20 - సుమతిభూపకథావర్ణనమ్

 నారద ఉవాచ :-

భగవన్సర్వధర్మజ్ఞ ! సర్వశాస్త్రార్ధపారగ ! సర్వకర్మవరిష్ఠం చ త్వయోక్తం ధ్వజధారణమ్ యస్తు వై సుమతి ర్నామ ధ్వజారోపసరో మువే

 త్వయోక్తస్తస్య చరితం విస్తరేణ మమాదిశ

 నారద మహర్షి పలికెను :- సర్వధర్మములను, సర్వశాస్త్రార్ధములను చక్కగా నేరిగిన మహానుభావా! ధ్వజారోపణము అన్ని కర్మలలో నుత్తమమని చెప్పియుంటివి. సుమతియను  మహారాజు ధ్వజారోహణమును చేసెనని చెప్పియుంటివి. ఆ సుమతి చరిత్రను నాకు విస్తరముగా తెలియజేయుము.

సనక ఉవాచ :-

శృణు ష్వైకమనాః పుణ్యమితిహాసం పురాతనమ్

 బ్రహ్మణా కథితం మహ్యం సర్వపాపప్రణాశనమ్

 ఆసీత్పురా కృతయుగే సుమతీర్నామ భూపతిః

సోమవంశోద్భవశ్రీమాన్ న్సప్తద్వీపైకనాయకః

 ధర్మాత్మా సత్యసంపన్నశ్శుచీవంశ్యోఽతిధిప్రియః

సర్వలక్షణసంపన్నః సర్వసంపద్విభూషితః

 సదాహరికథా సేవీ హరిపూజాపరాయణః

హరిభక్తి పరాణాం చ శుశ్రూషుర్నిరహంకృతి

పూజ్యపూజారతో నిత్యం సమదర్శీ గుణాన్వితః

సర్వభూతహితః శాన్తః కృతజ్ఞః కీర్తిమాoస్తథా

 తస్య భార్యా మహాభాగా సర్వలక్షణసంయుతా

 పతివ్రతా పతిప్రాణా నామ్నా సత్యనుతిర్మునే

 తావుభౌ దంపతీ నిత్యం హరిపూజాపరాయణౌ

 జాతిస్మరౌ మహాభాగో సత్యజ్ఞౌ సత్పరాయణే

 అన్నదానరతౌ నిత్యం జలదానపరాయణా

 తడాగారామవప్రాదీనసంఖ్యాతాన్వితేనతుః

 సా తు సత్యమతిర్నిత్యం శుచిర్విష్ణుగృహే సతీ

 నృత్యత్యత్యస్తసంతుష్టా మనోజ్ఞా మంజువాదినీ

 సోఽపి రాజా మహాభాగో ద్వాదశీ ద్వాదశీదినే

ధ్వజమారోపయత్యేవ మనోజ్ఞం బహువిస్తరమ్

 ఏవం హరిపరం నిత్యం రాజానం ధర్మకోవిదమ్

 ప్రియాం సత్యమతిం చాస్య దేవా అపి సదాస్తువన్

సనక మహర్షి పలికెను :-పురాతనమైన ఈ ఇతిహాసమును సావధానముగా వినుము. సర్వపాపప్రణాశనమగు నీ యితిహాసమును నాకు బ్రహ్మ  స్వయముగా తెలిపెను. పూర్వకాలమున కృతయుగమున సోమవంశమున సుమతి యను మహారాజు ఉండెను. ఈ మహారాజు సర్వసంపత్సమృద్ధి కలిగి సప్తద్వీపములకు ఏకైక నాయకుడగు చక్రవర్తి ధర్మాత్ముడు. సత్యసంపన్నుడు. పవిత్రవంశ్యుడు, అతిథి ప్రియుడు. సర్వలక్షణసంపన్నుడు. సర్వసంపద్విభూషితుడు. సర్వకాలములలో హరికథను సేవించువాడు. హరిపూజపరాయణుడు, హరిభక్తులను సేవించువాడు. ఆహంకొగరహితుడు. పూజ్యులను పూజించు శీలము కలవాడు. సమదర్శి, గుణవంతుడు, సర్వభూతహితుడు, శాన్లుడు, కృతజ్ఞుడు. కీర్తిమంతుడు. సుమతి మహారాజు భార్య మహానుభావురాలు, సర్వలక్షణవతి. పతివ్రత, పతిప్రాణ సత్యమతి యను పేరు గలది. ఆ దంపతులు నిత్యము హరి పూజా పరాయణులు. పూర్వజన్మ జ్ఞానము కల మహానుభావులు, సత్యమును తెలిసినవారు, సత్పరాయణులు. నిత్యము జలాన్నదాన నిరతులు. తటాకారామాదులను అసంఖ్యాకములుగా త్రవ్వించిరి. సత్యమతి కూడా నిత్యము పవిత్రురాలై విష్ణ్వాలయమున అతి సంతుష్టయై మనోజ్ఞముగా నాట్యము చేయుచు మృదు మధురముగా మాటలాడునది. ఆ మహారాజు కూడా ప్రతి ద్వాదశీతిథి యందు సుందరము విశాలము అగు ధ్వజమును ఆలయమున ప్రతిష్ఠించుచుండెను. ఇట్లు నిత్యము  హరిపూజారతుడైన సుమతి మహారాజును ధర్మపరాయణుడని సత్యమతి యను అతని ధర్మపత్నిని కూడా దేవతలు కూడా స్తుతించుచుండిరి.

త్రిలోకే విశ్రుతౌ జ్ఞాత్వా దంపతీ ధర్మ కోవిదౌ

 ఆయయౌ బహుభిః శిష్వైర్ద్రష్టుకామో విభాండకః

తమాయాన్తం మునిం శ్రుత్వా స తు రాజా విభాండకమ్

 ప్రత్యుద్యయౌ సపత్నీకః పూజాభిర్బహువిస్తరమ్

 కృతాతిథ్యక్రియం శాన్తం కృతాసనపరిగ్రహమ్

 నీచాసనస్థితో భూపః ప్రాంజలిర్మునిమబ్రవీత్

ఆ దంపతులు ధర్మ కోవిదులుగా మూడు లోకములలో ప్రసిద్ధులగుట నెంగి, విభాండక మహర్షి చూడగోరి చాలామంది శిష్యులతో కలిసి అచటికి చేరెను. విభాండక మహర్షి వచ్చుచున్నారని వినిన సుమతి మహారాజు భార్యతో ఎస్తృతముగా పూజా సామగ్రితో ఎదురేగెను. అతిథి మర్యాదను చేసి శాంతముగా సింహాసనము పై కూర్చుండ పెట్టి శాంతునిగా నున్న విభాండక మహర్షిని క్రింది ఆసనమున కూర్చొనియున్న సుమతి మహారాజు చేతులు జోడించి ఇట్లు పలికెను.

రాజోవాచ :

భగవన్కృతకృత్యోఽస్మి త్వదభ్యాగమనేన వై

సతామాగమనం సన్తః ప్రశంసన్తి సుఖావహమ్

యత్ర స్యాన్మహతాం ప్రేమ తత్ర స్యుస్సర్వసంపదః తేజః కీర్తిర్ధనం పుత్రా ఇతి ప్రాహుర్విపశ్చితః

 తత్ర వృద్ధిముపాయాన్తి శ్రేయాంస్యనుదినం మునే

 యత్ర సన్తః ప్రకుర్వన్తి మహతీం కరుణాం ప్రభో

 యో మూర్ధ్ని ధారయేద్భ్రహ్మన్మహత్పాద జదం రజః

స స్నాతః సర్వతీర్ధేషు పుణ్యాత్మా నాత్ర సంశయః

 మమ పుత్రాశ్చ దారాశ్చ సంపత్త్వయి సమర్పితాః

మామాజ్ఞాపయ విప్రేన్ద్ర కిం ప్రియం కరవాణి తే

 వినయావనతం భూపం స నిరీక్ష్య మునీశ్వరః

స్పృశన్కరేణ తం ప్రీత్యా ప్రత్యువాచాతిహర్షితః

మహారాజు పలికెను : ఓ పూజ్యుడా ! మీ రాకచే నేను కృతకృత్యుడనైతిని. సత్పురుషుల రాక సుఖావహమని సత్పురుషులు. కొనియాడుచుందురు. మహానుభావుల ప్రేమ యున్న ప్రదేశముననే అన్ని సంపదలు తేజస్సు, కీర్తి, ధనము పుత్రులు ఉందురని పండితులు చెప్పుదురు. మహాత్ముల పాదజలమును, పాదధూళిని శిరస్సున దాల్చినవాడు అన్ని పుణ్యతీర్ధములలో స్నానమాడిన పుణ్యాత్ము డగును. సంశయముతో పనిలేదు. నా ద్వారా పుత్రధనాది సంపదలనన్నిటిని మీకర్పించుచున్నాను. ఓ బ్రాహ్మణోత్తమా ! మీకేమి ప్రియమును చేయవలయునో నన్నాజ్ఞాపింపుము. ఇట్లు పలుకుచు వినయముతో వంగియున్న మహారాజును చూచి విభాండక మహర్షి ప్రీతితో చేతితో తాకుచు మిగుల సంతోషముచే ఇట్లు బదులు పలికెను.

ఋషి రువాచ :

రాజన్యదుక్తం భవతా తత్సర్వం త్వత్కులోచితమ్

 వినయావనతస్సర్వో బహుశ్రేయో లభేదిహ

ధర్మం చార్థం చ కామం చ మోక్షం చ నృపసత్తమ !

 వినయాల్లభతే మర్త్యో దుర్లభం కిం మహాత్మనామ్

ప్రీతోఽస్మి తవ భూపాల సన్మార్గపరివర్తనః

స్వస్తి తే సతతం భూయాద్యత్పృచ్ఛామి తదుచ్యతామ్

 పూజా బహువిధాస్సన్తి హరితుష్టివిధాయికాః

 తాను నిత్యం ధ్వజారో పే వర్త సే త్వం సదోద్యతః

భార్యాపి తవ సాధ్వీయం నిత్యం నృత్యపరాయణా

 కిమర్ధమేతద్వృత్తాన్తం యథావద్వక్తుమర్హసి

విభాండక మహర్షి పలికెను : ఓ రాజా ! నీవు చెప్పినదంతయూ నీ వంశమునకు తగియున్నది. వినయము కలవారందరు బహు శ్రేయస్సులను పొందగలరు. ధర్మార్థకామమోక్షములు వినయము వల్లనే లభించును. మహాత్ములకు దుర్లభమైనదేమి ? మంచి మార్గము నవలంబించిన నీ విషయమున ప్రీతుడనైతిని. శ్రీహరిని సంతోషింప చేయు పూజలు చాలా యున్నవి. వాటిలో నీవెప్పుడూ ధ్వజారోహణమునే ఎందుకు చేయుచున్నావు? నీ భార్య పరమ సాధ్వీమణి. ఎప్పుడూ స్వామి మందిరమున నృత్యమును చేయుచున్నది. ఎందుకిట్లు చేయుచున్నారో నాకు ఉన్నదున్నట్లు తెలుపుము.

రాజోవాచ :

శృణుష్వ భగవన్సర్వం యత్సృచ్ఛసి వదామి తత్

ఆశ్చర్యభూతం లోకానాం ఆవయోశ్చరితం త్విహ

 అహమాసం పురా శూద్రో మాలినిర్నామ సత్తమ !

కుమార్గనిరతో నిత్యం సర్వలోకాహితే రతః

పిశునో ధర్మవిద్వేషీ దేవద్రవ్యాపహారకః

గోఘ్నశ్చ బ్రహ్మహా చోరః సర్వప్రాణివ ధేరతః

నిత్యం నిష్ఠురవక్తా చ పాపీ వేశ్యాపరాయణః

 ఏవం స్థితః కియత్కాలమనాదృత్య మహర్వచః

సర్వబంధుపరిత్యక్తో దుఃఖీ వనముపాగతః

 మృగమాంసాశనో నిత్యం తథా పాంథవిలుమ్పకః

ఏకాకీ దుఃఖబహులో వ్యవసన్నిర్జనే వనే

ఏకదా కుత్పరిశ్రాన్తో నిదాఘార్తః పిపాసితః

 జీర్ణం దేవాలయం విష్ణోరపశ్యం విజనే వనే

హంసకారండవాకీర్ణం తత్సమీ పే మహత్సరః

 పర్యన్తవనపుష్పాఘచ్ఛాదితం తన్ము నీశ్వర

అసిబం తత్ర పానీయం తత్తి రే విగతశ్రమః

 ఫలాని జగ్ధ్వా శీర్ణాని స్వయం కుచ్చ నివారితా

తస్మిన్ జీర్ణాలయే విష్ణోర్నివాసం కృతవానహమ్

 జీర్ణస్ఫుటితసంధానం తస్య నిత్యమకారిషమ్

 పర్ణైస్తృణైశ్చ కాష్టౌ ఘైర్గృహం సమ్యక్ప్రకల్పితమ్

 స్వసుఖార్ధంతు తద్భూమిర్మయా లిప్తా మునీశ్వర !

 తత్రాహం వ్యాధవృత్తిస్తో హత్వా బహువిధాన్మృగాన్

 ఆజీవం వర్తయన్నిత్యం వర్షాణాం వింశతిం స్థితః

 అధేయమాగతా సాధ్వీ వింధ్యదేశసముద్భవా

నిషాదకులజా విప్ర నామ్నా ఖ్యాతాఽథ కోకిలా

బంధువర్గపరిత్యక్తా దుఃఖితా జీర్ణవిగ్రహా

 కుత్తృడ్ఘర్మపరిశ్రాన్తా శోచన్తీ స్వకృతం హ్యఘమ్

 దైవయోగాత్సమాయాతా భ్రమన్తీ విజనే వనే

గ్రీష్మా తపౌర్దితా బాహ్యే స్వాన్తే చాధి నిపీడితా

ఇమాం దుఃఖార్దితాం దృష్ట్వా జాతా మే విపులా దయా

 దత్తం మయా జలం చాస్త్యె మాంసం వన్యఫలాని చ

గతశ్రమా త్వియం బ్రహ్మన్మయా పృష్టా యథాతథమ్

మహారాజు పలికెను : పూజ్యుడా ! మీరడిగిన దానిని చెప్పెదను. మా చరిత్రము లోకముల కాశ్చర్యావహము. ఓ మహానుభావా ! నేను పూర్వము మాలిని యను పేరుగల శూద్రుడనై యుంటిని. ఎపుడూ చెడుదారిలో నడుచుచు అందరికీ కీడును చేయుచు, కొండెములను చెప్పుచు, ధర్మమును ద్వేషించుచు, దేవ ద్రవ్యముల నపహరించుచు, గో బ్రాహ్మణులను వధించుచు, చౌర్యము చేయుచు, అన్ని ప్రాణులను వధించుటయందాసక్తిని చూపుచు, ఎపుడూ కఠినముగా మాట్లాడుచు, పాపాత్ముడనై, వేశ్యాలోలుడనై, పెద్దలమాటలను లెక్కించక చాలాకాలముంటిని. బంధువులందరూ వెలివేయగా దుఃఖముతో అరణ్యమునకు చేరితిని. అరణ్యములో మగ మాంసమును భక్షించుచు బాటసారులను దోచుచు ఒంటరిగా బహు దుఃఖముతో చాలా కాలముంటిని. ఒకపుడు ఎండవేడికి తపించి ఆకలి దప్పులు పీడించగా తిరుగుచు నిర్జనారణ్యమున శిధిలమైయున్న ఒక విష్ణ్వాలయమును చూచితిని. ఆ దేవాలయ సమీపమున హంసాది పక్షి సంకులమగు తీరమున పుష్ప ఫలభరితోద్యానములు గల సరస్సును చూచితిని. ఆ సరస్సున నీరు త్రాగి తీరమున  విశ్రమించి అలసట తీర్చుకుంటిని. రాలిపడియున్న పండ్లను భక్షించి ఆకలిని తీర్చుకొంటిని. ఆ జీర్ణవిష్ణ్వాలయమున నివాసమేర్పరచుకొంటిని. జీర్ణమైన వాటిని, పగిలిన గోడలను మరల సంధానము చేసితిని. కట్టెలు ఆకులు తీగలచే చక్కగా గృహమును నిర్మించితిని. నా సౌకర్యము కొఱకు అచట భూమిని చక్కగా నలికితిని. అచట వ్యాధవృత్తిని స్వీకరించి చాలా మృగములను చంపుచు ఆ మాంసముతో కాలము గడుపుచు ఇరువది సంవత్సరములుంటిని. అపుడు వింధ్య దేశమున పుట్టిన ఈ సాధ్వి వచ్చినది. కోకిల అను పేరుగల ఈమే నిషాదవంశమున పుట్టియుండెను. బంధువర్గము విడువగా శిథిలదేహాయై దుఃఖించుచు ఆకలి దప్పివేడిమిచే ఆర్తురాలై తాను చేసిన పాపమును గూర్చి ఆలోచించుచు నిర్జనారణ్యమున తిరుగుచు దైవయోగమున అటకొచ్చినది. బయట గ్రీష్మతాపముచే, అంతరంగమున పాపముచే పీడించబడుచు వచ్చెను. ఇట్లు దుఃఖముచే బాధపడుచున్న ఈమెను చూచి నాలో దయకలిగెను. నీరును పండ్లను మాంసము నిచ్చితిని. నేనిచ్చిన వాటిని తిని ఆకలి దప్పులు అలసట తీరిన ఈమెను గత వృత్తాంతము నడిగితిని.

అవేదయత్స్వవృత్తాన్తం తచ్ఛృణుష్వ మహామునే

 నాన్నవకోకిలా చాహం నిషాదకులసంభవా

 దారుకస్య సుతా చాహం వింధ్యపర్వతవాసినీ

పరస్పహారిణీ నిత్యం సదా పైశున్యవాదినీ

పుంశ్చలిత్యేవముక్తా తు బంధువర్గైస్సముజ్ఘితా

కియత్కాలం తతః పత్యా భృతాహం లోకనిందితా

 దైవాత్సోఽపి గతో లోకం యమస్యాత్ర విహాయ మామ్

కాంతారే విజనే చైకా భ్రమన్తీ దుఃఖ పీడితా

దైవాత్వత్సవిధం ప్రాప్తా జీవితాహం త్వయాధునా

ఇత్యేవ స్వకృతం కర్మ మహ్యం సర్వం న్యవేదయత్

అపుడు ఈమె తన వృత్తాన్తమునంతటిని నాకు నివేదించెను. “ఓ మహామునీ ! దానిని వినుము. నేను నిషాదకులమున పుట్టితిని. నా పేరు అవకోకిల. నా తండ్రి పేరు దారుకుడు. వింధ్యపర్వతప్రాంతమున నా నివాసము. ఎపుడు పరద్రవ్యములను అపహరించుచు, కొండెములు చెప్పుచు, నచ్చిన పురుషునితో విహరించుచు బ్రతుకును సాగించుచుంటినని నన్ను  బంధువులందరు వెలివేసిరి. ఇట్లు లోక నిందీతనైన నన్ను కొంతకాలము భర్త పోషించెను. దైవ వశమున నా భర్త నన్నిచటనే వదిలి తాను యమలోకమును చేరెను. నిర్జనమైన అరణ్యమున ఒంటరిగా దుఃఖముతో తిరుగుచు దైవ వశమున నీ సమీపమునకు చేరితిని. నీచే బ్రతికించబడితిని” ఇట్లు ఆమె తన చరితము నంతను నాకు నివేదించెను.

తతో దేవాలయే తస్మిన్దమ్పతీభావమాశ్రితౌ

స్థితౌ వర్షాణి దశ చ ఆవాం మాంసఫలాశినౌ

ఏకదా మద్యపానేన ప్రమత్తౌ నిర్భరం మునే

 తత్ర దేవాలయే రాత్రౌ ముదితౌ మాంసభోజనాత్

 తనువస్త్రాపరిజ్జానౌ నృత్యం చక్కవ మోహితౌ

ప్రారబ్ధకర్మభోగాన్తమాహిం యుగపదాగతౌ

 యమదూతాస్తదాయాతో పాశహస్తా భయంకరాః

 నేతుమావాం నృత్యరతౌ సుఖోరాం యమయాతనామ్

 తతః ప్రసన్నో భగవాన్కర్మణా మమ మానద

దేవావసధసంస్కారసంజ్ఞితేన కృతేన నః

స్వదూతాన్ప్రేషయామాస స్వభక్తావనతత్పరః

తే దూతా దేవదేవస్య శంఖచక్రగదాధరాః

 సహస్రసూర్యసంకాశాః సర్వే చారుచతుర్భుజాః

కిరీటకుండలధరా హారిణో వనమాలినః

దిశో వితిమిరా విప్ర కుర్వన్త స్స్వేన తేజసా

భయంకరానాశహస్తాన్దంష్ట్రిణో యమకింకరాన్

 ఆవయోర్గ్రహణే యత్తానూచుః కృష్ణపరాయణాః

తరువాత మేమిద్దరమూ దాంపత్య భావముతో మాంసమును ఫలములను ఆహారముగా తీసుకోనుచు పది సంవత్సరములుంటిమి. ఒకపుడు బాగుగా మద్యము సేవించుటవలన మదించినవారమై ఆ రాత్రి దేవాలయమున మాంస భోజనముచే సంతోషించి వడలును వస్త్రములను మరిచి మోహముతో నృత్యమును చేసితిమి. ఇంతలో మా ఇద్దరికీ ఒకేసారి ప్రారబ్ధకర్మభోగము పరిసమాప్తమైనది. అపుడు భయంకరులైన యమదూతలు పాశహస్తులై నృత్యముచే ఆనందించుచున్న మమ్ములను ఘోరమైన యమయాతనలకు గొనిపోవవచ్చిరి. అంతలో దేవాలయమును పరిశుభ్రముగా ఉంచుటచే సంతోషించిన శ్రీ మహావిష్ణువు స్వభక్తులను కాపాడు శీలము కలవాడగుటచే తన దూతలను పం పెను. దేవదేవుని దూతలు శంఖచక్రగదొదులను ధరించి చతుర్భుజులై వేయి సూర్యుల వెలుగు కలవారై కిరీట కుండలాద్యా భరణములను ధరించినవారై హారములను వనమాలను ధరించి, తమ కాంతులచే దిక్కులను వెలిగింపజేయుచు, పాశహస్తులు దంష్ట్రులు భయంకరులై మా ఇద్దరిని తీసుకొని పోవయత్నించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః :

భో ! భో ! క్రూరా దురాచారా వివేకపరివర్జితాః

ముంచధ్వమేతా నిష్పాపౌ దంపతీ హరివల్లభౌ

 వివేకస్త్రిషు లోకేషు సంపదామాదికారణమ్

అపాపే పాపధీర్యస్తు తం విద్యాత్పురుషాధమమ్

 పాపే త్వపాపధీర్యస్తు తం విద్యాదధమాధమమ్

విష్ణుదూతలు పలికిరి : ఓ క్రూరులారా ! దురాచారులారా ! వివేకహీనులారా ! ఈ దంపతులు హరికి ప్రీతిపాత్రులు. కావున పాపరహితులు. వీరిని వీడువుడు. మూడు లోకములలో అన్ని సంపదలకు మూలకారణము వివేకము. పాపరహితుని పాపిగా తలచువాడు పురుషాధముడు. పౌపీని పాపరహితునిగా తలచువాడు అధమాధముడు.

యమదూతా ఊచుః :

 యుష్మాభిస్సత్యమేవోక్తం కింత్వేతౌ పాపిసత్తమౌ

యమేన పాపినో దండ్యాస్తస్నేష్యామో వయం త్విమౌ

శ్రుతిప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్వీపర్యయః

 ధర్మాధర్మవివేకోఽయం తన్నేష్యామో యమాన్తికమ్

ఏతచ్చ్రుత్వాతికుపితా విష్ణుదూతా మహౌజసః

ప్రత్యూచుస్తాన్యమభటానధర్మే ధర్మమానినః

 యమదూతలు పలికిరి : “మీరు నిజమునే పలికితిరి. కాని వీరు పరమ పాపులు. పాపులను యమధర్మరాజు దండించవలయును. కావున వీరిని మేము తీసుకొని పోగలము. వేదవిహితమే ధర్మము. తద్వాపరీతమధర్మము. ఇదియే ధర్మాధర్మ వివేకము. కావున వీరిని తీసుకొని పోవుచున్నాము.” గొప్ప తేజస్సు గల విష్ణుదూతలు ఈ మాటలను విని మిక్కిలి కోపించినవారై, అధర్మమును ధర్మముగా భావించు యమదూతలను గూర్చి ఇట్లు పలికిరి.

విష్ణుదూతా ఊచుః : 

అహో కష్టం ధర్మదృశామధర్మస్పృశతే సభామ్

సమ్యగ్వివేకశూన్యానాం నిదానం హ్యాపదాం మహత్

 తర్కణాద్యవిశేషేణ నరకాధ్యక్షతాం గతాః

యూయం కిమర్ధమద్యాపి కర్తుం పాపాని సోద్యమాః

స్వకర్మక్షయపర్యన్తం మహాపాతకినోఽపి చ

 తిష్టన్తి నరకే హోరే యావచ్చంద్రార్కతారకమ్

పూర్వసంచితపాపానామదృష్ట్వా నిష్కృతిం వృథా

 కీమర్థం పాపకర్మాణి కరిష్యేఽథ పునః పునః

 శ్రుతిప్రణిహితో ధర్మ సత్యం సత్యం న సంశయః

కింత్యాభ్యాం చరితాన్దర్మాన్ప్రవక్ష్యామో యథాతథమ్

 ఏతౌ పాపవినిర్ముక్తౌ హరిశుశ్రూషణే రతా

 హరిణా త్రాయమాణీ చ ముంచధ్వమవిలంబితమ్

 ఏషా చ నర్తనం చక్రే తథైష ధ్వజరోపణమ్

అన్తకాలే విష్ణుగ హే తేన నిష్పాపతాం గతౌ

 అన్తకాలే తు యన్నొమ శ్రుత్వోక్త్యాపి చ వై పకృత్

లభతే పరమం స్థానం కిము శుశ్రూషణే రతాః

 మహాపాతకయుక్తో వా యుక్తో వాప్యుపపాత కైః

 కృష్ణ సేవీ నరోఽన్తేఽపి లభతే పరమాం గతిమ్

యతీనాం విష్ణుభక్తానాం పరిచర్యాపరాయణాః

తే దూతాస్సహసా యాన్తి పొపినోఽపి పరాం గతిమ్

ముహూర్తం వా ముహూర్తార్థం యస్తిష్టేద్దరిమందిరే

సోఽపి యాతి పరం స్థానం కిము ద్వాత్రింశవత్సరాన్

ఉపలేపనకర్తారౌ సమ్మార్జనపరాయణే

ఏతౌ హరిగృహే నిత్యం జీర్ణశీర్జాధిరోపకౌ

 జల సేచనకర్తారౌ దీపదో హరీమందిరే

కథమేతౌ మహాభాగౌ యాతనాభోగమర్హతః

 ఇత్యుక్త్వా విష్ణుదూతా స్తే ఛీత్వా పాశాంస్త దైవహి

ఆరోప్యాం విమానాగ్య్రం యయుర్విష్ణోః పరం పదమ్

 తత్ర సామీప్యమాపన్నౌ దేవదేవస్య చక్రిణః

దివ్యానోగాన్భుక్తవన్తౌ తావత్కాలం మునీశ్వర

 దివ్యాన్భోగాంస్తు తత్రాపి భుక్త్వా యాతౌ మహీమిమామ్

అత్రాపి సంపదతులా హరి సేవా ప్రసాదతః

 అనిచ్ఛయా కృతేనాపి సేవనేన హరేర్ము నే

ప్రాప్తమీదృక్ఫలం విప్ర దేవానామపి దుర్లభమ్

ఇచ్ఛయారాధ్య విశ్వేశం భక్తి భావేన మాధవమ్

 ప్రొప్స్వావః పరమం శ్రేయ ఇతి హేతుర్నిరూపీతః

 అవశేనాపి యత్కర్మ కృతం స్వాత్సుమహత్ఫలమ్

 జాయతే భూమిదేవేన్ద్ర కింపునశ్శద్ధయాకృతమ్

 ఏతదుక్తం నిశమ్యానే సమునీన్ద్రో విభాండకః

 ప్రశస్య దంపతీ తౌ తు ప్రయయౌ స్వతపోవనమ్

 తస్మాజ్ఞానీహి దేవర్షే ! దేవదేవస్య చక్రిణః

 పరిచర్యా తు సర్వేషాం కామధేనూపమా స్మృతా

 హరిపూజాపరాణాతు హరిరేవ సనాతనః

దదాతి పరమం శ్రేయః సర్వకామఫలప్రదః

య ఇదం పుణ్యమాఖ్యానం సర్వపాపప్రణాశనమ్

పఠేచ్చ శృణుయాద్వాపి సోఽపి యాతి పరాం గతిమ్

ఇతి శ్రీ బృహన్నారదీయమహాపురాణే పూర్వభాగే ప్రథమపాదే సుమతిభూసకథావర్ణనం సామ వింశోఽధ్యాయః

 విష్ణుదూతలు పలికిరి : “ధర్మ పరీక్షకుల సభను అధర్మము స్పృశించుచున్నది. ఇది చాలా గొప్ప ఆపద. చక్కని వివేకము లేకపోవుటయే అన్ని ఆపదలకు మూలము. మీరు చక్కగా విచారించలేకపోవుట వలననే నరకలోకమున కొలువుదీరితిరి. మరల ఇపుడు కూడా పాపములను చేయుటకు పూనుకొందురేల ? తాము చేసిన కర్మలు క్షయమగువరకు మహాపాపులు ఘోరమైన నరకమున నుందురు. మీరు సూర్యచంద్రులుండు వరకు నరకముననే యుండవలయును. ఇది వరకు చేసిన పాపములకు నిష్కృతిని కనుగొనకనే మరల పొషముల నెందుకు చేయుచున్నారు ? వేదవి హీతమైనదే ధర్మమను మాట ముమ్మాటికీ నిజము. సంశయములేదు. కాని ఈ దంపతులు చేసిన ధర్మములను చేప్పెదము వినుడు. హరిని సేవించుటలో ఆసక్తులైన వీరు అన్ని పాపములనుండి విముక్తులయిరి. కావున శ్రీహరియే వీరిని కాచుచుండెను. కావున ఆలసించక విడువుడు. ఈమే హరి మందిరమున నృత్యము చేసెను. ఇతను ధ్వజారోపణము చేసెను. ఈ రెండు పుణ్యకార్యములను అత్త కొలమున విష్ణుమందిరమున చేసిరి. కావున వీరి పాపములు నశించినవి. అంతకాలమున . శ్రీహరి సొమమును ఒకసారి వినిననూ పలికిననూ పరమపదమును పొందుదురు. ఇక సేవించిన పోరి విషయమున నేమి చెప్పవలయును ? మహాపాతకములు ఉపపాతకములు కలవారైనను అత్త కొలమున శ్రీకృష్ణుని సేవించినవారు పరమ పదమును పొందెదరు.యతులను విష్ణుభక్తులను సేవించువారు పౌపులైనను పరమ పదమును పొందెదరు. ఒక ముహూర్త కాలము కాని సగము ముహూర్త కాలము కాని శ్రీహరి మందిరమున నివసించినచో పరమపదమును పొందుదురన్న, ముప్పది రెండు సంవత్సరములున్న వారి విషయమున నేమి చెప్పవలయును. ఈ దంపతులు దేవాలయమును ఊడ్చిరి, అలికిరి, శిథిలమైన వాటిని మరల సంధానము చేసిరి. నీరు చల్లిరి. దీపమును పెట్టిరి. ఇట్టి వీరు నరకయాతననెట్లనుభవింతురు ? “ విష్ణుదూతలు ఇట్లు పలికి మా పాశములను తెంపి విమానమున కూర్చుండబెట్టి విష్ణుపదమునకు చేర్చిరి. అచట శ్రీహరి సామీప్యమును పొంది చాలా దీవ్యవర్షములు సకల భోగముల ననుభవించి మరల భూలోకమునకు చేరితిమి. హరి సేవా ప్రసాదము వలన ఇచట కూడా సాటిలేని సంపదలను పొందితిమి. ఇచ్చ లేకనే చేసిన హరి సేవ వలననే దేవతలకు కూడా దుర్లభమగు . నిట్టి ఫలమును పొందితిమి. ఇచ్చతో భక్తి భావముతో విశ్వేశుడైన శ్రీహరిని సేవించి ఉత్తమ శ్రేయస్సును పొందగలమని నిరూపించబడియున్నది. మన వశములో లేక మత్తులో నుండి చేసిన కర్మలకే ఇంతటి గొప్ప ఫలము లభించినది కదా ! ఇక శ్రద్ధచే చేసినచో నేమి చెప్పవలయును. ఇట్లు సుమతి చెప్పిన వృత్తాస్త్రమును వినిన విభాండక మహర్షి ఆ దంపతులను ప్రశంసించి తన తపోవనమునకు వెళ్ళెను. కావున ఓదేవర్షీ ! దేవదేవుడగు చక్రి సేవ అందరికి కామధేనువు వంటిది. హరిని పూజించువారికి శ్రీహరియే సర్వకామార్థ ఫలప్రదమగు శ్రేయస్సును ప్రసాదించును. ఇట్లు అన్ని పాపములను తొలగించి అన్ని పుణ్యములను కలిగించు ఈ కథను చదివిన వారు, వినిన వారు కూడా పరమ పదమును పొందెదరు, అనెను.

ఇది శ్రీ బృహన్నారదీయమహాపురాణమున పూర్వభాగమున ప్రథమపాదమున సుమతిభూపకథావర్ణనమను ఇరువదియవ అధ్యాయము సమాప్తము.