92 - బ్రాహ్మపురాణేతిహాసకథనమ్

కలవి? దానినంతటిని నాకు చెప్పుము. చాతుర్వర్ణాశయకథలను నానావ్రతకధలను సృష్టి క్రమముతో వంశకధలను చక్కగాతెలిసిన వారు నీకంటే ఇతరులు లేరు. కావున నాకు నీవు సర్వసందేహభంజకమగు పురాణాఖ్యానమును తెలియజేయుము.

సూత ఉవాచ :-

తతస్సనాతనో విప్ర శ్రుత్వా నారదభాషితమ్

 నారాయణం క్షణం ధ్యాత్వా ప్రోవాచాథ విదాంవరః

సూతమహర్షిపలికెను :- అంతట జ్ఞానశ్రేష్టుడగు సనాతన మహర్షి నారద భాషితమును విని క్షణకాలము నారాయణుని ధ్యానించి ఇట్లుపలికెను.

సనాతన ఉవాచ :-

సాధు! సాధు మునిశ్రేష్ఠ! సర్వలోకోపకారక 

పురాణాఖ్యానవిజ్ఞానే యజ్జాతా నైష్ఠికీ మతిః

 తుభ్యం సమభిధాస్యామి యత్ప్రోక్తం బ్రహ్మణా పురా

 మరీచ్యాదిఋషిభ్యస్తు పుత్రస్నేహావృతాత్మనా

ఏకదా బ్రహ్మణః పుత్రో మరీచిరామ విశ్రుతః

 స్వాధ్యాయశ్రుతసంపన్నో వేదవేదాంగపారగః

ఉపసృత్య స్వపితరం బ్రహ్మాణం లోకభావనమ్

 ప్రణమ్య భక్త్యా పప్రచ్ఛ ఇదమేవ మునీశ్వర

పురాణాఖ్యానమమలం యత్వం పృచ్ఛసి మానద

 సనాతనమహర్షిపలికెను :- ఓ మునిసత్తమా? పురాణ కధలను తెలియుటకు కోరిక కలుగుట చాలామంచిది. పూర్వము బ్రహ్మదేవుడు పుత్రస్నేహముతో మరీచ్యాది ఋషులకు చెప్పిన దానిని నీకు చెప్పెదను. ఒకపుడు బ్రహ్మపుత్రుడు మరీచిమహర్షి స్వాధ్యాయశ్రుతసంపన్నుడు, వేదవేదాంగపారగుడు లోకభావనుడు తన తండ్రియగు బ్రహ్మను సమీపించి భక్తిచే నమస్కరించి నీవు నన్నడిగిన పురాణాఖ్యానమును ప్రశ్నించెను.  మరీచిరువాచ :-

భగవందేవదేవేశ! లోకానాం ప్రభవాప్యయ

 సర్వజ్ఞ సర్వకల్యాణ! సర్వాధ్యక్ష నమోస్తు తే

పురాణబీజమాఖ్యాహి మహ్యం శుశ్రూషవే పితః

లక్షణం చ ప్రమాణం చ వక్తారం పృచ్ఛకం తథా

మరీచిపలికెను :- ఓ భగవంతుడా! దేవదేవేశ! లోకముల సృష్టిలయకారణా! సర్వజ్ఞా! సర్వకళ్యాణా! సర్వాధ్యక్ష్యా! నీకునమస్కారము. ఓ తండ్రీ! నిన్ను సేవించు నాకు పురాణస్వరూపమును, లక్షణమును, ప్రమాణమును, చెప్పువానిని, అడుగువాని గురించి తెలుపుము.

బ్రహ్మవాచ :-

శృణు వత్స ప్రవక్ష్యామి పురాణానాం సముచ్చయమ్

 యస్మిన్ జ్ఞాతే భవేత్ జ్ఞాతం వాజ్మయం సచరాచరమ్

పురాణమేకమేవా సీత్సర్వకల్పేషు మానద

 చతుర్వర్గస్య బీజం చ శతకోటిప్రవిస్తరమ్

 ప్రవృత్తిస్సర్వశాస్త్రాణాం పురాణాదభవత్తతః

కాలేనాగ్రహణందృష్ట్వా పురాణస్య మహామతిః

హరిర్వ్యాస్వరూపేణ జాయతే చ యుగే యుగే

చతుర్లక్ష ప్రమాణేన ద్వాపరే ద్వాపరే సదా

 తదాష్టాదశధా కృత్వా భూర్లోకే నిర్దిశత్యపి

 అద్యాపి దేవలోకే తు శతకోటిప్రవిస్తరమ్

అస్యేవ తస్య సారస్తు చతుర్లక్షేణ వర్ణ్యతే

 బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ వాయవీయం తథైవ చ

 భాగవతం. నారదీయం మార్కండేయం చ కీర్తితమ్

 ఆగ్నేయం చ భవిష్యంచ బ్రహ్మవైవర్తలింగకే

వారాహం చ తథా స్కాంధం వామనం కూర్మసంజ్ఞకమ్

మాత్స్యం చ గారుడం తద్వద్ర్బహ్మండాఖ్యమితి త్రిషట్

 ఏకం కథానకం సూత్రం కర్తుశ్నోతుస్సమాహ్వయమ్

ప్రవక్ష్యామసమాసేన నిశామయ సమాహిత

 బ్రాహ్మం పురాణం తత్రాదౌ సర్వలోకహితాయ వై

 వ్యా సేన వేదవిదుషా సమాఖ్యాతం మహాత్మనా 

తద్వై సర్వపురాణాగ్ర్యం ధర్మకామార్థమోక్షదమ్

 నానాఖ్యానేతిహాసాఢ్యం దశసాహస్రముచ్యతే

దేవానం చ సురాణాం చ యత్రోత్పత్తిః ప్రకీర్తితా

 ప్రజాపతీనాం చ తథా దక్షాదీనాం మునీశ్వర

 తతో లోకేశ్వరస్యాత్ర సూర్యస్య పరమాత్మనః

వంశానుకీర్తనం పుణ్యం మహాపాతకనాశనమ్

యత్రావతారః కథితః పరమానందరూపిణః

 శ్రీమతో రామచంద్రస్య చతుర్వ్యూహావతారిణః

తతశ్చ సోమవంశస్య కీర్తనం యత్ర వర్ణితమ్

 కృష్ణస్య జగదీశస్య చరితం కల్మషాపహమ్

ద్వీపానాం చైవ సర్వేషాం వర్షాణాం చాప్యశేషతః

 వర్ణనం యత్ర పాతాళ స్వర్గాణాం చ ప్రదృశ్యతే

 నరకాణాం సమాఖ్యానం సూర్యస్తుతి కథానకమ్

పార్వత్యాశ్చ తథాజన్మ వివాహశ్చ నిగద్యతే

 దక్షాఖ్యానం తతః ప్రోక్తం ఏకామక్షేతవర్లనమ్

 పూర్వభాగ్య ముదితః పురాణస్యాస్య నారద

 అస్యోత్తరే విభాగే తు పురుషోత్తమవర్ణనమ్

 విస్తరేణ సమాఖ్యాతం తీర్థయాత్రావిధానతః

 అతైవ కృష్ణచరితం విస్తరాత్సముదీరితమ్

వర్ణనం యమలోకస్య పితృశ్రాద్ధవిధిస్తథా

 వర్ణాశ్రమాణాం ధర్మాశ్చ కీర్తితాయ త్ర విస్తరాత్

విష్ణుధర్మయుగాఖ్యానం ప్రలయస్య చ వర్ణనమ్

 యోగానాం చ సమాఖ్యానం సాంఖ్యానాం చాపి వర్ణనమ్

బ్రహ్మవాదసముద్దేశః పురాణస్య ప్రశంసనమ్

  ఏతద్ర్బహ్మపురాణం తు భాగద్వయసమన్వితమ్

వర్ణితం స్వరపాపఘ్నం సర్వసౌఖ్యప్రదాయకమ్

 సూత శౌనకసంవాదం భుక్తిముక్తి ప్రదాయకమ్

 లిఖిత్వైతత్పురాణం యో వైశాఖ్యాంహామసంయుతమ్ 

జలధేనుయుతం చాపి భక్త్యా దద్యాద్ద్విజాతయే

పౌరాణికాయ సంపూజ్య వస్త్ర భోజ్యవిభూషణైః

స వసేద్భ్రహ్మాణో లోకే యావచ్చంద్రార్క తారకమ్

యః పఠేచ్ఛృణుయాద్వాపి బ్రాహ్మనుక్రమణీం ద్విజ

సోపి సర్వపురాణస్య శ్రోతుర్వక్తు ఫలంలభేత్

శృణోతి యఃపురాణం తు బ్రాహ్మం సర్వం జితేంద్రియః 

హవిష్యాశీ చ నియమాత్స లభేద్ర్బహ్మణః పదమ్

కిమత్ర బహునోక్తేన యద్యదిచ్ఛతి మానవః

తత్సర్వం భవేద్వ త్స పురాణస్యాస్య కీర్తనాత్

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే చతుర్థపాదే బ్రాహ్మపురాణేతిహాసకథనం నామ ద్వినవతి తమోధ్యాయః.

బ్రహ్మపలికేను :- నాయనా. పురాణసముచ్చయమును చెప్పెదను వినుము ఈ పురాణ సముచ్చయమ తెలిసినచో చరాచర సహితమగు వాజ్మయమంతయూ తెలియును. మొదట అన్సీకల్పములలో ఒకటే పురాణముండెడిది. ఇదియే చతుర్వర్గమూలము. నూరుకోట్లశ్లోకములు కల విస్తృతగ్రంథము. సర్వశాస్త్రములు ఈ పురాణము నుండియే ప్రవర్తించినవి. ఎంతకాలము గడచిననూ పురాణమును ఎవ్వరూ గ్రహించకపోవుటను చూచి మహామతియగు శ్రీహరి ద్వాపరయుగమున వ్యాసునిగా అవతరించి నాలుగు లక్షలు శ్లోకములుగా పదునెనిమిది పురాణములుగా భూలోకమున అవతరింపచేసెను. ఇప్పటికి దేవలోకమున పురాణము శతకోటి ప్రవిస్తరముగానున్నది. ఈపురాణసారమునే నాలుగు లక్షల శ్లోకములలో వర్ణించిరి. బ్రహ్మపురాణము, పద్మపురాణము, విష్ణుపురాణము, వాయుపురాణము, భాగవతపురాణము, నారదీయపురాణము, మార్కండేయపురాణము, అగ్నిపురాణము, భవిష్యపురాణము, బ్రహ్మవైవర్త పురాణము, లింగపురాణము వరాహపురాణము, స్కాందపురాణము, వామనపురాణము, కూర్మపురాణము, మత్స్యపురాణము, గరుడ పురాణము, బ్రహ్మండపురాణము అని పురాణములు పదునెనిమిది. ఒకే కథానకసూత్రము వక్తకుశోతకు ఉండును. దానినంతటిన సంగ్రహముగా చెప్పెదను. వినుము. ఆపురాణములలో మొదటిది సర్వలోకహితమును కలిగించునది బ్రహ్మపురాణము. వేదజ్ఞుడు మహానుభావుడగు వ్యాసమహర్షిచే చెప్పబడినది. ఈ బ్రహ్మపురాణమే అన్నిపురాణములలో మొదటిది. ధర్మకామార్థమోక్షముల నిచ్చునది. నానాఖ్యానేతిహాస సహితము. పదివేలు శ్లోకములు కలది. ఈబ్రహ్మపురాణమున దేవదానవుల ఉత్పత్తి. దక్షాదిప్రజాపతుల ఉత్పత్తి, లోకేశ్వరుడగు సూర్యభగవానుని పరమపవిత్రము మహాపాతకనాశకమగు వంశానుకీర్తనము, పరమానందస్వరూపుడగు శ్రీ మహావిష్ణువు నాలుగు రూపములుగా అవతరించి శ్రీరామచంద్రుని కథ, సోమవంశ వర్ణనము, జగదీశుడగు శ్రీ కృష్ణ చరితము, సర్వద్వీపముల సర్వవర్షముల వర్లన, పాతాళస్వర్గముల వర్ణన, నరకకథలు, సూర్యస్తుతి కథ, పార్వతీదేవిపుట్టుక, వివాహము, దక్షప్రజాపతికథ, ఏకామక్షేత్రవర్ణనము, ఈ కథలు చెప్పబడినవి. ఇంతటితో బ్రహ్మపురాణమున పూర్వభాగము సమాప్తమగును. ఇక ఉత్తర భాగమున పురుషోత్తమ వర్ణనము. తీర్థయాత్రావిధాన విస్తారవర్ణనము. సవిస్తరముగా కృష్ణచరితము, యమలోకవర్ణనము, పితృశ్రాద్ధవిధానము, వర్ణాశ్రమధర్మముల విపులవర్ణనము, బ్రహ్మవాదసముద్దేశము, పురాణప్రశంస, విపులముగా వర్ణించబడినవి. విష్ణుధర్మముగా ఖ్యానము, ప్రలయవర్ణనము యోగసాంఖ్య సమాఖ్యానములు చెప్పబడినవి. ఇట్లు బ్రహ్మపురాణము రెండు భాగములుగా చెప్పబడినది. ఈ బ్రహ్మపుఠాణము సర్వపాపహారము. సర్వసౌఖ్యప్రదాయకము. సూతశౌనక సంవాదము. భుక్తిముక్తి ప్రదాయకము. వైశాఖ పూర్ణిమ తిథియందు ఈబ్రహ్మపురాణమును వ్రాసి బంగారముతో గోవుతో భక్తితో బ్రాహ్మణునకు దానము చేయవలయును. పౌరాణికుని చక్కగా పూజించి వస్త్ర భోజ్యభూషణదాలునిచ్చి బ్రహ్మపురాణమునిచ్చినచో సూర్యచంద్రులుండువరకు బ్రహ్మలోకమున నివసించును. బ్రహ్మపురాణముననున్న కధానుక్రమణికను చదివినవాడు, వినినవాడు అన్నిపురాణములను చెప్పుట వలన వినుటవలన కలుగు ఫలితమును పొందును. బ్రహ్మపురాణమును సంపూర్ణముగా జితేంద్రియుడై వినినవాడు హవిస్సును మాత్రమే భుజించి నియమబద్దముగా నుండినచో బ్రహ్మలోకమును పొందును. ఇంతయేల? బ్రహ్మపురాణసంకీర్తనమువలన కోరికలన్నింటిని పొందును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున చతుర్థపాదమున బ్రాహ్మపురాణేతిహాస కథనమను తొంబదిరెండవ అధ్యాయము సమాప్తము.