84 - దేవీ మంత్ర నిరూపణమ్

సనత్కుమార ఉవాచ :

కలికల్పాంతరే బ్రహ్మన్ బ్రహ్మణోవ్యక్త జన్మనః

 లోకపద్మే తపస్థస్య సృష్ట్యర్థం సంబభూవతుః

విష్ణుకర్ణమలోద్భూతావసురౌ మధు కైటభౌ

తౌ జాతమాత్రౌ పయసి లోక ప్రలయలక్షణే

జానుమాత్రే స్థితా దృష్టా బ్రహ్మాణం కమలస్థితమ్

ప్రవృత్తావత్తుమాలక్ష్య తుష్టావ జగదంబికామ్

తతో దేవీ జగత్కర్రీ శైవీ శక్తి రనుత్తమా

నారాయణాక్షిసంస్థానా నిద్రా ప్రీతా బభూవ హ

తస్యా మంత్రాదికం సర్వం కథయిష్యామి తచ్ఛృణు

సారుణా క్రోధనీ శాంతిశ్చక్రాలంకృత శేఖరా

ఏకాక్షరీ బీజమన్తఋషి శ్శక్తి రుదాహృతా

గాయత్రీ చ భవేచ్చన్తో దేవతా భువనేశ్వరీ

షడ్డీరయుక్తబీజేన కుర్యాదంగాని షట్కమాత్

సంహార సృష్టిమార్గేణ మాతృకొన్యస్త విగ్రహః

మంత్ర న్యాసం తతః కుర్యాద్దేవతా భావసిద్ధయే

 హృల్లేఖాం మూర్థి వదనే గగనాం హృదయాంబుజే

 రక్షాం కరాలికాం గుహ్యే మహోచ్ఛుష్మాం పదద్వయే

 ఊర్థ్వ ప్రాగ్దాక్షిణాదీచ్యపశ్చిమేఘూత్తరేపి చ

బ్రహ్మాణం విన్య సేత్ఫాలే గాయత్ర్యా సహ సంయుతమ్

 సావిత్ర్య సహితం విష్ణుం కపోలే దక్షిణే న్యసేత్

వాగీశ్వర్యా సమాయుక్తం వామగండే మహేశ్వరమ్

 శ్రియా ధనపతిం న్యస్య వామకర్ణాగకే పునః

రత్యా స్మరం ముఖే న్యస్య పుణ్యా గణపతిం న్యసేత్

సవ్యకర్లోపరి తథా కర్ణగండాంతరాలయోః

న్యస్తవ్యం వదనే మూలం భూపశ్చైతాంస్తతో న్యసేత్

కంఠమూలే స్తనద్వంద్వే వామాంసే హృదయాంబుజే

సవ్యాంసే పార్వయుగలే నాభిదేశే చ దేశికః

ఫాలాంశ్చ పార్వజఠరే పార్శ్వాంసాపరకే హృది

బ్రహ్మణ్యాధ్యా స్తనౌ న్యస్య విధినా ప్రోక్త లక్షణాః

మూలేన వ్యాపకం దేహే న్యస్య దేవీం విచిన్తయేత్

ఉద్యర్దివాకరనిభాం తాం గోరోజాం త్రిలోచనామ్

 స్మేరాస్యామిందుముకుటాం వరపాశాంకుశాభయామ్

రదలక్షం జపేన్మంత్రం త్రిమధ్యకై రువేత్తతః

అష్టద్రవ్యైర్థశాంశేన బ్రహ్మవృక్షసమిద్వరైః

 ద్రాక్షా ఖర్జూర వాతాదశర్కరా నాలికేరకమ్

 తందులాజ్య తిలం విప్ర ద్రవ్యాష్టకముదాహృతమ్

దద్యాదర్యం దినేశాయ తత్ర సంచిన్య పార్వతీమ్

పద్మమష్టదలం బాహ్యా వృత్తం షోడశభిర్దలైః

విలిఖేత్కకామధ్యే షట్కోణమతి సున్దరమ్

తతస్సంపూజయేత్పీఠం నవశక్తి సమన్వితమ్

జయాఖ్యా విజయా పశ్చాదజితాహ్వా పరాజితా

నిత్యా విలాసినీ దోగ్రత్యఘోరా మంగలానవా

బీజాఢ్యమాసనం దత్తా మూర్తిం తేనైవ కల్పయేత్

తస్యాం సంపూజయేద్దేవీమావాహ్యావరణే క్రమాత్

మధ్య ప్రాగ్యామ్యసవ్యేషు పూజయేగంగదేవతాః

 షట్కోణేషు యజేన్మంత్రీ పశ్చాన్మిధునదేవతాః

ఇంద్రకోణే లసద్దండకుండికాక్షగుణాభయామ్

గాయత్రీం పూజయేన్మంత్రీ బ్రహ్మాణమపి తాదృశమ్

రక్షః కోణే శంఖ చక్రగదా పంకజ ధారిణీమ్

సావిత్రీం పీతవసనాం యద్విష్ణుం చ తాదృశమ్

వాయుకోణే పరశ్వక్షమాలాభయ వరాన్వితామ్

యజేత్సరస్వతీమచ్ఛాం రుద్రం తాదృశలక్షణమ్

వహ్నికోణే యజేద్రత్నకుంభం మణి కరండకమ్

కరాభ్యాం బిభ్రతీం పీతాం తుందిలం ధనదాయకమ్

ఆలింగ్య సవ్యహస్తేన వానే తాంబూల ధారిణీమ్

ధనదాంక సమారూఢం మహాలక్ష్మీం ప్రపూజయేత్

పశ్చిమే మదనం బాణ పాశాంకుశ శరాసనామ్

ధారయంతం జపొరక్తం పూజయద్రక్త భూషణమ్

సవ్యేన పతిమాశ్రిష్య వామేనోత్పలధారిణీమ్

పాణినా రమణాంకస్థాం రతిం సమ్యకమర్చయేత్

ఈశాన్యే పూజయేత్సమ్యగ్విఘ్నరాజం ప్రియాన్వితమ్

 సృణిపాశధరం కొనం వరాంగ సృక్కరాంగులిమ్

మాధ్వీ పూర్ణ కపాలాఢ్యం విఘ్నరాజం దిగంబరమ్

పుష్కరే విగలద్రత్నస్ఫురచ్ఛషకధారిణమ్

సిందూరసదృశాకారముద్దామమదవిభ్రమామ్

ధృతరకోత్పలామన్యపాణినా తు ధ్వజసుశామ్

ఆశిష్టకాంతావరణాం పుష్టిమఠేద్దిగంబరామ్

కర్ణికాయాం నిధీ పూజ్యా షట్కోణస్యాధపార్వయోః

ఆంగాని కేసరీష్వేతాః పశ్చాత్పతేషు పూజయేత్

అనంగకుసుమా పశ్చాద్ద్వితీయా నంగమేఖలా

అనంగగమనా తద్వదనంగమదనాతురా

భువనపాలా గగనవేగా షష్ఠీ చైవ తతః పరమ్

శశిరేఖా గగన లేఖా చేత్యష్టా యత్ర శక్తయః

 ఖడ్గఖేటకధారిణ్య: శ్యామా: పూజ్యాశ్చ మాతరః

 పద్మాద్భహిస్సమభ్యర్జ్య: శక్తయః పరిచారికాః

ప్రథమానంగద్వయా స్యాదనంగ మదనా తతః

మదనాతురా భవన వేగా తతో భువన పాలికా

 స్యాత్సర్వశిశిరానంగా వేదనా నంగమేఖలా

చషకం తాలవృత్తం చ తాంబూలం ఛత్రముజ్జ్వలమ్

చామరే చాంశుకం పుష్పం బిభ్రాణాః కరపంకజైః

సర్వాభరణసందీప్తాన్ లోకపాలాన్బహిర్యజేత్

వజ్రాదీనపి తద్బా హ్యే దేవీమిత్తం ప్రపూజయేత్

మంత్రి త్రిమధుకోపేతైరుత్వా శ్వత్థాసమిద్వరైః

బ్రాహ్మణాన్వశయేచ్ఛీఘం పార్థివాన్పద్మహోమతః

పలాశ పుష్పై స్తత్పత్నీం మంత్రిణః కుముదైరసి

పంచ వింశతిధి జర్జెర్జలై స్నానం దినే దినే

ఆత్మానమభిషించేద్యః సర్వసౌభాగ్యవాన్భవేత్

పంచవిశతిధా జప్తం జలం ప్రాతః పిబేన్నరః

ఆవాప్య మహతీం ప్రజ్ఞాం కవీనామగ్రణీర్భవేత్

 కర్పూరాగరుసంయుక్తకుంకుమం సాధు సాధితమ్

గృహీత్వా సతిలం కుర్యాద్రాజవశ్యమనుత్తమమ్

శాలిపిష్టమయీం కృత్వాం పుత్తలీం మధురాన్వితామ్

జప్తాం ప్రతిష్టితప్రాం భక్షయేద్రవివాసరే

వశం నయతి రాజానం నారీం వా నరమేవ చ

కంఠమాత్రదకే స్థిత్వా వీక్ష్య తోయోద్గతం రవిమ్

త్రీసహస్రం జపేన్మస్త్రం కన్యామిషాం లభేత్తతః

అన్నం తన్మగ్రితం మంత్రి భుంజీత శ్రీప్రసిద్ధయే

లిఖితాం భస్మనా మాయాం ససాధ్యం ఫలకాదిషు

తత్కాలం దర్శయేద్యంత్రం సుఖం సూయత గర్భిణీ

 భునేశీయమాఖ్యాతా సహస్ర భుజ సంభవా

భుక్తిముక్తి ప్రదా నృణాం స్మరణారి ద్విజసత్తమ

 తతః కల్పాంత విప్ర కదాచిన్మహిషాసురః

బభూవ లోకపాలాంస్తు జిత్వా భుంక్తే జగత్రయమ్

తతస్తత్పీడితా దేవా వైకుంఠం శరణం యయుః

తతో దేవీ మహాలక్ష్మీశ్చక్రాద్యంగోత్థతేజసా

 శ్రీర్బభూవ మునిశ్రేష్ఠ మూర్తా వ్యాప్తజగత్త్రయా

స్వయం సా మహిషాదీంస్తు నిహత్య జగదీశ్వరీ

అరవిందవనం ప్రాప్తా భజతామిష్టదాయినీ

తస్యాస్సమర్చనం వక్ష్యే సంక్షేపేణ శృణు ద్విజ

సనత్కుమార మహర్షి పలికెను :

ఓ బ్రాహ్మణోత్తమా! కలి కల్పాంతరమున అవ్యక్త జన్మయగు బ్రహ్మలోక పద్మమున సృష్టి కొరకు తపస్సు చేయుచుండగా విష్ణు కర్ణమలము నుండి మధుకైటభులను రాక్షసులు పుట్టిరి. వారిద్దరూ పుట్టిన వెంటనే ప్రలయ లక్షణమగు జాను మాత్ర జలమున నిలిచి కమలముననున్న బ్రహ్మను చూచి భక్షించుటకు ముందుకు రాగా బ్రహ్మ జగదంబికను స్తుతించెను. తరువాత జగత్కర్తి శైవీ శక్తి యగు దేవి నారాయణ నేత్రమున నుండునదై ప్రీతి చెందెను. ఇపుడు ఆ దేవి యొక్క మంత్రాదికము నంతటిని చేప్పెదను వినుము. సొరుణా క్రోధనీ శక్తి చంద్రాలంకృత శేఖరా. “హీం” అను ఏకాక్షరీ బీజ మంత్రము. గాయత్రీ ఛందస్సు. భువనేశ్వరి దేవత. షడ్డీర్ఘ యుక్త బీజముచే అంగన్యాసమును చేయవలయును. సంహార సృష్టి మార్గముతో మాతృ కాన్యస్త విగ్రహుడై మంత్ర న్యాసమును దేవతా భావ సిద్ది కొఱకు చేయవలయును. హృల్లేఖను మూర్థ యందు వచనమున, హృదయాంబుజమున గగనమును, రక్త కరాలికను గుహ్యమున, పదద్వయమున మహోచ్చుష్మమును ఊర్థ్వప్రాగ్గక్షిణాదీచ్య పశ్చిమోత్తరములందు సద్యాదిహ్రస్వ బీజాదులను న్యాసమును చేయవలయును. తరువాత జాతీయుక్త షడంగములను క్రమముగా న్యాసమును చేయవలయును. గాయత్రీ సహితుడగు బ్రహ్మను ఫాలమున నుంచవలయును. సావిత్రీ సహితుడగు విష్ణువును దక్షిణ కపోలమున, వాగేశ్వరీ యుక్తుడగు మహేశ్వరుని వామగండమున, శ్రీ యుక్తుడగు ధన పతిని వామ కర్ణాగ్రమున రతీయుతుడగు స్మరుని ముఖమున న్యాసము చేయవలయును. పుణ్యా గణపతిని సవ్యకర్లో పరిభాగమున కర్ణాంగండాంతరాలము లందుంచ వలయును. వదనమున మూలము నుంచి తరువాత కంఠమూలమున, స్తనద్వంద్వమున, వామ భుజమున హృదయాంబుజమున, వామ భుజమున, పార్శ్వయుగలమున, నాభి దేశమున చైత్రముల నుంచవలయును. ఫాలములను పార్శ్వ జఠరమున పొర్వాంసమున, హృదయమున నుంచవలయును. బ్రహ్మణ్యాదులను యథావిధిగా శరీరము నందుంచి, మూలముచే దేహమున వ్యాపకము నుంచి దేవిని ధ్యానించ వలయును. ఉదయించు సూర్యుని కాంతి గలది, ఉన్నత వక్షోజములు గలది, త్రిలోచన, చిరునవ్వుమోము కలది, ఇందుమకుట, వరపాశాంకుశాభయ ధారిణి యగు దేవిని ధ్యానించి, మంత్రమును ముప్పది రెండు లక్షలు జపించవలయును. దశాంశమును త్రిమధు మిశ్రితములగు అష్టద్రవ్యములచే, బ్రహ్మవృక్ష సమిధలచే కాని హోమమును గావించ వలయును. ద్రాక్ష, ఖర్జూర, కాలూద, శక్కర, నాలికేర, తండుల, ఆజ్య, తిలములు అష్టదవ్యము లనబడును. పార్వతిని ధ్యానించుచు సూర్యున - కర్యము నీయవలయును. తద్బాహ్యమున షోడశదలములచే కూడియున్న అష్టదల పద్మమును లిఖించవలయును. కర్ణికా మధ్యమున షట్కోణమును లభించవలయును. తరువాత నవశక్తి సమన్వితమగు పీఠమును పూజించవలయును. జయ, విజయ, అజిత, అపరాజిత, నిత్య, విలాసిని, దోగ్రీ, అఘోరా, మంగలా అనునవి నవశక్తులు. బీజయుతమగు నాసనమునిచ్చి, ఆ బీజముచేతనే మూర్తిని కల్పించి, దాని యందు దేవిని ఆవాహించి ఆవరణలచే క్రమముగా పూజించవలయును. మధ్య ప్రొగ్యామ్య ఉత్తరము లందు అంగ దేవతలను పూజించవలయును. షట్కోణములందు మిధున దేవతలను పూజించవలయును. ఇంద్రకోణమున (తూర్పున) దండకుండికా అక్షగుణాభయ ధారిణి యగు గాయత్రిని, ఇట్టి బ్రహ్మను కూడా పూజించవలయును. నైరుత దిక్కునందు శంఖ చక్ర గదా పద్మ ధారిణీ, పీత వసనయగు సావిత్రిని, అట్టి విష్ణువును పూజించవలయును. వాయు కోణమున పరశు, అక్షమాలా అభయ వరాన్వితయగు, స్వచ్చ వర్ణయగు సరస్వతిని, అట్టి లక్షణములు గల రుద్రుని పూజించవలయును. ఆగ్నేయ కోణమున రత్నకుంభమును, మణి కరండకమును, కరములచే ధరించియున్న, పీతవర్ణయగు దేవిని, ధనదాయకుడగు తుందిలుని వామ హస్తముచే ఆలింగనము చేసుకొని, దక్షిణ హస్తమున తాంబూలమును ధరించియున్న ధనదారిక సమారూఢయగు మహాలక్ష్మిని పూజించవలయును. పశ్చిమ కోణమున బాణపాశాంకుశ ధనువులను ధరించి జపొరక్త వర్ణుడు, రక్త భూషణుడగు మన్మధుని పూజించవలయును. దక్షిణ భుజముచే భర్త నాలింగనము చేసుకొని, వామ హస్తమున ఉత్పలమును ధరించియున్న, భర్త వడిలో కూర్చొనియున్న రతీదేవిని చక్కగా పూజించవలయును. ఐశాన్య కోణమున ప్రియాన్వితుడు, సృణపాశధరుడు, సుందరుడు, వరాంగ సృక్కలాంగులి, మాధ్వీపూర్ణ కపాలాఢ్యుడు, దిగంబరుడు, పుష్కరమున విగలద్రత్న స్ఫురచ్చషక ధారియగు విఘ్నరాజును పూజించ వలయును. సింధూర సదృశాకారము గలది, ఉద్దామమద విభ్రమ, రక్తాత్పల ధారిణి, ఇతర హస్తముచే ధ్వజమును స్పృశించునది, భర్తను ఆలింగనము చేసుకొనియున్న, దిగంబరయగు పుష్టిని కర్ణికయందు పూజించవలయును. షట్కోణ పార్శ్వము లందు అంగములను పూజించవలయును. తరువాత కేశరము లందు పత్రములందు ఈ దేవీ మణులను పూజించవలయును. అనంగకుసుమ, ఆనంగమేఖల, ఆనంగ గమనా, అనంగ మదనాతుర, భువనపాలా, గగనవేగా, శశిరేఖ గగనలేఖ యనెడు అష్టశక్తులు. ఖడ్గ ఖేటకధారిణులు, శ్యామ వర్ణములు కల మాతృకలను పూజించవలయును. పద్మ బాహ్య ప్రదేశమున శక్తులను పరిచారికలను పూజించవలయును. అనంగ ద్వయా, అనంగమదన, మదనాతురా, భువనవేగా, భువనపాలికా, సర్వశిశిరా, అనంగవేదనా, అనంగమేఖల, అనువారు పరిచారికలు శక్తులు. చషకమును, తాలవృంతమును, తాంబూలమును, ఉజ్జ్వల ఛత్రమును, చామరములను, అంశుకమును పుష్పములను చేతులలో ధరించి యుందురు. సర్వాభరణ భూషితులగు లోకపాలురను బాహ్య ప్రదేశమున పూజించవలయును. తద్బాహ్యమున వజ్రాదులను పూజించవలయును. ఇట్లు దేవీ పూజ గావించవలయును. త్రిమధుర మిశ్రితములగు అశ్వత్త సమిధలచే హోమమును గావించి బ్రాహ్మణులను వశము చేసుకొన వచ్చును. పద్మముల హోమముచే క్షత్రియులు వశములో నుందురు, పలాశ పుష్ప హోమముచే వారి పత్నులు వశులగుదురు. కలువలచే హోమము చేసినచో మంత్రులు వశులగుదురు. ఇరువది అయిదు మార్లు జపించిన జలముచే ప్రతి దినము స్నానము గావించినచో సర్వసౌభాగ్యవంతుడగును. ఇరువది మార్లు జపించిన జలమును ప్రతిదినము ప్రాతః కాలమున పానము గావించినచో సాటిలేని ప్రజ్ఞను పొంది కవులలో శ్రేష్టుడు కాగలడు. కర్పూరాగరు కస్తూరీ సంయుక్తమగు కుంకుమను చక్కగా మంత్రించి తిలకముగా ధరించినచో రాజులు వశులగుదురు. మధురాన్వితమగు వరిపిండిచే బొమ్మను చేసి జపించి ప్రాణ ప్రతిష్ట గావించి ఆదివారమున భక్షించినచో రాజును కానీ పురుషుని కాని స్త్రీని కాని వశము చేయును. కంఠమాత్ర జలమున నిలిచి జలము నుండి వచ్చు సూర్యుని చూచి మూడు లక్షలు జపించినచో ఇష్టమగు కన్యను పొందును. సంపద కొరకు మంత్రితాన్నమును భుజించవలయును. భస్మముచే సాధించ దగిన మాటును ఫలకాదులందు లిఖించి, ఆ సమయమున యంత్రమును చూపినచో సుఖ ప్రసవము జరుగును. ఈమెయే సహస్ర భుజ సంభవయగు భువనేశ్వరి యనబడును. తలచు మానవులకు భుక్తిముక్తి ప్రదురాలుగా పేర్కొనబడినవి.

ఒకకల్పమున ఒకపుడు మహిషారుడు లోకపాలురను తన బలముచే గెలిచి జగత్రయమును అనుభవించుచుండెను. అంతట అతనిచే పీడించబడిన దేవతలు శ్రీ మహా విష్ణువును శరణు వేడిరి. అపుడు మహాలక్ష్మీ దేవి చక్రాద్యంగ ప్రభవ తేజస్సుచే మూర్తిని ధరించి, జగత్రయమును వ్యాపించి మహిషాద్యసురలను సంహరించి అరవిందవనమును చేరి, సేవించువారి అభీష్టములనిచ్చు చుండెను. ఇపుడు ఈ దేవీ పూజా విధానమును సంక్షేపముగా చెప్పెదను వినుము.

మృత్యు క్రోధేన గురుణా బిందు భూషిత మస్తకా

బీజ మంత్ర శ్శ్రియః ప్రోక్తో భజతా మిష్ట దాయకః

 ఋషిర్భగు ర్నివృచ్ఛందో దేవతా శ్రీ సమీరితా

షడ్దర్ఘయుక్త బీజేన కుర్యాదంగాని షట్కమాత్

తతో ధ్యాయేజ్జగద్వేద్యాం యం సంపత్తిదాయినీమ్

కాంచనాభాం గజైశ్వైతైశ్చతుర్బిస్వ కరోద్ధృతైః

 హిరణ్మయామృతఘట్రై స్సిచ్యమానాం సరోజగామ్

వరాభయాబ్దస్రగ్ధస్తాం క్షేమవస్త్రాం కిరీటినీమ్

సిద్ధలక్షం జపేన్మస్త్రం తత్సహస్రం హుసేత్తథా

సుగంధ కుసుమైరిష్టా కమలైర్మధుర ఫ్లుతైః

మహాలక్ష్ముడితే పీరే మూర్తిం మూలేన కల్పయేత్

యజేత్పూర్వవదంగాని దిగ్గలేష్వర్చయేత్తతః

 వాసుదేవం సంకర్షణం ప్రద్యుమ్నమనిరుద్ధకమ్

హిమపీతతమాలేస్రనీలాభానీతవాసనః

శంఖచక్రగదాపద్మధారిణస్తాంశ్చతుర్భుజాన్

విదిగంతేషు పత్రేషు దమకాదీన్యజేద్దజాన్

దమకం పుండరీకం చ గుగ్గులం చ కురంటకమ్

యజేచ్చంఖనిధిం దేవ్యా దక్షిణే ప్రమదాన్వితమ్

 ముక్తామాణిక్యసంకాశా కించిత్స్మితముఖాంబుజౌ

అన్యోన్యాలింగనకౌ శంఖపంకజధారిణే

 విగలద్రత్నవర్షాభ్యాం శంఖాభ్యాం మూర్ఖ లాంఛితా

తుందిలం కంబుకనిధిం వసుధారాం ఘనస్తనీమ్

వామతః పంకజనిధిం ప్రియయా సహితం యజేత్

సిందూరాభౌ భుజక్లిష్టో రక్త పద్మోత్సలాన్వితా

నిస్సరద్రత్నవర్షాభ్యాం పద్మాభ్యాం మూర్ఖ లాంఛితా

తుందిలం పంకజనిధిం తత్యోం వసుమతీమపి

 దలాగ్రేషు యజేదేతా బలాక్యొద్యా స్సమంతతః

బలాకీ విమలా చైవ కమలా వనమాలికా

విభీషికా మాలికా చ శాంకరీ వసుమాలికా

పంకజద్వయధారిణ్యే ముక్తాహార సమప్రభాః

 లోకేశాన్పూజయేదంతే వజ్రాద్యప్రాణి తద్బహిః

ఇళ్లం యో భజతే దేవీం విధినా సాధకోత్తమః

ధన ధాన్య సమృద్ధ స్స్యా శ్రియ మాప్నోత్యనిందితామ్

వక్షః ప్రమాణ సలిలే స్థిత్వా మన్రో మిమం జపేత్

త్రిలక్ష మర్కగం ధ్యాయన్ స భవేత్కమలాలయః

విష్ణు గేహస్థబిల్వస్య మూలే లక్షత్రయం జపేత్

సాధకో యస్స లభతే వాంఛితం ధన సంచయమ్

అశోకవహ్నావాజ్యాకై స్తండులైర్వశయేజ్జగత్

హోమేన ఖాదిరే వహ్నౌ తండులైర్మధురోక్షితైః

రాజవశ్యో భవేచ్ఛీఘం మహాలక్ష్మీ శ్చ వర్థతే

బిల్వచ్ఛాయా మధివసన్ బిల్వమిగ్రహవిష్యభుక్

సంవత్సర త్రయం హుత్వా తత్ఫలైరథ వాంబుజైః

సాధకేంద్రో మహాలక్ష్మీం చక్షుషా పశ్యతి ధ్రువమ్

గురువగు మృత్యు క్రోధముచే బిందు భూషిత మస్తకము శ్రీ బీజ మంత్రము. అనగా “శ్రీం” అనునది బీజమంత్రము. భజించు వారికి అభీష్ట ప్రదము. భృగువు మహర్షి నివృత్ ఛందస్సు. శ్రీ దేవత. షడ్డీరయుక్త బీజముచే షడంగములను క్రమముగా కల్పించవలయును. తరువాత జగద్వేద్య సంపత్తి దాయిని, కాంచనాభ, నాలుగు తెల్లని యేనుగులు తమ తొండములచే ధరించిన బంగారు కలశములతో అమృతాభిషేకము చేయుచుండగా పద్మమున నున్న, వరాభయాబ్జ స్రగ్ధరిణీ, క్షామ వస్త్ర కిరీటధారిణి, యగు మహా లక్ష్మిని ధ్యానించ వలయును. ఎనిమిది లక్షలు మంత్రమును జపించవలయును. దశాంశమును సుగంధకుసుమములచేకాని, మధుర పుతములగు కమలములచే కాని హోమము చేసి మహాలక్ష్మికి చెప్పబడిన పీఠమునందు మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి పూర్వోక్త విధానముగా అంగములను అర్చన చేయవలయును. అష్టదలము లందు పూజించవలయును. వాసుదేవుని సంకర్షణుని, ప్రద్యుమ్నుని, అనిరుద్ధుని హిమ పీత తమాలేన్ల నీల వర్ణులను పీత వస్త్ర ధారులను, శంఖ చక్ర గదా పద్మధారులను, చతుర్భుజులను పూజించవలయును. దిక్కులందు పత్రములందు దమకొదులను పూజించవలయును. దమకమును, పుండరీకమును గుగులు కురింటకము అనుగజములు. దక్షిణ భాగమున ప్రమదాన్వితనుగు శంఖ నిధిని పూజించవలయును. ముక్తామాణిక్య సంకాశులు, కించిత్స్మిత ముఖాంబుజులు, అన్యోన్యాలింగన పరులు, శంఖ పంకజధారులు రత్నములను వర్షించు శంఖ పద్మములచే శిరస్సున గుర్తించబడిన తుందిలుని, కంబుక నిధిని, వసుధారను, ఘనస్తనిని, వామ భాగమున పంకజనిధిని ప్రియా సహితుని పూజించవలయును. సింధూర వర్ణముగల, భుజ క్లిష్టులు రక్త పద్మోత్సలాన్వితులు రత్నములను వర్షించు పద్మములచే మూర్థ భాగమున చిహ్నితములు అగు తుంగీలునీ, పంకజ నిధిని తత్త్యమును, వసుమతిని దలాగ్రములందు పూజించవలయును. బలాకాదులను పూజించవలయును. బలాకి విమల, కమల వనమాలిక, విభీషిక, మాలికా, శాంకం, వసుమాలిక అనువారు రెండు పద్మములను ధరించినవారు ముక్తాహార సమప్రభలు అగువారిని పూజించవలయును. అంతమున లోకేశులను వారి అస్త్రములను పూజించవయలును. ఇట్లు దేవిని సేవించువారు ధనధాన్య సమృద్ధిని పొంది గొప్ప సంపదను పొందును. వక్షస్తల మాత్ర జలమున నిలిచి ఈ మంత్రమును జపించవలయును. సూర్య మండల గతుని ధ్యానించుచు మూడు లక్షలు జపించినచో లక్ష్మీనివాసమగును. విష్ణ్వాలయములోనున్న మారేడు చెట్లు మూల భాగమున మూడు లక్షలు జపించవలయును. ఇట్లు చేసినచో కోరిన ధనరాశులు లభించును. అశోక సమిధలచే ఏర్పరిచిన అగ్నిలో నేయి కలిపిన తండులములచే హోమమును గావించినచో జగత్తు వశమగును. చండ్రనిప్పులో మధుప్లుతములగు తండులములచే హోమమును గావించినచో రాజు వశమగును. మహా సంపదను పొందును. మారెడు నీడలో ఉంటూ మారెడు కలిసిన హవిస్సును భుజించుచు మూడు సంవత్సరములు హోమము గావించినచో, మారెడు ఫలములచే కాని అంబుజములచేకాని హోమమును గావించినచో మహాలక్ష్మిని స్వయముగా కన్నులతో చూడగలడు.

అథ కల్పాన్తరే బ్రహ్మన్ ! దేవరాజవిలుంపకౌ

జాతా శుంభ నిశుంభౌ ద్వౌ ఆసురౌ లోక కంటకౌ

తతో భ్రష్టాధికారైస్తు శక్రాద్యై సంస్తుతౌ మునే

మహా సరస్వతీ దేవీ తదా చావవతార హ

హిమాలయే మహాపుణ్యే శైలోద్దేశతిశోభనే

తతశుంభాదికాన్హత్వా దైవతైః పరిపూజితా

వరం దత్యా విశద్దేవీ మానసం నామ వై సరః

తస్యా మంత్రం ప్రవక్ష్యామి శృణుష్వావహితో మునే

 జ్ఞానామృతా శశిధరాక్రాంత ఫాలోపశోభితా

వాగ్బీజం తేన చాంగాని కల్పయేత్సాధకోత్తమః

ఋషి స్సదాశివశ్చాస్య ఛందోనుష్టు బుదాహృతమ్

దేవతా వాక్సమాఖ్యాతా భజతా మిష్టదాయినీ

శ్వేతాంబరాం బిసశ్వేతాం వీణాపుస్తకధారిణీమ్

దివ్యైరాభరశైర్యుక్తాం ధ్యాయేద్దేవీం నిరంతరామ్

మహా సరస్వతీ పీఠీ మూర్తిం మూలేన కల్పయేత్

దేవీం సంపూజయేత్తస్యామంగాద్యావరణే స్సహ

ఆదావంగావృతిః పశ్చాదంబికాదాస్పమిరితాః

ద్వితీయా మాతృభిః ప్రోక్తా తృతీయా దృష్టశక్తిభిః

చతుర్థి పంచమి ప్రోక్తా ద్వాత్రింశచ్ఛక్తిభిః పునః

చతుషష్ట్యా స్మృతా షష్ఠి శక్తిభిర్లోకనాయకైః

సప్తమి పునరేతేషామస్తె స్స్యాదష్టమావృతిః

ఏవం పూజ్యా జగద్ధాత్రీ శ్రీవతీ వాగ్భవాభిధా

స్థానేషు పూర్వముకేషు యజే దంగాని సాధకః

అంబికా వాగ్భవా దుర్గా శ్రీ శక్తి శోక్త లక్షణా

బ్రహ్మాద్యాశ్చ తతః పూజ్యా కరాలీ వికరాల్యుమా

 సరస్వతీ శ్రీర్థుర్గా చ లక్ష్మీశ్చైవ ధృతి స్మృతి:

శ్రద్ధామేధా రతిః కాస్తా రార్యా షోడశ శక్తయః

 ఖడ్గ భేటకధారిణ్యః శ్యామాః పూజ్యా స్వలంకృతాః

విషఘ్నీ పుష్టయః ప్రజ్ఞా సినీవాలీ కుహూః పునః

 రుద్రవీర్యా ప్రభానందా పోషణా వృద్ధిదా శుభా

 కాలరాత్రిర్మహారాత్రిర్భద్రకాళీ కపర్దినీ

వికృతిర్దండిముండిన్యౌ సేందు ఖండా శిఖండినీ

నిశుంభ శుంభ మథనీ చండముండవినాశినీ

ఇంద్రాణీ చైవ రుద్రాణీ శంకరార్థశరీరిణీ

నారీ నారాయణీ చైవ త్రిశూలిన్యపి పాలినీ

అంబికా ప్రోదినీ చైవ ద్వాత్రింశచ్ఛక్తయ సితాః

చక్రహస్తాః పిశాచాస్యాః సంపూజ్యాశ్చారుభూషణాః

పింగలాక్షీ విశాలాక్షీ సమృద్ధిర్బుద్ధిరేవ చ

శ్రద్ధా స్వాహా స్వధా భిక్షా మాయా సంజ్ఞా వసుంధరా

త్రిలోకధాత్రీ గాయత్రీ సావిత్రీ త్రిదశేశ్వరీ

సరూపా బహురూపా చ స్కందమాతా శ్రుతి ప్రియా

విమలా కమలా పశ్చాదరుణే పునరారుణే

ప్రకృతి ర్వికృతి సృష్టి స్థితి సంహృతి రేవ చ

సంధ్యా మాతా సతీ హంసేమకా వజ్రకా

పరా దేవమాతా భగవతీ దేవకీ కమలాసనా

త్రిముఖీ సప్తవదనా సురాసుర విమర్దినీ

లంబోష్ఠీ చోర్డ్వకేశీ చ బహుశిశ్నా వృకోదరీ

రధరేఖాహ్వయా పశ్చాచ్ఛశిరేఖా తథాపరా

గగనవేగా పవనవేగా వేగా చ తదనంతరమ్

తతో భువన పొలాఖ్యా తతస్స్యాత్మదనాతురా

అనంగా నంగ వదనా తథైవానంగమేఖలా

అనంగకుసుమా విశ్వరూపా సురభయంకరీ

అక్షోభ్యా సప్తవాహిన్యా వజ్రరూపా శుచివ్రతా

వరదాఖ్యాథ వాగేశ చతుష్టష్టి సూరితాః

చాప బాణధరా స్సర్వా జ్వాల జిహ్వా మహాప్రభాః

దంష్ఠిణ్య శర్థకేశ్యస్తా యుద్రో పక్రాన్త మానసాః

సర్వాభరణ సందీప్తా పూజనీయాః ప్రయత్నతః

లోకేశాః పూర్వవత్పూజ్యాస్తద్వద్వజాదికాన్యసి

జపేత్తోడశలక్షం చ తద్దశాంశం హువేత్సుధీః

ఆజ్యేన భాదిరే వహీ తతస్సిద్గో భవేన్మనుః

కమలై రయుతం హుత్వా రాజానం వశమానయేత్

ఉత్పలై ర్జుహ్వతో నూనం మహాలక్ష్మీ ప్రజాయతే

పలాశకుసుమైరుత్వా వత్సరేణ కవిర్భవేత్

రాజీలవణ హోమేన వనితాం వశమానయేత్

భూమౌ భోగాంస్తు భుక్త్యాంతే విష్ణులోకమవాప్నుయాత్

వాణీ బీజ జపాశక్తో నాత్ర కార్యా విచారణా

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయ పాదే దేవీ మంత్ర నిరూపణం నామ చతురశీతితమోధ్యాయః.

ఓ బ్రాహ్మణోత్తమా? మరియొక కల్పమున దేవ రాజ్యమున హరించువారు లోకకంటకులు శుంభ నిశుంభులను ఇరువురు రాక్షసులు పుట్టిరి. వారి వలన రాజ్య భ్రష్టులైన ఇంద్రాది దేవతలు ప్రార్థించగా మహా సరస్వతీదేవి అవతరించెను. అతి సుందరము అతి పవిత్రమగు హిమాలయ ప్రాంతమున అవతరించి శుంభ నిశుంభులను సంహరించి దేవతలచే పూజించబడును. వారికి వరములనిచ్చి మానస సరస్సున ప్రవేశించెను. ఆ సరస్వతీ మంత్రమును చెప్పెదను. సావధానముగా వినుము. జ్ఞానామృత స్వరూపురాలు చంద్ర కలను శిరమున ధరించిన శోభించు దేవత. వాగీజము ఆ దేవతా మంత్రము. వాజముచే అంగకల్పన చేయవలయును. సదాశివుడు ఋషి. అనుష్టుప్చందస్సు. వాగ్దేవి దేవత. సేవించు వారికి అభీష్టముల నొసంగును. శ్వేతాంబర బిసశ్వేత, వీణా పుస్తకధారిణీ, దివ్యాభరణ భూషిత యగు సరస్వతీ దేవిని ధ్యానించవలయును. మహా సరస్వతీ పీఠమున మూలమంత్రముచే మూర్తిని సంకల్పించి, ఆ మూర్తి యందు దేవి నావాహన గావించి అంగాద్యావరణలచే చక్కగా పూజించవలయును. మొదట అంగావరణము, తరువాత అంబికాదులు, ద్వితీయా వరణము మాతృకలు. తృతీయా వరణము అష్టశక్తులు. నాలుగైదు ఆవరణలు ముప్పది రెండు శక్తులచే చేయవలయును. అరువది నాలుగు శక్తులచే ఆరవ ఆవరణము. సప్తమావరణము లోకపాలకులు. అష్టమావరణము వారి ఆయుధములు. ఇట్లు వాకంభవయగు దేవతను పూజించవలయును. పూర్వోక్త స్థానములందు అంగములను పూజించవలయును. అంబికా, వాగృవ, దుర్గ. శ్రీ శక్తి మొదలగు వార శక్తులు. తరువాత బ్రహ్మాదులను పూజించ వలయును. కరాలి, వికరాలి, ఉమా, సరస్వతి, శ్రీ, దుర్గా, లక్ష్మి, ధృతి, స్మృతి, శ్రద్దామేధా, రతి, కాంతి ఆర్యా అనునవి పదునారు శక్తులు. వీరందరు ఖడ్గ భేటక ధారిణులు శ్యామ స్వరూపిణులు, స్వలంకృతులుగా ఉన్న వీరిని పూజించవలయును. విషఘ్ని, పుష్టి, ప్రజ్ఞా, సినీవాలి, కుహూ, రుద్రవీర్య, ప్రభ, నష్ణ, పోషణ, వృద్దిద, శుభ, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాలి, కపర్దినీ, వికృతి, దండీ, ముండీ, సేన్దుఖంతో, శిఖండిని, నిశుంభ శుంభమధని, చండముండ వినాశిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్థ శరీరిణీ నారీ, నారాయణి, త్రిశూలినీ, పాలిని, అంబికా, హోదిని, అనువారు ముప్పది రెండు శక్తులు. వీరందరు చక్ర హస్తలు, పిశాచాస్యలు, చారు భూషణలుగా నున్నవారిని చక్కగా పూజించవలయును. పింగలాక్షి, విశాలాక్షి, సమృద్ధి, బుద్ధి, శ్రద్ద, స్వాహా, స్వధా, భిక్షా,మాయ, సంజ్ఞా, వసుంధర, త్రిలోకధాత్రి, గాయత్రి, సావిత్రి, త్రిదశేశ్వరి, సరూప, బహురూప, స్కన్దమాత, శ్రుతి ప్రియ, విమలా, కమలా, అరుణీ, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యా, మాత, సతీ, హంసీ, మర్థికా, వజ్రకా, పరా, దేవమాత, భగవతి, దేవకీ, కమలాసన, త్రిముఖి, సప్తవదనా, సురాసుర విమర్దిని, లంబోష్ఠీ, ఊర్థ్వకేశి, బహు శిశ్నా, వృకోదరి, రధరేఖా, శశిరేఖ, గగన వేగా, పవనవేగా, వేగా, భువన పాల, మదనాతురా, అనంగా, అనంగవదన, అనంగమేఖల, అనంగకుసుమ, విశ్వరూప, సుభయంకరి, అక్షోభ్యా, సప్తవాహినీ, వజ్రరూపా, శుచివ్రత, వరదా, వాగేశీ, అనువారాలు అరువది నాలుగు శక్తులు. చాప బాణ ధారిణులు, జ్వాలా జిహ్వలు, మహాప్రభలు, దంష్టిణులు, ఊర్థ్వకేశినులు, యుద్దోపక్రాంత మానసలు, సర్వాభరణ భూషితలుగా పూజించవలయును. లోకేశులను, వజ్రాదులను పూర్వోక్త విధిగా ఆరాధించవలయును. పదునారు లక్షలు జపించవలయును. దశాంశమును నేతితో చండ్ర నిప్పులో హోమము చేసిన మంత్రము సిద్ధించును. కమలములచే పదివేలు హోమమును చేసినచో రాజు వశమగును. కలువలచే హోమము చేసినచో మహాలక్ష్మి పుట్టును. మోదుగు పూలచే హోమమును గావించిన సంవత్సరమున కవియగును. రాజీవలవణ- హోమముతో స్త్రీవశమగును. వాణీ బీజమును జపించువారు సకల భోగములననుభవించి అంతమున విష్ణులోకమును చేరును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున దేవీమంత్ర నిరూపణమను ఎనుబది నాలుగ -  అధ్యాయము ముగిసినది.