నారద మహా పురాణము
53 - నిరుక్తలక్షణనిరూపణమ్
సనందన ఉవాచ :-
నిరుక్తం తే ప్రవక్ష్యామి వేదశ్రోత్రాంగముత్తమమ్ ।
తత్పంచవిధమాఖ్యాతం వైదికం ధాతురూపకమ్ ॥
క్వచిద్వర్ణాగమస్తత్ర క్వచిద్వర్ణవిపర్యయః ।
వికారః క్వాపి వర్ణానాం వర్ణనాశః క్వచిన్మతః ॥
తథా వికారనాశాభ్యాం వర్ణానాం యత్ర నారద ।
ధాతోర్యో గాతిశయీ చ సంయోగః పరికీర్తితః ॥
సిద్ధేద్వర్ణాగమాద్ధింసస్సింహో వర్ణవిపర్యయాత్ ।
గూఢోత్మా వర్ణవికృతే వర్ణనాశాత్పృషోదరః ॥
భ్రమరాదిషు శబ్ధేషు జ్ఞేయో యోగో హి పంచమః ।
బహులం ఛందసీత్యుక్తం అత్ర వాచ్యం పునర్వసూ ॥
నభస్వద్వృషణ శ్చైవా పరస్మైపది చాపి హి ।
పరం వ్యవహితాశ్చాపి గతసంజ్ఞాస్తథా హి ఆ ॥
విభక్తీనాం విపర్యాసో యథా దధ్నా జుహోతి హి ।
అభ్యుత్సాదయామకేతుర్ధ్వనయీత్ప్రముఖాస్తథా ॥
నిష్టరాద్యాస్తథోక్తాశ్చ గృభయేత్యాదికస్తథా ॥
సుప్తిజుపగ్రహాలింగనరాణాం కాలహల్చస్వరకర్తృయదాం చ ।
వ్యత్యయమిచ్ఛతి శాస్త్రకృదేషాం సోఽపి చ సిద్ధ్యతి బాహులకేన ॥
రాత్రీ బంచీ చ కద్రూశ్చారిష్ట్వో వాజసనేయినః ।
కర్ణేఖశ్చ యశో భాగ్య ఇత్యాద్యాశ్చతురక్షరమ్ ॥
దేవాసోఽధో సర్వదేవ తాతిత్వావత ఇత్య పి ।
ఉభయావినమాద్యాశ్చ ప్రలయాద్యాశ్చ తృచం తథా ॥
అపస్పృ దేదాం నో అహ్యదయో అస్మన్ముఖాస్తథా ।
సగర్భో స్థాపదీ ఋత్వ్యో రజిష్టం చ త్రిపంచకమ్ ॥
హిరణ్యయేన నరం చ పరమే వ్యోమ ఇత్యపి ।
ఉర్వియా స్వప్రయా వారవధ్వా దదుహవైవధీ ॥
మజద్వైనమేమపి చ స్నాత్వీగత్వా పచాస్థభీః ।
గోనాం చ పరిహవృత్తాశ్చా తురిగ్రసితాదికా ॥
పశ్యేదధద్వభూధాపి ప్రమీణాంతిత్యవీవృధత్ ।
మిత్రాయుశ్చ దురశ్వావాహాత్వసుధితమిత్యపి ॥
దధర్త్యాద్యా స్వవద్భిశ్చ ససూవేతి చ ధిష్వ చ ।
ప్రపాయం చ హరివతే క్షణతస్సుపధితరః ॥
రధీతరీ న సతాద్యా అమ్నర్భ వరధో ఇతి ।
బ్రూహ్యాద్యదేః పరస్యాప్యౌ శ్రావయేత్యాది కే ప్లుతః ॥
దాశ్వాంశ్చ స్వతవాన్యాపౌ త్రిభిష్ట్వం చ నృభిష్టుతః ।
అభీషుణ ఋతావాహం న షీద న్నృమణా అపి ॥
చతుర్విధాద్భాహులకాత్ ప్రవృత్తేరప్రవృత్తితః ।
విభాషయాన్యథా భావత్ సర్వం సిద్ధైచ్చ వైదికమ్ ॥
సినందన మహర్షి పలికెను :- వేదమునకు శ్రోత్రాంగరూపమైన నిరుక్తమును నీకు చెప్పెదను. ఈ నిరుక్తము అయిదు విధములు. వైదికము, ధాతురూపముగా నుండును. కొన్ని చోట్ల వర్ణాగమము, కొన్ని చోట్ల వర్ణవిపర్యయము, కొన్ని చోట్ల వర్ణవికారము, కొన్ని చోట్ల వర్ణనాశము, వర్ణవికారనాశములచే ధాతుయోగము వలన అతిశయమును పొందినచో సంయోగమనబడును. హస అను శబ్దమున అనుస్వారము ఆగమముగా వచ్చినచో హంసః అనురూపము సిద్ధించును. హింస అనువర్ణములు విపర్యయము నొందినచో సింహః అను రూపమును పొందును. గూఢ ఆత్మా అనుచోట ఆ అను వర్ణము ఓ రూపముగా మారినందున ‘గూఢత్మా’ అను పదము సిద్దించును. “పృషసదృశః ఉదరః” అను వాక్యమున ‘సదృశ’ అనువర్ణములకు నాశమేర్పడుటచే ‘పృషోదరః’ అనురూపము సిద్ధించును. భ్రమరాది శబ్దములలో సంయోగమున్నదని తెలియవలయును. ఈ విధముగా నిరుక్తము అయిదు విధములు. వేదమున బాహులకమును విధించిరి. బాహులకము వలన పునర్వసు, నభస్వల్, వృషణ, అపర స్మెపది, ఇత్యాదీరూపములు సిద్ధించును. ధాతువునకు పరముగా వ్యవధానముగా ఉన్న అవ్యయాదులు గతిసంజ్ఞను పొందును. ఇచట హి, ఆ మొదలగునవి దృష్టాంతము. వైదికమున విభక్తి వివర్యాసము కూడా జరుగును. ‘దధ్ని జుహాతి’ అనునది ఉదాహరణము. అభ్యుత్సాదయామ కేతు, ధ్వనయీత్ మొదలగునవి కూడా ఇటులనే తెలియవలయును. నిష్టరీ మొదలగునవి, గృభాయ మొదలగునవి, సుప్, తీజ్, ఉపగ్రహ, లింగ, నర, కాల, హాల్, చ్, స్వర, కర్త, యజాదికమునకు కూడా శాస్త్రకారులు వ్యత్యయమునభిలషింతురు. ఈ వ్యత్యయము కూడా బాహులకముచే సిద్ధించును. రాత్రీ, చింబీ, కద్రూః, ఆవిష్ణ్వో, వాజసనేయినః, కర్ణేభిః, యశోభాగ్య, ఇత్యాది చతురక్షర పదములు, దేవాసః, సర్వదేవతాతి, త్వావత, అనునవి; ‘ఉభయావినం’ మొదలగునవి, ప్రలయాది శబ్దములు, సృచం అనునది ఆపస్పృధ్ధాంతో, అవ్యాదాయః, అస్మాన్ముఖాః, సగర్భ్యః, స్థాపదీ, ఋత్యోః, అజిష్ఠం, త్రిపంచకమ్, హిరణ్యయేవ, నరం, పరమే వ్యోమని, ఉర్వియా, స్వప్రయా, వారవధ్వా, దుదుహ, వైవధీ, యజధ్వం, నమేమసి, స్నాత్వీ, గత్వా, పచాస్థఖీః, గోనాం, అపరిహవృత్తా, ఆతురికి, గ్రసితా మొదలగునవి, పశ్యేత్ , అధదు, అభూద్, ప్రమీణాంత, అవీవృధత్, మిత్రయుః, దురస్వా, హాత్వా, సుధీతం అనునవి, దధర్తి మొదలగునవి, స్వవద్భిః, ససూవ, ధిష్య, ప్రపాయం,హరివతా, ఈక్షణ్వతః, సుపధితరః, రధీతరీ, నసత మొదలగునవి, అమ్నః, భువః, రధ, బ్రూహి మొదలగువాటికి, శ్రావయ ఇత్యాదులలో ప్లుతమునుచ్చరించవలయును. దాస్వాన్, స్వతవాన్, యాపీ, త్రిభిడ్జ్వం, నృభిప్టుతః, అభీషుణ, ఋతావహం, నషీదత్, నృణా ఇత్యాది రూపములు బాహులకమువలన సిద్దించును. బాహులకము నాలుగు విధములుగా నుండును. శాస్త్రము ప్రవర్తించుట, ప్రవర్తించకపోవుట విభాషగా ప్రవర్తించుట అనగా ఒకసారి వచ్చుట, ఒకసారి రాకపోవుట, అన్యథాభావము అని. ఇట్లు నాలుగు విధములగు బాహుంకము వలన వైదికరూపములన్నియూ సిద్ధించును.
భూవాద్యా ధాతవో జ్ఞేయా పరస్మైపదినస్స్మృతాః ।
ఏధాద్యా ఆత్మనే భాషా ఉదాత్తాః షట్ట్రింశసంఖ్యాకాః ॥
అదాదయోఽష్టత్రింశచ్చ పరస్మై పదినో మునే ।
శ్నోకృపూర్వా ద్విచత్వారింశదుక్తాశ్చ హాత్మనే పదే ॥
ఉదాత్తేతస్తు పంచాశత్ పక్వాద్యాః పరికీర్తితాః ।
వర్చాద్యా అనుదాత్తేత ఏకవింశతిమీరితాః ॥
గుపాదాయో ద్విచత్వారింశదుదాత్తేతస్సమీరితాః ।
ధీణ్యాదయ్యోనుదాత్తేతో దశప్రోక్తా హి శాబ్దికైః ॥
అణాదయోఽప్యుదాత్తేతస్సప్తవింశతిధాతవః ।
ఆమాదయస్సముద్దిష్టాశ్చతుస్త్రింశద్ధి శాబ్దకైః ॥
ద్విసప్తతి మీతా మవ్యముఖాశ్చోదాత్త బంధనాః ।
స్వరితేద్ధావుధాతుస్తు ఏక ఏవ ప్రకీర్తితః ॥
క్షుధాదయోఽనుదాత్తేతో ద్విషంచాశదుదాహృతాః ।
ఘుష్టిరాద్యా ఉదాత్తతోఽష్టాశీతిధాతవో మతాః ॥
ద్యుతాద్యాఅనుదాత్తేత ద్వివింశతిరతోఽమతాః ।
షితస్త్రయోదశ ఘటాదిష్వనుదాత్తే ఈరితాః ॥
తతో జ్వలదుదాత్తేతో ద్వీపంచాశన్మితాస్తథా ।
స్వరితేద్రాజృసంప్రోక్తస్తనహాభ్రాజృతస్త్రయః ॥
అనుదాత్తేత ఆఖ్యాతా భాద్యుదాత్తా ఇతః క్రమాత్ ।
సహ్యానుదాత్తే దేవస్తు రమేక్యోప్యాత్మ నేపదీ ॥
సదస్త్రయ ఉదాత్తేత కుచాద్వేదా ఉదాత్త ఇత్ ।
స్వరితేతః పంచత్రింశద్ధిక్కాద్యాశ్చ తతః పరమ్ ॥
స్వరితేచ్ఛిఞిభృఞగాద్యాశ్చత్వారః స్వరితేత్తతః ।
ధేటః పరస్మేపదినః షట్చత్వారింశదీరితాః ॥
అష్టాదశస్మిజాద్యాస్తు ఆత్మ నేపదినో మతాః ।
తతస్త్రయోఽనుదాత్తేతః పూజాద్యాః పరికీర్తితాః ॥
హృ పరస్మైపదీ చాత్మనేభాషాస్తు గుపా త్రయః ।
రభద్యబ్ద్యనుదాత్తెతో ఞ్క్ష్విదోదాత్త ఇన్మతః ॥
పరస్మైపదినః పంచ దశసంభ్వాదయస్తథా ।
కితధాతురుదాత్తేచ్చ దానశానోభయాత్మకా ॥
స్వరితేతః పచాద్యంతాః పరస్మైపదినో మతాః ।
స్వరితేతస్రయశ్చేతా వదవచీపరిభాషిణౌ ॥
భ్వాద్యా ఏతే షడధికా సహస్రం ధాతవో మతాః ।
పరస్మై పదినః ప్రోక్తా వదస్చాపి హనోతి చ ॥
స్వరితేతే ద్విషాద్యాస్తు చత్వారో ధాతవో మతాః ।
చక్షిజేకస్సమాఖ్యాతో ధాతురత్రాత్మ నేపదీ ॥
ఇరాదయోఽనుదాత్తేతో ధాతవస్తు త్రయోదశ ।
ఆత్మనే పదినౌ ప్రోక్తా షూజ్ ద్వౌ శాబ్దకైర్మునే ॥
పరస్మైపదినః ప్రోక్తాః షుముఖాస్సప్త ధాతవః ।
స్వరితేదూర్లుఞాఖ్యాతో ధాతురేకో మునీశ్వర ॥
ఘముఖాస్త్రయ ఉద్దిష్టాః పరస్మైపదినస్తథా ।
ష్టుఞేకస్తు సమాఖ్యాతస్స్మృతో నారద శాబ్దకైః ॥
అష్టాదశ రాప్రభృతయః పరస్మైపదినస్స్మృతాః ।
ఇజ్జాత్మ నేపదీ ప్రోక్తో ధాతుర్నారద కేవలః ॥
విదాదయస్తు చత్వారః పరస్మైపదినో స్స్మృతాః ।
ఞిష్వపశయే సముద్దిష్టః పరస్మైపదికస్తథా ॥
పరస్మైపదినశ్చైవ తే మయోక్త్యా మాదయః ।
దీధీజ్ వేవీజ్ స్మృతౌ ధాతూ ఆత్మ నేపదినౌ మునే ॥
ప్రథాదయస్త్రయశ్చాపి ఉదాత్తేతః ప్రకీర్తితాః ।
చర్కరీతం చ హ్రుజ్క్ ప్రోక్తోఽనుదాత్రేన్ము నిసత్తమ ॥
త్రిసప్తతిస్సమాఖ్యాతా ధాతవోఽదాదికే గణే ।
దాదయో ధాతవో వేదాః పరస్మైపదినో మతాః ॥
స్వరితేద్వై భృఞఖ్యాత ఉదాత్తేద్ధాక్ప్రకీర్తితః ।
మాజ్ హాజ్ ద్వావనుదాత్రేతౌ స్వరితేద్దానధాతుషు ॥
వాణీతిరాద్యాస్త్రయశ్చాపి స్వరితేత ఉదాహృతాః ।
ఘముఖా ద్వాదశ తథా పరస్మైపదినో మతాః ॥
ద్వావింశతిరిహొద్దిష్ఠా ధాతవో హ్వాదికే గణే ।
పరస్మైపదినః ప్రోక్తా దివ్యా పంచవిశతిః ॥
ఆత్మ నేపదినౌ ధాతూ ఘాజ్ దూజ్ ద్వావపి నారద ! ।
ఓదితః పూజ్ముఖాస్సప్త ఆత్మ నేపదినో మతాః ॥
ఆత్మ నేపదినో విప్ర దీజ్మఖాస్త్విహా కీర్తితాః ।
స్యతిప్రభృతయో వేద పరస్మైపదినో మతాః ॥
జన్యాదయః పంచదశ ఆత్మ నేపదినో మునే ।
మృషాద్యాస్వరితేతస్తు ధాతవః పంచకీర్తితాః ॥
ఏకాదశ పదాద్యాస్తు హ్యాత్మనే పదినో మతాః ।
రాధోఃకర్మక ఏవాత్ర వృద్దేస్వాది చురాదికే ॥
ఉదాత్తేతస్తుదాద్యాస్తు త్రయోదశస మీరితాః ।
పరస్మైపదినోఽష్టాత్ర రధాద్యాః పరికీర్తితాః ॥
సమాద్యాశ్చాప్యుదాత్తేత షట్చత్వారింశదీరితాః ।
చత్వారింశచ్ఛతం చాపి దివాదౌ ధాతవో మతాః ॥
స్వాదయస్స్వరితేత్తోక్తా ధాతవః పరికీర్తితాః ।
సప్తా ఖ్యాతా దునోతిస్తు పరస్మైపదిన్ మునే ॥
ఆష్టిధావనుదాత్తేతౌ ధాతూ ద్వౌ పరికీర్తితో ।
పరస్మైపదినస్త్వత్ర తీకాద్యాస్తు చతుర్దశ ॥
ద్వాత్త్రింశజ్ఞాతవః ప్రోక్తా విప్రేన్ద్ర స్వాదికే గణే ।
స్వరితేతప్షడాఖ్యాతాస్తుదాద్యా మునిసత్తమ ॥
ఋష్యదాత్తోజ్జు షీపూర్వా ఆత్మ నేపదినోర్ణవాః ।
వ్రాశ్చాదయ ఉదాత్తేతః ప్రోక్తాః పంచాధికం శతమ్ ॥
గూర్యుదాత్తే దీహోద్దిష్టో ధాతు రేకో మునీశ్వర ।
ణూముఖా శ్చైవ చత్వారః పరస్మైపదినో మతాః ॥
కుజాఖ్యాతోఽనుదాత్తేచ్చ కుటాద్యాః పూర్తిమాగతాః ।
పృజ్ మృజ్ చాత్మనే భాషౌ షట్పరస్మై పదేరితాః ॥
ఆత్మనే పదినౌ ధాతూ దృజ్ ధృజ్ ద్వౌ చాప్యుదాహృతా ।
ప్రచ్ఛాదిషోడశాఖ్యాతా పరస్మైపదినో మునే ॥
స్వరితేతప్షట్ తతశ్చోస్తత్ర బలముఖా మునే ।
కుతీప్రభృతయశ్చాపి పరస్మై చ పదినస్త్రయః ॥
సప్తపంచాశదధికాస్తుదాదౌ ధాతవశ్శతమ్ ।
స్వరితతో రుధ్యోనందా పరస్మైభాషిణః కృతీ ॥
ఞి ఇంధీత్వోనుదాత్తేతస్రయో ధౌతవ ఈరితాః ।
ఉదాత్తేతష్షిషపిషరుధాద్యాః పంచవింశతిః ॥
స్వరితేతస్త్నోస్సప్త ధాతవః పరికీర్తితాః ।
మనువన్వాత్మనేభాషా స్వరితేత్క్రుఞదాహృతః ॥
తతో ద్వౌ కీర్తితౌ విప్ర ధాతవో దశ శాబ్దికైః ।
క్రోద్యాస్సప్తోభయే భాషాః సౌత్రాస్సంభ్వాదికాస్తథా ॥
పరస్మై పదినః ప్రోక్తాశ్చత్వారోఽపి మునీశ్వర ।
ద్వావింశతిరుదాత్రేతః రుధాద్యా ధాతవో మతాః ॥
వృఙాత్మనే పదీ ధాతుశ్శ్రుంధాద్యా శ్చైకవింశతిః ।
పరస్మైపదినశ్చాథ స్వరితేద్గృహ ఏవ చ ॥
క్య్రాది కేషు ద్వీపంచాశద్దాతవః కీర్తితా బుదైః ।
చురాద్యా ధాతవో ఞంతా షట్ట్రింశదధికం శతమ్ ॥
చిత్యాద్యష్టాదశాఖ్యాతా ఆత్మనే పదినో మునే ।
చర్చాద్యా ఆధృషీయాస్తు ణ్యంతా వా పరికీర్తితాః ॥
అదంతా ధాతవశ్చైవ చత్వారింశత్తథాష్ట్ర చ ।
పద్యాస్తు దశ ప్రోక్తా ధాతవో హ్యాత్మనే పదే ॥
సూత్రాద్యా అష్ట చాప్యత్ర ఞ్యాన్తా ప్రోక్తా మనీషిభిః ।
ధాత్వర్దే ప్రాతిపదికాద్భహులం చేష్టవన్మతమ్ ॥
భూ మొదలగు ధాతువులు పర స్మెపదులు. ఏధమొదలగు ముప్పదియారు ధాతువులు ఆత్మనే పదులు. అత మొదలగు ధాతువులు ముప్పది యెనిమిది పర స్మెపదులు. శోక మొదలగు నలుబది రెండు ధాతువులు ఆత్మ నేపదులు. పక్వ మొదలగు ధాతువులు యాబది ఉదాత్తవర్ణము ఇత్తుగా గలవి. అనగా పర స్మెపదములు. వర్చమొదలగు ఇరువది యొకటి ధాతువులు అదుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఆత్మనే పదులు. గుపూ మొదలగు నలుబది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి కావున పర స్మెపదులు, ధిణీ మొదలగు పదిధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మనే పదములు. అణ మొదలగు ఇరువదియేడుధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి కొవున పర స్మెపదములు. ఆమాదిధాతువులు ముప్పదినాలుగు ఆత్మదే పదములు. మన్య మొదలగు డెబ్బది రెండు ధాతువులు పర స్మెపదములు. హావుధాతువు ఒక్కటే స్వరితము ఇత్తుగా గలది. అనగా ఉభయపది. క్షుధ్ మొదలగు యాబది రెండు ధాతువులు అను దాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మ నే పదములు. ఘష్ మొదలగు ఎనుబది ఎనిమిది ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పర స్మెపదములు. ద్యుతాదులు ఇరువది రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మ నే పదములు. ఘటాదులలోనున్న పదమూడు షిత్తులను ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. కావున ఆత్మ నే పదములు. జ్వలదాదులు యాబది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పర స్మెపదములు. రాజధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి అనగా ఉభయ పది స్తనభోజ అను మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. కావున ఆత్మ నే పదములు. భాది ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పర స్మె పదములు. సహాధాతులు ఒకటి అనుదాత్తము ఇత్తుగా కలది. అనగా ఆత్మ నే పదము. రమ్ ధాతువు కూడా ఆత్మ నే పదియే. సదమొదలగు మూడు ధాతువులు ఉదాత్తెత్తులు అనగా పర స్మెపదములు. కుచమొదలగునవి కూడా ఉదాత్తము ఇత్తుగా కలవే. కావున పర స్మెపదములు. హిక్కమొదలగు ముప్పదియైదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. శిహోర్, భృఢ్ మొదలగు నాలుగు ధాతువులు కూడా స్వరితము ఇత్తుగా కలవే. కావున ఉభయపదులు, ఫేట్ మొదలగు నలుబది యారుధాతువులు పర స్మె పదులు. సీజ్ మొదలగు పదునెనిమిది ధాతువులు ఆత్మ నే పదములు. పూజ్ మొదలగు మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. అనగా ఆత్మనే పదములు. హృధాతువు పర సెపది. గుపొదులు మూడు ధాతువులు ఆత్మ నే పదులు. రబాదిధాతువులు రెండు అనుదాత్తెత్తులు. అనగా ఆత్మనే పదములు కలవి. ఇక్ష్యిధాతువు ఉదాత్తము ఇత్తుగా కలది కావున పరస్మెపది. స్కంబ్వాది పదిహేనుధాతువులు పరస్మె పదులు. కితధాతువు కూడా పర స్మెపదియే. దాన శాన ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఇట్లు భ్వాదిగణమున ఒక వేయి ఆరు ధాతువులుండును. వద హన ధాతువులు కూడా పర స్మెపదులు. ద్విషమొదలగు నాలుగు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. చక్షిజ్ అను ఒక ధాతువు మాత్రము ఆత్మ నేపది. ఇరాదులు పదమూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మ నే పదులు. షూజ్, శీజ్ అను రెండు ధాతువులు ఆత్మ నేపదులు. ఘ మొదలగునేడు ధాతువులు పర స్మెదులు. ఊర్లుణ్ ధాతవోకటి మాత్రము స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. ఘు మొదలగు మూడు ధాతువులు - పర స్మెపదులు. ష్ణు హో ధాతువొకటి రా మొదలగు పదునెనిమిది ధాతువులు పర స్మెదులు. ఇజ్ ధాతువు ఆత్మ నేపది. విదోదీ ధాతువులు నాలుగు పర స్మెదులు. ఇక మొదలగు ధాతువులు కూడా పర సేపదేకమే. సమాదులు కూడా పరస్మై పదులేనని నేను చెప్పియుంటిని. దీ, ధీ, వే, వీ, ధాతువులు ఆత్మ నే పదులు. ప్రధాదులు మూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. అనగా పర స్మెపదములు. చర్కరీతం, హజ్ అనునవి అనుదాత్తము ఇత్తుగా కలవి. అనగా ఆత్మ నేపదులు. అద్దిగణమున డెబ్బదిమూడు ధాతువులున్నవి. దా మొదలగు ధాతువులు పర స్మెపదులు. భృణ్ ధాతువు స్వరితము ఇత్తుగా కలది కావున ఉభయపది. హాక్ ధాతువు. ఉదాత్తెత్తు అనగా పర స్మెపది. మాజ్, హాజ్, అను రెండు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మ నే పదులు. దానధాతువులో స్వరీతము ఇత్తుగా నుండును. అనగా ఉభయపది. వా, అణ మొదలగు మూడు ధాతువులు కూడా స్వరితోత్తు లే. కావున ఉభయపదులు. ఘు మొదలగు పన్నెండు ధాతువులు పర స్మెపదులు. హ్వాదిగణమున ఇరువది రెండు ధాతువులుండును. దీవాదులగు ఇరువది అయిదు ధాతువులు పర స్మె పదులు. ఘాజ్, దూజ్ అను రెండు ధాతువులు మాత్రము ఆత్మనే పదులు. ఓ కారము ఇత్తుగా గల పూజ్ మొదలగు ఏడు ధాతువులు ఆత్మ నేపదులు. దీజ్ మొదలగు ధాతువులు కూడా ఆత్మ నే పదులే. స్యతి మొదలగునవి పర స్మెపదులు. జని మొదలగు పది హేను ధాతువులు ఆత్మ నేపదులు. మృషాదులగు అయిదు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి. అనగా ఉభయపదులు. పదాదులను పదునొకండు ధాతువులు ఆత్మ నేపదులు. స్వాదులలో చురాదులో సకర్మకత్వమే యుండును. అది కూడా రాధు ధాతువు కర్మణో యుండును. తుద్దులు పదమూడు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పరస్మెపదులు. రధాదులు ఎనిమిది కూడా పరస్మె పదులే సమాది ధాతువులు నలుబది యారు కూడా ఉదాత్తము ఇత్తుగా గలవే. కావున పర స్మెపదులే. దీవాదులలో నూటనలబది ధాతువులున్నవి. స్వాదులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయపదులు. దునోతో మొదలగు ఏడు ధాతువులు పరస్మెపదులు. అషీ, ధా ధాతువులు రెండు అనుదాత్తము ఇత్తుగా గలవి కావున ఆత్మ నేపదులు. తికాది ధాతువులు పదునాలుగు పరస్మెపదులు. స్వాదిగణములో ముప్పది రెండు ధాతువులున్నవి. తువాదులు ఆరు ధాతువులు స్వరితము ఇత్తుగా కలవి కావున ఉభయపదులు. ఋషి ధాతువు పర స్మెపది. జుషి మొదలగు నాలుగు ధాతువులు ఆత్మ నేపదులు. ప్రశ్చ మొదలగు నూటా అయిదు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా కలవి. కావున పరస్మె పదులు ఒక్క గూరి ధాతువు మాత్రము ఉదాత్తము ఇత్తుగా కలది. కావున పర స్మెపది. ణూ మొదలగు నాలుగు ధాతువులు కూడా పరస్మెపదులే. కుజ్ ధాతువు అనుదాత్తెత్తు కావున ఆత్మ నేపదము.కుటాదులు పరస్మెపదులు. పృజ్, మృజ్ ధాతువులు మాత్రము ఆత్మ నేపదులు. మిగిలిన ఆరు ధాతువులు పర స్మెపదులు. దృజ్, ధృజ్ అను రెండు ధాతువులు ఆత్మనే పదులు. ప్రచ్ఛాదులు పదునొరు ధాతువులు పరస్మెపదులు. మిల మొదలగు ధాతువులు నారు స్వరితము ఇత్తుగా గలవి. అనగా ఉభయపదులు. కుతీ, మొదలగు మూడు ధాతువులు పర సెపదులు. తుదొదులలో నూటా యాబది యేడు ధాతువులున్నవి. రుధ నంద ధాతలీవులు స్వరితము ఇత్తుగా గలవి. కావున ఉభయపదులు, కు మొదలగు ధాతువులు పర స్మెపదులు. ఇ! ఇంధీ మొదలగు మూడు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా కలవి కావున ఆత్మ నేపదులు. శిష, పిష రుధాది ధాతువులు ఇరువది అయిదు ఉదాత్తము ఇత్తుగా గలవి కావున పర స్మేపదులు. తను ధాతువు నుండి ఏడు ధాతువులు స్వరితము ఇత్తుగా గలవి. అనగా. ఉభయపదులు. మను, వను ధాతువులు ఆత్మ నేపదులు. కృ ధాతువు స్వరితత్తు కావున ఉభయపది. తరువాత పన్నెండు ధాతువులను శాబ్దికులు చెప్పిరి. క్రీ మొదలగు ఏడు ధాతువులు ఉభయపదులు. సూత్రములో పఠించిన స్తంభ్వాదులు నాలుగు ధాతువులు పర స్మెదులు. క్రుధాదులగు ఇరువది రెండు ధాతువులు ఉదాత్తము ఇత్తుగా గలవి. అనగా పర స్మెపదులు. వృధాతువు ఆత్మ నేపది. శ్రంధాదులగు ఇరువది యొక్క ధాతువులు పర స్మెపదులు. గ్రహధాతువు స్వరితము ఇత్తుగా కలది యనగా ఉభయుపది. క్ర్యాదులలో యాబది. రెండు ధాతువులు పండితులచే చెప్పబడినవి. చురాది ధాతువులు నూట ముప్పది యారు. చితి మొదలగు పదునెనిమిది ధాతువులు ఆత్మ నేపదులు. ఈ చురాదులు ణ్యంతములని చెప్పబడినవి. అదంతములగు ధాతువులు నలుబది యెనిమిది. పదాదులగు ధాతువులు పది ఆత్మ నేపదులు. సూత్రాదులగు ఎనిమిది ధాతువులు కూడా ఇ్యంతములుగా చెప్పబడినవి. అనగా ఉభయపదులు. ప్రాతిపదికము కంటే పరముగా ధాత్వర్ధమున ఇష్టవదాదులు బహులముగా వచ్చునని సిద్ధాంతము.
తత్కరోతి తదాచష్టే హేతుమత్యపి ణిర్మతః ।
ధాత్వర్థ కర్తృకరణాచ్చిత్రాద్యాశ్చాపి ధాతవః ॥
అష్ట సంగ్రామ ఆఖ్యాతోఽనుదాత్తే చ్ఛాబ్ది కైర్బుదైః ।
స్తోమాద్యాషోడశ తథా అదంతస్య నిదర్శనమ్ ॥
తథా బాహులకొదన్యే సౌత్రలౌకిక వైదికొః ।
సర్వే సర్వగణీయాశ్చ తథాన్యే కార్ద వాచినః ॥
సనాద్యంతా ధాతనశ్చ తథో వై నామదాతవః ।
ఏవమానన్త్యముద్భావ్యం ధాతూనామిహ నారద ! ॥
సంక్షేపోఽయం సముద్ధిప్టో విస్తరస్తత్ర తత్ర చ ।
ఊదదంతైర్యోతిరుక్తురీజ్ సునుకు శ్విడీజ్ శ్రీఖః ॥
వృజ్ వృషభ్యాం చ వినైకాచోఽజంతేషు నిహతాస్స్మృతాః ।
శుక్ల పచ్ ముచ్ రిచ్ వచ్ విచ్ పిచ్ ప్రచ్ఛత్యజ్ నిజార్ భజిః ॥
భంజ్ భుజ్ భ్రస్ట్ మస్జి యజ్ యుజ్ రుజ్ రంజ విజిర్ స్పంజి సంజ్ సృజః ।
అద్ క్షుద్ ఛిద్ ఖద్ తుది నుదః పద్య విద్ విద్యతిర్వినద్ ॥
శిద్ సదీ స్విద్యతి స్కందిర్ హదీ క్రుధ క్షుధి బుధ్యతీ ।
బంధర్యుధి రుధే రాధి వ్యథ్ శుధస్సాది సిధ్యతీ ॥
మన్యహస్నాప్ క్షిప్ చుప్ తప్ తీపస్తృప్యతి దృష్యతీ ।
లిబ్ల్వుపూ శప్పుపూ సృపి యభ రభ లభ గమ్నమ్యయో రభిః ॥
క్రుశిర్థంశి దిశీ దృశ్ మృశ్రీశ్ రుశ్ లిశ్ విశ్ స్పృశ్ఛ కృషిః ।
త్వష్ తుష్ దుష్ పుష్య పిష్ విష్ శిష్ శుష్ క్లిష్యతయో ఘసిః ॥
వసతిర్థహ దిహి దుహో నహ్ మ్హ్ రుహ్ లిహ్ వహిస్తథా ।
అనుదాత్తా హాలంతేషు ధాతవో ద్వ్యధికం శతమ్ ॥
చాద్యా నిపాతా గవయః ప్రాద్యాదిణేశకాలజాః ।
శబ్దాః ప్రోక్తా హ్యనేకార్థాస్సర్వలింగా అపి ద్విజ ॥
గణపాఠస్సూత్రపాలో ధాతుపాఠస్తథైవ చ ।
పాఠనునాసికానాం చ పరాయణమహోచ్యతే ॥
శబ్దా స్సిద్ధా వైదికాస్తు లౌకికాశ్చాపి నారద ! ।
శబ్దపారాయణం తస్మాత్కారణం శబ్దసంగ్రహే ॥
లఘుమార్గేణ శబ్దానాం సాధూనాం సన్నిరూపణమ్ ।
ప్రకృతిప్రత్యయాదేశలోపాగమముఖైః కృతమ్ ॥
ఇత్ధమేతత్సమాఖ్యాతం నిరుక్తం కించిదేవ తే ।
కార్త్యె న వస్తుమానంత్యాత్కోఽపి శక్తి న నారద ! ॥
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయపాదే నిరుక్తలక్షణనిరూపణం నామ త్రిపంచాశత్తమోఽధ్యాయః ॥
తత్ కరోతి (దానిని చేయుచున్నాడు) తత్ ఆచష్ట (అట్లు చెప్పుచున్నాడు, ఆచరించుచున్నాడు) అను అర్దములో, హేతుమదర్థములో ధాతువునకం టే పరముగా ణీచ్ ప్రత్యయము వచ్చును. కర్తృకర్మ చాచక శబ్దముల కంటే పరముగా ధాత్వర్థమున ప్రత్యయములను చేర్చుకొన్నచో చిత్రమొదలగు శబ్దములు కూడా ధాతువులగును. సంగ్రామాది శబ్దములు ధాతువులుగా మారినపుడు సంగ్రామాదులు ఎనిమిది అనుదాత్తైత్తులగును. అనగా ఆత్మ నే పదమువచ్చును. అని శబ్దశాస్త్రవిదులు చెప్పిరి. సో మాది శబ్దములు పదునారు అదంత ధాతువులకు ఉదాహరములు. ఇట్ల బాహులకమును ఆశ్రయించుట వలన సూత్రములలో చెప్పబడినవి, లోకములో వ్యవహరించబడునవి, వేదములో ప్రయోగించబడినవి చాలా ధాతువులు సిద్ధించును. ఈ ధాతువులన్నియు అన్ని గణష్కులో నుండును. అనేకార్ధములను చెప్పుచుండును. సనాద్యంత ధాతువులు, నామ ధాతువులు అని ఇట్లు ధాతువులు అనన్తములని తెలియవలయును. ఇచట సంక్షేపముగా చెప్పితిరి. ఆయా సందర్భములలో విస్తరముగా చెప్పియుండును. చూచీ తెలియవలయును, ఊకారాంతములు, ఋకారాంతములు, యు,గు, క్లు, గీజ్, స్ను, ను, కు, క్వి, ఈజ్, గ్రి, వజ్, వృషన్ అను ధాతువులు తప్ప మిగిలిన అజంతములగు ధాతువులలో ఒక అచ్చుగల ధాతువలు అనుదాత్తము ఇత్తుగా గల వగును. శుక్ల, పచ్, ముచ్, రిచ్, వర్, విచ్, సిచ్, ప్రచ్చి, త్యజ్, నిజార్, భజ్, భంజ్, భుజ్, భస్ట్, మస్ట్, యజ్, యుజ్, రుజ్, రంజ్, విజిర్, స్పంజ్, సంజ్, సృజ్, ఆద్, కుద్, భద్, ఛిద్, తుద, నుది, పద్య, ఖిద్, విద్య, వినద్, శద్, సద్, స్విద్య, స్కందిర్, హది, క్రుధ్, కుధి, బుధ్య, బంధిర్ యుధి, రుధి, రాధి, వ్యథ్, శుధ్, సాధి, సిధ్య, మన్య, హన్, ఆప్, క్రిప్, చుపి, తప్, తప, తృప్, దృష్, లిబ్, లుబ్, వప్, శప్, స్వపూ, సపి, యభ, రభ, లభ, గమ్, నమ్, యమ్, రఫీ, క్రుసి , దంగి, దిగి, దృశ్, మశ్ , రిశ్, రుశ్, లిశ్, విశ్ , స్పృశ్, కృష్, త్విష్, తుష్, దుష్, పుష్య, పిష్, విష్, శుష్, భీష్య, ఘసి, వస, దహ, దిహి, దుహ్, నహ్, ముహ్, రుహ్, లేహ్, వహీ అను నూటారెండు హాలంతములగు ధాతువులు అనుదాత్తము ఇత్తుగా గలవి. చ మొదలగునవి, దేశములలో కాలములో ఏర్పడిన ప్ర మొదలగునవి నిపాతములనబడును. శబ్దములు అనేకార్థములు కలవి మూడు లింగములు కలవిగా చెప్పబడినవి. గణపాఠము, సూత్రపొఠము, ధాతు పాఠము, అనునాసిక పొఠము ఈ విషయమున ప్రమాణముగా చెప్పబడినది. శబ్దములు సిద్దములే, లౌకిక శబ్దములు వైదిక శబ్దములు కూడా సిద్దములే. కావున శబ్దములను తెలియవలయునన్నచో శబ్దపారాయణము చేయవలయును. సులభము లఘువు అయిన మార్గములో శబ్దములకు సాధుత్వము తెలియుటకు ప్రకృతి, ప్రత్యయ, ఆదేశ, లోప, ఆగమములను తెలియవలయును. ఇట్లు నీకు నిరుక్తమును సంక్షేపముగా కొంచెమే చెప్పితిని. శబ్దములు అనంతములు కావున సంపూర్ణముగా ఎవ్వరూ చెప్పజాలరు.
ఇది శ్రీబృహన్నారదీయ పురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయ పాదమున నిరుక్త లక్షణ నిరూపణమను యాబది మూడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 54 of the Nārada Mahā Purana is as follows:
వేదములకు పాదములుగా ప్రకాశించే ఛందో వేదాంగమును సనందన మహర్షి ఈ అధ్యాయంలో వివరించినారు. గాయత్రీ, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్ వంటి వైదిక ఛందస్సుల లక్షణములు, గురు లఘు నియమములు మరియు మంత్ర పఠనంలో ఛందస్సు యొక్క ప్రాముఖ్యత ఇక్కడ విశదీకరించబడినవి.