82 -  అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

కిం త్వం నారద జానాసి పూర్వ జన్మని యత్త్యయా !

 ప్రాప్తం భగవతస్సాక్షాచ్ఛూలినో యుగలాత్మకమ్

 కృష్ణమంత్రరహస్యం చ స్మర విస్మృతిమాగతమ్

సనత్కుమార మహర్షి పలికెను :- ఓ నారదా ! నీవు పూర్వజన్మలో సాక్షాత్తు భగవంతుడు శంకరుని దర్శించి యుగలాత్మకమును కృష్ణమంత్ర రహస్యమును పొందుటను తెలిసియున్నావు. ఒకవేళ మరిచినచో గుర్తు తెచ్చుకానుము.

సూత ఉవాచ :

ఇత్యుక్తో నారదో విప్రాః కుమారేణతు ధీమతా

ధ్యానే వివేదాశు చిరం చరితం పూర్వజన్మనః

తతశ్చిరం ధ్యానపరో నారదో భగవత్ప్రియః

 జ్ఞాత్వా సర్వం సువృత్తాంతం సుప్రసన్నాననోఽ బ్రవీత్

భగవన్సర్వవృత్తాంతః పూర్వకల్పసముద్భవః

 మమ స్మతిమనుప్రాప్తో వినా యుగలలంభనమ్

తచ్చ్రుత్యా వచనం తస్య నారదస్య మహాత్మనః

 సనత్కుమారో భగవాన్ వ్యాజహార యథాతథమ్

సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తములారా ! ఇట్లు సనత్కుమారుడు పలుకగా ధ్యానముచే పూర్వజన్మ వృత్తానమును తెలుసుకానెను. భగవత్రియుడగు నారదుడు చాలా కాలము ధ్యానమున నుండి తన వృత్తానమును తెలుసుకాని ప్రసన్నముఖుడై ఓ మహానుభావా? పూర్వకల్పమున జరిగిన వృత్తాంతమంతయు ఒక యుగల లంభనము తప్ప గుర్తుకాచ్చినది. అని పలికెను. అని నారదుని మాటలను వినిన సనత్కుమార మహర్షి యథార్థమును చెప్పసాగెను.

 సనత్కుమార ఉవాచ :

శృణు విప్ర ప్రవక్ష్యామి యస్మిన్జన్మని శూలినః

ప్రాప్తం కృష్ణరహస్యం వై సావధానో భవాధునా

 అస్మాతారస్వతాత్కల్పాత్ పూర్వస్మిన్పంచవింశకే

కల్పే త్వం కాశ్యపో జాతో నారదో నామ నామతః

 తత్రైకదా త్వం కైలాసం ప్రాప్తః కృష్ణస్య యోగినః

 సంప్రష్టుం పరమం తత్త్వం శివం కైలాసవాసినమ్

త్వయా పృష్టో మహాదేవో రహస్యం స్వప్రకాశితమ్

 కథయామాస తత్త్యేన నిత్యలీలానుగం హరేః

 తతస్తదన్త్ర తు పునస్యయం విజ్ఞాపితో హరః

 నిత్యాం లీలాం హరేర్ద్రష్టుం తతః ప్రాహ సదాశివః

గోపీజనపదస్యాంతే వల్లభేతి పదం తతః

చరణోశ్చరణం పశ్చాత్ ప్రపద్యే ఇతి వై మనుః

మంత్రస్యాస్య ఋషిః ప్రోక్తో సురభిశ్చన్త్ర ఏవ చ

గాయత్రీ దేవతా చాస్య వల్లవీవల్లభోవిభుః

ప్రపన్నోఽస్మీతి తద్భక్తా వినియోగ ఉదాహృతః

నాస్య సిద్ధాదికం విప్ర శోధనం న్యాసకల్పనమ్

కేవలం చిన్త్రనం సద్యో నిత్యలీలాప్రకాశనమ్

ఆభ్యన్తరస్య ధర్మస్య సాధనం వచ్మి సాంప్రతమ్

సంగృహ్య మన్త్రం గురుభక్తియుక్తో విచిన్య సర్వం మనసా తదీహితమ్

కృపాం తదీయాం నిజధర్మసంస్ధ విభావయన్నా త్మని తోషమేదురుమ్

 సతాం శిక్షేత వై ధర్మానపన్నానాం భయాపహాన్

ఐహికా ముష్మికీ చిన్తావిధురాన్సిద్ధి దాయకాన్

స్వేష్టదేవధియా నిత్యం తోషయేద్వైష్ణవాంస్తథా

భర్ఘ్ననాదికమేతేషాం న కదాచిద్విచిస్తయేత్

 పూర్వకర్మవశాద్భవ్యమైహికం భోగ్యమేవ చ 1

ఆయుష్యకం తథా కృష్ణః స్వయమేవ కరిష్యతి

శ్రీకృష్ణం నిత్యలీలాస్థం చింతయేత్స్వధియానిశమ్

 శ్రీమదర్చావతారేణ కృష్ణం పరిచరేత్సదా

అనన్యచింతనీయోఽసౌ ప్రపన్నైశరణార్థిభిః

 స్థేయం చ దేహగేహాదావుదాసీనతయా బుధైః

 గురోరవజ్ఞాం సాధూనాం నిందాం భేదం హరే హరే

వేదనిన్దాం హరేరామ బలాత్పాపసమిహనమ్

 ఆర్థవాదం హరేరామ్ని పాషండం నామసంగ్రహే

అలసే నాస్తికే చైవ హరినామోపదేశనమ్

 నామ విస్మరణం చాపి నాన్ననాదరమేవ చ

సంత్యజేద్దూరతో వత్స దోషానే తాన్సుదారుణాన్

ప్రపన్నోఽస్మీతి సతతం చింతయేద్ధృధ్ధతం హరిమ్

 స ఏవ పాలనం నిత్యం కరిష్యతి మమేతి చ

 తవాస్మి రాధికానాథ కర్మణా మనసా గిరా

కృష్ణకాంతేతి చైవాస్మి యువామేవ గతిర్మమ

దాసాస్సఖాయః పితర: ప్రేయస్యశ్చ హరేరిహ

సర్వే నిత్యా మునిశ్రేషా చిన్లనీయా మహాత్మభి:

 గమనాగమనే నిత్యం కరోతి వనగోష్ఠయోః

  గోచారాణాం వయస్యైశ్చ వినాసురవిఘాతనమ్

 సఖాయో ద్వాదశాఖ్యాతా హరేశ్రీరామపూర్వకా:

 రాధికాయాస్సుశీలాద్యాః సఖ్యో ద్వాత్రింశదీరితాః 

ఆత్మానం చింతయేద్వత్స తాసాం మధ్యే మనోరమామ్

రూపయౌవన సంపన్నాం కిశోరీం చ

స్వలంకృతామ్  నానాశిల్పకళాభిజ్ఞాం కృష్ణభోగానురూపిణీమ్  తత్సవనసుఖాహ్లాదభావేనాతిసునిర్వతామ్

 బ్రాహ్మం ముహూర్తమారభ్య యావదర్థనిశా భవేత్

తావత్ పరిచరేత్తే తు యథాకాలాను సేవయా

 సహస్రం చ తయోర్నామ్నాం పఠేన్నిత్యం సమాహితః

ఏతత్సాధనముద్దిష్టం ప్రపన్నానాం మునీశ్వర

 నాఖ్యేయం కస్యచిత్తుభ్యం మయా తత్యం ప్రకాశితమ్

సనత్కుమార మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా? నీవు ఏ జన్మలో శంకరుని నుండి కృష్ణ రహస్యమును పొందితివో దానిని చెప్పెదను. సావధానముగా వినుము. ఈ సారస్వతకల్పము కంటే మొదట ఇరువదియైదవ కల్పమున నీవు కాశ్యపునిగా నొకనామముచే పుట్టియుంటివి. ఆ కల్పమున ఒకనాడు నీవు కృష్ణ రహస్యమును అడుగుటకు కైలాస వాసియగు శంకరుని వద్దకు వెళ్ళి యుంటివి. నీవడుగగా శంకరుడు నిత్య లీలాచరుడగు కృష్ణుని రహస్యమును చెప్పసాగెను. అట్లు చెప్పిన తరువాత కృష్ణ భగవానుని నిత్యలీలను చూడమని చెప్పెను. “గోపీ జనవల్లభ చరణా శరణం ప్రపద్యే” అనునది మంత్రము. ఈ మంత్రమునకు సురభి ఋషి. గాయత్రీ ఛందస్సు. వల్లవీ వల్లభుడగు కృష్ణ పరమాత్మ దేవత. ప్రసన్నోస్మి' అని వినియోగము చేయవలయును. ఈ మంత్రమునకు సిద్ధి మొదలగునవి, శోధనము, న్యాసములుండవు. ఈ మంత్రము కేవలము చింతన మాత్రముననే శ్రీ హరి నిత్యలీలో ప్రకాశకము. ఇక ఇపుడు ఆభ్యంతర ధర్మసాధనమును చెప్పెదను. గురుభక్తి కలవాడై గురువు నుండి మంత్రమును పొంది, చింతనము గావించి నిజధర్మమున నిలిచి, గురుకృపను తలచుచు గురువును సంతోషపరచవలయును. శ్రేయోదాయకములగు సజ్జన ధర్మములను తెలియవలయును. ఇష్టదైవబుద్దిచే ఎల్లపుడు విష్ణు భక్తులను సంతోష పరచవలయును. విష్ణు భక్తులను నిందించుట, బెదిరించుట మొదలగు వాటిని మనసులో కూడా ఆలోచించరాదు. పూర్వకర్మవశమున జరుగవలసిన ఐహికమును, అనుభవమును, ఆయుష్యమును శ్రీ కృష్ణ భగవానుడు స్వయముగా చేయగలడు. ఎల్లపుడు తన బుద్దిచే నిత్యలీలాస్థితుడగు శ్రీ కృష్ణుని చింతించవలయును. ఆర్చావతారమున నన్ను కృష్ణుని ఎప్పుడూ సేవించవలయును. ప్రసన్నులచే, శరణార్డులచే సేవించదగినవాడు శ్రీకృష్ణ భగవానుడొక్కడే. శరీర గృహాది విషయములలో ఉదాసీనముగా నుండవలయును. గురువును అవమానించరాదు. సాధునింద చేయరాదు. హరిహరు లందు భేదమును చూడరాదు. వేదనింద కూడదు. బలముతో పాపములను ఆలోచించరాదు. హరి నామమున ఆర్థవాదమును, నామ సంగ్రహమున పాషండ వాదమును చేయరాదు. అలసునికి నాస్తికునికి హరినామము నుపదేశించరాదు. హరి నామమును విస్మరించుట, హరినామము నందు అనాదరమును చూపుట విడువ వలయును. పైన చెప్పబడినవి మహా భయంకరములగు దోషములు. హృదయస్థితుడగు శ్రీహరిని ఎల్లపుడు ప్రసన్నుడనని చింతించవలయును. ఆ శ్రీహరియే ఎల్లపుడూ నన్ను కాపాడునని తలచుచుండవలయును. ఓ రాధికానాథ! మనసుచే మాటచే పనిచే నీవాడను అనియే ఉన్నాను. మీరే నాకు గతి. శ్రీ హరి దాసులను, మిత్రులను, తలిదండ్రులను, ప్రేయసులను ఎల్లపుడూ స్మరించుచుండవలయును. గోష్ఠము నుండి వనమునకు, వనము నుండి గోష్టమునకు గోచారణమును మిత్రులతో కలిసి చేయుచు వచ్చి పోవు శ్రీ కృష్ణుని చింతించు చుండవలయును. శ్రీరాముడు మొదలగువారు పన్నెండు మంది శ్రీ కృష్ణుని మిత్రులుగా చెప్పబడిరి. రాధిక నుండి సుశీల వరకు ముప్పది రెండు మంది ప్రేయసులు. వారి మధ్యన తానున్నట్లుగా భావించవలయును. అట్లే వారి మధ్య మనోరమను ధ్యానించవలయును. ఈ మనోరమ రూపయౌవన సంపన్న, కిశోరి, స్వలంకృత, నానా శిల్పకళాభిజ్ఞ, కృష్ణ భోగాను రూపిణి, శ్రీ కృష్ణసేవన సుఖాహ్లాద భావాతినిర్వతనుగా ధ్యానించవలయును. బ్రాహ్మీ ముహూర్తము నుండి అర్థరాత్రి వరకు ఆయాకాలానుగుణమగు సేవలతో రాధాకృష్ణులకు పరిచర్య చేయవలయును. రాధాకృష్ణ సహస్ర నామములను నిత్యమూ పఠించవలయును. ఇది ప్రసన్న జనసాధనముగా చెప్పబడినది. దీనిని పరీక్షించక ఎవరికీ తెలుపరాదు. నేను నీకు చెప్పితిని. (6–33). సనత్కుమార ఉవాచ :

తతస్త్వం నారద పునః పృష్టవాన్వై సదాశివమ్

నామ్నాం సహస్రం తచ్చాపి ప్రోక్తవాంస్తచ్ఛృణుష్వ మే,

 ధ్యాత్వా బృందావనే రమ్యే యమునాతీరసంగతమ్

కల్పవృక్షం సమాశ్రిత్య తిష్ఠన్తం రాధికాయుతమ్

 పఠేన్నామసహస్రం తు యుగలాఖ్యం మహామునే

దేవకీనన్దనశ్శారిర్వాసుదేవో బలానుజః

 గదాగ్రజ కంసమోహః కంససేవనమోహనః

 భిన్నార్గలో భిన్నలోహః పితృబాహ్య: పితృస్తుతం

మాతృస్తుతశ్శివధ్యేయో యమునాజలభేదనః

వ్రజవాసీ వ్రజానన్ద నన్దబాలో దయానిధిః

 లీలాబాల: పద్మనేత్రో గోకులోత్సవ ఈశ్వరః

గోపికానన్దనః కృష్ణో గోపానన్దస్సతాంగతి: I

బకప్రాణహరో విష్ణుర్భవముక్తిప్రదో హరి:

బలడోలాశయశయ: శ్యామలస్సర్వసున్ధరః

పద్మనాభో హృషీకేశః క్రీడామనుజబాలకః

లీలావిధ్వస్తశకటో వేదమంత్రాభిషేచితః

 యశోదానన్దనః కాంతో మునికోటినిషేవితః

నిత్యం మధువనావాసీ వైకుంఠస్సంభవః క్రతుః

 రమాపతిర్యదుపతీర్మురారిర్మధుసూదనః

మాధవో మానహారీ చ శ్రీపతిర్భూధరః ప్రభుః

 బృహద్వనమహాలీలో నందసూనుర్మహాసనః

 తృణావర్త ప్రాణహారీ యశోదావిస్మయప్రదః

త్రైలోక్యవక్త్రః పద్మాక్షః పద్మహస్తః ప్రియంకరః

బ్రహ్మణ్యో ధర్మగోప్తా చ భూపతి: శ్రీధరస్స్వరాట్

అజాధ్యక్షశ్శివాధ్యక్షో ధర్మాధ్యక్షో మహేశ్వరః

వేదాంతవేద్యో బ్రహ్మస్థః ప్రజాపతిరమోఘదృక్

గోపీకరావలంబీ చ గోపబాలకసుప్రియః

బాలానుయాయీ బలవాన్ శ్రీదామప్రియ ఆత్మవాన్ గోపీగృహాంగణరతిర్భద్రస్సుశ్లోకమంగల:

నవనీతహరో బాలో నవనీతప్రియాశనః

బాలబృన్దీ మర్కబృన్దీ చకితాక్షః పలాయితః

యశోదాతగ్జితః కంపీ మాయారుదితశోభనః

 దామోదరోఽ ప్రమేయాత్మా దయాలుర్భక్తవత్సలః

 సుబద్దలూఖలో నమ్రశిరా గోపీకదర్థితః

 వృక్షభంగీ శోకభంగీ ధనదాత్మజమోక్షణ:

 దేవర్షివచన శ్లాఘి భక్తవాత్సల్యసాగరః

 ప్రజకోలాహలపరో ప్రజానన్దవివర్థన:

గోపాత్మా ప్రేరకస్సాక్షీ బృన్దవననివాసకృత్

 వత్సపాలో వత్సపతిర్గోపదారకమండనః

 బాలక్రీడో బాలరతిర్బాలకః కనకాంగదీ

పీతాంబరో హేమమాలీ మణిముక్తావిభూషణ:

కింకిణీ కటకీ సూత్రనూపురీ ముద్రికాన్వితః

 వత్సాసురపతిధ్వంసీ బకాసురవినాశనః

అఘాసురవినాశీ చ వినిద్రీ కృతబాలకః

ఆద్య ఆత్మప్రదస్సంగ్ యమునాతీరభోజనః

గోపాలమండలీమధ్యః ! సర్వగోపాలభూషణ:

వృతహస్తతలగ్రాసో వ్యంజనాశ్రితశాభికః

కృతబాహుశృంగయష్టిర్గుంజాలంకృతకంఠకః

మయూరపిచ్ఛముకుటో వనమాలావిభూషితః .

గైరికాచిత్రితవపుః నవమేఘవపుస్స్మరః

కోటికందర్ప లావణ్యో లసన్మకరకుండలః

 ఆజానుబాహుర్భగవాన్నిద్రారహితలోచనః

 కోటిసాగరగాంభీర్య: కాలకాలస్సదాశివః

విరించిమోహనవపుర్గోపవత్సవపుర్థరః

బ్రహ్మాండకోటిజనకో బ్రహ్మమోహవినాశకః

 బ్రహ్మా బ్రహ్మేడితస్స్వామి శక్రధర్పాదినాశనః

 గిరిపూజోపదేష్టా చ ధృతగోవర్థనాచల:

పురందరేడితః పూజ్యః కామధేనుప్రపూజితః

 సర్వతీర్థాభిషిక్తశ్చ గోవిన్దో గోపరక్షకః

కాలియార్తికరః క్రూరో నాగపత్నీడితో విరాట్

 ధేనుకారిః ప్రబంబారిర్వృషాసురవిమర్దనః

మాయాసురాత్మజ ధ్వంసీ కేశికంఠవిదారకః

 గోపగోప్తా ధేనుగోప్తా దావాగ్ని పరిశోషకః

గోపకన్యావస్త్రహారీ గోపకన్యావరప్రదః

యజ్ఞపత్చ్యన్నభోజీ చ మునిమానాపహారకః

జలేశమానమథనో నందగోపాలజీవనః

గన్ధర్వశాపమోక్తా చ శంఖచూడశిరోహరః

వంశీవటీ వేణువాదీ గోపీచిన్తాపహారకః

 సర్వగోప్తా సమాహ్వానసర్వగోపీమనోరథః

వ్యంగధర్మప్రవక్తా చ గోపీమండలమోహనః

 రాసక్రీడారసాస్వాదీ రసికో రాధికాధవః

కిశోరీప్రాణనాథశ్చ వృషభాను సుతాప్రియః

సర్వగోపీజనానన్డీ గోపీజనవిమోహనం

 గోపికాగీతచరితో గోపీనర్తనలాలసః

 గోపీస్కంధాశ్రితకరో గోపికాచుంబనప్రియ:

గోపికామార్జితముఖో గోపీవ్యజనవీజితః

 గోపికాకేశసంస్కారీ గోపికాపుష్టసంస్తరః

గోపికాహృదయాలంబీ గోపీవనతత్పరః

గోపికామదహారీ చ గోపికాపరమార్జితః

గోపికాకృతసంనీలో గోపికాసంస్మృతప్రియః

 గోపికావన్దితపదో గోపికావశవర్తన:

రాధాపరాజితశ్రీమాన్నికుంజేషు విహారవాన్

కుంజప్రియ: కుంజవాసీ బృన్దావనవినాసనః

యమునాజలసిక్తాంగో యమునా సౌఖ్యదాయకః

 శశిసంస్తంభనశ్శూర: కామా కామవిమోహనం

కామాద్య: కామనాథశ్చ కామమానసభేదనః

కామద: కామరూపశ్చ కామినీ కామసంచయ:

నిత్యక్రీడో మహాలీలస్సర్వస్సర్వగతస్తథా

పరమాత్మా పరాధీశః సర్వకారణకారణ:

గృహీతనారదవచా హ్యక్రూరపరిచింతితః

అక్రూరవందితపదో గోపికాతోషకారకః

ఆక్రూరవాక్యసంగ్రాహీ మధురావాసకారణః

ఆక్రూరతాపశమనో రజకాయుః ప్రణాశనః

మధురానన్దదామి చ కంసవస్త్రవిలుంఠనః

కంసవస్త్రపరీధానో గోపవస్త్రప్రదాయకః

సుదామగృహగాయీ చ సుదామపరిపూజితః

తంతువాయనసంప్రీతః కుబ్జాచందనలేపనః

కుబ్జరూపప్రదో విజ్జో ముకుందో విష్టరశ్రవాః

 సర్వజ్ఞో మధురాలోకీ సర్వలోకాభినందనః

కృపాకటాక్ష దర్శీ చ దైత్యారిర్దేవపాలకః

సర్వదు:ఖప్రశమనో ధనుర్భంగీ మహోత్సవః

కువలయాపీడహంతా దంతస్కంధబలాగ్రణీ: 1

 కల్పరూపధరో ధీరో దివ్యవస్త్రానులేపనః

 మల్లరూపో మహాకాలః కామరూపీ బలాన్వితః

 కంసత్రాసకరో భీమో ముష్టికాంతశ్చ కంసహా

 చాణూరఘ్నో భయహరః శలారిస్తోశలాంతకః

వైకుంఠవాసీ కంసారి: సర్వదుష్టనిషూదనః

 దేవదుందుభినిర్ఘోషీ పితృశోకనివారణః

యాదవేన్ద్రస్సతాం నాథో యాదవారిప్రమర్దనః

శౌరిశోకవినాశీ చ దేవకీతాపనాశనః

 ఉగ్రసేనపరిత్రాతా ఉగ్రసేనాభిపూజితః

ఉగ్రసేనాభిషేకీ చ ఉగ్రసేనదయాపరః

 సర్వసాత్వతసాక్షీ చ యదూనామభినన్దనః

సర్వమాధురసంసేవ్య: వరుణో భక్తబాంధవః

సర్వగోపాలధనదో గోపీ గోపాలలాలసః

కర్షణసహాధ్యాయీ సుదామసుహృదేవ చ

 విద్యానిధి: కలాకోశో మృతపుత్రప్రదస్తథా

చక్రీ పాంచజనీ చైవ సర్వనారకిమోచనః

 యమార్చితః పరో దేవో నామోచ్చారవశోఽచ్యుతః

కుబ్జ విలాసీ సుభగో దీనబంధురనూపమః

ఆక్రూరగృహగోప్తా చ ప్రతిజ్ఞాపాలకశ్శుభః

 జరాసంధజయీ విద్వాన్ యవనాశో ద్విజాశ్రయః

 ముచుకుందప్రియవరో జరాసంధపలాయిత:

ద్వారకాజనకో గూఢ బ్రహ్మణ్యసత్యసంగరః

లీలాధరః ప్రియకరో విశ్వకర్మా యశఃప్రదః

రుక్మిణీప్రియసందేశో రుక్మశోకవివర్ధనః

చైద్యశోకాలయశ్రేష్ఠో దుష్టరాజన్యనాశనః

రుక్మి వైరూప్యకరణో రుక్మిణీ వచనే రతః

 బలభద్ర వచోగ్రాహీ ముక్తరుక్మీ జనార్దనః

రుక్మిణీ ప్రాణనాథశ్చ సత్యభామాపతి స్స్వయమ్

 భక్తపక్షీ భక్తివశ్యో హ్యక్రూరమణి దాయకః

శతధన్వా ప్రాణహారీ ఋక్షరాజ సుతాప్రియః

సత్రాజిత్తనయాకాంతో మిత్రవిందాపహారకః

సత్యాపతిర్లక్ష్మణాజిత్ పూజ్యో భద్రా ప్రియంకర

నరకాసురఘాతీ చ లీలా కన్యాహ జయీ

మురారిర్మదనేశోఽపి ధరిత్రీ దుఃఖనాశనః

 వైనతే స్వర్గగామి అదిత్యై కుండలప్రదః

 ఇంద్రార్చితో రమాకాంతో వజ్రభార్యా ప్రపూజితః

 పారిజాతాపహారీ చ శక్రమానాపహారకః

ప్రద్యుమ్న జనకసాంబ తాతో బహుసుతో విధుః

 గర్గాచార్యసత్యగతి ర్ధర్మాధారో ధరాధరః

 ద్వారకా మండన శ్లోక్య స్సుశ్లోకో నిగమాలయః

పౌండ్రక ప్రాణహారీ చ కాశీరాజు శిరోహరః

 అవైష్ణవవిప్రదాహీ సుదక్షిణ భయావహః

 జరాసంధ విదారీ చ ధర్మ నందన యజ్ఞకృత్

శిశుపాల శిరశ్ఛేదీ దంత వక్త్ర వినాశనః

విధూరధాంతక శ్రీశ శ్రీదో ద్వివిదనాశనః

రుక్మిణీ మానహారీ చ రుక్మిణీ మానవర్థకః

దేవర్షి శాపహర్తా చ ద్రౌపదీ వాక్యపాలకః

 దుర్వాస భయహారీ చ పాంచాలీ స్మరణాగతః

పార్థ దూతః పార్థమంత్రి పార్థదు:భౌఘనాశనః

 పార్థమానాపహారీ చ పార్థ జీవన దాయకః

పాంచాలీ వస్త్ర దాతా చ విశ్వపాలక పాలకః

శ్వేతాశ్వసారధిస్సత్య: సత్యసాధ్యో భయాపహః

సత్యసంధస్సత్యరతి: సత్యప్రియ ఉదారఫీ:

మహాసేన జయీ చైవ శివ సైన్య వినాశనః

బాణాసుర భుజచ్ఛేత్తా బాణబాహు వరప్రదః

 తారక్ష్యమానాపహారీ చ తారక్ష్యతేజోవివర్ధనః

 రామస్వరూపధారీ చ సత్యభామా ముదావహః

 రత్నాకర జలక్రీడో ప్రజలీలా ప్రదర్శకః

స్వప్రతిజ్ఞా పరిధ్వంసీ భీష్మాజ్ఞా పరిపాలకః

 వీరాయుధ హరః కాలః కాలకేశో మహాబలః

బర్బరీశ శిరోహారీ బర్బరీశ శిరః ప్రదః

ధర్మపుత్ర జయీ శూరో దుర్యోధన మదొంతకః

 గోపికా ప్రీతి నిర్బంధనిత్యక్రీడో వ్రజేశ్వరః

 రాధామండరతీర్థన్యః సదాందోల సమాశ్రితః

సదా మధువనా నన్డే సదా బృందా వనప్రియ:

 అశోకవనసన్నద్ధః సదా తిలక సంగతః

 సదా గోవర్థన రతిః సదా గోకుల వల్లభః .

 భాండీరవటసంవాసీ నిత్యవంశీ వటస్థితః

 నన్దగ్రామ కృతావాసో వృషభాను గ్రహః ప్రియ:

 గృహీత కామినీ రూపో నిత్యం రాస విలాసకృత్

వల్లవీ జన సంగోప్తా వల్లవీ జన వల్లభః

దేవశర్మ కృపాకర్తా కల్ప పాదప సంస్థితః

శిలాసుగంధ నిలయః పాదచారీ ఘనచ్ఛవి:

 అతసీ కుసుమప్రఖ్యః సదా లక్ష్మీ కృపాకరః

 త్రిపురారి ప్రియకరో హ్యుగధన్వా పరాజితః

 షడ్డుర ధ్వంస కర్తా చ నికుంభ ప్రాణహారకః

వజ్రనాభపురధ్వంసీ పౌండ్రక ప్రాణ హారకః

బహులాశ్వ ప్రీతికర్తా ద్విజవర్య ప్రియంకరః

 శివ సంకట హారీ చ వృకాసుర వినాశనః

 భృగు సత్కారకారీ చ శివసాత్త్వికతాప్రదః

 గోకర్ణపూజకసాంబకుష్ఠవిధ్వంసకారణ:

 వేదస్తుతో వేదవేత్తా యదు వంశ వివర్థనః

యదువంశ వినాశీ చ ఉద్ధవోద్ధార కారకః

 సనత్కుమార మహర్షి పలికెను :- ఓ నారదా అపుడు నీవు సదాశివుని రాధాకృష్ణ సహస్ర నామముల నడిగితివి. సదా శివుడు దానిని కూడా చెప్పెను. వినుము. సుందరమగు బృన్దావనమున యమునా తీరముననున్న కల్పవృక్షము నాశ్రయించి రాధికాయుతుడగు శ్రీ కృష్ణ భగవానుని ధ్యానించి యుగలమను పేరుగల నామ సహస్రమును పఠించవలయును.

దేవకీనందనుడు, శౌరి, వాసుదేవుడు, బలానుజుడు, గదాగ్రజుడు, కంసహుడు, కంససేవక మోహనుడు, భిన్నార్గలుడు, భిన్నలోహుడు, పితృబాహ్యుడు, పితృస్తుతుడు, మాతృస్తుతుడు, శివధ్యేయుడు, యమునా జలభేదనుడు, ప్రజవాసి, ప్రజానంది, నందబాలుడు, దయానిధి, లీలా బాలుడు, పద్మనేత్రుడు, గోకులోత్సవము, ఈశ్వరుడు, గోపికానందనుడు, కృష్ణుడు, గోపానందుడు, సద్గతి, బక ప్రాణహరుడు, విష్ణువు, బకముక్తి ప్రదుడు, హరి, బలడోలాశయ శయుడు, శ్యామలుడు, సర్వసుందరుడు, పద్మనాభుడు, హృషీకేశుడు, క్రీడామనుజ బాలకుడు, లీలా విధ్వస్త శకటుడు, వేదమంత్రాభిషేచితుడు, యశోదానందనుడు, కాంతుడు, మునికోటి నిషేవితుడు, నిత్యమధువనవాసి, వైకుంఠుడు, సంభవుడు, క్రతువు, రమాపతి, యదుపతి, మురారి, మధుసూదనుడు, మాధవుడు, మానహారి, శ్రీపతి, భూధరుడు, ప్రభువు, బృహుద్వన మహాలీలుడు, నందసూనుడు, మహాసనుడు, తృణావర్త ప్రాణహారీ, యశోదా విస్మయ ప్రదుడు, త్రైలోక్య వక్రుడు, పద్మాక్షుడు, స్వరాట్, అజాధ్యక్షుడు, శివాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు, మహేశ్వరుడు, వేదాన్త్ర వేద్యుడు, బ్రహ్మస్థుడు, ప్రజాపతి, అమోఘదృష్టి, గోపీకరాలంబి, గోపజాలక సుప్రియుడు, బాలానుయాయి, బలవన్, శ్రీరామ ప్రియుడు, ఆత్మవాన్, గోపీ గృహాంగణరతి, భద్రుడు, సుశ్లోకమంగలుడు, నవనీతహరుడు, బాలుడు, నవనీత ప్రియాశనుడు, బాలబృన్టీ, మర్కబృన్డీ, చకితాక్షుడు, పలాయితుడు, యశోదా తగ్జితుడు, కంట మాయారోదిత శోభనుడు, దామోదరుడు, అప్రమేయాత్మా, దయాళువు, భక్తవత్సలుడు, సుబద్దలూఖలుడు,

తిలోత్తమా త్రికాలస్థా త్రికాలజ్జాప్యధీశ్వరీ

త్రివేదజ్జా త్రిలోకజ్జా తురీయాన్త్రనివాసినీ

 దుర్గారాధ్యా రమారాధ్యా విశారాధ్యా చిదాత్మికా

 దేవారాధ్యా పరారాధ్యా బ్రహ్మరాధ్యా పరాత్మికా

శివారాధ్యా ప్రేమసాధ్యా భక్తారాధ్యా రసాత్మికా

కృష్ణ ప్రాణార్పిణీ భామా శుద్ధ ప్రేమ విలాసినీ

 కృష్ణారాధ్యా భక్తిసాధ్యా భక్తబృన్దనిషేవితా

 విశ్వాధారా కృపాధారా జీవాధారాతినాయికా

 శుద్ధప్రేమమయీ లజ్జా నిత్యసిద్ధా శిరోమణిః

దివ్యరూపా దివ్యభోగా దివ్యవేషా ముదాన్వితా

దివ్యాంగనా బృన్దసారా నిత్యనూతనమౌవనా

 పరబ్రహ్మవృతా ధ్యేయా మహారూపా మహోజ్జ్వలా

 కోటిసూర్యప్రభా కోటీచన్ద్రబింబాధికచ్ఛవి:

 కోమలామృతవాగాద్యా వేదాద్య వేద దుర్లభా

 కృష్ణాసక్తా కృష్ణభక్తా చన్ద్రావలినిషేవితా

కలా షోడశసంపూర్ణా కృష్ణదేహార్ధధారిణీ కృష్ణబుద్ధి:

 కృష్ణసారా కృష్ణ రూప విహారిణీ

కృష్ణ కాస్తా కృష్ణ ధనా కృష్ణ మోహన కారిణీ 

కృష్ణదృష్టిః కృష్ణగోత్రీ కృష్ణదేవీ కులోద్వహా

 సర్వ భూతస్థితా ఆత్మా సర్వలోక నమస్కృతా

 కృష్ణదాత్రీ ప్రేమధాత్రీ స్వర్ణగాత్రీ మనోరమా

నగధాత్రీ యశోదాత్రీ మహాదేవీ శుభంకరీ

శ్రీశేషదేవ జననీ అవతార గణప్రసూః

ఉత్పలాంకార విందాంకా ప్రసాదంకా ద్వితీయకా

 రథాంకా కుంజరాంకా చ కుండలాంక పదస్థితా

ఛత్రాంకా విద్యుదంకా చ పుష్ప నూలాంకితాపి చ

 దండాంకా ముకుటాంకా చ పూర్ణచన్ద్రాశుకాంకితా

కృష్ణాన్నహార పాకా చ బృన్దా కుంజ నిహారిణీ

 కృష్ణప్రబోధనకరీ కృష్ణశేషాన్న భోజినీ

పద్మకేసర మధ్యస్థా సంగీతా గమవేదినీ

కోటికల్పాంత భ్రూభంగా అప్రాప్త ప్రలయాచ్యుతా

 సర్వస్వనిధి సంపద్మ శంభాది నిధి సేవితా

 అణిమాది గుణైశ్వర్యా దేవబృన్ద విమోహినీ

సర్వానన్ద ప్రదా సర్వా సువర్ణ లతికా కృతి:

కృష్ణాభిసారా సంకేతా మాలినీ నృత్య పండితా

 గోపీసిన్దుసకాశాహ్వా గోప మండప శోభినీ

శ్రీ కృష్ణ ప్రీతిదా భీతా ప్రత్యంగ పులకాంచితా

 శ్రీ కృష్ణాలింగన రతా గోవిన్ద విరహాక్షమా

ఆనన్త గుణ సంపన్నా కృష్ణ కీర్తన లాలసా

బీజత్రయమయీ మూర్తి: కృష్ణాను గ్రహవాంఛితా

 విమలాది నిషేవ్యా చ లలితాద్యాశ్చితా సతీ

పద్మబృష్ణ స్థితా హృష్టా త్రిపురా సరిసేవితా

వృత్తావత్యర్చితా శ్రద్ధా దుర్జయా భక్త వల్లభా

దుర్లభా సాంద్ర సౌఖ్యాత్మా శ్రేయోహేతుస్సుభోగదా

 సారంగా శారదా బోధా సద్భృందావనచారిణీ

బ్రహ్మనస్థా చిదానన్దా ధ్యానానందార్థమాత్రికా

 గంధర్వా సురతజ్ఞా చ గోవిన్దప్రాణసంగమా

కృష్ణాంగభూషణా రత్నభూషణా స్వర్ణభూషితా

 శ్రీకృష్ణహృదయావాస ముక్తాకనకనాలికా

సద్రత్నకంకణయుతా శ్రీమన్నీలగిరిస్థితా

స్వర్ణనూపురసంపన్నా స్వర్ణకింకిణిమండితా

 అశేషరాసకుడుకా రంభోరుస్తనుమధ్యమా

 పరాకృతిః పరానన్దా పరస్వర్గ విహారిణీ

ప్రసూన కబరీ చిత్రా మహా సిన్లూర సున్దరీ

కైశోర వయసా బాలా ప్రమదాకులశేఖరా

కృష్ణాధరసుధా స్వాదా శ్యామప్రేమ వినోదినీ

శిఖి పిచ్చలసచ్చూడా స్వర్ణ చంపక భూషితా

కుంకుమలక్త కస్తూరీ మండితా చాపరాజితా

 హేమ హారాన్వితా పుష్పా హారాధ్యా రసవత్యపి

 మాధుర్య మధురా పద్మా పద్మహస్తా సువిశ్రుతా

 భ్రూభంగా భంగ కోదండ కటాక్ష శరసంధినీ

 శేష దేహ శిరస్థా చ నిత్య స్థల విహారిణీ

 కారుణ్య జల మధ్యస్థా నిత్య మత్తాధి రోహిణీ

అష్ట భూషావతీ చాష్ట్రనాయికా లక్షణాన్వితా

 సునీతిజ్జా శ్రుతిజ్ఞా చ సర్వజ్ఞా దుఃఖ హారిణీ

 రజోగుణేశ్వరీ చైవ జరచ్చన్ద్రనిభాననా

 కేతకీ కుసుమాభాసా సదాసిన్దు వనస్థితా

 హేమ పుష్పాధికకరా పంచశక్తిమయీ హితా

 స్తనకుంభి నరాఢ్యా చ క్షీణపుణ్యా యశస్వినీ

వైరాజ సూయజననీ శ్రీశా భువన మోహినీ

మహాశోభా మహామాయా మహాకాంతి ర్మహాస్మృతిః

మహామోహా మహావిద్యా మహాకీర్తి ర్మహారతి:

మహాధైర్యా మహావీర్యా మహాశక్తి ర్మహాద్యుతిః

 మహాగౌరీ మహాసంపన్మహాభోగ విలాసినీ

సమయా భక్తిదా శోకా వాత్సల్య రసదాయినీ

సుహృద్భక్తి ప్రదా స్వచ్ఛా మాధుర్య రస వర్షిణీ

భావ భక్తి ప్రదా శుద్ధ ప్రేమ భక్తి విధాయినీ

 గోప రామాభిరామ చ క్రీడా రామా పరేశ్వరీ

నిత్య రామా చాత్మరామా కృష్ణ రామా రమేశ్వరీ

 ఏకానేక జగద్వ్యాప్తా విశ్వలీలా ప్రకాశినీ

 సరస్వతీశా దుర్గేశా జగదీశా జగద్విధి:

 విష్ణువంశ నివాసా చ విష్ణువంశ సముద్భవా

విష్ణువంశ స్తుతా కర్త్రీ విష్ణువంశావనీ సదా

ఆరామస్థా వనస్థా చ సూర్యపుత్ర్యవ గాహినీ

 ప్రీతిస్తా నిత్య యంత్రస్తా గోలోకస్థా విభూతిదా

 స్వానుభూతి స్థితా వ్యక్తి సర్వలోక నివాసినీ

 అమృతా హ్యద్భుతా శ్రీమన్నారాయణ సమిరితా

 అక్షరాపి చ కూటస్థా మహా పురుష సంభవా

ఔదార్య భావసాధ్యా చ స్థూల సూక్ష్మాతి రూపిణీ

 శిరీష పుష్ప మృదులా గాంగేయ ముకుర ప్రభా

 నీలోత్పల జితాక్షీ చ సద్రత్నికవరాన్వితా.

 ప్రేమపర్యంకనిలయా తేజో మండల మధ్యగా

 కృష్ణాంగ గోపన్యాభేదా లీలా వరణ నాయికా

సుధాసిందు సముల్లసామృత స్యంద విధాయినీ

కృష్ణ చిత్తా రాస చిత్తా ప్రేమ చిత్తా హరిప్రియా

 ఆచింతన గుణగ్రామా కృష్ణలీలా మలాపహా

 రాససిన్దుశశాంకా చ రాసమండల మండినీ

నతవ్రతా సింహరీస్థా సుమూర్తి సురవందితా

గోపీ చూడామణి ర్గోపి గణేడ్యా విరజాధికా

గోపప్రేష్ఠా గోపకన్యా గోపనారీ సుగోపికా

గోపధామా సుదామాంబా గోపాలీ గోపమోహినీ

 గోపభూషా కృష్ణభూషా శ్రీ బృందావన చన్ద్రికా

వీణాదిఘోషనిరతా రాసోత్సవ వికాసినీ

కృష్ణచేష్టా పరిజ్జాతా కోటి కన్దర్ప మోహినీ

 శ్రీ కృష్ణ గుణగానాధ్యా దేవ సున్దరిమోహినీ

కృష్ణచన్ద్ర మనోజ్ఞా చ కృష్ణ దేవ సహోదరీ

 కృష్ణాభిలాషిణీ కృష్ణ ప్రేమానుగ్రహవాంఛితా

 క్షేమా చ మధురాలాపా భ్రువో మాయా సుభద్రికా

ప్రకృతిః పరమా నన్దా నీపద్రుమతల స్థితా

 కృపాకటాక్షా బింబోష్ఠి రంభా చారు నితంబినీ

 స్మగకేలి నిధానా చ గండతాటంకమండితా

 హేమాద్రి కాంతిరుచిరా ప్రేమాద్యా మదమంధరా

 కృష్ణచింతా ప్రేమచింతా రతిచింతా చ కృష్ణదా

 రాసచింతా భావచింతా శుద్ధ చింతా మహారసా

కృష్ణాదృష్టి త్రుటియుగా దృష్టి పక్ష్మి వీనిందినీ

 కందర్ప జననీ ముఖ్యా వైకుంఠగతి దాయినీ

 రాస భావా ప్రియాశ్లిష్టా ప్రేష్ఠా ప్రథమ నాయికా

శుద్దా సుధా దేహినీ చ శ్రీరామా రసమంజరీ

సుప్రభావా శుభా చారా స్వర్ణదీ నర్మదాంబికా

గోమతీ చన్ద్రభారేడ్యా సరయూ స్తామ్ర పర్ణిసూః

నిష్కలంకచరిత్ర చ నిర్గుణా చ నిరంజనా

ఏతన్నామసహస్రం తు యుగ్మరూపస్య నారద

పఠనీయం ప్రయత్నేన బృన్దావన రసావహే

 మహాపాపప్రశమనం వంధ్యత్వ వినివర్తకమ్

దారిద్ర్యశమనం రోగనాశనం కామదం మహత్

పాపాపహం వైరిహరం రాధామాధవ భక్తిదమ్

 నమస్తస్మై భగవతే కృష్ణాయాకుంఠమేధసే

రాధాసంగసుధా సింధో నమో నిత్య విహారిణీ

రాధాదేవీ జగత్కర్తీ జగత్పాలన తత్పరా

జుగల్లయ విధాత్రీ చ సర్వేశీ సర్వసూతికా

 తస్యా నామసహస్రం వై మయా ప్రోక్తం మునీశ్వర

భుక్తి ముక్తి ప్రదం దివ్యం కిం భూయ శ్రోతు మిచ్ఛసి

 ఇతి శ్రీ బృహన్నారదీయ మహా పురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయ పాదేరాధాకృష్ణ సహస్ర నామ కథనం నామ ద్వ్యశీతితమోఽధ్యాయః.

రాధ, రాధికా, ఆనందా, వృషభానుజా, బృన్దావనేశ్వరీ, పుణ్యా, కృష్ణమానస హారిణీ, ప్రగల్భా, చతురా, కామా, కామినీ, హరిమోహినీ, లలితా, మధురా, మాధ్వీ, కిశోరీ, కనకప్రభా, జితచంద్రా, జితమృగా, జితసింహా, జితద్వీపా, జితరంభా, జితపికా, గోవిన్ద హృదయోద్భవా,

జితబింబా, జితశుకా, జితపద్మా, కుమారికా, శ్రీ కృష్ణా కర్షణా, దేవీ, నిత్యయుగ్మ స్వరూపిణీ, నిత్య విహారిణీ, కాంతా, రసికా, కృష్ణ వల్లభా, ఆమోదినీ, మోదవతీ, నన్ద నన్దన భూషితా, దివ్యాంబరా, దివ్యహారా, ముక్తామణి విభూషితా, కుంజప్రియా, కుంజవాసా, కుంజనాయక నాయికా, చారురూపా, చారువక్రా, చారుహేమాంగదా, శుభా, శ్రీ కృష్ణ వేణు సంగీతా, మురలీ హారిణీ, శివా, భద్రా, భగవతీ, శాంతా, కుముదా, సుందరీ, ప్రియా, కృష్ణ క్రీడా, కృష్ణరతి, శ్రీ కృష్ణ సహచారిణీ, వంశీవట ప్రియస్థానా, యుగ్మా, యుగ్మ స్వరూపిణీ, భాండీర వాసినీ, శుభ్రా, గోపీనాధ ప్రియా, సఖీ శ్రుతిని:శ్వసితా, దివ్యా, గోవిన్దరదాయినీ, శ్రీ కృష్ణ ప్రార్థనీ, ఈశానా, మహానళ్ల ప్రదాయినీ, వైకుంఠ జన సంసేవ్యా కోటి లక్ష్మీ, సుఖావహా, కోటికన్దర్ప లావణ్యా, రతికోటి రతిప్రదా, భక్తిగ్రాహ్యా, భక్తి రూపా, లావణ్య సరసీ, ఉమా, బ్రహ్మరుద్రాది సంరాధ్యా, నిత్యకౌతూహలాన్వితా, నిత్యలీలా, నిత్యకామా, నిత్య శృంగార భూషితా, నిత్య బృష్ణా వనరసా, వన్ద నన్దన సంయుతా, గోపికా మండలీ యుక్తా, నిత్య గోపాల సంగతా, గోరసక్షేపణీ, శూరా, సానన్గా, ఆనన్ద దాయినీ, మహాలీలా, ప్రకృష్ణా, నాగ, నగ చారిణీ, నిత్యా ఘూర్ణితా, పూర్ణా, కస్తూరీ తిలకాన్విత, పద్మా, శ్యామా, మృగాక్షీ, సిద్దిరూపా, రసావహా, కోటి చన్తాననా, గౌరీ, కోటి కోకిల సుస్వరా, శీలసౌన్దర్య నిలయా, నన్ద నన్జనలాలిత, అశోక వన సంవాసా, భాండీర వన సంగతా, కల్పద్రుమ తలావిష్టా, కృష్ణా, విశ్వా, హరిప్రియా, అజాగమ్యా, భావగమ్యా, గోవర్థన కృతాలయా, యమునా తీర నిలయా, శశ్వద్గోవిన్ద జల్పినీ, శశ్వన్మానవతీ, స్నిగ్ధ, శ్రీ కృష్ణ పరి వర్ణిత, కృష్ణస్తుత, కృష్ణ వృతా, శ్రీ కృష్ణ హృదయాలయ, దేవద్రుమఫలా, సేవ్యా, బృన్తావన రసాలయా, కోటి తీర్థమయీ, సత్యా, కోటి తీర్థఫలప్రదా, కోటియోగ సుదుమ్రాప్యా, కోటియజ్ఞ దురాశ్రయా, మానసా, శశిరేఖా, శ్రీ కోటి సుభగా, అనఘా, కోటిముక్త సుఖా, సౌమ్యా, లక్ష్మీ కోటి విలాసినీ, తిలోత్తమా, త్రికాలస్థా, త్రికాలజ్జా, అధీశ్వరీ, త్రివేదజ్జా, త్రిలోకజ్జా, తురీయాన్త్ర నివాసినీ, దుర్గారాధ్య, రమారాధ్య, విశ్వారాధ్య, చిదాత్మిక, దేవారాధ్య, పరారాధ్య, బ్రహ్మారాధ్య, పరాత్మిక, శివారాధ్య, ప్రేమసాధ్య, భక్తారాధ్య, రసాత్మిక, కృష్ణ ప్రాణార్పణీ, భామా, శుద్ధ ప్రేమ విలాసినీ, కృష్ణారాధ్య, భక్తి సాధ్యా, భక్త బృంద నిషేవితా, విశ్వాధారా, కృపాధారా, జీవాధారా, అతి నాయికా, శుద్ధ ప్రేమమయీ, లజ్జా, నిత్య సిద్ధా, శిరోమణి, దివ్య రూపా, దివ్యభోగా, దివ్యవేషా, ముదాన్వితా, దివ్యాంగనా బృష్ణసారా, నిత్య నూతన యౌవనా, పరబ్రహ్మవృతా, ధ్యేయా, మహారూపా, మహోజ్జ్వలా, కోటిసూర్య ప్రభా, కోటి చన్ద బింబాధికచ్ఛవి, కోమలా, అమృతవాక్, ఆద్యా, వేదాద్యా, వేద దుర్లభా, కృష్ణాసక్తా, కృష్ణభక్తా, చంద్రావతి నిషేవితా, కలా షోడశ సంపూర్ణి, కృష్ణ దేహార్థ ధారిణీ, కృష్ణబుద్ది, కృష్ణ సారా, కృష్ణ రూప విహారిణీ, కృష్ణ కాంతా, కృష్ణ ధనా, కృష్ణ మోహన కారిణీ, కృష్ణ దృష్టి, కృష్ణగోత్రి, కృష్ణదేవీ, కులో ద్వహా, సర్వభూత స్థితా, ఆత్మా, సర్వలోక నమస్కృతా, కృష్ణ దాత్రీ, మహాదేవీ, శుభంకరా, శ్రీ శేష దేవజననీ, అవతార గణ ప్రసూ, ఉత్పలాంకా, అరవిందాంకా, ప్రసాదింకా, ద్వితీయకా, రధాంకా, కుంజరాంకా, కుండలాంక పదస్థితా, ఛత్రాంకా, విద్యుదంకా, పుష్పమాలాంకితా, దండాంకా, సుకటాంకా, పూర్ణచన్హా, శుకొంకితా, కృష్ణాన్నహారపాకా, బృందా కుంజ విహారిణీ, కృష్ణ ప్రబోధనకరీ, కృష్ణ శేషాన్న భోజినీ, పద్మకేసర మధ్యస్థా, సంగీతా గమవేదినీ, కోటి కల్పాన భూభంగా, అప్రాప్తపులకాచ్యుతా, సర్వస్వనిధి, పద్మ శంఖాది నిధిసేవితా, ఆణిమాదిగుణైశ్వర్యా, దేవబృష్ణ విమోహినీ, సర్వానన్ద ప్రదా, సర్వా, సువర్ణ లతికాకృతి, కృష్ణాభిసార సంకేతా, మాలినీ, నృత్య పండితా, గోపీ సింధు సకాశాహ్వా గోప మండప శోభినీ, శ్రీ కృష్ణ ప్రతిదా, భీతా, ప్రత్యంగ పులకాంచితా, శ్రీ కృష్ణా లింగనరతా, గోవిన్ద విరహాక్షమా, అనన్త్ర గుణ సంపన్నా, కృష్ణ కీర్తన లాలసా, బీజత్రయ మయీమూర్తి, కృష్ణానుగ్రహ వాంఛితా, విమలాది నిషేవ్య, లలితా ద్యర్చితా, సతీ, పద్మ బృనస్థితా, హృష్టా, త్రిపురా పరిసేవితా, వృంతావశ్యర్చితో, శుద్ధా, దుర్జయా, భక్త వల్లభా, దుర్లభా, సాన్జసౌఖ్యాత్మా, శ్రేయో హేతువు, సుభోగదా, సారంగా, శారదా, బోధా, సదందావనచారిణీ, బ్రహ్మనందా, చిదానన్హా, ధ్యానానన్హా, అర్థమాత్రికా, గంధర్వా, సురతజ్జా, గోవిన్ద ప్రాణ సంగమా, కృష్ణాంగ భూషణా, రత్న భూషణా, స్వర్ణ భూషితా, శ్రీ కృష్ణ హృదయా వాస ముక్త కనక నాలిక, సద్రత్న కంకణయుతా, శ్రీమన్నీలగిరిస్థితా, స్వర్ణనూపుర సంపన్నా, స్వర్ణ కింకిణి మండితా, అశేష రాసకుతుక్, రంభోరువు, తనుమధ్యమా, పరాకృతి, పరానన్హా, పరస్వర్గ విహారిణీ, ప్రసూన కబరీ, చిత్రా, మహా సింధూర సుందరీ, కైశోర వయసా, బాలా, ప్రమదామల శేఖరా, కృష్ణా ధరసుధాస్వాదా, శ్యామ ప్రేమ వినోదినీ, శిఖిపిఇ్చలసచ్చూడా, స్వర్ణ చంపక భూషితా, కుంకుమలక్త కస్తూరీ మండితా, అపరాజితా, హెమహారాన్వితా, పుష్పాహారాఢ్యా, రసవతీ, మాధుర్య మధురా, పద్మా, పద్మహస్తా, సువిశ్రుతా, భూభంగా భంగ కోదండ కటాక్ష శర సంధినీ, శేషదేవా, శిరస్థా, నిత్య స్థల విహారిణీ, కారుణ్య జలమధ్యస్థా, నిత్య చిత్తాధిరోహిణీ, అష్టభాషవతీ, అష్టనాయికా లక్షణాన్వితా, సునీతిజ్జా, శ్రుతిజ్జా, సర్వజ్జి, దుఃఖ హారిణీ, రజో గుణేశ్వరీ, శరచ్చంద్రనిభాననా, కేతకీకుసుమాభాసా, సదాసింధు వనస్థితా, హేమ పుష్పాధిక వరా, పంచశక్తి మయీ, హితా, స్తనకుంబ్లీ, నరాఢ్యా, క్షీణపుణ్యా, యశస్వినీ, వైరాజ సూయ జననీ, శ్రీశా, భువన మోహినీ, మహా శోభా, మహామాయా, మహాకాని, మహాస్మృతి, మహామోహా, మహావిద్యా, మహాకీర్తి, మహారతి, మహా ధైర్యా, మహావీర్యా, మహాశక్తి, మహాద్యుతి, మహాగౌరీ, మహా సంపత్, మహా భోగవిలాసినీ, సనుయా, భక్తిదా, అశోకా, వాత్సల్య రసదాయినీ, సుహృత్, భక్తి ప్రదా, స్వచ్ఛా, మాధుర్య రసవర్షిణీ, భావ భక్తి ప్రదా, శుద్ధప్రేమ భక్తి విధాయినీ, గోపారామా, ఆభిరామా, క్రీడారామా, పరమేశ్వరీ, నిత్యరామా, ఆత్మరామా, కృష్ణరామా, రామేశ్వరీ, ఏకా, అనేక జగద్వ్యాపా, విశ్వలీలా ప్రకాశినీ, సరస్వతీశా, దుర్గేశా, జగదీశా, జగద్విధి, విష్ణువంశ నివాసా, విష్ణువంశ సముద్భవా, విష్ణువంశస్తుతా, వర్రీ విష్ణువంశావనీ, ఆరామస్థా, వనస్థా, సూర్యపుత్ర్యవగాహినీ, ప్రీతిస్థా, నిత్యయంత్రస్థా, గోలోకస్థా, విభూతిదా. స్వానుభూతి స్థితా, వ్యక్తా, సర్వలోక నివాసినీ, అమృతా, అద్భుతా, శ్రీ మన్నారాయణ సమీడితా, ఆక్షరా, కూటస్థా, మహా పురుష సంభవా, ఔదార్య భావసాధ్యా, స్థూల సూక్ష్మాతిరూపిణీ, శిరీష పుష్పమృదులా. గాంగేయముకురప్రభా, నీలోత్పలజలాక్షి, సద్రత్నక వరాన్వితా, ప్రేమ పర్యంక నిలయా, తేజోమండల మధ్యగా, కృష్ణాంగ గోపనా, అభేదా, లీలావరణ నాయికో, సుధా సింధు సముల్లా సా అమృతా స్య విధాయినీ. కృష్ణ చిత్రా రాసచిత్తా, ప్రేమచిత్తా, హరిప్రియా, అచింతన గుణగ్రామా, కృష్ణలీలా, మలాపహా, రాస సీన్దు శశాంకా, రాసముండల మండినీ, నతవ్రతా, సింహరీస్థా, సుమూర్తి, సురవందిత, గోపీ చూడామణి, గోపీ గణేడ్యా విరజాధికా, గోపప్రేషా, గోపకన్యా, గోపనారీ, సు గోపికా, గోపధామా, సుదామాంబా, గోపాలీ, గోప మోహినీ, గోప భూషా, కృష్ణ భూషా, శ్రీ బృందావన చంద్రికా, వీణాది ఘోష నిరతా, వాసోత్సవ వినాసిని, కృష్ణ చేష్టా, పరిజ్జాతా, కోటి కందర్ప మోహినీ, శ్రీ కృష్ణ గుణ గానాఢ్య, దేవ సుందరి మోహినీ, కృష్ణ చన్ల మనోజ్జా, కృష్ణదేవ సహోదరీ, కృష్ణా భిలాషిణి, కృష్ణ ప్రేమాను గ్రహ వాంఛితా, క్షేమా, మధురాలాపా, భ్రువోమాయా, సుభద్రికా, ప్రకృతి, పరమానన్దా, నీప ద్రుమతలస్థిత, కృపాకటాక్ష, బింబోష్ఠీ, రంభా, చారునితంబినీ, స్మరకేలి నిధానా, గండతాటంక మండితా, హేమాద్రి కాంతి రుచిరా, ప్రేమద్యా, మద మంధరా, కృష్ణార్చితా, ప్రేమచింతా, రతిచింతా, కృష్ణదా, రాసచింతా, భావచింతా, శుద్ద చింతా, మహారసా, కృష్ణా దృష్టి త్రుటి యుగా, దృష్టి పక్ష్మ వినిందినీ, కన్దర్ప జననీ, ముఖ్యా, వైకుంఠ గతి దాయినీ, రాసభావా, ప్రియాగ్లిష్టా, ప్రేషా, ప్రధమనాయికా, సుద్దా, సుధా దేహినీ, శ్రీరామా, రసమంజరీ, సుప్రభావా, శుభాచారా, స్వర్ణదీ, నర్మదాంబికా, గోమతీ, చన్ల భారేడ్యా, సరయూ, తామ్రపర్ణిస్తూ, నిష్కలంక చరిత్రా, నిర్గుణా, నిరంజనా ఇది రాధాకృష్ణ యుగ్మరూప సహస్ర నామము. బృందావనరసావహమున ప్రయత్నముచే పఠించవలయును. ఈ సహస్రనామము మహాపాప ప్రశమనము, వంధ్యత్వ వినీవర్తకము. దారిద్ర్య శమనము, రోగనాశనము, కామదము, గొప్పది. పాపాపహము. శత్రునాశకము, రాధా మాధవ భక్తి ప్రదము. అకుంఠమేధస్కుడైన భగవంతుడగు కృష్ణునకు నమస్కారము. రాధా సుధాసింధువున నిత్యవిహారికి నమస్కారము. రాధాదేవి జగత్కర్రీ, జగత్పాలన, జగల్లయ విధాత్రి, సర్వేశి, సర్వసూతికా, ఆమె నామ సమస్రమును నేను చెప్పితిని. ఈ సహస్ర నామము భుక్తి ముక్తి ప్రదము. ఇంకను ఏమి వినగోరు చున్నావు

ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున రాధాకృష్ణ సహస్ర నామ కథనమను ఎనుబది రెండ -  అధ్యాయము సమాప్తము.