నారద మహా పురాణము
4 - యమవాక్యమ్
శృణు మే వచనం నాధ! పితామహ! పితామహా ।
మరణాదధికం దేవ! యత్ప్రాతాపస్య ఖండనమ్
నిస్పృహోనాచరేద్యస్తు నియోగం పద్మసంభవ! ।
అంధకూపే నిపపతి స చాశు నరకే ధ్రువమ్
నియోగీ న నియోగం యః కరోతి కమలాసన ।
ప్రభోర్విత్తం సమశ్నాతి సభవేతాష్టకీటకః
యోశ్నాతి లోభా ద్విత్తాని ప్రజాభ్యో వా మహీపతేః ।
నియోగీ నరకం యాతి యావత్కల్ప శతత్రయమ్
ఆత్మకార్యపరోయస్తు స్వామినం చ విలుంపతి ।
భవేద్వేశ్మని మందాత్మన్ ఆఖుః కల్పశతత్రయమ్
నియోగీ యస్తు వై భూత్వా ఆత్మవేశ్మని భోక్ష్యతి ।
భృత్యాన్వై కరణే రాజ్ఞోకర్మ మార్జారతాంవ్రజేత్
సోహం దేవ తవాదేశాత్ ప్రజాధర్మేణ శాసయన్ ।
పుణ్యేన పుణ్యకర్తారం పాపం పాపేన కర్మణా
సమ్యగ్విఛార్యమునిభి ర్థర్మశాస్త్రాదిభిర్విభో ।
కల్పాదౌ వర్తమానస్య యావద్యావద్దినంతవ
సోఽహం త్వదీయేన విభో నియోగేవైన శక్నుయామ్ ।
కర్తుం రుక్మాంగదేనాద్య పరిభూతో హి భూభుజా
భయాద్యస్యజగన్నాథ పృధివీ సాగరాంబరా ।
న భుంక్తే వాసరే విష్ణో స్సర్వపాపప్రణాశనే
విహాయ సర్వధర్మాంస్తు విహాయ పితృపూజనమ్ ।
విహాయ దేవపూజాం చ తీర్థస్నానాదిసత్రియామ్
యోగసాంఖ్యావ్రతే త్యక్త్యా జ్ఞానం జ్ఞేయంచ మానద! ।
త్యక్త్యాస్వాధ్యాయహోమాంశ్చ కృత్వా పాపాని భూరిశః
ప్రయాన్తి వైష్ణవం లోకం ఉపోష్యహరివాసరమ్ ।
మనుజాః పితృభిస్సార్థం తధైవ చ పితామహైః
తేషామపీహపితరః పితృణాం పితరస్తధా ।
తధా మాతామహా యాన్తి మాతుర్యే జనకాదయః
తేషామపి జనేతారో జనితృణాం హి పూర్వజాః ।
ఏతద్దుఃఖం పునర్దేవ మమ మర్మవిభేదనమ్
ప్రియాయాః పితరో యాన్తి మార్జయిత్వా లిపిం మమ ।
పితృణాం బీజతో యస్మా ధాత్ర్యా కుక్షౌ ధృతో యతః
యదేకః కురుతే కర్మ తదేకెనైవ భుజ్యతే ।
తతన్యస్య కృతం బ్రహ్మ న్భీజం ధాత్రీసముద్భవమ్
తారయేత్స ఉభౌ పక్షౌ యత్పిండో యస్య విగ్రహః ।
న భార్యాయా భవేద్భీజం నభార్యా కుక్షిధారిణీ
కథం తస్యా జగన్నాధ పక్షో యాతి పరం పదమ్ ।
జామాతుః పుణ్యమాహాత్మ్యా త్తేన మే శిరసో రుజా
న మే ప్రయోజనం దేవ! నియోగేనేదృశేన వై ।
ఏకాదశ్యుపవాస్సేయ స్స మాం త్యక్త్యా వ్రజేద్దరిమ్
కులత్రయం సముద్దృత్య ఆత్మనా సహ పద్మజ! ।
త్యక్త్యా తు మామకం మార్గం ప్రయాతి హరిమందిరమ్
న యజ్ఞైస్తాదృశైర్దేవ! గతిం ప్రాప్నోతి మానవః ।
న తీర్ధై ర్నాపి దానైర్వా న వ్రతైర్విష్ణువర్జితైః
న జలే పావకే వాపి మృతః ప్రాప్నోతి తాం గతిమ్ ।
యోగేన సంప్రణప్టో వా భృగుపాతేన వా విధే
తాదృశీం న గతిం యాతి యాదృశీం వైష్ణవవ్రతీ ।
గతిం మతిమతాం శ్రేష్ఠో సత్యమేతదుదీరితమ్
హరేర్దినే ధాతృఫలాంగలిప్తో విముక్తవాంఛారసభోజనో నరః ।
ప్రయాతి లోకే ధరణీధరస్య విదుష్టకర్మాపీ మనుష్య జన్మా
సోహంనిరాశో భువి హీనకర్మా తవాగతః పాదసరోజయుగ్మమ్ ।
విజ్ఞప్తిమాత్రాభయదాప్తి కాలం కురుష్వ సర్గస్థితి నాశహేతోః
మాస్యుస్తదా పాపకృతో విహీనా యన్మామకైర్భూతగణైర్మనుష్యాః ।
నియన్త్రీతా శృంఖలరజ్ఞుబంధనై స్సమీపగా మే వశగా భవేయుః
భగ్నస్తు మార్గో రవితాపయుక్తో యద్విష్ణుసంఘైరతితీవ్రహస్తైః ।
విముచ్య కుంభీం సకలో జనౌఘం ప్రయాతి తద్ధామ పరాత్పరస్య
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే యమవాక్యం నామ చతుర్దోఽధ్యాయః.
యమధర్మరాజు పలికెను :- ఓపితామహా! స్వామీ! నామాటను వినుము. ప్రతాపమును తగ్గించుట మరణము కంటే అధికమైన బాధ. ఓ పద్మసంభవా. స్వామి ఆజ్ఞను నిస్పృహతో ఆచరించనివాడు తప్పక అంధకూపనరకమున పడిపోవును. సేవకుడు ప్రభువాజ్ఞను పాటించకనే యజమాని ధనమును అనుభవించినచో అతను కాష్ఠకీటముగా పుట్టును. ప్రజలనుండి కాని ప్రభువునుండి లోభముతో ధనమును తీసుకొని అనుభవించువాడు మూడు వందల కల్పములు నరకములో నుండును. తన పనిని పూర్తి చేసుకొనుటలో యజమాని కార్యమును నెరవేర్చని వాడు మూడు వందల కల్పములు యెలుకగా నుండును. సేవకుడై కూడా తన ఇంటిలో తన భృత్యులను చేయరాని పనికి నియోగించిననూ రాజు మార్జారమగును. కావున! ఓదేవా నేను నీ ఆజ్ఞచే పుణ్యము చేసిన వారిని పుణ్యముతో పాపములను చేసినవారిని పాపముతో ప్రజలను శాసించుచున్నాను. మునులతో, ధర్మశాస్త్రాదులతో చక్కగా విచారించి కల్పాదిలో నుండు నీకు ఎంతవరకు ఒకదినముండునో అంతవరకు నీఆజ్ఞను పాలించు నేను రుక్మాంగద మహారాజుచే ఈనాడు పరాభవించబడితిని. రుక్మాంగదుని భయమువలన సమస్త భూమండలము ఏకాదశినాడు భుజించటలేదు. ఇదియే వారి సర్వపాపములను నశింపచేయుచున్నది. అన్ని ధర్మములను వదిలి, పితృపూజను వదిలి, దేవపూజలను,తీర్థస్నానాది సర్రియలను విడిచి, యోగసాంఖ్యములను విడిచి జ్ఞానమును, జ్ఞేయమును విడిచి స్వాధ్యాయమును, హోమములను విడిచి బహు పాపపముల నాచరించి కూడా, ఏకాదశినాడు ఉపవసించి మానవులు తండ్రులతో తాతలతో ముత్తాతలతో వారి తండ్రులతో, తాతలతో, మాతామహులతో, వారీ జనకులతో విష్ణులోకమును చేరుచున్నారు. ఇదియే నాకు మర్మభేదకమగు మహాదుఃఖము. ప్రియురాలి తండ్రులు కూడా నావ్రాతను తుడిచి వైకుంఠమును చేరుచున్నారు. తండ్రి బీజముతో తల్లి కడుపులో ధరించును. కర్మచేయు వాడొక్కడే ఫలితమును అనుభవించును. ఇతరులు చేసినది బీజరూపముగా ధాత్రీసముద్భవము. కావున యేపిండము ఏ ఆకార ముండునో ఆరెండు పక్షములను తరింపచేయవచ్చును. భార్యాబిజముకాదు. భార్యగర్భధారిణి కాదు. అయిననూ ఆపక్షము వారెట్లు పరమపదమును చేరుచున్నారు? అల్లుని పుణ్యమహాత్మ్యముతో మామ విష్ణులోకమును చేరుచున్నాడు. అదియే నాతలనొప్పి. ఇటువంటి అధికారముతో నాకు ప్రయోజనములేదు. ఏకాదశిన ఉపవసించువాడు నన్నోదిలి కులత్రయము నుద్ధరించి తనతోపాటు హరిని చేరుచున్నాడు. యజ్ఞములతో, తీర్థములతో, దానములతో వ్రతములతో అట్టి విష్ణులోకప్రాప్తి లభించదు. జలమున అగ్నిలో మరణించు వారు కూడా విష్ణువ్రతమునాచరించువారు చేరు లోకమును చేరుటలేదు. ఇది నిజము. ఏకాదశీదినమున ఊర్థ్వపుండ్రమును ధరించి భోజనమునందు వాంఛను వదిలినచో పాపకర్ముడైనను విష్ణులోకమును చేరుచున్నాడు. కావున నేను నిరాశచెంది నీ పాదపద్మములను చేరితిని. నా విజ్ఞప్తితో అభయము నొసంగుము. పాపము చేసి కూడా నాభటుల బంధమును తప్పించుకొని, నా పాశములను తప్పించు కొను వారుండక నావశములో నుండవలయును. రవితాపముతో నాలోకపుదారి భగ్నమాయెను. అతి తీవ్రహస్తులగు విష్ణు భక్తులు కుంభీపాకమును విడిచి పరంధామమును చేరుచున్నారు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున యమవాక్యమను నాలుగవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 131 of the Nārada Mahā Purana is as follows:
శ్రీమహావిష్ణువునకు పరమ ప్రీతికరమైన ద్వాదశీ వ్రత మహిమ ఈ అధ్యాయంలో వివరింపబడినది. ద్వాదశీ తిథియందు శ్రీహరిని దివ్య తులసీ దళములతో, సుగంధ పుష్పములతో అర్చించి పారణ ఒనర్చు భక్తులకు సర్వ అభీష్ట సిద్ధులు లభించునని ఇక్కడ అభివర్ణించబడినది.