38 - విష్ణుమాహాత్మ్యమ్

నారద ఉవాచ :-

కిం తత్ స్తోత్రం మహాభాగ కథం తుష్టో జనార్దనః

ఉత్తంకః పుణ్యపురుషః కీదృశం లబ్ధవాన్వరమ్

నారదమహర్షి పలికెను :- ఓ మహానుభావా ! పుణ్యపురుషుడగు ఉత్తంకమహర్షి చేసిన స్తోత్రమేది ? శ్రీహరి ఎట్లు సంతోషించెను ? ఏ వరమును పొందెను ?

సనక ఉవాచ :-

ఉత్తంకస్తు తదా విప్రో హరిధ్యానపరాయణః

పాదోదకస్య మాహాత్మ్యం దృష్ట్వా తుష్టావ భక్తితః

సనక మహర్షి పలికెను :- హరిధ్యానపరాయణుడగు బ్రాహ్మణోత్తముడగు ఉత్తంకుడు శ్రీహరిపాదోదక మాహాత్మ్యమును చూచి భక్తిచే స్తోత్రము చేసెను.

ఉత్తంక ఉవాచ :-

నతోఽస్మి నారాయణమాదిదేవం జగన్నివాసం జగదేకబంధమ్

చక్రాబ్జశార్జా సిధరం మహాంతం స్మృతార్తినిఘ్నం శరణం ప్రపద్యే

యన్నాభిజాబ్జప్రభవో విధాతా సృజత్యముం లోకసముచ్చయం చ

యత్క్రోధజో హన్తి జగచ్చ రుద్రస్తమాదిదేవం ప్రణతోఽస్మి విష్ణుమ్

పద్మాపతిం పద్మదళాయతాక్షం విచిత్రవీర్యం నిఖిలైక హేతుమ్

వేదాంతవేద్యం పురుషం పురాణం తేజోనిధిం విష్ణుమహం ప్రపన్నః

ఆత్మాక్షర స్సర్వగతోఽచ్యుతాభ్యో జ్ఞానాత్మకో జ్ఞానవిదాం శరణ్యః

జ్ఞానైకవేద్యో భగవాననాదిః ప్రసీదతాం వ్యష్టి సమష్టిరూపః

అనన్తవీర్యో గుణజాతిహీనో గుణాత్మకో జ్ఞానవిదాం వరిష్ణ

నిత్యః ప్రపన్నార్తి హరః పరాత్మా దయాంబుధిర్మే వరదస్తు భూయాత్

యస్థూలసూక్ష్మాదివి శేషభేదైర్జగద్యథావత్స్వకృతం ప్రవిష్టః

నిత్యః ప్రపన్నార్తిహరః పరాత్మా దయాంబుధిర్మే వరదస్తు భూయాత్

అగోచరం యత్తవ శుద్దరూపం మాయావిహీనం గుణజాతిహీనమ్

నిరంజనం నిర్మలమప్రమేయం పశ్యన్తి సన్తః పరమార్థసంజ్ఞమ్

ఏకేన హేమ్నైవ విభూషణాని యాతాని భేదత్వముపాధిభేదాత్

తథైవ సర్వేశ్వర ఏక ఏవ ప్రదృశ్యతే భిన్న ఇవాఖిలాత్మా

యన్మాయయా మోహితచేతనేస్తం పశ్యన్తి నాత్మానమపి ప్రసిద్ధమ్

త ఏవ మాయారహితాస్తదేవ పశ్యన్తి సర్వాత్మ కమాత్మరూపమ్

విభుం జ్యోతిరనౌపమ్యం విష్ణుసంజ్ఞం నమామ్యహమ్

సమస్త మేతదుద్భూతం యతో యత్ర ప్రతిష్ఠితమ్

యతశ్చైతన్యమాయాతం యద్రూపం తస్య వై నమః

అప్రమేయమనాధారమాధారాధేయరూపకమ్

పరమానన్దచిన్మాత్రం వాసుదేవం నతోఽస్మ్యహమ్

హృద్గుహానిలయం దేవం యోగిభిః పరి సేవితమ్

యోగానామాదిభూతం తం నమామి ప్రణవ స్థితమ్

నాదాత్మకం నాదబీజం ప్రణవాత్మకమవ్యయమ్

సద్భావం సచ్చిదానన్దం తం వందే తిగ్మ చక్రిణమ్

అజరం సాక్షిణం త్వస్య హ్యవోజ్మినసగోచరమ్

నిరంజనమనంతాఖ్యం విష్ణురూపం నతోఽస్మ్యహమ్

ఇంద్రియాణి మనోబుద్ధిస్సత్త్వం తేజో బలం ధృతిః

వాసుదేవాత్మ కాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ

విద్యావిద్యాత్మకం ప్రాహుః పరాత్పరతం తథా

అనాదినిధనం శాంతం సర్వధాతారమచ్యుతమ్

యే ప్రపన్నా మహాత్మాన స్తేషాం ముక్తార్హి శాశ్వతీ

వరం వరేణ్యం వరదం పురాణం సనాతనం సర్వగతం సమస్తమ్

నతోఽస్మి భూయోఽపి నతోఽస్మి భూయో నతోఽస్మి భూయోఽపి నతోస్మి భూయః

యత్పాదతోయం భవరోగవైద్యో యత్పాదపాంశుర్విమలత్వసిద్ద్యై

యన్నామ దుష్కర్మ నివారణాయ తమప్రమేయం పురుషం భజామి

సద్రూపం తమసద్రూపం సదసద్రూపమవ్యయమ్

తత్తద్విలక్షణం శ్రేష్ఠం శ్రేషాచ్చ్రేష్ఠతరం భజే

నిరంజనం నిరాకారం పూర్ణమాకాశమధ్యగమ్

పరం చ విద్యావిద్యాభ్యాం హ్పదంబుజనివాసినమ్

స్వప్రకాశమనిర్దేశ్యం మహతాం చ మహత్తరమ్

అణోరణీయాంసమజం సర్వోపాధివివర్జితమ్

యన్నిత్యం పరమానందం పరంబ్రహ్మ సనాతనమ్

విష్ణుసంజ్ఞం జగద్ధామ తమస్మి శరణం గతః

యం భజన్తి క్రియానిష్ఠా యం పశ్యన్తి చ యోగినః

పూజ్యాత్పూజ్యతరం శాంతం గతోఽస్మి శరణం ప్రభుమ్

యం న పశ్యన్తి విద్వాంసో య ఏతద్వ్యాప్య తిష్ఠతి

సర్వస్మాదధికం నిత్యం నతో ఽస్మి విభుమవ్యయమ్

అంతఃకరణసంయోగాత్ జీవ ఇత్యుచ్యతే చ యః

అవిద్యాకార్యరహితః పరమాత్మేతి గేయతే

సర్వాత్మకం సర్వ హేతుం సర్వకర్మఫలప్రదమ్

వరం వరేణ్యమజనం ప్రణతోఽస్మి పరాత్పరమ్

సర్వజ్ఞం సర్వగం శాంతం సర్వాంతర్యామినం హరిమ్

జ్ఞానాత్మకం జ్ఞాననిధిం జ్ఞానసంస్థం విభుం భజే

నమామ్యహం వేదనిధిం మురారిం వేదాంతవిజ్ఞానసునిశ్చితార్థమ్

సూర్యేందువత్ప్రోజ్జ్వలనేత్రమింద్రం ఖగస్వరూపం వపతిస్వరూపమ్

సర్వేశ్వరం సర్వగతం మహాంతం వేదాత్మకం వేదవిదాం వరిష్ఠమ్

తం వాజ్మనోఽచిన్త్యమనన్తశక్తిం జ్ఞానైకవేద్యం పురుషం భజామి

ఇంద్రాగ్నికాలాసురపాణవాయుసోమేశమార్తాండపురందరాద్యైః

యఃపాతి లోకాన్ పరిపూర్ణభావస్తమప్రమేయం శరణం ప్రపద్యే

సహస్రశీర్షం చ సహస్రపాదం సహస్రబాహుం చ సహస్రనేత్రమ్

సమస్తయజ్ఞైః పరిజుష్టమాద్యం నతోఽస్మి తుష్టిప్రదముగ్రవీర్యమ్

కాలాత్మ కం కాలవిభాగ హేతుం గుణత్రయాతీతమహం గుణజ్ఞమ్

గుణప్రియం కామదమస్తసంగం అతీన్ద్రియం విశ్వభుజం వితృష్ణమ్

నిరీహమగ్ర్యం మనసాప్యగమ్యం మనోమయం చాన్నమయం నిరూఢమ్

విజ్ఞానభేదం ప్రతిపన్నకల్పం న వాజ్మయం ప్రాణమయం భజామి

న యస్య రూపం న బలప్రభావో న యస్య కర్మాణి న యత్ప్రమాణమ్

జానన్తి దేవాః కమలోద్భవాద్యా స్తోష్యామ్యహం తం కథమాత్మరూపమ్

సంసారసింధౌ పతితం కదర్యం మోహాకులం కామశతేన బద్దమ్

అకీర్తిభాజం పి శునం కృతఘ్నుం సదాశుచిం పాపరతం ప్రమన్యుమ్

దయాంబుధే పాహి భయాకులం మాం పునః పునస్త్వాం శరణం ప్రపద్యే

ఇతి ప్రసాదిత స్తేన దయాలుః కమలాపతిః ప్రత్యక్షమగాత్తస్య భగవాం స్తేజసాం నిధిః

ఉత్తంక మహర్షి పలికెను :- జగన్నివాసుడు జగదేక బంధువు ఆదిదేవుడగు నారాయణుని నమస్కరించుచున్నాను. శంఖచక్రశార్ణఖడ్గధారి మహానుభావుడు తలచువారి ఆర్తిని నశింపచేయువాడు అగు శ్రీహరిని శరణువేడుచున్నాను. శ్రీహరి నాభికమలమున పుట్టిన చతుర్ముఖబ్రహ్మ ఈ లోకజాలమును సృజించుచున్నాడు. శ్రీహరి కోపము నుండి పుట్టిన రుద్రుడు ఈ జగత్తును నశింపచేయుచున్నాడు. అట్టి ఆదిదేవుని ప్రతినిత్యము నమస్కరించుచున్నాను. లక్ష్మీపతి పద్మదలాయతాకుడు విచిత్రవీర్యుడు సమస్త జగత్తునకు ముఖ్య హేతువు, వేదాంతవేద్యుడు పురాణపురుషుడు, తేజోనిధియగు విష్ణువును నేను శరణుపొందితిని. ఆత్మ భూతుడు, అక్షరుడు, సర్వగతుడు, అచ్యుతనామధేయుడు, జ్ఞానాత్మ కుడు, జ్ఞానులకు శరణ్యుడు, జ్ఞానైకవేద్యుడు ఆదిభగవానుడు వ్యష్టి సమష్టిరూపుడు ప్రసన్నుడగు గావుత. ఆనన్త వీర్యుడు, గుణజాతిహీనుడు గుణాత్మకుడు, జ్ఞానవిదులలో శ్రేష్టుడు, నిత్యుడు, ప్రపన్నార్తిహరుడు, పరమాత్మ, దయాసముద్రుడు, నాయెడ వరదుడగు -గావుత. స్థూలసూక్ష్మాది విశేష భేదములచే తాను సృజించిన జగత్తున యథావిధిగా ప్రవేశించినవాడు సమస్త మగు అనంతసారస్వరూపుడు, అగు నీకం ఓ సగము మరొకటి లేదు. నీవే పరొత్మవు. నీ శుద్ద రూపము అగోచరము. మాయా సహీనము గుణజాతి హీనము, నిరంజనము నిర్మలము, అప్రమేయము, సజ్జనులచే పరమార్థముగా చూడబడువాడవు నీవు మాత్రమే. బంగారము ఒకటైనను ఆభరణముల ఉపాచే భిన్నముగా తోచునో అట్లే అఖిలాత్మకుడగు సర్వేశ్వరుడు ఒకడైనను ఉపాధి భేదముచే భిన్నముగా తోచును. నీమాయచే మోహాకులమగు మనస్సు కలవారై ప్రసిద్ధమైన ఆత్మ స్వరూపమును చూడజాలకున్నారు. మాయతొలగినచో వారే సర్వాత్మ కమగు ఆత్మరూపముగా చూచుచున్నారు. జ్యోతిస్వరూపుని విభుని సాటి లేని వానిని శ్రీమహావిష్ణువును నమస్కరించుచున్నాను. ఈ జగత్తు సమస్తము నీ నుండి కలిగి నీలో నిలుచుచున్నది. ఈ చైతన్యము నీ నుండి కలిగినది. చైతన్య స్వరూపుడవు అగు నీకు నమస్కారము. అప్రమేయుడు అనాధారుడు ఆధారాధేయ స్వరూపుడు, పరమానన్దచిన్మాత్రుడు అగు వాసుదేవుని సమస్కరించుచున్నాను. యోగులచే సేవించబడువాడు, హృదయకుహరమున నివసించువాడు యోగములకు ఆదిభూతుడు ప్రణవమున నివసించువాడగు శ్రీహరిని నమస్కరించుచున్నాను. 'నాదాత్మకుని, నాదబీజుని, ప్రణవాత్మకుని, అవ్యయుని, సద్భావుని, సచ్చిదానన్దుని తీక్ష చక్రము గలవానిని నమస్కరించుచున్నాను. అజరుడు, సాక్షి అవాఙ్మానసగోచరుడు, నిరంజనుడు, అనంతాఖ్యుడు అగు విష్ణురూపుని నమస్కరించుచునాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, సత్వము, తేజస్సు, బలము ధృతి ఇవియన్నియు వాసుదేవ స్వరూపములుగా చెప్పెదరు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు వాసుదేవ స్వరూపములుగా చెప్పుదురు. విద్వాస్వరూపుడు అవిద్యాస్వరూపుడు పరాత్పరతరుడని చెప్పెదరు. ఆద్యంతములేనివాడు శాంతుడు, సర్వధాత, అచ్యుతుడు అగు శ్రీహరిని శరణువేడిన మహానుభావులకు శాశ్వతమగు ముక్తి తప్పదు. శ్రేష్ఠుడు, శేష్ఠతరుడు వరదుడు, పురాణ పురుషుడు, సనాతనుడు, సర్వగతుడు, సమస్తరూపుడు అగు శ్రీహరిని మాటి మాటికి నమస్కరించుచున్నాను. శ్రీహరి పాదోదకము భవరోగమునకు ఔషధము అతని పాదరజము విమలత్వమును ప్రసాదించును. శ్రీహరి నామము దుష్కర్మలను నివారించును. అట్టి అప్రమేయుని పరమపురుషుని సేవించుచున్నాను. సద్రూపుని అసద్రూపుని, సదసద్రూపుని, అవ్యయుని, అట్నిటికంటే విలక్షణుని, శ్రేష్ఠములన్నిటిలో, శ్రేష్ఠ తరుని భజించెదను. నిరంజనుని నిరాకారుని పరిపూర్ణుని, ఆకాశమధ్యగుని, . విద్య అవిద్యలకం టే పరుని హృత్వద్మవాసుని స్వయంప్రకాశుని, అనిర్దేశ్యుని, మహత్తులకంటే మహత్తరుని, అణువు కం టే అణువును, సర్వోపాధివర్జితుని, నిత్యుని, పరమానందుని, సనాతనుని, పరబ్రహ్మను, జగన్నివాసుని శ్రీమహావిష్ణువును శరణు కోరితిని క్రియానిషులచే భజించబడువానిని, యోగులచే చూడబడువానిని పూజ్యులందరికంటే పరమపూజ్యుని, శాంతుని శరణుపొందితిని, విద్వాంసులచే కూడ చూడ శక్యముకాని వానిని, ఈ ప్రపంచమునంతటిని వ్యాపించియుండువానిని అన్నిటికంటే అధికుని, నిత్యుని, అవ్యయుని విభువును నమస్కరించుచున్నాను. అంతఃకరణసంయోగముచే జీవుడనబడువాడు, అవిద్యాతత్కార్యరహితుడై పరమాత్మమగా కీర్తించబడువాడు, సర్వాత్మ కుడు సర్వ హేతువు, సర్వకర్మఫలప్రదుడు, శ్రేష్ఠుడు, శ్రేష్ఠతరుడు, పరాత్పరుడగువానిని ప్రణమించుచున్నాను. సర్వజ్ఞుని, సర్వగతుని, శాంతుని సర్వాంతర్యామీనీ, శ్రీహరిని, జ్ఞానాత్మకుని, జ్ఞాననిధిని, జ్ఞానసంస్థుని విభువును భజింతును, వేదనిధిని, మురారిని, వేదాంత విజ్ఞానముచే నిశ్చయించబడిన స్వరూపము గలవానిని, సూర్యచంద్రులవలే కాంతివంతమగు నేత్రములు గలవానిని, ఇంద్రుని, పక్షిరూపుని, సర్వజగన్నాథుని, సర్వేశ్వరుని, సర్వగతుని, మహానుభావుని, వేదస్వరూపుని, వేదవిదులలో శ్రేష్ఠుని, వాజ్మనములచే ధ్యానించ శక్యము కానివానిని, అనంత శక్తిని జ్ఞానైకవేద్యుడగు పురుషుని భజించెదను. ఇంద్రాగ్నియమ 'నిర్భతి, వరుణ, వాయు, చంద్ర, శివ, సూర్య కుబేరాది దిక్పాలురరూపములచే పరిపూర్ణభావుడై లోకములను పాలించు అప్రమేయుని శరణు పొందుచున్నాను. సహస్రశీర్షుని, సహస్రపాదుని, సహస్రబాహువును, సహస్రనేత్రుని, సమస్త యజ్ఞములచే పూజించబడువానిని సంతోషప్రదుని, ఉగ్రవీర్యుని, ఆదిదేవుని నమస్కరించుచున్నాను. కాలస్వరూపుని, కాలవిభాగ హేతువును, గుణత్రయాతీతుని, గుణజ్ఞుని గుణప్రియునీ, కామదుని, సంగర హితుని, ఇంద్రియాతీతుని విశ్వబాహువుని, నిస్పృహుని, నిష్కాముని, ఉత్కృష్టుని, మనసునకు గోచరము కానివానిని - మనోమయుని, అన్నమయుని, నిస్సంగుని, విజ్ఞానభోదుని, రూపమును పొందినవానిని, వాచామగోచరుని, ప్రాణమయుని భజింతును. స్వరూపమును, బలమును, ప్రభావమును, కర్మలను, ప్రమాణములను బ్రహ్మాదిదేవతలు కూడా తెలియదు. అట్టి ఆత్మరూపుని, ఎట్లు స్తుతి చేసెదను. సంసార సాగరమున పడి దీనుడనై మోహాకులుడనై అనేక కామములచే బద్దుడనై అపకీర్తిని పొందును, పిశునుడను కృతఘ్నడను సదా అపవిత్రుని, పాపరతుని, విశేష క్రోధము గల వానిని భయాకులుడనుగు నన్ను కాపాడుము. దయానిధివగు నిన్ను శరణు వేడుచున్నాను. ఇట్లు ఉత్తంకునిచే ప్రార్థించబడిన దయానిధియగు శ్రీపతి తేజోనిధి భగవానుడు ప్రత్యక్షమాయెను.

అతసీపుష్పసంకాశం ఫుల్లపంకజలోచనమ్

కిరీటినం కుండలినం హార కేయూరభూషితమ్

శ్రీవత్సకౌస్తుభధరం హేమయజ్ఞోపవీతినమ్

నాసావిన్యస్తముక్తాభం వర్ధమానతనుచ్ఛవిమ్

పీతాంబరధరం దేవం వనమాలావిభూషితమ్

తులసీకోమలదలైరర్చితాంఘ్రిం మహాద్యుతిమ్

కింకిణినూపురాద్యైశ్చ శోభితం గరుడధ్వజమ్

దృష్ట్వా ననామ విప్రేన్ద్రో దండవత్కితిమండలే

అభ్యషించద్ధరేః పాదౌ ఉత్తంకో హర్షవారిభిః

మురారే రక్ష రక్షేతి వ్యాహరన్నాన్యధీస్తదా

తముత్తాప్య మహావిష్ణురాగ్యలిం దయాపరః

వరం వృణీష్వ వత్సేతి ప్రోవాచ మునిపుంగవమ్

అసాధ్యం నాస్తి కించితే ప్రసన్నే మయి సత్తమ

ఇతీరితం సమాకర్ణ్య హ్యుత్తంకశ్చక్రపాణినా

పునః ప్రణమ్య తం ప్రాహ దేవదేవం జనార్దనమ్

కిం మాం మోహయపీశ త్వం కిమన్త్యేర్దేవ మే వరైః

త్వయి భక్తిర్దృఢ మేఽస్తు జన్మజన్మాంతరేష్వపి

కీటేషు పక్షిషు మృగేషు సరీసృ పేషు రక్షఃపిశాచమనుజేష్వపి యత్ర తత్ర

జాతస్య మే భవతు కేశవ తే ప్రసాదాత్ త్వయ్యేవ భక్తిరచలావ్యభిచారిణీ చ

ఏవమస్తితి లోకేశశ్శంఖప్రాంతేన సంస్పృశన్

దివ్యజ్ఞానం దదౌ తస్మై యోగినామపి దుర్లభమ్

పునస్నువన్తం విప్రేన్ద్రం దేవదేవో జనార్దనః

ఇదమాహ స్మితముఖో హస్తం తచ్చరసి న్యసన్

అవిశపూవువన్నె గల వానిని వికసించిన పద్మముల వంటి కనులు గల వానిని కిరీట కుండల హార కేయూర శ్రీవత్సకౌస్తుభాదీ భూషణములను ధరించినవానిని, బంగారు యజ్ఞోపవీతమును ధరించినవానిని నాసికా ప్రాంతమున ధరించిన ముత్యము కాంతిచే శోభించు దేహకాంతి గలవానీని పీతాంబరధారిని, వనమాలావిభూషితుని, కోమలములైన తులసీ దళములచే పూజించబడిన పాదములు గలవానిని, గొప్ప తేజస్సు కలవానిని కింకిణి నూపురాదులచే భూషించబడినవానిని, గరుడ ధ్వజుని శ్రీహరిని చూచి ఉత్తంకుడు దండవత్సణామముల నాచరించెను. ఆనందబాష్పములచే శ్రీహరి పాదములను అభి షేకించేను. ఓ మురారీ ! రక్షించుము ! రక్షించుము ! అని పలుకుచు అనన్య చిత్తముతో ధ్యానించెను. దయాపరుడగు శ్రీమహావిష్ణువు ఉత్తంకుని లేపి ఆలింగనము చేసుకొనెను. వత్సా ! వరమును కోరుమని పలికెను. నేను ప్రసన్నుడనైన పిదప నీకు సాధించరానిదేదియు లేదని పలికిన శ్రీహరి మాటలను “విని ఉత్తంకుడు మరల మరల. నమస్కరించి దేవదేవుడగు జనార్ధనునితో ఇట్లు పలికెను. “నన్నేల మోహింపచేయుచున్నావు ? నాకు వేరు వరములతో నేమి పని ? ఎన్ని జన్మలలో నైనను నీయందు దృడభక్తి కలుగనిమ్ము” శ్రీహరి అట్లే కానిమ్మని పలికి శంకప్రాంతముతో స్పృశించి యోగులకు కూడా దుర్లభమగు దివ్యజ్ఞానమును ప్రసాదించెను. ఉత్తంకుడు మరల స్తోత్రము చేయుచున్న దేవదేవుడగు జనార్దనుడు ఉత్తంకుని శిరమున హస్తమునుంచి ఇట్లు పలి కెను.

శ్రీ భగవానువాచ :-

ఆరాధయ క్రియాయోగైర్మాం సదా ద్విజసత్తమ !

నరనారాయణస్థానం వ్రజ మోక్షం గమిష్యసి

త్వయా కృతమిదం స్తోత్రం యః పఠేత్సతతం నరః

సర్వాన్కామానవ్యాంతే మోక్షభాగీ భవేత్తతః

ఇత్యుక్త్వా మాధవో విప్రం తత్రైవాంతర్దధీ మునే !

నరనారాయణస్థానముత్తంకోఽపి తతో యయౌ

తస్మాద్భక్తి స్సదా కార్యా దేవదేవస్య చక్రిణః

హరిభక్తిః పరా ప్రోక్తా సర్వకామఫలప్రదా

ఉత్తంకో భక్తి భావేన క్రియాయోగపరో మునే

పూజయన్మాధవం నిత్యం నరనారాయణాశ్రమే

జ్ఞానవిజ్ఞానసంపన్నస్సంఛిన్నద్వైతసంశయః

ఆవాప దురావాపం వై తద్విష్ణోః పరమం పదమ్

పూజితో నమితో వాపి సంస్మృత వాపి మోక్షదః

నారాయణో జగన్నాదో భక్తానాం మానవర్థనః

తస్మాన్నారాయణం దేవమనన్తమపరాజితమ్

ఇహాముత్ర సుఖప్రేప్సుః పూజయేద్భక్తి సంయుతః

యః పఠేద్దమాఖ్యానం శృణుయాద్వా సమాహితః

సోఽపి సర్వాభనిర్ముక్తః ప్రయాతి భవనం హరేః

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే విష్ణుమాహాత్మ్యం నామ అష్టతింశోఽధ్యాయః

శ్రీమన్నారాయణభగవానుడు పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! క్రియాయోగముతో నన్నెల్లపుడారాధించుము. నరనారాయణాశ్రమునకు వెళ్ళుము. మోక్షమును పొందగలవు. నీవు చేసిన ఈ స్తోత్రమును చదివినవారు అన్ని కోరికలను పొంది అంతమున మోక్షమును పొందగలరు. శ్రీమన్నారాయణుడిట్లు పలికి అచటనే అంతర్ధానము చెందెను. తరువాత ఉత్తంకుడు కూడా నరనారాయణ స్థానమును గూర్చి వెళ్ళెను. కావున దేవదేవుడగు చక్రి విషయమున ఎల్లపుడు భక్తి చేయవలయును. అన్నిటిలో ఉత్తమమైనది హరిభక్తియే. హరిభక్తి సర్వకామఫలములనిచ్చును. నరనారాయణాశ్రమున ఉత్తంకుడు భక్తి భావముతో శ్రీహరిని పూజించుచు క్రియాయోగపరుడై, జ్ఞానవిజ్ఞానసంపన్నుడై సంశయచ్ఛేదము గలిగి అందరికి దుర్లభమగు శ్రీమహావిష్ణువు యొక్క పరమపదమును పొందెను. జగన్నాధుడగు నారాయణుడు భక్తుల గౌరవమును పెంచువాడు పూజించినను నమస్కరించిననూ స్మరించిననూ మోక్షము నొసంగును. కావున అనంతుడు అపరాజితుడు అగు నారాయణదేవుని ఇహపరములలో ఆనందమును కోరువాడు భక్తి చే పూజించవలయును. సావధానముచే ఈ కథను చదివిననూ వినిననూ సర్వపాపవినిర్ముక్తుడై శ్రీహరిభవనము చేరును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున విష్ణుమాహాత్మ్యమను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.