నారద మహా పురాణము
68 - గణేశ మంత్ర విధాన నిరూపణమ్
శ్రీ సనత్కుమార ఉవాచ :-
అథ వక్ష్యే గణేశస్య మంత్రాన్సర్వేష్టదాయకాన్,
యాన్సమారాధ్య విప్రేంద్ర సాధకో భుక్తిముక్తి మాన్.
అవ్యయో విష్ణువనితా శంభుస్త్రీ మీన కేతనః,
స్వృతిరాం సేన్లు మన్వాడ్యా సా పునశ్చన్ద శేఖరా.
జేన్తో గణపతి స్తోయం భుజంగో వరదేతి చ,
సర్వాంతో జనముచ్చార్య తతో మే వశమానయ.
వహ్నిః ప్రీయాంలో మంత్రోయమష్టావింశతివర్ణవాన్,
గణక్యోస్య మునిశ్ఛన్లో గాయత్రీ వియదాదికో.
గణేశో దేవతా బీజం షష్టశక్తిస్తదాదికా,
శ్రీమన్మహాగణపతిప్రీతయే వినియోగకః.
ఋషిం శిరసి వక్తీ తు ఛందశ్చ హృది దేవతామ్,
గు హ్యే బీజం పదోశక్తిం న్య సేత్సాధకసత్తమః.
షడ్దర్ర్యాన బీజేన యం చ బీజాదినా పునః,
షడంగాని న్య సేదస్య జాతియుక్తాని మంత్రవిత్.
శైవీ షడంగముద్రాత్ర న్యస్తవ్యా హి షడంగకే,
గామాద్యం చైవ భూర్లోకం నాభ్యంతం పాదయోర్న్య సేత్.
గీమాద్యం చ భువర్లోకం కంఠాంతరనాభితో న్య సేత్,
స్వర్లోకం చైవ గూమాద్యం కంఠాదిమస్తకావధి.
వ్యాపకం మూలమంత్రేణ న్యాస్యోఒయం భువనాభిధః,
మూలమంత్రం సముచ్చార్య మాతృకావర్ణమీరయేత్.
తదంతేపి చ మూలం స్యాన్ని మోంతం మాతృకాష్ఠ,
క్షాంతం విన్యస్య మూలేన వ్యాపకం రచయేత్సుధీః.
వర్ణనాసోయమాఖ్యాతః పదన్యాపస్తథోచ్యతే,
పంచత్రిబాణవ హిందుచంద్రాకినిగమైః క్రమాత్.
విభకైర్మూలగాయత్ర్యా హృదం చైరష్టభిః పదైః,
ఫాలదే ముఖే కండే హృది నాభ్యూరుజానుషు.
పాదయోశ్చెవ విన్యస్య మూలేన వ్యాపకం చరేత్,
వదేత్తత్పురుషాయాంతే విద్మ హేతి పదం తతః.
వక్రతుండాయ శబ్దాంతే ధీమహీతి సమీరయేత్,
తన్నో దంతిః ప్రచోవర్ణా దయాదితి వచేత్సునః.
ఏషోక్తా మూలగాయత్రీ సర్వసిద్ధిప్రదాయినీ,
ఏవం న్యాసవిధిం కృత్వా ధ్యాయేదేవం హృదంబుజే.
ఉద్యన్మర్తాండసదృశం లోక స్థిత్యంతకారణమ్,
సశక్తి కం భూషితాంగం దంతచక్రాద్యుదాయుధమ్.
ఏవం ధ్యాత్వా చతుశ్చత్వారింశత్సాహస్రసంయుతమ్,
చతుర్లక్షం జపేన్మం అష్టద్రవ్యర్థశాంశత: .
జుహుయాద్వీధీవన్మంత్ర సంస్కృతే హవ్యవాహనే,
ఇక్షవస్సక్తవో మోచా ఫలాని చిపిటాస్తిలాః.
మోదకా నారికేలాని లాజాద్రవ్యాష్టకం స్మృతమ్,
పీఠమాధార శక్త్యాది పరతత్త్వాంతమర్చయేత్.
శ్రీ సనత్కుమార మహర్షి పలికెను :- సకలాభీష్టదాయకములగు గణేశ మంత్రములను ఇపుడు చెప్పెదను. ఈ మంత్రములను ఉపాసన చేసి సాధకుడు భుక్తి ముక్తులను పొందును. అవ్యయుడు, లక్ష్మి, పార్వతి, మన్మధుడు, స్మృతి,చంద్రుడు, మనువు సహితయైన దేవత చంద్ర శేఖర జేస్తము గణపతి, తోయము, భుజంగుడు, వరణి . అని సర్వాంతమున జనమునుచ్చరించి తరువాత నావశమునకు తెమ్ము ఈ మంత్రము ఇరువది యెనిమిది అక్షరములు కలది. ఈ మంత్రములకు ముని గణకుడు. గాయత్రీ ఛందస్సు గణేశుడు దేవత. షష్ణ శక్తి బీజము. శ్రీ మన్మహాగణపతి ప్రీతికి వినియోగము. శిరస్సున ఋషిని వక్రమున ఛందస్సు, హృదయమున దేవతను, గుహ్యమున బీజమును, పాదములయందు శక్తిని న్యాసము చేయవలయును. షడ్జీర్జాడ్య బీజముతో 'యం'ను బీజాదిచే జాతియుక్తములగు షడంగములను న్యాసము చేయవలయును. షడంగములయందు శైవ షడంగముద్రను ఉంచవలయును. మొదట భూలోకమును గామాదీగా నాభ్యన్తముగా పాదములయందు ఉంచవలయును. గీం ఆదిగా భువర్లోకమును నాభినుండి కంఠాంతము వరకుంచవలయును. గూం ఆదిగా స్వర్లోకమును కంఠాదిమస్త కొవధిగా నుంచవలయును. వ్యాపకమును మూలమంత్రముచే న్యాసము చేయవలయును. ఈ న్యాసమును భువనన్యాస మందురు. మూలమంత్రము నుచ్చరించి మాతృకావర్ణమునుచ్చరించవలయును. తగంతమున మరల మూలమంత్రముండవలయును. మాతృకాస్థలమున నమోంతముగా పలుకవలయును. మూలమంత్రముచే కాంతముగా నయాసము చేసి వ్యాపకమును రచించవలయును. దీనిని వర్ణన్యాసమందురు. ఇక పదన్యాసమును చెప్పెదను. పంచ, త్రి, బాణ, వహీన్లు చంద్రాకి నిగమములతో క్రమముగా విభాగము చేసి మూలగాయత్రిచే హృదంతముగా అష్టపదములతో ఫాలదేశమున, ముఖమున కంఠమున, హృదయమున, నాభిలో, ఊరువులలో జానువులలో, పాదములలో నుంచి మూలమంత్రముచే వ్యాపకమును ఆచరించవలయును. “తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నో దంతిః ప్రచోదయాత్” ఇది సర్వ సిద్ధి ప్రదాయిని యగు మూలగాయత్రి. ఇట్లు న్యాసవిధిని పూర్తి చేసి, దేవుని హృదయపద్మమున ధ్యానము చేయవలయును. ఉదయంచు సూర్యుని కాంతిగల, లోకరక్టోసంహార కారణుడగు, శక్తితో కూడియున్న, భూషణ ధారియగు, శంఖచక్రాద్యాయుధములను ధరించిన దేవుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానము చేసి మంత్రమును నాలుగు లక్షల ఇరువది నాలుగు వేల మార్లు జపించవలయును. తరువాత అష్టద్రవ్యములతో దశాంశము సంస్కరించిన అగ్నిహోత్రమున హోమము చేయవలయును. ఇకువు, సకు, అరటిపండ్లు, చిపీటములు, తీలలు, మోదకములు, నారీ కేలములు, పేలాలు అనునవి అష్టద్రవ్యములు. పీఠమును, ఆధారశక్తినుండి పరతత్త్వాంతము వరకు అర్పించవలయును.
షట్కోణాంతస్త్రికోణం చ బహిరష్టతలం లిఖేత్,
భూపురం తద్బహిః కృత్వా గణేశం తత్ర పూజయేత్.
తీవ్రఖ్యా జ్వాలినీ నందా భోగదా కామరూపిణీ,
ఉగ్రా తేజోవతీ సత్యా నవమీ విఘ్ననాశినీ.
సర్వాది శక్తి కమలాసనాయ హృదయాంతకః,
పీఠమంత్రయమేతేన దద్యాదాసనముత్తమమ్.
తత్ర వాహ్య గణాధీశం మధ్యే సంపూజ్య యత్నతః,
త్రికోణబా హ్యే పూర్వాదిచతుర్ధకర్చయేతమాత్.
శ్రియం శ్రియః పతిం చైవ గౌరీం గౌరీపతిం తధా,
రతిం రతిపతిం పశ్చాత్ మహీపూర్వం చ పోత్రిణీమ్.
క్రమాదిలవటాశ్వత్థప్రీయంగూనామథో రచయేత్,
రమా పద్మద్వయకరా శంఖచక్రధరో హరః.
గౌరీపాశాంకుశధరా టంకశూలధరో హరః,
రతిః పద్మకరా పుష్పబాణచాపధరస్స్మరః.
శూకద్రోహ్యగ్రహస్తా భూ పోత్రీ చక్రగదాధరః,
దేవాగ్రే పూజయేల్లక్ష్మీసహితం తు వినాయకమ్.
పూజయేత్సట్సు కోణేషు హ్యామోహిద్యానియాయుతాన్,
ఆమోదం సిద్ధిసంయుక్తమగ్రతః పరిపూజయేత్.
ప్రమాదం చాగ్నికోణే తు సమృద్దిసహితం యజేత్,
ఈశకోణే యజేత్కీర్తిసంయుతం సుముఖం తథా.
వారుణే మదనావత్యా సంయుతః దుర్ముఖం యజేత్ ,
యజేన్నెఋత్యకోణే తు విఘ్నం మదద్రవాయుతమ్.
ద్రావిణ్యా విఘ్నకర్తా కవాయుకోణే సమర్చయేత్,
పాశాంకుశాభయకరింస్తరుణారసమప్రభాన్.
కపోలవిగలద్దానగంధలుబ్దాలిశోభితాన్,
షట్కోణాభయపార్శ్వేతు శంఖపద్మ నిభౌ క్రమాత్.
సహితా నిజశక్తి భ్యాం ధ్యాత్వా పూర్వవదర్చయేత్,
కేశ రేషు షడంగాని పత్రేష్వష్టా తు మాతరః.
ఇంద్రాద్యానపి వజ్రాదీన్పూజయేద్ధరిణీ గృహీ ఏవమారాధ్య విఘ్నేశం సాధయేత్స్వమనోరధాన్.
చతుశ్చద్వారింశతాఢ్యం చతుశ్శతమతంద్రితః,
తర్పయేదంబుభిశ్శుద్ధిర్గజాస్యం దినశస్సుధీః.
పద్మేస్తు వశయేద్భూపాన్ తత్పత్నీ శ్చతలైస్తథా కుముదైర్మంత్రిగ్యోశ్వఛసమీర్ధిర్వాడవాష్శుభైః.
ఉదుంబరోత్తైర్మపతీన్వెశ్యానక్షసముద్భవైః,
వటోద్భవైస్సమిద్భిశ్చ వశయేదంతిమానుధః.
ఆజ్యేన శ్రియమాప్నోతి స్వర్గాప్తిర్మధునా భవేత్,
గోదు గ్ధేన గవాం లాభో దధ్నా సర్వసమృద్ధిమాన్.
అన్నాప్తిరన్నహోమేన సమీద్ధి ర్వేతసాం జలమ్,
వాసాంపీ లభతే హుత్వా కుసుంభకుసుమైశ్శుభైః.
షట్కోణము లోపల త్రికోణమును, బయట అష్టదళమును లిఖించవలయును. దాని వెలుపల భూపురము నేర్పరిచి అచట గణేశునని పూజించవలయును. తీవ్రా, జ్వలిని, నందా, భోగదా, కామరూపిణి, ఉగ్రా, తేజోవతీ, సత్యా, విఘ్ననాశినీ అని తొమ్మిది శక్తులు. సర్వాది శక్తి కమలాసనాయ హృదయాంతీకః” అనునది పీఠమంత్రము. ఈ మంత్రముచే ఉత్తమాసనమునర్పించవలయును. ఆ ఆసనము పై గణేశుని ఆవాహించి, మధ్యభాగమున ప్రయత్నపూర్వకముగా పూజించవలయును. త్రికోణ బహిర్భాగమున క్రమముగా పూర్వాదిదిక్పతుష్టయమున అర్పించవలయును. లక్ష్మీదేవిని, లక్ష్మీపతిని, పార్వతిని, పార్వతీ పతిని, రతిని, రతీపతిని, మహాదేవిని, పోత్రిని క్రమముగా బిల్వవట, అశ్వత్త, ప్రియంగు వృక్షముల క్రింద ఆర్పించవలయును. లక్ష్మీదేవి రెండు పద్మములను ధరించి, శ్రీహరి శంఖ చక్రములను ధరించి, పార్వతి దేవి పాశాంకుశములను ధరించి. శివుడు టంకశూలములనుధరించి, రతి పద్మమును మన్మధుడు పుష్పబాణ చాపములను, భూమి శూక ద్రోహులను, పోత్రి చక్రగదలను ధరించి యుండును. దేవాగ్ర భాగమున లక్ష్మీసహితమగు వినియకుని పూజించవలయును. ఆరుకోణములయందు ప్రియాసహితులగు ఆమోదాదులను పూజించవలయును. సిద్దితో కూడి యున్న ఆమోదుని మొదట పూజించవలయును. ఆగ్నేయ కోణమున సమృద్ధి సహితుడగు ఆమోదుని పూజించవలయును. ఈశాన్యకోణమున కీర్తి సహితుడైన సుముఖుని పూజించవలయును. పశ్చిమభాగమున మదనోవతితో కూడియున్న దుర్ముఖుని, నైఋతి దిగ్పాగమున మదద్రపోయుతుడగు విఘ్నుని, వాయవ్యభాగమున ద్రావిణితో కూడిన విఘ్నకర్తను పూజించవలయును. పాశాంకుశ అభయకరులను, తరు భాస్కర సమతేజులను, గండస్థలములనుండి స్రవించుచున్న మదజలమునందలి ఆశతో వచ్చు తుమ్మెదలచే శోభించు వారిని పూజించవలయును. షట్కోణమునకు రెండు పార్శ్వములందు క్రమముగా నిజశక్తులతో కూడియున్న శంఖపద్మ నిధులను పూజించవలయును. కేశరములందు షడంగములను, పత్రములందు అష్టమాతృకలను ఇంద్రాదులను వజ్రాదులను భూగృహమునందు పూజించవలయును. ఇట్లు విఘ్నేశుని ఆరాధించి తన మనోరధములను సాధించుకొనవలయును. గజముఖుని నాలుగు వందల నలభై నాలుగు మార్లు శుద్ధ జలములతో తర్పణ చేయవలయును. పద్మములతో రాజులను, వారి పత్నులను కలువలతో, కుముదములతో మంత్రులను, శుభకరములగు అశ్వత్తసమిధలచే సేనానాయకులను వశము చేసుకొనవలయును. మేడి సమిధలచే రాజులను, జువ్విసమిధలచే వైశ్యులను, మజ్జి సమిధలచే అంత్యజులను వశము చేసుకోనవలయును. నేతితో హోమము చేసినచో సంపదలను, తేనెతో చేసినచో సువర్ణము, ఆవుపాలతో గోవులు, పెరుగుతో చేసిన చో సర్వసమృద్దులు కలుగును. అన్నహోమముచే అన్నము, వేతస సమిధలచే జలము, కుసుంభ కుసుమములచే హోమము చేసినచో వస్త్రములు లభించును.
అథ సర్వేష్టదం వక్ష్యే చతురావృత్తితర్పణమ్,
మూలేనాదౌ చతుర్వారం ప్రత్యేకం చ ప్రతర్పయేత్.
పూర్వమంత్రాక్షరైర్మంతై స్వాహాంతైశ్చ చతుశ్చతుః,
మూలమంత్రైశ్చతుర్వారపూర్వకం సంప్రతర్పచ.
మిధునాదీంస్తతః పశ్చాత్పూర్వవత్సంప్రతర్పయేత్,
దేవేన సహితాం శక్తిం శక్త్యా న సహితం తు తమ్.
ఏవం చ షడ్వింశతిధా మిధునాని భవంతి హి,
స్వనామాద్యర్ణబీజాని తాని సంతర్పయేత్క్రమాత్.
భవేత్సంభూయాస చతుశ్చత్వారింశచ్చతుశ్శతమ్,
ఏవం సంతర్ప్య తత్పశ్చాత్పూర్వవత్సపచారకైః.
సర్వాభీష్టం చ సంప్రార్ధ్య ప్రణమ్యోద్వాసయేత్సుధీః,
భాద్రకృష్ణచతుర్ధ్యాదిప్రతిమాసమతంద్రితః.
ఆరభ్యారోదయం మంత్రి యావచ్చంద్రోదయో భవేత్,
తావన్నోపవి శేద్భూమౌ జితవాకిరమానసః.
తతశ్చన్రోదయో మంత్రే పూజయేద్గణనాయకమ్,
పూర్వోక్తవిధినా సమ్యక్ నానాపుష్పోపహార కై:.
ఏకవింశతిసంఖ్యాకాన్నోదకాంశ్చ నివేదయేత్,
తదగ్రే ప్రజ పేన్మస్త్రమష్టోత్తరసహస్రకమ్.
తతః కర్పూరకాశ్మీరరక్తపు షెస్స చన్దనైః,
ఆర్ఘ్యం దద్యాత్తు మూలాంతే జేస్తే గణపతిం తతః.
ఇదమర్ఘ్యం రికల్పయామి హృదంత్యోక్ష్యమనుర్మతః,
సుత్వా నత్వా విసృజ్యాథ యజేచ్చన్తమసం పునః.
అర్ఘ్యం దద్యాచతుర్వాంగం పూజయిత్వా గురుం తతః,
నివేదితేషు విప్రాయ దద్యాదరాంశ్చ మోదకాన్.
స్వయమర్ధానభుంజీత బృహ్మ చారీ జితేంద్రియః,
ఏవం వ్రతం సః కురుతే సమ్యకృంవత్సరావధి.
పుత్రానౌత్రాన్సుఖం విత్తమారోగ్యం లభతే నరః,
సూర్యోదయాదశక్త శ్చేదస్తమారభ్య మంత్రవిత్.
చంద్రోదయాంతే పూర్వోక్తవిధినా వ్రతమాచరేత్,
ఏవం కృత్యేఒపి పూర్వోక్తం ఫలమాప్నోతి నిశ్చితమ్.
గణేశప్రతిమాం దంతి దంతేన కపినాపి వా,
గజభగ్నేన నింబేన సితార్కెణాధవా పునః.
కృత్వా తస్యాం సమావాహ్య ప్రాణస్థాపనపూర్వకమ్,
ఆభ్యర్య విధివన్మంత్రి రాహుగ్ర స్తే నిశాకరే.
స్పృష్ట్వా చైవ నిరాహారస్తాం శిఖాయాం సముద్వహన్,
ద్యూతే వివాదే సమరే వ్యవహారే జయం లభేత్.
బీజం వరాహో బింద్వాద్యౌ మన్వింద్వాగ్నౌ కలౌ తతః,
స్మృతిర్మా సేన్గుమన్వాగ్రాకర్లోచ్చిష్టగణే వదేల్.
బకస్సదీర్ఘపవనో మహాయజ్ఞాయ యంబలి,
బలిమంత్రోయమాభ్యాతో నచేద్వ్య ఒఖిలేష్టదః.
ప్రణవో భువనేశానీ స్వబీజాంతే నవార్ణకః,
హస్తీతి చ పిశాచీతి లిఖేచ్చేవాగ్నిసుందరీ.
నవార్ణోయం సముద్దిష్ణో భజతాం సర్వ సిద్ధిదః,
పదైస్సర్వేణ మంత్రేణ పంచాంగాని ప్రకల్పయేత్.
అన్యత్సర్వం సమాననం స్యాత్పూర్వమంత్రేణ నారద,
అథాభిధా స్యే విధివద్వక్రతుండమనుత్తమమ్.
ఇపుడు సర్వాభీష్టప్రదమగు చతురావృత్తితర్పణవిధానమును చెప్పెదను. మొదట మూలమంత్రముచే ఒక్కోదానికి నాలుగుమార్లు తర్పణమును చేయవలయును. పూర్వమంత్రాక్షరములచే స్వాహాంత మంత్రములచే నాలుగు నాలుగుమార్లు, మూలమంత్రములచే నాలుగుమార్లు తర్పణము గావించి, తరువాత మిధునాదులను పూర్వమువలె తర్పణము గావించవలయును. దేవునితో కూడియున్న శక్తిని, శక్తి చే కూడి యున్న దేవుని ఇట్లు ఇరువది యారు విధములుగా మిధునములగును. తన నామాద్యాకర బీజములను క్రమముగా తర్పణము గావించవలయును. ఇట్లన్నియూ కలిసి నాలుగు వందల నలుబదినాలుగు యగును. ఇట్లు సంతర్పణముగావించిన తరువాత పూర్వము వలే ఉపచారములతో సర్వాభీష్టప్రదుడగు దేవుని నమస్కరించి ఉద్వాసన గావించవలయును. భాద్రపద బహుళ చతుర్థి నుండి ప్రతిమాసమున ఏమరుపాటు లేక సూర్యోదయమున ప్రారంభించి చంద్రోదయము వరకు, భూమి పై కూర్చొనక ఇంద్రియజయముకలవాడుగా సావధాన మనస్కునిగా నుండవలయును. చంద్రోదయమైన తరువాత గణనాయకుని పూజించవలయును. పూర్వోక్తవిధి ననుసరించి నానాపుషోపహారములతో పూజించి ఇరువది యొకటి మోదకములను నివేదన చేయవలయును. తరువాత ఇరువది యెనిమిది వేలమార్లు మంత్రమును జపించవలయును. తరువాత కర్పూర కాశ్మీర పుష్ప చందనములచే గణపతికి మూలాంతమున జేన్తమున అర్ఘ్యమునీయవలయును. ఇదమర్యం కల్పయామి హృదంత? అనునది అర్ఘ్యమంత్రము. ఇట్లు స్తోత్రము గావించి నమస్కరించి తరువాత చంద్రుని పూజించవలయును. తరువాత గురువును పూజించి నాలుగుమార్లు అర్యము నీయవలయును. నివేదన చేసిన మోదకములలో సగము మోదకములను బ్రాహ్మణుల కీయవలయును. తాను జితేంద్రియుడై, బ్రహ్మ చర్యముతో మిగిలిన సగము మోదకములను భుజించవలయును. ఇట్లు ఒక సంవత్సరము వ్రతము నాచరించువాడు పుత్ర పౌత్రులను, సుఖమును, ధనమును, ఆరోగ్యమును పొందును. సూర్యోదయము నుండి చేయగల శక్తి లేనిచో సూర్యాస్తమయమున ప్రారంభించి చంద్రోదయము వరకు పూర్వోక్త విధిననుసరించి ప్రతము నాచరించవలయును. ఇట్లు చేసినను పూర్వోక్తఫలము లభించును. ఏనుగు దంతముతో కాని, బంగారముతో కాని, యేనుగు భంగపరిచిన నింబముతో కాని, చెండితోకాని గణేశప్రతిమను చేసి, ప్రాణప్రతిష్ట చేసి గణేశుని ఆవాహించి విధి విధానముగా పూజించి చంద్రగ్రహణ సమయమున నిరాహారుడై స్పంచి శిఖలో ధరించినచో ద్యూతమున, వివాదమున, యుద్ధమున వ్యవహారమున జయము లభించును. వరాహబీజము బిందుసహితములగు మన్వింద్వాన్నములు కళలు, స్మృతి, మా సేందు, మన్వాగ్రములు గర్లోచ్చిష్ట గణమున చెప్పబడవలయును. బకస్పదీర్ఘపవనో మహాయకాయ యం బలి?” అనునది ఐటీ మంత్రము. ఇట్లు లేనిచో వర్ణము అఖిలేష్టదముకాదు. ప్రణవము భువనేశ్వరి, స్వఓజాంతమున నవాక్షరి హస్తి పిశాచి అగ్ని సుందరి అని వ్రాయవలయును. ఈ నవాక్షరమంత్రము సేవించు వారికి సర్వాభీష్ట ప్రదము. పదములతో సమగ్ర మంత్రముతో పంచాంగములను కల్పించవలయును. మిగిలినదంతయూ పూర్వ మంత్రముతో సమానముగా నుండును. ఇపుడు సాటిలేని వక్రతుండ విధానమును చెప్పెదను.
తోయం విధిర్వహ్నియుక్తకర్ణేన్హాడ్యో హరిస్తథా,
సదీర్ఘోదారకో వాయుర్వర్మంతోయం రసార్ణకః.
భార్గవోస్యమునిశ్చన్దనుష్టుజ్జీవో గణాధిపః,
వక్రతుండాభిధో బీజం వం శక్తిః కవచం పునః.
తారహృన్మధ్య గైర్మన్తవర్ణాశ్చన్దవిభూషితైః,
కృత్వా షడంగమంత్రార్గానూమధ్యే చ గలే హృది.
నాభౌ లింగే పదే న్యస్యాఖిలేన వ్యాపకం చరేతం,
ఉద్యదరద్యుతిం హస్తిః పాశాంకుశవరా భయాన్.
దధతం గజవక్తం చ రక్తభూషాంబరం భజేత్,
ధ్యాల్వెవం ప్రజ పేత్తర్క లక్షం ద్రవ్యెర్థశాంశతః.
అష్టభీర్జుహుయాతీరే తీవ్రాదిసహితేర్పయేత్,
మూర్తిం మూర్తైన సంకల్ప్య తస్యామావాహ్య పూజయేత్.
నిధి ప్రదీపాం పాపఘ్నీం పుణ్యాం పశ్చాచ్ఛశిప్రభామ్,
దలాగ్రేషు వక్రతుండ ఏకదంష్ట్ర మహోది.
నిధిప్రదీపాం పాపఘ్నీం పుణ్యాం పశ్చాచ్ఛనిప్రభామ్,
ద గ్రేషు వక్రతుండ ఏకదంష్ట్రమహోది.
గజాస్యలంబోదరకే వికటో విఘ్నరాట్ తథా,
ధూమ్రవర్ణస్తతో బాహ్యా లో కేశాశ్లేతిసంయుతాన్.
ఏవమావరణెరిష్ట్వా పంచభిర్గణనాయకమ్,
సాధయేదభిలాన్కామాన్వక్రతుండప్రసాదతః.
లబ్లాగురుముఖాన్మస్త్రం దీక్షాసంస్కారపూర్వకమ్,
బ్రహ్మ చారీ హవిష్యాకీ సత్యవాక్ చ జితేంద్రియః.
జ పేదరసహస్రం తు షణ్మాసం హోమసంయుతమ్,
దారిద్ర్యం తు పరాభూయ జాయతే ధనదోపమః.
చతుర్ద్యాది చతుర్ధ్యస్తం జ పేదయుతమాదరాత్,
అష్టోత్తరశతం నిత్యం హుత్వా ప్రాగ్వత్పలం లభేత్ .
పక్షయోరుభయోర్మంత్రీ చతుర్ధ్యాం జుహుయాచ్చ తమ్,
అపూ పైర్వత్సరే సస్యాత్ సమృద్ధేః పరమం పదమ్.
అంగారకచతుర్డ్యాం తు దేవమిషా విధానతః,
హవిషా పాయసాన్నేన నైవేద్యం పరికల్పయేత్.
తతో గురుం సమభ్యర్య భోజయేద్విధావత్సుధీః,
నివేదితేన జుహుయాత్సహస్రం విధివద్వనీ.
ఏవం సంవత్సరం కృత్వా మహతీం శ్రీయమాప్నుయాత్,
అథాన్యత్సాధనం వక్ష్యే లోకానాం హితకామ్యయా.
జలము బ్రహ్మ అగ్నితో చంద్రునితో శ్రీహరి, సదీరడగు దారకుడు, వాయువు వర్మాంతముగా నుండునది ఇది ఆరక్షరములు కలది. ఈ మంత్రములకు మునీ భార్గవుడు. అనుష్టుప్ ఛందస్సు. దేవత గణాధిపుడు. వక్రతుండనామక బీజము. వం అనునది శక్తి కవచము. తార హృదయ మధ్యగతములగు చంద్ర భూషితములగు మంత్ర వర్ణములచే షడంగన్యాసము చేసి మన్తవర్ణములను భ్రూమధ్యమమున, కంఠమున, హృదయమున, నాభియందు, లింగమునందు, పదమునందుంచి, అబలముచే వ్యాపకము నాచరించవలయును. ఉదయుంచుచున్న సూర్యకాంతి గల, హస్తములందు పాశాంకుశవరాభయములను ధరించియున్న, రక్తభూషాంబరుడు అగు గజవక్తుని సేవించవలయును. దశాంశను అష్టద్రవ్యములచే బోమము చేయవలయును. తీవ్రాదులతో కూడియున్న పీఠమున అర్చించవలయును. మూర్త ముచే మూర్తిని సంకల్పించి ఆ మూర్తియందు ఆవాహన చేసి పూజించవలయును. షట్ కోణములందు షడంగములు, పత్రములందు అష్ట శక్తులుండును. విద్యను విధాత్రిని, భోగదము, విప్రఘాతినిని, నిధిప్రదీపను, పాపఘ్సిని, పుణ్యను, శశిప్రభను, పూజించవలయును. దళాగ్రములందు వక్రతుండ, ఏకదంష్ట్ర,మహోదర, గజాస్య, లంబోదర, వికటి, విఘ్నరాట్ ధూమ్రవర్లులను పూజించవలయును. తరువాత బాహ్యభాగమున ఆయుధ దారులగు లోకపాలకులను పూజించవలయును. ఇట్లు ఆవరణములలో పూజించి అయిదుగురిలో గణనాయకుని పూజించినవారు వక్రతుండుని అనుగ్రహమువలన అన్ని కోరికలను తీర్చుకొనగలుగుదురు. దీక్షాసంస్కార పూర్వకముగా గురు ముఖముగా మంత్రమును పొంది, బ్రహ్మచారియై, హవిస్సును మాత్రమే భుజించుచు, సత్యవాక్కు, జితేంద్రియుడుగానుండి పన్నెండుచేలు ఆరు నెలలు హోమము చేయుచు జపించవలయును. అట్లు చేసినచో దారిద్ర్యము తొలగిపోయి కుబేరుడంతటి ధనవంతుడు కాగలడు. చతుర్థి నుండి చతుర్థి వరకు ఆదరముతో పది వేలు జపించవలయును. ప్రతిదినము అష్టోత్తరశతము హోమము చేయవలయును. ఇట్లు చేసిననూ పూర్వము వలె ఫలము లభించును. శుక్ల కృష్ణపక్షములలోని చతుర్దతిథిలో నూరు పర్యాయములు హోమమును అపూపములతో ఒక సంవత్సరము హోమము చేసినచో సర్వసమ్పద్దులు లభించును. అంగారకచతుర్దిన విధివిధానముగా దేవుని పూజించి హవిస్సును, పాయసాన్నమును నివేదన చేసి, తరువాత గురువును పూజించి హవిస్సును, పాయసాన్నమును నివేదన చేసి, తరువాత గురువును పూజించి భోజనము చేయించవలయును. నివేదిత ద్రవ్యముతో వేయి హోమమును గావించవలయును. ఇట్లు ఒక సంవత్సరము చేసినచో గొప్పసంపదలను పొందును. ఇపుడు లోకముల హితమును కోరి మరియొక సాధకమును చెప్పెదను.
ఇష్ట్వా గణేశం పృధుకైః పాయాసాపూపమోదకైః,
నానాఫలైస్తతో మంత్రి హరిద్రా మధ సైంధవమ్.
వచాం నిష్కార్ధభాగం చ తధర్థం వా మనుం జపేత్,
విశోధ్య చూర్ణం ప్రసృతా గవాం మూత్ర వినిక్టి పేత్.
సహస్రకృత్వో మనునాం మన్తయిత్వా ప్రయత్నతః,
స్నాతాం ఋతుదినే శుద్ధాం శుక్లాంబరధరాం శుభమ్.
దేవస్య పురతస్టాప్య పాయయేదౌషధం సుధీః,
సర్వలక్షణసంపన్నం వంధ్యాపీ లభతే సుతమ్.
అథాన్యత్సంప్రవక్ష్యామి రహస్యం పరమాద్భుతమ్,
గోచర్మమాత్రాం ధరణీముపలిప్య ప్రయత్నతః.
వికీర్య ధాన్యప్రకరైస్తత్ర సంస్థాపయేర్ఘటమ్,
శుద్దోదకేన సంపూర్య తస్యోపరి నిధాపయేత్.
కపిలాజ్యేన సంపూర్ణం శరావం నూతనం శుభమ్,
షడష్టాక్షరమంత్రాభ్యాం దీపమారోపయేచ్ఛుభమ్.
దీపే దేవం సమావాహ్య గంధపుష్పాదిభిర్యజేత్,
స్నాతాం కుమారీమథవా కుమారం పూజయేత్సుధీః.
దీపస్య పురతస్ధాప్య ధ్యాత్వా దేవం జపేన్మనుమ్,
ప్రదీ పే స్థాపితే పశ్యేద్ద్విజరూపం గణేశ్వరమ్.
పృష్టస్తతస్సంపది వా నష్టం చైవాస్యనాగతమ్,
సకలం ప్రవదేదేవం కుమారీ వా కుమారకః.
షడక్షరో హృదంతశ్చేద్భ వేదష్టాక్షరో మనుః,
అన్యేపి మంత్రి దేవర్షే సంతి తండ్రీ గణేశితుః.
కింత్వత్ర యన్న సాధ్యం స్యాత్తీషులో కేషు సాధకైః,
అష్టావింశరసార్ణాభ్యాం తన్నపశ్యేదపి క్వచిత్.
ఏతద్గణేశమంత్రాణాం విధానం తే మయోచితమ్,
శరేభ్యః పరః ష్యేభ్యో వంచకేభ్యోఒపి మా వద.
ఏవం యో భజతే దేవం గణేశం సర్వసిద్ధిదమ్,
ప్రా ప్యేహా సకలానోగానంతే ముక్తిపదం వ్రజేత్.
ఇతి శ్రీబృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే గణేశమంత్ర విధాన నిరూపణం నామ అష్టషష్టితమోధ్యాయః.
గణపతిని అటుకులచే పొయసాపూపమోదకములచే హోమము చేసి నానాఫలములతో కూడా యజించి తరువాత మంత్రము తెలిసిన వాడు పసుపును ఉప్పును శుద్ధిచేసి ప్రసృతీయందు చూర్ణము చేసి, మంత్రాక్షరముల సంఖ్యలో సగభాగమును కాని, దానిలో సగభాగమును కొని మంత్రమును జపించవలయును. చూర్ణమును గోమూత్రమున నుంచవలయును. అట్లు ఉంచిన దీనిని వేయిసార్లు ప్రయత్నముతో మంత్రములో మంత్రించి, ఋతుదినమున స్నానము చేసి పరిశుద్ధురాలై శుక్లాంబరధర, శుభయగు స్త్రీని గణేశుని ముందు కూర్చుండ బెట్టి ఆ యౌషధమును త్రాగించవలయును. అట్లు చేసినచో గొడ్రాలు కూడా కొడుకును పొందును.మరియు పరమాద్భుతము పరమరహస్యమగు మరియొక సాధనమును చెప్పెదను వినుము. గోచర్మమాత్రమును భూమిని శ్రద్దగా అలికి దాని పై ధాన్యజాలమును చల్లి, అచట ఘటము నుంచవలయును. ఆ ఘటమును శుద్దోదకముతో నింపవలయును. ఆ ఘటము పై కొత్తది శుభకరమగు మూకుడును (మట్టిచిప్ప) కపిలగోవు నేతితో నిండుగా నుంచీ, షడక్షర మంత్రముతో కాని అష్టాక్షర మంత్రముతో కాని దీపమును వెలిగించవలయును. ఆ దీపమున గణేశుని ఆవాహన చేసి గంధపుష్పాదులతో పూజించవలయును. స్నానము చేసిన కుమారిని కాని, కుమారుని కొని పూజించవలయును. కుమారిని లేదా కుమారుని దీపము ముందు కూర్చుండబెట్టి, గణేశుని ధ్యానించి మస్త్రమును జపించవలయును. దీపము నుంచిన తరువాత గణేశుని ద్విజరూపునిగా చూడవలయును. అడిగినపుడు సంపదలో కొని, నశించిన దానిని లభించని దానిని గూర్చి, కుమారి కాని కుమారుడు కాని ఇట్లు చెప్పవలయును. షడక్షరము హదంతమైనచో అష్టాక్షరమగును. గణేశ తంత్రమున ఇతర మంత్రములు కూడా కలవు. కాని మూడు లోకములలోని సాధకులకు సాధ్యము కాని ఇరువది యెనిమిది అక్షరముల, షడక్షరముల మంత్రములను ఎపుడూ చూడరాదు. ఇట్లు గణేశ మన్త విధానమును చెప్పితిని. శఠులకు, పరశిష్యులకు వంచకులకు దీనిని చెప్పరాదు. ఇట్లు సర్వసిద్ధిప్రదుడగు గణేశుని సేవించువాడు ఇహమున సకల భోగములను పొంది అంతమును మోక్షమును పొందును.
ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున గణేశమంత్రవిధాననీరూపణమను ఆరువది ఎనిమిద - అధ్యాయము
Summary of chapter 69 of the Nārada Mahā Purana is as follows:
మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుని పరమ పావన మంత్రోపాసనా విధి ఈ అధ్యాయంలో వర్ణించబడినది. శ్రీరామ తారక మంత్ర జపము, రామయంత్ర స్థాపన మరియు భక్తిపూర్వక పూజ వలన భవబంధ విముక్తి సిద్ధించునని అభివర్ణించబడినది.