నారద మహా పురాణము
62 - ప్రయాగరాజ మాహాత్మ్యేతీర్థవిదిః
వసిష్ఠ ఉవాచ:-
ఏతచ్ఛ్రుత్వా తు భూపాల మోహినీ విధినందినీ ।
పురుషోత్తమ మాహాత్మ్యం భక్తిముక్తి ప్రదాయకమ్
పునః వప్రచ్ఛ తం విప్రం వసుం స్వస్య పురోహితమ్
వసిష్ఠ మహర్షి పలికెను :- ఓరాజా! బ్రహ్మపుత్ర యగు మోహిని భక్తిముక్తి ప్రదాయకమగు పురుషోత్తమ మాహాత్మ్యమును విని తన పురోహితుడుగు వస్తువును మరల ఇట్లడిగెను.
మోహిన్యువాచ : -
శ్రుత మత్యద్భుతం విప్ర పురుషోత్తమ సంభవమ్
మాహాత్మ్యం చాధునా బ్రూహి ప్రయాగస్యాపి సువ్రతః ।
తీర్థరాజః ప్రయాగాఖ్యః శ్రుతః పూర్వం మయా గురో
తన్మాహాత్మ్యం మమాభ్యాహి తీర్థయాత్రా విధానయుక్ ।
సామాన్యానాం విశేషాణాం తీర్థానాం గమనే ద్విజ
యత్కర్తవ్యం చ వీధినా నృభిర్ధర్మ పరాయణైః ।
తచ్చ్రుత్వా సద్విజో రాజ న్మోహిన్యా భాషితం వచః
సామాన్య విధి పూర్వం త త్ర్పయాగాఖ్యాన మబ్రవీత్
మోహిని పలికెను : ఓ బ్రాహ్మణోత్తమా! అత్యద్భుతమగు పురుషోత్తమ మాహాత్మ్యమును వింటిని. ఇక ఇపుడు ప్రయాగమాహాత్మ్యమును చెప్పుము. సామాన్య విశేష తీర్థయాత్రలకు వెళ్ళినపుడు నరులు ఆచరించవలసిన విధానమును తెలుపుము. ఇట్లు పలికిన మోహిని మాటలను వినిన ఆ బ్రాహ్మణోత్తముడగు వసువు సామాన్య విధి పూర్వకముగా ప్రయాగ మాహాత్మ్యమును ఇట్లు చెప్పసాగెను.
వసురువాచ : -
శృణు భద్రే ప్రవక్ష్యామి తీర్థాభిగమనే విధిమ్
యం సమాశ్రిత్య మనుజో యధోక్తం ఫలమాప్నుయాత్ ।
తీర్థాభి గమనం పుణ్యం యజ్ఞైరపి విశిష్యతే
అనుపోష్య త్రిరాత్రిని తీర్ధాన్యనగ్యభిగమ్యచ ।
అదత్వా కాంచనం గాశ్చ దరిద్రో జాయతే నరః
అగ్నిష్టోమాదిభిర్యజ్ఞై రిష్టా విపుల దక్షిణైః।
న తత్ఫల మవాప్నోతి తీర్థాభి గమనేన యత్
అజ్ఞానేనాపి య సేహ తీర్థాభిగమనం భవేత్ ।
సర్వకామ సమృద్ధస్స స్వర్గలోకే మహీయతే
స్థానం చ లభ్యతే నిత్యం ధనధాన్య సమాకులమ్ ।
ఐశ్వర్యజ్ఞాన సంపూర్ణ స్సదా భవతి భోగవాన్
తారితాః పితరస్తేన నరకాత్ప్రపితామహాః ।
యస్య హస్తే చ పాదౌ చ మనశ్చైవ సుసంయతమ్
విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్ధ ఫలమశ్నుతే ।
ప్రతిగ్రహాదపావృత్త స్సంతుష్టో యేన కేనచిత్
అహంకార విముక్తశ్చ స తీర్థ ఫలమాప్నుయాత్ ।
అకల్పకో నిరారంభో లఘ్వాహారో జితేంద్రియః
విముక్త సర్వసంగస్తు స తీర్థ ఫల భాగ్భవేత్ ।
తీర్థాన్యను సరన్దీరః శ్రద్ధధానస్సమాహితః
కృతపాపో విశుద్ధ్యేత్తు కింపున శ్శుద్ధకర్మకృత్ ।
అశ్రద్దధానః పాపార్తో నాస్తికోఽచ్ఛిన్న సంశయః
నృణాం పాపకృతాం తీర్దే పాపస్య శమనం భవేత్
యధోక్త ఫలదం తీర్థం భవేచ్చుద్దాత్మనాం నృణామ్ ।
కామం క్రోధం చ లోభం చ యో జిత్వా తీర్థమావిశేత్
న తేన కించిదప్రాప్తం తీర్థాభిగమనాద్భవేత్ ।
తీర్థాని చ యధోక్తేన విధినా సంచరన్తి యే
సర్వద్వంద్వసహా ధీరా స్తే నరాస్స్వర్గగామినః
గంగాది తీర్ధేషు వసన్తి మత్స్యా దేవాలయ పక్షిగణాశ్చ సన్తి ।
భావోజ్ఘితాస్తే న ఫలం లభన్తే తీర్థాచ్చ దేవాయతనాచ్చ ముఖ్యాత్
భావం తతో హృత్కమలే నిధాయ తీర్థాని సేవేత సమాహితాత్మా ।
యా తీర్థయాత్రా కధితా మునీస్త్రె కృతా ప్రయుక్తా వ్యనుమోదితా చ
తాం బ్రహ్మచారీ విధివత్కరోతి సుసంయతో గురుణా సంనియుక్తః ।
సర్వస్వనాశేఽప్యధపాల్పపక్షే సబ్రాహ్మణానగ్రత ఏవ కృత్వా
యజ్ఞాధి కారేఽ ప్యధనా నివృత్తే విప్రస్తు తీర్ధాని పరిభ్రమే చ్చ ।
తీర్దేష్వలం యజ్ఞఫలం హి యస్మా త్ప్రోక్తం మునీనైరమలస్వభావై
యస్యేష్టియ జ్ఞేష్వధికారతాస్తి వరం గృహో గృహ ధర్మాశ్చ సర్వే ।
ఏవం గృహస్థాశ్రమ సంస్థితస్య తీర్థ గతిః పూర్వతరై ర్నిషిద్దా
సర్వాణి తీర్థాన్యపీ చాగ్నిహోత్ర తుల్యాని నైవేతి వదంతి కేచిత్
యో య! కశ్చిత్తీర్థయాత్రాంత్తు గచ్చే తో సుసంయుత స్సచ పూర్వం గృహేషు ।
కృతావాసశ్శుచి రప్రమత్త స్సంపూ జయే ద్భక్తినమ్రో గణేశమ్
దేవాన్పితన్భ్రహ్మణార్షశ్చైవ సాధూ న్దీమాన్విప్రో విత్తశక్యాప్రయత్నాల్ ।
ప్రత్యాగతశ్చాపి పునస్తదైవ దేవాన్పితవ్రాహ్మణా స్టూజయేచ్చః
గచ్ఛన్దే శాన్తరం యస్తు శ్రాద్ధం కుర్యాత్ససరిషా ।
యాత్రార్థమితి తత్ప్రోక్తం ప్రవేశే చ నసంశయః
ప్రయాగే తీర్థయాత్రాయాం పితృమాతృ వియోగతః ।
కచానాం వపనం కుర్యా ద్వృధా న వికచోభవేత్
ఉద్యత శ్చేద్గయాం గన్తుం శ్రాద్ధం కృత్వా విధానతః ।
విధాయ కార్పటీవేషం కృత్వా గ్రామ ప్రదక్షిణామ్
తతో గ్రామాన్తరం గత్వా శ్రాద్ధశేషస్య భోజనమ్ ।
తతః ప్రతిదినం గచ్ఛే త్ప్రతిగ్రహ వివర్జితః
పదే పదేఽ శ్వమేధస్య స్యాత్పలం గచ్ఛతో గయామ్ ।
బలీవర్ద సమారూడ స్తీర్ధం యో యాతి సువ్రతే
నరకే వసతే ఘోరే గవాం క్రోధో హి దారుణః ।
సలిలం చ న గృహన్ణన్తి పితరస్తస్యదేహినః
ఐశ్వర్యాల్లో భమోహాద్వా గచ్ఛేద్యానేన యో నరః ।
నిష్ఫలం తస్య తీర్ధం తు తస్మాద్యానం వివర్జయేత్
గోయానే గోవధః ప్రోక్తో హయయానే తు నిష్ఫలమ్ ।
నరయానే తదర్ధం స్యా త్పద్భ్యాం తచ్చ చతుర్గుణమ్
వర్షాత పాదికే ఛత్రీ దండీ శర్కర సంకటే ।
శరీర త్రాణకామోఽసౌ సోపానతస్సదా వ్రజేత్
తీర్థం ప్రాప్యానుషంగేణ స్నానం తీర్థ సమాచరన్ ।
స్నానజం ఫలమాప్నోతి తీర్థయాత్రాఫలం నతు
షోడశాంశం స లభతే యః పరార్ధేన గచ్ఛతి ।
అర్ధం తీర్థపలం తస్య యః ప్రసంగేన గచ్ఛతి
తీర్దేషు బ్రాహ్మణం నైవ పరీక్షేత కదాచన ।
అత్రార్దిన మనుప్రాప్తం బోజ్యం తం మనురబ్రవీత్
సక్తుభిః పిండదానం చ సంయావైః పాయసేన వా ।
బదరామలకైర్వాపి పిణ్యాకైర్వా సులోచనే
శ్రాద్ధం తు తత్ర కర్తవ్యం అర్చావాహన వర్జితమ్ ।
శ్వధ్వాంక్ష గృధ్రపాపానాం నైవ దృష్టిహతం చ యత్
శ్రాద్ధంతు తైర్థికం ప్రోక్తం పితృణాం తృప్తి కారకమ్ ।
అకాలేఽ ప్యథవా కాలే తీర్థశ్రాద్ధం తధా నరైః
ప్రాప్తైరేవ సదా తత్ర కర్తవ్యం పితృతర్పణమ్ ।
విలంబో నైవ కర్తవ్యో నైవ విఘ్నం సమాచరేత్
ప్రతికృతిం కుశమయీం తీర్థవారి ని మజ్జయేత్ ।
యముద్దిశ్య విశాలాక్షి సోఽష్టమాంశం ఫలం లభేత్
కుశోఽసి కుశపుత్రోఽసి బ్రహ్మణా నిర్మితః పురా ।
త్వయి స్నాతే తు సస్నాతో యస్యేదం గ్రంధి బంధనమ్
ముండనం చోపవాసశ్చ సర్వతీర్దేష్వయం విధిః ।
వర్జయిత్వా కురుక్షేత్రం విశాలాం విరజాం గయామ్
భౌమానామధ తీర్థానాం పుణ్యత్వే కారణం శృణు ।
యధా శరీర స్యోద్దేశా కేచిన్ముఖ్యతమా స్మృతా!
ప్రభావాదద్బుతాద్భూమేః సలిలస్య చ తేజసః ।
పరిగ్రహాన్మునీనాంచ తీర్థానాం పుణ్యతా స్మృతా
గంగాం సంప్రాప్య యో దేవి ముండనం నైవ కారయేత్ ।
క్రియా తస్యా క్రియాస్సర్వా తీర్థద్రోహీ భవేత్తధా
గంగాయాం భాస్కరక్షేత్రే ముండనం యో న కారయేత్ ।
స కోటి కులసంయుక్త ఆకల్పం రౌరవం వ్రజేత్
గంగాం ప్రాప్య సరిచ్ఛేష్టాం కల్పాన్తా పాపసంచయాః ।
కేశానాశ్రిత్యతిష్టస్తి తస్మాత్తాన్పరివర్జయేత్
తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే ।
ప్రయాగవ్యతిరేకే తు గంగాయాం ముండనం నహి ।
యోఽన్యధా కురుతే మోహా త్సమహారౌరవం వ్రజేత్
స జీవత్పితృ కో యస్తు తీర్థం ప్రాప్య విధానవిత్ ।
క్షౌరం సమాచరేన్నైవ శ్మశ్రూణాం వపనం సతి
గయాదవపి దేవేశి శ్మశ్రూణాం వపనం వినా ।
న క్షౌరం మునిఖి స్పర్యై ర్నిషిద్దం చేతి కీర్తితమ్
సశ్శ్మశ్రుకేశవపనం ముండనం తద్విదుర్భుధాః ।
నక్షౌరం ముండనం సుభ్రు కీర్తితం వేదవేదిభిః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తర భాగే వసు మోహినీ సంవాదే ప్రయాగరాజ మాహాత్మ్యే తీర్ధ విధిర్నామ ద్విషష్ఠి తమోఽధ్యాయః.
వసువు పలికెను. : - భద్రపరులారా! తీర్థయాత్రాగమనవిధానమును తెలిపెదను వినుము. ఈ విధానమును అనుసరించినవారు యధోక్త ఫలమును పొందగలుగుదురు. పవిత్రమగు తీర్థయాత్రాగమనము యజ్ఞములనాచరించుటకన్నా విశేష ఫలప్రదము, దశమి ఏకాదశి ద్వాదశి రాత్రులందు ఉపవసించక, తీర్థయాత్రలకు వెళ్ళక, స్వర్ణదానమును, గోదానమును చేయక మానవుడు దరిద్రుడుగును. తీర్థయాత్రల వలన పొందు పలమును విపులదక్షిణలనిచ్చు అగ్నిష్టోమాదియాగముల వలన కూడా పొందజాలడు. అజ్ఞానముచే తీర్థయాత్రలు చేసినవాడు కూడా సర్వకామ సమృద్దుడే స్వర్గమును పొందును. ధనదాన్య సమాకులమగు స్థానమును పొందును. ఐశ్వర్య పూర్ణుడు జ్ఞానపూర్ణుడగును. స్వరకాలములందు భోగయుతుడగును. అతని పితరులు పితామహులు నరకమునుండి తరించబడుదురు. హస్తములు పాదములు మనస్సునియమబద్ధముగా ఉండువానికి విద్వ తపసు కీర్తి నియమబద్దముగా నున్నవానికి తీర్థయాత్ర ఫలముల లభించును. ఎవరి నుండి దేనిని గ్రహించక, లభించిన దానితో సంతృప్తి చెందువాడు, అహంకార విముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందకలుగును. కల్పనలు లేనివాడు, ప్రయత్నశూన్యుడు, తగినంత ఆహారమును పొందువాడు, ఇన్టియని గ్రహము కలవాడు, సర్వసంగవినిర్ముక్తుడు తీర్థయాత్రా ఫలమును పొందును. శ్రద్దతో, ఏకాగ్రమనస్కుడై, ధీరుడై తీర్థయాత్ర ననుసరించుచు పాపములను చేయువాడు కూడా శుద్ధి పొందును., ఇక పరిశుద్దుని మాటేల? శ్రద్ద లేనివాడు, పాపార్డుడు, నాస్తికుడు, సంశయములు తొలగనివాడు, హేతువాది ఈ అయిదు గురు తీర్థయాత్రా ఫలమును పొందజాలరు. పాపములను చేయువారి పాపములు తీర్థయాత్రలతో నశించును. పరిశుద్దాత్ములకు తీర్థయాత్రలు యధోక్త ఫలము లభించును. కామక్రోధలోభములను జయించి తీర్థయాత్రలు చేయువారు పొందజాలని ఫలముండదు. యధోక్త విధిచే తీర్థయాత్రలను చేయువారు సుఖదుఃఖాది సకల ద్వంద్వ విధిచే సకల ద్వంద్వములను సహించగలవారు స్వర్గమును పొందెదరు. గంగాది పుణ్యతీర్థములందు చాలా చేపలు నివసించుచుండును. దేవాలయములందు పక్షి గణములుండును. అయిననూ వారందరికీ ఫలము కలగుటలేదు. తీర్థమునందు కాని దేవాలయములందు కాని వాసము. ముఖ్యముకాదు. భావము ప్రధానము. భావహీనులు ఫలమును పొందజాలరు. కావున హృదయమున భక్తి భావమును ప్రతిష్టించుకొని ఏకాగ్రమనస్కుడై పుణ్యతీర్థములను సేవించవలయును. మునీన్తులు చెప్పిన విధించిన ఆమోదించిన తీర్థయాత్రను గురువులచే నియమించబడిన బ్రహ్మచారులు యధావిధిగా నాచరింతురు. సర్వస్వము నశించిననూ అల్పబలము కలవాడైననూ బ్రాహ్మణులను ముందు నిడుకొని, యజ్జాధికారము ఉన్ననూ తొలగిననూ బ్రాహ్మణులు తీర్థములను పర్యటించవలయును. పరిశుద్ద మనస్సుకల మునీన్తులు పవిత్ర తీర్థములలో యజ్ఞపలము లభించునని చెప్పియున్నారు. యజ్ఞములందు అధికారము కలవారు మాత్రము ఇల్లు, గృహస్థధర్మములే ముఖ్యము. గృహస్థాశ్రమమును యధావిధిగా ఆచరించువారికి తీర్థయాత్రలు నిషేధించబడినవి. సర్వతీర్థములు అగ్నిహోత్రతుల్యములు కాజాలవని కొందరు చెప్పేదరు. మొదట గృహస్థాశ్రమమున చక్కగా ఆచరించువాడు అప్రమత్తుడై గృహమున నుండువాడు తీర్థయాత్రలకు వెళ్ళదలచినచో సావధానుడై మొదట గణేశుని పూజించవలయును. దేవతలను పితరులను బ్రాహ్మణులను సాధువులను విత్తానుసారముగా ప్రయత్నముతో పూజించవలయును. తీర్థయాత్రల నుండి తిరిగి గృహమునకు వచ్చిన తరువాత ఇట్లే దేవ పితృ బ్రహ్మణ సాధువులను పూజించవలయును. ఇట్లు యధావిధిగా తీర్థయాత్రలను చేయువారికి యధోక్త ఫలము నిశ్చయముగా లభించును. దేశాన్తరమునకు వెళ్ళుచు నేతితో శ్రాద్దమునా చరించవలయును. ఇది యాత్రార్థము చేప్పబడినది. మరల ఇల్లు చేరిన వెంటనే చేయవలయును. ప్రయాగతీర్థమున యాత్రకు వచ్చిన వారు పితృమాత్స వియుక్తులైనచో కేశములను వపనము చేయవలయును. నిష్కారణముగా వపనము చేయరాదు. గయను వెళ్ళుటకు సిద్ధపడినవాడు యధావిధిగా శ్రాద్ధమునా చరించి కార్పటీ వేషమును ధరించి గ్రామ ప్రదక్షిణము నాచరించి గ్రామాన్తరమునకు వెళ్ళి శ్రాద్దశేషమును భుజించవలయును. తరువాత విఘ్నము లేకుండా ప్రతి దినము వెలవలయును. గయాక్షేత్రమునకు వెళ్భువానికి ప్రతిపదమున అశ్వమేధ పలము లభించును. వృషభము నధిరోహించి తీర్థయాత్రలకు వెళ్ళువాడు నరకమున నివసించును. గోవుల క్రోధము పరమదారుణము కదా. అతనిచ్చు తర్పణమును పితృదేవతలు గ్రహించరు. ఐశ్వర్యము, వలననో లోభము వలననో వాహనముతో చేసిన యాత్ర నిష్పలమగును. కావున వాహనమును విసర్జించవలయును. గోవాహనమున వెళ్ళినచో గోవధ పాతకము లభించును. హయయానమున వెళ్ళినచో నిష్పలమగును. నరవాహనమున వెళ్ళినచో అర్ధవలము లభించును. నడిచి వెళ్ళినచో నాలుగు రెట్లు వలము కలుగును. వరాతపాది బాధలున్నచో ఛత్రమునుదరించవలయును. గులకరాళ్లున్నచో దండమును ధరించవలయును. శరీరమును కాపాడుకొనుటకు పాదరక్షలను ధరించి యుండవలయును. పుణ్యతీర్థమును చేరి అచట స్నామును అప్రాధాన్యముగా చేసినచో స్నానపలమును పొందును కాని తీర్థఫలమును పొందజాలడు ఇతరుల ధనముతో వెళ్ళిన వారికి పదునారవ భాగము పలము లభించును. అనుకోకుండా ప్రసంగవశమున వెళ్ళినవారికి సగము ఫలము మాత్రమే లభించును. పుణ్యతీర్థములందు బ్రాహ్మణులను పరీక్షించరాదు. పుణ్యతీర్థములలో యాచనకొచ్చిన వారికి భోజనము పెట్టవలయునని మనువు చెప్పియున్నాడు. తీర్థములలో సత్తు పిండితో కాని యవలతోకాని, పాయసముతో కాని, రేగి పండ్లతో కాని, వుసిరికతోకాని, పిండితో కాని పిండదానమును చేయవలయును. తీర్థములలో అర్చావాహన వర్జితముగా శ్రాద్ధము నాచరించవలయును. శునక కాక గృహపాపుల దృష్టి హతము కాని దానిని చేయవలయును. తీర్థములలో నాచరించు శ్రాద్ధము పితరులకు తృప్తిని కలిగించును. సకాలములో కాని అకాలమున కాని తీర్థమున లభించినవారితోనే లభించిన పదార్థములతోనే పితృతర్పణమును చేయవలయును. ఆలస్యము చేయరాదు. విఘ్నము నాచరించరాదు. కుశమయి ప్రకృతిని తీర్థజలమున విసర్జించవలయును. ఎవరినుద్దేశించి విసర్జన చేసిన అతని అష్టమాంశ ఫలము లభించును. నీవు కుశస్వరూపుణివి. కుశపుత్రుడవు. పూర్వము బ్రహ్మచే నిర్మించబడితివి. నీవు స్నానముచేసినచో ఈ గ్రంథి బంధన ఉద్దేశ్యభూతుడు కూడా స్నానము చేసిన వాడగును. ముండనము ఉపవాసము అన్ని తీర్థములలో విధి. విశాల, విరజ, గయ కురుక్షేత్రములలో మాత్రము ఈ విధి వర్తించదు. భూమండలగత తీర్థములు పుణ్యప్రదములగుటకు కారణమును వినుము. శరీరమున కొన్ని అవయవములు ప్రధానములగునట్లు భూప్రభావము వలన, అద్బుతము వలన, జలము వలన, అగ్ని వలన, మునులు పరిగ్రహించుట వలన తీర్థములు పుణ్యప్రదములగుచున్నవి. గంగాతీర్థమును చేరి ముండనమును చేయుంచుకొననిది వాని క్రియలన్నియూ వ్యర్థములగును. అతను తీర్థద్రోహియగును. గంగాతీర్థమున భాస్కరక్షేత్రమున ముండనము చేయించుకోననివాడు కోటి కులములతో కల్పాన్తము వరకు గౌరవనరకమును చేరును. ఉత్తమనదియగు గంగను చేరి కల్పాన్తము వరకుండు పాపరాశులన్నియూ కేశముల నాశ్రయించియుండును గాన కేశములను విడువవలయును. గంగాజలమున ఎన్ని నఖకేశములు పడునో అన్ని వేలవర్షములు స్వర్గములో నివసించును. ప్రయాగ వ్యతిరిక్త గంగలో ముండనము చేయించుకొనరాదు. ఇందుకు భిన్నముగా వ్యవహరించిన వాడు మహారౌరవనరకమును పొందును. తండ్రి బ్రతికియుండగా తీర్థ మును చేరినవాడు యధావిధిగా క్షౌరమునాచరించవలయును కాని మీసములను ఖండించుకొనరాదు. మునులెల్లరూ క్షౌరమును నిషేధించియుండలేరు. మీసములను కేశములను వపనముచేసిననే ముండనమందురు. మీసములను వదిలి కేశములను మాత్రము తీసినచో క్షౌరమందురు. కావున వేదవిదులు క్షౌరము ముండనము వేరువేరని చెప్పియుండిరి.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున
ప్రయాగరాజ మహాత్మ్యమున తీర్థ విధి యను అరువది రెండవ అధ్యాయము.
Summary of chapter 189 of the Nārada Mahā Purana is as follows:
సమస్త సాధనలలో కల్లా అత్యుత్తమమైన అనన్య విష్ణుభక్తి స్వరూపమును వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయంలో విశదీకరించినారు. నిష్కామ భక్తితో శ్రీహరిని ఆరాధించే భక్తుడు సర్వలోక పూజ్యుడై ఆత్యంతిక మోక్షమును పొందుతాడని ఇక్కడ నిరూపించబడినది.