78 - అవంతికా మాహాత్మ్యమ్

మోహిన్యువాచ :-

అత్యద్భుత మిదం విప్ర మాహాత్మ్యం నర్మదా భవమ్

శ్రుతం త్వయా నిగదీతం నృణాం పాప వినాశనమ్ 

అధునాతు మహాభాగ బ్రూహి మేకవంతి సంభవమ్

మాహాత్మ్యం దేవ వన్ద్యస్య మహాకాలస్య చ ప్రభో

మోహిని పలికెను:-

ఓ బ్రాహ్మణోత్తమా ! నర్మదా మాహాత్మ్యము అత్యద్భుతము. నరులకు పాప వినాశము. నీవు చెప్పగా వింటిని. మహానుభావా? ఇపుడు అవంతికా మాహాత్మ్యమును తెలుపుము. అట్లే దేవవన్యుడగు మహాకాలుని మాహాత్మ్యమును కూడా తెలుపుము.

వసురువాచ : -

శృణు భద్రే ప్రవక్ష్యామి హ్యవంత్యాః పుణ్యదం నృణామ్

మాహాత్మ్యం సర్వపాపఘ్నం యధావత్పరి కీర్తితమ్

మహాకాల వనం పుణ్యం తపస్థాన మనుత్తమమ్

యత్ర దేవో మహాకాల స్థితస్తపసి నిత్యదా

మహాకాల వనాక్షేత్రం నాపరం విద్యతే భువి

యత్ర గత్వా నరో దేవి స్పర్థతే దైవతై స్సహ కపాల

మోచనం నామ యత్ర తీర్థం సులోచనే

తత్ర స్నాత్వా నరో భక్త్యా బ్రహ్మహాపి విశుద్ధ్యతి

తథావకలకలే శాఖ్యం దేవమభ్యర్చ్య మానవః

వివాదే జయ మాప్నోతి కార్య సిద్ధిం చ సంతతమ్

ఆత్రాన్యదప్సరః కుండం తీర్థం తత్ర ప్లుతో నరః

 సుభగో భోగ వాన్భూయా త్సాక్షాత్కన్దర్ప సన్నిభః

మహిషాఖ్యే తధా కుండే స్నానశ్శత్రూ షోయేద్రణే

స్నాతస్తు రుద్ర సరసి రుద్రలోకే మహీయతే

కుండలేశ్వర మాసాద్య సమభ్యర్చ్య విధానతః

వ్యాపారే లాభమాప్నోతి జాయతే చ శివప్రియః

 విద్యాధరాహ్వయే తీర్థ నరస్నాత్వా విశుద్ధ్యతి

మార్కండేశ్వర మభ్యర్య దీర్ఘాయుశ్చ ధవీ భవేత్

సంపూజ్య శీతలాం దేవీం నరః కాలవనే స్థితామ్

విస్ఫోటకమయం నైవ కదాచిత్తస్య జాయతే

స్వర్గ ద్వారం సమాసాద్య స్నాత్వా భ్యర్చ్య సదాశివమ్

నరో న దుర్గతిం యాతి స్వర్గలోకే మహీయతే 

రాజస్థలం నరః ప్రాప్య తతః సాముద్రికే ప్లుతః

స్నానస్య సర్వతీర్ణానాం లభతే ఫలముత్తమమ్

శంకరస్య తథా వాప్యాం స్నాత్వా నియమవాన్నరః

ప్రాపేహ వాంఛితాన్ఫోగా నంతే రుద్రపురం వ్రజేత్

శంకరాదిత్యమభ్యర్య నరస్స్యాద్దుష్క్రధర్షణ 

స్నాతస్తు నీలగంగాయాం దేవీం గన్గవతీం నరః

సంపూజ్య భక్తి భావేన సర్వపాపైః ప్రముచ్యతే

దశాశ్వమేధికే స్నాత్వా వాజిమేధఫలం లభేత్ అధ

మర్త్యస్సమాసాద్య ఏకానంశాం సురేశ్వరీమ్

సంపూజ్య గంధపుష్పాద్యై స్సర్వాన్కామానవాప్నుయాత్

హరసిద్ధిం నర్యోభర్చ్య సర్వసిద్ధేశ్వరో భవేత్

పిశాచకాదికాన్మర్త్య స్సమభ్యర్చ్య చతుర్దశ

సర్వాన్కామానవాప్నోతి నాత్ర కార్యా విచారణా

హనుమత్కేశ్వరం ప్రార్చే త్స్నాత్వా రుద్ర

సరోవరే యో నర శ్రద్ధయాయుక్త స్సలభేత్సంపదోఖిలాః

వాల్మీకేశ్వర మభ్యర్చ్య సర్వవిద్యానిధిర్భవేత్

శుక్రేశ్వరాది లింగాని యోర్చయే ఛ్ఛద్ధయా నరః

సస్యాధఖిల భోగాఢ్య స్సర్వ రోగవివర్జితః

పంచేశానం సమభ్యర్చ స్యాన్నరస్సర్వ సిద్దిభాక్

కుశస్థలీం పరిక్రమ్య వాంచితం లభతేఫలమ్

అక్రూరేశంతు సంపూజ్య క్రూరేభ్యోష్యభయం లభేత్

మందాకిన్యాం సమాపుత్య గంగాస్నాన ఫలం లభేత్

అంకపాదం నర్యోభర్చ్య శివస్యానుచరో భవేత్

చంద్రాదిత్యం ప్రపూజ్యాధ భోగాన్నానావిధాంల్లభేత్

వసువు పలికెను :-

నరులకు పుణ్యప్రదము, సర్వ పాపహరము అగు అవంతీ మాహాత్మ్యమును చేప్పెదను వినుము. మహాకాల వనము పరమ పావనము సాటిలేని తపస్థానము. ఇచటనే మహాకాల దేవుడు ఎల్లపుడూ తపమునాచరించు చుండును. ఈ భూమండలమున మహాకాల వనమును మించిన క్షేత్రము మరియొకటీ లేదు. ఇచటికి వెళ్ళిన వారు దేవతలతో పోటీ పడుదురు. ఇచటనే కపాలమోచనమును తీర్థము కలదు. ఇచట స్నానమాడిన వారు బ్రహ్మాహత్య నుండి విముక్తులగుదురు. అట్లే కలవలేశాఖ్య దేవుని పూజించిన వారు వివాదములలో విజయమును, కార్యసిద్ధిని పొందెదరు. ఇచటనే అప్పరః కుండమను తీర్థము మరియొకటి కలదు. ఇచట సామాడినవారు మన్మధుని వంటి రూపవంతుడు భోగవంతుడు కాగలడు. మహీష తీర్థమున స్నానమాడిన వారు శత్రువులను జయించెదరు. రు దసరస్సున స్నానమాడిన వారు రుద్రలోకమున విహరించును. కుండలేశ్వరుని చేరి యధావిధిగా పూజించిన వారు వ్యాపారమున లాభము బడయుదురు. శివునికి ప్రీతిపాత్రులగుదురు. విద్యాధర తీర్థమున స్నానమాడిన వారు పరిశుద్ధిని పొందెదరు. మార్కండేశ్వరుని పూజించిన వారు దీర్ఘాయుష్మంతులు ధనవంతులగుదురు. కాలవనమునందున్న శీతలాదేవిని పూజించిన వారికి ఎపుడూ విస్పోటకము రాదు. స్వర్గ ద్వారమునకు వెళ్ళేదరు. రాజస్థలమును చేరి అచట సముద్ర జలమున స్నానమాడిన వారు సర్వతీర్థ స్నాన ఫలమును పొందెదరు. శంకర వాపియందు నియమముతో స్నానమాడిన వారు ఇహమున అభీష్టభోగములనను భవించి అంతకాలమున రుద్రలోకమును చేరును. శంకరాదిత్యుని పూజించిన వారు ఇతరులచే గెలువ బడ జాలరు. నీలగంగలో స్నానమాడి గంధవతీదేవిని పూజించిన వారు సర్వపాప వినిర్ముక్తులగుదురు. దశాశ్వమేధ తీర్థమున స్నానమాడిన వారు అశ్వమేధ యాగ ఫలమును పొందెదరు. సురేశ్వరీ దేవిని చేరి గంధపుష్పాదులచే పూజించినవారు సర్వాభీష్టములను బడయుదురు. హరిసిద్ధిని పూజించి సర్వసిద్ధీశ్వరుడగును. పిశాచికాదులను పదునాలుగు మందిని పూజించి సర్వాభీష్టములను బడయును. రుద్ర సరోవరమున స్నానమాడి శ్రద్ధచే హనుమత్కేశ్వరుని పూజించి నవారు అఖిల సంపదలను పొందగలరు. వాల్మీకేశ్వరుని పూజించిన వారు సర్వవిద్యానిధీ కాగలరు. శుక్రేశ్వరాదీ లింగములను శ్రద్ధతో పూజించిన వారు సర్వరోగ వివర్జితులై అఖిల భోగాఢ్యులయ్యేదరు. పంచేశానుని పూజించిన వారు సర్వసిద్ధులను పొందును. కుశస్థితిని ప్రదక్షిణ మాచరించి వాంఛితములను పొందును. అక్రూరేశుని పూజించి క్రూరులనుండి అభయమును పొందగలడు. మందాకినిలో స్నానమాడిన వారు గంగా స్నాన ఫలమును పొందును. అంక పాదుని పూజించిన వారు శివానుచరులగుదురు. చంద్రాదిత్యుని పూజించిన వారు నానావిధ భోగములను పొందగలరు.

కరభేశ్వరమభ్యర్చ్య యాన సౌఖ్యమవాప్నుయాత్

లడ్డుక ప్రియ విఘ్నేశం సమభ్యర్చ్య సుఖీ భవేత్

కుసుమేశాదికాన్పార్య సర్వాన్ఫోగాన్సమశ్నుతే

యజ్ఞ వాప్యాం నరస్స్నాత్వా మార్కండేశం సమర్చ్య చ

సర్వయజ్ఞ ఫలం లభా యుగమేకం వసేద్దివి

సోమవత్యాం నరసాన్ని త్వా భ్యర్య సోమేశ్వరం

సతి వాంఛితాం ల్లభతే కామా నిహాముత్ర చ మోహిని

యాతనాకలనే స్నాత్వా యాతనం నైవ పశ్యతి

నరకేశం సమభ్యర్చ్య స్వర్గ లోకగతిం లభేత్

కేదారేశం తతః ప్రార్చ్య రామేశ్వర మధాపీ వా

సౌభార్యేశం నరాదిత్యం లభతే వాంఛితం ఫలమ్

కేశవార్కంతు సంపూజ్య నరస్స్యాత్కేశవప్రియః

శక్తి భేదే తలస్నాత్వా ముచ్యత్కేతుగ్రసంకటాచ్

స్వర్ణక్షుర బ్రహ్మవాప్యాం స్నాత్వాభ్యర్యాభయేశ్వరమ్

అగస్త్యేశం చ విధిజే సంపదామయనం భవేత్

ఓంకారే శాది లింగాని యో నరసమ్య గర్చయేత్

స లభేదఖిలా న్కామా న్మహేశస్య ప్రసాదతః

మహాకాలవనే దేవి లింగసంఖ్యా న విద్యతే

యత్ర తత్ర స్థితం లింగం సంపూజ్య స్యాచ్చివప్రియః

తధా కనక శృంగాహ్వా కుశస్థల్యప్య వంతికా

తధా పద్మావతీ దేవీ కుముద్వత్యుజ్జయిన్యపి

ప్రతికల్పాభిధా భిన్నా విశాలాఖ్యా మరావతీ

శిప్రాయాం వై నరస్నాత్వా యో మహేశం సమర్చయేత్

స లభేత్సకలాన్కామా న్దేవయోస్తు ప్రసాదతః

స్నాత్వా తు గోమతీకుండే స్వర్గతం లభతే నరః

కుండేతు వామనే స్నాత్వా స్తోతి నామ సహస్రతః

శ్రీధరం సర్వదేవేశం యస్ససాక్షాద్ధరిర్భువి

స్నాత్వా వీరేశ సరసి యోఃర్చయే త్కాల భైరవమ్

స సర్వా సంపదో భుక్త్యా శివలోక మవాప్నుయాత్

యః కుటుంబేశ్వరం ప్రాప్య పూజయే దుప చారకై:

సంప్రాప్య వివిధాన్కామా నంతే స్వర్గగతిం లభేత్

దేవ ప్రయాగ సరసి యోర్చయే ద్దేవ మాధవమ్

సభక్తిం మాధవే ప్రాప్య పదం విష్ణోస్సమాప్నుయాత్

కకరాజస్య తీర్థతు స్నాత్వా ప్రయతమానసః

సర్వరోగ వినిర్ముక్తో ఝానీ భోగీ భవేత్సతి

అంతర్గృహస్య యాత్రాయాం విఘ్నేశం భైరవం హ్యూమామ్

రుద్రాదిత్యా స్సురానన్యా న్యోతిర్చయే చ్ఛద్దయా నరః

యధా లభోప చారాద్యై స్సభవేత్సర్గ లోక భాక్ .

రుద్రసరః ప్రభృతి షు తీర్ధానన్యాని భామిని

బహూని తేషు చౌభ్యర్చ్య శంకరం స్యాత్సుఖీ నరః

అష్టతీర్థ్యాం నరస్నాత్వా సాంగం యాత్రా ఫలం లభేత్

కాలారణ్యస్య విధిజే సత్యం సత్యం మయోచితమ్

ఏతత్తే సర్వమాఖ్యాతం మాహాత్మ్యం పాపనాశనమ్

అవన్యా యన్నర శ్రుత్వా సర్వపాపైః ప్రముచ్యతే .

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున అవంతికా మాహాత్మ్యమను అష్టసప్తతిమోధ్యాయము.

కరభేశ్వరుని పూజించిన వారు వాహన సౌఖ్యమును పొందెదరు. లడుక ప్రియ వీ ఘ్నేశుని పూజించిన వారు సుఖాన్వితులగుదురు. కుసుమేశాదీకులను పూజించిన వారు సర్వభోగములను పొందెదరు. యజ్ఞవాయందు స్నానమాడి మార్కండేశుని పూజించిన వారు సర్వ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమున ఒక యుగ కాలము నివసించును. సోమవతీ తీర్థమున స్నానమాడి సోమేశ్వరుని పూజించి ఇహపరములందు పాంఛితార్థములను పొందగలరు. యాతనా కలనమున స్నానమాడిన వారు యాతనలను చూడ జాలరు. నరకేశుని పూజించిన వారు స్వర్గమును పొందెదరు. కేదారేశుని, రామేశ్వరుని, సౌభాగేశుని, నరాదిత్యుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. కేశవార్కుని పూజించిన వారు కేశవప్రియులయ్యేదరు. శక్తిభేదమున స్నానమాడిన వారు అత్యుగ్ర సంకటముల నుండి విముక్తులగుదురు. స్వర్ణక్షుర బ్రహ్మవాపి యందు స్నానమాడి అభయేశ్వరుని అగస్త్యేశుని పూజించి సర్వ సంపదలను పొందును. ఓంకారేశాది లింగములను పూజించిన వారు మహేశ ప్రసాదము వలన సకలాభీష్టములను పొందగలడు. మహాకాలవనమున లింగ సంఖ్యలేదు. అచట ఉన్న లింగమును పూజించిన వారు శివప్రియులయ్యేదరు. అట్లే కనకశృంగా కుశస్థలీ, అవంతికా, పద్మావతీదేవి, కుముద్వతీ ఉజ్జయినీ, ప్రతికలా, విశాలా, అమరావతీ మొదలగు పుణ్యతీర్థ క్షేత్రములెన్నియో కలవు. శిప్రానదిలో స్నానమాడి మ హేశుని పూజించిన వారు సకలాభీష్టములను పొందగలరు. గోమతీ కుండమున స్నానమాడిన వారు స్వర్గమును చేరెదరు. వామనకుండమున స్నానమాడి సర్వదేవేశుడగు శ్రీధరుని సహస్రనామములతోస్తుతించు వారు సాక్షాత్తు శ్రీహరి యగును. వీరేశ సరస్సున స్నానమాడి కాలభైరవుని పూజించిన వారు ఇహమున సకల సంపదల ననుభవించి అంతమున శివలోకమును చేరును. కుటుంబేశ్వరుని చేరి ఉపచారములచే పూజించిన వారు సకల కామనలను పొంది అంతమున స్వర్గమును చేరును. దేవప్రయాగ సరస్సున దేవమాధవుని పూజించిన వారు శ్రీహరి యందు భక్తిని పొంది అంతమున విష్ణులోకమును చేరును. కనకరాజ తీర్థమున నియతమనస్కులై స్నానమాడిన వారు సర్వరోగ వినిర్ముక్తులై ధనవంతులు, భోగవంతులు అయ్యేదరు. అంతరహయాత్రయందు విఘ్నేశుని భైరవుని, ఉమాదేవిని, రుద్రులను, ఆదిత్యులను, ఇతర దేవతలను శ్రద్ధతో పూజించినవారు స్వర్గలోకమును పొందెదరు. రుద్ర సరస్సు మొదలగు తీర్థములు చాలా కలవు. ఈ తీర్ధములలో శంకరుని పూజించిన వారు సుఖవంతులగుదురు. అష్టతీర్థయందు స్నానమాడిన వారు సమగ్ర యాత్రా ఫలమును పొందెదరు. ఇది పాపనాశకమగు అవన్తో మాహాత్మ్యము. నీకు సమగ్రముగా చెప్పితిని. దీనిని వినిన వారు సర్వపాప వినిర్ముక్తులయ్యెదరు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున అవంతికా మాహాత్మ్యమను డెబ్బది యెనిమిదవ అధ్యాయమ.