64 - అధ్యాయము

మోహిన్యువాచ: -

వసో కృపాలో ధర్మజ్ఞ త్వయా బహువిధా మమ

తీర్థరాజస్య మాహాత్మ్యం ప్రయాగస్య నిరూపితమ్

యత్సర్వతీర్థముఖ్యేషు కురుక్షేత్రం శుభావహమ్

పావనం సర్వలోకానాం తన్మమాచక్ష్య సాంప్రతమ్

మోహిని పలికెను : కృపాలూ! ధర్మజ్ఞా! వసూ బహువిదుడవగు నీవు ప్రయాగ తీర్థరాజమాహాత్మ్యమును తెలిపితివి. ఇక ఇపుడు సర్వతీర్ధములలో పావనము, శుభప్రదము, ముఖ్యము అగు కురుక్షేత్ర మాహాత్మ్యమును తెలుపుము.

వసురువాచ :-

శృణు మోహిని వక్ష్యామి కురుక్షేత్రం సుపుణ్యదమ్

యత్ర గత్వా నరస్నాత్వా సర్వ పాపైః ప్రముచ్యతే

తత్ర తీర్ధాన్యనేకాని సేవితాని మునీశ్వరైః

తాన్యహూతేఃభిధాస్యామి శృణ్వతాం ముక్తిదాని చ

బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం గోగ్రహో మరణంతథా

వాసః పుంసాం కురుక్షేత్ర ముక్తిరుక్తా చతుర్విధా

సరస్వతీ దృషద్వత్యోర్దేవన ద్యోర్యదస్తరమ్

తం దేవసేవితం దేశం బ్రహ్మవర్తం ప్రచక్షతే

దూరస్తోఁపి కురుక్షేత్రే గచ్చామి చ వసామ్యహమ్

ఏవం యస్సతతంబ్రూయా తోపి పాపైః ప్రముచ్యతే

తత్ర యో వై వసేద్ధీరః సర్వస్వత్యాస్తటే స్థితః

తస్య జ్ఞానం బ్రహ్మమయం భవిష్యతి నసంశయః

దేవతా ఋషయస్సిద్ధా సేవంతే కురు జాంగలమ్

తత్ర సంసేవనాద్దేవి బ్రహ్మచాత్మని పశ్యతి

వసువు పలికెను :- మోహినీ! ఇపుడు పుణ్యప్రదమగు కురుక్షేత్ర మాహాత్మ్యమును చెప్పెదను. వినుము. ఇచటికి వెళ్ళిస్నానము చేసినవాడు సర్వపాప వినిర్ముక్తుడగును. ఇచట అనేక తీర్ధములను మునీశ్వరులు సేవించిరి. ఇపుడు నీకు ఆ తీర్ధములను ముక్తి ప్రదములను చెప్పెదను. వినుము. గయాశ్రాద్ధమున బ్రహ్మజ్ఞానము గోగ్రహమున మరణము, కురుక్షేత్రమున నివాసము ముక్తి ప్రదములని చెప్పబడినవి. సరస్వతీ దృషద్వతీనదుల మధ్యభాగము బ్రహ్మవర్తమనబడును. దూరమున నుండు వాడుకూడా కురుక్షేత్రమునకు వెళ్ళేదను, నివసించెదను అని ఎల్ల కాలము స్మరించువాడు కూడా పాప విముక్తుడగును. ఇచట సరస్వతీ తీరమున నివసించు వారు బ్రహ్మజ్ఞానమును పొందును. ఈ కురుక్షేత్రమును దేవతలు ఋషులు సిద్దులు సేవించుచుందురు. ఈ కురుక్షేత్రమును సేవించుట వలన తనలో బ్రహ్మను దర్శించగలడు.

మోహిన్యువాచ :-

కురుక్షేత్రం ద్విజశ్రేష్ఠ సర్వతీర్ధాధికం కథమ్

తన్మే విస్తరతో బ్రూహి త్వామహం శరణం గతా

మోహిని పలికెను :- ఓ బ్రాహ్మణోత్తమా! కురుక్షేత్రము సర్వతీర్ధాధికమెట్లు అయినదో నాకు విస్తరముగా తెలుపుము. నిన్ను నేను శరణుపొందితిని.

వసురువాచ :-

శృణు భద్రే ప్రవక్ష్యామి కురుక్షేత్రం మహాఫలమ్

యధా జాతం నృణాం పాప దహనం బ్రహ్మణః ప్రియమ్

ఆద్యం బ్రహ్మ సరః పుణ్యం తత్ర స్థానే సముద్గతమ్

తతో రామహ్రదో జాతః కురుక్షేత్రం తతఃపరమ్

సరస్సన్ని హితం తచ్చ బ్రహ్మణా నిర్మితం పురా

అధైషా బ్రహ్మణో వేదీ దిశమంతరత స్థితా

బ్రహ్మణాత్ర తపస్తప్తం సృష్టి కామేన మోహిని!

స్థితి కామేన హరిణా తపసప్తం చ చక్రిణా

సరః ప్రవేశాత్సం ప్రాప్తం స్థాణుత్వం శంభునాపి చ

పితుర్వధాచ్చ తన పర్శురామేణ భామిని

ఆ బ్రహ్మణ్యక్షత వధా ద్యేచ రక్తహదాః కృతాః

తద్రక్షేన తు సంతర్ప్య కృతవాం స్తత్ర వై తపః

రామతీర్ధం తతః ఖ్యాతం సంజాతం పాపనాశనమ్

మార్కండేయేన మునినా సంతప్తం పరమం తపః

యత్ర తత్ర సమాయాతా ప్లక్షజాతా సరస్వతీ

సా సభాజ్య స్తుతా తేన మునినా ధార్మికేణ హి

సరస్సన్నిహితం ప్లావ్య పశ్చిమాం ప్రస్థితా దిశమ్

కురుణా తు తతః కృష్టం యావతిక్షేత్రం సమంతతః

పంచయోజన విస్తారం దయా ప్రత్యక్షమోద్దమమ్

స్యమంత పంచకం తావ తురుక్షేత్రముదాహృతమ్

అత్ర స్నాతా నరా దేవి లభంతే పుణ్యమక్షయమ్

మృతా విమాన మారుహ్య బ్రహ్మలోకం ప్రజల్లి చ

ఉపవాస శ్చ దానం చ హోమో జప్యం సురార్చనమ్

అక్షయత్వం ప్రయాంత్యేవ నాత్ర కార్యా విచారణ

బ్రహ్మవేద్యాం కురుక్షేత్రే యే మృతా స్తేఽపునర్భవాః

గ్రహనక్షత్ర తారాణాం కాలేన పతనాద్భయమ్

కురుక్షేత్ర మృతానాం తు న భూయః పతనం భవేత్

దేవర్షి సిద్ధ గంధర్వా సత్సంగైవ నోత్సుకాః

యత్ర నిత్యం స్థితా దేవి రంతుకం నామతస్తతః

తస్య క్షేత్రస్య రక్షార్ధం విష్ణునా స్థాపితాః పురా

యక్షస్సు చస్ర సూర్యశ్చ వాసుకి శ్శంబుకర్ణకః

విద్యాధరస్సుకేశీచ రాక్షసాస్థాపితాశ్శుభే

సభృత్యై స్వేష్ట సాహసై ర్ధనుర్భాణధరై స్సదా

రక్షన్స్ చ కురుక్షేత్రం వారయని చ పాపినః

రంతుకం తు సమాసాద్య క్షామయిత్వా పునః పునః

తతస్స్నాత్వా సరస్వత్యం యక్షం దృష్ట్యా ప్రణమ్య చ

పుష్పం ధూపం చ నైవేద్యం కృత్వై తద్వాక్యముచ్చరేత్

తవ ప్రసాదాద్యక్షేన్జ వనాని సరితస్తధా

భ్రమతో మమ తీర్థాని మా విఘ్నం జాయతాం నమః

ఇతి ప్రసాద్యయక్షేశం యాం సమ్యక్స ఆచరేత్

వనానాం చాపి తీర్ధానాం సరితామపి మోహిని

యో నరః కురుతే యాత్రాం కురుక్షేత్రస్య పుణ్యదామ్

న తస్య న్యూనతా కాచి దిహ లోకే పరత్ర చ

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే వసు మోహినీ సంవాదే కురుక్షేత్ర మాహాత్మ్యే క్షేత్రప్రమాణాది నిరూపణం నామ చతుష్టష్ఠితమోఽధ్యాయః

వసువు పలికెను :- శుభప్రదురాలా! మహాఫల ప్రదము మానవుల పాపమును దహింపచేయునది బ్రహ్మకు ప్రియమగునది యగు కురుక్షేత్రమేట్లేర్పడినదో చెప్పెదను వినుము. ఇచట మొదట పవిత్రమగు బ్రహ్మసరస్సు ఏర్పడినది. తరువాత రామప్రదము ఏర్పడినది. ఇపుడు కురుక్షేత్రమేర్పడినది. మొదట బ్రహ్మచే నిర్మించిన సరస్సు సన్నిహితముగానున్నది. ఇపుడే బ్రహ్మవేదికకు మధ్యలో నున్నది. సృష్టి చేయగోరిన బ్రహ్మ ఇచట తపమును చేసెను స్థితిని కోరు విష్ణువు కూడా ఇచటనే తపమునాచరించెను. ఈ సరస్సున ప్రవేశించుటవలననే శంకరునకు స్థాణుత్వమేర్పడినది. పితృవధముచే పరితపించిన పరశురాముడు బ్రాహ్మణద్వేషులగు క్షత్రియులను వధించి ఇచటనే రక్తపు మడుగులనేర్పరిచెను. ఆ రక్తముతో పితరులకు తర్పణమునిచ్చి ఇచటనే తపమునాచరించెను. అప్పటి నుండి ఇది పాప నాశకమగు రామతీర్థముగా ఖ్యాతిగాంచినది. ఇచటనే మార్కండేయ మహర్షి పరమ తపమునాచరించెను. ప్లక్షజాతయగు సరస్వతి వచ్చిన ప్రతి ప్రదేశమును మార్కండేయ మహర్షి స్తుతించెను. సన్నిహితమగు సరస్సునుండి పశ్చిమదిశకు బయలుదేరినది. అపుడు ఈ సరస్వతిని కురువుక్షేత్రమున్నంతవరకు ఆకర్షించెను. ఈ క్షేత్రము పంచయోజన విస్తీర్ణము. దయాసత్యక్షమలకు పుట్టిల్లు. స్యమంత పంచకమునే కురుక్షేత్రమనిరి. ఇచట స్నానమును చేసిన వారు అక్షయ పుణ్యమును పొందును. మరణించిన వారు విమానము నధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. ఇచట ఆచరించిన ఉపవాసము, దానము, జపము, హోమము, దేవతార్చనము అక్షయత్వమును పొందును. బ్రహ్మ వేదియందు కురుక్షేత్రమునందు మరణించిన వారు మరల పుట్టరు. గ్రహములకు నక్షత్రములకు తారలకు పతన భయముండును. కాని కురుక్షేత్రమున మరణించిన వారికి పతన భయముండదు. దేవతలు, ఋషులు సిద్ధులు ఈ సరస్సును సేవించు కోరికతో నుండు ప్రదేశమును రంతుకక్షేత్రమందురు. పూర్వము ఈ క్షేత్రమును కాపాడుటకు శ్రీ మహావిష్ణువు యక్ష సుచన సూర్య వాసుకి, శంఖుకర్ణక విద్యాధర సుకేశులను రాక్షసులను స్థాపించెను. వీరందరు ధనదుర్బాణధరులై భృత్యులతో కలిసి కురుక్షేత్రమును కాపాడుచు పావులను వారించుచుందురు. రంతుకక్షేత్రమును చేరి పలు మార్లు క్షమాపణను వేడి సరస్వతిలో స్నానమాడి యక్షుని దర్శించి నమస్కరించి పుష్పధూప దీపనైవేద్యములను సమర్పించి ఈ వాక్యమును పలుకవలయును. ఓ యక్షేనై నీ అనుగ్రహమువలన వనములను నదులను తీర్థములను పరిభ్రమించు నొకు విఘ్నము. కలుగ కుండుగాక. ఇట్లు ప్రార్థించి చక్కగా యాత్ర నాచరించవలయును. వనములను తీర్ధములను, నదులను కురుక్షేత్ర పుణ్యతీర్దములను పర్యటించువాడు. ఇహలోకమున పరలోకమున న్యూనత్వమును పొందజాలడు.

 ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదము కురుక్షేత్ర మాహాత్మ్యమున క్షేత్రప్రమాణాది నిరూపణ మను అరువది నాలుగవ అధ్యాయము.