42 - జగదుత్పత్తివర్ణనమ్

శ్రీ నారద ఉవాచ :-

కుతస్సృష్టమిదం బ్రహ్మ ఞ్జగత్థ్సావరజంగమమ్

ప్రలయే చ కమభ్యేతి తన్మే బ్రూహి సనన్దన !

ససాగరస్సగగనస్స శైలః సబలాహకః

సభూమిస్సాగ్ని పవనో లోకోయం కేన నిర్మితః

కథం సృష్టాని భూతాని కథం వర్ణవిభక్తయః

శౌచాఽశౌచం కథం తేషాం ధర్మాధర్మ విధిః కథమ్

కీదృశో జీవతాం జీవః క్వ వా గచ్ఛంతి యే మృతాః

అస్మాల్లోకాదముం లోకం సర్వం శంసతు మే భవాన్

శ్రీ నారదమహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! స్థావరజంగమాత్మకమగు ఈ జగత్తు ఎవరి వలన సృష్టించబడినది. ప్రలయకాలయమున ఎవరిలో లీనమగును. దానినంతటిని నాకు తెలుపుము. సాగరాకాశశైల మేఘ భూమ్యగ్ని వాయువులతో కూడిన ఈ లోకమును ఎవరు నిర్మించిరి. భూతములను వర్ల విభాగమును ఆచార అనాచారములను ధర్మాధర్మ విధానములను ఎట్లు సృజించిరి. జీవించు వారిలో జీవుడు ఎట్టిపాడు? మరణించినవారు ఎచటికి వెళ్ళేదరు? ఇహ లోకము నుండి పర లోకము వరకు. అంతటిని నాకు చెప్పుము.

సనందన ఉవాచ :-

శృణు నారద వక్ష్యామి చేతిహాసం పురాతనమ్

భృగుణాభిహితం శాస్త్రం భరద్వాజాయ పృచ్ఛతే

కైలాసశిఖరే దృష్ట్వా దీప్యమానం మహౌజపమ్

భృగుమహర్షిమాసీనం భరద్వాజోఽస్వపృచ్ఛత

సనందన మహర్షి పలికెను :- ఓ నారద మహర్షి ! పూర్వము ప్రశ్నించిన భరద్వాజమహర్షికి భృగుమహర్షి చెప్పిన పురాతనశాస్త్రమును ఇతిహాసమును చేప్పెదను. వినుము, కైలాసశిఖరమున గొప్ప తేజస్సుచే ప్రకాశించుచు కూర్చొనియున్న భృగు మహర్షి సమీపించి భరద్వాజమహర్షి ఇట్లు ప్రశ్నించెను.

భరద్వాజ ఉవాచ :-

కథం జీవో వీచరతి నానాయోనిషు సంతతమ్

కథం ముక్తిశ్చ సంసారాత్ జాయతే తస్య మానద !

యశ్చ నారాయణస్సృష్టా స్వయం భూర్భగవాన్వయమ్

సేవ్య సేవకభావేన వర్తేతే ఇతి తౌ సదా

ప్రవిశంతి లయే సర్వే యమీశం సచరాచరాః

లోకానాం రమణస్సోయం నిర్గుణశ్చ నీరంజనః

అనిర్దేశోఽప్రతర్క్యశ్చ కథం జ్జాయేత కైర్మునే

కథమేనం పరాత్మానం కాలశక్తిదురన్వయమ్

అతర్క్యచరితం వేదాస్తువన్తి కథమాదరాత్

జీవో జీవత్వముల్లంఘ్య కథం బ్రహ్మ సమన్వయాత్

ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తన్మే బ్రూహి కృపానిధే

ఏవం స భగవానృష్టో భరద్వాజేన సంశయమ్

మహర్షిరహ్మసంకాశస్సర్వం తస్మై తతోఽబ్రవీత్

భరద్వాజ మహర్షి పలికేను :- ఓ మహర్షీ ! జీవుడెప్పుడూ నానాయోనులందు ఎట్లు తిరుగుచుండును? జీవునికి సంసారము నుండి ఎట్లు ముక్తి లభించును? శ్రీమన్నారాయణుడే బ్రహ్మరూపముచే సృష్టించును. ఆ బ్రహ్మ, నారాయణుడు సేవక సేవ్య రూపముతో ఏల యుందురు? ప్రలయ కాలమున చరాచరములన్నియు ఎవనిలో లీనమగును? లోకనాధుడగు ఆ ప్రభువు నిర్గుణుడు నిరంజనుడు అనిర్దేశ్యుడు అప్రతర్కుడు అని ఎట్లు ఎవరిచే తెలియబడును? పరమాత్మ కాలశక్తి, దురన్వయుడు అతర్క్యచరితుడుగు పరబ్రహ్మను వేదములెట్లు ఆదరముతో స్తుతించును? జీవుడు జీవత్వమును లంఘించి ఎట్లు బ్రహ్మత్వమును పొందును? ఈ విషయమును తెలియగోరుచున్నాను. ఓ కృపానిధీ నాకు తెలుపుము. ఇట్లు భరద్వాజ మహర్షి అడుగగా బ్రహ్మ సంకాశుడగు భృగు మహర్షి దొనినంతటిని చెప్పెను.

భృగురువాచ : -

మానసో నామ యః పూర్వో విశ్రుతో వై మహర్షిభిః

అనాదినిధనో దేవస్తథా తేభ్యోఽజరామరః

అవ్యక్త ఇతి విఖ్యాతశాశ్వతోఽ ధాక్షయో వ్యయః

యతస్సృష్టాని భూతాని జాయన్తే చ మ్రియంతి చ

సోఽసృజత్ప్రథమం దేవో మహాంతం నామ సౌమతః

ఆకాశమితి విఖ్యాతం సర్వభూతధరః ప్రభుః

ఆశాదభవద్వారి సలిలోదగ్నిమారుతౌ

అగ్నిమారుతసంయోగాత్తతస్సమభవన్మ హీ

తత స్తేజోమయం దివ్యం పద్మం సృష్టం స్వయంభువా

తస్మాత్పద్మాత్సమభవద్భ్రహ్మా వేదమయో విధిః

అహంకార ఇతి ఖ్యాతస్సర్వభూతాత్మ భూతకృత్

బ్రహ్మవై స మహాతేజా య ఏతే పంచధాతవః

శైలాస్తస్యాస్థిసంఘాస్తు మేదోమాంసం చ మేదినీ

సముద్రాస్తస్య రుధిరమాకాశముదరం తథా

పవన శ్చైవ నిశ్వాస స్తేజోఽగ్నిర్నిమ్నగాశ్శిర్వా

అగ్నీషోమౌ చ చంద్రార్కౌ నయనే తస్య విశ్రుతే

నభశ్చోర్థ్వశిరస్తస్య క్షితిః పాదౌ భుజౌ దిశః

దుర్విజ్ఞేయో హ్యచిన్త్యాత్మా సిద్ధైరపి న సంశయః

స ఏష భగవాన్విష్ణురనన్త ఇతి విశ్రుతః

సర్వభూతాత్మ భూతస్థో దుర్విజ్ఞేయోఽకృతాత్మభిః

అహంకారస్య యస్స్రష్టా సర్వభూతభవాయ వై

తతస్సమభవద్విశ్వం పృష్టోఽహం యదిహ త్వయా

భృగుమహర్షి పలికెను :- పూర్వము మహర్షులచే మానసుడని చెప్పబడిన వాడు. ఆద్వన్తములు లేనివాడు. అతనీ నుండి అజరామరము, శాశ్వతము అక్షయము అవ్యయము అగు అవ్యక్తము ప్రభవించెను. అవ్యక్తము నుండియే సర్వ భూతములు పుట్టుచున్నవి, మరణించుచున్నవి. ఆ అవ్యక్తము మొదట మహత్తత్వమును సృజించెను. ఈ మహత్తత్త్వమునకే సర్వభూతధరుడు ప్రభునగు ఆకాశమను పేరు. ఆకాశమునుండి జలము, జలము నుండి అగ్ని వాయువులు పుట్టెను. అగ్ని వాయువుల సంయోగమువలన భూమి పుట్టెను. అంతట పరబ్రహ్మ తేజోమయమగు పద్మమును సృష్టించెను. ఆ పద్మమునుండి వేదస్వరూపుడు. విధియను బ్రహ్మ పుట్టెను. అతనికే సర్వభూతాత్మ భూతములను చేయు అహంకారమని ప్రసిద్ధి. ఆ మహాతేజస్కునకే బ్రహ్మ యని పేరు. పంచభూతములు పంచధాతువులు, పర్వతములు అస్థి సంఘములు, భూమిమేదో మాంసములు, సముద్రములు రుధిరము. ఆకాశము ఉదరము, వాయువు నిశ్వాసము. తేజోమయమగు అగ్ని క్రింది శిరస్సు, అగ్నీషోములు చంద్రసూర్యులు బ్రహ్మకు నేత్రములు. ఆకాశము ఊర్ద్వశిరము, క్షితిపాదములు, దిక్కులు భూజములు. ఆ బ్రహ్మ సిద్దులచే తెలియ శక్యము కానివాడు చింతించశక్యమైనవాడుకాడు. ఆ బ్రహ్మయే భగవంతుడగు విష్ణువు అనంతుడని ప్రసిద్దుడు. సర్వభూతాంతర్యామి అజ్ఞానులకు తెలియరానివాడు అహంకారమును సృజించిన వాడే సర్వప్రాణులను సృజించెను. ఆ విష్ణువు నుండే ఈ విశ్వమంతయు పుట్టినది. ఇట్లు నీవడిగిన దానిని చెప్పితిని.

భరద్వాజ ఉవాచ :-

గగనస్య దిశాం చైవ భూతలస్యానిలస్య చ

కాన్యత్ర పరిణామాని సంశయం ఛిన్ది తత్త్వతః

భరద్వాజ మహర్షి పలికేను :- ఆకాశమునకు, దిక్కులకు, భూమికి, వాయువునకు ఏయే పరిణామము లేర్పడినవో నాకు తెలుపుము.

భృగురువాచ :-

అనన్త మేతదాకాశం సిద్ధదైవత సేవితమ్

రమ్యం నానాశ్రయాకీర్ణం యస్యాంతో నాధిగమ్యతే

ఊర్ధ్వం గతేరధస్తాత్తు చంద్రాదిత్యానపశ్యతః

తత్ర దేవాస్స్వయం దీప్తా భాస్కరాభాన్నివర్చసః

తే చాప్యంతం న పశ్యన్తి నభసః ప్రథితౌజసః

దుర్గమత్వాదనంతత్వాదితి మే వద మానద

ఉపరిష్టోపరిష్టాత్తు ప్రజ్వలద్భిస్స్వయంప్రభైః

నిరుద్ధమేతదాకాశం హ్యప్రమేయం సురైరపి

పృథివ్యంతే సముద్రస్తు సముద్రాంతే తమస్స్మృతమ్

తమసోంతే జలం ప్రాహుర్జలస్యాం తేఽగ్నిరేవ చ

రసాతలాంతే సలిలం జలాంతే పన్నగాధిపాః

తదంతే పునరాకాశమాకాశాంతే పునర్జలమ్

ఏవమంతం భగవతః ప్రమాణం సలిలస్య చ

అగ్నిమారుతతోయేభ్యో దుర్జ్ఞేయం దైవతైరపి

అగ్నిమారుతతోయానాం వర్ణా క్షితితలస్య చ

ఆకాశసదృశా హ్యేతే భిద్యంతే తత్త్వదర్శనాత్

పఠితం చైవ మునయః శాస్త్రేషు వివిధేషు చ

త్రైలోక్యే సాగరే చైవ ప్రమాణం వివాతం యథా

అదృశ్యో యస్త్వగమ్యో యః కః ప్రమాణముదీరయేత్

సిద్ధానాం దేవతానాం చ పరిమితా యదా గతిః

తదాగణ్యమనస్తస్య నామానంతేతి విశ్రుతమ్

నామధేయానురూపస్య మానసస్య మహాత్మనః

యదా తు దివ్యం యద్రూపం హ్రసతే వర్ధతే పునః

కోఽన్యస్తద్వేదితుం శక్తి యోఽపి స్యాత్తద్విధోపరః

తతః పుష్కరతః సృష్టః సర్వజ్ఞో మూర్తిమానభుః

బ్రహ్మధర్మమయః పూర్వః ప్రజాపతీరనుత్తమః

భృగుమహర్షి పలికెను :- సిద్దదైవతములచే సేవించబడు ఈ ఆకాశము అనంతము, సుందరము, నానాశ్రయము. దీని అంతము తెలియ శక్యము కానిది. ఆకాశము యొక్క ఊర్ద్వ పరిమాణమును క్రిందుగా నున్న సూర్యచంద్రులు చూడజాలరు. సూర్యాగ్ని సమతేజస్కులు స్వయంప్రకాశులగు దేవతలు కూడా ప్రసిద్ధమైన కాంతి గల ఆకాశాంతమును చూడజాలరు. ఆకాశము దుర్గమము అనంతమగుటయే దీనికి కారణము. పై పై భాగములు కూడా స్వయంప్రకాశకములగు తేజో రాశులచే ఈ ఆకాశము నిరుద్ధమైయున్నది. కావుననే దేవతలు కూడా దీనిని. కొలువజాలరు. పృథివి చివర సముద్రము, సముద్రముల చివర తమస్సు, తమస్సు. చివర జలము, జలము చివర అగ్ని యుండును. రసాతలము చివర జలము, జలము చివర పన్నగాధిపులు, వారి తరువాత మరల నాకాశము, ఆకాశము చివర మరల జలము. ఇట్లు భగవంతునికి జలమునకు అగ్నిమారుతములకు అంతమును దేవతలు కూడా తెలియజాలరు. అగ్నిమారుత జలముల భూమి యొక్క వర్ణములు ఆకాశ సదృశములుగా కనపడును. కానీ తత్త్వదర్శనము వలన భేదము కనపడును. వివిధ శాస్త్రములలో మునులు దర్శించిన విధముగా త్రైలోక్యములలో సొగరమునందు విధించబడిన ప్రమాణము అదృశ్యము అగమ్యము. కావున ఆ ప్రమాణము నెవ్వరు చెప్పగలరు?. సిద్దుల దేవతల పరిమాణమును నిర్ణయించు ఆకాశము అగణ్యము అంతము లేనిది కావున అనంతమని ప్రసిద్ధిచెందినది. ఈ నామధేయము మానసుని స్వరూపమునకు అనురూపము. అనంతము యొక్క దివ్యరూపము పెరుగుచుండును, తరుగుచుండును. అనంతుని వంటి వాడు మరొకడున్నపుడు మాత్రమే అనంత స్వరూపము తెలియనగును. అంతట పద్మము నుండి సర్వజ్ఞుడు మూర్తిమంతుడగు ప్రభువు సృజించబడెను. ఇతడే ధర్మ స్వరూపుడగు మొదటి ప్రజాపతియగు బ్రహ్మ, ఇతనికి సాటి మరియొకడు లేడు.

భరద్వాజ ఉవాచ :-

పుష్కరో యది సంభూతో జ్యేష్టం భవతి పుష్కరమ్

బ్రహ్మాణం పూర్వజం చాహ భవాన్సందేహ ఏవ మే

భరద్వాజ మహర్షి పలికెను :- మొదట పుష్కరము పుట్టినది కావున పుష్కరమే జేష్టము కావలయును. కాని తాము బ్రహ్మ పూర్వజుడని చెప్పితిరి. కావున నాకు మరల సందేహమే కలుగుచున్నది.

భృగురువాచ :-

మానస స్యేహ యా మూర్తిః బ్రహ్మ త్వం సముపాగతా

తస్యాసనవిధానార్ధం పృథివీ పద్మముచ్యతే

కర్ణికా తస్య పద్మస్య మేరుర్గగనముచ్చ్రితః

తస్య మధ్యే స్థితో లోకాన్సృజత్యేష జగద్విధిః

భృగుమహర్షి పలికెను :- మానసుని స్వరూపమే బ్రహ్మ త్వమును పొందినది. ఆ బ్రహ్మకు ఆసనము కొఱకు ఏర్పరిచిన పృథివియే పద్మమనబడుచున్నది. పద్మము మధ్యనున్న నాళమే ఆకాశము వైపు పెరిగిన మేరుపర్వతము. ఆమేరు మధ్యనుండి ఈ బ్రహ్మ జగత్తును సృష్టించును.

భరద్వాజ ఉవాచ :-

ప్రజావిసర్గం వివిధం కథం స సృజతి ప్రభుః

మేరుమధ్యే స్థితో బ్రహ్మా తద్భహిర్ద్విజసత్తమ

భరద్వాజ మహర్షి పలికెను :- మేరు మధ్యన ఉన్న బ్రహ్మ మేరువునకు వెలుపల పలువిధములగు ప్రజాసృష్టినెట్లు చేసెను

భగురువాచ :-

ప్రజావిసర్గం వివిధ మానసో మనసాఽసృజత్

సంరక్షణార్ధం భూతానాం సృష్టం ప్రథమతో జలమ్

యత్ప్రాణాస్సర్వభూతానాం సృష్టం ప్రథమతో జలమ్

యత్ప్రాణాస్సర్వభూతానాం వర్థతే యేన చ ప్రజాః

పరిత్యక్తాశ్చ నశ్యంతి తేనేదం సర్వమావృతమ్

పృథివీ పర్వతా మేఘా మూర్తిమంతశ్చ యే పరే

సర్వం తద్వారుణం జ్ఞేయం ఆపస్తస్తంభిరే పునః

భృగుమహర్షి పలికెను :- మానసబ్రహ్మ మనసుచే ప్రజాసర్గమును చేసెను. ప్రాణులరక్షణ కొఱకు మొదట జలమును సృజించెను. అన్ని ప్రాణులకు ప్రాణ భూతములు, ప్రాణులను పెంచునది, జలమే. జలము లేనిచో ప్రాణులన్నియూ నశించును. ఈ ప్రపంచమంతయూ జలముచే ఆవరించబడియున్నది. పృథివి, పర్వతములు, మేఘములు, మూర్తిమంతములగు పదార్థములన్నియూ వారుణములే, జలస్తంభనచే ఏర్పడినవి.

భరద్వాజ ఉవాచ :-

కథం సలిలముత్పన్నం కథం చైవాగ్నిమారుతౌ

కథం వా మేదినీ సృష్టేత్యత్ర మే సంశయో మహాన్

భరద్వాజ మహర్షి పలికెను :- జలము అగ్ని మారుతములు పృథివి ఎట్లు సృష్టించబడినవి?

భృగురువాచ :-

బ్రహ్మకల్పే పురా బ్రహ్మన్ బ్రహ్మర్షీణాం సమాగమే

లోకసంభవసందేహః సముత్పన్నో మహాత్మనామ్

తేఽతిష్ఠస్థ్యానమాలంబ్య మౌనమాస్థాయ నిశ్చలాః

త్యక్తాహారాః స్పర్ధమానా దివ్యం వర్షశతం ద్విజాః

తేషాం బ్రహ్మమయీ వాణీ సర్వేషాం శ్రోత్రమాగమత్

దివ్యా సరస్వతీ తత్ర సంబభూవ నభస్తలాత్

పురా స్తిమితమాకాశమనన్తమచలోపమమ్

నష్టచన్ద్రార్కపవనం ప్రసుప్తమివ సంబభౌ

తతస్సలిలముత్పన్నం తమసీవ తమః పరమ్

తస్మాచ్చ సలిలోత్పీడాదుదతిష్ఠత మారుతః

యథా భవనమచ్ఛిద్రం నిశ్శబ్దమివ లక్ష్యతే

తచ్చాంభసా పూర్యమాణం స శబ్దం కురుతేఽనిలః

తథా సలిలసంరుద్దే నభసొంతే నిరంతరే

భిత్త్వార్లవతలం వాయుః సముత్పతతి ఘోషవాన్

ఏష వై చరతే వాయురర్ణవోత్పీడసంభవః

ఆకాశస్థానమాసాద్య ప్రశాంతిం నాధిగచ్ఛతి

తస్మి న్వాయ్వమ్బుసంఘర్షే దీప్తతేజా మహాబలః

ప్రాదురాసీదూర్థ్వశిఖః కృత్వానిస్తిమిరం తమః

అగ్నిః పవవసంయుక్తః ఖం సమాక్షిపతే జలమ్

తదగ్నివాయుసంపర్కాద్ఘనత్వముపపద్యతే

తస్యాకాశం నిపతితః స్నేహాత్తిష్ఠతి యోఽపరః

స సంఘాతత్వమాపన్నో భూమిత్వమనుగచ్ఛతి

రసానాం సర్వగంధానాం స్నేహానాం ప్రాణినాం తథా

భూమిర్యోనిరియం జ్ఞేయా యస్యాస్సర్వం ప్రసూయతే

పూర్వకాలమున బ్రహ్మ కల్పమున బ్రహ్మరుల సమాగమము వారికి లోకముల సృ షెట్లు జరిగెననేడు సందేహము కలిగెను. బ్రహ్మర్షులందరు నిశ్చలులై మౌనముగా ధ్యానమనవలంబించిరి. ఆహారమును స్వీకరించక పట్టుదలతో దీవ్యములగు నూరు సంవత్సరములు నిలిచిరి. అప్పుడు వారికందరికి బ్రాహ్మీవాక్కు చెవులపడెను. ఆకాశము నుండి సరస్వతీదేవి ఆవిర్భవించెను. నిశ్చలము అనంతమయమైన ఆకోశము మొదట నుండెను. సూర్యచంద్ర వాయ్వాది శూన్యమై నిద్రించిన దాని వలే నుండెను. తమస్సున ఉత్కృష్టమైన తమస్సు వలె ఆకాశము నుండి జలము పుట్టెను. సలిల పీడనము వలన వాయువు కలిగెను. ఛిద్రరహితమైన భవనము ఎట్లు నిశ్శబ్దముగా నుండును. అదే భవనము నీటితో నిండునపుడు వాయువు శబ్దమును కలిగించును. అట్లే సలిలిసంరోధము వలన నిరంతరమైన ఆకాశము నుండి చివర నున్న సముద్రములను భేదించుకొని ధ్వనించువాయువు సముత్పన్నమగును. సముద్రసంఘరణ వలన కలిగిన వాయువు అన్నిటిలో సంచరించును కాని ఆకాశ స్థానమును పొంది శాంతించదు. ఆ వాయుజలసంఘర్షము వలన ఉజ్వలమైన ప్రకోశము కల మహాబలమగు ఊర్ధ్వశిఖలు గల అగ్ని ఉత్పన్నమయేను. అగ్నిచే తిమిరము నశించును. వాయువులో కలిసిన అగ్ని ఆకాశము నుండి జలమును ఆవిర్భవింపచేయును. ఆ జలము అగ్ని వాయు సంపర్కము వలన ఘనత్వమును పొందును. ఆ ఘనపదార్థము ఆకాశము నుండి పతనమై అంతరాలముగ స్నేహము వలన నిలుచును. ఆ ఘనీ భూత పదార్థము సంఘాత రూపమును పొంది భూమిత్వమును పొందును. సర్వగంధములకు సర్వరసములకు స్నేహములకు ప్రాణులకు ముఖ్య కారణము ఈ భూమియే అని తెలియును. భూమినుండియే అన్నియూ పుట్టును.

భరద్వాజ ఉవాచ :-

య ఏతే ధాతవః పంచ రక్ష్యా యానస్పజత్ప్రభుః

ఆవృతా యైరిమే లోకాః మహాభూతాభిసంజ్ఞితైః

యదాఽసృజత్సహస్రాణి భూతానాం స మహామతిః

పశ్చాత్తే ష్వేకభూతత్వం కథం సముపపద్యతే

మానసుడు పంచ ధాతువులను సృజించెను. ఈ పంచ ధాతువులకే మహ భూతములను నామ మేర్పడెను. తరువాత లోకములనావరించెను. మహామతియైన మానస బ్రహ్మ వేల భూతములను సృజించెను కదా ! సృజించిన తరువాత వాటియందు భూతత్వమెట్లు సంభవించును?

భృగురువాచ :-

అమితాని మహాష్టాని యాన్తి భూతాని సంభవమ్

అత స్తేషాం మహాభూతశబ్ధోఽయముపపద్యతే

చేష్టా వాయుః ఖమాకాశమూష్మాగ్నిః సలిలం ద్రవః

పృధివీ చాత్ర సంఘాతః శరీరం పాంచభౌతికమ్

ఇత్యతః పంచభిర్యుకైర్యుక్తం స్థావరజంగమ్

శ్రోత్రే ఘ్రాణో రసస్స్పర్శో దృష్టి శ్చంద్రియసంజ్ఞతాః

భృగుమహర్షి పలికెను :- అమితములు మహాష్టములగు భూతములు సంభవించును. కావుననే వాటికి మహాభూత శబ్దముచే వ్యవహారము కలిగినది. చేష్ట వాయువు, శబ్ధమాకాశము, వేడి అగ్ని, ద్రవము సలిలము, సంఘాతరూపము పృధివి. కావున ఈ శరీరము పొంచభౌతికము. కావుననే స్థావరజంగమాత్మకమగు ఈ విశ్వమంతయు పంచభూతములతో కూడినదే. శ్రోత్రము, ఘ్రాణము, రసము, స్పర్శము, దృష్టి అను అయిదు ఇంద్రియములనబడును.

భరద్వాజ ఉవాచ :-

పంచభిర్యది భూతైస్తు యుక్తాస్థావర జంగమాః

స్థావరాణాం న దృశ్యంతే శరీరే పంచ ధాతవః

అనూష్మాణామచేష్టానామ ఘనానాం చైవ తత్త్వతః

వృక్షాణాం నోపలభ్యన్తే శరీరే పంచ ధౌతవః

న శృణ్వంతి న పశ్యంతి న గంధ రసవేదినః

న చ స్పర్శం హి జానన్తి తే కథం పంచ ధాతవః

అద్రవత్వాదనగ్నత్వాదభూమిత్వాదవాయుతః

ఆకాశస్యాప్రమేయత్వాత్ వృక్షాణాం నాస్తి భౌతికమ్

భరద్వాజ మహర్షి పలికెను :- స్థావర జంగమములన్నియూ పాంచభౌతికములని చెప్పుచున్నారు కదా ! కాని స్థావరముల శరీరమున పంచ ధాతువులు కనపడుట లేదు కదా ! ఊషరహితములకు, చేష్టారహితములకు, ఘన పదార్థములకు వాస్తవముగా వృక్షముల శరీరమున పంచధాతువులు కనపడుటలేదు కదా ! వృక్షములు వినలేవు, చూడలేవు, గంధమును, రసమును తెలియజాలవు. స్పర్శను కూడా తెలియవు. కావున వృక్షములు పాంచ భౌతికములెట్లగును? వృక్షములు ద్రవములు కావు, అగ్నిమయములు కావు, భూమికావు వాయు రూపములు కావు. అప్రమేయాకాశరూపములు కావు. కావున వృక్షములకు పాంచ భౌతికత్వము లేదు.

భృగురువాచ :-

ఘనానామపి వృక్షాణామాకాశోఽస్తి న సంశయః

తేషాం పుష్పఫలవ్యక్తిర్నిత్యం సముపపద్యతే

ఊష్మతో మ్లాయతే పర్ణం త్వక్ఫలం పుష్పమేవ చ

మ్లాయతే శీర్యతే చాపి స్పర్శ స్తేనాత్ర విద్యతే

వాంక్వుగ్న్యశనినిర్ఘోషై ఫలం పుష్పం విశీర్యతే

శ్రోత్రేణ గృహ్యతే శబ్దస్తస్మాచ్ఛృణ్వంతి పాదపాః

వల్లీ వేష్టయతే వృక్షాన్సర్వత శ్చైవ గచ్ఛతి

న హ్యాదృష్టశ్చ మార్గోఽస్తి తస్మాత్పశ్యంతి పాదపాః

పుణ్యా పుణ్యైస్తథాగంధైర్దూ పైశ్చ వివిధైరపి

అరోగాః పుష్పితాస్సన్తి తస్మాజ్జిఘ్రన్తి పాదపాః

సుఖదుఃఖయోర్గృహాణాచ్ఛిన్నస్య చ విరోహణాత్

జీవం పశ్యామి వృక్షాణామచైతన్యం న విద్యతే

తేన తజ్జలమాదత్తే జలమన్నంచ మారుతా

ఆహారపరిణామాచ్చ హ్రసో వృద్ధిశ్చ జాయతే

జంగమానాం చ సర్వేషాం శరీరే పంచధాతవః

ప్రత్యేకశః ప్రభిద్యంతే మైశ్శరీరం విచేష్టతే

త్వక్చ మాంసం తథాస్థీని మజ్జా స్నాయుశ్చ పంచమః

ఇత్యేతదిహ సంఘాతం శరీరే పృథివీమయే

తేజో హ్యగ్ని స్తథా క్రోధశ్చక్షుష్మా తథైవ చ

అగ్నిర్జనయతే యచ్చ పంచాగ్నేయా శరీరిణః

శ్రోత్రం ఘ్రాణం తథాస్యం చహృదయం కోష్టమేవ చ

ఆకాశాత్ప్రాణినామేతే శరీరే పంచ ధాతవః

శ్లేష్మా పిత్తమథ స్వేదో వసా శోణితమేవ చ

ఇత్యాపః పంచధా దే హే భవంతి ప్రాణినాం సదా

ప్రాణాత్ప్రీణయతే ప్రాణీ వ్యానాద్యాయచ్చతే తథా

గచ్ఛత్యపానోఽథశ్చైవ సమానో హృద్యవ స్థితః

ఉదానాదుఛ్ఛ్వసితీతి పంచభేదాచ్చ భాషతే

ఇత్యేతే వాయవః పంచ వేష్టయంతీహ దేహినమ్

భూమేర్గంధగుణాన్వేత్తి రసం చాద్భ్యశ్శరీరవాన్

తస్య గంధస్య వక్ష్యామి విస్తారాభిహితాన్గుణాన్

ఇష్టశ్చానిష్టగంధశ్చ మధురః కటురేవ చ

నిర్హారీ సంహత స్నిగ్ధో రూక్షో విశద ఏవ చ

ఏవం నవవిధ జ్ఞేయః పార్థివో గంధవిస్తరః

జ్యోతిః పశ్యతి చక్షుర్భ్య స్పర్శం వేత్తి చ వాయునా

శబ్దస్పర్శశ్చ రూపం చ రసశ్చాపి గుణాస్మృతాః

రసజ్ఞానం తు వక్ష్యామి తన్మే సాగదతశ్శృణు

రసో బహువిధః ప్రోక్త ఋషిభిః ప్రథితాత్మభిః

మధురో లవణ సీక్త కషాయోఽమ్లః కలుస్తథా

ఏష షడ్విధవిస్తారో రసో వారిమయస్స్మృతః

శబ్దస్పర్శశ్చ రూపం చ త్రిగుణం జ్యోతిరుచ్యతే

జ్యోతిః పశ్యతి రూపాణి రూపం చ బహుధా స్మృతమ్

హ్రస్వో దీర్ఘస్తథా స్థూలశ్చతురస్రోఽణు వృత్తనాన్

శుక్ల కృష్ణస్తథా రక్తో నీలః పీతోఽ రుణస్తథా

కఠినశ్చిక్కణ శ్లక్షః పిచ్ఛలో మృదు దారుణః

ఏవం షోడశవిస్తారో జ్యోతీ రూపగుణస్స్మృతః

తత్రైవ గుణమాకాశం శబ్ద ఇత్యేవ తత్స్మృతమ్

తస్య శబ్దస్య వక్ష్యామి విస్తరం వివిధాత్మ కమ్

షడ్జో ఋషభ గాంధారౌ మధ్యమో దైవతస్తథా

పంచమశ్చాపి విజ్ఞేయస్తథా చాపి నిషాదవాన్

ఏష సప్తవిధః ప్రోక్తో గుణ ఆకాశసంభవః

ఐశ్వర్యేణ తు సర్వత్ర స్థితో పి పటహాదిషు

మృందగభేరీశంఖానాం స్తనయిత్నో రథస్య చ

ఏవం బహువిధాకరశ్శబ్ద ఆకాశసంభవః

వాయవ్యస్తు గుణస్పర్శస్పర్శశ్చ బహుధా స్మృతః

ఉష్ణశ్శీతస్సుఖo దుఃఖం స్నిగ్ధో విశద ఏవ చ

తధా ఖరో మృదుశ్లక్షో లఘర్గురుతరోఽపి చ

శబ్దస్పర్శే తు విజ్ఞేయౌ ద్విగుణా వాయురిత్యుత

ఏమమేకాదశవిధో వాయవ్యో గుణ ఉచ్యతే

ఆకాశజం శబ్దమాహురేభిర్వాయుగుణైస్సహా

అవ్యాహతై శ్చేతయతి న వేతి విషమా గతిః

ఆప్యాయం తే చ తే నిత్యం ధాతవస్తైస్తు ధాతుభి:

ఆపోఽగ్నిర్మారుతశ్చేవ నిత్యం జాగ్రతీ దేహిషు

మూలమేతే శరీరస్య వ్యాప్య ప్రాణానిహ స్థితాః

పార్థివం ధాతుమాసాద్య యథా చేష్టయతే బలీ

శ్రితో మూర్థానమగ్నిస్తు శరీరం పరిపాలయేత్

స్త్రీ మూర్థనివాగ్నౌ చ వర్తమానో విచేష్టతే

ప జనుస్సర్వభూతాత్మా పురుషస సనాతనః

మనోబుద్ధిరహంకారో భూతాని విషయశ్చ సః

ఏవం త్విహా ప సర్వత్ర ప్రాణైస్తు పరిపొల్యతే

పృష్ఠతస్తు సమానేన స్వాం స్వాం గతిముపాశ్రితః

వస్తిమూలం గుదం చైవ పావకం సముపాశ్రితః

వహన్మూత్రం పురీషం వాస్యపానః పరివర్తతే

ప్రయత్నే కర్మ నియమే య ఏకస్త్రిషు వర్తతే

ఉదాన ఇతి తం ప్రాహుగధ్యాత్మ జ్ఞానకోవిదాః

సంధిష్వపి చ సర్వేషు సన్నివిష్టస్తథానిలః

శరీ రేసు మనుష్యాణాం వ్యాన ఇత్యుపదిశ్యతే

బాహుష్వగ్నిస్తు వితతస్సమానేన సమీరిత

రసాన్నపోహదోషాంశ్చ వర్తయన్నతి చేష్టతే

అపానప్రాణయోర్మధ్యే ప్రాణాపానసమీహితః

సమన్వితస్త్వధిష్టానం సమ్యక్పచతి పావకః

ఆస్యం హి పాయుపర్యన్తం అంతే స్యాద్గుదసంజ్ఞితే

రేతస్మస్మాత్ప్రజయంతే సర్వస్రోతాంసీ దేవానామ్

ప్రాణానాం సన్నిపాతాచ్చ పన్నిపొతః ప్రజాయతే

ఊష్మా చాగ్నిరీతి జ్ఞేయో యోఽన్నం పచతి దేహినామ్

అగ్నీ వేగవహాః ప్రాణో గుదొలతే ప్రతిహన్యతే

ప ఊర్ధ్వమాగమ్య పునః సముత్కిపతి పొవకమ్

పక్వాశయస్త్వథో నాభ్యా ఊర్థ్వవమాశయస్స్మృతః

నాభిమూలే శరీరస్య సర్వే ప్రాణాశ్చ సంస్థితాః

ప్రస్థితో హృదయాత్సర్వే తిర్యగూర్ధ్వమధస్తథా

వహంత్యన్నరసాన్యాడ్యో దశప్రాణ ప్రచోదితాః

ఏష మార్కోఽపి యోగానాం యేన గచ్ఛంతి తత్పదమ్

జతక్లమాస్సమా ధీరా మూర్థన్యాత్మానమాదధన్

ఏవం సర్వేషు విహితప్రాణాపానేషు దేహినామ్

తస్మిన్సమిధ్యతే నిత్యమగ్నిస్థల్యామీవాహితః

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ద్వితీయపాదీ భృగుభరద్వాజసంవాదే జగదుత్పత్తి వర్ణనం నామ ద్విచత్వారింశోఽధ్యాయః

భృగు మహర్షి పలికేను :- ఘన స్వరూపములైన వృక్షములలో కూడా ఆకాశమున్నది. సంశయము లేదు. వృక్షములకు పూవులుపూయుట పండ్లు కాయుట నిత్యము కనపడుచునేయున్నది. వేడివల్లనే ఆకులు. చర్మ, పండు, పూవువాడిపోవును పోడుచున్నది రోలుచున్నది కావున వృక్షములకు స్పర్శ ఉన్నది. వాయునుచే అగ్నిచే ఈ పిడుగుచే ఏర్పడిన ధ్వనులే పండ్లు పూవులు రాలిపడుచున్ద్నవి. ధ్వనిని శ్రోత్రములచే మాత్రమే గ్రహించవలయును. ధ్వనిచే గొలుచున్నవి కావున చేట్లు శబ్దమును వినుచున్నవి. తీగలు చెట్టును చుట్టుకొని ఆంతటా పొకును, ముందుకు సొగవలయునన్న దృష్టి కావలయును కదా. తీగలు పొకుచున్నవి కావున చెట్లు చూచుచున్నవి. పవిత్రములైన అపవిత్రములైన గంధములచే, ధూపములచే వృక్షములు రోగరహితములుగా పుష్పితములుగా మనగలుగుచున్నవి కావున వృక్షములు వాసన చూచుచున్నవి. సుఖమును దుఃఖమును వాడుట విప్పారుటలచే అనుభవించుచున్నవి. నరికిన మరల చిగుర్చుచున్నవి. కావున వృక్షములకు ప్రాణమున్నది. అచైతన్యము లేదు. ప్రాణమున్నది కావున జలమును గహించుచున్నది, గ్రహించిన జలమును జీర్ణించుకోనుచున్నది. జీర్ణమగుచున్నది కావున వాయువును గ్రహించుచున్నది, తీసుకొనిన ఆహారమును జీర్ణము చేసుకొనుచున్నది. కావుననే ఆహారము మాగినపుడు తరుగుట పెరుగుట సంభవించుచున్నది. అన్ని జంగమముల శరీరములలో ప్రత్యేకించి పంచధాతువులు భిన్నములుగా ఉండును. పంచధాతువులచే శరీరము చేష్టలను కలిగియుండును. చర్మము, మాంసము, అస్తులు, మజ్జ (కొవ్వు) స్నాయువు అను అయిదింటి సమూహము పృథివీమయమగు శరీరమున ఉండును. తేజస్సు, అగ్ని, క్రోధము, నేత్రములు, ఊష్మము అను అయిదింటిని శరీరమున అగ్ని కలిగించును. శ్రోత్రము, ఘ్రాణము, ఆస్యము, హృదయము, కోష్ఠము అను అయిదు ధాతువులు ఆకాశమువలన శరీరమున సంభవించును. శ్లేష్మము, పిత్తము, స్వేదము, వసా, రక్తము అని జలము అయిదు విధములుగా శరీరముననుండును. ప్రాణి ప్రాణముచే తృప్తి పొందును. వ్యానముచే తృప్తిని బయలుపరుచును. అపానము అధోదేశమునుండి వెడలును. సమానము హృదయముననుండును. ఉదానముతో గాలి పీల్చుకొనును. ఇట్లు అయిదు వాయువులు శరీరమున వ్యాపించియుండును. దేహి భూమినుండి గంధగుణములను, జలమును రసములను గ్రహించును. ఇపుడు గంధగుణములను విస్తరముగా చెప్పెదను వినుము. ఇష్టము, అనిష్టము, మధురము, కటువు, నిర్దారి, సంఘాతము, స్నిగ్ధము, రూక్షము, విశదము అని పొర్థివగంధములు తొమ్మిది విధములు. నేత్రములచే వెలుగును చూచును, వాయువుచే స్పర్శను తెలియును, శబ్ద స్పర్శరూపరసములు గుణములనబడును. ఇక ఇపుడు రస జ్ఞానమును 'చెప్పుచున్నౌను వినుము. జ్ఞానులగు ఋషులు బహువిధరసములను చెప్పియున్నారు. మధురము, లవణము, కారము, వగరు, పులుపు, చేదు అను ఆరు రసములు జలమయములు. శబ్దస్పర్శరూపములు జ్యోతిర్గుణములందురు. వెలుగే రూపములను చూచును. ఆ రూపము. బహువిధము, పొట్టి, పొడుగు, లావు, నాలుగుమూలము, అణువు, వృత్తము, తెలుపు, నలుపు, ఎఱుపు, నీలము, పసుపుపచ్చ, అరుణము, కఠినము, ముదురు, లేత, నునుపు, మెతన, భయమును కలిగించునది అని జ్యోతియొక్క రూపగుణములు పదునోరు విధములు. ఆకాశమునకు ఒక ఓ గుణము. అదియే శబ్దము. ఇపుడు శబ్దములయొక్క వివిధ స్వరూపములను విస్తరముగా చెప్పెదను, షడ్జ, ఋషభ, గాంధార, మధ్యమ, ధైవత, పంచమ నిషాదములని ఏడు విధములగు  శబ్దగుణములు ఆకాశ సంభవములు. ఈశ్వర రూపముగా అంతట శబ్దమున్నను, పటహ, మృదంగ, భేరి, శంఖ, మేఘ రధాదులయందు కలుగు ధ్వని ఆకాశసంభవమే, వాయుగుణము స్పర్శ. స్పర్శ పలువిధములుగా నుండును. ఉష్ణ, శీత, సుఖ, దుఃఖ, సిద్ధ, విశద, కఠిన, మృదు, శ్రేక్ష, లఘు, గురువులు  అనునవి శబ్దస్పర్శములు రెండింతలు వాయుస్పర్శలు. ఇట్లు వాయుగుణమగు స్పర్శ పదకొండు విధములు. ఈ పోయుగుణములతో కలిసిన శబ్దము ఆకాశమువలన జనించును. సంఘర్షమువలన, సంఘర్షము లేక కూడా కలుగుట శబ్దముయొక్క విషమగతి. ఇట్లు పంచధాతువులచే ధాతువులు వృద్ధి చెందించబడును. శరీరధారులయందు నీరు నిప్పుగాలి ఎప్పుడూ జాగరూకతతో నుండును, శరీరమునకు ఇవియే మూలములు. ప్రాణములను వ్యాపించియుండును. పార్ధివధాతువును పొందుటచే బలము గలవాడై చేష్టలు చేయును, శిరోస్థానముననున్న అగ్ని శరీరమును పరిపొలించుచుండును. ప్రాణము శిరమున వాని అగ్నిలోకాని నివసించుచు తిరుగుచుండును. ఆ ప్రాణమే ఆత్మరూపముగా సనాతన పురుషునిగా ఉండును. మనస్సు బుద్ది అహంకారము భూతములు విషయములు అన్నియూ అతనే. ఇట్లు శరీర అంతట ప్రాణములచే పరిపాలించబడుచుండును, ఉపస్థమూలమును గుదమున ఉన్న అగ్నిని ఆశ్రయించు అపానము మూత్ర పురీషములను గ్రహించును, విసర్జించును, ప్రయత్నమునందు, కర్మలయందు, నియమములందు మూడింటియందు ఒకటిగా నుండునది ఉదానమనబడును. మనుష్య శరీరములలోని అన్ని సంధులలోనుండు దానిని వ్యానమందురు. బాహువులలో విస్తరించియున్న అగ్ని సమాన వాయువుచే ప్రేరేపించబడి రస అన్నాది దోషములను నివారించుచుండును. అపాన ప్రాణముల మధ్యమున ప్రాణాపానములచే చక్కగా కలిసి అధిష్టానమును చక్కగా పాకము చేయును. ఆస్యమునుండి పొయువువరకూ చివరి గుదమువరకు వ్యాపించియున్న అగ్ని, వాయువుల సంయోగమువలన రేతస్సు జనించును. దానినుండి దేహిద్వారములు ఏర్పడును. ద్రోణముల సన్నిహితముచే సన్నిహిత వ్యాధి ఏర్పడును. ఊష్మమే అగ్ని. ఈ అగ్నియే అన్నమును, జీర్ణము చేయును. అగ్ని వేగముతో తిరుగుచున్న ప్రాణము గుదాంతమున త్రిప్పిపంపబడును. అట్లు ఊర్ధ్వభాగమునకు వచ్చి అగ్నిని ప్రజ్జ్వలింపచేయును. నాభికి క్రింది భాగమున పక్వాశయముండును, నాభికి పైభాగమున ఆమాశయముండును. శరీరముయొక్క ప్రాణములన్నియు నాభిమూలమున నిలిచియుండును. హృదయమునుండి పైకి, క్రిందికి అడ్డముగా ప్రసరించియున్న నొడులు అన్నరసములను దశ ప్రాణముల బలముచే వహించుచుండును. ఈ నాడీ మార్గముననే యోగులు పరమపదమును చేరెదరు. వీరు శ్రమను బాధను జయించి సమవర్తులై ధీరులై శిరోభాగమున ప్రాణములను నిలిపి పరమధామమును చేరెదరు. ఇట్లు అన్ని ప్రాణులలో నియమముగా నుండు అగ్ని ప్రాణాపానాదులలో స్థాలిలో ఉంచిన పదార్థమువలె చక్కగా నిలిచి ప్రవహించుచు పెరుగుచు దేహిని చేష్టామయుని చేయును.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున భృగుభరద్వాజసంవాదమున జగదుత్పత్తి వర్ణనమను నలుబది రెండవ అధ్యాయము సమాప్తము.