నారద మహా పురాణము
55 - జాతకనిరూపణమ్
సనందన ఉవాచ :-
మూర్దాస్యబాహుహృత్క్రోడాంతర్భస్తి వ్యంజసో నఖః ।
జానుజంఘాంఘ్రియుగలం కాలాంగాని క్రియాదయః ॥
భౌమాస్పుజీబుధేందుశ్చ రవిసౌమ్యా సితాః కుజాః ।
గురు మందార్కిగురవో మేషాదీనామధీశ్వరాః ॥
హారే విషమ ఖేర్కేంద్వోః సమభే శశిసూర్యయోఓ: ।
ఆదిపంచనవాధీశా ద్రేష్కాణేంశాః ప్రకీర్తితాః ॥
పంచేష్టాష్టాది పంచాంశా కుజార్కీజ్యజ్ఞ శుక్రగాః ।
ఓజే విపర్యయాద్గుగ్మే త్రింశాంశాః సమీరితాః ॥
క్రియణతౌలికార్కాద్యా మేషాదిషు నవాంశకాః ।
స్వభాద్ధ్వాదశభా గేశాః షడర్గం రాశిపూర్వకము ॥
గోజాశ్చ కర్కయు గ్మేన రాత్ర్యాఖ్యా పృష్ఠకోదయాః ।
శేషా దీనాఖ్యాస్తూ భయం తిమిః క్రూరస్సౌమ్యః పుమాన్ ॥
పుమాన్ స్త్రీచ క్లీబశ్చరస్థిరద్విస్వభావకాః ।
మేషాద్యాః పూర్వతో దిక్స్థాప్స్వస్వస్థానచరాస్తథా ॥
అజో క్షీణాంగనా కీటరుషజూకా ఇనాదితః ।
ఉచ్చాని ద్విత్రిమనుయుక్ తిధీషు భనవాంశకైః ॥
తత్తత్సప్తమనీచాని ప్రాజ్మధ్యాంత్యాసః క్రమాత్ ।
వర్గోత్తమాశ్చణరాధేషు భావాద్ద్వాదశ మూర్తిమాన్ ॥
సింహోక్షా విస్త్రశ్చ తౌలి కుంభా సూర్యాస్త్రికోణభమ్ ।
చతురస్రం తూర్యమృత్యు త్రికోణం నవ పంచమమ్ ॥
రిః ఫాష్తషట్కం త్రికభం కేంద్రం ప్రాక్తుర్య సప్త ఖమ్ ।
సృపాదః కీటపశవో బలాఢ్యా కేంద్రగాః క్రమాత్ ॥
కేంద్రాత్పరం ఫణపరం ఆపోక్లిమమతః పరమ్ ।
రక్త శ్వేతశ్శకునిభః పాటలో ధూమ్రపాండురౌ ॥
చిత్రః కృష్ణః పీత పింగౌ బభ్రుస్స్వచ్ఛప్రభాక్రియాత్ ।
సామ్యాశాఖ్యుప్లవత్వం స్యాద్ద్వితీయే వశీకరభాత్ ॥
కాలాత్మార్కో మనశ్చన్ద్రః కుజస్సత్వం వచో బుధః ।
జీవో జ్ఞానం సుఖం శుక్రః కామో దుఃఖం దినేశజః ॥
నృపౌ రవీన్దూ నేతాసృక్ కుమారోజ్ఞః కవీజ్యకౌ ।
సచివో సూర్యజః పేష్యో మతో జ్యోతిర్విదాం వరైః ॥
తామ్రశుక్ల రక్త హరితో పీత చిత్రా సీతా రవేః ।
వర్ణావ అవ్యహ హరీన్ద్రా శచీ కౌధిపా రవ్వే ॥
రవిశుక్రారరాహ్వర్కేన్దువిదీజ్యా దిగీశ్వరాః ।
క్షీణేన్ద్వర్కార రవిజాః పాపా పొపయుతో బుధః ॥
క్లీబౌ బుధార్కీ శుక్రేన్దు స్క్రియా శేషా నరా స్మృతాః ।
శిభి భూమి పయో వారి వాసినో భూసుతాదయః ॥
కవీశ్యా కుజసూర్యౌ చ వేదో జ్జో వర్ణపాః క్రమాత్ ।
సౌరోంత్యజాధిపః ప్రోక్తో రాహుర్మేచ్ఛాధిపస్తథా ॥
చంద్రార్కజీవాజ్ఞసితాకుజార్కీసాత్త్వికాదికా ।
దేవతేంద్వగ్నిఖైలాభూకోపఖాయో పరాధిపా! ॥
వస్త్రం స్థలం నవం వహ్ని కహతం మద్యదం తథా ।
స్ఫుటితం రవితస్తామ్రo తారం తామ్రపునిస్తథా ॥
హేమకాంస్యాయసీ త్ర్యం శైశ్శిభిరాద్యాః ప్రకీర్తితాః ।
సౌరశుక్రారచంద్రజ్ఞగురుఘాద్యత్సు చ క్రమాత్ ॥
త్ర్యాశత్రికోణతుర్యాష్టసప్తమాన్యేన వృద్ధితాః ।
సౌరే జ్యారాపరే పూర్ణే క్రమాత్సశ్యంతి నారద ॥
అయనక్షణఘస్రర్తుమాసార్ధశరదో రవేః ।
కటుతిక్తకారమిస్రమధురాoన్లకషాయకా ॥
త్రికోణాత్సాంత్యధాధర్మా యుస్సుఖభద్యపస్సుహృత్ ।
జీవో జీవజ్ఞా సీతజ్ఞౌ వ్యర్కా వ్యారాః క్రమాదమీ ॥
వీంద్వర్కా వికుజేంద్వర్కా సుహృదోఽన్యే రవేర్ధృతాః ।
మిధో ధన వ్యయాయత్ప్రిబంధువ్యాపారగస్సుహృత్ ॥
ధ్యేకానుభుక్తా మయాన్ జ్ఞాత్వా మిశ్రీదీత్సహజాన్మునే ।
మత్కాలోఽ దినుహృన్మిత్ర పూర్వకాన్కల్పయేత్పునః ॥
స్వోచ్చత్రికోణ గేహా ప్రనవాంశైస్థానజం బలమ్ ।
దీక్షుసౌమ్యేజ్యయోసూర్యా రయోస్సౌరే సితాజ్జయోః ॥
ఖాదృతూ దగనేన్యే తు వక్త్రే చంద్రసమాగమే ।
ఉత్తరస్థా దీప్తకరా శ్చేష్టా వీర్యయుతా మతాః ॥
నీశీందుకుజసౌరాశ్చ సర్వదా క్షోహ్ని చాపరే ।
క్రూరాః కృష్ణే సితే సౌమ్యా మతం కాలబలం బుదైః ॥
సౌరరాజ్ఞేజ్యశుక్రేందుసూర్యాధిక్యం పరస్పరమ్ ।
పాపాస్తు బలినసౌమ్యా వివక్షాః కంటకోపగే ॥
క్లీచేతదూశనాద్వాడిచంద్రార్కాంశసమంజనుః ।
స్వాంశే పాపాః పరాంశస్థాసౌమ్యా లగ్నం వియోనిజమ్ ॥
నిర్చలం చ తదాదేశ్యం వియోనేర్జన్మపంజితైః ।
శీర్షం వక్త్రగలే పొదావంసౌ పృష్ణమురస్తథా ॥
పార్శ్వే కుక్షిత్వపానాంఘ్రీ మేడ్రముష్కౌ తధా స్పిజౌ ।
పుచ్ఛం చతుష్పదాంగేషు మేషాద్యా రాశయస్స్మృతాః ॥
లగ్నాంశాద్గృహయగ్దృష్ట్వా వర్గాన్బలయుతాద్వదేత్ ।
దృక్సమానప్రమాణాంశ్చ ఇష్టే రేఖాం స్మర స్థితైః ॥
ఖగత్ర్యంశే బలాగ్నే గే చరమాంశే గ్రహాన్వితే ।
వాంశే స్థలాంబుజస్సౌరేర్ద్విక్షాయోగభవా ద్విజాః ॥
విప్రలైస్తనుచంద్రేజార్కైస్తరూణాం జనిం వదేత్ ।
స్థలాంబుఖేదేశకృత శ్చేత రేషాముదాహృతః ॥
స్థలాంబు చ పతిః ఖేటో లగ్నాద్యావన్మితే గృహే ।
తావంత ఏవ తరవః స్థలజా జలజాస్తథా ॥
అంతస్సారా రవౌ సౌరే దుర్భగాః క్షీరిణీ విధే ।
భౌమే కంటినో వృక్షా ఈజ్యౌజ్ఞే సఫలాఫలౌ ॥
పుష్పితా భార్గవే స్థిగ్ధాశ్చ్చన్ద్రేఽథ కటుకాః కుజే ।
అసుభగే శుభః భేటః శుభం వృక్షం కుభూమిజమ్ ॥
సనందన మహర్షి పలికెను :-
శిరస్సు, ఆస్యము, బాహువులు, హృదయము, క్రోడము, నఖములు, జానువులు, జంఘలు, అంఘియుగలము ఇవియన్నియు కాలపురుషుని అంగములు. క్రియాదులు కూడా కాలాంగములే: మేషాది రాశులను అధిపతులను తెలియుము. మేషవృశ్చికములకు కుజుడు అధిపతి. వృషభ తులలకు శుక్రుడు అధిపతి. మిధున కన్యా రాశులకు బుధుడు అధిపతి. కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. సింహరాశికి సూర్యుడధిపతి, ధనుర్మీనములకు బృహస్పతి అధిపతి. మకరకుంభ రాశులకు శని అధిపతి. హోరలో సూర్యచంద్రులు విషమ నక్షత్ర గతులైనపుడు, చంద్ర సూర్యులు సమ నక్షత్రగతులైనపుడు ఆది పంచనవాధీశులు దేష్కోణాధిపతులని చెప్పబడినది. పంచ ఇష్ట అష్టాది పంచాంశలు కుజ, శని గురు బుధ శుక్రగతములని తెలియవలయును. ఓజో విషయమున విపర్యయము వలన, యుగ్మమున త్రింశాంశేశులుగా చెప్పబడిరి. మేషాదిరాశులలో తులాకర్కాటకాదులు నవాంశలుగా తెలియవలయును. తమతమ నక్షత్రము నుండి ద్వాదశ భాగేశులు రాశిపూర్వకముగా షడర్గమును తెలియవలయును. వృషభమేషములు కర్కాటక మిధునములతో రాత్రి అను పేరుతో పృష్ట కోదయములు. మిగిలిన రాశులు దీనముగా పేర్కొనబడినవి. ఉభయములు తిమి, క్రూర, సౌమ్య పుమాన్. అను పేర్లచే వ్యవహరించబడును. పురుషుడు, స్త్రీ, నపుంసకుడు, చరము, స్థిరము, ద్విస్వభావములు కలవిగా నుండును. మేషాది రాశులు తూర్పుదిక్కున నుండును. తమతమ స్థానములలో తిరుగుచుండును. సూర్యాదిగ్రహములకు మేషాదిరాళులు ఉచ్ఛరాశులు ఇట్లు చెప్పెదరు. రవికి మేషము, చంద్రునికి వృషభము, కుజునికి మకరము, బుధునికి కన్య, గురునికి కటకము, శుక్రునికి మీనము, శనికి తుల ఇవి ఉచ్ఛరాశులు.. ప్రతిగ్రహమునకు తన ఉచ్ఛరాశికి సప్తమ రాశి నీచరాశిగా తెలియవలయును. అనగా రవికి తుల, చంద్రునికి వృశ్చికము, కుజునికి కటకము, బుధునికి మీనము, గురునికి మకరము, శుక్రునికి కన్య, శనికి మేషము ఇవి నీచరాశులు. ఇవి క్రమముననుసరించి, ప్రాక్, మధ్య,అంత్యాశలు కలవగును. వర్గోత్తమములు భావమువలన ద్వాదశమూర్తులు గలిగియుండును. ఇట్ల రవికి సింహము, చంద్రునికి వృషభము, కుజునికి మేషము, బుధునికి కన్య గురువునకు ధనుస్సు, శుక్రునికి తుల, శనికి కుంభము ఇవి మూలత్రికోణములనబడును. రాశికి, మరియు రాశినుండి నాలుగవ, ఏడవ పదియవరాశులకు కేంద్రములని పేరు. రాశికి, రాశినుండి అయిదవ, తొమ్మిదవరాశులకును కోణములని పేరు. కేంద్ర కోణములందున్న గ్రహములు ప్రబలులుగా ఉండును. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ, పొటలవర్ణము, ధూమ్రవర్ణము, పాండురవర్ణము, చిత్రవర్ణము, కృష్ణవర్ణము, పసుపుపచ్చ, పింగళవర్ణము, బభ్రువర్ణము, స్వచ్ఛవర్ణము గ్రహములకు ప్రక్రియవలన ఏర్పడును. సూర్యుడు . కొలస్వరూపుడు, చంద్రుడు మనస్సు, కుజుడు సత్త్వము, బుధుడు వాక్కు, గురువు జ్ఞానము, శుక్రుడు సుఖము, కామము, శని దుఃఖము స్వరూపముగా కలవారు. సూర్యచంద్రులు రాజులు, కుజుడు అధికారి, బుధుడు యువరాజు, గురు శుక్రులు మంత్రులు. శని అనుచరుడు అని జ్యోతిర్విదుల సిద్ధాంతము. సూర్యునికి ఆయారాశి సంచారము ననుసరించి తామ్ర, శుక్ల, రక్త, హరిత్ , పీత, చిత్ర, కృష్ణవర్ణములు కలుగుచుండును. రవి శుక్ర కుజ, రాహు, శని చంద్ర బుధ గురువులు వరుసగా అష్టదిక్కులకు అధిపతులు. క్షీణచంద్రుడు, రవి, కుజుడు శని ఈ సౌలుగు పాప గ్రహములు, పాపగ్రహములతో కలిసినపుడు బుధుడు పొపుడగును. బుధుడు శని నపుంసకులు, శుక్రుడు చంద్రుడు స్త్రీలు, మిగిలిన గ్రహములు పురుషులు అని తెలియవలయును. అగ్నిభూమి, నీరు, వాయువులలో భూసుతాది గ్రహములు నివసించును. గురు శుక్రులు బ్రాహ్మణులు. రవి చంద్ర గురులు సాత్త్వికులు. బుధ శుక్రులు రాజసులు. కుజశని రాహు కేతువులు తామసులు. రవికి అగ్ని, చంద్రునికి జలము, కుజునకు కుమారస్వామి, బుధునకు విష్ణువు, గురునకు దేవేంద్రుడు, శుక్రునకు శచీదేవి, శనికి బ్రహ్మ, రాహు కేతువులకు శివుడు అధిదేవతలు. వస్త్రము స్థలము కొత్తది వహ్నికహతము మద్యదము, స్పుటితము, రవికి తామ్రము, తారము, తామ్రపుని. బంగారము, ఇనుము, ఉక్కు ఈమూడు అంశలతో నుండును. శశిరాదులు గుణములు. అనగా రవికి రాగి, ముదుగు బట్ట, దేహపు ఎముకులు దేవతాస్థానము పూజా సంబంధములుండును. చంద్రునకు రత్నములు, క్రొత్తబట్ట, దేహరక్తము జలసమీపము స్పానప్రదేశములు. ఇట్లే ఇతర గ్రహములకు తెలియవలయును. శని శుక్రుడు కుజుడు చంద్రుడు బుధుడు గురువు ఉదయించుచుండగా క్రమముగా కేంద్రకోణ, చతుర్థ అష్ట సప్తమ స్థానములను వృద్ధిచెందించును. శని గురువు కుజుడు పూర్ణులుగా నున్నపుడు క్రమముగా చూతురు. అయన, క్షణ, ఘస్ర, ఋతు మాస, షాణ్మాసములు. సూర్యునికి కటు, తిక్త, క్షార, మధుర, ఆమ్ల, కషాయ రసములుండును. త్రికోణ స్థానము నుండి ధర్మాయువు మిత్రుడు. గురుడు, గురు బుధులు, శుక్ర బుధులు, సూర్య రహితులు, కుజరహితులు క్రమముగా చంద్రసూర్య రహితులు, కుజచంద్రార్కర రహితులు, ఇతరులు సూర్యునికి మిత్రులు. పరస్పరముగా ధన, వ్యయ, ఆయ త్రిబంధు, వ్యాపార గతుడైనచో మిత్రుడగును. ఏకాను భుక్తములుగా తెలుసుకొని సహజులుగా తెలియవలయును, ఆయాకాలములననుసరించి అధీసుహృత్ మిత్ర పూర్వకములను మరల కల్పించుకొనవలయును. తనకు ఉచ్ఛరాశులందు, త్రికోణరాశులందుండు వారు నవాంశలతో స్థానముల వలన బలము కలుగును. దిక్కులలో బుధ బృహస్పతులకు, సూర్య కుజులకు, శని విషయమున శుక్రచంద్రులకు ఆకాశమునుండి ఋతువులలో, ఇతరులు సమాగమములో, ఉత్తరమున నున్నవారు దీప్త కారులగుదురు. ఇష్టులైనపుడు వీర్యయుతులగుదురు. రాత్రిపూట చంద్రకుజశనులు ఎల్లపుడు శుభకరులు. ఇతర గ్రహములు పగలు శుభకరులు. వీరు కృష్ణపక్షమున క్రూరులు, శుక్లపక్షమున సౌమ్యులని కొలబలమును బుధులు చెప్పేదరు. శని కుజ బుధ గురు శుక్ర చంద్ర సూర్యులకు పరస్పరాధిక్యము గల వారగుదురు ఎప్పడు పాపులు బలయుతులు. సౌమ్యులు స్థానాధీనులుగా నుందురు. క్లీబులవిషయమున శుక్రుని కంటే చంద్రసూర్యాంశ సమముగానుండును. స్వాంశమున నున్న గ్రహములు పాపులు, పరాంశమున సౌమ్యులు వియోనిజమైనపుడు లగ్నభేదమేర్పడును. వియోని జన్మ దుర్బలమగును. శిరస్సు, వక్తము, కంఠము, పాదములు, భుజములు, పృష్ఠ భాగము, వక్షస్థలము, పార్శ్వములు, కుక్షి, అపానము, చరణములు, మేడ్రము, ముషములు (వృషణములు) పుచ్చములు, మొదలగు అవయవములందు మేషాది రాశులుండునని తెలియవలయును. లగ్నాంశము నుండి గ్రహయోగమును చూచి బలయుతముగా వర్ణములను చెప్పవలయును. దృక్సమాన ప్రమాణములను ఇష్టమున నున్న రేఖను గుర్తు చేసుకొనవలయును. నక్షత్రముల రాశుల వంశము బలాగ్రముగానున్నపుడు చరమాంశము గ్రహాన్వితముగా నున్నపుడు అంశములో స్థలమున చంద్రుడు శనికి ద్వీక్షయున్నపుడు యోగభవులు ద్విజులగుదురు. విడిగా ఉన్న చంద్ర గురు సూర్యులచే వృక్షముల జన్మను చెప్పవలయును. స్థలవృక్షముల జులవృక్షముల భేదము గ్రహముల స్థితిననుసరించి ఇతరములకు కూడా చెప్పవలయును. లగ్నమునుండి ఎంతమానము గల గృహమున సూర్యుడు అధిపతిగా ఉన్నపుడు అదేసంఖ్యచే స్థలజములు జలజములగు వృక్షములుండును. రవి రాశ్యధిపతిగా ఉన్నపుడు అంతస్సౌరము గల వృక్షములు, శని అధిపతిగా ఉన్నపుడు దుర్భగములగు వృక్షములు, చంద్రుడు అధిపతిగా యున్నపుడు క్షీరములు గల వృక్షములు, కుజుడు అధిపతిగా ఉన్నపుడు ముళ్ళ చెట్లు, గురువు అధిపతిగా యున్నపుడు ఫలమంతములగు వృక్షములు, బుధుడు అధిపతిగా ఉన్న చో ఫలరహితములగు వృక్షములు, శుక్రుడు అధిపతిగా ఉన్నపుడు పుష్పితములగు వృక్షములు, చంద్రుడధిపతిగా యున్నపుడు దట్టమగు వృక్షములు, కుజుడు అధిపతిగా యున్నచో కటురసము గల వృక్షములు అశుభనక్షత్రములో శుభగ్రహము శుభకరుడగును. కుభూమిలో పుట్టిన వృక్షము కూడా శుభకరమగును.
కుర్యాద్విలోమగో వాపి స్వాంశోక్తపరగైస్సమీమ్ ।
కుజేందు హేతుకం స్త్రీణాం ప్రతిమాసమిహార్తవమ్ ॥
నేష్టస్ధేజ్యేఽన్యథాస్తే స్త్రీయుక్తా సన్న రేక్షితే ।
పాపయుక్తేక్షితే ద్యూనే రుషా ప్రీత్యా శుభగ్ర హైః ॥
శుక్రార్కేందుజై స్వాంస స్థైరీజ్యచాంగత్రికోణే ।
భవేదపత్యం విప్రేన్ద్ర పుంసాం సర్వీర్యశాలినామ్ ॥
ఆస్రేర్కేందౌ కుజార్కి చేత్పుంస్త్రీయోరామయప్రదౌ ।
వ్యయఖగోయుతౌ చైక దృష్ట్వా మృత్యుప్రదౌ తయోః ॥
శుక్రార్కౌ మాతృపితరౌ దివా నక్తంశశీనఔ ।
మాతృష్వసృ పితృవ్యాఖ్యౌ వాపద్మేజోసమే శుభౌ ॥
పాపదృష్టే శుభే క్షీణే తుంగే వా లగ్న గే యమే ।
క్షీణేందుకుజసందృష్టే మృత్యు మేత్య గతా ధ్రువమ్ ॥
యుగపద్వా పృథక్సంస్థౌ లగ్నేందూ పాపమధ్యగౌ ।
యదా తదా గర్భయుతా నారీ మృత్యుమవాప్నుయాత్ ॥
లగ్నాచ్చంద్రాచ్చ తుర్యస్థైః పాపైర్నిధనగే కుజే ।
నష్టేందౌ కుజరవ్యోశ్చ బంధురిష్ఫగయోర్మృతి ॥
తన్వస్థసంస్థయోర్భౌమరవ్యోశృస్త్రభవః క్షయః ।
యన్మాసాధిపతిర్నష్టస్తన్మాసం సంస్రవే త్యజేత్ ॥
లగ్నేందు గైశ్శుభై ఖేటైస్త్రికోణార్ధాస్తభూఖ గైః ।
పాపైస్త్రిషష్ఠలాభస్థై సుఖీ గర్భో రవీక్షితః ॥
ఓజభౌ పురుషాంశేఽర్కే జ్యేన్దుల గెర్బలాన్వితైః ।
గుర్వర్కౌ విషమస్థా వా పుంజన్మ ప్రవదేత్తదా ॥
యుగ్మ భాంశస్థితై సైస్తు వక్త్రేన్దుభృగుభిస్తథా ।
యామస్థానగతైరాచ్యం స్త్రీయో జన్మమనీషిభిః ॥
ద్వంగస్థా బుధసందృష్టా స్వపక్షీయమలంకరాః ।
లగ్నం వినౌజభావస్థస్సౌరః పుంజన్మ కృత్తదా ॥
మీదో రవీన్దూ జ్ఞార్కీవా పశ్యత సమగం రవిః ।
వక్రవాంగ విధూ ఓజే జజ్జౌ యుగ్మాజసంస్థితౌ ॥
కుబేక్షితే పుమాంశే చ దుహితా క్లీబజన్మదా ।
సమే సితేన్దూ ఓజస్థా జ్ఞారాం జ్యా నృవీక్షితౌ ॥
లగ్నేందు సమగౌ యుగ్మ స్థానే వాయమలంకరాః ।
గ్రహోదయ స్థాన్ద్వ్యంగాంశా నశ్యతి జ్ఞే స్వభాగ గే ॥
త్రితయం జ్ఞాంశకాద్యుగ్మ భమిశైస్సమమాదిశేత్ ।
లగ్నే చాపాంత్యభాగస్థే తదంశస్థబలిగ్రహైః ॥
వీర్యాఢ్యజ్ఞార్కిసద్దృష్టై: కోశస్థావహవోగినః ।
సితారే జ్యార్కచంద్రార్కిజ్ఞాంగే శోర్కేందవోఽధిపా! ॥
మసానాం తత్సమం వాచ్యం గర్భస్థస్య శుభాశుభమ్ ।
త్రికోణే జ్ఞే పరైర్నష్టై ర్ద్విముఖాహ్ని కపాస్వితః ॥
ఆవాగావాటావశుభ్భైసంధి స్థైః ప్రజాయతే ।
వీరాన్సగీశ్చ దష్టేర్వష్టార్కాతభసంహితాః ॥
అరార్కీ జ్యభాంశస్థా సదంతో గరకస్తదో ।
స్వభౌజే భువి మందార దృష్టే కుబస్తు గర్భగః ॥
పంగుర్మీ నే యమేంద్వారైద షేధాంగేభసంధిగే ।
పాపైర్జడో విధేగర్భశ్శుభదృష్టివివర్జితే ॥
మృగాంత్య గే వామనకః సౌరేంద్వార్క నిరీక్షితే ।
ధీనయోదప గైస్ర్యశై పాపా స్తైరసీరో హ్రదాః ॥
రవీందుయుక్తే సింహేంగే మా హేయార్కి నిరీక్షితే ।
నేత్రహీనామిస్రఖే టైర్దృష్టే బుద్బుదలోచనాః ॥
వ్యయజో వామనయనం దక్షం సూర్యో వినాశయేత్ ।
నేష్టాయోగాశ్శుభైర్దృష్టాః పాపాస్స్యురాత్ర సంశయః ॥
మందేఽస్తే మందఖాంశంగే నిషే కేబ్దత్రయే జనిః ।
ద్వాదశాబ్దే శశిన్యేవం సుతావపి విచింతయేత్ ॥
ఆదానేందు ద్వాదశాంసా పాపాస్తద్రాశిభిః పురః ।
శశాంకే జన్మభాగాది ద్విఘ్నమిష్టకలాస్స్మృతాః ॥
పితుః పరోక్షే జన్మ స్యాత్ ఇందౌ లగ్నమపశ్యతి ॥
మధ్యాద్భృష్టేఽర్కే విదేశ స్థే జననే నారిజన్మ వై ।
మందేంగస్థే కుజే స్తే చ జ్ఞే స్ఫుజి మధ్య గే విధే ॥
పాపాం గేబ్జే త్రిభాగేలె స్వాయగ్రెస్సద్భిరుద్ధతః ।
సూర్యాస్త దృష్టిగో వాపీ జ్ఞేయో జ్యోతిర్విదాంవరై ॥
చతుష్పదరగే భానౌ శేషెర్చయుతైః ఖగైః ।
కోశాదతో తు యమలో జాయేతే మునిసత్తమ ॥
సార్క్యారసింహా జ్ఞాజాంగే భాంశతుల్యాంగనాలయు ।
లగ్నమిందుం చ సార్కేందుం న పశ్యతి యదా గురుః ॥
స పాపగోఽర్కో జాయో వా పరవీర్యప్రసూతికృత్ ।
పాపభస్థౌ పాపఖేటైః సూర్యారౌనత్రికోణగౌ ॥
విదేశగః పితా వృద్ధః ఖేవారాశీవశాత్యయే ।
పూర్ణ ఇందౌ స్వభం శేజ్ఞే శుభే భువ్యంబుజేతనౌ ॥
ద్యూనస్థేవా విధేయతేంగనా నారీ ప్రసూయతే ।
అబ్ధాంగమస్థగః పూర్ణేజ్యో పా పశ్యతి నారద ॥
స్వబంధలగ్నగస్సూతిస్సలిలే నాత్ర సంశయః ।
పాపదృష్టే యమే గుద్యం జన్మాంగాజవ్యయస్థితే ॥
కర్కాతిలగ్న గే సౌరే వటే జన్మాబ్జవీక్షితే ।
మందే జన్మ గతే లగ్నే బుధసూర్యేందువీక్షితే ॥
క్రీడాస్థానే దేవగే హేప్యూషరే చ క్రమాజ్జనిః ।
శ్మశానే లగ్నదృగసుగ్రామ్యస్థానేబ్జభార్గవౌ ॥
ఆగ్నిహోత్రగృ హే జీవ్యోఽర్కో భూషాభరణీ గృహే ।
శిల్పాలయే బుధో జన్మ కుర్యాద్భలసమన్వితః ॥
భాసమానే సరే మార్గే స్థిరే స్వరాంశరే గృహే ।
త్రికోణ గేజ ఆరార్క్యో ర స్తే వా సృజ్యతేంఽబయా ॥
గురుదృష్టే తు దీర్ఘాయుః పరం చ ప్రాప్యతే పునః ।
పాపదృష్టే విధాల గ్నేఽస్తే కుజే తు వినశ్యతి ॥
భవే మజార్క్యో సందృష్టే పరహస్తగతస్సుఖీ ।
పాపేద్యతాయుర్భవతి మాసస్సారైః పరైరపి ॥
పితృమాతృగ హేజన్మ తదధీశబలాన్ము నే ।
తరుగేహే శుభే వీచే నైకస్థదృష్టో లగ్నేందుః ॥
ఏతల్లక్షణసంపన్నా ప్రసూతిర్విజే తదా ।
మందరాంశే విధౌ తుర్యే మందదృష్టేఽబ్జగేఽపి వా ॥
మందార్చనే వా తమసి శయనం నీచగే భువి ।
శీర్షే పృష్ఠోదయే జన్మ తద్వదేవ వినిర్ధి శత్ ॥
అట్లే అశుభగ్రహమున్నపుడు ఉత్తమ భూమికూడా ఉత్తమవృక్షమునకు జన్మనీయజాలదు. స్త్రీలకు ప్రతిమాసమున జరుగు ఋతు ధర్మము కూడా కుజ చంద్రగ్రహముల ప్రభావమువలననే జరుగును. చంద్రుడు స్త్రీరాశికి ఇష్టరాశిలో ఉండనపుడు, బృహస్పతిచే చూడబడినపుడు స్త్రీకి పురుషునిచే సంయోగము లభించును. సప్తమ భావమున పాపగ్రహయోగమున్నపుడు రోషపూర్వక పతీ పత్నీసంయోగము, సప్తమభావమున శుభగ్రహమయోగమునపుడు ప్రీతిపూర్వక సంయోగమేర్పడును. సంయోగకాలమున శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు నవమాంశలో ఉండి, బృహస్పతి కేంద్రమున కాని, త్రికోణస్థానమున కాని యున్నచో సంతానప్రాప్తి నిశ్చితము. ఇట్లు సంయోగకాలమున కుజుడు శని సూర్యుని నుండి సప్తమ స్థానమున నున్నచో పురుషునికి, చంద్రునినుండి సప్తమస్థానమున నున్న చో స్త్రీకి రోగము సంభవించును. ఇట్లే గ్రహములు సూర్యునినుండి పన్నెండవ స్థానమున, రెండవస్థానమునకాని యున్నచో పురుషునికి, చంద్రుని కలిసియున్నచో స్త్రీకి మృత్యువు సంభవించును. పగలు గర్భాధానమైనచో శుక్రుడు సూర్యుడు మాతా పితృగ్రహములగును.
రాత్రిపూట గర్భాధానమైనచో చంద్రుడు శని మాతృపిత్సగ్రహములగును. పిత్సగ్రహము విషమరాశిలో ఉండుట తండ్రికి శుభము. మాతృగ్రహము సమరాశిలో నుండుట తల్లికి శుభము. పన్నెండవ స్థానమున పాపగ్రహములున్నపుడు, శుభగ్రహములకు బదులు పాపగ్రహములచే చూడబడుచున్నపుడు, లేదా లగ్నమున శని యుండి క్షీణ చంద్రునిచే కుజునిచే చూడబడుచున్నపుడు గర్భాధానము జరిగినచో స్త్రీకి మృత్యువు సంభవించును. లగ్నము నుండి కాని, చంద్రుని నుండి కాని చతుర్ధ స్థానమున పాపగ్రహములుండిన, కుజుడు అష్టమ భావమున నున్నచో, లేదా లగ్నము నుండి నాలుగవస్థానమున కాని పన్నెండవస్థానమున కాని కుజుడు శని యున్నచో గర్బముతో స్త్రీకి కాని, కేవలము స్త్రీకి కాని మృత్యువు సంభవించవచ్చును. లగ్నమున కుజుడు సప్తమమున సూర్యుడు ఉన్నచో గర్భవతికి శస్త్రము. వలన మరణము సంభవించును. గర్భాధాన సమయమున ఆయా మాసాధిపతి అస్తగతుడైనచో అస్తగతుడగు అధిపతిగల మాసమున గర్భపాతము సంభవించవచ్చును. గర్భాధానసమయమున లగ్నమున చంద్రునితో శుభస్థానములలో శుభగ్రహములు, అశుభస్థానమున పాపగ్రహములున్నపుడు గర్భము సురక్షితముగా నుండును. సూర్యుడు, బృహస్పతి, చంద్రుడు, లగ్నము ఈ నాలుగు విషమ రాశులైనపుడు, నవమాంశలైనపుడు, లేదా సూర్యుడు బృహస్పతి విషమరాశి గతులైనపుడు పుత్రుడు కలుగునని చెప్పవచ్చును. ఇట్లే ఈ గ్రహములే సమరాశిలో నవమాంశలలో ఉన్నపుడు, లేదా కుజుడు, చంద్రుడు, శుక్రుడు సమరాశిలో నున్నచో స్త్రీ శిశువు కలుగునని చెప్పవచ్చును. ఈ గ్రహములే ద్విస్వభావరాశులలో ఉన్నపుడు, . ఈ గ్రహముల మీద బుధుని దృష్టి ఉన్నపుడు కవల పిల్లలు కలుగుదురు. లగ్నము నుండి విషమ.. స్థానమున నున్న శని ప్రభావము వలన పుత్రుడు కలుగును. విషమ సమములగు రాశులలో నున్న సూర్యచంద్రులు లేదా శని బుధులు ఒకరినొకరు చూచుకున్నపుడు, లేదా సమరాశిలో నున్న సూర్యుని విషమరాశిలోనున్న కుజుడు చూచినపుడు, చంద్రుడు సమరాశిలో కానీ లగ్న విషమరాశిలో కొని ఉన్నపుడు, మరియు అట్టి చంద్రుని మీద కుజుని దృష్టి ఉన్నపుడు, లేదా లగ్నము, చంద్రుడు శుక్రుడు మూడు పురుషరాశి నవమాంశలో ఉన్నపుడు గర్భధానమైనచో నపుంసకుడు. పుట్టును. శుక్రచంద్రులు సమరాశిలో ఉండి, బుధుడు, కుజుడు, లగ్నము, బృహస్పతి విషమరాశులలో ఉంటూ పురుష గ్రహముచే చూడబడునపుడు గర్భాధానము జరిగినచో ! కవల పిల్లలు పుట్టదరు. లేదా లగ్నము చంద్రుడు సమరాశిలో ఉండుట, లేదా బుధుడు, కుజుడు, లగ్నము గురుసమరాశి అయిననూ కవల పిల్లలు పుట్టెదరు. బుధుడు నవమాంశలో ఉండి, ద్విస్వభావరాశులగు గృహమును, లగ్నమును చూచినచో ఒకేసారి ముగ్గురు సంతానము కలుగు అవకాశమున్నది. ఆ ముగ్గురిలో ఒకడు లగ్నసదృశుడు, ఇద్దరు బుధసదృశులగుదురు. ధనురాశి అంతిమాంశము లగ్నమైనచో, ఆ యంశలో బలవంతుడగు గ్రహమున్నచో, బలవంతుడగు బుధునిచే కాని శనిదే కాని చూడబడినపుడు ముగ్గురికంటే ఎక్కువమంది సంతానము కూడా ఒకేసారి కలుగవచ్చును. గర్భధాన సమయదశ, మాసముల దశలకు అధిపతులను జ్యోతిషశాస్త్రమున చూపిరి. వారు క్రమముగా శుక్రుడు, కుజుడు, బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు, శని, బుధుడు. ఆధీన లగ్నేశులు సూర్యుడు చంద్రుడు. ఏ నెలలో ఎట్లు సబలనిర్భల గృహములుండునో ఆయా నెలలో అట్లే శుభాశుభప్రభావము గర్భము పైన గర్భవతి పైన ఉండునని చెప్పవలయును. బుధుడు త్రికోణ స్థానముననుండి ఇతరగ్రహములు నిర్బలులైనచో శిశువునకు రెండుముఖములు, నాలుగుచేతులు, నాలుగు కాళ్ళు మొదలగు ఆకారములు లభించును. చంద్రుడు వృషభరాశిలో ఉండి ఇతరగ్రహములు నిర్బలులైనచో బాలకుడు వికారాకారము గలవాడగును. గ్రహముల పై శుభ గ్రహదృష్టిఉన్నచో బాలకుడు చాలాదినములకు మాట్లాడగలుగును. కుజుడు శనీ బుధుని రాశి నవమాంశలో ఉన్నచో శిశువు పండ్లతో పుట్టును. చంద్రుడు కర్కటకరాశిలో ఉండి లగ్నగతులై శని కుజుల దృష్టి కూడా చంద్రుని పై ఉన్నపుడు శిశు గర్భములోనే కుబ్జుడగును (మూడు వంకరలుగలవాడు) లగ్నము మీనరాశి ఆయి శనిచంద్రుడు కుజుల దృష్టి ఉన్న చో బాలకుడు కాళ్ళులేనివాడుగా (కుంటివాడుగా) పుట్టును. పాపగ్రహములు, చంద్రుడు రాశిసంధిలో ఉండి, శుభగ్రహ దృష్టి లేనిచో బాలకుడు జడుడు (బుద్ది హీనుడు) అగును. లగ్నము మకరరాశ్యంతిమాంశములో ఉండి శని చంద్ర సూర్యుల దృష్టి ఉన్నచో శిశువు పొట్టివాడగును. పంచమ నవము లగ్నముల వ్రేష్కాణమున అశుభ గ్రహములున్నచో కాళ్ళులేని వాడుగా, చేతులు లేనివాడుగా పుట్టును. సూర్యచంద్రులు సింహలగ్నమున నుండి శని కుజుల దృష్టి కలిగియున్నచో గుడ్డివాడుగా పుట్టును.
శుభాశుభగ్రహముల దృష్టి ఉన్నచో నేత్రములలో బిందువులేర్పడును. లగ్నమునకు ద్వాదశ భావమున చంద్రుడున్నచో ఎడమకన్ను, సూర్యుడున్నచో కుడి కన్ను నశించును. ఇట్లు పైన చెప్పబడిన గ్రహప్రభావములవలన కలుగు అశుభ ఫలములు ఆగ్రహముల పై శుభగ్రహముల దృష్టి కలిగినచో ప్రభావము తగ్గును. గర్భాధానము లగ్నము యొక్క నవమాంశమై ఆగ్రహము సప్తమ భావమున ఉన్న చో శిశువు మూడు సంవత్సరములు తరువాత పుట్టును. శనికాక చంద్రుడు ఈ స్థితిలో ఉన్న చో పన్నెండు సంవత్సరముల తరువాత శిశువు పుట్టును. గర్భాధాన సమయమున చంద్రుడున్న ద్వాదశాంశ సంఖ్యలో ముందున్న రాశిలోనికి చంద్రుడు వెళ్ళినపుడు శిశువు పుట్టును. ద్వాదశాంశ యుక్తములగు అంశలను రెండుచే హెచ్చించి అయిదుచే భాగించినచో రాశిమానము తెలియును. చంద్రుడు జన్మలగ్నమును చూడనిచో శిశువు తండ్రిపరోక్షమున పుట్టును. సూర్యుడు చరరాశిలో మధ్యభావము నుండి వెనుకకో ముందుకో అయినచో తండ్రి దేశాంతరమున నున్నపుడు శిశువు పుట్టును. లగ్నమున శని సప్తమ భావమున కుజుడు ఉన్న చో, లేదా బుధ శుక్రుల మధ్యన చంద్రుడున్నచో తండ్రి లేనపుడు శిశువు కలుగును. పాపరాశియుక్త లగ్నమున చంద్రుడున్నపుడు లేదా వృశ్చికరాశి వ్రేష్కాణముననున్నపుడు సర్పము పుట్టును. సూర్యుడు చతుష్పదరాశిలో ఉండి, ఇతర గ్రహములు బలము కలిగియున్నపుడు ఒకేమావిలో కవలలు పుట్టేదరు. శని, కుజులు సింహరాశిగతులైనపుడు, బుధుడు మేషరాశి నవమాంశలో ఉన్నపుడు, భాంశముతో సమానముగా కన్యాలగ్నము కూడియున్న చో గురువు లగ్నమును చంద్రుని, సూర్యునితో కలిసియున్న చంద్రుని చూడనిచో, సూర్యుడు పాపగ్రహములతో కలిసియున్నపుడు స్త్రీ భర్త వీర్యముచే కాక ఇతర పురుష వీర్యముతో శిశువును ప్రసవించును. పాపగ్రహములు పాపరాశులలో ఉండి సూర్యుడు కుజుడు త్రికోణ స్థానములలో లేనితో శిశువు తండ్రి విదేశములకు వెళ్ళియుండును. లేదా వృద్దుడుగా నుండును. రాశి అంత్యాంశమున గ్రహమున్నను, పూర్ణచంద్రుడున్నపుడు బుధుడు స్వరాశి నవమాంశలో ఉన్నపుడు, కుజుడు శుభగ్రహవీక్షణము కలిగియుండి లగ్నమున చంద్రుడున్నపుడు, చంద్రుడు రెండోస్థానముననున్నపుడు స్త్రీ శిశువు కలుగును. స్త్రీ ప్రసవించును. పూర్ణచంద్రుని బృహస్పతి చూచునపుడు, స్వగృహము లగ్నమై అందులో చంద్రుడున్నపుడు నీటిలో స్త్రీ ప్రసవించును. అనగా నీటిలోనే శిశువు పుట్టునని భావము. శని పాపగ్రహములచే చూడకబడునపుడు, మేషరాశి పన్నెండవరాశిగా ఉన్నపుడు, శని కర్కాటకలగ్నముననున్నపుడు చంద్రుని దృష్టి ఉన్నపుడు గోతిలో శిశువు పుట్టును. స్త్రీ ప్రసవము గోతిలో అగునని భావము. శని జన్మ లగ్నములో ఉండి బుధ సూర్య చంద్రులచే చూడబడినచో,క్రీడాస్థానమున, దేవాలయమున, మరుభూమిలో వరుసననుసరించి శిశువు పుట్టును. అనగా జన్మలగ్నముననుండి శనిని. బుధుడు చూచిన క్రీడాస్థానమున, సూర్యుడు చూచిన దేవాలయమున, చంద్రుడు చూచిన మరుభూమిలో పుట్టునని భావము. కుజుడు లగ్నమును చూచినచో స్మశానమున శిశువు పుట్టును. చంద్ర శుక్రులు కలిసున్నచో గ్రామ్యస్థానమున పుట్టును. బృహస్పతి సూర్యులు కలిసున్నచో అగ్నిహోత్రగృహమున పుట్టును. బుధుడు లగ్నమున నున్నచో బలవంతుడై శిల్పాలయమున శిశు జన్మను కలిగించును. స్థిరమగు గ్రహములు తమ తమ రాశి నవమాంశములలో నున్నపుడు గృహమున శిశువు పుట్టును. కుజుడు శని త్రికోణస్థానములందున్నపుడు, లేదా అస్తంగతులైనపుడు కూడా గృహమున శిశువు పుట్టును. శిశువునకు గురు దృష్టి యున్నచో దీర్ఘాయుష్మంతుడు, ఉత్తముడు అగును. చంద్రుని పాపగ్రహములు చూచునపుడు, లగ్నమున కుజుడు అస్తమించినచో శిశువు త్వరలో మృతి చెందును. శిశువు పుట్టినపుడు కుజ శనులచే చూడబడినచో తల్లిదండ్రులవద్ద కొక ఇతరుల వద్ద నుండి సుఖవంతుడగును. పాపగ్రహవీక్షణమున్నచో కొన్ని నెలలలో మృతి చెందును. ఆయా లగ్నాధిపతుల ప్రభావము వలన పితృ గృహమున, లేదా మాతృగృహమున స్త్రీ ప్రసవించును. శుభగ్రహము నీచ స్థానముననున్నపుడు, లగ్నమున నున్న చంద్రుడు ఒకోస్థానమును చూడనపుడు వృక్షము క్రింద శిశువు కలుగును. ఇట్లు లక్షణములున్నచో ఏకాంతమున ప్రసవించును. శని రాశి నవమాంశములో నున్నపుడు, చంద్రుడు నాలుగోస్థానమున నుండి, చంద్రుడు శనిచే చూడబడినపుడు కొద్దివెలుగున్న చీకటిలో, నీచ భూస్థానమున శిశువు పుట్టును. శీర్ణోదయము, పృషోదయము గల పుట్టుకను కూడా గ్రహముల ప్రభావము వలననే చెప్పవలయును.
చంద్రాస్తసుఖగః పాపైర్మాతుః పీడాం సమాది శేత్ ।
జీర్ణోద్ధృతం గృహం మందే సృజి దగ్ధం నవ విధే ॥
కాష్ఠాఢ్యమదృఢం సూర్యే బహుశిల్పయుతం బుధ ।
చిత్రయుక్తం నవం శుక్రే దృఢే రమ్యే గురౌ గృహమ్ ॥
ఘటాజకర్క్యలి ఘటే పూర్వే జ్ఞేజ్యగృహే హ్యుదక్ ।
వృషే పశ్చాన్నృగే సింహే దక్షిణే వసతిర్భవేత్ ॥
గృహప్రాచ్యాదిగో ద్వౌ ద్వౌ ద్వ్యంగాః కోణే । యవజాదయః।
పర్యంకే వాస్తువత్పాదాస్త్రీషదంకాంత్యరాశయః ॥
చంద్రాణాంతర గైః ఖేటైః సూతికాస్సముదాహృతాః ।
చక్రాద్ధి బహిరంతశ్చ దృశ్యాదృశ్యో పరేఽన్యధా ॥
లగ్నాశయసమానాంగో బాలిఖేటసమోఽపి పొ ।
చంద్రనందాంశవద్వర్ణశ్శీర్షాద్యంగవిభాగయుక్ ॥
శీర్షకం దక్ర్మలే నాసా కహాలహనవో ముఖమ్ ।
కంఠాంసపార్శ్వహృప్తోషః క్రోడం నాభిశ్చ బాస్తికః ॥
శిశ్నాపాతే చ వృషణౌ జఘనే జానునీ తథా ।
జంఘే పాదౌ భయత్ర త్ర్యంశైస్సముదితైర్వదేత్ ॥
పాపయుక్తే ప్రణస్త సిన్నంగే లక్ష్మ చ తద్యుతే ।
స్వరాంశే స్థిరయుక్తే తు నైజ ఆగంతుకోఽస్యధా ॥
మందేఽనిలాశ్మజో భౌమే వీషశస్త్రాగ్నిజో బుధే ।
భుజేఽర్కే కాష్ఠపశుజో జేతుశ్శృంగ్యజయోనిజ ॥
యస్మిన్సంజ్ఞాస్త్రయః ఖేటా అంగే స్యుస్తత్ర నిశ్చితమ్ ।
వ్రణే శుఖభకృతః పృష్ఠే తనౌ రాశిసమాశ్రితే ॥
తిలకృన్మసకృదష్టసౌమ్యెర్యుక్తశ్చ లక్ష్మవాన్ ।
చతురస్రః పింగదృక్చ పైత్తికోఽల్పకచో రవిః ॥
వృతో వాతకఫీ ప్రాజ్ఞో మందవాక్ శుభదృక్ ।
శశీ క్రూరదృక్తరుణో భౌమః పైత్తి కశ్చపలస్తథా ॥
ప్రాధానుపకృతీర్షాస్య రుచిరజ్ఞః క్లిష్టవాక్తథా ।
పింగకే శ్లక్షణో దీర్ఘ కఫీ ధీమాన్గురుర్మతః ॥
సువపుర్లోచనః కృష్ణ వక్ర కేశో భృగుస్సుఖీ ।
దీర్ఘః కపిల దృజ్మందో నిరీ ఖరకచోలసః ॥
స్నాయ్వస్థిరక్తత్వక్శుక్రవసామజ్జాస్తు ధాతవః ।
మందార్క చంద్రసౌమ్యా స్ఫుజిజ్జీవకుభువః క్రమాత్ ॥
చంద్రాంగపా పైర్భాంత్య స్థై స్పేందుపాపచతుష్టయైః ।
చక్రపూర్వాపరే పాపసౌమ్యేః కీటతనౌ మృతిః ॥
ఉదయాస్తగతౌ పాపౌ చంద్రః క్రూరయుతైశ్శుభైః ।
నచేద్దృష్టస్తదా మృత్యుద్ఘాతస్య భవతి ధ్రువమ్ ॥
క్షీణెబ్జే వ్యయగే పాపైర్లగ్నాష్ట స్థైశ్శుభా న చేత్ ।
కేంద్రేషు వాబ్జో సంయుక్తస్స్మరాంత్య మృతిలగ్నగః ॥
కేంద్రాద్యా హస్తసంఖే టైరదృష్టా మృత్యుదస్తథా ।
షష్టమేఽబ్జేఽస దృష్టే పద్యో మృత్యుశ్శుభక్తితే ॥
సమాష్ట్రకే మిశ్రఖేటైర్దృష్టేషే మృతిశ్శిశోః ।
క్షీణెబ్జేంగే రంధ్ర కేంద్ర పాపే పాపాంతర స్థితే ॥
భూద్యూనవిధనే వాబ్జే లగ్నేఽప్యేవం శిశోర్మృతిః ।
పాపైశ్చంద్రాస్త గైర్మాత్రా సార్ధం సందృష్టిమంతరా ॥
శుభాదృష్టే భాంత్య గేబ్జే త్రికోణోపరతైః ఖలైః ।
లగ్నఫే వా విదౌ పాపైరక్త ఛైర్మృతిమాప్నుయాత్ ॥
గ్రస్తేఽబ్జేఽసద్భిరష్టస్థై సృజ్యవాత్మ జయోర్మృతిః ।
లగ్నే రనౌ తు శస్త్రీణ సవీర్యాసద్భరష్టగైః ॥
కర్కేంద్వీజ్యయుతే లగ్నే కేంద్ర సౌమ్యే చ భార్గవే ।
శం షెస్ర్యరీశ గౌరాయురమితం భవతి ధ్రువమ్ ॥
వర్గోత్తమే మీనలగ్నే వృషేఽబ్జే తత్త్వలిప్పకే ।
స్వతుంగ ఫేష్వశే షేషు పరమాయుః ప్రకీర్తితమ్ ॥
శుభైర్దృష్టస్సవీర్యోగే కేంద్రస్థే చాయురర్థదః ।
స్వచ్చోబ్జే స్వరస్సౌమ్యె స వీర్యోగాధిపే తనౌ ॥
షష్ట్యబ్ద కేంద్రసౌమ్యౌభేష్టశుధ్ధ సప్తతిర్గురా ।
మూలత్రికోణ గైస్సౌమ్యైర్గురౌ స్వోచ్చసమన్వితే ॥
లగ్నాధిపే బలయుతే త్యశీత్యబ్ధం త్వాయురేరితమ్ ।
స వీర్యే సత్సు కేంద్రేషు త్రింశచ్ఛుద్ధియుతేఽష్టమే ॥
లయే శే ధర్మ గే జీవేష్టస్థే క్రూరేక్షితే జితాః ।
లగ్నాష్టమేశావష్టస్థా భాబ్దమాయుః వరౌ మతౌ ॥
లగ్నే శుభే జ్యౌగ్లాదృష్టా మృత్యౌ కశ్చన చాకృతిః ।
ధర్మాంగస్థై శనౌ శుక్రే కేంద్రేఽబ్జే వ్యయధర్మ గే ॥
శతాబ్దం గీష్పతా కర్కే కటకస్థపితేజ్యయోః ।
లయంశంగే శుబైర్హీనేష్టమే ఖాఛిమితం వయః ॥
లగ్నేశేఽష్టమగేష్టేశే తనుస్థే పంచవత్సరమ్ ।
కవీ తజ్యయో గే సౌమ్యాబ్జౌ లగ్నే మృత్యా చ స్వేషవః ॥
ఏతద్యోగజమాయుస్స్యాదథ స్పష్టముదీర్యతే ।
సూర్యాధికబలే పైండం నిసర్గాచ్చ విదోర్బలే ॥
అంశాయుస్సబలే లగ్నే తత్సాధనమధో శృణు ।
గోఽబ్జాస్తత్త్వతిధీ సూర్యాస్తిధిస్వర్గా నఖాః క్రమాత్ ॥
నఖా విధుర్ద్వావంకాశ్చ ధృతిస్సాక్షి ఖమార్గణాః ।
పిండే నిసర్గే ఖోచ్చేనో గ్రహప్షట్టాలకో యదా ॥
చక్రశుద్ధస్తదా గ్రాహ్యా స్యాంశా ఆయుషి సంమతాః ॥
అంశోనాశంవృభీ కార్యా గ్రహం వక్రగతిం వినా ।
మందశుక్రా వినార్ధనా గ్రహస్యాస్తంగతస్య చ ॥
హానిద్వయేఽధికాః కార్యా యదా క్రూరాస్తదా తనే ।
విహాయారీనంశాడ్వెర్ణన్యాదాయుర్లవాన్ భజేత్ ॥
భగణాంశైర్లబ్దిహీనా స్తేషాం కార్యా విచక్షణే ।
పాపస్యాంశాస్సమగ్రోనా సౌమ్యస్యార్ధవివర్జితాః ॥
స్పష్టా సేంశాః ఖషట్లాసా గుజయిత్వా స్వకైర్గణేశ్ ।
వర్షిణి శేషమర్కఘ్నం హారోత్సంమాసకాస్మృతాః ॥
తచ్ఛేషశ్చ త్రిగుణితః తేనైవాప్తం దినాని చ ।
శేషే షష్ట్యా హతే భక్తీ హారేణ ఘటికాదికమ్ ॥
హిత్వా భాజ్యంగభాగాదీన్ ఖలీకృత్య ఖఖాక్షిభిః ।
భజేద్వర్ణాషి శేషే తు గుణితే ద్వాదశాదిభిః ॥
ద్వీసప్తాంశే చ మాసాది లగ్నాయుర్జాయతే స్ఫుటమ్ ।
అంశాయుషీ స లగ్నానాం ఖేటానామంశకా హృతాః ॥
ఖయుగైరాయురంశాస్స్యుస్తత్సంస్కారం వదామి తే ॥
చంద్రుడు అస్తగతుడై పాపులతో కూడియున్నచో తల్లికీ పీడను కలిగించును. శనితో కలిసియున్నచో జీర్ణమైన గృహము ఉద్ధరించబడును. సూర్యునిచే కలిసియున్నచో కాష్ట్రములతో సుందరగృహముండును. బుధుడున్న చో గృహము బహు శిల్పయుతమగును. శుక్రుడున్నచో చిత్రయుక్తముగా నూతన గృహముండును. గురువు విషయమున దృఢము రమ్యముగా గృహముండును. బుధుడు కుంభ మేష, కర్కాటక రాశులలో ఉన్నచో గురువు గృహమున కలిసియున్నచో ఉత్తర దిక్కును చూచుచున్నపుడు, వృషభమునుండి మృగశిరమున నుండి, సింహమును చూచినపుడు దక్షిణ దిక్కున నివాసముండును. గృహమున ప్రాచ్యాది దిక్కులలో రెండు రెండు గ్రహముల మేలనముండి, ద్వీస్వభావరాశులలో, కోణస్థానరాశులలో ఉన్న చో ఫలితము మారి యుండును. పర్యంకమున వొస్తువు వలె పాదములుండును. త్రిషదంకాంత్య రాశులున్నపుడు, చంద్రుని, అంగారకుని మధ్యలో గ్రహములచే కలిసున్నపుడు సూలికములు చెప్పబడినవి. చక్రము నుండి బహిరాగమున అంతర్భాగమున దృశ్యాదృశ్యముగా నుండును. మరియొక విధముగా అయినచో ఇతరులుండును. లగ్నాశయ సమానాంగముబాలిథీటము సమముగా నున్నను చంద్రనవాంశమువలె వర్ణము కలిగి శిరస్సు మొదలగు అవయవ విభాగములచే కూడియుండును. శిరస్సు, నాసిక, కపోలములు, దవడలు, ముఖము, కంఠము, భుజములు, పార్శ్వములు, హృదయము, బాహువులు, క్రోడము, నాభి, బాస్తికము, శిశ్నము, వృషణములు, పిరుదులు, మోకాళ్ళు, పిక్కలు, పొదములు, రెండు చోట్ల కలిపి చెప్పవలయును. ఆయా అవయవముల అధిపతి పాపగ్రహములచే కలిసి యున్నచో ఆయా అవయవములకు వ్రణములు కలుగును. లేదా మచ్చలు ఏర్పడును. తమతమ రాశ్యంశమున స్థిరయుక్తమైనచో నైజమగును. లేనిచో ఆగంతకుడగును. శనియున్నచో వాయు పాషాణముల వలన భయము కలుగును. కుజుడున్నచో విషశస్త్రాగ్నులవలన భయము కలుగును. సూర్యుడు కోణస్థానమునందున్నచో కొషముల వలన పశువుల వలన భయము కలుగును. మేషరాశిలో పుట్టినవారికి శృంగములు కలవాటి వలన భయము కలుగును. ఏరాశిలో మూడు గ్రహములుండును అతనికి పృష్ఠమున. వ్రణము నిశ్చితము. రాశినాశ్రయించి యున్నచో శరీరమున వ్రణము కలుగును. సౌమ్యగ్రహములచే కూడియున్నచో మచ్చలు కలవాడగును. చతరస్రాకారముగా పింగళవర్ణములు కల నేత్రములు కలవాడు పిత్తస్వభావము కలవాడు కొద్ది జుట్టుకలవాడుగా సూర్యుడుండును. చంద్రుడు వృత్తాకారము కలవాడు వాత కఫ ప్రకృతి కలవాడు, ప్రాజ్ఞుడు, చిన్నగా మాట్లాడగలవాడు, శుభకరమైన నేత్రములు గలవాడు. కుజుడు క్రూరదృష్టి కలవాడు, యువకుడు, పిత్తప్రకృతి కలవాడు చపల స్వభావము కలవాడు. బుధుడు మూడు విధముల స్వభావముకలవాడు, హాస్య రుచి కలవాడు, శిష్ట వాక్కు గలవాడు. గురువు పింగళ కేశములు కలవాడు, శక్త స్వభావము కలవాడు, పొడగరి, కఫ స్వభావము కలవాడు బుద్ధిమంతుడు. శుక్రాచార్యులు చక్కని శరీరము కలవాడు, చక్కని నేత్రములు కలవాడు, నల్లని ఉంగరాల జుట్టు కలవాడు సుఖము కలవాడు. శని పొడగరి, కపిల నేత్రములు కలవాడు, తక్కువ పొడుగు కఠినమైన జుట్టుకలవాడు, సోమరి. స్నాయువు, అస్తి, రక్తము, చర్మము, శుక్రము, వస మజ్జ అను ఏడు ధాతువులు శరీరమున ఉండును. ఈ ఏడు ధాతువులకు వరుసగా శని, సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, కుజుడు అధిపతులు. రాశి అంత్యాంశలో చంద్రాంగ పాపులున్నపుడు, చంద్రునితో కలిసి నాలుగు పాపగ్రహములున్నపుడు, చక్రములోని పూర్వాపరములందు పాపులు సౌమ్యులు కలిసియున్నపుడు లగ్నమున కీటమున్నపుడు మృతి తథ్యము. పాపగ్రహములు ఉదయిస్తగతులై క్రూరగ్రహములచే కలిసియున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడనిచో ఆ సమయమున పుట్టిన శిశువు నిశ్చయముగా వెంటనే మరణించును. క్షీణ చంద్రుడు పన్నెండవ స్థానమున నుండి పాపగ్రహములు లగ్నమునకు అష్టమస్థానముననుండి, శుభగ్రహములు లేనిచో, కేంద్రస్థానములందు గ్రహములతో కలిసి చంద్రుడున్నచో మృత్యువులగ్నమని తెలియుము. కేంద్రాది స్థానములందు గ్రహముల వీక్షణము లేనపుడు మృత్యువు కలుగును. షష్ఠస్థానమున చంద్రుడు పాపగ్రహములచే చూడబడక శుభగ్రహములచే చూడబడునపుడు వెంటనే మృత్యువు కలుగును. సమాష్టకమున మిశ్రగ్రహములచే చూడబడినపుడు శిశువు మరణించును. క్షీణ చంద్రుడు అంశమున నున్నపుడు, రంధ్ర కేంద్ర స్థానములలో పాపులున్ననూ, పాపుల మధ్యలో నున్ననూ భూద్యూన నిదన స్థానములలో చంద్రుడున్నపుడు, లగ్నమున నున్నపుడ కూడా శిశువు మృతి చెందును. చంద్రుడస్తగతుడైనపుడు పాపగ్రహములచే చూడబడినపుడు, శుభగ్రహములచే చూడబడనపుడు, రాశి అంత్యాంశమున చంద్రుడున్నపుడు త్రికోణస్థానమున దుష్టగ్రహములు లేనిచో, లగ్నమున చంద్రుడున్నపుడు కూడా, పాపగ్రహములు ఆస్తమొందినపుడు శిశువు మృతి చెందును. చంద్రుడు గ్రసించబడినపుడు అష్టమస్థానమున దుష్టగ్రహములున్నచో తండ్రీకొడుకుల మృతి సంభవించును. లగ్నమున సూర్యుడుండి, బలవంతులగు దుష్టగ్రహములు అష్టమస్థానముననున్నచో శస్త్రముచే మృతి సంభవించును. కర్కాటకరాశిలో బృహస్పతితో చంద్రుడు కలిసున్నచో, లగ్నమున కేంద్రమున బుధుడు శుక్రుడున్నపుడు, మిగిలిన గ్రహములు మూడవస్థానమున, శత్రుస్థానమున నున్న చో. దీర్ఘాయువు లభించును. వర్గోత్తమము మీనలగ్నమైనచో, చంద్రుడు వృషభరాశిలో ఉన్నపుడు అన్ని గ్రహములు ఉచ్చస్థానములలో నుండగా దీర్ఘాయువు నిశ్చయము. బలవంతుడగు గ్రహము శుభగ్రహములచే చూడబడినపుడు, కేంద్రమున నుండగా ఆయువును అర్ధమును ఇచ్చును. చంద్రుడు స్వోచ్చస్థానమున నుండి శుభరాశులలో సౌమ్యగ్రహములు బలవంతులై, బలవర్ద్రహము లగ్నమున నుండగా కేంద్రస్థానమున సౌమ్యులుండగా అరవై సంవత్సరములు ఆయుష్యముండును. అష్టమశుద్ధి కలిగి గురువు అనుకూలముగా నుండగా డెబ్బది సంవత్సరముల ఆయుష్యము మూలత్రికోణస్థానములలో సౌమ్యగ్రహములుండి గురువు స్వోచ్చరాశిలో ఉండగా లగ్నాధిపుడు బలయుతుడైనచో యెనుబదివత్సరములు ఆయువు నిశ్చితము. కేంద్రమున బలయుతులైన గ్రహములుండి, కేంద్రమున శుభగ్రహములుండి అష్టమ శుద్ధియుండి, లయేశుడు ధర్మస్థానమున నుండి, బృహస్పతి అష్టమస్థానముననున్నచో, క్రూరగ్రహదృష్టిపడినచో జితులగుదురు. లగ్నాధిపతి అష్టమాధిపతి అష్టమ స్థానమున నున్నపుడు ఆయుః కారకులగుదురు. లగ్నమున అశుభగ్రహము గురువు ఉన్నపుడు చంద్రుని దృష్టి యున్నపుడు మృత్యువునకు ఒక ఆకాశము ఏర్పడును. శని ధర్మాంగ స్టుడైనపుడు, శుక్రుడు కేంద్రమునుండి చంద్రుడు పన్నెండవ స్థానమున నున్న చో నూరుసంవత్సరము ఆయుష్యముండును. బృహస్పతి కర్కటకరాశిలో ఉన్నపుడు, కర్కటకమున శుకరబృహస్పతులున్నపుడు లయేశుడంగముననున్నపుడు, అష్టమమున శుభగ్రహములు లేనిచో దీర్ఘాయువు నిశ్చితము. లగ్నాధిపతి అష్టమస్థానమున, అష్టమాధిపతి లగ్నమున నున్నచో అయిదుసంవత్సరములు ఆయుష్యము. శుక్రబృహస్పతి యోగమున, బుధ చంద్రులు. లగ్నమున ఉన్నచో మృత్యువు నిశ్చితము. ఇది గ్రహయోగము వలన తెలియు ఆయుష్యము. ఇపుడు స్పష్టముగా చెప్పెదను వినుము. సూర్యాధిక బలమున్నచో పిండము ఆరోగ్యబలములు కలిగియుండును. చంద్రబలమున్నచో సహజముగా నుండును. లగ్నము బలయుతమైనచో అంశాయువు నిశ్చితము. ఆ అంసాయువును తెలియు విధానమును చెప్పెదను వినుము. గోబ్దములు, తత్త్వతిధులు, సూర్యుడు, తిధి స్వర్గములు నఖములు క్రమముగా చేర్చబడవలయును. నఖములు, విధువు, రెండంకములు, ధృతి సాక్షి మార్గణములు చూడబడవలయును. పిండమునిసర్గముగా ఉన్నపుడు స్వోచ్చస్థానమున ఏ గ్రహములేనపుడు ఆరవ స్థానమున క్షీణబలయుతుడగు గ్రహమున్నపుడు చక్రశుద్దిని స్వీకరించవలయును. చక్రశుద్ది అంశములే ఆయుష్యమును తెలుపు ప్రమాణములు. అంశోనములు శత్రురాశిలో చేర్చబడి, వక్రగతిలేని గ్రహమును చూడవలయును. శని శుక్రులు అల్గోనులు కాక అస్తంగత గ్రహమునకు హాని ద్వయమున్నచో అధికాంశలను కూర్చవలయును. లగ్నమున క్రూరగ్రహములున్నపుడు శత్రువులను వదిలి, అంజ్ఞాదులతో కొట్టివేసి ఆయువు భాగములను, చూడవలుయును. భగణాంశములతో హీనలబ్దిని చూచి వాటిని విచక్షణతో పరిశీలించవలయును. పాపగ్రహాంశలను. సమగ్రముగా తక్కువగా చేసి బుధగ్రహాంశలను సగము వదిలి ఆ అంశలను సృష్టములుగా 1, 6, 3 సంఖ్యలచే భాగించి, తమ గణములతో గుణించి శేషమును సంవత్సరములుగా, పన్నెండుతో కొట్టి వేయగా వచ్చిన వి నెలలుగా తెలియవలయును. అట్లు చేయగా మిగిలిన దానిని మూడు రెట్లు చేసినపుడు వచ్చిన దానిని దినములుగా తెలియవలయును. శేషమును అరవైచే భాగించగా వచ్చినవి ఘటికాదులుగా తెలియవలయును. భాజ్యాంగ భాగములను విడిచి 1, 1, 2 తో గుణించగా వచ్చిన వివరములని, మిగిలిన దానిని ద్వాదశాదులచే గుణించగా ద్విసప్తాంశ మాసాదులుగా లగ్నాయువు స్పుటముగా తెలియును. లగ్నముల అంశలు ఆయుష్యము లగ్నాంశములచే గ్రహాంశలచే తెలియవలయును. ఖ యుగములచే ఆయురంశలు తెలియును. ఇపుడు నీకు ఆ సంస్కారమును గూర్చి తెలిపెదను.
గ్రహో న లగ్నం షడ్రత్యంచేత్సంస్కారోఽన్యధా న హి ॥
తదంశస్స్వాగ్రయో భక్తా లబ్ధోనో భూర్గుణో భవేత్ ।
యదైకాల్యం తదాస్యాంశాస్స్వాగ్ర్యాప్తోనా చ భూరుణం ॥
సౌమ్యస్యార్ధేన పాపస్య సమగ్రేణేతి నిశ్చయః ।
గుణకఘ్నశ్చాయురంశాస్సంస్కారోఽముదాహృతః ॥
ఆయురంశకలా భక్తాద్వింశత్యబ్ధా ఇనాహతమ్ ।
శేషం ద్విశతభక్తం సుర్మాసాశ్శేషా దినాదికమ్ ॥
అగ్నియురంశాస్త్రిగుణాదిగ్భక్తాస్స్యుస్సమాసతః ।
శేషేర్కాదిగుణే భక్తే దిగ్భర్మాసాదికం భవేత్ ॥
సబలేంగే భలుల్యాబ్ధై యుతమాయుర్భ వేత్పుటమ్ ।
అంశద్విఘ్నమక్షాంశం మాసాః ఖత్ర్యాది సంగుణాత్ ॥
శేషా దినాదికం యోజ్యం నైతత్పిండనిసర్గయోః ।
లగ్నార్క చంద్రమధ్యే తు యో బలీ తద్దశా పురా ॥
తతః కేంద్రాదిగానాం తు ద్విత్ర్యాదౌ స బలస్య చ ।
బహ్వాయుర్యో వీర్యసామ్యేర్కాద్యుతస్య ప్రాద్యాచకః ॥
షడ్వర్గార్ధస్య త్రింశస్య త్రికోణగశ్చ స్మరగః ।
సప్తమానస్య తూర్యస్య చతురస్రగతస్య చ ॥
క్రమః కేంద్రాదికోఽత్రాపి ద్విత్ర్యాదౌ స్వబలస్య చ ।
పాకపస్యాబ్లినాగాశ్చ హ్యర్థవా సహగస్య చ ॥
త్రికోణస్థస్య చాష్టాక్షిర్యాడ్యూనగతస్య చ ।
తుర్యాష్టగస్య తు స్వర్గా గుణకాః పరికీర్తితాః ॥
దశాగుణైర్హతా భక్త్యా గుణైక్యేన సమాగతాః ।
శేషేఽర్కాదిహతే భక్తీ మాసాద్యే క్యేన నారద ॥
అంతర్దశాసు విదశాస్తాసు చోపదశాస్తథా ।
దశేంశ మిత్రస్వోచ్చక్షం గోఽబ్జోఽబ్ధ్యేకాదివృద్ధిగః ॥
శుభగో యద్భగష్ణస్వాది స్టేన చ తద్దికృత్ ।
ప్రోక్షేతరస్థానగతతత్తద్బోవక్షయం కరః ॥
ఖగస్య యద్భవేద్ద్రవ్యం భావభేక్షణయోగజమ్ ।
జీవికాదిఫలం సర్వం దశాయాం తస్య యోజయేత్ ॥
విశన్యాపదశాయాం యో వైరిదృష్టో విపత్తికృత్ ।
శుభమిత్రేక్షిత శ్చేష్ట సద్వర్గస్థశ్చ యో గ్రహః ॥
తత్కాలే బలహీనాపన్నాశకృత్సముదాహృతః ।
యస్యాష్టవర్గజం చాపి ఫలం పూర్ణశుభం భవేత్ ॥
యశ్చ మూర్తి తనుగ్లావో వృద్ధిగస్వోచ్చసంస్థితః ।
స్వత్రికోణ సుహృద్ఖభస్థస్తస్య మధ్యమసత్ఫలమ్ ॥
శ్రేష్ఠం శుభతరం వాచ్యం విపరీతగతస్య తు ।
నేష్టముత్కటమిష్టం తు స్వల్పం జ్ఞాత్వా బలం వదేత్ ॥
చరే సన్మధ్యదుష్టాభ్యామంగభంగే విపర్యయాత్ ।
స్థిరే నే షేష్టమధ్యా చ హోరాయాస్ర్యంశకైః ఫలమ్ ॥
స్వామీజ్యజ్ఞయుతా హోరా దృష్టా వా సత్ఫలావహా ।
వినాశదృష్ణయుక్తా చ పాపాంతరగతాన్యభా ॥
ప్రాగ్ద్వాoక్షా బంధుమృత్యాయ తయోర్ద్యునే రవిప్స్వభాత్ ।
వక్రాత్స్వాదివశాచ్చార్కే శుక్రోద్యానాం తు షడతః ॥
ధర్మధ్యాయారగో జీవాదికత్ర్యారిగో విధః ।
పృధ్యంత్యధీతపాః సుజ్ఞా తతో వృద్ధ్యంత్యబంధురః ॥
వృద్ధిగోంగొత్సధనధీ తపస్వారోచ్ఛశీ శుభః ।
సద్వృద్ధ్యస్తాదిషు పృథా తృసాష్టౌ పంచయోపగః ॥
షట్ర్యాయ ధీస్థో మందాచ్చ జ్ఞాద్ద్విత్తాయాంష్ట కేంద్రగః ।
కేంద్రాష్టాయాంత్య ఇ జొద్వా జ్లిజ్యాయాస్తత్ర స్వేః కవేః ॥
వృద్ధావిహిత్సావిధియా మంగామాయారీ గోధోః ।
కేంద్రాష్ట్రపార్ధగస్వరాన్మందాద్మాష్టాయ కేంద్రగః ॥
షట్ త్రిధీభవతస్సౌమ్యాత్షణ్వాంశాష్టగో భృగోః ।
కర్మాయ వ్యయషష్ఠస్థో జీవాద్భౌమశ్శుభస్మృతః ॥
కవేర్ధ్యాషష్ణమోధ్యాయే సన్ జోమందాన్సధీత్రయే ।
సాక్షాస్తే భూమిజాజ్జీవా ద్వ్యయారిభవమృత్యుగః ॥
ధర్మాయారిసతాంతేరా సాద్యత్రిస్వగతా స్వభాత్ ।
షట్లాయాష్టాబ్ధిఖేష్విజ్యోత్సహాద్యేషు విలగ్నతః ॥
దీక్వాష్టాద్యస్తబంధ్యాయే కుజాత్భాత్సత్రిగే గురుః ।
సాత్ర్యంకే సభ్రవేశ్శుక్రాద్ధీఖగో దీర్ఘవారిగః ॥
చంద్రాద్వీశార్ధ గోస్తేషు మందాథ్ త్రిషడంత్యగః ।
గోఽభిధీషట్ ఖ ఖాద్యాయే జ్ఞాత్సద్యూనే విలగ్నతః ॥
ఆశుతేశాష్టగోష్వంగః త్సాంతేష్వజ్జాత్వితశ్శుభః ।
స్వాత్సశ్లేషు త్రిధీగోళి దిక్చిద్రాపి గతారోఽర్క జాత్ ॥
రంధ్రాయ వ్యయగస్సూర్యాదోష్ట ధీఖే సగోర్దురో ।
జ్ఞాబ్దిత్యాయారి గోరాత్రి షట్ ధ్యధ్యాంత్యగోషు చ ॥
త్రిధీశాలిషు మందఖాత్ సాక్షాంత్యేషు శుభో సృజః ।
కేంద్రాయాష్ట్ర ధనేష్వర్కా లగ్నాద్వృద్ధ్యాద్య బంధుషు ॥
గోధ్వష్టా పరిఖాంత్యేజ్ఞాచ్చంద్రాల్లోభత్రిషద్భతః ।
షడష్టాంత్యగతశ్శుక్రాద్ధురోద్వీంశాంత్య శత్రుఘు ॥
ఉక్తస్థానేషు రేఖాదో హ్యనుప్తేషు తు బిందుదాః ।
జన్మ చాద్వద్వి మిత్రోచ్ఛ స్వభౌ ధిష్టం పరేష్వసత్ ॥
కష్టమర్థక్షయః క్లోశః సమర్ధసుఖాగమః ।
ధనాప్తిస్సుఖమిష్టాపిరితిరేఖాఫలం క్రమాత్ ॥
పితృమాతృద్వేషన్మిత్రభాతృప్రీభృతకాద్రవే ।
స్వామిలగ్నాజయో స్వస్థాదేందర్క స్వయశోశయాత్ ॥
తృణస్వర్ణాశ్వధోరణాద్యైరస్కాం వృత్తిమాది శేజ్ ।
కృష్యంబుజస్క్రీబ్యోఽబ్దాంశేకాజే ధాత్వసాహసైః ॥
కావ్యశిల్పాదిభిర్బోధ జైవే దేవద్విజాకరైః ।
శాక్రే రజతగోరత్నెమాందే హింసాశ్రమాధమైః ॥
స్వోచ్చేష్వారీ తథా జ్యారైరుకెకాంగే నృపాధిపాః ।
లగ్నే వర్గోత్తమేఽట్టేవా చతురాదిగ్ర హేక్షితే ॥
ద్వావింశభూపాస్తుంగేసృక్ చా పేర్కేందు యమస్తనౌ ।
భూపకృత్తుంగగోఽర్కే గే స్తే సాజార్కోఖభే గురా ॥
యమేందుతుంగశౌ లగ్నే షష్టేర్కజ్ఞో తులా జ ।
పితాసృజో గురౌ కర్కో సారాజే లగ్న గే నృపాః ॥
వృషే గేబ్జేర్కెజ్యసౌరైః సుహుజ్జాయాఖ గైర్నృపః ।
మందే మృగాంగే త్ర్యర్యకాంశ స్థిరజాదిభిర్నృప ॥
సేజ్యా శ్వే మృగముఖే కుజే తుంగేర్కభాగవో ।
లగ్నేఽథ సౌజ్య కరేంగే జ్ఞాజశుక్లైర్భవోపగైః ॥
మే షేర్కే భూమి సేందొ ఏ షే షాంగైర్క పపాస్పజః ।
సింహకుంభమృగస్థాశ్చేద్దూప సారే తనావజే ॥
ఆర్కే జీవే తనౌ వాపి నృపోఽధో కుజభాస్కరా ।
ధీస్థౌ గుర్విందుకవయో భూమౌ ఝంగే బుధ నృపః ॥
మృగాస్య లగ్నగై సౌరే జాబ్దరహరయస్సయాః ।
కవిక్షాతుల యుగ్మస్థౌ భూపః కీర్తిమవాప్నుయాత్ ॥
యస్య కస్యాపి తనయః ప్రోక్తైర్యొగైర్న్పపో భవేత్ ।
వక్ష్యమాణైర్నృపసుతో జ్ఞేయో భూయో మునీశ్వర ॥
గ్రహాన లగ్నము షడ్రంత్యమైననే సంస్కారము చేయవలయును. అట్లు కానిచో చేయరాదు. ఆయంశము నాలుగుచే భాగించగా వచ్చిన తక్కువ భాగము గుణమగును. ఎక్కువగా ఉన్నవి అంశములు తక్కువగా ఉన్నవి భూగుణమని తెలియవలయును. సౌమ్యగ్రహమునకు అర్థభాగముచే, పాపగ్రహమునకు సమగ్రభాగముచే చేయవలయునని సిద్ధాంతము. ఆరింటిని గుణభాగముచే కొట్టివేయబడినవి ఆయురంశములు. దీనినే సంస్కారమందురు. ఆయురంశ కలా భక్తమునుండి పన్నెండుచే కొట్టివేసి ఇరువదిచే భాగించబడినవి సంవత్సరములు. మిగిలిన దానిని ద్విశతముచే భాగించగా నెలలు, మిగిలినవి దినాదికములని తెలియవలయును. లగ్నాంశములను, ఆయురంశములను మూడుచే గుణించి 8చే భాగించినపుడు సంవత్సరములగును. మిగిలిన దానిని పన్నెండుచే గుణించి 8చే భాగించగా మాసాదికములగును. బలవంతుడగు గ్రహమున్నరాశిలో సమానమగు సంవత్సరములు ఆయుష్యమని స్పష్టముగా తెలియును. అంశద్వీఘ్నము, అక్షాంశము 1, 3 మొదలగు వాటిచే గుణించగా మాసములు తెలియును. మిగిలినవి దినాదికములుగా తెలియవలయును. ఈ గణితము పిండ నిసర్గములకు చేయరాదు. లగొర్క చంద్రుల మధ్యలో ఏ గ్రహము బలీయమో ముందు ఆ దశ ప్రారంభమగును. తరువాత కేంద్రాది స్థానములలో ఉన్న గ్రహముల దశలు రెండు మూడు మొదలగు వాటి యందు బలీయుని దశ వచ్చును. ఈ దశలలో కూడా కేంద్రదిస్థానములలో ద్వితీయ తృతీయస్థానములలో బలీయునితో క్రమము ప్రారంభమగును. బలీయులై సూర్యాదులతో కూడియున్న గ్రహములదశ ప్రారంభమైనపుడు. దీర్ఘాయుష్మంతుడగును. విపరీతమైనచో యాచకుడగును. షడ్వర్గార్థము, త్రింశాంశ, త్రికోణస్థానములలో నున్న గ్రహదశయేర్పడినచే స్మరగుడగును. సప్తమాసములలో చతురస్రగతుడైనచే ఇచట కూడా కేంద్రాదిస్థానములలో ద్రాత్ర్యాదులలో సబలగ్రహములక్రమమే ప్రారంభమగును. పాకాధిపుడైనచో నాలుగు ఎనిమిది స్థానములు, సహగుడైనచే నాలగు స్థానములు. త్రికోణ స్థానమున నున్న వానికి 8, 8, 12 సంఖ్యలీయవలయును. నాలుగు పెనిమిది స్థానములలో ఉన్న వానికి స్వరగుణితము చెప్పబడినది. దశాగుణములో హతములై భాగముచే గుణేక్యముచే వచ్చినవగును. మిగిలిన భాగము అర్కాదిహతమైనచో మాసాద్యేక్యముచే భాగముచేయవలయును. అంతర్దశలలో విదశలు, విదశలలో ఉపదశలుండును. దశలో. అంశమిత్ర స్వోచ్చరాశులలో నున్న చంద్రుడు నాలుగు ఒకటిమొదలగు వాటిచే వృద్ధినందినచో శుభస్థానముననున్న చో శుభకరుడగును. ఏరాశిలో ఉన్నపుడు ఆయా స్థానములకనుగుణముగా ఫలితములనిచ్చును. చెప్పిన స్థానముల కంటే భిన్న స్థానములలో నున్నచో ఆయా భావములను క్షీణింపచేయును. గ్రహమునకు యే ద్రవ్యముండునో అది భావాంశలో కణయోగము వలన కలుగును. జీవనఫలమంతయు దశలో కూర్చవలయును. విదశాది దశలలో శత్రుగ్రహముచే చూడబడు గ్రహము ఆపదలను కలిగించును. శుభగ్రహములచే, మిత్రగములచే చూడబడినచో, సద్వర్గలోనున్న గ్రహము ఇష్టుడగును. ఆ దశా కాలములో ఆగ్రహము బలయుతుడైనచో ఆపదలను నశింపచేయును. అతనికి అష్టవర్గజఫలము పూర్తిగా శుభమే యగును. లగ్నమున మూర్తి స్థానమున నున్న చంద్రుడు వృద్ధిచెంది వాడై స్వోచ్చరాశిలోనున్న చో, తనను త్రికోణస్థానమున మిత్రగ్రహములున్న చో మధ్యమఫలము కలుగును. విపరీతగతుడైనచో శ్రేష్ఠము శుభతరమగు ఫలమును చెప్పవలయును. ఉతాటానిష్టమును, స్వల్పముగా తెలిసి బలమును చెప్పవలయును. చరరాశిలో ఉంటూ మధ్యలో దుష్టగ్రహములచే విపర్యమువలన అంగ భంగము జరిగినచో, స్థిరరాశిలో ఇష్టమగు అష్టమమధ్యలో నున్ననూ హోరాత్ర్యంశములతో ఫలమును చెప్పవలయును. రాశ్యధిపతి బృహస్పతి బుధులచే కలిసియున్న చో, లేదా చూడబడినచో సత్పలమునొసంగును. చూడబడిననూ కలిసియున్ననూ పాపగ్రహముల మధ్యన నున్నచో వినాశము తప్పదు. ప్రాగ్ద్వక్షముగా నున్నచో బంధుమృత్యువు సంభవించును. సూర్యుడు ఇద్దరికంటే తక్కువగా ఉన్ననూ, శుక్రాదులు షడ్రతులైనపుడు నాలుగు ఆరు పదకొండు స్థానములలో బృహస్పతిమొదలగు గ్రహములున్నూ, చంద్రునికి మూడింట ఆరింట ఉన్ననూ చెడుఫలము కలుగునని తెలియవలయును.. వృద్దిస్థానమగు రాశిలోకాని, పదకొండింట, ఆయిదింట చంద్రుడు తనరాశిలో ఉన్న చో శుభకరుడగును. ఆరు, మూడు, పదకొండు, అయిదు స్థానములలో నుండి శనికి బుధునికి రెండు మూడు పదకొండు కేంద్రస్థానములలో నున్ననూ కేంద్రము అష్టమఏకాదశ స్థానములలో నున్న బృహస్పతి కంటేను బుధుడు స్వస్థానముననున్న. శుక్రుని కంటే బలీయుడగును. వృద్ధిలో ఉన్న సూర్యునికంటే మొదటి అయిదవ స్థానములలో నున్న పదకొండు ఆరుస్థానములలో నున్న చంద్రునికంటే, కేంద్రస్థానములలో అష్టమస్థానములో శుభరాశిలోనున్న శని కం ఓ గోషాఆయ కేంద్రస్థానములలోనున్న, గ్రహము బలీయము. ఆరు మూడు అయిదు స్థానములలో నున్న బుధుని కంటే ఆరు, అంశ, అష్టమస్థానములలో నున్న శుక్రుని కం టే, నాలుగు పదకొండు పన్నెండు స్థానములలో నున్న కుజుడు గురువు కంటే బలీయుడు. ఆరు పదకొండు స్థానములలో నున్న శుక్రునికంటే, అయిదు మూడుస్థానములలో నున్న శనికంటే బుధుడు బలీయుడు. అస్తగతుడైన కుజునీ, కంటే బృహస్పతికంటే పన్నెండు ఆరుస్థానములలో నున్న గ్రహము మృత్యుప్రదుడు. నాలుగు పదకొండు ఆరుస్థానములలో నున్న అంత్యములోనున్న సూర్యునికంటే ప్రథమ తృతీయ స్థానములలోనున్న, ఆరు, ఒకటి, పదకొండు, ఎనిమిది, నాలుగు, స్థానములలోనున్న బృహస్పతికంటే భిన్నలగ్నములలోనున్న గ్రహములు బలీయములు. కోణస్థానములలో అష్టమస్థానములో ప్రథమస్థానముననున్న కుజునికం ఓ మూడవస్థానముననున్న గురువు. బలీయుడు. మూడవస్థానమున నున్న సూర్యుని కంటే, శుక్రునికం , మూడవ మొదటిస్థానమున, 8, 9, 6 స్థానములలోనున్న గ్రహము బలీయము. నాలుగు అయిదు రెండు స్థానములలో నున్న చంద్రుని కం టే, రెండు మూడు ఆరుస్థానములలోనున్న గ్రహము అదే స్థానములోనుండు శనికంటే బలీయుడు. ఒకటి, నాలుగు, అయిదు, ఆరు పదకొండు స్థానములలో నున్న గ్రహములు రెండు పన్నెండు స్థానములలో, భిన్న రాశులలో నుండు బుధునికంటే బలీయులు. రాశ్యంత్యాంశములలో నుండు చంద్రుని కంటే శుక్రుడు శుభకరుడు. తన రాశిలో బుధునితో నున్న గ్రహములలో మూడు అయిదు. నాలుగు రెండు స్థానములలో, దిక్ భద్ర ఆగతుడగు గ్రహము శనికంటే శుభకరుడు. రంధ్ర, ఆయ, వ్యయస్థానగతుడు 8, 5, 3 స్థానములలో నుండు సూర్యునికం టే గురువు కంటే బలీయుడు. బుధుడు నాలుగు మూడు, పదకొండు, ఆరు, రెండు స్థానములలో, మూడు అయిదు ఆరు స్థానములలో నుండు శని రాశ్యంత్యాంశములలో నుండు కుజుని కంటే బలీయుడు, కేంద్ర, ఆయ, అష్ట ధనస్థానములలో నున్న సూర్యుడు లగ్నమునుండి వృద్ధి ఆద్యబంధువులలో గోఅధ్వఅష్టఅరి భస్థానములలో రాంశ్యంత్య భాగములలో నుండు చంద్రునికంటే లాభత్రిషట్ స్థానములలో నుండగా బలీయుడు.
ఆరు, ఎనిమిది, అంత్యాంశగతుడు రెండు, అంత్యాంశలయందుండు గురువు కంటే శుక్రుని కంటే బలీయుడు. ఉక్తస్థానములలో రేఖల నీయవలయును. చెప్పని స్థానములలో బంధువుల నుంచవలయును. జన్మరాశి నుండి ద్వీమిత్రోశ్చరాశులు స్వస్థానములైనచో శుభము. పరస్థానమైనచో అశుభమని తెలియ వలయును. అర్థక్షయము క్లేశము. సమత అర్థ సుఖమునిచ్చును. ధనాప్తి, సుఖము, ఇష్టాప్తి అని క్రమముగా రేఖాఫలమును చెప్పవలయును. సూర్యుని వలన పితృమాతృద్విషన్మిత్ర భాతృ సేవనలు లభించెదరు. స్వాబగా ఉన్నను మేషలగ్నములోను స్వస్థానములోనున్న సూర్యచంద్రుల వలన కీర్తి ప్రతిష్ఠలు పెరుగును. తృణ, స్వర్ణ, అశ్వ, ధోరణాదులచే సూర్యాంశలో జీవనమును" చెప్పవచ్చును. చంద్రాంశలో, కృషి, అంచుజస్త్రీలచే జీవనమును చెప్పవలయును. కుజాంశలో ధాతువులచే, ఆస్త్రములచే, సాహాసముచే జీవనము జరుగునని చెప్పవలయును.
బుధాంశలో కావ్యశిల్పాదులచే జీవనము సాగునని, దేవ ద్వీజాకరములచే గుర్వంశలో జీవనము సాగునని చెప్పవలయును. శుక్రుని అంశలో రజత రత్నములచే, శని అంశలో హింసాశ్రమ అధములతో జీవనము సాగునని చెప్పవలయును. సూర్యుడు తన ఉచ్ఛరాశులలో ఉండి గురుకుజులతో కలిసి యున్నచో రాజులగుదురు. లగ్నములోకాని, వర్గోత్తమమున కొని చంద్రుడుండి నాలుగు అంతకంటే ఎక్కువ గ్రహములచే చూడబడినచో రాజగును. ఉచ్ఛలో కుజుడు, ధనూరాశిలో సూర్య చంద్రులు, లగ్నమున శని ఉన్నచో రాజగును. ఉచ్ఛలో సూర్యుడు, స్వస్థానమున నుండు గురువు, శని చంద్రులు ఉచ్ఛలో నుండు నపుడు, లగ్నమున సూర్యుడు, షష్ఠస్థానమున బుధుడున్నచో, శుక్రుడు కుజుడు, గురువు కర్కటకముననున్నపుడు, కుజుడు మేషమున కొని లగ్నమున కాని యున్నచో రాజగును. సూర్యుడు, బృహస్పతి వృషభమున నున్నను, స్వస్థానమున బృహస్పతి యున్ననూ రాజగును. శని సింహమున, మూడు ఆరు స్థానముల రాశ్యంశమున మేషాదులున్ననూ రాజగును. మేషమున బృహస్పతితో కూడిన గ్రహమునుండి, సింహమున కుజుడుండిన, ఉచ్ఛరాశితో మేషము చూడబడునపుడు రాజగును. లగ్నమున బృహస్పతితో కూడి సూర్యుడున్నపుడు, బుధశుక్రులు మేషమున నున్నపుడు, మేషరాశిలో సూర్యుడుండి, కుజచంద్రులతో కలిసి యున్ననూ చూపు పడిననూ, శని కుజులున్ననూ, సింహమున కుంభమున మేషమున ఉన్నచో రాజగును. మేషలగ్నమై, మేషమున కుజుడున్ననూ రాజగును. సూర్యుడు, బృహస్పతి లగ్నమున నున్ననూ, సూర్యుడు, కుజుడున్ననూ రాజగును. అయిదవస్థానమున గురువు చంద్రుడు శుక్రుడున్నచో, స్వస్థానమున మూడింటఉన్నను రాజగునని పండితులు చెప్పెదరు. సింహలగ్నజాతకుడు, సింహమున శనిచంద్రుడున్నపుడు, శుక్రుడు కుజుడు తులారాశిలో కాని, ద్విస్వభావరాశులలో కాని ఉన్నచో రాజు కీర్తిమంతుడగును. పైన చెప్పబడినయోగములచే ఎవరి పుత్రుడైననూ రాజు కావచ్చును. ఇపుడు చెప్పబోవుయోగములచే రాజ పుత్రుడు మాత్రమే రాజగునని తెలియును.
స్వోచ్చే త్రికోణభగతేస్త్రైద్యేర్బలయుతైర్నృపః ।
సింహ్వో మేషలగ్నేజే మృగే భౌమే ఘట్రేష్టమే ॥
చా పే జీవే ధరానాధస్యాధధ స్వర గే భృగౌ ।
పాతాలగే ధర్మగ్వేబ్జే శుభదృష్టి యుతే మునే ॥
త్రిలగ్నభావగైశ్మే షెర్ధరాధీశః ప్రజాయతే ।
సౌమ్యే వీర్యయుతేంఽగస్థే బలాఢ్య శుభగే శుభే ॥
ధర్మార్దోపచయస్థైశ్చ శే షేర్మర్మయుతో నృపః ।
మేషూరణాయతనుగా శశిసూర్యజసూరయః ॥
జ్ఞారౌ ధనేశితరవామిబుకే భూపతిస్తదా ।
వృషేగేఽబ్జో ధనారిస్థో జీవార్కలాభగాః పరే ॥
సుఖే గురుః ఖే రవీందూ యమోలగ్నే భవే కరౌ ।
లగ్నే వక్రాసితో చంద్రే జ్య సితార్కబుధాః క్రమాత్ ॥
సుఖాస్తు శుభఖాప్తిస్థా నరేశం జనయంత్యపి ।
కర్మలగ్నగఖేటస్య దశాయాం రాజ్యసంగతిః ॥
ప్రబలస్య దశాయాం వా శత్రునీచాదిగార్తిదాః ।
ఆసన్న కేంద్రద్వయ గైర్వర్గదాఖ్యస్సకలగ్ర హై ॥
తన్వస్తదైశ్చ సకటం విహగో రాజ్యబంధుగైః ।
శృంగాటకం ధిగౌగస్థైర్లగ్నాన్య స్థైర్హలం మతమ్ ॥
వర్జోంగేస్థే సత్స్వసత్సు తుర్యగస్థైర్యవోఽన్యధా ।
విమిశ్రైః కమలం ప్రాహుర్వాయాకంటకబాహ్యగై: ॥
లగ్నాచ్చతుర్భు గైరూపశ్శరస్తూర్యాచ్చతుర్భుఽకి ।
ద్యూనార్వేదక్ష గైశ్శక్తిం నర్డఖాదీచతుర్థగై: ॥
లగ్నాత్క్రమాత్సప్తభగైః నౌకాకూటస్తు తుర్యతః ।
ఛత్రమస్తాత్స్వభాద్యాయోన్యస్మాదర్దేష్ణునామకః ॥
లగ్నాదేకాంతరగతైశ్చక్రమర్ధాత్సరిత్పతిః ।
ఋహ్యుస్థానేషు వీణాద్యా సమసప్తరసంస్థితైః ॥
వీణాదామపాశ కేదారభూశూలయుగగోలకొః ।
గ్రహైస్సర్వైశ్చరభగై రాజయోగః ప్రకీర్తితః ॥
స్థిరస్థైర్ముసలం నామ ద్విశరీరగతైర్నలః ।
భాలా కేంద్రస్థితైస్సౌమ్యె పాపైస్సర్ప ఉదాహృతః ॥
ఈర్య్యుర్ధ్వరుచీ రజ్జ్యాం ముసలే ధనమానయుక్ ।
వ్యంగా స్థిరా లోనలజో మోగీ స్రగ్జో హి జోర్దితః ॥
వీణోద్భవోఽతినిపుణః గీతనృత్యరుచిర్భృశమ్ ।
దాతా సమృద్ధో దామస్థః పాశజో ధనశాలయుక్ ॥
కేదారోత్థః కృషికరశూలే శూరోక్షతో ధనః ।
యుగం పాషండయుర్గోలే విధనో మలినస్తథా ॥
భూపవంద్యపదశ్చక్రే సముద్రే నృపభోగయుక్ ।
సుభగాంగోర్ధచంద్రాత్సుఖీ శూరశ్చ చామరః ॥
మిత్రోపకారకృచ్ఛత్రే కూటే చానృతబంధరాట్ ।
తాజస్సకీర్తి సుఖభాక్ మానవో భవతి ధ్రువమ్ ॥
త్యాగే యజ్వాత్మవాన్ యూధే హింస్తో గుహ్యాధిపశ్శరైః ।
శక్తా నీచోఽలసో నిస్వో దండే ప్రియవియోగభాక్ ॥
వ్యర్కైస్స్వాంత్యో భయగతైః ఖైటై స్స్యాత్సునఫా నఫా ।
దురుధరా చైవ విధౌ జ్ఞేయః కేముద్రుమోఽన్యథా ॥
స్వోపార్జితార్ధభగ్దాతా సునఫాయాం ధనీ సుఖీ ।
నీరోగశ్శీలవాన్త్యాత సువేషశ్చానషాభవః ॥
భోగీ సుఖీ ధనీ దానీ త్యాగీ దురుదురోద్భవః ।
కేము ద్రుమోఽతిమలినో దుఃఖీ నీచోఽథ నిర్ధనః ॥
యంత్రాశ్మ కారంతో జోకో భౌమపుష్కరుర్తే ధ్వగస్సుజ్ఞః ।
సుకీర్తిం నిపుణం విధ్వాంసం ధనినం తథా ॥
సోఽన్యోన్యకార్యనిరతం సాస్ఫుజిచ్ఛస్త్రజీవినమ్ ।
సమందో ధాతుకుశలం తథా భాండవిదం మునే ॥
కూటస్న్యా శవ పణ్యాఠం నసాసృగిందుః ప్రసూ ద్విషమ్ ।
కుర్యాత్స జ్ఞోఽర్ధనిపుణం నమ్రం సత్కీర్తిసంయుతమ్ ॥
సజ్యోస్థిరవయం వంశ్యం విక్రాంతం చ సమర్ధినమ్ ।
ససితోసక వేత్తారం సార్కిపీనభవం మునే ॥
ఆరే సజ్జే బాహుయోధీ పురాధ్యక్షస్స గీష్పతౌ ।
పశుక్రే ద్యూతకర్హోయోఽనృతీ ద్యూతీ సమందకే ॥
సేజ్యే జ్ఞేనృత్యగీతాధ్యే మాయా దక్షస్సభార్గవే ।
సమందే లుబ్ధకః క్రూర నరో భవతి నారద ॥
సశుక్రే వాక్పతౌ విద్వాన్ సాసితేఽన్నఘటంకరః ।
కవౌ సమంద మందాక్షావవ్యశ్రయవిత్తవాన్ ॥
ఏకస్థైశ్చతురాయ్యెస్తు ఖవార్ధైః ఖచరైః పృథక్ ।
కుజజ్ఞేజ్యాజ శుక్రార్కిసూర్యైః పరివ్రజేన్నరః ॥
శాక్యజీవకవృద్ధార్థిచరకాఖ ఫలాశనః ।
తత్స్వామిభిః పరిజితైః ప్రవ్రాజ్యా ప్రచ్యుతిర్భవేత్ ॥
అదీక్షితాల్పస్తగతై సబలైస్తత్ష్సభక్తయః ।
జన్మపోఽన్యైర్యద్యదృష్టో మందం పశ్యతి నారద ! ॥
మందో వా జన్మపం నష్టం తథా చ మందకాగణే ।
భౌమార్కాంశే సౌరదృష్టే చంద్రే వా దీక్షితో భవేత్ ॥
సురూపో భూషితోఽశ్విన్యాం దక్షస్సత్యవచా యమే ।
బహుభుక్పదారగ్నౌ స్థిరధీః ప్రియవాక్తథా ॥
బ్రాహ్మీ ధనీ మృగే భోగీ రౌద్రౌ హింసశ్శరోఽఘకృత్ ।
దాంతో రోగీ శుభోఽదిత్యాం పుష్యర్యజన్మా కవిస్సుఖీ ॥
ధూర్తశ్శఠః కృతఘ్నోఽహౌ పాపసర్వాశనో భవేత్ ।
పత్రే భోగీ ధనీ భక్తో దాతా ప్రియవచో భగే ॥
ధనీ భోగీ నరోర్యమర్క్యే స్తేనో ధృస్టో ఘృణీకరే ।
చిత్రాంబరస్సుద్భక్త్వాష్ట్రే న చ ధర్మదయాపరః ॥
ద్వీశే లుబ్దః పటుః క్రోధీ మడ్యౌ అటనో విదేశగః ।
శాక్రీ ధర్మపరస్తుష్టో మూలే మానీ ధనీ సుఖీ ॥
ఆప్యే మానీ సుఖీ హృష్టో వైశ్వే నమ్రశ్చ ధార్మికః ।
కర్ణే ధనే సుఖీ ఖ్యాతో దాతాశూరో ధనీవసౌ ॥
శతేరిహంతా వ్యసనీ స్త్రీజితో జాహి భేదినీ ।
బుద్నే వక్తా సుఖీ కాంతః పౌష్ణే శూరో ధనీ శుచిః ॥
కామీ శూరః కృతజ్ఞోజే కాంతస్త్యాగీ క్షమీ వృషే ।
యుగ్మే స్త్రీద్యూతశాస్త్రజ్ఞస్త్రైణో స్వస్వభౌ విధే ॥
స్త్రీద్విట్ క్రోధీ హరౌ మానీ విక్రాంతస్థిరధీస్సుఖీ ।
ధర్మీ శ్లక్షసుధీష్షష్ఠే ప్రాజ్ఞః ప్రాంశుర్థనీ ఘటే ॥
రోగీ పూజ్యః క్షతీ కార్ష్యే కవిశ్శిల్పీజ్యభేధనీ ।
మృగేఽలసోఽటనస్సక్షో పరదారార్థహృదట ॥
సబలే భే భయే వాపి స బలేఽజేఖిలం ఫలమ్ ।
అన్యథా విపరీతం తత్ ఫలమేవం పరేఽపి న ॥
ఖ్యాత స్వీద్విట్ ధనీ తీక్షోజ కవిశ్శౌండికో ధనీ ।
పూజ్యో లుబ్ధకోఽధనసభో మేషాదౌ భాస్కరే జనౌ ॥
నిస్స్వోఽర్కఖీభూమిపుత్రే ధనీ చాంద్రే స్వఖేదనః ।
బుధే కృతజ్ఞో జైవే తు ఖ్యాతశ్నోత్రే అన్యదారికః ॥
మృగే బహ్వాత్మజధనకుంభే దుఃఖ్యనృతీ ఖలః ।
స్త్రీద్వేష్యస్వజనద్వేషీ నియరత్యస్సధీ ధనః ॥
సమానార్ధసపుత్రస్త్రీసర్ణసూర్యాదిఖే బుధే ।
సేనానీసర్ధపుత్రాడ్య దక్షమైశ్య పరిచ్ఛదీ ॥
మండలేశస్సార్ధసుఖసర్గస్వామ్యర్కభాద్గురౌ ।
ఫ్ర్యాప్తారో మందశోకాళ్యో బంధుద్వేషీ ధనాఘవాన్ ॥
సార్థః ప్రాజ్ఞసమః ఖ్యాతి స్త్రీజితోఽర్కాదిబే భృగా ।
వ్యంగజార్ధ్వప్రసూకో విధిమితో సుఖత్రయః ॥
సత్పుత్ర స్త్రీధనో రాజా గ్రామే శోకాదిఖేర్కజే ।
భూపజ్ఞగుణి పౌరాస్వా దృ షేప్డేజే సృగాదిభిః ॥
నిస్స్వ సేన నృపాః ప్రజ్ఞ పేష్యామలినృయుగ్మ గే ।
ధాత్వా జీవీ నృపజ్ఞాభీతంతువాయా ధనాస్వభౌ ॥
యుయుత్సుకవిసూరీజ్య ధాతుజీవిదృగామయాః ।
జ్యోతిర్జాఢ్య జ్యనుఖలు నృపే జ్ఞాదికర్హరో ॥
షష్ఠే శుభైర్నృపచమూనైపుణ్యవతితాశయాః ।
జూకే భూపస్వర్ణకారవణిజు శ్శేషదృగ్యుతే ॥
ద్విపైతృకాబ్ధిద్వజినో వ్యంగాస్వక్షితిపా అభౌ ।
జ్ఞాతిక్ష్మా జనయాశ్చాపే సద్ఖిర్ధర్మీ శరస్తథా ॥
భూపమండితస స్వేజ్యొ మృగే భూయాన్యదారికౌ ।
కుంభే శేషైశ్చ హాస్యజ్ఞ నృపజ్ఞాసద్భిరంత్యథే ॥
హారే శరదలిస్థైస్తు దృష్టో యుక్త శ్శశీ శుభః ।
త్ర్యంశే తత్పతిమిత్రగతైర్యుత్తే క్షితస్తథా ॥
స్త్య్రాదిగ్రహములు బలయుతులై తమతమ ఉచ్చ స్థానములలో కాని త్రికోణ స్థానములందు కానియున్నచో రాజుకోగలడు. సింహమున సూర్యుడు, మేషమున చంద్రుడు, మకరరాశిలో కుజుడు, కుంభరాశి అష్టమము, ధనూరాశిలో బృహస్పతి, స్వస్థానమున శుక్రుడున్న చో జాతకుడు రాజగును. పాతాల ధర్మస్థానములలో నున్న చంద్రుడు శుభగ్రహములచే చూడబడినచో మిగిలిన గ్రహములు త్రోలగ్న భవస్థానములలో నున్నచో రాజగును. బలయుతుడగు బుధుడు వృషభమున నుండగా, శుభగ్రహములు శుభస్థానములలో నున్నపుడు, ధర్మధనస్థానములలో మిగిలిన గ్రహములున్నపుడు రాజు. ధర్మాత్ముడగును. మేష ఆయలగ్నములలో చంద్రుడు శని గురువులున్నచో ధనస్థానమున (2) బుధకుజులున్నచో, శుక్రుడు హిబుకమున ఉన్నచో రాజగును.
వృషభమున, కుంభమున చంద్రుడు, రెండవస్థానమున ఆరవ స్థానమున గురు శనులు, ఇతరులు పదకొండవ స్థానముననున్నచో, నాలుగవస్థానమున గురువు, సూర్య చంద్రశనులు లగ్నమున, భవమున, కరిలో ఉన్నపుడు, లగ్నమున శుక్రుడు శని, చంద్రుడు, గురువు, శుక్రుడు, సూర్యుడు బుధుడు క్రమముగా శుభులు శుభరాశిలో ఉన్నపుడు పుట్టినవాడు రాజగును. పదవస్థానమున, లగ్నమున నున్నగ్రహముయొక్క దశలో రాజ్యము లభించుట కలదు. బలీయమగు గ్రహముయొక్క దశలో కాని శత్రుగ్రహములు నీచ స్థానములలో నున్నపుడు ఆర్తిని కలిగించును. సూర్యుని సమీపమున . సకల గ్రహములున్నచో వర్గదము అందురు. లగ్నమున గ్రహము అస్తగుడైనచో సకట యోగమందురు. రాజ్యబంధుస్థానములలో గ్రహములున్నచో విహగయోగమందురు. అయిదవ స్థానమున ఎనిమిదవ స్థానమున గ్రహములున్న చో శృంగాటకయోగమందురు. లగ్నమున కంటే ఇతర స్థానములలో గ్రహములున్నచో హలయోగమందురు. అంగమున శుభాశుభగ్రహములున్నపుడు వర్జయోగమందురు. నాలుగవ స్థానమున నున్న చో యపయోగమందురు.
గ్రహములు కలగాపులగముగానున్నచో కమలయోగమందురు. లగ్నమున నాలుగు గ్రహములున్నచో యూపయోగమందురు. నాలుగవ స్థానమున సొలుగు గ్రహములున్నచో శరయోగమందురు. ఏడునాలుగు రెండవ స్థానములలోనున్న చో శక్తి , యోగమందురు. లగ్నమునుండి వరుసగా ఏడు స్థానములలో గ్రహములున్నచో- నౌకా యోగమందురు. లగ్నమున మాత్రమే యున్నచో కూటయోగమందురు. స్వస్థానమున గ్రహమస్తంగతుడైనచో ఛత్రయోగమందురు. ఇతర స్థానములలో అస్తగుడైనచో అర్ధేందు యోగమందురు. లగ్నమునుండి ఒకటిని విడిచి తరువాతి రాశిలో గ్రహములున్నచో చక్రయోగమందురు. సమసప్తరాశులలో గ్రహములున్నచో వీణాదియోగములనబడును. వీణా దోమ, పాశ, కేదార, శూల యుగ గోలకములని ఆరు యోగములు. అన్ని గ్రహములు చర రాశులలో నున్నచో రాజయోగమని చెప్పబడినది. స్థిరరాశులలో అన్ని గ్రహములున్నచో ముసలయోగమందురు. ద్విస్వభావరాశులలో నున్నచో నలయోగమందురు. కేంద్రమున సౌమ్యగ్రహములున్నచో భాలయోగమందురు. కేంద్రమున పాపగ్రహములున్నచో సర్పయోగమందురు. రజ్జుయోగమున పుట్టినవాడు ఈర్ష్యాలువు ప్రయాణమున రుచి గలవాడుగా నుండును. ముసల యోగమున పుట్టినవాడు ధనము గౌరవము కలవాడగును. వీణాయోగమున పుట్టినవాడు అతినిపుణుడు, గీతనృత్యము లందు మిక్కిలి అభిలాష కలవాడుగా నుండును. దామయోగమున పుట్టినవాడు సర్వసంపద్యుక్తుడు దౌతయగును. పొశయోగమున పుట్టినపోడు ధనవంతుడు శీలవంతుడగును. కేదారయోగమున పుట్టినవాడు వ్యవసాయము చేయువాడగును. శూలయోగమున పుట్టినవాడు శూరుడు తరగని ధనము కలవాడగును. యుగయోగమున పుట్టినవాడు పాషండులతో కలిసియుండును. గోలకయోగమున పుట్టినవాడు ధన హీనుడు మలినుడగును. చక్రయోగమున పుట్టినవాడు రాజులచే నమస్కరించదగినవాడగును. సముద్రయోగమున పుట్టిన వాడు రాజభోగములు కలవాడగును. అర్థచంద్ర యోగమున పుట్టినవాడు సౌందర్యము కల అవయవములు కలవాడు సుఖీ, శూరుడు దీర్ఘాయుష్మంతుడగును. ఛత్రయోగమున పుట్టినవాడు మిత్రులకు ఉపకారము చేయువాడగును. కూటయోగమున పుట్టినవాడు అసత్యవాదియగును. తేజోవంతుడు, కీర్తిమంతుడు, సుఖము కలవాడుగా నగును. యూధయోగమున పుట్టినవాడు త్యాగి, యాగము చేయువాడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, గుహ్యాధిపుడగుచో శరములచే హింసించువాడగును. శక్తియోగమున పుట్టినవాడు నీచుడు, అలసుడు, నిర్థనుడు అగును. దండయోగమున పుట్టినవాడు ప్రియుల ఎడబాటును పొందును. సూర్యుడుకాక మిగిలిన గ్రహములు కుంభ మీన రాశులలో నున్నపుడు సునఫా, ఆనఫా యోగములందురు. చంద్రుడు మీనరాశిలో ఉన్నపుడు దురుధరాయోగమనబడును. అట్లు కానిచో కేముద్రుమయోగమందురు. సునఫా యోగమున పుట్టినవాడు తాను సంపాదించిన ధనమును అనుభవించువాడు, దాత, ధనవంతుడు, సుఖవంతుడుగా ఉండును. ఆనఫా యోగమున పుట్టినవాడు రోగము లేనివాడు, శీలమంతుడు, ప్రసిద్ధిని పొందువాడు, చక్కని వేషము కలవాడగును. దురుధర యోగమున పుట్టిన పొడు. భోగవంతుడు, సుఖవంతుడు, ధనవంతుడు, దానము చేయువాడు, త్యాగము చేయవాడుగా నుండును. కేముద్రుమ యోగమున పుట్టినవాడు మిక్కిలి మురికిగా నుండువాడు దుఃఖము కలవాడు, నీచుడు, నిర్ధకుడుగా నుండును. కుజుడు పుష్కరాంశమున నుండగా పుట్టినవాడు యంత్రకారుడు, అశ్మ కారుడు, చక్కని బాటలో నడుచువాడు, చక్కని జ్ఞానము కలవాడు, చక్కని కీర్తి కలవాడు, నిపుణుడు, విద్వాంసుడు, ధనవంతుడుగా నుండును. లగ్నమున సూర్యుడున్నచో అన్యోన్యకార్య నిరతుడగును. శుక్రుడున్నచో శస్త్ర జీవియగును. శనితో కలిసియున్నచో ధాతుకుశలుడగును. కూటస్థానమున తిరుగువాడు శవవిక్రేత కుజడున్నచో యగును, చంద్రుడున్నచో సంతాన ద్వేషియగును. బుధునితో కలిసున్నచో అర్ధ నిపుణుడగును. వినయశాలి సత్కీర్తిమంతుడగును. గురువుతో కలిసియున్నచో స్థిరవయస్కుడు, సద్వంశజుడు, విక్రాంతుడు సమర్థుడగును. శుక్రుడున్నచో, సుఖము తెలిసినవాడగును. శనియున్నచో బలిష్ఠుడగును. బుధునితో కలిసి కుజుడున్నచో బాహు యుద్ధము చేయువాడు, గురువుతో కలిసి యున్నచో పురాధ్యక్షుడు, శుక్రునితో కలిసి యున్నచో ద్యూతము నాడువాడు, శనితో కలిసి యున్నచో అబద్దములాడువాడు, ద్యూతము నాడువాడు, గురువుతో కలిసి బుధుడున్న చో నృత్యగీత నిపుణుడు, శుక్రునితో కలిసున్నచో మాయదకుడు, శనితో కలిసున్నచో పిసిసొరీ క్రూరడగును. శుక్రునితో కలిసి గురువున్నచో విద్వాంసుడు, శనితో కలిసున్నచో అన్నఘటకరుడు, శుక్రుడు మాత్రమే ఉన్నచో చిన్నకన్నులు కలవాడు, అరణ్యము వలన వచ్చు డబ్బుగలవాడగును. ఒకేస్థానములో నలుగురు అంతకన్నా ఎక్కువగ్రహములున్నచో, కుజుడు, బుధుడు, బృహస్పతి, చంద్రుడు, శుక్రుడు శని సూర్యులున్నచో పరివ్రాజకుడగును. శాకములను కందమూలములను, ఫలములను తిను పొడగును. రాశుల అధిపతులు బలీయులైనచో ప్రవ్రజించినచో చ్యుతి కలుగదు. అదీక్షితుడు, అల్పుడు, అస్తగతుడు. బలీయులగు గ్రహములు కలిసి యున్నచో వారి భాగములచే ఫలములను చెప్పవలయును. జన్మలగ్నాధిపత్తి ఇతర గ్రహములచే చూడబడనిచో మెల్లగా చూచును. జన్మలగ్నాధిపతిని శని చూచినచో నశించును. కుజ సూర్యాంశలు శనిచే చూడబడినచో, చంద్రుడు చూడబడినచో దీక్షితుడగును.
అశ్వినీ నక్షత్రమున పుట్టినవాడు రూపవంతుడు ఆభరణభూషితుడుగా నుండును. భరణీ నక్షత్రమున పుట్టినవాడు సమర్థుడు సత్యమును పలుకువాడగును. కృత్తికా నక్షత్ర జాతకుడు తీండిపోతు, స్థిర బుద్ధి కలవాడు, ప్రియముగా మాటలాడువాడగును. రోహిణీ నక్షత్ర జాతకుడు ధనవంతుడు, మృగశిరా నక్షత్రజాతకుడు భోగి, ఆర్థా నక్షత్ర జాతకుడు హింసాలి, శఠుడు, పాపకారి యగును. పునర్వసు నక్షత్ర జాతకుడు ఇంద్రియనిగ్రహము కలవాడు, రోగి, శుభకరుడు, పుష్యమీ నక్షత్ర జాతకుడు కవి, సుఖి, ఆశ్లేషానక్షత్ర జాతకుడు ధూర్తుడు, శరుడు, కృతఘ్నుడు, పాపి, అన్నిటిని తినువాడగును. మఘ నక్షత్ర జాతకుడు భోగి, ధని, భక్తుడు, పూర్వఫల్గునీ నక్షత్ర జాతకుడు దొత, ప్రియముగా మాట్లాడు వాడు, ఉత్తరా నక్షత్ర జాతకుడు ధని, భోగి, హస్తా నక్షత్రజాతకుడు చోరుడు, ధృష్ణుడు, దైన్యము కలవాడగును. స్వాతి నక్షత్రజాతకుడు చిత్రాంబరధారి, చక్కని నేత్రములు గలవాడు, ధర్మపరుడు దయాపరుడు కాజాలడు. వీశాఖా నక్షత్ర జాతకుడు లుబ్ధుడు శఠుడు, కోపిష్టి, అనూరాధానక్షత్ర జాతకుడు తిరుగుబోతు, విదేశములకు వెళ్ళువాడు, జ్యేష్ణానక్షత్ర జాతకుడు ధర్మపరుడు, సంతోషశీలి, మూలానక్షత్ర జాతకుడు అభిమానము కలవాడు, ధనవంతుడు, సుఖము కలవాడగును. పూర్వాషాఢనక్షత్రజాతకుడు అభిమాని, సుఖీ, సంతోషము కలవాడు, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుడు వినయశీలి ధార్మికుడగును. శ్రవణా నక్షత్ర జాతకుడు ధనవంతుడు, సుఖవంతుడు, ధనిషా నక్షత్రజాతకుడు దాత, శూరుడు, ధనవంతుడగును. శతభిషా నక్షత్ర జాతకుడు శత్రుసంహారకుడు, వ్యసనములు కలవాడు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకుడు స్త్రీలకు లొంగుపొడగును. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకుడు వక్త, సుఖి, ప్రియుడు, రేవతీ నక్షత్ర జాతకుడు శూరుడు, ధనవంతుడు పవిత్రుడగును. మేష లగ్న జాతకుడు కొమి, శూరుడు, కృతజ్ఞుడగును. వృషభలగ్న జాతకుడు ప్రియుడు, త్యాగి, ఓర్పుకల వాడగును. మిధున లగ్న జాతకుడు స్త్రీ విషయమును, ద్యూతమును, శాస్త్రములను చక్కగా తెలిసినవాడు, కర్కాటకలగ్న జాతకుడు శ్రీస్వభావము కలవాడు, పొట్టివాడు అగును. సింహలగ్న జాతకుడు స్త్రీలను ద్వేషించువాడు, కోపిష్టి అభిమానము కలవాడు, విక్రమము కలవాడు, స్థిరబుద్ధి కలవాడు సుఖవంతుడగును. కన్యాలగ్న జాతకుడు ధర్మాత్ముడు, వినయము కలవాడు, మంచి బుద్ధి కలవాడు, తులాలగ్న జాతకుడు ప్రాజ్ఞుడు, పొడగరి, ధనవంతుడగును. వృశ్చిక లగ్న జాతకుడు రోగి, పూజ్యుడు, గాయములు కలవాడు, ధనుర్లగ్న జాతకుడు కవి, శిల్పి, ధని యగును. మకర లగ్న జాతకుడు సోమరి, తిరుగుపోతు, మంచికనులు కలవాడు, కుంభ లగుజాతకుడు పరస్త్రీలను, పరధనమును హరించువాడు, మీన లగ్నజాతకుడు బలవంతుడు, భయము కలవాడగును. ఏ లగ్నమున పుట్టినవాడైనను లగ్నాధిపతి బలయుతుడైనచో ఫలము సంపూర్ణముగా నుండును. బల హీనుడైనచో విపరీత ఫలములు కలుగును. చంద్రుడు బలయుతుడుగా నున్నను సకల ఫలములు లభించును. క్షీణ చంద్రుడైనచో విపరీత ఫలములు కలుగును. మేషము మొదలు మీనాంతమగు రాశులలో సూర్యుడున్నపుడు వరుసగా ఖ్యాతి గలవాడు, స్త్రీ ద్వేషి, ధనవంతుడు, తీవ్రస్వభావము కలవాడు, జ్ఞానము కలవాడు, కవి, శాండికుడు, ధనవంతుడు, పూజ్యుడు, లుబ్ధుడు, దరిద్రులతో స్నేహము చేయువాడు, బలవంతుడు అగును. సూర్యుడు లగ్నమున నుండగా పుట్టినవాడు ధనహీనుడు, కుజుడున్నచో ధనవంతుడు, చంద్రుడున్నచో స్వభేదనుడు, బుధుడున్నచో కృతజ్ఞుడు, గురువున్నచో ఖ్యాతి కలవాడు, శుక్రుడున్నచో పరదార నిరతుడుగా నుండును. మకర లగ్న జాతకుడు బహపుత్రుడు బహుధనవంతుడగును. కుంభలగ్నమున పుట్టినవాడు దుఃఖవంతుడు, అసత్యవాది, ఖలుడగును. సూర్యునితో బుధుడు కలిసున్నచో స్త్రీలచే ద్వేషించబడువాడు, స్వజనులను ద్వేషించువాడు, దుఃఖములను పొందువాడు, బుద్ధిమంతుడు, ధనవంతుడు, సమానార్థుడు, పుత్రులు స్త్రీలు ఋణములు కలవాడుగా నుండును. సూర్యునితో బృహస్పతి కలిసున్నచో సేనాధిపతి, స్త్రీలు ధనము పుత్రులు కలవాడు, సమర్థుడు, అధికారము కలవాడు, వస్త్రములు కలవాడు మండలాధిపతి, ధనము సుఖము కలవాడు, ఋణము ప్రభుత కలవాడుగా నుండును. సూర్యునితో శుక్రుడు కలిసున్నచో స్త్రీల వలన ధనమును పొందువాడు, తక్కువ దుఃఖము కలవాడు, బంధువులను ద్వేషించువాడు, ధనము పొపము గలవాడు, ధనవంతుడు, ఖ్యాతిగలవాడు, సముడు, ప్రాజ్ఞుడు స్త్రీలకు వశ్యుడగును. సూర్యునితో శని కలిసున్న చో విపరీత కార్యములచే ధనమును పొందుపొడు, ఖప్రసూకుడు, విధిమిత్రుడు, సుఖత్రయము కలవాడు, సత్పుత్రులు, మంచి స్త్రీలు, మంచి ధనము కలవాడు, రాజు కాగలడు. కుజాదులచే చంద్రుడు చూడబడి మేషరాశిలో ఉన్నపుడు రాజు జ్ఞాని గుణవంతుడు, పౌరుల ధనమును స్వీకరించువాడగును. మిధునమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధన హీనుడు, చోరుడు, రాజుల సేవలు చేయువాడుగా నుండును. కర్కాటకమున చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు ధాతువుల నమ్ముకొని బ్రతుకువాడు, రాజాజ్ఞకు భయపడవాడు, బట్టలను నేసి బ్రతుకువాడు, ధనములేని వాడుగా నుండును. సింహమున చంద్రుడుండి ఇతరగ్రహములచే చూడబడినపుడు యుద్ధమునందు కోరిక గలవాడు, కవి, పండితుడు, యజ్ఞములచే, ధాతువులచే బ్రతుకువాడు, కంటి జబ్బులు కలవాడు, జ్యోతిశ్శాస్త జ్ఞానము కలవాడగును. కన్యలో చంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నచో రాజు, సేనాపతి, నైపుణ్యము కలవాడు మంచి ఆశయము కలవాడు గా నుండును. తులారాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినచో రాజు, స్వర్ణకారుడు, వాణిజ్యము చేయువాడుగా నుండును. వృశ్చికరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహముల దృష్టి ఉన్నచో ఇద్దరు తండ్రులు కలవాడు, సముద్రజీవి, సైన్యము గలవాడు, తన భూమిని కాపాడుకొన గలవాడుగా నుండును. ధనూరాశిలో చంద్రుడుండి శుభగ్రహవీక్షణమున్నచో జోత్రులు కలవాడు, భూమి న్యాయములను చెప్పువాడు, శఠుడుగా నుండును. మకరరాశిలో చంద్రుడుండి ఇతరగ్రహములచే చూడబడినపుడు రాజులచే సన్మానించబడువాడు, మిత్రులు గలవాడు, యజ్ఞములు చేయువాడుగా నుండును. కుంభరాశిలో చంద్రుడుండి ఇతర గ్రహములచే చూడబడినపుడు హాస్యజ్ఞుడు, నృపజ్ఞుడుగా నుండును. హారేసఋక్షదలములలో నుండి వారిచే చూడబడిననూ, కలిసియున్ననూ చంద్రుడు శుభుడు. త్ర్యంశమున తదధిపతి, మిత్రరాశులలో నున్ననూ, చూడబడిననూ శుభకరుడే.
ద్వాదశాంశే ఫలం ప్రోక్తం నవాంశెఽప్యథ కీర్త్యతే ।
ఆరక్షేకో వధరుచిర్నియుద్ధకుశలోఽర్ధవాన్ ॥
కలహః క్షితిజాంస్థే చ శౌక్రే మూర్ఖోఽన్యదారగః ।
కవిస్సుఖీ బుధాంశేరునటచౌరజ్ఞశిల్పినః ॥
స్వాం శేత్యల్పతనుసఖస్తపస్వీ లోభతత్పరః ।
క్రోధీ నిధీశోఽమాత్యో వా నృపో హింస్రో సుతో హరేః ॥
జీవాంశే హాస్యవిద్యోధి బలీ మంత్రీ చ ధార్మికః ।
అల్పాంత్యో దుఃఖితో ఖో దుష్టస్క్రీసౌభాగగే ॥
భానా హిద్వాదిదృష్టే తు తద్వదేవ ఫలం వదేత్ ।
వర్గోత్తమే భీ పరమేభౌ ఫలముక్తశుభం క్రమాత్ ॥
పుష్టం మధ్యం లఘు జ్ఞేయం యది చాంశపతిర్బలీ ।
రాశీక్షణఫలం రుద్ధ్వా దహిత్యంశఫలం స్ఫుటమ్ ॥
శూరస్తభో వికలదృగ్నిర్ఘృణోఽర్కే తను స్థితే ।
మేషే ధనీ తైమిరిక స్సింహే రాత్ర్యంధ ఏవ చ ॥
నీచోధోస్వః కర్కగేఽర్కే ఉద్వదాక్షస్తను స్థితే ।
ద్వితీయేర్కే బహుధనో నృపదండ్యో ముఖామయీ ॥
త్రిగే బుధో విక్రమ్ చ విముఖః పీడితో భువి ।
ధనాపత్యోక్తి తో ధీస్తే బలీ శత్రుజితోఽరిగే ॥
స్త్రీజితో ద్యూనసం స్థే చ నిధనేఽల్పోత్మ జోఽల్పదృక్ ।
సుతార్ధ సుఖభా భాగే దశమే శ్రుతశౌర్యవాన్ ॥
లాభే బహుధనో మానీ పతితో ఖో వ్యయే రవౌ ।
మూకోఽధో బధిరః ప్రేష్యో జేగే ఖాచ్చాజగే ధనీ ॥
బుటుర్వా ధనవానర్ధే హింస్రో విక్రమ గే భవేత్ ।
సాధుభావస్సుఖగతే ధీస్థే కన్యాప్రజోఽలసః ॥
ఆల్పాగ్నికామషీక్ణోఽరో ఈర్ష్యప్తత్రిమదో జైఖే ।
వ్యాధిపీడాన్వితో మృత్యౌ భానుర్ధన గే మిత్రధనాన్వితః ॥
ధర్మధీ ధనయుబ్రౌజ్యే ఖ్యాత ధీధనయుగ్ఖవేత్ ।
క్షుదోంఽగహీనో వ్యయగే చంద్రే ప్రోక్తం ఫలం బుదైః ॥
లగ్నే కుజే క్షతతనుర్ధన గే తు కదన్నభుక్ ।
ధర్మపాపసమాచారోఽన్యత్ర సూర్యసమో మతః ॥
విద్వాన్ ధనీ చ ప్రవరః పండిత స్సచివోఽరి యుక్ ।
ధర్మజ్లో విస్తృత గుణో గాధో జ్ఞేయరతరవత్ ॥
విద్వాన్స వాచ్యః కృపణీ సుఖాక్షో రిపుగృద్ధిమాన్ ।
నీచస్తపస్వీ చష్ణవనీ లోభీ దుష్టస్తనౌ గురౌ ॥
స్మరీ సుఖీ విలగ్ధస్థే కలహీ సురతోత్సుకః ।
సుఖితస్తనప స్యే చ భృగా జీవవద్యతః ॥
నిస్వో రోగీ కామవశో మలిన శ్మైశవార్తియుక్ ।
అలసో లగ్న గే మందే ధర్మాత్వచ్చగతే నృపః ॥
గ్రామాధిపస్సవిద్వాంశ్చ చార్వంగోఽన్యత్ర సూర్యవత్ ।
పూర్ణముచ్చేఽథ పాదోనఫలం మూలత్రికోణే ॥
శుభగ్ర హే దలం స్వర్కే మిత్రభేంఘ్రిమితం ఫలమ్ ।
శత్రుభేఽల్పం తథా నీచాస్తంగతే ఫలశూన్యతా ॥
ఖభారకాదికే ఖేటే కులతుల్యః కులాధికః ।
బంధుపూజ్యోఽథ ధనవాన్ సుఖీ భోగీ నృపః క్రమాత్ ॥
పరవిత్తసుహృద్బంధుపోష్యాగణబలాధిపౌ ।
నృపశ్చ మిత్రభస్థేషు ఖేటేద్రేషాదిషు క్రమాత్ ॥
విషమర్కేఽరహోరాయాం సంస్థితే శుభభేషు చ ।
ఖ్యాతో మహోద్యమీ చాతితేజా ధీమాన్దనీ బలీ ॥
శుభేషు చంద్రహోరాయాం స్థితేషు సమరాశిషు ।
కాంతిమార్దవసౌభాగ్యభోగధీమాన్భవేన్నరః ॥
సూర్యహోరాగతః పాపః సమభేషు తు మధ్యమః ।
విషమర్కేషు భాస్కర్యా సౌమ్యానోక్తఫలప్రదాః ॥
స్వమిత్రత్ర్యంశగశ్చన్ద్రస్సురూపం గుణినం నరమ్ ।
కరోతన్నగతస్తద్వత్ తత్తుల్యగుణరూపిణమ్ ॥
వ్యాలాయుధే చతుష్పాదాంజేషు చ త్ర్యంశకే తథా ।
తీక్షేఽతి హింప్రశ్చ భవేత్ గురుతల్పగతోఽటనః ॥
స్తేనో భోక్తా ప ధనధీర్నృపః క్లీబశ్చ శత్రుహా ।
విష్టికృద్దాపవృత్తిశ్చ పాపో హింసామతీర్భవేత్ ॥
మేషాదికోత్తమాంశేషు ద్వాదశాంశేషు రాశివత్ ।
జాయాబలవిభూషాఢ్యస్సత్త్వయుక్తోఽతిసాహసీ ॥
తేజస్వీ చ నరః ఖాయే త్రింశాంశే సృజి సంస్థితే ।
ఆమయీ వా స్వభార్యాయాం విషమః పారదారీకః ॥
దుఃఖీ సరిచ్ఛదయుతో మలినశ్చార్కజే స్వకే ।
సుఖధీ ధనకీర్త్యాల స్తేజస్వీ లోకపూజితః ॥
నీరగుహ్యభవాన్భోగి జీవే ఖత్రింశభాగ గే ।
మేధాకలాకావ్యశిల్పవివాదకపటాంచితః ॥
శాస్త్రార్ధసాహసయుతో బుధే స్వత్రింశభాగ గే ।
బహ్వపత్యసుఖారోగ్యరోగరూపార్ధసంయుతః ॥
లలితాంగో విప్రకీర్ణేంద్రియస్స్యాద్ఖార్గవే స్వకే ।
శూరస్తబ్ధో చ విషమవధకౌ సద్గుణాన్వితా ॥
సుఖీ జ్ఞోచారుచేష్టాంగౌ చంద్రార్కౌ చేతుజాదిగో ।
మూలత్రికోణస్వరోచ్చే కంఠస్థాస్తు చ యే గ్రహాః ॥
అన్యోన్య కారకాస్తేస్యు కర్మగస్తు విశేషతః ।
శుభం వర్గోత్తమే జన్మ వేసిస్థానే వసద్గృహై ॥
అశూన్యేషు చ కేంద్రేషు కారకాఖ్యగృ హేషు చ ।
గురుజన్మేశ లగ్నేశాః కేంద్రస్థా మధ్యసౌఖ్యదాః ॥
పృష్ఠో భవ కోదపర్క స్తితాస్త్వంత్యాంతరాదిషు ।
ప్రవేశే భాస్కరకుజౌ భృగ్విజ్యౌ మధ్యగౌ తథా ॥
చంద్రర్కీ ఫలదావంతే సదాఙ్ఞః ఫలదాయకః ।
లగ్నాత్పుత్రే కలత్రే వాల్టాచ్చుభేశయుతే క్షితే ॥
స్యాత్తయోస్సంపదస్వస్వమన్యథా ధాంగతోదయః ।
రవౌ మీసర్కజసీఘ్న పుత్రస్థస్తు తథా కుజః ॥
సిమాతుర్యాష్టగైః క్రూరై యద్వా క్రూరాంతరే సీతః ।
సద్గృహాయుతదృష్ట శ్చేదగ్నిపాతాన్మృతిసియాః ॥
లగ్నాద్య పాణిగతయోః శరవ్యోస్పహ స్త్రీయా ।
ఏకేన యస్య జన్మాహురథ సప్తమసంస్థయోః ॥
నవధీగతయోర్వాపి వికలస్త్రీసితార్కయోః ।
కోణోదయేఽస్తాంత్యసంధౌ భృగోర్వంధ్యాపతేర్జనిః ॥
సుతభం చేన్న సౌమ్యాఢ్యమధాంత్యాస్తోదయరగైః ।
పొపే ధీస్థే విధౌ క్షీణజన్మాసుతకలత్రిణః ॥
శనౌ ఖగేఽస్తే స శుక్రే తద్దృష్టే పారదారికః ।
ఆ చేత్సేందుశ్రియా సార్ధం పుంశ్చలో జాయతే నరః ॥
భృగజ్జయోరస్త గయోర్నరో భార్యాసుతోఽపి వా ।
నృస్త్రియోస్తు శుభైర్దృష్టౌ తార్వా పరిణతాంగకౌ ॥
ఖాస్తాంబు గైరిందుశుక్రపాపైర్వంశ వినాశకః ।
శిల్పీ త్ర్యేశే బుధయుతే కేంద్రసంస్థార్కి వీక్షితే ।
దాస్యాం జాతస్సౌరిభా గేరిః ఫగే భృగునందనే ।
నీచేఽర్కే దోరస్తగయోర్దృష్టయోస్సూర్యజేన వా ॥
పౌపదృష్టౌ శనికుజౌ అస్తనౌ వాతరుక్ప్రదౌ।
కర్కాల్యంశగతే కేంద్రే పాపయుక్తే తు గుహ్యరుక్ ॥
పాపాంతర గతేంఽగేబ్జే రవౌ ద్యూనే తు కుష్ఠయుక్ ।
చంద్రే ఖేఽస్తంగతే భౌమే వికలో వేశిగేఽజర్కజే ॥
మీదో భాంశగయోశూలీ రవీంద్వోర్యుతయోః కృశః ।
నిధనారి ధనాంత్యస్థా రవీంద్వారయమా యదా ॥
చలద్గృహేణ దోషేణ కుర్వత్యనయనం నరమ్ ।
సౌమ్యాదృష్టా నవాయత్రి ధీగతాః పాపఖేచరాః ॥
కర్లోపఘాతకాద్యూనేరదవైకృత్యకారకాః ।
లగ్నే గురౌ ద్యునే మందే వాతరోగార్దితో భవేత్ ॥
సుఖేస్తే వా కుజే జీవే లగ్నే వార్కియుతోదయే ।
కుజేన వాత్మజే ద్యూనే సజ్ఞేంఽత్యేష్టో చ సోన్మదః ॥
ధీధర్మార్థాంత్య గైపా పైర్ఖ సమస్యాన్నిబంధనమ్ ।
సర్పశృంఖలయా శాల్యెద్ద కెర్బల్యశుభేక్షితైః ॥
సమందేఽబ్జే వక్రదృ ష్టేఽపస్మారీ దుర్వచాః క్షయీ ।
రవిమందకుజైస్స్వస్థిః సౌమ్యదృషెస్సమండలై ॥
భృతకాః పూర్వముదితైర్వరమధ్యాధమా నరాః ।
పుంజనౌ తు ఫలం పణ్య స్త్రీణాం యోగ్యం వదేచ్చ తత్ ॥
తత్వామిష్వఖిలం కార్యం తద్భర్తృమరణం మృతౌ ।
లగ్నేందుగం వపు శ్చైవ యాదయూపపీతద్యునే ॥
యుగ్నేషు లగ్నశశినోర్వనితాప్ర0కృతి స్థితా ।
సచ్ఛీలభూషణయుతా శుభసందృష్టయోస్తయోః ॥
పురుషకృతిశీలాఢ్యా తయోరోజస్థయోర్మతా ।
అథ పాపా గుణోనాశ్చ పాపవీక్షితయోస్తయోః ॥
కుజార్కీజ్యజ్ఞశుక్రాణాం కురేక్రమశోంఽగనో ।
బాల్యదుష్టా తదా దాసీ సాధ్వీ మాయావతీశ్వరా ॥
దృష్టా వాకృతిశీలా స్యాత్తయోరోజస్థయోర్మతా ।
అథ పాపా గుణానాశ్చ పాపవీక్షితయోస్తయోః ॥
దుష్టవాక్ పునర్భూస్సగుణా విజ్ఞాఖ్యాతాస్పుజిహో ।
బౌధే సమాయాక్లీబాచ సతీ గుణవతీ చలా ॥
ఇంతవరకు ద్వాదశాంశఫలమును చెప్పితిని. ఇపుడు నవాంశఫలమును చేప్పెదను. కుజాంశలో శుక్రుడున్నచో తనను తాను రక్షించుకొనువాడు, ఇతరులను చంపుటలో రుచిగలవాడు, ద్వంద్వయుద్దకుశలుడు, ధనవంతుడు, కలహశీలి, మూర్తుడు, పరస్త్రీలోలుడగును. బుధాంశలో కవి, సుఖము గలవాడు, నటుడు, చోరుడు శిల్పి యగును. స్వాంశలో ఆల్నతనువు, సుఖము కలవాడు, తపస్వి లోభపరుడగును. కుజాంశలో కోపిషి, నిధీశుడు, అమాత్యుడు, రాజు, వెంసాశీలుడగును. బృహస్పతి అంశలో, హాస్యము తెలిసినవాడు, యోధుడు, బలశాలి, మంత్రి, ధార్మికుడు అగును. శన్యంశలో అల్పసంతానము గలవాడు, దుఃఖితుడు, దుష్ట స్త్రీ సంగతి గలవాడగును. సూర్యుడు చంద్రాదులచే చూడబడినచో క్రమముగా శుభఫలము చెప్పబడినది. అంశాధిపతి బలయుతుడైనచో పుష్టము మధ్యమము, లఘుఫలమని తెలియవలయును. రాశీక్షణఫలమును ఆపి అంశఫలమును స్పుటముగా నిచ్చును. సూర్యుడు లగ్నమున నున్నచో శూరుడు, స్తబుడు, వికలదృష్టి కలవాడు, నిర్ణయుడుగా నుండును. మేషణరాశిలో సూర్యుడున్నచో ధనవంతుడు, గుడ్డివాడు, సింహరాశిలో ఉన్న చో రేచీకట్లు కలవాడు, కర్కటరాశిలో ఉన్న చో నీచుడు, ధన హీనుడు, లగ్నముననున్నచో త్రిప్పుడు కనులు గలవాడగును.
రెండవస్థానమున సూర్యుడున్న చో బహుధనము కలవాడు, నృపునిచే దండించబడువాడు, ముఖామయము గలవాడగును. సూర్యుడు మూడవరాశిలో ఉన్నచో పండితుడు పరాక్రమవంతుడు, విముఖుడు, పీడించబడువాడగును. అయిదవస్థానమున నున్నచో ధనాపత్యములు కలవాడు, ఆరవరాశిలో ఉన్న చో శత్రువులచే పరాజయమును పొందువాడగును. ఏడవరాశిలో ఉన్నచో స్త్రీలకు వశ్యుడు, 8వ స్థానమున నున్నచో అల్పసంతానము కలవాడు, అల్పదృష్టికలవాడగును. 9వ రాశిలో నున్న సువర్ణ సుఖము కలవాడు, 10వ రాశిలో ఉన్నచో శాస్త్రజ్ఞానము, శౌర్యము కలవాడు, పదకొండవస్థానమున సూర్యుడున్నచో బహుధనవంతుడు, గౌరవము కలపోడు, 12వ రాశిలో ఉన్న చో పతితుడగును. లగ్నమున చంద్రుడున్న చో మూగవాడు చెవిటివాడు, సేవకుడుగా నుండును. రెండవస్థానముననున్నచో ధనవంతుడు, వటువు, మూడవస్థానమున నున్నచో హింసాప్రియుడు, నాలుగవస్థానమున నున్నచో సాధుస్వభావము కలవాడు, అయిదనస్థానమున నున్నచో స్త్రీ సంతానము కలవాడు సోమరి. ఆరవస్థానమున ఉన్నచో కొద్దీ ఆకలి కొద్దీ కామము కలవాడు, తీక్షస్వభావము కలవాడు, ఏడవస్థానమున నున్నచో ఈర్యకలవాడు మదత్రయము కలవాడు, 8వ స్థానమున నున్నచో వ్యాధి పీడాయుతుడడు, 9వ రాశిలో నున్న మిత్రులచే ధనముచే కూడియుండువాడు, పదవరాశిలో యున్నచో ధర్మబుద్ది ధనము కలవాడు, పదకొండవ స్థానములో నున్నచో ప్రసిద్ధి, బుద్ధి, ధనము కలవాడు, పన్నెండవరాశిలో చంద్రుడున్నచో కుద్రుడు అంగహీనుడగును. కుజుడు లగ్నమున నున్నచో గాయములు కల శరీరము కలవాడు, ధనస్థానమున నున్నచో దుష్టాన్నమును తినువాడు, కొంతధర్మము కొంత పాపమును ఆచరించువాడుగా నుండును. మిగిలిన స్థానములలో కుజుడున్నచో సూర్యుడిచ్చు ఫలములనే ఇచ్చును. బుధుడు లగ్నమున నున్నచో విద్వాంసుడు, ధనవంతుడు, ప్రవరుడు పండితుడు, మంత్రి, శత్రువులు కలవాడు, ధర్మము తెలిసినవాడు, విస్తృత గుణములు కలవాడు అగును.
మిగిలిన స్థానములలో నున్నచో సూర్యుని వలెనే ఫలములు కలుగును. బృహస్పతి లగ్నమున నున్నచో విద్వాంసుడు, కృపణుడు, మంచినేత్రములు కలవాడు, శత్రువులు కలపోడు, నీచుడు, తపస్వి, లోభి, దుష్టుడగును. శుక్రుడు లగ్నమున నున్నచో కాముకుడు, సుఖము కలవాడు, కలహ శీలుడు, సురతమునందు అభిలాష కలవాడు, సుఖించు వాడుగా నుండును. మిగిలిన స్థానములలో నున్న చో బృహస్పతి వలెనే ఫలములనిచ్చును. లగ్నమున శని యున్న చో నిర్థనుడు, రోగి, కామవశుడు, మలినుడు, శైశవము న ఆర్తి కలవాడు, సోమరి యగును. ఉచ్ఛస్థానమున నున్నచో రాజగును. గ్రామాధిపతి, విద్వాంసుడు, సుందరాంగుడు అగును. ఇతర స్థానములలో నున్న చో సూర్యునివలే ఫలములనిచ్చును. ఉచ్చస్థానములలో నున్నచో పూర్ణఫలము నొసంగును. మూలత్రికోణ స్థానములలో నున్నచో ఒక భాగము తక్కువ ఫలమునిచ్చును. శుభగ్రహము స్వస్థానమున నున్న చో పూర్ణఫలమును, మిత్రస్థానమున నున్నచో పొదఫలమును కలుగజేయును. శత్రుస్థానమున నున్నచో అల్పఫలమునిచ్చును. నీచస్థానముననున్ననూ అస్తగతుడైనను ఏ ఫలమునీయజాలడు. గ్రేష్కాణము, త్రికోణము మొదలగు స్థానములలో గ్రహములున్నచో క్రమముగా కులతుల్యుడు, కులాధికుడు, బంధుపూజ్యుడు, ధనవంతుడు, సుఖి, భోగి, రాజు అగును. అట్లే పరవిత్తమును హరించువాడు, మిత్రులను, బంధువులను పోషించుచోడు, గణాదీపుడు, బలాధిపుడు అగును. మీత్రస్థానములలో నున్న చో రాజగును. విషమరాశిలో సూర్యహారలో శుభరాశులలో నుండగా ప్రసిద్ధి నొందువాడు, మహోద్యమము గలవాడు, అతి తేజోవంతుడు, ధీమంతుడు, ధనవంతుడు, బలవంతుడు అగును. శుభగ్రహములు సమరాశులలో నుండగా చంద్రహోరలో పుచ్చినవాడు కాంతి, మృదుత్వము, సౌభాగ్యము, భోగము, బుద్ధి కలవాడగును. పాప గ్రహము సూర్య హోరలో ఉండి, సమరాశులలో మధ్యమ గ్రహములున్నచో, విషమరాశులలో శని మొదలగు పొరు కాని సౌమ్యగ్రహములుకాని ఉన్నచో పైన చెప్పబడిన ఫలములు నీయజాలవు. చంద్రుడు స్వమిత్ర గ్రహములతో కలిసున్నను, త్ర్యంశగతుడైనను రూపవంతుని గుణవంతుని చేయును. మూడవస్థానమున నున్నచో అట్లే అంతటి గుణములు, రూపము కలవానీని చేయును.
అంగారకుడు చతురంశలలో త్ర్యంశలలో కాని యున్నచో తీక్లరాశిలో ఉన్నచో అతిహింసాశీలుడు, గురుతల్పగతుడు, తిరుగుబోతు అగును. అట్లే చోరుడు, భోక్త, ధనవంతుడు, ధీమంతుడు, రాజు, నపుంసకుడు, శత్రుహంతకుడు, విషైకారుడు, దొసవృత్తి కలవాడు, పాపి, హింసాశీలుడు, బుద్దిహీనుడు గా మేషాది ద్వాదశరాశులలో కాని వాటి ఉత్తమాంశలలో కాని ఉన్నచో పైన చెప్పిన ఫలములు కలుగును. జాయా బలవిభూషణాడ్యుడు, సత్త్వముకలవాడు, అతిసాహసి తేజస్విగా అంగారకుడు త్రింశాంశలో ఉన్నచో అగును. శని స్వాంశలో కొని స్వరాశిలో కాని ఉన్నచో రోగిష్టి తన భార్యయందు విషముడు, పరదొరలయందు ఆసక్తి కలవాడు, దుఃఖము కలవాడు, వస్త్రములు కలవాడు, మలినుడుగా నుండును. బృహస్పతి త్రింశాంశలో ఉన్నచో సుఖము, బుద్ధి, ధనము, కీర్తి కలవాడు, తేజస్వి, లోకపూజితుడు, నీటిలో పుట్టినవాటిని, రహస్యముగా లభించిన వాటిని అనుభవించువాడుగా నుండును. బుధుడు త్రింశాంశలో ఉన్నచో మేధావి, కళాకోవిదుడు, కావ్య కర్త, శిల్పకారుడు, వివాదములు కపటము కలవాడు, శాస్త్రార్భజుడు, సాహసి యగును. శుక్రుడు స్వాంశలో ఉన్నచో బహుసంతానము, సుఖము, ఆరోగ్యము, భోగము, సౌందర్యము ధనము కలవాడు, లలితాంగుడు, ఇంద్రియానుకూలముగా సంచరించువాడుగా నుండును. కుజాది గ్రహములతో సూర్యచంద్రులు. కలిసున్న చో శూరుడు, స్తబ్దుడు, విషమ వధను పొందువాడు, సద్గుణములు కలవాడు, సుఖమునందభిలాష కలవాడు, సుందరాంగములు కలవాడుగా నుండును. మూలత్రికోణ స్వస్థాన ఉచ్చస్థానములలో కంఠస్థానమున నున్న గ్రహములు పరస్పరము సహకారమందించువారు, విశేషించి కర్మసాధకులుగా నుందురు. విషమరాశులలో గ్రహములుండగా వర్గోత్తమమున జన్మించుట శుభకరము. కేంద్రములు శూన్యముగా నుండక, కారక గృహములలో గురు, జ్మేశ లగ్నేశులుండగా కేంద్రములో నున్న గ్రహములు మధ్యకు సౌఖ్యమును ఇచ్చెదరు. అంత్యాంత రాదులలో నున్న గ్రహములు, భాస్కర కుజుల ప్రవేశమున, శుక్రగురులు మధ్యనుండగా, శని చంద్రులు అంత్యమున నున్నపుడు ఫలప్రదులగుదురు. బుధుడెప్పుడూ ఫలదోయకుడే. లగ్నమునుండి అయిదవస్థానమున ఏడవస్థానమున నున్న చంద్రుడు శుభగ్రహములతో కలిసియున్నను, శుభరాశ్యధిపతులతో చూడబడిననూ, సంపదలు సమృద్ధిగా కలుగును. స్వత్వముండును. సూర్యుడు మీనరాశిలో శనితో కలిసున్నచో స్త్రీని చంపును. అయిదవస్థానమున నున్న కుజుడు కూడా స్త్రీఘాతమును చేయును. నాలుగవస్థానమున ఎనిమిదవస్థానమున క్రూరగ్రహములున్నపుడు, క్రూరాంతరమున శుక్రుడున్నపుడు, సద్గహములతో కలిసి ఉండక చూడబడనిచో పుట్టిన స్త్రీకి అగ్నిపాతము వలన మృతి సంభవించును. సూర్యచంద్రులు లగ్నాద్యపాణి గతులైనపుడు, స్త్రీ గ్రహముతో కలిసియున్నపుడు, సప్తమ స్థానమున నున్నపుడు, శుక్ర సూర్యులు తొమ్మిదవస్థానమున అయిదవస్థానమున నుండి వికల స్త్రీగతులైనపుడు, కోణోదయమున, అస్తాంత్యసంధిలో శుక్రుడున్నపుడు వంధ్యాపతి పుట్టును. అయిదవస్థానము సౌమ్యగ్రహములు కలదికానపుడు, అంత్యాస్తుదయరాశులలో గ్రహములున్నపుడ, పాపగ్రహముల అయిదింట ఉన్నపుడు, చంద్రుడు క్షీణ దశలో నుండగా అల్పాయుష్కులగు భార్యాపుత్రులుందురు. శని శుక్రునితో కలిసి ఉన్నను, శుక్రునిచే చూడబడినపుడు పుట్టినవాడు పరదారరతుడగును. శని శుక్రులు చంద్రునితో కాని, స్త్రీ గ్రహములతో కాని కలిసున్నచో పురుషుడు పుంశ్చలుడగును. శుక్రుడు చంద్రుడు అస్తగతులైనపుడు పురుషుడు కాని స్త్రీకానీ, పుత్రుడుకాని, శుభగ్రహములచే చూడబడిన స్త్రీ పురుషులు పరిణతాంగులౌదురు. చంద్రుడు, శుక్రుడు, పాపగ్రహములు, తమరాశిలో అస్తగతులైనచో వంశవినాశకుడు జన్మించును. త్ర్యంశాధీపతి బుధునితో కలిసి కేంద్రములోనున్న శనిచే చూడబడినపుడు శిల్పియగును. శని అంశలో భృగువీక్షణమున్నపుడు, లేదా భృగువు నీచలో ఉన్నపుడు, సూర్యచంద్రులు అస్తగతులైనను, శనిచే చూడబడిననూ దాసీపుత్రుడగును. పాపగ్రహములచే చూడబడిన శని కుజులు, లేదా అస్తగతులైన శనికుజులు వాతరోగమును కలిగింతురు. కర్కాటక వృశ్చికొంశ గతము కేంద్రమైనపుడు, లేదా పాపగ్రహములు కేంద్రమున ఉన్నపుడు గుప్తరోగములు కలుగును. చంద్రుడు పాపగ్రహమధ్యమునున్నపుడు, సూర్యుడు ఏడవస్థానమున నున్నపుడు కుష్టురోగము కలుగును. చంద్రుడు తన స్థానమున నుండి, కుజుడు అస్త గతుడై, శని విషమ రాశిలో ఉన్నపుడు పుట్టినవాడు వికల మనస్కుడగును.
గ్రహములు ఒకదాని అంశలో వేరొకటి ఉన్నపుడు శూలరోగము కలుగును. సూర్యచంద్రులు కలిసియుండగా కశాంగుడగును. ఏడవస్థానమున సూర్యుడు, ఆరవస్థానమున చంద్రుడు, రెండవస్థానమున కుజుడు, అంత్యమున (12) శని ఉన్నచో చరగ్రహ గత దోషమువలన అంధుడు నిరాశ్రయుడగును. పాపగ్రహములు తొమ్మిది పదకొండు, మూడు, అయిదు స్థానములలో ఉండి సౌమ్యగ్రహములచే చూడబడనిచో చెవులకు హాని చేతురు. పాపగ్రహములు 7వ స్థానమున నున్నచో దంతములకు వికారమును కలిగింతురు. లగ్నమున గురువు, 7వ స్థానమున శని యున్న చో వాతరోగముచే పీడించబడును. కుజుడు నాలుగవస్థానమున కొని, అస్తగతుడుగా, కాని ఉన్నచో, బృహస్పతి లగ్నమున శనితో కలిసి ఉదయించినపుడు, కుజుడు అయిదవస్థానమున, ఏడవస్థానమున బుధునితో కలిసి చంద్రుడున్నను ఉన్మాదావస్థను చెందును. 12వ స్థానమున చంద్రుడున్నను ఉన్మత్తుడగును. అయిదు, తొమ్మిది, రెండు, పన్నెండు స్థానములలో పాపగ్రహములున్న చో బంధనము కలుగును. సర్పశృంఖలతో పాపగ్రహములు చూచినపుడు, బలయుతులగు పాపగ్రహముల చూపున్నపుడు, శనితో కలిసియున్న చంద్రుడు వక్రదృష్టి గలవాడైనపుడు అపస్మారము కలవాడు, దుష్టవాక్కుగలవాడు, క్షయరోగము కలవాడగును. సూర్యుడు శని కుజులు స్వస్థానములలో నుండి సౌమ్యగ్రహములచే చూడబడినపుడు, మండలములతో కూడియున్నపుడు ఇతరులచే పోషించబడువారు వరుసగా ఉత్తమ మధ్యమాధములుగా నుందురు. ఈ సమయమున పురుషుడు జన్మించినచో వేశ్యస్త్రీలకు తగిన ఫలమును చెప్పవలయును. స్త్రీలు తమభర్తలయందు సర్వకార్యభారమునుంచి, వారు మరణించినపుడు మరణించుట స్త్రీలఫలము. అట్లే వీరు కూడా యజమానులందు సర్వభారముంచి వారు మరణముతో మరణమును పొందెదరని చెప్పవలయును. చంద్రుడు లగ్నమున నున్నను, ఏడవస్థానమున నున్ననూ ద్వీస్వభావరాశులలో కాని లగ్నమున కాని చంద్రుడున్నచో స్త్రీ తన స్వభావముతో నుండును. లగ్నచంద్రుడు కాని సప్తమ చంద్రుడు కాని శుభగ్రహములచే చూడబడినపుడు పుట్టిన స్త్రీ, సత్స్వభావము, ఆభరణములు కలిగియుండును. లగ్నసప్తమ చంద్రులు ఓజస్తులైనపుడు పురుషాకారము, పురుష స్వభావము కలదెను. ఒక వేళ లగ్న, సప్తమ చంద్రులు పోపగ్రహములచే చూడబడినచో పాపులు, గుణహీనులు అవుదురు. కుజుని స్థానములో కుజుడు కాని, శనికాని, గురువుకాని, బుధుడు కాని, శుక్రుడు కాని యున్నచో వరుసగా స్త్రీ బాల్యమును దుష్టురాలు, దాసి, సాధ్వీ, మాయావతీ, తొందరపాటు గలదగును. పైన చెప్పబడిన గ్రహములచే చూడబడిననూ ఆ ఫలములే కలుగును. ఆ గ్రహములు బలయుతులైనచో మంచిరూపము, మంచిశీలము కలదగును. ఆ గ్రహములు పాపగ్రహములచే చూడబడినపుడు పాపులు గుణహీనులు అగుదురు. శుక్రుడు స్వస్థానమున నున్నచో దుష్టవాక్కు గలది, పునరూ, గుణవంతురాలు, విజ్ఞురాలు, ఖ్యాతి గలదియగును. బుధుడున్నపుడు సమురాలు, దీనురాలు, సాధ్వి, గుణవతి చంచలస్వభావము కలదగును.
ద్వంద్వభే స్వైరిణీ శఘ్నీ గుణాడ్యా శిల్పికాధమా ।
వాచాటా కులటా సిం హే రాశీపుంధీరగమ్యతా ॥
జైవే గుణాఢ్యాల్పిరతిర్గుణజ్ఞాజ్ఞానినీ సతీ ।
దాసీ నీచరతా సాధ్వీ మాందే దుష్టానపత్యకా ॥
లగ్నేందుయుక్తైస్త్రింశాంశై ఫలమేతద్భలానుగమ్ ।
దృగ్గైర్మిధోంశే శుక్రార్కి శౌక్రే చేద్వా ఘటాంశ కే ॥
స్త్రీభిస్స్త్రీమైధునం యాతి మదనానలదీపితా ।
శూన్యే కాపురు షే ద్యూనే బలే క్లీబో న సదృశి ॥
బుధార్క్యో శ్చరభౌ నిత్యం పరదేశపరాయణః ।
తత్సృష్టా మందగే సూర్యే స్త్రీ బాలా విధవా కుజే ॥
పాపదృష్టే శనౌ ద్యూనే కన్యైవాపద్యతే జరామ్ ।
ఆగ్నేయైర్విధవాస్త స్థై పునర్భూమిశ్రకైర్భవేత్ ॥
క్రూరే హీనబలేఽస్తస్థే పరిత్యక్తా నసద్దృశి ।
మిధోంశగైసితారౌ తు కురుతోఽన్యరతాం శ్రియమ్ ॥
శీతరశ్మిర్యదా ద్యూనే తదా భర్తురనుసయా ।
సౌరారర్కే లగ్నరతే సేందుశుక్రే తు బంధ కే ॥
మాత్రాసార్ధమసద్దృష్టే తథా కౌజేంశకేఽస్త గే ।
మందదృష్టే వ్యాధియోనిస్సద్గృహాంశే పతిప్రియా ॥
మందరే వాంశ కే ద్యూనే వృద్ధౌ మూర్గః పతిస్స్రి యాః ।
స్త్రీలోలః క్రోధనః కౌజే బౌధే విద్వాంశ్చ నైపుణః ॥
జితేంద్రియో గుణీ జైవే చాంద్రే కామీ మృదుస్తథా ।
శౌక్రే సౌభాగ్యయుక్కాంథ సౌరేతిమృదుకర్మకృత్ ॥
శుక్రాజ్జయోర్లగ్నగయో సుఖినీర్ష్యాసమన్వితా ।
జేన్ద్వోః కలాసు నిపుణా సుఖితా చ గుణాన్వితా ॥
శుక్రజ్ఞియోస్తు శుభగా కలాజ్ఞా రుచిరాంగనా ।
అనేకసౌఖ్యార్ధగుణా లగ్నే సౌమ్యత్రయే స్థితే ॥
క్రూరేఽష్టమేఽష్టమేశాంశే యస్య స్యాత్త ద్వయస్సమే ।
వైధవ్యం చ మృతిస్తస్యాస్వయసత్స్వర్థ గేషుతు ॥
అల్పాపత్యత్వమబ్జేస్యా కన్యాలిహరిగోషు తు ।
సౌరే మధ్యబలే చంద్రశుక్రజ్ఞైర్బలివర్జితైః ॥
శేషైస్సవీర్యైరోజరే లగ్నే కురూపిణీ భవేత్ ।
జీవారకవిసౌమ్యేషు బలిషు సమభౌ తనౌ ॥
విఖ్యాతా నైకశాస్త్రజ్ఞా వనితా బ్రహ్మవాదినీ ।
పాపేఽస్తే నవమస్థస్య ప్రవ్రజ్యామేతి భామినీ ॥
ఉద్వాహే వరణే ప్రశ్నే సర్వ మేతద్విచింతయేత్ ।
మృత్యుస్థానం పశ్యతాం స్యాద్బలినా ధాతుకోపతః ॥
నృణాం మృత్యుహితం యుక్తం భాగాత్రోస్థోపధభూరిభిః ।
స వీర్యైర్బహుజోఽగ్ర్యక్షతజ్వరరుగుద్భవః ॥
క్షుతృద్భవశ్చాష్టమస్థై సూర్యాద్యైశ్చ వరాదీషు ।
పరస్వాధ్యప్రదేశేషు మృత్యుస్సూర్యమహీజయోః ॥
స్వబంధుస్థితయోః పుంశః శైలాగ్రాభిరుతస్య చ ।
బంధస్త కర్మ గైర్మందభూజైరృష్టే ప్రహౌ మృతిః ॥
స్త్రీయాం హిమోష్ణకరయోః స్వజనాత్పాపదృక్తయోః ।
తోయమృతో రవీదృతు స్యాంతాయాద్యుభయోదయే ॥
శస్త్రాగ్నిజో శుభాంతస్థే చంద్రే భౌమగృహస్థితే ।
మృత్యుశ్చాథ మృగే చంద్రే కర్కే మందే జలోదరాత్ ॥
స్త్రీయామిందే రక్తశోధాత్సారే వాయ్వగ్నిపాతజ: ।
పుత్రధర్మస్థయోర్బంధాత్పాపయోస్సదదృష్ఠయోః ॥
సయాసశం యనిగడైర్దృకైర్మృత్యా తు బంధనైః ।
స్తియాం సపాపేఽబ్జేద్యూనే సితే మేమే రవౌ తనౌ ॥
మరణం స్త్రీకృతే గేహే హ్యథ తుర్యౌ కుజే రవౌ ।
యమే ఖేంఽగత్రికోణ్దైః క్షీణచంద్రా శుభైస్సకృత్ ॥
తుర్యేఽర్కే ఖే కుజే క్షీణచంద్రదృష్టే సమిద్ధతః ।
రంధ్రఖాంగజలై క్షీణీంద్వారార్కిరవిసంయులైః ॥
లకుటేనాథ తైరేవ ఖాంగాంగతనయ స్థితైః ।
ధూమా నిబంధనైః కార్యః కుదనైర్మరణం భవేత్ ॥
బంధస్తఖ స్తైర్భౌమార్కమందైశ్శస్త్రాగ్ని రాజభిః ।
సౌరేంద్వారై స్వాంబుసంస్థై క్షతక్రేమ్యంగయా తతః ॥
స్వేర్కే తుర్యే కుజేయానపాతాదధ కుజేస్త గే ।
యంత్ర సీదునతః క్షీణచంద్రయుక్తే మృతిర్భవేత్ ॥
భౌమార్కీ శీతకరిణైర్జూకాజని శనిభా స్థితైః ।
క్షీణీం ద్వర్కమజైః ఖాస్తాంబుస్థైర్వారకరైర్మతిః ॥
బల్యారదృష్టే క్షీణేందౌ మందే నిధనసంస్థితే ।
గుహ్యరుక్కృమిశస్త్రాగ్ని దారుణో మృత్యురంగిరాః ॥
సౌరేఽర్కే స్తే మృతో మందే క్షీణేందౌ భువ్యసంయుతే ।
లగ్నధ్యాయాస్తపఃఖార్కభౌమచంద్రనిశాక రైః ॥
శైలశృంగస్వరుగ్రపాతైర్ను నిధనం భవేత్ ।
దృక్కోంతరే తుర్ద్వాలింగస్తత్పతిర్మృత్యుపోఽపి వా ॥
స్వగుణైర్నిధనం కుర్యాద్బలవాన్యో ద్వయోర్భవేత్ ।
లగ్నాంశే ససదృక్థ్సానే మృత్యుర్యోగే క్షణాదిభిః ॥
మోదోంతే నుదితాంశస్య ముల్యో ద్విఘ్నస్స్వ పేక్షితే ।
శుభేక్షితే తు త్రిగుణః కల్ప్సమన్యత్స్వ బుద్ధితః ॥
వహ్యంబుభస్మసర్లేదశేషవ్యాలైర్మతిస్థితైః ।
బందుతశ్చింతనీయశ్చ యథోక్తో మృత్యురంగినః ॥
గురుశ్శశాంకశుక్రౌ చ సూర్యభౌమౌ యమేందుజౌ ।
దేవపిత్రతిరక్తోఽథ నారకాన్కుర్యురష్టమే ॥
రవీన్దు బలవశ్రంశ నాథాచ్చ్రేష్ఠసమాధమాః ।
తుంగగసాందనూ కేను గతిష్షడ్రంధ్రదృక్కపః ॥
ద్యూనస్థితో గురుర్వాపి రిపు కేంద్రవినాశగః ।
స్వోచ్ఛ స్థోంగే వ్యయే సౌమ్యభాగే మోక్షో బలాన్యతః ॥
ద్విస్వభావరాశులలో నున్నపుడు పుట్టిన స్త్రీ స్వేరిణి, భర్తను చంపునది, గుణాడ్యురాలు, శిల్పికా, అధమురాలు, వదరుబోతు, కులట అగును. సింహరాశిలో ఉన్నపుడు పురుష బుద్ధిగలది, అగమ్యురాలగును. బృహస్పతి అంశలో పుట్టిన శ్రీ గుణాడ్యురాలు, అల్పరతిగలది, గుణజ్ఞురాలు, జ్ఞానము కలది, సాధ్వి యగును. శని యంశలో పుట్టిన స్త్రీ దాసి, నీచులందు ప్రీతిగలది, సాధ్వి, దుష్టురాలు, సంతానము లేనిది యగును. లగ్నములో చంద్రునితో కలిసి ఉన్న త్రింశాంశం బలానుసారమగు ఫలితమిది. శుక్రశనులు దృగ్గోచరులై పరస్పరాంశలలో ఉన్నపుడు శుక్రుడు కుంభరాశ్యంశలో ఉన్నపుడు స్త్రీలతో స్త్రీ సంగమమును చేయును. మదనోగి తాపముచే దహించబడుచుండును. శూన్యముగా లగ్నమున్నపుడు దుష్టపురుషుడు జన్మించును. సప్తమరాశిలో బలయుతుడగు గ్రహమున్న చో నపుంసకుడు పుట్టును. బుధశనులు చరరాశిలో నున్నపుడు పుట్టినవాడు ఎప్పుడు పరదేశములందుండును. సూర్యుడు శనితో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ అల్పగుణములు కలదిగా, కుజుడున్నపుడు బాల వితంతువగును. పాపగ్రహములచే చూడబడు శని సప్తమస్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ కన్యగానే వృద్దురాలగును. అగ్ని గ్రహములు భూమిగ్రహములతో కలిసున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను కోల్పోవును. క్రూర గ్రహము బలహీనుడై అస్తంగతుడేనపుడు, శుభగ్రహముల దృష్టిలేనిచో భర్త విడువబడును. శుక్రకుజులు పరస్పరాంశలలో ఉన్నపుడు పుట్టిన స్త్రీ భర్తకంటే పరపురుషుని యందు ప్రీతికలదగును. చంద్రుడు ఏడవస్థానమున నున్నపుడు పుట్టిన స్త్రీ భర్తను అనుసరించి యుండును. శని కుజుల రాశులలో చంద్రునితో కలిసున్న శుక్రుడు లగ్నములో నుండగా పుట్టిన శ్రీ బంధకి యగును. నాలుగవస్థానములో కుజాంశ అస్తగాంశలో ఉన్నపుడు, పాపగ్రహముల దృష్టియున్నపుడు, శనిదృష్టియున్నపుడు వ్యాధిగ్రస్తురాలగును. శుభగ్రహాంశలో మాత్రము భర్త యందు ప్రీతి గలదగును. శని గ్రహరాశిలో కొని, శన్యంశలో కాని, సప్తమాంశ వృద్ధిలో ఉన్నపుడు స్త్రీకి మూర్భుడు భర్తగా లభించును. కుజాంశలో పుట్టినవాడు స్త్రీలోలుడు కోపిష్టిగా యుండును. బుధాంశలో విద్వాంసుడు నిపుణుడుగా ఉండును. గుర్వంశలో జితేంద్రియుడు, గుణవంతుడు, చంద్రాంశలో కాముకుడు, మృదు స్వభావము కలవాడు, శుక్రాంశలో సౌభాగ్యవంతుడు, సుందరుడు, శన్యంశలో మృదుకర్మలను చేయువాడుగా నుండును. శుక్రచంద్రులు లగ్నములో నుండగా పుట్టిన స్త్రీ సుఖము కలది, ఈర్ష్యతో కూడియుండినదగును. లగ్నములో బుధచంద్రులున్నచో కలానిపుణురాలు, సుఖవంతురాలు, గుణవంతురాలు, శుక్రుడు బుధుడున్నచో శుభకరురాలు, కళలు తెలిసినది, సుందరాంగి యగును. లగ్నమున మూడు సౌమ్య గ్రహములున్నచో బహుసౌఖ్యములు, అర్ధములు గుణములు కలదిగా నుండును. క్రూరగ్రహము అష్టమస్థానమున నున్నచో, అష్టమాధి పత్యంశలో ఉన్నపుడు పుట్టినవాడు సమవయస్కురాలగు భార్యను పొందును. శుభగ్రహములు ఆర్ధగతములుగా నున్నపుడు పుట్టిన స్త్రీకి వైధవ్యము మృతి సంభవించును. కన్యావృశ్చికము సింహము వృషభరాశులలో చంద్రుడున్నచో అల్పసంతానము కలదగును. శని మధ్య బలీయుడైనపుడు చంద్ర శుక్ర బుధులు బల హీనులుగా ఉన్నపుడు, మిగిలిన గ్రహములు బలీయములై ఓజ స్థానమున నున్నచో, లగ్నమున నున్ననూ కురూపిణి యగును. బృహసితి కుజుడు బుధుడు బలీయులై సమరాశులలో కాని, లగ్నములో కాని ఉన్నపుడు పుట్టిన స్త్రీ విఖ్యాతురాలు, అనేక శాస్త్రజ్ఞురాలు, బ్రహ్మ వాదిని యగును. పాపగ్రహము అస్తగతమైనపుడు, నవమ స్థానముననున్నపుడు పరివ్రాజకురాలగును. వివాహ సమయమున, కన్యావరణమున, కన్యనడుగునపుడు పైన చెప్పిన విషయములనన్నింటిని విచారించవలయును. బలయుతమగు గ్రహము మృత్యుస్థానమును చూచునపుడు ధాతుకోపము వలన నరులకు మృత్యు హితవు యుక్తమగును. బలయుతులగు గ్రహములు ఆశుభస్థానములో నున్నపుడు అగ్నిచే గాయములచే, జ్వరముచే రోగములు కలుగును. సూర్యాదులు అష్టమస్థానమున నున్నచో ఆకలి దప్పులు ఎక్కువగా నుండును. సూర్యకుజులు పరగ్రహమస్థానములలో ఉన్నపుడు మృత్యువు సంభవించును. బంధు స్థానమున, కర్మస్థానమున, అస్తగులుగా శని కుజులున్నపుడు బంధువులలో నుండగా శైలాగ్రమున నుండగా మృతి సంభవించును. సూర్యచంద్రులు శ్రీరాశిలో ఉన్నపుడు, మిత్రగ్రహములు పాపదృష్టి కలిగియున్నపుడు పదకొండు పన్నెండు స్థానములలో సూర్యచంద్రులున్నపుడు, ఉదయావస్థలో ఉన్నపుడు జలమున మరణము సంభవించును.
అశుభరాశ్యంత్యాంశలో నున్నపుడు, కుజరాశిలో చంద్రుడున్నపుడు, మకరములో చంద్రుడు, శని కర్కాటకమున నున్నపుడు జలోదరవ్యాధిచే మరణించును. స్త్రీ రాశిలో చంద్రుడు, శని అశుభ స్థానమున నున్నపుడు వాయ్వగ్నిపాతము వలన మృతి సంభవించును. పాపగ్రహములు అయిదు తొమ్మిది స్థానములలో నున్న చో శుభగ్రహముల దృష్టిలేనపుడు బంధనముచే ఆయదులచే మృత్యువు సంభవించును. పాపగ్రహములచే కూడియున్న చంద్రుడు స్త్రీరాశిలో యున్నపుడు, శుక్రుడు సప్తమ స్థానమున నున్నపుడు సూర్యుడు మేషమున కాని లగ్నమున కాని యున్నపుడు స్త్రీ వలన ఇంట్లో మరణము సంభవించును. కుజుడు కాని సూర్యుడు కాని నాలుగవస్థానమున నున్నపుడు శని రాశ్యంశలో కాని త్రికోణస్థానములో కాని ఉన్నచో పాపగ్రహములతో కలిసి క్షీణ చంద్రుడున్నపుడు, సూర్యుడు నాలుగవస్థానమున నున్నపుడు, క్షీణచంద్రునిచే కుజుడు చూడబడినపుడు సమిధల చే. మరణించును. క్షీణచంద్రుడు, అంగారకుడు, శని, సూర్యుడు కలిసున్న చో రంధ్రాదులతో జలాదులతో మృతి సంభవించును. మొదటి స్థానమున, రెండు మూడు స్థానములలో పైన చెప్పబడిన గ్రహములున్నచో లగుడముచే మతి సంభవించును. పొగచే గడ్డపార మొదలగు పరికరములచే మృతి సంభవించును. బంధు స్థానమున, అస్తగునిగా, మొదటి స్థానమున కుజుడు సూర్యుడు శని ఉన్నచో శస్త్రములచే అగ్నిచే రాజులచే మృతి చెందును శని, చంద్రుడు, కుజుడు, స్వస్థానమున జలస్థానమున మొదటి స్థానమున సూర్యుడు, నాలుగవస్థానమున కుజుడున్నచో వాహనము నుండి పడుట వలన మరణము కలుగును. కుజుడు అస్తంగతుడై క్షీణచంద్రునితో కలిసియున్నచో యంత్రాదులచే మృతి చెందును. కుజుడు, శని చంద్రుడు తులమేష మకర కుంభములలో ఉన్న చో, క్షీణచంద్రుడు సూర్యుడు, కుజుడు లగ్నమున, అస్తగుతుడుగా, జలస్థానమున ఉన్న చో వారజనము చేతిలో మృతి సంభవించును. క్షీణచంద్రుడు బలయుతుడగు కుజునిచే చూడబడినపుడు శని ఏడవస్థానమున నున్నపుడు గుప్తరోగములచే, కృములచే, శస్త్రములచే అగ్నిచే దారువుచే మరణము సంభవించును అని అంగీర మహర్షి చెప్పెను. శని. సూర్యుడు అస్తగంతులైనపుడు, శని ఏడవస్థానమున నున్నపుడు క్షీణచంద్రుడు భూస్థానమున నున్నపుడు, లగ్నమున, పదకొండవస్థానమున, అస్తంగతునిగా మొదటిస్థానమున సూర్యుడు, చంద్రుడు, కుజుడు చంద్రుడున్న చో పర్వతశిఖరములనుండి పడుటచే మరణము సంభవించును. దృక్కోణములలో, నాలుగవస్థానములలో ఆయధిపతులున్న చో వారిలో బలవంతుడగు గ్రహప్రభావము వలన తనగుణముల వలననే తాను మరణించును. లగ్నాంశమునకు అధిపతి. దృష్టిపడు స్థానమున నున్నచో యో గేక్షణలచే మృతి చెందును. అస్తంగతాంశలో నున్నగ్రహము అశుభగ్రహములచే చూడబడినచో రెండు రెట్లు కీడు సంభవించును.. శుభగ్రహములచే చూడబడినచో మూడు రెట్లు మేలు జరుగును. ఇతర విషయములను తమ తమ బుద్ధిచే ఊహించుకొనవలయును. మృత్యుస్థానమున గ్రహములున్నచో అగ్నిజల భస్మ, శ్రీద, శోష, సర్పాదులచే మృతి సంభవించును. గ్రహములున్నరాశ్యంశములను బిందు మాత్రస్థానమును కూడా పరిశీలించి బుద్ధి వైభవముచే ఫలితమును చెప్పవలయును. అష్టమస్థానమున గురువుకాని, శుక్రచంద్రులు, సూర్యాంగారకులు, శని బుధులు కాని యున్నచో నరకమును కలిగించును. సూర్య చంద్రాది గ్రహములు బలవంతులతో కూడియున్నపుడు అంశాధిపతులతో కూడియున్నపుడు శ్రేష్ఠ, సమ, అధములగుదురు. గురువు ఏడవస్థానముననున్న చో రిపుస్థానమును కేంద్రస్థానమును నశింపచేయును. బృహస్పతి ఉచ్చలో ఉన్నపుడు, పన్నెండవస్థానమున బుధాంశయున్నచో ఇతర గ్రహముల బలము కూడా యున్నపుడు మోక్షము సంభవించును.
ఆధానే జన్మాజ్ఞానే తు వృక్షతాం లగ్నతో వదేత్ ।
పూర్వాపరార్దైర్లగ్నస్య సౌమ్యే వాచ్యపనేజనిః ॥
లగ్నత్రికోణే ధీజ్యత్య్రం శైర్వికల్పవయవాస్సమాః ।
గ్రీష్మో గేఽర్కే పరై రమ్యాపనతాంపృతురర్కభాత్ ॥
చంద్రజ్ఞజీవావృత్త్యస్యాః శుక్రోరార్కిభిరన్యథా ।
దృక్కైరాద్యైః పూర్వమాసస్తిధిస్తత్రానుపాతతః ॥
విలోమ జన్మభాగైశ్చ వేలారాత్రి ద్యుసంజ్ఞకే ।
త్రికోణోత్తమ పార్యాం హి లగ్నంవా లభనాభనే ॥
యావదూతో విదుర్లగ్నాత్తా వచ్చంద్రాచ్చ జన్మభౌ ।
గోహరీ యుగ్మ వసుభౌ క్రియజకే మృగాంగనే ॥
దశాష్టసప్తవిషయే గుణ్యాశ్శేషాస్స్వసంఖ్యయా ।
జీవభౌమకవిజ్ఞాస్స్యు రథవాద్యాయరే జ్ఞవత్ ॥
భానాం నిత్యో విధిః భేట వశావద్ధర్గణాస్తథా ।
సప్తఘ్నం భహాృతం శేషవృక్షం నవధానార్ణతః ॥
ద్విఘ్న సమర్తుమాసాస్స్యు పక్షతిద్యౌ గజాహతే ।
సప్తఘ్నం హో నిశార్కాణీషుఘ్నేగాం శేష్టహోరికా ॥
పుమాన్పరశుధృకృష్ణా రక్తదృగ్రక్షితుం క్షమః ।
హృష్చర్తికపదాశ్వాస్యా రక్తవస్త్ర ఘటాకృతిః ॥
కపిలో హ్యాంధదృక్రూరో రక్తవస్త్రః క్షతవ్రతః ।
క్షుత్తృషార్తో దుగ్ధపటో తానకుంచితమూర్ధజః ॥
మలినః కుత్పరోజాస్యో దక్షః కృష్యాదికర్మణి ।
ద్వీపకాయస్సరభయా పింగలో వ్యాకులాంతరః ॥
శౌచికే రూపిణీ సాధ్వీ హ్యప్రజోచ్చ్రితపాణిరా ।
ఉద్యానే కవచీ ధన్వీ క్రీడేచ్ఛర్గరుడాననః ॥
నృత్యాదివిద్వరుణవద్బహురత్నోధనుర్ధరః ।
ద్విపాస్య కంఠః క్రోడాస్యః కాననే శరమాహికః ॥
ఆతవ్యశాఖాం పాలాశీం రౌతిమ్ఫర్దాహి కర్కశా ।
చిపిటాస్యో హి సంవీతో నౌస్తస్త్రర్ధప్రజఞ్జలే ॥
శ్వానరో జంబుకం గృధ్రం గృహీత్వా రౌతి శాల్మలౌ ।
ధన్వీ కృష్ణాజినీ సింహవాశ్వోన్నతమాతురః ॥
ఫలామిషఘ్నః కూర్చీ న భల్లాస్యః కపిచేష్టితః ।
పుష్పపూర్ణచ్ఛటా కన్యా విద్యేల్లా మలినాంబరా ॥
ధన్వీ వ్యయాపకృచ్ఛ్యామో లిపికృద్రామశో నరః ।
గౌరీ దౌతాంశుకా త్సుచ్చా కుంభహస్తా సురాలయే ॥
మానోన్మాన్పాపసోతౌలీ భాండమలవిచింతకః ।
క్షుత్తృడ్యుతో నరః కుంభీ గృధ్రస్య స్త్రీసుతోపగః ॥
ధన్వీకింతరచేష్టస్తు హైమవర్మా మృగానుగః ।
సిందే కూజం ప్రజంతీ స్క్రీనానాసర్ప సితం హి హి ॥
సౌక్యస్పృహాద్యావృతాంగీ భత్రర్ధకచ్ఛపాకృతిః ।
కూర్మాస్యో మలయే సింహః శ్వక్రోడమృగభీషకః ॥
వాస్యః శ్వకాయో ధనుష్కో రక్షంస్తాపసయజ్ఞియే ।
చంపకా భాసనే మధ్యా సింధురత్రివివర్ధినీ ॥
కూర్చాసనే చంపకాభో దండీ కౌశేయకాననీ ।
పరమోధో గృధ్రముఖః స్నేహమద్యాశనస్పృహః ॥
దగ్ధానస్థా లోహాధరా సభూషా భాండకచ్చరా ।
భాండీ రోమశ్రవా శ్యామః కిరీటీ ఫలయంత్రధృక్ ॥
నౌస్థో ద్వౌసం విభూషార్ధా నానారత్నకరోంచతః ।
స్థా బ్ధేః మాలమాయాంతీ సయూధం చంపకాననా ॥
గర్తే సర్పవృతో నమ్రో రుదంశ్చేరానలార్దితః ।
ఏతాదృశా క్రియాంశాస్తు షట్రింశదుదితాః క్రమాత్ ॥
ఏతత్సంక్షేపతః ప్రోక్తం జాతకం మునిసత్తమ ।
నిబోధ సంహితాం స్కంధం లోకకృత్యుపయోగినమ్ ॥
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ద్వితీయపాదే బృహదుపాఖ్యానే జాతకనిరూపణం నామ పంచపంచాశత్తమోఽధ్యాయః ॥
గర్భాధానము పుట్టుకతెలియనపుడు లగ్నమును బట్టి చెప్పవలయును. లగ్నము యొక్క పూర్వార్ధాపరార్దములు సౌమ్యముగా నున్నపుడు ఫలములు చెప్పవలయును. లగ్నత్రికోణ స్థానమున అయిదవస్థానమున బృహస్పతి త్ర్యంశములతో వికల్పావయవములు సమముగా నుండును. సూర్యుడు గ్రీష్క గతుడైనపుడు ఇతరులు శుభస్థానగతులైనపుడు, సూర్యరాశినుండి చంద్ర బుధ బృహస్పతుల ఆవృత్తులతో ఒక ఫలితము, శుక్ర కుజ శనుల ఆవృత్తిచే మరొక ఫలితము సంభవించును. దృగ్గణితముననుసరించి కుజాదులచే పూర్వమాస తీథులను అనుపాతము వలన తెలియనగును. విలోమ జన్మభాగములచే కాలమున రాత్రిపగలు అను సంజ్ఞలు ఏర్పడును. త్రికోణ ఉత్తమ వర్గలననుసరించి లగ్నమును. లగ్నాంశములను గుర్తించవలయును. లగ్నము నుండి చంద్రుడెంత తక్కువగా నుండునో అంత చంద్రుని నుండి తక్కువగా లగ్నరాశిని చూడవలయును. 1, 11 స్థానములు, సంస్థానములు, అష్టమరాశులు, క్రియాజనము, మకర కన్యలు 10, 8, 7 విషయమున స్వసంఖ్యచే శేషమును గుణించవలయును. గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు ఆఘవాద్యాయరము లందు బుధునీవలే -అగును. రాశులకు నిత్యవిధి యుండును. గ్రహములవశము వలన ఆర్థగణములేర్పడును. ఏడుచే కొట్టివేయబడినదానిని పన్నెండుచే భాగించగా మిగిలిన దానిని నక్షత్రసంఖ్యచే నవ, ద్విసంఖ్యలచే ఋణముగొని రెండుచే భాగించగా సంవత్సర, ఋతుమాసములు ఏర్పడును. ఎనిమిదిచే కొట్టివేయగా పక్షములు తిధులేర్పడును. అయిదుచే భాగించగా పగలురాత్రులు వచ్చును. గోంశాష్ట్రము హోరలగును. కృష్ణవర్ణుడు పరశుధారియగు పురుషుడు, రక్త నేత్రుడు రక్షణకు సమర్థుడు. స్త్రీ అయినచో హృష్ణర్తి. సపాదములు గలది.. అశ్వము కలది, రక్తవస్త్ర, ఘటాకారము కలదిగానుండును. కపిలుడు అంధదృష్టి కలవాడు, క్రూరుడు, రక్తవస్త్రుడు, క్షతవ్రతుడు, ఆకలిదప్పులచే ఆర్తుడు, తెల్లని వస్త్రములు కలవాడు, ఖండించబడిన పొట్టి వెంట్రుకలుకలవాడు, మలినుడు, క్షత్పరుడు, అజముఖుడు, కృష్యాదికర్మలలో దక్షుడు. ఏనుగువంటి శరీరము కలవాడు, సరభయము వలన పింగలవర్ణుడు, వ్యాకులమైన మనసు కలవాడుగా పురుషుడుండును.
శౌచము కలది, రూపవతి, సాధ్వి, సంతానములేనిది, బలిసియున్న చేతులు కలదిగానుండును. కవచమును ధనువును ధరించి నరుదాననముతో ఉద్యానమున క్రీడేచ్చ గలవాడు నృత్యాదులు తెలిసినవాడు, వరుణుని వలె బహురత్నములు కలవాడు, ధనుర్ధరుడు, ఏనుగు ముఖము కంఠము కలవాడు, క్రోధముఖము కలవాడు, అరణ్యమునందు శరములచే వేటాడువాడు, పలాశశాఖను ధరించువాడు శిరస్సు సర్పమువలె కఠినముగా నుండునది, చపలాస్యుడు, సంవీతుడు, నౌకలో ఉండువాడు, స్త్రీ కొరకు జలమును పయనించువాడు. సారమేయము లేదా నరుడు జంబుకమును గద్దను తీసుకొని బూరుగువృక్షము మీద నిలుచుని అరుచుపోడు, ధనుర్ధారి, కృష్ణాజనమును ధరించువాడు, సింహమువలే అశ్వమువలె గంభీరుడు, ఉన్నతుడు, ఆరుడు, ఫలామిషములను హరించువాడు, కూర్చను ధరించువాడు, భల్లాస్యుడు, వానర చేష్టలు కలవాడు, స్త్రీ అయినచో పూలునిండిన బుట్టను ధరించునది, కన్య, మలినాంబరధారిణిగా తెలియవలయును. పురుషుడైనచో ధనుర్ధారి, వ్యయమును తొలగించువాడు, శ్యాముడు, లిపికారుడు, ఆరామమును చేయువాడు, నరుడు. స్త్రీ అయినచో గౌరి, శుభ్రవస్త్రము కలది, మద్యశాలలో కుంభహస్త, అభిమానమును తొలగించువాడు, పాపిష్టుడు, భాండమును తాచువాడు, చింతకుడు, ఆకలిదప్పులు కలవాడు, మంథీ, గృధ్రాస్యుడు, స్క్రీస్తుతోపగుడు, ధనుర్ధారి, కింకరచేష్టుడు, బంగారు కవచము కలవాడు, మృగముల వెంటవెళ్ళువాడు, సముద్రమున అరుచుచు వెళ్ళు స్త్రీ సౌనాసర్పహస్త, సౌఖ్యమునందు అభిలాష కలది, శరీరమును కప్పుకొనునది, కచ్చపాకారము కలది, మార్మాస్యుడు, మలయపర్వతమున సింహము, శునకవరాహమృగములకు భయమును కలిగించువాడు, వాస్యుడు, శునక శరీరుడు, ధనుర్ధారి, తాపసుయజ్ఞములను రక్షించువాడు, చంపకము వంటి ఆసనమధ్యమున నుండునది, నదులను వృద్ధి పొందించునది, కూరాసనమున . చంపక కాంతిగలపోడు, దండధారి, కౌశేయమును ధరించువాడు, ఉత్తముడు, గృధ్రముఖుడు, తైలమును మద్యమును సేవించుటలో అభిలాష కలవాడు, కాలిన బండిలో ఉండునది, లోహమును ధరించునది, భూషణములు - కలది, భాండమును ధరించుచు తిరుగునది, భాండము కలది, రోమములు కల చెవులు కలది, శ్యాముడు, కిరీటము కలవాడు, ఫలయంత్రమును ధరించువాడు, నౌకలో ఉండువాడు, భుజములను అలంకరించుకొనుటకు నానారత్నములను చేతులలో ధరించి యున్నవాడు, పడవలో ఉండిన సముద్రతీరమునకు వచ్చుచు సైన్యముతో కూడియున్నది, చంపకముఖి, గోతిలో సర్పములచే చుట్టబడియున్నవాడు, నగ్నుడు, చోరులచే అగ్నిచే బాధించబడి ఏడ్చువాడు, అనిపైన చెప్పబడిన ఈ ముప్పదియారు క్రీయాంశలు క్రమముగా ఫలితములుగా నుండును. ఓ మునీశ్వరా ! ఇది జాతకము. సంక్షేపముగా చెప్పితిని. లోకకృత్యములకు ఉపయోగించు, సంహితా భాగమును ఇక తెలుసుకొనుము.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున జాతకనిరూపణమను యాబదియైదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 56 of the Nārada Mahā Purana is as follows:
జ్యోతిష శాస్త్రమునందలి ద్వితీయ భాగమైన జాతకాంగ స్కంధ స్వరూపమును ఈ అధ్యాయంలో వివరించబడినది. ద్వాదశ రాశులు, నవగ్రహములు, భావ ఫలములు మరియు మానవ జన్మ లగ్నము ఆధారంగా శుభాశుభ ఫలములను గణించే దివ్య విజ్ఞానము ఇక్కడ ప్రతిపాదించబడినది.