30 - ప్రాయశ్చిత్తవిధిః

సనక ఉవాచ :-

ప్రాయశ్చిత్తవిధిం వక్ష్యే శృణు నారద సాంప్రతమ్

ప్రాయశ్చిత్తవిశుద్ధాత్మా సర్వకామఫలం లభేత్

ప్రాయశ్చిత్తవిహీస్తు యత్కర్మ క్రియతే మునే

తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం రాక్షసైః పరి సేవితమ్

కామక్రోధవిహీనైశ్చ ధర్మశాస్త్రవిశారదైః

ప్రష్టవ్యా బ్రాహ్మణా ధర్మం సర్వధర్మఫలేచ్ఛుభిః

ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణరాజ్ముఖైః

న నిష్పునన్తి విప్రేన్ద్ర సురాభాండమివాపరాః

బ్రహ్మహా చ సురాపీ చ స్తేయీ చ గురుతల్పగః

 మహాపాతకినస్త్వేతే తత్సంసర్గీ చ పంచమః

 యస్తు సంవత్సరం హ్యేతైశ్శయనాసనభోజనైః

సంవ సేత్సహ తం విద్యాత్పతితం సర్వకర్మసు

అజ్ఞానాద్భ్రాహ్మణం హత్వా చీరవాసా జటీ భవేత్

స్వేనైవ హతవిప్రస్య కపాలమపి ధారయేత్

తదభావే మునిశ్రేష్ఠ కపాలం వాన్యమేవ వా

తర్ద్రవ్యం ధ్వజదండే తు ధృత్వా వనచరో భవేత్

వన్యాహారో వ సేత్తత్ర వారమేకం మితాశనః

సమ్యక్సంధ్యాముపాసీత త్రికాలం స్నానమాచరేత్ అధ్యయనాధ్యాపనాదీశ్వర్జయేత్సంస్మరేద్ధరిమ్

బ్రహ్మచారీ భవేన్నిత్యం గంధామాల్యాది వర్జయేత్

 తీర్థాన్యనున సేచ్చైవ పుణ్యాం శ్చైవాశ్రమంస్తథా

యది వన్యైర్న జీవేత గ్రామే భిక్షాం సమాచరేత్

ద్వాదశాబ్దం వ్రతం కుర్యాదేవం హరిపరాయణః

బ్రహ్మహా శుద్ధిమాప్నోతి కర్మార్హశ్చైవ జాయతే

 వ్రతమధ్యే మృగైర్వాపి రోగైర్వాపి నిషూదితః

గోనిమిత్తం ద్విజార్థం వా ప్రాణాన్యపి పరిత్యజేత్

 యద్వా దద్యాద్ద్విజేన్ద్రాణాం గవామయుతముత్తమమ్

ఏతేషన్యతమం కృత్వా బ్రహ్మహా శుద్ధిమాప్నుయాత్

దీక్షితం క్షత్తియం హత్వా చరేద్ది బ్రహ్మ హవ్రతమ్

అగ్నిప్రవేశనం వాపి మరుత్ప్రపతనం తథా

 దీక్షితం బ్రాహ్మణం హత్వా ద్విగుణం వ్రతమాచరేత్

 ఆచార్యాదివధే చైవ వ్రతముక్తం చతుర్గుణమ్

 హత్వా తు విప్రమాత్రం చ చరేత్సంవత్సరం వ్రతమ్

 ఏవం విప్రస్య గదితః ప్రాయశ్చిత్తవిధిర్ద్విజ

 ద్విగుణం క్షత్రియస్యోక్తం త్రిగుణం తు విశస్స్మృతమ్

 బ్రాహ్మణం హంతి యశ్శూద్రస్తం ముశల్యం విదుర్బుధాః

 రాజ్ఞైవ శిక్షా కర్తవ్యా ఇతి శాస్త్రేషు నిశ్చయః

 బ్రాహ్మణీనాం వధే త్వర్ధం పాదస్యాత్కన్యకావధే

హత్వా త్వనుపనీతాంశ్చ తథా పాదవ్రతం చరేత్

హత్వా తు క్షత్రియం విప్రః షడబ్ధం కృచ్చ్రమాచరేత్

సంవత్సరత్రయం వైశ్యం శూద్రం హత్వా తు వత్సరమ్

 దీక్షితస్య స్త్రీయం హత్వా బ్రాహ్మణీం చాష్టవత్సరాన్

బ్రహ్మహత్యావ్రతం కృత్వా శుద్దో భవతి నిశ్చితమ్

ప్రాయశ్చిత్తం విధానం తు సర్వత్ర మునిసత్తమ

 వృద్ధాతురస్త్రీబాలానామర్థముక్తం మనీషిభిః

సనకమహర్షి పలికెను :- ఓ నారదా! ఇపుడు ప్రాయశ్చిత విధిని చెప్పెదను వినుము. ప్రాయశ్చిత్తముతో శుద్ధిపొందినవాడు సర్వకర్మఫలములను పొందును. ప్రాయశ్చిత్తము నాచరించనివారు చేసిన కర్మలన్నీ నిష్పలములై రాక్షసములగును. కామక్రోధములను పరిత్యజించినవారు ధర్మశాస్త్రవిశారదులు సర్వధర్మఫలమును పొందగోరినవారు బ్రాహ్మణులను ధర్మమునడిగి తెలుసుకొనవలయును. శ్రీమన్నారాయణునకు పరాజ్ముఖులై ప్రాయశ్చిత్తము లాచరించిననూ సురాభాండమును నదులు పవిత్రములను చేయలేనట్లు పవిత్రులను చేయజాలవు. బ్రాహ్మణుని చంపినవాడు, సురాపానము చేసినవాడు, చౌర్యమును చేయువాడు, గురుతల్పగతుడు ఈ నలుగు మహాపాతకులు. వీరితో కలిసియుండువోడు అయిదవ మహాపాపి. ఈ నలుగురితో కలిసి శయనాసన భోజనాదులతో ఒక సంవత్సరము కలిసున్నవాడు సర్వకర్మ భ్రష్టుడగును. తెలియక బ్రాహ్మణుని చంపినవాడు నారబట్టలను జటను ధరించి తాను చంపిన బ్రాహ్మణుని కపొలమును చేతిలో ధరించవలయును. ఆ కపాలము లభించనచో ఇంకొక కపొలమును ధరించవలయును. ధ్వజాగ్రమున కపాలమును ధరించి వనచరుడు కావలయును. మితముగా వన్యాహారమును భుజించుచు వనములో ఒకవారముండవలయును. మూడువేళలలో స్నానము చేసి సంధ్యావందనము నాచరించవలయును. గంధమాల్యాది ధారణమును పరిత్యజించి బ్రహ్మ చారి కావలయును. పుణ్యతీర్థములను పుణ్యాశ్రమములను సేవించవలయును. వన్యాహారమునచే జీవించలేనియెడల గ్రామమున భిక్షాటన చేయవలయును. ఇట్లు శ్రీహరిని స్మరించుచు పన్నెండు సంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. ఇట్లు చేసినచో బ్రాహ్మణఘాతకుడు శుద్ధిని పొంది సర్వకర్మార్హుడగును. వ్రతమధ్యమున మృగములచే కానీ రోగములచే గాని మరణించిననూ గోరక్షకై ద్విజరక్షకై ప్రాణత్యాగమును చేసిననూ, బ్రాహ్మణులకు పది వేల గోవులను దానము చేసిననూ బ్రహ్మ ఘాతకుడు శుద్ధిని పొందును.  దీక్షితుడగు క్షత్రియుని వధించినను బ్రహ్మహత్యావ్రతమును ఆచరించవలయును. అగ్నిప్రవేశనము కాని వారు ప్రపాతమును కాని చేయవలయును. దీక్షితుడగు బ్రాహ్మణుని చంపినచో రెట్టింపు వ్రతము నాచరించవలయును. ఆచార్యాదివధను జరిపినచో నాలుగింతలు వ్రతమును చేయవలయును. సామాన్య బ్రాహ్మణుని వధించినచో సంవత్సరము వ్రతము నాచరించవలయును. ఇది బ్రాహ్మణునకు చెప్పబడిన ప్రాయశ్చిత్త విధి. క్షత్రియునకు రెట్టింపు, వైశ్యునకు మూడింతలు ప్రాయశ్చిత్తము జరుపబడును. బ్రాహ్మణుని వధించిన శూద్రుని ముశల్యుడందురు. అట్టివానికి రాజే శిక్ష విధించవలయునని శాస్త్ర నిర్ణయము. బ్రాహ్మణ స్త్రీని వధించినచో సగము ప్రాయశ్చిత్తమును, బ్రాహ్మణ కన్యను వధించినచో నాలుగవ భాగము ప్రాయశ్చిత్తము నాచరించవలయును. ఉపనయనము కాని వానిని వధించిననూ పాదప్రాయశ్చిత్తము నాచరించవలయును. వైశ్యుని చంపినచో మూడు సంవత్సరములు, శూద్రుని వధించినచో ఒక సంవత్సరము కచవ్రతము నాచరించవలయును. దీక్షితుడు బ్రాహ్మణుని భార్యను వధించినచో ఎనిమిది సంవత్సరములు కృచ్ఛవ్రతము నాచరించవలయును. లేదా బ్రహ్మహత్యా వ్రతమును చేసి నిశ్చయముగా శుద్ధిని పొందును. వృద్దులకు రోగార్తులకు, స్త్రీలకు, బాలురకు ఆర్థప్రాయశ్చిత్తము విధించబడినది.

గౌడీ పైష్టీ చ మాధ్వీ చ విజ్ఞేయా త్రివిధా సురా చాతుర్వర్ణ్యైర పేయా స్యాత్తథా స్త్రీభిశ్చ నారద! 

క్షీరం ఘృతం వా గోమూత్రమేతేష్వన్యతమం మునే స్నాత్వార్ధ్రవాసా నియతో నారాయణమనుస్మరన్

పక్వాయసనిభం కృత్వా పిబేచ్చైవోదకం తతః తత్తు హేన పాత్రేణ హ్యాయ సేనాథవా పిబేత్తామ్రేణ పాథపాత్రేణ తత్పత్వా మరణం వ్రజేత్

సురాపీ శుద్ధిమాప్నోతి నాన్యథా శుద్ధిరీష్యతే

ఆజ్ఞానాదాత్మబుద్ధ్యా తు సురాం పీత్వా ద్విజశ్చరేత్ బ్రహ్మహత్యావ్రతం సమ్యక్త చిహ్నపరివర్జితః

యది రోగనివృత్త్యర్థం ఔషధార్ధం సురాం పిబేత్ తస్యోపనయనం భూయస్తథా చాంద్రాయణద్వయమ్

సురాసంస్పష్టపాత్రం తు సురాభాండోదకం తథా సురాపానసమం ప్రాహుస్తథా చంద్రస్య భక్షణమ్

తాలం చ పానసం చైవ ద్రాక్షం ఖార్జురసంభవమ్ మాధూక శైలమారిష్టం మైరేయం కాలి కేరజమ్

గౌడీ మాధ్వీ సురా మద్యమేవమేకాదస్మృతాః ఏతేష్వన్యతమం విప్రో న పిబేద్వై కదాచన ఏతేష్వన్యతమం యస్తు పిబేదజ్ఞానతో ద్విజః తప్యోనయనం భూయస్తప్తకృచ్ఛం చరేత్తథా

గుడముచే చేయబడినది, పిష్టముచే చేయబడినది, ఇప్పపూవుచే చేయబడినది అను సురా మూడు విధములు. ఇట్టి సురను చాతుర్వర్ణ్యముల వారు స్త్రీలు ఎవ్వరూ పొనము చేయరాదు. ఒకవేళ పానము చేసినచో స్నానముచేసి తడి బట్టలను ధరించి నియమముతో నారాయణ నామమును స్మరించి పాలను కాని, నేతిని కాని గోమూత్రమును. కాని కాచిన ఉక్కువలె కాచి త్రాగి తరువాత నీరు త్రాగవలయును. లోహపాత్రతో కాని ఇనుముపాత్రతో కాని రాగి పాత్రతో కాని త్రాగవలయును. అట్లు త్రాగినచో మరణించును. సురాపానము చేసినవాడు మరణముతో శుద్ధిపొందును. మరియొక మార్గము లేదు. తెలియక కాని తెలిసికొని ద్విజుడు సురాపానము చేసినచో ప్రాయశ్చిత్తము నాచరించవలయును. చిహ్నములను మాత్రమే ధరించక బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును, రోగ నివృత్తికి ఔషధముగా సురాపానము చేసినచో అతనికి మరల ఉపనయనము చేయవలయును. అట్లే రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. సుర తాకిన పాత్రను తాకిననూ, సురాభాండముతో జలము సేవించిననూ సురాపానముతో సమానమే, తాలము, పానసము, ద్రాక్ష, ఖార్జూరము, మాధూకము, శైలమారిష్టము, మైరేయం. నాలికేరజము, గౌడి, మాధ్వీ, సుర అని మద్యము పదకొండు విధములు. వీటిలో దేనినీ విప్రుడు సేవించరాదు. ఒకవేళ సేవించినచో మరల ఉపనయనము చేసీ తప్తకృచ్ఛ్ర వ్రతము నాచరించవలయును.

సమక్షం వా పరోక్షం వా బలాచ్చౌర్యేణ వా తథా

 పరస్వానాముపాదానం స్తేయమిత్యుచ్యతే బుధైః

 సువర్ణస్య ప్రమాణం తు మన్వాద్యేః పరిభాషితమ్

వక్ష్యే శృణుష్వ విప్రేన్ద్ర ప్రాయశ్చిత్తోక్తిసాధనమ్

గవాక్షగతమార్తాండరశ్మిమధ్యే ప్రదృశ్యతే

త్రసరేణు ప్రమాణం తు రజ ఇత్యుచ్యతే బుదైః

త్రసరేణ్వష్టకం నిష్కస్తత్త్రయం రాజసర్షపః

గౌరసర్షపస్తత్త్రయం స్యాత్తర్షట్కం యవ ఉచ్యతే

 యవత్రయం కృష్ణలస్యాన్మాషస్తత్పంచకం స్మృతః

 మాషషోడశమానం స్యాత్సువర్ణమితి నారద

హృత్వా బ్రహ్మ స్వమజ్ఞానాద్ద్వాదశాబ్దం తు పూర్వవత్

 కపాలధ్వజహీనం తు బ్రహ్మహత్యావ్రతం చరేత్

గురూణాం యజ్ఞకర్తౄణాం ధర్మిష్టానాం తథైవ చ

శ్రోత్రియాణాం ద్విజానాం తు హృత్వా హేమైవమాచరేత్

కృతానుతాపం దేహేహో చ సంపూర్ణే లేపయేత్ ఘృతమ్

 కరీషచ్ఛాదితో దగ్ధస్స్తేయ పాపాద్విముచ్యతే

 బ్రహ్మ స్వం క్షత్రియో హృత్వా పశ్చాత్తాపమవాప్య చ

పునన్దదాతి తత్రైవ తద్విధానం శృణుష్వ మే

 తత్ర సంతాపనం కృత్వా ద్వాదశాహోపవాసతః

శుద్ధిమాప్నోతి దేవర్షే హ్యన్యథా పతితో భవేత్

 రత్నాసనమనుష్య స్త్రీధనుభూమ్యాది కేషు చ

సువర్ణసదృశే ష్వేషు ప్రాయశ్చితార్ధముచ్యతే

త్రసరేణుసమం హేమ హృత్వా కుర్యాత్సమాహితః

ప్రాణాయామద్వయం సమ్యక్ తేన శుద్ధ్యతి మానవః

ప్రాణాయామత్రయం కుర్యాద్ధృత్వా నిష్కప్రమాణకమ్

 ప్రాణాయామాశ్చ చత్వారో రాజసర్షపమాత్రకే

గౌరపర్షపమానం తు హృత్వా హేమవిచక్షణః

 స్నాత్వా చ విధివజ్జప్యాద్గాయత్ర్యష్టసహస్రకమ్

యవమాత్రసువర్ణస్య స్తేయాచ్చుద్ధో భవేద్ద్విజః

 ఆసాయం ప్రాతరారభ్య జప్త్యా వై వేదమాతరమ్

 హేమకృష్ణలమాత్రం తు హృత్వా సాంతపనం చరేత్

 మాషప్రమాణే హేమ్నస్తు ప్రాయశ్చిత్తం విద్యతే

గోమూత్రపక్వయవభగ్వర్షేణేకేన శుద్ధ్యతి

 సంపూర్ణస్య సువర్ణస్య స్త్యం కృత్వా మునీశ్వర

బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్ద్వాదశాబ్దం సమాహితః

 సువర్ణమానాన్న్యూనే తు రజత స్తేయ కర్మణి

కుర్యాత్సంతాపనం సమ్యగన్యథా పతితో భవేత్

 దశనిష్కాంతపర్యంతమూర్ధ్వం నిష్క చతుష్టయాత్

 హృత్వా చ రజతం విద్వాన్కుర్యా చాంద్రాయణం మునే

దశాదిశతనిష్కాంతం స్తేయీ రజతస్య తు

 చాంద్రాయణద్వయం తస్య ప్రోక్తం పాపవిశోధకమ్

శతాదూర్ధ్వం సహస్రాన్తం ప్రోక్తం చాంద్రాయణత్రయమ్

సహస్రావధిక స్తేయే బ్రహ్మహత్యావ్రతం చరేత్

 కాంస్య పిత్తలముఖ్యేషు హ్యయస్కాంతే తథైవ చ

 సహస్రనిష్కమానే తు పరాకం పరికీర్తితమ్

 ప్రాయశ్చితం తు రత్నానాం  స్తేయే రాజతవత్స్మృతమ్

చూచుచుండగా కాని, చూడకుండా కాని, బలప్రయోగముతో కాని, చౌర్యముతో కాని ఇతరుల వస్తువులను స్వీకరించుట స్తేయమనబడును. సువర్ణ ప్రమాణము మన్వాదులచే నిశ్చయించబడినది. స్త్యమునకు ప్రాయశ్చిత్త విధానము చెప్పెదను వినుము. గవాక్షమార్గమున ప్రసరించు సూర్య కిరణముల మధ్యన కనపడు సూక్ష్మతమాకారమగు దుమ్ములోని ఒక  కణము త్రిసరేణు ప్రమాణముగా నిర్ణయించబడినది. ఎనిమిది త్రసరేణువు నిష్కమగును. మూడు నిష్కములు రాజసర్షపమగును. మూడు రాజసర్షపములు ఒక గౌరసర్షపమగును. ఆరు గౌరుసర్షములు యవమగును. మూడు నిష్కములు రాజ సర్షపమగును. ఆరు గౌరసర్షపములు యవమగును. మూడు యవలు కృష్ణలమగును. అయిదు కృష్ణలములు మాషమనబడును.పదునాఱుమాషములు సువర్ణమగును. తెలియక బ్రాహ్మణ ధనమునపహరించినచో పూర్వమువలె పన్నెండు సంవత్సరములు కపాలధ్వజరహితముగా బ్రహ్మ హత్యావ్రతము నాచరించవలయును, గురువుల, యజ్ఞకర్తల. ధర్మిష్ణుల శ్రోత్రియుల ద్విజులు బంగారమును హరించినచో నేతిని బాగుగా కాచి శరీరమునిండా లేపనమును చేయవలయును. కరీషములో ఆచ్చాదన చేయబడి దగ్గుడైనచో సేయపాపమునుండి విముక్తుడగును. క్షత్రియుడు బ్రాహ్మణ ధనమును హరించినచో పశ్చాత్తాపమును చెంది మరల వారికే ఇచ్చివేసి పన్నెండు దినములు ఉపవాసముచేసి సాంతాపన వ్రతము నాచరించవలయును. అపుడు ముకుడగును. అటు చేయనిచో పతితుడగును. రతాసన మనుష్య , భూమి, ధేనువులు, మొదలగువి సువరసమములు. వీటిని హరించినచో అర్ధప్రాయశ్చిత్తము నాచరించవలయును. త్రసరేణు పరిమితమైన బంగారమును అపహరించినచో సావధానమనస్కుడై రెండుమార్లు ప్రాణాయామము నాచరించవలయును. నిష్కపరిమితమగు బంగారమును హరించిన ప్రాణాయామత్రయమును, రాజసక్తపమాత్రమును హరించిన నాలుగు ప్రాణాయామములను ఆచరించినచో శుద్ధిపొందును. గౌరసరపరిమిత బంగారమును హరించినచో స్నానమాచరించి యథావిధిగా ఎనిమిదివేలు గాయత్రి జపము నోచరించవలయును. యవమాత్రకవచనమునపహరించినచో ప్రాతఃకాలమునుండి సాయంకాలము వఱకు గాయత్రీజపము నాచరించి శుద్ధిపొందును. కృష్ణలమాత్ర హేమాపహరణమును గావించినచో సాంతపనవ్రతము నాచరించవలయును. మాషప్రమాణ హేమపహారణము గావించినచో ఒకసంవత్సరము గోమాత్రములో పక్వము గావించబడిన యవలను భుజించి శుద్ధిపొందును. సువర్ణపరిమిత హేమపహరణము గావించినవారు పన్నెండు సంవత్సరములు సావధాన మనస్కుడై బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. సువర్ణపరిమాణము కంటే తక్కువ రజతము నపహరించినచో సాంతపన వ్రతము నాచరించవలయును. లేనిచో పతితుడగను. నాలుగు నిష్కములనుండి పది నిషముల వరకు రజతాపహరణమును గావించినచో చాంద్రాయణ వ్రతము నాచరించవలయును. పదీనుండి నూరు నిష్కములవరకు రజతమును అపహరించినచో రెండు చాంద్రాయణ వ్రతముల నాచరించి శుద్ధిపొందును. నూరునుండి వేయి నిషముల వరకు రజాపహరణమునకు మూడు చాంద్రాయణము లాచరించవలయును. వేయినిష్కముల కన్నా అధికము రజతమును అపహరించినచో బ్రహ్మ హత్యవ్రతము నాచరించవలయును. కంచు ఇత్తడి అయస్కాంతము మొదలగువాటిని వేయినిష్కముల నపహరించినచో పరాకవ్రతమునాచరించవలయును. రత్నాపహరణమునకు రజతాపహరణము వలెనే ప్రాయశ్చిత్తము నాచరించవలయును.

గురుతల్పగతానాం చ ప్రాయశ్చితముదీర్యతే

ఆజ్ఞానాన్మాతరం గత్వా తత్సపత్నీమథాపి వా

 స్వయమేవ స్వముష్కం తు ఛింద్యాత్పాపముదీరయన్

హస్తే గృహీత్వా ముష్కం తు గచ్ఛన్త్వై నైరుతిం దిశమ్

 గచ్ఛన్మార్గే సుఖం దుఃఖం న కదాచద్విచారయేత్

 అపశ్యన్గచ్ఛతో గచ్చేత్ప్రాణాన్తం యస్స శుధ్యతి

 మరుత్ప్రపతనం వాపి కుర్యాతాపముహరన్

స్వవర్ణోత్తమవర్ణస్త్రీగమనే త్వవిచారతః

బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్ద్వాదశాబ్దం సమాహితః

ఆమత్యాభ్యాసతో గచ్ఛేత్సవర్ణాం చోత్తమాం తథా

కారీషవహ్నినా దగ్ధశ్శుద్ధిం యాతి ద్విజోత్తమ

రేత స్సేకాత్పూర్వమేవ నివృత్తో యది మాతరి

 బ్రహ్మ హత్యావ్రతం కుర్యాద్రేతస్సేకేఽగ్నిదాహనమ్

సవర్ణోత్తమవర్ణాత్తు నివృత్తే వీర్య సేచనాత్

బ్రహ్మహత్యావ్రతం కుర్యాన్నవాబ్దాన్ విష్ణుతత్పరః

వైశ్యాయాం పితృపత్యాం తు షడబ్దం వ్రతమాచరేత్

 గత్వా శూద్రాం గురోర్భార్యాం త్రివర్షం వ్రతమాచరేత్

 మాతృష్వసారం పితృష్వసారం ఆచార్యభార్యాం శ్వశురస్య పత్నీం

పితృవ్యభార్యమథ మాతులానీం పుత్రీం చ గచ్ఛేద్యది కామముగ్ధః

 దీనద్వయే బ్రహ్మహత్యావ్రతం కుర్యాద్యథావిధి

ఏకస్మిన్నేవ దివ సే బహువారం త్రివార్షికమ్

ఏకవారం గతే హ్యబ్దం వ్రతం కృత్వా విశుద్ధ్యతి

దినత్రయే గతే వహ్నిదగ్ధశ్శుద్ధ్యేత నాన్యథా

 చాండాలీం పుష్క సీం చైవ సుషాం చ భగినీం తథా

మిత్రస్త్రియం శిష్యపత్నీం యస్తు వై కామతో ప్రజేత్

బ్రహ్మ హత్యావ్రతం కుర్యాత్సషడబ్దం మునీశ్వర

అకామతో ప్రజేద్యస్తు సోఽబ్దకృచ్ఛ్రం సమాచరేత్

గురుతల్పగతులకు ప్రాయశ్చిత్తమును వివరించెదను. తెలియక తల్లినిగాని, తల్లి సవతిని గాని సంగమించినచో తాను చేసిన పాపమును చెప్పుచు తానే తన వృషణమును ఛేదించుకొనవలయును. చేతిలో వృషణమును పట్టుకోని నైరుతీ దిశకు వెళ్ళుచు మార్గమధ్యమున సంభవించు సుఖదుఃఖములను విచారించక ప్రాణము వదలు వరకు చూడకనే వేళ్ళవలయును. అపుడు శుద్ధిపొందును. చేసిన పాపమును చాటుకొనుచు సుడిగాలిలో పడవలయును. విచారించక తన వర్ణముకంటే ఉత్తమ వర్ల స్త్రీని సంగమించినచో సావధానమనస్కుడై పన్నెండు సంవత్సరములు బ్రహ్మహత్యావ్రతము నాచరించవలయును. విచారించక ఆభ్యాసముచే సవర్ణ స్త్రీని కాని ఉత్తమ స్త్రీని కొని సంగమించినచో పిడకనిప్పుతో దగ్గమై శుద్ధిని పొందును. మాతృసంగమున రేత స్సేకము కంటే ముందే నివృత్తుడైనచో బ్రహ్మ హత్యావ్రతము నాచరించవలయును. సవర్ణ స్త్రీ విషయమున ఉత్తమవర్ణ స్త్రీవిషయమున రేత స్సేకము గావించకనే నివృత్తుడైనచో విష్ణుతత్పరుడై తొమ్మిదివత్సరములు బ్రహ్మహత్యావ్రతము నోచరించవలయును. తండ్రి భార్యయగు వైశ్య స్త్రీ సంగమును గావించిచో ఆరు సంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. తండ్రి భార్యయగు శూద్ర స్త్రీని సంగమించినచో మూడు సంవత్సరములు వ్రతము నాచరించవలయును. పినతల్లిని, మేనత్తను, ఆచార్య భార్యను, మామ భార్యను, పినతండ్రి భార్యను, మేనమామ భార్యను, పుత్రికను కామమోహితుడై దీనద్వయము సంగమించినచో యథావిధిగా బ్రహ్మ హత్య వ్రతము నాచరించవలయును. ఒకేదినమున పలుమార్లు సంగమించినచో మూడువరములు బ్రహ్మహత్యవ్రతము నాచరించవలయును. ఒకమారు సంగమించినచో ఒక సంవత్సరము వ్రతము నాచరించవలయును. మూడు దినములు సంగమించినచో వహ్నిదగ్గుడైననే శుద్ధిపొందును. చండాలస్త్రీని, పుష్కస స్త్రీని, కోడలును, సోదరిని, మిత్రుని భార్యను, శిష్యుని భార్యను కామముతో సంగమించినచో ఆరుసంవత్సరములు బ్రహ్మ హత్యా వ్రతము నాచరించవలయును. కామము లేకనే సంగమించినచో ఒక సంవత్సరము కృచ్ఛవ్రతము నాచరించవలయును.

మహాపాతకిసంపర్గే ప్రాయశ్చిత్తం నిగద్యతే ప్రాయశ్చిత్తవిశుద్దాత్మా సర్వకర్మఫలం లభేత్

యస్య యేన భవేత్సంగో బ్రహ్మహాదిచతుర్ష్వపి తత్తద్ర్వతం స నిర్వర్త్య శుద్దిమాప్నోత్యసంశయమ్

ఆజ్ఞానాత్పంచరాత్రం తు సంగమేభిః కరోతి యః కాయకృచ్చ్రం చరేత్సమ్యగన్యథా పతితో భవేత్

ద్వాదశా హేతు సంసర్గే మహాసాంతపనం స్మృతమ్ సంగం కృత్వార్ధమాసం తు ద్వాదశాహముపావ సేత్

పరాకో మాససంసర్గే చాంద్రమాసత్రయే స్మృతమ్ కృత్వా సంగం తు షణ్మాసం చరేచ్చాంద్రాయణద్వయమ్

 కించిన్న్యూనాబ్దసంగే తు షణ్మాసవ్రతమాచరేత్ ఏతచ్చ త్రిగుణం ప్రోక్తం జ్ఞానాత్సంగే యథాక్రమమ్

మండూకం నకులం కాకం వరాహం మూషకం తథా మార్జారాజావికం శ్వానం హత్వా కుక్కుటకం తథా

కృచ్చ్రార్ధమాచరేద్విప్రోతికృచం చాశ్వహా చరేత్ తప్త కృచ్చ్రం కరివ పరాకం గోవధే స్మృతమ్

కామతో గోవధం నైవ శుద్ధిర్ఘృష్టా మనీషిభిః పానశయ్యాసనాద్యేషు పుష్పమూలఫలేషు చ

భక్ష్యభోజ్యాపహారేషు పంచగవ్యవిశోధనమ్ శుష్క కాష్ఠతృణానాం చ ద్రుమాణాం చ గుడస్య చ

చర్మవస్త్రామిషాణాం చ త్రిరాత్రం స్యాదభోజనమ్ టిట్టిభం చక్రవాకం చ హంసం కారండవం తథా

 ఉలూకం సారసం చైవ కపోతం జలపాదకమ్ శుకం చాషం బలాకం శిశుమారగం చ కచ్ఛపమ్

ఏతేష్వన్యతమం హత్వా ద్వాదశాహమభోజనమ్ ప్రాజపత్యవ్రతం కుర్వాద్రేతో విణ్మూత్రభోజనే

 చాంద్రాయణత్రయం ప్రోక్తం శూద్రోచ్ఛిష్టస్య భోజనే రజస్వలాం చ చాండాలం మహాపాతకీనం తథా

 సూతికాం పతితం చైవ ఉచ్ఛిష్టం రజకాదికమ్ స్పృష్ట్వా సచేలం స్నాత ఘృతం సంప్రాశయేత్తథా

 గాయత్రీం చ విశుద్దాత్మా జు పేదష్టశతం ద్విజ ఏతేష్వన్యతమం స్పృష్ట్వా అజ్ఞానాద్యది భోజనే

త్రిరాత్రోపోషణాచ్ఛుధ్యేత్పంచగవ్యాశానాద్ద్విజ స్నానదానజపాదౌ చ భోజనాదౌ చ నారద

ఏషామన్యతమస్యాపి శబ్దం యశ్శృణుయాద్వదేత్ ఉద్వమేద్భుక్తమన్నం తత్స్నాత్వా చోపవ సేత్తథా

ద్వితీయేఽహ్ని ఘృతం ప్రాశ్య శుద్ధిమాప్నోతి నారద ప్రతాదిమధ్యే యద్యేషాం శృణుయాద్ధ్వనినప్యుత

అష్టోత్తరసహస్రం తు జదేవ వేదమాతరమ్ పాపానామధికం పాపం ద్విజదైవతనిందనమ్ న దృష్టా న్విష్కృతి స్తస్య సర్వశాస్త్రేషు నారద

మహాపాతకులతో కలిసియున్నపుడాచరించవలసిన ప్రాయశ్చిత్తమును చెప్పెదను. ప్రాయశ్చిత్తముచే పరిశుద్దుడగువాడు సర్వకర్మఫలముల నందగలడు. బ్రహ్మ హత్యాదిపాతక చతుష్టయములలో ఏ పాపమునచేసిన వానితో కలిసియున్నవాడు ఆయా పాతకములను నిర్దేశించబడిన ప్రాయశ్చిత్తముల నాచరించి పరిశుద్దుడగును. ఈ పాతకులలో తెలియక అయిదు దినములు కలిసియున్నచో కాయకచవ్రతమున నాచరించవలయును. లేనిచో పతితుడగును. పన్నెండురోజులు కలిసున్నచో మహాసాంతపన వ్రతము నాచరించవలయును. పది హేనుదినములు సంసర్గముచేసినచో పన్నెండు రోజులుపవసించవలయును. ఒకమాసము కలిసున్నచో పరాకవ్రతమునాచరించవలయును. మూడు మాసములున్నచో చాంద్రాయణవ్రతము నాచరించవలయును. ఆరునెలలు కలిసున్నచో రెండు చాంద్రాయణముల నాచరించవలయును. కొంచెము తక్కువగా సంవత్సరమున్నచో ఆరుమాసములు వ్రతము నాచరించవలయును. ఇదియే సంసర్గము తెలిసి చేసినచో పైన చెప్పబడిన ప్రాయశ్చిత్తములకు మూడురెట్లధికముగా నాచరించవలయును.

మండూకమును (కప్పు) ముంగిసను, కాకిని, వరాహమును, మూషకమును, మార్జాలమును, మేకను, గొఱ్ఱేను, కుక్కను, కోడిని చంపినచో అర్ధకృచ్ఛవ్రతము నాచరించవలయును. అశ్వమును వధించినవారు అతీకృచవ్రతము నాచరించవలయును. ఏనుగును వధించినచో తప్తక్పచువ్రతమును గోవధను చేసినవారు పరాకము నాచరించవలయును. తెలిసి కోరి గోవధను చేసినవారి నిష్కృతి విధించబడలేదు.

పానశయ్యాసనాదులను పుష్పమూలఫలాదులను భక్ష్య భోజ్యాదుల నహరించినచో పంచగవ్య సేవనముచే శుద్ధికలుగను. శుష్క కాష్ఠలములను, తృణమును, వృక్షములను, గుడమును, చర్మమును, వస్త్రములను, మాంసమును అపహరించినచో మూడు దినములు ఉపవసించవలయును. చకోరమును, చక్రవాకమును, హంసను, కారండమును, గుడ్లగూబను, సారసమును, పావురమును, జలపాదకమును చీలుకను, పిట్టను బలాకమును, తోడేలును, తాబేలును, వీటితో దేనిని చంపిననూ పన్నెండు దినములుపవసించవలయును. రేతస్సును, మలమూత్రములను ఆహారముగా తీసుకొనినచో ప్రాజాపత్య వ్రతము నాచరించవలయును. శూద్రోచ్చిష్టభోజనము చేసినచో మూడు చాంద్రాయణ వ్రతముల నాచరించవలయును. రజస్వలయగు స్త్రీని, చండాలుని, మహాపాతకుని, ప్రసవించిన స్త్రీని, పతితుని, ఉచ్చిష్టమును, రజకొదులను స్పృశించినచో సచేలముగా స్నానము చేయవలయును, ఘృతప్రాశనము చేయవలయును. స్నానము చేసి పరిశుద్దుడై ఎనిమిది నూర్లు గాయత్రీ జపమును చేయవలయును. భోజనముచేయుచున్నప్పుడు తెలియక వీరిలో ఒకరిని స్పృశించినచో మూడుదినములుపవాసమునాచరించి పంచగవ్య ప్రాశనము చేయవలయును. స్నానదానజపభోజనాదులలో పైన చెప్పబడిన వారిలో ఒకరి శబ్దమును వినిననూ వారితో మాటలాడినను, భుజించిన దానిని వాంతి చేసుకొనవలయును. సొనము చేసి. ఉపవసించవలయును. రెండవదినము నేతిని భుజించి శుద్ధిని పొందును. ప్రతాదుల మధ్యన వీరి మాటలను వినినచో ఒక వెయ్యి ఎనిమిది గాయత్రీ జపమునాచరించి శుద్ధిపొందును. అన్నిపాపములలో అధికపాపము ద్విజదైవత నిందనము. ఈ పాపమునకు ఏ శాస్త్రములోను నిష్కృతి చెప్పబడలేదు.

మహాపాతకతుల్యాని యాని ప్రోక్తాని సూరిభిః

 ప్రాయశ్చిత్తం తు తేషాం చ కుర్యాదేవం యథావిధి

 ప్రాయశ్చిత్తాని యః కుర్యాన్నారాయణపరాయణః

తస్య పాపాని నశ్యంతి హ్యన్యథా పతితో భవేత్

 యస్తు రాగదినిర్ముక్తో హ్యనుతాపసమన్వితః

 సర్వభూతదయా యుక్తో విష్ణుస్మరణతత్పరః

మహాపాతకయుక్తో వా యుక్తోవా సర్వపాత కైః

విముక్త ఏవ పా పేభ్యో జ్ఞేయో విష్ణుపరో యతః

నారాయణమనాద్యంతం విశ్వాకారమనావయమ్

యస్తు సంస్మర మర్త్య స్సముక్తః పాపకోటిభిః

 స్మృతో వా పూజితో వాపి ధ్యాతః ప్రణమితోపివా

 నాశయత్యేవ పాపాని విష్ణుర్హృద్గమనస్సతామ్

సంపర్కాద్యది వా మోహాద్యస్తు పూజయతే హరిమ్

 సర్వపాపవినిర్ముక్తస్య ప్రయాతి హరేః పదమ్

 సకృత్యంస్మరణాద్విష్ణోర్నశ్యంతి క్లేశసంచయాః

 స్వర్గాదిభోగప్రాప్తిస్తు తస్య విప్రానుమీయతే

మానుషం దుర్లభం జన్మ ప్రాప్యతే యైర్మునీశ్వర

తత్రాపి హరిభక్తిస్తు దుర్లభా పరికీర్తితా

తస్మాత్తటిల్లతాలోలం మనుష్యం ప్రాప్య దుర్లభమ్

 హరిం సంపూజయేద్భక్త్యా పశుపాశవిమోచనమ్

 సర్వేంతరాయా నశ్యంతి మనశ్శుద్దిశ్చ జాయతే

పరం మోక్షం లభేచ్చైవ పూజితే తు జనార్దనే

ధర్మార్ధకామమోక్షాఖ్యాః పురుషార్ధాసనాతనాః

హరిపూజాపరాణాం తు సిద్ధ్యన్తి నాత్ర సంశయః

 పుత్రదారగృహక్షేత్రధనధన్యాభిధావతీమ్

 లబ్ధ్వేమాం మానుషీం వృత్తిం రే రే దర్పంతు మాకృధా

సంత్యజ్య కామం క్రోధం చ లోభం మోహం మదం తథా

పరాపవాదం నిందాం చ భజధ్వం భక్తితో హరిమ్

వ్యాపారాన్సకలాంస్త్యక్త్యా పూజయధ్వం జనార్దనమ్

నికటా ఏవ దృశ్యంతే కృతాంతనగరద్రుమాక

యావన్న యాంతి మరణం యావ న్నాయాతివా జరా

ధీమాన్న కుర్యాద్విశ్వాసం శరీరేఽస్మిన్వినశ్వరే

 నిత్యం సన్ని హితో మృత్యుసంపదత్యంతచంచలా

 ఆసన్నమరణో దేహస్తస్మాద్దర్పం విముంచత

సంయోగా విప్రయోగాంత పర్వం చ క్షణభంగురమ్

ఏతజ్ జ్ఞాత్వా మహాభాగ పూజయస్వ జనార్దనమ్

ఆశయా వ్యధతే చైవ మోక్షస్త్వత్యంతదుర్లభః

 భక్త్యా యజతి యో విష్ణుం మహాపాతకవానపి

సోఽపి యాతి పరం స్థానం యత్ర గత్వా న శోచతి

సర్వతీర్థాని యజ్ఞాశ్చ సాంగా వేదాశ్చ సత్తమ

నారాయణార్చన స్త్యైతే కలాం నార్హంతి షోడశీమ్

 కిం వా వేదైర్మహా చ్చాస్త్రైః కిం వా తీర్ధని షేనణైః

 విష్ణుభక్తి విహీనాం కిం తపోభిర్వతైరపి

యజంతి యే విష్ణుమనన్తమూర్తిం నిరీక్ష్య చాకారగతం వరేణ్యమ్

వేదాంతవేద్యం భవరోగవైద్యం తే యాంతి మర్త్యాః పదమచ్యుతస్య

 అనాదిమాత్మానమనన్త శక్తిమాధారభూతం జగతస్సురేడ్యమ్

 జ్యోతిస్స్వరూపం పరమచ్యుతాఖ్యం స్మృత్వా సమభ్యేతి నరస్సఖాయమ్

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే ప్రాయశ్చిత్తవిధిర్నామ త్రింశోఽధ్యాయః

 మహాపాతకతుల్యములుగా జ్ఞానులు పేర్కొన్నవాటికి యథావిధిగా ప్రాయశ్చిత్తముల నాచరించయే తీరవలయును. నారాయణపరాయణుడై ప్రాయశ్చిత్తముల నాచరించినచో శుద్దుడగును. లేనియెడల పతితుడగను. రాగాదినిర్ముక్తుడై పశ్చాత్తాప సమన్వితుడై సర్వభూతములయందు దయావంతుడుగుచు విష్ణుస్మరణ తత్పరుడైనచో మహాపాతకములచే కాని సర్వవిధపాతకములచే కొని కూడియున్ననూ విష్ణుపరుడగుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతడుగుట వలన విముక్తుడగును. అనాకారుడు అనామయుడు అనాద్యంతుడు అగు నారాయణుని స్మరించు మానవుడు పొషకోటులనుండి విముక్తుడగును. శ్రీమన్నారాయణుని స్మరించినను, పూజించినను, ధ్యానించినను, ప్రణామము లాచరించినను శ్రీమహావిష్ణువు హృదయమునుండి పాపకోటులను నశింపచేయును. సంసర్గము వలన కానీ మోహము కలన కొని శ్రీహరిని పూజించినచో సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరి పదమును చేరును. శ్రీమహావిష్ణువును ఒకసారి స్మరించినచో క్లేశరాశులు నశించును. స్వర్గాది భోగప్రాప్తి సుకరమగును. ఓ మునీశ్వరా ! మానవజన్మ దుర్లభము. అందులోనూ హరిభక్తి పరమ దుర్లభము. కావున మేరుపువలె చంచలమైన దుర్లభమైన మానవజన్మను పొంది సర్వపాశవిమోచనకమగు హారిని పూజించిన అన్ని విఘ్నములు నశించును. మనశ్శుద్ధి కలుగును. ఉత్తమమైన మోక్షము లభించును. ధర్మార్థకామమోక్షములగు సనాతన పురుషార్ధములు హరిపూజాపరులకు సిద్ధించును. పుత్రదోరగృహక్షేత్రధనధాన్యముల వెంట పరుగెత్తి మానవజన్మ నెత్తి గర్వించకుడు. కామక్రోధలోభమోహమున మాత్సర్యములను, పరాపవాదమును నిందను వదిలి భక్తితో శ్రీహరిని సేవించుడు. అన్ని వ్యాపారములను వదిలి పెట్టి జనార్దనుని పూజించుడు. యమనగరవృక్షరాజములు సమీపములోనే యున్నవి. జరామరణములు ఇంద్రియవైకల్యము సంభవించకమునుపే శ్రీహరిని అర్చించుడు. నశ్వరమైన ఈ శరీరము పై బుద్ధిమంతుడు విశ్వాసముంచడు. మృత్యువు ఎల్లపుడూ సమీపించియే యుండును. సంపదలు మిగుల చంచలములు. దేహమేప్పుడూ మృత్యవునకు దగ్గరలోనే యున్నది. కావున గర్వమును విడువుడు. ప్రతి కలయిక విడిపోవుట కొఱకే, ప్రతిదీ క్షణభంగురమే. ఈ విషయమును తెలిసి జనార్ధనుని పూజించుము. ప్రాణి ఆశచే బాధలను తెచ్చుకొనును. మోక్షమత్యంత దుర్లభము. మహాపొపియైనను భక్తి చే శ్రీ మహావిష్ణువును పూజించినచో తిరిగిరాని పరమపదమును చేరును. సర్వతీర్ధములు యజ్ఞములు సాంగములైన వేదములు నారాయణార్చనలో పదునారవ అంశతో సరిపోవు. విష్ణుభక్తి లేనివారు చేసిన వేదాధ్యయనము, యాగములు, శాస్త్రములు, తీర్ధ సేవనము, తపము, వ్రతములు అన్నియూ, నిష్పలములే యగును. వేదాంతవేద్యుడు భవరోగవైద్యుడు అనంతమూర్తి  ఆకారమునుదాల్చినవాడు సర్వ శ్రేష్ఠుడు అగు శ్రీమహావిష్ణువును ధ్యానించువారు అచ్యుత పదమును చేరెదరు. అనాదియైన ఆత్మ, అనంతశక్తి జగత్తునకు ఆధారభూతుడు, దేవతలచే స్తుతించబడువాడు, అట్టి జ్యోతిస్వరూపుని అన్నిటికంటే పరుడైన అచ్యుతుని స్మరించిన ఉత్తమసఖుని పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమ భాగమున ప్రాయశ్చిత్తవిధి యను ముప్పదియవ అధ్యాయము సమాప్తము.