28 - శ్రాద్ధక్రియావర్ణనమ్

సనక ఉవాచ :-

శృణుష్వ మునిశార్దూల శ్రాద్ధస్య విధిముత్తమమ్

యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః

క్షయాహపూర్వదేవసే స్నాత్వా చైకాశనో భవేత్

అధశ్శాయీ బ్రహ్మచారీ నిశి విప్రాన్నిమంత్రయేత్

దంతధావనతాంబూలే తైలాభ్యంగం తథైవ చ

రత్యోషధిపరాన్నాని శ్రాద్ధకర్తా వివర్జయేత్

అధ్వానం కలహం క్రోధం వ్యవాయం చ ధురం తథా

శ్రాద్ధకర్తా చ భోక్తా చ దివాస్వాపం చ వర్జయేత్

 శ్రాద్దే నియంత్రితో యస్తు వ్యపాయం కురుతే యది

బ్రహ్మ హత్యామవాప్నోతి నరకం చాధిగచ్ఛతి

 శ్రాద్ధే నియోజయేద్విప్రం శ్రోత్రియం విష్ణుతత్పరమ్

యథాస్వాచారనిరతం ప్రశాంతం సత్కులోద్భవమ్

 రాగద్వేషవిహీనం చ పురాణార్ధవిశారదమ్

త్రిమధు త్రిసుపర్ణజ్ఞం సర్వభూతదయాపరమ్

దేవపూజారతం చైవ స్మృతితత్త్వవిశారదమ్

 వేదాంతతత్త్వసంపన్నం సర్వలోకహితే రతమ్

కృతజ్ఞం గుణసంపన్నం గురుశుశ్రూషణే రతమ్

పరోపదేశనిరతం సచ్ఛాస్త్రైకధనైస్తథా

ఏతే నియోజితవ్యా వై శ్రాద్దే విప్రా మునీశ్వర !

 శ్రాద్దే వర్జ్యాన్ప్రవక్ష్యామి

న్యూనాంగశ్చాధికాంగశ్చ కదర్యో రోగితస్తథా

కుష్ఠీ చ కునఖీ చైవ లంబకర్ణః క్షతవ్రతః

నక్షత్రపాఠజీవీ చ తథా చ శవవాహకః

 కువాదీ పరివేత్తా చ తథా దేవలకః ఖలః

 నిందకోఽమర్షణో ధూర్తస్తథైవ గ్రామయాజకః

 అసచ్ఛాస్త్రాభినిరతః పరాన్ననిరత స్తథా

 వృషలీసూతిపోష్టా చ వృషలీపతి రేవ చ

కుండశ్చ గోలక శ్చైవ హ్యయాజ్యానాం చ యాజకః

 దంభాచార వృధా ముండీ హ్యన్య స్త్రీధనతత్పరః

విష్ణుభక్తివిహీనశ్చ శివభక్తిపరాజ్ముఖః

వేదవిక్రయిణ శ్చైవ క్రతవిక్రయిణస్తథా

స్మృతివిక్రయిణ శ్చైవ మంత్రవిక్రయిణస్తథా

 గాయకాః కావ్య కర్తారో భిషక్షాస్త్రోపజీవినః

 వేదనిందాపర శ్చైవ గ్రామారణ్యప్రదాహకః

 తథాతికాముక శ్చైవ రసవిక్రయకారకః

కూటయుక్తిరతశ్చైవ శ్రాద్ధే వర్జ్యాః ప్రయత్నతః

సనక మహర్షి పలికెను :- ఓ మునిశ్రేష్టా ! ఉత్తమమైన శ్రాద్ధవిధిని వినుము. ఈ విధిని వినినచో సర్వపాప నివృత్తి కలుగును. సంశయములేదు. మృతదినమునకు ముందురోజు స్నానము చేసి ఏకభుక్తముగా నుండవలయును. క్రింద పరుండవలయును. బ్రహ్మ చర్యము నవలంబించవలయును. రాత్రిపూట బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. దంతధావనము, తాంబూలము, తైలాభ్యంగనము, రతి, ఓషధిపరాన్నములను శ్రాద్ధకర్త పరిత్యజించవలయును. ప్రయాణమును, కలహమును, క్రోధమును స్త్రీ సంగమమును, బరువుమోయుటను, పగటినిద్రను శ్రాద్ధకర్త, భోక్త పరిత్యజించవలయును. శ్రాద్ధమున నియంత్రణ చేయబడిన విప్రుడు స్త్రీ సంగమును చేసినచో బ్రహ్మ హత్యాపాపమును పొందును. నరకమును పొందును. శ్రాద్దమునందు శ్రోత్రియుడు, విష్ణుతత్పురుడు, స్వాచారనిరతుడు, ప్రశాంతుడు, సత్కులోద్భవుడు, రాగద్వేషరహితుడు పురాణార్ధ విశారదుడు త్రిమధు త్రిసుపర్ణజ్ఞానము కలవాడు, సర్వభూత దయాపరుడు, దేవపూజారతుడు, స్మృతతత్త్వవిశారదుడు వేదాంతతత్త్వసంపన్నుడు సర్వలోకహితాకాంక్షి, కృతజ్ఞుడు గుణసంపన్నుడు, గురుశుశ్రూషారతుడు, సచ్చాస్త్రకథనములతో పరోపదేశ నిరతుడు అయిన విప్రుని నిమంత్రణ చేయవలయును. ఇక ఇపుడు శ్రాద్ధమున నియంత్రణకు యోగ్యులుకానివారిని, చెప్పెదను వినుము. న్యూ గాంగుని, అధికొంగుని, లుబ్ధుని, రోగిని, కుష్టువ్యాధిగ్రస్తుని, కునఖుని, లంబకర్ణుని, వ్రతభ్రష్టుని, జ్యోతిష్కుని, శవదాహకుని, కువాదిని, పరికేత్తను, దేవలకుని, ఖలుని, నిందకుని, అమర్జాగ్రస్తుని, ధూర్తుని, గ్రామయాజకుని, అసచ్ఛాస్త్రాభి నిరతుని, పరాన్ననిరతుని శూద్రస్త్రీ పుత్రుని పోషించువానిని, శూద్రస్త్రీ పతిని, భర్తుండగా స్త్రీకి జారుని వలన కలిగిన పుత్రుని, భర్త చనిపోయిన తరువాత ఇతరుని వలన కలిగిన పుత్రుని, యజ్ఞము చేయుదగని వానిచే యజ్ఞమును చేయించువానిని, దంభాచారపరుని, నిషయోజనముగా ముండనము చేసుకొనువానిని పరస్త్రీలను పరుల ధనుమును ఆశించువారిని, విష్ణుభక్తివిహీనుని, శివభక్తి పరాజ్ముఖుని, వేద విక్రయముచేయు వానిని, వ్రతమును విక్రయించువానిని, స్మృతి విక్రాయకుని, మంత్ర విజ్రాయకుని, గాయకుని, కావ్యకర్తను, వైద్యముచే జీవించువానిని, వేదనిందాపరుని, గ్రామారణ్య ప్రదాహకుని, అతికాముకుని, రస విక్రయకారకుని కూటయుక్తిరతుని ప్రయత్నముతో శ్రాద్ధమున పరిత్యజించవలయును.

నిమంత్రత పూర్వేద్యుస్త స్మిన్నేవ దినేఽధవా

నిమంత్రితో భవేద్విప్రో బ్రహ్మచారీ జితేంద్రియః

శ్రాద్ధే క్షణస్తు కర్తవ్యః ప్రసాదశ్చేతి సత్తమ నియంత్రయేద్ద్వియం ప్రాజ్ఞం దర్భపాణిర్జితేంద్రియః

 తతః ప్రాతస్సముత్థాయ ప్రాతః కృత్యం సమాప్య చ శ్రాద్ధం సమాచరేద్విద్వాన్కాలే కుతపసంజ్ఞతే

 దివసస్యాష్టమే కాలే యదా మందాయతే రవిః

 సకాలః కుతపస్సతు పితృణాం దత్తమక్షయమ్

 అపరాహ్ణః పితృణాం తు దత్తః కాలస్వయం భువా

తత్కాల ఏవ దౌతవ్యం కవ్యం తస్మాద్ద్విజోత్తమైః

యత్కవ్యం దీయతే ద్రవ్త్యెరకాలే మునిసత్తమ రాక్షసం తద్ధి విజ్ఞేయం పితృణాo నోపతిష్ఠతి

కన్యం ప్రత్తం తు సాయాహ్నే రాక్షసం తద్భవేదపి

దాతా నరకమాప్నోతి భోక్తా చ నరకం వ్రజేత్

 క్షయాహస్య తిథేర్విప్ర యది దండమితిర్భవేత్

విద్ధాపరాహ్నికాయాం తు శ్రాద్ధం కార్యం విజానతా

క్షయాహస్య తిథిర్యా తు అపరాహ్ణాద్వయే యది

పూర్వాక్షయే తు కర్తవ్యా వద్దేకార్యా తథోత్తరా

ముహూర్తద్వితయే పూర్వదినే స్యాదపరేహని

 తిథిస్సాయాహ్నగాయత్రపరా కావ్యస్య విశ్రుతా

కించిత్పూర్వదినే ప్రాహుర్ముహుర్తద్వితయే సతి

 నైతన్మతం హి సర్వేషాం కవదానే మునీశ్వర

నిమంత్రితేషు విప్రేషు మిలితేషు ద్వీజోత్తమ

ప్రాయశ్చిత్త విశుద్ధాత్మా తేభ్యోనుజ్ఞాం సమాహరేత్

శ్రాద్ధార్ధం సమనుజ్ఞాతో విప్రాన్భూయో నిమన్త్రయేత్

ఉభౌ చ విశ్వేదేవార్థం పిత్రర్థం త్రీన్యథావిధి

 దేవతార్థం చ పిత్రర్థమే కైకం వా నిమనత్రయేత్

 శ్రాద్ధార్థం సమునుజ్ఞాతః కౌరయేన్మండలద్వయమ్

 చతురస్రం బ్రాహ్మణస్య త్రికోణం క్షత్రియస్య పై

 వైశ్యస్య వర్తులం జ్ఞేయం శూద్రస్యాభ్యుక్షణం భవేత్

 బ్రాహ్మణానామభావే తు భ్రాతరం పుత్రమేవ చ

ఆత్మానం వా నియుంజీత న విప్రం వేదవర్జితమ్

 ప్రక్షాల్య విప్రపాదాంశ్చ హ్యోచాంతానుపవేశ్య చ

 యథావదర్చనం కుర్యాత్స్మరన్నారాయణం ప్రభుమ్

బ్రాహ్మణానాం తు మధ్యే చ ద్వారదేశే తథైవ చ

అపహతా ఇతృచా వై కర్తా తు విక్రేత్తి లాన్

యవైర్ధర్బైశ్చ విశ్వేషాం దేవానామిదమాసనమ్

దత్తేఽతి భూయో దద్యాచ్చ దేవేక్షణప్రతీక్షణమ్

అక్షయ్యాసళయోష్షష్టీ ద్వితీయావాహనే స్మృతా

 అన్నదానే చతుర్థి స్యాచ్ఛేషాప్సంబుద్ధయస్స్మృతాః

ఆసాద్య పాత్రద్వితయం దర్భశాకాసమన్వితమ్

తత్పాత్రే సేచయేత్తోయం శం నో దేవీత్యృచా తతః

 యవో సీతి యవాన్ క్షిప్త్వా గంధపుష్పే చ వాగ్యతః

ఆవాహయేత్తతో దేవాని శ్వేదేవాసన ఇత్యృచా

యా దివ్యా ఇతి మంత్రేణ దద్యాదర్ఘ్యం సమాహితః

 గంధైశ్చ పత్రపుష్పైశ్చ ధూపైర్దీ పైర్యజేత్తతః

దేవైశ్చ సమునుజ్ఞాతో యజెత్పితృగణాంస్తథా

 తలసంయుక్తదర్భేశ్చ దద్యాత్తేషాం సదాసనమ్

పాత్రాణ్యాసాదయేత్రీణి హ్యర్ఘ్యార్థం పూర్వవద్ద్విజః

శన్నో దేవ్యా జలం క్షిప్త్వా తిలో సీతి తిలాన్కి పేత్

ఉశన్త ఇత్యృచా వాహ్య పితరాన్విస్సమాహితః

యా దివ్యా ఇతి మంత్రేణ దద్యాదర్ఘ్యం చ పూర్వవత్

గంధైశ్చ పత్రపుష్పైశ్చ ధూపైర్దీపైశ్చ సత్తమ

వాసోభిర్భూషణే శ్చైవ యథావిభవమర్చయేత్

 తతోఽన్నాగ్రం సమాదాయ ఘృతయుక్తం విచక్షణః

అగ్నౌ కరిష్య ఇత్యుక్త్యా తేభ్యోనుజ్ఞాం సమాహారేత్

 కరవై కరవాణీతి చాపృష్టా బ్రాహ్మణా మునే

కురుష్వ క్రియతాం వేతి కుర్వతి బ్రూయురేవ చ

 ఉపాసనాగ్నిమాధాయ స్వగృహ్యోక్తవిధానతః

సోమాయ చ పితృమతే స్వధానామ ఇతీరయేత్

 అన్నయే కవ్యవాహనాయ స్వధా నమ ఇతీహ వా

 స్వాహంతేనాపి వా ప్రాజ్ఞో జుహుయాత్పితృయజ్ఞవత్

 ఆభ్యామేవాహుతిభ్యాం తు పితృణాం తృప్తిరక్షయా

అగ్న్యభావే తు విప్రస్య పాణౌ హోమో విధీయతే

మొదటిదినమున కాని మృతాహమున కాని పిలువలయును. నియంత్రణ చేయబడిన విప్రుడు బ్రహ్మచారియై జితేంద్రియుడై యుండవలయును. “శ్రాద్దమున క్షణము చేయవలయును ప్రసన్నులు కండు” అని పలుకవలయును. జితేంద్రియుడై దర్భపాణియై ప్రాజ్ఞుడైన ద్విజుని నియంత్రణ చేయవలయును. తరువాత ప్రాతఃకాలమున లేచి ప్రాతఃకృత్యమును ముగించుకొని కుతపకాలమున విద్వాంసుడు శ్రాద్ధము నాచరించవలయును. దీనములోని ఎనిమిదవ భాగమున సూర్యుడు, మందగించిన సమయం కుతకాలమందురు. అపుడు పితరుల కర్పించినది అక్షయమగును. అపరాహ్లామున పితరులకు దత్త మైనది అక్షయమగునని బ్రహ్మ చెప్పెను. కావున ద్విజులు ఆ సమయమునే ఈయవలయును. అకాలమున కవ్యము ఆర్పించినచో దానిని రాక్షసమని అందురు. అది పితృదేవతలను చెందదు. సాయంకాలమున దత్తమైన కవ్యము రాక్షసమనబడును. ఆసమయమున ఇచ్చినవాడు, భోక్తకూడ నరకమును చెందుదురు. మృతాహా తిథి దండపరిమితముగా నున్న చో అపరాహ్లావిద్దయున్నచో ఆ సమయముననే శ్రాద్దము నాచరించవలయును. మృతాహ తిథి రెండు దినములలో ఆపరాఫ్లమున నున్న చో పూర్వదినమున కయకర్మ చేయవలయును. రెండవ దినమున వృద్ధి కార్యమును చేయవలయును. పూర్వదినమున మతాహో తిథి రెండు ముహూర్తములుండి ద్వితీయ దినమున సాయంకాలము వరకున్నచో రెండవదినమున కవ్యమును చేయవలయును. రెండు ముహూర్త కాలమున్న చో పూర్వదినముననే చేయవలయునని కొందిర మతము కాని ఇది అందరి మతము కాదు. నిమంత్రణ చేయబడిన విప్రులు వచ్చిన వెంటనే కర్త ప్రాయశ్చిత్తముతో విశుద్దుడై వారినుండి అనుజ్ఞను పొందవలయును. విశ్వేదేవస్థానమునకు ఇద్దరు విప్రులను పితృస్థానమునకు ముగ్గురు విప్రులను నియంత్రణ చేయవలయును. లేదా విశ్వేదేవులను ఒకరిని, పితృదేవతలకు ఒకరిని కూడా నిమంత్రణ చేయవలయును. బ్రాహ్మణునకు చతురస్రమును, క్షత్రియునకు త్రికోణమును, వైశ్యనకు వర్తులాకాలముగను శూద్రునకు ప్రోక్షణమును చేయవలయును. బ్రాహ్మణులు లభించనిచో సోదరుని కాని, పుత్రుని కాని చివరకు తన వారిని నియోగించుకొనవలయును. కాని వేదవర్జితుడగు విప్రుని మాత్రము నియోగించరాదు. బ్రాహ్మణులకు పాద ప్రక్షాళన చేసి ఆచమనమును చేయించి కూర్చుండ నియమించి నారాయణ స్మరణ చేయచు యథావిధిగా ఆర్చన చేయవలయును. బ్రాహ్మణుల మధ్య దేశమున ద్వారదేశమున ‘అపహృతా’  అను ఋక్కుచే కర్త నువ్వులను చల్లవలయును, యవలచే దర్భలచే విశ్వేదేతలకు ఇది ఆసనమని ఆసనమునిచ్చి మరల క్షణము నీయవలయును. అక్షయ్య ఆసనము లిచ్చునపుడు షష్ఠీవిభక్తిని ఆవాహనలో ద్వితీయ విభక్తిని, అన్నదామున చతుర్థి విభక్తిని ఇతరవిషయములలో సంబుద్ధిని ఉపయోగించవలయును. దర్భశాఖాసమన్వితమైన పాత్రద్వయమును ఆమోదించి ఆ పాత్రలను “శం నో దేవీ” అను మంత్రముచే జలమున ప్రోక్షించవలయును. ‘యవోసి’ అను మంత్రముచే యవలను చల్లవలయును. మౌనముగా గంధపుష్పములచే ఆర్పించవలయును. “విశ్వేదేవాస్స” అను మంత్రముచే విశ్వేదేవతలను ఆవాహనము చేయవలయును “యా దివ్యా” అను మంత్రముచే సావధానమనస్కుడై అర్ఘ్యము నీయవలయును. ధూపదీపగంధపుష్పాదులచే పూజించవలయును. విశ్వేదేవుల అనుమతిని పొంది పితృదేవతలకు పూజించవలయును. పితృదేవతలను తిలయుక్త, దర్భలను ఆసనముగా నీయవలయును. మూడు పాత్రలను ఆసాదించవలయును. పూర్వమువలె ఆర్యాదులనీయవలయును. ‘శం నో దేవీ’ అను మంత్రముచే జలమును  ప్రోక్షించి ‘తిలోసి’ అను మంత్రముచే తిలలను చల్లవలయును. “ఉశన్త” అను మంత్రముముచే ఆవాహన చేయవలయను ‘యా దివ్యా’ అను మంత్రముచే పూర్వములే ఆర్యము నీయవలయును. ధూపదీపగంధపుష్పవస్త్రాభరణములచే విభవానుసారముగా పూజించవలయును. తరువాత వివేకము కలవాడై ఘృతయుక్తమైన అన్నాగ్రమును తీసుకొని ‘అగ్నౌ కరిష్యే’ అని అనుజ్ఞనడిగి, ‘కురుష్య’  ‘క్రియతాం’ ‘కురుష్వ’ “క్రియతాం” ‘కురు’ అని అనుజ్ఞనీయవలయును. స్వగృహ్యోక్త విధానము ననుసరించి ఉపసానాగ్నిని ఆదానము చేసుకొని “సోమాయ చ పిత్సమతే స్వధా నమ” అని కానీ ఉచ్చరించవలయును. స్వాహాంతముగానైనను పితృయజ్ఞమువలె హోమును చేయవలయును. ఈ ఆహుతులచే మాత్రమే పితృదేవతలకు అక్షయతృప్తి కలుగును. ఉపాసనాగ్ని లేనియెడల బ్రాహ్మణుని హస్తమున హోమము చేయవలయును.

యదాచారం ప్రకుర్వీత పాణావగ్నే చ వా ద్విజ

నహ్యాగ్నిదూరగః కార్యః పార్వణే సముపస్థితే

సంధాయాగ్నిం తతః కార్యం కృత్వా తం విసృజేత్కృతీ

యద్యగ్నిర్దూరగో విప్ర పార్వణీ సముపస్థితే

భ్రాతృభిః కారయేచ్చ్రాద్దం సాన్ని కైర్విధివద్ధిజై

క్షయా హే చైవ సంపాస్తే స్వస్యాన్నిర్దూరగో యది

తథైవ భ్రాతరస్తత్ర లౌకికాగ్నావపి స్థితాః

ఉపాసనాగ్నౌ దూరస్థే సమీ పే భ్రాతరి స్థితే

యద్యగ్నె జుహుయాద్వాపి పాణౌ వా స హి పాతకీ

ఉపాసనాగ్నౌ దూరస్థే కేచిదిచ్ఛంతి వై ద్విజాః

తచ్చైషం విప్రపాత్రేషు వికిరన్సంస్మరేద్ధరిన్

భక్ష్యర్భోజ్యైశ్చ లేహ్యేశ్చ స్వాయ్య్వెప్రాపూజయేత్

అన్నత్యాగం తతః కుర్యాదుభయత్ర సమాహితః

 ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః

యే యత్ర విహితా శ్రాద్ధే సావధానా భవంతు తే

ఇతి సంప్రార్థయేద్దేవాన్యే దేవా స ఋచాను వై

 తథా సంప్రార్ధయేద్విపాన్యే చ హేతి ఋచా పితౄన్

అమూర్తానాం చ మూర్తానాం పితృణాం దీప్తతేజసామ్

నమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షుషామ్

ఏవం పితృన్నమస్కృత్య నారాయణపరాయణః

 దత్తం హవిశ్చ తత్కర్మ విష్ణవే వినివేదయేత్

తత స్తే బ్రాహ్మణాస్సర్వే భుంజీరన్వాగ్యతా ద్విజాః

హసతే వదతే కోపి రాక్షసం తద్భవేద్దవిః

యథాచారం ప్రదేయం చ మధుమాంసాదికం తథా

 పాకాదికంచ ప్రశం సేరన్ వాగ్యతా ఘృతభోజనాః

యది పాత్రం త్యజేత్కోఽపి బ్రాహ్మణ శ్శాద్ధయోజితః

 శ్రాద్ధహంతా స విజ్ఞేయో నరకోపపద్యతే

భుంజానేషు చ విప్రేషు హ్యన్యోన్యం సంస్పృశేద్యది

తదన్నమత్యజన్భుక్త్వా గాయత్ర్యష్ఠశతం జపేత్

 భుజ్యమానేషు విప్రేషు కర్తా శ్రద్ధపరాయణః

 స్మ రేన్నారాయణం దేవమనన్తమపరాజితమ్

 రక్షోఘాద్వైష్ణవాంశ్చైవ పైతృకాంశ్చ విశేషతః

జ పేచ్చ పౌరుషం సూక్తం నాచికేతత్రయం తథ్

త్రిమధు త్రిసుపర్ణం చ పావమానం యజూంషీ చ

సామాన్యపి తథోక్తాని వదేత్పుణ్యప్రదాంస్తథా

ఇతిహాసపురాణాని ధర్మశాస్త్రాణి చైవ వా

భుంజీరన్భ్రాహ్మ ణా యావత్తావదేతాఞ్జపేద్ద్విజ

బ్రాహ్మణేషు చ భుక్తేషు వికిరం విక్షి పేత్తథా

శేషమన్నం వదెచ్చెవ మధుసూక్తం చ వై జపేత్

 స్వయం చ పాదౌ ప్రక్షాళ్య సమ్యగాచమ్య నారద

ఆచాంతేషు చ విప్రేషు పిండం నిర్వాపయేత్తతః

స్వస్తి వాచనకం కుర్యాదక్షయ్యోదకమేవ చ

దత్త్వా సమాహితః కుర్యాత్తదా విప్రాభవాదనమ్

ఆచాలయిత్వా పాత్రం తు స్వస్తి కుర్వని యే ద్విజాః

 వత్సరం పీతర స్తేషాం భవన్యుచ్ఛిష్టభోజనాః

 దాతారో నోఽభివర్థంతామిత్యాద్యైః స్మృతభాషితైః

ఆశీర్వాదో లభేత్తేభ్యో నమస్కారం చరేత్తతః

 దద్యాచ్చ దక్షిణాం శక్త్యా తాంబూలం గంధసంయుతం

న్యుబ్జపాత్రమథానీయ స్వధాకారముదీరయేత్

 వాజే వాజే ఇతి బుచా పితృన్ధేవాన్విసర్జయేత్

భోక్తా చ శ్రాద్ధకృత్తస్యాం రజన్యాం మైథునం త్యజేత్

తథా స్వాధ్యాయమధ్వానం ప్రయత్నేన పరిత్యజేత్

ఆచారనుగుణముగా హస్తమునందు కాని అగ్నియందు కాని హోమమును చేయవలయును. పొర్వణము వచ్చినపుడు ఉపాసనాగ్నిని దూరముగా నుంచరాదు. అగ్ని సంధానము చేసి హోమమును చేసి విసర్జన చేయవలయును. పార్వణ సమయమున అగ్ని దూరముగా నున్న చో సోదరులచే కాని అగ్నితో కూడియున్న ద్విజులచే కాని శ్రాద్ధమును చేయించవలయును. మృతాహదినమున తన అగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు లౌకికాగ్నితో నున్నపుడు, ఉపాసనాగ్ని దూరముగా నున్నపుడు, సోదరులు సమీపమున నున్నపుడు అగ్నిలో కాని హస్తములో కాని హోమమును చేసినచో వాడు పొతకియగును. ఉపాసనాన్ని దూరముగా నున్నపుడు అట్లు చేయవచ్చునని కొందరి మతము. హోమశేషాన్నమును శ్రీహరిని స్మరించుచు విప్రపాత్రలలో నుంచవలయును. రుచికరమైన భక్ష్యభోజ్య లేహ్యములచే విప్రులను పూజించవలయును. అపుడు విశ్వేదేవ పితృదేవతాస్థలములలో అన్నత్యాగమును చేయవలయును. “ఆగచ్ఛంతు మహాభాగా విశ్వేదేవా మహాబలాః యే యత్ర విహితా శ్రాద్దే సావధానా భవంతు తే” అను మంత్రముచే “యే దేవాస” అను ఋక్కుతో విశ్వేదేవతలను ప్రార్థించవలయును. (“మహానుభావులు మహాబలులైన విశ్వేదేవతలు ఇచటకు రండు! శ్రాద్ధమున విధించబడిన వారు కావున సావధానులు కండు” అని పై మంత్రమున కర్థము). “యే చ హో” అను ఋక్కుతో పితృదేవతలను ప్రార్థించవలయును. “అమూర్తానాం చ మూర్తానాం పితృణాం దీప్తతేజసామ్ నమస్యామి సదా తేషాం ధ్యానినాం యోగచక్షుషామ్” అను  మంత్రముచే నారాయణ స్మరణముతో పితృదేవతను ప్రార్థిచవలయును. (మూర్తిమంతులు మూర్తిరహితులు దీప్త తేజస్కులు, యోగచక్షువులు, ధ్యానరతులు అగు పితృదేవతలకు నమస్కారము” అని పై మంత్రమునకు అర్థము). దానము చేయబడిన దానిని హవిస్సును శ్రాద్ధ కర్మను శ్రీమహావిష్ణువునకు సమర్పించవలయును. అపుడు ఆ బ్రాహ్మణులందరూ మౌనముగా భోజనము చేయవలయును. నవ్వుచున్నవానికి మాటాలాడువానికి చేసిన దానము రాక్షసమగును. ఆచారానుగుణముగా మధుమాంసాదులు వడ్డించవలయును. వాజ్మయముతో ఘృతపాత్రలను చేతబట్టుకొని పాకాదులను ప్రశంసించవలయును. శ్రాద్దమున నియోగించబడిన బ్రాహ్మణుడు ఘృతపాత్రను వదిలినచో శ్రాద్దఘాతకుడై నరకమును పొందును. భోజనమును చేయుచున్న విప్రులు ఒకరినొకరు తొకినచో ఆ అన్నము విడువక భుజించి ఎనిమిదివందలు గాయత్రీ జపములను . చేయవలయును. విప్రులు భోజనము చేయుచుండగా కర్త శ్రద్ధతో అనంతుడు అపరాజితుడు అగు నారాయణుని స్మరించువలయును. రక్షోఘ్నలగు వైష్ణవులను, విశేషించి పితృదేవతలను స్మరించవలయును. పురుషసూక్తమును సాచి కేతోపాఖ్యానమును, మధుసూక్తమును, సుపర్ల సూక్తమును పవమానసూక్తమును, యజుర్వేద మంత్రములను సామవేదమంత్రములను పుణ్యప్రదములగు ఇతిహాస పురాణములను ధర్మ శాస్త్రములను బ్రాహ్మణ భోజనము జరుగువరకు జపించవలయును. బ్రాహ్మణుల భోజనము జరిగిన తరువాత వికిరాన్నమును చల్లవలయును. శేషాన్నమును భుజించవలయును. ప్రార్థించి మధుసూక్తమును పఠించవలయును. కర్త పొదప్రక్షాళనమును చేసుకొని చక్కగా ఆచమనము చేసి, బ్రాహ్మణవచనము తరువాత పిండదానమును చేయవలయును. స్వస్తివాచనమును అక్షయోదకమును చేయవలయును. తరువాత సావధానుడై విప్రులకు ఆభివాదనము చేయవలయును, పాత్ర చాలనము చేయకనే స్వస్తి వాచనము చేసినచో వారి పితరులు ఒక సంవత్సరము ఉచ్చిష్ణ బోజనము చేతురు. “దాతారో నోభివర్థంతాం” ఇత్యాది స్మృతివచనములచే బ్రాహ్మణులనుండి ఆశీర్వాదమును పొందవలయును. తరువాత న్యుబ్దపాత్రను తీసుకొని పితృదేవతలను విసర్జించవలయును. శ్రాద్ధకర్త, భోక్త ఇరువురు ఆ రాత్రి స్త్రీ సంగమమును చేయరాదు. స్వాధ్యాయమును, ప్రయాణమును చేయరాదు.

అధ్వగశ్చాతురశ్చైవ విహీనశ్చధనై స్తదా

ఆమశ్రాద్ధం ప్రకుర్వీత హేమ్నావా స్పృశ్య భార్యకః

ద్రవ్యాభావే ద్విజాభావే హ్యనమాత్రం తు పాచయేత్

పైతృకేన తు సూక్తేన హోమం కుర్యాద్విచక్షణ

 అత్యన్తహవ్యశూన్య శ్చత్త్వశక్త్యా తు తృణం గవామ్

స్నాత్వా చ విధివద్వీప కుర్యాదా తిలతర్పణమ్

అథవా రోదనం కుర్యాదత్యుచ్చైర్విజనే వనే

దరిద్రోఽహం మహాపాపీ వదన్నితి విచక్షణ

పరేద్యుశ్శాద్ధకృన్మర్త్యో యో న తర్పయతే పితృన్

తత్కులం సౌశమాయతి బ్రహ్మహత్యాం చ విందతి

శ్రాద్ధం కుర్వన్తి యే మర్త్యా శ్రద్ధావంతో మునీశ్వరా !

న తేషాం సంతతిచ్ఛేదస్సంపన్నా స్తే భవంతి చ

పితృన్యజంతి యే శ్రాద్ధే తైస్తు విష్ణు పూజితః

తస్మింస్తు ష్టే జగన్నాథే సర్వాస్తుష్యంతి దేవతాః

పితరో దేవతాశ్చైవ గంధర్వాప్సరసం స్తధా

యక్షాశ్చ సిద్దా మనుజా హరి రేవ సనాతనః

 యేనేదమఖిలం జాతం జగత్థ్సావరజంగమమ్

తస్మాద్దాతా చ భోక్తా చ సర్వం విష్ణుస్సనాతనః

యదస్తి విప్ర యన్నాస్తి దృశ్యం చాదృశ్యమేవ చ

 సర్వం విష్ణుమయం జ్ఞేయం తస్మాదన్యన్న విద్యతే

ఆధారభూతో జ్ఞేయం తస్మాదన్యన్న విద్యతే

 అనౌపమ్యస్వభావశ్చ భగవాన్హవ్యకవ్యభుక్

 పరబ్రహ్మాభిధేయో య ఏకేవ జనార్దనః

కర్తా కారయితా చైవ సర్వం విష్ణుసనాతనః

ఇత్యేవం తే మునిశ్రేష్ఠ శ్రాద్ధస్య విధిరుత్తమః

 కథితః కుర్వతామేవం పాపం సద్యో విలీయతే

య ఇదం పఠతే భక్త్యా శ్రాద్ధకాలే ద్విజోత్తమః

పితరస్తస్య తుష్యంతి సంతతిశ్చైవ వర్థతే

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే  ప్రథమపాదే శ్రాద్ధక్రియావర్ణనం నామ అష్టావింశోఽధ్యాయః

 ప్రయాణము చేయుచు దారిలో నున్నవాడు, రోగాది పీడితుడు, ధన హీనుడు ఆమశ్రాద్దమును చేయవలయును, భార్య ఋతుమతిగా ఉన్నవాడు బంగారముతో శ్రాద్ధము చేయవలయును. ద్రవ్యములు, విప్రులు లేని పక్షమున అన్నమును మూత్రము వండించి పితృసూక్తముచే హోమమును చేయవలయును. పూర్తిగా వండుట కే పదార్థములు లేనివాడైనచో తన శక్తికొలది గోవులకు తృణమునీయవలయును. లేదా స్నానము చేసి యథావిధిగా తిలతర్పణము చేయవలయును, ఏమీ లేనివాడైనచో నిర్జనారణ్యమునకు వెళ్ళీ నేను పరమదరిద్రుడను మహాపాపీని అని పలుకుచు పెద్దగా రోదించవలయును. శ్రాద్ధ కర్త రెండవదినమున పితృతర్పణమును చేయనిచో ఆ కులము నశి¢చును, బ్రహ్మహత్యాపాపమును పొందును. శ్రద్దతో శ్రాద్దమును చేయు మానవులకు సంతతి చ్చేదము జరగదు. సంపన్నులగుదురు. శ్రాద్దమున పితృదేవలను పూజించినచో శ్రీహరియే పూజించబడును. శ్రీహరి సంతోషించినచో దేవతలందరూ సంతోషింతురు. పితరులు, దేవతలు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, సిద్దులు మనుజులు హరి స్వరూపులే. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతయు శ్రీహరి వలననే పుట్టినది. కావున కర్త భోక్త శ్రీహరియే ఈ జగమున ఉన్నదిలేని, కనపడునది కనపడనిది అంతా విష్ణుమయముగా తెలియును. విష్ణువు కంటే ఇతరమైనదేదియు లేదు. ఈ ప్రపంచమునకు ఆధారభూతుడు, సర్వభూతాత్మకుడు, ఆవ్యయుడు సాటిలేని స్వభావము కలవాడు హవ్య కవ్య భోక్త భగవానుడే. పరబ్రహ్మ ధేయుడైనవాడు జనార్దను డొక్కడే కర్త కారయిత అంతా సనాతనుడగు శ్రీమహావిష్ణువే. ఓ మునిశ్రేష్టా ! ఇట్లు ఉత్తమశ్రాద్ధ విధి చెప్పబడినది. ఇట్లు చేసిన వారి పాపము నశించును. శ్రాద్ధకాలమున ఈ ఉత్తమ విధిని పఠించినచో వారి పితరులు సంతోషించెదరు. సంతతి వృద్ధి చెందును.

ఇది శ్రీ బృహాన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున శ్రాద్ధక్రియా వర్ణనమను ఇరువదియెనిమిదివ అధ్యాయము సమాప్తము.