62 - మోక్షధర్మనిరూపణమ్

సూత ఉవాచ:-

ఏతచ్ఛ్రుత్వా తు వచనం నారదో భగవానృషిః,

 పునః పప్రచ్ఛ తం విప్ర శుకాభిపతనం మునిమ్.

సూత మహర్షి పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా ! సనందనమహర్షి మాటలను వినిన నారదమహర్షి శుకమహర్షి మోక్షమార్గమును చేరిన విధానమును మరల ఇట్లడిగెను.

నారద ఉవాచ :-

భగవన్సర్వమాఖ్యాతం త్వయాతికరుణాత్మనా,

యచ్ఛ్రుత్వా మానసం మేద్య శాంతిమగ్య్రయముసాగతమ్.

పునశ్చ మోక్షశాస్త్రం మే త్వమాదిశ మహామునే,

న హి పంపూర్ణతామేతి తృష్ణా కృష్ణగుణార్ణవే.

 యే తు సంసాదనిర్ముక్తా మోక్షశాస్త్రపరాయణాః,

కుత్ర తే నివసనింతిహ సంశయో మే మహానయమ్.

 తం ఛిన్ది సుమహాభాగ ! త్వత్తో నాన్యో విదాంవరః

నారద మహర్షి పలి కెను :- ఓ పూజ్యతమా ! నీవు అతి దయాలుడవై నాకు ఆంతయూ తెలిపితివి. నీవు చెప్పిన దానిని విని నా మనసు ఉత్తమశాంతిని పొందినది. అయిననూ నీవు మరల నాకు మోక్షశాస్త్రమును వివరించుము. కృష్ణగుణార్ణవమున నా ఆశ తీరుటలేదు. సంసారమునుండి ముక్తులై మోక్షశాస్త్రపరాయణులైనవారు ఎచట నివసింతురు. ఇది నాలో గొప్ప సంశయము. నీకంటే జ్ఞానులు లేరు కావున ఈ సంశయనివృత్తిని చేయుము.

సనందన ఉవాచ :-

ధారయామాస చాత్మానం యథా శాస్త్రం మహామునిః.

 పాదాతభృతి గాత్రేషు క్రమేణ క్రమయోగవిత్,

 తప్ప ప్రాజ్ముఖో విద్వానాదిత్యేన విరాజితే.

పాణిపాదం సమాధాయ వినీతవదుపావిశత్,

 న తత్ర పక్షిసంఘాతో న శబ్దో న చ దర్శనమ్.

యత్ర వైయాసికిమి యోక్తుం సముపచక్రమే,

ప దదర్శ తదాత్మానం సర్వసంగవినిస్సృతః.

ప్రజహాస తతో హాసం శుకస్సంపేక్ష్య భాస్కరమ్,

స పునర్యోగమాశ్రియ మోక్షమార్గోపలబ్ధయే.

మహాయోగీశ్వరో భూత్వా సోత్యక్రామ్వహాయసమ్,

 అంతరిక్ష చరళీమాన్యాసపుత్రస్సునిశ్చితః.

తముద్యంతం ద్విజశ్రేష్ఠం వైనతేయసమద్యుతిమ్,

 దదృశుస్సర్వభూతాని మనోమారుతరంహసమ్.

యథాశక్తి యథాన్యాయం పూజయాల చక్రిరే తథా,

 పుష్పవర్షశ్చ దివ్యస్తమవచక్రుద్దివొకసః.

తం దృష్ట్వా విస్మితాస్సర్వే గంధర్వాపురసాం గణాః,

 ఋషయ శ్చైవ పంపిద్ధాః కోఽయం సిద్ధిముపాగతః,

తతోసౌ స్వాహ్వయం తేభ్యః కథాయామాప నారద,

ఉవాచ చ మహాతేజాస్తానన్సంప్రహర్షితః.

పితా యద్యనుగచ్ఛేన్మాం క్రోశమానశ్శు కేతి పై,

 తస్మై ప్రతివచో దేయం భవద్భిస్తు సమాహితైః.

బాఢముక్తప్తత ప్తైస్తు లోకాన్షిత్వా చతుర్విధాన్,

తమో హ్యష్టవిధం త్యక్త్వా జహౌ పంచవిధం రజః.

 తత్సత్త్వం జహౌ ధీమాన్ తదద్భుతమివాభవత్,

తతస్త స్మిన్నదే నిర్యే నిర్గుణీ లింగవర్జితే.

తతస్స శృంగే_ప్రతిమే హిమవన్మేరుపన్నిభే,

 పండ్లి పే శ్వేత పీతే చ రుక్మరూప్యమయే శుభే.

శతయోజనవిస్తారే తిర్యగూర్ధ్వం చ నారద !,

 సోవిశం కేన మనసా తథైవాభ్యపతచ్చుకః.

తే శృంగేఒత్యన్తసంబ్లీ ప్లే సహ సైవ ద్వీధా కృతే,

అదృ శ్యతాం ద్విజశ్రేష్ఠ తదద్భుతమివాభవత్.

తతః పర్వతశృంగాభ్యాం సహా పైవ వినిస్సృతః,

 న చ ప్రతిజఘానాస్య స గతిం పర్వతోత్తమః.

 తతో మందాకినీం దివ్యాం ఉపరిష్టాదభివ్రజన్,

 శుకో దదర్శ ధర్మాత్మా పుష్పితద్రుమకాననమ్.

 తస్యా క్రీడాసు నిరతాః స్నాంతి చైవాప్సరో గణాః,

నిరాకారం తు సాకారా దదృశుస్తం వివాహ సః.

తం ప్రక్రమంతమాజ్ఞాయ పితా స్నేహపమన్వితః,

ఉత్తమాం గతిమాస్థాయ పృష్ఠతోనుససార హ.

శుకస్తు మారుతాదూర్థ్వం గతిం కృత్వాంతరిక్షగామ్,

 దర్శయిత్వా ప్రభావం స్వం సర్వభూతోఽభవత్తదా.

సనందన మహర్షి పలికెను :- మహామునియగు శుకుడు శాస్త్రవిధానముతో ఆత్మను పాదముల నుండి శరీరమంతట అన్ని అవయవములలో క్రమముగా క్రమము తెలిసినవాడు కావున ధరించెను. తరువాత ప్రాజ్ముఖుడై విజ్ఞాని సూర్యునిచే శోభించుచున్నటుల హస్తపాదములను సవరించుకొని వినయశీలివలే ఆసీనుడాయెను. అచట పక్షి సమూహము కాని ధ్వనికాని చూపుకాని కనిపించుట లేదు. శుకమహర్షి పరంధామమున ఆత్మను చేర్చుటకు ప్రయత్నించు ప్రదేశమున ఇతరములేవీ లేవు. సర్వసంగవినిర్ముక్తుడై ఆత్మసాక్షాత్కారమును పొందెను. శుకమహర్షి సూర్యుని చూచి పెద్దగా నవ్వెను. అంతలోనే మోక్షమార్గమును పొందుటకు యోగము నవలంబించి మహాయోగీశ్వరుడై ఆకాశము నతిక్రమించెను. వ్యాసపుత్రుడు నిశ్చయబుద్దితో అంతరిక్షచరుడాయెను. గరుడుని వలె ప్రకాశించుచు ఉదయించుచున్న శుకమహర్షిని అన్ని ప్రాణులు వాయువేగమనోవేగములు కలవానిగా దర్శించిరి. యథాధిగా యథాశక్తి పూజించిరి. దేవతలు పుష్పవర్షమును కురిపించిరి. శుకమహర్షిని చూచిన గంధర్వులు అప్సరోగణములు, ఋషులు సిద్ధులు ఎవరితను కొత్తగా సిద్ధిని పొందినవాడని ఆశ్చర్యచకితులైరి. అపుడు శుకమహర్షి వారికి తన పేరును చెప్పెను. అట్లే సంతోషముచే మహాతేజోవంతులగు ఆ ఋషులను గూర్చి ఇట్లు పలికెను. మా తండ్రి! శుకొ అని పిలుచుచు - నా వెంట వచ్చినచో మీరు సావధానులై వారికి సమాధానమును చెప్పవలయును. వార యని సమాధానము చెప్పగా. శుకమహర్షి చతుర్విధలోకములను, అష్టవిధమగు తమస్సును, పంచవిధమగు రజస్సును విడిచెను. తరువాత జ్ఞానియగు - శుకమహర్షి సత్త్వమును కూడా వీడెను. అది అత్యద్భుతమాయేను. తరువాత 'నిర్గుణము లింగరహితము అయిన ఆ పదమున హిమవత్పర్వతము మేరుపర్వతముల  వంటి ఆ పర్వతశృంగమున, శ్వేత పీత వర్ణ సమ్మిశ్రమున స్వర్ణరజతమయము శుభకరము అయిన నిలువుగా, అడ్డముగా శతయోజనవిస్తారముగా నున్నదాని పై నిర్వింశంకమనస్కుడై నిలిచెను. శుకమహర్షి నిలువగానె మిక్కిలి సంక్లిష్టముగా నున్న ఆ శృంగము రెండుగా చీలి కనపడెను. ఆ దృశ్యము మిగుల ఆశ్చర్యమును గొలి పెను. అంతట ఆ పర్వత శిఖర భాగముల నుండి వేగముగా బయలు వెడలెను. ఆ పర్వతము శుకమహర్షి గమనమును అడ్డగించలేక పోయెను. అప్పుడు దివ్యమగు ఆకాశ గంగను ఉపరిభాగమున వెళ్ళుచు పూచిన చెట్లు గల వనమును శుకమహర్షి చూచెను. ఆ నదిలో క్రీడించుచు అప్పరోగణములు వివస్త్రలుగా స్నానము చేయుచు సాకారులై నిరాకారుని చూడసాగిరి. అట్లు శుకమహర్షి వ్యోమగతిన సాగుచుండుట తెలిసీ తండ్రియగు వ్యాస మహర్షి అతని యందలి పేమచే ఉత్తమగతిని స్వీకరించి శుకుని వెంట సాగెను. శుక మహర్షి మాత్రము వాయువునకు పై భాగమున గమనమును అవలంబించి తన ప్రభావమును చూపుచు సర్వభూతాత్మకుడాయెను.

అథ యోగగతిం వ్యాసస్సమాస్థాయ మహాతపాః,

నిమేషాంతరమాత్రేణ శుకాధిపతనం యయా.

స దదర్శ ద్విధా కృత్వా పర్వతాగ్రం గతం శుకమ్,

 శశంసుర్మునయస్సిద్ధా గతిం తస్మై సుతస్య తామ్.

తతశ్శు కేతి శబ్ధేన దీర్ఘణ క్రందీతం తదా,

 స్వయం పిత్రా స్వరేణోచ్చైస్త్రీంల్లో కాననునాద్య వై.

 శుకస్సర్వగతిర్భూత్వా సర్వాత్మా సర్వతోముఖః,

ప్రత్యభాషత ధర్మాత్మా భోశ్శబ్ధేననునాదయన్.

తత ఏకాక్షరం నాదం భోరిత్యేవముదీరయన్,

ప్రత్యాహరజ్జగత్సర్వముచ్చెస్థావరజంగమమ్.

తతః ప్రభృతి వాద్యాపి శబ్దానుచ్చారతానృథక్,

గిరిగహ్వరపు షేషు వ్యాజహార శుకం ప్రతి.

అంతర్జితప్రభావం తం దర్శయిత్వా శుకస్తదో,

గుణాన్సంత్యజ్య పత్త్వాదీ పదమధ్యాగమత్పరమ్.

 మహిమానం తు తం దృష్ట్వా పుత్రస్యామితతేజసః,

సోనునీతో భగవతా వ్యాసో రుద్రేణ నారద.

కిము త్వం తామ్యసి మునే పుత్రం ప్రతి పనకులః,

పశ్యపీ విప్ర నాయాంతం బ్రహ్మభూతం నిజాంతి కే.

 ఇత్యేవమనునీతోనో వ్యాసః పునరుపొవ్రజత్ ,

 స్వాశ్రమం ప శుక బ్రహ్మభూతో లోకాంశ్చచారహ.

తతః కాలాంతరే బ్రహ్మన్ ! వ్యాసస్సత్యవతీసుతః,

నరనారాయణో ద్రష్టుం యమౌ బదరికాశ్రమమ్.

తత్ర దృష్ట్వా తు తో దేవో తప్యమానౌ మహత్తపః,

స్వయం చ తత్ర తపసి స్థితశ్శుకమనుస్మరన్.

యావత్తత్ర స్థితో వ్యాసశ్శుకః పరమయోగవిత్,

శ్వేతద్వీపం గతస్తాత ! యత్ర త్వమగమః పురా.

తత్ర దృష్టప్రభావస్తు శ్రీమన్నారాయణః ప్రభుః,

దృష్టశ్శ్రుతివిమృగ్యో హి దేవదేవో జనార్దనః.

స్తుతశ్చ శుకదేవేన ప్రసన్నః ప్రాహ నారద!

మహాతపస్కుడైన, వ్యాసమహర్షి యోగగతిని అవలంబించి నిమేషమాత్రమున శుకాధిపతనమును గూర్చి వెళ్ళేను. పర్వతమును రెండుగా చీల్చి శుకుడు వెళ్ళుటను చూచెను. మునులు సిద్ధులు శుకుని గతిని వ్యాసమహర్షికి తెలిపిరి. అపుడు వ్యాసమహర్షి శుకా అని పెద్దగా పిలిచెను. ఆ పిలుపు మూడులోకములలో ప్రతిధ్వనించేను. శుకమహర్షి సర్వాత్ముడు సర్వతోముఖుడు సర్వగతి అయి తండ్రి పిలుపును విని ధర్మాత్ముడు కావున భోః అని బదులు పలికెను. అంతట భోః అను ఒక అక్షరము గల మాట స్థావరజంగమాత్మకమగు ప్రపంచమంతట ప్రతిధ్వనించేను. అప్పటి నుండి ఇప్పటి వరకు పర్వతగుహలలో పలికిన మాటలు శుకుని గూర్చి ప్రతిధ్వనిగా వినిపించుచున్నవి. ఇట్లు శుకుడు సర్వభూతాంతర్గతునిగా తన ప్రభావమును చూపి సత్త్వాధీగుణములను వదిలి పరమపదమును చేరెను. మిక్కిలి తేజోవంతుడగు పుత్రుని ప్రభావమును చూచి పుత్రుని కొరకు పరితపించుచున్న వ్యాసమహర్షిని భగవంతుడగు రుద్రుడు ఓదార్చేను. ఓ మహామునీ ! నీవు పుత్రుని గూర్చి ఏల పరితపించుచున్నొవు? నీ పుత్రుడు బ్రహ్మ రూపుడై నీ వద్దకు వచ్చుటను చూడలేకున్నావా? అని ఓదార్చగా వ్యాసమహర్షి తన ఆశ్రమమునకు వెడలెను. శుకమహర్షి బ్రహ్మ స్వరూపుడై సర్వలోకములలో సంచరించెను. తరువాత కొంతకాలమునకు వ్యాసమహర్షి నరనారాయణులను చూచుటకు బదరికాశ్రమమునకు వెళ్ళెను. బదరికాశ్రమమున గొప్పతపమును చేయుచున్న నరనారాయణులను చూచిన వ్యాసమహర్షి శుకమహర్షిని తలచుచు తాను కూడా తపస్సును చేయసాగెను. వ్యాసమహర్షి బదరికాశ్రమమున ఉన్న సమయమున పరమయోగజ్ఞుడగు శుకయోగీంద్రుడు నీవు మొదటవెళ్ళిన శ్వేతద్వీపమునకు వెళ్ళెను. ఆ శ్వేతద్వీపమున దేవదేవుడు, శ్రుతులచే అన్వేషించబడు జనార్ధనుని చూచెను.. వెంటనే శుకయోగీంద్రుడు శ్రీహరిని స్తుతించెను. అపుడు శ్రీహరి శుకయోగిని గూర్చి ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ :-

త్వయా దృష్టోఽ స్మి యోగీంద్ర సర్వ దేవరహస్థితః.

 సనత్కుమార ది ష్టేన సిద్ధోయోగేన బాడవ,

త్వం పదాగతిమార్గస్థో లోకాన్పశ్య యథేచ్ఛయా.

 ఇత్యుక్తో వాసుదేవేన తం నత్వారణిసంభవః,

వైకుంఠం ప్రయహో విప్ర సర్వలోకనమస్కృతమ్.

వైమానికైస్సు రైర్జుష్టం విరజా పరిచేష్టితమ్,

యం భాంతమనుభాంత్యేతే లోకాస్సర్వేపి నారద.

యత్ర విద్రుమసోపానాస్స్వర్ణరత్నవిచిత్రితాః,

 వాప్య ఉత్పలసంఛన్నాస్సుర సీక్రీడనాకులాః.

దివ్యర్థంసకులైరుష్టాస్వచ్ఛాంబుని భృతాస్సదా,

తత్ర ద్వా స్టైశ్చతుర్ల సైర్నానాభరణభూషితైః.

విష్వక్సేనాను గైసిద్ధిః కుముదాయ్యెరవారితః,

ప్రవిశ్యాభ్యంతరం తత్ర దేవదేవం చతుర్భుజమ్.

శాంతం ప్రసన్నవదనం పీతకౌశేయవాససమ్,

శంకచక్రగదాపద్మేర్మూర్తిమద్భిరుపాసితమ్.

 వక్షస్థలస్థయా లక్ష్మ్యా కౌస్తుభేన విరాజితమ్,

 కటిసూత్రబ్రహ్మసూత్రకటకొంగదభూషితమ్.

 భాజత్కిరీటవలయం మణినూపురశోభితమ్,

 దదర్శ సిద్దనికరై స్సేవ్యమానమహర్నిశమ్.

 తం దృష్ట్వా భక్తి భావేన తుష్టావ మధుసూదనమ్

భగవంతుడు శ్రీహరి పలికెను :- ఓ యోగీంద్రుడా ! దేవతలందరికీ కనపడకుండా రహస్యముగా నున్న నన్ను నీవు చూడగలిగితివి. నీవు సనత్కుమారుడు ఉపదేశించిన యోగముచే సిద్ధిని పొందగలిగితివి. ఈ యోగముచే నీవు నీ ఇచ్చానుకూలముగా వాయుమార్గమున అన్నిలోకములను చూడుము. ఇట్లు వాసుదేవుడు పలుకగా శుకమహర్షి నమస్కరించి సర్వలోకములచే నమస్కరించబడు వైకుంఠమునకు వెళ్ళెను. ఆ వైకుంఠలోకము విమానము గల దేవతలచే కూడియున్నది. విరజానది పరివేష్టితము. వైకుంఠలోకపు ప్రకాశముతోనే ఇతరలోకములు ప్రకాశించుచుండును. ఆ వైకుంఠమున పగడపు మెట్లు బంగారముతో రత్నములచే పొదగబడియున్నవి. అచటి కొలనులు కలువలచే దేవతా స్త్రీల క్రీడలతో కూడియున్నవి. దివ్యములైన హంసలు కలది. స్వచ్ఛమైనజలము కలవి. నాసాభరణభూషితులు చతుర్ఘస్తులు విష్వక్సేనానుచరులు అగు కుముదొదిద్వారపాలకులు శుకమహర్షిని వారించజాలకపోయిరి. శుకమహర్షి అభ్యంతరమున ప్రవేశించి అచట చతుర్భుజుడు, శాంతమూర్తి, ప్రసన్నవదనుడు, పీతాంబరధారి, అకారమును ధరించిన శంఖ చక్ర గదా పద్మములచే ఉపాసించబడువాడు, లక్ష్మీదేవిచే కౌస్తుభమణిచే ప్రకాశించు వక్షస్థలము కలవాడు కటిసూత్ర, యజ్ఞోపవీత, కటకొంగదములచే విభూషతుడు, కిరీటవలయాదులచే విరాజిల్లువోడు, మణినూపురాధీభూషణములచే సుశోభితుడు, రాత్రింబవళ్ళు సిద్దులచే సేవించబడు దేవదేవుడగు శ్రీమన్నారాయణుని దర్శించెను. అట్లు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి భావముచే స్తోత్రము చేసెను.

శుక ఉవాచ :-

నమస్తే వాసుదేవాయ సర్వలోకైకసాక్షిణే.

 జగద్బీజస్వరూపాయ పూర్ణాయ నిభృతాత్మనే,

హరయే వాసుకిస్థాయ శ్వేతద్వీపనివాసినే.

 హంసాయ మత్స్యరూపాయ వరాహతనుధారిణే,

 నృసింహాయ ధ్రువేజ్యాయ సాంఖ్యయోగేశ్వరాయ,

చతుస్సనాయ కూర్మాయ పృథవే స్వసుఖాత్మనే,

నాభైయాయ జగద్ధాత్రే విధాత్రెన్తకరాయ చ.

భార్గవేంద్రాయ రామాయ రాఘవాయ పరాయ చ,

కృష్ణాయ వేదకర్త్రే చ బుద్ధకల్కి స్వరూపిణీ.

 చతుర్వ్యూహాయ వేద్యాయ ధ్యేయాయ పరమాత్మనే,

నరనారాయణాభ్యాయ శిపివిష్టాయ విష్ణవే.

 ఋతధామ్నే విధామ్నే చ సుపర్ణాయ స్వరోచి షే,

ఋభవే సువ్రతాభ్యాయ సుధామ్నే చాజితాయ చ.

విశ్వరూపాయ విశ్వాయ సృష్టిస్థిత్యంతకారిణే,

యజ్ఞాయ యజ్ఞభోక్రే చ స్థవిష్టాయాణవేర్థినే.

 ఆదిత్యసోమనేత్రాయ సహా ఓజో బలాయ చ,

ఈజ్యాయ సాక్షిణేజాయ బహుశీర్షాంఘిబాహవే.

 శ్రీశాయ శ్రీనివాసాయ భక్తవశ్యాయ శార్జిణే,

అష్టప్రకృత్యధీశాయ బ్రహ్మణేనన్తశక్తయే.

 బృహదారణ్యవేద్యాయ హృషీ కేశాయ వేధ పే,

 పుండరీకనిభాక్షాయ క్షేత్రజ్ఞాయ విభాసినే.

గోవిందాయ జగత్కర్త్రే జగన్నాథాయ యోగి,

పత్యాయ సత్యసంధాయ వైకుంఠాయాచ్యుతాయ చ.

అధోక్షజాయ ధర్మాయ వామనాయ త్రిధాతవే,

ఘృతాచ్చి షే విష్ణవేతేనంతాయ కపిలాయ చ.

 విరించయే త్రికమో ఋగ్యజుస్సామరూపిణే,

ఏకశృంగాయ చ శుచిశ్రవ సే శాస్త్రీయోనయే.

వృషాకపయే బుద్ధాయ ప్రభవే విశ్వకర్మణే,

భూర్భువస్స్వస్వరూపాయ దైత్య ఘ్నే నిర్గుణాయ చ.

నిరంజనాయ నిత్యాయ హ్యవ్యయాయాక్షరాయ చ,

 నమస్తే పాహి మామీశ శరణాగతవత్సల !

ఇతి స్తుతస్స భగవాన్ శంఖచక్రగదాధరః,

ఆరణ్యమువాచేదం భృశం ప్రణతవత్సలః.

శుకమహర్షి పలికెను :- సర్వలోకసాక్టివగు వాసుదేవునకు నమస్కారము. జగత్తున కారణస్వరూపము, పరిపూర్ణుడు, నిభృతాత్ముడయిన నీకు నమస్కారము. వాసుకి పై నివసించువానికి శ్వేతద్వీపవాసి యగు శ్రీహరికి నమస్కారము హంసరూపధారికి, మత్స్యరూపధారికి వరాహరూపధారికి నమస్కారము. నృసింహరూపునకు, ధ్రువునిచే పూజించబడినవానికి సాంఖ్య యోగీశ్వరునకు నమస్కారము. పృథుస్వరూపునకు కూర్మరూపధారికి పరమానందస్వరూపునకు నమస్కారము. పొందశక్యము కాని వానికి, జగత్తును ధరించువానికి, విధాతృస్వరూపునకు, జగదంతమును చేయువానికి నమస్కారము. పరశురామస్వరూపునకు, రఘురామస్వరూపునకు, బలరామస్వరూపునకు నమస్కారము. కృష్ణరూపనకు, వేదకర్తకు, బుద్దరూ పునకు, కల్కి రూపునకు నమస్కారము. వాసుదేవ ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ నామములతో చతుర్వ్యూహరూపునకు వేద్యునకు, ధ్యానగమ్యునకు, పరమాత్మకు నమస్కారము. నరనారాయణనామునకు, శిపివిష్ట స్వరూపునకు, విష్ణువునకు, సత్యనివాసమునకు విధామకు, సుపర్ణునకు, స్వయం ప్రకాశకునకు నమస్కారము. ఋభుగొమధారికి, సువ్రతాఖ్యునకు, సుధామునకు, జయింపశక్యము కాని వానికి నమస్కారము. విశ్వరూపునకు, విశ్వభూతునకు సృష్టి స్థితి లయ కారకునకు, యజ్ఞ స్వరూపునకు యజ్ఞభోక్తకు, స్థవిష్ణునకు, అణు స్వరూపునకు, అర్థి రూపునకు నమస్కారము. సూర్య చంద్రనేత్రునకు, ఓజో సహబల స్వరూపునకు, పూజ్యునకు, సర్వసాక్షికి, జన్మరహితునకు బహు శీర్షములు, బహు పాదములు, బహు బాహువులు కలవానికి నమస్కారము. శ్రీపతికి, శ్రీనివాసునకు, భక్తవశ్యునకు, శార్జధనుర్ధారికి, అష్టప్రకృతులకు అధిపతికి, అనంతశక్తికి, బ్రహ్మకు నమస్కారము. బృహదారణ్య వేద్యునకు, హృషీకేశునకు, వేధస్స్వరూపునకు, పుండరీకాక్టునకు, క్షేత్రజ్ఞునకు, అంతటా భాసించువానికి నమస్కారము. గోవిందునకు, జగత్కర్తకు, జగన్నాధునకు, యోగికి, సత్యస్వరూపునకు, సత్యసంధునకు, వైకుంఠునకు, అచ్యుతునకు నమస్కారము. అధోక్షజునకు, ధర్మస్వరూపునకు, వామనునకు, త్రిధాతువునకు, ఘృతార్చికి, విష్ణువునకు, అనంతునకు, కపిలునకు నమస్కారము. విరించికి, త్రికకుదునకు, ఋగ్యజుస్సామరూపునకు, ఏక శృంగునకు, శుచిశ్రవునకు, శాస్త్ర సిద్దునకు నమస్కారము. వృషాకపునకు, బుద్ధునకు, ప్రభువునకు, విశ్వకర్మ కు, భూర్భువస్సువస్వరూపునకు, దైత్య సంహర్తకు నిర్గుణునకు నమస్కారము. నిరంజనునకు, నిత్యునకు, అవ్యయునకు, నాశములేనివానికి నమస్కారము. ఓ శరణాగతవత్సలా ! లోకనాథా ! నీకు నమస్కారము. నన్ను కాపాడుము. ఇట్లు శుకమహర్షిచే స్తోత్రము చేయబడిన శంఖ చక్రగదాధరుడు ప్రణతవత్సలుడగు శ్రీమన్నారాయణుడు శుకమహర్షిని గూర్చి ఇట్లు పలికెను.

శ్రీ భగవానువాచ :-

వ్యాసపుత్ర మహాభాగ ! ప్రీతోఽస్మి తవ సువ్రత !,

విద్యామాప్ను హి భక్తిం చ జ్ఞానీ త్వం మమ రూప ధృక్.

యద్రూపం మమ ప్రాగ్దృష్టం శ్వేతద్వీ పే త్వయా ద్వీజ !,

సోహమేవావతారార్థం స్థితో విశ్వంభరాత్మకః.

పిద్ధోపి త్వం మహాభాగ ! మోక్షధర్మానుచింతయా,

వరలోకాన్యథా వాయుర్యథా ఖం సవితా తథా

 నిత్యముక్త స్వరూపస్త్వం పూజ్యమానప్సుర్నై రైః,

భక్తిర్హి దుర్లభా లోకే మయి పర్వపరాయణే.

తార లబ్ధ్వ నాపరం కించిల్లజ్ఞవ్యమవశిష్యతే,

ఆకల్పాంతస్తపస్సంస్థా నరనారాయణావృషీ.

తయోర్ని దేశతో వ్యాసో జనకస్తవ పువ్రతః,

కర్తా భాగవతం శాస్త్రం తదధీష్వ భువం ప్రజ.

స తప్యతి తపస్త్వద్య పర్వతే గంధమాదనే,

త్వద్వియోగేన ఛిన్నాత్మా తం ప్రసాదయ మలియమ్.

 ఏవముక్తశ్శుకో విప్ర నమస్కృత్య చతుర్భుజమ్,

యథాగతం నివృత్తా నీ పితురని కమాగమణ్ .

అథతం స్వాంతికే దృష్ట్వా పారాశర్యః ప్రతాపవాన్,

పుత్రం ప్రాప్య ప్రహృష్టాత్మా తపసో నివవర్త హ.

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్,

ఆరణీయసమాయుక్తస్వాశ్రమం సముపాగమత్.

నారాయణయోగాత్తు త్వన్ముఖేన మునీశ్వర,

 చకార పంహితాం దివ్యాం వానాఖ్యానసమన్వితామ్.

వేదతుల్యాం భాగవతీం హరిభక్తి వివర్ధినీమ్,

నివృత్తినిరతం పుత్రం శుకమధ్యాపయచ్చ తామ్.

 ఆత్మారామోపి భగవాన్ పారాశర్యాత్మ జశ్శుకః,

అధీతవాన్సంహితాంవై నిత్యం విష్ణుజనప్రియామ్.

ఏవమేతే సమాఖ్యాతా మోక్షధర్మాస్తవానఘ,

పఠతాం శృణ్వతాం చాపి హరిభక్తివివర్ధనాః.

ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ద్వితీయపాదే బృహదుపాఖ్యానే మోక్షధర్మ

నిరూపణం నామ ద్వీషష్ఠితమోఽధ్యాయః.

ద్వితీయపాదశ్చ సమాప్తః.

 శ్రీమన్నారాయణుడు పలికెను :- ఓ సువ్రతా ! మహానుభావా ! వ్యాసపుత్రా ! నీవు నా రూపమును ధరించి విద్యను భక్తిని పొంది జ్ఞానరూపుడవు కమ్ము. నీవు శ్వేతద్వీపమున చూచిన నా రూపము . అవతారము కొరకు ధరించినది. ఆ రూపము విశ్వంభరుడనైన నాదే. మోక్ష ధర్మమును చింతించుటచే నీవు సిద్దుడవైతివి. ఉత్తమలోకములను వాయువు, ఆకాశము, సూర్యుడు సంచరించునట్లునీవు సంచరించెదవు. నీవు నిత్యముక్తస్వరూపుడవు కావున నరులచే దేవతలచే. పూజించబడుచుందువు, సర్వపరాయణుడనైన నాయందు భక్తి కలుగుట దుర్లభము. భక్తి లభించిన తరువాత ఇక పొందవలసినదేమియూ ఉండదు. నరనారాయణ ఋషులు కల్పాంతము వరకు తపస్సు చేయుచుందురు. వారి ఆజ్ఞ వలన సువ్రతుడగు , మీ తండ్రి యగు వ్యాసమహర్షి భాగవతమును రచించెను. నీవు భూలోకమునకు వెళ్ళి ఆ భాగవతమును అధ్యయనము చేయుము. మీ తండ్రి ఇపుడు గంధమాదవ పర్వతము పై తపస్సునాచరించుచున్నాడు. నీ ఎడబాటుచే ఖిన్నుడై యున్నాడు. అతనిని సంతోషపరుచుము. అతను నాకు ప్రీతిపాత్రుడు. ఇట్లు శ్రీమన్నారాయణుడు చెప్పగా, చతుర్బుజునికి నమస్కరించి శుకమహర్షి వచ్చిన విధముగానే తిరిగి వెళ్ళి తండ్రిని సమీపించెను. తేజశ్శాలి యగు వ్యాసమహర్షి తన వద్దకు వచ్చిన శుకుని చూచి సంతోషించి తపస్సు నా పెను, నర నారాయణ మూర్తులను నమస్కరించి, శుకమహర్షితో కలిసి తన యాశ్రమమును చేరేను. నారాయణమహర్షి ఆజ్ఞచే వ్యాసమహర్షి నీ ముఖము ద్వారా విని నానాఖ్యానములు గల దివ్యమగు భాగవత సంహితను నివృత్తిపరుడగు శుకునిచే చదివించేను. వ్యాసపుత్రుడగు శుకయోగీంద్రుడు ఆత్మారాముడైనను విష్ణు భక్తులకు ప్రియమగు భాగవతసంహితము ప్రతినిత్యము అధ్యయనము చేసెను. చదువు వారికి వినువారికి హరిభక్తిని పెంచేడు మోక్షధర్మములను నీకు తెలిపితిని.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ద్వితీయపాదమున బృహదుపాఖ్యానమున మోక్షధర్మ నిరూపణిమను ఆరువది రెండవఆధ్యాయము సమాప్తము.

ద్వితీయపాదము సమాప్తము.