నారద మహా పురాణము
29 - కాశీవర్ణనమ్
కాష్ఠీలోవాచ :
ఏవం సా రాక్షసీ సుభ్రు హస్తినీ రూపధారిణీ ।
త్రిభిర్ముహూర్తై సంప్రాప్తా కాశీ విశ్వేశ మందిరమ్
ఉవాచ తాం పురీం ప్రాప్య భర్తారమసితేక్షణా ।
ఇయం పాపతరోః కాంత కుఠారా పరికీర్తితా
షడూర్మికాంచనస్యైషా కాంత ప్రోక్తా దురోదరీ ।
కర్మ బీజోప శమనీ సర్మేషాం గతిదాయినీ
ఆద్యం హి వైష్ణవం స్థానం పురాణా స్సంప్రచక్షతే ।
నా వైష్ణవే స్థలే ముక్తి స్సర్వస్యతు కదాచన
మాధవస్య పురీ చేయం పూర్వమాసీద్ద్విజోత్తమ ।
ముక్తిదా సర్వంజంతూనాం సర్వపాపవ్రాశినీ
ఏకదా శంకరో దేవో ద్రష్టుం ప్రాగాత్పితామహమ్ ।
సర్వలోకైక కర్తారం భ్రాజమానం స్వతేజసా
గత్వా తత్ర మహాదేవో బ్రహ్మాణం జగతాం గురుం ।
నమస్కృత్య స్థితో హ్యగ్రే వేదపాఠం నిశామయన్
చతుర్భిరద్భు తైర్వక్త్రైః చతురో నిగమాన్ముదా ।
ఉద్గిరంతం జగన్నాథం దృష్ట్యా ప్రీతోక్యఃఽ, భవత్తదా
అథ తత్పంచమం వక్త్రం బ్రహ్మణో భూతనాయక ।
ప్రగల్బం తముపాలక్ష్య క్షణాజ్ఞాతః సమత్సరః
సక్రోధ జన్మా విప్రేంద్ర తస్య ప్రొగల్యమక్షయం ।
చకర్త తన్నఖాగ్రేణ స్వస్థం వక్త్రం త్రిలోచన
తచ్ఛిన్నం బ్రహ్మణః శీర్షం సంలగ్న కరపల్లవే ।
వామే నిర్దూతమనిశం న నివృత్తం ద్విజోత్తమ
బ్రహ్మా తు దుఃఖితో భూత్వా తస్థౌ స్థాణుం వ్యలోకయన్ ।
రుద్రోపి లజ్జితో భూత్వా నిర్జగామ త్వరాన్వితః
బహుధా యతమానోపి తచ్చిరః క్షేప్తుమాతురః ।
న శశాక పరిత్యక్తుం తదద్బుతమభూన్మహత్
చింతయా వ్యా కులో భూత్వా సస్మార గరుడధ్వజమ్ ।
తేన సంస్మృత మాత్రస్తు శీఘ్రమావిరభూచ్చ సః
తం దృష్ట్వా దేవదేవేశం విష్ణుం సర్వగతం ద్విజ ।
ననామ శిరసా నమ్రో నిష్ప్రభో వృషభధ్వజః
తం తథాతురమాలక్ష్య భీతం బ్రహ్మద్రుహం హరిః ।
సమాశ్వాశ్వాస్యాబ్రవీద్వాక్యం తత్తోష పరికారకమ్
శంభో త్వయా కృతం పాపం యచ్ఛిన్నం బ్రహ్మణః శిరః ।
తత్ఫలం భుంక్ష్య సర్వజ్ఞ కియత్కాలం కృతం స్వయమ్
అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ।
నా భుక్తం క్షీయతే కర్మ హ్యపి జన్మశతైః ప్రియ
కిం కరోమి క్వ గచ్చామి త్వాం దృష్ట్వా దుఖితం హరమ్ ।
ప్రాణా వికలతాం యాన్తి మమ త్వద్దు:ఖదర్శనాత్
యాని కాని చ పాపాని మహాంతి మహతాంగతే ।
న తాని బ్రహ్మహత్యాయః సమానీతి మతిర్మమ
యస్త్వం సర్వస్య లోకస్య గురుర్ధర్మోపదేశకః ।
బ్రహ్మ హత్యాభి భూతస్తు క్షణం స్థాతుం న చ క్షమః
ఏషా ఘోరతరా హత్యా మీననం ధ్యా జంతురా ।
లేలిహనా సురేశాన గ్రహీతుం త్వానుధావతి
తస్మాన్నైకత్ర భవతా స్థయం ద్వాదశ వత్సరమ్ ।
ఆటనీయం హితార్థాయ పాపనాశాభికామ్యాయ
అటిత్వా ద్వాద శాబ్దాని తీర్ధేషు సకలేషు చ ।
ప్రక్షాళయన్ కరం వామం భిక్షాం గృహ్ణాన్కపాలకే
శుద్ధిం యాస్యసి దేవేశ పాపాదస్మాత్సుదారుణాత్ ।
ఇత్యుక్తో విష్ణునా విప్ర స్థాణుః సర్వగతో భవత్
కపాల మోచనార్థం హి పాణిం ప్రక్షాళయన్ జలే ।
వర్షత్రయం భ్రమిత్వా తు ప్రాప్తో బదరికాశ్రమమ్
భిక్షార్ధం దేవదేవస్య ధర్మపుత్రస్య మానద ।
ద్వారస్థో దేహి భిక్షాం మే విష్ణో ఇత్యవదన్ముహుః
తతో నారాయణో దేవో దృష్ట్వా ద్వారి స్థితం హరమ్ ।
గృహాణ భిక్షామిత్యుక్త్యా ప్రదదౌ దక్షిణం కరమ్
తతో హలో హరిం దృష్ట్వా. భిక్షాం దౌతుం సముద్యతం ।
ప్రాహరదక్షిణం పాణిం త్రిశూలేన ద్విజోత్తమ
తత్రి శూల క్షతాద్ధారా: తిస్రో లోకభయం కరాః ।
ఏకా క్షతజధారా తు కపాలే న్యపతత్తదా
ద్వితీయా తన్ముఖేప్రాప్తా పయస్యథ తృతీయకా ।
జలధారా శివం ప్రాప్తా మరస్య హేతురగ్రతః
తా ధారాస్త్రీణి వర్షాణి సంసేవ్య విధివద్ధరః ।
కించి త్ప్రీతో యయౌ క్షేత్రం కురోః పుణ్యకరం ద్విజ
కాషీల పలికెను : ఇట్లు ఆడయేనుగు రూపమును ధరించిన ఆ రాక్షసి మూడు ముహూర్తముల కాలములో విశ్వేశ్వరుని నివాసమగు కాశీ నగరమును చేరెను. ఆ నగరమును చేరిన రాక్షసి భర్తతో ఇట్లు పలికెను. ఓ ప్రియా ఈ కాశీ నగరము పాపమను వు/క్షమునకు గొడ్డలివంటిది. షడూర్మికాంచనమునకు ఈ నగరము దురోదరి. కర్మయను బీజమును శమింప చేయునది. అందరికి సద్ధతిని ప్రసాదించునది. ఈ నగరము మొదట విష్ణుక్షేత్రమని పురాణములు చెప్పుచున్నవి. విష్ణుక్షేత్రము కాని చోట ఎవరికీ మోక్షము కలుగదు. ఈ నగరము పూర్వము శ్రీహరి నగరము. సర్వప్రాణులకు మోక్షమును ప్రసాదించునది. అన్ని పాపములను నశింప చేయునది. ఒకప్పుడు శివుడు సర్వలోక కర్త తన తేజస్సుచే ప్రకాశించుచున్న పితామహుని చూచుటకు బయలుదేరెను. బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి, వేదమును వినిపించుచు బ్రహ్మముందు నిలిచేను. నాలుగు ముఖములచే నాలుగు వేదములను పఠించుచు బ్రహ్మ ముందు నిలిచెను. నాలుగు ముఖములచే నాలుగు వేదములను పఠించుచున్న జగన్నాధుడగు బ్రహ్మను చూచి శంకరుడు ప్రీతి చెందెను. ఇక బ్రహ్మయొక్క అయిదవ ముఖము ప్రగల్భముగా నుండుట చూచిన శంకరుడు క్రోధావిష్టుడాయెను. ప్రగల్భముతోనున్న ఆ అయిదవ ముఖమును త్రిలోచనుడు కోపముచే నఖాగ్రముతో ఖండించెను. అట్లు ఛేదించబడిన బ్రహ్మ శిరస్సు శివుని వామహస్తమును అంటియుండెను. వదలి పెట్టలేదు. బ్రహ్మ కూడా దుఃఖితుడై శివుని చూచుచుండెను. రుద్రుడు కూడా లజ్జితుడై త్వరగా బయలుదేరెను. పలు విధములుగా ఆ శిరమును వదిలించుకొనుటకు ప్రయత్నించినను ఆ శిరము విడివడలేదు. ఈ సంఘటన చాలా ఆశ్చర్యమును కలిగించేను. చింతా వ్యాకులుడై శ్రీహరిని స్మరించెను. శివుడు స్మరించిన వెంటనే శ్రీహరి ఆవిర్భవించెను. దేవదేవుడు, సర్వ వ్యాపియగు శ్రీమహావిష్ణువును చూచిన శంకరుడు తేజోహీనుడై వినయముగా శిరస్సును వంచి నమస్కరించెను. అట్లు చింతా వ్యాకులుడు బ్రహ్మద్రోహి, భయాతురుడగు శివుని ఓదార్చి అతని సంతోషకరమగు మాటలను పలికెను. ఓ శంకరా నీవు బ్రహ్మ శిరమును ఖండించి పాప మునాచరించితివి. కావున స్వయం కృతాపరాధ ఫలమును కొంతకాలము అనుభవించుము. ప్రతి ప్రాణి తానాచరించిన శుభాశుభకర్మలను ఆనుభవించియే తీరవలయును. నూరు జన్మలలోనైనను అనుభవించనిదే కర్మనశించదు. నేనేమి చేతును? ఎటు వెళ్ళుదును? దుఃఖితుడవగు నిన్ను చూచి, నీ దుఃఖమును చూచి నా ప్రాణములు వికలములగు చున్నవి. ఈలోకములోని మహాపాపములన్నియూ బ్రహ్మహత్యతో సమములు కాజాలవు. నీవు సర్వలోకములకు గురువువు. దర్మమునుపదేశించువాడవు. అయిననూ బ్రహ్మహత్యాపాతకముచే పరాభూతుడవై ఒక్క క్షణము కూడా నిలువజాలవు. ఈ బ్రహ్మహత్య మహా ఘోరము. మత్స్యగంథము కలది. జరాతుర నాలుకను బయటికి చాచి నిన్ను పట్టుకొనుటకు నీవెంట పరుగెత్తి వచ్చుచున్నది. కావున నీవు పన్నెండు సంవత్సరములు ఒకేచోట నిలువక పాపనాశమును కోరి అంతటా తిరుగు చుండవలయును. పన్నెండు సంవత్సరములు సకల తీర్థములలో తిరుగుచు వామహస్తమును ప్రక్షాళనము చేసుకొనుచు కపాలమున భిక్షను స్వీకరించుచు ఈ దారుణమగు పాపమునుండి విముక్తుడవగుదువు. ఇట్లు శ్రీహరి పలుకగా శివుడు అన్ని తీర్థములలో తిరుగుచుండెను. కపాలమును విడిపించుకొనుటకు జలములలో హస్త ప్రక్షాళనమును గావించుకొనుచు మూడు సంవత్సరములు తిరిగి బదరికాశ్రమమును చేరెను. ధర్మపుత్రుడు దేవదేవుడగు శ్రీమహా విష్ణువు నుండి భిక్షను స్వీకరించదలచెను. ద్వారమున నిలిచి విష్ణు నాకు భిక్షనిమ్ము అని పలికెను. అంతట నారాయణ దేవుడు ద్వారమున నిలిచియున్న హరుని చూచి భిక్షను స్వీకరించమని దక్షిణహస్తమును చాచెను. అట్లు భిక్షనిచ్చుటకు చాచిన శ్రీహరి దక్షిణహస్తమును చూచి హరుడు త్రిశూలముచే ప్రహరించెను. అట్లు త్రిశూలముచే అయిన గాయము నుండి లోకభయంకరములగు మూడు ధారలు వెడలెను. ఆ ధారలు ప్రస్థద్వాదశహస్త ప్రమాణములు చిత్రవర్ణములు గలవిగా నుండెను. ఆ మూటీలో ఒక రక్త ధారమాత్రము హరుని కపాలమున పడెను. రెండవ ధోర శివుని ముఖమున పడెను. మూడవది జలమునపడెను. ముందు పాపమును హరించుచుటకు హేతువగునది శివుని ఒక జలధార చేరినది. ఆ మూడు ధారలను శివుడు యధావిధిగా మూడు సంవత్సరములు సేవించి కొద్దిగా ప్రీతిని చెంది పుణ్యకరమగు కురుక్షేత్రమును చేరేను.
తత్ర గత్వా హరః స్థాణు ర్దూత స్తత్ర పపాత చ ।
బ్రహ్మహ్రదే త్రివర్షాణి మగ్నో బ్రహ్మహ్రదాంబుని ।
వర్షత్రయే గతే తత్ర క్షతార్థాంగో వినిస్తృతః
చిరం తుష్టావ దేవేశం విష్ణుం సర్వగుహాశయమ్ ।
తత్తస్తుష్టో జగన్నాదో వరం తస్మై దదౌ తు సః
గచ్చ కాశీమితో భ్రాంత్వా తీర్థాని బహుశో హర ।
తతో హరిం నమస్కృత్య పరీత్య బహుధా తధా
క్రమాత్తీర్ధాటనం కుర్వన్ అవిముక్తపురీం గతః ।
అవిముక్తస్య సీమాయాం ప్రావిశద్వీక్ష్య ధూర్జటిః
నాపశ్యత్తామనుప్రాప్తం బ్రహ్మహత్యాం బహిస్థితామ్ ।
తతో సౌ వైష్ణవం జ్ఞాత్వా క్షేత్రం దురితనాశనమ్
తుష్టావ ప్రయతో భూత్వా మాధవం వన్ద్యమిశ్వరమ్ ।
జయజయ జగదీశనాధవిష్ణో జగదానన్ద నిధాన వేదవేద్య ।
మధు మధన నృసింహ పీతవాసో గరుడాధిష్ఠిత మాధవదేవ
ప్రజరమణ రమేశ రాధికేశ త్రిదశేశాఖిల కామ్యపూరకృష్ణ! ।
సురవర కరుణార్ణవారినాశిన్ నలినాక్షాధిపతే విభో పరేశ
యదుకుల తిలకాబ్దివాస శౌరే కుధరోద్ధార విధ్మాన క్షధన్విన్ ।
కలికలుషహరాంఘ్రిపద్మయుగ్మ గృణదాత్మప్రద కూరశ్యపోత్థ
కుకుపతి వనపావకాఖిలేజ్యా స్రకాలాశిత వస్త్రబుద్ధ కల్కిన్ ।
భవభయహర భక్తవశ్య గోప ప్రణతోద్దారక పుణ్యకీర్తినామ
ధరణి భరహరాసురారిపూజ్య ప్రకృతిశేశ జగన్నివాస రామ ।
గుణగణ విలసచ్చరాచరేశ త్రిగుణాతీత సనాతనాగ్రపూజ్య
నిజజనపరిరక్షితాంతకారే కమలాంఘ్రే కమనీయ పద్మనాభ ।
కమలకర కుశేశయాధివాస ప్రియకామోన్మదన త్ర్యధీశవంద్య
అఘహర రఘనాధ యాదవేశ ప్రియభూదేవ పరాత్పరామరేజ్య! ।
హలధర దురితాపహప్రణమ్య త్రిగుణవ్యాప్త జగత్రి కాల దక్ష!
దనుజకుల వినాశనైక కర్మ న్నన ఘారూఢ ఫణీశ కంసకాల ।
రవి శశినయన ప్రగల్చ చేష్ట ప్రదుతధ్వాంత నవాంబుదాభ మేశ
మఖమఖ ధర మాతృబద్ధదామ న్నవనీత ప్రియ వల్లవీగణేశ! ।
ఆఘబక వృషకేశిపూత నాంత త్రిశిరోవాలి దశాస్యభేదకారిన్
నరకపుర వినాశబాణదోః కృ త్త్రిపురారీజ్య సుదామమిత్రసేవ్య భవతరణ పవిత్ర పాదపద్మ ప్రకటైశ్వర్య పురాణ పూర్ణబాహో బహు జని సుకృతాప్య మంగలార్హ ప్రతిష్యే శ్రతి ధామ శాంతశుద్దన్న వరద మణ్య మంఫ్రియుగ్మం శణం ప్రాప్తమఘార్దితం ప్రపాపా
నహి మమగతిదం పురాణ పుంసో ఽ న్యదితి ప్రార్ధనయా ప్రసీద మేకద్య
ఇతి స్తుతో జగన్నాదో భక్త్యాదేవేన శంభునా ।
ఆవిర్బభూవ సహసా మాధవో భక్తవత్సలః
కురుక్షేత్రమును చేరిన హరుడు స్థాణువై అచటనే పడెను. మూడు సంవత్సరములు బ్రహ్మప్రదజలమున క్రుంకులిడెను. అచట మూడు సంవత్సరములు గడుపగా కపాలమున సగభాగము విడిచెను. సర్వగుహాశయుడగు శ్రీహరిని చాలా కాలము స్తుతించెను. అట్లు స్తుతించబడిన శ్రీహరి శివునికి వరమునిచ్చేను. ఓ శివా చాలా తీర్థములను పర్యటించి ఇక్కడి నుండి కాశీ నగరమునకు వెళ్ళుము. అంతట శ్రీహరికి నమస్కరించి చాలా మార్లు ప్రదక్షిణములనాచరించి తీర్ధయాత్రలను పర్యటించుచు అవిముక్త పురిని (కాశీ నగరమును) చేరెను. కాశీ నగర సీమను ప్రవేశించుచు వెనుక తిరిగి చూచేను. అచట తన వెనుక బ్రహ్మహత్య రాక పోవుటను చూచెను. సీమకు అవతల నిలిచి యుండుటను గమనించేను. అప్పుడు ఇది వైష్ణవక్షేత్రము పాపనాశనము అని తెలిసి సర్వవంద్యుడగు మాధవుని శ్రద్ధతో స్తుతించెను. ఓ జగదీశా! నాధా! విషూ! జగదానన్ద నిధాన! వేదవేద్యా! మధుమధన! నృసింహా! పీతాంబరధారీ! గరుడవాహనా! మాధవా, ఆదిదేవా గోపనాయక! రమేశ! రాధాపతీ! దేవేశ! సకల కామపూర! కృష్ణ! జయము జయము. సురవర! వరుణ సాగరా! ఆర్తినాశక! పుండరీకాక్ష! అధిపతి! విభో! పరేశ! యదు కుల తిలక! సాగరవాస! శారీ! పర్వతో ధార దక్ష! ధనుర్ధారీ! కలికలుషాపహరణ! పద్మపాద! గృణద! ఆత్మప్రద! కూర్మ! వామనా! వరాహా! నరసింహా పరశురామా! యజ్ఞరూపా!కాలాశితవస్త్రధారీ! బుద్దిరూపా కల్కీ! భవభయహరణ! భక్తవశ్య! గోపాలక! ప్రణతోద్దారక! పుణ్యకీర్తి నామ! భూభారహరణ! దేవపూజ్య! ప్రకృతీశ! జగన్ని వాస! రామ! గుణగణ విలసచ్చరాచరేశ! త్రిగుణాతీత! సనాతన! అగ్రపూజ్య! నిజజన పరిరక్షిత! అంతకరిపూ! కమలపాద! సుందర! పద్మనాభ! కమలకర! కుశేశయాధి వాస ప్రియ! కామానన! త్రిగుణాధీశ! త్రిమూర్తి వరదా! పాపహరణ! రఘునాధ! దురితాపహరణ! త్రిగుణవ్యాప్త జగత్! త్రికాలదక్ష! దనుజకుల వినాశనైక కర్మ! అనఘారూఢ! ఫణేశ! కంపనాశా! సూర్యచన్జనేత్ర! ప్రగల్భ చేష్ట! ధ్వాంతహరణ! నవజలదశ్యామదేహా! లక్ష్మీనాధా! యజ్ఞరూపా యజ్ఞధర! మాతృబద్ధదామ! నవనీత ప్రియ! గోపీజనప్రియ! అఘ, బక, వృషకేశి, పూతనాంతక! త్రిశిరో వాలి దశాస్యభేదక! నరకపుర వినాశన! బాణబాహుచ్ఛేదక! త్రిపురారీపూజ్య, సుదామమిత్ర! సంసారతారణ! అహిత్రపాదపద్మ! ప్రకటైశ్వర్య! పురాణ పురుష! ఆ జానుబాహు బహుజన్మ పుణ్యప్రాప్య! మంగళార్హ! శ్రుతివేద్య! శ్రుతిధామ! శాంత! శుద్ద! వరద! వరేణ్య! నీ పాదపద్మములను శరణు పొందితిని. పాపపీడితుడనగు నన్ను కాపాడుము. నాకు సద్గతిని ప్రసాదించువారు నీకంటే ఇతరులు లేరు. నా ప్రార్థన ప్రసన్నుడవు కమ్ము! ఇట్లు దేవదేవుడగు శంకరుడు భక్తిచే స్తుతించగా భక్తవత్సలుడగు శ్రీనాధుడు వెంటనే అచట ఆవిర్భవించెను.
తం దృష్ట్వా దండవద్భూమౌ నిపపాత హలో హరిమ్ ।
పునరుత్థాయ విప్రేన్ద్ర ననామ విధృతాంజలి!
తమువాచ హృషీకేశః ప్రణతం భూతనాయకమ్ ।
వరం వృణు ప్రదాస్యేక హం సంతుష్ట స్తోత్రతస్తవ
తచ్చ్రుత్వా భగవద్వాక్యం భూతేశో బ్రహ్మహత్యయా ।
పీడితాత్మా జగాదేదం భుక్తిముక్తి ప్రదం హరిమ్
ఇచ్ఛామి వసితుం క్షేత్రే తవ చక్రగదాధార! ।
త్వత్క్షేత్ర సీమాబాహ్యస్థా బ్రహ్మహత్యా యదీక్ష్యతే
క్షేత్ర దానేన కారుణ్యం కురుమే గరుడధ్వజ ।
మమ నిర్గమనే బ్రహ్మ హత్యా మా పునరేష్యతి
త్వత్క్షేత్ర సంస్థితో హం తు పూజాం ప్రాప్స్యే జగత్త్రయే ।
ఇత్యుక్త్యా హ్యభవత్తూష్ణీం దేవదేవం వృషధ్వజః
తదేతి ప్రతిపేదే చ క్షీరసాగర జాప్రియః ।
తతః ప్రభృతి విప్రేన్ద్ర శైవం క్షేత్రం నిగద్యతే
క్షేత్రం తు కేశవ స్వేదం పురాణం కవయో విదుః ।
కృపయా సంపరీతస్య మాధవస్య ద్విజోత్తమ
నేత్రాభ్యాం నిర్గతం వారి తేన బిందు సరోజభవత్ ।
మాధవస్యాజ్ఞయా తత్ర సస్నౌదేవో వృషధ్వజః
స్నాతమాత్రే హరే తత్తు కపాలం పాణితోక పతత్ ।
కపాలమోచనం నామ తత్తీర్ధం ఖ్యాతి మాగతమ్
బిందు మాధవ నామాసౌ దత్వా స్వం ధామ శూలినే ।
భక్తి భావేన శంభుస్తు అబద్ధస్తత్ర సంస్థితః
యంతు బ్రహ్మదయో దేవా స్స్వస్థాః పశ్యన్తి సర్వదా ।
సూర్యాయుత సమప్రఖ్యం దిగంబర నిషేవితమ్
విఘ్నాని శూలినా కాంత కృతాన్యస్య నిషేవణే ।
యైర్విఘ్నేరభిభూతాస్తు స్తుత్వా విష్ణుం శివార్చకాః
సర్వే లోకా స్థ్సితా హ్యత్ర శివః కాశీతి చింతకాః ।
శివస్య చింతనాద్విష్ణు శైవాస్సర్వేనిరామయాః
ప్రయాంతి శివలోకం వై జరామృత్యు వివర్జితమ్ ।
బహుపుణ్యయుతాస్సన్తో నివసన్త్యత్ర నీరుజా
యజ్ఞ శిష్టాశినః కాశీ కాన్తబుద్ధి సమన్వితాః ।
నాత్ర స్నానం ప్రశంసన్తి న జపం ససురార్బనమ్
నాపి దానం ద్విజశ్రేష్ఠ ముక్త్వైవం దేహపాతనమ్ ।
మృత్యుం ప్రాప్య నరః కామం కృతకృత్యో భవేద్ద్రువమ్
సేయ మాసాదితా విప్ర పురీప్రాసాద సంకులా
భోగినా మమోక్షాయ కింపునర్వత ధారిణమ్
నిక్షిప్యతామియం బాలా కాళేశస్యేహమందిరే ।
వియోజితా తు యా పూర్వం తేన దుష్టన రక్షసా
ఆత్మనస్సురతార్థాయ కుమారీ నియమాన్వితా ।
ఏష ప్రభావో భిహితః క్షేత్రస్యాస్య ద్విజోత్తమ
వినశ్యంతీహ కర్మాణి శుభాన్యప్యశుభానిచ ।
భూతభవ్య భవిష్యాణి జ్ఞానా జ్ఞానకృతానిచ
ఏషా పరీ క్మ వినాశనాయ కృష్ణన హార్వం హి వినిర్మితాభాత్ ।
యస్యాం మృతా దుఃఖమనంతముగ్రం భుంజంతి మర్త్యా యమయాతనాం నో
ఇతి శ్రీ బృహన్నారదీయ మహా పురాణే ఉత్తర భాగే మోహినీ చరితే కాష్ఠీలోపాఖ్యానే రాక్షసీ చరితేకాశీవర్ణనం నామ ఏకోనత్రింశోఽధ్యాయః.
అట్లు ఆవిర్భవించిన శ్రీహరిని చూచి హరుడు దండవత్రణామము నాచరించెను. మరల లేచి చేతులు జోడించి నమస్కరించెను. ఇట్లు నమస్కరించుచున్న భూతనాయకుని హృషీకేశుడిట్లు పలికెను. నీ సోత్తమునకు సంతోషించింతిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము. ఇచ్చెదను అని ఆ శ్రీహరి వాక్యమును వినిన భూతేశుడు బ్రహ్మహత్యచే పీడించబడుచు భక్తి ప్రదాయకుడగు శ్రీహరితో ఇట్లు పలికెను. చక్రగదారా! నీ క్షేత్రమున నివాసమును చేయగోరుచున్నాను. బ్రహ్మహత్య నీ క్షేత్రసీమకు అవతల నున్నది. గరుడ ధ్వజా నాకు క్షేత్రదానమును గావించి దయ చూపుము. నేను ఇటునుండి మరలి వెళ్ళినచో బ్రహ్మహత్య మరల నా వెంటపడును. నీ క్షేత్రమున నేను నివసించినచో ఈ మూడు లోకములలో పూజలనందగలను. ఇట్లు పలికి వృషధ్వజుడు ఊరకుండెను. రమాప్రియుడు అట్లే అని అంగీకరించెను. అప్పటి నుండి ఈ కాశీపురము శివక్షేత్రమనబడుచున్నది. కాని ఇది పూర్వము విష్ణుక్షేత్రమని విద్వాంసులు తెలియదురు. దయార్ద్రహృదయుడగు మాధవుని నేత్రముల నుండి నీరు వేడలివచ్చెను. ఆ జలము బిందు సరస్సుగా మారెను. మాధువుని ఆజ్ఞ చే యచట వృషధ్వజుడు స్నానము గావించెను. ఆ బిందు సరస్సులో స్నానమాడినంతనే శంకరుని చేత నుండి కపాలము వీడి పడెను. కావున ఆ తీర్థమునకు కపాలమోచన తీర్థమని ప్రసిద్ది కలిగెను. ఈ సరస్సు బిందుమాధవ సరస్సు అని కూడా పేరు వచ్చెను. శ్రీహరి శంకరునికి తన క్షేత్రమునిచ్చి వెడలెను. శంకరుడు కూడా భక్తి భావముచే అచట నిలిచెను. ఇచట నున్న శంకరుని బ్రహ్మాది దేవతలు తమ తమ స్థానములలో నుండియే ఎల్లవేళలా చూచుచుందురు. ఇచట శంకరుడు పదివేల సూర్వులతో సమమగు కాంతి గలవాడు, దిగంబర ని షేవితుడు, తనను సేవించుటలో శూలియే విశ్నుములను కలిగించుచుండెను. ఇట్లు విఘ్నములు కలుగగా శివార్చకులు శ్రీహరిని స్తుతించి విఘ్నములను తొలగించుకొందురు. ఇచట శివుని కాశీనగరమును ధ్యానించుచు అన్ని లోకములు నిలిచినవి. శివుని ధ్యానించు శైవులందరూ చింతలేనివారైరి. జరామృత్యురహితులై శివలోకమును చేరెదరు. ఇహలోకమున కూడా బహు ఫుణ్యయుతులై రోగహీనులై నివసించేదరు. యజ్ఞశేషమును భుజించుచుందురు. బుద్దీయుతులగుదురు. ఈ కాశీ క్షేత్రమున స్నానము, జపము, దైవపూజ, దానము కూడా విధించబడలేదు. ఇచట మరణించుట యొకటే ప్రశంసించబడినది. ఈ కాశీ నగరమున మరణించినవారు కృతకృత్యులగుదురు. అట్టి కాశీ నగరమును చేరితిమి. భోగులకు కూడా మోక్షమును ప్రసాదించునన్న ఇక వ్రతధారుల విషయము చెప్పనేల? ఈ రాజకుమారిని కాశీనాధుని మందిరమున నుంచుము. ఈ రాజకుమారిని దుష్టుడగు రాక్షసుడు విడదీ సేను. నియమాన్వితయగు ఈ కుమారిని తన భోగము కొఱుకు తీసుకొనివచ్చెను. ఇది కాశీ క్షేత్ర మహాత్మ్మము. నీకు సవిస్తరముగా వివరించితిని. ఇచట శుభాశుభకర్మలు అన్నియూ నశించును భూత భవ్యభవిష్య కర్తలు జ్ఞానాజ్ఞానకృతములగు కర్మలు కూడా నశించును. ఈ కాశీ నగరమును శ్రీహరి కర్మనాశమునకు నిర్మించెను. ఈ కాశీనగరమున మరణించిన వారు అనంతము ఉగ్రమగు దుఃఖమును యమయాతనలను అనుభవించరు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మెహినీ చరితమున కాష్ఠీలో పాఖ్యానమున రాక్షసీ చరితమున కాశీ వర్ణనమను ఇరువది తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 156 of the Nārada Mahā Purana is as follows:
గోదావరి నది మొదటగా ఆవిర్భవించిన పవిత్ర కుశావర్త తీర్థ మాహాత్మ్యము ఈ అధ్యాయంలో వివరింపబడినది. కుశావర్త తీర్థంలో భక్తితో ఆచరించే స్నానము మరియు పితృ తర్పణముల వలన సమస్త పాపములు నశించునని నిరూపించబడినది.