నారద మహా పురాణము
3 - మూడవ అధ్యాయము - సృష్టి భరతఖండ ప్రాశస్త్యం భూగోలవర్ణనమ్
నారద ఉవాచ
కథం ససర్జ బ్రహ్మదీనాదిదేవః పురా విభుః।
తన్మమాఖ్యా హి సనక సర్వజ్ఞోస్తి యతో భవాన్॥
నారదుడు పలికెను :- మొదట ప్రభువు ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు బ్రహ్మదులనెట్లు సృజించెను ? నీవు సర్వజ్ఞుడవు కావున నొకు అంతయూ నేరిగింపుము.
శ్రీ సనక ఉవాచ
నారాయణోక్షరోనన్తః సర్వవ్యాపీ నిరంజనః।
తేనేదమఖిలం వ్యాప్తం జగత్ స్థావరజంగమమ్॥
ఆదిసర్గే మహావిష్ణుః స్వప్రకాశో జగన్మయః।
గుణభేదమధిష్టాయ మూర్తిత్రికమవాసృజత్॥
సృష్ట్యర్థం తు పురా దేవో దక్షిణాంగాతజాపతిమ్।
మధ్యే రుద్రాఖ్యమీశానం జగదన్తకరం మునే॥
పాలనాయాస్య జగతో వామాంగార్విష్ణుమవ్యయమ్।
తమాదిదేవమజరం కేచిటాహుశ్శివాభిధమ్।
చిద్విష్ణుం సదా సత్యం బ్రహ్మాణం కేచిచూచిదే॥
తస్య శక్తిః పరా విష్ణోర్జగత్కార్యప్రవర్తినీ।
భావాభావస్వరూపా సా విద్యా విద్యేతి గీయతే॥
యదా విశ్వం మహావిష్ణోర్భిన్నత్వేన ప్రతీయతే।
తదా హ్యవిద్యా సంసిద్ధా భవేద్దుఃఖస్యసాధనమ్॥
జాతృజ్జీయాద్యుపాధి స్తే యదా నశ్యతి నారద।
సర్వేకభావనా బుద్ధిః సా విద్యేత్యభిధీయతే॥
ఏవం మాయా మహావిష్ణోర్బిన్నా సంసారదాయినీ।
అభేదబుద్ద్యా దృష్టా చేత్సంసారక్షయకారిణీ॥
శ్రీ సనక మహర్షి చెప్పెను :- అంతము, నాశము లేనివాడు, అంతటా వ్యాపించియుండువాడు దేనితో సంబంధములే నివాడు అయిన శ్రీమన్నారాయణుడు స్థావరజంగమాత్మ కమగు ఈ జగత్తునంతటినీ వ్యాపించియున్నాడు. జగత్స్వరూపుడు, స్వయంప్రకాశుడు అగు మహావిష్ణువు ఆది సృష్టిలో సత్త్వరజస్తమోగుణముల భేదములను ఆధారముగా చేసుకొని విష్ణువు, బ్రహ్మ, రుద్రుడు అను మూర్తిత్రయమును సృష్టించేను. శ్రీమన్నారాయణుడు జగత్సృష్టి కొరకు పూర్వము తన దక్షిణశరీరము నుండి బ్రహ్మను, శరీరమధ్యభాగము నుండి జగదంతకరుడగు రుద్రుడను పేరుగల ఈశ్వరుని, . చామశరీర భాగము నుండి జగత్పాలనకొఱకు విష్ణువును సృష్టించెను. ఆది దేవుడు జన్మజరాది రహితుడు అగు శ్రీమన్నారాయణుడు. కొందరు శివుడందురు. కొందరు విష్ణువందురు. మరికొందరు బ్రహ్మ అనేదరు. జగత్తును ప్రవర్తింపచేయు శ్రీమహావిష్ణువు శక్తి అన్నిటికంటే పరమైనది. ఆ శక్తి భావస్వరూపమని, అభివస్వరూపమని, విద్య అని అవిద్య అని, కీర్తించబడును. ఈ ప్రపంచము మహావిష్ణువు కంటే వేటుగా తోచినపుడు దుఃఖ సాధనమైన ఆవిద్య సిద్దించును. తెలియునది, తెలియువాడు అను ఉపాధి నశించినపుడు అంతా ఒక టే మహావిష్ణుమయమను బుద్ధికలుగునపుడు దానిని విద్య అందురు. ఇట్లు మహావిష్ణువు మాయయే భిన్న రూపముగా సంసారమునిచ్చును. ఆభేద బుద్దిచే చూచినచో ఆ మాయయే సంసారమును నశింపచేయును.
విష్ణుశక్తి సముద్భూతమేతత్సర్వం చరాచరమ్।
యస్మాద్భిన్నమిదం సర్వం యచ్చజేద్యచ్చనేజ్గతి
ఉపాధిభిర్యథాకాశో భిన్నత్వన ప్రతీయతే।
అవిద్యోపాధియోగేన తథేదమఖిలం జగత్॥
యథా హరిర్జగద్వ్యాపీ తస్య శక్తిస్తథామునే।
దాహశక్తిర్యభాంగారే స్వాశ్రయం వ్యాప్య తిష్ఠతి॥
ఉమేతి కేచిదాహుస్తాం శక్తిం లక్ష్మీం తథాపరే।
భారతీత్యపరే చైనాం గిరిజేత్యంబి కేతి చ॥
దుర్గేతి భద్రకాళీతి చండీ మా హేశ్వరీత్యపి।
కౌమారీ వైష్ణవీచేతి వారా హ్యెంద్రీ చ శాంభవీ॥
బ్రాహ్మీతి విద్యావిద్యేతి మాయేతి చ తథా పరే।
పకృతిశ్చ పరాచేతి వదని పరమర్షయః॥
సేయం శక్తిః పరా విష్ణోర్జగత్సర్గాదికారిణీ।
వ్యక్తావ్యక్తస్వరూపేణ జగద్వ్యాప్య వ్యవస్థితా॥
ప్రకృతిశ్చ పుమాంశ్చైవ కాలశ్చేతి త్రిథాస్థితో।
సృష్టి స్థితి వినాశానామేకా కారణతాం గతా॥
యేసేదమఖిలం జాతం బ్రహ్మరూపధ రేణ వై।
తస్మాత్పరతరో దేవో నిత్య ఇత్యభిధీయతే॥
రక్షాం కరోతి యోదేవో జగతాం పరతః పుమాన్।
తస్మాత్పరతరం యత్తదవ్యయం పరమం పదమ్॥
ఈ చరాచరజగత్తంతయు విష్ణుశక్తి వలన పుట్టినదే. చలించునది, చలించనిది అయిన ఈ జగత్తంతా విష్ణువు కంటే భిన్నముగా కనబడుచున్నది. ఘటపటాద్యుపొధులచే ఎట్లు ఆకాశము భిన్నముగా తోచునో అట్లే అవిద్యోపాధి భేదముచే ఈ జగత్తు భిన్నముగా తోచును. విష్ణువు జగత్తునంతటిని వ్యాపించి యున్నట్లు అతని శక్తి కూడా జగత్తును వ్యాపించి యుండును. అగ్నిలో ఉన్న దొహశక్తి అగ్న్యాశ్రయమును వ్యాపించి యుండునుకదా. ఈ శక్తిని కొందరు ఉమ అని, మరీ కొందరు లక్ష్మియనీ, ఇతరులు భారతీయని, కొందరు గిరిజ, అంబికయని అందురు. కొందరు.. దుర్గ, భద్రకాళి, చండి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఐస్ట్రి, శాంభవి, బ్రాహ్మి, విద్య, అవిద్య, మాయ అని అందురు. పరమర్దులు మాత్రము దీనిని ప్రకృతియని పరొయని అందురు. విష్ణువుయొక్క ఈ శక్తి అన్నిటికంటే పరమైనది. ఇదియే జగత్సృష్టి స్థితిలయములను చేయును. ఈ శక్తియే వ్యక్తరూపముతో, అవ్యక్తరూపముతో జగమును వ్యాపించియుండును. ఈ శక్తియే ప్రకృతి, పురుషుడు, కొలము అని మూడు విధముల వస్తు స్థితి ఉండి సృష్టి స్థితిలయములకు కారణమగుచున్నది. ఈ జగత్తును సృష్టించిన బ్రహ్మరూపధరుని కంటే పరతరుని నిత్యుడు అందురు. ఈ జగత్తును రక్షించు దేవుని నిత్యుడందురు. అన్ని జగత్తులను రక్షించువాడు అందరి కంటే పరుడైనవాడు పురుషుడు. అతని కంటే పరుడే అవ్యయుడు పరముడు అందురు.
అక్షరో నిర్గుణశ్శుద్ధః పరిపూర్ణః సనాతనః।
యః పరః కాలరూపొభ్యో యోగిధ్యేయః పరాత్పరః॥
పరమాత్మా పరానన్దసర్వోపాధివివర్జితః।
జ్ఞానైక వేద్యః పరమః సచ్చిదానన్దవిగ్రహః॥
యోఒసౌ శుద్ధోపి సరమో హ్యహంకారేణ సంయుతః।
దేహీతి ప్రోచ్యతే మూడైరహోఒజ్ఞానవిడంబనమ్॥
స దేవః పరమః శుద్దః సత్త్వాదిగుణభేదతః।
మూర్తిత్రయం సమాపన్నం సృష్టిస్థిత్యన్తకారణమ్॥
యోఒసౌ బ్రహ్మా జగత్కర్తా యన్నాభికమలోద్భవః।
స ఏవానన్దరూపొత్మా తస్మాన్నాస్త్యపరో మునే॥
అన్తర్యామీ జగద్వ్యాపీ సర్వసాక్షీ నిరంజనః।
భిన్నాభిన్నస్వరూపేణ స్థితో వై పరమేశ్వరః॥
యస్య శక్తిర్మహామాయా జగద్విసమ్భధారిణీ।
విశ్వోత్పత్తైర్నిదానత్వాతకృతిః ప్రోచ్యతే బుధైః॥
ఆదీసర్లే మహావిష్ణుర్లోకాన్కర్తుం సముద్యతః।
ప్రకృతిః పురుష శ్చేతి కొలశ్చేతి త్రిథా భవేత్॥
పశ్యన్తి భావితాత్మనో యం బ్రహ్మేత్యభిసంజ్ఞాతమ్।
శుద్ధం యత్పరమం ధామ తద్విష్ణోః పరమం పదమ్॥
ఏవం శుద్దోక్షరోనన్తః కాలరూపీ మహేశ్వరః।
గుణరూపీ గుణాధారో జగతామాదికృద్విభుః॥
నాశరహితుడు, గుణరహితుడు, శుద్దుడు, పరిపూర్ణుడు, సనాతనుడు, పరము కంటే పరుడు యోగులచే ధ్యానించదగిన వాడు కాలనామము కలవాడు పరమాత్మ, పరానన్దుడు ఉధులేవీ లేనివాడు, జ్ఞానముతో మాత్రమే తెలియదగినవాడు పరముడు సచ్చిదానన్ద స్వరూపుడు పరమాత్మ శుద్దుడైనను అహంకారముతో సంబంధముచేత దేహి (జీవుడు) అని అనబడుచున్నాడు. అజ్ఞానప్రవృత్తి వింత కదా ! అన్నిటికంటే పరముడైన ఆ యాదిదేవుడు సత్త్వరజస్తమోగుణ భేదముల వలన సృష్టి స్థితిలయములను చేయు విష్ణు బ్రహ్మ శివాఖ్యములగు మూడు మూర్తుల రూపమును పొందెను. జగత్తును సృష్టించిన బ్రహ్మ ఎవని నాభి కమలము నుండి పుట్టనో అతనే ఆనంద స్వరూపుడు పరమాత్మ. అతని కంటే భినుడింకొకడు లేడు. ఆ పరమాత్మయే అన్తర్యామిగా జగత్తును వ్యాపించి యుండును. సర్వసాక్షి అయిననూ దేనితో సంబంధములేని వాడు. ఈ పరమేశ్వరుడే (జగజ్జీవాదులకంటే) భిన్నరూపముతో అభిన్నరూపములో నుండును. ఈ పరమాత్మ శక్తియగు మహామాయయే జగత్స్వరూపమును ధరించును. ప్రపంచము పుట్టుటకు మూలకారణము కావున పండితులు ఈ మాయను ప్రకృతి అందురు. మహావిష్ణువు ఆదిసృష్టిలో లోకములను సృజించుటకు , సంకల్పించి ప్రకృతి, పురుషుడు, కాలము అని మూడువిధములాయెను. ఆత్మ స్వరూపమును తెలిసినవారు ఇతనినే బ్రహ్మ అని అందురు. పరిశుద్ధమైన ఈ పరంధామమే పరమపదమని పిలువబడును. ఈ పరమాత్మ పరిశుద్దుడు అక్షరుడు, అనస్తుడు, కాలరూపి, మహేశ్వరుడు, గుణరూపి, గుణములకు ఆధారము, జగత్తును మొదట సృజించినవాడు. జగత్తులకధిపతి.
ప్రకృతిః క్షోభమాపన్నా పురుషాఖ్యే జగద్గురౌ।
మహాంప్రాదురభూద్బుద్ధిస్తతోఒహం సమవర్తత॥
అహంకారాచ్చ సూక్ష్మాణి తన్మాత్రాణేంద్రియాణి చ।
తన్మాత్రేభ్యో హి జాతాని భూతాని జగతః కృతే॥
ఆకోశవాయ్వగ్ని జలభూమయోబ్జభవాత్మజ।
యథాక్రమం కొరణతామే కైకస్యోపయాస్తి చ॥
తతో బ్రహ్మా జగద్ధాతా తామసానసృజతభుః;
తిర్యగ్యోనిగజాన్ జంతూన్ పశుపక్షి మృగాదికాన్।
తమప్యసాధకం మత్వా దేవసర్గం సమాతనోత్।
తతో పై మానుషల సర్గం కల్పయామాస పద్మజః॥
తతో దక్షాదికాన్పుతాన్ సృష్టిసాధనతత్పరాన్।
ఏభిః పుతైరిదం వ్యాప్తం సదేవాసురమానుషమ్॥
భూర్భువశ్చ తథా స్వశ్చ మహశ్చైవ జనస్తథా।
తపశ్చ సత్యమిత్యేవం లోకాః సప్టోపరి స్థితాః॥
అతలం వితలం చైవ సుతలం చ తలాతలమ్।
మహాతలం చ విపేత్తో తతోధశ్చ రసాతలమ్॥
పాతాలం చేతి సపైవ పాతాలోని క్రమాదధః।
ఏష సర్వేషు లోకేషు లోకనాథాంశ్చ స్పష్టవాన్॥
కులాచలాన్నదీశ్చాసౌ తత్తల్లోకనివాసినమ్।
వర్తనాదీని సర్వాణి యథాయోగ్యమకల్పయత్॥
పురుషుడను పేరుగల జగద్గురువునందు క్షోభ (కదలిక) చెందిన ప్రకృతినుండి మహత్తత్త్వమను బుద్ది పుట్టెను. మహత్తత్త్వమునుండి అహంకారము పుట్టెను. అహంకారమునుండి సూక్ష్మములైన పంచతన్మాత్రలు, ఇంద్రియములు పుట్టెను. ఈ జగత్సృష్టి కొఱకు తన్మొత్రలనుండి పంచభూతములు పుట్టెను, ఆకాశము, పొయువు, అగ్ని, జలము, భూమి అను పంచభూతములు వరుసగా ఒక్కొక్కదానికి కారణములగును. అనగా ఆకాశమునుండి పోయువు, వోయువునుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి పుట్టినవని భావము. తరువోత జగత్తును సృష్టించు బ్రహ్మ తమోగుణ భూయిష్టములైన తిర్యగ్జంతువులగు పశుపక్షిన్సుగాదులను సృష్టించేను. అది తన కార్యసాధనము కొదని భావించిన బ్రహ్మ దేవతలను సృజించెను. పిమ్మట మానుషసృష్టిని గావించెను. తరువాత సృష్టిని సాధించుటయందు తత్పరులైన దక్షాది పుత్రులను సృష్టించేను. దేవదానవమానవాత్మకమగు ఈ ప్రపంచమంతయు ఈ పుత్రులచే వ్యాపించబడెను. భూలోకము భువర్లోకము, స్వర్గలోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము అను ఏడు లోకములు ఉపరిభాగమున నున్నవి. అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలను, రసాతలము, సౌతొలము అనునవి ఏడు క్రింది భాగమున నున్న పాతాల లోకములు. ఈ అన్ని లోకములందును- లోకనాథులను కూడా స్పష్టించెను. ఆయా లోకములలో నివసించువొరికొజకు కుల పర్వతములను నదులను కూడో సృష్టించేను. ఆయా లోకములలో నివసించువారికి యోగ్యముగా ప్రవర్తన మొదలగు వాటిని కూడా ఏర్పరిచేను.
భూతలే మధ్యగో మేరుః సర్వదేవసమాశ్రయః।
లోకాలోకశ్చ భూమ్యస్తే తన్మధ్యే సప్తసాగరాః॥
ద్వీపాశ్చ సప్త విపేత్తో ద్వీపే ద్వీపే కులాచభాః।
వాహ్యా మద్యశ్చ విఖ్యాతా జనాశ్చామరపన్నిభాః।
జంబూప్లక్షాభిధానౌ చ శాల్మలశ్చ కుశస్తథా।
క్రౌంచాశోకా పుష్కరశ్చ తే సర్వే దేవభూమయః॥
ఏతే ద్వీపాస్సముద్రిస్తు సప్త సప్తభిరావృతాః।
లవణీక్టు సురాసర్పదధిక్షీర జలైప్సమమ్ ఏతే
ద్వీపాస్సముద్రాశ్చ పూర్వస్మాదుత్తరోత్తరాః।
ప్లేయా ద్విగుణవిస్తారా ఆలోకాలోకపర్వతాత్॥
క్షారోదధ్రుత్తరం యద్ధిమాద్రేశ్చైవ దక్షిణమ్।
జ్ఞేయం తద్భారతం వర్షం సర్వకర్మఫలప్రదమ్॥
ఆత్ర కర్మాణి కుర్వన్త త్రివిధాని తు నారద !
తత్ఫలం భుజ్యతే చైవ భోగభూమిధనక్రమాత్॥
భారతే తు కృతం కర్మ శుభం వా శుభమేవ చ।
తత్పలం క్షయి విపేత్తో భుజ్యతేఒన్యత్ర జనుభిః॥
అద్యాపి దేవో ఇచ్ఛని జన్మ భారతభూతలే।
సంచితం సుమహత్పుణ్యమక్షయ్యమమలం శుభమ్॥
కదా లభామ హే జన్మ వర్షభారతభూమిషు।
కదా పుణ్యేన మహతో యాస్యాను పరమం పదమ్॥
భూమండలమున మధ్యభాగమున దేవతలందరికి ఆశ్రయమైన మేరుపర్వతమున్నది. భూమి చివర లోకాలోక పర్వతమున్నది. భూమి మధ్యభాగమున ఏడు సముద్రములు కలవు. ఓ బ్రాహ్మణోత్తమా ! ఈ భూమండలమున ఏడు ద్వీపములు కలవు. ప్రతి ద్వీపమున కులాచలములు కలవు. ఈ భూమండలమున చక్కని ప్రవాహములు కల నదులు కలవు. ఇచటి జనులు దేవతాసములు. జమ్బూద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలద్వీపము, కుశద్వీపము, క్రౌంచద్వీపము, ఆశోకద్వీపము, పుష్కరద్వీపము అను ఏడు ద్వీపములు దేవనివాసములు. ఈ ఏడు ద్వీపములు ఏడు సముద్రములచే చుట్టబడియున్నవి. లవణసముద్రము, ఇక్షు సముద్రము, సురాసముద్రము, సర్పిసముద్రము, దధిసముద్రము, క్షీరసాగరము, జలసముద్రములు అని ఏడు సముద్రములు. లోకాలోకపర్వతము వరకు ఈ ఏడు ద్వీపములు, సముద్రములు మొదటి దానికంటే రెండవది ఈ విధముగా రెట్టింపు విస్తారము కలవి. ఉప్పు సముద్రము కంటే ఉత్తర భాగమున హిమాద్రికి దక్షిణ భాగమున భారత వర్షము కలదు. ఈ భారతవర్షము అన్ని కర్మల ఫలము నిచ్చునది. ఓ సొరదా ! ఈ భారతవర్షమున మూడు విధములైన కర్మలను (కాయిక వాచిక మానసిక) చేతురు. ఆ కర్మల ఫలమును భోగరూపముగా భూరూపముగ్రో ధనరూపముగా వరుసగా అనుభవింతురు. భారతవర్షమున చేయు శుభాశుభ కర్మల ఫలమును ప్రాణులు మరొకచోట అనుభవింతురు. ఇప్పటికీ దేవతలు భారతభూమిలో పుట్టవలయునని కోరుచుందురు. ఈ భూమి పై సంపొదించిన పుణ్యము, అక్షయము అమలము శుభమగును. భారతవర్ష భూభాగమున ఎపుడు పుట్టదమా! ఎపుడు గొప్ప పుణ్యముతో పరమపదమును చేరెదమా ! అని దేవతలు ఆశింతురు.
దానైర్వా వివిధైర్యజ్ఞై స్తపోభిర్వాధవా హరిమ్।
జగదీశం సమేష్యమో నిత్యానన్దమనామయమ్॥
యో భారతభువం ప్రాప్య విష్ణుపూజాపరో భవేత్।
న తస్య సదృశోఒన్యోఒ స్త్రీ త్రిషు లోకేషు నారద !
హరికీర్తనశీలో వా తద్భక్తానాం ప్రియోసి వా।
శుశ్రూషుర్వాపి మహతస్స వంద్యో దీవితైరపి॥
హరిపూజారతో నిత్యం భక్తపూజారతోపి వా।
భక్తోచ్ఛిష్టాన్న సేవీ చ యాతి విష్ణోః పరం పదమ్॥
నారాయణేతి కృ షైతి వాసుదేవేతి యో వదేత్।
అహింసాదిపరశ్శాస్తస్సోపీ వన్ద్యసురోత్తమైః॥
శివేతి నీలకంఠేతి శంక రేతి చ యః స్మరేత్।
సర్వభూతహితో నిత్యం సో2భ్యర్యో దివిజైః స్మృతః॥
గురుభక్తశ్శివధ్యానీ స్వాశ్రమాచారతత్సరః।
అనసూయుశ్శుచిర్షన్లో యసో2భ్యర్చస్సు రేశ్వరైః
బ్రాహ్మణానాం హితకరశద్ధావాన్వర్ణధర్మయోః।
వేదవాదరతో నిత్యం స జేయః పంక్తిపొవనః॥
అభేదదర్శీ దేవేశే నారాయణశివాత్మ ।
స వన్ష్య బ్రహ్మణా నిత్యమస్మదోదీషు కా కథా॥
గోషు క్షాన్తో బ్రహ్మచారీ పరనిందావివర్జితః।
అపరిగ్రహశీలశ్చ దేవపూజ్యస నారదః॥
సేయాదిదోషవిముఖః కృతజ్ఞ సత్యవాక్ శుచిః।
పరోపకారనిరతః పూజనీయస్సురాసురైః॥
వేదార్థాశ్రవణే బుద్ధిః పురాణశ్రవణే తథా।
సత్సం గేపి చ యస్యాస్తి సోపి వర్ణ్యసురోత్తమైః॥
ఏవమాదీన్యనేకాని కర్మాణి శ్రద్ధయాన్వితః।
కరోతి భారతే వన్డే స వన్ద్యస్మాభిరేవ చ॥
ఏతేష్వన్యతమో విప్రమాత్మానం సారభేత్తు యః।
స ఏవ దుష్కృతిర్మూథో నాస్త్యన్యోఒస్మాదచేతనః॥
సంప్రాప్య భారతే జన్మ సత్కర్మసుపరాజ్ముఖః।
పీయూషకలశం ముక్త్వా విషభాండముపాశ్రితః
శ్రుతిస్మృత్యుదిత్భైర్మెరాత్మా నం పావయేత్తు యః।
స ఏవాత్మవిఘాతీ స్యాత్ పాపినామగ్రణీర్మునే॥
కర్మభూమిం సమాసాద్య యో న ధర్మం సమాచరేత్।
స చ సర్వాధమః ప్రోక్తో వేదవిద్భిర్మునీశ్వర॥
శుభం కర్మ సముత్సృజ్య దుష్కర్మాణి కరోతి యః।
కామధేనుం పరిత్యజ్య అరక్షీరం స మార్గతి॥
ఏవం భారతభూభాగం ప్రశంసన్త దివౌకసః।
బ్రహ్మాద్యా అపి విప్రేంద్ర స్వభోగక్షయభీరవః॥
నిత్యానందస్వరూపుడు, శుద్దుడు, జగదీశ్వరుడైన శ్రీహరిని పలువిధములైన దానములచేత కాని, యజ్ఞములచేత కాని, తపములచేత కాని ఆరాధించి ఎప్పటికైన అతనిని చేరగలమా అని దేవతలు కోరుకొనుచుందురు. భారత భూమిలో పుట్టి విష్ణుపూజారకుడైనచో వానితో సాటివచ్చువాడు మూడులోకములలో మరియెవడుండడు. హరిని కీర్తించు స్వభావము కలవాడు కాని, హరిభక్తులకు ప్రీతిపాత్రుడుకొని, మహాత్ములను సేవించువాడు కాని దేవతలచే కూడా నమస్కరింపదగినవాడగును. హరిని పూజించుటయందు ఆసక్తి గలవాడు, హరిభక్తులను పూజించగోరువాడు, హరిభక్తులు తినగా మిగిలిన అన్నమును తినువాడు శ్రీమహావిష్ణువు నివసించు పరమపదమును చేరును. నారాయణ కృష్ణ వాసుదేవ అని శ్రీహరిని కీర్తించువాడు అహింసను ఆశ్రయించి శాంతుడుగా ఉండువాడు దేవతల చేత కూడా నమస్కరించదగినవాడగును. శివా, నీలకంఠా, శంకరా అని కీర్తించువాడు సర్వప్రాణుల హితమునుకోరువాడు దేవతల పూజలందదగినవాడగును. గురువు యందు భక్తి కలవాడు, శివుని ధ్యానించువాడు తన ఆశ్రమాచారములయందు ఆసక్తుడు, అసూయలేనివాడు, పవిత్రుడు, సమర్థుడు అయినవాడు కూడా దేవతలచే పూజించదగినవాడు. బ్రాహ్మణులకు హితమును చేయువాడు, వర్ణధర్మములయందు శ్రద్ధకలవాడు ఎల్లపుడు వేదాధ్యయనమునం దోసక్తి కలవాడు ఎల్లపుడు పంక్తిపావనుడే. నారాయణ శివ రూపములతోనున్న ఆదిదేవుని అభేదమును చూచువాడు ఎల్లపుడు చతుర్ముఖబ్రహ్మ చేతగూడ నమస్కరింపదగినవాడగును. ఇక మన విషయమేమి. చెప్పగలము! ఓతృతీయోధ్యాయః నారదా ! ఆవులయందు క్షమాశీలుడు, బ్రహ్మ చారి, పరనిందను వదిలినవాడు ఎవరినుండి దేనిని గ్రహించనివాడు దేవపూజ్యుడు. చౌర్యము మొదలగు దోషములయందు విముఖుడు, కృతజ్ఞుడు, సత్యమును మాత్రమే మాట్లాడువాడు, పరిశుద్దుడు, పరోపకారమునందు ఆసక్తి కలవాడు దేవదానవులందరిచే పూజించదగినవాడగును. వేదార్ధములను వినుటయందు, పురాణములను వినుటయందు, సజ్జనసాంగత్యమునందు ఆసక్తి కలవాడు కూడా దేవతలచేకూడా పూజించదగినవాడగును. ఇటువంటి పనులను అనేకములను శ్రద్ధతో భారతవర్షములో చేయుచు ఋషులతో సంబంధము నేర్పరచుకొనినవాడు ఉత్తముడు. భారతవర్షములో పుట్టి శ్రద్దతో ఇట్టి పనులు చేయువాడు మనకు నమస్కరింపదగినవాడు. పైన చెప్పిన పనులలో ఏ ఒక్క పనిని కూడా చేయనివాడు మహాపాపి. మూర్ఖుడు కూడ. అతని కంటే అజ్ఞాని మరియొకడుండడు. భారతవర్షములో పుట్టి కూడా మంచికర్మలయందు ఆసక్తి లేనివాడు అమృతకలశమును వదిలి పెట్టి విషభాండము నాశ్రయించినవాడగును. శ్రుతి స్మృతులచే చెప్పబడిన ధర్మములతో తనను పవిత్రుని చేసుకోననివాడు ఆత్మఘాతీ, పాపులలో మొదటివాడగును. కర్మభూమిలో పుట్టి కూడా ధర్మము నాచరించనివాడు అందరిలో అధముడుగా వేదజ్ఞులచే చెప్పబడును. శుభకర్మలను వదిలి చెడుపనులను చేయువాడు కామధేనువును వదిలి జిల్లేడు పాలను వెతుకువాడగును. ఇట్లు బ్రహ్మాదిదేవతలు తమ భోగము క్షీణించును అను భయముచే. భారత భూభాగమును ప్రశంసించెదరు.
తస్మాత్పుణ్యతమం జ్ఞేయం భారతం వర్షముత్తమమ్।
దేవానాం దుర్లభం వాపి సర్వకర్మఫలప్రదమ్॥
అస్మినుణ్యే చ భూభా గే యస్తు సత్కర్మసూద్యతః।
న తస్య సదృశః కశ్చిత్తీషు లోకేషు విద్యతే॥
అస్మిన్హాతో నరో యస్తు స్వకర్మక్షపణోద్యతః।
నరరూపపరిచ్ఛన్నః స హరిరాత్ర సంశయః॥
పరలోకఫలప్రేప్సుః కుర్యాత్కర్మా ణ్యతంద్రితః।
నివేద్య హరయే భక్త్యా తత్సలం హ్యాక్షయం స్మృతమ్॥
విరాగీ చేత్కర్మఫలేష్వపి కించిన్న కారయేత్।
అర్పయేత్సుకృతం కర్మ ప్రీయతామితి మే హరిః॥
ఆబ్రహ్మభువనాల్లోకాః పునరుత్పత్తిదాయకాః।
ఫలాగృధ్నుః కర్మణాం తతాప్నోతి పరమం పదమ్॥
వేదోదితా కర్మాణి కుర్యాదీశ్వరతుష్టయే।
యథాశ్రమం త్యక్తు కామః ప్రాప్నోతి పదమవ్యయమ్॥
నిష్కామో వా సమోవా కుర్యాత్కర్మ యథావిధి।
స్వాశ్రమాచారశూన్యశ్చ పతితః ప్రోచ్యతే బుధైః॥
సదాచారపరో విప్రో వర్ధతే బ్రహ్మతేజసా।
తస్య విష్ణుశ్చ తుష్టః స్యాద్భక్తియుక్తస్య నారద !
భారతే జన్మ సంప్రాప్య నాత్మానం తారయేత్తు యః।
పచ్యతే నిరయే హోరే స త్వాచన్హార్కతారకమ్॥
వాసుదేవపరో ధర్మో వాసుదేవపరం తపః।
వాసుదేవపరం జ్ఞానం వాసుదేవపరా గతిః॥
వాసుదేవాత్మకం సర్వం జగత్ స్థావరజంగమమ్।
ఆబ్రహ్మస్తమ్భపర్యస్తం తస్మాదన్యన్న విద్యతే॥
స ఏవ ధాతా త్రిపురాన్త కశ్చ స ఏవ దేవాసురయజ్ఞరూపః।
స ఏవ బ్రహ్మాండమిదం తతోఒన్యన్న కించిదస్తి వ్యతిరిక్తరూపమ్॥
యస్మాత్పరం నాపరమస్తే కించిద్యస్మాదణీయాన్న తథా మహీయాన్।
వ్యాప్తం వా తేనేదమిదం విచిత్రం తం దేవదేవం ప్రణమత్సమీడ్యమ్॥
ఇతి శ్రీ బృహన్నారదీయపురాణే పూర్వభాగే ప్రథమపాదే సృష్టి భరతఖండప్రాశస్త్య భూగోలానాం వర్ణనం నామ తృతీయోధ్యాయః॥
కావున భారతవర్షము అన్నిటికంటే ఉత్తమము, పరమ పవిత్రము, అని తెలియుము. అట్లే అన్ని విధముల కర్మల ఫలములనిచ్చునది. దేవతలకు కూడా లభించ శక్యము కానిది. ఈ భారత భూభాగమున మంచి పనులను చేయ సమకట్టిన వానితో సమానుడు మరియొకడుండడు. ఈ భారత భూభాగమున పుట్టి కర్మలను క్షీణింపచేయదలచిన మానవుడు మానవరూపముతో నున్న శ్రీహరియే. ఈ విషయమున సందేహముతో పనిలేదు. పరలోక ఫలమును పొందగోరువాడు కూడా సోమరితనమును విడిచి కర్మలను చేయవలయును. చేసిన కర్మలను శ్రీహరికి సమర్పించినచో ఆ ఫలము తరగని దగును. కర్మఫలములలో ఆశలేనివాడుకూడా సత్కర్మల నాచరించి శ్రీహరి ప్రీతి చెందుగాక అని సుకృతములను శ్రీమన్నారాయణునకు సమర్పించవలయును. బ్రహ్మలోకము వరకున్న లోకములన్నియు పునర్జన్మ నిచ్చునవే. కర్మఫలముల నాశించనివాడు పునర్జన్మ లేని పరమపదమును పొందును. పరమేశ్వరుని ప్రీతికొరకు తన ఆశ్రమానుగుణముగా వేదవిహిత కర్మల నాచరించవలయును. కర్మ ఫలములను వదిలినవాడు. పరమపదమును పొందును. కోరికలున్నవాడైనను లేనివాడైనను శాస్త్రము ననుసరించి కర్మలనాచరించియే తీరవలయును. తన ఆశ్రమాచారముల ననుసరించని వానిని పండితులు పతీతుడందురు. సదాచారపరుడైన బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సుతో వృద్ధి చెందును. భక్తియుక్తుడైన వానికి శ్రీహరి సంతుష్టుడగును. ఓ నారద మహర్షి ! భారతవర్షమున పుట్టి ఆత్మను తరింపచేసుకోననివాడు సూర్యచంద్రులుండువరకు నరకము ననుభవించుచుండును. ధర్మము వాసుదేవ స్వరూపము. తపస్సు వాసుదేవ స్వరూపము. జ్ఞానము వాసుదేవుని తెలుపునదే. వాసుదేవుని చేర్చునదే ఉత్తమగతి. స్థావరజంగమాత్మకమగు ఈ ప్రపంచమంతయు వాసుదేవ స్వరూపమే. బ్రహ్మ నుండి స్తంబమువరకున్న ఈ ప్రపంచము సర్వము వాసుదేవాత్మకమే. శ్రీహరి కానిదేదీలేదు. శ్రీహరియే బ్రహ్మ. శ్రీహరియే విష్ణువు. దేవదానవ యజ్ఞరూపము లన్నియూ శ్రీహరియే. ఈ బ్రహ్మాండమంతయూ శ్రీమన్నారాయణుడే. శ్రీహరి కానిది శ్రీహరికంటే వేరైనది ఏదియును లేదు. శ్రీహరి కంటే గొప్పది, తక్కువది ఏదియును లేదు. శ్రీహరి కంటే పెద్దది చిన్నది కూడా ఏది లేదు. ఈ చిత్ర విచిత్రమైన ప్రపంచమందంతటనూ శ్రీమన్నారాయణుడు వ్యా పించి యున్నాడు. కావున చక్కగా స్తుతించదగిన శ్రీమన్నారాయణునికి నమస్కరించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సృష్టి, భరతఖండ ప్రాశస్త్యము భూగోళ వర్ణనము అను మూడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 3 of the Nārada Mahā Purana is as follows:
ఈ అధ్యాయంలో సనందన మహర్షి దేవర్షి నారద మహర్షికి సమస్త బ్రహ్మాండ నిర్మాణము, సప్త ద్వీపములు, సప్త సముద్రములు మరియు జంబూద్వీప విశేషాలను ప్రత్యక్ష సత్యముగా వివరించినారు. సకల పుణ్యకర్మలకు, మోక్ష సాధనకు అత్యంత పవిత్ర భూమియైన భారతవర్షము యొక్క భౌగోళిక మరియు ఆధ్యాత్మిక మహత్యము, ఇక్కడి పవిత్ర నదులు, పర్వతములు మరియు యుగధర్మముల వైభవము అత్యంత భక్తిశ్రద్ధలతో వర్ణించబడినవి.