనిష్ఠ, పునర్వసు, పూర్వాషాడ, పుష్యమీ శ్రవణములు చర నక్షత్రములనబడును. మృగశిర, అనూరాధ, చిత్ర, రేవతి, అనునవి మృదునక్షత్రములు, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, పుబ్బ, మఖా నక్షత్రములు ఉగ్రములు. మూలా, ఆర్దా, ఆశ్లేష, జ్యేషా నక్షత్రములు తీక్షములు. ఈ నక్షత్రములు తమ తమ పేర్లకు తగిన ఫలములనిచ్చును. చిత్త, పునర్వసు, పూర్వాషాఢ, శ్రవణం, రేవతి, అనూరాధ, ధనిష్ఠ, మృగశిర, పుష్యమి, నక్షత్రములలో బాలురకు చౌలమును చేయవలయును. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, స్వాతి నక్షత్రములలో, స్థిరనక్షత్రములలో గజకర్మ చేయవలయును. సూర్యవారమున (ఆదివారమున) అశ్వకర్మను చేయవలయును. చిత్త, శతభిష, రోహిణి, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర నక్షత్రములలో గమనాగమనములను చేయవలయును. అనూవాస్య, అష్టమి, చతుర్దశీ తిథులలో పశువుల పనిని చేయరాదు. మృదు, ధ్రువ, కిప్ర, చర నక్షత్రములలో, విశాఖా మఘా నక్షత్రములలో, మూలానక్షత్రమున వృషభములతో మొదటి నాగలిని లాగించవలయును. (భూమిని దున్నవలయును) పైన చెప్పిన నక్షత్రములనుండి మూడు నక్షత్రములలో హస్త నక్షత్రమున హలాదిచే దున్నించినచో వృషభములు నశించును. అగ్రభాగముతో దున్నించిన వృషభములు వృద్ధిచెందును. మూటితో దున్నించిన సంపద చేకూరును. ఉత్తర భాగమున పంచకమును చేయవలయును. శూలత్రయమున నవకము, పంచకము మరణమును కలిగించును. సంపదకు పుష్టికి త్రయము శ్రేష్ఠము. లాంగల నామక చక్రములో మూడునాగళ్ళచే దున్నించుట ఉత్తమము. మృదు, ధ్రువ, క్షిప్ర నక్షత్రములలో, మఖ, స్వాతి, ధనిష్ఠ మూలానక్షత్రములలో విత్తనము చేసినచో పంట పుష్కలముగా వచ్చును. రాహునక్షత్రమునుండి మూడు నక్షత్రములు శిరసానమున నుండును. కావున ధాన్యనాశము కలుగును. కంఠస్థానమున నుండు మూడు నక్షత్రములు చెడు ఫలమునిచ్చును. ఉదర స్థానమున నుండు పన్నెండు నక్షత్రములు వృద్ధిని ప్రసాదించును. లాంగూలస్థానమున నున్న నక్షత్రములలో విత్తినచో తండులశూన్యత్వమును కలిగించును. నాభిస్థానమున నున్న ఆయిదు నక్షత్రములలో విత్తినచో అగ్ని భయము కలుగునని శాస్త్ర నిర్ణయము. స్థిరనక్షత్రములలో, పునర్వసు, ఆశ్లేష, రేవతి, మఘ, స్వాతి నక్షత్రములలో రోగముక్తునికి స్నానమును చేయించరాదు. ఆశ్లేష, మృగశిర, పుష్యమీనక్షత్రములలో కూడా చేయించరాదు. ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, అనూరాధ, జ్యేష్ఠ, ధనిష్టా శతభిషా నక్షత్రములలో నృత్యారంభము ప్రశస్తముగా పేర్కొనబడినది. అట్లే పుష్యమి, హస్త, రేవతి నక్షత్రములు కూడా నృత్యారంభమునకు ఉత్తమములు. పూర్వార్ధముతో కలిసియున్న ఆరు నక్షత్రములు, రేవతీ, ఉత్తరానక్షత్రములు మధ్యభాగములు కలిసియున్న పన్నెండు నక్షత్రములు జ్యేష్ఠ నుండి తొమ్మిది నక్షత్రములు, పరార్ధముచే కలిసియున్న నక్షత్రములు క్రమముగా దంపతులకు ప్రీతిని పెంచునవి. శతభిష, ఆర్దా, ఆశ్లేష, స్వాతి, భరణి, జ్యేషా నక్షత్రములు అధమములు. పునర్వసు, విశాఖా నక్షత్రములు, బృహత్తారలు సమములు. ఈ నక్షత్రముల ప్రమాణఘడియలు క్రమముగా ముప్పది, తొంబది, పదునారుగా తెలియవలయును. చంద్రోదయము తరువాత వరుసగా అర్జసమములను గ్రహించవలయును. అశ్విని, మృగశిర, పుష్యమి, మూల, చిత్త, ఉత్తధా, మఘ, విశాఖ, ధనిషా నక్షత్రములకు, కులమని పేరు. రోహిణి, జ్యేషా, పునర్వసు, స్వాతి, రేవతి, హస్త, శ్రవణ, ఆశ్లేష, నక్షత్రములకు అకులములని పేరు. మిగిలిన నక్షత్రములకు కులాకులములని పేరు. కులసంజ్ఞకల నక్షత్రములలో రాజు యుద్ధమునకు బయలుదేరి వెళ్ళినచో పరాజయమును పొందును. ఆకుల నక్షత్రములలో యుద్ధమునకు వెళ్ళినరాజు విజయమును పొందును.

నక్షత్రసంధిలో వెళ్ళినను, కులాకుల నక్షత్రములలో వెళ్ళినను అట్టి ఫలమునే పొందును. ఆది శని మంగళ వారములలో, భద్రానక్షత్రములయొక్క విషమ పొదములలో త్రిపుష్కరమున అయినచో త్రిగుణములను కలిగించును. ఉత్తరాషాడ ఆశ్లేషా నక్షత్రములలో ద్విగుణఫలము లభించును. ఈ దోషము తొలగుటకు మూడు గోవులను కాని, మూడుగోవుల మూల్యమును కాని దానమును చేయవలయును. ద్విపుష్కరమున చేసినచో రెండు గోవులను దానము చేయవలయును. త్రిపుష్కరమున దానము చేసినచో దోషమంటదు. పుష్యమీ నక్షత్రము క్రూరనక్షత్రములచే విద్దయైననూ, క్రూరనక్షత్రములచే కలిసియున్ననూ వివాహమును తప్ప ఇతర శుభకార్యములను చేయవచ్చును. 3, 3, 6, 5, 3, 1, 4, 3, 5, 2, 2, 5, 1, 1, 2, 4, 3, 4, 2, 3, 4, 3, 100, 2, 2, 32. ఇవి అశ్వనీ మొదలగు నక్షత్రములకు వేరువేరుగా వరుసగా తారాసంఖ్యలని తెలియవలయును. వీటిలో దీప్తతారలుగా కనపడునవి తమ తమ గణములలో యోగతారలుగా పిలువబడును.

వృషో వృక్షశ్చ భాయామ్యధిష్ణ్యేయమకరస్తరుః

 ఉడుంబరశ్చాన్నిధిష్ణ్యే రోహిణ్యాం జంబుకస్తరుః

ఇందుభాత్ఖాదిరో జాతః కృష్ణప్లక్షశ్చ రౌద్రభాత్

 సంభూతోఽదితి భాద్వంశః పిప్పలః పుష్యసంభవః

   సర్పధిష్ట్యాన్నాగవృక్షో వటః పితృభసంభవః

పాలాశో భాగ్యభాజ్జాత అక్షశ్చార్యమపంభవః

   అరిష్టవృక్షో రవిభాత్ శ్రీ వృక్ష స్త్వాష్ట్ర సంభవః

స్వాత్యక్ష జోఽర్జునో వృక్షో ద్విదైవత్యాద్వికం తతః 

       మిత్రభాద్వకులో జాతో విష్టిః పౌరందరజః

సర్జవృక్షో మూలభాచ్చ వంజులో వారిధిష్ణ్యజః

  పనసో వైశ్వబాజ్జాతశ్చార్క వృక్షశ్చ విష్ణుభాత్

వసుధిష్ణ్యాచ్ఛమీవృక్షః కదంబో వారుణరజః

 ఆజా హే శ్చూత వృక్షోఽభూద్భుధ్యుజః పిచుమందకః

 మధువృక్షః పౌష్ణధిష్ట్యా ధిష్ణ్య వృక్షాః ప్రకీర్తితాః

యస్మిఇ్ఛనైశ్చరో ధిష్ణ్యే తద్వక్షోఽర్చ్యః ప్రయత్నతః

 యోగీశా యమవిశ్వేన్దుధాతృజీవనిశాకరా ఇంద్రతోయాహ్నివహకర్కభూమిరుద్రకతోయపాః

గణేశరుద్రధనదత్వష్ట్ర మిత్రషడాననాః

 సావిత్రి కమలా గౌరీ నాసత్యా పితరోఽదితిః

 వైధృతిశ్చ వ్యతీపాతో మహాపాతావుభౌ సదా

పరిఘస్య చ పూర్వార్థం సర్వకార్యేషు గర్హితమ్

విష్కంభ వజ్రయోస్తిస్రః షడ్వా గండాతిగండయోః

వ్యాగఘాతే నవశూలే తు పంచ నాడ్యో హి గర్హితాః

అదితీందుమఘాహ్యశ్వ మూలమైత్రేజ్యభాని చ

జ్ఞేయాని సహచిత్రాణి మూర్ధభాని యధాక్రమమ్

లిఖేదూర్ధ్వ గలామేకం తిర్యగ్రేఖా స్త్రయోదశ

తత్ర ఖార్జూరి కే చక్రే కథితం మూర్ధ్ని భే న్యసేత్

 భాజ్యైక రేఖా గతయోః సూర్యాచంద్రమసోర్మిధః

ఏకార్గలో దృష్టిపాతశ్చాభిజిద్వర్జితాని వై

వినాడీభిర్ద్వాదశీఖీరహితం ఘటికాద్వయమ్

 యోగం ప్రకరణం యోగాః క్రమాత్తు సప్తవింశతిః

 ఇన్ద్రః ప్రజాపతిర్మిత్రస్త్వష్టాభూ హరితి ప్రియా

కీనాశః కలి రుద్రాభ్యో తిథ్యర్దే శాస్త్ర్వహిర్మరుత్

 బవాదివణిజాంతాని శుభాని కరణాని షట్

పరీతా విపరీతా వా విష్టిర్నేష్టా తు మంగలే

 ముఖే పంచగలే చైకా వక్ష స్యేకాదశ స్మృతః

నాభౌ చతస్రః షట్ కట్యాం తిస్రః పుచ్ఛాఖ్య నాడికాః

కార్యహానిర్ముఖే మృత్యుర్గలే వక్షసి నిస్స్వతా

కట్యామున్మత్తతా నాభౌ చ్యుతిః పుచ్ఛే ధ్రువం జయః

 స్థిరాణి మధ్యమాన్యేషాం మధ్యనాగ చతుష్పదౌ

దివా ముహూర్తా రుద్రాహి మిత్ర పితృ వసూదకమ్

 విశ్వ విధాతృబ్రహ్మేన్ద్రరుద్రాగ్నివసుతోయపాః

ఆర్యమా భగ సంజ్ఞశ్చ విజ్ఞేయా దశ పంచ చ

 ఈశా జపాదాహిర్బుధ్యపూషాశ్వీయమవహ్నయః

ధాతృ ఇంద్రాదితీజ్యాఖ్యా విష్ణ్వర్కత్వష్టృవాయవః

 ఆహ్న: పంచదశో భాగస్తధా రాత్రిప్రమాణతః

ముహూర్తమానం ద్వరా వ క్షణర్క్షాణి సమేశ్వరమ్

అర్యమా రాక్షసబ్రాహ్మ పిత్ర్యాగ్నేయౌ తధాభిజిత్

రాక్షసాఖ్యే బ్రాహ్మ పిత్ర్యౌ భర్గాజాంశా వినాదిషు

వారేషు వర్జనీయాస్తే ముహూర్తాశ్శుభకర్మసు

యేషు ఋక్షేషు యత్కర్మ కధితం నిఖిలం చ తత్

 తద్ధైవత్యే ముహూర్తేఽపి కార్యం యాత్రాదికం సదా

భూకంపస్సూర్యభోత్సప్త మర్క్షే విద్యుచ్చ పంచమే

 శూలోఽష్టమే చ దశమే శనిరష్టాదశే తతః

కేతుః పంచదశే దండ ఉల్కా ఏకోనవింశతౌ

నిర్ఘాత పాత సంజ్ఞశ్చ జ్ఞేయస్స నవపంచమే

మోహనిర్ఘాతకంపాశ్చ కులిశం పరివేషణమ్

విజ్ఞేయా ఏకవింశీరాదారభ్య చ యథాక్రమమ్

చంద్రయుక్తేషు భేష్వేషు శుభకర్మ న కారయేత్

 సూర్యభాత్సర్వ త్ర్యర్క్షం త్వాష్టమిత్రాప్తభేషు చ

స విష్ణు భేషు క్రమశో హస్త భాచ్చంద్ర సంయుతః

ధిష్ణ్యే తావతి సత్యత్ర దుష్టయోగః పతత్యసౌ

చండీశ చండాయుధాఖ్య స్తస్మిన్నేవా చరేచ్ఛుభమ్

త్రయోదశ సుకర్మలిన సంఖ్యయా తిధి వారయోః

క్రకచో నామ యోగోఽయం మంగలేష్వతి గర్హితః

సప్తమ్యామర్కవార శ్చేత్ప్రతిపత్సౌమ్యవాసరే

సంవర్త యోగో విజ్ఞేయ శుభ కర్మ వినాశకృత్

ఆనందః కాలదండాభ్యో ధూమ్రధాతృసుధాకరాః

ధ్వాంక్షధ్వజాఖ్యశ్రీవత్స వజ్రిముద్గరఛత్రకాః

మిత్రమానసపద్మాఖ్య లుంబకోత్పాత మృత్యవః

కాణసిద్ధి శుభా మృత్యు ముసలాంతకకుంజరః

రాక్షసాఖ్య వరస్థైర్య వర్థమానాః క్రమాదమీ

యోగాస్స్వసంజ్ఞఫలదా అష్టావింశతి రీరితాః

 రవివారే క్రమాదేవ దస్రభాదిందుభాద్విధౌ

సారాద్భౌమే బుధ హస్తాత్ మైత్రభాత్సురమంత్రిణి

వైశ్వదేవాద్భృగుసుతే వారుణాత్ భాస్కరాత్మజే

హస్తర్క్షంచ ఖార్విందౌ చంద్రభం దస్రభం కుజే

సౌమ్యే మిత్ర భమాచార్యం తిష్యః పౌష్ణం భృగోస్సుతే

రోహిణీ మన్దవారే చ సిద్ధయోగాహ్వయా అమీ

ఆదిత్యభౌమయోర్నందా భద్రాశుక్ర శశాక యోః

జయా సౌమ్యే గురౌ రిక్తా శనౌ పూర్ణేతి నో శుభాః

నన్దా తిథి శ్శుక్రవారే సౌమ్యే భద్రా కుజే జయా

రిక్తామందే గురోర్వాలే పూర్ణా సిద్ధాహ్వయా అమీ

 ఏకాదశ్యామిందువారో ద్వాదశ్యామర్కవాసరః

షష్ఠే గురౌ తృతీయాజ్ఞేఽష్ఠమీ శుక్రే శనైశ్చరే

నవమీ పంచమీ భౌమే దగ్ధయోగాః ప్రకీర్తితాః

భరణ్యర్కదినే చంద్రే చిత్రా భౌమే తు విశ్వభమ్

 బుధే శ్రవిష్టార్యమభే గురౌ జ్యేష్టా భృగోర్దినే

 రేవతీ మందవారే తు గ్రహాజన్మర్క్క్ష నాశనమ్

 విశాఖాదిచతుర్వర్గ అర్కవారాదిషు క్రమాత్

 ఉత్పాతమృత్యుకాణాఖ్య సిద్దియోగాః ప్రకీర్తితాః

తిథివారోద్భవా నేష్టా యోగా వారర్క్షసంభవాః

హూణవంశఖ సేపన్యదే శేష్వతి శుభప్రదాః

ఘోరాష్టాక్షిమహోదర్యో మందమందాకినీ తథా

మిశ్రా రాక్షసి కా సూర్యవారాదిషు యథాక్రమమ్

శూద్రతస్కర వేశ్యక్ష్మా దేవభూపగవాం క్రమాత్

అనుక్తానాం చ సర్వేషాం హోరాద్యాస్సుఖదాస్స్మృతాః

పూర్వాహ్ణే నృపతీన్హన్తి విప్రాన్మధ్యందినే విశః

అపరాహ్ణే స్త గే శూద్రాన్ప్రదోషే చ పిశాచకాన్

 నిశి రాత్రించరాన్నాట్యకారానపరరాత్రి కే

 గోపానుషసి సంధ్యాయాం లింగినో రవిసంక్రమః

దివాచేన్మేషసంక్రాన్తి రనర్థకలహప్రదా

రాత్రౌ సుభిక్షమతులం సంధ్యయోర్వృష్టినాశనమ్ హరిశార్దూలవారాహఖరకుంజరమాహిషాః

ఆశ్వశ్వాజవృషాః పాదా యుధాః కరణవాహనాః

భుశుండీ చ గదా ఖడ్గీ దండం ఇష్వాస తోమరౌ

కుంత పాశాం కుశాస్త్రీషూన్భిభర్త కరయోవనః

అన్నం చ పాయసం బైక్ష్యం సయూషం చ పయోదధి

మిష్టాన్నం గుడమధ్వాజ్యశర్కరావవతో హవిః

వవో వీవణిజే విశ్వాం బాలవే గోచర స్థితౌ

 కౌలవే శకునౌ భానుః కింస్తుఘ్నే చోరసంస్థితః

చతుః పాదే తీరే నాగే సుప్త: క్రాంతం కరోతి హి

 ఇక ఇపుడు ఆయా నక్షత్రములవలన వచ్చిన వృక్షములను చెప్పుచున్నాము. అశ్వని వలన వృషవృక్షము భరణీ నక్షత్రమున, యమకరవృక్షము, కృత్తికా నక్షత్రమున మేడిచెట్టు, రోహిణీ నక్షత్రమున జంబుకవృక్షము, మృగశిరా నక్షత్రమువలన చండ్రచెట్టు, ఆర్ధా నక్షత్రమువలన నల్లజువ్వి, పునర్వసు నక్షత్రమువలన వెదురు, పుష్యమీ వలన పిప్పలము, ఆశ్లేష వలన నాగవృక్షము, మఘా వలన మట్టిచెట్టు, పుబ్బా నక్షత్రమువలన మోదుగు, ఉత్తరా నక్షత్రమువలన అక్షవృక్షము, హస్త వలన అరిష్టవృక్షము, చిత్తా నక్షత్రమువలన శ్రీవృక్షము, స్వాతివలన అర్జునవృక్షము, విశాఖా నక్షత్రమువలన వీకంకతవృక్షము, అనూరాధా నక్షత్రమువలన పొగడచెట్టు, జ్యేష్ఠా నక్షత్రము వలన విష్టి వృక్షము మూలా నక్షత్రము వలన సర్జవృక్షము, పూర్వాషాఢ నక్షత్రమువలన కంజల వృక్షము ఉత్తరాషాఢ నక్షత్రము వలన పనస వృక్షము, శ్రవణా నక్షత్రము వలన జిల్లేడు, ధనిష్ణా నక్షత్రము వలన జమ్మి చెట్టు, శతభిషా నక్షత్రము వలన కదంబ వృక్షము, పూర్వాభాద్ర నక్షత్రము వలన మామిడి చెట్టు, ఉత్తరాభాద్ర నక్షత్రము వలన వేపచెట్టు, రేవతి వలన ద్రాక్ష చెట్టు పుట్టినవి. ఈ వృక్షములన్నియు నక్షత్రముల వలన ఏర్పడినవిగా తెలియవలయును. యేనక్షత్రమున శని ఉండునో ఆ వృక్షమును ప్రయత్నపూర్వకముగా అర్చించవలయును. యోగేశులు, యముడు, విశ్వేదేవతలు, చంద్రుడు, భూమి, రుద్రుడు, వరుణుడు, గణేశుడు, రుద్రుడు, కుబేరుడు, త్వష్ట, మిత్రుడు, కుమారస్వామి, సావిత్రి, లక్ష్మి, గౌరి, అశ్వనీ దేవతలు, అదితి, పితృదేవతలు వీరిని , అర్చించవలయును. వైధృతి వ్యతీపాత్ లు మహాపాతములనబడును.

         పరిఘా యోగముయొక్క పూర్వార్ధము ఏకార్యములకు పనికిరాదు. విష్కంభ వజ్ర యోగములయొక్క మూడు నొడికలు, గండ, అతిగండ యోగముల ఆరు నాడికలు, వ్యాఘాతమున తొమ్మిది నాడులు, శూలమున అయిదు నాడులు, అశుభ ఫలప్రదములు. పునర్వసు, మృగశిర, మఘా, అశ్విని, మూల, అనూరాధ, పుష్యమీ, చిత్తా నక్షత్రములు: వరుసగా మూర్ధాస్థాన నక్షత్రములని తెలియవలయును. పైభాగమున ఒక రేఖను, అడ్డముగా పదమూడు రేఖలను గీయవలయును. ఆ ఖార్జూర చక్రమున - పైన చెప్పబడిన నక్షత్రములను మూర్ధస్థానమున ఉంచవలయును. ఒకే రేఖలో నుండు సూర్య చంద్రులకు పరస్పరము దృష్టిపాతమున్నచో ఏకాగ్దలమందురు. అభిజిత్తును వదిలి పన్నెండు ఏనాడులు లేని రెండు ఘడియలు యోగమందురు. అట్లే కరణము అందురు. ఈ యోగములు వరుసగా ఇరువది యేడుండును. ఇంద్రుడు, ప్రజాపతి, మిత్రుడు, త్వష్టా, భూమి, హరితీప్రియా, యముడు, కలి, రుద్రుడు, నాగము, వాయువు అనువారలు తిధ్యర్దేశులుగా తెలియవలయును. బవ మొదలుకొని వణిజమువరకు ఆరు శుభకరణములు. శుభకార్యములను పరీతమగు విష్టికొని విపరీతమగు విష్టికాని ఇష్టప్రదము కాజాలదు. ముఖమున అయిదు, కంఠమున ఒకటి, వక్షస్నలమున పదకొండు, నాభిస్థానమున నాలుగు, కటి స్థానమున ఆరు, పుచ్చమున మూడు నాడికలుండును. ముఖనాడికలలో కార్యమును ప్రారంభించినచో కార్యహాని, గల స్థాన నాడికలలో ప్రారంభించిన మృత్యువు, వక్షస్థలనాడికలలో అర్థహాని, కటి స్థాననాడికలలో ఉన్మాదము, - నాభి స్థాననాడికలలో చ్యుతి, పుచ్చ నొడికలలో ప్రారంభించిన జయము కలుగును. మధ్యభాగమున నున్న నక్షత్రములు స్థిరములు. అవియే మధ్యనాగ చతుష్పదములనబడును. ఆరుద్ర, ఆశ్లేష, అనూరాధ, మఘా, ధనిష్ఠ, పూర్వాషాడ, ఉత్తరఫల్గుని, పూర్వఫల్గుని. ఉత్తరాషాడ, రోహిణి, జ్యేషా, ఆర్ద్ర, కృత్తిక, ధనిష్ఠ, శతభిషం అను ఈ పది హేను నక్షత్రములు దీవాముహూర్తములని తెలియవలయును. ఆర్ద్ర, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, జ్యేష్ణ, పునర్వసు, పుష్యమి, శ్రవణము, హస్త, చిత్త, స్వాతి, నక్షత్రములు ఒకదినములో పగలులో పది హేనవభాగము, అట్లే రాత్రిలోని పది హేనవ భాగము ముహూర్తమానమగును. క్షణములు నక్షత్రములు సరిగా చూడవలయును. ఉత్తరఫల్గుని, మూల, రోహిణి, మఘా, కృత్తిక, అభిజిత్ ఈ నక్షత్రములలో భరణి మఘానక్షత్రములు రాక్షసములను పేరు గలవి. సూర్యాదులలో భర్గ, అజాంశలు గా నుండును. శుభకర్మలను చేయునపుడు ఆయా వారములలో పైన చెప్పబడిన ముహూర్తములను వదులవలయును. యే నక్షత్రములలో ఏ పనిని చేయవలయునని చెప్పబడినదో ఆ విధముగా ఆయాదేవతలున్న ముహూర్తములలోనే యాత్రాదికములను చేయవలయును. హస్తా నక్షత్రము నుండి ఏడవ నక్షత్రమున అనగా మూలా నక్షత్రమున భూకంపము, హస్త నుండి అయిదవ నక్షత్రమున అనగా అనూరాధా నక్షత్రమున విద్యుత్ , 8, 10 యవ నక్షత్రములలో అనగా పూర్వాషాఢ శ్రవణా నక్షత్రములలో శూలము, 18 వ నక్షత్రమున అనగా జ్యేషానక్షత్రమున శని, పది హేనవ నక్షత్రమున కేతువు, పందొమ్మిదవ నక్షత్రమున ఉల్కాపాతము, 9, 5 నక్షత్రములలో నిర్జాతపాతమను సంజ్ఞలను తెలియవలయును. మోహము, నిర్జాతపాతము, కంపము, కులిశము, పరివేషణము అనునవి 21 వ నక్షత్రము నుండి వరుసగా ఆయా నక్షత్రములలోనివి అని తెలియవలయును! పైన చెప్పబడిన ఈ నక్షత్రములలో చంద్రుడున్నచో శుభకార్యములు చేయకూడదు. హస్త మఘ చిత్త, అనూరాధ, అప్త నక్షత్రములలో శ్రవణమున క్రమముగా హస్తనుండి చంద్రునితో కూడియున్న చో, అంత వరకు ఆనక్షత్రమున దుష్టయోగమనబడును. వాటిలో చండీశ, చందోయుధా యోగములున్నపుడు ఈ యోగములలోనే శుభకార్యములనాచరించవలయును. తిథీ వారములు మలినములు పదమూడుండును. దీనిని క్రకచయోగమందురు. శుభకార్యములను ఈ క్రచ యోగమున ఆచరించరాదు.

ఆదివారమున సప్తమి, బుధవారమున ప్రతిపత్తు ఏర్పడినచో సంవర్తయోగమందురు. ఈ యోగము శుభకర్మలను నశింపచేయును. ఆనందము, కొలదండము, ధూమము, ధాత, సుధాకర, ధ్వాంక, ధ్వజ, శ్రీవత్స, వజ్ర, ముద్గర, ఛత్రకమిత్ర, మానస, పద్మ, లుంబన, ఉత్పాత, మృత్యువు, కాణ, సిద్ధి, శుభ, అమృత్యు, ముసల, అంతక, కుంజర, రాక్షస, వర, స్థైర్య, వర్థమానము అనునవి ఇరువది ఎనిమిది యోగములు. తమ పేరులో నున్న ఫలమునొసంగునవి. ఆదివారమున -క్రమముగా అశ్వని మృగశిరలలో చంద్రుడున్నను, ఆశ్లేషలో కుజుడున్ననూ, హస్తా నక్షత్రమున బుధుడున్నను, అనూరాధలో బృహస్పతి యున్ననూ, ఉత్తరాషాఢ శుక్రుడున్ననూ, శతభిషమున శని యున్ననూ, హస్తలో చంద్రుడు, మృగశిరా అశ్వినులలో కుజుడున్ననూ, అనూరాధలో బుధుడున్నను పుష్యమిలో బృహస్పతి యున్ననూ, రేవతిలో శుక్రుడున్ననూ, శని వారమున రోహిణీ నక్షత్రము వచ్చిన చో ఇవియన్నియూ సిద్ధయోగములనబడును. ఆది మంగళవారములలో నందా, శుక్ర సోమవారములలో భద్రా, బుధవారములో జయా, “గురువారము రిక్త, శనివారము పూర్ణ ఉన్నచో శుభప్రదములు. శుక్రవారమున నందాతిథి, బుధవారమున భద్రా, మంగళవారమున జయ, - శనివారమున రిక్త, గురువారమున పూర్ణ యున్నచో సిద్ధయోగములందురు. ఏకాదశి తిథి సోమవారము, ద్వాదశి ఆదివారము గురువారము షష్ఠి, బుధవారము తృతీయ, శుక్రవారము అష్టమి, శనివారము నవమి, మంగళవారము పంచమీ. ఇవి దగ్గ యోగములనబడును. ఆదివారము , భరణీ నక్షత్రము, సోమవారము చిత్తానక్షత్రము, మంగళవారము ఉత్తరాషాఢ, బుధవారము శ్రవణము, గురువారము ఉత్తర ఫల్గుని, శుక్రవారము జ్యేషా, శనివారము రేవతి యున్నపుడు గ్రహోదయము జరిగినచో నక్షత్రనాశమును కలిగించును. విశాఖ నుండి నాలుగు వర్గములు ఆదివారము నుండి వరుసగా ఏర్పడినచో అదే వరుసలో ఉత్పాత, మృత్యు, కొణ, సిద్ధియోగములనబడును. తిథివారములు కలిసినపుడు ఏర్పడిన యోగము శుభప్రదము కాదు. వార నక్షత్రముల కలయిక వలన ఏర్పడిన యోగములు ఇతరదేశములలో శుభప్రదములు. . హోరా, అష్టాకీ, మహోదరీ, మందా, మందాకినీ, మిశ్రా, రాక్షసీ. అను యోగములు ఆదివారాది వారములలో వరుసగా ఉండును. శూద్ర, తస్కర, వైశ్య, బ్రాహ్మణ, క్షత్లోయ, గోవులకు ఇంకా చెప్పువాటికి అన్నిటికి వరుసగా ఘోరాది యోగములు సుఖప్రదములు. పూర్వాహ్లామున రాజులను, మధ్యాహ్నమున బ్రాహ్మణులను, అపరాష్ట్రమున వైశ్యులను, ప్రదోషకాలమున శూద్రులను, రాత్రి పిశాచములను, అపరరాత్రమున రాక్షసులను, నాట్యకారులను, ఉషః కాలమున గోపాలురను, సంధ్యకాలమున బ్రహ్మ చారులను సూర్యసంక్రమణము ఏర్పడినచో నశింపచేయును. మేష సంక్రమణము పగలు వచ్చినచో అనర్గములను కలహములను, కలిగించును. రాత్రివచ్చినచో సుభిక్షము, సంధ్యాకాలమున వృష్టినాశము కలగును. సింహము, శార్దూలము, వరాహము, ఖరము, - కుంజరము, మహిషము, అశ్వము, కంచరగాడిద, వృషభము ఇవీ పోదోయుధములు, కరణములు వాహనములుగా నుండును. భుశుడి గద, ఖడ్గము, దండము, ధనుస్సు, తోమరము. కుంతము, పొశము, అంకుశము, అస్త్రములు, బాణములు వీటిని చేతులలో సూర్యుడు ధరించును. అన్నము పాయసము, భైక్యము, పాలు, పెరుగు, మిష్టాన్నము గుడము, తేనే, నెయ్యి, శర్కర, హవిస్సు ఇవి ఆహారము. సూర్యుడు చరరాశిలో ఉండగా పక్షులు వైశ్యులు బవకరణమున బావమున- సూర్యుడున్న చో కాలవమున శకునిలో సూర్యుడున్న చో, కింస్తుఘ్నమున చోరులలో నున్నను, చతుః పాదమున, తలమున, నాగమున పరున్నచో క్రాంతిని చేయును.

ధర్మాయుర్వృష్టిషు సమం శ్రేష్ఠం నష్టం ఫలం క్రమాత్

ఆయుధం వాహనాహారౌ యజ్జాజీయం జనస్య చ

స్వాపోపవిష్టా స్తిష్టన్త స్తే లోకాః క్షేమమాప్నుయుః

అంధకం మందసంజ్ఞంచ మధ్యసంజ్ఞం సులోచనమ్

పాపీయాద్గణమేద్ఖాని రోహిణ్యాది చతుర్విధమ్

స్థిరభేష్వర్కసంక్రాన్తి ర్జేయా విష్ణుపదాహ్వయా

 షడశీతి ముఖా జ్ఞేయా ద్విస్వభావేషు రాశిషు

 తులా ఘటా జయో ర్జేయో విషువత్సూర్యసపుము

 యామ్యాయనే స్థిరేత్వాద్యాః పరాసౌమ్యేందు మూర్తిభైః

 మేధ్యా విఘవతి ప్రోక్తాః పుణ్యనాడ్యస్తు షోడశ

 సంధ్యా త్రినాడీ ప్రమితార్కబింబో ర్ద్వోదయాస్తతః

ప్రాక్పశ్చాద్యామ్య సౌమ్యే చేత్పుణ్యం పూర్వపరేఽహని

  నరః ప్రాప్నోతి తద్రాశౌ శీతాంశోస్సాధ్వసాధు చ

 సంక్రాన్తేః పరతో భానుర్ఖుక్త్వా యావద్భిరంశకైః

రవేరయనసంక్రాన్తిస్తదా తద్రాశి సంక్రమాత్

 సంక్రాన్తి గ్రహాతేంవా జన్మన్యుభయపార్వాయోరీక్ష:

 ప్రతోద్వా హాదికేష్వేవ ద్వయం నేష్టంతు తత్ర్కమాత్

 తిలోపరి లిఖేచ్చక్రం త్రిశూలం త్రికోణకమ్

తత్ర హేమ వినిక్షిప్య దద్యాద్దోషాపవృత్తయే

 తారాబలేన శీతాంశుర్బలవాంస్తద్వశాద్రవిః

బలీ సంక్రమమాణస్తు తద్వత్కేటాబలాధికాః

శుభోర్కో జన్మతస్స్యాయ దశషట మునిశ్వర

 నవపంచాంఋరిష్పస్థై ర్వ్యరిభిర్విధ్యతే న చేత్

 త్రయారిషు కుజ శ్శ్రేష్ఠో జన్మత శ్టేన్న విధ్యతే

వ్యయేషంక స్థితై స్సౌరి సౌమ్యసూర్యై శుభోషధాత్

 శుభో జన్మర్క్షత శ్చంద్రోద్యానాంగాయారీ స్వత్రిషు

యధేష్టాంత్యాంబు ధర్మస్థై బుదైర్విధ్యతే న చేత్

 జ్ఞస్స్వాయార్యష్ట స్వాయేఘ జన్మత శ్టేన్న విధ్యతే

 ధీత్ర్య కాదిగజాంతస్థై శశాంకరహితైశ్శుభై

 జన్మరాశేర్గురుశ్శ్రేష్ఠ స్వాయగ్యో ధ్యస్తగో న చేత్

 జన్మరా శేర్గురుశ్శ్రేష్ఠ స్వాయగోళి ధ్యస్తగో న చేత్

విధ్యర్తెత్యాష్ట ఖాబుత్రిగతైః ఖేటైర్మునీశ్వర

 జన్మభాదా సుతాష్టాంకాం త్యాయేష్విష్టోభృగోస్సుతః

చేన్నవిద్రోష్టసప్తాంగం ఖాంకాద్యాయారిరామ గైః

తస్మా ద్వేధం విచార్యాథ కథనీయం శుభాశుభమ్

వామభేదవిధానేన దుష్టోఽపి స్యాచ్చుభంకరః

సౌమ్యేక్షితోకలిష్టఫల: శుభదః పాపవీక్షితః

నిష్ఫలౌతా గ్రహౌ స్వేన శత్రుణా చ విలోకితౌ

 నీచరాశిగతస్స్వస్య శత్రోః క్షేత్రగతోఽపివా

 శుభాశుభఫలం నైవ దద్యాదస్తమితోఽపి వా

 గ్రహేషు విషమ స్థేషు శాంతిం కుర్యాత్ప్రయత్నతః

 హానిర్వృద్ధిర్గృహాధీనా తస్మాతూజ్యతమాగ్రహ్యాః

 మణి ర్ముక్తాఫలం విద్రుమాఖ్యం మరకతం తధా

 పుష్పరాగం తధా వజ్రం నీలం గోమేద సంజ్ఞాతమ్

 వైదూర్యం భాస్కరాదీనాం తుష్ట్యై ధార్యం యథాక్రమమ్

 శుక్లపక్షాదిదివ సే చంద్రో యస్య శుభప్రదః

 పక్షస్తస్య శుభదః కృష్ణపక్షోఽన్యధ్యాశుభః

శుక్లపక్షే శుభశ్చంద్రో ద్వితీయనవ పంచమే

రిఃఫరంధ్రంబుసం స్థైశ్చ న్న విద్ధో గనే చరైః

జన్మ సంపద్వీపత్ క్షేమ ప్రత్యరిస్సాధకో వధః

 మిత్రం పరమమిత్రం చ జన్మ భాత్తు పునః పునః

 జన్మత్రిపంచసప్తా ఖ్యా స్తారానేష్టఫలప్రదాః

 శాకం గుడం చ లవణం సతిలం కాంచనం క్రమాత్

అనిష్టఫలనాశాయ దద్యాదేతద్ద్విజాతయే

కృష్ణే బలవతీ తారా శుక్లపక్షే బలీ శశీ

 చంద్రస్య ద్వాదశావస్థా రాశౌ రాశౌ యథాక్రమమ్

 యాత్రోద్వాహ్వాది కార్యేషు నామతుల్య ఫలప్రదాః

షష్ఠిఘ్నం గత చంద్రరీక్షం తత్కాల ఘటికాన్వితమ్

వేదఘ్నమిఘ వేదాంత్యమవస్థా భ్మానుభ్మా గతః

ప్రవాస నష్టాఖ్యమృతా జయో హస్యం రతిం ముదా

శని భుక్తి ర్జ్వరః కంపః సుస్థితి ర్నామ సన్నిభః

 పట్టబంధన యానోగ్ర సంధివిగ్రహభుషణమ్

 ధాత్వా కరం యుద్ధకర్మ మేషలగ్నే ప్రశస్సాతి

 మంగలాని స్థిరాణ్యంబువేశ్మ కర్మ ప్రవర్తనమ్

 కృషివాణిజ్యపశ్వాది దుష్టలగ్నే ప్రసిద్ధ్యతి

 కాలవిజ్ఞానశిల్పాని భూషణాహవసంశ్రవమ్

 గజోద్వాహాభి షేకాద్యం కర్తవ్యం మిధునోదయే

వాపికూపతటాకాదివారిబంధనమోక్షణమ్

పౌష్టికం లిపిలేఖాది కర్తవ్యం కర్కటోదయే

ఇక్షుధాన్య వణిక్పణ్యకృషి సేవాదయ స్థిరే

 సాహసాహవభూపాద్యం సింహల గ్నే ప్రసిద్ధ్యతి

విద్యా శిల్పౌషధం కృత్యం భూషణం చ చరస్థిరమ్

 కన్యాలగ్నే విధేయం చ పౌష్టికాఖిల మంగలమ్

 కృషివాణిజ్యయానం చ పశూద్వాహవ్రతాదికమ్

తులాయామఖిలం కర్మ తులాభారాశ్రితే చ యత్

 స్థిరకర్మాఖిలం కార్యం రాజ సేవాభి షేకనమ్

 చౌర్యకర్మ స్థిరారంభ్మాః కర్తవ్యా వృశికోదయే

వ్రతోద్వాహప్రయాణాశ్వగజశిల్పకలాదికమ్

చరస్థిరవిమిశ్రం చ కర్తవ్యం కార్ముకోదయే

చాపబంధనమోక్షాస్త్ర కృషిగోశ్వాదికర్మ యత్

ప్రస్థానం పశుదాసాది కర్తవ్యం మకరోదయే

 కృషివాణిజ్యశ్వంబుశిల్పకర్మ కదిలా దీకమ్

 జలపాత్రాస్త్రశస్త్రాది కర్తవ్యం కలశోదయే

వ్రతోద్వాహాభి షేకాంబు స్థాపనం సన్నివేశానామ్

 భూషణం జలపాత్రాశ్వకర్మ మీనోదయే శుభమ్

 మేషాదిషు విలగ్నేషు శుద్దే ష్వేవం ప్రసిద్ధ్యతి

క్రూరగ్ర హేక్షితే ఘాగ్ర సంయుతే ఘాగ్రమేవ హీ

 గోయుగ్మ కర్కకన్యాంత్య తులా చాపధరాశ్శుభాః

 శుభరక్షత్వా శుభాసత్య ఇతరా పాపరాశయః

   ధర్మ, ఆయుష్య వృష్టులలో వరుసగా శ్రేష్ఠము, నష్టము, ఫలము అనునవి ఫలములుగా నుండును. సూర్యుని ఆయుధములు, వాహనములు, ఆహరములు ఎటువంటివో నిద్రంచుట కూర్చునుట, నిలబడుట ఎవరికి అలవాట్లు గానుండునో అటువంటి లోకములు క్షేమమును పొందగలవు. రోహిణి. నుండి నాలుగు నక్షత్రములు అంధకము, మందము, మధ్యము సులోచనము అను సంజ్ఞలను పోలియున్నవి. ఈ నాలుగు పాటీయములుగా పరిగణించవలయును. స్థిరరాశులలో సూర్య సంక్రాంతి యేర్పడినచో విష్ణుపదమందురు. ద్విస్వభావరాశులలో సంక్రమణము జరిగినచో షడశీతిముఖ యందురు. తుల కుంభ మేషములలో సూర్య సంక్రమణమేర్పడినచో విషువత్ అందురు. దక్షిణాయనమున స్థిరరాశులలో ఏర్పడినపుడు మొదటివి, కర్కాటక కన్య మిథున రాశులలో ఏర్పడినపుడు తరువాత చెప్పినవి ఏర్పడును. విషువత్తులో పుణ్యనాడులు పదునాఱని చెప్పబడినవి. సంధ్యాకాలము నాడీత్రయపరిమితము.. సూర్యబింబము ఉదయించుట, ఊర్ధ్వగతి మిగిలిన నాడులలో జరుగును. దినమున పూర్వాహ్లా పరాష్ట్రములలో తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తర దిశలలో జరిగినచో పుణ్య మగును. ఎటువంటి చంద్రునితో భానుసంక్రాంతి ఏర్పడునో అట్టి ఫలముకలుగును. ఆరాశిలో చంద్రుని మంచి చేడులవలన కలుగు ఫలమునే మానవుడు పొందును. సంక్రాంతి తరువత సూర్యుడు ఎన్ని అంశల భుక్తుల తరువాత సూర్యుని అయన సంక్రాంతి కలుగునో అదే ఆరాశి సంక్రమణము వలన ఏర్పడును. సంక్రాంతి గ్రహము, నక్షత్రము కాని జన్మలో, రెండు పార్శ్వములలో ఉన్న చో వ్రతవివాహదులలో ఆక్రమముచే ఆ రెండు ఇష్టములు కావు. నువ్యుల మీద చక్రమును లిఖించవలయును. మూడుత్రిశూలములను మూడు కోణములుగా లిఖించి వాటి పై బంగారమునుంచి దోషనివృత్తికొరకు దానమును చేయవలయును. తారాబలముచే చంద్రుడు బలీయుడగును. చంద్రుని వలన సూర్యుడు బలీయుడగును. సంక్రమణము జరుగు సూర్యుడు ఖలియుడు. అట్లే గ్రహములు బలీయములు. శుభుడగు సూర్యుడు జన్మ నుండి 3, 11, 10, 6 లో 9,5,లలో, శనికంటే భిన్నగ్రహములచే వేధించబడనిచో శుభకరుడగును. 3, 11, 6 స్థానములలో కుజుడు శుభుడు. అదియును జన్మవిద్దకానపుడు మాత్రమే. 12 వ స్థానమున అంకస్థితులతో శని బుధ సూర్యులచే చూడబడనపుడు కుజుడు శుభుడు. జన్మ నక్షత్రమునుండి చంద్రుడు శుభుడు 7, 9, 6, 3 స్థానములలో అంత్యాంబు ధర్మ స్థానములలోనుండు గ్రహములచే విద్దలేనపుడు మాత్రమే. బుధుడు 1, 11, 6, 8 స్థానములలోనుండి జన్మనుండి లిద్దలేనిచో 4, 3 మోదలగు గజాంతములలో ఉండి చంద్రుడులేని శుభగ్రహ విక్టణమున్నచో శుభుడగును. జన్మరాశినుండి గురుడు, అస్తగతుడు స్వాయగతుడు కొనిచో శుభుడగును. 1,9,6,3 స్థానములలోనున్న గ్రహములచే చూడబడినపుడు మాత్రమే. శుక్రుడు జన్మరాశి నుండి 4, 6, 8, 12, 11 ఉన్న చో శుభుడు.7, 6, 1, 11 స్థానములలో విద్ధ లేనపుడు మాత్రమే.

 గ్రహమునకు వేధ యున్నచో శుభము నీయజాలడు. కావున గ్రహ వేధను చక్కగా పరిశీలించిన తరువాతనే శుభాశుభఫలములను చెప్పవలయును. వామ భేదవిధానముచే దుష్టగ్రహము కూడా శుభమును కలిగించును. సౌమ్యగ్రహములచే చూడబడినచో అనిష్ట ఫలమును కలిగించును. పాపగ్రహములచే చూడబడినచో శుభములనిచ్చును. తనను తాను చూచుకొనినను, శత్రువు చేత చూడబడిననూ గ్రహములు నిష్పలములగును. నీచరాశిలో ఉన్ననూ, తన శత్రు క్షేత్రమున నున్ననూ అస్తగతుడైనను శుభాశుభఫలముల నీయజాలడు. గ్రహములు విషమ స్థానములలో నున్నపుడు ప్రయత్నపూర్వకముగా శాంతిని జరుపవలయును. శుక్లపక్షమున ద్వితీయ నవ పంచమ స్థానములలోని చంద్రుడు గ్రహముల వేధ లేకయున్నచో శుభుడు. జన్మతారనుండి వరుసగా ప్రతి తొమ్మిది నక్షత్రములకు జన్మ, సంపత్, విపత్, క్షేమ, ప్రత్యక్, సాధన, నైధన, మిత్ర పరమమిత్ర అనీ తారాబలమును తెలుపు పేర్లు. ఇట్లు ఈ తొమ్మిందింటినే మరల మరల చూడవలయును. జన్మ, వీపత్ , ప్రత్యక్, నైధన తారలు అనిష్ట ఫలమునొసంగును. ఆయనిష్టము నశించుటకు శానదానము, గుడదానము, లవణదానము, తిలదానము, సువర్ణదానము వరుసగా ఆయా తారలలో దానము చేయవలయును. "కృష్ణపక్షమున తారలు బలము కలిగియుండును. శుక్లపక్షమున చంద్రుడు బలవంతుడుగా నుండును. చంద్రుని ప్రతిరాశిలో ఆ వరుసలోనే ద్వాదశావస్థలుండును. యాత్ర, వివాహాదికార్యములలో ఆయా అవస్థలు తమ పేరులో నున్న ఫలములనే ఇచ్చును. షష్ణ స్థాన వేధయున్నది, చంద్రనక్షత్రము దాటినది ఆయా సమయములలోని ఘటికలలో కూడినది, నాలుగుతో కొట్టబడినది 5, 4, 12 అవస్థలు సూర్యుభాగము వలన ప్రవాస, నష్ట, మత, జయ, హాస్యం, రతి, మోసము, శని, భుక్తి, జ్వరము, కంపము, సుస్థితి అని చంద్రునికి 12 అవస్థలుండును. పట్టబంధము, యానము, ఉగ్రకర్మ, సంధివిగ్రహకర్మలు ఆభరణ ధారణము, ధాత్వాకరము, యుద్ధకర్మ ఈ పనులను మేష లగ్నమున చేయుట శుభప్రదము. శుభకార్యములు, స్థిరమైన కార్యములు, జలకర్మ , గృహకర్మ, కృషివాణిజ్యపశ్వాదికర్మలను దుష్టలగ్నమున చేయవలయును. కాలవిజ్ఞానము, శిల్పకర్మ భూషణధారణము, యుద్దము, గజకార్యము, వివాహము, అభి షేకాది కర్మలను మిథున లగ్నమున చేయవలయును. వాపీకూపతటాకాది కర్మలను, వాటి బంధనమును, వాటి మోక్షమును, పౌష్టికకర్మను, లిపి లేఖనమును కర్కాటక లగ్నమున చేయవలయును.

 ఇక్టు కర్మ, ధాన్యకర్మ, వాణిజ్యకర్మ, విక్రయకర్మ, వ్యవసాయము, సేవాదికర్మలు స్థిరలగ్నమున చేయవలయును. సాహసకార్యములను, యుద్దమును, రాజకార్యములు మొదలగువాటీని సింహలగ్నమున చేయవలయును. విద్యాభ్యాసము, శిల్పకర్మ, ఔషధకర్మ, భూషణధారణ, చర స్థిర లగ్నములలో చేయవలయును. పౌష్టికకర్మలు, సర్వశుభ కార్యములు కన్యాలగ్నమున చేయవలయును. కృషికర్మను, వాణిజ్యకర్మను, యానకర్మ , పశుకర్మ , వివాహము, వ్రతాది కార్యములను తులాభారాశ్రితమైన కర్మలను తులాలగ్నమున చేయవలయును. సమస్తములగు స్థిర కర్మలను, రాజ సేవను, రాజాభి షేకమును, చోరకర్మ, స్థిరములగు ప్రయత్నములను వృశ్చిక లగ్నముననాచరించవలయును. వ్రతములను, వివాహమును, ప్రయాణమును, అశ్వగజ కర్మలను, శిలకర్మలను, కళాకర్మలను, చర స్థీరకర్మలను ధనుర్లగ్నమున నాచరించవలయును. చాప బంధనము, చాప మోక్షమును, అస్త్రకర్మను కృషికర్మ, గోకర్మ, ఆశ్వాదికర్మలు, ప్రస్థానము, పశుకర్మ, దాసకర్మలను మకర లగ్నమున చేయవలయును. కృషి, వాణిజ్య, పశు, జల, శిల్ప కళాదికవలలను, జలపాత, అస్త్ర శస్త్రాది కర్మలను కుంభలగ్నమున చేయవలయును. వ్రతములను వివాహమును, అభి షేకమును, జలస్థాపనము, సన్ని వేశనము, భూషణములను జలపాత్ర, అశ్వకర్మలను మీనలగ్నమున చేయవలయును. మేషాది విలగ్నములు శుద్ధములుగా ఉన్నపుడు ఈ కర్మలనాచరించుట ప్రసిద్దీకలదు. క్రూరగ్రహములచే చూడబడినను, ఉగ్రగ్రహములున్ననూ క్రూరఫలితమే కలుగును. వృషభ, మిథున, కర్కాటక, కన్యా, మీన, తులా, ధనుర్లగ్నములు శుభప్రదములు. శుభ నక్షత్రములు శుభగ్రహములు ఉన్నపుడు శుభములు. ఇతర రాశులు పాపరాశులు.

 గ్రహయోగావలోకాభ్యాం రాశిర్ధత్తే గ్రహోద్భవమ్

 ఫలం తాభ్యాం విహీనోఽసౌ స్వభావముపసర్పతి

 ఆదౌ సంపూర్ణ ఫలదం మధేమధ్యఫలప్రదమ్

 అంతే తుచ్ఛ ఫలే లగ్నే సర్వస్మిన్నేవమేవ హి

 సర్వత్ర ప్రధమం లగ్నం కర్తుశ్చంద్రబలం తతః

కల్ప్యామదిందౌ బలిని సప్తమే బలినో గ్రహాః

 చంద్రస్య బలిమాధారమాధేయం చాన్య ఖేటకమ్

 ఆధారభూతేనాధేయం ధీయతే పరిధిష్టనమ్

 చేదిందు శ్శుభద స్సర్వే గ్రహా శ్శుభఫలప్రదాః

అశుభ శ్చేదశుభదా వర్జయిత్వా ధనాధిపమ్

 లగ్న స్యాభ్యుదితా యేం శా స్తేష్వం శేషు స్థితో గ్రహః

లగ్నోద్భవం ఫలం ధత్తే ధనాతీతో ద్వితీయకమ్

 ఏవం స్థానేషు శేషేషు చైవమేవం ప్రకల్పయేత్

లగ్నం సర్వగుణోపేతం లభ్యతేఽల్పైర్దినెర్న హి

 దోషాల్పత్వం గుణాధిక్యం బహుసంతతమిష్యతే

 దోషాద్దుష్టోహీ కాలస్తమపి మార్జుం పితామహః 

అప్యశాచ గుణాధిక్యం దోషాన్యత్తే తతో హి తే

ఆమరిక్తాష్టమీ షష్టీ ద్వాదశీ ప్రతిపత్స్వపి

పరిఘస్య చ పూర్వార్థం వ్యతీపాతే స వైధృ తా

 సంధ్యాసూపప్లవే విష్ట్యామశుభం ప్రధమార్తవమ్

 రుగ్ణా పతిప్రియా దుఃఖీ పుత్రిణే భోగినీ తధా

 పతివ్రతా కేశయుక్తా సూర్యవారాదిషు క్రమాత్

 యామాగ్నిరౌద్రభాగ్యా హి ద్వీశేంద్రాది హ్యుపద్విషాః

 తారకా న హితా మాసా మధూర్జ శుచిపౌషకాః

భద్రా చ సంక్రమో నిద్రా రాత్రిశ్చంద్రార్కయోర్గృహః

కులటా పాపభో శేషు నింద్యర్క్షే నింద్యవాసరే

 తిలాజ్య దూర్వా జుహుయా గాయత్ర్యాష్ట శతం బుధః

 సువర్ణగోతిలాన్దద్యాత్ సర్వదోషాపనుత్తయే

 ఆద్యానిశశ్చ తస్రస్తు త్యాజ్యా హ్యపి సమాఃపరైః

 ఓజరాశ్యంశగే చంద్ర లగ్నౌ పుంగ్రహవీక్షితే

 ఉపవీతీ యుగ్మతిధావనగ్న: కామయేత్ప్రియమ్

పుత్రార్దీ పురుషస్త్యక్త్వా పౌష్ణమూలాహి పిత్ర్యభమ్

 ప్రసిద్ధే ప్రధమే గర్భే తృతీయే వా ద్వితీయకే

 మా సే పుంసవనం కార్యం సీమంతం చ యధా తధా

చతుర్ధే మాసి షష్ఠేవా ప్యష్టమే వా తదీశ్వరే

 బలోపపన్నే దంపత్యో శ్చంద్రతారా బలాన్వితే

అరిక్తా పర్వదివసే కుజజీవార్కవాసరే

తీక్ష్ణ మిశ్రార్క వర్జ్యేషు పుంభాం రాత్రినాయకే

శుద్ధేఽష్టమే జన్మలగ్నా తయోర్లగ్నౌ న నైధనే

 శుభగ్రహయుతే దృష్టే పాపదృష్టి వివర్జితే

 శుభగ్రహేష ధీ ధర్మ కేంద్రేష్వరిభవే త్రిషు

పా పేషు సత్సు చంద్రేఽన్త్య నిధనాద్యరివర్జితే

 క్రూరగ్రహాణా మేకోఽపి లగ్నాదంత్యాత్మజాష్టగః

 సీమంతినీం వా తద్గర్భం బలీహంతి న సంశయః

 తస్మిన్జన్మముహూర్తేఽపి సూతకాంతేఽపి వా శిశోః

జాతకర్మ ప్రకర్తవ్యం పితృపూజనపూర్వకమ్

సూతకాంతే నామకర్మ విధేయం తత్కులోచితమ్

నామ పూర్వం ప్రశస్తం స్యాన్మంగలై స్సుసమీక్షితైః

 దేశకాలోపఘాతాద్యైః కాలాతిక్రమణం యదా

 అనస్త గే భృగావీజ్యే తత్కార్యేచోత్తరాయణే

 చరస్థిరమృదుక్షిప్ర నక్షత్రే శుభవాసరే

 చన్ద్రతారా బలోపేతే దివపే చ శిశోః పితుః

శుభలగ్నే శుభాంశే చ నిధనే శుద్ధి సంయుతే

 షష్ఠే మాస్యష్టమే వాపి పుంసా స్త్రీణాం తు పంచమే

 రిక్తాం దీక్షయం నన్దాం ద్వాదశీ మష్టమీ మన

త్యక్త్వానతిధిషు ప్రోక్తం ప్రాశనం శుభవాసరే

 చరస్థిర మృదుక్షిప్ర నక్షత్రే శుభనైధనే

దశమే శుద్ధ సంయుక్తే శుభలగ్నే శుభాంశకే

పూర్వార్థ సౌమ్యఖేటేన సంయుక్తే వీక్షితేఽ పివా

త్రిషష్ఠలాభగై:క్రూరైః కేంద్రధీధ్ధర్మ గైశ్శుభైః

వ్యయాదినిధన స్థేచ చంద్రేఽన్నప్రాశనం శుభమ్

 తృతియే పంచమే చాబ్ధే స్వకులాచారతోఽపి వా

బాలానాం జన్మత శ్చౌలం స్వగృహ్యోక్త విధానతః

సౌమ్యాయనే నాస్తగయో సురారిసురమంత్రిణోః:

 అపర్వరిక్తతిధిషుo శుక్రేజ్యజ్ఞేందువాసరే

 దస్రాదితీజ్య చంద్రేంద్ర పూషఖాని శుభాని చ

 చౌలకర్మణి హస్తరాక్ష త్రీణి త్రీణి చ విష్ణుభాత్

 పట్టబంధనచౌలాన్నప్రాశనే చోపనాయనే

 శుభదం జన్మ నక్షత్రమశుభం త్వన్యకర్మణి

ఆష్టమే శుద్ధి సంయుక్తే శుభలగ్నే శుభాంశకే

జన్మాష్టమేన శీతాంశౌ షష్టాష్టాంత్య వివర్జితే

 ధదత్రికోణ కేంద్ర స్థైశ్శుభై స్ర్యయారి గైఃపరైః

 అభ్యక్తౌ సంధ్యయోర్నారే నిశి భుక్తావాన వి హవే

నోత్కటే భూషితేఽనైవ యానే న నవయ్యే హ్ని చ

క్షౌరకర్మ మహీపానాం పంచమే పంచమేఽ హాని

 కర్తవ్యం క్షౌరనక్షత్రేఽప్యధ వాస్యోదయే శుభమ్

నృప విప్రాజ్ఞయా యజ్ఞే మరణే బంధమోక్షణే

 ఉద్వాహేఽఖిల వో తిథిషు క్షౌరమిష్టదమ్

 కర్తవ్యం మంగలేష్వాదౌ మంగలాయ క్షురార్పణమ్

నవమే సప్తమే వాపి పంచమే దివసేఽపివా

 తృతీయే బీజనక్షత్రే శుభవారే శుభోదయే

సమ్యగ్గృహాణ్యలంకృత్య వితానధ్వజతోరణైః

ఆశీషో వాచనం కార్యం పుణ్యం పుణ్యాంగనాదిభిః

సహా వాదిత్రనృత్యాద్యే ర్గత్వా ప్రాగుత్తరో దిశమ్

 తత్ర మృదం తతస్తీక్ష్ణా గృహీత్వా పునరాగతః

 మృణ్మయ్యేవ్యధవా వైణేఽపి పాత్రే ప్రపూరయేత్

అనేకబీజసంయుక్తం తోయం పుష్ఫాభిశోభితమ్

 ఆధానాదష్టమే వర్షే జన్మతో వాగ్రజన్మనామ్

 రాజ్ఞామేకాదశే మౌంజీబంధనం ద్వాదశే విశామ్

 జన్మతః పంచమే వర్షే వేదశాస్త్రవిశారదః

 ఉపవీతీ యతః శ్రీమాన్ కార్యం తత్రోపనాయనమ్

బాలస్య బలహీనోఽపి సీతో జీవశ్శుభప్రదః

 యధోక్తవత్సరే కార్యం అనుక్తే నోపనాయనమ్

దృశ్యమానగురౌ శుక్రే శాఖేశే చోత్తరాయణే

 వేదానామధిపాశు జీవక్రభౌమబుధాఃక్రమాత్

శరద్గ్రీష్మవసంతేషు వ్యుత్క్రమాత్తు ద్విజన్మ సౌమ్

 ముఖ్యం సాధారణం తేషం తపో మాసాది పంచసు

స్వకులాచారధర్మజ్ఞో మాఘమా సే తు ఫాల్గునే

 విధిజ్ఞ శ్చార్ద వాంశ్చైత్రే వేద వేదాంగ పారగః

 వైశాఖే ధనవాన్వేదశాస్త్రవిద్యావిశారదః

ఉపవీతో బలాఢ్యశ్చ జ్యేష్ఠే విధివిదాం వరః

 శుక్లపక్షే ద్వితీయా చ తృతీయా పంచమా తథా

 త్రయోదశీ చ దశమీ సప్తమి వ్రతబంధనే

శ్రేష్టాత్వే కాదశీ షష్టీ ద్వాదశ్యన్యాస్తుమధ్యమాః

 కృష్ణే ద్వితీషు సంఖ్యాశ్చ తిథ్యోఽన్యా హ్యతినిందితాః

ధిష్ణ్యాన్యరత్రయాంత్యజ్య రుద్రాదిత్యుత్తరాణి చ

 విష్ణుత్రయాశ్విమిత్రోజ్జయోని భాన్యుపనాయనే

 జన్మభాద్దశమం కర్మ సంఘాతరక్షంతు షోడశమ్

అష్టాదశం సముదయం త్రయోవింశం వినాశనమ్

మానసం పంచవింశర్క్ష నాచరే చ్ఛుభమేషు తు

 ఆచార్య సౌమ్యకావ్యానాం వారాశ్శస్తాశ్శసీ నయోః

వారౌ తు మధ్యమౌ చైవ వ్రత్యాన్యౌ నిందితౌ మతా

త్రిధా విభజ్య దివసం తత్రాదౌ కర్మ దైవికమ్

 ద్వితీయే మానుషం కార్యం తృతీయేం శే చ పైతృకమ్

 కృషి వాణిజ్య పశ్వంబు శిల్పకర్మకలాదికమ్

 స్వనీచగే తదంతే వా స్వారిభౌ వా తదంశ కే

 గురుశిఖి నోశ్చ శాఖేశే కలాశీలవివర్జితః

 స్వాధిశత్రుగృహస్థే వా తదంశ స్థేఽధ వా ప్రతీ

 శేఖే శే వా గురౌ శుక్రే మహాపాతకకృద్భవేత్

స్వోచ్ఛసంస్థే తదం శేవా స్వరాశౌ రాశి గే గణే

శాఖే శే వా గురౌ శుక్రే కేంద్ర గే వా త్రికోణ గే

అతీవ ధనవాంశ్చైవ వేదవేదాంగపారగః

పరమోచ్చగతే జీవే శాఖే శే వాథ వాసితే

 ప్రతీ విశుద్దే నిధనే వేదశాస్త్ర విశారద:

స్వాధిమిత్ర గృహస్థే వా తస్యోచ్చ స్ధ తదంశ గే

గురౌ భృగౌ వా శాఖేశే విద్యాధనసమన్వితః

శాఖాధిపతివారశ్చ శాఖాధిపబలం శిశో

 శాఖాధిపతి లగ్నం చ దుర్లభం త్రితయం ప్రతే

 తస్మా ద్వేదాంశగే చన్ద్రే ప్రతీ విద్యావిశారదః

పాపాంశగే స్వాంశగే వా దరిద్రో నిత్యదుఃఖితః

శ్రవణాదిని నక్షత్రే కర్కాంశ స్థే నిశాకరే

తదా వ్రతీ వేదశాస్త్ర ధనధాన్యసమృద్ధిమాన్

 శుభలగ్నే శుభాం చ నైధనే శుద్ధిసంయుతే

లగ్నే తునిధనే సౌమ్యైసంయుతే వా నిరీక్షితే

ఇష్టైర్జీవార్కచంద్రాద్యై పంచభిర్చలిభిర్గ్ర  హైః

స్థానాదిబలసంపూర్ణై చతుర్భిర్వా శుభాన్వితైః

ఈక్షన్నైవాత్రైకవింశ మహాదోషవివర్జితే

 రాశయస్సకలా శ్శ్రేష్ఠాశ్శుభగ్రహయుతేక్షితాః

 శుభానవాంశక గతా గ్రాహ్యా స్తే శుభరాశయః

నకదాచిత్కర్కటాంశ శ్శుభేక్షితయుతోఽపివా

తస్మాద్గోమిధునాంశాశ్చ తులాకన్యాంశకాశ్శుభాః

ఏవం విధే లగ్నగతే నవాంశే వ్రతమీరితమ్

 త్రిషదాయగతైః పాపై షడష్టాంత్య వివర్జితైః

 శుభై ష్షష్ఠాష్ట లగ్నాంత్య వర్జితేన హిమాంశుసా

 స్వోచ్చసంస్థోఽపి శీతాంశుః వ్రతినో యది లగ్నగః

 కరోతి శిశుం నిస్స్వం సర్వతః క్షయరోగిణమ్

 స్ఫూర్జితే కేంద్ర భానౌ వ్రతినాం పితృనాశనమ్

 పంచదోషోనితం లగ్నం శుభదం చోపనాయనే

 వినావసంతఋతునా కృష్ణపక్షే గలగ్ర హే

 అనధ్యాయే విష్టి షష్ఠ్యో ర్నతు సంస్కారమర్హతి

 త్రయోదశ్యాదిచత్వారి సప్తమ్యాది దినత్రయమ్

 చతుర్థి వా శుభాఃప్రోక్తా అష్టావేతే గలగ్రహాః

            గ్రహయోగమువలన గ్రహవీక్షణమువలన రాశిగ్రహోద్భవమును ధరించును. అట్లే ఫలమును ధరించును. గ్రహయోగము, గ్రహవీక్షణములేని రాశి తన స్వభావమును అనుసరించును. రాశి ఆదిలో సంపూర్ణఫలమునిచ్చును. మధ్యలో మధ్యమ ఫలమునిచ్చును. లగ్నాంత్యమున తుచ్ఛఫలము నిచ్చును. అన్నిలగ్నములలో ఇదేవిధమగు ఫలముండును. అన్ని విషయములలోను మొదట లగ్నము, తరువాత కర్తకు చంద్రబలమును చూడవలయును. సప్తమస్థానమున బలయుతులగు గ్రహములుండవలయును. చంద్రబలము ఆధారము,ఇతరగ్రహముల బలము ఆధేయము. ఆధారముచే ఆధేయము ధరించబడును. చంద్రుడు శుభప్రదుడైనచో అన్ని గ్రహములు శుభఫలములనే ఇచ్చును. చంద్రుడు అశుభప్రదుడైనచో ఇతరగ్రహములుకూడా అశుభఫలమునే ఇచ్చును. ఒక్కధనాధిపుడు మాత్రమే చంద్రుని ఆధారము చేసుకొని ఫలములనొసంగుడు. లగ్నముయొక్క అంశలలోనున్న గ్రహములు లగ్నమునుండి వచ్చుఫలమును ధరించియుండును. ధనాతీతము ద్వితీయఫలము నొసంగును. ఇట్లు అన్నిస్థానములు శేషములైన పిదప ఒకటి లగ్నమును నిర్ణయించవలయును.

        కొద్ది దినములలో సర్వగుణయుతమగు లగ్నము లభించదు. తక్కువ దోషములు ఎక్కువ గుణములుకల లగ్నము శుభదాయకము. కాలము దోషమువలననే దుష్టమగును. ఆ దోషము చతుర్ముఖ బ్రహ్మ కూడా తొలగించజాలడు. అశౌచగుణములేక్కువగానున్ననూ దోషావహమే అగును. అశౌచగుణములను తెలి పెదను. ఆమరిక్తయగు అష్టమి, షషీ, ద్వాదశి ప్రతిపత్తు, పరిఘయొక్క పూర్వార్ధము, వ్యతీపాత్, వైధృతి, ఉభయ సంధ్యలు, ఉపప్లవము, విష్టి, ఋతువుయొక్క ప్రథముభాగము ఇవి యన్నియూ అశుభ ప్రదములు. ఈ దోషములుకల లగ్నము నిశ్చయించినచో అనిష్టము తప్పదు. ఆదివారము మొదలు శనివారము వరకు కల వారములలో వివాహము చేసినచో వరుసగా స్త్రీరోగముకలది, పతిప్రియ, దుఃఖముకలది, పుత్రవంతురాలు, భోగములుకలది, పతివ్రత, సుందరములగు కేశములు కలదియగును. భరణి, కృత్తిక, ఆర్ద్ర, పుబ్బ, విశాఖ జ్యేష్ఠ మొదలగు నక్షత్రములు, చైత్రము, కార్తీకము, జ్యేష్ఠము, పుష్యమాసములు హితకరములుకావు. భద్ర, సంక్రమణము, నిద్రా, రాత్రి, సూర్యచంద్రగ్రహణములు, అట్లే నింద్య నక్షత్రములలో నింద్యపారములలో వివాహము జరిపినచో కులటయగును. పాపభోగములందు అభిరుచి కలదియగును. ఈ దోషముల నివృత్తికి తిలలచే, నెయ్యిచే దూర్వలచే గాయత్రీమంత్రముతో 800లు హోమమును చేయవలయును. సర్వదోష నివృత్తికి, బంగారమును, గోవులను, తిలలను దానము చేయవలయును. మొదటి నాలుగునిశలు సమములైనను విడువవలయును. చంద్రుడు ఓజరాశి అంశగతుడై లగ్నమును పురుషగ్రహములు చూచుచున్నపుడు, ఉపవీతి అయి, సరితిథిలో నగ్నుడు కాకుండా స్త్రీని కామించవలయును. పుత్రులను కోరు పురుషుడు రేవతి, మూల, ఆశ్లేష మఘా నక్షత్రములను వదిలి స్త్రీ సంగమమును చేయవలయును. గర్భము తెలిసిన తరువాత రెండవనేలలో కానీ మూడవనేలలోకాని సీమంతమువలె పుంసవనమును చేయవలయును. నాలుగవ, ఆరవ, ఎనిమిదవ మాసమునకాని మాసాధిపతి బలయుతుడుగా నున్నపుడు, దంపతులకు తారాచంద్రబలమున్నపుడు శూన్యముకొని పర్వదివసమున, మంగళ, గురు, ఆదిత్య వారములలో తీక్షగ్రహములతో కలిసి యున్న సూర్యుని వదిలి చంద్రుడు పురుష నక్షత్రాంశలో ఉన్నపుడు, జన్మలగ్నమునుండి అష్టమ శుద్ధి యున్నపుడు ఇద్దరికి నైధనలగ్నము కానపుడు శుభగ్రహములు లగ్నమున నున్నపుడుకాని, శుభగ్రహముల వీక్షణమున్నపుడుకాని, పాపగ్రహములుకాని, పాపగ్రహదృష్టికాని లేనపుడు శుభగ్రహములు 3, 4 స్థానములలో కేంద్ర స్థానములలో ఉన్నపుడు 6, 1 స్థానములలో పాపగ్రహములున్నపుడు, చంద్రుడు 12, 7, 6 స్థానములలో లేనపుడు సీమంతముకొని, పుంసవనమునుకొని చేయవలయును. ఒక్క క్రూరగ్రహముకానీ 12వ స్థానమున, పుత్రస్థానమున, అష్టమస్థానమునకొని ఉన్నచో సీమంతినినికాని, ఆమె గర్భమునుకాని నశింపచేయును. పుత్రుడు కలిగిన తరువాత జన్మముహూర్తమునకాని, జాతాశౌచము తొలగిన తరువాతకాని శిశువునకు. జాతకర్మనాచరించవలయును. జాతకర్మ కుముందు పితృదేవతలను పూజించవలయును. జాతాశౌచము తొలగిన తరువాత ఆయాకులములకు తగినవిధముగా నామకరణమును చేయవలయును. నామము మొదట ప్రశస్తి చెందినదై యుండవలయును. శుభగ్రహ వీక్షణమున్నపుడు చేయవలయును. దేశకాల విఘ్నములు కలిగి కాలాతిక్రమణమైనచో శుక్రుడు గురువు అస్తగులు కొనపుడు, ఉత్తరాయణమున, చర స్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో, శుభ వాసరమున, తారాచంద్రబలమున్నపుడు, శుభలగ్నమున, శుభాంశమున సప్తమశుద్ధియున్నపుడు, నామకరణమును చేయవలయును. పురుషుడైనచో ఆరవనెలలోకాని, ఎనిమిదవ నెలలోకాని, స్త్రీ అయినచో అయిదవ నెలలో, ఏడవనెలలో కాని అన్నప్రాశనమును చేయవలయును. రిక్తతిథిని, దీనక్షయమును, నన్లను, ద్వాదశిని, అష్టమిని వదలి, ఇతర తిథులలో శుభవాసరమున అన్నప్రాశనమును చేయవలయును. చరస్థిర మృదు క్షిప్ర నక్షత్రములలో సప్తమ స్థానమున శుభగ్రహములున్నపుడు, దశమ శుద్దియుండగా శుభలగ్నమున, శుభాంశమున, పూర్వార్ధమును సౌమ్యగ్రహము చూచుచున్నపుడు లేదా సౌమ్య గ్రహమున్నపుడు, క్రూరగ్రహములు మూడు ఆరు లాభస్థానములలో, శుభగ్రహములు కేంద్ర ధీధర్మస్థానములలో ఉన్నపుడు, చంద్రుడు 12, 6, 7 స్థానములలో ఉండగా అన్నప్రాశనము శుభప్రదము. బాలునికి మూడవ సంవత్సరమునకాని, అయిదవ సంవత్సరమునకాని, తమతమ కులాచారముననుసరించి, గృహ్యసూత్ర ప్రకారముగా చౌలకర్మనాచరించవలయును. ఉత్తరాయణమున గురుశుక్రులు అస్తమించనపుడు, పర్వరిక్తతిథులు లేనపుడు, శుక్రగురు బుధ సోమవారములలో, అశ్విని, పునర్వసు, పుష్యమి, మృగశిర, జ్యేషా, రేవతి నక్షత్రములలో చేయవలయును. చౌలకర్మలో హస్తనుండి మూడు నక్షత్రములు, శ్రవణమునుండి మూడు నక్షత్రములు శుభప్రదములు. పట్టబంధనము, చౌలము, అన్నప్రాశనమున, ఉపనయనమున జన్మనక్షత్రము శుభప్రదము. ఇతర కర్మలకు అశుభప్రదము. అష్టమశుద్ధి యుండవలయును. శుభలగ్నమున, శుభాంశమున, జన్మ లగ్నము నుండి అష్టమస్థానమున చంద్రుడు లేనపుడు షష్ణ, అష్టమ, అంత్యస్థానములలో లేనపుడు, శుభగ్రహములు ధన, త్రికోణ, కేంద్ర స్థానములలోనుండగా, ఇతర గ్రహములు మూడు ఆరు స్థానములలోనుండగా, ఉభయసంధ్యలలో కాక, అభ్యంగనముచేయక, రాత్రికాక, భోజనమును చేయక, యుద్ధమున, ఉత్కటయోగమున, భూషణములు ధరించియుండగా, ప్రయాణము చేయుచుండగా తొమ్మిదవ దినమునకాక రాజులకు శౌరకర్మ చేయవలయును. అయిదవయేట అయిదవదినమున, శౌరయోగ్యమగు నక్షత్రమున లేదా శుభోదయమున కౌరకర్మ చేయవలయును. నృపాజ్ఞచే, బ్రాహ్మణాజ్ఞచే, యజ్ఞమున, మరణమున, బంధమోక్షణ సమయమున వివాహమున అనివారములలో, అన్నీ నక్షత్రములలో, అన్ని తిథులలో కౌరము చేసుకొనవచ్చును. శుభకార్యములలో మొదట శుభముకొరకు కురార్పణమును చేయవలయును. తొమ్మిదవ, ఏడవ, ఐదవ దినములలో తృతీయము బీజనక్షత్రముగా నున్నపుడు శుభవారమున, శుభోదయమున, వితాన ధ్వజతోరణములచే చక్కగా ఇంటిని అలంకరించి, ఆశీర్వాదమును, పుణ్యాంగనలచే పుణ్యకర్మను చేయించవలయును.

వాద్య నృత్యములచే ఈశాన్యదిశకు వెళ్ళి అచట తీర్ఘమైన ఉపకరణముచే మట్టిని తీసుకొని మరలవచ్చి, మృణ్మ యపాత్రలోకాని, వెదురు పాత్రలో కాని ఆ మట్టిని నింపవలయును. అనేక బీజములతో కలిసియున్న నీటిని పుష్పాదులచే అలంకరింపచేసి, చల్లవలయునను. గర్భాధానమునుండికాని, పుట్టుకనుండికాని అష్టమ వర్గమున బ్రాహ్మణులకు, రాజులకు పదకొండవ యేట, వైశ్యులకు పన్నెండవ యేట మౌంజీ బంధనమును (ఉపనయనమును) చేయవలయును. పుట్టుకనుండి అయిదవయేట, వేదశాస్త్ర విశారదుడగువాడు, ఉపవీతుడై, కాంతివంతుడై ఉపనయనమును చేయవలయును. బాలునికి శుక్రుడు  జీవుడు బలహీనుడైనను శుభప్రదులే. చెప్పబడిన సంవత్సరములోనే ఉపనయనమును చేయవలయును. చేప్పబడనపుడు చేయరాదు. గురువు, శుక్రుడు కనపడుచున్నపుడు, ఉత్తరాయణకాలమున చేయవలయును. వేదములకు గురువు, శుక్రుడు, కుజుడు, బుధుడు అధిపతులు. ఇతరులకు శరత్, గ్రీష్క వసంత ఋతువులలో చేయవచ్చును. బ్రాహ్మణులకు మాత్రము వ్యుతమముతో మాఘాదిపంచకమున చేయుట సాధారణనియమము. స్వకులాచారధర్మములను తెలిసినవాడు మాఘమునకాని ఫాల్గుణమాసమునకాని, విధులను తెలిసినవాడు, ధనవంతుడు చైత్రమాసమున, వేద వేదాంగ పారగుడు ధనవంతుడు వైశాఖ మాసమున, వేదశాస్త్ర విశారదుడు, ఉపనీతుడు, బలాడ్యుడు జ్యేష్ఠమాసమున, విధులను బాగుగా తెలిసినవాడు శుద్ధ ద్వితీయ, తృతీయ, పంచమి, త్రయోదశి, దశమి, సప్తమీ తిథులు శుభప్రదములు. ఉపనయనమునకు ఏకాదశి, షష్ఠి, ద్వాదశీ శుభప్రదములు. ఇతర తిథులు నిందితములు. హస్తనుండి మూడు నక్షత్రములు, రేవతి, పుష్యమి, ఆర్ద్ర, పునర్వసు, ఉత్తర, శ్రవణము నుండి మూడునక్షత్రములు, అశ్వని, అనూరాధ, మృగశిర, పుబ్బ నక్షత్రములు ఉపనయనమునకు శుభప్రదములు.

 జన్మనక్షత్రమునుండి పదియవనక్షత్రము కర్మ, పదునారవనక్షత్రము సంఘాతము, పదునెనిమిదవ నక్షత్రము సముదయము, ఇరువదిమూడవ నక్షత్రము వినాశనము, ఇరువదియైదవ నక్షత్రము మానసము. ఈ నక్షత్రములలో శుభకార్యములను చేయరాదు. గురు బుధ శుక్ర సోమ, ఆదివారములు ప్రశస్తములు. ఉపనయనమునకు మధ్యనున్న వారములు శ్రేష్ఠములు. ఇతరములు నిందితములు, దినమును మూడు భాగములుగా విభజించి, వాటిలో మొదటి భాగమున దైవకర్మను, రెండవ భాగమున మానవకర్మను, తృతీయ భాగమున పితృకర్మను చేయవలయును. స్వనీచస్థానమునకాని, నీచాంశలోకాని, తన శత్రురాశిలోకాని, ఆయంశలోకాని గురు కుజులు శాఖేశుడున్న చో వటువు కలా హీనుడు శీలవర్జితుడు అగును.. తనకు శత్రుగృహమునకాని, ఆయంశలో కాని 'గురుడు , శుక్రుడు శాఖేశులలో ఎవరున్ననూ ఉపనీతుడు మహాపాతకములను చేయువాడగును. స్వోచ్ఛస్థానమున నున్నపుడు, ఆయంశలోను, స్వరాశిలో, స్వరాశిగత గణములో గురుశుక్రలున్ననూ, కేంద్రత్రికోణములందు గురు శుక్రులున్ననూ మిక్కిలి ధనవంతుడు, వేద వేదాంగపారగుడు అగును. గురువు పరమోచ్చలో ఉన్నపుడు, శాఖేశుడున్ననూ, శుక్రుడున్ననూ, సప్తమ శుద్దియున్నచో ఉపనీతుడు వేదశాస్త్ర విశారదుడగును. గురువు, శుక్రుడు, శాఖేశుడు స్వోచ్ఛలోకాని, మిత్రగృహములోకాని, మిత్రునికి ఉచ్చస్థానమునకాని, ఉచ్చాంశలోకాని యున్నపుడు ఉపనయనము చేసినచో వటువు విద్యాధన సమన్వితుడగును. శాఖాధిపతివారము, శాఖాధిప బలము, శాఖాధిపతి లగ్నము ఈ మూడు ఉపనయనమున దుర్లభములు, కావున చంద్రుడు వేదాంశలో ఉన్నపుడు ఉపనయనమును చేసినచో విద్యావిశారదుడగును. చంద్రుడు పాపాంశలో కాని స్వాంశలో కాని యున్నచో దరిద్రుడు నిత్యదుఃఖితుడు అగును. శ్రవణాది నక్షత్రములలో, చంద్రుడు కర్కటకొంశలో ఉన్నపుడు, ఉపనయనమును చేసినచో వేదశాస్త్ర సమ్పది, ధనధాన్య సమృద్ధి గలవాడగును. శుభలగ్నమున, శుభాంశమున, సప్తమశుద్ధి కలిగియున్న లగ్నమునకాని, సప్తమస్థానమున సౌమ్యగ్రహములున్ననూ, సౌమ్యగ్రహవీక్షణమున్ననూ ఇష్టులగు గురుసూర్య చంద్రాదిగ్రహములు అయిదు బలయుతులై, స్థానాది బలపూర్ణులైనను, నలుగురు శుభగ్రహములు కలిసియున్ననూ, ఏకవింశ' మహాదోషములు లేకుండగానున్న చో, శుభ గ్రహములున్న రాశులుకాని శుభగ్రహములచే చూడబడిననూ శుభకరములు. నవాంశగతములు అయిన శుభరాశులను అన్నింటిని గ్రహించవచ్చును. కాని కర్కటకోంశము శుభగ్రహములతో కూడియున్ననూ, శుభగ్రహములచే చూడబడుచున్ననూ వర్షింపదగినదే. కావున గోమిధునాంశములు, తులాకన్యాంశములు శుభములు. ఇట్లు లగ్నమును సిద్దపరిచి నవాంశములను చూచి ఉపనయనమును ఆచరించవలయును. పాపగ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలోనుండి ఆరు ఎనిమిది పన్నెండు రాశులలో శుభగ్రహములు లేకుండగా, చంద్రుడు ఆరు, ఎనిమిది, లగ్న, పన్నెండు స్థానములలో లేకుండగా ఉండుట చాలా ముఖ్యము. చంద్రుడు తన ఉచ్చస్థానములో ఉన్ననూ ఉపనయనము చేయువాని లగ్నములో ఉన్నచో వటువును ధన హీనుని, క్షయరోగిని చేయును. సూర్యుడు కేంద్రస్థానమున యున్నచో వటువుకు పితృనాశము సంభవించును. ఉపనయనమునకు పంచదోషములులేని లగ్నము శుభప్రదము. వసంతఋతువులోతప్ప ఉపనయనము కృష్ణపక్షమునకూడా చేయవచ్చును. కాని అనధ్యయన దినములలో విష్టిలో షష్ణలో ఉపనయనమును చేయరాదు. త్రయోదశినుండి నాలుగు దినములు సప్త మినుండి మూడుదినములు, చతుర్థి ఈ తిథులుగల గ్రహమునకు శుభప్రదములని చెప్పబడినవి.

క్షురికా బంధనం వక్ష్యే నృపాణాం ప్రాక్కరగ్రహాత్

 వివాహోక్తేషు మాసేషు శుక్లపక్షేప్యనస్త గే

 జీవే శుక్రే చ భూపుత్రే చంద్రతారా బలాన్వితే

మౌంజీబంధోక్త తిథీషు కుజవర్జితవాసరే

న చేన్నవాంశకే కర్తురష్టమోదయవర్జితే

 శుద్ధేఽష్టమే విధౌ లగ్నే షష్టాష్టాంత్యవివర్జితే

ధనత్రికోణ కేంద్ర స్థే శ్శుభైస్త్య్రాయారి గైః పరైః

క్షురికాబంధనం కార్యం అర్చయిత్వామరానితన్

 అర్చయేతురికాం సమ్యక్ దేవతానాం చ సన్నిధౌ

తతస్సుల గ్నే బధ్నీయాత్ కట్యాం లక్షణసంయుతామ్

 ఆయామార్ధాస్రవిస్తార ప్రమాణేనైవ చ్ఛేదయేత్

 తచ్ఛేదఖండాన్యాయాస్స్యు ర్ధ్వజాయే రిపునాశనమ్

 ధూమ్రాయే మరణం సింహే జయశ్శుని చ రోగితా

 ధనలాభో వృషోఽత్యంతం దుఃఖీ భవతి గర్గభే

గజాయేఽత్యంత సంప్రీతి ర్ధ్వాంక్షే విత్తవినాశనమ్

 ఖడ్గపుత్రికయోర్మానం గణయేత్స్వాంగులేన తు

 మానాంగులేషు పర్యాయామేకాదశ మితాం త్యజే

 శేషాణామంగుళీనాం చ ఫలాని సుర్యథాక్రమమ్

 పుత్రలాభ శ్శత్రువధ స్త్రీలోభో గమనం శుభమ్

 ఆర్థహానిశ్చార్థవృద్ధికి ప్రీతి సిద్ధి జయస్తుతిః

 స్థితో ధ్వజే వృషాయే వా నష్టా చే త్పూర్వతో ప్రణమ్

 సింహే గజే మధ్యభాగే త్వంతభాగే శ్వకాకయోః

 ధూమ్రగర్దభయోర్నైవ వ్రణం శ్రేయోంత్య భాగగమ్

 అధోత్తరాయణే శుక్ర జీవయోర్దృశ్యమానయోః

ద్విజాతీనాం గురోర్గేహాన్నివృత్తానాం యతాత్మనామ్

చిత్రోత్తరాదితీజ్యాంత్య హరిమిత్ర విధాతృషు

భేష్వర్కేందు జ్ఞేజ్యశుక్ర వారలగ్నాంశ కేషు చ

ప్రతిపత్పర్వరిక్తా మా చాష్టమీ చ దీనత్రయమ్

 హిత్వా న్యదివ సే కార్యం సమావర్తన ముండనమ్

 సర్వాశ్రమాణాం విపేంద్ర హ్యుత్త మోఽయం గృహాశ్రమః

సుఖం తత్రాపి భామిన్యాం శీలవత్యాం స్థితం తతః

 తస్యాస్సచ్ఛీల లబ్ధస్తు సులగ్నవశతః ఖలు

 పితామహోక్తం సంవీక్ష్య లగ్నశుద్ధిం ప్రవచ్మ్యహమ్

 పుణ్యేహ్ని లక్షణో పేతం సుఖాసీనం స చేతసమ్

 ప్రణమ్య దేవవత్ప్రచ్ఛే దైవజ్ఞం భక్తిపూర్వకమ్

 తాంబూలఫలపుష్పాద్యే పూర్ణాంజలిరుపొగతః

తత్ర చేల్లగ్నగః క్రూర స్తస్మాత్సప్తమగః కుజః

దంపత్యోర్మరణం వాచ్యం వర్షాణామష్టకాత్పురా

 యది లగ్నగతశ్చంద్ర స్తస్మాత్సప్తమగః కుజః

 విజ్ఞేయం భర్తృమరణ మష్టవర్షాంతరే బుధైః

 లగ్నాత్పంచమగః పాపః శత్రుదృష్టశ్చ నీచగః

మృతపుత్రాధవా కన్యా కులటా వా న సంశయః

తృతీయా పంచసప్తా య కర్మగో వా నిశాకరః

 లగ్నాత్కరోతి సంబంధం దంపత్యోర్గురువీక్షితః

 తులాగో కర్కటాలగ్న సంస్థా శ్శుక్రేందుసంయుతాః

వీక్షితాః పృచ్చతాం నృణాం కన్యాలాభో భవేత్తదా

 స్త్రీ ద్రేష్కాణ స్త్రీ నవాంశే యుగ్మలగ్నం సమాగతమ్

 వీక్షితం చంద్రశుక్రాభ్యాం కన్యాలాభో భవేత్తదా

 ఏవం స్త్రీణాం భర్తృలబ్ధః పుంల గ్నే పుంనవాంశ కే

 పృచ్చకస్య భవేల్లగ్నం పుంగ్ర హైరవలోకితమ్

 కృష్ణపక్షే ప్రశ్నలగ్నా ద్యస్య రాశా శశీయదా

పాప దృష్టోధఽ వా రంధ్రే న సంబంధో భవేత్తదా

 పుణ్యైర్నిమిత్త శమనైః ప్రశ్నకాలే తు మంగలమ్

 దంపత్యోర శుభైరేతై రశుభం సర్వతో భవేత్

 పంచాంగశుద్ధిదివ సే చంద్రతారాబలాన్వితే

 వివాహభస్యోదయే వా కన్యావరణమన్వయైః

 భుషణైః పుష్పతాంబూల ఫలైర్గంధాక్షతాదిభిః

 శుక్ణాంబరైర్గీత వాద్యై విఘ్నాశీర్వచనై స్సహ

 కారయేత్కన్యకాగేహే వరఃప్రణవపూర్వకమ్

తదా కుర్యాత్పితా తస్యాః ప్రదానం ప్రీతిపూర్వకమ్

 కులశీలవయోరూపవిత్తవిద్యాయుతాయ చ

 వరాయ చ రూపవతీం కన్యాం దద్యాద్యవీయసీమ్

 సంపూజ్య ప్రార్థయిత్వా చ శచీం దేవీం గుణాశ్రయామ్

త్రైలోక్యసుందరీం దివ్వగంధమాల్యాంబరావృతామ్

సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్

 అనర్ఘమణిమాలాభిర్భాసయంతీం దిగంతరాన్

విలాసినీ సహస్రాద్యే సేవమానామహర్నిశమ్

 ఏవం విధాం కుమారీం తాం పూజాంతే ప్రార్ధయేదితి

దేవేంద్రాణీ నమస్తుభ్యం దేవేంద్రప్రియ భామిని

 వివా హే భాగ్యమారోగ్యం పుత్రలాభం చ దేహి మే

 యుగ్మేబ్దే జన్మత స్త్రీణాం ప్రీతిదం పాణిపీడనమ్

 ఏతత్పుంసామయుగ్మౌఽబ్దే వ్యత్యయే నాశనం తయోః

 మాఘఫాల్గునవైశాఖజ్యేష్ఠమాసా శ్శుభప్రదాః

మధ్యమౌ కార్తీకో మార్గశీర్షో వై నిందితాఃపరే

 న కదాచిద్వశర్క్షేషు భానోరార్ద్రా ప్రవేశనాత్

 వివాహో దేవతానాం చ ప్రతిష్ఠించోపనాయనమ్

 నాస్తం గతే సితే జీవే న తయోర్బాలవృద్ధయోః

న గుర్బా సింహరాశి స్థే సింహశకగత్యేఽ పి వా

పశ్చాత్ప్రాగుదితశ్శ్రు క్రో దశత్రిదివసం శిశుః

 వృద్ధః పంచదనం పక్షం గురుః పక్షం చ సర్వతః

అప్రవృధ్ధో హృషీకీశో యావత్తావన్న మంగలమ్

ఉత్సవే వాసుదేవస్య దివసే నాన్యమగలమ్

న జన్మమాసే జన్మర్క్షా న జన్మదివస్యేఽపి చ

 ఆద్యగర్భ సుతస్యాధ దుహితుర్వాం కరగ్రహః

నైవోద్వాహో జ్యేష్ఠపుత్రీ పుత్రయోశ్చ పరస్పరమ్

జ్యేష్ఠమాసే తయోరేక జ్యేష్థే శ్రేష్ఠశ్చ నాన్యధా

ఉత్పాతగ్రహణాదూర్ధ్వం సప్తాహమఖిల గ్రహే

నాభిలే త్రిదినం జ్యేష్ఠం త్రిద్యుస్పృక్ చ క్షయం తధా

 గ్రస్తాస్తే త్రిదినం పూర్వం పశ్చాద్గ్రస్తోదయేఽషెధవా

 సంధ్యాయాం త్రిదినం తద్వన్ని ధే సప్త ఏవ చ

 మాసాంతే పంశదీవసాం స్త్యజేద్రిక్తాం తథాష్టమీమ్

 వ్యతీపాతం వైధృతిం చ సంపూర్ణం పరిఘార్థకమ్

 పౌష్ణభత్య్రుత్తరామైత్రమరుశ్చంద్రార్కపిత్ర్యభైః

 సమూలభైరవిద్ధస్తై స్త్రీ కరగ్రహ ఇష్యతే

 వివాహే బలమావశ్యం దంపత్యోర్గురుసూర్యయోః

చేత్పూజా యత్నతః కార్యా దుర్భలగ్రహయోస్తయోః

 గోచరం వేధజం చాష్టా వర్గజం రూపజం బలమ్

యథోత్తరం బలాధిక్యం స్థూలంగో చర మార్గజమ్

 చంద్రతారాబలం వీక్ష్య తతఃపంచాంగజం బలమ్

 తిధిరేకగుణావారో ద్విగుణ  స్త్రీ గుణం చ భమ్

 యోగశ్చతుర్గుణః పంచగుణం తిధ్యర్థసంజ్ఞితమ్

 తతో ముహూర్తో బలవాన్ తతో లగ్నం బలాధికమ్

తతో బలవతీ హోరా ద్రేష్కాణో బలవాంస్తతః

తతో నవాంశో బలవాన్ ద్వాదశాంశో బలీ తత

 త్రింశాంశో బలవాంస్తస్మాద్వీ క్ష్యమేతలాబలమ్

 శుభేక్షితయుతాశ్శస్తా ఉద్వాహేఽఖిలరాశయః

 చంద్రార్కె జ్యాదయః పంచ యస్య రాశేస్తు ఖేచరాః

 ఇష్టాస్తచ్ఛుభదం లగ్నం చత్వారోఽపి బలాన్వితాః

రాజులకు పాణిగ్రహణమునకన్నా ముందు చేయవలసిన కురికొబంధనకర్మను గురించి ఇపుడు చెప్పెదను. వివాహమునకు చెప్పిన మాసములలో శుక్లపక్షమున, గురువు, శుక్రుడు, కుజుడు, అస్తగతుడు కానపుడు తారాచం ద్రబలమున్నపుడు, ఉపనయనమునకు చెప్పబడిన తిథులలో, మంగళవారముతప్ప ఇతరకొరములలో, కర్తకు నవాంశ గానపుడు, అష్టమోదయవర్జితమున, అష్టమ శుద్దియుండి, చంద్రుడు లగ్నముననుండి, ఆరు, ఏనిమిది, పన్నెండుస్థానములలో గ్రహములులేనపుడు శుభగ్రహములు, ధన, త్రికోణ, కేంద్రస్థానములలోనుండి, ఇతర గ్రహములు మూడు, ఆరు, పదకొండు స్థానములలోనుండగా దేవతలను పితృ దేవతలను పూజించి కురికాబంధనమును చేయవలయును. దేవతల సమీపమున కురికను చక్కగా పూజించవలయును. తరువాత లక్షణములుగల కురికను నడుమునకు కట్టవలయును. ఆయా మార్గావిస్తారప్రమాణముతో ఛేదించవలయును. ఆఛేదఖండములే ఆయములుగాను, ఆ విస్తారము ధ్వజపరిమాణమున్న చో శత్రునాశము, ధూమపరిమాణమున్నచో మరణము, సింహపరిమాణమున్నచో జయము, కుక్క పరిమాణమున్నచో రోగము, వృష పరిమాణమున్నచో ధనలాభము, గర్గభ పరిమాణమున్నచో దుఃఖము, గజ పరీమాణమున్నచో మిక్కిలి పీతి, ధ్వాంక పరిమాణమున్నచో ధననోశము కలుగును. ఖడ్డిని పుత్రికను తన అంగుళములచే కొలువవలయును. ఎటు కొలచినదానిలో ఏకాదశ పరిమితిని వదలవలయును. మిగిలిన అంగుళిలకు వరుసగా ఇట్లు ఫలముండును. పుత్రలాభము, శత్రువధ, స్త్రీలాభము, గమనము, శుభము, అర్థహాని, ఆర్ధవృద్ధి, ప్రీతి, సిద్ధ, జయము, స్తుతి ఇవి ఫలములు. ధ్వజపరిమాణమో, ఉండి నష్టమైనచో మొదటిదానివలన ప్రణముకలుగును. మధ్యభాగము సింహపరిమాణమో గజపరిమాణమో ఉండి, అంత్యభాగము శ్వానకొక పరిమాణమున్ననూ, చివరభాగము ధూమ్ర గర్దభాగమునమువలన ప్రణముండుట శ్రేయోదాయకముకాదు. గురువుగారి ఇంటినుండు స్వగృహమునకువచ్చిన జితేంద్రియులగు బ్రాహ్మణులకు చిత్ర, ఉత్తర, పునర్వసు, పుష్యమి, రేవతి, శ్రవణము, అనూరాధ, రోహిణీనక్షత్రములందు, సూర్యచంద్ర బుధ గురు, శుక్ర వారములందు, లగ్నాంశములందు, ప్రతిపత్తు, పర్వదినమును, రిక్తదనమును, అమావాస్యను, అష్టమానుండి దీనత్రయమును విడిచి, ఇతరదినములలో సమావర్తనమును, ముండనమును చేయవలయును. అన్ని యాశ్రములలో గృహస్థాశ్రమము ఉత్తమోత్తమము. . ఈ గృహస్థాశ్రమమున శీలవతియగు స్త్రీయందు సుఖమును పొందగలడు. శీలవతియగు  భార్య సులగ్నవశముననే లభించునుకదా. చతుర్ముఖ బ్రహ్మ చెప్పిన దానిని చక్కగా ఆలోచించి సులగ్నమును చెప్పెదను. ఒక శుభదినమున సర్వలక్షణసంపన్నుడు సుఖాసీనుడు, జ్ఞానముకలవాడు అగు దైవజ్ఞుని భక్తితో దేవునీవలే నమస్కరించి అడుగవలయును. తొంబూలఫలపుష్పాదులను దోసిటపట్టుకొని వెళ్ళవలయును. లగ్నమున క్రూరగ్రహమున్నను, సప్తమ స్థానమున కుజుడున్ననూ 8 సంవత్సరములలో పుణ్యదంపతుల మరణము సంభవించును. లగ్నమున చంద్రుడుండి, సప్తమ స్థానమున కుజుడున్నచో భర్త మరణము ఎనిమిది సంవత్సరములలో సంభవించును. లగ్నము నుండి అయిదవ స్థానమున పాపగ్రహముండి, శత్రువుచే చూడబడి నీచగతుడైనచో వధువునకు పుత్రులు మరణింతురు. లేదా వధువు కులటయగును. 3, 5, 7, 11 కర్మస్థానములలో చంద్రుడుండి గురువుచే చూడబడినచో దంపతులకు సంబంధమును కలిగించును. తులా కర్కటకలగ్నములలో శుక్రచంద్రులతో కలిసియున్ననూ చూడబడుచున్ననూ అడుగువారికి కన్యలభించును. స్త్రీలగ్నమున, దేష్కాణలగ్నమున స్త్రీఆంశమున, నవాంశమున సరి లగ్నమువచ్చి చంద్ర, శుక్రులచే చూడబడినచో అడుగువారికి కన్యలభించును. ఇట్ల స్త్రీకి పుంలగ్నమున, పుంనవాంశమున పృచ్చకుని లగ్నము పుంగ్రహములచే చూడబడినపుడు భర్త లభించును. కృష్ణపక్షమున ప్రశ్నలగ్నమునుండి రాశిలో చంద్రుడుండి పొపగ్రహములచే చూడబడిననూ, రంధ్రమున నున్ననూ సంబంధము కుదురదు. ప్రశ్నకొలమున శుభనిమిత్తములు, శుభశకునములు కలిగినచో దంపతులకు శుభము కలుగును. అశుభనిమిత్తములు అశుభశకునములు కలిగినచో అశుభము జరుగును. పంచాంగములచే శుద్ధిపొందిన దినమున చంద్రబలము తారాబలము ఉన్నపుడు, వివాహానక్షత్రోదయ కొలమునకాని కులస్థులచే కన్యావరణమును చేయవలయును. ఆభరణములచే పుషతాంబూల ఫలగంద్రాక్షతాదులచే, శుక్లాంబరములచే, గీతవాద్యములచే, విఘ్ననివృత్తినిచేయు ఆశీర్వచనములతో, కన్యాగృహమున వరుడు ప్రణవపూర్వకముగా కన్యావరణమును చేయవలయును. అపుడు కన్యతండ్రి ప్రీతిపూర్వకముగా కన్యాదానమును చేయవలయును. కుల శీల వయో రూప ధన విద్యాదులుకల వరునికి రూపవతియగు వరునికంటే చిన్నదగు కన్యను దానము చేయవలయును. గుణాశ్రయురాలు, త్రైలోక్యసుందరి, దివ్యగంధమాల్యాంబరవతి, సర్వలక్షణ సంయుక్త, సర్వాభరణ భూషిత, వెలకట్టలేని మణిహారములచే దిగంతములను శోభింపచేయుచున్న, వేలకొలది విలాసినులచే రాత్రింబవళ్ళు సేవించబడుచున్న కుమారియగు శశీ దేవిని చక్కగాపూజించి, పూజ ముగియగానే ఇట్లు ప్రార్థించవలయును. ఓ దేవేంద్రోణీ ! దేవేంద్ర ప్రియభాలనీ ! నీకు నమస్కారము. వివాహమున నాకు భాగ్యమును, ఆరోగ్యమును, పుత్రలాభమును ప్రసాదింపుము.. స్త్రీలకు సరియేడులో పాణిగ్రహణము శుభప్రదము. అట్లే పురుషులకు బేసి ఏడులో శుభప్రదము. ఒకవేళ వీపరీతముగా జరిగినచో అనగా స్త్రీకి బేసి ఏడులో, పురుషునికి సరియేడులో వివాహమును జరిపినచో అశుభప్రదము. వివాహమునకు మాఘ, ఫాల్గున, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసములు శుభప్రదములు. కార్తీక మార్గశీర్ష మాసములు మధ్యమములు. ఇతర మాసములు నిందితములు. వశన నక్షత్రములలో సూర్యుడు ఆర్గా నక్షత్రమున ప్రవేశించిన తరువాత వివాహము, దేవతాప్రతిష్ణ, ఉపనయనము చేయరాదు. శుక్రుడు గురువు అస్తగతులైనపుడు, బొలులుగా ఉన్నపుడు, వృద్దులుగా ఉన్నపుడు, గురువు సింహరాశిలో ఉన్నపుడు, సింహాంశగతుడైనపుడుకూడా విఫోహాదులను చేయరాదు. పశ్చాదుదితుడు, ప్రాగుదితుడు అగు శుక్రుడు ముప్పదిరోజులు శిశువుగానుండును. ఇరువది ' రోజులు వృద్దుడుగా నుండును. గురువు పది హేనురోజులు బాలుడుగా, పది హేను రోజులు, వృద్ధుడుగా నుండును. శ్రీమన్నారాయణుని ఉత్సవము జరుగువరకు శుభకార్యములను చేయరాదు. వాసుదేవుని ఉత్సవ సమయమున ఇతర శుభములకొరకు చూడవలసిన అవసరమేలేదు. పుట్టిన మాసమున, జన్మ నక్షత్రమున మొదటి పుత్రునకుకాని, పుత్రికకుకాని వివాహమును చేయరాదు. పెద్దకొడుకు, పెద్దకూతురుకు పరస్పరము జ్యేష్ఠమాసములో వివాహము జరుపరాదు. అనగా వధూవరులు ఇద్దరూ జ్యేషులుగా ఉండరాదని భావము. ఇద్దరిలో ఒకరు మాత్రమే జ్యేషులైనచో మంచిదే. ఇద్దరైన శుభప్రదముకాదు. ఉత్పాతములేర్పడిన తరువాత, గ్రహణము ఏర్పడిన తరువాత ఏడురోజులు వివాహమును జరుపరాదు. మూడుదినములు అత్యంతము అశుభప్రదములు. త్రిద్యుస్పృక్, కయదినము, గ్రహము గ్రస్తమైనపుడు, అస్తగుడైనపుడు ముందు మూడుదినములు ఉదయించిన తరువాత మూడు దినములు, గ్రహసంధిలో మూడుదినములు, నిశీధమున ఏడు దినములు, మాసమున చివరి అయిదుదినములు రిక్తతిథిని, అష్టమిని, వ్యతీపాతమును, వైధృతిని, సంపూర్ణముగా పరిఘార్థమును విడువవలయును. రేవతి, ఉత్తర, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, అనూరాధ, స్వాతి, మృగశిర, హస్త, మఘ, మూల నక్షత్రములలో విద్దలేనపుడు పాణిగ్రహణమును చేయవలయును. వివాహమున దంపతులకు గురు సూర్యబలము ఆవశ్యకము. గురుసూర్యులు బలహీనులైనచో ప్రయత్నముచే పూజ జరుపవలయును. గోచరము, వేధజము, అష్టవర్గజము, రూపజము అని ఈ బలములు ఉత్తరోత్తరము బలాధిక్యము కలవి. గోచర మార్గమువలన కలుగు బలము స్తూలబలము. మొదట చంద్రబలమును తారాబలమునుచూచి, తరువాత పంచాంగబలమును చూడవలయును. తిథి ఒక గుమము, వారము రెండు గుణములు, నక్షత్రము మూడు రెట్లు, యోగము నాలుగు రెట్లు తిథ్యర్థము  అయిదురెట్లు బలము. తరువాత ముహూర్తము బలీయము తరువాత లగ్నము బలాధికము. తరువాత హోర, దేష్కాణము, నవాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము, ఇట్లు ఉత్తరోత్తర బలీయములు. కావున వీటిని చక్కగా చూడవలయును. శుభగ్రహములున్న, లేక వీక్షణమున్న అన్ని రాశులు శుభప్రదములే. చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, మొదలగు అయిదు గ్రహములు ఏరాశికి శుభులుగా నుందురో అది శుభప్రదమగు లగ్నము. నలుగురు బలీయులున్ననూ శుభప్రదమే.

జామిత్ర శుద్ధ్యేక వింశన్మహాదోషవివర్జితమ్

ఏకవింశతి దోషాణాం నామరూపఫలాని చ

 వక్ష్యంతేఽత్ర సమాసేన శృణు నారద సాంప్రతమ్

 పంచాంగశుద్ధిరాహిత్యం దోషస్త్వాద్యః ప్రకీర్తితః

 ఉదయాస్త శుద్ధి ర్వానిర్ద్వితీయస్సూర్య సంక్రమః

 తృతీయః పాపషడ్వర్గో భృగు షష్ఠః కుజోఽష్టమః

 గండాంతం కర్తరీ రిషలు షడ ష్టేందుగతో గ్రహాః

 దంపత్యోరష్టమం లగ్నం రాశిర్వీషఘటీ తథా

 దుర్ముహూర్తో వారదోషః ఖర్జూరికసమాంఘ్రి భమ్

గ్రహణోత్పాతభం క్రూర విద్ద్వరం క్రూరసంయుతమ్

 కునవాంశో మహాపాతో వైధృతిశ్చెకవింశతిః

 తిథివారర్క్ష యోగానాం కరణస్య చ మేలనమ్

పంచాంగమస్య శుద్ధిస్తు పంచాంగశుద్ధిరీరితా

 యస్మిన్పంచాంగ దోషోఽస్తి తస్మింల్లగ్నే నిరర్థకమ్

త్యజేత్పంచైష్టికంచాపి విషసంయుక్త దుగ్ధవత్

లగ్నలగ్నాంశకౌ స్వస్వ పతినా వీక్షితా యుతౌ

న చే ద్వొన్యోన్యపతినా శుభమిత్రేణ వా తతొతా

 వరస్య మృత్యు స్స్యౌ త్తాభ్యాం సప్తసపోదయాంశ

 ఏవం తొ నయుతౌ దృష్టౌ మృత్యుర్వధ్వా కరగ్రహే

త్యాజ్యా స్సూర్యస్య సంక్రాంతేః పూర్వతః పరత స్తథా

వివాహాదిషు కార్యేషు నాడ్యష్షోడశ షోడశ

 షడ్వర్గశ్శుభద శ్శ్రేష్ఠో వివాహస్థాపనాదిషు

భృగుషష్ఠాహ్వయో దోషో లగ్నాత్షష్ఠ గతే సితే

 ఉచ్చగే శుభసంయుక్తీ తల్లగ్నం పర్వదా త్యజేత్

 కుజోష్టమో మహాదోషో లగ్నాదష్టమ గే కుజే

 శుభత్రయయుతం లగ్నం న త్యజేత్తుంగగోయది

 పూర్ణానందోఖ్యయో స్త్రీధ్యో స్సందిర్నాడీద్వయం యది

 గండాంతం మృత్యుదం జన్మ యాత్రోద్వాహవ్రతాదిషు

  కులీరసింహయోః కీటచొపయో ర్మీనమేషయోః

 గండాంతమంతరాలం స్యాద్ఘటికౌర్ధం మృతిప్రదమ్

 సార్పేంద్రపౌష్ణభేష్వంత్య షోడశేశా భ సంధయః

తదగ్రిమే ష్వాద్యపొదా భానాం గండాంతసంజ్ఞికాః

 ఉగ్రం చ సంధిత్రితయం గండాంతం త్రివిధం మహత్

 లగ్నాభిముఖయోః పాపగ్రహయో రృజు వక్రయోః

సా కర్తరీతి విజ్ఞేయా దంపత్యోర్గలకర్తరీ

 కర్తరీయోగదుష్టం యల్లగ్నం తత్పరివర్జయేత్

 అపి సౌమ్య గ్రహైర్యుక్తం గుణైస్సర్వైప్సమన్వితమ్

 షడష్టరిష్భగే చంద్ర లగ్నదోషస్స్వపంజ్ఞకః

 లగ్నగం వర్జయేద్యత్నాజ్జీవశుక్రపమన్వితమ్

ఉచ్చగే నీచగే వాపి మిత్రభే శత్రురాశి గే

 అపి సర్వగుణో పేతం దంపత్యోరిధనప్రదమ్

శశాంకే గ్రహసంయుక్తే దోషస్సంగ్రహ సంజ్ఞకః

తస్మిన్సంగ్రహదోషే తు వివాహం నైవ కారయేత్

 సూర్యేణ సంయుతే చంద్రే దారిద్య్రం భవతి స్ఫుటమ్

 కుజేన మరణం వ్యాధిస్సౌమ్యేన తనపత్యతా

 దౌర్భాగ్యం గురుణా యుక్తే సాపత్యం భార్గవేణ తు

ప్రవ్రజ్యా సూర్యపుత్రేణ రాహుణా మూలసంక్షయః

 కేతునా సంయుతే చంద్రే నిత్యం కష్టం దరిద్రతా

 పొపగ్రహయుతే చంద్రే దంపత్యోర్మరణం భవేత్

 శుభగ్రహయుతే చంద్రే స్వోచ్ఛ స్థే మిత్రరాశిగే

దోషాయనం భవేల్లగ్నం దంపత్యోశ్శ్రేయ సే సద

స్వోచ్చగో వా స్వరగో నా మిత్రక్షేత్ర గతోఽపి వా

 పాపగ్రహయుత శ్చన్దః కరోతి మరణం తయోః

దంపత్యోరష్టమం లగ్నం ఆష్టమో రాశిరేవ చ

 యది లగ్నగత స్సోఽ పి దంపత్యోర్మరణప్రదః

సరాశిశ్శుభసంయుక్తో లగ్నం వా శుభసంయుతమ్

 లగ్నం వివర్జయేద్యత్నాత్ తదంశాంశ తదీశ్వరామ్

 దంపత్యోద్ద్వాదశం లగ్నం రాశార్వా యది లగ్నగః

 అర్థహానిస్తయోరస్మాత్తదంశస్వామినం త్యజేత్

 జన్మరాశ్యుదయశ్చైవ జన్మలగ్నోదయ శ్శుభః

 తయోరుపచయస్థానం లగ్నేఽత్యంత శుభప్రదమ్

 ఖమార్గణా వేదపక్షా ఖరామా వేదమార్గణాః

 వహ్నిచంద్రారూపదస్రాః ఖ రామా వ్యోమబాహవః

 ద్విరామా స్స్వాగ్నయ శ్శూన్య దస్రాః కుంజర భూమయః

 రూపపక్షావ్యోమదస్రా వేదచంద్రాశ్చతుర్దశ

 శూన్య చంద్రా వేద చంద్రా షడృక్షా వేదబాహవః

 శూన్యదస్రా శూన్య చంద్రా పూర్ణచంద్రా గతేందవః

తర్క చంద్రా వేద పక్షాః ఖరామాశ్చాస్వి భాత్క్రమాత్

ఆభ్యః పరాస్తు ఘటికా శ్చతసో విషపంజ్జితాః

 వివాహాదిషు కార్యేషు విషనాడీం వివర్జయేత్

 భాస్కరాదిషు వారేషు యే ముహూర్తాశ్చ నిందితాః

 వివాహాదిషు తే వర్జ్యా అపి లక్షగుణైర్యుతాః

 నిహితా వారదోషా యే సూర్యవారాదిషు క్రమాత్

అపి సర్వగుణోపేతా స్తే వర్జ్యా స్సర్వమంగలే

సప్తమ శుద్ది యుండవలయును. ఏకవింశతి మహాదోషములు లేకుండవలయును. ఓ నారదా ! ఏకవింశతి మహాదోషముల నామములను, రూపములను, ఫలములను సంగ్రహముగా చెప్పెదను వినుము. పంచాంగ శుద్ధిలేకపోవుట మొదటి దోషము. ఉదయాస్త శుద్ధిహాని రెండవ దోషము. సూర్యసంక్రమణము మూడవ దోషము. పాప షడ్వర్గము, షష్ణ భృగువు, అష్టమ కుజుడు, గండాంతము, కర్తరీ, రిషము. షష్ణ అష్టమ స్థానగత చంద్రుడు, దంపతులకు అష్టమ లగ్నము, విషఘటీ, దుర్ముహూర్తము, వార దోషము, ఖార్టూరికము సమాంఘిభం, గ్రహణము, ఉత్పాతము, క్రూర గ్రహవేధగల నక్షత్రము, క్రూర గ్రహ సంయుతము, కునవాంశ, మహాపాతము, వైధృతి అనునవి ఇరువది యొకటి మహాదోషములు. తిథివారనక్షత్రయోగకరణములను పంచాంగములందురు. ఈ అయిదింటి శుద్ధి పంచాంగ శుద్ధి యనబడును. పంచాంగ

దోషములున్న లగ్నము నిరర్ధకము. విషము కలిసిన పాలను వదిలినట్లు పంచైష్టిక లగ్నమును కూడా వదలవలయును. లగ్నము కాని లగ్నాంశముకాని ఆయా ఆధిపతులచే చూడబడిననూ, కూడియున్ననూ, పరస్పరాధిపతులతో చూడబడిననూ, కూడియున్ననూ, శుభగ్రహముచే కొని, మిత్రగ్రహముచే కాని చూడబడిననూ, కూడియున్ననూ వరునికి మృతి సంభవించును. ఇట్లే ఆయా ఆధిపతులచే సప్తమ స్థానము కాని, సప్తమాంశలుకొని, ఉదయాంశలు కాని చూడబడిననూ కూడియున్ననూ, వారిద్దరూ కలిసి లేకున్ననూ చూపులేకున్ననూ వధువునకు మరణము సంభవించును. వివాహాది శుభకార్యములలో సూర్యసంక్రమణమునకు మొదటి పదునారు నోడికలను, తరువాతి పదునారు నాడికలను విడువవలయును. వివాహ, స్థాపనాది శుభకార్యములలో షడ్వర్గము శుభప్రదము శ్రేష్ఠము. లగ్నము నుండి ఆరవస్థానమున శుక్రుడున్నచో భృగు షష్ణ దోషమని పేరు. శుక్రుడు ఆరవ స్థానమున నుండి ఉచ్చగతుడైనను, శుభగ్రహములచే కలిసియున్ననూ ఆ లగ్నమును వదిలి పెట్టవలయును. లగ్నము నుండి అష్టమస్థానమున నున్న కుజుడున్నచో కుజాపలుమమందురు. ఇది మహాదోషము. అష్టమస్థానముననున్న కుజుడు ఉచ్చగతుడై మూడు శుభగ్రహములచే కూడియున్నచో ఆ లగ్నమును విడువవలసిన పనిలేదు. పూర్ల, నందయను తిథుల సంధి నాడీద్వయమున్నచో యాత్ర, వివాహ, ఉపనయనాదులకు గండాంత దోషమనబడును. ఈ దోషము మృత్యుప్రదము. కర్కాటక సింహములకు, తులా ధనువులకు, మీన మేషములకు ఘటి కార్థము అంతరాలకాలము గండాంత మనబడును. ఇది కూడా మృతి ప్రదమే. ఆశ్లేషా జ్యేషా, రేవతులలో షోడశాంశాధిపతులు, నక్షత్ర సంధులు, ఆ నక్షత్రములకు మొదటి నక్షత్రముల మొదటి పొదములు కూడా గండాంతములనబడును. మూడు సంధులు చాలా ఉగ్రములు. ఈ మూడు గండాంతములనబడును. ఇవి మూడు విధములుగానుండును. పాప గ్రహములు లగ్నాభిముఖములైనను, ఋజుగతులు కలవైననూ, వక్రగతులు కలవైననూ కర్తరి యందురు. ఈ కర్తరి దంపతుల కంఠమును ఖండించును. కర్తరీయోగదుష్టమగు లగ్నమును విడిచి పెట్టవలయును. సౌమ్యగ్రహములచే కూడియున్ననూ, సర్వగుణస్టమన్వితమైననూ షష, అష్టమ, రిషస్థానములలో చంద్రుడున్నచో దానిని లగ్నదోషమందురు. గురుడు కాని శుక్రుడు కాని యున్న లగ్నమును ప్రయత్నముచే వదలవలయును. ఉచ్చగతుడైననూ, నీచగతుడైననూ మిత్ర గ్రహము శత్రురాశిలో యున్నచో అన్నిగుణములు కలదైననూ ఆ లగ్నము దంపతులకు మరణ ప్రదము. చంద్రుడు ఇతర గ్రహములచే కలిసి యున్నచో సంగ్రహ దోషమందురు. ఈ సంగ్రహ దోషమున్న లగ్నమున వివాహమును చేయరాదు. చంద్రుడు సూర్యునితో కలిసి యున్నచో దారిద్ర్యము కలుగును. కుజునిచే కలిసి యున్నచో మరణము సంభవించును. బుధునితో కలిసి యున్నచో వ్యాధి కలుగును. గురువుచే కలిసి యున్నచో నిస్సంతానము, దౌర్బాగ్యము కలుగును. శుక్రునిచే కలిసియున్నచో సపత్నీ ప్రదము. అంగారకునిచే కలిసియున్నచో సన్యాసము, రాహువుచే కలిసి యున్నచో మూలనాశము, కేతువుతో చంద్రుడు కలిసియున్నచో నిత్య కష్టములు, దారిద్యము కలుగును. చంద్రుడు పాపగ్రహములతో కలిసియున్నచో దంపతులకు మరణము సంభవించును. శుభగ్రహములచే చంద్రుడు కలిసియుండి ఉచ్ఛరాశీలో కాని మిత్రరాశీలో కాని యున్నచో లగ్నము దోషాయనమైననూ దంపతులకు శ్రేయోదాయకమగును. చంద్రుడు స్వోచ్చగతుడైనను, తన నక్షత్రమున నున్ననూ, మిత్రగ్రహక్షేత్రములలో నున్ననూ పాపగ్రహములతో కూడియున్నచో దంపతులకు మరణమును కలిగించును. దంపతులకు అష్టమలగ్నము, అష్టమరాశి అయిననూ చంద్రుడు ఆ లగ్నమున నున్నచో దంపతులకు మృతిని కలిగించును. ఆ రాశి శుభగ్రహములు కలదైననూ, లగ్నము శుభగ్రహయుతమైనను ఆ లగ్నమును, లగ్నాంశమును, లగ్నాంశాధిపతి కలదానిని ప్రయత్నించి విడువవలయును. దంపతులకు ద్వాదశలగ్నమై, లగ్నతమైన రాశియైనచో దంపతులకు అర్థహాని కలుగును. కావున ఆ లగొంశాధిపతిని విడిచి పెట్టవలయును. జన్మరాశ్యుదయము, జన్మలగ్నోదయము శుభప్రదము. ఆ రెంటికి వృద్దిస్థానము మీక్కిలి శుభప్రదము. 1, 5, 3, 2, 1, 3, 3, 5, 3, 1, 7, 3, 1, 3, 1, 2, 2, 3, 3, శూన్యము, 3, 9, 1, 1, 2, 1, 3, 4, 1, ఇవి పదునాలుగు స్థానములు శూన్యము, 1, 4, 1, 6, 27, 4, 2, . శూన్యము, 3, శూన్యము, 1, పూర్ణచంద్రుడు, గతచంద్రుడు, తర్క చంద్రులు, వేదపక్షములు, ఖరామములు అని అశ్వని మొదలగు నక్షత్రముల కుండును. వీటి తరువాత నుండు నాలుగు ఘటికలు విషఘటికలనబడును. వివాహాది శుభకార్యములలో విషనాడులను విడువవలయును. ఆదివారము మొదలగు వారములలో నిందించబడిన ముహూర్తములను ఎన్ని గుణములు కలవైనను వివాహాదులలో వదలవలయును. భాస్కరాది వారములలో నుండు వారదోషములను కూడా సర్వగుణో పేతములైనను శుభకార్యములలో వదలవలయును.

ఏకార్గలాంఘ్రితుల్యం య త్తల్లగ్నం చ వివర్జయేత్

అపి శుక్రేజ్యసంయుక్తం విషసంయుక్తదుగ్థవత్

గ్రహణోత్పాతభం త్యాజ్యం మంగలేషు ఋతుత్రయమ్

 యావచ్చ శశినా భుక్త్వా ముక్తభం దగ్ధకాష్ఠవత్

 మంగలేషు త్యజేత్ఖేటైర్విద్ధం చ క్రూర సంయుతమ్

 అఖిలరర్క్ష పంచగవ్యం సురాబిందుయుతం  యథా

పాద ఏవ శుభైర్విద్ధమశుభం నైవ కృత్స్నభమ్

క్రూరవిద్ధం యుతం ధిష్ణ్యం నిఖిలం నైవ మంగలమ్

 తులామిధునకన్యాంశా ధనురంత్యార్థసంయుతాః

ఏతే నవాంశా శ్శుభదా వృషభస్యాంశకాః ఖలు

అంత్యాంశాస్తేఽపి శుభదా యది వర్గోత్తమాహ్వయాః

అన్యే నవాంశా న గ్రాహ్యా యతస్తే కునవాంశకాః

కునవాంశకలగ్నం యత్త్యాజ్యం సర్వగుణాన్వితమ్

 యస్మింది నే మహాపాత త్తద్దినం వర్జయేచ్ఛుభే

అపి సర్వగుణోపేతం దంపత్యోర్ముత్యుదం యతః

 అనుక్తా స్స్వల్ప దోషాస్స్యు ర్విద్యున్నీహార వృష్టయః

ప్రత్యర్కపరివేషేంద్ర చాపాంబుధర గర్జనాః

లత్తోపగ్రహపాతాఖ్యా మాస దగ్ద్వాహ్వయా తిథిః

 దగ్ధలగ్నాంధబధిర పంగుసంజ్ఞాశ్చ రాశయః

ఏవ మాద్యాస్తత స్తేషాం వ్యవస్థా క్రియతేఽధునా

 అకాలజా భవంత్యేతే విద్యున్నీహార వృష్టయః

దోషాయ మంగలే నూనమదోషాయైవ కాలతః

 బృహస్పతిః కేంద్రగతశ్శుక్రో వా యది వా బుధః

 ఏకోఽపి దోష నిచయం హరత్యేవ న సంశయః

తిర్యక్పంచోర్ధ్వగాః పంచరేఖా ద్వే ద్వే చ కోణయోః

ద్వితీయే శంభుకోణేఽగ్ని ధిష్ణ్యం చక్రే ప్రవిన్యసేత్

 భాన్యత్ర సాభిజిత్యేకరేఖా ఖేటేన విధ్ధభమ్

 పురథః పృష్టతోఽర్కాద్యా దినరం లత్తయంతి యత్

 అర్కావృతి గుణాద్యంగ బాణాష్టనవసంఖ్యభమ్

 సూర్యభాత్సార పిత్రాంత్య త్వాష్ట్రమిత్రోడువిష్ణుభమ్

సంఖ్యయా దినభేతావత్ అశ్విభాత్పాతదుష్టభమ్

 సౌరా పాల్వదేశే తు లత్తితం భం వివర్జయేత్

కలింగవంగదే శేషు పాతితం న శుభప్రదమ్

బాహ్లికే కురుదేశే చా న్యస్మిన్దే న దూషణమ్

 తిథయో సదర్థాశ్చ దగ్ధలగ్నాని యాన్యపి

 మధ్యదేశే వివర్జ్యాని న దుష్టానీత రేషు చ

 పంగ్వంధకొణలగ్నాని మాసశూన్యాశ్చ రాశయః

 గౌడమాలవయోస్త్యాజ్యా అన్యదేశే న గర్జితాః

 దోషదుష్టం సదా కాలం పన్నిమార్జుం న శక్యతే

అపి ధాతురతో గ్రాహ్యం దోషాల్పత్వం గుణాధికమ్

 ఏవం సులగ్నే దంపత్యోః కారయేత్సమ్యగీక్షణమ్

 హస్తోచితాం చతుర్థ సై శ్చతురస్రం సమంతతః

స్తంభైశ్చతుర్భిస్సుళ్ల కైర్వామభాగే తు సన్నతామ్

 సమండపాం చతుర్ధికు సోపానైరతిశోభితామ్

 ప్రాగుదక్రవణాం రంభా స్తంబైర్హంసశుకొదిఖిః

 విచిత్రితాం చిత్రకుంభై ర్వివిధైస్తోరణాంకురైః

 శృంగారపుష్పనిచయే ర్వర్ణకై స్సమలంకృతామ్

 విప్రాశీర్వచనై పుణ్యక్షీభిర్దివ్యైర్మనోరమామ్

 వారిత్రనృత్యగీతాద్యే ర్హృదయానందినీం శుభాం

ఏవం విధాం పమా హే న్మిధునం స్వాన్నీ వేదికామ్

 అష్టధా రాశి కూటం చ స్వాధూడు గణరాశయః

 రాశీ శయోనివర్ణిఖ్య ఋతవః పుత్రపౌత్రదాః

ఏకరాశౌ పృథగి ష్యే దంపత్యోః పాణిపీడనమ్

ఉత్తమం మధ్యమం భిన్నం రాశ్యేకత్వం యయోస్తయోః

స్త్రీ ధిష్ణా దాద్యనవ కే శ్రీదూరమతినిందితమ్

ద్వితీయే మధ్యమరి శ్రేష్ఠ తృతీయే నవకే నృభమ్

 తిస్రః పూర్వోత్తరా ధాతు యామ్యమా శతారకాః

ఇతి మర్త్యగణే ప్లేయ స్స్యాదమర్త్యగణః పరః

 హర్యాదిత్యారవాయ్వాంత్య మిత్రాశ్వీజ్యేందుతారకాః

 రక్షోగణః పితృత్వా ద్వీదైవాగీశ్రోతారకాః

 వసువారీశ మూలాహి తారకాభిర్యుతాస్త్రతాః

 దంపత్యోర్జన్మభేదైక గణే ప్రీతిరనేకదా

 మధ్యమాదేవమ్యం రాక్షసానాం త్వయోర్మృతిః

మృత్యుషష్టాష్టకే పంచ నవమే త్వన పత్యతా

 నైసవ్యద్విౄ్వదా శ్వేన్యేషు దంపత్యోః ప్రీతిరుత్తమా

 ఏకాధి పే మిత్రభావే శుభదం పాణి పీడనమ్

 ద్విఠాదశే త్రికోణే చ న కదాచిత్తడష్టకే

 అశ్వభమేషసర్పాహి హ్యోతు మేషోతుమూష

ఆఖగోమహిషవ్యా కొలీవ్యాఘమృగద్వయమ్

శ్వానః కపిర్బభ్రుయుగం సింహతురంగమాః

సింహగోదంతినోభానాం యోనయస్యుర్యథాశ్వభాత్

శ్వేణం బభ్రరగం మేష వానరో సింహవారణమ్

గోవ్యాఘమాఖు మార్జారం మహిషాశ్వంచ శాత్రవమ్

 జుషాలి కర్కటా విప్రా స్త దూర్ద్వాః క్షత్రియాదయః

పుంవర్ణరాశే సీరాశా సతిహీనే యథా శుభమ్

చతుస్రిద్యంఫ్రీ భోక్తాయాః కన్యాయాశ్చ్వాభాతమాత్

వహ్నిభోదిందుభిన్నాడీ త్రిచతుః పంచపర్వసు

 గణయేత్సంఖ్యయా చేకనోడ్యాం మృత్యుర్న పార్శ్వయోః

ప్రాజాపత్య బ్రాహ్మదైనా నివాహాశ్చార్ఘసంయుతాః

 ఉక్తకాలే తు కర్తవ్యా శ్చత్వారః ఫలదాయకొః

 గంధర్వాసుర పైశాచ రాక్షసాఖ్యాస్తు సర్వదా

 చతుర్థమభిజిల్లిగ్నముదయరాచ్చ సప్తమమ్

గోధూళికే తదుభయం వివా హే పుత్ర పౌత్రదమ్

 ప్రాచ్యా న చ కలింగానాం ముఖ్యం గోధూళికం స్మృతమ్

 అభిజీత్సర్వ దేశేషు ముఖ్యో దోష వినాశకృత్

మధ్యందినగతే భానౌ ముహూర్తోభిజిదాహ్వయః

నాశయత్యభిలాక్టోషానికీ త్రిపురం యథా

 పుత్రోద్వాహాత్పరం పుత్రీవివాహో న ఋతుత్రయే

న తయోర్వతముద్వాహాన్మంగలే నాన్యమంగలమ్

 వివాహ శ్చైకజన్యానాం షణ్మాసాభ్యంతరే యది

 అసంశయం త్రిభిర్వర్జె సతైకా విధవా భవేత్

 ప్రత్యుద్వాహో నైవకార్యో నైక స్మె దుహితృదయమ్

 న చైకజన్యయోః పుంసోరేవ జన్యేతు కన్య కే

 నైవం కదాచిదుద్వాహో నైకదా ముండన ద్వయమ్

 దివా జాతస్తు పితరం రాత్రైతు జననీం తథా

ఆత్మానం సంధ్యయోర్హస్తి ఫాస్త్రి గండే విపర్యయః

 సుతస్సుతో మౌ నియతం శ్వశురం హంతి మూలజః

తదంత్యపాదజో నైవ తథా శ్లేషాద్యపాదజః

 జ్యేషాంత్యపాదఔ జ్యేష్ఠం బాలో హస్తి న బాలికా

 న బాలికాంబు మూలరే మాతరం పితరం తధా

 సైంధీ దవాగ్రజం హంతి దేవరం తు ద్విదైవజా

ఆరభ్యోద్వాహాదివసాత్ షషే వా ప్యష్టమే దినే

 వధూప్రవేశ సంపత్యై దశమే పప్తమే దినే

 హాయనద్వితీయం జన్మ భలగ్న దివసానపి

 సంత్యజ్య హ్యతి శుక్రే2పి యాత్రా వైవాహికీ శుభా

 శ్రీప్రదం సర్వగీర్వాణస్థాపనం చోత్తరాయణే

గీర్వాణ పూర్వగీర్వాణ నత్రిణ్ఝశ్యమానయోః

విచిత్రే ష్వేవ మా సేషు మాఘాదిషుచ పంచసు

శుక్లపక్షేషు కృ షేషు తదాదిష్వష్టసు శుభమ్

దినేషు యస్య దేవస్య యాతిథి స్తత్ర తస్య చ

 ద్వితీయాది ద్వయే పంచమ్యా తప్తిసృషు క్రమాత్

దశమ్యాదేశ్చతసృషు పౌర్ణమాస్యాం విశేషతః

త్ర్యుత్తరాదితి చంద్రాంశ్య హస్తత్రయ గురూడుడు

సాశ్విధాతృజలాధీశ హరిమిత్రవసుష్వపి

కుజవర్జితవారేషు కర్తుసూర్యే బలప్రదే

 చంద్రతారా బలోపేతే పూర్వాహ్ణే శోభనే దినే

శుభల గ్నే శుభాం చ కర్తర్ననిధనోదయే

 రాశయస్సకలా శేషా శుభగ్రహయుతేక్షితాః

 పంచాష్టకౌ శుభేలగ్నే నైధనే శుద్ధిసంయుతే

 లగ్నస్థా శ్చన్హపూర్యార రాహు కేత్వర్కసూనవః

 కర్తుర్మృత్యుప్రదా శ్చాన్యే ధన్యధాన్యసుఖప్రదాః

ద్వితీయే నేష్టదాః పాపా సౌమ్యా శ్చన్తశ్చ విత్తదా

 తృతీయే నిఖిలాః భేటాః పుత్రపౌత్రసుఖప్రదాః

చతుర్థ సుఖదాసౌమ్యా క్రూరాః భేటాశ్చ దుఃఖదాః

గ్లానిదాః పంచమే క్రూరా సౌమ్యాః పుత్రసుఖప్రదాః

 షష్ఠ శుభాశ్శత్రుదాస్యుః పాపా శ్శత్రుక్షయం కరాః

 వ్యాధిదా స్సప్త మే పాపా సౌమ్యా శ్శుభఫలప్రదాః

 అష్టమస్థాః ఖగాస్సర్వే కర్తుర్మృత్యుప్రదాయకాః

ధర్మే పాపా ఘ్నంతి సౌమ్యా శ్శుభదా మంగలప్రదాః

కర్మగా దుఃఖదాః పాపా సౌమ్యాశ్చంద్రశ్చ కీర్తిదాః

 లాభస్థానగతాస్సర్వే భూరిలాభప్రదాగ్రహాః

 వ్యయస్థానగతాశ్శశ్వత్ బహువ్యయకరాగ్రహాః

హన్త్యర్థహీనాః కర్తారం మన్తహీనాస్తు ఋత్విజమ్

స్త్రియం లక్షణహీనాస్తు న ప్రతిష్ణా పమో రిపుః

గుణాధికతరే లగ్నే దోషస్స్వల్పతరో యది

ఏకార్గలాంఘ్రి తుల్యమగు లగ్నమును విడువవలయును. ఇట్టిలగ్నము శుక్రబృహస్పతులచే కూడియున్నదైనను విషము కలిసిన పాలను విడిచినట్లు విడువవలయును. గ్రహణ నక్షత్రమును, ఉత్పాత నక్షత్రమును, మూడు ఋతువులను శుభకార్యములలో విడువవలయును. శశిభుక్తి తరువాత మిగిలిన నక్షత్రమును కూడా కాలిన కట్టెను విడిచినట్లు విడువవలయును. శుభకార్యములందు గ్రహావిద్దమైన నక్షత్రమును క్రూరగ్రహముల నక్షత్రమును మధ్య బిందువు కలిసిన పంచగవ్యమును విడిచినట్టు విడువవలయును. శుభగ్రహవిద్దమైన నక్షత్రములో అశుభమైన నక్షత్రపాదమునే విడువవలయును కాని  పూర్తి నక్షత్రమును, విడువవలసిన అవసరము లేదు. క్రూరగ్రహములచే విద్ధమైనది, క్రూరగ్రహములు కల నక్షత్రము పూర్తిగా అశుభమే యగును. తులామిధున కన్యాంశలు, ధనూరాశిలోని అంత్యార్ధసంయుతములు ఈ నవాంశలు శుభప్రదములు. వృషభాంశలు వర్గోత్తమములైనచో అవి కూడా శుభప్రదములే. ఇతర నవాంశలు కునవాంశలు కావున గ్రహించరాదు. కునవాంశకలగ్నము సర్వగుణాన్వితమైనను వదలవలసినదే. మహాపాతము సంభవించిన దినమును శుభకార్యములకు విడువదగియున్నది. ఈ దినము సర్వగుణో పేతమైనను దంపతులకు మృత్యుప్రదము కావున విడువదగినది. ఇంకను కొన్ని చెప్పని చిన్న చిన్న దోషములుండును. లగ్నసమయమున మెరుపులు ఉరుములు, మంచు కురియుట, సూర్య పరివేషము, ఇంద్రచాపము, లతా, ఉపగ్రహపాతము, మాస దగ్గమను తిథి, దగ్డలగ్నము, అంధరాగి, బధిర రాశి, పంగురాశి మొదలగునవి కలవు. ఈ దోషముల విషయమున ఇపుడు నియమములను చెప్పెదను. అకాలమున మెరుపులు, ఉరుములు, మంచు కురియుట జరిగినచో శుభకార్యములను చేయరాదు. సకాలమున జరిగినచో దోషము లేదు. కేంద్రస్థానమున బృహస్పతి కాని, శుక్రుడుకొని, బుధుడు కొని యున్నచో సమస్త దోషములను నశింపచేయును. అడ్డముగా అయిదు రేఖలు, నిలువుగా అయిదు రేఖలు, కోణములో రెండు రెండు రేఖలు ద్వితీయమగు శంభుకోణమున కృత్తికా నక్షత్రమున చక్రమున నుంచవలయును. ఈ చక్రమున అభిజిత్తుతో కూడిన నక్షత్రముల నుంచవలయును. గ్రహవిధమైన నక్షత్రమును సూర్యాదులు ముందుకొని వెనుకకొని నిత్యనక్షత్రమును తాకినచో దానిని లత్తయందురు. అర్క ఆకృతి గుణాద్యంగబాణాష్ట్ర నవసంఖ్యలు గల నక్షత్రమును హస్తా నక్షత్రమునుండి ఆశ్లేష, మఘ, రేవతి, చిత్త, అనూరాధ, మృగశిర శ్రవణా నక్షత్రములు సంఖ్యచే నిత్యనక్షత్రమున అశ్వని నుండి పొత నక్షత్రము దుష్టనక్షత్రము ఇవి వదలదగినవి. సౌరాష్ట్ర సాల్వదేశములలో లత్తిత నక్షత్రమును విడువవలయును. కలింగవంగదేశములో పాతిత నక్షత్రము శుభప్రదము కాదు. బాహ్లిక మరుదేశాదులలో దోషము లేదు మానదగ్గములగు తిథులు, దగ్గలగ్నములు మధ్య దేశమున దుష్టములు ఇతర దేశములలో దోషప్రదములు కావు. పంగు, అంధ, బధిర కొణలగ్నములు, మాసశూన్యములగు రాశులు గౌడ మాలవ దేశములలో వదల దగినవి ఇతర దేశములలో దుష్టములు కావు. దోషదుష్టమగు కాలమును చతుర్ముఖబ్రహ్మ కూడా సరి చేజాలడు కావున స్వల్పదోషములు అధికగుణములు కల లగ్నమును చూడవలయును. కావున ఇట్లు వివాహమునకు శుభలగ్నమును చక్కగా పరిశీలించి నిర్ణయించవలయును. తరువాత హస్త మాత్రాన్నతముగా హస్త చతుష్టయ విస్తారముగా చతురస్రాకారముగా, నాలుగు చక్కని స్తంభములచే వామ భాగమున సన్నతరుగునట్లుగా మండపము కలదిగా, నాలుగు దిక్కులలో సోపానములు కలదిగా, తూర్పు ఉత్తర దిక్కులలో ప్రవణముగా, అరటి స్తంభములతో హంసశుకొదిచిత్ర ములలో చిత్రించబడి, చిత్రకుంభములు తోరణములు అంకురాదులు కలిగి, శృంగారపుష్పరాశులచే, పలువర్ణములతో అలంకరించబడి, బ్రాహ్మణాశీర్వచములు, ముత్తయిదువల ఆశీర్వచనములతో సుందరమైనది, విదిత్ర నృత్యగీతాదులచే హృదయమును ఆనందింపచేయు శుభప్రదమైన, అగ్నిహోత్రము కలిగియున్న కళ్యాణవేదికను వధూవరులు చేరవలయును. అష్టరాశి కూటములు, నక్షత్రగణములు, రాశులు, రాశీశులు, యోనులు, వర్ణములు, ఋతువులు పుత్రపౌత్రప్రదములు. ఒకేరాశియందు వేరు నక్షత్రములున్న వధూవరులకు పాణిగ్రహణము ఉత్తమము. భిన్నరాశులైనచో మధ్యమము ఒకేనక్షత్రము ఒకే రాశి అయినచో వారికి వివాహము చేయుట ప్రాణహానిని కలిగించును. స్త్రీ నక్షత్రము నుండి మొదటి నవకమున స్త్రీ దూరమైనచో, ఆతినిందితము రెండవ నవకమున మధ్యమము శ్రేష్ఠము. తృతీయ నవకమున నృతో శ్రేష్ఠము. పూర్వఫల్గుని, పూర్వాభాద్ర, ఉత్తరఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, భరణి, ఆర్థానక్షత్రములు మర్త్యగణములని తెలియవలయును. ఇతర నక్షత్రములు అమర్త్యగణములు. శ్రవణము, పునర్వసు, హస్త, స్వాతి, రేవతీ, అనూరాధ, అశ్వని, పుష్యమి, మృగశిరా లక్షత్రములు దేవగణములు మఘ, చిత్త, విశాఖ, కృత్తిక, జ్యేష్ఠా నక్షత్రములు, ధనిష్ఠ, శతభిష, మూల, ఆశ్లేష, నక్షత్రములు రాక్షసగణములు.

దంపతుల జన్మ నక్షత్రమొకటే గణములోనిది అయినచో బహుప్రీతి కలుగును. దేవమానవగణములైనచో మధ్యమము. దేవరాక్షసగణములైనచో దంపతులకు మృతి సంభవించును. దంపతులకు షష్టాష్టకములున్నచో మృత్యువు, పంచనవములైనచో సంతాన రాహిత్యము, రెండు పన్నెడు అయినచో దొరిద్ర్యము, ఇతరములైనచో పరస్పరము ప్రీతి కలుగును. ఇద్దరి రాశ్యధిపతులు ఒక్క గ్రహమే అయిననూ, మిత్రగ్రహమేనమా పొణిగ్రహణము శుభప్రదము. రెండు పన్నెండుగా ఉన్ననూ త్రికోణస్థానముననున్ననూ శుభమే. షష్టాష్టకము మాత్రము పనికి రాదు. అశ్వము, గజము, మేషము, సర్పము, సర్పము, మార్జాలము, మేషము, మార్జాలము, మూషకము, మూషకము, గోవు, మహిషము, వ్యాఘము, కొలి, వ్యాఘ్రము, మృగములు, శ్వానము, వానరము, బభ్రుయుగము, వానరము, సింహము, అశ్వము, సింహము, గోవు, గజము, ఇవి అశ్వని మొదలగు నక్షత్రములకు వరుసగా యోనులు. శ్వావహరిణములు, బభ్రువు గజము, మేషవానరములు, సింహగజములు, గోవ్యాఘ్రములు, మార్జార మూషకములు, మహిషాశ్వములు, శత్రువులు. మీనవృశ్చిక, కర్కటములు, బ్రాహ్మణజాతి. తరువాతవి క్షత్రియాదులు పురుషుని రాశికి శ్రీ రాశి తక్కువనచో శుభప్రదము. అశ్వినీ నక్షత్రము నుండి వరుసగా లెక్కించినపుడు కన్యా నక్షత్రము నాలుగు మూడు పాదద్వయములైనచో, కృత్తికనుండి, మృగశిర నుండి మూడు నాలుగు అయిదు పర్వలలో నాడీ గణనము చేయవలయును. అట్లు గణనచేసినచో ఏకనాడి అయినచో మృత్యుప్రదము. పార్శ్వనొడి అయినచో అశుభము కొదు. ప్రాజాపత్యము, బ్రాహ్మము, దైవము, అను వివాహములు ఋషిప్రోక్తములు. ఈ వివాహములను విధించబడిన కొలమున చేయవలయును. ఈ నాలుగు వివాహములు సత్పల దొయకములు. గంధర్వ, అసుర, పైశాచ, రక్షస వివాహములను ఏసమయమునందైన జరుపవచ్చును. ఉదయనక్షత్రము నుండి ఏడవది, చతుర్థము ఆభిజిల్లగ్నము, గోధూళిలగ్నమున పైరెండు వివాహములు జరిపిన పుత్రపౌత్రాభివృద్ధి జరుగును. ప్రాచ్యదేశవాసులకు గోధూళిలగ్నము ముఖ్యము కళింగదేశస్తులకు మాత్రముపనికి రాదు. అభిజిల్లగ్నము అన్ని దేశములలోని వారికి ముఖ్యము. సర్వదోషనివారకము. సూర్యుడు మధ్యందినగతుడైనపుడు అభిజిన్ముహూర్తమనబడును. 

శంకరుడు త్రిపురములను నశింపచేసినట్లు అభిజిల్లగ్నము అన్నిదోషములను నశింపచేయును. పుత్రుని వివాహమును చేసిన తరువాత ఆరు నెలలకు వరకు పుత్రిక వివాహమును చేయరాదు. అట్లే పుత్రుని ఉపనయనమును, పుత్రికా వివాహమును ఒకేసారి జరుపరాదు. ఒక శుభకార్యమున ఇంకొక శుభకార్యము జరుపరాదు. ఒకే తండ్రి బిడ్డలకు ఆరునెలలలోపు వివాహము జరిపినచో ఆ ఇద్దరిలో ఒకరు మూడు సంవత్సరములలో భర్తను కోల్పోవును. ప్రతివివాహము అనగా తన కూతురును ఒకరి కొడుకుకిచ్చి, ఆతని, కూతురును తన కొడుకుకు చేసుకొనుట పనికిరాదు. అట్లే ఒకే వరునికి ఇద్దరు పుత్రికలనిచ్చి వివాహము చేయరాదు. ఒకని కొడుకులకు ఒకని బిడ్డలను (ఇద్దరికి ఇద్దరిని) ఇచ్చి వివాహము చేయరాదు. అట్లే ఒకసారి ఇద్దరికి ఉపనయనము చేయరాదు. శిశువు పగలు పుట్టినచోతండ్రిని, రాత్రి పుట్టినచో తల్లిని, సంధ్యాకాలమున పుట్టినచో తనను చంపుకొనును. గండములకు అన్యధా భావము లేదు. మూలా నక్షత్రమున పుట్టిన పుత్రుడు కాని, పుత్రిక కాని మామను కన్యదానమును చేసిన వానిని చంపును. మూలా నక్షత్రమున చివరి పాదమున పుట్టినచో ఈ హాని జరుగదు. ఆశ్లేషా మొదటి పాదమున పుట్టినవాడు, జ్యేషాంత్యపాదమున పుట్టిన వాడు కూడా ఆ ఇదే చేయును. పుత్రిక మాత్రము చేయదు. పూర్వాషాఢ మూలా నక్షత్రములలో పుట్టిన బాలిక తల్లిదండ్రులకు హాని కలిగించదు. జ్యేషా నక్షత్రమున పుట్టిన బాలిక భర్త అన్నను చంపును. విశాఖా నక్షత్రమున పుట్టినది భర్త తమ్ముని చంపును. వివాహదినమునుండి ఆరవ, ఎనిమిదవ దినమున వధూప్రవేశమును జరిపిన సకలసంపదలు కలుగును. ఏడవ పదవదినమున కూడా జరుపవచ్చును. రెండు సంవత్సరముల జన్మమును, నక్షత్రలగ్నదివసములను వదిలి, అతిశుక్రుడున్ననూ వివాహయాత్ర శుభప్రదము. ఉత్తరాయణమున దేవతాప్రతిష సంపత్సదము. గురు శుక్రులు అస్తగులు కానపుడు దేవదైత్యప్రతిష ఉత్తమము. చైత్ర భిన్నమాసములలో, మాఘాది పంచమాసములలో శుక్లకృష్ణపక్షములలో మొదటి ఎనిమిది తిథులలో చేసినచో శుభప్రదము. యే తిథికి యే దేవత అధిపతియో ఆ తిథిలో ఆ దేవతా ప్రతిష్ఠ జరుపవలయును. ద్వితీయనుండి రెండు పంచమి నుండి మూడు వరుసగా దశమి నుండి నాలుగు, విశేషించి పూర్ణిమ నాడు, ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, పునర్వసు, మృగశిర, రేవతి, హస్త, చిత్త, స్వాతి గురు నక్షత్రములలో, అశ్విని, రోహిణి, శతభిష, శ్రవణం, అనూరాధా నక్షత్రములలో, మంగళవారము తప్ప మిగిలిన వారములలో కర్తకు సూర్యుడు బలయుతుడుగా నున్నపుడు, చంద్రతారా బలముండగా శుభదినమున పూర్వహమున శుభలగుమున, శుభా రొ బలముండగా శుభదినమున పూర్వాప్తమున, శుభలగ్నమున, శుభాంశలో, కర్తకు నిధనస్థానగతగ్రహోదయము కానపుడు అన్నిరాశులు శుభప్రదములే. కొని శుభగ్రహములు కలవి గాని శుభగ్రహ వీక్షణము కాని యుండవలయును. పంచాష్టకమున శుభలగ్నమున, సప్తమశుద్ధియున్నపుడు శుభము. చంద్రసూర్యకుజరాహు కేతుశనులు లగ్నమున నున్నచో మృత్యుప్రదులు. ఇతరులున్నచో ధనధాన్య సుఖములను ప్రసాదించును. ద్వితీయ స్థానమున పాపగ్రహములున్నచో అనిష్టమును కలిగించును. సౌమ్యగ్రహములు చంద్రుడు ఉన్నచో సంపదలనిచ్చును. మూడవస్థానమున అన్ని గ్రహములు పుత్రపౌత్ర సుఖముల నొసంగును. చతుర్థమున సౌమ్యగ్రహములు సుఖమును, క్రూరగ్రహములు దుఃఖమునొసంగును. పంచమమున క్రూరులు హానిని, శుభులు పుత్ర సుఖములను, షష్ణమున శుభులు శత్రువులను పాపులు. శత్రునాశమును, సప్తమమున పొపులు వ్యాధిని, సౌమ్యులు శుభమును, అష్టమమున అన్ని గ్రహములు మృత్యువును, నవమమున పొపులు మృత్యువును, సౌమ్యులు శుభమును, దశమమున పాపులు దుఃఖమును, సౌమ్యులు చంద్రుడు సుఖమును, కీర్తిని, ఏకాదశమున అన్ని గ్రహములు బహులాభమును, ద్వాదశమున వ్యయమును కలిగించును. ఆర్థహీనమైనచో కర్తను, మన్తహీనమైనచో ఋత్విజులను, లక్షణహీనులైనచో స్త్రీని చంపును. కావున దేవతా ప్రతిష్ఠవంటి శత్రువులేడు. లగ్నమున గుణములధికములు, దోషములు స్వల్పములున్నచో శుభప్రదము.

 సురాణాం స్థాపనం తత్ర కర్తరిష్టార్థ సిద్ధిదమ్

 నిర్మాణాయతనగ్రామ గృహాదీనాం పమాసతః

 క్షేత్రమాదౌ పరీక్షేత గంధవర్ణరసాంశ కైః

 మధుపుష్పామ్ల పిశిత గంధం విపానుపూర్వకమ్

సితం రక్తం చ హరితం కృష్ణవర్ణం యథాక్రమమ్

 మధురం కటుకం తిక్తం కషాయకరసం క్రమాత్

 అత్యంత వృద్ధిదం నృణాం ఈశానప్రాగుదప్లవమ్

 అన్యదికు ప్లవే తేషాం శశ్వదత్యంత హానిదమ్

 సమగర్హరత్ని మాత్రం ఖనిత్వా తత్ర పూరయేత్

 అత్యంత వృద్ధిరధికే హీనే హాని పమే సమమ్

 తధానిశాదా తత్కృత్వా పానీయేన ప్రపూరయేత్

 ప్రాతర్దృషే జలే వృద్ధిప్పమం పంకే క్షయః క్షయే

ఏవం లక్షణసంయుక్తం సమ్యక్ క్షేత్రం సమీక్ష్యతే

 ద్సిధనాయ తన్మధ్యే సమం మండలమాలిఖేత్

ద్వాదశాంగులకం శంకుం స్థాప్యే క్షేత్రత్ర దికమమ్

చతురసే కృతే క్షేత్ర షడ్వర్గపరిశోధితే

రేఖామాగ్గే చ కర్తవ్యం ప్రాకారం సుమనోహరమ్

ఆయామేషు చతుర్ధిక్టు ప్రాగాదిషు చ సత్స్వపి

 అష్టావజ్జా ప్రతిదిశం ద్వారాణి పుర్యథాక్రమమ్

 ప్రదక్షిణ క్రమాతేషాం అమూని చ ఫలాని వై

 హానిర్నేసవ్యం ధనప్రాప్తి నృపపూజా మహద్ధనమ్

అతి చౌర్యమతిక్రోధో భీతిర్దిని శచీపతేః

 నిధనం బంధనం భీతి వర్గాషిర్ధనవర్ధనమ్

అనాతంకం వ్యాధిభయం నిస్సత్వం దక్షిణాదికి

 పుత్రహాని శ్శత్రువృద్ధి క్లక్ష్మీప్రాప్తి ర్ధనాగమః

 సౌభాగ్యమతిదౌర్భాగ్యం దుఃఖం శోకశ్చ పశ్చిమే

 కలత్రహాన్నిసత్వం హానిర్దాస్యధనాగమః

 సంపద్వృద్ధి ర్మాసభీతి రామయం దిశి శీతగోః

 ఏవం గృహాదిషు ద్వారవిస్తారా ద్ద్విగుణోచితమ్

 పశ్చిమే దక్షిణే వా పి కపాటం స్థాపయేద్గృహే

 ప్రాకారాంతః క్షితిం కుర్యా దేకాకీతి పదం యథా

 మధ్యే నవపదే బ్రహ్మ స్థానం తదతినిందితమ్

 ద్వాత్రింశదంశాః ప్రాకార సమీయాంశా స్సమస్తతః

 పిశాచాంశే గృహారంభ దుఃఖశోకభయప్రదః

శేషాంశా స్స్యుశ్చ నిర్మాణే పుత్రపౌత్ర ధనప్రదాః

 శిరాప్స్యు ర్వాస్తునో రేఖా దిగ్విదిజ్మధ్యసంభవాః

 బ్రహ్మ భాగాః పిశాచాంశాః శిరాణాం యత్ర పంపతిః

 తత్ర తత్ర విజానీయా ద్వాష్ణునో మర్మసంధయః

 మర్మాణి సంధయో నష్టాః ప్వ స్ధల ప్యేవం నివేశనే

 సౌమ్యఫాల్గున వైశాఖ మాఘ శ్రావణ కార్తికాః

 మాసాస్స్యుకృహ నిర్మాణే పుత్రారోగ్యధనప్రదాః

 అకారాదిషు భాగేషు దీక్టు భాగాదిషు క్రమాత్

 ఖరోశ్వోథ హరిశ్శ్వాఖ్యః పపాంశు గజశాశకాః

 దిగ్వర్గాణామియం యోనిః స్వవర్గాత్పంచమో రిపుః

 సాధ్యవర్గః పురః స్థాప్యః పృష్ఠత స్సాధకం న్య సేత్

 వ్యత్యయే నాశనం తప్య ఋణ మధ్యం ధనాచ్చుభమ్

 ఆరభ్య సాధకం ధిష్ణ్యం సాధ్యం యావచ్చతుర్గుణమ్

విభజోత్సప్తభిశ్శేషం సాధకస్య ధనం తదా

 విస్తార ఆయామగుణో గృహప్య పదముచ్యతే

 తస్మాద్ధనా ధనాయర వారాంశా ప్సంఖ్యలో క్రమాత్

ధనాదికం గృహం వృద్ధ్యే ఋణాధికమశోభనమ్

 విషవాయ శ్శుభాయైవ సమాయో నిర్ధనాయ చ

 ధనక్షయ షృతీయరే పంచమరే పరః క్షయః

ఆత్మక్షయ స్సప్తమరే భవత్యేవ హి భర్తృభాత్

ద్విగ్ద్వాదశో నిర్ధనాయ త్రికోణమసుతాయ చ

 షట్కాష్టకం మృత్యవేస్యాచ్ఛుభదారాశయః పరే

సూర్యాంగారక వారాంశో వైశ్వానర భయప్రదాః

 ఇతరే గ్రహవారాంశాః సర్వకామార్థ సిద్ధిదాః

 నభస్యాదిషు మా సేషు త్రిషు త్రిషు యథాక్రమమ్

 పూర్వాదికశిరోవామ పార్శ్వే శాయా ప్రదక్షిణమ్

 చరాహ్వయో వాస్తు పుమాన్ చరత్యేవం మహోదరః

 యద్దిబ్ముఖో వాస్తు పుమాన్ కుర్యాత్తద్దిబ్ముఖం గృహమ్

 ప్రతికూలముఖం గేహం రోగశోకభయప్రదమ్

సబలో ముఖ గేహానాం ఏష దోషో న విద్యతే

 వృత్యేటికాం పర్ల రేణు ధాన్య శైవలసంయుతమ్

 గృహమధ్యే హస్తమాత్రే గత్తే న్యాసాయ విన్య సేత్

 వస్తాయామ దలం నాభిస్తస్మాదధ్యంగులత్రయమ్

 కుక్షి స్త్మ సిన్య సేచ్ఛంకుం పుత్రపౌత్రవివర్ధనమ్

 చతుర్వింశత్తయో వింశత్తోడశద్వాథశాంగులై

 విప్రాదీనాం కుక్షిమానం స్వర్ణవఫ్రాద్యలంకృతమ్

 ఖదిరార్జునశాలోళం యుగయంత్రం తరూద్భవమ్

 రక్త చందనపాలాశ రక్తశాలవిశాలజమ్

శంకుం త్రిధా విభాజ్యాద్యం చతురస్రం తతః పరమ్

అష్టాసంచ తృతీయాసౌ మన్వసం మృదుమంత్రణమ్

ఏవం లక్షణసంయుక్తం పరికల్ప్య శుభే దినే

 షడ్వర్గశుద్దిసూత్రేణ సూత్రితే ధరణీతలే

 మృదుధ్రువక్షిప్రభేషు రిక్షామావర్జితే దినే

 వ్యర్కార చరలగ్నేషు పాపే చాష్ట్రమ వర్జితే

 నైధనే శుద్ధిసంయుక్తే శుభలగ్నే శుభాంశరే

 శుభేక్షితేఒథవా యుక్తే లగ్నే శంకుం వినిక్షిపేత్

 పుణ్యాహహో షేర్వాదితైః పుణ్యపుణ్యాంగనాదిభిః

 స్వతి కేంద్ర త్రికోణె శ్శుభైస్సాయారిగైః పరైః

 లగ్నాంశాష్టారి చంద్రేణ దైవజ్ఞార్చన పూర్వకమ్

 ఏకద్విత్రిచతుశ్శాలా పృప్తశాలా దశాహ్వయాః

 తాః పున షడ్విధా శ్శాలా ప్రత్యేకం దశషడ్విధా

ధ్రువం ధాన్యం జయం నందం ఖరం కాంతం మనోరమం

 సుముఖం దుర్ముఖం క్రూరం శత్రుం స్వర్ణప్రదం క్షయమ్

 ఆక్రందం విపులాఖ్యం చ విజయం షోడశం గృహమ్

గృహాణి గణయేదేవం తేషాం ప్రస్తార భేదతః

 గురో రధో లఘుస్ధాప్యః పురస్తాదూర్ధ్వవన్న్య పేత్

 గురుభిః పూరయేత్పశ్చాత్ పర్వలఘ్వవధీర్విధిః

కుర్యాల్లగుపదేలిగ్దం గృహద్వారాతదక్షిణమ్

పూర్వాది గేప్వలిందేషు గృహభేదాస్తు షోడశ

 స్నానాగారం దిశి ప్రాచ్యాం ఆగ్నేయ్యాం పాకమందిరమ్

 ప్రతీచ్యాం భోజన గృహం వాయవ్యాం ధాన్యమందిరమ్

 యామ్యాం చ శయనాగారం నైఋత్యాం శాస్త్రమందిరమ్:

 కౌబేర్యాం దేవతాగారం ఈశాన్యాం క్షీరమందిరమ్

శయ్యామూత్రాస్త్ర తద్విచ్చ భోజనం మంగళాశ్రయమ్

  ధాన్యస్త్రీభోగవిత్తం చ శృంగారాయతనాని చ

ఈశాన్యాది క్రమ స్తేషాం గృహనిర్మాణకం శుభమ్

ఏతే ష్వేతాని శస్త్రాణి సంస్థాప్యాని స్వదిక్ష్వపి

 ధ్వజో ధూమ్రాథపింహశ్శ్వా సౌరమేయః ఖరో గజః

ధ్వాంక్ష శ్చైవ భవంత్యప్టో పూర్వాదిపాః క్రమాదమీ

ప్లక్షోలదుంబరచూతాఖ్యా నింబస్తు హి విభీతకాః

 కంటకా దుగ్ధవృక్షా వృక్షాశ్వత్థ కపిత్థకాః

అగస్తి సింధువాలాఖ్య తింతిడీకాశ్చ నిందితాః

 పిత్తవాగ్రజ దేహస్యాత్పశ్చిమే దక్షిణే తథా

గృహపాదా గృహస్తంభా స్సమా శ్శస్తాశ్చ నాసమాః

నాత్యుచ్ఛ్రితం నాతి నీచం కుడ్యోత్సేధం యథారుచి

 గృహోపరి గృహాదీనాం ఏవం సర్వత్ర చింతయేత్

అట్టి లగ్నమున దేవతాప్రతిష్ట కర్తకు అభీష్టములను ప్రసాదించును. దేవాలయమును, గ్రామమును గృహమును మొదలగువాటిని నిర్మించుటకు ముందుగా భూమిని గంధవర్ణరసాదులచే పరీక్షించవలయును. విప్రాశీర్వచన పూర్వకముగా మధు పుష్ప ఆమ్ల పిశిత గంధమును తెలుపు ఎరుపు ఆకుపచ్చ నలుపు వర్ణమును వరుసగా మధుర కటుక తిక్త కషాయకర రసములను కలుపుట వలన ఈశాన్య పాక్ ఉత్తర ప్లవముగా నున్నచో మానవులకు మిక్కిలి అభివృద్ధిని కలిగించును. ఇతర దిక్కులలో ప్లవముగా (పల్లముగా) ఉన్నచో అత్యంతహానిని కలిగించును. సమముగా అరత్ని మాత్రప్రమాణముగా గర్తమును తవ్వి నింపవలయును. అధికముగా ఉన్నచో వృద్ధితగ్గినచో హాని కలుగునని తెలియవలయును. అట్లు సాయంకాలము ఆగర్తమును జలముతో నింపవలయును. మరునాడు ఉదయము జలమున్నచో వృద్ధి, బురదయున్నచో సమఫలము, నీరు పూర్తిగా ఇంకి పోయినచో క్షయము కలుగునని తెలియవలయును. ఇట్లుచక్కగా పరీక్షించి సలక్షణమైన భూమిని నిర్ణయించి, ఆ భూమిలో దీక్కులను తెలియుటకు సమమండలమును లిఖించవలయును. ద్వాదశాంగుల పరిమాణముగల శంకును స్థాపించి దిగ్విభాగమును చూడవలయును. ఇట్లు క్షేత్రమును చతురస్రముగా చేసి షడ్వర్గలచే పరిశోధించి రేఖామార్గమున ప్రాకారమును సుందరముగా నిర్మించవలయును. నాలుగు దిక్కులలో విస్తారమున్ననూ ప్రతిదిక్కులో ఎనిమిది ద్వారములుండవలయును. ఆ ద్వారములకు ప్రదక్షిణక్రమముగా ఈ ఫలములుండును. హాని, దారిద్ర్యము, ధనప్రాప్తి, రాజపూజ, మహాధనము, అతిచౌర్యము, అతిక్రోధము, భీతియనునవి ఇంద్రుని దిక్కులోని ద్వారములకు ఫలములు. నిధనము, బంధనము, భీతి, ధనప్రాప్తి, ధనవృద్ధి, విఘ్నరాహిత్యము, వ్యాధి భయము, నిస్సత్వము, దక్షిణదిక్కులో కలుగును. పుత్రహాని, శత్రువృద్ది, లక్ష్మీప్రాప్తి, ధనాగమము, సౌభాగ్యము, అతిదౌర్భాగ్యము, దుఃఖము శోకము పశ్చిమదిక్పలములు. కలత్రహాని, నిస్సత్త్వము, హాని, ధాన్యాగమము, సంపద్వృద్ధి, మాసభీతి, రోగము ఇవి చంద్ర దీక్సలములు. (ఉత్తరదిక్కు) ఇట్లు గృహాదులలో ద్వారములు విస్తారమునకు రెట్టింపు ఔన్నత్యముగా నుండవలయును. ఇంట్లో పశ్చిమమునకాని, దక్షిణమున కాని కవాటమునుంచవలయును. ప్రాకారములోపల ఎనుబది యొక్క అడుగుల భూమి నుంచవలయును. ఆ భూమి మధ్యభాగమున తొమ్మిదడుగుల భూమి బ్రహ్మస్థానమనబడును. ఈ బ్రహ్మస్థానము అతినిందితము. ప్రాకారమున ముప్పది రెండంశలుండును. పిశాచాంశమున - గృహారంభమును చేసినచో దుఃఖమును, శోకమును భయమును కలిగించును. దిక్కుల విదిక్కుల మధ్యనున్న రేఖలు వాస్తు పురుషుని శిరస్సులుగా నుండును. శిరముల సమూహమున్న బ్రహ్మ భాగములు  పిశాచాంశలగును. అట్లే వాస్తుపురుషుని మర్మసంధులను కూడా తెలియవలయును. ఇల్లు మంచిగో నున్నను వాస్తు పురుషుని మర్మములు సంధులు ఇష్టప్రదములు కొజూలవు. మాఘ ఫాల్గున వైశాఖ శ్రావణ కార్తిక మాసములలో గృహనిర్మాణమును చేసినచో పుత్ర, ఆరోగ్య ధనములు కలుగును. దిగ్భాగములలో వరుసగా అకారాది భాగములందు ఖరము, ఆశ్వము, సింహము, శ్వానము, పాంశు, గజము, శశము ఇవి దిగ్వర్గముల యోనులు. తమ వర్గము నుండి అయిదవ వర్గము శత్రుస్థానము ముందుభాగమున సాధ్యవర్గమును స్థాపించవలయును. తరువాత వెనుక భాగమున సాధక వర్గము నుంచవలయును. దీనికి విపరీతముగా చేసినచో నాశనము జరుగును. ఋణస్థానము మధ్యమము. ధనస్థానము శుభప్రదము. సాధక నక్షత్రమున సాధనావాసమును ప్రారంభించి సొధనమునకు నొలుగు రెట్లధికముగా సాధ్యమును చేసి ఏడింటిచే భాగించగా శేషము సాధకునికి ధనమగును. విస్తారము ఆయామగుణముగా నుండుట గృహస్థానమగును. కావున ధన అధన, ఆయ, నక్షత్రవారాంశలు సంఖ్యాక్రమమున చూడవలయును. ధనాధికముశేషమైనచో గృహము వృద్ధి ప్రదము.ఋణాధికము శేషమైనచో శుభప్రదము కాదు. విషమాయము శుభమును, సమయము నిర్ధనమును కలిగించును. మూడవ నక్షత్రమున ధన క్షయము, అయిదవ నక్షత్రమున అధిక క్షయము, ఏడవ నక్షత్రమున ఆత్మక్షయము, కర్తనక్షత్రము నుండి జరిగియే తీరును. రెండు పన్నెండు నిర్ధనమును, త్రికోణము సంతాన రాహిత్యమును, 6-8 మృత్యువును ప్రసాదించును. ఇతర రాశులు శుభప్రథములు. ఆది మంగళ వారాంశలు అగ్నిభయమును కలిగించును. ఇతర గ్రహాంశలు వారాంశలు సర్వకామార్ధ సిద్దిప్రదములు. శ్రావణాది మాసములలో మూడు మూడులలో యథాక్రమముగా పూర్వోదికము శిరస్సునోమపార్శ్వేశునికి అప్రదక్షిణముగా చరనామముచే వొస్తు - పురుషుడు మహోదరునిగా చరించుచుండును. వాస్తుపురుషుడు ఏ దిజ్ముఖుడుగా నుండునో గృహమును ఆ దిజ్ముఖముగా నిర్మించవలయును. ప్రతికూల దిజ్ముఖముగా నిర్మించినచో రోగశోకభయములను కలిగించును. వాస్తుపురుషుడు బలీయుడైనచో ఈ దోషము లేదు. ఈటికను స్వర్ణరేణువును, ధాన్య శైవలసంయుతముగా గృహమధ్యమమున హస్త మాత్ర ప్రమాణము గల గర్తమున న్యాసము కొరకుంచవలయును. వస్తాయామదలమును నొభియందురు. దానికంటే అంగుళత్రయాధికభాగము కుక్షి యగును. ఆ కుకీలో శంకునుంచవలయును. ఇట్లు చేసినచో పుత్రపౌత్రవృద్ధి కలుగును. 24, 23, 16, 12 అంగుళములు కుక్షి ఉండుట బ్రాహ్మణాది చాతుర్వర్ణ్యముల ప్రమాణము. శంకున స్వర్ణవస్త్రాదులచే అలంకరించి, ఖదిర, అర్జున, శాల వృక్షముల నుండి చేసిన దానిని, యుగ యంత్రమును సిద్దము చేసి, రక్త చందన, పాలాశ, రక్త శాల, విశాలములనుండి పుట్టిన దానిని శంకువును మూడు భాగములుగా విభజించి, మొదటి భాగమును చతురస్రాకారముగా, రెండవ భాగమును అష్టాగ్రముగా, తృతీయ భాగమును మన్వసముగా నిర్మించవలయును. మృదువుగా - మన్హణముగా నుండవలయును. ఇట్లు శంకును లక్షణ సంయుక్తముగా సిద్దము చేసి శుభదినమున షడ్వర్గశుద్ధి సూత్రముచే చుట్టబడిన ధరణీ తలమున మృదు, ధ్రువ, క్షిప్ర నక్షత్రములలో రిక్త అమావర్జిత దినమున సూర్యకుజచర భిన్నమగు లగ్నమున పాపగ్రహములు అష్టమస్థానమునలేనపుడు, సప్తమ శుద్దిని చూచి, శుభలగ్నమున, శుభాంశమున శుభగ్రహ వీక్షణమున్నపుడు, లేదా శుభగ్రహములతో కూడియున్నపుడు శంకున్యాసమును చేయవలయును: పుణ్యాహఘోషములతో, వాదిత్రములతో, పవిత్రులగు పుణ్యాంగనలతో స్వతి కేంద్ర త్రికోణస్థానములందు శుభగ్రహములుండగా 3, 6, 11 స్థానములలో ఇతర గ్రహములుండగా లగ్నాంశాష్టారి చంద్రునిచే, దైవజ్ఞులను అర్చించి, ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాల, సప్తశాల దశశాలలుగా నిర్మించవలయును. ఈ శాలలు మగల షడ్విధములు, ధ్రువపరు, ధాన్యము, జయము, నందము, ఖరము, కొంతము, మనోరమము, సుముఖము, దుర్ముఖము, క్రూరము, శత్రువు, స్వర్ణప్రదము, క్షయము. ఆక్రందము, విపులము, విజయము అని పదునొరు పేర్లు గృహముల కుండును. గృహముల. విస్తార భేదములచే ఈ పేర్లతో లెక్కించవలయును. గురువుకు క్రిందుగా లఘువు నుంచవలయును. ముందు ఊర్ధ్వముగా నుంచవలయును. తరువాత గురువులతో పూరించవలయును. లఘు పదమున అళీందమును చేయవలయును. గృహవ్వొరము నుండి ప్రదక్షిణముగా పూర్వాదులందున్న ఆలిందములందు షోడశ గృహభేదము లేర్పడును. తూర్పున స్నానాగారము, ఆగ్నేయమున పాకశాల, పశ్చిమమున భోజనశాల, వాయవ్యమున ధాన్యశాల, దక్షిణమున శయనాగరము, నైఋతిలో శాస్త్రిగారము, ఉత్తరమున దేవాగారము, ఈశాన్యమున క్షీరమందిరముండవలయును. శయ్యామూత్రాస్త్రశాలలు భోజనాలయములుండుట శుభావహము. ధాన్య, స్త్రీ భోగ, ధన, శృంగారశాలలు ఈశాన్యాదిక్రమముగా నిర్మించుట శుభప్రదము. ఈ శాలలో ఆయాదిక్కులలో ఆంగూశస్త్రముల నుంచవలయును. ధ్వజము, ధూమము, సింహము, శునకము, సౌరమేయము ఖరము గజము, ధ్వాంక్షము అను ఎనిమిది పూర్వాది దిక్పాలకులు. జమ్మి, మేడి, మామిడి, వేప, తుహి, విభీతకము, కంటక వృక్షములు, దుగ్ధవృక్షములు, రాగి, వెలగ చెట్లు ఆగస్తి, సిందువాలవృక్షములు, చింతచెట్లు ఇంట్లో ఉండరాదు. పశ్చిమ దక్షిణములలో పిత్తవాక్- రజోదేహుడుగా నుండును. గృహపాదములు, గృహస్తంభములు సమములుగా నుండవలయును. విషమములుగా నుండరాదు. ఎక్కువ ఎత్తు, ఎక్కువ వంపు కాక గోడ యథేష్టముగా నుండవలయును. గృహములమీది గృహములు కూడా ఇట్లే ఉండవలయును.

గృహాదీనాం గృహశ్రావం క్రమశోష్ట విధం స్మృతమ్

 పాంచాల మానం వైదేహం కౌరవం చ కుజన్యకమ్

మాగధం శూర పేనం చ గొంధారవంత స్మృతాః

 స చతుర్బాగవిస్తార ముత్సేధం యత్తదుచ్యతే

 పాంచాల మాతులానాం చ హ్యుత్తరోత్తర వృద్ధితః

 వైదేహా దీన్య శేషాణి మావావి ప్యుర్యథాక్రమమ్

 పాంచాలమానం సర్వేషాం సాధారణమతః పరమ్

 అవంతిమానం విప్రాణాం గాంధారం క్షత్రియప్య చ

 కౌజన్యమానం వైశ్యానాం విప్రాదీనాం యథోత్తరమ్

 యథోదితం జలస్త్రాఖ్యం ద్వాత్రిభూమిక వేశ్మనామ్

 ఉష్ట్ర కుంజరశాలానాం ధ్వజాయే ప్యథవా గజే

పశుశాలాశ్చ కౌలానాం ధ్వజాయే ప్యథవాగజే

 ద్వారశయ్యాశనా మత్ర ధ్వజా సిహవృషధ్వజాః

 వాస్తుపూజా విధిం వక్ష్యే నవ వేశ్మ ప్రవేశనే

 హస్త మాత్రా లిఖేదేఖా దశపూర్వా దశోత్తరాః

 గృహమధ్యే తండులోపర్యేకవింశతిపదం భవేత్

 పంచోత్తరానక్ష్యమాణాం శ్చత్భారింశత్సురానిఖీత్

ద్వాత్రింశదా హ్యత పూజ్యా పత్రాంతస్థా స్రయోదశ

తేషాం స్థానాని నామాని వక్ష్యామి క్రమ శోధునా

 ఈశానకోణతో బాహ్యే ద్వాత్తాంశత్త్రిదశా అమీ

 కృపీట యోనిః పర్జన్యో జయన్తః పాక శాపనః

సూర్య శ్శశీ మృగౌకాశా వాయుః పూషా శనైచరతికి

గృహాక్షతో దండధరో గాంధర్వో భృగురాజకః

మృగః పితృగణాధీశః తతో దైవారికాస్వయః

 సామస్సూర్యోఒదితి దితీ ద్వాత్తంశత్రిదశా ఆమీ

 అధోశనాది కోణస్థా శ్చత్వారస్తత్సమీపగాః

ఆప స్సావిత్ర సంజ్ఞశ్చ జయో రుద్రఃక్రమాదమీ

 ఏకాంతరాస్స్యు ప్రాగాద్యా పరితో బ్రహ్మణస్సృతాః

 అర్యమా సవితా బింబ వివస్వాన్వసుధాధిపః

 మిత్రోథ రాజయక్ష్మా చ తథా పృధ్వీధరాహ్వాయః

 ఆపవత్సష్టమః పంచ చత్వారింశస్సురా అమీ

 ఆపశ్చేవాపవత్సశ్చ పర్జన్యోఒగ్నిః దితిః క్రమాత్

 యద్దిక్కొనాం చ వర్గోయం ఏవం కోణీష్వ శేషతః

 తన్మధ్యే వింశతిరాహ్యా ద్విపదా స్తే తు పర్వదా

 అర్యమా చ వివస్వాంశ్చ మిత్రః పృథ్వీ ధరాహ్వయః

 బ్రహ్మణః పరితో దికు చత్వార ప్రీపదా స్సృతాః

 బ్రహ్మణం చ తథైకద్విత్రిపదానర్చయేత్సురాన్

 వాస్తు మంత్రేణ వాస్తుజ్ఞో దూర్వాదధ్యక్షతాదిభిః

 బ్రహ్మమంత్రేణ వా శ్వేతవస్త్రయుగ్మం ప్రదాపయేత్

 ఆవాహనాది పర్వోపచారాంశ్చ క్రమశస్తథా

నైవేద్యం త్రివిధాన్నేన వాడ్యెస్సహ పమర్పయేత్

 తాంబూలం చ తతఃకర్తా ప్రార్థయే ద్వాస్తుపూరుషమ్

వాస్తుపురుష నమస్తేస్తు భూశయ్యా నిరత ప్రభో

ముద్గృహం ధనధాన్యాదిసమృద్ధం కురు సర్వదా

 ఇతి ప్రార్ధ్య యధా శక్త్యా దక్షిణామచ్చ కాయచ

 దద్యాత్తదగ్రే విపేభ్యో భోజనం చ స్వశక్తితః

 అనేన విధినా పమ్యక్ వాస్తు పూజాం కరోతి యః

 ఆరోగ్యం పుత్రలాభం చ ధనం ధాన్యం లభేన్నరః

 అకృత్వా వాస్తుపూజాం యః ప్రవిశన్నవమందిరమ్

 రోగన్నానావిధాంక్లే శానశ్నుతే సర్వసంకటమ్

 అకపాట మనాచ్చన్న మదత్త బలిభోజనమ్

 గృహం న ప్రవిశేదేవం విపదామాకరం హి తత్

గృహములు మొదలగు వాటికి గృహ శ్రావము క్రమముగా అష్టవిధములు చెప్పబడినవి. పాంచాలమానము, వైదేహమానము, కౌరవమానము, కుజనమానము, మాగధమానము, శూర సేనమానము, గాంధారమానము, అవంతీమానము అని. చతుర్బాగ విస్తారము ఉన్నతముగనున్నది. పాంచాలమానమనబడును. ఉత్తరోత్తర వృద్దిగా నుండు నవి వైదేహాది మానములగును. పాంచాలమానము సర్వసాధారణము. బ్రాహ్మణులకు అవంతిమానము, క్షత్రియులకు గాంధారమానము, వైశ్యులకు కుజనమానము, ఆశ్రయణీయము. బ్రాహ్మణాదులకు యథోత్తరముగా, యథోక్తముగా జలయ్యీణ్యములను ద్విత్రిభూమికగృహములకు, ఉష్ట్ర కుంజరశాలలకు ధ్వజాయము గజయామములు చెప్పబడినవి. ద్వార శయ్యాభోజనశాలల ఆయామములు ధ్వజసింహ వృష ధ్వజాయామములు విధించబడినవి. నూతన గృహప్రవేశసమయమున చేయవలసిన వాస్తు పూజా విధానమును చెప్పెదను వినుము. గృహ మధ్యమున బియ్యము మీద ఇరువది ఒకటి అడుగుగల కొలతతో హస్త మాత్రముగా పూర్వ భాగమున పది ఉత్తరభాగమున పది రేఖను గీయవలయును. అయిదు తరువాత చెప్ప బోవు ఇరువదినాలుగు మంది దేవతలను లిఖించవలయును. బాహ్యభాగమున ఈశాన్యకోణము నుండి 32 మంది దేవతలు వీరు. తీపుడు, పర్జన్యుడు, జయస్తుడు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, మృగము, ఆకాశము, వాయువు, పూష, నైఋతి, గృహక్షతుడు, దండధరుడు, గొంధర్వుడు, భృగు, ఆజకుడు, మృగుడు, పీత, గణాధీశుడు, దైవారీకుడు, సోముడు, సూర్యుడు, అదితి, దితి. ఉశనొది కోణమునుండి ఉండు నలుగురు దేవతలు వేరు. అపుడు, సావిత్రుడు, జయుడు, రుద్రుడు ఆనువారలు. తూర్పు మొదలుకొని ఏకొంతరులు చుట్టూ బ్రహ్మలుందురు. అర్యమా, సవిత, వివస్వాన్ వసుధాధిపుడు. మిత్రుడు, రాజయక్ష్మ, పృథ్వీధరుడు, ఆపపతి అష్టమను. ఇట్లు 45 మంది దేవతలు. ఆప, ఆపవత్స, పర్జన్య, అగ్ని, దితి, అని ఇది ఒకదిగ్వర్గము ఇట్లు అన్ని కోణములలో సంపూర్ణముగా నుండును. ఈ మధ్యలో బాహ్యులు ఇరువదిమంది ద్విపోదులు. అర్యమా, వివస్వాన్, మిత్రుడు, పృధ్వీధరుడు, అని బ్రహ్మ చుట్టు నాలుగు దిక్కులలో నలుగురు శ్రీపాదులు, బ్రహ్మను కూడా ఒకటి, రెండు మూడు పాదములు కలవానినిగా పూజించవలయును. వొస్తును తెలిసినపోడు వాస్తుమంత్రముచే దూర్వాదధ్యక్షతాదులచే, బ్రహ్మమంత్రముచే కాని, శ్వేతవస్త్రయుగ్మమును ఇప్పించవలయును. క్రమముగా ఆహ్హనోది సర్వోపచారములను చేసి, త్రివిధానమును నైవేద్యము చేసి, వాద్యములచే చక్కగా పూజించవలయును. తరువాత తాంబూలమును సమర్పించి వాస్తుపురుషుని ప్రార్థించవలయును. ఓ వాస్తుపురుషా! నీకు నమస్కారము. నీవు భూశయ్యానిరతుడవు. నొగృహమును ధనధాన్యసమృద్ధముగా చేయుము. ఇట్లు యథాశక్తిగా ప్రార్థించి అర్చకునికి దక్షిణనీయవలయును. తరువొత శక్తి ననుసరించి బ్రాహ్మణులకు భోజనతాంబూలదక్షిణలను సమర్పించవలయును. ఇట్లు తన శక్తి మేరకు విధిగా చక్కగా వొస్తు పూజను చేయుడు ఆరోగ్యమును పుత్రలాభమును ధనధాన్యములను పొందగలడు. ఇట్లు వాస్తు పూజను ఆచరించక నూతన గృహప్రవేశమును చేసినచో రోగములను బహువిధకష్టములను పొందును. ఎప్పుడూ సంకటముల సొలగుచుండును. తలుపులేని, ఆచ్చాదనము లేని, పూజచేయని, భోజనము పెట్టని కొత్త ఇంటిలోనికి ప్రవేశించకూడదు. అట్లు ప్రవేశించినచో ఆపదల పాలగును.

అధో యాత్రా నృపాదీనానభీష్టఫల సిద్ధయే

 స్యాత్తథా తాం ప్రవక్ష్యామి సమ్యగ్విజ్ఞాతజన్మనామ్

 ఆజ్ఞాతజన్మనాం నౄణాం ఫలాప్తిర్ఘుషవర్ణవత్

ప్రశ్నోదయనిమిత్తోద్యే స్తేషామపీ ఫలోదయః

 షష్ఠ్యష్టమీ ద్వొదశీసు రిమా పూర్ణినూపు చ

 యాత్రా శుక్లపతిపది నిర్థస్య క్షయాయ చ

 మైత్రాదితీం ద్వర్కౌంత్య్వాహరితిష్యవసూడుసు

 ఆసక్త సంచ త్ర్యాద్యేషు యాత్రా భీష్టఫలప్రదా

 న ముందేందు నే ప్రొచీం న వ్రజేద్దక్షిణం గురౌ

 సితార్కయోరప్రతీచీం సోదీచీం జ్ఞారయోర్థినే

ఇంద్రో జపాద చతురా స్యాద్యమరాణి పూర్వతః

 శూలాని సర్వద్వారాణి మిత్రాద్కేజ్యాశ్వ భాని చ

మాద్రిడ్జ్వర భావిస్యు పస్తపస్త్రాన్ని ధిష్ణ్యతః

 పరిఘం లంఘయోద్దండం నాస్తిశ్వసనదిగ్గమమ్

 ఆగ్నేయం పూర్వ దిష్ఠి స్యై ర్విదిశ శ్చైవ మేన హి

 దిగ్రాశయస్తు క్రముతో మేషాద్యాశ్చ పునఃపునః

 దిగీశ్వరే లలాటస్ధే యాతుర్నపునరాగమః

 లగ్నస్లో భాస్కరః ప్రాచ్యాం దిశీయాతుర్లలాటగః

 ద్వొదశైకాదశశ్శుక్రో ప్యా స్నేయ్యాం తు లలాటగః

 దశనుష్ఠః కుజో లగ్నాత్ యామ్యాం యాతుర్లలాటగః

 నవమాష్ట్రమగో రాహు రైఋత్యాం తు లలాటగః

 లగ్నొత్సప్తమగ సౌగిః ప్రతీచ్యాం తు లలాటగః

 షష్ఠః పంచమగ శ్చన్తో వాయవ్యాం చ లలాటగః

 చతుర్ధ స్థానగ సౌమ్య శ్చత్తరస్యాం లలాటగః

 ద్వీత్రిస్థానగతో జీవ ఈశాన్యం వై లలాటగః

లలాటం తు పరిత్యజ్య జీవితేచ్ఛురజేన్నరః

 విలోమగో గ్రహో యస్య యాత్రా లగోపగో యది

 తస్య భంగప్రదో రోజ్ఞ పద్వద్గోపి విలగ్నగః

 రవీంద్వయనయ్యో తమనుకూలం శుభప్రదమ్

తదభావే దివారాత్రో యాయాద్యాతు ర్వధన్యధా

 మూఢ శుక్రే కార్యహానిః ప్రతిశుకే పరాజయః

 ప్రతిశుక్ర కృతం దోషం పంతుం శక్తి  గ్రహా న హి

వాసిష్ఠ కొత్య పే యాత్రి భారద్వాజాస్సగౌతమాః

 ఏతేషాం పంచగోత్రాణాం ప్రతిశుక్రో న విద్యతే

 ఏకగ్రామే వివా హే చ దుర్భిక్షే రాజవిగ్ర హే

ద్విజక్షోభే నృపక్షోభే ప్రతిశుక్రో న విద్యతే

 నీచ గోరి గృహ స్లో వా వక్రగోవా పరాజితః

యాతుర్భంగప్రదశ్శుక్ర స్వోచ్ఛస్థజే జయప్రదః

 స్వాష్టలగ్నేష్ట రాశా వా శత్రుభాత్త్వష్టమేపి వా

 తేషామీశస్థ రాశా నా యాతుర్మృత్యుర్న సంశయః

జన్మే శాష్ట్రమ లగ్నాశా మిధో మిత్రే వ్యవస్థితా

జన్మరాశ్యష్టమరోత్థ దోషా నశ్యంతి భావతః

 క్రూరగ్ర హేక్షితో యుక్తో ద్విస్వభావోపి భంగదః

 యానే స్థిరోదయే నేట్టే భవ్యయుకే క్షితస్స్వయమ్

 వస్త్వంత్యార్థిది పంచరే సంగ్రహం తృణకాష్ఠయోః

 యామ్యదిగ్గమనం శయ్యా న కుర్యాద్దేహగోపనమ్

 జన్మోదయే జన్మభేవా తయోరీశస్యభేఽపి వా

తాభ్యాం తయోరర్కేంద్రేషు యాతు శ్శత్రుక్షయో భవేత్

 శీర్సోదయే లగ్నగతే దిగ్లగ్నే లగ్న గేపి వా

శుభవరోథ వా లగ్నే యాతు శ్శత్రుక్షయస్తధా

 శత్రుజన్మోదయే జన్మ రా శర్వా నిధనోదయే

 తయారీశస్థితే రాశా యాతు శ్శత్రుక్షయో భవేత్

 వక్రః పంధా మీనలగ్నే యాతుర్మీనాం శకేఽపివా

 నింద్యో నిఖిల యాత్రాసు ఘటలగ్నో ఘటాంశకః

 జలలగ్నో జలాంతో వా జలయోనే శ్శుభావహః

 మూర్తి: కోశో ధన్వినశ్చ వాహనం మంత్ర సంజ్ఞకమ్

 శత్రుమార్గస్తథాయుశ్చ మనోవ్యాపార పంజికమ్

 ప్రాప్తిరప్రాప్తిరుదయాత్ భావాస్స్యుల్ద్వాదశైవ తే

 ఘ్నంత క్రూరాస్త్ర్యాప్తి వర్గం భావాన్సూర్య మహీసుతౌ

 న నిఘ్నతో హి వ్యాపారం సౌమ్యాః పుష్ణంత్యరిం వినా

రాజులు మొదలగువారు చేయు యాత్రలు ఫలప్రదమగుట కేమి చేయవలయునో చెప్పెదను. పుట్టుక తెలిసిన వారి విషయమున అనగా జన్మతిథి వారనక్షత్రములు తెలిసిన వారి విషయమున చెప్పెదను. జన్మతిథ్యాదులు తెలియని వారికి ఘుణాక్షరముల వలే - ఫలముండును. అటువంటి వారికి ప్రశ్నకాలము, నిమిత్తము మొదలగు వాటిచే ఫలోదయమగును. షష్ఠి, అష్టమి, ద్వాదశి, రిక్త, అమావాస్య, పూర్ణిమ, శుద్ధ పాడ్యమి ఈ తిథులలో ప్రయాణము చేయుట నిర్ధనమును క్షయమును కలిగించును. అనూరాధ, పునర్వసు, మృగశిర, హస్త, రేవతి, అశ్వని, శ్రవణము, పుష్యమి, ధనిష్ఠ నక్షత్రములలో, ఏడు వరకు అయిదు మూడు మొదలగు వాటి యందు ప్రయాణము చేసిన అభీష్టఫలము, సిద్దించును. శనిసోమవారములలో తూర్పుదిక్కునకు, గురువారము దక్షిణమునకు, ఆది. శుక్రవారములలో పశ్చిమమునకు, మంగళ బుధవారములలో ఉత్తరమునకు ప్రయాణము చేయరాదు. జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర, రోహిణి ఉత్తరఫల్గునీ నక్షత్రములు తూర్పదిశకు శూలలు. అనూరాధ హస్త, పుష్యమి, అశ్వనీ నక్షత్రములు పూర్వాదిదిక్కులకు క్రమముగా దిగ్ద్వార నక్షత్రములు. కృత్తికా నక్షత్రము నుండీ ఏడింటి చొప్పున లెక్కించుచు ఏడు ద్వారనక్షత్రములుగా తెలియవలయును. పరిఘను దాటవలయును. ఆగ్నేయ వాయవ్య దిక్కులకు పరిఘలో వెళ్ళరాదు. ఇట్ల విదిక్కుల విషయమున కూడా తెలియవలయును. మేషాది రాశులు మరల మరల దిగాశ్రయములగును. దిగధిపతి లలాటమున నుండగా ప్రయాణము చేసినవాడు తిరిగిరాడు. ప్రయాణలగ్నమున భాస్కరుడుండగా తూర్పు దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును.

పదకొండు, పన్నెండు స్థానములలో నుండు శుక్రుడు ఆగ్నేయ దిక్కునకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి పదియవస్థానమున నున్న కుజుడు దక్షిణ దిక్కునకు వెళ్భువానికి లలాటమున నుండును. తొమ్మిది ఎనిమిది స్థానములలో నుండు రాహువు నైఋతి దిశకు వెళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి ఎడింట నుండు శని పశ్చిమదిక్కునకు వేళ్ళువానికి లలాటమున నుండును. లగ్నము నుండి అయిదు, ఆరు స్థానములలో నుండు చంద్రుడు వాయవ్యదిశకు వేళ్ళువానికి లలాటమున నుండును. రెండు మూడు స్థానములలో నుండు గురువు ఈశాన్య దిక్కునకు వేళ్సువానికి . లలాటమున నుండును. బ్రతుకు మీద ఆశగలవాడు లలాటమును పరిత్యజించి వెళ్ళవలయును. యాత్రా లగ్న సమీవర్తి గాకాని, విలోమగతునిగా కానీ గ్రహమున్నపుడు యాత్రచేయు రాజునకు కార్యభంగమును కలిగించును. ఇట్ల ఆవర్గయైనను వీలగ్నుడైనను ఇదే ఫలితము కలుగను. ఉత్తరాయన దక్షిణాయనములలో యాత్ర అనుకూలము. శుభప్రదము అనగా సూర్యచంద్రాయనములలో వేళ్ళుట యని భావము. అట్లుకానిచో దివారాత్రులలో యాత్రచేయవలయును. అట్లు కానిచో యాత్రచేయువానికి మరణము సంభవించును. శుక్రమూఢమున వెళ్ళినచో కార్యహాని సంభవించును. ప్రతి శుక్రునిలో పరాజయము కలుగును. ప్రతిశుక్రుని వలన కలుగు దోషమును ఏగ్రహములు తొలగించలేవు.

వాసిష్ఠ కాశ్యప, ఆత్రేయ, భరద్వాజ, గౌతమ గోత్రముల వారికి ప్రతిశుక్ర దోషములేదు. ఒకే గ్రామమున వివాహమున, కరువులో, రాజవిరోధమున, బ్రాహ్మణక్షోభకలిగినపుడు, రాజులకు క్షోభయేర్పడినపుడు ప్రతి శుక్రదోషము లేదు. శుక్రుడు నీచస్థానగతుడైనను, శత్రు క్షేత్రమున నున్ననూ, వక్రగతుడైనను యాత్రచేయువానికి కార్యభంగమును కలిగించును. ఉచ్చగతుడైనచో జయమును కలిగించును. తన లగ్నమునకు ఆష్టమస్థానగతుడైనను, ఇష్టరాశి గతుడైనను శత్రురాశి నుండి అష్టమస్థానగతుడైనను, వాటి అధిపతిరాశిలో నున్ననూ యాత్ర చేయువానికి మరణము సంభవించును. జన్నే శుడు, అష్టమ లగ్నేశుడు పరస్పరము మిత్రులుగా నున్నచో జన్మ రాశికి అష్టమరాశివలన కలుగు దోషములు నశించును. క్రూరగ్రహములచే  చూడబడిననూ, కూడబడియున్ననూ, ద్విస్వభావము కలదైనను కోగ్యభంగమును కలిగించును. స్థిరోదయమున యానము పనికిరాదు. శుభగ్రహములు కలిసియున్ననూ, చూపు కలిగియున్ననూ ఇదియే ఫలితము. అంత్యనక్షత్రము నుండి అయిదు నక్షత్రములలోతృణకొష్ట్ర సంగ్రహము, దక్షిణ దిగ్గమనము, శయ్య, గృహరక్షణను చేయరాదు. జన్మోదయమున, జన్మనక్షత్రమున, ఈ రెంటి అధిపతుల రాశిలో నక్షత్రములో కాని ఆరేంటీవలన, ఆరెంటిలో సూర్యుడు ఇంద్రుడున్నపుడు యాత్ర చేసినవారి శత్రువు మరణించును. కీర్ణోదయము లగగతమైనపుడు, దిగ్లగ్నము లగ్నగతమైనపుడు కొని శుభవర్గము లగ్నమైనపుడు కొని యాత్రచేయువారి శత్రువులు నశింతురు. శత్రు జన్మోదయమున జన్మరాశికి నిధనోదయమైనపుడు ఈ రెంటీ అధిపతులుండురాశిలో యాత్రచేయువారి శత్రువులు నశింతురు. మీనలగ్నమున వక్రమార్గమున్నపుడు యాత్రచేయువానికి మీనోంశలో నున్ననూ కుంభలగ్నము, కుంభాంశము యాత్రకు నింద్యములగును. జలయోనికి జలలగ్నము, జలాంశము శుభావహము. ధన్వికోశము మూర్తి వాహనము మంత్ర సంజ్ఞకమగును. - శత్రుమార్గము - వారి ఆయువు మనోవ్యాపార సంజ్ఞను పొందును. ఉదయము నుండి ప్రాప్తి అప్రాప్తియని ద్వాదశ భావములుండును. క్రూరములు ఆప్తి మార్గమును నశింపచేయును. సూర్యుడు కుజుడు భావములను నశింపచేయును. శుభగ్రహములు వ్యాపొరహానిని చేయజాలరు.

శుక్రోస్తం చ న పుష్ణాతి మూర్తిం మృత్యుం చ చంధ్రమాః

యామ్యదిగ్గమనం త్యక్త్వా సర్వకాషాసు యాయినామ్

 అభిజితణయోగ్య మభీష్టఫల సిద్ధిదః

పంచాంగశుద్ధిరహితే దివ సేపి ఫలప్రదః

 యాత్రాయోగా విచిత్రాస్తాన్యోగాన్వక్ష్యే యత స్తతః

 ఫలసిద్ధి ర్యాగలగ్నాత్ రాజ్ఞాం విప్రస్య ధీష్ణ్యతః

 ముహూర్తశక్తితోన్యేషాం శకునై స్రష్కరస్య చ

కేంద్రత్రికోణే- హ్యే కేన యోగ శ్శుక్రజ్ఞ సూరిణామ్

 అధియోగో భవేద్దాభ్యాం త్రిభిర్యోగాధియోగకః

 యోగేపి యాయినాం క్షేమం ఆధియోగే జయో భవేత్

 యోగాధియోగే క్షేమం చ విజయార్థ విభూతయః

 వ్యాపార శత్రుమూర్తి ఫై శ్చన్దమందదివాకరైః

 రణే గతస్య భూపస్య జయలక్ష్మీః ప్రమాణికా

 శుక్రార్క జ్ఞారి భౌమేషు లగ్నాధ్వస్తత్రి శత్రుఘు

 గతసాగే వైరి చమూ ర్వహ్నౌ లాకేవ లీయతే

లగ్న ప్లే త్రిదశాచార్యే ధనాయ స్థిః పరగ్ర హైః

 గతస్య రాజోరి సేనా నీయతే యనమందిరమ్

 లగ్నే శుకే రనౌలాభే చంద్రే బంధు స్థితే యదా

 గతో నృపో రిపూనని కేసరీవేభసంపతిమ్

 స్వోచ్చపం ప్లే తేలగ్నే స్వోచ్చే చంద్రే చ లాభగే

 హంతి యాత్రి ప్పతనాం కేశవః పూతనామివ

 త్రికోణే కేంద్రగా సౌమ్యాః క్రూరాస్ర్యయారిగా యది

 యస్య యాతేరలక్ష్మీస్తము పైతీవాభిసారికా

జీవార్క చంద్రాలగ్నారి రంధ్రగా యది గచ్ఛతః

 తస్యాగ్రే బలమైత్రీవన స్థిరా రిపువాహినీ

 త్రిషడాయేషు మందారౌ బలవంత శ్శుభా యది

 యాత్రాయా భూపతేస్తస్య హస్తస్థా శత్రుమేదినీ

 స్వోచ్చస్థే లగ్నగే జీవే చంద్రే లాభగతే యది

గతో రాజా రిపూణని పినాకీ త్రిపురం యథా

 మస్తకదయగే శుక్రే లగ్నస్థే లాభ గురౌ

గతో రాజా రిపూన్లంతి కుమారస్తారకం యథా

 జీవే లగ్నగతే శుక్రీ కేంద్ర వాపి త్రికోణ గే

గతో దహత్యరీస్రజా కృష్ణవర్ష్మా యథా వనమ్

 లగ్న జై శుభే కేంద్రో ధిఘ్యేచోపకులే గతః

 నృపాశ్శుష్యన్త్యరీఛీ ష్మే హోదినీం వార్కరశ్మయః

శుభే త్రికోణే కేన్త స్థ లాభే చంద్రోథవా రనౌ

 శత్రూణంతి గతో రాజా హ్యంధకారం యథా రవిః

 పక్షేత్రగే శుభే కేన్డే త్రికోణాయగతే గతః

 వినాశయత్యరీర్రాజా తూలరాశి మివానలః

 ఇందౌ స్వస్థే గురౌ కేంద్ర మంత్రసప్రణవో గతః

 నృపో హస్తి రీపూన్సర్వా నాపాన్పంచాక్షరో యథా

 వర్గోత్తమ గతే శుక్రే ప్యేకస్మి న్నేవ లగ్న గే

 హరిస్మృతి ర్య థాఘోఘా న్తస్తి శత్రూన్డతో నృపః

 శుభే కేశౌ త్రికోణే చంద్ర వర్గోత్తమే గతః

 స గోత్రారీన్నపాన్తంతి యథా గోత్రాంశ్చ గోత్రభిత్

 మిత్రభేథ గురౌ కేంద్రే త్రికోణ స్థేథవా సితే

శత్రూన్లని గతో రాజా భుజంగాన్గరుడోయథా

 శుభకేంద్ర త్రికోణస్థే వర్గోత్తమగతే గతః

 వినాశయత్యరీర్రాజా పాపానాగీరధీయథా

 యే నృపా యాన్త్యరీన్హేతుం తేషాం యోగైరృపాహ్వయైః

 ఉపైతి శాంతిం కోపాగ్ని శ్శత్రుయోషాశ్రబిందుభిః

బలక్షయ పక్షదశమీ మా సేషు విజయాభిధా

విజయస్తత్ర యాతృణాం సంధిర్వా న పరాజయః

నిమిత్తశకువాదిభ్యః ప్రధానం హి మనోదయః

 తస్మాత్మనస్వినాం యత్నాత్ ఫల హేతు ర్మహోదయః

ఉత్సవోపనయోద్వాహ ప్రతిష్టాశౌచసూత కే

అసమాప్తే న కుర్వీత యాత్రాం మర్త్యోజి జీవిషకి

 మహిషోందురయోర్యుద్ధీ కలత్ర కలిహార్త వే

వస్త్రాదే సలిలే క్రోధో దురుస్తే న ప్రజేన్నృపః

ఘృతాన్నం తిలపిష్టాన్నం మత్యాన్నం ఘృత పాయసం

ప్రాగాది క్రమశో భుక్త్వా యాతి రాజా జయత్యరీన్

సజ్జికా పరమాన్నం చ కొంజికం చ పయోదధి

 క్షీరం తిలోదనం భుక్త్వా భానువారాదిషు క్రమాత్

 కుల్మాషాంశ్చ తిలాన్నం చ దధిక్రౌద్రం ఘృతం పయః

 మృగమాంసం చ తత్సారం పాయసం చ ఖగం మృగమ్

 శశ మాంసం చ షాక్యం ప్రియంగుకమపూపకమ్

చిత్రాండజఫలం కూర్మ శ్వావిద్రోధాంశ్చ శాశ్వకమ్

 హవిష్యం కృశరాన్నం చ ముద్గాన్నం యవపిష్టికమ్

 మత్యాన్నం చ విచిత్రాన్నం దధ్యన్నంద ప్రభాతమాత్

 భుక్త్వా రాజే భాశ్వరథ నరైర్యాతి జయత్యరీన్

హుతాశనం తిలైర్జుత్వా పూజయేత దిగీశ్వరమ్

 ప్రణమ్య దేవభూదేవా నాశీర్వాదైర్న్పపో ప్రజేత్

 యద్వర్ణవస్త్ర గంధాదేస్తన్మంత్రేణ విధానతః

 ఇంద్రమైరావతారూఢం శచ్యా సహ వీరాజితమ్

 వజ్రపాణిం స్వర్ణవర్ణం దివ్యాభరణభూషితమ్

పప్తహస్తం సప్తజిహ్వం షణ్ముఖం మేషవాహనమ్

 స్వాహాప్రియం రక్తవర్ణం స్రుకువాయుధధారిణమ్

 దండాయుధం లోహితాక్షం యమం మహిషవాహనమ్

శ్యామలాసహితం రక్తవర్ణైరూర్థ్వముఖం శుభమ్

 ఖడ్గచర్మధరం నీలం విఋతిం నరవాహనమ్

ఊర్ధ్వకేశం విరూపాక్షం దీర్ఘగ్రీవాయుతం విభుమ్

 నాగపాశధరం పీతవర్ణం మకరవాహనమ్

వరుణం కాలికానాథం రత్నాభరణభూషితమ్

 ప్రాణినాం ప్రాణరూపం తం ద్విబాహుం దండపాణికమ్

 వాయుం కృష్ణమగారూఢం పూజయేదంజనీ పతిమ్

 అశ్వారూఢం కుంభపాణిం ద్విబాహుం స్వర్ణసన్నిభమ్

కుబేరం చిత్రలేఖేశం యక్షగంధర్వనాయకమ్

 పినాకినం వృషారూఢం గౌరీపతిమనుత్తమమ్

 శ్వేతవర్ణం చంద్రమౌలిం నాగయజ్ఞోపవీతినమ్

 అప్రయాణే స్వయం కార్యా ప్రేక్షయా భూభుజస్తథా

 కార్యం నిగమనం ఛత్రం ధ్వజశస్త్రాస్త్ర వాహనైః

స్వస్థానాన్నిర్గమస్థానం దండానాం చ శతం ద్వయమ్

చత్వారింశ ద్ద్వాదశైవ ప్రస్థిత స్స స్వయం గతః

దినావ్యేకత న వ పేత్ పప్తషడ్వాపరో జనః

 పంచరాత్రం చ పురతః పునర్లగ్నాంతరే వ్రజేత్

అకాలజేషు నృపతి ర్విద్యుధర్జితవృష్టిషు

ఉత్పాతేషు త్రివిధేషు సప్తరాత్రేషు న ప్రజేత్

 రత్నాకుడ్య శివాకాక కపోతానాం గీరస్తథా

భుక్ హేమ వక్షీర స్వరాణాం వామతో గతిః

 పీత కార భరద్వాజ పక్షిణాం దక్షిణా గతిః

 చాపం త్యక్త్వా చతుప్పాత్తు శుభదా వామతో మతాః

కృష్ణంత్యక్త్వా ప్రయాణే తు కృకలా సేన వీక్షితః

 వారాహశశగోధాస్తు సర్పాణాం కీర్తనం శుభమ్

 హృతేక్షణం నేష్టమేవా వ్యత్యయం కపిఋక్షయోః

 మయూర ఛాగ నకుల చాషా పారావతా శ్శుభాః

 దృష్టమాత్రేణ యాత్రాయం వ్యక్తం సర్వం ప్రవేశనే

 యాయాత్రా సిద్ధిర్భవేద్ద ష్ట శవే రోదనవర్జితే

 ప్రవేశే రోదనయుత శ్శవశ్శవప్రదస్తథా

 పతిత క్లీబజటిల మత్తవింశౌషధాదిభిః

 అభ్యక్తపాసాబ్ధచర్మాం గారా దారుణ రోగిభిః

 గుడకార్పాప లవణ రిపుప్రశ్నతృణోరగైః

 వంధ్యాకుంజక కాషాయ ముక్త కేశ బుభుక్షితైః

 ప్రయాణసమయే నగ్నై క్షృష్ట సిద్ధిర్న జాయతే

ప్రజ్వలాగ్నిన్సుతురగం నృపాపనపురాంగనాః

గంధపుష్పాక్షతచ్ఛత్ర చామరాందోలికం నృపః

 భక్ష్యేక్షుఫలమృత్నాన్న మధ్వాజ్యదధిరోదయాః

 మద్యమాంస సుధాధౌత వస్త్రశంఖవృషధ్వజాః

 పుణ్యస్త్రీపుణ్యకలశరత్నభృంగారగోద్విజాః

భేరీ మృదంగ పటహ ఘంటావీణాది నిస్స్వనాః

 వేదమంగలఘోషాస్స్యుర్యాయినాం కార్య సిద్ధిదాః

శుక్రుడు అస్తమును పోషించడు. చంద్రుడు లగ్నమును ఆరవస్థానమును చంద్రుడు పోషించడు. దక్షిణ దిక్కు తప్ప ఇతరదిక్కులకు వెళ్ళువారికి ఈ నియమము వర్తించును. అభిజిత్ క్షణయోగము సకలాభీష్టసిద్దిని కలిగించును. పంచాంగ శుద్ధిరహితముగా నున్న దివసమున కూడా అభిజిద్యోగము ఫలప్రదమగును. యాత్రాయోగములు విచిత్రములుగా నుండును. ఇపుడా యోగములను చెప్పేదను. రాజులకు యాగలగ్నము వలన, బ్రాహ్మణునికి నక్షత్రము వలన, ఇతరులకు ముహూర్త బలము వలన, చోరులకు శకునముల వలన ఫలసిద్ధికలుగను. శుక్రుడు బుధుడు బృహస్పతి ఈ ముగ్గురిలో ఒకడు కేంద్రమున కొని త్రికోణమున కాని యున్నచో యోగమనబడును. ఇద్దరున్నచో తిధి యోగమనబడును. ముగ్గురున్నచో యోగాధియోగమనబడును. యోగమున యాత్రచేయువానికి క్షేమము, తిధియోగమున చేయువానికి జయము, యోగాధియోగమున చేయువానికి క్షేమము, విజయము, ధనము, సంపదలు కలుగను. చంద్రుడు శని, సూర్యుడు 10, 6, 1 స్థానములలో నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజుకు విజయలక్ష్మి సిద్ధించును. శుక్రుడు, సూర్యుడు, బుధుడు, శని, కుజుడు లగ్న, అధ్వ, అస్త, త్రి, శత్రుస్థానములలో నున్నపుడు వెళ్ళిన రాజుముందు శత్రు సైన్యము అగ్నిలో లక్కవలె తరిగిపోవును. గురువు లగ్నమున నుండి రెండు, పదకొండు స్థానములలో ఇతరగ్రహములుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రు సైన్యమును నశింపచేయును. శుక్రుడు లగ్నమున, సూర్యుడు ఏకాదశ స్థానమున చంద్రుడు బంధుస్థానమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రు సైన్యమును సింహము ఏనుగుల గుంపును చంపునట్లు చంపును. లగ్నము స్వోచ్చమైనపుడు చంద్రుడు స్వోచ్చగతుడు, లేదా లాభగతుడైనపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు కృష్ణుడు పూతనను చంపినట్లు శత్రు సైన్యమును నశింపచేయును. శుభగ్రహములు త్రికోణ కేంద్ర గతులై, పాపగ్రహములు మూడు ఆరు పదకొండు స్థానములలో ఉన్నపుడు యుద్ధమునకు వెళ్ళినపుడు అభిసారిక వెంటపడునట్లు అపజయము కలుగను.

గురుడు, సూర్యుడు చంద్రుడు లగ్నశత్రురంధ్రస్థానములలో నుండగా యుద్దమునకు వెళ్ళిన రాజుముందు రి పు సైన్యము దుర్జనమైత్రి వలె స్థిరముగా నుండజాలదు. శని కుజులు మూడు ఆరు పదకొండు స్థానములలో నుండి బలయుతులైనపుడు యుద్దమునకు వెళ్ళిన రాజునకు శత్రు సైన్యము అధీనమగును. గురువు ఉచ్చగతునిగా లగ్నమున నున్నపుడు చంద్రుడు లాభస్థానగతుడై యుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు శంకరుడు త్రిపురాసురుని సంహరించినట్లు శత్రుసంహారమును గావించును. శుక్రుడు మస్త కోదయగతుడై గురువు లగ్నమున లేదా లాభస్థానమున నున్నపుడు యుద్దమునకు వెళ్ళిన రాజు కుమారస్వామి తారకాసురుని సంహరించినట్లు శత్రువులను సంహరించును. గురువు లగ్నమున, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమున కొని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రుడు వనమును దహించునట్లు శత్రు సైన్యమును దహింపచేయును. బుధుడు లగ్నమున నుండి, శుభగ్రహము కేంద్రమున నుండి, నక్షత్రము ఉపకులమున నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజులు వేసవికాలములో సూర్యుడు నీటి మడుగులను ఎండజేసినట్లు శత్రు సైన్యమును శుష్కింపచేయును. శుభగ్రహములు త్రికోణమునకొని కేంద్రమునకొని యుండి లాభస్థానమున చంద్రుడుకాని సూర్యుడు కొని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రోజు సూర్యుడు చీకటిని హరింపచేసినట్లు శత్రువులను హరింపచేయును. శుభగ్రహము స్వక్షేత్రమునకాని, కేంద్రమున కాని, త్రికోణలాభస్థానములలో కాని యున్నపుడు యుద్దమునకు వెళ్ళిన రాజు అగ్నిహోత్రము దూదిని నశింపచేసినట్లు శత్రు సైన్యమును నశింపచేయును. చంద్రుడు స్వస్థానమున, గరువు కేంద్రమున నున్నపుడు యుద్ధమునకు వెళ్ళిన రాజు పంచాక్షరీ మంత్రము పాపములను హరింపచేయునట్లు శత్రువులను హరింపచేయును. శుక్రుడు వర్గోత్తమగతుడై, ఒక గ్రహము లగ్నములో నుండగా యుద్ధమునకు వెళ్ళిన రాజు హరిస్మరణము పాపములను నశింపచేయునట్లు శత్రు సైన్యమును నశింపచేయును. శుభగ్రహము కేంద్రమున కాని త్రికోణమున గాని యుండి చంద్రుడు వర్గోత్తమున నున్నపుడు యుద్ధమునకు బయలుదేరిన రాజు ఇంద్రుడు పర్వతములను కూల్చినట్లు శత్రువులను కూల్చును, గురువు మిత్రరాశిగతుడై, శుక్రుడు కేంద్రమున కాని త్రికోణమున కొని యున్నపుడు యుద్ధమునకు వెళ్ళినరొజు గరుడుడు సర్పములను సంహరించునట్లు శత్రువులను సంహరించును. శుభగ్రహము కేంద్రత్రికోణ స్థానగతుడై వరత్తమమున నుండగా యుద్ధమునకు వెళ్ళినరాజు గంగ పొపములను హరించునట్లు శత్రువులను హరించును. ఇట్లు రాజులు రాజయోగములలో శత్రుసంహారమునకు వెళ్ళినచో వారికోపాగ్ని శత్రుస్త్రీల కన్నీటిచే శాంతించును. బలక్షయపక్షదశమి మాసములలో విజయయనబడును. ఈ విజయయోగమున యుద్దమునకు వెళ్ళిన రాజునకు విజయము కాని శత్రువులతో సంధికాని జరుగును. పరాజయము మాత్రము సంభవించదు. నిమిత్తశకునాదుల వలన ముఖ్యమగు మనోదయము కలుగును. కావున బుద్ధిమంతులు ప్రయత్నముచే ఫల సిద్ధిని కలిగించు మనోదయమును సాధించేదరు. ఉత్సవము, ఉపనయనము, వివాహము, ప్రతిష్టా ఆశౌచము, సూతకము ముగియకుండగా బ్రతుకగోరువాడు యాత్రకు బయలుదేర కూడదు. మహిషములన యుద్ధసమయమున, కళత్రకలహమున, కలత్రఋతు సమయమున, కట్టుకున్న వస్త్రము జారినపుడు.  కోపమున్నపుడు, దుర్భాషలాడుచున్నపుడు రాజు యుద్ధమునకు బయలుదేరగొదు. నేతి అన్నమును, తిలపిష్టాన్నమును, మత్స్యాన్నమును, నేతిపాయసమును, తూర్పు మొదలగు దిక్కులలో వరుసగా భుజించి యుద్ధమునకు వెళ్ళిన రాజు శత్రువులను జయించును. సజ్జికను పరమాన్నమును, . కొంజికమును, నీరు, పెరుగు, పాలు, తిలాన్నమును, ఆదివారము నుండి ఏడువారములలో క్రమము ననుసరించి భుజించవలయును. ఉలువలు, తిలాన్నము, పెరుగు, తేనె, నెయ్యి, పాలు, మృగమాంసము, దానిసారము, పాయసము, పక్షి, మృగము కుందేటి మాంసము, పౌష్టిక్యము, ప్రియంగు అపూపములు, చిత్రాండజఫలము, కూర్మము, ఏదు, - ఉడుము, శాశ్వకము, హవిస్సు, కృపరాన్నము, పెసరపప్పు కలిపిన అన్నము, యవ పిష్టము . మత్యాన్నము, విచిత్రాన్నము, పెరుగన్నము వీటిని అశ్వినీ నక్షత్రము నుండి ఇరువది ఏడు నక్షత్రములలో వరుసలో తిని రాజు రధ గజాశ్వపాదాలు దళములను తీసుకొని యుద్ధమునకు వెళ్ళినచో శత్రువులను జయించగలుగును. అగ్నిహోత్రుని నువ్వులతో హోమముగావించి, దిక్పాలకులను పూజించి దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరించి, వారి ఆశీర్వాదమును పొంది యుద్ధమునకు వెళ్ళవలయును. యేయే దేవతలకు ఏయే వర్ణము గల వస్త్రములు గంధాదులచే, ఆయా మంత్రములచే యథావిధిగా పూజించవలయును. వజ్రాయుధమును ధరించి స్వర్ణవర్ణము కలిగి శచీదేవితో విరాజిల్లుచు, ఐరావతమునధిరోహించియున్న ఇంద్రుని, సప్తహస్తుడు, సప్తజిహ్వడు, షణ్ముఖుడు, మేషవాహనుడు; - స్వాహాప్రియుడు, రక్తవర్ణుడు, స్రుకువాయుధుడు అగు అని, దండాయుధుడు, లోహితాకుడు, మహిషవాహనుడు, శ్యామలాసహితుడు, రక్తవర్ణములచే ఊర్ధ్వముఖుడు, శుభకరుడగు యముని, ఖడ్గచర్మధరుడు, నీలుడు, నరవాహుడు ఊర్ధ్వకేశుడు, విరూపాకుడు, దీర్ఘగ్రీవుడు, ప్రభువు అయిన నిబతిని, నాగపాశధరుడు, పీతవర్ణుడు, మకరవాహనుడు, కాలికానాథుడు, రత్నాభరణభూషితుడు అగు వరుణుని, ప్రాణుల ప్రాణరూపమగువాడు, ద్విబాహువు, దండపాణి, కృష్ణమృగారూడుడు, అంజనీపతియగు వాయువును పూజించవలయును. అశ్వారూఢుడు కుంభపాణి, ద్విబాహువు, స్వర్ణవర్ణుడు, చిత్రలేఖేశుడు, యక్షగంధర్వ' నాయకుడు అగుకుబేరుని, పినాకి, వృషారూఢుడు, గౌరీపతి, సర్వోత్తముడు, శ్వేతవర్ణుడు, చంద్రమౌళి, నాగయజ్ఞోపవీతుడు, అగు శంకరుని యాత్రకు బయలు దేరు రాజులు స్వయముగా పూజించవలయును. ఛత్రధ్వజశస్త్రాస్త్రవాహనములచే నిగమనమును చేయవలయును. తమస్థానము నుండి నిర్గమ స్థానము రెండు వందల దండప్రమాణ దూరముండవలయును. బయలు దేరిన వాడు నలుబది కాని పన్నెండు కాని వెళ్ళవలయును. ఆరేడు దీనములు ఒకే చోట యుండరాదు. అయిదు దినములకన్నొ ఎక్కువవున్నచో మరల శుభలగ్నమును చూచుకొని బయలు దేరవలయును. అకాలమున మెరుపులు ఉరుములు వర్ణములు సంభవించినచో భౌమదివ్యాకోశ ఉత్పాతములు సంభవించినచో ఏడు దినములు బయలు దేరరాదు. రత్న కుడ్యముల, జంబుకముల 'కాకుల, కపోతముల అరుపులు వినినచో వామగతి, పీత, కొరభరధ్వాజ పక్షుల దక్షిణగతి చోపమును వదలి చతుష్పాత్తు వామభాగమున వెళ్ళినచో శుభప్రదము; కృష్ణ వర్ణమును వదిలి ప్రయాణమున తొండ చూచినచో, వరాహము, కుందేలు, ఉడుము, సర్పకీర్తనము శుభము. కపి భల్లూకములు కనులు మూసుకొని వచ్చిన అరిష్టము, కొమయూర, మేషము ముంగిస, పిట్ట, పావురములు శుభములు, యాత్రలో చూచిన శుభము. ప్రవేశమున చూచినచో వ్యత్యయము జరుగును.

రోదన వర్జితమైన శవమును చూచినచో యాత్రా సిద్ధి కలుగును. ప్రవేశసమయమున రోదన సహీత మగు శవము శవప్రదము, పతితులు, నపుంసకులు, జటిలులు, మత్తులు, వాంతము, ఔషధాదులు, తలస్నానమును చేసినవారు, వస్త్రములు, ఎముకలు, చర్మము, అంగారములు, దొరుణరోగులు, గుడము పత్తి లవణము, శత్రువులు ప్రశ్నలు, తృణము, సర్పములు, గోత్రాలు, కుంజము, కషాయధారులు, వెంట్రుకలు విరబోసుకొనినవారు ఆకలి గొన్నవారు నగ్నులు ప్రయాణసమయమున చూడబడినచో కార్య సిద్ధి జరుగును. మండుచున్న అగ్నిఉత్తమాశ్వములు, సింహాసనము, పౌరస్త్రీలు, గంధపుష్పాక్షతములు, ఛత్రచామర ఆందోళికలు, భక్ష్యములు, ఇక్టువు, ఫలములు, మత్సాన్నము, మధువు, ఆజ్యము, దధి గోదయము, మద్యమాంస సుధా ధౌతవస్త్ర శంఖవృషభధ్వజములు, పుణ్య స్త్రీపుణ్యకలశ రత్న భృంగార గోద్విజులు, భేరీమృదంగ పటహ ఘంటా వీణా నాదములు, వేదమంగలమౌషలు ప్రయాణసమయమున కలిగినచో కార్య సిద్ధి ప్రదాయకములు.

 ఆదౌ విరుద్ధశకునం దృష్ట్వా యా యీష్టదేవతామ్

 స్మృత్వా ద్వీతీయే విప్రాణాం కృత్వా పూజాం నివర్తయేత్

 సర్వదిక్ష క్షుతం నేష్టం గోక్షుతం నిధనప్రదమ్

అఫలం యద్బోలవృద్ధరోగి సైనాసికైః కృతమ్

పరస్త్రీ ద్విజదేవస్వం న పశేద్దిగజాశ్వకాన్

 హన్యాత్పర పుర ప్రాప్తో న ప్రీర్నిత్యం నిరాయుధాన్

ఆదౌ సౌమ్యాయనే కార్యం నవ వాస్తు ప్రవేశనమ్

విధాయ పూర్వదేవ సే వాస్తుపూజో బలిక్రియామ్

 మాఘఫాల్గునవైశాఖజ్యేష్ఠమా పేసు శోభనమ్

ప్రవేశో మధ్యమో జ్ఞేయ సౌమ్యకార్తీకమాసయోః

శశీ జ్యాంతేషు వరుణ త్వాష్టమిత్ర స్థిరోడుషు

శుభః ప్రవేశో దేవేజ్య శుక్రయోర్దశ్యమానయోః

 వ్యర్కార వారే తిథిషు రిక్షావర్జితేషు చ

దివా వా యది వా రాత్రే ప్రవేశ మంగలప్రదః

 చంద్రతారా బలో పేతే పూర్వాహ్ణే  శోభనే దినే

స్థిరలగ్నే స్థిరాం చ నైధనే శుద్ధిపంయుతే

 త్రికోణ కేంద్రపం ఫై శ్చ సౌమ్యై యారిగైః పరైః

 లగ్నాంత్యాష్టమ షష్టస్థ వర్జితేన హిమాంశునా

 కర్తుర్వా జన్మభే లగ్నే తాభ్యాముపచయేఒపి వా

ప్రవేశలగ్నే స్యాద్వృద్ధి రన్యభే శోకన్వితా

 దర్శనీయం గృహం రమ్యం వివిధైర్మంగలస్వనైకి

కృత్వార్కం వామతో విద్వా శృంగారం చాగ్రతో విశేత్

వర్షాప్రవేశే శశిని జలరాశిగతేసీ వా

 కేంద్రశే వా శుక్లపక్షే చాతివృష్టి శ్శుభేక్షితే

 అల్పవృష్టిః పాపదృష్ట ప్రావృణ్కాలే చిరాద్భవేత్

 చంద్రశ్చేద్భార్గవే సర్వమేవల విధగుణాన్వితే

 ప్రావృషీన్లు ప్సితా తృప్త రాగ శ్శుభవీక్షితః

మందాత్త్రికోణ సప్తస్థో లో యది వా వద్ధికృద్భవేత్

 సద్యో వృష్టికరశ్శుక్రో యదా బుధ సమీపగః

 తయోర్మధ్యగతే భానౌ భవేద్యృష్టి వినాశనమ్

మఘాదిపంచ ధేష్ణ్యస్థః పూర్వ స్వాతి త్రయే పరే

ప్రవర్షణం భృగుః కుర్యా ద్వీపరీతే న వర్షణమ్

 పురతః పృష్ఠతో భానో రొహా యది సమీపగోకి

తదా వృష్టిం ప్రకుర్వని న తే చేతతిలో మగాః

వామభాగ స్థిత శుక్రో వృష్టి కృచ్ఛేత్తు యామ్యగః

ఉదయా స్తేషు వృష్టి స్స్యా దానోలార్డా ప్రవేశనే

 పంధ్యయో పుస్యవృద్ధి స్యా త్సర్వసంపన్నృణాం నిశి

స్తోకవృష్టిరనర్ఘస్స్యాదవృష్టి సస్యసంపదః

 ఆర్థోదయోగ్రభిన్నాచేద్భవే తి న సంశయః

చంద్రే జ్యేక్షేధ వా శుకే కేంద్ర వృష్టి ర్వినశ్యతి

 పూర్వాషాఢంగతో భానుర్జీమూతైః పరివేష్టితః

 వర్షత్యార్షాది మూలాంతం ప్రత్యక్షం ప్రత్యహం తథా

 వృష్టి శ్చేత్నౌష్ణభే తస్మాద్దశరేషు న వర్షతి

పింహే భిన్నే కుజో వృష్టి రభిన్నె కర్కటే తథా

 కన్యోదయే ప్రభిన్నే చే పర్వదా వృష్టిరుత్తమా

 అహిర్చుబధ్యం పూర్వసస్యం పరసస్యా చ రేవతీ

 భరణీ సర్వపస్యా చ సర్వనాశాయ చాశ్వినీ

 గురోప్సప్తమరాకిస్థః ప్రత్యక్షో భృగుజోయదా

 తదాతివర్షిణం భూరి ప్రావ్యట్కోలే బలోత్తైతే

ఆపస్తమర శశినః పరివేషగతోత్తరా

 విద్యుతపూర్ణమండుకా ప్వనావృష్టి ర్భవేత్తదా

 యదా ప్రత్యజ్ నతా మేఘా ఖపప్రోపరిసంస్థితాః

 సతంతి దక్షిణస్థాయే భవేద్వృష్టి ఇదొచిరాత్

నఖైర్లిఖనో మార్జారా శ్చావనిం లోహపంయుతే

 రధ్యాయాం పేతుబంధాస్స్యు బాలానాం వృష్టి హేతవః

 పిపీలికా శ్రేణయశ్ఛిన్నాః ఖద్యోతా బహవస్తదా

ద్రుమాది రోహపురాణాల ప్రీతిర్దుర్వృష్టి సూచకాః

ఉదయాస్తమయ కాలే వివర్ణోర్కోథవా శశీ

మధువర్ణోతి వాయుశ్చేదతివృష్టి ర్భవేత్తదా

ప్రయాణము చేయువాడు. మొదట విరుద్ధశకునములను చూచినచో ఇష్టదేవతాస్మ రణమును. చేయవలయును. ద్వితీయమున చూచినచో బ్రాహ్మణ పూజను చేయవలయును. తుమ్ము ఏ దిక్కు నుండి వినవచ్చినను శుభము కొదు. గోవు తుమ్మినచో మృత్యుప్రదము. బాలులు, వృద్ధులు, రోగులు, పిసునొరులు తుమ్మినచో ఫలభంగము జరుగును. పరస్త్రీలను బ్రాహ్మణ దేవధనమును స్పృశించరాదు. శత్రుపురమును ప్రవేశించి నిరాయుధులను స్త్రీలను తప్ప గజాశ్వయోధులను సంహరించవచ్చును. నూతనగృహ ప్రవేశమును ఉత్తరాయణమున చేయవలయును. మొదటిరోజు వాస్తు పూజను, బలిక్రియలను చేయవలయును. మాఘ ఫొల్లున వైశాఖ జ్యేష్ట మాసములు శుభప్రదములు. సౌమ్య కార్తీకమాసములు గృహప్రవేశమునకు మధ్యమములు. జ్యేష్ట, పుష్యమి, రేవతి, శతభిష, చిత్త, అనూరాధ, స్థిరనక్షత్రములలో ప్రవేశము శుభప్రదము. గురుశుక్రులు కనపడుచున్నపుడు ప్రవేశము చేయవలయును. ఆది మంగళవారములు తప్ప ఇతరవారములలో రక్త అమాభిన్న తిధులలో పగలు కాని రాత్రికాని ప్రవేశము శుభప్రదము. చంద్రతారాబలములున్న శుభదినమున పూర్వాహ్లామున, స్థిరలగ్నమున స్థిరాంశమున సప్తమశుద్ది యున్నపుడు, శుభగ్రహములు కేంద్రత్రికోణ గతులైనపుడు ఇతర గ్రహములు 3, 11, 6 స్థానములలో ఉన్నపుడు, చంద్రుడు లగ్నమున, ద్వాదశమున, అష్టమ షష్ఠ స్థానములలో లేనపుడు కర్తకు జన్మ రాశి లగ్న మైనపుడు, ఆరెండు వృద్ధిలో యున్నపుడు ప్రవేశలగ్నమైనచో వృద్ధి కలుగును. ఇతర లగ్నమున  దుఃఖదారిద్ర్యములు కలుగును. వివిధ మంగల వాద్యములచే గృహమును సుందరముగా అలంకరించవలయును. సూర్యుని వామభాగమున' నుంచి, భృంగారమును . ముందుంచుకొని చంద్రుడు వర్గాప్రవేశమున, జలరాశి గతుడైనపుడు కేంద్రమున నున్నపుడు, శుక్ల పక్షమున అయినచో శుభగ్రహవీక్షణమున్నచో అతివృష్టి కలుగును. వర్షకాలమున పాపదృష్టి యున్నచో అల్పవృష్టి కలుగును. చంద్రుడు శుక్రునితో కలిసియుండి ఇతర గుణములన్నియూ ఇట్లే యున్నచో, వర్షకాలమున చంద్రుడు శుక్రుడున్న రాశినుండి సప్తమస్థానమున నున్నచో శుభదృష్టి ఉండగా, శని నుండి త్రికోణమున కాని సప్తమస్థానమున కాని ఉన్నచో, వృద్ధికారకుడగుచో, శుక్రుడు. బుధసమీపవర్తి అయినచో సద్యోవృష్టిప్రదుడగును. బుధశుక్రుల మధ్యన సూర్యుడున్నచో వృష్టినాశమేర్పడును. శుక్రుడు మఘాది పంచకమున నున్నను, స్వాతిత్రయమున నున్ననూ విపరీత వృష్టిని, అతివృష్టిని కలిగించును. సూర్యునికి ముందుకొని వెనుక కొని గ్రహములు సమీపమున నున్న చో ప్రతిలోమగతి లేనపుడు వర్షమును కురిపింతురు. వామ భాగమున నున్న శుక్రుడు దక్షిణదిశగా వెళ్ళుచున్నపుడు వృష్టికారకుడగును. ఉదయాస్తమయములలో సూర్యుడు ఆర్దా ప్రవేశమును చేసినచో వృష్టి కలుగును. సంధ్యాసమయమున ఆర్గాప్రవేశమైనచో సస్యవృద్ధియగును. రాత్రి ప్రవేశించినచో నరులకు సర్వసంపదలు కలుగును. కొద్దిగా వర్షించును. ధరలు పెరుగును. ఆర్థోదయము ఉన్న భిన్నమయినచో అవృష్టి సస్యసంపదలు కలుగును. చంద్రుడుకాని, గురువుకాని, బుధుడుకాని, శుక్రుడుకాని కేంద్రగతుడగుచో వృష్టినాశము కలుగును. సూర్యుడు పూర్వాషాఢలో చేరినపుడు మేఘ పరివేష్టితుడై ఆర్ద్రనుండి మూలా నక్షత్రము వరకు ప్రతిదినము ప్రత్యక్షముగా వర్షమును కలిగించును. రేవతిలో నుండగా వర్షము కురియును. పదినక్షత్రములలో వృష్టియుండదు. సింహమున కుజుడు ఖిన్నుడైనచో వర్షము కురియును. కర్కటమున ఖిన్నుడు కానున్న కురియును. కన్యోదయమున ప్రభిన్నమగుచో సర్వకాలవృష్టి యుండును. ఉత్తరాభాద్రలో పూర్వసస్యము, రేవతిలో పరసస్యము, భరణిలో సర్వసస్యములు వృద్దిచెందును. అశ్వినిలో సస్యనాశమేర్పడును. శుక్రుడు గురువునకు సప్తమరాశిలో నుండి ప్రత్యక్ గమనమును చేసినచో ప్రావృట్కాల బలము లేకున్ననూ అతివృష్టి మిన్నగా కలుగును. చంద్రుడు ఏడవనక్షత్రము వరకు పరివేషగతుడగుచో మెరుపులు ఉరుములు కలిగి అనావృష్టి కలుగును. మేఘములు పశ్చిమ భాగమున వంగి ఖసప్తకమునకు ఉపరిభాగమున నున్నచో, దక్షిణస్థములుగా పతనమగుచో త్వరలో వర్షించును. లోహసంయుతమున మార్జారములు గోళ్ళతో భూమిని గీయునపుడు, నడుచుదారిలో సేతువు కట్టవలసినంత వర్షమేర్పడును. చీమలు బారు విడినపుడు ఎక్కువ మిడుతలున్నపుడు, సర్పములు చెట్లక్కునపుడు దుర్వృష్టి కలుగును. ఉదయాస్తమయకాలమున చంద్రుడుకాని సూర్యుడుకొని వివర్ణుడైనచో వాయువు, అతివర్షము సంభవించును.

ప్రాజ్ముఖస్య తు కూర్మప్య నవాంగేషు ధరాభిమామ్

 విభజ్య నవధా ఖండే మండలాని ప్రదక్షిణమ్

అంతర్వేదా శ్చపాంచాల ప్త ప్యేదం నాభిమండలమ్

 ప్రాచ్యామాగధలాటోత్తా దేశాస్తన్ముఖ మండలమ్

శ్రీ కలింగ కిరాతాఖ్యా దేశాస్తద్బోహుమండలమ్

 అవన్త ద్రవిడా భిల్లా దేశాస్తత్పార్శ్వ మండలమ్

 సింధుకాని మహారాష్ట్ర సౌరాష్ట్రాః పుచ్ఛమండలమ్

 పులివ్ల చీన యవన గుర్షరాః పాదమండలమ్

 కురు కాశ్మీర మాడ్రేయ మత్స్యాస్తత్పార్శ్వ మండలమ్

 ఖసాంగ బంగబాహ్లిక కాంభోజాః పాణి నుండలమ్

కృత్తికాదీని ధిష్ణ్యాని త్రీణి త్రీణి క్రమాన్న్య పేత్

 సౌభ్యాదిషు నవాంగేషు పా పైర్దుష్టం శుభైశ్శుభమ్

దేవతా యత్రా నృత్యంతి పతంతి ప్రజ్వలంతి చ

ముహూ రుదంతి గౌయక్తి ప్రప్విద్యంతి హసన్స్ చ

 వమంత్యగ్నిం తథా ధూమం స్నేహం రక్తం పయోజలమ్

అధోముఖాథితిష్ఠన్తి స్థానాల్డానం ప్రజని చ

 ఏవమాద్యా హి దృశ్యస్తే వికారాః ప్రతిమాపు

గంధర్వనగరం చైవ దీవానక్షత్రదర్శనమ్

మహూల్కాపతనం కొష్ఠతృణరక్తప్రవర్షణమ్

 గాంధర్వం గేహదిగ్గూనం భూమికంపం ధివా నిశి

 అనగ్నౌ చప్పులింగాశ్చ జ్వలనం చ వినేన్దనమ్

 నిశీస్ట్రచాపమండూకం శిఖరే శ్వేతవాయసః

 దృశ్యంతే విస్ఫులింగాశ్చ గోగజాశ్వోష్ట గోత్రతః

 జంతవో ద్విత్రిశిరసో జాయంతే వాపి యోనిషు

 ప్రాతస్సూర్యశ్చతసృషు హ్యర్థితా యుగపద్రవే

జంబూకగ్రామసంవాసః కేతూనాం చ ప్రదర్శనమ్

కోకానామాకులం రాత్రా కపోతానాం దివా యది

 అకాలే పుష్పితా వృక్షా దృశ్యంతే ఫలితా యది

 కార్యం తచ్ఛేదనం తత్ర తతశ్శాంతి ర్మనీషిభిః

 ఏవమాద్యా మహోత్పాతా బహవస్థాననాశదాః

కేచిన్మృత్యుప్రదాః కేచిచ్ఛత్రుభ్యశ్చ భయప్రదాః

మధ్యాద్భయం యశో మృత్యుః క్షయః కీర్తి స్సుఖాసుఖమ్

ఐశ్వర్యం ధనహావిశ్చ మధుచ్ఛన్నం చ వాల్మి కమ్

ఇత్యాదిషు చ పర్వేషత్పాతేషు ద్వీజసత్తను

 శాంతిం కుర్యాతయత్నేన కల్పోక్తవిధినా శుభమ్

 ఇత్యేతత్కథితం విప్ర జ్యోతిషం తే సమాసతః

 అతః పరం ప్రవక్ష్యామి ఛన్దశ్శాస్త్ర మనుత్తమమ్

 ఇతి శ్రీబృహన్నారదీయపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితియపాదే షట్పంచాశత్తమోధ్యాయః

తూర్పుముఖముగా నున్న కూర్మము యొక్క ననొంగముల యందు ఈ భూమిని నవఖండములుగా విభజించి మండలములుగా ఏర్పరిచిరి. అంతర్వేదములు పొంచోలములు ఆ కూర్మమునకు నొభిమండలము. ప్రాచ్యమాగధ లౌటదేశములు కూర్మమునకు ముఖమండలము. స్త్రీ కలింగ కిరాతదేశములు బాహుమండలము. ssఅవÁద్రవిడ భిల్లదేశములు ఒక పొర్శ్వమండలము. సింధు, కాళి, మహారాష్ట్ర, సౌరాష్ట్రములు పుచ్ఛమండలము. పులిన్ద, చీన, యవన, గుర్జరదేశములు పొదనుండలములు. కురుకాశ్మీర, మాదేయ మత్స్యదేశములు రెండవపొర్శ్వమండలము. ఖసాంగ, బంగ బాప్తీక కొంభోజదేశములు పొణీమండలము. ఇట్లు నాభి మొదలు కొని యున్న నవాంగములలో ఒక్కొక్క అవయవమునందు కృత్తికనుండి మూడు మూడు నక్షత్రముల నుంచవలయును. ఈ కూర్మొగములందే దేవతలు నృత్యమును చేతురు. పడుదురు. జ్వలించుచుందురు. మాటిమాటికి రోదనము చేతను గొనము చేతరు స్వేదమును కలిగియుందరు నవ్వుదురు నిప్పులను కక్కుచుందురు ధూమమును కక్కుచుందురు. స్నేహమును, రక్తమును, పొలను, నీటిని కక్కుచుందురు అధోముఖులుగా నుందురు. ఒకస్థానము నుండి మరియొక స్థానమునకు వెళ్ళేదరు. ఇటువంటి వికారములు దేవతాప్రతిమలలో కూడా కనిపించుచుండును. గంధర్వనగరమును, పగలు నక్షత్రములను చూచుట, నుహోల్కాపతనము, కాష, తృణ, రక్తముల వర్షము, గాంధర్వము, దేహదిగ్గూమము ధాత్రీపగలు భూమికంపము అగ్ని లేనపుడు కూడా నిప్పురవ్వలు కలుగుట, కట్టలు లేకుండా అగ్నిమండుట, రాత్రి ఇస్త్రచోపము కనపడుట, శిఖరములందు తెల్లకాకులు కనపడుట, గో, గజ, అశ్వ, ఉష్ట్రముల శరీరముల నుండి స్పులింగములు వచ్చుట, రెండు, మూడు తలలు కల జంతువులు పుట్టుట, ప్రాతఃకొల సూర్యుడు నాలుగు దిక్కుల నుండి ఒకేసారి కనపడుట, నక్కలు ఊరిలో ఉండుట, ఆకాశమున కేతువులు కనపడుట, రాత్రిపూట కొకుల కలకలము, పగలు పావురముల కలకలము, ఆకొలమున పూచిన పండిన చెట్లు కనపడుట, ఇవియన్నియు మహూత్పాత సూచకములు. కావున బుద్ధిమంతులు అలమున కనపడిన పూలను పండ్లను వెంటనే కోయవలయును. ఈ ఉత్పాతములు నొశసూచకములు కొన్నిమృత్యుప్రదములు. కొన్ని శత్రువుల వలన భయమును కలిగించునవి. మధ్య నుండి అయినచో భయము, యశస్సు మృత్యువు, క్షయము, కీర్తి, సుఖము, దుఃఖము, ఐశ్వర్యము, ధనహాని ఈ ఫలములు: పుట్టను తేనె కప్పియున్నచో కలుగును. కావున ఈ అన్ని ఉత్పాతముల విషయమున కల్పోక్త వీధిచే ప్రయత్నముతో శాంతిని జరుపవలయును. ఓ బ్రాహ్మణోత్తమా ! నీకు ఇట్లు సంగ్రహముగా జ్యోతిషాంగమును బోధించితిని. ఇక ఇపుడు సాటిలేని మహిమగల ఛందశ్శాస్త్రమును చెప్పెదను.

ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున యాబదియారవ అధ్యాయము సమాప్తము.