నారద మహా పురాణము
58 - శుకప్రలోభనమ్
నారద ఉవాచ :-
అనూచానప్రసంగేన వేదాంగాన్యభిలాని చ।
శ్రుతాని త్వన్ము ఖాంభోజాతో సమాపవ్యాసయోగతః॥
శుకోత్పత్తిం సమాచక్ష్వ విస్త రేణ మహామతే।
నారద మహర్షి పలికెను :-
ఓ మహామతీ ! అనూచాన ప్రసంగముతో సంపూర్ణముగా అన్ని వేదాంగములకు సంక్షిప్తముగా విస్తారముగా మీనుండి వింటిని. ఇపుడు విస్తరముగా శుకోత్పత్తిని తెలియజేయుము.
సనందన ఉవాచ :-
మేరుశృంగే కిల పురా కార్లికారవనాయతే॥
విజహార మహాదేవో భౌమైర్భూతగభైరృతః।
శైలరాజసుతా చైవ దేవీ తత్రాభవత్పురో॥
తత్ర దివ్యం తపస్తే పే కృష్ణద్వైపాయనః ప్రభుః।
యోగేనాత్మానమావిశ్య యోగధర్మపరాయణః॥
ధారయన్స తప ఘె పే పుత్రార్థం మునిసత్తమః।
అగ్నేర్భూమేస్తథా వాయోరంతరిక్షస్య చొభితః॥
వీర్యేణ సంమతః పుత్రో మమ భూయాదితి ప్మ హా।
సంకల్పేనాధ సో నేన దుషాపనకృతాత్మిభిః॥
వరయామాస దేవేశస్థితస్తప ఉత్తమమ్।
అతిస్థన్మారుతాహారశ్శతం కిల సమాః ప్రభుః॥
ఆరాధయన్మహాదేవం బహురూపముమాపతిమ్।
తత్ర బ్రహ్మర్షయశ్చిన సర్వేదేవర్షయస్తథా॥
లోకపాలాశ్చ సాధ్యాశ్చ వసుభిశ్చాష్టభిస్సహా।
ఆదిత్యా శ్చైవ రుద్రాశ్చ దివాకరనిశాకరా॥
నిశ్వావసుశ్చ గంధర్వ సిద్ధాశ్చాప్సరసాం గణాః।
తత్ర రుద్రో మహాదేవః కర్ణికారమం శుభమ్॥
ధారయానసజం భాతి శరదీవ నిశాకరః।
తస్మిన్టివ్యే వనే రమ్యే దేవదేవర్షిసంకులే॥
ఆస్థితః పరమం యోగం వ్యాసః పుత్రార్థముద్యతః।
న చాస్య హీయతే వర్ణో న గ్లానిరుపజాయతే॥
త్రయాణామపి లోకానాం తదద్భుతమనాభవత్।
జటాశ్చ తేజసా తస్య వైశ్వానర శిఖోపమా॥॥
ప్రజ్వలంత్యస్మ దృశ్యంతే యుక్తస్యామితతేజసః।
ఏవంవిధేన తపసా తస్య భక్త్యా చ నారద॥
మహేశ్వరః ప్రసన్నాత్మా చకార మనసా మతిమ్
ఉవాచ చైనం భగవాంస్ర్యంబకః ప్రహసన్నివ
॥ యథాహ్యగ్నిర్యథా వాయుర్యథాభూమిర్యథా జలమ్।
యథా ఖం చ తథా శుద్ధో భవిష్యతి సుతస్తవ॥
తద్భావభాగే తద్బుద్ధిస్తదాత్మా తదుపాశ్రయః।
తేజసా తస్య లోకాంస్త్రీన్యశః ప్రాప్స్యత కేవలమ్॥
సనందన మహర్షి పలికెను :- పూర్వము మేరు పర్వత శిఖరమున కర్ణికొరవనమున మహాదేవుడగు శంకరుడు భౌమములచే భూతగణములచే కూడినవాడై విహరించెను. అచట హిమవత్పుతియగు పార్వతి కూడ యుండెను. ఆప్రాంతముననే యోగధర్మ పరాయణుడగు వేదవ్యాసమహాముని యోగముచే ఆత్మ లో ప్రవేశించి దివ్యమైన తపస్సునాచరించెను. పుత్రునికొరకు ధారణచే తపస్సునాచరించెను. అగ్నితో భూమితో వాయువుతో ఆకాశముతో సమానతేజో శాలియగు పుత్రుడు కావలయునను సంకల్పముచే ఇంద్రియనిగ్రహములేనివారు పొందలేని అభిలాషను సంకల్పించుకొని, ఉత్తమమగు తపస్సులో నుండి శంకరుని ప్రార్థించేను. నూరుసంవత్సరములు - వాయువును ఆహారముగా తీసుకొనుచు తపస్సునాచరించెను. బహురూపుడు ఉమాపతియగు శంకరుని ఆరాధించుచుండెను. అచట బ్రహ్మర్షులు, అందరు దేవర్షులు లోకపొలులు, సాధ్యులు, అష్టవసువులు, ఆదిత్యులు, రుద్రులు, సూర్యచంద్రులు, విశ్వావసువు, గంధర్వులు, సిద్దులు, అప్సరోగణములు ఉండిరి. అచటనే మహాదేవుడగు రుద్రుడు సమస్త దేవర్షులచే సంకులము, సుందరము అయిన కర్ణికారవనమున, కర్ణికారమాలను ధరించి శరదృతువున చంద్రునివలె ప్రకాశించుచుండెను. అదే వనమున వ్యాసమహర్షి పుత్రుని కోరి పరమయోగమును ఆచరించుచుండెను. అట్లుతపమునాచరించుచున్న వ్యాసుని, దేహవర్ణము తరగలేదు. శ్రమకలుగలేదు. అట్లు వ్యాసమహర్షి ఉండగలుగుట మూడులోకములకు నాశ్చర్యమును కలిగించేను. మిక్కిలి తేజోవంతుడగు వ్యాసమహర్షి జటలు అగ్నిశిఖల వలె ప్రకాశించుచు కనపడుచుండెను. ఇట్టి ఉత్తమతపస్సుచే భక్తిచే మహేశ్వరుడు ప్రసన్నుడై మనసులో వ్యాస మహర్షిని అనుగ్రహిచవలయునని సంకల్పించి అతని ముందున కేగి చిరునవ్వులను చిందించుచు ఇట్లు పలికెను. అగ్నివాయువు భూమి జలము, ఆకాశముల వలె పరిశుద్దుడగు పుత్రుడు నీకు కలుగును. అతని భావమును అనుభవించుచు, అతనియందే మనసు కలవాడవై, తాదాత్మ్యముచే అతని ఆశ్రయము వలన, ఆపుత్రుని తేజస్సుచే మూడులోకములలో గొప్పకీర్తిని పొందగలవు.
ఏవం లబ్ధ్వా వరం దేవో వ్యాసస్సత్యవతీసుతః।
ఆరణిం త్వథ సంగృహ్య మమంధాగ్నిచికీర్షయా॥
అథ రూపం పరం విప్ర బిభ్రతీం స్వేన తేజసా।
ఘృతాచీం సౌమాప్సరసం దదర్శ భగవానృషిః॥
ప తామప్సరపం దృష్ట్వా పూసా కామమోహితః।
ఉభవద్భగవాన్వ్యాసో వనే తస్మిన్ము నీశ్వర॥
సా తు కృత్వా తదా వ్యాపం కామపంవిగ్నమానసమ్।
శుకీభూయ మహారమ్యా ఘృతాచీ సముపాగమత్॥
ప తామప్సరపం దృష్ట్వా రూపేణాన్యేనసంవృతామ్।
స్మరరాజేనానుగతస్సర్వగాత్రాతి గేన హ॥
స తు ధైర్యేణ మహతా నిగృహ్ణన్ పృచ్చయం మునిః
న శశాక నియంతుం తం వ్యాసః ప్రవిప్పతం మనః॥
భావిత్వాచ్చెవ భావ్యస్య ఘృతాచ్యా వపుషా హృతమ్।
యత్నాన్నియచ్ఛత సాఒపి మునే ఏతచికీర్షయా॥
అరణ్యామేవ పూసా తస్య శుక్రమవాపతత్।
శుక్రే నిర్మధ్యమానేస్యాం శుకో జజ్ఞే మహాతపాః॥
పరముర్షిర్మహాయోగే ఆరణీగర్భసంభవః।
యదైవహి పమిదోగ్నీర్భాతి హావ్యముపాత్తవాన్॥
తథా రూపశ్శుకో జజ్ఞి ప్రజ్వలన్నివ తేజసా।
బిభ్రచ్చిత్రం చ విపేంద్ర రూపవర్ణిమనుత్తమం॥
తం గంగా సరితాం శ్రేష్ఠా మేరుపృష్ఠే స్వరూపిణీ।
అభ్యేత్య స్నాపయామాపు వారణా స్వేన నారద॥
కృష్ణాజినం చాంతరిక్టోచ్చుకార్డే భువ్యవాపతత్।
జేగీయంత చ గంధర్వా ననృతుశ్చాప్పరగణాః॥
దేవదుందుభయ శ్చైవ ప్రావాద్యంత మహాస్వనః।
విశ్వావసుశ్చ గంధర్వస్తథా తుంబురునారదౌ॥
హాహాహూహూశ్చ గంధర్వౌ తుష్టువుశ్శుకసంభవమ్।
తత్ర శక్రపురోగాశ్చ లోకపాలాస్సమాగతాః॥
దేవా దేవర్షయశ్చైవ తథా బ్రహ్మర్షయోపి చ।
దివ్యాని సర్వపుష్పాణి ప్రవవర్ష చ మారుతః॥
జంగమం స్థావరం చైవ ప్రహృష్టమభవజ్జగత్।
తం మహాత్మా స్వయం ప్రీత్యా దేవ్యా పహ మహాద్యుతిః॥
జాతమాత్రం మునేః పుత్రం విధినోపానయత్తదా।
తస్య దేవేశ్వరశ్నక్రో దివ్యమద్బుతదర్శనమ్॥
దదౌ కమండులుం ప్రీత్యా దేవా వాసాంసి చాభితః।
హంసాశ్చ శతపత్రాశ్చ సారసాశ్చ సహస్రశః॥
ప్రదక్షిణమవర్తంత శుకాశ్చాషాశ్చ నారద।
ఆరణీయస్తదా దివ్యం ప్రాప్య జన్మ మహామునిః॥
తతైవోవాస మేధావీ వ్రతచారీ సమాహితః।
ఉత్పన్నమాత్రం తం వేదాః సరహస్యాపసంగ్రహాః॥
ఉపతస్థుర్మునిశ్రేష్ఠం యథాప్య పితరం తథా।
బృహస్పతిం స వత్రే చ వేదవేదాంగ భాష్యవిత్॥
ఉపాధ్యాయం ద్విజశ్రేష్ఠ ! ధర్మ మేవానుచిన్తయన్।
సోధీత్య వేదానఖిలాన్సరహస్యాన్స సంగ్రహాన్॥
ఇతిహాసం చ కార్డ్యే న వేద శాస్త్రాణి చొభితః।
గురవే దక్షిణాం దత్త్వా సమావృత్తో మహామునిః॥
ఉగ్రం తపస్సమారేభే బ్రహ్మచారీ సమాహితః।
దేవతానామ్సషీణాం చ చేల్యేపి సుమహాతపాః॥
సమంత్రణీయో జన్యశ్చ జ్ఞానేన తపసా తథా।
న త్వస్య రమతే బుద్ధిరాశ్రమేషు మునీశ్వర॥
త్రిషు గార్హస్థ్యమూలేషు మోక్షధర్మానుదర్శినః।
స మోక్షమనుచింత్యైవ శుకః పితరమభ్యగాత్॥
మహానుభావుడు సత్యవతీ సుతుడగు వ్యాసమహర్షి ఇట్లు శంకరుని వలన తపస్సుచే వరమును పొంది, అగ్నిని చేయ సంకల్పించి అరణిని మధించసాగెను. అంతలో తన తేజస్సుచే ఉజ్జ్వలమగు రూపమును ధరించియున్న ఘృతాచియను అప్పరసను వేదవ్యాసమహర్షి అచట చూచెను. అట్లు వ్యాసమహర్షి ఘృతాచిని చూచి వెంటనే కామమోహితుడాయెను. ఇట్లు వ్యాస మహర్షిని కొత్త సంవిగ్నమనస్కుని చేసి లోకోత్తర సౌందర్యవతియగు ఘృతాచి చిలుకరూపముతో వ్యాసమహర్షిని సమీపించేను. లోకోత్తర సౌందర్యవతి యగు ఘృతాచిని చూచిన వ్యాస మహర్షి శరీరమంతట మన్మథభావము నిండగా, మనోవ్యాకులతను గొప్ప ధైర్యముచే నిగ్రహించుకొనుచు, జారిన మనసును నిగ్రహించలేక, జరుగవలసినది జరుగవలయును కావున ఘృతాచీ సౌందర్యముచే హరించబడిన మనస్సును యత్నముచే నిగ్రహించుకొనిననూ దీనిని చేయసంకల్పించుటచే ఆయరణిలోనే వ్యాసమహర్షి వీర్యము స్రవించెను. ఆవీర్యమును మథించగా ఆయరణి యందే మహాతపస్వియగు శుకుడు జన్మించెను. ఈ శుకుడు పరమర్షి మహాయోగి అరణీ గర్భమున జన్మించెను. చక్కగా ప్రజ్వలించు అగ్ని హవ్యమును స్వీకరించి తేజస్సుచే ప్రకాశించునట్లు తన తేజస్సుచే జ్వలింపచేయుచున్నట్లు శుకమహర్షి ప్రకాశించుచుండెను. సాటిలేని రూపమును, వర్ణమును ఆశ్చర్యకరముగా ధరించుచు వెలుగొందుచుండెను. అట్టి శుకుని నదులలో కెల్ల ఉత్తమనదియగు గంగానది మేరు శిఖరమున రూపు దాల్చి స్వయముగా వచ్చి తన జలముచే స్నానము చేయించేను. అంతరిక్షము నుండి శుకుని కొరకు కృష్ణాజినము భూమిమీద పడెను. గంధర్వులు గొనమును చేసిరి. అప్పరసలు నాట్యము చేసిరి. దేవదుందుభులు గొప్పదని కలవై మోగినవి. గంధర్వుడగు విశ్వావసువు, తుంబురు నారదులు, హాహాహూహూ " గంధర్వులు శుకజన్మను స్తోత్రము చేసిరి. అచటికి ఇంద్రుడు మొదలగు లోకపొలకులు వచ్చిరి. దేవతలు దేవర్పులు బ్రహ్మరులు కూడా వచ్చిరి. వాయువు దీవ్యములైన సర్వవిధపుష్పములను వర్షించెను. స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు సంతోషించేను. మహాత్ముడగు శంకరుడు మిక్కిలి ప్రీతిచే పార్వతీదేవితో కలిసి గొప్పతేజస్సు కలవాడై వ్యాసమహర్షి పుత్రునికి పుట్టిన వెంటనే ఉపనయనము గావించెను. దేవాధిపతియగు ఇంద్రుడు దివ్యము ఆశ్చర్యమును గొలుపు కమండలమును శుకునికిచ్చిరి. దేవతలు వస్త్రములనిచ్చిరి. హంసలు, చక్రవాకములు, సారసములు, చిలుకలు ఇతర పక్షులు శుకునికి ప్రదక్షిణమును గావించిరి. ఇట్లు అరణీ సంభవుడగు శుక మహర్షి దీవ్యమగు జన్మను పొంది, ఉపనయనము గావించుకొని బ్రహ్మ చర్యవ్రతము నవలంబించి అచటనే ఉండెను. శుకమహర్షి పుట్టిన వెంటనే సాంగములు సరహస్యములగు వేదములు తండ్రియగు వేదవ్యాసుని పొందినట్లు శుకమహర్షిని వచ్చి చేరినవి. అపుడు శుకమహర్షి ధర్మమును పరిశీలించి వేద వేదొంగ భాష్య జ్ఞానము కలవాడైనను బృహస్పతిని గురువుగా వరించెను. అట్లు బృహస్పతి దగ్గర సాంగములు సరహస్యములగు వేదములనభ్యసించి, సమగ్రేతిహాసమును, సర్వశాస్త్రములను అధ్యయనము చేసి గురువుగారికి దక్షిణను సమర్పించి ఆశ్రమమునకు తిరిగివచ్చి, సావధానమనస్కుడై ఉగ్రమైన తపస్సుచేయనారంభించెను. అట్లు తపస్సు చేయుచున్న శుకమహర్షి బాల్యములో నున్ననూ దేవతలకు, ఋషులకు సంప్రదిచదగిన వాడాయెను. జ్ఞానముచే, తపస్సుచే వారికంటే అధికుడాయెను. అయినను శుకమహర్షి బుద్ధి ఆశ్రమమున ఆనందించలేకపోయెను. గృహస్థాశ్రమము మొదలుకొనియున్న మూడు ఆశ్రమములో మోక్షధర్మమును గూర్చి ఆలోచించుచున్న శుకమహర్షి మోక్షమును ధ్యానించుచు తండ్రిని సమీపించేను.
ప్రొహాభివాద్య చ తదా శ్రేయోర్ధీ వినయాన్వితః।
మోక్షధర్మేషు కుశలో భగవాన్ ప్రబ్రవీతు మే॥
యథైన నునసశ్సాంతిః పరమా పంభవేన్మునే।
శ్రుత్వా పుత్రప్య వచనం పరమర్షిరువాచ తమ్॥
అధీష్య మోక్షశాస్త్రం వై ధర్మాంశ్చ వివిధానపి
పితుర్నిర్దేశాజ్జగ్రాహ శుకో బ్రహ్మవిదాం వరః॥
యోగశాస్త్రం చ నిఖిలం కాపిలం చైవ నారద।
ప తం బ్రాహ్మ్యాశ్రియా యుక్తం బ్రహ్మతుల్యపరాక్రమమ్॥
మేనే పుత్రం యథావ్యాసో మోక్షశాస్త్ర విశారదమ్।
ఉవాచ గచ్చేతి తదా జనకం మిథిలేశ్వరమ్॥
స తే వక్ష్యతి మోక్షార్థం నిఖిలేన నరాధిపః
పీతుర్నియోగాదగమజ్జనకం మైధిలం నృపమ్॥
ప్రష్టుం ధర్మప్య నిష్ణాం వై మోక్షస్య చ పరాయణమ్।
ఉక్తశ్చ మాను షేణ త్వం తథా గచ్ఛేత్యవి స్మితః॥
న ప్రభావణ గంతవ్యమంతరిక్షచరేణ వై।
ఆర్జవేనైవ గంతవ్యం న సుఖాయ క్షణాత్వయా॥
న ద్రష్టవ్యా విశేషా। హి విశేషా హి ప్రసంగినః।
అహంకారో న కర్తవ్యో యాజ్యే తస్మిన్నరాధి పే॥
స్థాతవ్యం వసధే తస్య స తే ఛత్స్యతి సంశయమ్।
స ధర్మకుశలో బాజా మోక్షశాస్త్ర విశారదః॥
యథా యథా చ తే బ్రూయాత్ తత్కార్యమవిశంకయా।
ఏవముక్తస్స ధర్మాత్మా జగామ మిథిలాం మునిః॥
పద్భ్యాం శక్తోంతరిక్షేణ క్రౌంతుం భూమిం ససాగరామ్।
స గిరీంశ్చాష్యతిక్రమ్య భారతం వర్షమాసదత్॥
స దేశాన్వివిథాన్ఫీతేనతిక్రమ్యం మహామునిః।
విదేహాన్వె సమాసాద్య జనకేన సమాగమత్॥
రాజద్వారం సమాసాద్య ద్వారపాలైర్నివారితః।
తస్థా తత్ర మహాయోగీ జ్జుత్పిపాసాదివర్జితః॥
ఆత పే గ్లానిరహితో ధ్యానయుక్తశ్చ నారద ।
తేషాం తు ద్వారపాలానామేకస్తత్ర వ్యవస్థితః॥
మధ్యంగతమిపాదిత్యం దృష్ట్వా శుకమవస్థితమ్।
పూజయిత్వా యథా న్యాయం అభివాద్య కృతాంజలిః॥
ప్రావేశయత్తతః కక్షాం ద్వితీయాం రాజు వేశ్మనః।
తత్రాంతఃపురసంబద్ధం మహచ్చేత్రరధోపమమ్॥
సువిభక్త జలక్రీడం రమ్యం పుష్పితపాదపమ్।
దర్శయిత్వాపనే స్థాప్య రోజానం చ వ్యజిజ్జపత్॥
శ్రుత్వా రాజా శుకం ప్రాప్తం వారస్త్రీప న్యయుజ చ।
సేవాయే తస్య భావస్య జ్ఞానాయ మునిసత్తమ॥
తం చారు కేశ్యప్సుశ్రేణ్యస్తరుణ్యః ప్రియదర్శనాః।
సూక్ష్మరక్షాంబరధరాస్తప్త కాంచనభూషణాః॥
సంలాపాలాపకుశలా భావజ్జాస్సర్వకోవిదాః।
పరం పంచాశతస్తస్య పాద్యాదీని వ్యకల్పయన్॥
దేశకాలోపపన్నేన సాధ్వన్నేనాప్యతర్పయన్।
తస్య భుక్తవతస్తాత తాస్తతః పురకాననమ్॥
సురమ్యం దర్శయామాసురేకైకత్వేన నారద
క్రీడంత్యశ్చ హాపంత్యశ్చ గౌయంత్యశ్చైవ తాశ్శుకమ్॥
ఉదారసత్వం సత్వజ్ఞాస్సర్వా పర్యచరంస్తదో।
ఆరణీయస్తు శుద్ధాత్మా జితక్రోధో జితేంద్రియః॥
ధ్యానస్థ ఏవ సతతం న హృష్యతి న కుప్యతి।
హదశౌచం తు కృత్వా వై శుకస్సంధ్యాముపాస్య చ॥
నిషసాదాసనే పుణ్యే తమేవార్థం వ్యచిన్తయత్।
పూర్వరాత్రే తు తత్రాసౌ భూత్వా ధ్యానపరాయణః॥
మధ్యరాత్రే యథాన్యాయ్యం నిద్రామాహారయతభుః।
తతః ప్రాతస్సముత్థాయ కృత్వా శౌచమనన్తరమ్॥
స్త్రీభిః పరివృత ధీమాంధ్యానమేవాన్వపద్యత।
అనేకవిధినా తత్ర తదహశ్శేషమప్యుత॥
తాం చ రాత్రిం నృపకులే వర్తయామాస నారద॥
ఇతి శ్రీబృహన్నారదీయ మహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే ద్వితీయ భాగే శుకప్రలోభనం నామ అష్టపంచాశత్తమోధ్యాయః॥
తండ్రికి నమస్కరించి, శ్రేయస్సును కోరి వినయముతో, మోక్షధర్మములలో కుశలులైన మీరు నా మనస్సునకు శాంతి ఎట్లు కలుగునో చెప్పుడు అని పలికెను. పుత్రుడగు శుకమహర్షి మాటలను వినిన వ్యాసమహర్షి అతనితో ఇట్లు పలికెను. మోక్షధర్మములను, ఇతరములైన వివిధ ధర్మములను అధ్యయనము చేయుము. అని అట్లు తండ్రి ఆజ్ఞతో తండ్రినుండి బ్రహాజ్ఞానులలో శ్రేషుడగు శుకమహర్షి మోక్షధర్మములను ఇతర ధర్మములను గ్రహించెను. అట్లే సమగ్రముగా యోగశాస్త్రమును, కాపిల శాస్త్రమును గ్రహించెను. ఇట్లు బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్న, బ్రహ్మతుల్యపరాక్రముడైన శుకమహర్షిని మోక్షశాస్త్ర విశారదునిగా వ్యాసమహర్షి తలచెను. అపుడు వ్యాసమహర్షి పుత్రుని గూర్చి మిధిలేశ్వరుడగు జనకుని వద్దకు వెళ్ళుము. జనక మహారాజు నీకు సమగ్రముగా మోక్షార్థమును బోధించగలడు. గర్వించక మానవునిగా నడిచి వెళ్ళుము. నీ ప్రభావముచే అంతరిక్ష గమనమున వెళ్ళకుము. ఆర్జవముతో వెళ్ళుము. క్షణకాల సుఖము కొరకు ఆశపడరాదు. విశేషములను నీవు చూడరాదు. విశేషములు తమంతతాముగా వచ్చి చేరును. పూజించదగిన జనక మహారాజు విషయమున అహంకారమును చూపరాదు. అతనీ భవనమున కొంతకాలమున్నచో అతను నీసంశయములను తొలగించగలడు. జనక మహారాజు ధర్మ కుశలుడు. మోక్ష శాస్త్రవిశారదుడు. అతను చెప్పి దానిని చెప్పినట్లుగా ఆచరించుము. ఇట్లు తండ్రి చెప్పగా తండ్రి అనుమతిని పొంది మిధిలాధిపతియైన జనకుని వద్దకు వెళ్ళేను. అంతరిక్ష మార్గమున సముద్రములతో చుట్టబడియున్న భూమిని దాటగల శక్తి యున్ననూ పాదములతో నడుచుచు పర్వతములను దాటి భారతవర్షమును చేరి, సమృద్ధములగు వివిధ దేశములనతిక్రమించి, విదేహ దేశమును చేరి జనకుని భవనమునకు చేరెను. రాజద్వారమును చేరగా ద్వారపాలకులు ఆపిరి. శుక్రమహర్షి రాజద్వారము ముందే ఆకలి దప్పులు లేనివాడై ఎండలో శ్రమనెరుగని వాడై ధ్యానయుక్తుడై నిలిచియుండెను. అచట నున్న ద్వారపాలకులలో ఒకడు, సూర్యుడు ఆకాశ మధ్యమున ప్రకాశించునట్లు దివ్యతేజోయుక్తుడగు శుకుడు నిలిచియుండుట చూచి, న్యాయబద్ధముగా పూజించి, నమస్కరించి చేతులు జోడించి అంజలి బదుడై రాజభవనమున ప్రవేశింప జే సెను. అచట రాజభవనములో రెండవ కక్ష్యలో అంతపుర భవనము చైత్రరధముతో సాటివచ్చునది, జలశాలలు, క్రీడాశాలలతో చక్కగా విభజింపబడి, సుందరము, పూలచెట్లు కలదియగు భవనమును చూపి, ఆసనమున కూర్చుండబెట్టి జనకమహారాజునకు నివేదించెను. జనకమహారాజు శుకుడు వచ్చుట తెలిసి, శుకుని అభిప్రాయమును తెలియగోరి శుకమహర్షి పరిచర్య కొలకు వారకాంతలను నియమించెను. సుందరమగు కేశపాశములు గలవారు, అందమైన శోణీభరము కలవారు, ప్రియదర్శనులగు వారకాంతలు సూక్ష్మములగు రక్త వస్త్రములను ధరించి మేలిమి బంగారు నగలను ధరించి, సంతాప ఆలాపములందు కుశలులు కావున, ఎదుటివారి భావమును గ్రహించు వారు, అన్నిటిలో నిపుణులగు యాబది మంది వారకాంతలు శుకమహర్షిని సమీపించి అర్ఘ్యపాద్యాదికములను సమర్పించిరి. దేశకాలోచితమగు చక్కని భోజనముచే తృప్తి కలిగించిరి. భోజనము చేసిన తరువాత శుకమహర్షిని సుందరమైన పురోద్యానమునకు కొనిపోయి ఒక్కొక్క దానిని చూపిరి. ఆడుచు, పొడుచు, నవ్వుచు స్వభావమును తెలిసిన వారకాంతలు ఉదారసత్వుడగు శుకుని సేవించసాగిరి. జితక్రోధుడు జితేంద్రియుడగు ఆరణీ గర్భసంభూతుడు పరిశుద్ధమగు మనస్సుతో ఎప్పుడూ ధ్యానములోనే ఉండి సంతోషించక, కోపించక యుండెను. పాదప్రక్షాలనమును గావించుకొని శుకమహర్షి సంధ్యావందనమాచరించెను. మోక్షార్ధమును ధ్యానించుచు పవిత్రమైన ఆసనమును కూర్చొనెను. పూర్వరాత్రిలో ధ్యానపరాయణుడై, మధ్యరాత్రమున నిద్రను రప్పించుకొనెను. ప్రొద్దుననేలేచి శౌచమును ముగించుకొని స్త్రీలతో కలిసి యుండియు ధ్యానమునే పొందెను. ఈ విధానముతో ఆచటనే ఆ పగలు రాత్రి గడి పెను.
ఇది శ్రీబృహన్నారదీయ మహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున ద్వితీయభాగమున శుకప్రలోభమను యాబయెనిమిదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 59 of the Nārada Mahā Purana is as follows:
ఆకాశంలో గ్రహముల మధ్య జరిగే గ్రహయుద్ధ విశేషములు మరియు లోకంలో సంభవించే దివ్య అంతరిక్ష భూమి ఉత్పాతముల లక్షణములు ఈ అధ్యాయంలో వివరింపబడినవి. అట్టి ఉత్పాత నివారణకై ఒనర్చవలసిన శాంతి ప్రక్రియలు ఇక్కడ ప్రతిపాదించబడినవి.