నారద మహా పురాణము
32 - భవాటవీనిరూపణమ్
సనక ఉవాచ :-
ఏవం కర్మపాశనియన్త్రితజన్తవః స్వర్గాదిపుణ్యస్థానేషు
పుణ్యభోగమనుభూయ యాతనాసు చాతీవ దుఃఖతరం పాపఫలమనుభాయ॥ ప్రక్షీణకర్మావశే షేణాముం లోకమాగత్య సర్వభయవిహ్వలేషు మృత్యుబాధాసంయుతేషు స్థావరాదిషు జాయతే
వృక్షగుల్మ లతావల్లీగిరయశ్చ తృణాని చ।
స్థావరా ఇతి విఖ్యాతా మహామోహసమావృతాః
స్థావరత్వే పృథివ్యాముప్తబీజాని జల సేకానుపదం సుసంస్కారసామగ్రీవశాదంతరూష్మ ప్రపాచితాన్యుచ్ఛానత్వ మాపాద్యతతో॥
మూలభావం। తన్మూలాదంకురోత్పత్తిస్తస్మాదపి పర్ణకాండనాలాదికం కాండేషు చ ప్రసవమాపద్యంతే।
తేషు చ పుష్పసంభవః॥
తాని పుష్పాణి కానిచిదఫలాని।
కానిచిత్పల హేతుభూతాని తేషు పుష్పేషు వృద్ధ భావేషు సత్సు తత్పుష్పమూల వస్తుత్పత్తర్జాయతే।
తేషు తేషు భోక్తౄణాం ప్రాణినాం సంస్కారసామగ్రీవశాద్దిమరశ్మి కిరణాసన్నతయూ తదోషధిరసస్తుషాంతః ప్రవిశ్య
క్షీరభావం సమేత్య స్వకాలే తండులాకారతాముపగమ్య ప్రాణినాం భోగసంస్కార వశాత్సంవత్సరే ఫలితస్స్యుః॥
స్థావరత్వేఽపి బహుకాలం వానరాదిభిర్భుజ్యమానా హి
ఛేదన దవాగ్నిదహనశీతాతపాదిదుఃఖమనుభూయ మ్రియంతే॥
తతశ్చ క్రిమయో భూత్వా సదా దుఃఖబహుళా క్షణార్థం జీవంతః క్షణార్థం ప్రియమాణాః బలవత్ప్రాణిపీడాహం నివారయితుమక్షమాః
శీతావాతాది క్లేశభూయిషా నిత్యం క్షుధాక్షుధిలో మలమూత్రాదిషు సంచరన్తో దుఃఖమనుభవంతి॥
తత ఏవ పద్మయోనిమాగత్య బలవద్భాధోద్వేజితా
వృధోద్వేగభూయిష్ఠా క్షుత్కాన్తా నిత్యం వనచారిణో మాతృష్వపి విషయాతురా
వాతాది క్లేశబహులాః కప్మింశ్చిజ్జన్మని తృణాశనా।
కస్మింశ్చిజ్జన్మని మాంసామేధ్యాద్యదనాః।
కస్మింశ్చిజ్జన్మని కందమూలపలాశనా దుర్బలప్రాణి పీడానిరతా దుఃఖమనుభవంతి॥
అండజతేఽపి వాతాశనా మాంసామేధ్యాద్యశనాశ్చ పరపీడాపరాయణా నిత్యం దుఃఖబహులా గ్రామ్యపశుయోనిమాగతా
అపిస్వజాతివియోగభాగోద్వహనపాశాదిబంధనతాడనహలాదీధారణాదిసర్వదుఃఖాన్యనుభవంతి॥
ఏవం బహుయోనిషు సంభ్రాంతాః క్రమేణ మానుషం జన్మ ప్రాప్నువంతి॥
కేచిచ్చ పుణ్యవిశేషాద్యుత్క్రుమేణాపి మనుష్యజన్మాశ్నువతే॥
సనకమహర్షి పలుకుచున్నాడు :- ఇట్లు కర్మపాశముచే నియమించబడు జంతువులు స్వర్గాది పుణ్యస్థానములలో పుణ్యభోగముల ననుభవించి యాతనాలోకములందు మిక్కిలి దుఃఖకరమగు పాపఫలము ననుభవించి క్షీణించగా మిగిలిన కర్మలచే ఈ భూలోకమునకు వచ్చి అన్నిభయములతో విహ్వలములగు, మృత్యబాధాయుతములై స్థావరాదులలో పుట్టెదరు. వృక గుల్మలతా వల్లీ గిరి తృణములు మహోమోహసమాకృతములగు స్థావరములుగా పేర్కొనబడును. స్థావరత్వమును పొందుటకు భూమిలో విత్తిన బీజములు నీటిలో తడిసిన వెంటనే సంస్కారసామగ్రీ వశమున లోని వేడితో పక్వములై ఉబకి మూలభావమును పొంది, మూలమునుండి అంకురత్వమునొంది, అంకురమునుండి ఆకులు కాండములు నాలములు కలిగి, కాండములనుండి మొగ్గలు తొడిగి పూవులగును. ఆ పూవులలో కొని ఫలరహితములు, మరికొన్ని ఫలసహితములు అగును. ఆ పూవులు బాగుగో వృద్ధిపొందినపుడు ఆ పుష్పమూలములనుండి తుషా (పొట్టు) పుట్టును. ఆ పొట్టులో అనుభవించదగిన ప్రాణుల సంస్కారసామగ్రీ వశమున చంద్రకిరణ స్పర్శచే చంద్రకిరణములలోని ఓషథులులోన ప్రవేశించి కీరభావమును పొందును. కాలవశమున పొట్టులో తండులాకారమేర్పడును. ప్రాణుల భోగసంస్కారవశమున సంవత్సరములో ధాన్యముగా ఉండును. స్థావరమును పొందియు చాలాకాలము వానరాదులచే భుజింపబడుచు ఛేదన దవాగ్నిదోహ శీతాతపాది దుఃఖముల ననుభవించి మరణించును. తరువాత క్రీములుగా పుటి ఎలపుడూ దుఃఖబాహుల్యము కలిగి ఒకక్షణమో సగము కణమో బ్రతుకుచు, అరకణములో మరణించుచు బలవత్రాణి పీడలను నివారించుకోజాలక శీతవాతాణములో మరణించుచు బలవత్రాణి పీడలను నివారించుకోజాలక శీతవాతాది క్లేశబాహుల్యము కలవే ఎపుడూ ఆకలిచే పీడించబడుచు మలమూత్రాదులలో సంచరించుచు దుఃఖముననుభవించుచుండును. తరువాత పశుజన్మను పొంది, బలవంతుల బాధలచే ఉద్వేగమును పొంది వ్యర్దోద్వేగ బాహుల్యము కలవారై ఆకలిచే పీడించబడుచు నిత్యము వనచౌరులై తల్లియందు కూడా విషయభోగపరాయణులై శీతమౌతోతపాది కేశబాహుల్యము కలిగి కొన్ని జన్మలలో తృణాహారమును, మరికొన్ని జన్మలలో మాంసాదికమును మేఢ్యమును ఆహారముగా తీసుకొనుచు, మరికొన్ని జన్మలలో కందమూల ఫలాశనులై దుర్బలప్రొణులను పీడించుచు దుఃఖము ననుభవించుచుందురు. అండజములుగా పుట్టినను గొని మాంసాద్య మేధ్యములను తినుచు పర పీడాపరాయణులై నిత్యము దుఃఖబాహుల్యము కలిగియుందురు. గ్రామ పశుజన్మను పొందినను స్వజాతీ వియోగము, బరువును మోయుట, పాశములచే బంధించబడుట, కొట్టబడుట, నాగలి మొదలగు వాటిని లాగుట మొదలగు సర్వవిధదుఃఖములను అనుభవించుచుండును. ఇట్లు నానా జన్మమలలో తిరిగి తిరిగి క్రమముగా మానవజన్మను పొందెదరు. కొందరు పుణ్యవిశేషములచే కూడా మానవ జన్మను పొందెదరు.
మనుష్యజన్మనాపిచచర్మకారచండాలవ్యాధనాపితరజకకుంభకారలోహకారస్వర్ణకారతంతువాయసౌచిక జటలసిద్ధిధావకలేఖకభృతకశాసనహరినీచభృత్యదరిద్రహీనాంగఅధికాంగత్వాదిదుఃఖబహులజ్వరతాపశీతశ్లేష
గుల్మపాదఅక్షిశిరోగర్భపార్శ్యవేదానాదిదుఃఖమనుభవంతి॥
మనుష్యత్వేఽపి యదా స్త్రీపురుషయోర్వ్యవాయస్తత్సమయే రేతో యదా జరాయాం ప్రవిశతి।
తదైవ కర్మవశా జ్జంతుశ్శుక్రేణ సహ జరాయుం విశ్వశుక్రశోణితకలలే ప్రవర్తతే॥
తద్వీర్యం జీవప్రవేశాత్పంచాహాత్కలలం భవతి॥
అర్థమా సే పలలభావముపేత్య మాసే ప్రాదేశమాత్రత్వ మాపద్యతే॥
తతః ప్రభతి వాయువశాచ్చైతన్యాభావేఽపి మాతురుదరే దుస్సహతాపక్లేశతయా ఏకత్రస్థాతుమశక్యత్వాద్బ్రమతి॥
మా సే ద్వితీయే పూర్ణే పురుషాకారమాత్రతాముపగమ్య మౌసతయే పూర్ణే కరచరణాద్యవయవభావముప గమ్య।
చతుర్షు సేషు గతేషు సర్వావయానాం సంధిభేదపరిజ్ఞానం।
పంచస్వతీతేషు నఖానామభివ్యంజకతా।
షట్స్వ తీతేషు నఖసంధిపరిస్పుటతాముపగమ్య నాభిసూత్రేణ పుష్యమాణం అమేధ్యమూత్రసిక్తాంగం
జరాయుణా బంధిత రక్తాస్థిక్రిమివసామజ్జాస్నాయు కేశాదిదూషితే కుత్సితే శరీరే నివాసిం స్వయమప్యేవం పరిదూషితదేహం।
కుత్సితే శరీరే నివాసినం స్వయమ ప్యేవం పరిదూషిత దేహం।
మాతుశ్చ కట్వామ్లకలవణాత్యుష్ణభుక్తదుహ్యమానమాత్మానం
దృష్ట్వా దేహీ పూర్వజన్మస్మర్మణానుభావాత్పూర్వానుభూతనరకదుఃఖానిచ స్మృత్వాంతర్దుఃఖేన చ పరిదహ్యమానో
మాతుర్దే హేతిమూత్రాదిరూ క్షేణ దహ్యమాన ఏవం మనసి ప్రలపతి॥
మనుష్యజన్మలో కూడా చర్మ కార, చండాల, వ్యాధ, నాపిత, రజక, కుంభకార, లోహకార, స్వర్ణకార, తంతువాయ, సౌచిక, జటిల, సిద్ధి, ధావన, లేఖన, భృతక, శాసనహరి, నీచభృత్య, దరిద్ర, హీనాంగ, అధికొంగత్వాది భేదములచే దుఃఖబహులములగు జ్వరతాప, శీత, శ్లేష్మ, హస్తిపాద, నేత్రశీరో, గర్భ పొర్శ వేదానాది దుఃఖముల ననుభవించుచుందురు. మనుష్య జన్మలో కూడా స్త్రీ పురుష సంగమసమయమున రేతస్సు గర్భకోశమును ప్రవేశించునపుడు కర్మవశమున ప్రాణి శుక్రముతో కలిసి జరాయువును ప్రవేశించి శుక్రశోణితసమ్మేలనరూపఘనపదొర్ణముగా మారును. ఆ వీర్యమున జీవుడు ప్రవేశించుట వలన అయిదు దినములలో ఘనపదార్థముగా మారి, పక్షమున మాంస పిండరూపమును పొంది, మాసమున ప్రాదేశమాత్రమగును. అప్పటినుండి చైతన్యము లేకున్ననూ పోయువశమున మాతృగర్భమున దుస్సహతాప క్లేశములుండుటచే ఒకచోటనుండ శక్యము కాక తిరుగుచుండును. రెండవమాసమునిండిన వెంటనే మానవాకార మాత్రమును పొందును. మూడవమాసము నిండగనే కరచరణాద్యవయవ భావము లభించును. నాలుగు నెలలు గడిచినచో గోళ్ళ చివురులేర్పడును. నాభీసూత్రముచే పోషించబడుచుండును. మలమూత్రములచే పూయబడిన శరీరము కలవాడై మావీచే బంధించబడి రక్త ఆస్టిక్రియ వసామజ్ఞాస్నాయు కేశాదులచే దూషితమైన శరీరమున నివసించుచు, తాను కూడా ఇట్టి శరీరము కలవాడై, తల్లి భుజించు కారము పులుపు ఉప్పు అత్యుష్ణ పదార్థములచే దహ్యమానశరీరుడగుచు, తన శరీరమును చూచుకొని జీవుడు పూర్వజన్మస్మరణానుభవముచే పూర్వమున అనుభవించిన నరకదుఃఖములను స్మరించుటచే అంతర్దుఃఖముచే దహించబడుచు మాతృదేహములోని మూత్రాద్యుష్ణములచే దహింపబడుచు తన మనసులో ఇట్లు పరితపించును.
అహోఽత్యంతపాపోఽహం పూర్వజన్మని భృత్యాపత్యమిత్రయోషిద్గృ హక్షేత్రధనధాన్యాదిపత్యంరా గేణ
కలత్రపోషణార్థం పరధన క్షేత్రాదికం పశ్యతోహరణాదులపాయైరపిహృత్య కామాంధతయా
పరస్త్రీహరణాదికమనుభూయ మహాపాపాన్యాచరంస్తైః పాపైరహమేక ఏవంవిధనరకాననుభూయ పునస్థావరాదిషు
మహాదుఃఖమనుభూయ సంప్రతి జరాయుణా పరివేష్టితోఽన్తర్దుఃఖేన బహిస్తా పేన చ గర్హామి॥
మయా పోషితా దారాశ్చ స్వకర్మ వశాదన్యతో గతాః॥
అహో దుఃఖం హి దేహినామ్॥
దేహస్తు పాపాతంజాతస్తస్మాత్పాపం న కారయేత్।
భృత్యమిత్రకలత్రార్ధమన్యద్ద్రవ్యం హృతం మయా॥
తేన పా పేన దహ్యామి జరాయుపరివేష్టితః।
దృష్ట్వాన్యస్య శ్రియం పూర్వం సంతప్తోఽహమసూయయా॥ గర్భాగ్నినానుదహ్యోయమిదానీమపి పాపకృత్।
కాయేన మనసా వాచా పరపీడామకారిషమ్॥
తేన పాపేన దహ్యోమిత్యహమేకోఽతిదుఃఖితః ఏవం బహువిధం గర్భస్థో జంతుర్విలప్య స్వయమేవ।
ఆత్మానమాశ్వాస్య ఉత్పత్తెరనన్తరం సత్సంగేన విష్ణోశ్చరితశ్రవణేన చ విశుద్ధమనా భూత్వా సత్కర్మాణి
నిర్వర్త్య అఖిలజగదంతారాత్మనః సత్యజ్ఞానానందమయస్య శక్తి ప్రభాకానుషితవిష్టపవర్గస్య లక్ష్మీపతేర్నారాయణస్య
సకలసురాసుర యక్షగంధర్వరాక్షపపన్నగమునికిన్నరసమూపర్చితచరణకమలయుగం భక్తితస్సమభ్యర్బ్య
దుస్సహసంసార చ్చేదస్య కారణభూతం వేదరహస్యోపనిషద్భిః పరిస్పుటం సకలలోకపరాయణం హృది
నిధాయ దుఃఖతరమిమం సంసారగామతిక్రమిష్యామీతి మనసి భావయతి॥
అయ్యో ! నేనెంత పాపిని. పూర్వజన్మలో భృత్యమిత్రకళత్రపుత్రగృహ క్షేత్ర ధనధాన్యాలయందు వ్యామోహముచే భార్యాపుత్రులను పోషించుటకై పరధన క్షేత్రాదులయందు దృష్టినుంచి పలు ఉపాయములచే హరించి కామాంధకారముచే పర స్త్రీ గమనాది పొతకముల నాచరించి, ఆ పొతకములచే నేనొక్కడినే బహువిధనరకములననుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము ననుభవించి, ఇపుడు మావిచే కప్పబడి అంతఃర్డుఃఖముచే నేనొక్కడినే బహువిధనకరముల ననుభవించి, మరల స్థావరాదిరూపములతో మహాదుఃఖము ననుభవించిపోవుచున్నాను. నేను పోషించిన దారాపుత్రాదులుకెంత దుఃఖము ! పుత్రమిత్ర కళాత్రాది పోషణ కొఱకు పరద్రవ్యముల నపహరించితిని. ఆ పాపముచే నిపుడు మావిచే కప్పబడియుంటిని. పూర్వము ఇతరుల సంపదను చూచి ఆసూయచే దహించిపోతిని. ఇపుడు ఇచట గర్భాన్ని చే దహించి పోవుచుంటిని. మనోవాక్కాయములచే పరపీడన మాచరించితిని. ఆ పాపముచే ఇపుడు నేనొక్కడినే మిగుల దుఃఖముచే దహించిపోతిని.. ఇట్లు గర్భస్థజీవుడు పలువిధములుగా విలపించి తనను తానే ఓదార్చుకొని పుట్టిన తరువాత సత్సంగముచే శ్రీమహావిష్ణుచరిత్రశ్రవణముచే విశుద్దమనస్కుడనే సత్కార్యముల నాచరించి అఖిల జగదంతరాత్మ సత్యజ్ఞానానందమయుడు, శక్తి ప్రభావముచే స్వర్గాదులను సృజించినవాడు లక్ష్మీపతి అయిన నారాయణుని సకల సురాసుర యక్షగంధర్వ రాక్షస పన్నగముని కిన్నర సమూహములచే పూజింపబడిన పొదపద్మములను భక్తిచే పూజించి, దుస్సహమైన సంసారమును ఛేధించుకు కారణభూతుడు, వేదరహస్యోపనిషత్తులచే స్పష్టముచేయబడిన వాడు అయిన సకలలోకపరాయణునీ హృదయమున నిలుపుకొని ఈ దుఃఖమును సంసారమును దాటెదనని మనసున భావించును.
యతస్తన్మాతుః ప్రసూతిసమయే సతి గర్భస్థో దేహీ నారదమునే వాయునా పరిపీడితో మాతుశ్చాపి
దుఃఖం కుర్వన్కర్మపాశేన బలాద్యోని మార్గాన్నిష్క్రామన్సకలయాతనాభోగ మేకకాలభవననుభవతి॥
తేనాతి క్లేశేన యోనియంత్రఫీడితో గర్భాన్నిష్క్రాoతో నిస్సంజ్ఞతాం యాతి॥
తం తు బాహ్యవాయుస్సముజ్జీవయంతి॥
బాహ్యవాయుస్పర్శసమనన్తరమేవ
నష్టస్మృతిపూర్వానుభూతాఖిల దుఃఖాని వర్తమామనాన్యపి జ్ఞానోభావాదవిజ్ఞాయాత్యన్తదుఃఖమనుభవంతి॥
ఏవం బాలత్వమాపన్నో జంతుస్తత్రాపి స్వమలమూత్రదేహ ఆధ్యాత్మి కాదిపీడ్యమానోఽపి వక్తుమశక్తః
క్షుత్తృషాపీడితః। రుదితే సతి స్తనాదికం దేయమితి మన్వానాః ప్రయతన్తే॥
ఏనమనేకం దేహభోగమన్యాధీనమయానుభూయనూనో దంశోదీష్వపి వారయితుమశక్తః
బాల్యభావనూసాద్య మాతాపిత్రోరుపాధ్యాయస్య తాడనం ।
సదా పర్యటనశీలత్వం।
భస్మపంకాదిషు క్రీడనం।
సదో కలహానియతత్వమశుచిత్వం బహు వ్యాపారాభాసకార్యనియతత్వం॥
తదసంభవ ఆధ్యాత్మిక దుఃఖమేవంవీధమనుభవతి॥
తల్లి ప్రసూతి సమయమున గర్భస్థుడగు దేహి వాయువుచే పరిపీడితుడై తల్లికి కూడా దుఃఖమును కలిగించుచు కర్మపాశముచే బలముగా యోని మార్గమునుండి బయలు వెడలుచు సకలయాతన అనుభవమును ఒకే సమయమున అనుభవించును. ఆట్లు అతి క్లేశముతో యోని యంత్రపీడితుడై గర్భమునుండి నిష్క్రమించి సంజ్ఞను కోల్పోవును. అట్టి శిశువును, బాహ్యపోయువు నురల బ్రతికించును. బాహ్యవాయు స్పర్శకోలముననే పూర్వమున అనుభవించిన సమస్త దుఃఖాదుల స్మృతి నశించును. వర్తమాన దుఃములను కూడా జ్ఞానము లేనందున తెలియజాలక, అత్యంత దుఃఖము ననుభవించును. ఇట్లు బాలత్వమును పొందిన జంతువు అచట కూడా తన మలమూత్రాదులను శరీరమున పూసుకొని ఆధ్యాత్మికాది తాపత్రయములచే పీడించబడుచున్నను చెప్పజాలక ఆకలిదప్పులచే పీడించబడుచు బిగ్గరగా ఏడ్చును, అప్లైడ్వగా స్తన్యమీవలయునని భావించి తల్లి ఆ ప్రయత్నమును చేయును. ఇట్లు అనేక దేహాభోగములను అన్యోధీనముగా ననుభవించుచు కీటకములు కరచుచున్ననూ వారింపజాలడు. బాల్యభావమును పొంది తల్లితండ్రులచే, ఉపాధ్యాయులచే తాడనములను పొందుచు ఇటునటు తిరుగుచు దుమ్ము, బూడిద, బురద మొదలగు వాటియందాడుచు ఎప్పుడూ కలహా స్వభావమును అపవిత్రతను పొంది బహువ్యాపారభ్యాస కార్యనియతుడగుచు ఆ పని చేయలేక ఆధ్యాత్మికాది తాపత్రయములచే దుఃఖములననుభవించును.
తతస్తు తరుణభావేన ధనార్జనమార్జితస్య రక్షణం తస్య నాశవ్యయాదీషు చాత్యంతదుఃఖితాః।
మాయయా మోహితాః। కామక్రోధాతీదుష్టమనపస్సదాసూయపరాయణా। పరస్వపరస్త్రీ హరణోపాయ
పరాయణాః పుత్రమిత్ర కలత్రాదిభరణోపాయచింతాపరాయణాః।
వృధాహాంకారదూషితాః పుత్రాదిషు
వ్యాధ్యాదిపీడితేషు। సత్సు సర్వవ్యాప్తిం పరిత్యజ్య రోగాదిభిః క్లేశితానాం సమీ పే స్వయమౌధ్యాత్మి కదుఃఖేన
పరిప్లుతా వక్ష్యమాణప్రకారేణ చింతామశ్నువతే॥
గృహ క్షేత్రాదికం కర్మ కించిన్నాపి విచారితమ్।
సమృద్ధస్య కుటుంబస్య కథం భవతి వర్తనమ్
మమ మూలధనం నాస్తి వృష్టిశ్చాపి న వర్షతి।
అశ్వః పలాయితః కుత్ర గావః కిం నాగతా మమ॥
బాలాపత్యా చ మే భార్యా వ్యాధితోఽహం చ నిర్థనః।
ఆవిచారిత్కృషిర్నష్టా పుత్రా రుదంతి చ॥
భగ్నం ఛిన్నం తు పద్మ బాంధవా అపి దూరగాః।
న లభ్యతే వర్తనం చ రాజబాధాతదుస్సహా॥
రిపవో మాం ప్రధావంతి కథం జేష్యామ్యహం రిపూన్।
వ్యవసాయాక్షమశ్చాహం ప్రాప్తాః ప్రాఘార్ణకా అమీ॥
ఏవమత్యంతచింతాకులః స్వదుఃఖాని నివారయితుమక్షయో ధీగ్విధిం భాగ్యహీనం మాం కీమర్థం విదధే ఇతి దైవమాక్షిపతి॥
పిమ్మట యౌవనమును పొంది ధనమును సంపాదించుచు సంపాదించిన ధనమును రక్షించుచు, ధనము నష్టమైనను, వ్యయమైనను మిక్కిలి దుఃఖించుచు మాయామోహితులై కామ క్రోధాదులచే చెడిన మనసుగలవారై, ఎపుడూ అసూయపరులై పరులధనమును, పరస్త్రీలను హరించు ఉపాయములను ఆలోచించుచు, పుత్ర మిత్ర కలత్రాదులను పోషించు ఉపాయములను విచారించుచు వ్యర్థమగు అహంకారముచే దూషితులై, పుత్రాదులు వ్యాధిపీడితులైనపుడు అన్ని వ్యాపకములను వదిలి, రోగాలదులచే పీడించబడువారి సమీపమున స్వయముగా ఆధ్యాత్మి కాది దుఃఖములచే పీడించబడుచు ఇట్లు చింతించెదరు. ఇల్లు పొలము మొదలగు స్థిరాస్తిని గూర్చి ఏ మాత్రమాలోచింకపోతిని. ఇంత పెద్దకుటుంబమెట్లు పోషించబడును. నాకు మూలధనములేదు. వర్షముకూడా కురియుటలేదు. గుఱ్ఱములేటు పారిపోయినవో, గోవులు ఇంకనూ ఇల్లు చేరలేదు. నా భార్యకు చిన్నచిన్న వయసు గల పిల్లలున్నారు. నేను వ్యాధిగ్రస్తుడనైతిని. ధన హీనుడను. ఆలోచించనందున వ్యవసాయము నశించినది. పుత్రులెప్పుడూ రోదించుచున్నారు. నా ఇల్లు భగ్నమైనది. బంధువులు దూరములోనున్నారు. బ్రతుకు తెరువు లభించుటలేదు. రాజబాధ దుస్సహముగానున్నది. శత్రువులు బాధించుచున్నారు. నేనెట్లు శత్రువులను గెలిచెదను. ప్రయత్నశూన్యుడనైతిని. వ్యాధులన్నీ ఒకేసారొచ్చినవి. ఇట్లు మిక్కిలి దుఃఖాకులుడై తన దుఃఖములను నివారించ జాలక ఈ విధి నన్నెందుకు భాగ్య హీనుని చేసెను, అని దైవము నాక్షేపించును.
తథా వృద్ధత్వమాపన్నో హీయమానసారో జరాపలితాదివ్యాప్తదేహో వ్యాధిబాధ్యత్వాధికమాపన్నః।
ప్రకంపమానావయవశ్వాసవాసాదిపీడితో।
లోలావిలోచనః శ్లేష్మవ్యాప్త కంఠః పుత్రదారాదిభిర్త్యమానః కదా
మరణముపయామీతి చింతాకులోమయి మృతే సతి మదార్జితం గృహక్షేత్రాదికం వస్తుపుత్రాదయః కథం రక్షంతి।
కస్య వా భవిష్యతి॥
మద్దనే పరైరపహృతే పుత్రాదీనాం కథం వర్తనం భవిష్యతీతి మమతా దుఃఖపరిప్లుతో గాఢం నిశ్శ్వస్య స్వేన
వయసా కృతాని కర్మాణి పునఃపునస్స్మరన్ క్షణే విస్మరతి చ సంతతస్త్వాసన్నమరణో॥ వ్యాధిపీడితోఽన్తస్తాపార్తః క్షణం శయ్యాయాం।
క్షణం మంచే చ తతస్తతః పర్యటన్ క్షుత్రృట్ పరిపీడితః
కించిన్మాత్ర ముదకం దేహీతి కార్పణ్యేన యాచమానస్తత్రాపి జ్వరావిష్టానాముదకం
న శ్రేషస్కరమితి బ్రువతో మనసాతిద్వేషం కుర్వన్మన్దచైతన్యో భవతి॥
తతశ్చ హస్తపాదాకర్షణే న తు క్షమో రుదదిర్బందుజనైర్వేష్టితో వక్తుమక్షమస్వార్జిత ధనాదికం
కస్య భవిష్యతీతి చింతాపరో బాష్పావిలవిలోచనః కంఠేఘరఘరరాయమాణీ సతి శరీరాన్నిష్క్రాంతస్రాణో
యమదూతైర్భర్త్స్యమానః పాశయన్త్రితో నరకాదీన్పూర్వవదశ్నుతే॥
అట్లే వృద్ధత్వమును పొంది బలముడిగి, వార్ధక్యముచే ముడతలు పడిన దేహము కలవాడై తెల్లబడిన కేశములు కలిగి మురికి పట్టిన శరీరముచే వ్యాధులచే బాధించబడుచు వణుకుచున్న అవయవములతో ఊపిరి పీల్చరాక ఆయాసముచే కనులు తీరుగగా చూడదగిన దానిని చూడజాలక కంఠమున శ్లేష్మము నిండి భార్యపుత్రాదులచే చీదరించబడుచు ఎపుడు మరణించెదనా అని చింతించుచు, నేను మరణించినచో నేను సంపాదించిన గృహక్షేత్రాదికములను నా పుత్రు రెట్లు కాపాడెదరో, ఎవరికీ చెందునో ? నా సంపదను ఇతరులపహరించినచో నా పుత్రాదులెట్లు బ్రతికెదరు ? అని మమకారముచే దుఃఖముచే గాఢముగా నిట్టూర్చి తాను భవనములో చేసిన పనులను మాటిమాటికి తలచుకొనుచు, అంతలోనే మరచుచు మరణము సమీపించగా వ్యాధి పీడితుడై, మానసిక సంతాపముచే ఆర్తుడై కొంత సేపు అటునిటు తిరుగుచు ఆకలిదప్పులు పీడించగా, కొంచెము నీరిమ్మని అతిదీనముగా యాచించుచు, అక్కడున్నవారు జ్వరము వచ్చినవారికి నీరీయకూడదని చెప్పుచుండగా వారిని మనసులో ద్వేషించుచు తెలివి తప్పుచుండును. తరువాత కాలుచేతులు కదల్చలేక రోదించు బంధుజనులతో కూడినవాడై, ఏమియూ చెప్పజాలక తాను సంపాదించిన ధనాదికమెవరి పాలగునో అని చింతించుచు నీరు నిండిన కనులతో కంఠమున ఘరఘర ధ్వని వచ్చుచుండగా శరీరమునుండి ప్రాణములు పోవుచుండగా యమదూతలు బెదిరించుచు పాశముచే కట్టగా మొదటచెప్పిన విధముగా నరకాదులననుభవించును.
ఆమలప్రక్షయాద్యద్వదగ్నౌ ధామ్యంతి ధాతవః।
తథైవ జీవినస్సర్వే ఆకర్మ ప్రక్షయాద్భృశమ్॥
తస్మాత్సంసారదావాగ్నితాపార్తో ద్విజసత్తమ।
అభ్య సేత్పరమంజ్ఞానం జ్ఞానాన్మోక్షమవాప్నుయాత్॥
జ్ఞానశూన్యా నరా యే తు పశవః పరికీర్తితాః।
తస్మాత్సంసారమోక్ష్య పరం జ్ఞానం సమభ్య సేత్॥
మానుష్యం చైవ సంప్రాప్య సర్వకర్మప్రసాధకమ్।
హరిం న సేవతే యస్తు కోఽన్యస్తస్మాదచేతనః॥
అహో చిత్రమహోచిత్రమహోచిత్రం మునీశ్వరాః।
ఆస్థితే కామదే విష్ణౌ నరా యాంతి హి యాతనామ్॥
నారాయణే జగన్నాథే సర్వకామఫలప్రదే।
స్థితేఽపి జ్ఞానరహితాః పచ్యంతే నరకేష్వహో॥
స్రవన్మూత్రపురీషే తు శరీరేఽస్మిన్న శాశ్వతే।
శాశ్వతం భావయంత్యజ్ఞా మహామోహసమావృతాః॥
కుత్సితం మాంసరక్తాద్యైర్దేహం సంప్రాప్య యో నరః।
సంసారచ్చేదకం విష్ణుం న భజేతోఽతిపాతకీ॥
అహోకష్టమహోకష్టమహాకష్టం హి మూర్ఖతా।
హరిధ్యానపరో విప్ర చండాలోఽపి మహాసుఖి॥
స్వదేహాన్నిత్సృతం దృష్ట్వా మలమూత్రాది కిల్బిషమ్।
ఉద్వేగం మానవా మూర్ఖా కిం న యాం తి హి పాపినః
దుర్లభం మానుషం జన్మ ప్రార్ధ్యతే త్రిదశైరపి।
తల్లబ్ద్వా పరలోకార్థం యత్నం కుర్యాద్విచక్షణః॥
ఆధ్యాత్మ జ్ఞానసంపన్నా హరిపూజాపరాయణాః।
లభన్తే పరమం స్థానం పునరావృత్తిదుర్లభమ్॥
యతో జాతమిదం విశ్వం యతశ్చేతన్యమశ్నుతే।
యస్మింశ్చ విలయం యాతి స సంసారస్య యోచకః
నిర్గుణోఽపి పరోఽనన్తో గుణవానివ భాతి యః।
తం సమభ్యర్చ్య దేవేశం సంసారాత్పరిముచ్యతే॥
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమభాగే భవాటవ నిరూపణం నామ ద్వాత్రింశోఽధ్యాయః ॥
ధాతువులు మలక్షయము వరకు అగ్నిలో దాహమగునట్లు జీవులు కర్మక్షయమగువరకు సంసారాగ్నిలో దహింపబడుదురు. కావున సంసారదావాగ్ని తాపార్తుడగు మానవుడు పరమజ్ఞానము నభ్యసించవలయును. జ్ఞానమువలన మోక్షము లభించును. జ్ఞానశూన్యులగు మానవులు పశువలనబడుదురు. కావున సంసారవిముక్తికి పరమజ్ఞానము నభ్య సించవయును. అన్ని కర్మలను చక్కగా నిర్వహించగల మానవత్వమును పొంది శ్రీహరిని సేవించుకున్న అతనికన్నా అజ్ఞాని ఎవడుండును ? అన్ని కోరికలను తీర్చు. శ్రీహరి యుండగా మానవులు నరకమునకు వెళ్ళుట ఎంత విచిత్రము ? ఎంత విచిత్రము. ఇది గొప్ప వింతయే. జగన్నాథుడు సర్వకర్మఫల ప్రదుడగు అగు నారాయణుడున్ననూ మానవులు జ్ఞానశూన్యులై నరకములో చుందురు. మూత్రపురీషములు స్రవించునశ్వరమైన శరీరమును మాయామోహావిష్ణులగు అజ్ఞానులు నిత్యమని భావింతురు. రక్తమాంసములచే దూషితమగు శరీరమును పొందిన మానవుడు సంసారమును చేదించు విష్ణువును భజించనిచో మహాపాపియగును. మూర్ఖత్వము చాల కష్టములను కలిగించును. హరి ధ్యానపరుడగు చండాలుడు కూడా ఆనందించును. తన దేహమునుండి వెలువడు మలమూత్రాది కిల్బిషమును చూచిన మానవులు ఉద్వేగము నెట్లుపొందకుందురు ? మానవజన్మ పరమదుర్లభము. దేవతలు కూడా ఈ జన్మ కై ప్రార్థనలు చేతురు. అట్టి మానవజన్మను పొంది పరలోకము కొరకు వివేకము కలవాడు ప్రయత్నించవలయును. అధ్యాత్మ జ్ఞానము కలగి హరిపూజా పరాయణులైన వారు పునరావృత్తిదుర్లభమగు పరమపదమును పొందెదరు. ఈ ప్రపంచము ఎవరివలన పుట్టనో, ఎవరివలన చైతన్యమును పొంది ఎవరిలో లీనమగునో అతనే సంసారమునుండి విముక్తిని ప్రసాదించును. నిర్గుణుడైనను గుణవంతునివలె భాసించు శ్రీహరిని చక్కగా పూజించి సంసారమునుండి విముక్తుడగును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున భవాటనీనిరూపణమను ముప్పది రెండవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 32 of the Nārada Mahā Purana is as follows:
భవబంధములతో కూడిన ఈ భూమిపై మానవ జీవితము ఒక దుర్గమమైన అడవి అంటే సంసార కాంతారము వంటిదని సనందన మహర్షి ఈ అధ్యాయంలో అద్భుతమైన రూపకం ద్వారా వివరించినారు. అజ్ఞానము, కామక్రోధములు అను క్రూరమృగములతో నిండిన ఈ సంసార అడవి నుండి విముక్తి పొందుటకు శ్రీహరి భక్తి ఒక్కటే శరణ్యమని నిరూపించబడినది.