నారద మహా పురాణము
5 - అధ్యాయము
యమ ఉవాచ
ధృష్టతాం సమనుప్రాప్తః పనాదేవస్యమ్య చక్రిణః ।
అచ్ఛిద్రైర్గమానైశ్చ నరైస్త్రిభువనార్చిత!
అప్రమాణమహం మన్యే లోకం విష్ణోర్జగత్పతే! ।
యో నపూర్యతి లో కౌఘై స్సర్వసత్యసరోరుహైః
మాధవావసథేనైవ సమస్తేన పితామహ ।
స్వకర్మస్థా వికర్మస్థా శుచయోఽశుచయోఽపివా
ఉపోష్య వాసరం విష్ణో ర్లోకం యాంతి నృపాజ్ఞయా ।
సోఽస్మాకం హి మహాన్శత్రు ర్బవతాం చ విశేషతః
నిగ్రాహ్యో జగతాం నాధ భవేన్నాస్త్యత్ర సంశయః ।
తేన వర్షసహస్రేణ శాసితం క్షితిమండలమ్
అప్రమేయో జనో నీతో వైష్ణవం హరివల్లభమ్ ।
ఆరోపయిత్వా గరుడే కృత్వా రూపం చతుర్భుజమ్
పీతవస్త్రం సుసంవీతం స్రగ్విణం చారులేపనమ్ ।
యది స్థాస్యతి దేవేశ మాధవ్యాం మాధవప్రియః
సమస్తం నేష్యతే లోకం విష్ణోః పదమనామయమ్ ।
ఏష దండః పటో హ్యేష తవ పద్భ్యాం విసర్జితః
లోకపాలత్వమతులం మార్జితం తేన భూభుజా ।
రుక్మాంగదేన దేవేశ! ధన్యా సా స ధృతో యయా
సర్వదుఃఖవినాశాయ మాతృజాతో గుణాధికః ।
కిమపత్యేన జాతేన మాతుఃక్లేశకరేణ హి
యో న తాపయతే శత్రూన్ జ్యేష్ఠ మాసి యధా రవిః ।
వృధాశూలాపి జననీ జాతా దేవ కుపుత్రిణీ
యస్య నస్ఫురతే కీర్తి ర్ఘన స్యేవ శతహ్రదా ।
యః పితు ర్నోద్ధరేత్పక్షం విద్యయా వా బలేన వా
మాతుర్జఠరజో రోగ స్సప్రసూతో ధరాతలే ।
ధర్మే చార్ధే చ కామే చ ప్రతీపో యో భవేత్సతః
మాతృహా ప్రోచ్యతే సద్బి ర్వధా తస్యైవ జీవితమ్ ।
ఏకా హి వీరసూరేవ విరించే నాత్ర సంశయః
యయా రుక్మాంగదో జాతో మల్లి పేర్మార్జనాయవై ।
నేదం వ్యవస్థితం దేవ క్షితా కేనాపి భూభుజా
పురాణేఽపి జగన్నాథ న శ్రుతం పట్టమార్జనమ్
సోహం న జానామి కదాచిదీశ దృష్ట్వా క్షితీశం హరిసేవనే స్థితమ్ ।
ప్రవాదమానం పటహం సుఘోరం ప్రలోపమానం మమవేశ్మ మార్గమ్
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణే ఉత్తరభాగే యమవిలాపనం నామ పంచమోఽధ్యాయః.
యమధర్మరాజు పలికెను :- ఓ త్రిభువనార్చితా శ్రీహరిలోక మార్గము. ఎల్లపుడు నడుచు మానవులచే సందడిగా యున్నది. శ్రీ మహావిష్ణులోకమునకు ఇంత అని ప్రమాణము లేదనుకొనుచున్నాను. ప్రపంచములోని జనసమూహముతో నిండులేదు. స్వకర్మ నిరతులు, స్వకర్మభ్రష్టులు, పవిత్రులు, అపవిత్రులు కూడా రుక్మాంగదాజ్ఞచే ఏకాదశినాడుపవసించి విష్ణులోకమునకు వెళ్ళుచున్నారు. ఆరుక్మాంగదుడు నాకు గొప్ప శత్రువు. మీకు విశేషించి శత్రువు. అతనిని అరికట్టవలయును. ఈ విషయమున సంశయములేదు. అతను వేయిసంవత్సరములు భూమండలమును పరిపాలించుచున్నాడు. అసంఖ్యాకజనమును చతుర్భుజములతో గరుడ వాహనముతో పీతాంబరధారణతో, చిత్రమాల్యానులేపనములతో, శ్రీ విష్ణులోకమును చేర్చుచున్నాడు. రుక్మాంగదమహారాజు ఈ భూమిపై యున్నచో భూమండలవాసులందరిని విష్ణులోకమును చేర్చును. ఇదిగో ఈ శిక్షాదండము, కర్మల వివరముల పట్టికను నీ పాదముల వద్ద విడుచు చున్నాను. ఆరుక్మాంగదుని గర్భమున ధరించిన స్త్రీ ధన్యురాలు. గుణాధికుడు తల్లి సర్వదుఃఖములను నశింపచేసెను. తల్లికి కష్టమును కలిగించుటకు మాత్రమే పుట్టిన పుత్రుడు నిష్ప్రయోజకుడు. జ్యేష్ఠమాసములో సూర్యునివలె శత్రువులను తపింప చేయనివాని జన్మము వ్యర్థము. మేఘములో మెరుపువలె కీర్తి విస్తరించినచో, విద్యచేకాని, బలముచేకాని పితృపక్షమును ఉద్ధరించని వాడు తల్లికడుపులో విపరీతముగా సంచరించువాడు మాతృఘాతకుడగును. అతని జీవితము వ్యర్థము. ఈ ప్రపంచమున నా వ్రాతను తుడిచివేయుటకు పుట్టిన రుక్మాందుడుతప్ప ఏ రాజు కూడా నా పటమార్జనమును చేసినట్లు వినియుండలేదు. చూసి యుండలేదు. ఇంతవరకు ఎపుడూ ఈ లోకమున హరిసేవలో నుండుచు ఘోరమగు పటహమును మ్రోగించుచు నాలోకపుమార్గమును లోపింప చేయు రాజును నేను తెలియను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున యమవిలాపమను అయిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 132 of the Nārada Mahā Purana is as follows:
భాద్రపద మాసంలో వచ్చే పవిత్ర వామన ద్వాదశీ మరియు శ్రావణ ద్వాదశీ వ్రత విధులను వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయంలో ప్రబోధించినారు. వామనావతార ప్రభువును అర్చించి ఆచరించే ఉపవాసము వలన సర్వ పాపక్షయము సిద్ధించునని నిరూపించబడినది.