నారద మహా పురాణము
25 - అధ్యయనాదిధర్మనిరూపణమ్
సనక ఉవాచ :-
వర్ణాశ్రమాచారవిధిం ప్రవక్ష్యామి విశేషతః।
శృణుష్వ తన్ము నిశ్రేష్ఠ ! సావధానేన చేతసా॥
యస్స్వధర్మం పరిత్యజ్య పరధర్మం సమాచరేత్।
పాషండస్స హి విజ్ఞేయస్సర్వధర్మబహిష్కృతః॥
గర్భాధానాధిసంస్కారాః కార్యా మంత్రవిధానతః।
స్త్రీణామమంత్రతః కార్యా యథాకాలం యథావిధి॥
సీమంతకర్మ ప్రథమం చతుర్దే మాసే శస్యతే।
షష్టే వా సప్తమే వాపి అష్టమే వాపి కారయేత్॥
జాతే పుత్రే పితా స్నాత్వా సచేలం జాతకర్మ చ।
కుర్యాచ్చ నాందీశ్రాద్ధం చ స్వస్తివాచనపూర్వకమ్॥
హేమ్నా వా రజతే నాపి వృద్దాశ్రాద్ధం ప్రకల్పయేత్।
అన్నేన కారయేద్యస్తు స చండాలసమో భవేత్॥
కృతాభ్యుదయినం శ్రాద్ధం పితా పుత్రస వాణ్యతః।
కుర్వీత నామనిర్దేశం సూతీకాంతే యథావిధి॥
అస్పష్టమర్ధహీనం చ హ్యతిగుర్వక్షరాన్వితమ్।
న దద్యాన్నామ విప్రేన్ద్ర తథా చ విషమాక్షరమ్॥
తృతీయవర్షే చౌలం చ పంచమే షష్ఠసమ్మితే।
సప్తమే చాష్ట్రమే వాపి కుర్యాద్ధృహోక్తమార్గతః॥
దైవయోగాదతి క్రాంతే గర్భాధానాదికర్మణి।
కర్తవ్యః పాదకృచ్చ్రో వై చౌలే త్వర్థం ప్రకల్పయేత్॥
గర్భాష్టమేఽష్టమే వాబ్ధే వటుకస్యోపనాయనమ్।
ఆషోడశాబ్దపర్యంతం గౌణం కాలముశంతి చ॥
గర్భేకాదశమేఽబ్ధే తు రాజన్యసోపనాయనమ్।
ఆద్వావింశాబ్దపర్యంతం కాలమాహుర్విపశ్చితః॥
వైశ్యోపనయనం ప్రోక్తం గర్భాద్ద్వాదశమే తథా।
చతుర్వింశాబ్దపర్యంతం గౌణమాహుర్మనీషిణః॥
ఏతత్కాలావధీర్యస్య ద్విజస్యాతిక్రమో భవేత్।
సావిత్రీ పతితం విద్యాన్నాల పేత్తం కదాచన॥
ద్విజోపనయనే విప్ర ముఖ్యకాలవ్యతిక్రమే।
ద్వాదశాబ్దం చరేత్కృచ్చ్రం పశ్చాచ్చాంద్రాయణం తథా॥
సాంతాపనద్వయం చైవ కృత్వా కర్మ సమాచరేత్।
అన్యథా పతితం విద్యాత్కర్తాపీ బ్రహ్మహా భవేత్॥
మౌంజీ విప్రస్య విజ్ఞేయా ధనుర్ద్యా క్షత్రియస్య చ।
ఆవీవైశ్యస్య విజ్ఞేయా శ్రూయతామజినం తథా॥
విప్రస్య చోక్త వైణీయం రౌరవం క్షత్రియస్యతు।
ఆజం వైశ్యస్య విజ్ఞేయం దండాన్వక్ష్యే యథాక్రమమ్॥
పాలాశం బ్రాహ్మణస్యోక్తం నృపస్యౌదుంబరం తథా।
బైల్వం వైశ్యస్య విజ్ఞేయం తతమాణం శృణుష్వ మే॥
విప్రస్య కేశమానం స్యాదాలలాటం నృపస్య చ।
నాసాగ్రపరిమితం దండం వైశ్యస్యాహుర్విపశ్చితః॥
తథా వాసాంసి వక్ష్యామి విప్రాదీనాం యథాక్రమమ్।
కషాయం చైవ మాంజిష్ఠం హారిద్రం చ ప్రకీర్తితమ్॥
ఉపనీతో ద్విజో విప్ర పరిచర్యాపరో గురోః।
వేదగ్రహణపర్యంతం నివ సేద్గురు వేశ్మని॥
ప్రాతస్స్నాయీ భవేద్వర్ణీసమిత్కుశఫలాదికాన్।
గుర్వర్ధమాహరేన్నిత్యం కల్యే కల్యే మునీశ్వర।
యజ్ఞోపవీతమజినం దండం చ మునిసత్తమ !
నష్టే భ్రష్టే నవం మంత్రోద్ధృత్వా భ్రష్టం జలే క్షి పేత్॥
వర్ణినో వర్తనం ప్రాహుర్భిక్షాన్నే నైవ కేవలమ్।
భిక్షాం చ శ్రోత్రియాగారాదాహరేతయతేంద్రియః॥
భవత్పూర్వం బ్రాహ్మణస్య భవన్మధ్యం నృపస్య చ।
భవదంత్యం విశః ప్రోక్తం భిక్షాహరణకం వచః॥
సాయం ప్రాతర్వహ్నికార్యం యథాచారం జితేంద్రియః।
కుర్యాత్ప్రతిదినం వర్ణీ బ్రహ్మయజ్ఞం చ తర్పణమ్॥
అగ్నికార్యపరిత్యాగే పతితః ప్రోచ్యతే బుదైః।
బ్రహ్మయజ్ఞవిహీనశ్చ బ్రహ్మహా పరికీర్తితః॥
దేవతాభ్యర్చనం కుర్యాచ్ఛుశ్రూషానుపదం గురోః।
భిక్షాన్నం భోజయేన్నిత్యం నైకాన్నాశి కదాచన॥
ఆనీయానిన్ద్యవిప్రాణాం గృహాద్భిక్షాం జితేంద్రియః।
నివేద్య గురవేఽశ్నీయాద్వాగ్యతస్తదనుజ్ఞయా॥
ఓ ముని శ్రేష్టా ! వర్ణాశ్రమాచారవీధిని విశేషముగా చెప్పెదను. సావధాన మనస్కుడవై వినుము. స్వధర్మమును విడిచి పరధర్మము నాచరించువాడు సర్వధర్మ బహిష్కృతుడై పాషండుడగును. గర్భాధానాదీ సంస్కారములను కాలానుసారముగా మంత్రపూర్వకముగా నాచరించవలయును. స్త్రీలకు మంత్రరహితముగా నాచరించవలయును. మొదట సీమంతకర్మ నాలుగవ నెలలో చేయవలయును. లేదా ఆరవ, ఏడవ, ఎనిమిదవ నెలలోనైననూ చేయవచ్చును. పుత్రుడు జన్మించిన వెంటనే తండ్రి సచేలస్నానమాచరించి స్వస్తి వాచకపూర్వకముగా నాందీశ్రాద్దమునాచరించవలమును. అన్నముతో శ్రాద్దమును చేసినచో చండాలుడగును. తండ్రి వాజ్మయముతో అతి గుర్వక్షరాన్వితముగా బేసిఅక్షరములు కలదిగా నామకరణము చేయరాదు. మూడవయేట కాని, అయిదవ ఏట కాని, ఆరవ ఏటగాని, ఏడవయేటగాని, ఎనిమిద ఏటకొని గృహ్యమార్గముననుసరించి చౌలమును చేయవలయును. దైవయాగమున గర్భాధానాదికర్మలు చేయుటకు కాలాతిక్రమము జరిగిచో పాదకృచ్ఛవ్రతము నాచరించవలయును. కాలాతిక్రమము జరిగినచో పొదకృచ్ఛవ్రతము నాచరించవలయును. బ్రాహ్మణునకు, గర్భాష్టమ, వర్షమున కాని అష్టమవర్షమున కాని ఉపనయనము చేయవలయును. వీలుకానిచో పదునారు వర్షముల లోపు చేయవచ్చును. క్షత్రియునకు గర్బెకాదశవర్షమున చేయవలయును. ఇరువది రెండు సంవత్సరముల వరకు చేయవచ్చును. ఇరువది నాలుగు వర్షముల వరకు గౌణకాలమగును. బ్రాహ్మణునకు చెప్పిన ఉపనయనకాలము అతిక్రమించినచో ద్విజుడు సావిత్రీ పతితుడగును. అతనితో నెవ్వరూ ఎప్పుడూ సంభాషించరాదు. బ్రాహ్మణున కుపనయనము చేయు సమయము అతిక్రమించినచో పన్నెండు సంవత్సరములు కృచ్ఛవ్రతము నాచరించవలయును. తరువాత చాంద్రాయణవ్రతము నాచరించవలయును. రెండు సంతాపన వ్రతముల నాచరించి తరువాత కర్మ నారంభించ వలయును. అట్లు చేయనిచో పతీతుడగును. కర్తకు బ్రహ్మ హత్యాపాతకము లభించును. ఉపనయన కాలమున బ్రాహ్మణుని మొలత్రాడు ముంజతృణముతో నేర్పరుచవలయును. కత్రియునకు వింటినారితో చేయవలయును. వైశ్యునకు ఆవకముతో చేయవలయును. అట్లే బ్రాహ్మణునకు జింకచర్మము, క్షత్రియునకు ఏదు చర్మము, వైశ్యనకు గొట్టెచర్మమును ధరింపచేయవలయును. అట్లే బ్రాహ్మణునకు మోదుగుచెట్టు దండం, క్షత్రియునకు మేడిచెట్టు దండము, వైశ్యునకు మారేడుచెట్టు దండముండవలయును. దండప్రమాణము బ్రాహ్మణునకు కేశాంతము, క్షత్రియమునకు లలాటపర్యంతము, వైశ్యునకు నాసాగ్రపర్యంతముండవలయును. ఇక ఇపుడు బ్రాహ్మణాదులు. ధరించవలసిన వస్త్రములను చెప్పెదను వినుము. బ్రాహ్మణునకు కాషాయ వర్ణము, క్షత్రియునకు మాంజిష్ఠ వర్ణము, వైశ్యునకు పసుపువర్ణ వస్త్రము విహితము. ఉపనీతుడైన ద్విజుడు గురువునకు పరిచర్యను చేయుచు వేదాధ్యయన పర్యంతము గురకులమున నివాసమును చేయవలయును. బ్రహ్మ చారి ప్రతిదినము ప్రాతఃకాలమున స్నానమాచరించి కాలానుగుణముగా గురువుగారి కొరుకు సమిత్కుశఫదీకములను తేవలయును. యజ్ఞోపవీతము అజినము దండము నష్టమైనను భ్రష్టమైననూ నూతనమును మంత్రపూర్వకముగా ధరించవలయును. భ్రష్టమైనదానిని జలమున పడ చేయవలయును. బ్రహ్మ చారి భిక్షాన్నముచే మాత్రమే జీవికను గడుపవలయును. ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మ చారి శ్రోత్రియుని ఇంటనుండియే భిన్న గ్రహణము చేయవలయును. బ్రాహ్మణుడు భిక్ష చేయునపుడు మొదట భవచ్చబ్దమును ప్రయోగించవలయును. క్షత్రియుడు మధ్యన భవచ్చబ్దమును ప్రయోగించవలయును. వైశ్యుడు చిరవ భవచ్చబ్దము నుపయోగించవలయును. అనగా బ్రాహ్మణుడు “భవతి ! భిక్షాం దేహి మాతః” అని, క్షత్రియుడు “భిక్షాం భవతి దేహి మాతః” అని, వైశ్యుడు “భిక్షాం దేహి భవతి మాతః” అని ప్రయోగించవలయును. బ్రహ్మ చారి ఇంద్రియ నిగ్రహముతో ప్రతిదినము ప్రాతఃకాలము సాయంకాలము అగ్ని కార్యమును బ్రహ్మయజ్ఞమును చేయవలయును. తర్పణము చేయవలయును. అగ్ని కార్యమును వదిలినవాడు పతితుడగను, బ్రహ్మయజ్ఞమును చేయనివాడు బ్రహ్మ హత్యచేసిన వాడగును. గురుశుశ్రూష తరువాత దేవతాద్యర్చనను చేయవలయును. బ్రహ్మ చారి ప్రతినిత్యము భిక్షాన్నమునే భుజించవలయును కాని ఒకే ఇంటి భోజనమును చేయరాదు. ఉత్తమవిప్రుల ఇంటినుండి భిక్షను తెచ్చి ఇంద్రియ జయముతో భిక్షను గురువునకు నివేదించి గురువాజ్ఞచే మౌనముగా తాను భోజనము చేయవలయును.
మధు స్త్రీమాంసలవణం తాంబూలం దంతధావనమ్।
ఉచ్చిష్టభోజనం చైవ దీవాస్వాపం చ వర్జయేత్॥
ఛత్రపాదకగంధాంశ్చ తథా మాల్యానువేపనమ్।
జలకేళిం నృత్యగీతవాద్యం తు పరివర్జయేత్॥
పరివాదం చోపతాపం విప్రలాపం తథాంజనమ్।
పాషండజనసంయోగం శూద్రసంగం చ వర్జయేత్॥
అభివాదనకీలస్యాత్ వృద్ధేషు చ యథాక్రమమ్।
జ్ఞానవృద్ధాస్తపోవృద్దా వయోవృద్దా ఇతి త్రయః॥
ఆధ్యాత్మికాదిదుఃఖాని నివారయతి యో గురుః।
వేదశాస్త్రోపదేశేన తం పూర్వమభివాదయేత్॥
అసావహమితి బ్రూయాద్ద్విజో వై హ్యాభివాదనే।
నాభివాద్యాశ్చ విపేణ క్షత్రియాద్యాః కథంచన॥
నాస్తికం భిన్నమర్యాదం కృతఘ్నం గ్రామయాజకమ్।
సేనం చ కితవం చైవ కదాచిన్నాభివాదయేత్॥
పాషండం పతితం వ్రాత్యం తథా నక్షత్రజీవినమ్।
తథా పాతకినం చైవ కదాచిన్నాభివాదయేత్॥
ఉన్మత్తం చ శఠం ధూర్తం ధావన్తమశుచిం తథా।
అభ్యక్తశిరసం చైవ జపన్తం నాభివాదయేత్॥
వివాదశీలినం చండం వమంతం జలమధ్యగమ్।
భిక్షాన్నధారిణం చైవ శయానం నాభివాదయేత్॥
భర్తృఘ్నీం పుష్పిణీం జరాం సూతికాం గర్భపాతినీమ్।
కృతఘ్నీం చ తథా చండీం కదాచిన్నాభివాదయేత్॥
సభాయాం యజ్ఞశాలాయాం దేవతాయతనేష్వపి।
ప్రత్యేకం తు నమస్కారో హంతి పుణ్యం పురాకృతమ్॥
శ్రాద్ధం వ్రతం తథా దానం దేవతాభ్యర్చనం తథా।
యజ్ఞం చ తర్పణం చైవ కుర్వంతం నాభివాదయేత్॥
కృతేఃఽభివాదనే యస్తు న కుర్యాతతివాదనమ్।
నాభివాద్యస్స విజ్ఞేయో యథా శూద్ర స్తథైవ సః॥
ప్రక్షాల్య పాదావాచమ్య॥ గురోరభీముఖస్సదా।
తస్య పాదౌ చ సంగృహ్య అధీత విచక్షణః॥
అష్టకాసు చతుర్దశ్యాం ప్రతిపత్పర్వణోస్తథా।
మహాభరణ్యాం విప్రేన్ద్ర శ్రావణీద్వాదశీదినే॥
భాద్రపదాపరపక్షే ద్వితీయాయం తథైవ చ।
మాఘస్య శుక్లసప్తమ్యాం నవమ్యామాశ్వినస్య చ॥
పరివేషం గతే సూర్యే శ్రోత్రియే గృహమాగతే।
బంధితే బ్రాహ్మణే చైవ ప్రవృద్ధకలహే తథా॥
సంధ్యాయాం గర్జితే మేఘే హ్యకాలే పరివర్షణే।
ఉల్కా శనిప్రపొతే చ తథా విప్రేఽవమానితే॥
మన్వాదిషు చ దేవర్షే యుగాదిషు చతుర్వపి।
నాధీయిత ద్విజః కశ్చిత్ సర్వకర్మఫలోత్సుకః॥
తృతీయా మాధవే శుక్లా భాద్రే కృష్ణా త్రయోదశీ।
కార్తికే నవమీ శుద్ధా మా ఘే పంచదశీ తిథిః।
ఏతా యుగాద్యాః కథితా దత్తస్యాక్షయకారకాః॥
మద్యమును, స్త్రీలను, మాంసమును, లవణమును, తాంబూలమును, దంతధావనమును, ఉచ్చిష్ట భోజనమును, పగలు నిద్రించుటను, బ్రహ్మచారి విడువవలయును. ఛత్రమును, పాదుకలను, గంధమును, పూలమాలనును, సుగంధద్రవ్యా సులేపనమును, జల కేళిని, నృత్యగీత పోద్యములను, వీడువలయును. పరివాదమును, ఉపలాపమును, అధిక ప్రలాపమును, కాటుకను, నాస్తిక జనసంబంధమును, శూద్రజన సంగతిని విడువలయును. వృద్ధుల విషయమున యథావిధిగా అభివాదమును చేయవలయును. జ్ఞానవృద్ధులు, వయోవృద్దులు తపోవృద్ధులు అని వృద్ధులు మూడు విధములుగా నుందురు. వేదశాస్త్రోపదేశముచే ఆధ్యాత్మికాది దుఃఖములను నివారించు గురువునకు మొదట ఆభివాదనము చేయవలయును. బ్రాహ్మణుడు ఆభివాదమును చేయునపుడు ‘అసావహం’ (ఈ నేను) అని చెప్పవలయును. బ్రాహ్మణుడు క్షత్రియాదులను ఎట్టి స్థితిలోనైనను అభివాదనము చేయరాదు. నాస్తికునికి, భిన్నమర్యాదునికి, కృతఘ్నునికి, గ్రామయాజకునికి, చోరునకి, కపటికి, ఎపుడూ నమస్కరించరాదు. పాషండునికి పతితునికి, వ్రాత్యునికి, జ్యోతిష్కునికి, పాతకునికి నమస్కరించరాదు. ఉన్మత్తునికి శకునికి ధూర్జునికి పరుగెత్తు వానికి అపవిత్రునికి నూనె తలకంటుకొనిన వానికీ, జపముచేయుచున్నవానికి నమస్కరించరాదు. వివాదశీలికీ, చండునికి వాంతి చేసుకొనినవానికి నీటి మధ్యలో నున్నవానికి, భిక్షాన్నమును ధరించినవానికి, పడుకొనియున్నవానికి నమస్కరించిరాదు. భర్తను చంపినదానికి, రజస్వలకు, జారురాలికి, ప్రసవించినదానికి, పురిటిలో ఉన్నదానికి, గర్భపాతమును చేసుకొన్నదానికి, కృతఘ్నురాలికి, చండికి, నమస్కరించరాదు. సభలో, యజ్ఞశాలలో, దేవాలయములో ప్రత్యేకించి ఏ ఒక్కరికో చేసిన నమస్కారము పూర్వమున చేసుకొన్న సుకృతమును నశింపచేయును శ్రాద్ధమును, వ్రతమును, దానమును దేవతార్చనను, యజ్ఞమును, తర్పణమును, చేయువారికి నమస్కరించరాదు. అభివాదము చేసినపుడు ప్రత్యభివాదము చేయనివారికి అభివాదము చేయరాదు. ప్రత్యభివాదమును చేయనివాడు శూద్రతుల్యుడు. పాదప్రక్షాళనమును చేసుకొని ఆచమనము చేసి గురువుగారికి అభిముఖముగా నుండి గురువుపొదములను గ్రహించి వివేకము కలవాడై అధ్యయనము చేయవలయును. అష్టమియందు, చతుర్దశియందు, ప్రతిపత్తునందు, పూర్ణిమ తిథియందు మహాభరణీ నక్షత్రమునందు శ్రావణద్వాదశియందు, భాద్రపద బహుళ ద్వితీయానాడు, మాఘశుద్ధ సప్తమినాడు, అశ్వయుజ శుద్ధనవమినాడు, సూర్యగ్రహణమున, శ్రోత్రియులు గృహమునకు వచ్చినపుడు బ్రాహ్మణుడు బంధించబడినపుడు, కలహములు పెరిగినపుడు, సంధ్యాసమయమున, మేఘగర్జన కాలమున, అకాలవర్షమున, ఉల్కాపాతము ఆశనిపాతము జరిగినపుడు, విప్రుడవమానించబడినపుడు మన్వాదికాలమునందు నాలుగు యుగముల ఆదికాలమమునందు కర్మఫలమున ఆసక్తి గల బ్రాహ్మణుడు అధ్యయనము చేయరాదు వైశాఖశుద్ద తదియ (అక్షయ తృతీయ) భాద్రపద కృష్ణ త్రయోదశి, కార్తీక శుక్ల నవమి (అక్షయనవమి) మాఘ పూర్ణిమ ఈ నాలుగు యుగాదులుగా తెలియును. ఈ కాలమున దానము చేసినచో అక్షయ ఫలము లభించును.
మన్వాదీంశ్చ ప్రవక్ష్యామి శృణుష్వ సుమాహితః।
అక్షయశుక్ల నవమీ కార్తి కే ద్వాదశీ పితా॥
తృతీయా చైత్రమాసస్య తథా భాద్రపదస్య చ।
ఆషాఢ శుక్లదశమీ సీతా మాఘస్య సప్తమీ॥
శ్రావణస్యాష్టమీ కృష్ణా తథాషాఢే చ పూర్ణిమా।
ఫాల్గునస్య త్వమావాస్యా పౌషస్యేకాదశీ సితా॥
కార్తికీ ఫాల్గునీ చైత్రీ జైష్ఠే పంచదశీ సితా।
మన్వాదయస్పమాఖ్యాతా దత్తస్యాక్షయ కారికాః॥
ద్విజైశ్శాద్ధం చ కర్తవ్యం మన్వాదిషుయుగాదిషు।
శ్రాద్దే నిమంత్రితే చైవ గ్రహణే చంద్రసూర్యయోః॥
అయనద్వితయే చైవ తథా భూకంపనే మునే।
గలగ్రహే దుర్దినే చ నాధీత కదాచన॥
ఏవమాదిషు సర్వేషు అధ్యయేషు నారద !
అధీయతాం సుమూనాం ప్రజాం ప్రజ్ఞాం యశశ్శ్రియం॥
ఆయుష్యం బలమారోగ్యం నికంతతి యమస్స్వయమ్।
అనధ్యాయే తు యోఽధీతే తం విద్యాద్భ్రహ్మఘాతకమ్॥
న తం సంభాషయేద్విప్ర న తేన సహ సంవ సేత్।
కుండగోలకయోః కేచిజ్జాడాదీనాం చ నారద॥
వదంతి చోపనయనం తత్పుత్రాదిషు కేచన।
అనధీత్య తు యో వేదమన్యత్ర కురుతే శ్రమమ్॥
శూద్రతుల్యస విజ్ఞేయో నరకస్య ప్రియోఽతిథిః।
అనధీతశ్రుతిర్విఘ్ర ఆచారే ప్రతిపద్యతే॥
నాచారఫలమాప్నోతి యథా శూద్రస్తథైవ సః॥
నిత్యం నైమిత్తికం కామ్యం యచ్చాన్యత్కర్మ వైదికమ్।
అనధీతస్య ఏప్రస్య సర్వం భవతి నిష్ఫలమ్॥
శబ్దబ్రహ్మమయో విష్ణుః వేదస్సాక్షాద్ధరిస్మృతః
వేదాధ్యాయీ తతో విప్రస్సర్వాన్కామానవాప్నుయాత్॥
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమమాదే స్మార్తా చారేషు వర్ణాశ్రమ ధర్మేష్వధ్యయనాదిధర్మనిరూపణం నామ పంచవింశోఽధ్యాయః॥
మన్వాదికాలమును చెప్పెదను సావధానముగా వినుము. ఆశ్వయుజ శుద్ధనవమి, కార్తీక శుద్ధద్వాదశి, చైత్రశుద్ధ తృతీయ, భాద్రపదశుద్ధ తృతీయ ఆషాడ శుక్ల దశమి, మాఘశుద్ధ సప్తమీ, శ్రావణ బహుళ అష్టమి, ఆషాడ పూర్ణిమ, ఫాల్గునామావాస్య, పుష్యశుదైకాదశి, కార్తిక, ఫాల్గున చైత్ర జ్యేష్ఠ పూర్ణిమలు మన్వాదులుగా ప్రసిద్ధి పొందినవి ఈ కాలమున దానము చేసిన అక్షయ ఫలమున లభించును. మన్వాది కాలమున, యుగాదికాలమున శ్రాద్ధము చేయవలయును. శ్రాద్ధమున నియంత్రణ చేసినపుడు, సూర్యచంద్రగ్రహణములలోను ఉత్తరాయణ దక్షిణాయన కాలములోను భూకంపనమున గల గ్రహణమున, మేఘచ్చిన్నదినమున అధ్యయనము చేయరాదు. ఈ అనధ్యయన దినములలో అధ్యయనముచేయు మూడులకు సంతానమును, ప్రజ్ఞను, కీర్తిని, సంపదను, ఆయుష్యమును, బలమును, ఆరోగ్యమును యముడు స్వయముగా హరించును. అనధ్యయనమున వేదాధ్యయనము చేయువానిని బ్రహ్మఘూతకునిగా పేర్కోనెదరు. అట్టివానితో మాట్లాడరాదు, కలసియుండరాదు. భర్త ఉండగా జారుని వలన కలిగిన పుత్రునికి, భర్త మరణించిన తరువాత జారుని వలన కలగిన పుత్రునికి కొని వారి పుత్రులకు కాని ఉపనయనము చేయవచ్చునని కొందరు పండితులు చెప్పుచున్నారు. వేదాధ్యయనము జరుపక ఇతర విద్యలలో పరిశ్రమచేయువాడు శూద్రతుల్యుడు, నరకమునకు ప్రియమైన అతిథిగా తెలియుము. వేదాధ్యయనమును చేయని విప్రుడు ఆచారమునందు శ్రద్ద చూపినను ఆచారఫలమును పొందజాలడు. శూద్రతుల్యుడగును. వైదికములగు నిత్యనైమిత్తిక కామ్యకర్మలుచే ఆధ్యయనము చేయనివానికి నిష్ఫలములగును. శబ్ద బ్రహ్మమయుడు విష్ణువు. వేదము సాక్షాత్తు శ్రీహరియే. కావున వేదాధ్యాయియగు విప్రుడు సర్వకామములను పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున స్మార్తా చారములలో వర్ణాశ్రమధర్మములలో అధ్యయనాదిధర్మనిరూపణము అను ఇరువది అయిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 25 of the Nārada Mahā Purana is as follows:
వేదాధ్యయనము యొక్క పవిత్రత మరియు వేదోక్త ధర్మముల ఆచరణ విధానము ఈ అధ్యాయంలో ప్రతిపాదించబడినది. బ్రాహ్మణుల నిత్యకర్మలు, వేదమంత్రముల జపము మరియు యజ్ఞయాగాదుల నిర్వహణ వలన లోకమునకు సిద్ధించే శ్రేయస్సు ఇక్కడ వివరంగా అభివర్ణించబడినది.