నారద మహా పురాణము
75 - దీపవిధినిరూపణమ్
సనత్కుమార ఉవాచ :
ఆథ దీపవిధిం వక్ష్యే పరహస్యం హనూమతః,
యస్య విజ్ఞానమాత్రేణ సిద్దో భవతి సాధకః.
దీపపాత్రప్రమాణం చ ద్రవ్యస్య చ ప్రమాణం వై తత్తు మానమనుక్రమాత్.
స్థానభేదం చ మంత్రం చ దీపదానమనుం పృథక్,
పుష్పవాషితతైలేన సర్వకామప్రదం మతమ్.
తిలతైలం శ్రియః ప్రాప్తైః పథకాగమనం ప్రతి,
అతసీతైలముద్రిష్టం వశ్యకర్మణి నిశ్చితమ్.
సార్షపం రోగనాశాయ కథితం కర్మ కోవిదైః,
మారణే రాజికోత్థం వా విభీతకసముద్భవమ్.
ఉచ్చాటనే కరంబోత్తం విద్వేషే మధువృక్షజమ్,
అలాభే పర్వతైలాసోం తిలజం తైలముత్తమమ్.
గోధూమాశ్చ తిలా మాషా ముద్గా వై తండులాః క్రమాత్,
పంచధాన్యమిదం ప్రోక్తం నిత్యదీపం తు మారుతేః.
పంచధాన్యపముద్భూతం పిష్టమాత్రం సుశోభనమ్,
సర్వకామప్రదం ప్రోక్తం సర్వదా దీపదానకే.
వశ్యే తండులపిష్టోత్తం మారణే మాషపిష్టజమ్,
ఉచ్చాటనే కృష్ణతిలపిష్టజం చ ప్రకీర్తితమ్.
పథికాగమనే ప్రోక్తం గోధూమోత్థం పతండులమ్,
మోహనే త్వాఢకీజాతం విద్వే షే చ కులుత్థజమ్.
సంగ్రామే కేవలా మాషాః ప్రోక్తా దీపప్య పాత్ర కే,
సంధౌ త్రిపిష్టజం లక్ష్మీ హేతో: కస్తూరీకాభవమ్.
ఏలాలవంగకర్పూరమృగనాభిసముద్భవమ్,
కన్యాప్రాప్తై తథా రాజవ శ్యే సంఖ్యే తథైవ చ.
అలాభే సర్వవస్తూనాం పంచధాన్యం వరం స్మృతమ్,
అష్టముష్టిర్భవేత్కించిత్కించిదష్టే చ పుష్కలమ్.
పుష్కిలానాం చతుర్ణాం చ హ్యాడకః పరికీర్తితః,
చతురాఢకో భవేద్ధ్రోణః ఖారీ ద్రోణచతుష్టయమ్.
ఖారీచతుష్టయం ప్రస్థసంజ్ఞా చ పరికీర్తితా,
అథవాన్యప్రకారేణ మానమత్ర నిగద్యతే.
పలద్వయం తు ప్రసృతం ద్విగుణం కుడవం మతమ్,
చతుర్భిః కుడవైః ప్రస్థస్తైశ్చతుర్భిస్తథాఁకః.
చతురాఢకో భవేద్ధ్రోణఃఖారీ ద్రోణచతుష్టయమ్,
క్రమేణైతేన తే జ్ఞేయాః పాత్రే షట్కర్మసంభవే.
పంచసప్త నవ తథా ప్రమాణా స్తే యథ్రాక్రమమ్,
సౌగంధేనైవమానం స్యాత్తద్యథారుచి పంమతమ్.
నిత్యపాత్రే తు తైలానాం నియమో వార్తికోద్భవః,
సోమవారే గృహీత్వా ధాన్యం తోయప్లుతం ధరేత్.
పశ్చాత్ప్రమాణతో జ్ఞేయం కుమారీ హస్తపోషణమ్,
తత్పష్టం శుద్ధపాత్రే తు నదీతోయేన పిండితమ్.
దీపపాత్రం తతః కుర్యాచ్చుద్దః ప్రయతమానసః,
దీపపాత్రే జ్వాల్యమానే మారుతేః కవచం పఠేత్.
శుద్ధభూమౌ సమాస్ధాప్య భౌమే దీపం ప్రదాపయేత్,
మాలా మనూనాం యే వర్ణా సాధ్యనామపమన్వితాః.
వర్తికాయాం ప్రకర్తవ్యాస్తనవస్తత్ప్రమాణకాః ,
తత్రింశాంశేన వార్యేగ్రాహ్యా గురుఖిలాఢ్యతా.
కూటతుల్యా స్మృతా నిత్యే సామాన్యేథ విశేష కే.
రుద్రాః కూటగణాః ప్రోక్తా న పాత్రే నియమో మతః.
ఏకవింశతిసంఖ్యాకాస్తన్తవోఽధ్వని సంస్మృతాః,
రక్తసూత్రం హనుమతో దీపదానే ప్రకీర్తితమ్.
కృష్ణముచ్చాటనే ద్వేషే రుణం మారణకర్మణి,
కూటతుల్యఫలం తైలం గురుకార్యే శివైర్గుణమ్.
నిత్యే పంచ పలం ప్రోక్తం అథవా మానసీ రుచి:.
హనుమత్ప్రతిమాయాస్తు సన్నిధౌ దీపదాపనమ్,
శివాలయేఽథవా కుర్యాన్నిత్యనైమిత్తికే స్థలే.
విశేషోఽస్త్యత్ర యః కశ్చిన్మారుతేరుచ్యతే మయా.
ప్రతిమాల్లే ప్రమాదేన గ్రహభూతగ్ర హేషు చ,
చతుష్పధే తథా ప్రోక్తం షట్సు దీపప్రదాపనమ్.
సన్నిధౌ స్పాటి కే లింగే శాలగ్రామస్య సన్నిధౌ,
నానాభోగశ్రియై ప్రోక్తం దీపదానం హనూమతః.
గణేశసన్నిధౌ విఘ్నే మహాసంకటనాశనే,
విషవ్యాధిభయే ఘోరే హనుమత్సన్నిధౌ స్మృతిమ్.
దుర్గాయాస్సన్నిధౌ ప్రోక్తం సంగ్రామే దీపదాపనమ్,
చతుష్ప వ్యాధినష్టా దుష్టదృష్టా తథైవ చ.
రాజద్వారే బంధముక్తా కారాగారేఒథవా మతమ్,
అశ్వత్థవటమూలే తు పర్వకార్యప్రసిద్దయే.
వ్య భయే వివాదే చ వేశ్మ సంగ్రానుసంకటే,
ద్యూతే దృష్టిస్తంభనే చ విద్వేషే మారణే తథా.
మృతకోత్తాపనే చైవ ప్రతిమా చాలనే తథా,
వి వ్యాధే జలే భూతగ్ర హే కృత్యావిమోచనే.
క్షతగ్రంధే మహారణ్యే దుర్గే వ్యాఘ చ దల్లిని,
క్రూరసత్వే చ పర్వేషు శశ్వద్బంధవిమోక్షణే.
పథకాగమనే చైవ దుస్థాన్ రాజమోహనే,
ఆగమే నిర్గమే చైవ రాజద్వారే ప్రకీర్తితమ్.
దీపదానం హనుమతో నాత్ర కార్యా విఛారణా.
రుద్రేకవింశపిండాంశ్చ త్రిధా మందలమానకమ్,
లఘుమానం స్మృతం పంచ సప్త వా నవ వా స్మృతమ్.
క్షీరేణ నవనీతేన దధ్ని వా గోమయేన చ,
ప్రతిమకరణం ప్రోక్తం మారుతేర్దీపదాపనే.
దక్షిణాభిముఖం వీరం కృత్వా కేసరివిక్రమమ్.
ఋక్షవిన్యస్తపాదం చ కిరీ టేన విరాజితమ్,
లిఖేద్బిత్తా పపే వాపి పీ వా మారుతేశ్శుభౌ,
మాలామంత్రేణ దాతవ్యం దీపదానం హనూమతః,
నిత్యదీపః ప్రకర్తవ్యో ద్వాదశాక్షరం విద్యయా.
విశేషస్తత్ర యస్తం వై దీప దొనేవధారయ,
షష్ట్యాదౌ చ ద్వితీయాదౌ ఇమం దీప మితీరయేత్.
గృహాణేతి పదం పశ్చాచ్ఛేషం పూర్వవదుచ్చరేత్,
కూటాదౌ నిత్యదీ పే చ మంత్రం సూర్యాక్షరం వదేత్.
తత్ర మాలాఖ్యమనునా తత్తత్కార్యేషు కారయేత్,
గోమయేనోపలిపొయాం భూమౌ తద్గతమానసః.
షట్కోణం వసుపత్ర చ భూమౌ రేఖాసమన్వితమ్,
కమలం చ లిఖేదద్రం తత్ర దీపం నిధాపయేత్.
శైవే వా వైష్ణవే పీతే పూజయేదంజనాసుతమ్,
కూటషట్కం చ షట్కోణే అంతరాలే పరం లిఖేత్,
షట్కోణేషు షడంగాని బీజయుక్తాని సంలిఖేత్ ,
సౌమ్యం మధ్యగతం లేఖ్యం తత్ర సంపూజ్య మారుతిమ్.
షట్కోణేషు షడంగాని నామాని చ పూరోక్తవత్,
వసుపత్రే క్రమాత్పూజ్యా అష్టావేతే చ వానరాః.
సుగ్రీవాయాంగదాయాధ సుషేణాయ నలాయ చ,
నీలాయాధో జాంబవతే ప్రహస్తాయ తథైవ చ.
సువేషాయ తతః పశ్చాద్యజేత్తడంగదేవతాః,
ఆదోవంజనాపుత్రాయ తతశ్చ రుద్రమూర్తయే.
తతో వాయుసుతాయాథ జానకీజీవనాయ చ రామదూతాయ బ్రహ్మాస్త్రనివారణాయ తత్పరమ్.
పంచోపచారై స్సంపూజ్య దేశకాలౌ చ కీర్తయేత్,
కుశోదకం సమాదాయ దీపమంత్రం సముచ్చరేత్.
ఉత్తరాభిముఖో జప్త్వా సాధయేత్సాధకోత్తమః,
తం మంత్రం కూటాధాజప్త్వా జలం భూమౌ వినిక్తిపేత్.
తతః కరపుటం కృత్వా యథాశక్తి జపేన్మనుష్,
అనేన దీపవర్యేణ ఉదఙ్ముఖగతేన వై. తథా.
విధేహి హనుమాన్యథాస్యురే మనోరథాః,
త్రయోదశైవం ద్రవ్యాణి గోమయం మృత్తికా మసీ.
అలందరదం రక్త చన్దనం చందనం మధు,
కస్తూరికా దధిక్షీరం నవనీతం ఘృతం తథా.
గోమయం ద్వివిధం తత్ర ప్రోక్తం గోమహిషీభవమ్,
పశ్చాద్వినష్టదవ్యాప్తీ మాహిషం గోమయం స్మృతమ్.
సనత్కుమార మహర్షి పలికెను : ఇక హనుమంతుని దీపవిధిని సరహస్యముగా చెప్పెదను. ఈ విధిని తెలిసిన వారు సిద్ధిని పొందెదరు. దీప పాత్ర ప్రమాణము తైలమానము, ద్రవ్యప్రమాణము ఈ మూడింటిని మానమందురు. స్థానభేదము మంత్రము, దీపదానమంత్రమును గూర్చి వివరించేదను. పూనూనెచే దీపముంచినచో సర్వాభీష్టప్రదము. సంపదను పొందుటకు నువ్వుల నూనెచే ఉంచవలయును. ఇతరులను వశపరుచుకోనుటకు అవిశనూనెచే దీపముంచవలయును. రోగనాశమునకు ఆవనూనె, మారణకర్మకు రాజికలైలము కొని విభీతకతైలముకొని, ఉచ్చాటనలో కరంజతైలము, విద్వేషమున ఇప్పనూనెచే ఉంచవలయును. ఈ తైలములు లభించనిచో నువ్వులనూనె ప్రశస్తము. గోధుమలు, నువ్వులు, మినుములు, పెసలు, తండులములు ఈ అయిదు ధాన్యములు హనుమన్నిత్యదీపవీధిలో ఉపయోగించవలయును. ఈ అయిదు ధాన్యముల పిండి ఉత్తమముగా పేర్కొనబడినది. ఇట్లు దీపముంచుటలో ఈ పిష్టములను వాడుట సర్వాభీష్టప్రదమని చెప్పబడినది. వశమును చేసుకొనుటకు బియ్యపుపిండి, మారణకర్మకు మినుపపిండి, ఉచ్చాటనకు నల్లనువ్వుల పిండి, దేశాంతరమునకు వెళ్ళిన వాడు వచ్చుటకు గోధుమ బియ్యపు పిండి, మోహనమున ఆఢకపిష్టము, విద్వేషమున ఉలువపిండి, యుద్ధమున కేవలము మినుములు దీపపాత్రలో ఉపయోగించవలయును. సంధి విషయమున మూడు పిష్టములను, సంపద కొఱకు కస్తూరిభవమును వాడవలయును. ఏలా లవంగకర్పూర కస్తూరీ భవములను కన్యా ప్రాప్తికి, రాజవశ్యతకు, స్నేహమునకు ఉపయోగించవలయును. ఈ వస్తువులు లభించనిచో పంచధాన్యములు ఉత్తమములు. ఎనిమిది పిడికిళ్ళు కించిత్ అగును. ఎనిమిది కించిత్తులు పుష్కలము. నాలుగుపుష్కలములు ఆడకమనబడును. నాలుగాఢకములు ద్రోణమగును. నాలుగు ద్రోణములు భారీయగును. నాలుగు భారీలు ప్రస్థమగును. ఇచట ఇంకొక విధముగా మానము చెప్పబడినది. రెండు పలములు ప్రస్పతము. రెండు ప్రసృతములు కుడవము. నాలుగు కుడవములు ప్రస్థము. నాలుగు ప్రస్థములు ఆడకము సోలుగాఢకములు ద్రోణము. నాలుగు ద్రోణములు ఖారీ. ఈ క్రమమున షట్కర్మ సంభవమగు పాత్రయందు మానములను తెలియవలయును. అయిదు, ఏడు, తొమ్మిదిగా యథాక్రమముగా ఈ ప్రమాణములుండును. సుగంధ విషయమున మాన నియమముండదు. అభిరుచికి అనుగుణముగా తెలియవలయును. నిత్యపాత్రయందు వత్తిని బట్టి తెలనియమముండును. సోమకారమున ఆ ధాన్యమును నీటితో తడుపవలయును. తరువాత కుమారీ హస్త పోషణప్రమాణము తెలియవలయును. అనగా కుమారీ హస్తములచే విసరిన ఆ పిండిని ఈ నదీతోయముచే ముద్దగా చేసి శుద్ధపాత్రలో నుంచవలయును. అపుడు పరిశుద్దుడై ఏకాగ్రమనస్కుడై దీపపాత్రను సిద్ధము చేయవలయును. దీపపాత్ర వెలుగుచుండగా హనుమత్కవచమును పఠించవలయును. పరిశుద్ధమైన భూమియందుంచి మంగళవారమున దీపదానముగావించవలయును. సాధ్యనామముతో కూడిన మాలామంత్రవర్ణముల సంఖ్యలో వత్తియందు దొరములుండవలయును. లేదా ఆ వర్ణములలో ముప్పదియవ భాగమునుంచవలయును. వార్యము గొప్పదైనపుడు మొత్తముగా నుంచవలయును. నిత్యమగు సామాన్య విశేషకార్యములందుకూడ తుల్యర్తులుండవలయును. కూటగమనగా ఏకాదశ సంఖ్య. దీప పాత్ర విషయమున నియమములేదు. మార్గమున నున్నపుడు ఇరువదియొక్క తంతువులుండవలయును. హనుమంతునికి దీపదానము చేయునపుడు ఎఱ్ఱనిదారము నుంచవలయును. ఉచ్చాటన విషయమున కృష్ణసూత్రము, ద్వేషమున అరుణ సూత్రము, మారణకర్మలోకూడా అరుణసూత్రము నుంచవలయును. గురుకొర్యమున పదకొండుపలముల తైలమునుంచవలయును. నిత్య కర్మయందు పంచపలముల తైలమును, లేదో మనసునకు తోచినంత యుంచవచ్చును. హనుమంతుని ప్రతిమ సన్నిధిలో కాని, శివాలయమున కాని, నిత్య నైమిత్తిక స్థలములలో కాని దీపదానము చేయవలయును. ఈ విషయమున హనుమంతుని సంబంధమున కొంత విశేషము గలదు. దానిని చేప్పెదను. హనుమంతుని ప్రతిమ ముందు సంతోషముచే గ్రహ భూతగ్రహ విషయమున చతుష్పథమున షట్పాత్రలందు దీపప్రదాపనము చేప్పబడినది. హనుమంతుని సన్నిధిలో, స్పొటిక లింగమున, శాలగ్రమసన్నిధిలో నాసొభోగసంపదల కొజుకు హనుమంతునికి దీపదానము విధించబడినది. విఘ్నములు మహాసంకటములు నశించుటకు గణేశసన్నిధిలో, ఘోరమగు విషవ్యాధి భయమున హనుమంతుని సన్నిధిలో దీపదానము చెప్పబడినది. వ్యాధిలో, నష్టము జరిగినపుడు, దుష్టులదృష్టి తగిలినపుడు చతుష్పధమున దీపదానముగావించవలయును. బంధముక్తికి రాజద్వారమున కానీ కారగారమున కాని దీపదానము చేయవలయును. సర్వకార్య సిద్ధికోటకు అశ్వత్థామూలమున కాని వటవృక్షమూలమున కాని దీపదానము గావించవలయును. వశీకరణలో, భయమున, వివాదమున, వేశ్మ సంగ్రమ సంకటములందు, ద్యూతమున, దృష్టిస్తంభనమున విద్వేషమున మారణమున, మృతకోత్తాపనమున, ప్రతీమాచాలనమున విష ప్రయోగమున, వ్యాధి యందు, జ్వరమునందు, భూతగ్రహముల విషయమున, కృత్యావిమోచనమున, క్షతగ్రంధియందు, మహారణ్యముమన దుర్గమున, వ్యాఘగజాది క్రూర జంతువుల విషయమున, బంధవిమోక్షణమున, పధిగమనమున, దుస్థానమున, రాజమోహనమున, ఆగమమున, నిర్గమమున రాజద్వారమున దీపదానము ప్రశస్తముగా చెప్పబడినది. ఈ విషయమున విచారించవలయున పనిలేదు. పదకొండు కొని ఇరువదియొకటి కాని పిండి ముద్దలు చేసి మూడు భాగములు చేసి నలుబది రోజులు చేయుట. ఒక పద్ధతి. పంచ,సప్త,నవ అనునది లఘమౌనము. క్షీరముచేకొని, దధికానని, నవనీతముచేకొని, గోమయముచేకొని దీపదాననిషయమున హనుమంతుని దక్షిణాభిముగా చేసి ఋకవిన్యస్త పాదుని, కిరీట వీరాజితునిగా భిత్తియందు కాని, పటమునందు కాని, పీఠమున కాని హనుమంతుని చిత్రమును లిఖించి మాలామంత్రముచే దీపదానము చేయవలయును. ద్వాదశాక్షర విద్యచే నిత్యదీపముంచవలయును. దీపదానమున నున్న విశేషమును తెలియును. షష్ట్యాది యందు ద్వితీయాదియందు ఈ దీపమును గ్రహీంచుము. అని పలుకవలయును. కూటాదులయందు నిత్యదీపవీధియందు ద్వాదశాక్షరమంత్రమును పఠించవలయును. ఆయా కార్యములందు మాలామంత్రముచే దీపదానమును చేయవలయును. గోమయముచే అలికిన భూమియందు రేఖా సమన్వితముగా షట్కోణమును అష్టదలమును లిఖించవలయును. షట్కోణములందు బీజయుక్త షడంగములను లిఖించవలయును. ఆమధ్యలో సౌమ్యుడగు మారుతిని వ్రాసి పూజించి, షట్కోణములందు షడంగములను సొమములను పూర్వోక్తవిధిగా వసుపత్రములందు క్రమముగా ఈ ఎనిమిది మంది వానరులను పూజించవలయును. సుగ్రీవుని, అంగదుని, సు షేణుని, నలును, నీలుని, జాంబవంతుని, ప్రహస్తుని, సువేషుని చక్కగా పూజించి తరువాత షడంగ దేవతను పూజించవలయును. మొదట వాయుపుత్రుని, తరువాత జానకీజీవనుని, రామదూతను, బ్రహ్మాస్త్రనివారకుని దేశకాలసంకీర్తనము చేసి చక్కగా పూజించవలయును. కుశోదకమును తీసుకొని దీపమంత్రమును పఠించవలయును. ఉత్తరాభిముఖుడై జపించి సాధించవలయును. ఆ మంత్రమును పదకొండు మార్లు జపించి జలమును భూమిమీద విడువలయును. తరువాత అంజలిబద్దుడై శక్త్యను సారముగా జపించవలయును. ఉత్తరాభిముఖముగా నున్న ఈ దీపరాజులు నా కోరికలు తీరునట్లు చేయుము. ఇట్లు పదమూడు ద్రవ్యములను గోమయము, మృత్తికా, మషీ, లత్తుక, దరదము, రక్త చందనము, చందనము, తేనె, కస్తూరి, దధి, క్షీరము, నవనీతము, ఘృతము వీటిని ఉపయోగించవచ్చును. గోమయము గోభవము, మహిషీ భవము అని రెండు విధములు. నశించిన ద్రవ్యప్రాప్తికి మాహిష గోమయమునుపయోగించవచ్చును.
పథకాగమనే దూరాన్మహాదుర్గస్య రక్షణే,
బాలాది రక్షణే చైవ చౌరాదిభయనాశనే.
స్త్రీవశ్యాదిషు కార్యేషు శస్తం గోమమయం మునే,
భూమిప్పృష్టం న తద్గృహ్యం అంతరిక్షాచ్చ భాజనే.
చతుర్విధా మృత్తికా తు శ్వేతా సీతారుణాసితా,
తత్ర గోపీచన్దనం తు హరితాలం చ గైరికమ్.
మషీ లాక్షారసోద్భూతా సర్వం వాన్యత్స్ఫుటం మతమ్,
కృత్వా గోపీచన్దనేన చతురస్రం గృహే సుధీః.
తన్మధ్యే మాహి షేణాధ కుర్యాన్మూర్తిం హనూమతః,
బీజం క్రోధాచ్చ తత్పుచ్ఛం లిఖేన్మన్త్రీ సమాహితః.
తెలేన స్నాపయేన్మూర్తిం గుడేన తిలకం చరేత్,
శతపత్రసమో ఘూపశ్శాలనిర్యాససంభవః.
కుర్యాచ్చ తైలదీపం తు వర్తిపంచకసంయుతమ్,
దధ్యోదనేన నైవేద్యం దద్యాత్సాధకసత్తమః.
వారత్రయం కంఠదేశే సశేషం విషముచ్చరన్,
ఏవం కృతే తు నష్టానాం మహిషీణాం గవామపి.
దాసీదాసాదికానాం చ నష్టానాం ప్రాప్తిరీతా,
చౌరాదిదుష్టసత్త్వానాం సరాదీనాం భయే పునః.
తాలేన చ చతుర్ద్వారం గృహం కృత్వా సుశోభనమ్,
పూర్వద్వారే గజస్థాప్యో దక్షిణే మహిషస్తథా.
సర్పస్తు పశ్చిమే ద్వారే వ్యాఘ్ర శ్చైవోత్తరే తథా,
ఏవం క్రమేణ ఖడ్గం చ క్షురికొదండముద్గరాన్.
విలిఖ్య మధ్యే మూర్తిం చ మహిషీ గోమయేన వై,
కృత్వా డమరుహస్తాం చ పీతాక్షీం ప్రయత్నతః,
పయసా స్నానం రక్తచన్దనేనానులేపనమ్,
జాతీపుష్పైస్తు సంపూజ్య శుద్ధధూపం ప్రకల్పయేత్.
ఘృతేన దీపం దత్వాథ పాయసాన్నం నివేదయేత్,
గగనం దీపి కేన్ద్వాఢ్యం శాస్త్రం చ పురతో జపేత్.
ఏవం సప్తదినం కృత్వా ముచ్యతే మహతో భయాత్,
అనయోర్భౌమవారే తు కుర్యాదారంభమాదరాత్
శత్రు సేనాభయే ప్రాప్తీ గైరి కేణ తు మండలమ్,
కృత్వా తదన్తరే తాలమీషన్నమం సమాలిఖేత్ .
తత్రావలంబమానాం చ ప్రతిమాం గోమయేన తు,
వామహస్తేన తాలాగ్రం దక్షిణే జ్ఞానముద్రికా.
తాలా మూలాత్స్వకాష్ఠాయాం మార్గే హస్తమితే గృహమ్,
చతురస్రం విధాయాథ తన్మధ్యే మూర్తిమాలిఖేత్.
దక్షిణాభిముఖీం రమ్యాం హృదయే విహితాంజలిమ్,
తోయేన స్నానగంధాది యథాసంభవమర్పయేత్.
కృశరాన్నం చ నైవేద్యం సాజ్యం తస్యై నివేదయేత్,
కిలిద్వయం జపం ప్రోక్తం ఏవం కుర్యాద్దినే దినే.
ఏవం కృతే భవేచ్ఛీఘ్రం పధికానాం సమాగమః,
శ్యామపాషాణఖండేన లిఖిత్వా భూపతేర్గృహమ్.
ప్రాకారం తు చతుర్ద్వారయుక్తం ద్వారేషు తత్రవై,
అన్యోన్యపుచ్చరిధిత్రయయుక్తాం హనూమతః.
కుర్యాన్మూర్తిం సోమయేన ధత్తూరకుసుమైర్యజేత్,
జటామాంసీభవం ధూపం కైలాక్తఘృతదీపకమ్.
నైవేద్యం తిలతైలాక్తసక్షారామాషరోటికా,
ధ్యేయో దక్షిణహస్తేన రోటికా భక్షయన్హరి:.
వామహస్తేన పాషాణెస్త్రాసయన్సర సైనికాన్,
మారయన్భ్రుకుటీం బద్ధా భీషయన్నధయష్ఠితః.
జుపేచ్చ భుగ్భుగితి వై సహస్రం ధ్యానతత్పరః,
ఏవం కృతవిధానేన పర సైన్యం వినాశయేత్.
రక్షా భవతి దుర్గాణాం సత్యం సత్యం న సంశయః,
ప్రయోగా బహవసత్ర సంక్షేపాద్గదితా మయా.
ప్రత్యహం యో విధానేన దీపదానం విధానతః,
తస్యాసాధ్యం న వై కించిత్ విద్యతే భువనత్రయే.
న దేయం దుష్టహృదయే దుష్టచిన్తనబుద్ధయే,
అవినీతాయ శిష్యాయ పిశునాయ కదాచన.
కృతాఘ్నాయ న దాతవ్యం దాతవ్యం చ పరీక్షితే,
బహునా కిమిహోక్తేన పర్వం దద్యాత్కపీశ్వరః.
అథ మన్త్రాన్తరం వక్ష్యే తత్త్వజ్ఞానప్రదాయకమ్,
తారో నమో హనుమతే జాఠరత్రయమీరయేత్.
దనక్షోంభ సమాభాష్య సంహరద్వయమీరయేత్,
ఆత్మతత్త్వం తతః పశ్చాత్ ప్రకాశయ యుగం తతః. వర్మాస్త్రవహ్నిజాయాత్తస్సార్దషడ్వింశధర్ణవాన్,
వసిష్ఠోస్య మునిశ్ఛన్దోనుష్టుప్ప దేవతా పునః.
హనుమాన్మునిః సప్తరు వేదాష్ట్రనిగమైః క్రమాత్,
మంత్రార్ణైశ్చ షడంగాని కృత్వా ధ్యాయేత్కపీశ్వరమ్.
జానుస్థవామబాహుం చ జ్ఞానముద్రాపరం హృది,
అధ్యాత్మ చిత్తమాపీనం కదలీవనమధ్యగమ్.
బాలార్కకోటిప్రతిమం ధ్యాయేత్ జ్ఞానప్రదం హరిమ్,
ధ్యాత్వైవం ప్రజ పేల్లక్షం దశాంశం జుహుయాత్తిలైః.
సాజ్యైస్సంపూజయేత్పఠే పూర్వోక్తే పూర్వవత్ర్పభుమ్,
జప్తోళియం మదనక్షోభం నాశయత్యేవ నిశ్చితమ్.
తత్త్వజ్ఞానమవాప్నోతి కపీంద్రప్య ప్రసాదతః,
అథ మంత్రాంతరం వక్ష్యే భూతవిద్రావణం పరమ్.
తారః కాశీ కుక్షిపరవహాశ్చాంజనాపదమ్,
పవనో వనపుత్రాంతే ఆవేశ ద్వయమీరయేత్.
తారశ్రీహనుమాత్పశ్చాదస్త్ర రేచభుజాక్షరః,
బ్రహ్మా మునిస్స్యాద్గాయత్రీ ఛందోత్ర దేవతా పునః.
హనుమాన్కమలా బీజం ఫట్ శక్తిః పరికీర్తితా,
షడ్దీర్ఘాడ్యేన బీజేన షడంగాని సమాచరేత్.
ఆంజనేయం పాటలాస్యం స్వర్ణాద్రిసమవిగ్రహమ్,
పారిజాతద్రుమూలస్థం చింతయేత్సాధకోత్తమః.
ఏవం ధ్యాత్వా జుపేల్లక్షం దశాంశం జుహుయాత్తిలై,
త్రిమధ్యక్తైర్యజేల్పీఠే పూర్వోక్తే పూర్వవత్సుధీః.
అనేన మనునా మన్త్రీ గ్రహగ్రస్తం ప్రమార్జయేత్,
ఆక్రన్దంస్తం విముత్యాథ గ్రహశ్శీఘ్రం పలాయతే.
మనవోఽమీ సదా గోప్యా న ప్రకాశ్యా యతస్తతః,
పరీక్షితాయ శిష్యాయ దేయా వా నిజసూనవే,
హనుమద్భజనాసక్తః కార్తవీర్యార్జునం సుధీః,
విశేషతస్సమారాధ్య యథోక్తం ఫలమాప్నుయాత్.
ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే దీపవిధి నిరూపణం నామ పంచసప్తతితమోఽధ్యాయః.
దేశాన్తరము వెళ్ళినవాడు చాలా దూరము నుండి రావలసి యున్నపుడు, మహా దుర్గమును రక్షించవలసియున్నపుడు, బాలాదులను రక్షించవలసి యున్నపుడు, చోరాదుల వలన కలుగు భయమునను తొలగించవలసియున్నపుడు, స్త్రీలను వశము చేసుకొనవలసి యున్నపుడు గోమయము ప్రశస్తము. గోమయమును భూమి మీద పడిన తరువాత గ్రహించరాదు. ఆకాశమున నుండగనే పాత్రలో తీసుకొనవలయును. శ్వేతము, పీతము, - అరుణము, అసితము అని మృత్తిక నాలుగు విధములు. గోపీచందనము, హరితాలము, గైరికము, మషి, లాక్షారసోద్భూతము వర్ణములు విశిష్టములు. ఇతరములు స్పష్టములే. గోపీచందనముచే చతురస్ర గృహమును లిఖించి, ఆ గృహమధ్యమున మాహిషగోమయముచే హనుమంతుని మూర్తిని చేసి క్రోధభీజమును పుచ్చమునను సావధానముగా లిఖించి, తైలముచే స్నానము చేయించి, గుడముచే తిలకధారణ చేసి శాలనిర్యాససంభవమగు ధూపమును పద్మ సమముగా చేసి, అయిదు వత్తులచే తైలదీపమునుంచి, దధ్యోదనమును నైవేద్యము చేసి, మూడు వారములు కంఠదేశమున శేషవిషమునుచ్చరించుచుండవలయును. ఇట్లు చేసినచో నష్టములగు గేదెలు, గోవులు దాసదాసీజనములు త్వరలో లభింతురు. చోరాది దుష్టులవలన సర్పాదులవలన భయము కలిగినపుడు తాలముచే నాలుగు ద్వారములు గల గృహమును లిఖించి పూర్వద్వారమున గజమును, దక్షిణ ద్వారమున మహిషమును, పశ్చిమద్వారమున సర్పమును, ఉత్తరమున వ్యాఘము ఏర్పరిచి, ఇట్లే క్రమముగా ఖడ్గమును కురికను, దండమును ముదర్గమును లిఖించి, మధ్యలో మాహిష గోమయముచే మూర్తిని ఏర్పరిచి డమరు హస్తము చకితాక్షిని ప్రయత్నముచే ఏర్పరిచి, పాలచే స్నానము చేయించి, రక్త చందనముచే అనులేపనపనము గావించి, జాజిపూవులచే పూజించి శుద్ద ధూపమును కల్పించవలయును. నేతిదీపమునుంచి పాయసాన్నమును నివేదన చేయవలయును. దీప కేంద్వొడ్యమగు గగనమును శాస్త్రమును ముందు జపించవలయును. ఇట్లు ఏడు దినములు చేసినచో మహాభయము నుండి విముక్తుడగును. ఈ రెండు విధానములను మంగళవారమున ప్రారంభించవలయును. శత్రు సైన్య భయము కలిగినపుడు గైరికాది ధాతువులచే మండలమును లిఖించవలయును. మధ్యభాగమున కొద్దిగా వంగియున్న తాలమును లిఖించవలయును. అచట వ్రేలాడు ప్రతిమను గోమయముచే ఏర్పడవలయును. వామహస్తముచే తాలాగ్రమును, దక్షిణహస్తముచే జ్ఞానముద్రికను, తాలమూలమునుండి స్వదిశలో మార్గమున హస్తమితమున చతురస్ర గృహము నేర్పరిచి, దాని మధ్యలో మూర్తిని లిఖించవలయును. దక్షిణాభిముఖముగా సుందరముగా, హృదయమున అంజలిని ధరించి జలముచే స్నానగందాదులను యథాశక్తిగా అర్పించవలయును. నేయి కలిపిన నువ్వుల అన్నమును నివేదన చేయవలయును. రెండు వేలు జపించవలయును. ఇట్లు ప్రతిదినము చేసినచో తప్పిపోయినవారు తిరిగి వత్తురు. శ్యామపాషాణ ఖండముచే భూపతి గృహమును లిఖించి, నాలుగు ద్వారములచే కూడిన ప్రాకారము నేర్పరిచి, ఆ ద్వారములలో అన్యోన్యపుచ్చములుకల హనుమంతుని ఆకొరత్రయము నేర్పరిచి గోమయముచే హనుమన్మూర్తిని చేసి, ఉమ్మెంత పూవులచే పూజించవలయును. జటామాంసీభవమగు ధూపమును, నూనె కలిపిన నేతి దీపమును, నువ్వుల నూనె కలిపిన కారము కలిపిన మినుప రొట్టెను నైవేద్యము చేసి, దక్షిణ హస్తమున రొట్టెను తినుచున్న హనుమంతుని ధ్యానించవలయును. వామహస్తముచే పొషాణములను విసరుచు శత్రు సైన్యమును భయ పెట్టుచున్న వానిని, కనుబొమను ముడిచి, భయ పెట్టుచు, క్రోబింప చేయుచు శత్రువులను సంహరించుచున్న హనుమంతుని ధ్యానించవలయును. ‘భుగుగ్’ అని వేయి మార్లు జపించవలయును. ఇట్లు చేసినచో పర సైన్యమును నశింపచేయగలడు. దుర్గములకు చక్కనిరక్షణ ఏర్పడును. ఇట్లు చాలా ప్రయోగములను చెప్పితిని. ప్రతిదినము యథావిధిగా దీపదానము చేయువానికి మూడులోకములలో సాధించలేనిదేదియు నుండదు. దుష్టహృదయము కలవానికి, దుష్ణాలోచన దుష్టబుద్ధికలవానికి, వినయము లేని శిష్యునకు, లోభికి, కృతఘ్ననకు ఈ మంత్రములనుపదేశించరాదు. చక్కగా పరీక్షించి ఉపదేశించవలయును. ఇంకనూ ఏమి చెప్పవలయును. హనుమంతుడు అన్నిటినిచ్చును. ఇపుడు తత్త్వజ్ఞానము నిచ్చు మరియొక మస్త్రమును చెప్పెదను. “ఓం నమో హనుమతే జాఠరదన క్షోభం సంహర! సంహర ! ఆత్మ తత్త్వం ప్రకోశయ ప్రకాశయ ! హుం ఫట్ స్వాహా” అను మంత్రము సార్ధ షడ్వింశత్యక్షరములు కలది. ముని వసిష్ఠమహర్షి అనుష్టుప్ ఛందస్సు హనుమంతుడు దేవత 7, 7, 6, 4, 8, 4 మంత్రాక్షరములచే షడంగములను కల్పించవలయును. హనుమంతుని ధ్యానించవలయును. పొమబాహువును జానువుననుంచి, హృదయమున జ్ఞానముద్రనుంచి అధ్యాత్మ చిత్తముతో ఆసీనుడై, కదలీవనమధ్యగతుడై, బాలార్కకోటి ప్రతిముడు, జ్ఞానప్రదుడగు హనుమంతుని ధ్యానించి, లక్ష జపించి, దశాంశమును నేయి కలిపిన నువ్వులచే హోమము గావించి, పూర్వోక్త పీఠమున- పూర్వమువలె పూజించవలయును. ఈ మంత్రమును జపించినచో మన్మథ వికారములు నశించును. హనుమంతుని అనుగ్రహమువలన తత్త్వజ్ఞానమును పొందును. భూతములను పొరద్రోలు మరియొక మంత్రమును చేప్పెదను. “ఓం కాశీం కుకీ వరాహాం జనా పవన వనపుత్ర ఆవేశి ఆవేశి” “ఓం శ్రీహనుమన్మస్త్రరచ” అనునది మరియొక మంత్రము. బ్రహ్మ ముని గాయత్రీ ఛందస్సు హనుమంతుడు దేవత. కమలా బీజము ఫట్ శక్తి. షడ్రీరాడ్య బీజముచే షడంగకల్పన చేయవలయును. పాటలాస్యుడు, స్వర్ణోదీ సమవిగ్రహుడు, పారిజాత వృక్షమూలస్తుడు అగు ఆంజనేయుని ధ్యానించవలయును. ఇట్లు ధ్యానించి, లక్ష జపించి, తేనె కలిపిన నువ్వులచే, దశాంశమును హోమముగావించి, పూర్వోక్త పీఠమున పూర్వమువలె పూజించవలయును. ఈ మంత్రముచే గ్రహగ్రస్తుని తుడువవలయును. ఇట్లు చేసినచో గ్రహము అరుచుచు అతనిని విడిచి పారిపోవును. ఈ మంత్రములను ఎప్పుడూ రహస్యముగా నుంచవలయును. అందరికీ తెలుపరాదు. చక్కగా పరీక్షించిన శిష్యునికి కాని, పుత్రునికి కాని ఉపదేశించవలయును. హనుమద్భజనాసక్తుడగు బుద్ధిమంతుడు కార్తవీర్యార్జుని విశేషముగా ఆరాధించి యథోక్తఫలమును పొందును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున దీపవిధి నిరూపణ మను డెబ్బది అయిద - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 76 of the Nārada Mahā Purana is as follows:
శ్రీవిద్యోపాసనలో అత్యుత్తమమైన శ్రీ త్రిపురసుందరీ దేవి మంత్రోపాసన ఈ అధ్యాయంలో ప్రతిపాదించబడినది. శ్రీచక్ర యంత్రారాధన, కాది విద్య, హాది విద్యల రహస్యములు మరియు దేవీ మంత్ర జప మహిమ ఇక్కడ వర్ణించబడినవి.