78 -  అధ్యాయము

సనత్కుమార ఉవాచ :

కార్తవీర్యస్య కవచం కథితం తే మునీశ్వర !

మోహవిధ్వంసనం జైత్రం మారుతేః కవచం శృణు.

యస్య సంధారణాత్సద్యస్సర్వే నశ్యంత్యుపద్రవాః,

భూతప్రేతారిజం దుఃఖం నాశమేతి న సంశయః.

ఏకదాహం గతో ద్రష్టుం రామో రమయతాం వరమ్,

ఆనన్దవనికాసంస్థం ధ్యాయన్తం స్వాత్మనః పదమ్.

తత్ర రామం రమానాథం పూజితం త్రిదశేశ్వరైః,

నమస్కృత్య తదాదిష్టమాసనం స్థితపాన్పురః.

తత్ర సర్వం మయా వృత్తం రావణస్య వధాదికమ్,

పృష్టం ప్రోవాచ రాజేన్ద్ర శ్రీరామస్స్వయమాదరాత్.

తతః కథాంతే భగవాన్ మారుతేః కవచం దదౌ,

మహ్యం తత్తే ప్రవక్ష్యామి న ప్రకాశ్యం హి కుత్రచిత్.

భవిష్యదేతన్నిరిష్టం బాలభావేన నారద !

శ్రీరామేణాంజనాసూనోర్భుక్తిముక్తి ప్రదాయకమ్.

హనుమాన్పూర్వతః పాతు దక్షిణే పవనాత్మజః

పాతు ప్రతీచ్యామక్షఘ్నః సౌమ్యే సాగరతారకః.

 ఊర్ధ్వం పాతు కపిశ్రేష్ఠః కేసరిప్రియనందనః,

అథస్తాద్విష్ణుభక్తస్తు పాతు మధ్యే చ పావని:.

 లంకావిదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరమ్,

సుగ్రీవపచివః పాతు మస్తకం వాయునందనః.

 ఫాలం పాతు మహావీరో భ్రువోర్మధ్యే నిరంతరమ్,

నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవ గేశ్వరః.

కపోలౌ కర్ణమూలే చ పాతు శ్రీరామకింకరః,

నాసాగ్రమంజనాసూనుః పాతు వక్త్రం హరీశ్వరః.

పాతు కంఠేతు దైత్యారిః స్కంధౌ పాతు సురారిజిత్,

భుజౌ పాతు మహాతేజాః కరౌ చ చరణాయుధః.

నఖాన్నఖాయుధః పాతు కుక్షౌ పాతు కపీశ్వరః,

వక్షోజ ముదరాపహారీ చ పాతు పార్శ్వే భుజాయుధః.

లంకానిభంజనః పాతు పృష్ఠదేశే నిరంతరమ్,

నాభిం శ్రీరామభక్తపు కటిం పాతనిలాత్మజః.

గుహ్యం పాతు మహాప్రాజ్ఞస్సక్థీనీ అతిథిప్రియః,

ఊరూ చ జానునీ పాతు లంకాప్రాసాదభంజనః.

జంఘే పాతు కపిశ్రేష్ఠో గుల్పౌ పాతు మహాబలః,

అచలోద్దారకః పాతు పాదౌ భాస్కరసన్నిభః.

అంగాని పాతు సత్త్వాధ్యః పాతు పాదాంగులీస్సదా,

ముఖాంగాని మహాశూరః పాతు రోమాణి చాత్మవాన్.

దివారాత్రౌ త్రిలోకేషు సదాగతిసుతోఽవతు,

స్థితం ప్రజంతమాసీనం పిబన్తం జక్షతం కపిః.

లోకోత్తరగుణశ్రీమాన్ పాతు త్ర్యమ్బకసంభవః,

ప్రమత్తమప్రమత్తం వా శయానం గహనేంఽబుని.

స్థలేఽన్త్రరిక్షే హ్యాగ్నౌ వా పర్వతే సాగరే ద్రుమే,

సంగ్రామే సంకటే ఘోరే విరాడ్రూపధరోఽవతు.

డాకినీ శాకినీ మారీ కాల రాత్రిమరీచి,

శయానం మాం విభుః పాతు పిశాచోరగరాక్షసీః.

దివ్యదేహధరో ధీమాన్ సర్వసత్త్వభయంకరః,

సాధకేంద్రావనశ్శశ్వత్ పాతు పర్వత ఏవ మామ్.

యద్రూపం భీషణం దృష్ట్యా పలాయంతే భయానకాని,

స సర్వరూపస్సర్వజ్ఞస్సృష్టిస్థితికరోఽవతు.

స్వయం బ్రహ్మా స్వయం విష్ణుస్సాక్షాద్దేవో మహేశ్వరః,

సూర్యమండలగశ్రీదః పాతు కాలత్రయేఽపి మామ్.

యస్య శబ్దముపాకర్ణ్య దైత్యదానవరాక్షసా,

దేవా మనుష్యాస్తిర్యఞ్చసావరా జంగమాస్తథా.

సభయా భయనిర్ముక్తా భవన్తి స్వకృతానుగాః,

యస్యానేకకథాః పుణ్యాశ్రూయంతే ప్రతికల్ప కే.

సోఽవతాత్సాధకశ్రేష్ఠం సదా రామపరాయణః,

వైధాత్రధాతృప్రభృతి యత్కించిద్దృశ్యతేఽత్యలమ్.

విద్ధి వ్యాప్తం యథా కేశరూ పేణానంజనేన తత్,

యో విభుస్సోఽహమేషోఽహం స్వీయస్స్వయమణుర్బృహత్.

ఋగ్యజుస్సామరూపశ్చ ప్రణవ స్త్రీవృదధ్వరః,

తస్మై స్వస్మై చ పర్వ స్మై నతోఽస్యాత్మ సమాధినా.

అనేకానన్త బ్రహ్మాణ్డధృతే బ్రహ్మస్వరూపిణీ,

సమీరణాత్మనే తస్మై నతోఽస్మాత్మస్వరూపిణీ,

నమో హనుమతే తస్మై నమో మారుతపూనవే,

నమశ్రీరామభక్తాయ శ్యామాయ మహతే నను.

నమో వానరవీరాయ సుగ్రీవసఖ్యకారిణే,

లంకావిదహనాయాథ మహాసాగరతారిణే .

సీతాశోకవినాశాయ రామముద్రాధరాయ చ,

రావణాంతనిదానాయ నమః సర్వోత్తరాత్మ నే.

మేఘనాథమఖధ్వంసకారణాయ నమో నమః,

అశోకవనవిధ్వంసకారిణీ జయదాయినే.

వాయుపుత్రాయ వీరాయ ఆకాశోదారగామినే,

వనపాలశిరశ్చేత్రే లంకాప్రాసాదభంజినే.

జ్వలత్కాంచనవర్ణాయ దీర్ఘలాంగూలధారిణే,

సౌమిత్రిజయదాత్రే చ రామదూతాయ తే నమః.

ఆక్షస్య వధకర్త్రే చ బ్రహ్మ శస్త్రనివారిణే,

లక్ష్మణాంగమహాశక్తి జాతక్షతవినాశనే.

రక్షోఘ్నాయ రిపుఘ్నాయ భూతఘ్నాయ నమో నమః,

ఋక్షవానరవీరౌఘప్రాసాదాయ నమో నమః.

 పర సైన్యబలఘ్నాయ శస్త్రాస్త్రఘ్నాయ తే నమః,

విషఘ్నాయ ద్విషఘ్నాయ భయఘ్నాయ నమో నమః.

 మహారీపుభయఘ్నాయ భక్తత్రాణైకకారిణే,

పర ప్రేరితమంత్రాణాం మంత్రాణాం స్తంభకారిణే.

పయః పాషాణతరణకారణాయ నమో నమః,

బాలార్కమండలగ్రాసకారిణే దుఃఖహారిణే.

నఖాయుధాయ భీమాయ దన్తాయుధధరాయ చ,

విహంగమాయ శైవాయ వజ్రదేహాయ తే నమః.

ప్రతిగ్రామస్థితాయాథ భూతప్రేతవధార్థినే,

కరస్థశైలశస్త్రాయ రామశస్త్రాయ తే నమః.

కౌపీనవాససే తుభ్యం రామభక్తిరతాయ చ,

దక్షిణాశాభాస్కరాయ సతాం చంద్రోదయాత్మనే.

కృత్యాక్షతవధఘ్నాయ సర్వక్లేశహరాయ చ,

స్వామ్యాజ్ఞాపార్థసంగ్రామసఖ్యసంజయకారిణే.

భక్తానాం దివ్యవాదేషు సంగ్రమే జయకారిణే,

కిల్కిలాబువకారాయ ఘోరశబ్దకరాయ చ.

సర్వాగ్నివ్యాధిపంస్తమ్భకారిణే భయహారిణే,

సదా వనఫలహారసంతృప్తాయ విశేషతః.

మహార్ణవశిలాబద్ధ సేతుబంధాయ తే నమః,

ఇత్యేత్కథితం విప్ర మారుతేః కవచం శివమ్.

యస్మై కస్మై న దాతవ్యం రక్షణీయం ప్రయత్నతః,

అష్టగంధైర్విలిఖ్యాదౌ కవచం ధారయేత్తు యః.

కంఠే వా దక్షిణే బాహో జయస్తస్య పదే పదే,

కింపునర్బహునోక్తేన సాధితం లక్షమాదరాత్.

ప్రజప్తమేతత్కవచం అసాధ్యం చాపి సాధయేత్.

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే బృహదుపాఖ్యానే తృతీయపాదే హనుమత్కవచనిరూపణం నామ అష్టసప్తతితమోఽధ్యాయః

సనత్కుమార మహర్షి పలికెను : ఓ మునీశ్వరా నీకు కార్తవీర్యకవచమును చెప్పితిని. ఇక ఇపుడు మోహవిధ్వంసకము జయప్రదమగు హనుమత్కవచమును వినుము. ఈ కవచమును ధరించిన వెంటనే అన్ని ఉపద్రవములు నశించును. భూత ప్రేత శత్రువుల వలన కలిగిన దుఃఖములు నశించును. నేను ఒకప్పుడు ఆనందింప చేయువారిలో ఉత్తముడు, ఆనందవననివాసి స్వాత్మపదమును ధ్యానించుచునన్న రాముని చూచుటకు వెళ్ళితిని. అచట రమాకాంతుడు దేవపూజితుడగు రామచంద్రుని నమస్కరించి అతను చూపిన ఆసనమున కూర్చుంటిని. అచట రావణవధ వృత్తాంతమును నేనడుగగా శ్రీరామచంద్రుడు ఆదరముతో చెప్పెను. ఆ వృత్తాంతము చివర శ్రీరాముడు నాకు మారుతి కవచమనిచ్చెను. ఆ కవచమును నేను నీకు చెప్పెదను. ఈ కవచమును అంతటా అందరికి తెరుపరాదు. ఇది ముందుజరుగబోవునది చెప్పబడెను. భుక్తి ముక్తి ప్రదమగు ఈ ఆంజనేయకవచమును శ్రీరాముడు చేప్పెను. తూర్పు దిక్కున హనుమంతుడు, దక్షిణమున పవనాత్మజుడు, పశ్చిమమున అక్షఘాతకుడు ఉత్తరమున సాగరతారకుడు కాపాడుగావుత, ఊర్ధ్వభాగమున కపిశ్రేషుడు, కేసరి ప్రియనందనుడు, అధోభాగమున విష్ణుభక్తుడు, మధ్యభాగమున 'పావని కాపాడు గావుత. అన్ని వేళలా అన్ని ఆపదలనుండి లంకా దాహకుడు కాపాడు గోవుత. మస్తకమును సుగ్రీవసచివుడు, వాయునందనుడు పాలమును, మహావీరుడు భూమధ్యమును, నేత్రములను ఛాయాపహర్షి ప్లవ గేశ్వరుడు కాపాడుగావుత. కపోలములను, కర్ణమూలమున శ్రీరామకింకరుడు, నాసాగ్రమును అంజనాసూనుడు, వక్తమును హరీశ్వరుడు, కంఠమును దైత్యారి, స్కంధమును రాక్షసజిత్, భుజములను మహాతేజస్కుడు, కరములను చరణాయుధుడు నఖములను నఖాయుధుడు, కుక్షిని కపీశ్వరుడు, వక్షసులమును ముధాపహారి, పార్శ్వములను భుజాయుధుడు కాపాడు గావుత. పృష్ట దేశమును లంకావిభంజకుడు, నాభిని శ్రీరామ భక్తుడు, కటిని అనిలాత్మజుడు, గుహ్యమును మహాప్రాజ్ఞుడు, సక్తులను అతిథిప్రియుడు, ఊరువులను, జానువులను లంకాహ్రసాదభంజనుడు, జంఘలను కపిశ్రేష్ఠుడు, గుల్పములను మహాబలుడు, పాదములను అచలోద్ధారకుడు, అంగములను భాస్కర సన్నిభుడు, పాదాంగుళులను సత్తాడ్యుడు కాపాడు గౌవుత. ముభాంగములను మహాశూరుడు, రోమములను ఆత్మవంతుడు, దివారాత్రములలో త్రిలోకములలో సదాగతిసుతుడు కాపాడు గావుత. నిలుచున్నవానిని, నడచుచున్న మౌనిని, కూర్చొని' యున్నవానిని, తినుచున్నవానిని కపీ కాపాడుగావుత. లోకోత్తర గుణుడు, శ్రీమంతుడు, త్ర్యంబకసంభవుడు, ప్రమత్తుని, అప్రమత్తుని, నిద్రించువానిని. అరణ్యమున, జలమున, స్థలమున, అంతరిక్షమున, అగ్నియందు, పర్వతమున, సాగరమున, వృక్షములలో, సంగ్రామమున, మౌరసంకటమునందు, విరాడ్రూపధరుడు కాపాడుగావుత. డాకినీ శాకినీ మారీ కాలరాత్రి మరీచికలనుండి నిద్రించుచున్న నన్ను పిశాచోరగరాక్షసులనుండి విభువు కాపాడుగావుత. నన్ను అంతట దివ్య దేహధరుడు, ధీమంతుడు, సర్వసత్త్వభయంకరుడు, సాధకేంద్రావనుడు నన్ను అంతటా కాపాడుగావు. భయానకసత్వములు చూచి భయపడు సర్వరూపములను ధరించువాడు, సర్వజ్ఞుడు, సృష్టి స్థితికరుడు కాపాడుగావుత. స్వయం బ్రహ్మ, స్వయం విష్ణువు, స్వయం సాక్షాత్తుగా మహేశ్వరుడు సూర్యమండలగతుడు, శ్రీప్రదుడు నన్ను కాలత్రయమున కాపాడుగావుత. హనుమంతుని ధ్వనిని విని దైత్యదానవరాక్షసులు దేవతలు మనుష్యులు తిర్యగ్జంతువులు, స్థావర జంగమములు భయము కలవి భయము తొలగినవి యగును. ప్రతి కల్పమునందు హనుమంతుని అనేక కథలు పవిత్రములు వినబడుచుండును. అట్టి రామపరాయణుడు సాధక శేషుని కాపాడు గావుత. వైధాత్రధాతు ప్రభృతులుగా ఈ ప్రపంచమున కనపడునదంతయు కేశరూపముచే వ్యాపించబడియున్నది. ఆ ప్రభువు నేను, ఈ నేను స్వీయుడను, స్వయముగా అణువు, బృహత్, ఋగ్యజుస్సామరూపుడు ప్రణవము, త్రివృత్, అధ్వరము, ఆస్వరూపుడు, సర్వరూపుడగు కపీశ్వరునికి ఆత్మ సమాధిచే నమస్కరించుచున్నాను. అనేకానన్త్ర బ్రహ్మాండ ధారి, బ్రహ్మ స్వరూపీ, సమీర స్వరూపి, ఆత్మ స్వరూపి యగువానికి నమస్కారము. హనుమంతునికి, మారుత పుత్రునకు నమస్కారము. శ్రీరామ భక్తునకు శ్యామునకు, మహాత్మునకు నమస్కారము. వానరవీరునకు, సుగ్రీవసఖ్య కారకునకు, లంకావిదాహకునకు, మహాసాగర తారకునకు, సీతాశోక వినాశకునకు, రామముద్రాధరునకు రావణాంతనీదానమునకు సర్వోత్తరాత్మకు నమస్కారము. మేఖ నామద ఖధ్వంసకారణునకు, అశోకవనవిధ్వంసకారికి, జయదాయికి, వాయుపుత్రునకు, వీరునకు, ఆకాశోదరగామికి, వనపాల శిరశ్చేత్తకు, లంకాప్రాసాద భంజకునకు నమస్కారము. జ్వలత్కాంచన వర్లునకు, దీర్ఘలాంగూలధారికి, సౌమిత్ర జయదాతకు, రామదూతకు నమస్కారము. అక్షవధకారికి, బ్రహ్మాస్త్ర నివారకునకు, లక్ష్మణాంగ మహాశక్తి జాత క్షత వినాశికి, రక్షోఘ్ననకు, రిపుఘ్నునకు, భూతఘ్నునకు నమస్కారము. ఋక్షవానరవీరౌఘ ప్రాసాదునకు పర సైన్యబలఘ్నునకు, శస్త్రాస్త్రఘ్నునకు, విషఘ్నునకు, ద్విషఘ్నునకు, భయఘ్నునకు నమస్కారము. మహారీపుభయఘ్ననకు, భక్తత్రాణేకకారికి, పర పేరితమంత్ర యంత్రస్తంభకారికి, పయఃపాషాణ తరణకారణునకు, బాలార్కమండలగ్రాసకారికి, దుఃఖహారికి నమస్కారము. నఖాయుధునకు, భీమునకు, దంతాయుధునకు, విహంగమునకు, శైవునకు, వజ్రదేహునకు, ప్రతిగ్రామ స్థితునకు, భూత ప్రేత పధార్ధికి, కరస్థ శైలశస్రునకు రామశర్ఖునకు నమస్కారము. కౌపీనవాససునకు, రామభక్తిరతునకు, దక్షిణాశాభాస్కరునకు, సజ్జనులకు చంద్రోదయ స్వరూపునకు, కృత్యాక్షతవ్యధఘ్నునకు, సర్వ క్లేశహరునకు, స్వామ్యాజ్ఞాపార్ధసంగ్రామ సఖ్యసంజయ కారికి, నమస్కారము. దివ్యవాదములందు, సంగ్రమములందు భక్తులకు జయమును కలిగించువానికి, కిలారావకరునికి, మౌరశబ్ధకరునకు, సర్వాగ్నివ్యాధిసంస్తంభకోరికీ, భయహారికి, సదావనఫలాహార సంతృపునకు, మహార్ణవశిలాబద్ధ సేతు బంధువుడవగు నీకు నమస్కారము. ఇట్లు శుభకరముగు హనుమత్కవవచమును నీకు చెప్పితిని. ప్రతివారికీయరాదు. ప్రయత్నముచే రక్షించవలయును. అష్టగంధములచే వ్రాసి కంఠమున కాని, దక్షిణబాహువున కాని ధరించిన వానికి ప్రతిక్షణమున జయమే కలుగుచుండును. ఇంకా ఏమి చెప్పవలయును. ఆదరముచే ఈ కవచమును లక్ష జపించిన వానికి అసాధ్యమంటూ ఉండదు. ప్రతిదానిని సాధించగలడు.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున బృహదుపాఖ్యానమున తృతీయపాదమున హనుమత్కవచనిరూపణమను డెబ్బది యెనిమిద -  అధ్యాయము సమాప్తము