51 -  అధ్యాయము

ఆథాత స్సంప్రవక్ష్యామి కల్పగ్రంథం మునీశ్వర !

యస్య విజ్ఞానమాత్రేణ స్యాత్కర్మ కుశలో నరః

నక్షత్రకల్పో వేదానాం సంహితానాం తథైవ చ

చతుర్ధస్స్యాదాంగీరసశ్శాంతికల్పశ్చ పంచమః

నక్షత్రాధీశ్వరాఖ్యానం విస్త రేణ యథాతథమ్

నక్షత్రకల్పే నిర్దిష్టం జ్ఞాతవ్యం తదిహాపీ చ

వేదకల్పే విధానం తు ఋగాదీనాం మునీశ్వర !

ధర్మార్థకామమోక్షాణాం సిద్ద్యై ప్రోక్తం సవిస్తరమ్

మంత్రాణామృషయ శ్చైవ ఛందాస్యథం చ దేవతాః

నిర్దిష్టాస్సంహితా కల్పే మునిభిస్తత్త్వదర్శిభిః

తథైవాంగీరసఃకల్పే షట్కర్మాణి సవిస్తరమ్

అభిచారవిధానేన నిర్దిష్టాని స్వయంభువా

శాంతికల్పే తు దివ్యానాం భౌమానాం మునిసత్తమ

తథాంతరిక్షోత్పాతానాం శాంతయో హ్యుదీతోః పృథక్

సంక్షేపేణైతదుద్దీష్టం లక్షణం కల్పలక్షణే

విశేషః పృథగేతేషాం స్థితశ్శాఖాంత రేషు చ

గుహ్యకల్పేషు సర్వేషాముపయోగితయాధునా

వక్ష్యామి తే ద్విజశ్రేష్ఠ ! సావధానతయా శృణు

ఓంకారశ్చాథశబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా

కంఠం భిత్త్వా వినిర్యాతౌ తస్మాన్మాంగల్యకావిమౌ

కృత్వా ప్రోక్తాని కర్మాణి తదూర్ద్వాని కరోతి యః

సోఽథశబ్దం ప్రయుంజీత తదానన్ద్యార్ధమిష్యతే

కుశాః పరిసమూహాయ వ్యస్త శాఖాః ప్రకీర్తితాః

న్యూనాధికా నిష్పలాయ కర్మణోఽభిమతస్య చ

కృమికీటపతంగాద్యా భ్రమంత్రి వసుధాతలే

తేషాం సంరక్షణార్ధాయ ప్రోక్తం పరిసమూహనమ్

రేఖాః ప్రోక్తాశ్చ యాస్తిస్రః కర్తవ్యాస్సాస్సమాద్విజ

న్యూనాధికా న కర్తవ్యా ఇత్యేవ పరిభాషితమ్

మేదినీ మేదసా వ్యాప్తా మధుకైటభదైత్యయోః

గోమయేనోపలే ప్యేయం తదర్దమితి నారద

వంధ్యా దుష్టా చ దీనాంగీ మృతవత్సా చ యా భవేత్

యజ్ఞార్థం గోమయం తస్యా నాహరేదితి భాషితమ్

యే భ్రమంతి తదాకాశే పతంగాద్యా భయంకరాః

తేషాం ప్రహరణార్థాయ మతం ప్రోద్ధరణం ద్విజ

స్రువేణ చ కుశేనాపి కుర్యాదుల్లేఖనం భువః

అస్థికంటకినస్సిద్ధ్యర్థం బ్రహ్మణా పరిభాషితమ్

ఆపో దేవగణాప్సర్వే తథా పితృగణా ద్విజ

తేనాద్భిరుక్షణం ప్రోక్తం మునిభిర్విధికోవిదైః

అగ్నేరానయనం ప్రోక్తం సౌభాగ్య స్త్రీభిరేవ చ

శుభదే మృణ్మయే పాత్రే ప్రోక్ష్యాద్భిస్తం నిధాపయేత్

అమృతస్య క్షయం దృష్ట్వా బ్రహ్మ ద్యేస్సర్వదైవతైః

వేద్యాం నిధా పితస్తస్మాత్ సమిద్గర్బే హుతాశనః

దక్షిణస్యాం దానవాద్యా స్థితా యజ్ఞస్య నారద !

తేభ్యసంరక్షణార్ధాయ బ్రహ్మణం తద్దికి న్య సేత్

ఉత్తరే సర్వపాత్రాణి ప్రణీతాద్యాని పశ్చిమే

యజమానః పూర్వతస్స్యు్విజాస్సర్వేఽపి నారద

ద్యూతే చ వ్యవహారే యజ్ఞకర్మణి చేద్భవేత్

కర్తోదాసీనచిత్తస్తత్కర్మ నశ్యేదితి స్థితి:

బ్రహ్మచార్యే స్వశాఖో హి కర్త వ్యే యజ్ఞకర్మణి

ఋత్విజాం నియమో నాస్తి యథాలాభం సమర్చయేత్

ద్వే పవిత్రేత్ర్యంగులేస్తః ప్రోక్షణీ చతురంగులా

ఆజ్యస్థాలీస్త్య్రంగులాథ చారుస్థాలీ షడంగులా

ద్వంగులం తూపయమనమేకం సమ్మార్జనాంగులమ్

స్రువం షడంగులం ప్రోక్తం స్రుచం సార్ధత్రయాంగులమ్

ప్రాదేశమాత్రా సమిధపూర్ణపాత్రం షడంగుళమ్

ప్రోక్షీణ్యా ఉత్తరే భాగే ప్రణీతాపాత్రమష్టభిః

యాని కాని చ తీర్థాని పముద్రిపరీతస్తథా

ప్రణీతాయాం సమాసన్నాస్తస్మాత్తాం పూరయేజ్జలైః

వేదికా వస్త్ర హీనా చ నగ్నా సంప్రోచ్యతే ద్విజ

పరిస్తీర్య తతో దర్భైః పరిదధ్యాదిమం బుధః

ఇంద్రవజ్రం విష్ణుచక్రం వామదేవత్రిశూలకమ్

దర్భరూపతయా త్రీణి పవిత్రచ్చేదనాని చ

ప్రోక్షణీ చ ప్రకర్తవ్యా ప్రణీతోదకసంయుతా

తేనాతి పుణ్యదం కర్మ పవిత్రమితి కీర్తితమ్

ఆజ్యస్థాలీ ప్రకర్తవ్యా ఫలమాత్రప్రమాణికా

కులాలచక్రఘటికం ఆసురం మృణ్మయం స్మృతమ్

తదేవ హస్తఘటితం స్థాల్యాది దైవికం భవేత్

స్రువే చ సర్వకర్మాణి శుభాన్యప్యశుభాని చ

తస్య చైవ పవిత్రార్థం వహ్నౌ తాపనమీరితమ్

అగ్రే ఘృతేన వైధవ్యం మధ్యం చైవ ప్రజాక్షయః

మూలే చ మ్రియతే హోతా తస్మాద్దార్యం విచార్య తత్

అగ్నిస్సూర్యశ్చ సోమశ్చ విరించిరనిలో యమః

స్రువే షడేతే దేవాస్తు ప్రత్యంగులముపాశ్రితాః

అగ్నిర్భోగార్ధనాశాయ సూర్యో వ్యాధికరో భవేత్

నిష్ఫలస్తు స్మృతస్సోమో విరించిస్సర్వకామధః

అనిలో వృద్ధిదః ప్రోక్తో యమో మృత్యుప్రదో మతః

సంమార్జనోపయమనం కర్తవ్యం చ కుశద్వయమ్

పూర్వం తు సర్వశాఖం స్యాత్ పంచశాఖం తథాపరమ్

 శ్రీపణీ చ శమీ తద్వత్ ఖదిరశ్చ వికంకతః పలాశ శ్చైవ విజ్ఞేయా స్రువే చైవ తథా సుచి హస్తోన్నితం స్రువం శస్తం త్రిదశాంగుళికం స్రుచమ్

విప్రాణాం చైతదాఖ్యాతం హ్యన్యేషామంగుళోనకమ్

శూద్రాణాం పతితానాం చ ఖరాదీనాం చ నారద

దృష్టిదోషవినాశార్థం పాత్రాణాం ప్రోక్షణం స్మృతమ్

అకృతే పూర్ణపాత్రే తు యజ్ఞచ్చిద్రం సముద్భవేత్

తస్మిన్పూర్ణి కృతే విప్ర ! యజ్ఞసంపూర్ణతా భవేత్

అష్టముష్టి భవేత్కించిత్ పుష్కలం తచ్చతుష్టయమ్

పుష్కలాని తు చత్వారి పూర్ణపాత్రం విదుర్బుధాః

హోమకాలే తు సంప్రాప్తే న దద్యాదాసనం క్వచిత్

దత్తేఽతృప్తో భవేద్వ హ్నిశ్శాపం దద్యాచ్చ దారుణమ్

ఆధారా నాసికా ప్రోక్తా ఆజ్యభాగా చ చక్షుషీ

ప్రాజాపత్యం ముఖం ప్రోక్తం కటిర్వ్యాహృతిభిస్మృతా

శీర్షహస్తౌ చ పాదౌ చ పంచవారుణమీరితమ్

తథా స్విష్టకృతం విప్ర శ్రోత్రే పూర్ణాహుతిస్తథా

ద్విముఖం చైకహృదయం చతుశ్శత్రం ద్వినాసికమ్

ద్వీశీర్షకం చ షణ్ణేత్రం పింగలం సప్తజిహ్వకమ్

సవ్యభాగే త్రిహస్తం చ చతుర్హస్తం చ దక్షిణే

సుక్స్రువౌ చాక్షమాలా చ యా శక్తిర్ధక్షిణే కరే

త్రిమేఖలం త్రిపాదం చ ఘృతపాత్రం ద్విచామరమ్

మేషారూఢం చతుశ్శృంగం బాలాదిత్యసమప్రభమ్

ఉపవీతసమాయుక్తం జటాకుండలమండితమ్

జ్ఞాత్వైవమగ్నిదేహం తు హోమకర్మ సమాచరేత్

ఓ మునీశ్వరా ! ఇక ఇపుడు కల్పగ్రంథమును చెప్పెదను. కల్పమును తెలుసుకొనిన మానవుడు కర్మ కుశలుడు కాగలడు. వక్షత్ర కల్పము, వేదకల్పము, సంహితా కల్పము, ఆంగిరస కల్పము, శాంతి కల్పము అని అయిదు కల్పములు కలవు. నక్షత్రాధీశ్వరలను నక్షత్ర కల్పము విస్తరముగా వివరించిరి. ఇట్లు నక్షత్ర కల్పమును కూడా విస్తరముగా తెలియవలయును. వేదకల్పమున ధర్మార్థకామ మోక్షముల సిద్ధికొఱకు ఋగాది చతుర్వేదములు విస్తారముగా చెప్పబడినవి. సంహితా కల్పమున మంత్రముల ఋషులు, ఛందస్సులు, దేవతలు తత్త్వము తెలిసిన మునులచే చెప్పబడినవి. అట్లే ఆంగిరస కల్పములో బ్రహ్మ ఆభిచారవిధానముచే షట్కర్మలను విస్తరముగా వివరించెను. శాంతి కల్పమున దివ్యభౌమ అంతరిక్షముల ఉత్పాతముల శాంతులు వివరించబడినవి. ఇది సంక్షేపముగా కల్పలక్షణము. శాఖాంతరములలో విడిగా ఈ కల్పముల లక్షణములు విస్తరముగా చెప్పబడినవి. గృహ్యకల్పమున అందరి ఉపయోగము కొఱకు చెప్పబడిన వాటిని ఇపుడు విస్తరముగా చెప్పెదను. సావధానముగా వినుము. పూర్వము బ్రహ్మ కంఠమును బోధించుకొని ఓంకారము, అథయను శబ్దములు వెలువడినవి. కావున ఈ రెండు శబ్దములు శుభకరములు. ఇట్లు చెప్పబడిన కర్మలను ప్రారంభించు మానవుడు. మొదట అథశబ్దమును ప్రయోగించినచో అనన ఫలము కలుగును. దర్భలు పరిసమూహము కొఱకు విడివిడి శాఖలుగా చెప్పబడినవి. తక్కువైనను, అధికమైనను అభిమత ఫలము నీయజాలవు. భూమి మీద కృమికీటపక్ష్యాదులు భ్రమించుచుండును కావున వాటి నుండి, వాటిని రక్షించుట కొఱకు పరిసమాహాము చెప్పబడినది. మూడు రేఖలు చెప్పబడినవి. ఆరేఖలు సమముగా నుంచవలయును. ఎక్కవగా చేయరాదు. ఈ భూమి మధుకైటభులను రాక్షసుల మేదస్సుతో నిండియున్నది. కావున భూమిని గోమయముతో అలుకవలయును, గొడ్రాలు, దుష్టురాలు, దీనాంగీ, పుత్రులు చనిపోయిన స్త్రీ యజ్ఞము కొఱకు గోమయమును తేరాదు. ఆకాశమున తిరుగు భయంకరములగు పక్ష్యాదుల ప్రహరణము కొఱకు ప్రోద్దరణము చెప్పబడినది. స్రువముతో కాని దర్భతో కాని భూమిని ఉల్లేఖనము చేయవలయును. అట్లు చేసినచో అస్థి కంటకాదుల శుద్ధి కలుగునని బ్రహ్మ చెప్పియుండెను. జలమే అన్ని దేవగణములు పితృగణములు. కావుననే 'వీధిని తెలిసిన మునులు జలముచే ప్రోక్షణమును చేయవలయునని చెప్పిరి. సౌభాగ్యవతులగు స్త్రీలు మాత్రమే యజ్ఞాగ్నిని తేవలయును. పవిత్రమైన మృణ్మయపాత్రను నీటితో శుద్ధిచేసి పాత్రలో అగ్నినుంచి కేవలయును. బ్రహ్మ దులగు దేవతలందరు అమృత క్షయమును చూచి దర్భలలోని అగ్నిని యజ్ఞవేదిలో నుంచిరి. యజ్ఞమునకు దక్షిణ దిక్కున దానవాదులుందురు. వారి నుండి రక్షణ కొఱకు బ్రహ్మను దక్షిణ దిక్కున నుంచవలయును. ప్రణీత మొదలగు పాత్రలను ఉత్తరమున నుంచవలయును. పశ్చిమమున యజమాని ఉండవలయును మిగిలిన బ్రాహ్మణులందరు తూర్పుదిక్కున నుండవలయును. ద్యూతములో, వ్యవహారములో యజ్ఞకర్మలో కర్త ఉదాసీనచితుడైనచో ఆ కర్మ నశించును. బ్రహ్మ ఆచార్యులు యజ్ఞకర్మలో యజమాని శాఖ గలవారే యుండవలయును. ఋత్విజుల. విషయమున నియమము లేదు. లభించిన విధముగా ఏ శాఖవారి నైనను నియమించవచ్చును. మూడు అంగుళముల పరిమాణము గల రెండు పవిత్రములు కావలయును. ప్రకణి . నాలుగంగుళములుండవలయును. ఆజ్యపాత్ర మూడంగుళములు, చరు పాత్ర ఆరంగుళములు గలదిగా నుండవలయును. ఉపయమనము రెండంగుళములు కలది, సమ్మార్జనము ఏకాంగుళముండవలయును, సువము ఆరంగుళములు కలది, సుచము మూడన్నర అంగుళములు కలది . సమిధలు ప్రాదేశమాత్రములుగా నుండవలయును. పూర్ణపాత్రము ఆరంగుళములు కలది కావలయును. ప్రోక్షణి పొత్రకు ఉత్తర భాగమున ఎనిమిదిఅంగుళములు గల ప్రణీతి పాత్రనుంచవలయును. భూమండలముననున్న సమస్త నదులు సముద్రములు ప్రణీతిలో చేరియుండును. కావున ప్రణీతిపాత్రను - నీటిచే నింపవలయును. వస్త్ర హీనమగు వేదిక నగ్నమనబడును. కావున దర్భలను పరిచి వస్త్రమును పరచవలయును. ఇంద్రవజ్రము, విష్ణుచక్రము, శివత్రిశూలము అను వాటిని దర్భలతో చేయవలయును. ఈ మూటినే పవిత్రఛేదనములందురు. ప్రణీతజలముతో కూడిన ప్రోక్షణి చేయవలయును. అట్లు చేసినచో మహా పుణ్యమును ప్రసాదించును. కావుననే దానిని పవిత్రమందరు. పలమాత్రప్రమాణము కలదానిని ఆజ్యపాత్రనేర్పరుచవలయును. కులాల చక్రముతో నిర్మించబడిన మృణ్మయ పాత్రను ఆసురమందురు. ఆ పాత్రయే హస్తమున ధరించినచో దైవికర్మకు యోగ్యమగు స్థాల్యాదులుగా మారును. సువమున శుభాకర్మలన్నియూ నుండును. కావుననే పవిత్రత కొఱకు స్రువమును అగ్నిచే తప్తము చేయవలయును. స్రువమున అగ్రభాగమున ధరించినచో వైధవ్యము, మధ్యభాగమున సంతాన క్షయము మూలమున హోతృమరణము సంభవించును. కావున చక్కగా విచారించి ధరించవలయును. అగ్ని, సూర్యుడు, యముడు, చంద్రుడు, బ్రహ్మ, వాయువు అను నీ షడ్రేవతలు స్రువమున ప్రతి అంగుళమున నుందురు. అగ్ని, భోగార్ధనాశమును, సూర్యుడు వ్యాధిని, సోముడు ఫలరాహిత్యమును కలిగించును. బ్రహ్మ సర్వకామములనిచ్చును. వాయువు వృద్దిని కలిగించును. యముడు మృత్యువునిచ్చును. సంమార్జన- ఉపయమనములుగా రెండు దర్భలను ఏర్పరచవలయును. శ్రీపర్ణము, శమీ, ఖదిరము, వికంకము పలాశము అయిదు శాఖలను స్రువమున, సుచమున ఉంచవలయును. స్రువము హస్తపరిమితము, స్రుచము ముప్పదియంగుళముల పరిమాణముండవలయును. ఈ పరిమాణము బ్రాహ్మణులకు విధించబడినది. ఇతరులకు ఒక అంగుళము తక్కువగా నుండవలయును. శూద్ర పతిత : ఖరాది దృష్టిదోషనివారణమునకు పాత్రలను ప్రోక్షించవలయును. పూర్ణపాత్రను ఏర్పరచనిచో యజ్ఞచ్ఛిద్రము కలుగును. పూర్ణపాత్రనుంచినచో యజ్ఞ పూర్తీ జరుగును. అష్టముష్టి పరిమితములు నాలుగైనచో పుష్కలమనబడును. నాలుగు పుష్కలములను పూర్ణపాత్ర యందురు. హోమకొలమున ఎవరికి ఆసనము నీయరాదు. అట్లిచ్చినచో అగ్ని అసంతృప్తుడై దొరుణ శాపమునిచ్చును. ఆధారపాత్రలను నాసికలందురు. ఆజ్యభాగములను చక్షువులందురు. ప్రాజాపత్యమును ముఖమని వ్యాహృతులను కటియని యందురు. పంచవాగుణములను శీర్షము హస్తములు పొదములు అందురు. సిష్టకృతము పూర్ణాహుతి శ్రోత్రములందురు. రెండుముఖములు, ఒక హృదయములు, నాలుగు శ్రోత్రములు, రెండునొసీకలు, రెండు తలలు, ఆరునేత్రములు, పింగళవర్ణము, ఏడు జిహ్వలు, వామభాగమున మూడు హస్తములు, దక్షిణ భాగమున నాలుగు హస్తములు, సుకువములు, జపమాల, శక్తి దక్షిణకరము నందు, మూడుమేఖణలలు, మూడు పాదములు, ఘృత. పాత్రము, రెండు చామరములు కలిగియుండును. మేషవాహనము, నాలుగు శృంగములు, బాలసూర్యకాంతి కలిగి యుండును. ఉపవీతముతో కూడి యుండును. జటాకుండలమండితుడుగా నుండును. ఇట్లు అగ్ని దేహమును తెలుసుకొని హోమ కర్మనారంభించవలయును.

పయో దధి ఘృతం చైవ స్నేహపక్వం తథైవ చ

జుహుయాద్యస్తు హస్తేన స విప్రో బ్రహ్మహా భవేత్

యదన్నం పురుపోఽశ్నాతి తదన్నం తస్య దేవతాః

సర్వకామసమృద్ధ్యర్థం తిలాధిక్యం హవిర్మతమ్

హోమే ముద్రిత్రయం ప్రోక్తం మరీ హంసీ చ సూకరీ

అభిచారే సూకరీ స్యాత్ మృగీ హంసీ శుభాత్మ కే

సర్వాంగుళీభిః క్రౌడీ స్యాత్ హరిసీ ముక్తకనిష్ఠికా

మధ్యమానామికాంగుష్ఠైః మృగీ ముద్రా ప్రకీర్తితా

పూర్వప్రమాణయాహుత్యా పంచాంగులిగృహీతయా

దధిమధ్వాజ్యసంయుక్తం ఋత్విగ్భిర్జుహుయాత్తిలైః

కుశాస్త్వనామికాసక్తాః కార్యాస్యుః పుణ్యకర్మణి

వినాయకః కర్మవిఘ్న సిద్ధ్యర్థం వినియోజితః

గణానామాధిపత్యే చ రుద్రేణ బ్రహ్మణా తథా

తేనోపసృష్టో యస్తస్య లక్షణాని నిబోధ మే

స్వమేవ గాహతేఽత్యర్థం జలం ముండాంశ్చ పశ్యతి

కొమాయ వాసస శ్చైవ క్రత్యాదాంశ్చాధిరోహతి

అంత్యజైర్గర్ధభైరుష్ట్రైస్స హైవ త్రావ తిష్ఠతే

ప్రజన్నపి తథాత్మానం మన్యతేఽనుగతం పరైః

విమనా విఫలా రంభస్సంసీదత్య నిమిత్తతః

తేనోపసృష్టో లభతే న రాజ్యం రాజ్యనందనః

కుమారీ న చ భర్తా గమపత్యం గర్భమంగనా

ఆచార్యత్వం శ్రోత్రియశ్చ న శిష్యోఽధ్యయనం తథా

వణిగ్లాభం న చాప్నోతి కృషిం చాపి కృషీవల:

స్నపనం తస్య కర్తవ్యం పుణ్యేఽహ్ని విధిపూర్వకమ్

గౌరపర్షపకల్కేన స్వస్తివాచ్యాద్విజైశ్శుభాః

ఆశ్వస్థానాద్గజస్థానాత్ వర్మీ కాత్సంగమాద్ద్రుదాత్

మృత్తికాం రోచనాం గంధాన్ గుగ్గులుం చాశు నిక్షి పేత్

పాత్ర్యద్ధృతా హ్యేకవర్ణైశ్చతుర్భిః కలశైర్ర్హదాత్

చర్మణ్యానుడు హైరక్తే స్థాప్యం భద్రాసనం తతః

సహస్రాక్షం శతధారమృషిభిః పావనం కృతమ్

తేన త్వామభిషించామి పావమాన్యాః పునంతు తే

భగం తే కరుణో రాజా భగం సూర్యో బృహస్పతిః

భగమింద్రశ్చ వాయుశ్చ భగం సప్తర్షయో దదుః

యత్తే కేశేషు దౌర్భాగ్యం సీమంతే యచ్చ మూర్ధని

లలాటే కర్ణయోరక్షోరాపస్తుదంతు సర్వదా

స్నానస్య సార్షపం తైలం స్రువేణౌదుంబరేణ తు

జుహుయాన్మూర్ధని కుశాన్ సవ్యే చ పరిగృహ్య చ

మితశ్చ సంమితశ్చైవ తథా శాలకటంకటౌ

కూష్మాండో రాజపుత్రశ్చేత్యంతే స్వాహాసమన్వితైః

నామభిర్బలిమంత్రైశ్చ నమస్కారసమన్వితైః

దద్యాచ్చతుష్పధే సూర్యే కుశానాస్తీర్య సర్వతః

కృతాకృతాంస్తండులీశ్చ పలలౌదనమేవ చ

మత్స్యావృక్వాంస్తథైవామాన్ మాంసమేతావదేవ తు

పుష్పం చిత్రం సుగంధం చ సురాం చ త్రివిధామ

మూలవం పూరికాపూపాన్ తథైవోటస్రజోఽపి చ

దధ్యన్నం పాయసం చైవ గుడపిష్టం సమోదకమ్

ఏతాన్సర్వానుపాహృత్య భూమౌ కృత్వా తతశ్శిరః

వినాయకస్య జననీముపతిష్ఠేత్తతోంబికామ్

దూర్వాపర్షపపుష్పాణాం దత్వార్ఘ్యం పూర్ణమంజలిమ్

రూపం దేహి యశో దేహి భగం భగవతి దేహి మే

పుత్రాన్దేహి ధనం దేహి సర్వాన్కామాంశ్చ దేహి మే

ఉపస్థాయ శివాం దుర్గాముమాపతిమథార్చమేత్

ధూపైర్దీ పైశ్చ నైవేద్యైర్గంధమాల్యానులేపనైః

తతశ్శుక్లాంబరధరశుక్లమాల్యానులేపనః

బ్రాహ్మణాన్ఫోజయేత్పశ్చాద్వస్త్రయుగ్మం గురోరపి

ఏవం వినాయకం పూజ్య గ్రహాంశ్చైవ ప్రపూజయేత్

శ్రీకామశాంతికామో వా పుష్టిబుద్ధ్యాయువీర్యవాన్

సూర్యస్సోమో మహీపుత్రో బుధో జీవో భృగుశ్శని

రాహు కేతు న వా ప్యేతే స్థాపనీయా గ్రహాః క్రమాత్

తామ్రకాద్రజతాద్రక్త చందనోత్స్వర్ణకాదపి

హెమ్నో రజతాదయస సీసాత్కార్యా శుభాప్తయే

స్వవర్ణైర్వా పటే లేఖ్యా గంధైర్మండల కేషు చ

 యథావర్ణం ప్రదేయాని వాసాంసి కుసుమాని చ

గంధాశ్చ బలయ శ్చైవ ధూపో దేయశ్చ గుగ్గులు:

కర్తవ్యా మంత్రవంతశ్చ చరవః ప్రతిదైవతమ్

ఆవృష్ణేన ఇ మందే వా అగ్నిర్మూర్దాదివః క్రమాత్

ఉద్బుధ్య స్వేతి యదర్య తథైవాన్నాత్పరిస్రుతః

శంనో దేవీస్తథా కాండాత్ కేతుం కృణ్వన్న కేతవః

అర్కః పలాశః ఖదిరస్త్వపామార్గోఽథ పిప్పల:

ఉదుంబరశ్నమీ దూర్వా కుశాశ్చ సమిధః క్రమాత్

ఏకైకస్మాదష్టశతం అష్టావింశతిరేవ చ

హోతవ్యా మధుసర్పీభ్యాం దధ్నా స్త్రీ రేణ వా పునః

గుడౌదనం పాయసం చ హవిష్యం క్షీరషాష్టికమ్

దధ్యోదనం హలిశ్చూర్ణం మాంసం చిత్రాన్న మేవ చ

 దద్యాద్గృహక్రమాదేతద్ద్విజేభ్యో భోజనం బుధః

శక్తితోఽపి యథాలాభం సత్కృత్య విధిపూర్వకమ్

ధేనుశ్శంఖస్తదానడ్వాన్ హీమకాసో హయః క్రమాత్

కృష్ణా గౌరాయసః భాగ ఏతా వై దక్షిణా స్మృతాః

యస్య యస్య తు యద్ద్రవ్యం పలేనార్బ్యస్సతేన చ

బ్రహ్మ న్నేషాం వరో దత్త: పూజితాః పూజయిష్యథ

గ్రహాధీనా నరేంద్రాణాం ధనజాత్యుచ్చ్రయాస్తథా

భావాభావో చ జగతస్తస్మాత్పూజ్యతమా గ్రహాః

ఆదిత్యస్య సదా పూజా తిలకం స్వామినస్తథా

మహాగణపతేశ్చైవ కుర్వన్సిద్ధిమవాప్నుయాత్

కర్మణాం సఫలత్వం చ శ్రీయం వాప్నోత్యుత్తమామ్

 అకృత్వా మాతృయాగం తు యో గ్రహార్చాం సమారభేత్

కుప్యంతి మాతరస్తస్య ప్రత్యూహం కుర్వతే తథా

వసోః పవిత్రమంత్రేణ వసోర్ధారాం ప్రకల్ప్య చ

గౌర్యాద్యా మాతరః పూజ్యా మాంగల్యేషు శుభార్ధిభిః

గౌరీ పద్మా శచీ మేధా సావిత్రీ విజయా జయా

దేవ సేనా స్వధా స్వాహా మాతృకా వైధృతిర్ధృతిః

 పుష్టిర్ఘృష్టిస్తథా తుష్టిరాత్మ దేవతయా సహ

గణే శేనాధికో హ్యేతా వృద్దౌ పూజ్యాస్తు షోడశ

ఆవాహనం తథా పాద్యమర్ఘ్యం స్నానం చ చందనమ్

అక్షతాంశ్చైవ పుష్పాణి ధూపం దీపం ఫలాని చ

నైవేద్యమాచమనీయం చ తాంబూలం పూగమేవ చ

నీరాజనం దక్షిణాం చ క్రమాద్దద్యాచ్చతుష్టయే

పాలు పెరుగు, నెయ్యి నూనేతో వండిన దానిని చేతితో హోమమును చేసిన బ్రాహ్మణుడు బ్రహ్మ హత్యా పొపమును పొందును.మానవుడు తాను భుజించు ఆహారమునే తన దేవతలకు సమర్పించవలయును. సర్వకామ సమృద్దికి తిలాధిక్యములు కల హవిస్సును సమర్పించవలయును. హోమమున మృగీ, హంసీ, సూకరీయని మూడు ముద్రలుండును. అభిచార హోమమున మాత్రము సూకరీముద్రనుపయోగించవలయును. శుభకరయాగములో హంసీ, మరీ ముద్రలను ఉపయోగించవలయును. చేతి అన్ని వేళ్ళను కలిపినచో సూకరీ ముద్రయగును. కనిష్ఠికను వదిలినచో హంసీ ముద్రయగును. మధ్యమ అనామికొంగుష్ఠలను కలి పినచో మరీ ముద్రయగును. మొదట చెప్పిన ప్రమాణముననుసరించి పంచాంగులములతో హవిస్సును దధిమధు ఆజ్యయుక్తముగా స్వీకరించి తిలలతో కలిపి ఋత్విక్కులు హోమమును చేయవలయును. శుభకర్మలలో దర్భలను అనామికొంగుళులతో, ధరించవలయును. వినాయకుడు కర్మముల విఘ్న సిద్ధికి నియమించబడియుండెను. అట్లే గణాధిపత్యమున కూడా బ్రహ్మరుద్రులు వినాయకుని నియమించిరి. అట్టి వినాయకుడు స్పృశించిన వాని లక్షణములను తెలుపుచున్నాను వినుము. తన నీటిలోనే తాను మునుగును. కేశఖండనము చేయబడిన ముండులను చూచును. కామారుడై వస్త్రాభిలాషియే రాక్షసులనావేశించును. అంత్యజులతో రాసభములతో ఒంటెలతో కలిసి ఒకే చోట నివసించును. దొరిలో నడుచుచు తననెవరో వెంబడించుచున్నారని తలంచును. ఎపుడూ వేదనచే నిండిన మనసు కలవాడై యుండును. ప్రారంభించిన ప్రతీపని విఫలమగును. కారణము లేకనే కలత చెందును. వినాయకునిచే స్పృశించబడిన రాజపుత్రులు రాజ్యమును పొందజాలదు. కన్య భర్తను పొందలేదు. వివాహిత స్త్రీ సంతానమును పొందజాలదు. శ్రోత్రియుడు ఆచార్యత్వమును, శిష్యుడు అధ్యయనమును పొందజాలడు. వైశ్యుడు తన వ్యాపారమున లాభమును పొందజాలడు. రైతు పంటను పొందజాలడు. కావున వినాయకోపసృష్టుడైన వానికి శుభదినమున విధి పూర్వకముగా స్నపనమును చేయవలయును. పచ్చని ఆవాలచే బ్రాహ్మణులు స్వస్తి వాచనమును చేయవలయును. అశ్వశాలనుండి, గజశాలనుండి, పుట్టనుండి, నదీసంగమము నుండి, సరస్సునుండి మట్టిని, రోచనమును, గంధమును, గుగ్గులును తెచ్చి నిక్షిప్తము చేయవలయును. ఒకేరంగు కల నాలుగు కలశములతో యోగ్యమగు ప్రదమునుండి జలమును తేవలయును. ఎఱ్ఱని వృషభ చర్మమున భద్రాసనమును స్థాపించవలయును. వజ్రాయుధమును ధరించిన ఇంద్రుని ఋషులు పావనము చేసిన జలముచే నిన్ను అభి షేకించేదను. పవమానదేవతలు నిన్ను పవిత్రుని చేయుదురు గాక. వరుణుడు, సూర్యుడు, బృహస్పతి, ఇంద్రుడు, వాయువు, సప్తర్షులు నీకు ఐశ్వర్యమును ప్రసాదింతురు గావు, నీ కేశములలో, పాపిటలో శిరస్సులో, లలాటమున,చెవులలో, నేత్రములలో నున్న దౌర్బాగ్యమును జలము తొలగించుగావుత, స్నానము మేడిస్రువము ద్వారా ఆవనూనెతో శిరస్సున సవ్యముగా దర్భలను గ్రహించి ఉంచవలయును. నొలుగు దొరుల కూడలిలో దర్భలను పరీచి అంతటా మీతసంఘిత శాలకంటకములను గుమ్మడికాయను రాజపుత్ర అను పదము అంతమందు కల మంత్రములతో, నమస్కారములతో నీయవలయును. ఉడికి ఉడకని బియ్యమును,మాంసమును అన్నమును, వండిన మత్స్యములను, వండని వాటిని సమర్పించవలయును. పలువిధములగు పుష్పములను, గంధమును, మూడువిధములగు సురనర్సించవలయును. మూలములను పూర్లాపూపములను, పూలమాలలను, పెరుగన్నమును, పొయసమును బెల్లముతో కలిపిన పిండిని తగిన నీటితో కలిపి, . వీటినన్నింటిని ఒకచోట చేర్చి, భూమియందుంచి నమస్కరించి, వినాయకుని తల్లియగు పొర్వతిని ప్రార్థించవలయును. గరక ఆవాలపూలచే పూర్లోంజలిచే ఆర్యము నీయవలయును. రూపమును, కీర్తిని, ఐశ్వర్యమును ప్రసాదించుము. పుత్రులను, ధనమును అన్ని కోరికలనీయుము. అని శివుని పతియగు పొర్వతిని పూజించి తరువాత శివుని ధూపదీప గంధమాల్యాదులచే నైవేద్యములచే పూజించవలయును. తరువాత తెల్లని వస్త్రములను, తెల్లని పుష్పమాలలను ధరించి బ్రాహ్మణులకు అన్నదానమును చేయువలయును. గురువుగారికి రెండు వస్త్రములను కూడా దానము చేయవలయును. ఇట్లు వినాయకుని పూజించి పిదప గ్రహములను కూడా పూజించవలయును. సంపదను, శాంతిని, "పుష్టి బుద్ది ఆయుష్యములను కోరువారు గ్రహములను పూజించవలయును. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నీ నవగ్రహములను క్రమముగా స్థాపించవలయును. ఈ గ్రహములను రాగితో, వెండితో రక్త చందనముతో బంగారముతో, ఉక్కుతో, సీసముతో కాని శుభము కొఱకు చేయవలయును లేదా వస్త్రములందు వారి వొరి వర్ణములతో లిఖించవలయును. మండలములలో కూడా లిఖించవచ్చును. ఆయా గ్రహములకు నియమించబడిన వర్ణములు గల వస్త్రములను పూవులను సమర్పించవలయును.

 గంధములను బలులను గుగ్గులు ధూపమును సమర్పించవలయును. మంత్రములతో చరువును సిద్దము చేయవలయును. “ఆకృ షైన"అను మంత్రముతో సూర్యుని, ‘ఇమం దేవా’ అను మంత్రముతో చంద్రుని, “అగ్నిర్మూర్ధా” అను మంత్రముతో కుజుని, “ఉద్బుధ్యస్వ" అను మంత్రముచే బుధుని, “యదర్య"అను మంత్రముచే గురువును, “అన్నాత్పరిస్రుత" అను మంత్రముచే శుక్రుని, “శం నో దేవీ" అను మంత్రముచే శనిని, “కాండాత్" అనుమంత్రముచే రాహువును, “కేతుం కృణ్వన్న కేతవ” అను మంత్రముచే కేతువును. ధ్యానించవలయును. జల్లేడు, మోదుగు, జువ్వి ఉత్తరేణి, రాగి, మేడి, జమ్మి, గరక, దర్భలు, సమిధలు యథాక్రమముగా ఒక్కొక్క గ్రహమునకు 108, కాని 28 సార్లు కాని హోమమును చేయవలయును. అట్ల తేనెతో, నేయితో, పెరుగుతో, పాలతో కొని హోమము చేయవలయును. బెల్లముకలిపిన అన్నమును, పాయసమును, హవిస్సును, క్షీరములను, దధ్యోదనమును, హవిశూర్ణమును మాంసమును, చిత్రాన్నమును యథాక్రమముగా ఆయాగ్రహములకర్పించవలయును. తరువాత బ్రాహ్మణులను భుజింప చేయవలయును. శక్తి ననుసరించి యథావకాశముగా శాస్త్రముననుసరించి బ్రాహ్మణులను సత్కరించి, ధేనువును, శంఖమును, వృషభమును, తెల్లని వస్త్రములను, గుఱ్ఱమును, కపిలగోవును, ఇనుము, మేక వీటిని యథాక్రమముగా దక్షిణగా సమర్పించవలయును. ఏ గ్రహమునకు ఏ ద్రవ్యము, ఫలము నిర్ణయించబడినదో ఆ ద్రవ్యాదులచే పూజించవలయును. ఇట్లు పూజించిన వారిని గ్రహములు. అనుగ్రహించునని శాస్త్రము చెప్పుచున్నది. మానవుల ధన, జాతి అభివృద్దులు గ్రహాధీనములే. జగత్తు స్థితినాశములు కూడా గ్రహాధీనములే కావున ఆయాగ్రహములను పూజించవలయును. ఎపుడూ సూర్యుని పూజించి, స్వామీయైన మహాగణపతికి తిలకము నుంచిన వారు సిద్ధిని పొందెదరు. అన్ని కర్మలు ఫలించును. సాటిలేని సంపదలను పొందును. మాతృదేవతల పూజ చేయక గ్రహపూజచేసినచో మాతృదేవతలు కోపింతురు. ఓవసోః పవిత్రం అను మంత్రముచే వసుధారను కల్పించి గౌరీమొదలగు మాతృదేవతలను, శుభకర్మల యందు శ్రేయోభిలాషులు పూజించవలయును. గౌరీ, పద్మా, శచీ, మేధా, సావిత్రీ, విజయా, జయ, దేవ సేనా, స్వధా, స్వాహా, వైధృతి, ధృతి, పుష్టి, హృష్టి, తుష్టి, ఆత్మ దేవత యను పదునారు మాతృదేవతలు, గణేశునితో షోడశ మాతృకలను శుభకర్మలయందు వృద్ధి కొఱకు పూజించవలయును. ఆ వాహనము పాద్యము, అర్ఘ్యము, స్నానము, చందనము, అక్షతలు, పుష్పములు, ధూపము, దీపము, పండ్లు, నైవేద్యము, ఆచమనీయము, తాంబూలము, పోకలు, నీరాజనము, దక్షిణలను మాతృదేవతల సంతోషము కొఱకు క్రమముగా నీయవలయును.

పితృకల్పం ప్రవక్ష్యామి ధనసంతతివర్థనమ్

అమావాస్యాష్టకావృద్ధి: కృష్ణపక్షాయనద్వయమ్

ద్రవ్యం బ్రాహ్మణసంపత్తిర్విషువత్సూర్యసంక్రమః

వ్యతీపాతో గజచ్చాయా గ్రహణం చంద్రసూర్యయోః

శ్రాద్ధం ప్రతిరుచి శ్చైవ శ్రాద్ధకాలాః ప్రకీర్తితాః

అగ్ర్యాస్సర్వేషు వేదేషు శ్రోత్రియో బ్రహ్మవిద్యువా

వేదార్థవిజ్జ్యేష్ఠసామా త్రిమధుస్త్రీ సుపర్ణికః

స్వస్రీయ ఋత్విగ్జామాతా యాజ్యశ్వశురమాతులాః

త్రిణాచికేతదౌహిత్రశిష్యసంబంధబాంధవాః

కర్మనిష్ఠాస్తపోనిష్ఠా పంచాగ్నిబ్రహ్మచారిణః

పితృమాతృపరాశ్చైవ బ్రాహ్మణాశ్శ్రాద్ధసంపదః

రోగీ న్యూనాతిరిక్తాంగః కాణః పౌనర్భవస్తథా

అవకీర్ణో కుండగోలౌ కునఖీ శ్యావదంతకః

భృతకాధ్యాపకః క్లీబః కన్యాదూష్యభిశస్తకః

మిత్రధ్రుక్ పిశునస్సోమవిక్రయీ పరివిందకః

మాతృపితృగురుత్యాగీ కుండాశీ వృషలాత్మజః

పరపూర్వాపతి ప్సైనః కర్మ భ్రష్టాశ్చ నిందితాః

నిమంత్రయాత పూర్వేద్యుర్భ్రాహ్మణానాత్మవాన్శుచిః

తైశ్చైపి సంయతైర్భావ్యం మనోవాక్కాయకర్మభిః

అపరాహ్ణే సమభ్యర్చ్య స్వాగతేనాగతాంస్తు తాన్

పవిత్రపాణిరాచాంతాన్ ఆసనే చోపవేశయేత్

విప్రాన్దైవే యథాశక్తి పిత్రేయుగ్మాంస్తథైవ చ

పరాశ్రితే శుచౌ దేశే దక్షిణా ప్రవణం తథా

ద్వౌ దైవే ప్రాక్త్రయః పిత్రే ఉదగేకైకమేవ చ

 మాతామహానామ ప్యేవం తత్ర వా వైశ్వదైవికమ్

పాణిప్రక్షాలనం దత్త్వా విష్టరార్థం కుశానపి

ఆవాహయేదనుజ్ఞాతో విశ్వేదేవాస ఇత్యృచా

యవైరన్వావకీర్యాథ భాజనే స పవిత్రకే

శన్నో దేవ్యా అపః క్షిప్త్వా యవోఽసీతి యవాంస్తథా

యా దివ్యా ఇతి మంత్రేణ హస్తే పాద్యం వినిక్షిపేత్

దత్త్వోదకం గంధమాల్యం ప్రదాయాన్నం సదీపకమ్

అపసవ్యం తతః కృత్వా పితృణాం సప్రదక్షిణమ్

ద్విగుణాంస్తు కుశాన్దత్వా హ్యుశంతన్త్వత్కచా పితృన్

ఆవాహ్య తదనుజ్ఞాతో జపే దాయంతు నస్తతః

యవార్ధాస్తు తిలైః కార్యా కుర్యాదర్ఘ్యాది పూర్వవత్

దత్వార్ఘ్యం సయవాం స్తేషాం పాత్రే కృత్వా విధానతః

పితృభ్యస్థానమపీతి న్యుజ్జం పాత్రం కరోత్యధః

అగ్నౌ కరిష్యన్నారాయ పృచ్ఛత్యన్నం ఘృతప్లుతమ్

కురు ష్వేత్యభ్యనుజ్ఞాతో దత్వాన్నౌ పితృయజ్ఞవత్

హుత శేషం ప్రదద్యాత్తు భాజనేషు సమాహితః

యథాలాభపపన్నేషు రౌప్యేషు చ విశేషతః

దత్వాన్నం పృథివీరిపాత్రమితి పాత్రాభిమంత్రణ

కృత్వేదం విష్ణురిత్యన్నే ద్విజాంగుష్ఠం నివేశయేత్

సవ్యాద్హృతికాం గాయత్రీం మధు పోతా ఇతి త్వచమ్

జప్త్వా యథాసుఖం వాచ్యం భుంజీరం స్తేపి వాగ్యతాః

అన్నమిష్టం హవీష్యం చ దద్యాదక్రోధనోఽత్వరః

ఆతృప్తేస్తు పవిత్రాణి జప్త్వా పూర్వజపం తథా

అన్నమాదాయ తృప్తాస్థ్స శేషం చైవానుమాన్య చ

తదన్నం వికిరేద్భూమౌ దద్యాచ్చాపస్సకృత్ సకృత్

సర్వమన్నముపాదాయ సతిలం దక్షిణాముఖs

ఉచ్ఛిష్ఠసన్నిధౌ పిండాన్ దద్యాద్వై పితృయజ్ఞవత్

మాతామహానామ ప్యేవం దద్యాదాచమనం తతః

స్వస్తివాచం తతః కుర్యాత్ అక్షయ్యోదకమేవ చ

దత్వా చ దక్షిణాం శక్త్యా స్వధాకారముదాహార్త్

వాచ్యతామిత్యనుజ్ఞాతః ప్రకృతేభ్యస్వధోచ్యతామ్

బ్రూయుగస్తు స్వధోత్యుత్తే భూమౌ సించేత్తతో జలమ్

విశ్వేదేవాశ్చ ప్రీయంతాం విప్రైశ్చోక్త ఇదం జపేత్

దాతారో నోఽభి వర్ధంతా వేదాస్పంతతి దేవ చ

శ్రద్ధా చ నో మా వ్యగమత్ బహు దేయం చ నోఽస్త్వితి

ఇత్యుక్త్వాః ప్రియా వాచః ప్రణిపత్య విసర్జయేత్

వాజే వాజే ఇతి ప్రీతః పితృపూర్వం విసర్జనమ్

యస్మింస్తే సంశ్రవాః పూర్వమర్ఘ్యపాత్రే నివేశితాః

పితృపాత్రం తదుత్థానం కృత్వా విప్రాన్విసర్జయేత్

ప్రదక్షిణమను వ్రజ్య భుంజీత పితృ సేవితమ్

బ్రహ్మచారీ భవేత్తాం తు రజనీం బ్రాహ్మణైస్సహ

ఏవం ప్రదక్షిణావృత్యా వృద్ధౌ నాందీముఖాన్పతౄన్

యజేత దధికర్కంధుమిశ్రాన్పిండాన్యవైః కృతాన్

ఏకోద్దిష్టం దేవ హీనమేవార్ఘ్యైకపవిత్రకమ్

ఆవాహనాగ్నౌ కరణరహితం హ్యాపసవ్యవత్

ఉపవిష్టతామక్షయ్యస్థానే విప్రవిసర్జనే

అభిరమ్యతామితి వదేత్ బ్రూయుస్తేఽభరతాస్స్మ హ

గంధోదకం తిలైర్యుక్తం కుర్యాత్పాత్రచతుష్టయమ్

అర్ఘ్యార్థం పితృపాత్రేషు పేతపాత్రం ప్ర సేచయేత్

యే సమాహా ఇతి ద్వాభ్యాం శేషం పూర్వవదాచరేశ్

 ఏతత్సపిండీకరణమేకోద్దిష్టం స్త్రీయా అపి

ఆర్వాక్సపిండీకరణం యస్య సంవత్సరాద్భవేత్

తస్యాప్యన్నం సోదకుంభం దద్యాత్సంవత్సరం ద్విజే

మృతేఽహని తు కర్తవ్యం ప్రతిమాసం తు వత్సరమ్

ప్రతిసంవత్సరం చైవ మాసమేకాదశేహని

పిండాంశ్చ గోఽజవిపేభ్యో దద్యాదగ్నౌ జపివా

ప్రక్షి పేత్సత్సు విప్రేషు ద్విజోచ్ఛిష్టం న మార్జయేత్

హవిష్యన్నేన వై మాసం పాయ సేన తు వత్సరమ్

మాత్స్యా హరణకౌరభ్రశామనచ్ఛాగపార్హతైః

వణరౌరవపోరాహాశైర్మాం సైర్యథాక్రమమ్

మాసవృద్ద్యాభితృప్యంతి దత్తైరిహ పితామహాః

ఖడ్గామిషం మహాకల్పిం మధు మున్యన్నమేవ చ

 లోహామిషం మహాశాకం మాంసం వాంఘ్రీణసస్య చ

యో దదాతి గయాస్థశ్చ సర్వమానన్త్యమశ్నుతే

తథా వర్షత్రయోదశ్యాం మఘాసు చ విశేషతః

కన్యాం కన్యావేదినశ్చ పశూన్వై సత్సుతానపి

ద్యూతం కృషిం చ వాణిజ్యం ద్విశ ఫైకఫాశషాంస్తథా

బ్రహ్మవర్చస్వినః పుత్రాన్ స్వర్ణరూప్యే సకుప్యకే

జ్ఞాతిశ్రేష్ఠ్యం సర్వకామానాప్నోతి శ్రాద్ధదస్సదా

ప్రతిపత్ప్రభృ తిష్వేకం వర్జయిత్వా చతుర్దశీమ్

శస్త్రేణ తు హతా యే వై తేభ్యస్తత్ర ప్రదీయతే

స్వర్గం హ్యపత్యమోజశ్చ శౌర్యం క్షేత్రం బలం తథా

పుత్రాన్శ్రేష్ఠాంశ్చ సౌభాగ్యం సమృద్ధిం ముఖ్యతాం శుభం

ప్రవృత్తం చక్రతాం చైవ నొణిజ్యప్రభృతీని చ

అరోగిత్వం యశోవీతశోకతా పరమాం గతిమ్

ధనం విద్యాం భిషక్సిద్ధిం కుప్యగా అప్యజావికమ్

అశ్వానాయుశ్చ విధివత్ యశ్శ్రాద్ధం సంప్రయచ్ఛతి

కృత్తికాదిభరణ్యంతం స కామానాప్నుయాదిమాన్

ఆస్తికశ్శద్దధానశ్చ వ్య పేతమదమత్సరః

వసురుద్రాదితిసుతాః పితరశ్శ్రాద్ధదేవతాః

ప్రీణయంతి మనుష్యాణాం పితౄన్ శ్రాద్దేన తర్పితః

ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ

ప్రయచ్ఛంతి తథా రాజ్యం నృణాం ప్రీతాః  పితామహాః

ఇత్యేవం కథితం కించిత్ కల్పాధ్యాయే విశేషతః

జ్ఞాతవ్యం వైదికే తంత్రే పురాణాంతర కేఽపి చ

య ఇమం చింతయేద్విద్వాన్ కల్పాధ్యాయం మునీశ్వర

సభవేత్కర్మకుశల ఇహాన్యత గతిం శుభమ్

యశ్శ్రుణోతి నరో భక్త్యా దైవే పిత్త్రే చ కర్మణి

కల్పాధ్యాయం ప లభతే దైవపిత్త్రుక్రియాఫలమ్

ధనం విద్యాం యశః పుత్రాన్ పరత్ర చ గతిం పరామ్

అతః పరం వ్యాకరణం తుభ్యం వేదముఖాభిధమ్

కథయి ప్యే సమాసేన శృణుష్వ సుసమాహితః

ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయ పాదే

ఏకపంచాశత్త మోఽధ్యాయః

సంపదలను, సంతానమును వృద్దిగావించు పిత్సకల్పమును ఇపుడు చెప్పెదను. ఉత్తరాయణ పుణ్యకాలమున దక్షిణాయన పుణ్యకాలమున, అమావాస్యాతిథి యందు, అష్టకములలో, తిథివృద్ధిలో నున్నపుడు, ద్రవ్యము లభించినపుడు, సదాహ్మణులు వచ్చినపుడు, విషువత్కాలమందు, సూర్యసంక్రమణమున, వ్యతీపాద్యోగమునందు, గజచ్ఛాయలో, సూర్య చంద్రగ్రహణ కాలమున శ్రాద్దమును చేయవలయునని ప్రీతి కలిగిన కొలమున శ్రాద్ధమునోచరించవలయును. ఈ సమయములు శ్రాద్దకొలములుగా పెద్దలచే పేర్కొనబడినవి. ఉత్తమపంశ సంజాతుడు, సర్వ వేదములను అధ్యయనము చేసినవాడు, శ్రోత్రియుడు, బ్రహ్మ జ్ఞానము కలవాడు, - యువకుడు, వేదార్దజ్ఞుడు, సామవేదమును చదివిన వాడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు, చెల్లెలు కొడుకు, ఋత్విజుడు, అల్లుడు, యాగము చేయువాడు, మామ, మేన మామ, త్రికాలములలో సంధ్యావందనము నాచరించువాడు, పుత్రికా పుత్రుడు, శిష్యుని సంబంధులు, బంధువులు, కర్మనిషులు, తపోనిషులు, పంచాగ్నిపరాయణులు, బ్రహ్మ చారులు, పితృమాతృభక్తి గలవారు, అగు బ్రాహ్మణులు శ్రాద్ధమున నియోగించుటకు యోగ్యులు. రోగము కలవాడు, అంగవికలురు, అంగాధిక్యులు, గ్రుడ్డివారు, కవలలలో తరువాత పుట్టినవాడు, దీనుడు, విధవాపుత్రుడు, వ్యభిచారిణీ పుత్రుడు, గోళ్ళను పెంచుకొనినవాడు, దంతధావనమును చేయని " వాడు, వేతనను తీసుకొని విద్యను బోధించువాడు, నపుంసకుడు, కన్యను దూషించువాడు, పలువురిచే నిందించబడువాడు, మిత్రద్రోహి, లోభి, సోమరసమునమ్మువాడు, అన్నకంటే ముందు వివాహము చేసుకొనినవాడు. తల్లిని, తండ్రినీ, గురువును త్యజించినవాడు, అయోగ్యుల భోజనము చేయువాడు, శూద్రుని వలన పుట్టినవాడు, స్త్రీకి రెండవ భర్తగా నున్నవాడు, మొదటి భర్త గా నున్నవాడు, చోరుడు, కర్మ భ్రష్టులు శ్రాద్దమున నిమంత్రణమునకు అయోగ్యులు. శ్రాద్ధము చేయువాడు మనోనిగ్రహము కలవాడై, పవిత్రుడై మొదటి దినముననే బ్రాహ్మణులను నిమంత్రణ చేయవలయును. అట్లు నియంత్రణ చేయబడిన బ్రాహ్మణులు కూడా కాక వాచిక మానసిక నిగ్రహము కలిగియుండవలయును. శ్రాద్ధదినమున వచ్చిన బ్రాహ్మణులకు స్వాగతము పలికి అపరాప్లకాలమున పూజించవలయును. పవిత్రమును ధరించి బ్రాహ్మణులకు ఆచమనమునిచ్చి ఆసనముల యందు కూర్చోబెట్టవలయును. విశ్వేదేవతల స్థానమున శక్తిననుసరించి, పితృస్థానమున బేసి సంఖ్యతో అనగా మూడు, అయిదు, మొదలగు సంఖ్యలో బ్రాహ్మణులను ఉంచవలయును. చక్కగా శుద్ధి చేయబడిన ప్రదేశమున దక్షిణాభిముఖముగా నుండి విశ్వదేవతలను ఇద్దరిని ప్రాబ్ముఖముగా, పితృస్థానమున నియోగించిన ముగ్గురిని. ఉత్తరాభిముఖముగా ఒక్కొక్కరిని కూర్చుండ బెట్టవలయును. మాతామహుల విషయమున కూడా ఇట్లే ఆచరించవలయును. హస్తప్రక్షాలణమునాచరించి ఆసనమునకు దర్భలనుంచ వలయును. బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది విశ్వేదేవాస”అను ఋక్కుచే ఆవాహనము చేయవలయును. పవిత్రముతో కూడిన పొత్రయందు యవలను చల్లి "శం నో దేవీ" అను మంత్రముచే నీరునుంచి, “యవోసి”అనుమంత్రముచే యవలనుంచి, “యా దివ్యా”అను మంత్రముచే హస్తమున పాద్యము నర్పించవలయును. తరువాత ఉదకమునిచ్చి, గంధమాల్యముల నర్పించి దీపమునుంచి అన్నప్రదానము గావించవలయును. తరువాత అపసవ్యము చేసుకొని పితృస్థానమున నియోగించిన పోరికి ప్రదక్షిణము చేసి, రెట్టింపు దర్భలనిచ్చి, “ఉశంతః” అను మంత్రముచే అనుమతిని పొంది ఆవాహనము చేయవలయును. తరువాత పితృమంత్రమును జపించవలయును. పితృదేవతలకు యవలకు బదులుగా నువ్వులను వాడవలయును. ఆర్ష్యాదులను పూర్వము వలె నాచరించవలయును. యవలతో అర్ఘ్యమునిచ్చి పాత్రలో యవలను విధానముగా నుంచి ఈ పితృభ్యః స్థానమసి అను మంత్రముచే కొద్దిగా వేడిచేసిన పాత్రను తలక్రిందులుగా చేయవలయును. అన్నమును హోమము చేయునపుడు అనుమతిని పొంది నేతితో కలిపిన అన్నమును హోమము గావించవలయును. హోమము చేయగా మిగిలిన అన్నమును పాత్రలలో నుంచవలయును లభించిన విధముగా పాత్రలనుంచవలయును. బంగారు పాత్రలు శ్రేష్ఠములు. అట్లు పాత్రలలో అన్నము నుంచి ఉపృథివీ తో పొత్రం” అను మంత్రముచే పాత్రలను అభిమంత్రించవలయును. “ఇదం విష్ణుః” అను మంత్రముచే అన్నమున బ్రాహ్మణాంగుష్ఠమునుంచవలయును. వ్యాహృతులచే కూడిన గాయత్రీమంత్రమును, “మధు వాతా” అను మంత్రమును జపించి ‘యథాసుఖం’అని చెప్పవలయును. బ్రాహ్మణులు కూడా మౌనముగా భుజించవలయును. కోపమును, త్వరను విడిచి ఇష్టమగు అన్నమును, హోమము చేసిన హవిస్సును, ఈయవలయును. తృప్తి చెందువరకు వడ్డించవలయును. వారు భోజనము చేయుచుండగా పూర్వము వలె గాయత్రీజపమును చేయుచుండవలయును. అన్నమును తీసుకొని తృప్తినిచెందితిరా యని యడిగి, శేషాన్నమును అనుమతిని పొంది భూమి మీద చల్లవలయును. ఒక్కొక్కమారు జలము నీయవలయును. మొత్తము అన్నమును నువ్వులతో తీసుకొని దక్షిణాభిముఖుడై బ్రాహ్మణులు భోజనము చేసిన ప్రదేశమునకు సమీపమున పిత్స యజ్ఞము నందు వలె పిండ ప్రదానమును గావించవలయును. మాతా మహాదులకు కూడా ఇట్లే చేయవలయును. తరువాత ఆచమనమునకు జలము నీయవలయును. తరువాత స్వస్తివాచనము గావించి అక్షయోగకము నీయవలయును. శక్తిననుసరించి దక్షిణలనిచ్చి స్వధాకారమును చేయవలయును. వాచ్యతాం అని అనుమతిని పొంది, స్వధాకారమును చేయుడు అని పలికి బ్రాహ్మణులు స్వధా అని పలుకగా జలమును భూమి పై చల్లవలయును. విశ్వదేవతలు తృప్తి చెందుదురు గాక అని విప్రులు పలుకగా బ్రాహ్మణులు ఇట్లు జపించవలయును. ఉదోతారో నోభి వర్గస్తోం వేదాస్పంతతిదేవ చ, శ్రద్ధా చ నో మావ్యగమద్బహు దేయం చ నోస్తు”అని అనగా మాకు దొనము చేసినవారు, వేదములు, సంతతివృద్ధి చెందుగాక. మాలో శ్రద్దలోపించకుండుగాక. మాకు చాలా ఇవ్వగల సంపదలు దాతలకు కలుగు గాక అని అర్థము. ఇట్లు బ్రాహ్మణులు ప్రియవచనములను పలుకగా నమస్కరించి పంపించవలయును. “పోజే పోజే”అను మంత్రములచే ప్రీతిపూర్వకముగా మొదట పితృదేవతలను పంపవలయును. మొదట యవాదుల నుంచిన అర్ఘ్యపాత్రను (తలక్రిందులుగా నుంచిన దానిని) యథా. ప్రకారముగా చక్కగా నుంచి తరువాత పంపవలయును. బ్రాహ్మణులకు ప్రదక్షిణముచేసి పంపిన తరువాత పితృభుక్త శేషమును తాము భుజించవలయును. ఆ రాత్రి శ్రాద్ధకర్తలు భోక్తలగు బ్రాహ్మణులు బ్రహ్మ చర్యమును పాటించవలయును. ఇట్లు వృద్ధి కార్యమున సాందీముఖ్యులగు పితృదేవతలను దధి కర్కంధు మిశ్రితములగు, యవలచే చేయబడిన పిండములచే పూజించవలయును. ఏకోద్దిష్టమున మాత్రము దేవస్థానరహితముగా ఏక్తార్ఘ్యపాత్రముతో, ఆవాహనాగ్ని కార్యరహితముగా. నాచరించవలయును. అపసవ్యముతో చేయవలయును. స్థానోపవేశన సమయమున “ఉపతీషతోం”అని, విప్రవిసర్జనలో ‘అభీరమ్యతాం’ అని పలుకవలయును. బ్రాహ్మణులు అభిరతాస్స్మ”అని పలుకవలయును. నువ్వులతో కలిపిన గంధోదకముతో నాలుగు పాత్రలనుంచవలయును. పితృపాత్రలయందలి జలముతో అర్ఘ్యము కొఱకు ప్రీతిపాత్రను తడుపవలయును. “యే సమానా” అను మంత్రములతో రెండు పాత్రలతో తడుపవలయును. మిగిలినదంతయు పూర్వము వలె నాచరించవలయును. ఈ సపిండీ కరణము ఏకొద్దిష్టము స్త్రీవిషయమున కూడా నాచరించవలయును. ఇట్లు సంవత్సరము వరకు తరువాత సపిండీకరణమును చేయవలయును. సంవత్సరము తరువాత మరణించినట్లు తెలిసిననూ తరువాత ఒక సంవత్సరము ఉదకుంభముతో అన్నదానమును బ్రాహ్మణునకు చేయవలయును. ఒక సంవత్సరము ప్రతిమాసమున చనిపోయిన దినమున శ్రాద్ధమును చేయవలయును. సంవత్సరము తరువోత ప్రతిసంవత్సరము చనిపోయినదినమున శ్రాద్ధమునాచరించవలయును. పిండములను గోవులకు కానీ, మేకలకు కాని, బ్రాహ్మణులకు కానీ ఈయవలయును. లేదా అగ్నిలో కాని జలమున కాని విసర్జించవలయును. సదాహ్మణులకే దానమీయవలయును. బ్రాహ్మణులు తినగా మిగిలిన దానిని ఊడ్వరాదు. హవిస్సుకుయోగ్యమగు అన్నమును ఒకనెలహోమము చేయవలయును. పాయసముతో సంవత్సరము హోమమును చేయవలయును. చేపల, లేళ్ళ, పావురముల, ఇతర పక్షుల, మేకల, దుప్పుల, జింకల, ఏదుల, వరాహముల కుందేళ్ళ మాంసములతో యథాక్రమముగా ఒక్కొక్క నెలలో పితరుల నర్పించినచో పితృదేవతలు తృప్తి చెందెదరు. పితామహులు తృప్తి చెందేదరు. ఖడ్గమృగమాంసముతో చేయు పితృయజ్ఞము మహాకల్పమనబడును. తేనెచే మునుల ఆహారముచే కూడా శ్రాద్ధము చేయవచ్చును. డేగమాంసము మహాశాకము కోడిమాంసమునర్పించవచ్చును. గయాక్షేత్రమున పైన చెప్పబడిన వాటిచే శ్రాద్దమును చేసినచో ఉత్తమ ఫలములను పొందును. ఇట్లే వర్షర్తువులోని త్రయోదశి తిథిన మఘలలో చేసినచో విశేషఫలమును పొందెదరు. ఇట్లు శాస్త్రోక్తముగా శ్రాద్దమునాచరించి వారికి కన్యలు, పశువులు, సత్పుత్రులు, కలిగెదరు. ద్యూతమున, వ్యవసాయమున, వ్యాపారమున లాభములను పొందెదరు. రెండు గిట్టలుకల పశువులను, ఒకగిట్టగల పశువులను, బ్రహ్మ తేజస్సుగల పుత్రులను, బంగోరువెండి నాణేములను, ఉత్తమ జ్ఞాతులను, సర్వకామములను పొందెదరు. ప్రతిపత్తు మొదలగు తిథులలో ఒక్క చతుర్ధశినీ వదిలి మిగిలిన తిథులలో, శస్త్రపతులైన వారికి శ్రాద్ధమునాచరించవలయును. ఇట్లు శ్రాద్ధము నోచరించిన పోరు, స్వర్గమును, సత్సంతానమును, తేజస్సును, బలమును, శౌర్యమును, భూమిని, ఉత్తమ పుత్రులను, సౌభాగ్యమును, సమృద్ధిని, కీర్తిని, శుభమును, మంచినడవడిని, రాజ్యమును, వ్యాపారాదులలో లాభమును, ఆరోగ్యమును, కీర్తిని, దుఃఖరాహిత్యమును, ఉత్తమగతిని, ధనమును, విద్యను, మంచి వైద్యుని, గోమహిష్యాది పశుసంపదను అశ్వములను పొందెదరు. కృత్తికొది భరణ్యంత నక్షత్రములలో శ్రాద్ధమునాచరించినవారు అన్ని కామనలను పొందగలరు. భగవంతుని యందు విశ్వాసము కలవాడై, శ్రద్దకలవాడై, మదమత్సరములను విడిచి వసురుద్రాదిత్యులను, పితరులను, శ్రాద్దదేవతలను తృప్తిపరచినచో, అట్లు ప్రీతిచెందిన శ్రాద్ధదేవతలు ఆయువును సంతానమును, ధనమును, విద్యను, సుఖములను, మోక్షమును ప్రసాదింతురు. ప్రీతిని చెందిన పితామహులు నరులకు రాజ్యమును ప్రసాదింతురు. ఇట్లు విశేషమగు కల్పాధ్యాయమును కొంచెము చెప్పితిని. వైదికతంత్రమున, ఇతర పురాణముల నుండి విస్తరముగా తెలియవలయును. ఇట్లు ఈ కల్పాధ్యాయమును చదువువారు, కర్మలలో కుశలులై ఇహపరలోకములలో సద్గతిని పొందెదరు. దైవకార్యములందు పితృకార్యములందు ఈ కల్పాధ్యాయమును వినువారు కల్పాధ్యాయమున చెప్పబడిన దేవపితృకార్యముల నాచరించిన ఫలమును పొందెదరు. ధనమును, విద్యను, ఉత్తమ కీర్తిని, పుత్రులను, పరలోకమున సద్ధతిని పొందెదరు. ఇక ఇపుడు వేదమునకు ముఖము అనబడు వ్యాకరణమును సంగ్రహముగా తెలి పెదను సావధానముగా వినుము.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయపాదమున యాబదియొకటవ అధ్యాయము సమాప్తము.