నారద మహా పురాణము
9 - రుక్మాంగద ధర్మాంగద సంవాదః
సౌతిరువాచ :-
రుక్మాంగదస్తు రాజేన్ద్రో భుక్త్యా భోగాంస్తు మానుషాన్ ।
సంపూజ్య బహుశో దేవం పీతాంబరధరం హరిమ్
దత్వా మూర్ధ్ని పదం విప్రా శ్శుత్రూణాం రణశాలినామ్ ।
కృత్వా శూన్యం యమపధం జిత్వా వైవస్వతం యమమ్
వైకుంఠస్య తు పంధానం సంపూర్ణం మానవైః కృతమ్ ।
ఆహూయ తనయం కాలే ధర్మాంగదమభాషత
ఏతాం వసుమతీం పుత్ర వసుపూర్ణాం సమంతతః ।
పరిపాలయ వీర్యేణ స్వధర్మే కృతనిశ్చయః
పుత్ర సమర్థ జాతే యో రాజ్యం న ప్రతిపాదయేత్ ।
తస్య ధర్మస్తధాకీర్తి ర్వినశ్యతి న సంశయః
సమర్ధేన చ పుత్రేణ యో న యాతి పితా సుఖమ్ ।
అవశ్యం పాతకీ సోఽపి విజ్ఞేయో భువనత్రయే
పితుర్భారక్షమః పుత్ర భారం నోర్వహతే తు యః ।
మాతురుచ్చారవజ్ఞాతో ద్విజిహ్వా విషవర్జితః
స పుత్రో యోఽధికఖ్యాతః పితుర్భవతి భూతలే ।
ప్రకాశయతి సర్వత్ర స్వకరైరివ భాస్కరః
పుత్రాపనయజై ర్దుఃఖై రాత్రౌ జాగర్తియత్పితా ।
స పుత్రో నరకం యాతి యావదాభూతసంప్లవమ్
పితుర్వచనమాదృత్య సర్వంయఃకురుతే గృహే ।
స యాతి దేవసాయుజ్యం స్తూయమానో దివి స్థితైః
సోఽహం ప్రజాకృతే పుత్ర! ఆసక్తః కర్మభిః క్షితౌ ।
నభుక్తం నైవ సుప్తం తు స్వేచ్ఛయా పాలనే స్థితః
అసమర్ధే త్వయి సుత న ప్రాప్తం హి మయా సుఖమ్ ।
విష్ణువాసరభోక్త్రుణాం నిగ్రహే కృతబుద్ధినా
కేచిచ్చైవే స్థితా మార్గే సౌరే కేచిద్వ్యవస్థితాః ।
విరించి మార్గగాశ్చాన్యే పార్వత్యాశ్చ స్థితాః పరే
సాయం చ ప్రాతరాసీనా అగ్నిహోత్రే వ్యవస్థితాః ।
బాలో యువా వా వృద్ధో వా గుర్విణీ వా కుమారికా
స రోగో వికలో వాపి న శక్నోతి హ్యుషోషితుమ్ ।
ఇత్యేవ జల్పితం యైస్తు తాన్నిరస్య సమంతతః
వచోభిస్తు పురాణోక్తై రాసర్బైహుభిస్త్వహమ్ ।
సంబోధయిత్వా బహుశః ప్రజానాం సుఖహేతవే
నిగృహ్య తాన్హరిదినే నిరాహారాన్కరోమి చ ।
శాస్త్రదృష్ట్యా తు విదుషో మూర్ఖాన్దండనపూర్వకమ్
శాసయిత్వా కృతా స్సర్వే నిరాహారా హరేర్దినే ।
తేన మే న సుఖం కించి దవలీడం ధరాతలే
కచ్చిన్నదుఃఖేన జనాన్ యోజయేత్కిల పుత్రక! ।
స్వేభ్యోవాపి పరేభ్యో వా యో రక్షేచ్చ ప్రజా నృపాః
తస్యామి హ్యక్షయా లోకాః పురాణేషు ప్రకీర్తితాః ।
సోఽహం ప్రజాకృతే సౌమ్య సంస్థితా నాత్మనః క్వచిత్
సౌఖ్యమిచ్ఛామ్యహం భోక్తుం మృగయాదిసముద్భవమ్ ।
న పానద్యూతజం పుత్ర కామయే హం కదాచన
ఏషు సక్తోఽచిరాత్పుత్ర వినాశం యాతి పార్థివః ।
త్వత్ప్రసాదాదహం పుత్ర మృగయావ్యాజతోఽధునా
గిరీశ్వనాదిపరీతః సరాంసి వివిధాని చ ।
భోక్తుకామః ప్రియాన్కామాం స్త్వయి భారం నివేశ్య చ
ఏతత్సర్వం సమాఖ్యాతం యత్ద్సితం హృదయే మమ ।
కృతే తవ మహాకీర్తి రకృతే నరకస్థితిః
సౌతిపలికెను :- రుక్మాంగదమహారాజు ఇహలోకమున మానుషభోగములను అనుభవించి, పీతాంబరధరుడగు శ్రీహరిని బహు విధములుగా పూజించి, రణశీలులగు శత్రువుల శిరస్సున పాదమునుంచి యమలోకమార్గమును శూన్యము గావించి, యముని గెలిచి, వైకుంఠమార్గమును మానవులతో సంపూర్ణము గావించి, సమయమును చూచి తనయుడగు ధర్మాంగదుని పిలిచి ఇట్లు పలికెను. ఓ పుత్రుడా? సమగ్రముగా వసుసంపూర్ణమగు సమస్తభూమండలమును ధర్మబుద్ధికలవాడవై నీపరాక్రమముతో పరిపాలించుము. సమర్థుడగు పుత్రునికి రాజ్యమునీయనివాని ధర్మము కీర్తి నశించును. సమర్థుడగు పుత్రునివలన సుఖమును పొందని తండ్రి ఈ మూడులోకములందు మహాపాతకియగును. తండ్రిభారమును భరించగల సామర్థ్యము ఉండి కూడా తండ్రి భారమును వహించని వాడు తల్లికడుపుకు బాధకలిగించు, విషరహితమగు సర్పము. తండ్రికంటే అధికమగు కీర్తిని సంపాదించిన పుత్రుడు సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపచేయునట్లు ఈలోకమును ప్రకాశింపచేయును. పుత్రుని అవినీతివలన రాత్రిపూట తండ్రి నిదురించనిచో ఆ పుత్రుడు ప్రళయకాలము వజకు నరకమున వసించును. తండ్రిమాటను ఆదరముతో ఇంటిలో ఆచరించుపుత్రుడు దేవతలచే స్తుతించబడుచు దేవసాయుజ్యమును పొందును. కావున పుత్రా! నేను ప్రజారక్షణార్థము భూమండలమున కర్మలలో ఆసక్తుడనై నిదురించలేదు. భుజించలేదు. స్వేచ్చగా పాలనలో ఉంటిని. నీవు అసమర్థునిగా ఉన్నపుడు నేను సుఖమును బొందలేదు. విష్ణు వాసరమున భుజించువారిని నిగ్రహించుటలో ప్రయత్నించితిని. ప్రజలలో కొందరు శివభక్తి పరాయణులు, కొందరు సూర్యభక్తులు, కొందరు బ్రహ్మభక్తులు, మరికొందరు పార్వతీభక్తులు. ప్రాతఃకాలము సాయంకాలము ఆసీనులై అగ్నిహోత్రముల నాచరించుచు ఉండిరి. బాలుడు కాని వృద్ధుడు కాని వృద్దురాలుకాని కుమారి కాని, రోగి కాని, అంగవికలులుకొని, ఉపవసించలేరు అని చెప్పువారిని నిరసించి పురాణవచనములచే చాలాదినములు బోధించి ప్రభోదించి, ప్రజాసుఖముకొరకు, నిగ్రహించి హరివాసరమున నిరాహారులను చేయుచున్నాను. విద్వాంసులను శాస్త్రదృష్టిచే, దండన పూర్వకముగా మూర్ఖులను శాసించి హరివాసరమున అందరిని నిరాహారులను చేసితిని. కావున ఈ భూమిమండలమున నేను సుఖముననుభవించలేదు. అయిననూ ప్రజలను కష్టములపాలుచేయరాదు. తనవారి నుండి ఇతరులనుండి వచ్చు కష్టములనుండి ప్రజలను కాపాడు రాజునకు అన్నిలోకములు అక్షయములని పురాణములలో చెప్పబడినది. కావున నేను ప్రజలకొరకే వ్యవహరించితిని. నా సుఖముకోరకు కాదు. ఇపుడు వేట మొదలగు విహారముల వలన కలుగు ఆనందమును అనుభవించదలచితిని. అంతేకాని పానమును ద్యూతమును నేనెపుడూ అభిలషించను. పానద్యూతములలో ఆసక్తుడగు మానవుడు త్వరలో నాశమును పొందును. కావున నీ ప్రీతివలన ఇపుడు నేను వేట అను మిషతో పర్వతములను అడవులను నదులను, బహువిధ సరస్సులను చూచుచు తిరుగుచు ఆనందమును అనుభవించదలచితిని. ఇట్లు నా హృదయమున కల అభి ప్రాయమును సమగ్రముగా తెలిపితిని. ఇట్లు చేసినచో నీకు గొప్పకీర్తి. చేయనిచో నరకప్రాప్తి యుండును.
ధర్మాంగద ఉవాచ :-
సర్వమేతత్కరిష్యామి భుంక్ష్య భోగా న్మనోఽనుగాన్ ।
గుర్వీం రాజ్యధురం తాత త్వదీయాముద్దరామ్యహమ్
న హి మేఽన్యస్స్మ్రతోధర్మ స్త్వద్వాక్యకరణం వినా ।
పితుర్వాక్యమకుర్వాణః కుర్వన్ధర్మానధో వ్రజేత్
తస్మాత్కరిష్యే వచనం త్వదీయం ప్రాంజలిస్ధ్సితః ।
ఏవముక్తే తు వచనే రాజా హృష్టో బభూవ హ
గంతుకామె మృగాన్భూయో లబ్ధ్యా జ్ఞాత్వా వనం తతః ।
ధర్మాంగదోఽపి హృష్టాత్మా ప్రజా ఆహూయా చాబ్రవీత్
పిత్రా నియుక్తో భవతాం పాలనాయ హితాయ చ ।
పితుర్వాక్యం మయా కార్యం సర్వథా ధర్మమిచ్ఛతా
నాన్యో హి ధర్మః పుత్రస్య పితుర్వాక్యం వినా ప్రజాః ।
మయి దండధరే శాస్తా న యమో భవతి క్వచిత్
ఏవం జ్ఞాత్వా తు యుష్మాభిః స్మర్తవ్యో గరుడధ్వజః ।
బ్రహ్మార్పణప్రయోగేణ యజనీయో జనార్దనః
పితృమార్గాధికో హ్యేష భవతాం దర్శితాః ప్రజాః ।
బ్రహార్పణక్రియా యుక్తా భవంతు జ్ఞానకోవిదాః
న భోక్తవ్యం హరిదినే పైత్రో మార్గస్తు శాశ్వతః ।
విశేషో హి మయాఖ్యాతో భవతాం బ్రహ్మసంస్థితిః
ప్రయోక్తవ్యా చ తత్త్వజ్ఞే పునరావృత్తిదుర్లభా ।
యదుపోష్యం హరిదినం తదవశ్యమితి స్థితిః
అనునీయ ప్రజాస్సర్వా సమాశ్వాస్య పునఃపునః ।
న దివా న చ శర్వర్యాం శేతే ధర్మాంగదస్సదా
సర్వత్ర భ్రమతే శౌర్యా తుర్వన్నిష్కంటకారి క్షితిమ్ ।
పటమారటతే నిత్యం మృగారిరిపుమస్తకే
అభుక్త్యా ద్వాదశీం లోకా మమత్వే న వివర్జితాః ।
త్రివిధేషు చ కార్యేషు దేవేశశ్చింత్యతాం హరిః
హవ్యకవ్యవహాదేవ స్స ఏవ పురుషోత్తమః ।
సూర్యే యో హి కృశాకాశ విసర్గే జగతాం పతిః
స్మర్తవ్యో మనుజై స్సర్యై ర్ధర్మకామార్థకాముకైః ।
స్వజాతివిహితోఽ ప్యేవం సన్మార్గే చైవ మాధవః
స ఏవ భోక్తా భోక్తవ్య స్స ఏవ పురుషోత్తమః ।
వినియోగిస్తు తస్యైవ సర్వకర్మసు యుజ్యతే
ఏవం రటన్తి విప్రేంద్ర పటహే మేఘనిస్స్వనే ।
ఏవం ధర్మ మవాప్యాధ పితా ధర్మాం గదస్య హి
జ్ఞాత్వా పుత్రం క్రియోపేత మాత్మనోహ్యధికం ద్విజాః ।
ఉవాచ భార్యాం సంహృష్ట స్థితాం లక్ష్మీమివాపరామ్
సంధ్యావలి! హ్యహం ధన్య స్త్వంచాపి వరవర్ణినీ ।
ఉభయోర్జనితః పుత్ర శ్శశాంకధవలః క్షితౌ
కర్ణాభ్యాం శ్రూయతే మోక్షో న దృష్టః కేనచిత్క్వచిత్ సోఽస్మాభిరధికంప్రాప్తో మోక్షస్సత్పుత్రసంభవః
పుత్రే వినయసంపన్నే వృత్తశౌర్యసమన్వితే ।
ప్రతాపిని వరారోహే పితుర్మాక్షో గృహెధ్రువమ్
ఆనన్దం బ్రహ్మణో రూపం శతానంద స్సుతేన యః ।
పితా భవతి చార్వంగి సత్కర్మకరణై శ్శుభైః
నైతత్సామ్యం భవేద్దేవి! లోకే స్థావర జంగమే ।
సత్పుత్రః పితురాదాయ భారముద్వహతే తు యః
సోఽహంగమిష్యామి వనాయ హృష్ణో విహార శీలీ మృగహింసనాయ ।
స్వేచ్ఛాచరశ్చాధ విశాల నేత్రే విముక్తపాపో జనరక్షణాయ
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే రుక్మాంగద ధర్మాంగద సంవాదోనామ నవమోఽధ్యాయః.
ధర్మాంగదుడుపలికెను :- ఓ తండ్రీ! మీరు చెప్పిన దంతయూ చేయగలను. మీకునచ్చిన భోగములను అనుభవించుడు. మీరు వహించు రాజ్యభారమును నేను తీసుకొని మా భారమును తొలగింతును. నాకు మీ ఆజ్ఞను పాటించుట కన్నా మరియొక ధర్మము తెలియదు. ఎన్ని ధర్మములనాచరించువాడైననూ పితృవాక్యమును పరిపాలించని వాడు అధోగతిని చెందును. కావున చేతులు జోడించి మీ ఆజ్ఞను పాటింతును. ఇట్లు ధర్మాంగదుడు పలుకగా రుక్మాంగద మహారాజు సంతోషించెను. చాలా మృగములున్న అరణ్యములను తెలుసుకొని వెళ్ళదలచేను. ధర్మాంగదుడు కూడా సంతోషముచే ప్రజలను పిలిచి ఇట్లు పలికెను. మీకు హితమును కూర్చి పరిపాలించమని తండ్రి గారిచే నియమించబడితిని. ధర్మమును కోరి నేను పితృవాక్యపరిపాలన గావించవలయును. ఓ ప్రజలారా! పుత్రునికి పితృవాక్యపరిపాలనను మించిన వేరొకధర్మములేదు. నేను దండధరుడనై పాలించుచుండగా ఎచటా యమధర్మరాజు కనపడకూడదు. ఈ విషయమును తెలిపి మీరు శ్రీహరిని స్మరించవలయును. బ్రహ్పార్పణ విధానముతో జనార్ధనుని పూజించవలయును. మమకారమును విడిచి స్వస్వజాతివిహితములైన ధర్మములననుసరించి పూజించినచో మాలోకములు అక్షయ లోకములు లభించును. ఇది పితృమార్గమునకంటే ఉత్తమమార్గమును మీకు చూపితిని. జ్ఞానకోవిదులందరూ బ్రహ్పారణక్రియలను ఆచరించుడు. హరివాసరమున భుజించరాదు. దీనివలన పితృమార్గము శాశ్వతము కాగలదు. మి బ్రహ్మస్థితిని విశేషముగా సూచించితిని. కావున తత్త్యమును తెలిసినవారు పునరావృత్తి రహితమగు విధానమును అనుసరించుడు. హరివాసరమున తప్పక ఉపవసించవలయును. ఇట్లు ప్రజలందరికి బోధించి వారిని ఓదార్చి పంపెను. ధర్మాంగదుడు రాత్రికాని పగలుకాని నిదురించుటలేదు. తన శౌర్యముతో భూమిని నిష్కంటకముగా చేయుచు అంతటా తిరుగు చుండెను. ఏనుగు కుంభస్థలము పైన భేరిని మ్రోగించుచుండెను. హరీవానరమున భుజించక మమకారరహితులైమనోవాక్కాయకార్యములందు దేవేశుని చింతించు చుండవలయును. శ్రీహరియేహవ్యమును కవ్యములను వహించువాడు. సూర్యోదయకాలమునుండి అన్నికాలములలో శ్రీహరిని స్మరించవలయును. ధర్మార్థకామములను కోరువారందరు శ్రీహరిని స్మరించవలయును. స్వజాతివిహితమగు ధర్మము కూడా నిదియే. ఇదియే సన్మార్గముకూడా. శ్రీమన్నారయణుడే భోక్త. భోగ్యముకూడా ఆపురుషోత్తముడే. సర్వకర్మలలో అతనికే వినియోగమును చేయవలయును. ఇట్లు బ్రాహ్మణోత్తములు భేరిపై చాటించుచుండిరి. ఇట్లు రుక్మాంగదుడు ధర్మాంగదుడాచరించు ధర్మమునుచూచి, క్రియాయుక్తుడగుపుత్రుని చూచి సంతోషముతో అపరలక్ష్మివలె నున్న భార్యను చూచి ఇట్లుపలికెను. ఓ సంధ్యావలీ! నేను ధన్యుడను. నీవు కూడా ధన్యురాలివి. మనిద్దరికి కలిగిన పుత్రుడు ఈ భూమండలమున చంద్రునివలె స్వఛ్ఛ ముగా ప్రకాశించు చున్నాడు. ఇంతవరకు ఎవరైననూ మోక్షమును చేవులతో వినిరే కాని కనులతో చూచియుండలేదు. కాని సత్పత్రుని వలన ఆమోక్షమును మనము పొందగలిగితిమి. పుత్రుడు వినయసంపన్నుడు చక్కని నడవడి శౌర్యము కలవాడు, ప్రతాపము కలవాడైనచో తండ్రికి ఇంటిలోనే మోక్షముకనబడును. ఆనందము బ్రహ్మస్వరూపము. పుత్రునిచే శతానందమును సత్కర్మలను శుభకర్మలను చేయు తండ్రియే పొందును. స్థావర జంగమాత్మకమగు ఈప్రపంచమున తండ్రిభారమును వహించు పుత్రునితో సమానమగునది వేరొకటిలేదు. కావున నేను ప్రజారక్షణకొఱకు పాపవిముక్తుడనై సంతోషముతో మృగములను శిక్షించుటకు విహారశీలినై అరణ్యమునకు వెళ్ళెదను. స్వేఛ్ఛగా అంతటా సంచరించెదను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున రుక్మాంగద ధర్మాంగద సంవాదమను తొమ్మిదవ అధ్యాయము.
Summary of chapter 136 of the Nārada Mahā Purana is as follows:
పరమశివుని దివ్య రాజధానియైన పవిత్ర కాశీక్షేత్ర మాహాత్మ్యము ఈ అధ్యాయంలో అభివర్ణించబడినది. కాశీక్షేత్ర నివాసము, మణికర్ణికా స్నానము మరియు కాశీ విశ్వేశ్వర దర్శనము వలన జీవునికి లభించే తారక బ్రహ్మోపదేశ ముక్తి మహిమ ఇక్కడ నిరూపించబడినది.