నారద మహా పురాణము
86 - యక్షిణీ మంత్ర సాధన నిరూపణమ్
సనత్కుమార ఉవాచ :
సరస్వత్యవతారాస్తే కధితా స్సిద్ధిదా నృణామ్ ।
అథ లక్ష్మ్యవతారాంస్తే వక్ష్యే సర్వార్థ సిద్ధిదాన్
వాణీ మన్మథశక్త్యాఖ్యం బీజత్రితయ మిరితమ్ ।
ఋషి స్స్యాదక్షిణామూర్తి: పంక్తిశ్ఛన్దః ప్రకీర్తితమ్
దేవతా త్రిపురా బాలా మధ్యాంతే శక్తి బీజకే ।
నాభేరాపాదమాద్యం తు నాభ్యన్తం హృదయాత్పరమ్
మూర్ద్ర హృదస్తం తార్తీయం క్రమాదేతేషు విన్యసేత్ ।
ఆద్యం వామకరే దక్ష కరే తదుభయోః పరమ్
పునర్బీజత్రయం న్యస్య మూర్థి గుహ్యే చ వక్షసి ।
నవయోన్యాభిధం న్యాసే నవకృత్వ మనుం న్యసేత్
కర్ణయోశ్చిబుకే న్యస్వేచ్ఛంకయోర్ముఖ పంకజే ।
నేత్రయో రాసికాయాం చ స్కన్హయో రుదరే తథా
న్యసే త్కూర్పరయోర్నాభౌ జానునో ర్లింగ మస్తకే ।
పాదయోరపి గుహ్యేచ పార్వయోర్హదయే పునః
స్తనయోః కంఠదేశే చ వామాంగాదిషు విన్యసేత్ ।
వాగ్బవాద్యాం రతిం గుహ్యా ప్రీతి మత్యాదికాం హృది
కామబీజాదికాన్పశ్యేద్రూమధ్యే తు మనోభవామ్ ।
పునరాగాకాత్మమాద్యా స్మిస ఏవ చ విన్య సేత్
అమృతేశీం చ యోగేశీం విశ్వయోనిం తృతీయకమ్ ।
మూర్థి వక్రే హృది న్యస్యేద్దుహ్యే చరణయోరపి
కామేశాం పంచబీజాఢ్యం స్మరాత్పంచ న్యసేత్ర్కమాత్ ।
మాయా కామౌ చ వాగ్లక్ష్మీ కామేశా పంచ బీజకమ్
మనోభవశ్చ మకర ధ్వజ కన్జర మన్మధాః ।
కామదేవః స్మరః పంచ కీర్తితా న్యాస సిద్ధిదాః
శిర: పన్ముఖగు హ్యేషు హృదయే బాణదేవతాః ।
ద్రావిణాద్యాః క్రమాన్య స్యేద్భాణేశీ బీజ పూర్వకా:
ద్రాం ద్రీం క్లీం జూం స ఇతి వై బాణేశ్ బీజ పూర్వకాః ।
ద్రావిణీ క్షోభిణీ వశీ కరణ్యా కర్షణీ తధా
సమ్మోహనీ చ బాణానాం దేవతాః పంచకీర్తితాః ।
తార్తీయవాగ్మధ్వరేన కామేన స్యాత్తడంగమ్
షడ్డీరస్వరయుక్తేన తతో దేవీం విచింతయేత్ ।
ధ్యాయేద్రక్తసరోజస్థాం రక్తవస్త్రాం త్రిలోచనామ్
ఉద్యదరనిభాం విద్యాం మాలాభయవరోద్వహామ్ ।
లక్షత్రయం జపేన్మస్త్రం దశాం శంకించుకోద్భవైః
పుషైర్హయారిజైర్వాపి జుహుయాన్మధురాన్వితైః ।
నవయోన్యాత్మకం యన్తం బహిరష్టదలావృతమ్
కేసరేషు స్వరాన్య స్యేద్వర్గానష్టా దలేష్వపి ।
దలాగ్రేషు త్రిశూలాని పద్మం తు మాతృకావృతమ్
ఏవం విలిఖితే యంత్ర పీఠశక్తీః ప్రపూజయేత్ ।
ఇచ్ఛా జ్ఞానాక్రియా చైవ కామినీ కామదాయినీ
రతీ రతి ప్రియా నన్హా మనోన్మన్యపి చోదితాః ।
పీఠశక్తీ రిమా ఇష్టా పీఠం తన్మనునా దిశేత్
వ్యోమ పూర్వేలు తార్తీయం సదాశివ మహాపదమ్ ।
ప్రేత పద్మాసనం జేస్తం నమోంతః పీఠ మన్తకం
షోడశార్ల సతో మూర్తె క్లుప్తాయాం మూల మంత్రతః ।
ఆవాహ్య ప్రజపేద్దేవీ ముపచారైః పృథగ్విధైః
దేవీ మిష్టా మధ్యయోనౌ త్రికోణా రతిపూర్వికామ్ ।
వామకోణే రతిం దక్షే ప్రీతిమగ్రే మనోభవామ్
యోన్యంతర్వహ్నికోణారావంగాన్యన్నే ర్విదిక్షపి ।
మధ్యయోనేర్బహిః పూర్వా దిషు చాగ్రే స్మరానపి
బాణదేవీ సర్వదేవ శక్తీరష్టసు యోనిషు ।
సుభగాఖ్యా భగొపశ్చా తృతీయా భగసర్పిణీ
భగమాలా తథానంగా తగాద్యా కుసుమాపరా ।
అనంగమేఖలానంగ మదన్త్యష్ట శక్తయః
పద్మకేశరగా బ్రాహ్మీ ముఖాః పత్రేషు భైరవాః ।
దీరాద్యా మాతరః పూజ్యా హ్రస్వాద్యాశ్చాష్టభైరవాః
దలాగ్రే ష్వష్ట పీఠాని కామరూపొఖ్య మాదిమమ్ ।
మలయం కోల్లగిర్యాఖ్యం చౌహారాఖ్యం కులాంతకమ్
జాలంధరం తథోన్నాసం కోటపీఠమథాష్టమమ్ ।
భూగృహే దశ దిక్షర్చే ఛేతుకం త్రిపురాంతకమ్
వైతాలమగ్నిజిహ్వం చ కమలాంత కపాలినౌ ।
ఏకపదాం భీమరూపం విమలం హాటకేశ్వరమ్
శక్రాద్యాయుధై స్సర్థం స్వస్వ దీక్షు సమర్చయేత్ ।
తద్భహిర్దిక్షు బటుకం యోగినీం క్షేత్ర నాయకమ్
గణేశం విదిశాస్వర్చే ద్వసూన్పూర్వా ఇష్టికాంస్తథా ।
భూతాంశ్చళం భజనాలామీశ స్స్యాద్ధన విద్యయోః
రక్తాంభోజైరుతైర్నార్యో వశ్యాస్స్యుస్సర్షపైరృపాః ।
నంద్యావరై రాజవృక్షిః కుందైః పాటల పంచకైః
పుషైర్బిల్వఫలైర్వాపి హోమాల్లక్ష్మీస్థిరాభవేత్ ।
అపమృత్యుం జయేనన్రీ గుడూచ్యా గుగ్ధయుక్తయా
యథోక్త దూర్వాహోమేన నీరోగాయుస్సమశ్నుతే ।
జ్ఞానం కవిత్వం లభతే చంద్రాగురుసురై ర్హుతే
పలాశపుషైరాక్సిద్ధిరన్నాపిశ్చాన్నహోమతః ।
సురభిక్షీర దధ్యక్తం క్లాజానుత్వా రుజో జయేత్
రక్త చన్దన కర్పూర కర్పూరాగరురోచనాః ।
చన్దనం కేశరం మాంసీం క్రమాద్భాగైర్నియోజయేత్
భూమి చ కనక్టాబ్ది దిక్సప్త నిగమోన్మితైః ।
శ్మశానే కృష్ణ భూతస్య నిశినీ హార సాధసా
కుమార్యా పేషయేత్తాని మంత్రేణాధాభి మస్ర్య చ ।
విదధ్యాత్తిలకం తేన దర్శనాద్దశయోజనాన్
గజ సింహాది భూతాని రాక్షసాజ్ఛాకినీరపీ ।
ప్రయోజనానాం సిగ్యై తు దేవ్యా శాపం నివర్త్య చ
విధాయోత్కీలితాం పశ్చా జ్ఞాపమస్య సమాచరేత్ ।
యో జపేదామేచీజే వరాహ భృగుపావకాన్
మధ్యమాదౌ నభోహంసే మధ్యమాంతే తు పావకమ్ ।
ఆదావంతే చ తార్తీయక్రమాత్స్వం ధూమ్రకేతనమ్
ఏవం జప్త్యా శతం విద్యా శాపహీనా ఫలప్రదా ।
యద్వార్వే చరమే బీజే నైవం రేఫం వియోజయేత్
శాపోద్ధారప్రకారోన్యో యద్వయం కీర్తితో బుధైః ।
ఆద్యమాద్యం హి తార్తీయం కామః కామోధ వాగ్భవమ్
అన్యమన్య మనంగశ్చ నవార్ణః కీర్తితో మనుః ।
జప్తాయం శతధా శాపం జాలాయా వినివర్తయేత్
చైతన్యాహ్లాదినీ మన్రో జప్తా నిషేలితో కరౌ ।
త్రిస్వరాశ్చేతనం మంత్రి ధరశ్శాంతి రనుగ్రహః
తారాది హృదయానస్స్యా శ్కామ ఆహ్లాదినీ మనుః ।
తథా ప్రయాణాం బీజానాం దీపనైర్మనుభిస్తిభిః
సుదీప్తిని విధాయాదే జపేత్తానీష్టసిద్ధయే ।
పదయుగ్మం సుదీర్ఘాంబుస్మృతివాలావనం గతా
సత్యస్సనేత్ర నస్తాదృగ్వావాగ్వద్య దీపినీ ।
క్లిన్నే క్లేదిని వైకుంఠ దీర్ఘం స్వం సద్యగోంతిమ:
నిద్రా స చంద్రా కుర్వీత శివార్లా మధ్యదీపినీ ।
తారో మోక్షం చ కురుతే నాయం వర్ణస్య దీపినీ
దీపినీ మంతరా బాలా సాధాతాపి నసిద్ధ్యతి ।
వారంత్యకామాన్ ప్రజయే దరీనాం క్షోభహేతవే
కామ వాగన్య బీజాని త్రైలోక్యస్య వశీకృతా ।
కామాన్య వాణీ బీజాని ముక్తయే నియతో జపేత్
పూజారంభే తు బాలాయా త్రివిధా నర్చయేద్దురూన్ ।
దివ్యౌఘశ్చైవ సిద్ధాఘ మానవొఘు ఇతి త్రిధా
పరప్రకాశః పరమేశానః పరశివస్తథా ।
కామేశ్వర స్తతో మోక్షః షష్ఠః కామోమృతంతిమ:
ఏతే సపైవ దివ్యాఘా ఆనన్దపద పశ్చిమాః ।
ఈశానాఖ్యస్తత్పురుష ఘోరాభ్యో వామదేవకః
సద్యోజాత ఇమే పంచ సిద్ధాఘాఖ్యా స్సతా మునే ।
మానవాఘాః పరిజ్జీయా స్వగురోస్సంప్రదాయత:
నవయోవ్యాత్మకే యంత్రే విలిథేన్మధ్యయోనితః ।
ప్రాదక్షిణ్యేన బీజాని త్రివారం సాధకోత్తమః
త్రింస్త్రీన్వర్ణాంస్తు గాయత్ర్యా అష్టపత్రేషు సంలీఖేత్ ।
బహిర్మాతృకయా వేష్ట్య తద్భహిర్భూపురద్వయమ్
కామబీజలసత్కోణ వ్యతిభిన్నం పరస్పరమ్ ।
సత్రే త్రిపురమాఖ్యాతం జపసంపాతసాధితమ్
బాహునా విధృతే దద్యాద్ధనం కీర్తిం సుఖం సుతాన్ ।
కామాంతే త్రిపురాదేవీ విద్మహే కవిషంభహిమ్
తత్ర క్లిన్నే ప్రచోదాంతే యాదిత్యేషా ప్రకీర్తితా ।
గాయత్రీ త్రైపురా సర్వ సిద్ధిదా సురసేవితా
సనత్కుమార మహర్షి పలికెను :
ఇంతవరకు నీకు సరస్వతీ అవతారములను చెప్పితిని. ఇక ఇపుడు సర్వసిద్ధి ప్రదములగు లక్ష్మ్యవతారములను చెప్పెదను. వాణీ మన్మథ శక్తి నామములతో మూడు బీజములు చెప్పబడినవి. దక్షిణామూర్తి ఋషి, పంక్తి ఛందస్సు. బాలాత్రిపుర దేవత. మధ్యాంతములందు శక్తి బీజములుండును. నాభి నుండి పాదముల వరకు మొదటిది. హృదయము నుండి నాభి వరకు రెండవది. శిరస్సు నుండి హృదయము వరకు మూడవది. ఈ మూడిటి యందు మూడు బీజముల నుంచ వలయును. మొదటి దానిని వామకరమున దక్షిణ కరమున, రెండవది రెండు కరములందు, మరల బీజ త్రయన్యాసమును శిరస్సున గుహ్యమున, వక్ష సృలమున నుంచి నవయోని న్యాసమున తొమ్మిది మార్లు మంత్రన్యాసమును గావించవలయును. కర్ణములందు, చిబుకము నందు, శంఖములందు, ముఖ పంకజము నందు, నేత్రము లందు, నాసిక యందు, స్కంధములందు, ఉదరము నందు, కూర్చరములందు, నాభియందు, జానువులందు, లింగమునందు, మస్తకము నందు, పాదములందు, గుహ్యము నందు, పార్శ్వములందు, హృదయము నందు, స్తనములందు, కంఠము నందు, వామాంగాదులందు న్యాసము గావించవలయును. వాగ్భవాద్యమగు రతిని గుహ్యమున, ప్రీతి మత్యాదికమును హృదయమున, కామబీజాదికములను భ్రూమధ్యమున మనోభవమును న్యాసము గావించవలయును. మరల వాగాది న్యాస త్రయమును గావించవలయును. అమృతేశి, యోగేశి, విశ్వయోని అను మువ్వురిని శిరస్సున వక్రమున హృదయమున, గుహ్యమున, పాదములందుంచ వలయును.పంచ బీజాఢ్యమగు వామేశిని మన్మధుని నుండి పంచన్యాసమును గావించవలయును. మాయ, కామ, వాక్, లక్ష్మి, కామేశి అనునవి అయిదు బీజములు కలవి. మనోభవ, మకరధ్వజ, కందర్ప, మన్మధ, కామదేవ, స్మరులు న్యాస సిద్ధిదులుగా చెప్పబడిరి. శిరస్సున పాదములందు, ముఖమున, గుహ్యమున హృదయమున ద్రావిణీ మొదలగు బాణ దేవతలను బాణేశా బీజ పూర్వకముగా న్యాసముగావించవలయును. ద్రాం, దీం, క్లీం,సం, కం అనునవి బాణేశ బీజములు. ద్రావిణీ, క్షోభిణీ, వశీకరణీ, ఆకర్షణీ, సంమోహనీ అనునవి అయిదు బాణ దేవతలు. మూడవది వాజ్మధ్యమమగు కామ బీజముచే షడంగములను కల్పించవలయును. షడ్డీరస్వర యుక్తముచే దేవిని ధ్యానించవలయును. రక్తపద్మమున నుండునది రక్తవస్త్ర త్రిలోచన, ఉద్యదరనిభ, విద్యాస్వరూపిణి, మాలా భయవరధారిణి యగు దేవిని ధ్యానించవలయును. మూడు లక్షలు జపించవలయును. దశాంశమును మోదుగు పూవులచేకాని, హయారి పుష్పములచే కానీ మధుర మిశ్రితములుగా హోమము గావించవలయును. నవయోన్యాత్మక యంత్రమును లిఖించి, బయట అష్టదల పద్మమును లిఖించి కేసరములందు స్వరములను, దలములందు అష్ట వర్గలను న్యాసము గావించవలయును. దలాగ్రములందు త్రిశూలములను, పద్మమున మాతృకావృతిని లిఖించిన యంత్రమున షట్ శక్తులకు పూజించవలయును. ఇచ్ఛా, జ్ఞానాక్రియా, కామినీ, కామదాయినీ, రతీ, రతిప్రియ, నందా, మనోన్మని అనునవి తొమ్మిది పీఠ శక్తులు. ఈ శక్తులను పూజించి పీఠమంత్రముచే పీఠమును నిర్దేశించ వలయును. “సదా శివాయ మహా ప్రేత పద్మాసనాయ నమ:” అనునది పీఠమంత్రము ఈ మంత్రము పదునారు అక్షరములు కలది. తరువాత మూల మంత్రముచే మూర్తిని కల్పించి దేవిని ఆవాహన గావించి వివిధ ఉపచారములచే పూజించి జపించవలయును. త్రికోణ రూపమగు మధ్య యోనియందు రతి పూర్విక యగు దేవిని పూజించి, వామ కోణమున రతిని, దక్షిణ కోణమున ప్రీతిని, ముందు మనోభవను, యోన్యంతర్భాగమున వహ్నికోణాదులందు అంగములను, అగ్నియొక్క విదిక్కులందు కూడా పూజించవలయును. మధ్యయోని బయట పూర్వాది దిక్కులందు అగ్రభాగాన స్మరులను, అష్టయోనులందు బాణ. దేవులను, శక్తులను అట్లే పూజించవలయును. సుభగా, భగా, భగసర్పిణీ, భగమాలా, అనంగా, నగాకుసుమా, ఆనంగమేఖలా, అనంగమదనా అనునవి అష్టశక్తులు. పత్రములందు పద్మకేసరగతులగు బ్రాహ్మీముఖులగు భైరవులను పూజించవలయును. దలాగ్రము లందు అష్ట పీఠములనుంచ వలయును. మొదటిది కామరూపము మలయము, కోల్లగిరి, చౌహారము, కులాంతము, జాలంధరము, ఉన్నసము, కోట పీఠము అనునవి అష్ట పీఠములు. భూ గృహమున దశ దిక్కులందు హేతుకుని, త్రిపురాంతకుని, వైతాలుని, అగ్ని జిహ్వుని, కమలాంత, కపాలులను, ఏకపాదుని, భీమరూపునీ, విమలుని, హాటకేశ్వరుని పూజించి వారి వారి దీక్కులందు శక్రాదులను సాయుధులను పూజించవలయును. దాని వెలుపల బటుకుని యోగినిని క్షేత నాయకుని పూజించవలయును. విదిక్కులందు గణేశుని వస్తువులను, సూర్యులను, శివులను అర్చించవలయును. ఇట్లు బాలా త్రిపురను సేవించువాడు విద్యా ధనములకు అధిపతి కాగలడు. రక్త పద్మములచే హోమము చేసిన స్త్రీలు వశమగుదురు. ఆవాలచే హోమము చేసిన రాజులు వశమగుదురు. నంద్యా వర్తములచే రాజవృక్షములచే, మల్లెలచే, పాటల చంపకములచే, పుష్పములచే బిల్వఫలములచే హోమము చేసిన లక్ష్మి స్థిరమగును. పాలు కలిపిన గుడూచిచే హోమము గావించిన అపమృత్యువును జయించును. దూర్వాహోమముచే రోగములు లేని ఆయుష్యము కలుగును. చంద్రా గురుసురములచే హోమము గావించిన జ్ఞానమును కవిత్వమును పొందును. మోదుగు పూవులచే హోమము చేసిన వాక్సిద్ధి, అన్నహోమముచే అన్నము లభించును. ఆవుపాలు కలిపిన పేలాలచే హోమమును చేసిన రోగములను జయించును. రక్త చందన కర్పూరం కర్పూరాగురు చందనకేశర, మాంసీ చయమును క్రమముగా భాగములను చేయవచ్చును. 1,1,1, 9,4,6,7, 4 సంఖ్యలతో భాగములు చేయవచ్చును. శ్మశానమున నల్లటి రాత్రియందు నీహార సౌధమును కుమారిచేత మర్థన చేయించి మంత్రముచే అభిమంత్రించి తిలకమును ధరింప చేయవలయును. ధరించిన వానిని చూచిన జనము వశమగును. గజ సింహాది భూతగణము రాక్షసీగణము శాకినీ గణము కూడా వశమగును. ప్రయోజన సిద్ది కోటకు దేవీ శాపమును వర్తింపచేసి ఉత్కీలమును గావించి తరువాత ఈ జపము నాచరించవలయును. మొదట జపమున వరాహ భృగు పావకములను జపించి, మధ్యమాది యందు నభోహంసలను, మధ్యమాంతమున పావనుని, ఆద్యంతములలో తృతీయ క్రమముచే ధూమ్రకేతనుని నూరుమార్లు జపించినచో ఈ మంత్రము శాపహీనమై ఫలప్రదమగును. లేదా ఆది బీజమున చరమ బీజమున రేఫా వియోగమును చేయరాదు. ఈ శాపోద్దారమునకు మరియొక విధానముకూడా కలదు. ఆద్యము ఆద్యము, తృతీయము, కాముడు, కాముడు, వాగ్భవము, అంత్యాంత్యము, అనంగుడు, బాలా త్రిపుర శాపము నివృత్తి యగును. చైతన్య హోదినీ మంత్రములు జపించి నచో నిషీలమగును. మూడు స్వరములు, చేతనా, శాంతి, అనుగ్రహము, తారాది మూడు మంత్రములచే సుదీప్తములను గావించి, మొదట ఆ మంత్రములను జపించవలయును. “వదవద" సుదీరాంబు స్మృతి కాలములు ఆనుగాములుగా సనేత్ర సత్యము వాగ్వర్ణోద్యములు క్లేదినిక్లిన్నము కాగా వైకుంఠము, దీర్ఘము, స్వము, సద్యోగాంతిమము, సచంద్రా, నిద్రా, ఈ మంత్రము ఏకాదశాక్షరి. 'ఇది మధ్యదీపిని, తారము మోక్షమును చేయును. ఇది వర్ణస్య దీపిని కాదు. దీపిని లేనిదే బాలత్రిపుర మంత్రమును సాధించిననూ సిద్ధించదు. శత్రుక్షోభ కొఱకు వారంత్య కామములను జయించవలయును. త్రైలోక్యమును వశము చేసుకొనుటకు కామవారంత్య బీజములను జపించవలను, మోక్షము కొఱకు కామాంత్యవాణీ బీజములను జపించవలయును. బాలా త్రిపుర పూజారంభమున త్రివిధ గురువులను పూజించవలయును. దీవోఘము, సిద్ధాఘము మానవొఘము అని గురువులు త్రివిధము పరప్రకాశుడు, పరమే శానుడు, పరశివుడు కామేశ్వరుడు, మోక్షము, కామము, అమృతము ఈ యేడుగురే దివ్యౌఘము. ఆనందప్రద పశ్చిమములు. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అను అయిదుగురు సిదౌఘులు. స్వగురు సంప్రదాయమునను. సరించి మానవోఘములను తెలియవలయును. నవయోన్యాత్మక యంత్రమున మధ్యయోని నుండి లేఖనము ప్రారంభించవలయును. ప్రదక్షిణాక్రమముచే బీజములను మూడుమార్లు వ్రాయవలయును. గాయత్రి యొక్క మూడు మూడు వర్ణములను అష్టపత్రములందు వ్రాయవలయును. వెలుపల మాతృకావేష్టనము గావించి, దాని వెలుపల భూపుర ద్వయమును వ్రాయవలయును. కామ బీజ లసత్కోణమున పరస్పర వ్యతిభిన్నముగా పత్రమున తైపురము జప సంపాత సౌధితమును గావించ వలయును. అట్లు సాధించిన పత్రమును చేతిలో ధరించినచో ధనమును, కీర్తిని, సుఖమును, సుతులను ఇచ్చును. కామాంతమున “త్రిపురాదేవీం విద్మహే కవిష భహింబకం ఖడ్గ సమారూడ సనేత్రాగ్నిం ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్” అనునది బాలాత్రిపుర గాయత్రి సర్వసిద్ధి ప్రద. సుసేవిత.
అథ లక్ష్మ్యావతారోన్యః కీర్త్యతే సిద్ధిదో నృణామ్ ।
వేదాది ర్గిరి జా పద్మా మన్మధ హృదయం భృగుః
భగవతి మాహేశ్వరీ ఏంతే అన్నపూర్ణే దహనాంగనా
ప్రోక్తా వింశతి వర్ణేయం విద్యా స్యాద్రుహిణో మునిః ।
ధృతి శ్ఛందోన్న పూర్ణేశ్ దేవతా పరికీర్తితా
షడ్దర్షాఢ్యన్న హృల్లేఖా బీజేన స్యాత్వడంగనమ్ ।
ముఖ నాసాక్షి కర్ణా గుదేషు నవసు న్యసేత్
పదాని నవ తద్వర్ణ సంఖ్యేదానీముదీర్యతే ।
భూమి చస్థ ధరైకాక్షి వేదాబ్ది యుగ బాహుభి
పద సంఖ్యామితావర్ణి స్తతో ధ్యాయేత్సురేశ్వరీమ్ ।
స్వర్ణభాంగాం త్రినయనాం వస్త్రాలంకార శోభితామ్
భూరమాసంయుతాం దేవీం స్వర్ణామత్ర కరాంబుజామ్ ।
లక్షం జపోయుతం హోమో ఘృతాక్త చరుణా తథా
జయాది నవ శక్త్యాఢ్య పీలే పూజా సమిగితా ।
త్రికోణ వేద పత్రాష్ట్ర పత్రషోడశపత్రకే
భూపురేణ యుతే యంత్ర ప్రదద్యాన్మాయయా మనుమ్ ।
అగ్న్యాది కోణత్రితయే శివవారాహ మాధవాన్
అర్చయే త్స్వస్వమంతైస్తు ప్రోచ్యంతే మనవస్తు తే।
ప్రణవో మనుచంద్రాఢ్యం గగనం హృదయం శివా
మారుత శ్శివ మంత్రయం సప్తార్ణ శివ పూజనే ।
వారాహనారాయణయోర్మంతౌ పూర్వముదీరయేత్
షడంగాని తతోభ్యర్చ్య వామే దక్షాధరాం రమామ్ ।
యజేత్స్వస్వమనుభ్యాం తు తావుచ్యేతే మునీశ్వర
అన్నం మహ్యన్నమిత్యుక్త్యా మేదేహ్యన్నాధి పోర్ణకాః ।
నయేమమన్నం ప్రాణం తే దాపయానలసుందరీ
ద్వావింశత్యక్షరో మంత్రో భూమిట్టా భూమి సంపుటః ।
లక్ష్మీష్టౌ శ్రీపుటౌ విప్రస్మృతిర్లంభాను చంద్రయుక్
భువో బీజమితి ప్రోక్తం శ్రీ బీజం ప్రాగుదాహృతమ్ ।
మంత్రాదిస్ధ చతుర్భిజ పూర్వికాః పరిపూజయేత్
శక్తీశ్చతసో దాస్తే పరాచ భువనేశ్వరీ ।
కమలా సుభగా చేతి బ్రహ్మ్యాద్యా అష్ట పత్రగాః
ప్రీతీ రతి స్త్రీ శ్రీశ్చాపి స్వధా స్వాహా దశమ్యథ
జ్యోత్స్నా హైమవతీ ఛాయా పూర్ణిమా సంహతిస్తథా ।
అమావాస్యేతి సంపూజ్యా మంత్రేశే ప్రాణ పూర్వికా
భూపురే లోకపాలా స్స్యు సదస్రాణి తదగ్రతః ।
ఇళం జపాదిభిస్సిద్ధే మన్తస్ర్మిస్ధన సంచయైః
కుబేర సదృశో మంత్రీ జాయతే జనవందితః ।
అథ లక్ష్మ్యవతా రోన్యః కీర్త్యతే మునిసత్తమ
ప్రణవశ్శాంతిరరుణా క్రియాఢ్యా చన్ద భూషితాః ।
బగలా ముఖి సర్వాంతే ఇంధికాహోదినీయుడా
పీతా జరాయుక్రృతిష్ణా పునర్డీరోద సంయుతా ।
వాచం ముఖం పదం స్తంభాయాంతే జిహ్వా పదం వదేత్
కీలయేతి చ బుద్ధిం నిధీశయాంతే స్వబీజకమ్ ।
తారాన్ని సుందరీ మంత్రో బగలాయాః ప్రకీర్తితః
మునిస్తు నారదశ్ఛందో బృహతీ బగలాముఖీ ।
దేవతా నేత్ర పంచేషు నవ పంచ విగర్లకైః
అంగాని కల్పయిత్వా చ ధ్యాయేత్పతాంబరాం తతః ।
స్వర్ణాసనస్థాం హేమాభాం స్తమ్భీనీఇందుశేఖరామ్
దధతీం ముద్గరం పాశం వజ్రం చ రసనాం కరైః ।
ఏవం ధ్యాత్వా జపేల్లక్ష మయుతం చంపకోద్భవైః
కుసుమైర్జుహుయాతీరే బాలయాః పూజయేదిమామ్ ।
చందనాగరు చంద్రాద్యైః పూజార్థం యస్త్రమాలిఖేత్
త్రికోణషడ్డలాప్టాసషోడశారే యజేదిమామ్ ।
మంగలా స్తంభినీ చైవ జృంభిణీ మోహినీ తథా
వశ్యాచలా బలాకా చ భూధరా కల్మషాభిధా ।
ధాత్రీ చ కలనా కాల కర్షిణీ భ్రామికాపి చ
మందగాపి చ భోగస్థా భావికా షోడశిస్మృతా ।
భూ గృహస్య చతుర్దిక్షు పూర్వాదిషు యక్షేత్రమాత్
గణేశం బటుకం చాపి యోగినీః క్షేత్ర పాలకమ్ ।
ఇంద్రాదీంశ్చ తతో బాహ్యై నిజాయుధసమన్వితాన్
ఇత్తం సిద్ధే మనో మంత్రో స్తంభయేద్దేవతాదికాన్ ।
పీతవ స్త్రపదాసీనః పీతమాల్యానులేపనః
పీతపు షైర్యజేద్దేవీం హరిద్రోత్తస్రజాం జపేత్ ।
పీతాం ధ్యాయ వ్భగవతీం పయోమధ్యేయుతం జపేత్
త్రిమధ్యాజ్యతిలైర్హమో నృణాం వశ్యకరో మతః ।
మధురతయాకై స్స్యాత్ ఆకట్టో లవగైర్రువమ్
తైలాభ్యకైర్నింబపతై రోమో విద్వేషకారకః ।
తాలలోణహరిద్రాభిర్విషాం సంస్తంభనం భవేత్
ఆగారధూమం రాజీశ్చ మాహిషం గుగ్గులుం నిశి ।
శ్మశానే పావకే హుత్వా నాశయే దచిరాదరీన్
గరుతో గృధ్రకాకానాం కటుతైలం విభీతకమ్ ।
గృహ ధూమం చితావహ్నౌ హుత్వా ప్రోచ్చాటయేట్రిపూన్
దూర్వాగుడూచీలజాన్యో మధురత్రితయాన్వితాన్ ।
జుహోతి సోభిలానోగాన్ శమయే ద్దర్శనాదపి
పర్వతాగ్రే మహారణ్యే నదీసంగే శివాలయే ।
బ్రహ్మచర్యంతో లక్షల జపేదఖిలసిద్ధయే
ఏకవర్లగవీదుగ్ధం శర్కరా మధు సంయుతమ్ ।
త్రిశతం మంత్రితం పీతం హన్యాద్విషపరాభవమ్
శ్వేత పాలాశ కాఫేన రచితే రమ్య పాదుకే ।
ఆలస్తరంజితే లక్షం మన్తయేననునామునా
తదారూఢః పుమాన్షచ్ఛేత్ క్షణేన శతయోజనమ్ ।
పారదం చ శిలాం తాలం పిష్టం మధు సమన్వితమ్
మనునా మంత్రయేల్లక్షం లిపేత్తేనాఖిలాం తనుమ్ ।
అదృశ్య స్స్యానృణామేష ఆశ్చర్యం దృశ్యతామిదమ్
షట్కోణం విలిభేద్బీజం సాధ్యనామాన్వితం మనోః ।
హరితాలనిశాచూర్ణేరున్మత్తరససంయుతైః
శేషాక్షరైస్సమానీతం ధారాగేహవిరాజితమ్ ।
తద్యంత్రం స్థాపితప్రాణం పీతసూత్రేణ వేష్టయేత్
భ్రామ్యత్కులాలచక్రస్థాం గృహీత్వామృత్తికాం తథా ।
రచయేదృషభం రమ్యం యన్తం తన్మధ్యతః క్షిపేత్
హరితాలేన సంలిప్య వృషం ప్రత్యహమర్చయేత్ ।
స్తంభయేద్విద్విషాం వాచం గతిం కార్యపరంపరామ్
ఆదాయ వామహస్తేన ప్రేత భూస్థితకర్పరమ్ ।
అంగారేణ చితాగ్గేన తత్ర యంత్రం సమాలిఖేత్
మంత్రితం నిహితం భూమౌ రిపూణాం స్తంభయేద్గతిమ్ ।
ప్రేతవస్తే లిఖేద్యంత్రం అంగారేశైవ తత్పునః
మండూకవదనే న్యసేత్ పీతసూత్రేణ వేష్టితమ్ ।
పూజితం పీతపుష్పైస్తద్వాచం సంస్తంభయే ర్హిషామ్
యద్భూమౌ భవితా దివ్యం తత్ర యంత్రంచ సంలీఖేత్ ।
మార్జితం తద్ద్విషాం పాతైర్దివ్యస్తంభనకృద్భవేత్
ఇంద్రకారుణికామూలం సప్తశో మను మంత్రితమ్ ।
క్షిప్తం జలే దివ్యకృతం జలస్తంభన కారకమ్
కిం బహూక్త్యా సాధకేన మంత్రస్సమ్యగుపాసితః ।
శత్రూణాం గతిబుద్ధ్యాదేసంభవో నాత్ర సంశయః
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే యక్షిణీ మంత్ర సాధన నిరూపణం నామ షడశీతి తమోధ్యాయః.
ఇపుడు నరులకు సిద్ది నిచ్చు మహాలక్ష్మి యొక్క మరియొక అవతారమును చెప్పెదను. “ఓం గిరిజాయై భగవత్యై మాహేశ్వర్యై అన్నపూర్ణాయై స్వాహా" అనునది ఇరువది అక్షరములు గల మంత్రము. ద్రుహిణఋషి. ధృతి ఛందస్సు. అన్నపూర్ణ దేవత. షడ్దరాడ్యమగు హృల్లేఖ బీజముచే షడంగ కల్పన గావించవలయును. ముఖనాసాక్షివర్ణింసగుదములను నవాంగము లందు న్యాసమును చేయవలయును. తొమ్మిది పదములు. ఇపుడు ఆవర్ణముల సంఖ్యను చెప్పెదను. 1,11,1,2,4,4,4,2. ఇవి వర్ల సంఖ్యలు. తరువాత సురేశ్వరిని ధ్యానించవలయును. స్వర్ణకాంతులీను అంగములు కలది, త్రినయన, వస్త్రాలంకార శోభిత, భూరమా సంయుత, స్వర్ణామత్ర కరాంబుజ యగు దేవిని ధ్యానించి ఒక లక్ష జపమును గావించి, పదివేలు నేయి కలిపిన పొంగలిచే హోమమును గావించవలయును. జయాది నవశక్తి యుతమగు పీఠమును పూజను చేయవలయును. త్రికోణము, చతుష్పత్రము, అష్టపత్రము, షోడశ పత్రములు గల భూపుర యుతమగు యంత్రమున మాయచే మంత్రదానమును చేయవలయును. అగ్న్యాది కోణత్రితయమున శివరాహ మాధవులను వారి మంత్రములచే పూజించవలయును. ఆ మంత్రములను ఇపుడు చెప్పెదను, మను చంద్రాఢ్యమగు ప్రణవము, గగనము హృదయము, శివా, మారుతము ఇది శివమంత్రము ఏడక్షరములు కలది. వారాహ నారాయణ మంత్రములను మొదట ఉచ్చరించవలయును. షడంగములను పూజించి వామ దక్షిణములందు భూమిని లక్ష్మిని ఆయా మంత్రములచే అర్చించవలయును. ఇపుడా మంత్రములను చేప్పెదను. “అన్నం దేహి అన్నం మే దేహి అన్నాధిప! నయేమ మన్నం ప్రాణం నాపయ స్వాహా” అనునది ఇరువది రెండక్షరముల మంత్రము. భూపూజ యందు భూ సంపుటముచే జపించవలయును. లక్ష్మీ పూజయందు శ్రీపుటము స్మృతి లభాను చంద్రయుతము. భూ బీజము. శ్రీ బీజమును ముందే చెప్పితిని. మంత్రాదిలో నున్న నాలుగు బీజములు పూర్వములుగా పూజించవలయును. చతుష్పత్రములందు నాలుగు శక్తులుండును. పర, భువనేశ్వరి, కమల సుభగయని, అష్టపత్రములందు బ్రాహ్మి మొదలగు వారిని పూజించవలయును. షోడశ పత్రములందు మానదా, తుష్టి పుష్టి, ప్రీతి, రతి, స్త్రీ, శ్రీ, స్వధా, స్వాహా, జ్యోత్స్నా, హైమవతీ, ఛాయ, పూర్ణిమా, సంహతి, అమావాస్య అను వారిని మంత్రాది దేవతలను ప్రాణ ప్రతిష్టా పూర్వకముగా పూజించవలయును. భూపురము నందు లోకపాలురు, వారిముందు వారి అస్త్రములుండును. ఇట్లు జపాదులచే మంత్రము సిద్ధించినచో ధనరాశులచే కుబేర సదృశుడగును. జనులచే పూజించబడును.
ఇపుడు మరియొక లక్ష్మ్యవతారమును చెప్పెదను. ప్రణవము శాంతి అరుణ క్రియాఢ్యమగు చంద్ర భూషితములు బగలాముఖి సర్వాంతమున ప్రోదినీయుతమగు ఇందిర జరాయుతమగు పీతా ప్రతిష్ఠ దీరేందు తరువాత బీజము ఓంకారము స్వాహా "అనునది బలా మంత్రము నారదర్షి బృహతీ ఛన్దస్సు. 2,5,5,9,8 వర్ణములచే అంగములను కల్పించి, పీతాంబరను స్వర్ణాసనస్థను, హేమాభను, స్తంభినిని, ఇందు శేఖరను. ముద్గర పాశవజ రసనలను ధరించిన దేవిని ధ్యానించి లక్ష జపించవలయును. బాలా పీఠమున ఈ దేవిని పూజించవలయును. చందనాగరు చంద్రాదులచే పూజించుటకు యంత్రమును లిఖించవలయును. త్రికోణ, షడ్డల, అష్టదల, షోడపత్ర పీఠమున పూజించవలయును. మంగల, స్తంభినీ. జృంభిణి, మోహిని, వశ్యా, చలా, బలాకా, కల్మషా, ధాత్రీ, కలనా, కొలకర్షిణీ, భ్రామికా, మందగా, భోగస్తా, భావికా, షోడశీ అను వారిని భూగృహము యొక్క నాలుగు దిక్కులందు పూజించవలయును. గణేశుని, బటుకుని, యోగినులను, క్షేత్రపాలకుని పూజించవలయును. వారి వెలుపల స్వాయుధ సముపేతులగు ఇంద్రాదులను పూజించవలయును. ఇట్లు మంత్రము సిద్ధించిన తరువాత సాధకుడు దేవతాదులను స్తంభింప చేయవచ్చును. పీత వస్త్రమును ధరించి, పీతవర్ణాసనమున కూర్చుండి పీతమాల్యములను ధరించి, పీత చందనమును వ్రాసుకొని, పచ్చని పుష్పములచే పచ్చని మాలలచే దేవిని పూజించి పసుపు కొమ్ములచే చేసిన జపమాలచే జపించవలయును. పాలమధ్యన ఉంచిన పీతవర్ణదేవిని ధ్యానించుచు పదివేలు జపించవలయును. మూడు మధువులు నేయి కలిసిన నువ్వులచే హోమము చేసిన నరులు వశమగుదురు. త్రిమధుర మిశ్రితములకు లవణములచే హోమమును గావించిన ఆకర్షణ కలుగును. నూనె కలిపిన నింబపత్రములచే హోమము విద్వేషకారకము. తాలలోణహరిద్రలచే హోమము శత్రుస్తంభనము గావించును. రాత్రిపూట అంగారధూమము, రాజులు, మహిష గుగ్గులులను శ్మశానాగ్నిలో హోమమును గావించిన త్వరలో శత్రునాశము జరుగును. గరుడ గృధ్రకాహకటుతైలము, విభీతకము గృహధూమము చితాగ్నిలో హోమము గావించినచో శత్రూచ్చాటకము జరుగును. దూర్వా గుడూచీ లాజములను మధురత్రయ మిశ్రితములుగా చేసి హోమము గావించిన వానిని చూచిననూ అఖిల రోగ శాంతి కలుగును. పర్వతాగ్రమున, మహారణ్యమున, నదీసంగమమున, శివాలయమున బ్రహ్మచర్యారతుడగుచు అఖిలసిద్ధి కొజుకు లక్ష జపించవలయును. ఒకే వర్ణము గల గోవు యొక్క పాలను శర్కరా మధుమిశితముగా మూడు వందల మార్లు మంత్రించి పానము చేసినచో శత్రుపరాభవమును తొలగించును. తెల్లని మోదుగు చక్కతో సుందరమగు పాదుకలను సిద్ధముచేసి లత్తుకపూసి లక్ష జపముతో మంత్రించవలయును. ఆ పాదుకలనధిరోహించినచో ఒక క్షణములో నూరు యోజనములు వెళ్ళగలడు. పాదరసమును, శిలను, తాలపిష్టమును మధు మిశ్రితముగా. చేసి లక్ష జపముతో మంత్రించి శరీరమంతట వ్రాసుకొనవలయును. అట్లుచేసిన వాడు అదృశ్యమగును. ఈ ఆశ్చర్యమును చూడుము. సాధ్యనామ సమన్వితముగా షట్కోణ బీజమును వ్రాసి హరితాల నిశాచూర్ణములచే ఉమ్మెంత రసముచే కలిపి శేషాక్షరములచే తేబడి భూగృహమున స్థాపించబడి ప్రాణ ప్రతిష్ఠ గావించి పీత సూత్రముచే వేష్టించి వలయును. తిరుగుచున్న కుమ్మరి చక్రము మిద నున్న మట్టిని తీసుకొని సుందరమగు ఋషభమును చేసి యంత్రమధ్యమున నుంచి, ఆ ఋషభమును ప్రతిదినము పూజించవలయును పూజించే ముందు ఋషభమును హరితాలముచే లేపన గావించవలయును ఇట్లు చేసిన శత్రువుల వాక్కును, గతిని, కాశ్యపరం పరను స్తంభింప చేయును. వామహస్తముచే శ్మశాన భూమిలో నున్న కర్పరమున తీసుకొని, చితిలోనున్న అంగారముచే అచట యంత్రమును లిఖించి, మంత్రించి భూమిలో స్థాపించినచో శత్రు గతిని స్తంభింపచేయును. ప్రేతవస్త్రమున బొగ్గుతో యంత్రమును లిఖించి పీతసూత్రముచే పరివేష్టించి మండూక వదనమున నుంచి, పచ్చని పూవులచే పూజించినచో శత్రువాక్కును స్తంభింపచేయును. దివ్యత్వమున్న భూమియందు యంత్రమును లిఖించవలయును. పాత్రలచే మార్జన చేసినచో దివ్యత్వమును స్తంభింపచేయును. ఇంద్రవారుణి కామూలమును ఏడుమార్లు మంత్రించి జలమున పడవేసినచో జలస్తంభనమును గావించును. ఇంకనూ ఏమి చెప్పవలయును? సాధకుడు మంత్రమును చక్కగా ఉపాసించినచో శత్రువుల గతి బుద్ఘ్యాదులను స్తంభింప చేయవచ్చును. ఈ విషయమున సంశయముచే పనిలేదు
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయ పాదమున యక్షిణీ మంత్ర సాధన నిరూపణ మను ఎనుబది యార - అధ్యాయము సమాప్తము.
Summary of chapter 88 of the Nārada Mahā Purana is as follows:
పరమాత్మ యొక్క దివ్య ఆలాదిని శక్తులైన శ్రీ రాధికా దేవి మరియు శ్రీ సీతాదేవి మంత్రోపాసనా క్రమము ఈ అధ్యాయంలో వర్ణించబడినది. దేవీ మంత్ర జపము మరియు ప్రేమభక్తి మార్గములు ఇక్కడ భక్తిరసభరితంగా వివరింపబడినవి.