89 - లలితా స్తోత్రకవచసహస్రనామకథనమ్

సనత్కుమార ఉవాచ :

ఆథాసామావృతిస్థీనాం శక్తీంనా సమయేన చ

 నామ్నాం సహస్రం వక్ష్యామి గురుధ్యానపురస్పరమ్

నాధా నవ ప్రకాశాద్యా సుభగాంతాః ప్రకీర్తితాః

భూమ్యాదీని శివాంతాని విద్ధి తత్త్యాని నారద

గురుజన్మాది పర్వాణి దర్శనాని చ సప్త వై

ఏతాని ప్రాజ్మినోవృత్త్యా చింతయేత్సాధకోత్తమః

గురుస్తోత్రం జపేచ్చాపి తద్గతేనాంతరాత్మనా

నమస్తే నాథ భగవన్ శివాయ గురురూపిణే

విద్యావతారసంసిధ్యై స్వీకృతానేక విగ్రహ

నవాయ నవరూపాయ పరమార్థిక రూపిణే

సర్వానతమోభేదభానవే చిదనాయ తే

స్వతంత్రాయ దయాక్లుప్త విగ్రహాయ శివాత్మవే

పరతంత్రాయ భక్తానాం భవ్యానాం భవ్యరూపిణే

వివేకినాం వివేకాయ విమర్శాయ విమర్శనామ్

ప్రకాశానం ప్రకాశాయ జ్ఞానినాం జ్ఞానరూపిణే

పురస్తాత్వార్వయోః పృషే నమః కుర్యాముపర్యథః

సదా మచ్చిత్తసదనే విధేహి భవద్యాసనమ్

ఇతి స్తుత్వా గురుం భక్త్యా పరాం దేవీం విచంతయేత్

గణేశగ్రహనక్షత్ర యోగినీ రాశిరూపిణీమ్

దేవీం మంత్రమయీం నౌమి! మాతృకాపీఠరూపిణీమ్

ప్రణమామి మహాదేవీం మాతృకాం పరమేశ్వరమ్

కాలహృల్లోహలోల్లాహ కలానాశనకారిణీమ్

యదక్షరూవమాత్రేపి సంసిద్ధే స్పర్థతే నరః

రవితాక్షేన్లు కందర్చై శ్శంకరానల విష్ణుభిః

యదక్షరశశిజ్యోత్స్నా మండితం భువనత్రయమ్

వన్డే సర్వేశ్వరీం దేవీం మహాశ్రీసిద్ద మాతృకామ్

యదక్షరమహాసూత్ర ప్రోతమేతజ్జగత్రయమ్

బ్రహ్మాండాదికటాహాస్త్రం తాం వన్డే సిద్దమాతృకామ్

యదేకాదశమాధారం బీజం కోణత్రయోద్భవమ్

బ్రహ్మాండాది కటాహాంతం జగదద్యాపి దృశ్యతే

ఆకచాదిటతోన్నద్ద పయశాక్షరవర్గిణీమ్

జ్యేష్టాంగబాహుహృత్కంఠ కటిపాదనివాసినీమ్

నౌమికారాక్షరోద్ధారాం సారాత్సారాపరాత్పరామ్

ప్రణమామి మహాదేవీం పరమానన్దరూపిణీమ్

అధాపి యస్యా జానస్తి న మనాగపి దేవతాః

కేయం కస్మాత్వ కేనేతి సరూపారూపభావనామ్

వందే తామహమక్షయ్యం క్షకారాక్షరరూపిణీమ్

దేవీమలనలోల్లోల ప్రోల్లసన్తం శివాం పరామ్

వర్గానుక్రమయోగేన యస్యావ్యోమాష్టకం స్థితమ్

వందే తామష్టవర్గోత్త మహాసిద్ధాదికేశ్వరీమ్

కామపూర్ణజకారాఖ్య సుపీఠాంతర్నివాసినీమ్

చతురాజ్ఞా కోశభూతాం నౌమి శ్రీత్రిపురామహమ్

ఏతత్త్సోత్రం తు నిత్యానాం యః పఠేత్సుసమాహితం

పూజాదౌ తస్య సర్వాస్తా వరదా స్స్యుర్న సంశయః

సనత్కుమార మహర్షి పలికెను :- ఇక ఇపుడు ఈఆవరణములలో నుండు శక్తులనియమములననుసరించి గురుధ్యాన పురస్పరముగా నామసహస్రమును చెప్పెదను. ప్రకాశమొదలుకొని సుభగవరకు తొమ్మిదిమంది నాధలుగా చెప్పబడిరి. భూమి మొదలుకొని శివవరకుండునవి తత్త్యములని తెలియుము. గురుజన్మమొదలుకొని దర్శవరకు ఏడుపరలు. వీటిని సాధకుడు మొదట ధ్యానించవలయును. తద్దత మనస్కుడై గురుస్తోతమును జపించవలయును. ఓనాథ! గురురూపుడవగు శివా! నీకు నమస్కారము. విద్యావతార సంసిద్ధి కొరకు అనేక రూపములను స్వీకరించితివి. నవునకు, నవరూపునకు, పరమార్థక రూపునకు, సర్వా జ్ఞానతమోభేద భానునకు చిదనరూపునకు, స్వతంత్రునకు, దయాక్లుప్త విగ్రహునకు, శివస్వరూపునకు, భక్త పరతంత్రునకు భవ్యులకు భవ్యరూపునకు, వివేకులలో వివేకమునకు, విమర్శుల, విమర్శకు, ప్రకాశముల ప్రకాశమునకు, జ్ఞానుల జ్ఞాన రూపునకు ముందు, ఇరు ప్రక్కల, వెనుక, ఉపరి భాగమున, అధోభాగమున నమస్కరించెదను. ఎప్పుడూ నా చిత్త మందిరమున నీ నివాసము నేర్పరచుకొనుము. ఇట్లు భక్తిచే గురువును స్తుతించి పరాదేవిని ధ్యానించవలయును. గణేశ గ్రహ నక్షత్ర యోగినీ రాశి రూపిణి, మంత్ర స్వరూపిణియగు మాతృకాపీఠ రూపిణి, పరమేశ్వరి కాలహృల్లో హలోల్లోహ కలానాశనకారిణి యగు మహాదేవికి నమస్కారము ఈ దేవి మంత్రములోని ఒక అక్షరము సిద్ధించిననూ సూర్యగరుడ చంద్ర మన్మథ శంకర అగ్ని విష్ణువులతో నరుడు పోటీపడును. ఈ భువనత్రయము ఈ మంత్రాక్షర చంద్ర చంద్రకాంతులచే అలంకరించబడియున్నది. అట్టి మహా శ్రీ సిద్ధ మాతృకయగు సర్వేశ్వరీ దేవిని నమస్కరించెదను. ఈ జగత్రయము ఈ దేవీ మంత్రాక్షర సూత్రమున కూర్చబడియున్నది. అట్టి సిద్ధ మాతృకకు నమస్కారము. ఈ దేవి యొక్క ఏకాదశాధారము కోణ త్రయోద్భవ బీజము బ్రహ్మండాది కటాహాంతముగా గోచరమగుచున్నది. అ కచట తపయశ అక్షర వర్గాణి జ్యేష్టాంగ బాహుహృత్కంఠ కటిపాద నివాసిని ఈ కారాక్షరోద్ధార సారములన్నింటిలోని సారము, పరముల కంటే పరమగు దేవికి నమస్కారము. పరమానన్ద రూపిణి యగు మహాదేవికి నమస్కారము. అయిననూ ఈ దేవియొక్క ఒక్కకలను కూడా దేవతలు తెలియజాలరు. ఎవరీమె? ఎక్కడి నుండి వచ్చినది? ఎక్కడుండును? ఎట్లుండను? దేనిచేనుండును? సరూపారూపభావనలను తెలియజాలరు. అట్టి క్షయరహిత క్షకారాక్షరరూపిణి కులకలోల్లోల పొల్లపల్లి, శివ, పరయగు దేవిని నమస్కరించెదను. వర్గాను క్రమయోగముచే ఈమెకు ఉమాష్టకమని పేరు కలిగినది. అట్టి అష్టవర్గ భవమగు మహాసిద్ద్యాదికేశ్వరుని నమస్కరించెదను. కామ పూర్ణజకార సుపీఠాంతర్నివాసిని, చతురాజ్ఞాకోశభూత శ్రీత్రిపురాదేవిని నమస్కరించెదను. ఇట్లు నిత్యాదేవుల స్తోత్రమును సావధానముతో పూజాదియందు పఠించువానికి నిత్యాదేవతలందరు వరప్రదలౌదురు.

అథ తే కవచం దేవ్యా వక్ష్యే నవరతాత్మకమ్

యేన దేవాసురనర జయీ స్యాత్సాధకస్సదా

 సర్వత స్సర్వదాత్మానం లలితా పాతు సర్వగా

కామేశీ పురతః పాతు భగమాలీ త్వనంతరమ్

దిశం పాతు తథా దక్ష పార్శ్వం మే పాతు సర్వదా

నిత్యక్లిన్నాథ భేరుండా దేశం మే పాతు కౌణపీమ్

తథైవ పశ్చిమం భాగం రక్షతాద్వహ్నివాసినీ

మహావజ్రేశ్వరీ నిత్యా వాయవ్యే మా సదావతు

వామపార్వం సదా పాతు ఇతీమే లలితా తతః

మహేశ్వరీం దిశం పాతు త్వరితం సిద్ధిదాయినీ

పాతు మామూర్థ్వత శ్శశ్వత్ దేవతామల సున్దరీ

ఆ నీలపతాకాఖ్యా విజయా సర్వతశ్చ మామ్

కరోతు మే మంగలాని సర్వదా సర్వమంగలా

దేస్థాయమనఃప్రాణాన్ జ్వాలామాలినివిగ్రహా

పాలయత్వనిశం చిత్తా చిత్తం మే సర్వదావతు

కామాక్రోథాతథా లోభాన్మోహాన్మానాన్మదాదపి

పాపానాం సర్వతశ్శోకాత్ సంక్షయాత్సర్వత స్సదా

అసత్యాత్ర్కూర చింతాతో హింసాతశ్చారతస్సదా

సౌమిత్యాచ్చ సదా పాతు ప్రేరయంత్యశ్శుభం ప్రతి

నిత్యాషోడశ మాం పాలతు గజారూఢ స్వశక్తిభిః

తథా హయసమారూఢాః పాంతు మాం సర్వతస్సదా

సింహారూఢస్సదా పాంతు పాంతు ఋక్షగతా అపీ

రథారూఢాశ్చ మాం పాతు సర్వత స్సర్వదా రణే

తారారూఢాశ్చ మాం పాండు తథా వ్యోమగతాశ్చ తాః

భూతగా స్సర్వగాః పాతు పాంతు దేవ్యశ్చ సర్వదా

భూతప్రేత పిశాచాశ్చ పురవృత్యాదిధాన్దదాన్

ద్రావయంతు స్వశక్తీనాం భూషణెరాయుధైర్మమ గజాశ్వద్వీపిపంచాస్య తారారూఢాఖిలాయుధః

అసంఖ్యాశక్తయో దేవ్య పాంతు మాం సర్వత స్సదా

సాయం ప్రాతర్జపన్నిత్యా కవచం సర్వరక్షకమ్

కదాచిన్నాశుభం పశ్యేత్సర్వదానందమాస్థితః

ఇత్యేతత్కవచం ప్రోక్తం లలితాయాశ్శుభావహమ్

యస్య సంధారణాన్మర్త్యో నిర్భయో విజయీ సుఖీ

ఇక ఇపుడు నీకు నవరతాత్మకమగు దేవీకవచమును చెప్పెదను. ఈ కవచమును ఉపాసించు నరుడు దేవాసురనరులను జయించు వాడగును. అంతటా అన్నివేళలా అంతటనుండు లలితాదేవి కాపాడుగావుత. ముందు భాగమున కామేశి, వెనుక భాగమున భగమాలిని, కుడి ప్రక్క అన్ని వేళలా నిత్యక్లిన్న, నైఋతదిశను భేరుండ కాపాడుకొవుత. వహ్నవాసిని పశ్చిమ దిక్కును, వాయవ్యదిక్కున మహా వజ్రేశ్వరి, వామపార్వమును లలిత కాపాడు గావుత. సిద్ధి దాయినీ ఈశాన్య దిక్కును కాపాడు గావుత. కులసుందరిదేవత ఊర్థ్వ భాగమును కాపాడుదువుగాత. నీలపతాకాదేవి ఆధోభాగమును, విజయఅన్ని దిక్కులందు కాపాడుగావు. సర్వమంగళాదేవి నాకెల్లపుడు శుభములను ఇచ్చుగాక. జ్వాలామాలిని విగ్రహాదేహాశ్రియ మనః ప్రాణములును, చిత్తమును, చిత్తాదేవి ఎల్లపుడూ కాపాడుగావుత. కామక్రోధలోభమోహమదములనుండి, పాపశోకములనుండి అంతటా అన్ని వేళలా కాపాడుగావుత. అసత్యమునుండి, సంక్షయము నుండి, క్రూరాలోచన నుండి, వాసాచౌర్యముల నుండి సౌమిత్యము నుండి కాపాడుచు శుభములవైపు ప్రేరణ చేయు గావుత. తమ తమ శక్తులచే కూడుకొని గజారూఢులైన షోడశనిత్యలు నన్ను కాపాడుదురు గాత. అట్లే హయారూఢలు, సిహారూఢలు, ఋక్షారూఢలు, రథారూఢలు, గరుడారూఢలు, వ్యోమగతలు, భూగతలు అసర్వగతలు అన్ని వేళలా అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగావుత. భూత ప్రేతపిశాచ పురకృత్యాదికలను, రోగములను స్వశక్తి భూషణాయుధములచే పారద్రోలుగావుత. గజవ్యాఘసింహ గరుడా రూఢలు, అభిలాయుధ ధారిణులు అసంఖ్యాక శక్తులు దేవీసముదాయము అంతటా అన్నివేళలా నన్ను కాపాడువు గావు. ఇట్లు ప్రతిదినము ప్రాత సాయంకాలములో సర్వరక్షకమగు నిత్యాకవచమును పఠించువారు ఎప్పుడూ అశుభమును చూడరు. ఎల్లపుడూ ఆనందమునే అనుభవింతురు. ఇట్లునీకు శుభావహమగు లలితా కవచమును చెప్పితిని. ఈ కవచమును ధరించుటచే నిర్భయుడూ విజయుడూ కాగలడు.

అథ నామ్నాం సహస్రం తే వక్ష్యే సావరణార్చనమ్

షోడశానామపి మునే స్వస్వక్రమగతాత్మకమ్

లలితా చాపి వా కామాఈశ్వరీ భగమాలినీ

నిత్యక్లిన్నా చ భేరుండా కీర్తితా వహ్నివాసినీ

వజ్రేశ్వరీ తథా దూతీ త్వరితా కులసుందరీ

నిత్యా సంవిత్తథా నీలపతాకా విజయాహ్వయా

సర్వమంగలికా చాపి జ్వాలామాలినిసంజ్ఞతా

చిత్రాచేతి క్రమాన్నిత్యా షోడశాపీష్టవిగ్రహాః

కురుకుల్లా చ వారాహీ ద్వే ఏతే చేష్టవిగ్రహా

 వశినీ చాపి కాశీ మోహినీ విమలారుణా

తపినీ చ తథా సర్వేశ్వరీ చాప్యథకాలినీ

ముద్రణం తనురిష్వర్ణరూపా చాపర్ల విగ్రహా

పాశావర్ణశరీరాచా కుర్వర్ణసువపుర్థరా

త్రిఖండా స్థాపినీ సన్నిరోధనీ భావగుంఠనీ

సన్నిధానేషు చాపాఖ్యా తథా పాశాంకుశాభిథా

నమస్కృతిస్తథా సంక్షోభణీ విద్రావణీ తథా

ఆకర్షణీ చ విఖ్యాతా తధైవావేశవారిణీ

ఉన్మాదినీ మహాపూర్వా కుశాభో ఖేచరీ మతా బీజా

శక్త్యుపనా చ స్థూలసూక్ష్మపరాభిదా

అణిమా లఘిమా చైవ మహిమా గరిమా తథా

ప్రాప్తి: ప్రకామితా చాపి చేశితా వశితా తథా

భుక్తిసిద్ధిస్తధైవేచ్ఛా సిద్దిరూపా చ కీర్తితా

బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా

వారాహీన్రిచ చాముండా మహాలక్ష్మీస్వరూపిణీ

కామా బుద్ధిరహంకారా శబ్దస్పర్శస్వరూపిణీ

రూపరూపా రసాహ్వా చ గంధవిత్తధృతిస్తథా

నాభిబీజామృతాఖ్యా చ స్మృతదేహాత్మరూపిణీ

కుసుమా మేఖలా చాపి మదనా మదనాతురా

రేఖా సంవేగినీ చైవ హ్యంకుశా మాలినీతి చ

సంక్షోభిణీ తథా విద్రావీణ్యాకర్షణరూపిణీ

ఆహ్లాదినీతి చ ప్రోక్తా తథా సంమోహినీతి చ

 స్తంభినీ జంభినీ చైవ వశంకర్యథ రంజినీ

ఉన్మాదినీ తథైవార్థసాధినీతి ప్రకీర్తితా

సంపత్తిపూర్ణా సా మంత్రమయీ ద్వంద్వక్షయంకరీ

సిద్దిసంపత్ర్పదా చైవ ప్రియమంగలకారిణీ

 కామప్రదా నిగదితా తథా దుఃఖవిమోచనీ

మృత్యుప్రశమనీ చైవ తథా విఘ్ననివారిణీ

అంగసుందరికా చైవ తథా సౌభాగ్యదాయినీ

జ్ఞానైశ్వర్యప్రదా జ్ఞాన మయీ చైవ చ పంచమి

 వింధ్యవాసనకా ఘోర స్వరూపాపాపహారిణీ

తథానన్దమయీ రక్షా రూపేప్సితఫలప్రదా

 జయినీ విమలా చాడ కామేశీ వజ్రాణీ భగా

త్రైలోక్యమోహనాస్థానా సర్వాశాపరిపూరణీ

సర్వసంక్షోభణగతా సౌభాగ్యప్రదసంస్థితా

సర్వార్థసాధకాగారా సర్వరోగహరా స్థితా

 సర్వరక్షాకరాస్థానా సర్వసిద్ధిప్రదస్థితా

 సర్వానందమయాధారా బిందుస్థానశివాత్మికా

ప్రకృష్టా చ తథా గుప్తా ప్లేయా గుప్తతరాపి చ

సంప్రదాయ స్వరూపా చ కులకౌల నిగర్బగా

రహస్యా పరాప్రాకృ తథైవాతి రహస్యకా

త్రిపురా త్రిపురేశీ చ తథైవ పురవాసినీ

 శ్రీమాలినీ చ సిద్ధాన్తా మహాత్రిపుర సుందరీ

నవరత్నమయద్వీప నవఖండ విరాజితా

కల్పనోద్యాన సంస్థా చ ఋతురూపేన్టియార్చకా

కాలముద్రా మాతృకొఖ్యా రత్నదేశోపదేశికా

తత్యాగ్రహాభిదా మూర్తిస్తథైవ విషయద్విషా

దేశకాలాకారశబ్ద రూపా సంగీత యోగినీ

 సమస్త గుప్త ప్రకట సిద్ధయోగిని చక్రయుక్

వహ్ని సూర్యేన్లు భూతాహ్వా తథాతాస్వక్షరాహ్వయా

పంచధార్చ స్వరూపా చ నానావ్రత సమాహ్వయా

నిషిద్ధాచార రహితా సిద్ధచిహ్న స్వరూపిణీ

చతుర్థి కూర్మ భాగస్థా నిత్యాద్యర్చ స్వరూపిణీ

దమనాది సమభ్యర్చా షట్కర్మ సిద్ధి దాయినీ

తిథివార పృథగ్రవ్య సమర్చన శుభావహా

వాయోశ్యనంగ కుసుమా తథైవానంగమేఖలా

అనంగ మదనానంగ మదనాతుర సాహ్వయా

మదదేగినికా చైవ తథా భువన పాలినీ

శశిరేఖా సముద్దిష్టా గతిలేఖాహ్వాయా మతా

శ్రద్ధా ప్రీతీ రతిశ్చైవ ధృతిః కాంతి ర్మనోరమా

 నునోహరా సమాఖ్యాతా తథైవ హి మనోరథా

మదనోన్మాదినీ చైవ మోదినీ శంఖినీ తథా

శోషిణీ చైవ శంకారీ సింజనీ సుభగా తథా

పూషా చే ద్వాసుమనసా రతిః ప్రీతిర్థతి స్తథా

బుద్ధి సౌమ్యా మరీచిశ్చ తథైవ హ్యంశుమాలినీ

శశినీ చోంగిరా ఛాయా తథా సంపూర్ణమండలా

తుష్టిస్తథామృతాఖ్యా చ డాకినీ సాధ లోకపా

బటుకేభా స్వరూపా చ దుర్గా క్షేత్రేశ రూపిణీ

కామరాజు స్వరూపా చ తథా మన్మధ రూపిణీ

కందర్ప రూపిణీ చైవ తథా మకర కేతనా

మనో భవ స్వరూపా చ భారత్ వర్ణ రూపిణీ

మదనా మోహినీ లీలా జంభినీ చోద్యమా శుభా

 హోదినీ ద్రావిణీ ప్రీతీరతా రక్త మనోరమా

సర్వోన్మాదా సర్వముఖా హ్యభంగా చామితోద్యమా

 అనల్పా వ్యక్తవిభవా వివిధ క్షోభవిగ్రహా

రాగశక్తి క్షేష శక్తి స్తథా శబ్దాది రూపిణీ

 నిత్యా నిరంజన్ క్లిన్నా శ్లేదినీ మదనాతురా

మద ద్రవా ద్రవిణీ చ ద్రావిణీ చేతి కీర్తితా

మదావిలా మంగలా చ మన్మథానీ మనస్వినీ

మోహామోదా మానమయీ మాయా మందా మీలావతీ

విజయా విమలా చైవ శుభా విశ్వా తథైవ చ

విభూతిర్వనితా చైవ వివిధా వినతా క్రమాత్

కమలా కామినీ చైవ కిరాతా కీర్తి రూపిణీ

కుట్టినీ చ సముద్దిష్టి తథైవ కులసుందరీ

కల్యాణీ కాలకోలా చ డాకినీ శాకినీ తథా

లాకినీ కాకినీ చైవ రాకినీ కాకినీ తథా

ఇచ్ఛా జ్ఞానా క్రియాఖ్యా చ ఆయుధాష్టకధారిణీ

కపర్దినీ సముద్దిష్టా తథైవ కులసున్దరీ

జ్వాలినీ విస్ఫులింగా చ మంగలా సుమనోహరా

కనకా కీనవా విద్యా వివిధా చ ప్రకీర్తితా

మేషా వృషాహ్వయా చైవ మిధునా కర్కటా తథా

సింహా కన్యా తులా కీటా చాపా చ మకరా తథా

కుంభా మీనా చ సారా చ సర్వభక్షా తథైవ చ

విశ్వాత్మా వివిధోద్భూత చిత్రరూపా చ కీర్తితా

 నిస్సపత్నా నిరాళంకా యాచనాచింత్యవైభవా

రక్తా చైవ తతః ప్రోక్తా విద్యాప్రాప్తి స్వరూపిణీ

హృల్లేఖా శ్లేదినీ క్లిన్నా క్షోభిణీ మదనాతురా

నిరంజనా రాగవతీ తథైవ మదనావతీ

మేఖలా ద్రావిణీ వేగవతీ చైవ ప్రకీర్తితా

కమలా కామినీ కల్పా కలా చ కలితాద్భుతా

కిరాతా చ తధా కాలా కదనా కౌశికా తధా

 కంబుకాదనికా చైవ కాతరా కపటా తధా

కీర్తిశ్చాపి కుమారీ చ కుంకుమా పరికీర్తితా

భంజినీ వేగినీ నాగా చపలా పేశలా సతీ

రతిశ్రద్ధా భోగలోలా మదోన్మత్తా మనస్వినీ

విహ్వలా కరిణీ లోలా తథా మదన మాలినీ

వినోదా కౌతుకా పుణ్యా పురాణా పరికీర్తితా

వాగేశీ వరదా విశ్వా విభవా విఘ్నకారిణీ

బీజవిఘ్నహరా విద్యా సుముఖీ సుందరీ తథా

 సారా చ సుమనా చైవ తథా ప్రోక్తా సరస్వతీ

సమయా సర్వగా విద్దా శివా వాణీ చ కీర్తితా

 ధూరసిద్దా తథా ప్రోక్తాధో విగ్రహవతీ మతా

నాదా మనోన్మనీ ప్రాణ ప్రతిష్టారుణ వైభవా

ప్రాణాపానా సమానా చ వ్యానోదానా చ కీర్తితా

నాగా కూర్మా చ కృకలా దేవదత్తా ధనంజయా

ఫట్కారీ కింకరారాధ్యా జయా చ విజయా తథా

హుంకారీ ఖేచరీ చండా ఛేదినీ క్షపిణీ తధా

స్త్రీ హుంకారీ క్షేమకరీ చతురక్షర రూపిణీ

శ్రీవిద్యా మాత వర్లాంగే కాలీ యామ్యా నృపార్లకా

భాషా సరస్వతీ వాణీ సంస్కృతా ప్రాకృతా పరా

బహురూపా చిత్తరూపా గమ్యానన్హా చ కౌతుకా

త్రయాఖ్యా పరమాత్మాఖ్యా ప్యమేయవిభవా తధా

వాక్స్వరూపా బిన్దుసర్గరూపా విశ్వాత్మికా తధా

తధా శ్రిపురకందాఖ్యా జౌత్రాది త్రివిధాత్మికా

ఆయుర్లక్ష్మీ కీర్తిభోగ సౌందర్యారోగ్యదాయికా

ఐహికాముష్మిక జ్ఞానమయీ చ పరికీర్తితా

 జీవాఖ్యా విజయాఖ్యా చ తథైవ విశ్వవిన్మయీ

హృదాది విద్యారూపాది భానురూపా జగద్వపుః

విశ్వమోహనికా చైవ త్రిపురామృత సంజ్లికా

సర్వాప్యాయనరూపా చ మోహినీ క్షోభణీ తధా

క్లేదినీ చ సమాఖ్యాతా తధైవ చ మహోదయా

సంపత్కరీ హలక్షార్లా సీమా మాతృతనూరతిః

 ప్రీతిర్మనోభవా వాపి ప్రోక్తా వారాధిపా తధా

త్రికూటా చాపి షట్కూటా పంచకూటా విశుద్ధగా

అనాహత గతా చైవ మణిపూరక సంస్థితా

స్వాధిష్టానస మాసీనా దౌరస్తా జ్ఞాసమాస్థితా

 షడ్రింశత్కూట రూపా చ పంచాశన్మిధునాత్మికా

పాదుకాదికసిద్ధీశా తదా విజయ దాయినీ

కామరూప ప్రదావేశాలరూపా చ పిశాచికా

విచిత్ర విభ్రమా హంసీ భీషణీ జనరంజికా

విశాలా మదనా తుష్టా కాలకంఠీ మహాభయా

మాహెన్రీ శంఖినీ చైందీ మంగలా వటవాసినీ

మేఖలా సకలా లక్ష్మీర్మాలినీ విశ్వనాయికా

సులోచనా సుశోభా చ కామదా చ విలాసినీ

కామేశ్వరీ నన్లినీ చ స్వర్ణరేఖా మనోహరా

ప్రమోదా రాగిణీ సిద్ధా పద్మినీ చ రతిప్రియా

 కల్యాణదా కలా దక్షా తతశ్చ సురసుందరి!

విభ్రమా వాహకా వీరా వికలా కోరకా కవిః

సింహనాదా మహానాదా సుగ్రీవా మర్కటా శఠా

బిడాలక్షా బిడాలాస్యా కుమారీ ఖేచరీ భవా

మయూరా మంగలా భీమా ద్విపవక్రా ఖరాననా

మాతంగీ చ నిశాచారా వృషగ్రాహా వృకాననా

సౌరభాస్యా గజముఖా పశువక్రా మృగాననా

క్షోభకా మణిభద్రా చ క్రీడకా సింహ చక్ర

మహోదరా స్థూలశిఖా వీకృతాస్యా కరాననా

చపల్లా కుక్కుటాస్యా చ పాలినీ మదనాలసా

మనోహరా దీర్ఘజంఘా స్థూలదన్హా దశాననా

సుముఖా పండితా క్రుద్ధా వరాహాస్యా సటాముఖా

కపటా కౌతుకా కాలా కింకరా కితవా ఇలా

భక్షకా భయదాసిద్దా సర్వగా చ ప్రకీర్తితా

జయా చ విజయ దుర్గా భద్రా భద్రకరీ తథా

అంబికా వామదేవీ చ మహామాయా స్వరూపిణీ

విదారికా విశ్వమయీ విశ్వావిశ్వవి భంజితా

వీరా విక్షోభిణీ విద్యా వినోదా బీజవిగ్రహా

వీతా శోకా విషగ్రీవా విపులా విజయ ప్రదా

విభవా వివిధ విప్రా తథైవ పరికీర్తితా

మనోహరా మంగళా చ మదోత్సకా మనస్వినీ

మానినీ మధురా మాయా మోహినీ చ తథా స్మృతా

భద్రా భవానీ భవ్యా చ విశాలాక్షీ శుచిస్మితా

కకుభా కమలా కల్పా కలాధో పూరణీ తథా

నిత్యా చాప్యమృతా చైవ జీవితా చ తథా దయా

 అశోకా హ్యమలా పూర్ణా పూర్ణాభాగ్యోద్యతా తధా

వివేకా విభవా విశ్వా వితతా చ ప్రకీర్తితా

కామినీ ఖేచరీ గర్వా పురాణా పరమేశ్వరీ

గౌరీ శివా హ్యమేయా చ విమలా విజయా పరా

పవిత్రా పద్మినీ విద్యా విశ్వేశీ శివవల్లభా

ఆశేషరూపా హ్యానందాంబుజాక్షీ చాప్యనిందితా

వరదా వాక్యదా వాణీ వివిధ వేద విగ్రహా

విద్యా వాగీశ్వరీ సత్యా సంయతా చ సరస్వతీ

నిర్మలానన్ద రూపా చ హ్యమృతా మానదా తథా

పూషా చైవ తథా పుష్టిస్తుష్టి శ్చాపి రతిరతి:

శశినీ చన్రికా కాంతి ర్ద్యోత్స్నా శ్రీ: ప్రీతి రంగదా

పూర్ణా పూర్ణామృతా కామదాయినీన్లు కలాత్మికా

తపినీ తాపినీ ధూమ్రా మరీచిర్జలినీ రుచిః

సుషుమ్లా భోగాదా విశ్వా బాధినీ ధారిణీ క్షమా

ధూమ్రార్చిదుష్మా జ్వలినీ జ్వాలిసీ విస్ఫులింగినీ

సుశ్రీ స్వరూపా కపిలా హవ్య కవ్యవహా తధా

ఘస్మరా విశ్వకబలా లోలాక్షీ లోల జిహ్వికా

సర్వభక్షా సహస్రాక్షీ నిస్సంగా చ గతిప్రియా

అచింత్యా చాప్రమేయా చ పూర్ణ రూపా దురాసదా

సర్వా సంసిద్ధ రూపా చ పావనీ త్యేకరూపిణీ

తథా యామలవేధాఖ్యా శాక్తీ వేద స్వరూపిణీ

తథా శాంభవవే ధా చ భావనా సిద్ధి సూచినీ

వహ్నిరూపా తధా దస్రా హ్యమా విఘ్నా భుజంగమా

షణ్ముఖా రవిరూపా చ మాతా దుర్గా దిశా తధా

ధనదా కేశవా చాపి యమి చైవ హరా శశా

అశ్వినీ చ యమి వహ్నిరూపా ధాత్రీతి కీర్తితా

చన్హా శివా దితిర్జీవా సర్పిణీ పితృరూపిణీ

 అర్యమౌ చ భగా సూర్యా త్వాష్టీ మారుతిసంజైవా

 ఇంద్రాగ్నిరూపా మిత్రా చాపీన్హాణీ నిభ్రాతిర్జలా వైశ్వదేవీ హరితభూర్వాసవీ వరుణా జయా అహిర్భుధ్యా పూషణీ చ తథాకారస్కరిమలా

ఉదుంబరాజంబుకా చ ఖదిరా కృష్ణరూపిణీ

వంశా చ పిప్పలా నారా రోహిణీ చ పలాశకా

పక్షకా చ తథామ్బష్ణా బిల్వాచార్జునరూపిణీ

వికంకుతా చ కకుభా సరలా చాపి సర్జికా

 మంజులా పనసారా చ శమి హలిప్రియామకా

 నింబా మధూవసంజ్ఞాచాప్యశ్వత్థా చ గజాహ్వయా

నాగినీ సర్పణే చైవ శునీ చాపి బిరాలినీ

ఛానీ మార్టారికా మూషీ వృషభా మాహిషీ తథా

శార్దూలీ సౌరభ్ వ్యాఘ్ హారిణీ చ మృగీ శునీ

 కపిరూపా చ గోఘంటా వానరీ చ నరాశ్వినీ

నగా గౌర్హస్తినీ చేతి తథా షట్చక్రవాసినీ

త్రిఖండా తీర పాలాఖ్యా భ్రామణీ ద్రావిణీ తథా

సోమా సూర్యాతిథి ర్వారా యోగార్క్షా కరణాత్మికా

యక్షిణీ తారణా వ్యోమశబ్దాద్యా ప్రాణినీ చ ధీః

 క్రోధినీ స్తంభినీ చండో చ్చంగా బ్రహ్మాది రూపిణీ

సింహస్థా వ్యాఘ్రగా చైవ గజాశ్వ గరుడ స్థితా

భౌమ్యా తేజసీ వాయురూపిణీ నాభసా తథా

ఏకవక్రా చతుర్వక్రా నవవక్రా కలాననా

పంచవింశతి వక్రా చ షడ్వింశద్వదనా తథా

ఊనపంచాశదాస్యాచ చతుషష్టిముఖా తథా

ఏకాశీతి ముఖా చైవ శతానన సమన్వితా

 స్థూలరూపా సూక్ష్మరూపా తేజోవిగ్రహధారిణీ

వృణావృత్తి స్వరూపా చ నాధా వృత్తి స్వరూపిణీ

తత్యావృత్తిస్వరూపాపి నిత్యావృత్తివపుర్ధరా

అంగావృత్తి స్వరూపా చాప్యాయుధావృత్తి రూపిణీ

 గురు పంక్తి స్వరూపా చ విద్యావృత్తి తనుస్తథా

బ్రహ్మద్యా వృత్తిరూపా చ పరాపశ్యంతికా తథా

మధ్యమా వైఖరీ శీర్ష కంఠఁల్వోష్టదనగా

 జిహ్వా మూలగతా నాసా గత్ర సృలగామినీ

  పదవాక్య స్వరూపా చ వేదభాషా స్వరూపిణీ

సేకాఖ్యా వీక్షణాఖ్యాచోపదేశాఖ్యా తథైవ చ

వ్యాకులాక్షర సంకేతా గాయత్రీ ప్రణవాదికా

 జపహోమార్చన ధ్యాన యంత్రతర్పణ రూపిణీ

 సిద్ధసారస్వతా మృత్యుం జయా చ త్రిపురా

తథా గారుడా చాన్నపూర్ణాచాప్యశ్వారూఢ నవాత్మికా

గౌరీ చ దేవీ హృదయా లక్షదా చ మతంగినీ

నిష్కత్రయపదా చేష్టా వాదినీ చ ప్రకీర్తితా

రాజలక్ష్మీర్మహాలక్ష్మీ సిద్ధలక్ష్మీర్గవాననా ఇత్యేవం

లలితా దేవ్యా దివ్యం నామ సహస్రకమ్

సర్వార్ధసిద్ధిదం ప్రోక్తం చతుర్వర్గ ఫలప్రదమ్

ఏతన్నిత్యముషకాలే యో జపేచ్ఛుద్ధమానసః

స యోగీ బ్రహ్మవిజ్ఞానీ శివయోగీ తథాత్మవిత్

 ద్విరావృత్త్యా ప్రజపతో హ్యాయురారోగ్య సంపదః

 లోకానురంజనం నారీ నృపా వర్జన కర్మ చ

అపృథక్షేన సిద్ధ్యంతి సాధకస్యాస్య నిశ్చితమ్

త్రిరావృత్యాస్య వై పుంసో విశ్వం భూయాదఖిలమ్

 చతురావృత్తితశ్చాస్య సమిహిత మనారతమ్

ఫలత్యేవ ప్రయోగార్డో లోకరక్షాకరో భవేత్

పంచావృత్త్యా నరా నార్యో నృపా దేవాశ్చ జన్తవః

భజంత్యేనం సాధకం చ దేవ్యామాహితచేతసః

షడావృత్త్యా తన్మయ స్స్యాత్సాధకశ్చాస్య సిద్ధయః

అచిరేశైవ దేవీనాం ప్రసాదాత్సంభవస్తి చ

సప్తావృత్త్యారిరోగాది కృత్యాపస్మారనాశనమ్

 అష్టావృత్యా నరో భూపాన్ని గ్రహానుగ్రహక్షమ:

నవావృత్యా మన్మధాభో విక్షోభయతి భూతలమ్

 దశావృత్యా పఠేన్నిత్యం వార్లక్ష్మీ కాంతిసిద్ధయే

రుద్రావృత్యాభిలర్ధిశ్చ తదాయత్తం జగద్భవేత్

 అర్కావృత్త్యా సిద్ధిభిస్స్యా ద్దిగ్ఫెర్మర్యో హరోపమః

విశ్వవృత్త్యా తు విజయీ సర్వతస్స్యాత్సుఖీ నరః

 శక్రావృత్యాభిలేప్టాప్తి స్సర్వతో మంగలం భవేత్

తిధ్యావృత్త్యాభిలానిష్టానయత్నాదాప్నుయాన్నరః

షోడశావృత్తితో భూయాన్నరస్సాక్షాన్మహేశ్వరః

 విశ్వం స్రష్టుం పాలయితుం సంహర్తుం చ క్షమో భవేత్

మండలం మాసమాత్రం వా యో జపేద్యద్యదాశయః

తత్తదేవాప్నుయాత్సత్యం శివస్య వచనం యథా

 ఇత్యేతత్కథితం విప్ర నిత్యావృత్యర్చనాశ్రితమ్

నామ్నాం సహస్రం మనసో భీష్ట సంపాదన క్షమమ్

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే లలితాస్తోత్ర కవచ సహస్రనామ కథనం నామ ఏకోన నవతి తమోధ్యాయః

 ఇక ఇపుడు నీకు లలితా సహస్ర నామములను షోడశ శక్తుల క్రమాగతమగు ఆవరణార్చనమును చెప్పెదను. లలితా, కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నా భేరుండా, వహ్నివాసినీ, వశ్వరీ, దూతీ, త్వరితా, కులసుందరీ, నిత్యా, సంవత్, నీల పతాకా, విజయా, సర్వమంగలికా, జ్వాలామాలినీ, చిత్రా అను పదునారుమంది ఇష్ట విగ్రహాలు. కురుకుల్ల, వారాహి అను ఇద్దరు ఇష్ట విగ్రహాలు వశిని, కామేశి, మోహినీ, విమలా, అరుణ, తపని, సర్వేశ్వరి, కౌలినీ, ఇష్వర్ణ రూపా, అపర్ణ విగ్రహా, పాశవర్ణశరీర, ఆకుర్వర్ణసువపుర్ధరా, త్రిఖండా, స్థాపినీ, సన్నిరోధినీ, అవగుంఠనీ, ఇషు చాపాఖ్యా, పాశాంకుశాభిదో, నమస్కృతి, సంక్షోభణీ, విద్రావణీ, ఆకర్షణీ, విఖ్యాతా, ఆవేశకారిణీ, ఉన్మాదినీ, మహా. పూర్వా, కుశాభో, ఖేచరీ, బీజా, శక్త్యుష్ఠాపనా, స్థూలసూక్ష్మా పరాభిధా, అణిమా, లఘిమా, మహిమా, గరిమా, ప్రాప్తి, ప్రకామితా, ఈశితా, వశితా, భుక్తి, సిద్ది, ఇచ్చా, సిద్దిరూపా, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవీ, వారాహీ, ఇంద్రాణీ, చాముండా, మహాలక్ష్మీ, కామా, బుద్ధి, అహంకార శబ్ద స్పర్శ స్వరూపిణీ, ఆత్మరూపిణీ, కుసుమా, మేఖలా, మదనా, మదనాతురా, రేఖా, సంవేగినీ, అంకుశా, మాలినీ, సంక్షోభిణీ, విద్రావిణీ, ఆకర్షణ రూపిణీ, ఆహ్లాదినీ, సంమోహినీ, స్తంభినీ, జంభినీ, వశంకరీ, రంజినీ, ఉన్మాదినీ, అర్థసాధినీ, సంపత్తి పూర్ణా, మంత్రమయీ, ద్వంద్వక్షయంకరీ, సిద్ది, సంపత్ర్పదా, ప్రియ మంగలకారిణీ, కామప్రదా, దుఃఖ విమోచనీ, మృత్యుప్రశమనీ, విఘ్న నివారిణీ, అంగసున్దరికా, సౌభాగ్యదాయినీ, జ్ఞానైశ్వర్య ప్రదా, జ్ఞానమయీ, పంచమి, విన్ద్యవాసనకా, మౌర స్వరూపా, పాపహారిణీ, ఆనన్దమయీ, రక్షా, రూపేప్సిత ఫలప్రదా, జయినీ, విమలా, కామేశీ, వజ్రాణీ, భగాత్రే లోక్యమోహనా, స్థానా, సర్వాశాపరిపూరిణీ, సర్వసంక్షోభణగతా, సౌభాగ్యప్రద సంస్థితా, సర్వార్థ సాధకాగారా, సర్వరోగహరా, స్థితా, సర్వరక్షాకరస్థానా, సర్వసిద్ధి ప్రదస్థితా, సర్వానన్దమయా, ఆధార బిన్లు స్థాన శివాత్మికా, ప్రకృష్టా, గుప్తా, జైయా, గుప్తతరా, సంప్రదాయ స్వరూపా, కులకౌలని గర్భగా, రహస్య, పరాపరప్రాకృత్, అతి రహస్యకా, త్రిపురా, త్రిపురేశీ పురవాసినీ, శ్రీమాలినీ, సిద్దాయీ మహా త్రిపుర సుందరి, నవరత్నమయ ద్వీప నవఖండ విరాజితా, కల్పకో ద్యాన సంస్థా, ఋతు రూపేంద్రియార్చకా. కాలముద్రా, మాతృకాఖ్యా, రత్న దేశోప దేశికా, తత్యాగ్రహాభిధా, మూర్తి, విషయద్విపా, దేశకాలాకార శబ్ద రూపా, సంగీత యోగినీ, సమస్త గుప్త ప్రకట సిద్ద యోగిని చక్రయుక్, వహ్ని సూర్యేష్ణు భూతాహ్వా, ఆత్మాష్టాక్షరాహ్వయా, పంచధార్చ స్వరూపా, నానావ్రత సమాహ్వయా, నిషిద్దా చారరహితో, సిద్ద చిహ్న స్వరూపిణీ, చతుర్థాకూర్మ భాగస్తా, నిత్యాద్యర్చా స్వరూపిణీ, దమనాది సమభ్యర్చ్యా, షట్కర్మ సిద్ది దాయినీ, తిధి వార పృధగ్రవ్య సమర్చన శుభావహా, వాశ్య నంగకుసుమా, అనంగమేఖలా, ఆనంగమదనా, ఆనంగమదనాతురా, మదగినికా, భువన పాలినీ, శశిరేఖా, సముద్దిష్ణా, గతిలేఖా హ్వయా, శ్రద్దా, ప్రీతి, రతి, ధృతి, కార్న్, మనోరమా, మనోహరీ, మనోరధా, మదనోన్మాదినీ, మోదినీ, శంఖినీ, శోషిణీ, శంకరీ, సింజనీ, సుభగా, పూషా, వాసుమనసా, రతి, ప్రీతి, ధృతి, బుద్ధి, సౌమ్యా, మరీచి, అంశుమాలినీ, శశినీ, అంగిరా, ఛాయా, సంపూర్ణ మండలా, తుష్టి, అమృతా, డాకినీ, లోకపా, బటుకా, ఇభ స్వరూపా, దుర్గా, క్షేత్రశరూపిణీ, కామరాజ స్వరూపా, మన్మథరూపిణీ, కందర్ప రూపిణీ, మకర కేతనా, మనో భవ స్వరూపా, భారతీ వర్ల రూపిణీ, మదనా, మోహినీ, లీలా, జంభినీ, ఉద్యమా, శుభా, హోదినీ, ద్రావిణీ, ప్రీతి, రతి, రక్తా, మనోరమా, సర్వోన్మాదా, సర్వముఖా, ఆభంగా, అమితోద్యమా, అనల్పావ్యక్త విభవా, వివిధక్షోభ విగ్రహా, రాగశక్తి, ద్వేషశక్తి, శబ్దాది రూపిణీ, నిత్యా, నిరంజనా, క్లిన్నా, దినీ, మదనాతురా, మదగ్రవా, ద్రావిణీ, మదావిలా, మంగలా, మన్మధానీ, మనస్వినీ, మోహా, మోదా, మానమయీ, మాయా,మందా, మితానతీ, విజయా, విమలా, శుభా, విశ్వా, విభూతి, వనితో, వివిధా, వినతా, కమలా, కామినీ, డాకినీ, శాకినీ, లాకినీ, కాకినీ, రాకినీ, ఇచ్ఛా, జ్ఞానా, క్రియా, ఆయుధాష్టకధారిణీ, కపర్దినీ, కులసుందరీ, జ్వాలినీ, విస్ఫులింగా, మంగలా, సుమనోహరా, కనకా, కినవా, విద్యా వివిధా, మేషా, వృషా, మిధునా, కర్కటా, సింహా, కన్యా, తులా, కీటా, చాపా, మకరా, కుంభ, మీనా, సారా, సర్వభక్షా, విశ్వాత్మా, వివిధోద్భూత చిత్రరూపా నిస్పృత్నా, నిరాతంకా, యాచనా, అచింత్య వైభవా, రక్తా, విద్యాప్రాప్తి స్వరూపిణీ, హృల్లేఖా, క్లేదినీ, క్లిన్నా, క్షోభిణీ, మదనాతురా, నిరంజనా, రాగవతీ, మదనావతీ, మేఖలా, ద్రావిణీ, వేగవతీ, కమలా, కామినీ, కల్పా, కలా,కలితో, అద్భుతా, కిరాతా, కాలా, కదనా, కేశికా, కంబువాదికా, కాతరా, కపటా, కీర్తి, కుమారీ, కుంకుమ, భంజినీ, వేగినీ, నాగా, చపలా, పేశలా, సతీ, రతి, శ్రద్ధా, భోగలోలా, మదోన్మత్తా, మనస్వినీ, విహ్వలా, ఆకర్షణీ, లోలా, మదనమాలినీ, వినోదా, కౌతుకా, పుణ్యా, పురాణా, వాగేశీ, వరదా, విశ్వా, విభవ, విఘ్నకారిణీ, బీజ విఘ్నహరా, విద్యా సుముఖీ, సుందరీ, సారా, సుమన్, సరస్వతీ, సమయా, సర్వగా, విద్దా, శివా, వాణీ, దూరసిద్దా, అథో విగ్రహావతీ, నాదా, మనోన్మనీ, ప్రాణప్రతిష్ఠా అరుణ వైభవా, ప్రాణా, అపానా, సమానా, వ్యానా, ఉదానా, నాగా, కూర్మా, కృకరా, దేవదత్తా, ధనంజయా, ఫట్కారీ, కింకరా, ఆరాధ్య, జయా, విజయా, హుంకారీ, ఖేచరీ, చండా, ఛేదినీ, క్షపిణీ, స్త్రీ హుంకారీ, క్షేమకరీ, చతురక్ష రూపిణీ, శ్రీ విద్యామత వర్ణాంగీ, కాలీ, యామ్యా, నృపొర్లకా, భాషా, సరస్వతీ, వాణీ, ప్రాకృత, సంస్కృతి, పరా, బహురూపా, చిత్తరూపా, రమ్యానందా, కౌతుకా, త్రయాఖ్యా, పరమాత్మాఖ్యా, అమేయ విభవా, వాక్స్వరూపా, బిన్లు సర్దరూపా, విశ్వాత్మికా, త్రిపుర కందాఖ్యా, జౌత్రాది త్రివిధాత్మికా, ఆయుర్లక్ష్మీ కీర్తి భోగసౌందర్యా రోగ్యదాయికా, ఐహికా ముష్మిక జ్ఞానమయీ, జీవా, విజయా, విశ్వ విన్మయీ, హృదాది విద్యా, రూపాది భానురూపా, జగద్వపు, విశ్వమోహనికా, త్రిపురా, అమృతా, సర్వాపాయన రూపా, మోహినీ, క్షోభణీ, క్లేదినీ, మహోదయా, సంపత్కరీ, లక్షార్జా, సీమామాతృతను, రతి, ప్రీతి, మనోభవా, వారాధిపా, త్రికూటా, షట్కూటా, పంచకూటా, విశుద్ధగా, అనాహతగతా, మణిపూరక సంస్థితా, స్వాధిష్టాన సమాసీనా, ఆధారస్థా, ఆజ్ఞా సమస్థితా, షత్రింశత్కూటరూపా, పంచాశ న్మిథునాత్మికా, పాదుకాదికసిద్దీశా, విజయ దాయినీ, కామరూప ప్రదా, వేతాల రూపా, పిశాచికా, విచిత్రా, విభ్రమా, హంసీ, భీషణీ, జనరంజికా, విశాలా, మదనా, తుష్టి, కాలకంఠీ, మహాభయా, మాహేన్రీ, శంఖినీ, ఐస్టీ, మంగలా, వటవాసినీ, మేఖలా, సకలా, లక్ష్మీ, మాలినీ, విశ్వనాయికో, సులోచనా, సుశోభా, కామదా, విలాసినీ, కామేశ్వరీ, నందినీ, స్వర్ణరేఖా, మనోహరా, ప్రమోదా, రాగిణీ, సిద్దా, పద్మినీ, రతిప్రియా, కల్యాణదా, కలాదక్షా, సురసుందరీ,విభ్రమా, వాహకా, వీరా, వికలా, కోరకొ, కవి, సింహనాదో, మహానాదా, సుగ్రీవా, మర్కటా, శఠా, బిడాలాక్షా, బిడాలాస్యా. కుమారీ, ఖేచరీ, భవా, మయూరా, మంగలా, భీమా,ద్విపవక్రా ఖరాననా, మాతంగీ, నిశాచారా, వృషNహా వృకాననా, సైరి భాస్యా గజముఖా, పశువక్రా, మృగాననా, క్షోభకా, మణిభద్రా, క్రీడకా, సింహచక్రకా, మహోదరా, స్థూలశిఖా, వికృతాస్యా, వరాననా, చపలా, కుక్కుటాస్యా, పాలినీ, మదనాలసా, మనోహరా, దీర్ఘజంఘా, స్థూలదన్హా దశాననా, సుముఖా, పండితా, క్రుద్దా, వరాహాస్యా, సటాముఖా, కపటా, కౌతుకొ, కాలా, కింకరా, కితవా, ఖలా, భక్షకా, భయదా, సిద్దా, సర్వగా, జయ, విజయా, దుర్గా, భద్రా, భద్రకరీ, అంబికా, వామదేవీ, మయామాయా స్వరూపిణీ, విదారికా, విశ్వమయీ, విశ్వా, విశ్వ విభంజితా, వీరా, విక్షోభిణీ, విద్యా, విభవా, వివిధా, విప్రా, మనోహరా,మంగలా, మదోత్సక్షా, మనస్వినీ, మానినీ, మధురా, మాయా, మోహినీ, భద్రా, భవానీ, భవ్యా, విశాలక్షీ, శుచిస్మితా, కకుభా, కమలా, కల్పా, కలా, పూరణీ, నిత్యా, అమృతా, జీవితా, దయా, అశోకా, అమలా, పూర్ణా, భాగ్యోద్యతా, వివేకా, విభవా, విశ్వామితతా, కామినీ, ఖేచరీ, గర్వా, పురాణా, పరమేశ్వరీ, గౌరీ, శివా, అమేయా, విమలా, విజయా, పరా, పవిత్రో, పద్మినీ, విద్యా, విశ్వేశ్, శివ వల్లభా, అశేషరూపా, ఆనందా, అంబుజాక్షి, అనిందితా, వరదా, వాక్యదా, వాణీ, వివిధ, వేద విగ్రహా, విద్యా, వాగీశ్వరీ, సత్యా, సంయుతా, సరస్వతీ, నిర్మలా, ఆనన్ద రూపా, అమృతా, మానదా, పూషా, పుష్టి, తుష్టి, రతి, ధృతి, శశినీ, చన్దికా, కాంతి, జ్యోత్స్నా, శ్రీ, ప్రీతి, అంగదా, పూర్ణా, పూర్ణామృతా, కామదాయిని, ఇందుకలాత్మికా, తపినీ, తాపినీ, భ్రూమ్రా, మరీచి, జ్వాలినీ, రుచి, సుషుమ్లా, భోగదా, విశావ, బాధినీ, ధారిణీ, క్షమా, ధూమ్రార్చి, ఊష్మా, జ్వలినీ, జ్వాలినీ, విస్ఫులింగినీ, సుశ్రీ, స్వరూపా, కపిలా, హవ్య కవ్యవహా, ఘస్మరా, విశ్వకబలా, లోలాక్షీ, లోల జిహ్వికా, సర్వభక్షా, సహస్రాక్షీ, నిస్సంగా, గతిప్రియా అచింత్యా, అప్రమేయా పూర్ణరూపా, దురాసదా, సర్వా, సంసిద్ది రూపా, పావనీ, ఏకరూపిణీ, యామలవేధా, వేదస్వరూపిణీ, శాంభవవేదా, "వనాసిద్ది సూచినీ, వహ్నిరూపా, ద్రసా, అమావిఘ్నా, భుజంగమా, షణ్ముఖా, రవిరూపా, మాతా, దుర్గా, విశా, ధనాధా, కేశవా, యమి, హరా, శశా, అశ్వినీ, యమి, వహ్నిరూపా, ధాత్రీ చంద్రా, శివా, అదితి, జీవా, సర్పిణీ, పితృరూపిణీ, అర్యమ్స్, భగా, సూర్యా, త్వాష్టి, మారుతి ఇంద్రాగ్నిరూపా, మిత్రా, ఇంద్రాణీ, నిఋతి, జలా, వైశ్వదేవీ, హరితభూ, వాసవీ, వరుణ, జయా, అహిర్బుధ్న్యా, పూషణీ, కారస్కరా, అమలా, ఉదంబురా, జంబువా, ఖదిరా, కృష్ణరూపిణీ, వంశా, పిప్పలా, నాగా, రోహిణీ, పలాశకా, పక్షవా అమ్బష్ణా, బిల్వా, అర్జునరూపిణీ, వికలకతా, కకుభా, సరలా,సర్జికా, వంజులా, పనసా, అర్కా, శమి, హలిప్రియా, ఆస్రుకొ, నింబా, మధూవా, అశ్వత్థా, గజా, నాగినీ, సారిణీ, శునీ, కపిరూపా, గోఘంటా, వానరీ, నరా, అశ్వినీ, నగా, గౌ, హస్తినీ, షట్చక్రవాసినీ, త్రిఖండా, తీరపాలా, భ్రమణీ, ద్రవిణీ, సోమా, సూర్యా, తిథి, వారా, యోగా, ఋక్షా, కరణాత్మకొ, యక్షిణీ, తారణా, వ్యోమ శబ్దాద్యా, ప్రాణినీ, ధీ, క్రోధినీ, సంభినీ, చందా,ఉచ్చండా, బ్రహ్మాదిరూపిణీ, సింహస్థా, వ్యాఘ్రగా, గజాశ్వగరుడస్థితా, భౌమాప్యా, తైజసీ, వాయు రూపిణీ, నాభసా, ఏకవస్త్రి, చతుర్వక్రా, నవవక్రా, కలావా, పంచవింశతి, వక్రో, షడ్వింశతివదనో, ఊనపంచాశ దాస్యా, చతుష్టష్టిముఖా, ఏకా శీతిముఖా, శతానన సమన్వితా, స్థూలరూపా, సాక్షిరూపా,తేజోవిగ్రహధారిణీ, వృణా, వృత్తిరూపా, నాథా, వృత్తి స్వరూపిణీ, తత్యావృత్తి స్వరూపా, నిత్యావృత్తివపుర్థరా, అంగావృత్తిస్వరూపా, ఆయుధావృత్తిరూపిణీ. గురుపంక్తి స్వరూపా, విద్యావృత్తితను, బ్రహ్మద్యా వృత్తిరూపా, పరా, పశ్యంతికా, మధ్యమా, వైఖరీ, శీర్షకంఠతాలోఅష్టదంతగా, జిహ్వామూలగతా, నాసాగతా, ఉరఃస్థలగా మినీ, పదవాక్యస్వరూపా, వేద భాషాస్వరూపిణీ, సేకాఖ్యా, వీక్షణాఖ్యా, ఉపదేశాభ్యా, వ్యాకులాక్షరసంకేలీ, గాయత్రీ, ప్రణవాదికా, జపహోమార్చన ధ్యానమంత్ర తర్పణ రూపిణీ, సిద్దసారస్వతా, మృత్యుంజయా, త్రిపురా, గారుడా, అన్నపూర్ణా, అశ్వారూఢా, నవాత్మికా, గౌరీ, దేవీ, హృదయా, లక్షదా, మతంగినీ, నిష్పత్రయపదా, చేష్టావాదినీ, రాజలక్ష్మీ, మహాలక్ష్మీ, సిద్ధలక్ష్మీ, గజాననా.

ఇట్లు ఇవి లలితా దేవీసహస్రనాములు సర్వార్థసిద్ధిప్రదములు. ఫలప్రదములు ఈ సహస్రనామస్తోతమును ఉషఃకాలమున చదివినచో అతను యోగీ, బ్రహ్మజ్ఞాని, శివయోగి, ఆత్మజ్ఞాని యగును. ప్రతిదినమురెండుమార్లు జపించినచో ఆయురారోగ్య సంపదలు, లోకానురంజనము, నారీనృపవశీకరణలు ఒకేసారి సిద్దించును. మూడుమార్లు జపించినచో సమస్త ప్రపంచము వశమగును. నాలుగు మార్లు జపించువానికి అఖిలాభీష్టములు సిద్ధించును. ప్రయోగార్హత లభించును. లోకరక్షాకరుడగును. అయిదుమార్లు జపించువానికి, నరులు, నారీమణులు, దేవతలు, జంతువులు, వశమగును. ఎపుడూ సాధకుని సేవించుచుండును. ఆరుమార్లు పఠించినచో తన్మయుడగును. దేవీప్రసాదమువలన వెంటనే అన్ని సిద్దులూ చేకూరును. ఏడుమార్లుజపించినచో శత్రు,రోగ, కృత్య, అపస్మారాదులు.నశించును. ఎనిమిదిమార్లు జపించినవాడు నిగ్రహానుగ్రహ సమర్థుడగును. తొమ్మిదిమార్లు జపించినచో వాక్ లక్ష్మీకాంతులు సిద్ధించును. పదకొండుమారులు పఠించినచో అఖిలవృద్ధులు సమకూరును. జగత్తు అధీనమగును. పన్నెడు మార్లు పఠించినచో అంతట జయము సుఖము లభించును. పదునాలుగు మార్లు పఠించినచో అఖిలాభీష్టములు సర్వమంగలములు లభించును. పదునైదుమార్లు పఠించినచో సకలాభీష్టములు అప్రయత్నముగా సిద్దించును. పదునారుమార్లు పఠించినచో నరుడు సాక్షాత్తుగా మహేశ్వరుడగును. ఈ ప్రపంచమును సృష్టించుటకు, కాపాడుటకు, సంహరించుటకు సమర్థుడగును. నలుబది రోజులుకాని ఒకనెలకొని కోరికతో ఈ సహస్రనామస్తోతమును జపించిన ఆ కోరికలు వెంటనే నెరవేరును. ఇట్లు నిత్యావృత్త్యర్చనాశ్రితవిధానమును నీకు తెలిపితిని. సకలాభీష్టసాధనమగు సహస్ర నామస్తోత్రమును కూడా తెలిపితిని.

ఇది శ్రీబృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున లలితాస్తోత్ర కవచసహస్రనామకథనమను ఎనుబది తొమ్మిద -  అధ్యాయము సమాప్తము.