26 - అధ్యాయము

రాజోవాచ :-

కీర్తి ర్నశ్యతు మే పుత్ర హ్యనృతీ వా భవామ్యహమ్

 గత వా నరకం ఘోరం కధం భోక్ష్య హరేర్దినే

బ్రహ్మణో నిరయం యాతు దేవీయం మోహినీ సుత !

 భూయో భూయో వదతి మాం దుర్మేధాశ్చ సుబాలీశా

నాపరం కామయే రాజ్యం వసుధాం వసు కించన

ముక్తైకం వాసరే విష్ణో రోజనం పాపనాశనే

యద్యహం కుత్సితాం యోనిం వ్రజేయం క్రిమి సంజ్ఞితామ్

తధా పి నైవ కర్తాహం భోజనం హరివాసరే

ఏషా గురుతరా భూత్వా లోకానాం శిక్షయాన్వితా

దుందుభీ కుర్వతీ నాదం సా కధం వితధా భవేత్

అభక్ష్య భక్షణం కృత్వా అగమ్యాగమనం తధా

అపేయం చైవ పీత్వాతు కిం జీవేచ్ఛర దశ్శతమ్

అసత్యం వాపి కృత్వాహం త్యక్త్వ రాజ్యనయః క్షితౌ

ధిక్కృతోఽపి జనైస్సర్వై ర్న భోక్ష్యే హరి వాసరే

వియోగే చపలాపాంగ్యా యది చేన్మరణం మమ

తచ్చాపి వరమే పాత్ర నభోక్ష్యే హరి వాసరే

కథం హర్ష మహం కర్తా మార్తండ తనయస్య వై

ప్రజద్భి ర్మనుజై ర్మార్గె నిరయస్యాతి దుఃఖితైః

యాస్తు శూన్యాః కృతాస్తాత! మయా నరక పంక్తయః

జనైః పూర్ణా భవిష్యంతి మయి భుక్తేతు తాస్సుత

మాస్మ సీమంతినీ పుత్ర కుక్షౌ సంధారయే త్సుతమ్

సమర్దో యస్తు శత్రూణాం హర్షం సంజనయే దువి

భోజనం వాసరే విష్ణోః ఏతదేవ హి యాచతే

తన్నదాస్యామి మోహిన్యా యాచితో2పి సురాసురైః

పిబేద్విషం విశేద్వహ్నిం నిపతే త్పర్వ తాగ్రతః

ఆకాశ భాసాస్వశిరశ్చింద్యాదేవ వరాసినా

న భోక్ష్యతే హరిదినే రాజా రుక్మాంగదః క్షితౌ

రుక్మాంగదేతి మన్నామ ప్రసిద్దం భువనత్రయే

ఏకాదశ్యుప వాసేన తన్మయా సంచితం యశః

సకధం భోజనం కృత్వా నాశయే స్వకృతం యశః

ప్రియతే యదివా గచ్ఛతి నిపతతి నశ్యచ్చ ఖండవాపి

విరమతి తదపిన చేతో మామకమితి మోహినీ హాతో

పరిత్యజామ్యేష నిజం హి జీవితం లోకైస్సమేత సహదార భృత్యైః

నవ్వేవ కుర్యాం మధుసూదనస్య దినే సుపుణ్యేఽన్న నిషేవణం హి

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే షడ్వింశ్వోఽధ్యాయః.

రుక్మాంగద మహారాజు పలికెను:-

ఓ పుత్రా! నా కీర్తి నశించిన నశించనిమ్ము ! నేను అసత్యవాక్కును అయిన కానిమ్ము. ఘోరమగు నరకము వచ్చిన రానిమ్ము. కాని ఏకాదశి నాడు నేనెట్లు భుజించగలను? ఈ మోహినీదేవి బ్రహ్మలోకమునకు వెళ్ళనిమ్ము. మూర్ఖురాలు, దుర్బుద్ధియగు ఈ మోహిని మాటి మాటికి నాతో నాకే కోరిక లేదు. రాజ్యముతో పనిలేదు. రాజ్యముతో పనిలేదు. కేవలము ఏకాదశి నాడు రాజు భుజించుటయే కావలయును అని పలుకుచున్నది. నాకు క్రిమి జన్మ వచ్చిననూ రానిమ్ము. కాని నేను మాత్రము ఏకాదశినాడు భుజించజాలను. ఈ లోకమున చాలా పెద్ద దుందుభి ప్రజలను బోధించుచున్నది. ఆ దుందుభి ఎట్లు వ్యర్థమగును? తినరాని దానిని తిని, పొందరాని స్త్రీని పొంది, పానముచేయరాని దానిని పానము చేసి నూరు సంవత్సరములు బ్రతికిననేమి ప్రయోజనము? ఈ భూమండలమున రాజనీతిని వదిలి, రాజ్యాధికారమును కూడా వదిలెదను. అసత్యవాక్కునను అపనిందను కూడా భరించేదను. ప్రజలందరూ ధిక్కరించిననూ ఏకాదశినాడు మాత్రము భుజించను. మోహినీ వియోగముచే మరణము సంభవించిననూ మేలేకాని ఏకాదశినాడు మాత్రము భుజించను. అతి దుఃఖముతో యమలోక మార్గమున ప్రజలను పంపుచు యమధర్మరాజునకు సంతోషమెట్లు కలిగించగలను? నీకాదశినాడు భుజించినచో ఇదివరకు శూన్యములుగా చేయబడిన నరకశ్రేణులు ఇపుడు పరిపూర్ణములగును. సమర్థుడైకూడా శత్రువులకు ఆనందము కలిగించువానిని ఏ తల్లీ గర్భమున ధరించరాదు. ఈ మోహిని ఏకాదశినాడు భుజించుటనే యాచించుచున్నది. సురాసురులు యాచించిననూ ఆ వరమును ఈయజాలను. విషమునైనను త్రాగెదను. అగ్నిలో కూడా దూకెదను. పర్వతాగ్రము నుండి క్రింద పడెదను. ఆకాశమున ప్రకాశించు ఖడ్గముచే నా శిరస్సును కూడా ఖండించుకొందును. కాని రుక్మాంగద మహారాజు మాత్రము ఏకాదశి నాడు భుజించడు. ఏకాదశ్యుపవాసము చేతనే రుక్మాంగద నామము మూడు లోకములలో ప్రసిద్ధి గాంచినది. అదియే నేను సంపాదించిన యశము. అట్టి నేను ఏకాదశినాడు భోజనము చేసి నేను సంపాదించిన కీర్తిని నేనే ఎట్లు నశింప చేతును. ఈ మోహిని మరణించిననూ, వెడలిపోయిననూ, పతనమైననూ, ఖండ ఖండములుగా నశించిననూ, ఇట నుండి విరమించిననూ, నానిశ్చయము మాత్రము మోహినీ కారణమున మాత్రము మారజాలదు. నా ప్రజలతో భార్యా పుత్రులతో నా జీవితమును కూడా విడిచెదను కాని పరమ పవిత్రమగు ఏకాదశీ దీనమున మాత్రము నేను భోజనము చేయజాలను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున ఇరువది యారవ అధ్యాయము.